Britain prime minister
-
తుపానులా వచ్చాడు... స్టార్మర్ ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం
నిరుపేద కుటుంబం. తండ్రి పనిముట్ల తయారీ కారి్మకుడు. తల్లి నర్సు. నలుగురు సంతానంలో రెండోవాడు. కుటుంబాన్ని నిరంతరం అప్పుల బాధ వెంటాడేది. దాంతో ఫోన్ బిల్లును తప్పించుకునేందుకు దాన్ని నెలల తరబడి వాడకుండా పక్కన పెట్టే పరిస్థితి! ‘‘కార్మికునిగా ఫ్యాక్టరీలో తన తండ్రి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. దాంతో విపరీతమైన ఆత్మన్యూనతకు లోనై జనానికి దూరంగా మెలగడం అలవాటు చేసుకున్నారు’’ అంటూ ఆవేదనగా గుర్తు చేసుకుంటారు స్టార్మర్. అందుకే స్థాయిలో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడటం తనకు చిన్నప్పటి నుంచే అలవాటైందని చెబుతారు. లేబర్ పార్టీ తొలి నాయకుడైన కియర్ హార్డీ అంటే తల్లిదండ్రులకు ఎంతో అభిమానం. ఆ పేరునే స్టార్మర్‌కు పెట్టుకున్నారు. ఆయన ఇప్పుడదే పార్టీకి ఘనవిజయం సాధించి పెట్టడమే గాక ప్రధాని పీఠమెక్కడం విశేషం. విపక్షంలో ఉండగా లేబర్ పార్టీ పగ్గాలు చేపట్టి గెలుపు బాటన నడిపిన ఐదో నేతగా కూడా నిలిచారు... తమ కుటుంబంలో కాలేజీ చదువు చదివిన తొలి వ్యక్తి స్టార్మరే. అప్పుడు కూడా డబ్బుల కటకట బాగా వేధించేది. దాంతో డబ్బుల కోసం స్టార్మర్ ఓసారి బీచ్‌లో మిత్రులతో కలిసి చట్ట విరుద్ధంగా ఐస్‌క్రీం అమ్ముతూ పట్టుబడ్డారు! లీడ్స్‌లో న్యాయశాస్త్రం చదివాక ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లారు. 1987లో బారిస్టర్ పూర్తి చేశారు. మానవ హక్కుల చట్టంలో స్పెషలైజేషన్ చేశారు. కరీబియన్, ఆఫ్రికాల్లో ఉద్యోగం చేశారు. పని రాక్షసునిగా పేరుపడ్డారు. 2008లో ఇంగ్లండ్, వేల్స్ చీఫ్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. రాజకీయ ప్రవేశం... స్కూలు దశ నుంచే స్టార్మర్ రాజకీయాల పట్ల మొగ్గు చూపేవారు. తొలుత వామపక్ష రాజకీయ పట్ల ఆకర్షితులయ్యారు. 2015లో 52వ ఏట పూర్తిస్థాయిలో రాజకీయ రంగప్రవేశం చేశారు. ఉత్తర లండన్‌లోని హాల్‌బోర్న్ అండ్ సెయింట్ పాంక్రాస్ నియోజకవర్గం నుంచి 2015లో ఎంపీగా గెలుపొందారు. తాజా మాజీ ప్రధాని రిషి సునాక్ కూడా సరిగ్గా అదే రోజున తొలిసారిగా ఎంపీగా ఎన్నికవడం విశేషం! నాటి లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్‌కు నమ్మకస్తునిగా పేరుబడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోర పరాజయంతో కార్బిన్ తప్పుకున్నారు. దాంతో 2020 ఏప్రిల్‌లో స్టార్మర్ లేబర్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. పార్టీలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. విలువల విషయంలో రాజీ పడేందుకు ససేమిరా అంటారాయన. తమ కంచుకోటైన హారి్టల్పూల్ స్థానంలో మూడేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికలో లేబర్ పార్టీ తొలిసారి ఓటమి చవిచూసింది. ఆ పరాభవానికి బాధ్యత వహిస్తూ పార్టీ సారథ్యం నుంచి తప్పుకోవడానికి స్టార్మర్ సిద్ధపడ్డారు. సీనియర్ నాయకుల విజ్ఞప్తి మేరకు కొనసాగారు. 2019 ఓటమితో చతికిలపడి ఉన్న పార్టీలో జవజీవాలు నింపడమే గాక ఐదేళ్లకే ఘనవిజయం సాధించి పెట్టారు. ఇది తేలిగ్గా ఏమీ జరగలేదు. పార్టీకి పునర్వైభవం... లేబర్ పార్టీకి పునరై్వభవం తేవడానికి స్టార్మర్ చాలా కష్టపడ్డారు. హారి్టల్పూల్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత ఓటర్లను పార్టీ వైపు తిప్పుకోవడంపై దృష్టి సారించారు. వర్సిటీల ట్యూషన్ ఫీజుల రద్దు, ఇంధన, నీటి కంపెనీల జాతీయీకరణ వంటి గత వాగ్దానాల నుంచి వెనక్కు తగ్గారు. ఇది నమ్మకద్రోహమని, పార్టీ వాగ్దానాలను తుంగలో తొక్కారని సీనియర్లే ఆరోపించినా వెనక్కు తగ్గలేదు. కొన్నేళ్లుగా బ్రిటన్‌లో ఉద్యోగ సంక్షోభం నెలకొంది. ధరలు విపరీతంగా పెరిగి, ప్రజల ఆదాయం తగ్గి జీవన ప్రమాణాలు పడిపోయాయి. వీటితో పాటు ప్రధాన సమస్యయిన ఆరోగ్య రంగంపైనా స్టార్మర్ దృష్టి సారించారు. బ్రిటన్‌లో వైద్య సేవలుందించే ప్రభుత్వ విభాగం ఎన్హెచ్ఎస్లో వెయిటింగ్ జాబితాను తగ్గిస్తామని, పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేస్తామని, పన్ను చెల్లింపుల్లో లొసుగులను నిర్మూలించి ఎన్హెచ్ఎస్కు నిధులు సమకూర్చుతామని హామీలిచ్చారు. అక్రమ వలసలను అడ్డుకునేందుకు సరిహద్దు భద్రత కమాండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా సొంతిల్లు లేనివారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చట్టాలను సంస్కరించి 15 లక్షల కొత్త ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ప్రైవేట్ స్కూళ్లకు పన్ను మినహాయింపులు ఎత్తేసి ఆ సొమ్ముతో 6,500 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇవన్నీ జనాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేణుగానంలో నిపుణుడు స్టార్మర్‌కు సంగీతంలో లోతైన ప్రవేశముంది. చాలాకాలం పాటు శాస్త్రీయ శిక్షణ తీసుకున్నారు. ఫ్లూట్, పియానో, వయోలిన్ అద్భుతంగా వాయిస్తారు. కాలేజీ రోజుల్లో ఆయన వేణుగానాన్ని అలా వింటూ ఉండిపోయేవాళ్లమని నాటి మిత్రులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. కాలేజీ రోజుల్లో స్టార్మర్ ఎంతో చురుకైన ఫుట్‌బాల్ ఆటగాడు కూడా. 2007లో విక్టోరియా అలెగ్జాండర్‌ను పెళ్లాడారు. ఆమె నేషనల్ హెల్త్ సరీ్వస్ (ఎన్హెచ్ఎస్)లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్. వారికి ఒక కొడుకు, కూతురున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Britain general elections: సునాక్ ఎదురీత!
బ్రిటన్‌లో పద్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెరపడనుందా? భారత మూలాలున్న తొలి ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్ గద్దె దిగాల్సి వస్తుందా? అవుననే అంటున్నాయి ఒపీనియన్ పోల్స్. షెడ్యూల్ ప్రకారం ఏడాది చివరిదాకా ఆగితే తన ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి తారస్థాయికి చేరి ఓటమి ఖాయమనే భావనతో రిషి అనూహ్యంగా జూలై 4న ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయినా పెద్దగా ప్రయోజనమేమీ ఉండకపోవచ్చని సర్వేలంటున్నాయి. విపక్ష లేబర్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని పేర్కొంటున్నాయి. స్వయానా రిషీ కూడా ఎదురీదుతున్నారని, సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా కోల్పోవచ్చని సావంత పోల్ పేర్కొంది! అదే జరిగితే సొంత పార్లమెంటు స్థానంలో ఓడిన తొలి సిట్టింగ్ ప్రధానిగా బ్రిటన్ చరిత్రలో రిషి నిలిచిపోతారు...ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతోనే కన్జర్వేటివ్ పార్టీ ఓటమి సగం ఖాయమైందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీది 190 ఏళ్ల చరిత్ర. ఇంత సుదీర్ఘ చరిత్రలో 1906లో వచి్చన 131 సీట్లే అత్యల్పం. ఈసారి ఆ రికార్డును అధిగమించవచ్చని సర్వేలంటున్నాయి. ‘‘సునాక్ ఉత్తర ఇంగ్లాండ్‌లోని కన్జర్వేటివ్‌ల కంచుకోటైన తన సొంత పార్లమెంటరీ స్థానాన్ని కూడా కోల్పోవచ్చు. ఆర్థిక మంత్రి జెరెమీ హంట్‌తో సహా పలువురు సీనియర్ మంత్రులకు ఓటమి తప్పదు’’ అని సావంత పోల్ పేర్కొంది. కన్జర్వేటివ్ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయం తప్పక పోవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత సంతతికి చెందిన వారు ఈసారి కన్జర్వేటివ్ పారీ్టకి ఓటేయకపోవచ్చనేది పోల్స్టర్ల అంచనా. లేబర్ పారీ్టకి 425కు పైగా సీట్లు...! హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 650 సీట్లకు గాను లేబర్ పార్టీ 425కు పైగా సాధించి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ 108 స్థానాలకు పరిమితమవుతుందని యూగవ్, కేవలం 53 స్థానాలకే పరిమితమవుతారని సావంత పోల్ పేర్కొన్నాయి. సావంత అయితే లేబర్ పార్టీకి దాని చరిత్రలోనే అత్యధికంగా 516 సీట్లు రావచ్చని అంచనా వేయడం విశేషం! కన్జర్వేటివ్‌లకు 72కు మించబోవని, లేబర్ పార్టీ 456 సీట్లు దాటుతుందని బెస్ట్ ఫర్ బ్రిటన్ సర్వే అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 43.6 శాతం ఓట్లతో 365 సీట్లు సాధించగా లేబర్ పార్టీకి 32.1 శాతం ఓట్లతో 202 స్థానాలు దక్కాయి. ఆకట్టుకుంటున్న కైర్ స్టార్మర్ ‘లెఫ్టీ లండన్ లాయర్’గా పేరు తెచ్చుకున్న కైర్ స్టార్మర్ లేబర్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. 14 ఏళ్లుగా విపక్షంలో ఉంటూ కుంగిపోయిన పారీ్టలో ఆయన జోష్ నింపుతున్నారు. ఇళ్ల సంక్షోభాన్ని పరిష్కరిస్తామని, పన్ను పెంపుదల లేకుండా మెరుగైన ప్రజా సేవలను అందిస్తామనే మామీలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ ప్రధాన దాత అయిన బిలియనీర్ జాన్ కాడ్వెల్ కూడా ఈసారి లేబర్ పారీ్టకి మద్దతిస్తున్నారు. తాను లేబర్ పారీ్టకే ఓటేస్తానని బాహాటంగా చెబుతున్నారు. అందరూ అదే చేయాలని పిలుపునిస్తున్నారు.ప్రజల్లో వ్యతిరేకతకు కారణాలెన్నో... బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ కామెరాన్ రాజీనామా అనంతరం చీటికీమాటికీ ప్రధానులు మారడం కన్జర్వేటివ్ పార్టీకి చేటు చేసింది. థెరిసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి రూపంలో ఏకంగా నలుగురు ప్రధానులు మారారు. వీరిలో 45 రోజులే కొనసాగిన ట్రస్ పారీ్టకి గట్టి నష్టాన్ని కలిగించారని, దాన్ని సునాక్ పూడ్చలేకపోయారని అంటున్నారు.→ 2022 అక్టోబర్‌లో రిషి ప్రధాని అవుతూనే ద్రవ్యోల్బణాన్ని సగానికి తగ్గిస్తానని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని, రుణ భారాన్ని, నేషనల్ హెల్త్ సరీ్వస్ వెయిటింగ్ జాబితాను తగ్గిస్తానని, అక్రమ వలసలను అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. ఇవేవీ చేయలేకపోగా సంప్రదాయ ఓటర్లనూ మెప్పించలేకపోయారని విమర్శ ఉంది.→ ఐదేళ్లలో బ్రిటన్ వాసుల జీవన ప్రమాణాలు బాగా పడిపోయాయి. వారిపై పన్ను భారమైతే గత 70 ఏళ్లలో అత్యధిక స్థాయిలో ఉంది. అక్రమ వలసలు పెరిగాయి. ప్రధానిగా సునాక్ నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలొచ్చాయి. → వీటికి తోడు 14 ఏళ్లుగా అధికారంలో ఉండటంతో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది.→ రిఫార్మ్ యూకే పార్టీ పుంజుకోవడం కూడా కన్జర్వేటివ్‌లను దెబ్బ తీయనుంది. ఈ పారీ్టకి 15 శాతం ఓట్ల వాటా ఉంది. ఈసారి చాలా స్థానాల్లో కన్జర్వేటివ్ ఓటు బ్యాంకుకు భారీగా గండి పెడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇంట దీపావళి వేడుకలు (ఫోటోలు)
-
రిషి సునాక్‌పై తీవ్ర విమర్శలు చేసిన బ్రిటన్ ఎంపీ
లండన్: బ్రిటిష్ మాజీ కల్చర్ సెక్రెటరీ నాడైన్ డోరీస్ తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాసిన లేఖలో ప్రధాని రిషి సునాక్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బోరిస్ జాన్సన్ ఎంపీగా రాజీనామా చేసినప్పుడే ఆమె కూడా రాజీనామా చేయాల్సి ఉంది కానీ అప్పుడు ఆమె రాజీనామా చేయనందుకు తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు రాజీనామా చేసిన ఆమె రిషి సునాక్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ భారీ లేఖను రాశారు. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అత్యంత సన్నిహితురాలైన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ నాడైన్ డోరీస్ చాలా కాలంగా రిషి సునాక్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ప్రధాని జాంబీల ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆయనకు ఎటువంటి రాజకీయ ముందుచూపు లేదన్నారు. రిషి సునాక్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. ఆర్ధిక పరమైన కుంభకోణాలతో పాటు మరికొన్ని కుంభకోణాల కారణంగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవి నుండి తప్పుకున్నారు. మాజీ ఆర్ధిక మంత్రి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయిన రిషి సునాక్ పార్టీ నాయకత్వ పోటీలో నామినేట్ చేయబడిన ఏకైక అభ్యర్థి కావడంతో ప్రధానిగా నియమితులయ్యారు. ఎంపీ రాసిన రాజీనామా లేఖ సంగతి అటుంచితే రిషి సునాక్ ప్రభుత్వం ప్రస్తుతానికైతే వెంటిలేటర్‌పైనే ఉండాలి చెప్పాలి. కొద్దీ రోజుల క్రితం ఖాళీ అయిన పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ రెండు స్థానాలను కోల్పోగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన చోట మాత్రం గెలిచింది. ప్రధాని రిషి సునక్ తన సాంకేతిక నాయకత్వాన్ని ఉపయోగించుకుని పార్టీ విశ్వసనీయతను కాపాడుకంటూ వస్తున్నారు. కానీ అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక స్తబ్దత, పారిశ్రామిక అస్థిరత ప్రభుత్వ ఆరోగ్య సేవల్లో జాప్యం వంటి కారణాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఈ కారణాల వల్లనే వచ్చే ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ప్రత్యర్థి లేబర్ పార్టీ కంటే చాలా వెనుకబడి ఉన్నారని అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: బాస్మతి బియ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. -
బ్రిటన్ ప్రధాని నివాసంపై కారుతో దాడికి యత్నం?
బ్రిటన్ ప్రధాన మంత్రి అధికారిక నివాసం వద్ద ఓ వ్యక్తి కారుతో దాడికి యత్నించాడు. ఈ పరిణామం అందర్నీ షాక్ కి గురి చేసింది. వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆ సమయంలో సునాక్ తన కార్యాలయంలో ఉన్నట్లు తెలుస్తోంది. లండన్ లోని ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ గేటును ఓ వ్యక్తి కారుతో ఢీకొట్టాడు. బ్రిటన్ కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నివాసం గేటును కారు ఢీకొన్న వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాస్త వయసున్న ఆ వ్యక్తిని సంకెళ్లతో బంధించి తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. సాధారణంగా బ్రిటన్ ప్రధాని నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఎప్పుడూ గట్టి సెక్యూరిటీ ఉంటుంది. రక్షణ వ్యవస్థలో భాగంగా బలమైన ఇనుప గేట్లు ఉంటాయి. దేశ పార్లమెంటుకు ఇది దగ్గరి మార్గం. ఇక్కడి ఎంట్రెన్స్ వద్ద గతంలోనే లోనే భారీ గేట్లను ఏర్పాటు చేశారు. 1991లో ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ లండన్‌లో బాంబు దాడులకు పాల్పడిన దృష్ట్యా ఇక్కడ భద్రతను పెంచారు. కాగా తాజా ఘటన వెనుక నిందితుడి ఉద్దేశం ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. గురువారం సాయంత్రం బ్రిటన్ ప్రధాని నివాసం వద్ద జరిగింది ఉగ్ర దాడి కాకపోవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. క్రిమినల్ డ్యామేజ్, డేంజరస్ డ్రైవింగ్ ఆరోపణలపై అతడిని అరెస్టు చేసినట్టు వారు చెప్పారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద 19 ఏళ్ళ సాయివర్షిత్ కందుల ఓ అద్దె ట్రక్కుతో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన మూడు రోజులకే బ్రిటన్ ప్రధాని నివాసం వద్ద అదే తరహా ఘటన చోటు చేసుకోవడగం గమనార్హం. ఇదీ చదవండి: అడ్డొస్తే ఎవరినైనా లేపేస్తా: సాయివర్షిత్ -
బ్రిటన్ ప్రజలకు క్షమాపణలు చెప్పిన రిషి సునాక్
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తాను చేసింది తప్పే అని ఒప్పుకున్నారు. కారులో ప్రయాణిస్తూ సీటు బెల్టు ధరించనందుకు తీవ్ర విమర్శలు రావడంతో ఆయన ఈమేరకు స్పందించారు. రిషి అధికార ప్రధినిధి జేమీ డేవిస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ ప్రచార కార్యక్రమం కోసం వీడియో చిత్రీకరిస్తుండగా రిషి సునాక్ కారులో వెనకాల కూర్చొని మాట్లాడారు. ఈ సమయంలో ఆయన సీటు బెల్టు ధరించలేదు. దీంతో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని అయి ఉండి రూల్స్ పాటించకపోవడంపై నెటిజన్లు మండిపడ్డారు. దీంతో రిషి తన తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పారు. గతంలో కరోనా ఆంక్షల సమయంలో కూడా రిషి నిబంధనలు అతిక్రమించారు. పోలీసులు అందుకు జరిమానా కూడా విధించారు. అప్పుడు కూడా ప్రజల ఆగ్రహానికి గురై విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోమారు ఇరకాటంలో పడ్డారు. దీన్నే అవకాశంగా తీసుకున్న ప్రతిపక్ష లేబర్ పార్టీ రిషిపై విమర్శలతో విరుచుకుపడింది. గతంలో ఓసారి ఆయన కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డును ఉపయోగించేందుకు ఇబ్బంది పడిన విషయాన్ని గుర్తు చేసింది. 'రిషి సునాక్‌కు సీటు బెల్టు పెట్టుకోవడం రాదు. డెబిట్ కార్డు ఉపయోగించడం రాదు. రైలు సేవలు, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా తెలియదు' అని లేబర్ పార్టీ ఎద్దేవా చేసింది. చదవండి: బాప్రే!..పాత సామాన్లు అమ్ముకున్న ఎలాన్ మస్క్, ఏ వస్తువు ఎంత ధర పలికిందంటే -
షాకింగ్.. రిషి సునాక్‌పై బూతులతో రెచ్చిపోయిన నటి.. ఎందుకంటే?
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై బూతులతో రెచ్చిపోయింది ప్రముఖ నటి, షీ-హల్క్ వెబ్ సిరీస్ స్టార్ జమీలా జామిల్. ఆయన ప్రభుత్వం ప్రజలను అణగదొక్కాలని చూస్తోందని మండిపడింది. రిషి సునాక్ సంపన్న వర్గానికి చెందిన వాడని, మితవాది అని, అదృష్టం కొద్ది ప్రధాని అయ్యారని ధ్వజమెత్తింది. ఇంగ్లీష్ భాషలో బూతు పదంతో తీవ్ర విమర్శలు చేసింది. ఈమేరకు తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసింది. ఎందుకీ విమర్శలు..? బ్రిటన్‌లో ప్రజలు నిరసనలు, ఆందోళనలు చేపట్టకుండా కొత్త చట్టాన్ని తీసుకురావాలని రిషి సునాక్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేయాలని రిషి సునాక్ చూస్తున్నారని జమీలా జామిల్ మండపడింది. ఇది నాయకత్వం కాదు నియంతృత్వం అని ధ్వజమెత్తింది. ప్రజలు ఉద్యోగాలు లేక ఆర్థిక సాయం అందక నిరసనలు వ్యక్తం చేస్తుంటే బిలియనీర్ రిషి సునాక్ వాళ్ల నోళ్లు మూయించాలని చూస్తున్నారని, దీన్ని తాము ఎంత మాత్రమూ సహించబోమని జమీలా హెచ్చరించింది. బ్రిటన్ వలసదారులపై రిషి సునాక్ విమర్శలు చేయడాన్ని కూడా తప్పుబట్టింది. బ్రిటన్ కోసం పనిచేస్తున్న వారిపై నిందలు మోపొద్దని హితవు పలికింది. చదవండి: రెస్టారెంట్లో కాల్పుల కలకలం.. ర్యాపర్ సహా 10 మందికి గాయాలు -
FIFA World Cup 2022: ఖతర్‌ను పొగుడుతూ ట్వీట్.. రిషి సునాక్‌పై విమర్శలు!
లండన్: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో మ్యాచ్‌లు తుది అంకానికి చేరుకుంటున్నాయి. ఏమాత్రం అంచనాలు లేని జట్టు బలమైన జట్లను ఓడించాయి. ఇదిలా ఉంటే..ఫిఫా ప్రపంచకప్‌పై బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ చేసిన ఓ ట్వీట్ విమర్శలకు దారి తీసింది. 16వ రౌండ్లో సెనెగల్‌తో ఇంగ్లాండ్ మ్యాచ్‌కు ముందు ఫిఫా ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్న ఖతర్‌ను పొగుడుతూ ట్వీట్ చేశారు రిషి సునాక్. ‘ఇప్పటివరకు అద్భుతమైన ప్రపంచకప్‌ను నిర్వహించినందుకు ఖతార్‌కు హ్యాట్సాఫ్. గ్రూప్ దశలు ఆల్ టైమ్ గ్రేట్స్‌లో ఒకటిగా గుర్తుండిపోతాయి. కమాన్ ఇంగ్లాండ్.. మన కలను సజీవంగా కొనసాగించండి.’ అంటూ ట్విట్టర్ వేదికగా ఖతార్‌పై ప్రశంసలు కురింపించారు. ఆయన ట్వీట్‌కు మిశ్రమ స్పందనలు వచ్చాయి. ‘నిజంగానా? ఆల్ టైమ్ గ్రేట్స్? మీరు ఏం చూస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు.’ అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. మరోవైపు.. కొందరు ఇంగ్లాండ్, సెనెగల్ మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగినట్లు పేర్కొన్నారు. ‘ఎస్ రిషి సునాక్, ఖతర్ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కొంత మందికి మాత్రం సమస్యగా ఉన్నా.. చూడదగ్గ ఈవెంట్.’ అంటూ మరొకరు రాసుకొచ్చారు. మరోవైపు.. ఇంగ్లాండ్ గత మ్యాచ్‌లో విజయం సాధించటంపై ప్రశంసలు కురింపించారు. తాము గతంలో ఎన్నడూ ఇంగ్లాండ్ ఆటను ఈ విధంగా చూడలేదని పేర్కొన్నారు. సెనెగల్పై విజయం సాధించిన ఇంగ్లాండ్.. డిసెంబర్ 11 డిఫెండింగ్ ఛాంపియన్స్ ఫ్రాన్స్‌తో క్వార్టర్ ఫైనల్లో తలపడనుంది. Hats off to Qatar for hosting an incredible World Cup so far. The group stages will be remembered as one of the all-time greats. Come on @England keep the dream alive 🦁🦁🦁#FIFAWorldCup #ENGSEN pic.twitter.com/YyLv9Y2VjZ — Rishi Sunak (@RishiSunak) December 4, 2022 ఇదీ చదవండి: FIFA World Cup 2022: మరో సంచలనం.. బెల్జియంను ఖంగుతినిపించిన మొరాకో -
Bali G20 Summit: జీ 20 సదస్సుకు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ/బాలి: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జీ 20 కూటమి దేశాల సదస్సుకు హాజరవడానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఇండొనేసియా బయల్దేరి వెళుతున్నారు. ఇండొనేసియాలోని బాలిలో 15, 16 తేదీల్లో జరిగే 17వ జీ 20 శిఖరాగ్రంలో మూడు ముఖ్యమైన సెషన్స్‌లో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలఫ్ స్కొల్జ్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లు కూడా హాజరవనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడం లేదు. అధ్యక్ష బాధ్యతలు భారత్‌కు 20 దేశాల కూటమి అయిన జీ 20 18వ సదస్సుకు 2023లో భారత్ అధ్యక్షత వహించనుంది. బాలి సదస్సులో ఇండొనేసియా నుంచి సారథ్య బాధ్యతలను భారత్ అందుకోనుంది. సునాక్‌తో ప్రత్యేకంగా భేటీ! జీ 20 సదస్సుకు హాజరయ్యే దేశాధినేతలతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపే అవకాశాలున్నాయి. దీంతో అందరి దృష్టి భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో మోదీ భేటీపై ఆసక్తి నెలకొంది. అయితే వీరిద్దరి మధ్య భేటీ ఉంటుందో లేదో ఇరుపక్షాలు కూడా స్పష్టం చేయలేదు. -
రిషి సునాక్‌ను బ్రిటన్ ప్రధానిగా చేయడం వెనుక..
‘మనము నేర్చు కోవాల్సిన పాఠం’ అంటూ అక్టోబర్ 31వ తేదీన కరణ్ థాపర్ వ్యాసంలోని అంశాలు అసంబద్ధంగా, తర్క విరుద్ధంగా ఉన్నాయి. బ్రిటన్ దేశ ప్రధాన మంత్రిగా హిందూ భక్తుడైన రిషి సునాక్ ఎన్నిక కావడానికీ, బ్రిటన్ నుంచి మనము పాఠం నేర్చుకోవడానికీ సంబంధం ఏమిటో అర్థం కావడం లేదు. రిషి సునాక్‌ను ఎన్ను కోవడానికి ముందు లిజ్ ట్రస్ అనే మహిళను కన్జర్వేటివ్ పార్టీ ఎన్నుకున్నది కదా. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి గట్టె క్కించడానికి బ్రిటన్ దేశానికి, ముఖ్యంగా కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి రిషి సునాక్ లాంటి ఆర్థిక వ్యవహారాల నిపుణుడి అవసరం వచ్చింది. కన్జర్వేటివ్ పార్టీ రిషి సునాక్‌ను ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టి, ఎన్నికలలో గెలిచి ఉంటే – అప్పుడు భారతీయులు బ్రిటన్ ప్రజల నుంచి ఆదర్శాన్ని అందిపుచ్చుకోవాల్సి ఉండేది. 190 సంవత్సరాలు భారతదేశాన్ని పీల్చి పిప్పి చేసింది బ్రిటన్. ఇప్పటికీ 14 దేశాలపై తన రాజరికపు ముద్రను కొనసాగిస్తూనే ఉన్నది. తమను దోచుకున్న దేశాన్ని బ్రిటిషర్స్ శత్రువులుగా భావిస్తారు. వ్యాసకర్త చెప్పిన దానికి విరుద్ధంగా ఆ దేశం నుండి చాలా విషయాలను స్వయం ప్రకటిత మేధావులైన కొందరు భారతీయులు నేర్చుకోవాలి. ఇక రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సందర్భాన్ని నేపథ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే భారతీయ జనతా పార్టీ హిందూ మతానికి చెందినదనీ, ఆ పార్టీ ముస్లింలకు వ్యతిరేకమని చెప్పడానికీ వ్యాసకర్త సంఖ్యాపరమైన విశ్లేషణలు చక్కగా చేశారు. ఈ దేశంలో సంఖ్యాపరంగా ముస్లింలు 14.3 శాతం ఉన్నది నిజమే. పార్లమెంట్లో వారి స్థానాలు కూడా తక్కువనేది వాస్తవమే. సివిల్ సర్వెంట్లుగా, సైనికులుగా ఆ మతం వారి సంఖ్య దేశంలోని ఇతర మతాల వారితో పోలిస్తే తక్కువే. ఇందుకు భారతీయ జనతా పార్టీ కారణం కాదే! హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశంలో ముస్లిం వర్గం నుండి నలుగురు రాష్ట్రపతులుగా ఎన్నిక చేయబడ్డారు. మరి ముస్లింలు మెజా రిటీగా ఉండే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మైనార్టీ వర్గాలైన హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్సీలు, క్రైస్తవుల పరిస్థితి ఏమిటి? 20 కోట్ల మంది ముస్లింల నుండి ఒక ప్రధాని ఆశించడానికి వీలు లేదా? అని ఒక మంచి ప్రశ్న వేశారు వ్యాసకర్త. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, క్రైస్తవ మతానికి చెందిన సోనియా గాంధీ 2004 నుండి 2014 వరకు ఈ దేశంపై సర్వాధికారాలను అనుభవించిన విషయం అందరికీ తెలిసిందే. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో 28 శాతం హిందువులు ఉంటారు. ఆ రాష్ట్రం భారతదేశంలో విలీనమైనప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క హిందువూ సీఎం కాలేదనే విషయం వ్యాసకర్తకు తెలియదా? ముస్లింలను చెద పురుగులుగా, బాబర్ వారసులుగా అవహేళన చేస్తూ, మానసికంగా వేధిస్తున్నారనే విషయం వాస్తవమేనా? కశ్మీర్ లోయనుండి 3 లక్షల మంది హిందువులను తరిమికొట్టింది ఎవరు? ఇక చివరిగా రిషి సునాక్‌ను బ్రిటన్ ప్రధానిగా చేయడం వెనుక ఆ దేశ అవసరం ఉంది. ఈ విషయంలో ఆయన భారతీయ మూలాల శ్రేష్ఠత గానీ, రంగు గానీ, జాతి గానీ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలకు కనబడ లేదనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం రిషీ సునాక్ ఎంపిక చూసి గర్వపడాల్సింది ఏమీలేదు. బ్రిటిష్‌వారి ఔదా ర్యమూ అంతకన్నా ఏమీలేదు. - ఉల్లి బాలరంగయ్య రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
COP27: వేదికను వీడిన రిషి సునాక్.. అంతా షాక్
షెర్మ్–ఎల్–షేక్: ప్రపంచ పర్యావరణ సదస్సు కాప్-27 కు హాజరుకాబోనని ప్రకటించి.. ఆవెంటనే యూటర్న్తీసుకుని ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్. ఆదివారం రాత్రే సదస్సుకు చేరుకున్న ఆయన.. పర్యావరణ మార్పులు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందించబోయే సాయం, భావితరాల సంక్షేమం గురించి కూడా ప్రసంగించారు. అయితే ఓ కీలక సమావేశం జరుగుతున్న సమయంలో హడావిడిగా అక్కడి నుంచి నిష్క్రమించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. కాప్27 సదస్సులో సోమవారం ఓ నాటకీయ పరిణామం జరిగింది. సదస్సు కొనసాగుతున్న సమయంలోనే ఆయన ఆ హాల్ నుంచి హడావిడిగా బయటకు వెళ్లిపోయారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక గందరగోళానికి గురయ్యారు అక్కడ ఉన్నవాళ్లంతా. COP27 సదస్సులో భాగంగా.. ఫారెస్ట్స్ పార్ట్నర్షిప్ ప్రారంభం అయిన కాసేపటికే ఓ సహాయకుడు వచ్చి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిమిషంపాటు చెవిలో ఏదో చెప్పాడు. అయినా సునాక్ అలాగే స్టేజ్ మీద కూర్చుని ఉండిపోయారు. ఈ లోపే మరో వ్యక్తి వచ్చి ఆయనతో ఏదో చెప్పగా.. హడావిడిగా సునాక్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని యూకేకు చెందిన ఓ వెబ్సైట్ నిర్వాహకుడు లియో హిక్‌మ్యాన్ తెలిపారు. UK prime minister @RishiSunak has just been rushed out of the room by his aides during the middle of the launch for forests partnership at #COP27 pic.twitter.com/OQy9TYkqpX — Leo Hickman (@LeoHickman) November 7, 2022 సహాయకులు ఏం చెప్పారు? ఆయన ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోయారు? ఆయనింకా అక్కడే ఉన్నారా? బ్రిటన్‌కు వెళ్లారా? దానిపై డౌనింగ్ స్ట్రీట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఐరాస నిర్వహించే పర్యావరణ మార్పుల సదస్సును ‘కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్’(COP27)గా వ్యవహరిస్తుంటారు. ఈజిప్ట్‌లో రిసార్టుల వనంగా పేరున్న షెర్మ్–ఎల్–షేక్‌లో ఈ సదస్సు ఆదివారం నుంచి మొదలైంది. ఇదిలాఉంటే.. 42 ఏళ్ల రిషి సునాక్‌కు ప్రధాని హోదాలో ఇదే తొలి అధికారిక పర్యటన కావడం గమనార్హం. ఇదీ చదవండి: రిషి సునాక్‌పై విమర్శల పర్వం! -
Rishi Sunak: రిషి సునాక్.. ఇది తగునా?
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ తీరుపై కన్జర్వేటివ్ పార్టీ సీనియర్లలో అసంతృప్తి పెల్లుబిక్కుతోంది. వివాదాల్లో నిలిచిన వ్యక్తులను కేబినెట్లోకి తీసుకోవడం.. పైగా వాళ్లను వెనకేసుకొస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నగాక మొన్న సువెల్లా బ్రేవర్మన్ను తిరిగి మంత్రిగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆ వేడి చల్లారకముందే తప్పు చేసిన మరో మంత్రిని వెనకేసుకు రావడం ద్వారా ఆయన మరోసారి విమర్శలపాలవుతున్నారు. సండేటైమ్స్ కథనం ప్రకారం.. మంత్రి గేవిన్ విలియమ్సన్.. మాజీ పార్టీ విప్, వెంటీ మోర్టన్కు ఫోన్ ద్వారా అసభ్యమైన సందేశాలు పంపారు. ఈ విషయాన్ని మరో మంత్రి ఒలీవర్ డౌడెన్ తాజాగా మీడియాకు వెల్లడించారు. వర్ణించలేని రీతిలో గేవిన్, ఆమెను తిట్టినట్లు తెలుస్తోంది. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల సమయంలో ఆహ్వానం అందకపోవడంపై రగిలిపోతూ వెంటీకి అలా మెసేజ్‌లు చేశాడట. అయితే.. ఈ వ్యవహారాన్ని ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సునాక్ దృష్టికి తీసుకెళ్లారు పార్టీ మాజీ చైర్మన్ సర్ జేక్ బెర్రీ. ఫోన్ సంభాషణలను మీడియాకు చూపిస్తున్న డౌడెన్ మరోవైపు కన్జర్వేటివ్ పార్టీ గవర్నింగ్ బాడీకి ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గేవిన్-వెంటీ మధ్య వైరం సంగతి రిషి సునాక్‌కు ముందు నుంచే తెలుసని, అయినప్పటికీ గేవిన్ను సునాక్ వెనుకేసుకొస్తున్నారని డౌడెన్ ఆరోపించారు. ఇక తీవ్ర విమర్శల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు. గేవిన్ చర్యలు సరికాదని, ఆమోదయోగ్యం ఎంతమాత్రం కాదని అన్నారు. అలాగే ఈ వ్యవహారంలో ఎవరికీ వెనుకేసుకు రావాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఫిర్యాదు నేపథ్యంలో.. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని ఆయన చెప్పారు. అంతకు ముందు సువెల్లా బ్రేవర్మన్ నియామకాన్ని ఆయన సమర్థించుకున్న సంగతి తెలిసిందే!. ఇదీ చదవండి: మూలాలపై రిషి సునాక్ ఆసక్తికర వ్యాఖ్యలు -
హిందూ ప్రధానిగా గర్విస్తున్నా
లండన్: బ్రిటన్ మొట్టమొదటి హిందూ ప్రధాని అయినందుకు గర్వపడుతున్నానని భారత సంతతికి చెందిన రిషి సునాక్ అన్నారు. ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో భావాల్ని పంచుకున్నారు. ప్రధానిగా తాను ఎన్నికవడం బ్రిటన్‌లో భిన్నత్వానికి నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు.యూకేకి 42 ఏళ్ల వయసులోనే ప్రధాని అయిన రిషి సునాక్ ఏదైనా ముఖ్య కార్యక్రమం చేయడానికి ముందు గోమాతకి పూజ చేస్తారు. దీపావళి పండుగని ఘనంగా జరుపుకుంటారు. ‘‘ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి పండుగకి దివ్వెలు వెలిగించాను. అలా చెయ్యగలగడం మన దేశం ఎంత అద్భుతమైనదో చాటి చెప్పింది. అదే సమయంలో అదో పెద్ద విషయం కాదన్న అంశాన్ని కూడా చెప్పింది.’ అని సునాక్ అన్నారు. ప్రధాని ఎన్నిక సమయంలో బోరిస్ జాన్సన్ ప్రధాని కావడానికి వీలుగా తాను పోటీ నుంచి తప్పుకుంటానని జరిగిన ప్రచారాన్ని తోసిపుచ్చారు. ‘‘పార్లమెంటులో నా సహచర ఎంపీల నుంచి నాకు గట్టి మద్దతు ఉంది. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్న సమయంలో ప్రధానిగా నేనే సరైన వ్యక్తినని గట్టిగా నమ్మాను. రేసు నుంచి తప్పుకోవాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు’’ అని సునాక్ స్పష్టం చేశారు. -
పీఎంగా రిషి సునాక్ బిగ్ ‘యూ-టర్న్’.. ఆ నిర్ణయంలో మార్పు
లండన్: బ్రిటన్ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ప్రధాని పదవి చేపట్టిన విషయం తెలిసిందే. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కఠిన నిర్ణయాలు తప్పవంటూ తన మార్క్‌ను చూపిస్తున్నారు. అయితే, ప్రధాని పీఠంపై కూర్చున్న మొట్టమొదటి సారి బిగ్ యూటర్న్ తీసుకుని తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దేశీయ బాధ్యతల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి క్లైమేట్ సమ్మిట్‌కు వెళ్లకూడదని ముందుగా నిర్ణయించుకున్న రిషి సునాక్.. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకుని వెళ్లాలని నిశ్చయించుకున్నారు. తాను పర్యావరణ సదస్సుకు హాజరవుతున్నట్లు ట్వీట్ చేశారు. ‘పర్యావరణ మార్పులపై చర్యలు తీసుకోకుండా బంగారు భవిష్యత్తు లేదు. పునరుత్పాదక ఇంధనాలపై పెట్టుబడులు పెట్టకుంటే విద్యుత్తు సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నట్లే. అందుకే.. వచ్చే వారం జరగనున్న కాప్27 క్లేమేట్ సదస్సుకు హాజరవబోతున్నా. సురక్షితమైన, స్థిరమైన భవిష్యత్తును నిర్మించే గ్లాస్గో వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నా.’ అని ట్వీట్ చేశారు రిషి సునాక్. ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్-షేక్ రెడ్ సీ రిసార్ట్‌లో జరిగే సమావేశానికి హాజరు కాకూడదని సునాక్ తీసుకున్న నిర్ణయం పర్యావరణ ప్రచారకుల ఆగ్రహానికి కారణమైంది. ఈ కారణంగానే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. రిషి సునాక్ ట్వీట్ చేయకముందే యూ-టర్న్‌పై హింట్ ఇచ్చారు ఆయన అధికార ప్రతినిధి. నిర్ణయంపై పునఃసమీక్షిస్తున్నట్లు చెప్పారు. దానికన్నా ముందు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరుకాబోతున్నట్లు ప్రకటించారు. గత ఏడాది కాప్ 26 సమావేశానికి ఆయన ప్రధాని హోదాలో హాజరయ్యారు. There is no long-term prosperity without action on climate change. There is no energy security without investing in renewables. That is why I will attend @COP27P next week: to deliver on Glasgow's legacy of building a secure and sustainable future. — Rishi Sunak (@RishiSunak) November 2, 2022 ఇదీ చదవండి: ఈ నిర్ణయం ఘోర తప్పిదం...రిషి సునాక్‌పై విమర్శలు! -
రిషి సునాక్ ఫిట్నెస్ సీక్రెట్, డైట్ ప్లాన్ ఏంటో తెలుసా?
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ కొద్ది రోజుల క్రితం బాధ్యతలు చేపట్టారు. 42 ఏళ్ల వయసున్న రిషి సునాక్.. 200 ఏళ్ల బ్రిటన్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా నిలిచారు. ఏ వేదికపై చూసినా ఎంతో ఫిట్‌గా, ఉత్సాహంగా కనిపిస్తారు. ఇంతకి ఆయన ఫిట్నెస్ సీక్రెట్, డైట్ ప్లాన్ ఏంటి అనేది చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్న. ఆయన దిన చర్య, డైట్ ప్లాన్, ఫిట్నెస్ కోసం ఏం చేస్తారనేది ఆయనే వెల్లడించారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని సాధించేందుకు రిషి సునాక్ దిన చర్య ఎందరికో ఆదర్శవంతంగా ఉంటుంది. గత ఏడాది ‘ద ట్వంటీ మినట్ వీసీ పోడ్కాస్ట్ విత్ హ్యారీ స్టెబ్బింగ్స్’ కార్యక్రమం వేదికగా తన దినచర్య, ఆహార అలవాట్ల వంటి అంశాలను బహిర్గతం చేశారు రిషి సునాక్. తాను ఉదయం 6-7గంటలకు నిద్ర లేస్తానని, అది తాను చేయబోయే జిమ్‌ను బట్టి సమయం ఆధారపడి ఉంటుందని తెలిపారు. ‘శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు ఒక సెషన్ పెలోటన్, ఒక సెషన్ ట్రెడ్మిల్ వర్కౌట్ చేస్తా. అలాగే హెచ్ఐఐటీ క్లాస్ నిర్వహిస్తాను. అమెరికన్ ఫిట్నెస్ ట్రైనర్ కాడీ రగ్స్బైని అనుసరిస్తాను. ఆయనే నాకు చాలా కాలంగా ఫేవరెట్. నేను అడపా దడపా ఉపవాసం చేస్తాను. కొన్ని రోజులు అసలు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే ఉంటాను. ఉపవాసం రోజుల్లో గ్రీకు పెరుగు, బ్లూబెర్రీలను తీసుకుంటాను. ఆపై అల్పాహారంలో బన్, చాక్లెట్ వంటివి తీసుకుంటాను. వారాంతాలు శని, ఆదివారాల్లో ఇంట్లోనే వండిన వాటిని అల్పాహారంగా తీసుకుంటాము. అమెరికన్ స్టైల్లో పాన్‌కేక్స్ తయారు చేస్తాము.’ అని తెలిపారు రిషి సునాక్. ఇదీ చదవండి: రిషి సునాక్ ఆప్యాయ పలకరింపు వీడియో.. ఇంతకీ ఆ ‘విజయ్ మామా’ ఎవరు? -
Rishi Sunak: విజయ్ మామా..హాయ్!
వైరల్: బ్రిటన్ చరిత్రను తిరగరాస్తూ.. చిన్నవయసులోనే ఆ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు రిషి సునాక్. ఆయన పీఎంగా ఎన్నిక కావడం పట్ల కన్జర్వేటివ్ పార్టీలో.. ఆ దేశంలో ఆయన అభిమానులు ఇంకా సంబురాలు చేసుకుంటూనే ఉన్నారు. మరోవైపు భారత మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో ఇక్కడి నెటిజన్స్ కూడా ఊరుకోవడం లేదు. ఈ గ్యాప్‌లో సెలబ్రిటీ చెఫ్ సంజయ్ రైనా షేర్ చేసిన ఓ వీడియో ట్విటర్లో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ముందుగా సంజయ్.. ‘మామా, మీకు ఒకరు హలో చెప్తారు’ అని అంటాడు. ఆ వెంటనే కెమెరా రిషి సునాక్ వైపు మళ్లుతుంది. అప్పుడు రిషి సునాక్ ‘విజయ్ మామా..హాయ్. నేను రిషి. మీరు ఎలా ఉన్నారు..? మీరు యూకే వచ్చినప్పుడు నన్ను కలుస్తారని అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు 10 డౌనింగ్ స్ట్రీట్‌కి తీసుకురామని మీ మేనల్లుడిని(రైనాను చూపిస్తూ..) అడగండి.. జాగ్రత్త’ అంటూ చెప్తారు. వీడియో షేర్ చేసిన సంజయ్ ‘వీసా ఆన్ అరైవల్ పక్కా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. పాతదే అనిపిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘విజయ్ మామా’ ఎవరు..? అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సంజయ్ చేసిన ఈ వీడియో.. యూకే వీసా సమస్యలను ఉద్దేశించి సెటైరిక్‌గా చేసి ఉంటారనే కోణంలోనూ చర్చ నడుస్తోంది. ఇక ఆ విజయ్ మామా.. విజయ్ మాల్యా అయ్యి ఉండొచ్చనే అనుమానం ఒక నెటిజన్ వ్యక్తం చేయగా.. గుడ్ వన్ అంటూ నవ్వులు చిందించాడు సంజయ్ రైనా. Visa on arrival ab pakka 😊😊#RishiSunak pic.twitter.com/imSIhuEgKB — Sanjay Raina (@sanjayraina) October 27, 2022 -
బ్రిటన్ ప్రధానిగా రిషి.. యూకేలో ప్రవాసీయుల ఖుషీ
రాయికల్(జగిత్యాల): సుమారు రెండువందల సంవత్సరాల పాటు మనదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. ప్రస్తుతం భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీపావళి పర్వదినాన ఆయన ఎన్నికవడంపై యూకేలో స్థిరపడిన ప్రవాస భారతీయులు పండుగను ఘనంగా జరుపుకున్నారు. రిషి ఎన్నికపై ప్రవాసీయులు ‘సాక్షి’తో తమ మనోభావాలు పంచుకున్నారు. వారి మాటల్లోనే.. ఆర్థిక విధానాలతోనే ప్రజాదరణ మాది హైదరాబాద్. నేను ఉద్యోగ రీత్య బ్రిటన్‌లో పనిచేస్తున్నా. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్ర ధానిగా పీఠం అధిరోహించడం ఆనందంగా ఉంది. యూకేలో కరోనా మహమ్మారి సమయంలో రిషి రూపొందించిన ఆర్థిక సంస్కరణలతో ప్రజల్లో ఆదరణ పెరిగింది. ప్రతి ఒక్కరూ ఆయన ఆర్థిక విధానాలతో యూకేలో పూర్వ వైభవం తీసుకువస్తారనే ఆశతో ఎన్నుకున్నారు. – సిక్క చంద్రశేఖర్, ఎన్ఆర్ఐ, లండన్ సమర్థవంతంగా పాలిస్తారు మాది నల్గొండ జిల్లా కేతుపల్లి మండలం తుంగతుర్తి గ్రామం. భారత సంతతికి చెందిన రిషి యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంతో ఆనందంగా ఉంది. ఆయన అనేక సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంటూ ముందుకు సాగుతారనే నమ్మకం ఉంది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఆర్థిక మాంధ్యం నుంచి ముందుకు నడిపిస్తారనే నమ్మకంతో ప్రజలు, కన్జర్వేటివ్ పార్టీలో నెలకొన్న అనిశ్చితిని సరిదిద్దగల శక్తి రిషికి ఉందనే నమ్మకం ఉంది. – సతీశ్‌రెడ్డి, లండన్ ప్రతిపక్షాలను సమన్వయం చేస్తారు మాది మహబూబాబాద్ జిల్లా కంబంపల్లి. యూకే ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ప్రతిపక్షంలోని సభ్యులకు కేబినేట్లో మంత్రి పదవి ఇచ్చారు. దీనిద్వారా ఆయన రాజకీయ చాతుర్యం యూకేలోని అన్ని పార్టీలకు తెలిసింది. పడిపోతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే సత్తా రిషి సునాక్‌కు ఉంది. ఇండియా, యూకే సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. – సతీశ్‌కుమార్, నార్తర్న్ ఐర్లాండ్ మంచి ఆర్థిక నిపుణుడు మాది హైదరాబాద్. బ్రిటన్ ప్రధాని రిషి యూకేలో మాజీ ఆర్థికమంత్రిగా పనిచేశారు. యూకేలో ఆర్థిక సంక్షోభం గురించి పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. చిన్నవయసులోనే ప్రధాని కావడం, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న యూకేకు పూర్వ వైభవం తెస్తారనే నమ్మకం ప్రజలు, నాయకుల్లో ఉంది. – దూసరి అశోక్‌గౌడ్, ఎన్ఆర్ఐ, బీఆర్ఎస్ యూకే ప్రెసిడెంట్ గర్వంగా ఉంది నాది కరీంనగర్ జిల్లా కేంద్రం. మొన్నటివరకు లండన్‌లో ఉద్యోగం చేశా. బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు స్వీకరించడం గర్వంగా ఉంది. ముఖ్యంగా భారత్, బ్రిటన్ల మధ్య అనేక సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. యూకేలో భారతీయులకు ఒక భరోసా నెలకొల్పింది. ఆర్థిక వ్యవస్థ మళ్లీ మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. – కూర్మాచలం అనిల్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ -
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు మోదీ ఫోన్
న్యూఢిల్లీ/ లండన్: ప్రపంచంలో రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ కలిసి పనిచేయాలని, ఇరు దేశాల నడుమ రక్షణ, ఆర్థికపరమైన భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని బ్రిటన్ నూతన ప్రధానమంత్రి రిషి సునాక్ ఆకాంక్షించారు. రెండు దేశాలు కలిసికట్టుగా సాధించబోయే ఘనత కోసం తాను ఉత్సుకతతో ఎదురు చూస్తున్నానని చెప్పారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తనను అభినందించినందుకు గాను ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలియజేశారు. మోదీ గురువారం ఫోన్లో రిషి సునాక్‌తో మాట్లాడి, అభినందించారు. ‘‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి మేమిద్దరం కలిసి పనిచేస్తాం. సమగ్ర, సమతుల్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవాలని అంగీకారానికి వచ్చాం’’ అని మోదీ ట్వీట్ చేశారు. దీనిపై రిషి సునాక్ ట్విట్టర్లో స్పందించారు. కొత్త పాత్రలో తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని, బ్రిటన్–భారత్ కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిషి సునాక్‌తో మోదీ మాట్లాడడం ఇదే మొదటిసారి. Glad to speak to @RishiSunak today. Congratulated him on assuming charge as UK PM. We will work together to further strengthen our Comprehensive Strategic Partnership. We also agreed on the importance of early conclusion of a comprehensive and balanced FTA. — Narendra Modi (@narendramodi) October 27, 2022 Thank you Prime Minister @NarendraModi for your kind words as I get started in my new role. The UK and India share so much. I'm excited about what our two great democracies can achieve as we deepen our security, defence and economic partnership in the months & years ahead. pic.twitter.com/Ly60ezbDPg — Rishi Sunak (@RishiSunak) October 27, 2022 ఇదీ చదవండి: Rishi Sunak: తొలిరోజే విమర్శల జడివాన.. బ్రేవర్మన్ నియామకంపై వ్యతిరేకత -
పాలించడమెలాగోచూపిస్తా
లండన్: ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో సతమతమవుతున్న బ్రిటన్‌కు స్థిరత్వం, ప్రజలకు విశ్వాసం కలిగించడమే తమ ప్రభుత్వ అజెండాలో ప్రధానాంశమని నూతన ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. తాజా మాజీ ప్రధాని లిజ్ ట్రస్ చేసిన ఆర్థిక తప్పిదాలను సరిచేసేందుకే కన్జర్వేటివ్ ఎంపీలు తనను సారథిగా ఎన్నుకున్నారని అభిప్రాయపడ్డారు. ‘‘మార్పు కోసం ట్రస్ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. ఆమె ఉద్దేశాలు మంచివే. కాకపోతే తీసుకున్న నిర్ణయాల్లో, వాటి అమల్లోనే తప్పిదాలు దొర్లాయి’’ అన్నారు. మంగళవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి జాతినుద్దేశించి ఆయన తొలి ప్రసంగం చేశారు. దేశం చరిత్రలోనే అతి పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే, ‘‘తొలుత కరోనా, తర్వాత రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మన పాలిట పెను సమస్యలుగా మారాయి. పరిస్థితిని దీటుగా ఎదుర్కొంటాం. కరోనా, దానివల్ల తలెత్తిన ఆర్థిక సమస్యలను ఆర్థిక మంత్రిగా ఎంత సమర్థంగా నిభాయించుకొచ్చానో అందరికీ తెలుసు. ప్రజలను, వ్యాపార వాణిజ్యాలను పరిరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నా. అదే స్ఫూర్తితో ఇప్పుడూ సమస్యలను అధిగమిస్తాం. సమస్యను చూసి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. పూర్తి జవాబుదారీతనం, సమగ్రత, పక్కా ప్రొఫెషనలిజంతో కూడిన పాలన ఎలా ఉంటుందో చూపిస్తా. మాటలతో కాకుండా చేతల్లో దేశాన్ని ఐక్యం చేసి చూపిస్తా’’ అని చెప్పారు. ‘‘మనం చెల్లించలేనంత భారీ అప్పులను ముందు తరాలపై రుద్దే ప్రసక్తే లేదు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తా’’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో పౌరుల సంక్షేమం పట్ల సహానుభూతితో వ్యవహరిస్తామన్నారు. ‘‘మేం పూర్తి స్పష్టతతో రంగంలోకి దిగాం. ఈ క్షణం నుంచే మా పని మొదలైంది. దేశ సంక్షేమం కోసం అహోరాత్రాలూ కష్టపడతాను’’ అని ప్రకటించారు. ‘‘మనమంతా కలిసి పని చేస్తే అద్భుతాలు చేసి చూపించొచ్చు’’ అంటూ ఆత్మవిశ్వాసం వెలిబుచ్చారు. అందరి ఆకాంక్షలకు అనుగుణంగానే తన పాలన ఉంటుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఆ క్రమంలో తాను పలు కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలపై రిషి విమర్శలు ఎక్కుపెట్టారు. భార్య అక్షత, కుమార్తెలు కృష్ణ, అనౌష్కలతో కలిసి మాట్లాడతారని అంతా భావించగా రిషి ఒంటరిగానే దాదాపు 6 నిమిషాల పాటు మాట్లాడారు. బ్రిటన్ చరిత్రలో ఓ కొత్త ప్రధాని చేసిన అతి సుదీర్ఘ తొలి ప్రసంగాల్లో ఇదొకటని చెబుతున్నారు. బోరిస్ జాన్సన్ మాత్రం 2019లో బాధ్యతలు చేపట్టాక ఏకంగా 11 నిమిషాల 13 సెకన్లు మాట్లాడారు! తాజా మాజీ ప్రధాని ట్రస్ తన తొలి ప్రసంగాన్ని 4 నిమిషాల్లో ముగించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Rishi Sunak: పక్కా హిందూ
‘‘నేను హిందువుని అని చెప్పుకోవడానికి గర్వపడతాను’’ అని బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ పలు సందర్భాల్లో బాహాటంగానే ప్రకటించారు. ఎంత ఎదిగినా తన మూలాలను ఆయన ఎన్నడూ మరచిపోలేదు. రిషి బ్రిటన్‌లో పుట్టి పెరిగినప్పటికీ చిన్నప్పట్నుంచి భారత సంస్కృతి సంప్రదాయలను వంటపట్టించుకున్నారు. తరచూ దేవాలయాలను దర్శిస్తూ ఉంటారు. సోమవారం ఉపవాసం చేస్తారు. గోమాంసం ముట్టరు. యూకే రాజకీయాల్లో హిందువునని చెప్పుకునే రిషి పైకి ఎదిగారు. అదే ఆయన ప్రత్యేకత. హిందువులకు అత్యంత పవిత్రమైన భగవద్గీతపైన అపారమైన నమ్మకం. 2015లో మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేశారు. జాన్సన్ హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించేటప్పుడు కూడా గీతపైనే ప్రమాణం చేశారు .ప్రధానిగా లిజ్ ట్రస్‌తో పోటీ పడే సమయంలో ప్రచారంలోనూ శ్రీకృష్ణ జయంతి రోజున గోపూజ చేస్తున్న ఫొటోలు, వీడియోలతో ఆయన ట్వీట్లు చేశారు.రిషి ఇంగ్లీషుతో పాటు హిందీ, పంజాబీ భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. సునాక్‌కు భారత్ పాస్‌పోర్టు కూడా ఉంది. బెంగుళూరుకు చెందిన బ్రాహ్మణ కుటుంబమైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతను పెళ్లి చేసుకున్న సునాక్ ఇంట్లో కూడా భారతీయ సంప్రదాయాలనే పాటిస్తారు. వారి ఇద్దరి ఆడపిల్లలు అనౌష్క, కృష్ణని కూడా భారతీయతనే నేర్పిస్తున్నారు. కుటుంబానికి అత్యంత విలువ ఇస్తారు. తన అత్తమామలు ఎప్పటికీ గర్వకారణమని చెప్పుకుంటారు. వారిని కలవడానికి తరచూ బెంగుళూరు వచ్చి వెళుతుంటారు. ప్రతీ ఏటా దీపావళిని ఘనంగా జరుపుకునే సునాక్ ప్రధానిగా దీపావళి రోజే ప్రమాణం చేయడం విశేషం. ఒక హిందువును ప్రధానిగా అంగీకరించడం ద్వారా బహుళ విశ్వాసాలు, వైవిధ్యాలను అంగీకరించగలిగే సహనం యూకే ప్రజలకు బాగా ఉందని అర్థమవుతోంది. కుటుంబ నేపథ్యం ఇదీ రిషి సునాక్ తాత రామదాస్ సునాక్ అవిభాజ్య భారత్‌లో పంజాబ్ రాష్ట్రంలోని గుజ్రనవాలాకు చెందినవారు. 1935 సంవత్సరంలోనే రామదాస్ తూర్పు ఆఫ్రికాలోని నైరోబియాకి వలస వెళ్లిపోయారు. నాన్నమ్మ రాణి సునాక్ ఓ రెండేళ్లు ఢిల్లీలో ఉండి తర్వాత భర్త దగ్గరకి వెళ్లారు. రామదాస్ దంపతులకి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. రిషి సునాక్ తండ్రి యశ్వీర్ 1949లో కెన్యాలో జన్మించారు. 1960లో ఆఫ్రికాలో భారతీయులపై జరిగే దాడులకు భయపడి యశ్వీర్ యువకుడిగా ఉన్నప్పుడే ఆ కుటుంబం బ్రిటన్‌కు మకాం మార్చి అక్కడే స్థిరపడింది. పంజాబ్ నుంచి టాంజానియా వచ్చి స్థిరపడిన కుటుంబానికి చెందిన ఉషా బెర్రీని యశ్వీర్ వివాహం చేసుకున్నారు. ఆ దంపతుల మొదటి సంతానమే రిషి సునాక్. రిషి తాత ముత్తాతలు ఉంటే గుజ్రనవాలా ప్రస్తుతం పాకిస్తాన్లో ఉండడంతో ఆ దేశం కూడా రిషి మా వాడే అని అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Rishi Sunak: సార్.. కోహినూర్!
బ్రిటన్ ప్రధాని పీఠంపై చిన్న వయసులో.. అదీ తొలి శ్వేతజాతీయేతరుడిగా రిషి సునాక్ పగ్గాలు అందుకున్నారు. భారత మూలాలు ఉన్న వ్యక్తి, పైగా మన దేశపు అల్లుడు కావడంతో ఇక్కడి నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. మీమ్స్ వడ్డన మామూలుగా ఉండడం లేదు. రెండు రోజులుగా కొనసాగుతూనే ఉంది. ప్రముఖ భారత క్రికెటర్ అశిష్ నెహ్రా.. రిషి సునాక్ కవలలు అంటూ మొదలైన మీమ్స్ ఫెస్టివల్.. ఇవాళ అధికారికంగా ఆయన ప్రధానిగా నియామకం అయిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. ఇక ఆయనకు భారతీయులు ట్విటర్ ద్వారా చేసిన తొలి విజ్ఞప్తి.. కోహినూర్ వజ్రాన్ని ఎలాగైనా భారత్‌కు పంపించాలని. అలాగే.. వలసవాదులను వలసరాజ్యంగా మార్చేసి.. పాలించబోతున్నారంటూ మరో సెటైర్ పేలుస్తున్నారు. ఇక యూకే ప్రధాని అధికారిక భవనం 10 డౌనింగ్ స్ట్రీట్ డోర్లకు దండలు, ఆ బయట చెప్పులు విడిచేసి ఉండడం, కాపలాగా వాచ్మెన్ ఉండడం.. ఇలా దేశీ టచ్‌ను మీమ్స్‌కు జత చేసి హిలేరియస్ ఫన్ను పుట్టిస్తున్నారు. మరోవైపు రిషి సునాక్ ప్రధాని అయ్యాడు కాబట్టి.. ఇడ్లీ, వడ, చట్నీ, కాఫీ.. మెనూలో చేరతాయని జోకులు పేలుస్తున్నారు. ఇక పాక్‌కు బర్నల్ పంపాల్సిన అవసరం ఉందంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తి గనుక అల్లుడి ఇంటికి వెళ్తే.. 10 డౌనింగ్ స్ట్రీట్ కాస్త తీన్ మూర్తి భవనం(రిషి సునాక్ భార్య అక్షతా మూర్తితో కలిపి) అవుతుందని జోకులు పేలుస్తున్నారు. Meanwhile in UK :) pic.twitter.com/nnOuU2b0FQ — Switty (@Switty2020) October 25, 2022 If NRN and Sudha move into Dus Number, perhaps it can be called Teen Murti Bhavan — Abhishek Singhvi (@DrAMSinghvi) October 24, 2022 Our first mission is to bring back our ' Kohinoor '. let's goo #Sunak #Kohinoor pic.twitter.com/UvEwXp6cjt — Teju (@tejasflyingmac) October 24, 2022 As #RishiSunak is about become UK PM ,India to send trucks full of Burnol to Pakistan pic.twitter.com/GSm3qbI3O3 — 𝒮𝒽𝒶𝒾𝓁𝑒𝓈𝒽_𝐼𝒩𝒟 भारत🇮🇳 (@Shailesh__IND) October 24, 2022 Meanwhile in UK 😀 pic.twitter.com/JxYC7Qz14k — Porinju Veliyath (@porinju) October 25, 2022 Congratulations Rishi Sunak! The new PM of Britain pic.twitter.com/JWhLJVTwMA — Syed Zain Raza (@SydZainRaza) October 25, 2022 -
అప్పుడు అమెరికాకు ఒబామా.. ఇప్పుడు బ్రిటన్‌కు సునాక్..!
లండన్: బ్రిటన్ రాజకీయ చరిత్రను తిరగరాస్తూ.. మొట్టమొదటి భారత సంతతి, హిందూ ప్రధాని పీఠం అధిరోహించారు రిషి సునాక్. ఈ సందర్భంగా.. ఆయనపై ప్రపంచ నేతలతో పాటు బ్రిటన్ వాసులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది తమకు ‘ఒబామా మూమెంట్’ అని అక్కడి హిందూ దేవాలయ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. బ్రిటన్ రాజధాని లండన్‌కు 110 కిలోమీటర్ల దూరంలోని సౌతాంప్టన్‌లో వేదిక్ సొసైటీ హిందూ దేవాలయం ఉంది. దీనిని రిషి తాత రామ్‌దాస్ సునాక్ 1971లో నిర్మించారు. ఆ తర్వాత ఆయన తండ్రి యాష్ సునాక్.. 1980 నుంచి ట్రస్టీగా కొనసాగారు. ఇప్పటికీ రిషి కుటుంబం ఆ ఆలయంతో అనుబంధం కొనసాగిస్తోంది. హాంప్‌షైర్ నగర్‌లోని ఆలయాన్ని రిషి సునాక్.. తరుచుగా సందర్శిస్తుంటారు. ఈ జులైలో కూడా అక్కడకు వెళ్లారు. ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ‘ఇది గర్వించదగ్గ క్షణం. రిషి సునాక్ విజయంతో ఈ గుడి ఆవరణలో సందడి నెలకొంది. ఇక్కడున్న సుమారు 300 మంది ఆయనతో దిగిన చిత్రాలను చూపించి, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది బ్రిటన్‌కు బరాక్ ఒబామా మూమెంట్. మొదటిసారి శ్వేత జాతియేతర వ్యక్తి ప్రధాని అయ్యారు. ఆయన ప్రధాని అవబోతున్నారనే వార్త వినగానే వెంటనే ప్రత్యేక పూజలు నిర్వహించాం’ అని ఆలయ కమిటీ నేత సంజయ్ చందరాణా పేర్కొన్నారు. బ్రిటన్‌కు రిషి సునాక్ ప్రధానికావటం అనేది దేశాన్ని ఏకం చేయటమేనన్నారు. బరాక్ ఒబామా 2009లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అగ్రదేశపు అత్యున్నత స్థానంలో కూర్చొన్న తొలి ఆఫ్రికన్ అమెరికన్‌గా ఆయన ఖ్యాతి గడించారు. బరాక్ ఒబామా పాలనా కాలాన్ని సూచిస్తూ రిషి సునాక్‌పై ప్రశంసలు కురిపించారు ఆలయ కమిటీ నేత సంజయ్ చందరాణా. ఇదీ చదవండి: రిషి సునాక్ ప్రసంగం: ఐదు ప్రధానాంశాలు -
రిషి సునాక్ ప్రసంగం: ఐదు ప్రధానాంశాలు
లండన్: భారత మూలాలు కలిగిన రిషి సునాక్.. బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి తొలిసారి ప్రసంగించిన ఆయన తన లక్ష్యాలను స్పష్టం చేశారు. మాటలతో కాదు చేతలతో తానేంటో చూపిస్తానని ప్రకటించారు. లిజ్ ట్రస్ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తానని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని వెల్లడించారు. రిషి సునాక్ ప్రసంగంలోని 5 ప్రధానాంశాలు ఇవి... 1. బ్రిటన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా కారణంగా తలెత్తిన విపరిణామాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లు, సరఫరా వ్యవస్థ బలహీనపడింది. 2. బ్రిటన్ను అభివృద్ధి పథంలో నడపాలని లిజ్ ట్రస్ కోరుకున్నారు. గొప్ప లక్ష్యంతో అవిశ్రాంతంగా పనిచేసిన ఆమెను మెచ్చుకోవాల్సిందే. కానీ లిజ్ ట్రస్ హయాంలో కొన్ని తప్పులు జరిగాయి. 3. నేను నా పార్టీ నాయకుడిగా ఎన్నుకోబడ్డాను. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దే పని తక్షణమే ప్రారంభమవుతుంది. 4. ఆర్థిక స్థిరత్వం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తాం. కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకునేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నేను చేసిన ప్రయత్నాలను మీరంతా చూశారు. 5. మాటలతో కాదు నా పనితీరుతో మన దేశాన్ని ఏకం చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రజల నమ్మకాన్ని సంపాదించడానికి ప్రతిరోజు కష్టపడతాను. (క్లిక్ చేయండి: అదో భయంకరమైన యుద్ధం: రిషి సునాక్) -
అదో భయంకరమైన యుద్ధం: రిషి సునాక్
బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్.. ఉక్రెయిన్ యుద్ధ పరిణామంపై స్పందించారు. లండన్ వెస్ట్‌మినిస్టర్‌లోని అధికారిక భవనం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద తన తొలి ప్రసంగంలోనే ఆయన ఈ కీలక అంశంపై మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు ముగింపు దిశగా సాయం చేస్తామని రిషి సునాక్ 10 Downing Street వద్ద తొలి ప్రసంగంలో ప్రకటించారు. ఇదొక భయంకరమైన యుద్ధం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద పెను ప్రభావం చూపెట్టింది. అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లపైనా ప్రభావం చూపెడుతోంది. దాని ముగింపును విజయవంతంగా చూడాలి అని ప్రధాని రిషి సునాక్ తెలిపారు. అంతకు ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, కొత్త ప్రధాని రిషి సునాక్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉక్రెయిన్‌తో సైన్యసహకారాలు కొనసాగిస్తున్న యూకేతో బంధం మరింత బలపడేందుకు యత్నిస్తామని జెలెన్స్కీ ప్రకటించారు. ఇక తన ప్రభుత్వం ముందు ఆర్థికంగా పెను సవాళ్లే ఉన్నాయన్న యూకే ప్రధాని రిషి సునాక్.. వాటిని ఎలాగైనా అధిగమించి తీరతామని ప్రకటించారు. ఆర్థికంగా బ్రిటన్ బలహీనంగా ఉందని.. కానీ, రాబోయే తరాల మీద అప్పుల ప్రభావం లేకుండా చూస్తామని ప్రకటించారు. అలాగే మాజీ ప్రధాని లిజ్ ట్రస్ గొప్ప వ్యక్తి అని, ఆమె పాలనలో కొన్ని పొరపాట్లు చోటు చేసుకున్నాయని, వాటిని సరిదిద్దేందుకే తనకు బాధ్యత అప్పజెప్పారని డౌనింగ్ స్ట్రీట్ బయట వ్యాఖ్యానించారు. -
Rishi Sunak: బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్
యూకే అధికారిక పార్టీ కన్జర్వేటివ్ తరపున ప్రధానిగా రిషి సునాక్ నియమితులయ్యారు. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నాం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 3తో భేటీ అనంతరం.. 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద రిషి సునాక్ ప్రసంగించారు. అంతకు ముందు లిజ్ ట్రస్.. కింగ్ ఛార్లెస్‌ను కలిసి ప్రధాని పదవికి(ఆపద్ధర్మ) తన రాజీనామాను సమర్పించారు. ప్రధానిగా తనకు మద్దతు ఉందని, కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రిషి సునాక్, కింగ్ ఛార్లెస్-3ని కోరారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రిషిని కింగ్ ఛార్లెస్ ఆహ్వానించారు. దీంతో రిషి సునాక్‌ను బ్రిటన్ ప్రధానిగా నియమిస్తున్నట్లు కింగ్ ఛార్లెస్ తెలిపారు. ప్రధానిగా ట్రస్ తన వంతు ప్రయత్నం చేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తా. బ్రిటన్ ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టకుంటా. సంక్షోభం నుంచి బయటపడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. మనం అద్భుతాలు సాధించగలం అంటూ బ్రిటన్ కొత్త ప్రధాని రిషి మీడియా ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. -
చరిత్ర సృష్టించిన రిషి సునాక్ (ఫొటోలు)
-
బ్రిటన్ పీఎంగా రిషి.. మరి ఈ దేశాలను ఏలుతోంది మనోళ్లేనని తెలుసా?
బ్రిటన్ రాజకీయాల్లో భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. బ్రిటన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికై.. ఆ పదవి చేపడుతున్న మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా నిలిచారు. గడిచిన 200 ఏళ్లలో బ్రిటన్ ప్రధానుల్లో రిషి సునాక్ అత్యంత పిన్నవయస్కుడిగా గుర్తింపు పొందారు. వివిధ దేశాల అధినేతలుగా భారత సంతతి వ్యక్తుల జాబితాలో చేరారు రిషి సునాక్. ఈ సందర్భంగా దేశాల అధినేతలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత సంతతి వ్యక్తుల వివరాలు తెలుసుకుందాం.. ► ప్రవింద్ జుగ్నాథ్.. భారత సంతతికి చెందిన ప్రవింద్ జుగ్నాథ్ 2017లో మారిషస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రవింద్ పూర్వీకులు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి మారిషస్‌కు వలస వెళ్లారు. ఆయన హిందూ కుటుంబంలో జన్మించారు. ► పృథ్విరాజ్ సింగ్ రూపున్.. 2019లో మారిషస్ ఏడవ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు పృథ్విరాజ్ సింగ్ రూపున్. ఆయన భారత మూలలున్న ఆర్య సమాజ్ హిందూ కుటుంబంలో జన్మించారు. ► ఆంటోనియా కోస్టా.. భారత మూలలు కలిగిన ఆంటోనియా కోస్టా 2015లో పోర్చుగల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గోవాలో ఆయనను బబుష్గా పిలుస్తారు. కొంకణి భాషలో అత్యంత ప్రియమైన వ్యక్తిగా దాని అర్థం. ► ఛాన్ సంటోఖి.. చంద్రికాపెర్సాద్ ఛాన్ సంటోఖి.. సురినామిస్ దేశంలో కీలక రాజకీయ నేత. మాజీ పోలీసు అధికారి. 2020లో సురినామిస్ 9వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇండో-సురినామిస్ హిందూ కుటుంబంలో 1959లో జన్మించారు సంటోఖి. ► మొహమెద్ ఇర్ఫాన్ అలీ.. గయానా 9వ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా 2020, ఆగస్టు 2న ప్రమాణ స్వీకారం చేశారు మొహమెద్ ఇర్ఫాన్ అలీ. లియోనోరాలోని ఇండో-గయానీస్ ముస్లిం కుటుంబంలో జన్మించారు ఇర్ఫాన్ అలీ. ► హలిమా యాకోబ్.. భారత మూలలున్న హలిమా యాకోబ్ సింగపూర్ రాజకీయ నాయకురాలు, మాజీ న్యాయవాది. 2017 నుంచి 8వ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సింగపూర్ చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. హలిమా తండ్రి పూర్వీకుల కారణంగా ఆమె భారతీయ ముస్లింగా గుర్తింపు పొందారు. ► వేవల్ రామ్‌కలవాన్.. సీషెల్లోస్ రాజకీయ నాయకుడు, 2020, అక్టోబర్ 26 నుంచి దేశాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన 1961, మార్చి 15న మహేలో జన్మించారు. 1993-2011, 2016-2022 వరకు ప్రతిపక్ష ఎంపీగా కొనసాగారు. ఆయన గ్రాండ్ పేరెంట్స్ భారత్‌లోని బిహార్ రాష్ట్రానికి చెందిన వారే. ► కమలా హారీస్.. భారత సంతతి వ్యక్తి కమలా హారిస్ అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యాక్షురాలిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. 2019లో అధ్యక్ష పదవికి పోటీ పడినప్పటికీ.. విజయవంతం కాలేకపోయారు. ఆ తర్వాత ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఇదీ చదవండి: బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా రిషి సునాక్ -
బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్
లండన్: బ్రిటన్ కొత్త ప్రధానిగా భారత సంతతి ఎంపీ రిషి సునాక్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకూ పోటీలో ఉన్న పెన్నీ మోర్డాన్ రేసు నుంచి తప్పుకున్నట్లు వెల్లడించడంతో రిషి సునాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో బ్రిటన్ ప్రధానిగా మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు రిషి సునాక్. బ్రిటన్ పార్లమెంట్లో సునాక్‌కు 193 మంది ఎంపీల మద్దతు ఉండగా.. మోర్డాన్కు 27 మంది ఎంపీలు మద్దతు తెలిపారు. దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ట్రస్ రాజీనామాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో టోరీ సభ్యులు ఈసారి రిషి వైపే మొగ్గు చూపారు. ఆయనే తమ దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించగలరని విశ్వసించారు. దీంతో బ్రిటన్ పగ్గాలు చేపట్టే అరుదైన అవకాశం రిషి సునాక్‌ను వరించింది. నెలన్నర రోజుల క్రితం లిజ్‌ట్రస్ చేతిలో ఓటమిపాలైన అదే సునాక్.. నేడు దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆయనకు సంబంధించి ఐదు కీలక విషయాలు ఇప్పుడు చూద్దాం. ► ప్రస్తుతం 42 ఏళ్ల వయసున్న రిషి సునాక్.. బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. ► ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా, తొలి హిందూ వ్యక్తిగా నిలిచారు. అలాగే.. తొలి శ్వేత జాతీయేతర ప్రధానిగా గుర్తింపు పొందారు. ► 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రిచ్మాండ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మరోసారి రిషి విజయం సాధించారు. 2020లో బోరిస్ ప్రధాని బాధ్యతలు చేపట్టాక తన తొలి కేబినెట్లో ఆర్థిక మంత్రిగా రిషిని నియమించారు. ► కరోనా సంక్షోభ సమయంలో వ్యాపారులు, కార్మికుల కోసం వందల కోట్ల పౌండ్ల ప్యాకేజీ తీసుకొచ్చి రిషి మంచి గుర్తింపు పొందారు. ► రిషిపై కొన్ని వివాదాలు కూడా వచ్చాయి. ఆయన భార్య ట్యాక్స్ వివాదం, అమెరికా గ్రీన్ కార్డు, బ్రిటన్ జీవన వ్యయం సంక్షోభం సమయంలో ఆయన కాస్త నెమ్మదిగా స్పందించారనే ఆరోపణలు ఉన్నాయి. ► డౌన్స్ట్రీట్లో సమావేశానికి హాజరై కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా రిషికి జరిమానా విధించారు. ► రిషి సునాక్ 1980 మే 12న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో జన్మించారు. రిషి గ్రాండ్ పేరెంట్స్ పంజాబ్‌కు చెందినారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కూతురు అక్షత మూర్తిని రిషి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇదీ చదవండి: చరిత్రకెక్కిన జిన్‌పింగ్.. మావో జెడాంగ్ తర్వాత తొలినాయకుడిగా.. -
రిషి సునాక్ తొలి అడుగు
లండన్: లిజ్ ట్రస్ ఆకస్మిక రాజీనామాతో ఖాళీ అయిన బ్రిటన్ ప్రధాని కోసం అభ్యర్థుల ఎంపికలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోవారం పాటు ఆపద్ధర్మ ప్రధానిగా ట్రస్ కొనసాగనున్న తరుణంలో.. ఈ మధ్యలోనే కన్జర్వేటివ్ పార్టీ ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆ పార్టీ ఎంపీల మద్దతే కీలకంగా మారింది. అభ్యర్థిగా బరిలో దిగాలంటే కనీసం 100 మంది ఎంపీల మద్దతు అవసరం. అయితే.. బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఇప్పటికే వంద మంది టోరీ సభ్యుల మద్దతు కూడగట్టుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం నాటికే ఆయన ఆ మద్దతును దాటేశారని, తద్వారా ప్రధాని అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న మొదటి వ్యక్తిగా నిలిచారని స్థానిక మీడియా ప్రకటించింది. ఇక మాజీ ఆరోగ్య మంత్రి మ్యాట్ హ్యాంకాక్ సైతం రిషి సునాక్‌కు తన మద్దతు ప్రకటించారు. మరో టోరీ ఎంపీ నైగెల్ మిల్స్.. గతంలో ట్రస్‌ను ఎన్నుకుని తప్పు చేశానని, ఈసారి ఆ తప్పు మరోసారి చేయదల్చుకోలేదంటూ రిషి సునాక్‌కు మద్దతు ప్రకటించారు. ట్రస్ పన్ను రాయితీలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని మొదట్నుంచి హెచ్చరిస్తూ వచ్చిన 42 ఏళ్ల సునాక్‌కు ఈసారి ఎక్కువగా కలిసొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఘోరంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలడన్న నమ్మకం.. ఈసారి సభ్యుల్లో కలిగితే గనుక సునాక్ గెలుపు నల్లేరు మీద నడకే కానుంది. బరిలో సునాక్‌తో పాటు పెన్నీ మోర్డంట్, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం నిలబడచ్చని అంచనా. నామినేషన్ల గడువు 24(సోమవారం) ముగియనుంది. ఇద్దరి కంటే ఎక్కువ మంది 100 ఎంపీ మద్దతు సాధిస్తే.. వాళ్ల నుంచి ఇద్దరిని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల ఓటింగ్ ద్వారా ఫిల్టర్ చేస్తారు. ఆ ఇద్దరిలో మళ్లీ ఒకరిని ఓటింగ్ ద్వారా తమ నాయకుడిగా ఎన్నుకుంటారు. ఓటింగ్ ఫలితాలను అక్టోబర్ 28న ప్రకటిస్తారు. ఆ గెలిచిన వ్యక్తిని బ్రిటన్ రాజు ఛార్లెస్-3.. బ్రిటన్ ప్రధానిగా ప్రకటిస్తారు. ఇవేం లేకుండా గడువులోగా ఒక్కరికే వంద మంది ఎంపీల మద్దతు గనుక లభిస్తే.. ఏకగ్రీవంగా ప్రధాని అవుతారు. ఒక ప్రధాని రాజీనామా చేసి మరొకరు పదవి చేపట్టే సమయంలో ఎన్నిక ప్రక్రియ సర్వసాధారణంగా టోరీ సభ్యుల వరకు వెళ్లదు. ఇద్దరు సభ్యులు చివర్లో మిగిలితే తక్కువ మంది ఎంపీల మద్దతున్న వారు తప్పుకుంటారు. 2016లో థెరిసా మే ప్రధాని అయినప్పుడు ప్రత్యర్థి అండ్రూ లీడ్సమ్ ఇలాగే బరి నుంచి తప్పుకున్నారు. ఇదీ చదవండి: మాజీ ప్రధాని ట్రస్‌కు ఎంత జీతమంటే.. -
UK Political Crisis: ఎంపీలే కీలకం
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాతో ఆమె వారసుడెవరన్న దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సహా పలువురు రేసులో ఉన్నారు. ఈసారి ఎన్నికల ప్రక్రియలో కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల కంటే ఎంపీల మద్దతే కీలకంగా మారింది. అభ్యర్థిగా బరిలో దిగాలంటే కనీసం 100 మంది ఎంపీల మద్దతు అవసరం. గతంలో 20గా ఉండేది. ఎన్నిక ప్రక్రియ ఇలా... ఈసారి ఎన్నిక ప్రక్రియ కూడా గతంలో కంటే భిన్నంగా ఉంటుంది. 1922 కమిటీ నిబంధనల మేరకు 100 మంది ఎంపీల మద్దతున్నవారికే పోటీకి చాన్సుంటుంది. పార్లమెంటులో 357 మంది ఎంపీలున్నందున అత్యధికంగా ముగ్గురు బరిలో దిగొచ్చు. ► నామినేషన్‌కు ఈ నెల 24తో గడువు ముగుస్తుంది. అప్పటికల్లా ఇద్దరి కంటే ఎక్కువ మంది 100 ఎంపీల మద్దతు సాధిస్తే వారి నుంచి ఇద్దరిని ఎంపీలే అప్పటికప్పుడు ఎన్నుకుంటారు. అంటే అత్యధిక ఓట్లు పొందిన ఇద్దరు బరిలో మిగులుతారు. ► ఆ ఇద్దరిలో ఒకరిని టోరీ సభ్యులు ఆన్లైన్లో తమ నాయకుడిగా ఎన్నుకుంటారు. అక్టోబర్ 28న ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత కింగ్ చార్లెస్ –3 లాంఛనంగా కొత్త ప్రధానిని నియమిస్తారు. ► ఒకవేళ గడువులోగా 100 మంది ఎంపీల మద్దతు ఒక్కరికే లభిస్తే తదుపరి ప్రక్రియతో పని లేకుండా వారే నేరుగా ప్రధాని అవుతారు. ► ఒక ప్రధాని రాజీనామా చేసి మరొకరు పదవి చేపట్టే సమయంలో ఎన్నిక ప్రక్రియ సర్వసాధారణంగా టోరీ సభ్యుల వరకు వెళ్లదు. ఇద్దరు సభ్యులు చివర్లో మిగిలితే తక్కువ మంది ఎంపీల మద్దతున్న వారు తప్పుకుంటారు. 2016లో థెరిసా మే ప్రధాని అయినప్పుడు ప్రత్యర్థి అండ్రూ లీడ్సమ్ ఇలాగే బరి నుంచి తప్పుకున్నారు. ► అందుకే ఈ సారి ఎన్నికలో టోరీ సభ్యులు కంటే ఎంపీలే కీలకంగా ఉన్నారు. రేసులో వీరే... రిషి సునాక్: భారత సంతతికి చెందిన రిషి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు. గత ఎన్నికలో ట్రస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. అత్యధిక ఎంపీల మద్దతు ఆయనకే ఉన్నా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలనని సభ్యుల్లో విశ్వాసం కలిగించలేక 21 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. ట్రస్ పన్ను రాయితీలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని మొదట్నుంచి హెచ్చరిస్తూ వచ్చిన సునాక్‌కు ఈసారి ఎంపీల మద్దతు లభించే అవకాశముంది. బోరిస్ జాన్సన్: తాను ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి రావడానికి రిషియే కారణమన్న ఆగ్రహంతో ఉన్న జాన్సన్ మరోసారి పీఠమెక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. సొంత పార్టీ ఎంపీలు, మంత్రుల తిరుగుబాటు కారణంగా మరో దారి లేక ప్రధానిగా రాజీనామా చేసినా, జాన్సన్‌కు ఇప్పటికీ పార్టీపై పట్టుంది. ట్రస్ చేతిలో రిషి ఓటమికి జాన్సన్ తెర వెనుక మంత్రాంగమే ప్రధాన కారణమన్న ఆరోపణలున్నాయి. కరోనా సమయంలో పార్టీలు చేసుకున్న వ్యక్తిగా అప్రతిష్ట మూటగట్టుకున్న ఆయనకు ఈసారి కూడా ఎంపీలు మద్దతుగా నిలవకపోయినా సునాక్‌ని ఓడించడానికైతే ప్రయత్నిస్తారన్న వార్తలు విన్పిస్తున్నాయి. పెన్నీ మోర్డంట్: బ్రిటన్ తొలి మహిళా రక్షణ మంత్రి. గత ఎన్నికల్లో ఎంపీల మద్దతు బాగా సంపాదించినా తుది ఇద్దరు అభ్యర్థుల్లో స్థానం దక్కించుకోలేకపోయారు. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ట్రస్‌కు మద్దతుగా నిలిచి ఆమె ప్రధాని అయ్యాక హౌస్ ఆఫ్ కామన్స్ అండ్ లార్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ప్రైవీ కౌన్సిల్‌కి నాయకురాలయ్యారు. ట్రస్‌పై ఎంపీల్లో వ్యతిరేకత ఉండడంతో ఆమె సన్నిహితురాలైన పెన్నీకి ఎంతవరకు మద్దతునిస్తారన్న అనుమానాలున్నాయి. వీరే కాకుండా మంత్రులుగా అనుభవమున్న కెమీ బాదెనోచ్, సుయెల్లా బ్రేవర్మన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆర్థిక మంత్రిగా గొప్ప పనితీరుతో ఆకట్టుకున్న రిషి, బోరిస్ మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డోంట్ కేర్.. ట్రస్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం!
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్‌ను గద్దె దించేందుకు ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి!. ఈ మేరకు వందకు పైగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు.. పార్టీ కమిటీ హెడ్ గ్రాహం బ్రాడీని కలిసి ట్రస్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి లేఖలు సమర్పించనున్నట్లు డెయిలీ మెయిల్ ఒక కథనం ప్రచురించింది. ప్రధాని లిజ్ ట్రస్‌ను తొలగించే ప్రయత్నాలు మంచివి కాదని.. దాని వల్ల ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని డౌనింగ్ స్ట్రీట్(ప్రధాని కార్యాలయం) చేసిన హెచ్చరికలను కన్జర్వేటివ్ చట్టసభ్యులు బేఖాతరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ఈ వారంలోనే ట్రస్‌ను గద్దె దించే ప్రయత్నాలు ఊపందుకోనున్నట్లు తెలిపిన ఆ కథనం.. దానికి ఆధారం ఏంటన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ఆమె సమయం ముగిసింది అని ట్రస్‌కు చెప్పాలని, లేదంటే.. ఆమె నాయకత్వంపై విశ్వాస పరీక్షను తక్షణమే నిర్వహించాలని, ఇందుకోసం రాజకీయ పార్టీ నియమాలను మార్చమని బ్రాడీని ఒత్తిడి తెచ్చేందుకు కన్జర్వేటివ్ ఎంపీలు ప్రయత్నించబోతున్నట్లు డెయిలీ మెయిల్ కథనం పేర్కొంది. యూకే చట్టాల ప్రకారం.. సాంకేతికపరంగా లిజ్ ట్రస్ ప్రధాని పదవికి ఏడాదిపాటు ఎలాంటి ఢోకా ఉండదు. అయితే.. 1922 బ్యాక్‌బెంచ్ ఎంపీల కమిటీ తన రూల్స్ మారిస్తే గనుక ట్రస్‌కు సవాల్ ఎదురుకావొచ్చు. ఒకవేళ తిరుగుబాటు-అవిశ్వాస ప్రయత్నాలే జరిగితే గనుక.. అక్టోబర్ 31వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్, తదనంతర పరిణామాల దాకా ఓపిక పట్టాలని గ్రాహం బ్రాడీ, ఎంపీలను కోరే అవకాశం కనిపిస్తోంది. 2016లో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చాక.. బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఈ గ్యాప్‌లో ఏకంగా ముగ్గురు ప్రధానులు గద్దె దిగాల్సి వచ్చింది. ఈ మధ్యే ప్రధాని పగ్గాలు చేపట్టిన లిజ్ ట్రస్.. కిందటి నెలలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. ఈ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి. ఊహించని ఈ పరిణామాలతో ఏకంగా తన మద్దతుదారు, ఆర్థిక మంత్రి అయిన క్వాసీని పదవి నుంచి తప్పించి.. ఆ స్థానంలో జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారామె. ఈ తరుణంలో ట్రస్-జెరెమీ హంట్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ దాకా ఆగాలని గ్రాహం బ్రాడీ కోరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ది టైమ్స్ సైతం కన్జర్వేటివ్ రెబల్స్.. ట్రస్‌ను తప్పించి ఆ స్థానే మరో నేతను ఎన్నుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఓ కథనం ప్రచురించింది. ఇదీ చదవండి: బైడెన్ వ్యాఖ్యలతో పాక్ గుస్సా! -
ఈ ఓటమి స్వయంకృతమే!
బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎన్నికలో భారత సంతతికి చెందిన రిషీ సునాక్ తన ప్రత్యర్థి లిజ్ ట్రస్ చేతిలో హోరాహోరీ పోరులో ఓడిపోయారు. ఆయన ఓటమిలో జాతి, మతం కూడా తమ వంతు పాత్ర పోషించాయని కొందరు అంటున్నారు (తాను హిందువును అని సునాక్ చెప్పుకొన్నారు). కానీ బ్రిటన్ ఇప్పుడు చాలా మారిపోయింది. ఆసియన్లనూ, నల్లజాతి ప్రజలనూ శ్వేతేతరులు అనీ, బుర్రతక్కువ వాళ్లు అనీ కొట్టిపడేసే రోజులు గతించిపోయాయి. పన్నుల విధింపుపై సునాక్ వైఖరిలోనే ఆయన ఓటమికి ముఖ్యమైన కారణం కనబడుతుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసిన తర్వాతే పన్నులను తగ్గిస్తానని ఆయన ప్రచారం చేశారు. ఇది కన్జర్వేటివ్ పార్టీ ధోరణికి భిన్నం. అలాగే బోరిస్ జాన్సన్ గద్దె దిగిపోయేలా సునాక్ మొట్టమొదట రాజీనామా చేయడం కూడా జాన్సన్ మద్దతుదారుల్లో వ్యతిరేకతకు కారణమైంది. అదే సమయంలో లిజ్ ట్రస్ చివరిదాకా జాన్సన్‌కు మద్దతిచ్చారు. పార్టీ సభ్యులు ఏం కోరుకుంటున్నారో అవి ఇవ్వడానికి ఇష్టపడకపోవడమే సునాక్ ఓటమికి కారణం. బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికలో రిషీ సునాక్ ఓడిపోవడానికి జాతి, మతం కూడా తమదైన పాత్ర పోషిం చాయా అంటే మనకు ఎన్నటికీ కచ్చితంగా తెలీకపోవచ్చు. రిషి ఓటమికి ఇవి కూడా పనిచేశాయని నొక్కి చెప్పేవారు, ఇవి కారణాలు కావు అని చెబితే సమాధానపడరు. అయితే ఆయన ఓటమికి ఇవి కారణాలు కావు అని చెప్పేవారు దాన్ని నిరూ పించలేరు. నా ఊహ ఏమిటంటే, తన ఓటమికి జాతి, మతం కూడా కారణాలు అయివుండవచ్చు కానీ వాటికి అంత ప్రాధాన్యం ఉండకపోవచ్చు. లేదా రిషి ఓడిపోవడానికి అవే ప్రధాన కారణం కావచ్చు కూడా! అయితే నిజం ఏమిటంటే, చాలామంది ప్రజలు నమ్ము తున్నట్లుగానే బ్రిటన్ ప్రస్తుతం చాలా విభిన్నమైన దేశంగా మారి పోయింది. ఆసియన్లనూ, నల్లజాతి ప్రజలనూ శ్వేతే తరులు అనీ, బుర్రతక్కువ వాళ్లు అనీ కొట్టిపడేసే రోజులు గతించిపోయాయి. ఈ విషయం అర్థం కావడానికి మీరు థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ మంత్రివర్గాలను చూడండి. అలాగే ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ‘బీబీసీ’ ఛానల్లో మనకు కనబడే ముఖాలను చూడండి. తర్వాత ‘డచెస్ ఆఫ్ ససెక్స్’ కూడా ఒక ఉదాహరణగా నిలుస్తారు. (అమెరికన్ యువతి మేఘన్ మెర్కెల్ బ్రిటిష్ రాజవంశంలోని ప్రిన్స్ హ్యారీని పెళ్లాడిన తర్వాత బ్రిటిష్ రాణి రెండో ఎలిజబెత్ సంప్రదాయాలను పక్కనపెట్టి ఆమెను ససెక్స్ యువ రాణిగా ప్రకటించారంటే బ్రిటిష్ సమాజంలో వచ్చిన మార్పునకు ఇది నిదర్శనం అన్నమాట.) అందుకనే రిషీ సునాక్ ఓటమికి కారణాలు అనేకం అని నేను నమ్ముతున్నాను. ఆర్థికమంత్రిగా రిషి ట్రాక్ రికార్డులో గానీ, బహుశా ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రదర్శించిన వ్యక్తిత్వంలో గానీ, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ వంటి ప్రజాదరణ కలిగిన నేత దిగ్భ్రాంతి కరమైన పతనానికి దారితీసేలా తన మంత్రిపదవికి ఇచ్చిన రాజీ నామాలో గానీ మనం రిషి శైలినీ, మూర్తిమత్వాన్నీ చూడవచ్చు. రిషికి అదృష్టం ముఖం చాటేసిందని చెప్పడం కంటే బహుశా ఆయనదే తప్పు అయివుండొచ్చు. బ్రిటన్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అవి ఇవ్వడానికి రిషి ఇష్టపడకపోవడమే ఆయన తప్పు కావచ్చు. ప్రధానంగా పన్నుల విధింపుపై సునాక్ వైఖరిలోనే ఆయన ఓటమికి ముఖ్యమైన కారణం కనబడుతుంది. కన్జర్వేటివ్ పార్టీని సాధారణంగా పన్నులు తక్కువగా విధించే పార్టీగా చెబుతుంటారు. ఇది వారికి ఒక పవిత్ర విశ్వాసం లాంటిది. కానీ ఆర్థిక మంత్రిగా సునాక్ పన్నులను గణనీయంగా పెంచారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసిన తర్వాతే పన్నులను తగ్గిస్తానని మాత్రమే ఆయన మాట్లాడుతూ వచ్చారు. మరోవైపున ఆయన ప్రత్యర్థి ట్రస్ మాత్రం తన ప్రచార తొలిదశలోనే పన్నులను బాగా తగ్గిస్తానని హామీ ఇచ్చారు. సునాక్ చెప్పింది సరైనదేనని చాలామంది ఆర్థికవేత్తలు, పారిశ్రా మికవేత్తలు నమ్ముతున్నారు. లండన్ ప్రజలు కూడా సునాక్ వాదనను సమర్థించారని ‘వెంబ్లే ర్యాలీ’ సూచిస్తోంది. ఇప్పుడు ఇది జాతీయ ఎన్నికల ప్రచారం అయినట్లయితే సునాక్ సులువుగా గెలిచేవారు. ఆయన వైఖరిని దేశం అంగీకరించేది. కానీ ఇది జాతీయ ఎన్నిక కాదు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు మాత్రమే పాల్గొన్న ఎన్నిక. వీరు బ్రిటన్ లోని జిల్లా కేంద్రాల్లో నివసిస్తుంటారు. వీరిలో ఎక్కువమంది ముసలి వారు. వీరు చాలా భిన్నంగా వ్యవహరిస్తారు. అందుకే లిజ్ ట్రస్ ఇచ్చిన సందేశం వీరిని నేరుగా తాకింది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే కన్జర్వేటివ్ పార్టీ తరఫున ప్రధాని ఎన్నికలో వీరే ముఖ్యమైన ఓటర్లు మరి. మరొక కారణం ఏమిటంటే, బోరిస్ జాన్సన్‌కు విశ్వసనీయమైన మద్దతుదారులు సునాక్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. ఎందుకంటే తమ మనిషిని, తమ నాయకుడిని గద్దె దింపిన ఘటనలకు రిషీనే బాధ్యు డని వీరు నమ్మారు. టోరీ(కన్జర్వేటివ్ పార్టీ) సభ్యులలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు బోరిస్ జాన్సనే అని పోల్స్ సూచి స్తున్నాయి. సునాక్ కానీ, ట్రస్ కానీ ఈయనతో పోలిస్తే ప్రజాదరణ విషయంలో ఎంతో వెనుకబడి ఉన్నారు. పైగా మరోసారి పోటీపడి గెలిచి ప్రధాని పదవి చేపట్టాలని జాన్సన్ భావిస్తున్నట్లు ‘ద టైమ్స్’ పత్రిక కూడా సూచిస్తోంది. కాబట్టి బోరిస్ జాన్సన్ మంత్రివర్గం నుంచి మొట్టమొదట రాజీనామా చేసినదానికి రిషి ఫలితం అనుభవించినట్లు కనిపిస్తోంది. మరోవైపున లిజ్ ట్రస్ తన నాయకుడు జాన్సన్ పట్ల చివరివరకూ విశ్వాసం ప్రకటించారు. అలా బహుశా ప్రయోజనం పొందివుంటారు. మూడో కారణం సునాక్ శైలి, వ్యక్తిత్వంలో దాగి ఉంది. చిన్నచిన్న అంశాలలో కూడా ఇది ఒక సమస్యగా మారింది. కానీ ఇది మరో ఆందోళనకు దారితీసింది. ఉదాహరణకు, మొట్టమొదటి చర్చలో రిషిని అహంభావిగా టోరీ ఓటర్లు భావించారు. తాను చెబుతున్నదే సరైనది అని భావిస్తున్నాడని రిషి గురించి అనేకమంది ఆరోపించారు. పైగా గత ఆరు వారా లుగా రిషి ఆరోగ్యం గురించి అనేకమంది ప్రశ్నలు సంధిం చారు. నిస్సందేహంగా ఆయన ఆ ప్రశ్నలకు సమర్థంగా జవాబి చ్చారు. కానీ ఓటర్ల సందేహాలు సమసిపోలేదు. ప్రత్యేకించి సునాక్ శైలి, వ్యక్తిత్వం తన సొంత టీమ్‌లోనే భయాందోళనలు కలిగించినట్లుందని ‘ద డైలీ టెలిగ్రాఫ్’ పత్రిక నివే దించింది. ఈ పత్రిక ప్రకారం తన ప్రచారం తొలి దశలో రిషీ సునాక్ పదేపదే క్యాలిఫోర్నియా గురించి ప్రస్తావించడంతో పరిస్థితులు తప్పు దోవ పడుతున్నాయని ఆయన సొంత టీమ్‌లోనే భయం పుట్టు కొచ్చింది. క్యాలిఫోర్నియా తరహా వాణిజ్య సంస్కృతి పట్ల తన ఆరా ధనను రిషి ఏమాత్రం దాచుకోలేదు. దీంతో క్షేత్రస్థాయి టోరీ పార్టీ సభ్యులకు ఆయన దూరమైపోయాడని చెబుతున్నారు. కాబట్టి సునాక్ జాతి మూలం ఆందోళన కలిగిస్తున్నట్లయితే, అది అంత ప్రాధాన్యం కలిగిన విషయమా అని నేను సందేహ పడుతున్నాను. దాదాపుగా ఇది ప్రతి ఒక్కరికీ వర్తించవచ్చు కూడా! ఇప్పుడు, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేకుండా, లిజ్ ట్రస్ ఎలా పనిచేస్తారనే అంశంపైనే రిషీ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. లిజ్ గెలిచినప్పటికీ, ఆమె ప్రధాన మంత్రిగా తగినంత ఆత్మవిశ్వాసంతో లేరని పోల్స్ సూచించాయి. ఇలాగే కొనసాగితే 2024లో ఆమె లేబర్ పార్టీకి చెందిన కైర్ స్టార్మర్‌కు తన పదవిని కోల్పోవచ్చని చెబుతున్నారు. అదే జరిగితే సునాక్ మళ్లీ పోటీ చేయడానికి దారి దొరుకుతుందని చెప్పవచ్చు. రిషీ సునాక్‌కు ఇప్పుడు 42 సంవత్సరాలు. 2029 వరకు ఆయన వేచి ఉండాల్సి వస్తే అప్పటికి కూడా తాను 50 ఏళ్ల వయసు లోపే ఉంటారు. వెనుక బెంచీల్లో కూర్చోవాలని రిషి తీసుకున్న నిర్ణయం తన భవిష్యత్తుపై అతడు ఒక కన్నేసి ఉంచాడనేందుకు సంకేతంగా కనిపిస్తోంది. కరణ్ థాపర్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) -
లిజ్ ట్రస్‌కు ఇది ముళ్ళకిరీటమే!
బ్రిటన్‌లో తొలి మహిళా లార్డ్ ఛాన్సలర్ ఆమే. రెండో మహిళా విదేశాంగ మంత్రీ ఆవిడే. ఇప్పుడు థాచర్, థెరెసా మే తర్వాత ఆ దేశానికి ముచ్చటగా మూడో మహిళా ప్రధానీ ఆమే. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ మార్పులో భాగంగా బోరిస్ జాన్సన్‌కు వారసురాలిగా సోమవారం ఎన్నికైన 47 ఏళ్ళ లిజ్ ట్రస్‌కు ఇలాంటి ఘనతలు చాలానే ఉన్నాయి. క్వీన్ ఎలిజబెత్2ను లాంఛనంగా కలసి, 96 ఏళ్ళ రాణిగారి సాంప్రదాయిక నియామకంతో బ్రిటన్ కొత్త ప్రధానిగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన లిజ్ ఇప్పుడు ఆ ఘనతలు నిలబెట్టుకోవడానికి శ్రమించక తప్పదు. వరుస వివాదాలతో రెండు నెలల క్రితం జాన్సన్ బ్రిటీష్ ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి లిజ్ ప్రయాణం మలుపు తిరిగింది. జాన్సన్ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఆమె మాజీ ఆర్థిక మంత్రి రిషీ సునాక్‌ను అధిగమించి, పీఠం దక్కించుకున్నారు. కొత్త నేతగా పీఠమెక్కడానికి కన్జర్వేటివ్ పార్టీలో ఆరుగురు ఉత్సాహపడితే, ఆఖరికి బరిలో మిగిలింది – లిజ్, భారతీయ మూలాలున్న రిషీ సునాక్. ‘ఇన్ఫోసిస్’ సుధ – నారాయణమూర్తి దంపతుల అల్లుడైన రిషి సోమవారం ఓటమి పాలయ్యారు. అయితేనేం, లక్షా 70 వేల పైగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఎన్నుకొనే పదవికి చివరి దాకా పోటీపడి, 60 వేలకు పైగా ఓట్లు సంపాదించడం విశేషమే. నిలబెట్టుకోలేని వాగ్దానాలు ఇవ్వలేనన్న రిషికి భిన్నంగా లిజ్ వ్యవహ రించడం గమనార్హం. బ్రిటీష్ ప్రజాస్వామ్య వ్యవస్థలోని రాజకీయ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యా నికి ప్రతీకగా నిలిచిన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పరిష్కారాల మాట దేవుడెరుగు, కనీసం దేశం ఆర్థికంగా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నట్టు తన ప్రచారంలో ప్రస్తావించకుండా వాస్తవాన్ని చూడ నిరాక రించిన లిజ్ ఇప్పుడు కళ్ళెదుటి సంక్షోభం నుంచి దేశాన్ని ఎలా గట్టెక్కిస్తారన్నది ఆసక్తికరం. వామపక్ష భావజాల కుటుంబంలో పుట్టి, తల్లితండ్రుల రాజకీయ పొత్తిళ్ళ నుంచి బయటపడి, ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకొనే రోజుల్లో ఉదారవాద ప్రజాస్వామ్య రాజకీయాల వైపు మొగ్గి, యువ ఉద్యోగినిగా కన్జర్వేటివ్ పార్టీలో చేరిన గమ్మల్తైన ప్రయాణం లిజ్ది. ముగ్గురు కన్జర్వేటివ్ పార్టీ ప్రధానమంత్రుల వద్ద ఆరు మంత్రి పదవులు నిర్వహించిన ఆమె ఇప్పుడు సరాసరి లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ నివాసి అయ్యారు. ఈ ప్రధానమంత్రి పీఠంపై ఆమెకు మొదటి రోజు నుంచీ అనేక సవాళ్ళు ఎదురుకానున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న ఇంధన ధరలు, కరెంట్ కోతల ముప్పు, గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా రెండంకెల ద్రవ్యోల్బణం, పొంచి ఉన్న దీర్ఘకాలిక ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న తనఖా రేట్లు... వెరసి అలవి కాని జీవన వ్యయం – ఇలా సమస్యలెన్నో. దేశంలో వివిధ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే సమ్మె సైరన్ మోగించాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం, బ్రెగ్జిట్ పర్యవసానాల లాంటి విదేశాంగ విధానపు తలనొప్పులు సరేసరి. పదవికి పోటీలో లిజ్ చేసిన వాగ్దానాలూ చిన్నవేమీ కావు. పన్నులను తగ్గిస్తాననీ, ప్రజా వ్యయాన్ని పెంచుతాననీ బాస చేశారు. దేశం ఇప్పుడున్న ఇక్కట్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చా లంటే, ఆమె ఇంట్లో కల్పవృక్షమో, కామధేనువో ఉంటే కానీ సాధ్యం కాదని ఓ జోక్. బ్రిటన్ తాజా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ లానే లిజ్కూ మాటల్లో ఘనత చాటుకొనే లక్షణం ఉంది. కానీ, ఆయనకున్న జనాకర్షణ, అవతలివారి అంగీకారం పొందే నేర్పు ఆమెకు లేవని విమర్శకుల మాట. ఒకప్పటి మార్గరెట్ థాచర్‌ను లిజ్లో ఆశించలేమని వారి విశ్లేషణ. అయితే ఎదగాలనే ఆకాంక్ష బలంగా ఉన్న ఈ దృఢచిత్తురాలికి స్వతఃసిద్ధ పోరాటగుణమే పెట్టనికోట. సమయానికి తగ్గట్టు అభిప్రాయాలు మార్చుకొనే దృక్పథం కలిసొచ్చే అంశం. 2016లో బ్రెగ్జిట్ విధానానికి తీవ్ర వ్యతిరేకిగా ఉన్న లిజ్, ఆపై బ్రెగ్జిట్‌కు పూర్తి అనుకూలంగా మారడం, 2019 నాటికి జాన్సన్ హయాంలో బ్రెగ్జిట్ అనంతరకాల వాణిజ్య మంత్రిగా వ్యవహరించడమే అందుకు ఉదాహరణ. మాటల గారడీ జాన్సన్ హయాంలో వెనుకబడ్డ బ్రిటన్‌కు ఇప్పుడు చిత్తశుద్ధితో కూడిన స్థిర మైన, బలమైన నాయకత్వం అవసరం. రిషిని వెన్నుపోటుదారుగా భావిస్తూ, అతనికి తప్ప ఎవరి కైనా ఓటేయమన్న జాన్సన్ మాటలతో ఆయన అనుకూలుర మద్దతు లిజ్‌ను గెలిపించింది. అలా జాన్సన్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న లిజ్ పాత ప్రభుత్వ తప్పుడు విధానాల నుంచి ఎంత త్వరగా బయటకొస్తే, బ్రిటన్‌కు అంత మంచిది. ఇక, ఆప్తురాలైన లిజ్ ఎన్నిక భారత్‌కు శుభవార్తే. విదేశాంగ మంత్రిగా చైనాతో కయ్యానికి కాలుదువ్వుతూ, రష్యాపై కఠినవైఖరిని అనుసరించిన ఆమె ఇప్పటికి 3 సార్లు క్యాబినెట్ మంత్రిగా భారత్‌లో పర్యటించారు. ఇరుదేశాల పాత అనుబంధంతో మెతకగానే ఉన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల చర్చలూ అక్టోబర్‌లో కొలిక్కిరానున్నాయి. ఏప్రిల్‌లో కుదుర్చుకున్న రక్షణ సహకార ఒప్పందం సహా అన్నీ సజావుగా సాగుతాయని అంచనా. అయితే, బ్రిటన్ సమస్యల సుడిగుండంలోకి ప్రయాణిస్తోందన్న ఆలోచననే ఇన్నాళ్ళూ ‘క్షీణ వాద ప్రసంగం’గా కొట్టిపారేస్తూ వచ్చిన లిజ్ వాస్తవంలోకి రాక తప్పదు. సమస్యల పరిష్కారంలో జయాపజయాలను బట్టే చరిత్రలో ప్రధానిగా ఆమె అధ్యాయం లిఖితమవుతుంది. మరోపక్క దీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ అంతర్గత సమస్యలు, పరస్పర విరుద్ధ ఆలోచనల వర్గా లతో సతమతమవుతోంది. ఆ పార్టీ, దాని సారథిగా ఈ ఇద్దరు టీనేజ్ కుమార్తెల తల్లి కొద్దిగా తడ బడినా, కొన్నేళ్ళుగా అధికారానికి దూరమైన ప్రతిపక్ష లేబర్పార్టీకి 2024 ఎన్నికల్లో సందు చిక్కినట్టే! ఇదీ చదవండి: Indian Economy: త్వరపడితేనే... నిలబడతాం! -
Rishi Sunak: వెన్నుపోటు ఫలితమే.. ఈ ఓటమి!
బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిరోహించాలనుకున్న రిషి సునాక్ కల చెదిరింది. ప్రధాని రేసులో లిజ్ ట్రస్ చేతిలో 21వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారాయన. అయితే.. ఈ ఎన్నిక ప్రక్రియ మొదలైన వెంటనే ముందుగా ప్రచారం ప్రారంభించింది రిషి సునాక్. పైగా ఆయన దూకుడు చూసి చాలామంది ఆయనే నెగ్గుతారని భావించారు కూడా. దీనికి తోడు.. విదేశాంగ మంత్రి అయిన ట్రస్‌కు.. టోరీ(కన్జర్వేటివ్) ఎంపీల సపోర్ట్ కూడా మొదట్లో తక్కువే ఉండేది. ఇది ఆయనకు కలిసొస్తుందని భావించారు రాజకీయ విశ్లేషకులు. కానీ, ఆన్లైన్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఎన్నికల సీన్ రివర్స్ అయ్యింది. ట్రస్‌కు క్రమక్రమంగా ఆధిక్యం పెరగుతూ వచ్చింది. మరోవైపు సర్వే ఫలితాలు కూడా ట్రస్‌కే మద్దతుగా వచ్చాయి. అయినప్పటికీ రిషి సునాక్ ధైర్యం వీడలేదు.. ప్రచారంలో ఎక్కడా తగ్గలేదు. అధికారంలోకి రాగానే.. పన్నుల భారాన్ని తగ్గిస్తానని ట్రస్ చెప్పగా, సునాక్ మాత్రం ఆమెది తప్పుడు నిర్ణయమని.. తాను మాత్రం ద్రవ్యోల్బణం కట్టడి మీదే ప్రధానంగా దృష్టిసారిస్తానని చెప్పడం చాలామందిని ఆకట్టుకుంది. అయితే పోటాపోటీగా ప్రచారం కార్యక్రమాలు సాగినా.. గ్రాండ్ ప్రచారంతో ఆకట్టుకున్నా.. రిషి సునాక్‌కు ‘ప్చ్’ ఓటమి మాత్రం తప్పలేదు. మరి ఈ మధ్యలో ఏం జరిగింది?.. రిషి సునాక్ ఓటమికి కారణాలను విశ్లేషిస్తే.. నాయకత్వ పోటీలో తనను తాను ‘చిత్తశుద్ధి’ ఉన్న అభ్యర్థిగా నిలబెట్టుకోవాలని సునాక్ శతవిధాల ప్రయత్నించారు. కానీ, వెన్నుపోటుదారుడనే ముద్ర ఆయన్ని ముందుకు పోనివ్వలేదు. టోరీ సభ్యుల్లో ఎక్కువ మంది బోరిస్ జాన్సన్ విధేయులు కావడం.. పైగా ఛాన్సలర్‌గా రాజీనామా చేస్తూ రిషి సునాక్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించడంతో అసలు కథ మొదలైంది. రాజకీయ గురువు సమానుడు.. సీనియర్ రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు కారణమైన వ్యక్తిని(బోరిస్ జాన్సన్)కు వెన్నుపోటు పొడిచాడంటూ టోరీ సభ్యులు రిషి సునాక్‌పై ఆరోపణలు గుప్పించారు. అయితే.. దేశ ఆర్థిక విధానంపై తనకు, జాన్సన్‌కు మధ్య పెద్ద అభిప్రాయ భేదం ఉందని స్పష్టమైన తర్వాతే తనకు వేరే మార్గం లేకుండా పోయిందని రాజీనామాపై సునాక్ ప్రతిస్పందించారు. కానీ, ఆ సమయంలోనే దాదాపు రిషి సునాక్ ఓటమి ఖాయమైంది. బోరిస్ సింపథీ వర్కవుట్ రిషి సునాక్ మంచి సేల్స్‌మ్యాన్.. వెన్నుపోటుదారుడు.. మోసగాడు.. ఈ విమర్శలు చేసింది టోరీ సభ్యులే. తన రాజీనామా ప్రకటన తర్వాత తాత్కాలిక ప్రధానిగా ప్రకటించుకున్న బోరిస్ జాన్సన్.. ‘‘ప్రధాని ఎన్నికల్లో ఎవరికైనా ఓటేయండి.. సునాక్‌కు తప్ప’’ అంటూ ఇచ్చిన పిలుపు టోరీ సభ్యుల్లోకి బలంగా దూసుకెళ్లింది. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. జులై నెలలో బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభ తలెత్తింది. ఆ సమయంలో విపక్షం నుంచే కాకుండా సొంత పార్టీ కన్జర్వేటివ్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు బోరిస్. సాజిద్ జావిద్, రిషి సునాక్లాంటి వాళ్ల రాజీనామా తర్వాతే.. చాలామంది ఆ బాటలో పయనించారు. సుమారు 50 మంది రాజీనామాలు చేయడంతో.. ఒత్తిడికి తలొగ్గి రాజీనామా చేశారు బోరిస్ జాన్సన్. ఈ తరుణంలో.. లక్ష్యం కాదు.. విశ్వాస ఘాతుకం బ్రెగ్జిట్ సమయంలో, కరోనాను కంట్రోల్ చేయడం, ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక పాత్ర పోషించడం లాంటి చర్యలతో బోరిస్‌పై సింపథీ క్రియేట్ అయ్యింది. అదే ఎన్నికల ప్రచారంలో రిషి సునాక్‌కు మైనస్ అయ్యింది. ప్రధాని పదవి రేసులోకి ఎంటర్ అయిన వెంటనే ఆలస్యం చేయకుండా.. ‘రెడీ ఫర్ రిషి’ నినాదంతో 10 డౌనింగ్ స్ట్రీట్(బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం) వైపు ఉరుకులు మొదలుపెట్టాడు. ఇది చూసి చాలామంది.. ‘‘తన లక్ష్యం(ప్రధాని కావాలనే..) కోసమే జాన్సన్‌ను రాజీనామా వైపు నెట్టేశాడని చర్చించారు టోరీలు. ఇది ద్రోహమని ఫిక్స్ అయిపోయారు. ఈ అభిప్రాయం వల్ల.. నలుగురు మాజీ చీఫ్ విప్‌లు ప్రచారం చేసినా రిషి సునాక్‌కు ప్రయోజనం లేకుండా చేసింది. అదే టైంలో.. ట్రస్ తనను తాను ‘నిజాయితీ పరురాల’నే ప్రచారం చేసుకుంది. బోరిస్ జాన్సన్‌కు నమ్మినబంటునని, తానే ప్రధానినైతే 2019 మేనిఫెస్టో అమలు చేస్తానని ఇచ్చిన హామీలు ట్రస్‌కు బాగా కలిసొచ్చాయి. వివాదాలు.. బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి అనే టాప్ జాబ్ రేసులోకి ఎంటర్ కాకముందే నుంచే.. సునాక్ చుట్టూ కొన్ని వివాదాలు నెలకొన్నాయి. ► ఆర్థిక మంత్రిగా ఉన్న టైంలో(ప్రత్యేకించి కరోనా సమయంలో..) ఆయన తీసుకున్న నిర్ణయాలు విమర్శలు దారి తీశాయి. ఎంతలా అంటే.. సొంత పార్టీ నేతలే ఆ నిర్ణయాలను తప్పుబట్టేంతగా. ► భార్య అక్షత మూర్తి ఆస్తులు, వ్యాపార లావాదేవీలు, పన్నుల చెల్లింపుల విషయంలో కూడా ప్రతిపక్ష లేబర్ పార్టీ విమర్శలు గుప్పిస్తూ వచ్చేది. ఇది సొంతపార్టీ కన్జర్వేటివ్‌కు విసుగు తెప్పించింది. ► కరోనా టైంలో శాస్త్రవేత్తలపై నోరు పారేసుకున్నారు రిషి సునాక్. వ్యాక్సిన్ తయారీ వంకతో సైంటిస్టులు ఎక్కువ అధికారం చెలాయిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సైంటిస్టు కమ్యూనిటీల నుంచి తీవ్ర వ్యతిరేకతను కట్టబెట్టింది. ► నార్త్ యార్క్‌షైర్‌లో ఉన్న తన మాన్షన్‌లో భారీగా ఖర్చు చేపట్టి రిషి సునాక్ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టడంపై దుమారం రేగింది. నీటి కొరత ఉన్న సమయంలో.. పైగా ఆ ప్రాంతంలో స్విమ్మింగ్‌పూల్స్‌ను మూసేసిన టైంలో సునాక్ చేసిన పని వివాదాస్పదంగా మారింది. ఇక ఓటమిపాలైతే.. ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తానని, ఉత్తర యార్క్‌షైర్‌లోని రిచ్మండ్కు ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతానని, నియోజకవర్గం కోసం పని చేస్తానని ఆయన వ్యాఖ్యానించడం తెలిసిందే. తాజాగా ఓటమి తర్వాత.. తనకు ఓటేసిన వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేశాడు. కన్జర్వేటివ్ అంతా ఒక కుటుంబం అని, లిజ్ ట్రస్ కింద పని చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. -
బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్
-
బ్రిటన్ ప్రధానిగా నెగ్గిన లిజ్ ట్రస్
లండన్: ఉత్కంఠ వీడింది. బ్రిటన్ ప్రధాన మంత్రి రేసులో లిజ్ ట్రస్(47) విజయం సాధించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తూ.. ట్రస్ గెలిచినట్లు ప్రకటించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సర్ గ్రాహం బ్రాడీ. ట్రస్ విజయంతో.. బ్రిటన్‌కు మూడవ మహిళ ప్రధాని ఘనత దక్కినట్లయ్యింది. ఆరువారాలుగా సాగిన హోరాహోరీ ప్రచారం.. ఆపై పోలింగ్‌తో బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరనే ఉత్కంఠ నెలకొంది. అయితే.. పోటీలో నిలిచిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ రిషి సునాక్‌కు నిరాశే ఎదురైంది. బోరిస్ జాన్సన్ వారసురాలిగా ట్రస్ ఎన్నికైంది. ఈ విషయాన్ని కన్జర్వేటివ్ పార్టీ సైతం అధికారికంగా ప్రకటించింది.లీజ్ ట్రస్‌కు వచ్చిన ఓట్లు 81,326 పోలుకాగా, రిషి సునాక్‌కు 60,399 ఓట్లు వచ్చాయి. దీంతో 21 వేల ఓట్ల తేడాతో ట్రస్ నెగ్గినట్లయ్యింది. భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్(42), మంత్రి లిజ్ ట్రస్ ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది విదేశాంగ మంత్రి అయిన లిజ్ ట్రస్ వైపే మొగ్గుచూపారు. ఆన్లైన్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా సుమారు 1.60 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓటు వేసి కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకున్నారు. #WATCH | Liz Truss defeats rival Rishi Sunak to become the new Prime Minister of the United Kingdom pic.twitter.com/Xs4q2A2ldu — ANI (@ANI) September 5, 2022 ఇదీ చదవండి: ఆ కౌగిలింత.. తీవ్ర విమర్శలు -
UK PM results 2022: జాన్సన్ వారసులెవరో తేలేది నేడే
లండన్: యూకే తదుపరి ప్రధాని ఎవరో మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్(42), మంత్రి లిజ్ ట్రస్(47) ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది లిజ్ ట్రస్ వైపే మొగ్గుచూపుతున్నట్లు పలు సర్వేల్లో ఇప్పటికే వెల్లడైంది. లిజ్ ట్రస్ ఎన్నికైతే బ్రిటన్ ప్రధానిగా మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత మూడో మహిళ కానున్నారు. ఆన్లైన్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా సుమారు 1.60 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓటు వేసి పార్టీ నేతను ఎన్నుకుంటారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న సర్ గ్రాహం బ్రాడీ వెల్లడిస్తారు. ఎన్నికైన నేత డౌనింగ్ స్ట్రీట్‌కు సమీపంలోనే ఉన్న రాణి ఎలిజబెత్–2 కాన్ఫరెన్స్ సెంటర్ నుంచి సంక్షిప్త ప్రసంగం చేస్తారు. మంగళవారం డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం నుంచి ఆపద్ధర్మ ప్రధాని బోరిస్ జాన్సన్ వీడ్కోలు ప్రసంగం చేస్తారు. అనంతరం స్కాట్లాండ్లో ఉన్న రాణి ఎలిజబెత్‌కు తన రాజీనామాను అందజేస్తారు. ఆపైన, పార్టీ నేతగా ఎన్నికైన వారు స్కాట్లాండ్కు వెళ్లి రాణి నుంచి నియామక పత్రం అందుకుంటారు. ఇంగ్లండ్‌కు, బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు బదులుగా మరోచోట నుంచి ప్రధాని పేరును రాణి ప్రతిపాదించడం బ్రిటన్ చరిత్రలో ఇదే మొదటిసారి. 96 ఏళ్ల రాణి వయస్సు రీత్యా ప్రయాణాలను గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రస్తుతం ఆమె అబెర్దీన్‌షైర్ బాల్మోరల్ కోటలో గడుపుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం కొత్తగా నియమితులైన ప్రధానమంత్రి డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం నుంచి మొదటి ప్రసంగం చేయడానికి ముందే కీలకమైన కేబినెట్ పదవులను ఖరారు చేస్తారు. సీనియర్ అధికారులు నూతన ప్రధానికి భద్రతకు సంబంధించిన కీలక వివరాలను, అణ్వాయుధాల రహస్య కోడ్లను అందజేస్తారు. బుధవారం మధ్యాహ్నం అధికార కన్జర్వేటివ్ పార్టీ కొత్త నేత హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రతిపక్ష నేత ప్రశ్నలకు సమాధానాలిస్తారు. కోవిడ్ నిబంధనలన ఉల్లంఘిస్తూ పార్టీలు జరుపుకోవడం, పార్టీ సీనియర్ నేత ఒకరు కుంభకోణంలో ఇరుక్కోవడం వంటి పరిణామాలతో బోరిస్ జాన్సన్ కేబినెట్లోని సుమారు 60 మంది సీనియర్ నేతలు రాజీనామాలు చేశారు. దీంతో అధికార పార్టీ కొత్త నేతను ఎన్నుకునే సుదీర్ఘ ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఇంధన భారం తగ్గిస్తాం ఇంధన సంక్షోభాన్ని పరిష్కరిస్తామని, గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారం తగ్గిస్తామని యూకే ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్, లిజ్ ట్రస్ తెలిపారు. బ్రిటన్ ప్రధాని పదవికి జరిగే ఎన్నికలో అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఈ ఇద్దరు నేతలు బరిలో ఉన్న విషయం తెలిసిందే. మరికొద్ది గంటల్లోనే పోలింగ్ జరగనున్న సమయంలో ఆదివారం వీరు బీబీసీ ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. రష్యా– ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా యూకేలో ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో, ఇదే ప్రధాన అంశంగా మారింది. కొత్త ప్రభుత్వానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా రిషి సునాక్ పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతానని, తన సొంత రిచ్మండ్, యార్క్‌షైర్ ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే ఏం చేస్తారన్న ప్రశ్నలకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. మళ్లీ ఎన్నికలు జరిగితే ప్రధాని పదవి రేసులో ఉంటారా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. -
రిషి సునాక్ గెలుపు కోసం.. ప్రవాసుల ప్రయత్నాలు
లండన్: బ్రిటన్ నూతన ప్రధాని ఎంపిక ప్రక్రియ తుది ఘట్టానికి చేరువవుతోంది. రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఎవరు ప్రధానికి అవుతారన్న ఉత్కంఠ నెలకొంది. రిషి సునాక్ ప్రధాని పదవిని అధిష్టించాలని యూకేలోని ప్రవాస భారతీయులు బలంగా కోరుకుంటున్నారు. అంతేకాదు ఆయన గెలుపు కోసం యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారు. రిషి సునాక్ వెనకబడ్డారని సర్వేలు వెల్లడించడంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రిషి సునాక్ సమర్థుడు కాబట్టే బ్రిటన్‌కు ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నామని ప్రవాస భారతీయులు అంటున్నారు. ‘భారతీయ మూలాలు కలిగివున్నారు కాబట్టే మేము ఆయన కోసం ప్రార్థించడం లేదు. జీవన వ్యయ సంక్షోభం నుంచి మమ్మల్ని బయటపడేసే సమర్థత ఆయనకు ఉందని నమ్ముతున్నాం కాబట్టే రిషి విజయం సాధించాలని కోరుకుంటున్నామ’ని బ్రిటిష్ ఇండియన్ సీకే నాయుడు తెలిపారు. ప్రధాని పదవికి ప్రస్తుతం రిషి సునాక్ ఉత్తమ అభ్యర్థి అని ప్రవాస భారతీయురాలు షీలమ్మ పేర్కొన్నారు. పాలనా వ్యవహారాలతో పాటు ప్రతి విషయంలోనూ రిషి ఎంతో హుందాగా వ్యవహరించారని, ఆయన గెలవాలని తామంతా కోరుకుంటున్నట్టు చెప్పారు. కాగా, బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరనేది సెప్టెంబర్ 5న తేలుతుంది. (క్లిక్: భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ మనసులో మాట) బ్రిటన్‌లో దాదాపు 15 లక్షల మంది భారతీయులు ఉన్నారు. యూకే మొత్తం జనాభాలో 2.5 శాతంగా ఉన్న ప్రవాసులు జీడీపీలో దాదాపు 6 శాతం వాటా కలిగివున్నారు. గ్రాంట్ థోర్న్టన్ వార్షిక ట్రాకర్ 2022 ప్రకారం గత సంవత్సరంతో పోల్చితే భారతీయ కంపెనీల సంఖ్య 805 నుంచి 900కి పెరిగింది. వీటి ద్వారా వచ్చే రాబడి 50.8 బిలియన్ల ఫౌండ్ల నుంచి 54.4 బిలియన్ ఫౌండ్లకు చేరుకుంది. ఇండియన్ డయాస్పోరా విజయాల్లో రిషి సునాక్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయితే తమకు మరింత మేలు జరుగుతుందని ప్రవాసులు అభిప్రాయపడుతున్నారు. (క్లిక్: రిషి సునాక్‌కు అనూహ్య మద్దతు.. అవాక్కయిన యాంకర్) -
రిషి సునాక్‌కు అనూహ్య మద్దతు.. అవాక్కయిన యాంకర్
లండన్: బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తుది పోటీలో నిలిచిన భారత సంతతికి చెందిన రిషీ సునాక్, లిజ్ ట్రస్ హోరాహోరీగా తలపడుతున్నారు. తాజాగా స్కై టీవీ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో రిషీ సునాక్‌కు అనూహ్య మద్దతు లభించింది. టీవీ డిబేట్‌ను స్టూడియోలో ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారిలో ఎక్కువ మంది ఆయనవైపు మొగ్గుచూపారు. స్కై టీవీ డిబేట్లో గురువారం రిషీ సునాక్, లిజ్ ట్రస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెజెంటర్ కే బర్లీ... రిషీకి మద్దతు ఇస్తున్న వారిని చేతులు పైకి ఎత్తమనగా స్టూడియోలో ఉన్న దాదాపు అందరూ స్పందించారు. లిజ్ ట్రస్‌కు ఎంత మంది మద్దతు ఇస్తున్నారని అడగ్గా అంత అంతమాత్రం స్పందన లభించింది. దీంతో రిషీ, ట్రస్ సహా అక్కడున్నవారంతా సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే రిషీ గెలిచే అవకాశాలు 10 శాతం మాత్రమే ఉన్నాయని బ్రిటన్ సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రిషీకి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించడం ఆశ్చర్యానికి గురిచేసింది. బ్రిటన్ నూతన ప్రధానిగా ఎవరు ఎన్నికవుతారనేది సెప్టెంబర్ 5న తెలుస్తుంది. ఇక డిబేట్లో భాగంగా రిషీ సునాక్, లిజ్ ట్రస్ ఇద్దరూ కఠినమైన ప్రశ్నలు ఎదుర్కొన్నారు. లండన్ బయట నివసించే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించాలని డిమాండ్ చేసి యూటర్న్ తీసుకోవడం గురించి లిజ్ ట్రస్‌ను ప్రశ్నించగా.. తన ప్రతిపాదనను మీడియా తప్పుగా ప్రచారం చేసిందని సమాధానం ఇచ్చారు. మంచి నాయకులు తమ తప్పులను ఒప్పుంటారా, ఇతరులను నిందిస్తారా అని కే బర్లీ ఎదురు ప్రశ్న వేయగా.. తాను ఎవరినీ నిందిచడం లేదని, తాను ప్రతిపాదించిన విధానాన్ని వక్రీకరించారని చెబుతున్నానని లిజ్ ట్రస్ తడబడుతూ జవాబిచ్చారు. రష్యా దండయాత్రపై ఉక్రెయిన్ తరపున పోరాడేందుకు బ్రిట్స్‌కు మద్దతు ఇస్తానని చేసిన వ్యాఖ్యల గురించి కూడా ఆమె ప్రశ్నలు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుత తరుణంలో బ్రిటీష్ ప్రజలు ఉక్రెయిన్‌కు వెళ్లకూడదనే ట్రావెల్ ఎడ్వైజరీ ఉందని గుర్తు చేశారు. రిషీ సునాక్ కూడా కే బర్లీ నుంచి కఠిన ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ‘మీరు ఖరీదైన ప్రాడా షూస్‌లో నడుస్తున్నందున వారి బూట్లు ధరించి ఒక మైలు కూడా నడవలేరని ప్రజలు భావిస్తున్నార’ని పశ్నించారు. బిలియనీర్ అయిన మామగారికి అల్లుడనే ఉద్దేశంతో ఆమె ఈ ప్రశ్న అడిగ్గా.. ‘తాను ఎన్హెచ్ఎస్ కుటుంబంలో పెరిగానని, నా ప్రచారంలో ఈ విషయం గురించి మీరు వినే ఉంటార’ని రిషీ జవాబిచ్చారు. తన తండ్రి జాతీయ ఆరోగ్య సేవ(ఎన్హెచ్ఎస్)లో డాక్టర్‌గా పనిచేశారని పలు సందర్భాల్లో ఆయన చెప్పారు. కాగా, స్టూడియోలో ఉన్న ప్రేక్షకుల్లో ఎక్కువ మంది రిషీ సునాక్‌కు మద్దతు పలుకుతారని తాను అసలు ఊహించలేదని కే బర్లీ వ్యాఖ్యానించారు. (క్లిక్: మన రిషి గెలుస్తాడంటారా?) -
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో జాతివివక్షా..?
లండన్: బ్రిటన్ ప్రధాని రేసులో జాతివివక్షకు తావే లేదని అభిప్రాయపడ్డారు భారత సంతతికి చెందిన రిషి సునాక్. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా లింగం, జాతిని చూసి ఓటు వేయరని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరు సరైన అభ్యర్థి అని నిర్ణయించుకునేందుకు ఇది కారణంగా ఉండదన్నారు. ది డైలీ టెలిగ్రాఫ్‌కు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు తెలిపారు. ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్ ఒకవేళ ఓడిపోతే బ్రిటన్‌లో జాతివివక్ష ఉందని అందరూ అనుకుంటారని భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త రామి రేంజర్ గతవారం ఓ వీడియోలో వ్యాఖ్యానించారు. రిషి దీనిపైనే స్పందిస్తూ.. అసలు జాతివివక్షకు అవకాశమే లేదన్నారు. రిచ్మాండ్ నుంచి టోరీ సభ్యులే తనను ఎంపీగా గెలిపించారని, ప్రధాని రేసులో ఎక్కువ మంది ఎంపీలు తనకే మద్దతుగా నిలిచారని రిషి గుర్తు చేశారు. అలాంటప్పుడు జాతివివక్షకు ఆస్కారం ఎలా ఉంటుందన్నారు. బ్రిటన్ ప్రధాని పదవికి ఎవరు సమర్థవంతులు అనే విషయం గురించి చర్చించే క్రమంలో ఇలాంటి ప్రశ్నలు వచ్చి ఉంటాయన్నారు. బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్, రిషి సునాక్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. 1.75లక్షల మందికిపైగా టోరీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొని వీరిద్దరిలో ఒకరిని ప్రధానిగా ఎన్నుకోనున్నారు. సెప్టెంబర్ 5 వరకు ఈ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. అయితే ఇప్పటివరకు నిర్వహించిన సర్వేల్లో లిజ్ ట్రస్‌కే విజయావకాశాలు ఎక్కువని తేలింది. 90 శాతం ఆమే గెలుస్తుందని, రిషి సునాక్‌కు 10శాతమే అవకాశాలున్నాయని ప్రీ పోల్ సర్వేలు అంచనా వేశాయి. రిషి కూడా తాను రేసులో వెనుకంజలో ఉన్నట్లు అంగీకరించారు. అయినా చివరి ఓటు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. చదవండి: బోరిస్‌కు ఎందుకు వెన్నుపోటు పొడిచారు? రిషికి ఇబ్బందికర ప్రశ్నలు -
లిజ్ ట్రసే బ్రిటన్ కొత్త ప్రధాని.. రిషికి 10 శాతమే ఛాన్స్!
లండన్: బ్రిటన్ ప్రధాని రేసు తుది దశకు చేరుకుంది. లిజ్ ట్రస్, రిషి సునాక్‌లలో బోరిస్ జాన్సన్ వారసులెవరో కొద్ది రోజుల్లో తేలిపోనుంది. అయితే బ్రిటన్‌కు చెందిన బెట్టింగ్ సంస్థ స్మార్కెట్స్ మాత్రం తదుపరి ప్రధాని లిజ్ ట్రస్ కావడం దాదాపు ఖాయం అని చెబుతోంది. టోరీ పార్టీ సభ్యుల్లో ఎక్కువ మంది ఆమెకే మద్దతుగా నిలుస్తారని పేర్కొంది. రిషి కంటే ట్రస్‌కు ప్రధాని అయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతం ఎక్కువ ఉన్నాయని చెబుతోంది. బ్రిటన్ ప్రధాని రేసులో లిజ్ ట్రస్, రిషి సునాక్ మధ్య గట్టి పోటీ ఉంటుందని తొలుత భావించారు. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో ఎక్కువమంది రిషికే మద్దతుగా నిలిచినా.. పార్టీ సభ్యులు మాత్రం లిజ్ ట్రస్‌కు జై కొడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ట్రస్‌కు 60శాతం, రిషికి 40 శాతం విజయావకాశాలు ఉంటాయని అంచనాలు వేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టోరీ సభ్యులతో సమావేశాలు మొదలుపెట్టాక రిషి విజయావకాశాలు దారుణంగా 10 శాతానికి పడిపోయాయి. అయితే రేసులో తాను వెనుకబడి ఉన్నాననే విషయాన్ని రిషి సునాక్ అంగీకరించారు. అయినప్పటికీ చివరి వరకు పోరాడుతానని, ప్రతి ఓటు కోసం ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. బ్రిటన్ కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు 1.75లక్షల మంది టోరీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 5న నూతన ప్రధాని ఎవరో అధికారికంగా ప్రకటిస్తారు. చదవండి: రిషి సునాక్‌కు ఇబ్బందికర ప్రశ్నలు.. ఎందుకు వెన్నుపోటు పొడిచారని అడిగిన టోరీ సభ్యులు -
బోరిస్‌కు ఎందుకు వెన్నుపోటు పొడిచారు? రిషికి ఇబ్బందికర ప్రశ్నలు
లండన్: బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్, లిజ్ ట్రస్ తొలిసారి కన్జర్వేటివ్ పార్టీ సభ్యులతో నేరుగా సమావేశమయ్యారు. ఎప్పటిలాగే ఆర్థికవ్యవస్థ, జీవన వ్యయం వంటి అంశాలపైనే ఇద్దరు తమ విధానాల గురించి వివరించారు. నార్త్ యార్క్‌షైర్ లీడ్స్‌లో వేదికగా జరిగిన ఈ కర్యక్రమంలో టోరీ సభ్యుల నుంచి రిషి సునాక్‌కు ఇబ్బందికర ప్రశ్నలు ఎదురయ్యాయి. వారంతా ప్రధాని బోరిస్ జాన్సన్ పట్ల తమ విధేయతను చాటుకుంటూ రిషిని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు సంధించారు. దానికి ఆయన కూడా తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. 'మీరు మంచి సేల్స్‌మన్, బలమైన వ్యక్తి. కష్ట సమయంలో స్థిరంగా పాలన సాగించిన బోరిస్‌కు అందరూ మద్దతుగా నిలిచారు. కానీ మీరు మాత్రం వెన్నుపోటు పొడిచారని చాలా మంది అనుకుంటున్నారు. మిమ్మల్ని సీనియర్ పొలిటీషియన్‌ను చేసింది బోరిసే' అని ఓ టోరీ సభ్యుడు రిషి సునాక్‌ను ప్రశ్నించారు. అయితే రిషి ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. గత్యంతరం లేకే తాను ఆర్థికమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు వివరించారు. కరోనా కష్ట సమయంలో ఆర్థిక విధానాలపై ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినందుకే అలా చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. అలాగే తాను అధికారంలోకి వస్తే పన్ను రాయితీ ఇస్తానని ప్రకటించిన లిజ్ ట్రస్ ఆర్థిక విధానాలపైనా రిషి విమర్శలు గుప్పించారు. తాత్కాలిక ఉపశమనం కోసం పన్నుల్లో కోత విధించి తర్వాతి తరాల పిల్లల భవిష్యత్తును తాకట్టుపెట్టలేనని స్పష్టం చేశారు. చదవండి: లైవ్ ప్రోగ్రామ్‌లో కుప్పకూలిన యాంకర్.. సాయం చేసిన రిషి సునాక్ -
రిషి సునాక్ మంచి మనసు.. కళ్లుతిరిగి పడిపోయిన యాంకర్‌కు సాయం
లండన్: బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్ మంచి మనసు చాటుకున్నారు. లైవ్ టీవీ ప్రోగ్రాంలో హఠాత్తుగా కుప్పకూలి పడిపోయిన యాంకర్‌కు సాయం చేశారు. రిషి తన ప్రత్యర్థి లిజ్ ట్రస్‌తో టీవీ డిబేట్లో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. 'టాల్క్ టీవీ' డిబేట్లో తాను గెలిస్తే చేపట్టే కార్యక్రమాలపై లిజ్ ట్రస్ వివరిస్తున్న సమయంలో ఆ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న యాంకర్.. ఒక్కసారిగా కళ్లుతిరిగిపడిపోయింది. దీంతో ట్రస్ షాక్‌కు గురయ్యారు. మరోవైపు రిషి మాత్రం యాంకర్ పడిపోతుండగానే హుటాహుటిన ఆమె వద్దకు వెళ్లి సాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. A TV host faints during the UK's second leaders' debate between Liz Truss and Rishi Sunak pic.twitter.com/blovJGPiMK — TICKER NEWS (@tickerNEWSco) July 26, 2022 యాంకర్ బాగానే ఉన్నప్పటికీ అనుకోకుండా అలా జరిగిందని, ఆమె ప్రోగ్రాం కొనసాగించవద్దని వైద్యులు ఇచ్చిన సూచన మేరకు డిబేట్‌ను రద్దు చేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించారు. బ్రిటన్ ప్రధాని ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రస్, రిషి పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే పన్నుల్లో కోత విధిస్తానని ట్రస్ హామీ ఇస్తున్నారు. రిషి మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడంపైనే తాను దృష్టి సారిస్తానని చెబుతున్నారు. ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించడమే తన లక్ష్యమన్నారు. మరోవైపు బ్రిటన్‌లోని పలు సర్వేలు లిజ్ ట్రస్ వైపే కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు మొగ్గు చూపుతున్నట్లు తెలిపాయి. రిషిపై ట్రస్ 24 పాయింట్ల శాతం ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొన్నాయి. చదవండి: కరోనా మూలాల గుట్టు విప్పిన అధ్యయనం.. వైరస్ పుట్టింది అక్కడే.. కానీ ల్యాబ్‌లో కాదు -
బ్రిటన్ ప్రధాని పదవికి అడుగు దూరంలో రిషి.. ఐదో రౌండ్లో పెన్నీ అవుట్..
లండన్: బ్రిటన్ ప్రధాని పదవి రేసులో దూసుకుపోతున్నారు భారత సంతతికి చెందిన రిషి సునాక్. ప్రధాని పదవికి పోటి పోటీ పడుతున్న తుది ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచారు. ఫలితంగా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. ఐదో రౌండ్లో 137 మంది ఎంపీల మద్దతుతో రిషి మొదటి స్థానం సంపాదించారు. చివరకు రిషి, లిజ్ ట్రస్ మాత్రమే పోటీలో మిగిలారు. రిషికి గట్టి పోటీ ఇస్తుందని భావించిన పెన్నీ మోర్డెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఇక కన్జర్వేటివ్ పార్టీకి చెందిన లక్షా 60 వేల మంది సభ్యుల్లో ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వాళ్లే బ్రిటన్ ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకుంటారు. రిషికి లిడ్ ట్రస్‌తో హోరాహోరీ పోరు ఉండనుంది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ట్రస్‌వైపే మొగ్గుచూపే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే రిషి సోమవారం బీబీసీ ఛానెల్లో డిబేట్లో పాల్గొనాల్సి ఉంది. అలాగే ఇంకా చాలా కార్యక్రమాలకు హాజరై మద్దతు కూడగట్టుకోనున్నారు. సెప్టెంబర్ 5న జరిగే బ్యాలట్ ఓటింగ్ నాటికి మరింత మందిని తన వైపు తిప్పుకుంటే రిషి విజయం నల్లేరుపై నడకే అవుతుంది. అప్పుడు బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ సరికొత్త చరిత్ర సృష్టిస్తారు. చదవండి: రోజుకు రూ.15 వేలు సంపాదిస్తున్నా.. ఏం చేసినా ఇంత డబ్బు రాదు.. అందుకే! -
రెడీ ఫర్ రిషి! బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి దూకుడు
లండన్: బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ముందంజలో దూసుకుపోతున్నారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకునిగా ఆయన అభ్యర్థిత్వానికి అత్యధికంగా 40 మందికి పైగా ఎంపీలు మద్దతు పలికారు. ఆర్థిక మంత్రిగా సమర్థ పనితీరు ఆయనకు మరింతగా కలిసొస్తోంది. ‘రెడీ ఫర్ రిషి’ పేరుతో రిషి ఇప్పటికే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి ఆయన అల్లుడు కావడంతో ఈ ఎన్నికలపై భారత్‌లోనూ ఆసక్తి మరింత పెరిగింది. భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఇప్పటికే అగ్ర రాజ్యం అమెరికాకు ఉపాధ్యక్షురాలైన నేపథ్యంలో భారత మూలాలున్న రిషి బ్రిటన్ పగ్గాలు చేపట్టి చరిత్ర సృష్టిస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి భారత సంతతికి చెందిన హోం మంత్రి ప్రీతీ పటేల్‌తో పాటు పాక్ సంతతికి చెందిన మాజీ మంత్రులు సాజిద్ జావిద్, రెహ్మాన్ చిస్తీ తదితరులు తప్పుకున్నారు. దాంతో రిషితో పాటు మరో ఏడుగురు బరిలో మిగిలారు. వీరిలో భారత మూలాలున్న అటార్నీ జనరల్ సువెల్లా బ్రేవర్మన్ కూడా ఉండటం విశేషం! అంత ఈజీ కాదు బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో అడుగు పెట్టడం అంత సులభమైన వ్యవహారం కాదు. 650 స్థానాలున్న బ్రిటన్ పార్లమెంటులో అధికార కన్జర్వేటివ్ పార్టీకి 358 మంది సభ్యుల బలముంది. ప్రధానిగా పగ్గాలు చేపట్టబోయే పార్టీ నాయకుడి ఎన్నిక ప్రక్రియ 8 వారాల పాటు సుదీర్ఘంగా సాగుతుంది. చివరికి అత్యధిక ఎంపీల మద్దతు లభించిన వారే కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి ఎన్నికై ప్రధాని పీఠం అధిరోహిస్తారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక ఓటింగ్ ప్రక్రియ మొదలవనుంది. బుధవారం తొలి రౌండ్ ఓటింగ్ జరుగుతుంది. కనీసం 30 మంది ఎంపీల మద్దతున్న వాళ్లే గురువారం నాటి రెండో రౌండ్ ఓటింగ్‌కు అర్హత సాధిస్తారు. అక్కడినుంచి ఒక్కో దశలో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన వారు తప్పుకుంటూ పోతారు. ఇలా జూలై 21 నాటికి ఇద్దరే అభ్యర్థులు పోటీలో మిగలాల్సి ఉంటుంది. దాదాపు 2 లక్షల మంది టోరీ పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టుకునేందుకు వారు దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుడతారు. తుది ఇద్దరు అభ్యర్థుల్లో రిషి కచ్చితంగా నిలిచే అవకాశాలున్నాయి. సమర్థమైన పనితీరు కరోనా కల్లోల సమయంలో బ్రిటన్ ఆర్థిక సంక్షోభం బారిన పడకుండా ఆర్థిక మంత్రిగా రిషి తీసుకున్న చర్యలు అందరి మన్ననలు పొందాయి. ఉద్యోగాలను కాపాడే చర్యలతో మంచి పేరు తెచ్చుకున్నారు. కార్మికులు, చిరు వ్యాపారులకు అండగా నిలిచారు. యువత, విద్యావంతులు, సంపన్నుల్లోనూ రిషికి మంచి ఫాలోయింగ్ ఉంది. పన్ను రాయితీలను ఆయన వ్యతిరేకిస్తున్నారు. పన్నులు తగ్గిస్తే ధరలు పెంచాల్సి వస్తుందని, అది ఆర్థిక వ్యవస్థపై చెడు ప్రభావం చూపిస్తుందన్నది ఆయన వాదన. పార్టీగేట్ కుంభకోణంలో జరిమానా కట్టాల్సి రావడం వంటివి రిషికి ప్రతికూలంగా మారాయి. భార్య అక్షత మూర్తి భారత్ పౌరురాలిగా కొనసాగుతూ నాన్ డొమిసైల్ హోదాను అడ్డు పెట్టుకొని తన సంపాదనపై పన్నులు ఎగవేశారన్న ఆరోపణలు కూడా రిషిని ఇరకాటంలో పెట్టాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ పెన్నీతో గట్టి పోటీ! రిషికి ప్రధానంగా వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ మోర్డంట్ నుంచి గట్టి పోటీ ఉంటుందంటున్నారు. దేశ తొలి మహిళా రక్షణ మంత్రి అయిన ఆమె థెరిసా మే ప్రధానిగా ఉండగా ఒక వెలుగు వెలిగారు. పెట్రో పన్నులను 50 శాతం తగ్గిస్తానని, వ్యాట్ రాయితీలను 2023 ఏప్రిల్ దాకా పొడిగిస్తానని ఆమె ఇస్తున్న హామీలు పార్టీ ఎంపీలను బాగా ఆకర్షిస్తాయంటున్నారు. కన్జర్వేటివ్ పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో పెన్నీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఆమెకు 19.6% మంది మద్దతు పలికారు. మాజీ మంత్రి కెమీ బడెనోక్ (18.7%) రెండోస్థానంలో ఉన్నారు. 12.1 శాతం ఓట్లతో రిషి మూడో స్థానంలో, సుయెల్లా బ్రేవర్మన్ నాలుగో స్థానంలో ఉన్నారు. అయితే ఆమెకు ప్రజల్లో అంతగా ఫాలోయింగ్ లేదు. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ పన్నుల తగ్గింపు హామీలతో రిషికి పూర్తి వ్యతిరేక విధానాలతో దూసుకుపోతున్నారు. టామ్ టుగెన్హాట్, జెరెమీ హంట్, నదీమ్ జహావీ కూడా రేసులో ఉన్నారు. రేసులో నిలిచింది వీరే... రిషి సునాక్ పెన్నీ మోర్డంట్ టామ్ టుగెన్హాట్ లిజ్ ట్రస్ కెమీ బడెనోక్ జెరెమీ హంట్ నదీమ్ జవాహి సుయెల్లా బ్రేవర్మన్ చదవండి: ఊహించని మలుపులు.. ప్రీతి పటేల్ అవుట్ -
ఊహించని మలుపులు.. ప్రీతి పటేల్ అవుట్
లండన్: బ్రిటన్ రాజకీయాల్లో ఇవాళ కీలక, ఊహించని పరిణామాలే చోటుచేసుకున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థి విషయంలో మాజీ ఛాన్స్లర్ రిషి సునాక్‌కు అవకాశాలు కొంచెం కొంచెంగా మెరుగు అవుతున్నాయి. అదే సమయంలో.. బ్రిటన్ హోం సెక్రెటరీ ప్రీతి పటేల్(50) కీలక నిర్ణయం ప్రకటించారు. ప్రధాని రేసులో తాను దిగట్లేదని కాసేపటి కిందట ఆమె స్పష్టం చేశారు. 2016 బ్రెగ్జిట్ రిఫరెండమ్‌లో డేవిడ్ కామెరున్ క్యాబినెట్ నుంచి బోరిస్ జాన్సన్, మైకేల్ గోవ్తో పాటు ప్రీతి పటేల్ కూడా కీలకంగా వ్యవహరించారు. ఈ తరుణంలో..కన్జర్వేటివ్ పార్టీ తరపున నాయకత్వ రేసులో ఆమె దిగుతారని అంతా భావించారు. అయితే పోటీలో తాను లేనని హోం సెక్రటరీ ప్రీతి సుశీల్ పటేల్ ప్రకటించారు. సహచరుల నుంచి లభిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలని ఆమె పేర్కొన్నారు. అంతకు ముందు ఆమె మద్దతుదారులు.. పోటీ విషయంలో ఆమె ధృడంగా ఉన్నారని, సుదీర్ఘకాలం బ్రెగ్జిటర్గా ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రీతి పటేల్‌ను మార్గరేట్థాచర్తో పోల్చారు కొందరు సభ్యులు. అయితే ఆమె మాత్రం పోటీలో ఉండడం లేదని క్లారిటీ ఇచ్చారు. సరిపడా మద్దతు లేనందునే ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది.కానీ, పటేల్‌కు విద్యా మంత్రి ఆండ్రియా జెన్కీన్స్, న్యాయశాఖ మంత్రి టామ్ పుర్సుగ్లోవ్తో పాటు పదమూడు మంది సభ్యుల మద్దతు ఉంది. ఈ మద్దతు కోసం ఇప్పుడు మిగతా సభ్యులు చూస్తున్నారు. మరోవైపు రేసులో ఉన్న రిషి సునాక్(42) భారత సంతతి వ్యక్తికాగా, ప్రతీ కూడా భారత సంతతి వ్యక్తే కావడం గమనార్హం. ఇప్పటికే సువెల్లా బ్రావర్మన్, లిజ్ ట్రుస్స్లు బ్రిటన్ ప్రధాని రేసులో నిలబడ్డారు. ఇదిలా ఉంటే.. ప్రధాని రేసులో నిల్చునే అభ్యర్థి పేరును బ్యాలెట్ పేపర్లో చేర్చాలంటే కనీసం 20 ఎంపీల మద్దతు అయినా అవసరం ఉంటుంది. కన్జర్వేటివ్ పార్టీ తరపున అభ్యర్థి కోసం నిర్వహించిన ఓటింగ్‌లో.. ఊహించని మలుపులు ఇదిలా ఉంటే.. బ్రిటన్ రాజకీయాల్లో ఇవాళ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఉప ప్రధాని డోమినిక్ రాబ్, రవాణా శాఖ మంత్రి గ్రాంట్ షాప్స్లు.. రిషి సునాక్ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రకటన చేశారు. అంతేకాదు.. రాబ్ స్వయంగా సునాక్ ప్రచార ఈవెంట్‌ను లాంచ్ చేశారు ఇవాళ. ఇదిలా ఉంటే.. ప్రధాని రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించిన గ్రాంట్ షాప్స్.. ట్విటర్ ద్వారా సునాక్ అనుభవానికి, అర్హతకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: బ్రిటన్ తదుపరి ప్రధానిని ప్రకటించేంది అప్పుడే! -
బ్రిటన్ కొత్త ప్రధాని ఎంపిక రేసులో 11 మంది.. ముహూర్తం ఫిక్స్!
లండన్: బ్రిటన్ కొత్త ప్రధాని ఎంపికకు ముహూర్తం ఖరారు చేసింది అధికార కన్జర్వేటివ్ పార్టీ. సెప్టెంబర్ 5న పార్టీ నాయకుల సమక్షంలో కొత్త ప్రధాని పేరును అధికారికంగా ప్రకటించనుంది. ప్రధాని పదవికి పోటీ పడేందుకు 11 మంది నేతలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రేసులో ఉండాలనుకునేవారు నామినేషన్లు సమర్పించేందుకు మంగళవారం ఒక్కరోజే గడువుంది. వేసవి విరామం అనంతరం బ్రిటన్ పార్లమెంట్ సెప్టెంబర్‌లోనే తిరిగి ప్రారంభమవుతుంది. అప్పుడే కొత్త ప్రధాని ప్రకటన ఉండనుంది. రౌండ్ల వారీగా ఓటింగ్.. ప్రధాని పదవికి పోటీ పడాలనుకునే వారికి కనీసం 20 మంది ఎంపీల మద్దతు ఉండాలి. పోటీలో ఉన్నవారిని పార్టీ నేతలు బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. రౌండ్ల వారీగా ఓటింగ్ నిర్వహించి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. చివరకు మిగిలిన ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే కన్జర్వేటివ్ పార్టీ నూతన సారథిగా, ప్రధానిగా బాధ్యతలు చేపడుతారు. ఈ ప్రక్రియ బుధవారం నుంచే ప్రారంభమవుతుంది. కొత్త ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ ఉన్నారు. మొన్నటివరకు ఆర్థిక మంత్రిగా సేవలందించిన ఈయన బోరిస్ జాన్సన్ కేబినెట్ నుంచి మొదటగా తప్పుకున్నారు. ఆ తర్వాత సొంత ప్రభుత్వంలో మంత్రులతో పాటు మొత్తం 58 మంది రాజీనామా చేశారు. దీంతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు బోరిస్ ప్రకటించారు. కొత్త ప్రధాని ఎంపిక జరిగేవరకు తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతానన్నారు. చదవండి: Who Is Rishi Sunak: బ్రిటన్ తదుపరి ప్రధానిగా భారత సంతతి వ్యక్తి! అదే నిజమైతే చరిత్రే.. -
ప్రధాని పదవికి గుడ్‌బై చెప్పే ముందు.. బోరిస్ భారీ ప్లాన్.. చెకర్స్‌లో..
లండన్: ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని గురువారం అధికారికంగా ప్రకటించారు బోరిస్ జాన్సన్. కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే తాను ప్రధాని హోదాలో ఉండగానే చివరగా గ్రాండ్ పార్టీకి ఆయన్ ప్లాన్ చేసినట్లు బోరిస్ సన్నిహిత వర్గాలు చెప్పాయని బ్రిటన్ మీడియా తెలిపింది. చాలాకాలంగా సహజీవనం చేస్తున్న కేరీని గతేడాది పెళ్లి చేసుకున్నారు ఆయన. అయితే కరోనా కారణాల వల్ల ఈ వేడుక అతికొద్ది మంది సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. అందుకే ఇప్పుడు అందరినీ పిలిచి గ్రాండ్ వెడ్డింగ్ పార్టీ ఇవ్వాలని బోరిస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని అధికారిక నివాసం 'చెకర్స్'లో ఈ పార్టీ ఉండనుంది. బ్రిటన్ ప్రధాని కార్యాలయం 10 డౌన్ స్ట్రీట్‌లో ఉంటుంది. చెకర్స్ ప్రధాని అధికారిక నివాసం. 600 హెక్టార్ల విస్తీర్ణంతో ఎంతో విశాలంగా ఉండే ఈ భవన సముదాయంలో ప్రపంచనేతలతో సమావేశాలు, విందు కార్యక్రమాలు, పార్టీలకు బ్రిటన్ ప్రధానులు ఉపయోగిస్తుంటారు. 1920 నుంచి ఇది వాడుకలో ఉంది. చెకర్స్‌లో జులై 30న బోరిస్ పార్టీ ఇవ్వనున్నట్లు బ్రిటన్ మీడియా పేర్కొంది. ఇది ఎంతో గ్రాండ్‌గా, గ్లామరస్‌గా ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలిపింది. బోరిస్ స్నేహితులు, కుటుంబసభ్యులకు ఇప్పటికే ఆహ్వానం అందిందని మీడియా వెల్లడించింది. -
నా విజయాల పట్ల గర్వపడుతున్నా: బోరిస్ జాన్సన్
లండన్: బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం ఆయన స్వయంగా విషయాన్ని వెల్లడించారు. 2019లో ప్రజలు అందించిన అఖండ విజయం పట్ల బోరిస్ కృతజ్ఞతలు తెలియజేశారు. నా హయాంలో సాధించిన విజయాల పట్ల గర్వపడుతున్నా. బ్రెగ్జిట్‌ను పూర్తి చేయడం గర్వంగా ఉంది. కొత్త నేత వచ్చే దాకా ఆ స్థానంలో నేనే కొనసాగుతా, కన్జర్వేటివ్ పార్టీ త్వరలో కొత్త నేతను ఎన్నుకుంటుంది అని ప్రకటించారాయన. సహచర మంత్రుల ఒత్తిళ్ల మేరకు తలొగ్గి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారాయన. కరోనా టైంలో బ్రిటన్ సంఘటితంగా ఉండి.. మహమ్మారిని ఎదుర్కోవడాన్ని ప్రస్తావించారాయన. రాజకీయాల్లో ఎవరూ అనివార్యం కాదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారాయన. ఇక బోరిస్ రాజీనామాపై ప్రతిపక్ష లేబర్ పార్టీ సంతోషం వ్యక్తం చేసింది. గుడ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో సంబురాలు మొదలుపెట్టింది. -
UK political crisis: మెడపై కత్తి
సోమిరెడ్డి రాజమహేంద్రారెడ్డి బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం ముదురుపాకాన పడుతోంది. ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతిష్ఠ రోజురోజుకూ మసకబారుతోంది. అనేక ఆరోపణలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆయన తక్షణం రాజీనామా చేయాలంటూ స్వపక్షం నుంచే తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. మంగళవారం ఇద్దరు సీనియర్ మంత్రుల రాజీనామాతో రాజకీయంగా కలకలం రేగింది. వారి స్థానంలో వెంటనే కొత్తవారిని నియమించి ఎంపీలంతా తన వెంటే ఉన్నారని చెప్పుకునేందుకు జాన్సన్ ప్రయత్నించినా పోతూ పోతూ బోరిస్‌పై మంత్రులు చేసిన విమర్శలు అంతటా చర్చనీయంగా మారాయి. పైగా ఆ కలకలం సద్దుమణగకముందే బుధవారం ఏకంగా మరో డజను మంది మంత్రులు ప్రధానిపై నమ్మకం పోయిందంటూ గుడ్‌బై చెప్పారు! దీంతో బోరిస్ ఎలా నిలదొక్కుకోవాలో తెలియని అయోమయంలో పడ్డారు. కేబినెట్లోని ఇతర మంత్రులు ఇంకా తనతోనే ఉన్నదీ లేనిదీ ఆరా తీయాల్సిన పరిస్థితి దాపురించింది. జాతి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోకుండా జాన్సన్ ఇష్టమొచ్చినట్టుగా పరిపాలిస్తుండటమే గాక పలు అంశాలపై నోటికొచ్చినట్టు అబద్ధాలాడి విశ్వసనీయత కోల్పోయారన్నవి ఆయనపై ప్రధాన విమర్శలు. గత నెల జరిగిన ఉప ఎన్నికల్లో టివర్టన్, హోనిటన్, వేక్ఫీల్డ్ స్థానాలను కన్జర్వేటివ్ పార్టీ కోల్పోవడం, పార్టీ చైర్మన్ ఒలివర్ డోడెన్ రాజీనామా వంటివి జాన్సన్ పనితీరుపై తాజాగా ప్రశ్నలు రేకెత్తించిన పరిణామాలు. అప్పటికే పార్టీ గేట్ వివాదం ఆయన్ను వెంటాడుతుండగా, తాజాగా మొదలైన రాజీనామాల పర్వంతో ప్రధానిగా ఆయన పరిస్థితి మరింత దిగజారింది. అసమర్థతను అంగీకరించి తక్షణం రాజీనామా చేయాల్సిందేనని, లేదంటే పార్టీయే ఉద్వాసన పలకాల్సి వస్తుందని కన్జర్వేటివ్ ఎంపీ ఆండ్రూ బ్రిడ్జెన్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. సరైన నిర్ణయాలు తీసుకోలేక ఊగిసలాట ధోరణితో దేశాన్ని బోరిస్ఇబ్బందుల్లోకి నెడుతున్న తీరును పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ (1922) క్షుణ్నంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని ఆయన వివరించారు. ఇదే అదనుగా ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత సర్ కెయిర్ కూడా గొంతు సవరించుకున్నారు. ఉన్నపళంగా ఎన్నికలకు వెల్లడమే శ్రేయస్కరమని, దేశం సరికొత్త నాయకత్వాన్ని కోరుకుంటోందని చెప్పుకొచ్చారు. ఆరోపణలు, వివాదాలు, అసమర్థత కలగలిసి బోరిస్‌ను అశక్తున్ని చేశాయన్నారు. ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కుప్పకూలడం ఖాయమని వ్యాఖ్యానించారు. కన్జర్వేటివ్ ఎంపీలు వెంటనే బోరిస్‌కు ఉద్వాసన పలికి దేశభక్తి చాటుకోవాలంటూ విపక్ష ఎంపీలు పిలునివ్వడం విశేషం! బ్రిటన్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రధాని తన అధికారాన్ని ఉపయోగించి ముందస్తు ఎన్నికలకు ఆదేశించవచ్చు. మద్దతుకూ కొదవ లేదు స్వపక్షం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బోరిస్‌కు మద్దతు కూడా అదే స్థాయిలో ఉంది. పార్టీ నాయకునిగా, ప్రధానిగా ఆయన కొనసాగాలనే అధిక సంఖ్యాకులు కోరుకుంటున్నారు. కానీ పాలనా దక్షతపై సందేహాల నేపథ్యంలో పదవి నిలబెట్టుకోవాలంటే బోరిస్గట్టి సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని పరిశీలకుల అభిప్రాయం. ఇటీవల జరిగిన పార్టీపరమైన విశ్వాస పరీక్షలో 359 మంది కన్జర్వేటివ్ ఎంపీల్లో 211 మంది బోరిస్‌కు మద్దతుగా ఓటేశారు. అంటే 148 మంది ఆయనపై అవిశ్వాసం వెలిబుచ్చినట్టు. గత ప్రధాని థెరెసా మే కూడా 2018లో బ్రిగ్జిట్ పాలసీపై ఇలాగే పార్టీపరమైన విశ్వాస పరీక్షలో 83 ఓట్లతో గట్టెక్కారు. అయినా ఆర్నెల్లకే రాజీనామా చేశారు. 2003లో డంకన్ స్మిత్ విశ్వాస పరీక్షలో కొద్ది తేడాతో ఓడి తప్పుకున్నారు. 1990లో మార్గరెట్ థాచర్ విశ్వాస పరీక్షలో 204–152 ఓట్లతో నెగ్గినా కేబినెట్ నిర్ణయానికి తలొగ్గి ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తప్పుకోక తప్పదా! జాన్సన్ పార్టీ విశ్వాస పరీక్షలో నెగ్గినా ప్రధాని పదవిని ఎంతోకాలం నిలబెట్టుకోవడం అనుమానమే. ఉప ఎన్నికల ఓటమి, పార్టీ గేట్, మంత్రుల రాజీనామాల వంటివి ఆయన పదవికి ఎసరు తెచ్చే అవకాశాలే ఎక్కువ. ఏడాది దాకా మళ్లీ విశ్వాస పరీక్షకు అనుమతించని కన్జర్వేటివ్ పార్టీ నిబంధనలను మారిస్తే అది అంతిమంగా బోరిస్ ఉద్వాసనకు దారి తీయొచ్చన్నది పరిశీలకుల అభిప్రాయం. ఇవీ వివాదాలు పార్టీ గేట్ కరోనా విజృంభణ తీవ్రంగా ఉన్న సమయంలో దాని కట్టడికి అమల్లో ఉన్న నిషేధాలు, నియమాలను ఉల్లంఘిస్తూ ప్రధాని జాన్సన్ అధికార నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో, పలు ఇతర ప్రభుత్వ ఆవాసాల్లో విచ్చలవిడిగా పార్టీలు జరిగాయి. 16కు పైగా పార్టీలు జరిగినట్టు ఇప్పటిదాకా తేలింది. వీటిలో పలు పార్టీల్లో జాన్సన్ స్వయంగా పాల్గొన్నారు. మొదట్లో బుకాయించినా ఆ తర్వాత ఈ విషయాన్ని ఆయన అంగీకరించారు. అందుకు క్షమాపణలు కూడా చెప్పారు. ప్రధానే అడ్డంగా నిబంధనల్ని ఉల్లంఘిస్తారా అంటూ ఇంటా బయటా ఆయనపై దుమ్మెత్తిపోశారు. రాజీనామా డిమాండ్లు కూడా అప్పటినుంచీ ఊపందుకున్నాయి. పించర్ గేట్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన వివాదాస్పద ఎంపీ క్రిస్ పించర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల పరంపరను పించర్ గేట్గా పిలుస్తున్నారు. ఆయనపై ఈ ఆరోపణలు కొత్తవేమీ కాదు. కొన్నేళ్లుగా ఉన్నవే. తాజాగా గత జూన్ 29న ఓ ప్రైవేట్ పార్టీలో ఇద్దరు పురుషులను పించర్ అభ్యంతరకరంగా తాకారన్న ఆరోపణలపై వారం క్రితం పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. గతంలోనూ సొంత పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలతోనూ పించర్ ఇలాగే వ్యవహరించారని ఆరోపణలున్నాయి. పించర్‌ను డిప్యూటీ చీఫ్ విప్‌గా నియమిస్తూ 2019లో జాన్సన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడాయన మెడకు చుట్టుకుంది. ఆయనపై లైంగిక ఆరోపణల విషయం తనకు తెలియదని జాన్సన్ చెబుతూ వచ్చారు. కానీ అదాయనకు ముందునుంచీ తెలుసని బయట పెడటంతో తీవ్ర దుమారం రేగింది. లైంగిక ఆరోపణలున్న ఎంపీకి కీలక పదవి కట్టబెట్టడమే గాక అడ్డంగా అబద్ధాలాడిన వ్యక్తి నాయకత్వంలో పని చేయలేమంటూ కీలక మంత్రులు రిషి సునక్, జావిద్ రాజీనామా చేయడం రాజకీయ సంక్షోభానికి దారి తీసింది. ఏం జరగవచ్చు? 1. విశ్వాస పరీక్షను ఏడాదికి ఒక్కసారికి మించి జరపరాదన్న కన్జర్వేటివ్ పార్టీ నిబంధనను ఎత్తేస్తే బోరిస్‌ను దించేందుకు మరోసారి ప్రయత్నం జరుగుతుంది. ఆయనకు ఉద్వాసన పలకాలంటే 54 మంది కంటే ఎక్కువ ఎంపీలు ఆ మేరకు ‘1922 కమిటీ’ చైర్మన్‌కు లిఖితపూర్వకంగా నివేదించాల్సి ఉంటుంది. అప్పుడు రహస్య ఓటింగ్ ద్వారా విశ్వాస పరీక్ష జరుగుతుంది. గెలిస్తే బోరిస్ కొనసాగుతారు. లేదంటే పార్టీకి కొత్త నాయకున్ని ఎన్నుకుంటారు. ఆయనే ప్రధాని కూడా అవుతారు. 2. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, అందులో బోరిస్ ఓడితే రాజీనామా చేయాల్సి వస్తుంది. ముందస్తు ఎన్నికలు జరుగుతాయి. 3. ఇంటాబయటా వస్తున్న తీవ్ర ఒత్తిళ్లకు తలొగ్గి మార్గరెట్ థాచర్ మాదిరిగానే బోరిస్ తనంత తానే తప్పుకోవచ్చు. -
బోరిస్ జాన్సన్ సన్నిహితుల రాజీనామా
లండన్: పార్టీగేట్ కుంభకోణం బ్రిటిన్ను కుదిపేస్తోంది. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు సన్నిహితులైన నలుగురు ఉన్నతాధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆరోపణల నుంచి బయటపడేందుకు బోరిస్ జాన్సన్ వారితో రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి పాలసీ చీఫ్ మునిరా మీర్జా, చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ రోసెన్ఫీల్డ్, ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రెటరీ మార్టిన్ రేనాల్డ్, కమ్యూనికేషన్ డైరెక్టర్ జాక్ డోయెల్ తాజాగా తమ పదవుల నుంచి తప్పుకున్నారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో యునైటెడ్ కింగ్డమ్(యూకే) అంతటా కఠినమైన ఆంక్షలు అమలవుతున్న సమయంలో ప్రధానమంత్రి అధికార నివాసమైన డౌనింగ్ స్ట్రీట్‌లో విచ్చలవిడిగా విందులు చేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. -
మరణాలు తక్కువగానే ఉంటాయేమో
వాషింగ్టన్: అమెరికాలో కోవిడ్ మరణాల సంఖ్య ముందుగా అంచనా వేసిన దానికంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాటి విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్–19 కారణంగా మంగళవారం నాటికి అమెరికాలో సుమారు 12,700 మంది ప్రాణాలు కోల్పోగా, సోమవారం నుంచి మంగళవారం వరకూ మాత్రమే 1,900 మంది మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య అత్యధికంగా నాలుగు లక్షలకు చేరుకుంటూండగా ఒక్క న్యూయార్క్ నగరంలోనే 5,400 మంది మరణించారు, 1.38 లక్షల మంది వ్యాధి బారిన పడ్డారు. న్యూజెర్సీలో 1,200 మంది ప్రాణాలు కోల్పోగా, 44,416 మంది కోవిడ్ కోరల్లో చిక్కుకున్నారు. నిలకడగా బ్రిటన్ ప్రధాని ఆరోగ్యం కోవిడ్ లక్షణాలు తీవ్రం కావడంతో ఐసీయూలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. బోరిస్ జాన్సన్ అధికారిక కార్యకలాపాలు చేపట్టకపోయినప్పటికీ అధికారులతో మాట్లాడుతున్నారు. భారత్ నుంచి 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ డోసులు కోవిడ్–19 పేషెంట్లకు వినియోగించేందుకు భారత్ నుంచి 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ డోస్‌లను కొనుగోలు చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ‘భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను పంపగలరా? అని అడిగాను. ఆయన చాలా గొప్పవాడు. చాలా మంచివాడు’ అని ఫాక్స్ న్యూస్‌తో ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఎగుమతి చేసేందుకు భారత్ మంగళవారం అంగీకరించిన విషయం తెలిసిందే. -
ఇంటెన్సివ్ కేర్ లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
-
కరోనా లక్షణాలు ఉండడంతో ఆస్పత్రిలో బ్రిటన్ ప్రధాని
-
‘బ్రెగ్జిట్ జరగకుంటే సంక్షోభమే’
గ్రిమ్స్బై: బ్రెగ్జిట్ విషయంలో యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలు మరో అడుగు ముందుకేయాలని బ్రిటన్ ప్రధాని థెరెసా మే విజ్ఞప్తి చేశారు. లేదంటే బ్రెగ్జిట్ ఎన్నటికీ జరగదనీ, సంక్షోభం నెలకొంటుందని హెచ్చరించారు. ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ బిల్లును బ్రిటిష్ పార్లమెంటు తిరస్కరించింది. ‘వచ్చే మంగళవారం జరిగే ఓటింగ్‌లో బ్రెగ్జిట్ బిల్లు తిరస్కరణకు గురైతే మిగిలేది సంక్షోభమే. అంతిమంగా బ్రిటన్ ఈయూ నుంచి ఎన్నటికీ విడిపోదు’ అని మే అన్నారు. 2016లో జరిగిన బ్రెగ్టిట్ లో ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవాలని 51.9 శాతం మంది బ్రిటిషర్లు ఓటేశారు. -
నన్ను తొలగిస్తే ‘బ్రెగ్జిట్’ సంక్లిష్టం: థెరిసా
లండన్: తనని పదవి నుంచి తొలగిస్తే యూరోపియన్ యూనియన్(ఈయూ)తో బ్రెగ్జిట్ చర్చలు క్లిష్టతరమవుతాయని బ్రిటన్ ప్రధాని థెరిసా మే తన పార్టీ ఎంపీలను హెచ్చరించారు. భవిష్యత్‌లో బ్రిటన్–ఈయూ సంబంధాలపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమించేందుకు కుదుర్చుకున్న ఒప్పందం ముసాయిదా విషయంలో ప్రధానితో అధికార కన్జర్వేటివ్ ఎంపీలు పలువురు విభేదించిన సంగతి తెలిసిందే. వచ్చే వారం రోజులు బ్రిటన్‌కు కీలకమని, ఈయూ నాయకులతో సమావేశమై మరిన్ని చర్చలు జరుపుతానని చెప్పారు. అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 48 మంది సభ్యుల మద్దతును రెబెల్ ఎంపీలు కూడగట్టారా? అని ప్రశ్నించగా..ఇప్పటి వరకైతే లేదని బదులిచ్చారు. -
బ్రెగ్జిట్ సుడిగుండంలో థెరిసా మే
బ్రెగ్జిట్ పరిణామాలతో బ్రిటిష్ రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి (బ్రెగ్జిట్) సంబంధించిన విధివిధానాలపై ప్రధానమంత్రి థెరిసా మే ప్రవేశపెట్టిన ఒప్పంద ముసాయిదాకు కేబినెట్ ఆమోదం లభించినప్పటికీ, సొంత పార్టీలో (కన్సర్వేటివ్) తిరుగుబాటు తలెత్తింది. పలువురు కేబినెట్ సహచరులు ఇప్పటికే రాజీనామా చేశా రు. ప్రతిపక్ష లేబర్ పార్టీ, మిత్రపక్షమైన డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ దీన్ని తీవ్రంగా విభేదిస్తున్నాయి. చీలిపోయిన పార్టీ దేశానికి దిశానిర్దేశకత్వం చేయలేదని బ్రిటిష్ మీడియా విశ్లేషిస్తోంది. క్రిస్మస్‌లోగా థెరిసా పదవి నుంచి తప్పుకోవచ్చుననే ఊహాగానాలు సాగుతున్నాయి. బ్రెగ్జిట్ సాధ్యమా? నవంబరు 25న జరిగే ఈయూ ప్రత్యేక సమావేశంలో ఈ ఒప్పందంపై యూనియన్ నాయకులు సంతకాలు చేసే అవకాశముంది. దాని కంటే ముందు, ఈయూలోని 27 దేశాల్లో 65 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహించే 20 దేశాలు దీనిపై ఆమోదముద్ర వేయాలి. యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం పొందాలి. ఇవన్నీ డిసెంబరులోగా పూర్తి కావాల్సి వుంది. డిసెంబరులో బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం పొందాల్సివుంది. నేడు అవిశ్వాసం..? నిబంధనల ప్రకారం – పార్లమెంట్లో 15శాతం మంది (48మంది ఎంపీలు) అవిశ్వాస లేఖలు సమర్పిస్తే ప్రధాని సాధ్యమైనంత త్వరగా సభ విశ్వాసం పొంది తీరాలి. ఇప్పటికి 21 మంది ఎంపీలు అవిశ్వాస లేఖలు సమర్పించినట్టు ప్రకటించారు. అయితే, ఈ సంఖ్య 48కి చేరిందని కొందరు కన్జర్వేటివ్ బ్రెగ్జిటీర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం థెరిసా విశ్వాస పరీక్ష ముప్పును ఎదుర్కొంటున్నారు. ► నెట్సెన్ ఇటీవల జరిపిన సర్వే ప్రకారం – తాజాగా 59 శాతం మంది బ్రెగ్జిట్‌ను వ్యతిరేకిస్తున్నారు. (2016 జూన్ 23న జరిగిన రెఫరెండంలో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా 51.9 శాతం, వ్యతిరేకంగా 48.1 శాతం ఓట్లు వచ్చాయి). ► ఈయూలో ఉండటం వల్ల బ్రిటన్ నష్టపోతున్నదంటున్నారు బ్రెగ్జిటీర్లు.. రాజకీయ సంకోభాన్ని నివారించాలంటే మరో రెఫరెండానికి వెళ్లాల్సిందేనని, పార్లమెంట్ రెఫరెండానికే ఓటు వేస్తుందని కన్సర్వేటివ్ పార్టీ ‘పీపుల్స్ ఓట్’ క్యాంపెయినర్లు భావిస్తున్నారు. ► బ్రెగ్జిట్ ముసాయిదా ఉభయ పక్షాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉందంటున్నారు ఈయూ మధ్యవర్తి మైఖేల్ బెర్నర్. దీనిపై మరోసారి చర్చలు జరిపేది లేదని జర్మనీ చాన్సరల్ ఏంజెలా మెర్కెల్ తెలిపారు. ► ఈ ఒప్పందం బెస్ట్ డీల్.. ఒకవేళ బ్రెగ్జిట్ విషయంలో బ్రిటన్ వెనక్కి మళ్లినా అందుకు తాము సిద్ధమేనని అంటున్నారు ఈయూ అధ్యక్షుడు డొనాల్ట్ టస్క్. బ్రెగ్జిట్ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ► 2019 మార్చి 29 రాత్రి 11 గంటలకు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ అధికారికంగా నిష్క్రమిస్తుంది. తర్వాత మొదలయ్యే 21 మాసాల పరివర్తనా కాలంలో.. ఎటువంటి సుంకాలు లేకుండా ఈయూ–యూకే స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకోవచ్చు. ఈయూ నిబంధనలను బ్రిటన్ అనుసరించాల్సివుంటుంది. ► ఆర్థిక లావాదేవీల పరిష్కారంలో భాగంగా విడిపోయేటప్పుడు ఈయూకి బ్రిటన్ 39 బిలియన్ పౌండ్లు (5100 కోట్లు) చెల్లించాలి. ► పౌరుల నివాస హక్కులకు ఈ ఒప్పందం గ్యారెంటీ ఇస్తుంది. ఇప్పుడు వున్న చోటే చదువుకుని, ఉద్యోగాలు చేసే వీలుంటుంది. ► బ్రిటన్‌లో భాగంగా వున్న ఉత్తర ఐర్లాండ్ – ఈయూలో భాగంగా వున్న ఐర్లాండ్ మధ్య ప్రస్తుతానికి ఎలాంటి సరిహద్దు ఏర్పాటు చేయరు. రాకపోకలకు ఎలాంటి ఆంక్షలూ వుండవు. -
బ్రెగ్జిట్‌పై ముందుకే థెరెసా మే
లండన్: ప్రస్తుతం కుదిరిన బ్రెగ్జిట్ ఒప్పందంపై స్వపక్షం నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తున్నా తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ముందుకు సాగేందుకే బ్రిటన్ ప్రధాని థెరెసా మే మొగ్గుచూపుతున్నారు. పార్లమెంటులో అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమేనన్నారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై ప్రజల భయాలను పోగొట్టేందుకు వారడిగే ప్రశ్నలకు తానే జవాబుచెప్తానన్నారు. యురోపియన్ యూనియన్ (ఈయూ)తో థెరెసా కుదుర్చుకున్న బ్రెగ్జిట్ ఒప్పందం ముసాయిదా బుధవారం విడుదలైనప్పటి నుంచి మంత్రులు సహా కొందరు ఎంపీలు థెరెసాను వ్యతిరేకిస్తున్నారు. ఈ ఒప్పందం బ్రిటన్ ప్రజలకు మంచిదేననీ, తన దృక్పథంలో ఇది అత్యుత్తమ ఒప్పందమన్నారు. -
బ్రిటన్ ప్రభుత్వంలో ‘బ్రెగ్జిట్’ చిచ్చు
లండన్: బ్రిటన్ ప్రధాని థెరెసా మే తన సొంత పార్టీ ఎంపీల నుంచే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రెగ్జిట్ (యురోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడం) వ్యవహారంలో మే వైఖరిని వ్యతిరేకిస్తూ అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు థెరెసా మే ప్రభుత్వంపై గురువారం అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. అంతకుముందు ఈయూతో మే కుదుర్చుకుంటున్న బ్రెగ్జిట్ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మంత్రివర్గంలోని నలుగురు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ఒప్పందం అర్ధరహితంగా, బ్రిటన్‌కు నష్టం చేకూర్చేలా ఉందని వారంతా ఆరోపిస్తున్నారు. బ్రెగ్జిట్ ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభమై 20 నెలల్లో ముగిసేలా ఓ ఒప్పందాన్ని థెరెసా మే ఈయూ తో కుదుర్చుకుంటున్నారు. అందుకు సంబంధించిన ముసాయిదా బిల్లు బుధవారం రాత్రే విడుదలైంది. బిల్లులోని నిబంధనలపై తన నిరసన తెలుపుతూ మొదటగా భారత సంతతి వ్యక్తి, ఉత్తర ఐర్లాండ్ శాఖ మంత్రి శైలేశ్ వర తన పదవికి రాజీనామా చేశారు. థెరెసా మేపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై చర్చ చేపట్టాలంటే మే ప్రత్యర్థులకు ఆమె సొంత పార్టీ నుంచే కనీసం 48 మంది ఎంపీల మద్దతు కావాలి. వారు ఎలాగోలా ఇంత మందిని కూడగట్టినా.. మేను పదవి నుంచి దించడానికి మాత్రం 158 మంది మద్దతు అవసరం. అంతమంది మే ప్రత్యర్థుల వైపు లేరని తెలుస్తోంది. -
ఈయూపై ట్రంప్ కేసు వేయమన్నారు
లండన్: బ్రెగ్జిట్ విషయంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో చర్చలకు బదులు దానిపై కేసు వేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు సూచించారని బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఆదివారం వెల్లడించారు. నాలుగు రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా ట్రంప్ శుక్రవారం మేతో భేటీ అవ్వడం తెలిసిందే. అంతకు రెండ్రోజుల ముందు కూడా.. మే అనుసరిస్తున్న బ్రెగ్జిట్ వ్యూహాలను ట్రంప్ విమర్శించారు. శుక్రవారం సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ‘ఈయూతో ఎలా వ్యవహరించాలనే దానిపై నేను థెరెసాకు ఓ సలహా ఇచ్చాను. ఆమెకు అది బహుశా క్రూరమైనదిగా, చాలా క్లిష్టమైనదిగా అనిపించవచ్చు’ అని అన్నారు. ఆ సలహా ఏంటో చెప్పాలని ఓ విలేకరి ఆదివారం మేను కోరగా ‘నేను ఈయూతో చర్చలు జరపకుండా దానిపై కేసు వేయాలని ఆయన చెప్పా రు’ అని అన్నారు. అయితే తాను ఈయూతో చర్చలతోనే ముందుకెళ్తాననీ ఆమె చెప్పారు. -
మా బంధం అత్యంత ప్రత్యేకం
లండన్: అమెరికా–బ్రిటన్ల బంధం విడదీయరానిదనీ, చాలా ప్రత్యేకమైనదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. బ్రిటన్ ప్రధాని థెరెసా మే అనుసరిస్తున్న బ్రెగ్జిట్ వ్యూహాన్ని గతంలో విమర్శించిన ట్రంప్ తాజాగా మాట మార్చారు. మే బ్రెగ్జిట్ విధానాలు.. అమెరికా, బ్రిటన్ల మధ్య కుదరాల్సిన వాణిజ్య ఒప్పందాన్ని ‘చంపేసేలా’ ఉన్నాయని ట్రంప్ మూడ్రోజుల క్రితం ‘ద సన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అయితే ద సన్ ప్రతిక ప్రచురించిందంతా అబద్ధమని, అదో ‘ఫేక్ న్యూస్’ (నకిలీ వార్తలు) పత్రిక అని ట్రంప్ ఆరోపించారు. 4 రోజుల పర్యటన కోసం ట్రంప్ తొలిసారిగా బ్రిటన్ వచ్చారు. చర్చల తర్వాత ట్రంప్, థెరెసా మీడియాతో మాట్లాడారు. ‘బ్రెగ్జిట్ చాలా సంక్లిష్టమైంది. బ్రిటన్ ఏం చేసినా అమెరికాతో వ్యాపారం కొనసాగిస్తే చాలు’ అని ట్రంప్ అన్నారు. ట్రంప్ పర్యటనకు వ్యతిరేకంగా లండన్‌లో నిరసనలు చోటు చేసుకున్నాయి. -
బ్రిటన్‌లో ‘బ్రెగ్జిట్’ చిచ్చు
లండన్: బ్రిటన్ ప్రధాని థెరీసామే చిక్కుల్లో పడ్డారు. సోమవారం ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామా చేయడంతో.. బ్రిటన్ రాజకీయం వేడెక్కింది. బ్రెగ్జిట్ విషయంలో మే అనుసరిస్తున్న వ్యూహాలతో విభేదిస్తూ బ్రెగ్జిట్ మంత్రి డేవిడ్ డేవిస్ రాజీనామా చేయగా.. కాసేపటికే విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీలో బ్రెగ్జిట్ అనంతరం యురోపియన్ యూనియన్ దేశాలతో అనుసరించాల్సిన విధానంపై నిర్ణయాలు తీసుకున్న మూడ్రోజుల్లోపే ఇద్దరు సీనియర్ మంత్రులు రాజీనామా చేయడం సంచలనం సృష్టిస్తోంది. దీనికితోడు వీరిద్దరూ బ్రెగ్జిట్ విధానపర నిర్ణయాలనే కారణంగా చూపుతూ రాజీనామా చేయడంపై సర్వత్రా చర్చ మొదలైంది. థెరీసా మే రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. థెరీసా మే కేబినెట్లో బోరిస్‌కు బ్రెగ్జిట్ అనుకూల మంత్రుల పోస్టర్‌బాయ్‌గా పేరుంది. తిరుగుబాటు యోచన లేదు ప్రధాని థెరీసా మేతో విధానపరమైన అంశాల్లో విభేదాల కారణంగానే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు డేవిస్ ప్రకటించారు. ఈయూతో బ్రిటన్ ప్రభుత్వ చర్చల ప్రక్రియలో తనను సంప్రదించడంలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డేవిస్ వెల్లడించారు. అయితే, మేకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవనెత్తే ఆలోచన లేదని చెప్పారు. -
ఓటమికి నాదే కారణం, నన్ను క్షమించండి!
లండన్: గతవారం జరిగిన ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఎదురైన ఘోర పరాభవానికి బాధ్యురాలిని తానేనని బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే అంగీకరించారు. ఈ ఓటమికి బాధ్యత తనదేనని, ఇందుకు తనను క్షమించాలని ఆమె పార్టీ ఎంపీలను కోరారు. భారీ మెజారిటీని ఆశించి అవసరం లేకపోయినా ఎన్నికలకు వెళ్లి పార్లమెంటులో ఉన్న మెజారిటీని కూడా పోగొట్టుకున్న థెరిసా మేను బ్రిటన్ ప్రధాని పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన నాయకత్వంపై ఎంపీల విశ్వాసాన్ని కూడగట్టేందుకు ఆమె సోమవారం కన్జర్వేటివ్ ఎంపీలతో వెస్ట్ మినిస్టర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత గందరగోళానికి నేనే కారణం. నా వల్లే ఈ పరిస్థితి తలెత్తింది’ అని అన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ చర్చల నేపథ్యంలో అనూహ్యంగా ఎన్నికలకు వెళ్లిన థెరిసా మేకు ఘోరమైన ఎదురుదెబ్బ తగిలింది. దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో సాధారణ మెజారిటీకి 326 సీట్లు కాగా, గురువారం జరిగిన ఎన్నికల్లో థెరిసా మే నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 318 స్థానాలకే పరిమితమైంది. 10 చోట్ల గెలిచిన డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి థెరిసా మే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఈ సమావేశంలో నాయకత్వ మార్పుపై ఎలాంటి చర్చ, అభిప్రాయాలు వెల్లువడలేదని ఎంపీలు తెలిపారు. మరోసారి ప్రధానిగా థెరిసా మేను కొనసాగించాలని పార్టీలోని ఎక్కువమంది ఎంపీలు కోరుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినందువల్ల ఆమెను మార్చాలంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. థెరిసా మేను తొలగిస్తే.. తదుపరి ప్రధాని ఎవరన్న దానిపై కూడా ఊహగానాలు సాగుతున్నాయి. థెరిసా మేను ప్రధానిగా కొనసాగిస్తారా? లేక కొత్త వ్యక్తిని ప్రధానిగా నియమించే అవకాశముందా? అన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరముందని భావిస్తున్నారు. చదవండి:‘థెరిసా మే’ను తప్పిస్తారా? -
‘థెరిసా మే’ను తప్పిస్తారా?
భారీ మెజారిటీని ఆశించి అవసరం లేకపోయినా ఎన్నికలకు వెళ్లి పార్లమెంటులో ఉన్న మెజారిటీని కూడా పోగొట్టుకున్న థెరిసా మేను బ్రిటన్ ప్రధాని పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 650 స్థానాలున్న పార్లమెంటు దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌లో సాధారణ మెజారిటీకి 326 సీట్లు గెలవాలి. కానీ గురువారం జరిగిన ఎన్నికల్లో థెరిసా మే నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 318 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. 10 చోట్ల గెలిచిన డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ (డీయూపీ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి థెరిసా మే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినందువల్ల ఆమె నాయకత్వ సామాజిక మాధ్యమాల ద్వారా ఈమేరకు ప్రచారం చేస్తున్నారు. తదుపరి ప్రధాని ఎవరన్న దానిపై కూడా ఊహగానాలు సాగుతున్నాయి. బ్రిటన్‌లో అత్యంత ప్రభావంతమైన టాబ్లాయిడ్లలోనూ ఈ మేరకు కథనాలు వెలువడుతున్నాయి. కొందరు ఎంపీలతో మంతనాలు సాగిస్తూ లాబీయింగ్ సైతం చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద థెరిసా మే తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ చర్చలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ ప్రక్రియ సాఫీగా సాగి ఈయూతో ఒప్పందం కుదిరేదాకా... థెరిసా మేను కొనసాగించాలని కన్జర్వేటివ్ పార్టీలోని కొందరు పెద్దలు భావిస్తున్నారు. ఆరునెలలు సమయమిచ్చి... బ్రెగ్జిట్ కొలిక్కి వచ్చాక క్రిస్మస్ అనంతరం కొత్త నాయకుడిని ఎన్నుకోవడం మంచిదనేది వారి అభిప్రాయం. అవతలివైపు లేబర్ పార్టీ బలపడుతుండటం (గత ఎన్నికలతో పోలిస్తే గురువారం లేబర్ పార్టీ 29 స్థానాలు అధికంగా నెగ్గింది. ఆ పార్టీ బలం 261కి చేరింది) కూడా కన్జర్వేటివ్ పార్టీ సీనియర్లకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు థెరిసా మే నాయకత్వాన్ని సవాల్ చేసి... అంతర్గత కుమ్ములాటలతో ప్రభుత్వాన్ని నడపలేక చివరకు లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి రానివ్వకూడదనేది వీరి వాదన. నాయకులను అనూహ్యంగా సాగనంపుతుందనే పేరు కన్జర్వేటివ్ పార్టీకి ఉంది. కాబట్టి పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి. ప్రధాని పదవికి పోటీపడే వారిని ఎన్నుకోవడానికి మొదట కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో ఓటింగ్ నిర్వహిస్తారు. ప్రతి రౌండ్లో పోటీదారులందరిలోకి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని రేసు నుంచి తప్పిస్తారు. ఇలా చివరకు ఇద్దరు మిగిలేదాకా ఎంపీలు ఓటింగ్ చేస్తారు. ఈ ఇద్దరిలో ప్రధాని పదవి ఎవరు చేపట్టాలనే దాన్ని దాదాపు లక్షా యాభై వేల మంది పార్టీ సభ్యులు ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు. థెరిసా మేను తప్పించే పరిస్థితి వస్తే రేసులో ముందుండేదెవరు? వారి బలాబలాలేమిటో చూద్దాం. బోరిస్ జాన్సన్ 52 ఏళ్ల జాన్సన్ ‘బ్రెగ్జిట్’’కు అనుకూలంగా నిలబడి పూర్తి శక్తియుక్తులు ఒడ్డిన వాడు. ప్రస్తుతం విదేశాంగ మంత్రి. కన్జర్వేటివ్ ఎంపీల్లో జాన్సన్ నాయకత్వంపై అపనమ్మకం. పార్టీ సిద్ధాంతాలను కూడా కాదనే స్వతంత్ర భావాలున్న వ్యక్తిగా పరిగణిస్తారు. కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారీ లండన్ మాజీ మేయర్. బ్రెగ్జిట్‌లో ఓడిపోయి డేవిడ్ కామెరూన్ రాజీనామా చేశాక... బోరిస్ జాన్సన్యే తదుపరి ప్రధాని అవుతాడని అత్యధికులు విశ్వసించారు. అయితే బ్రెగ్జిట్ సహచరుడు, తనకు గట్టి మద్దతుదారుగా ఉన్న మైకేల్ గోవ్ అనూహ్యంగా ప్రధాని రేసులోకి రావడంతో జాన్సన్ తాను పోటీ నుంచి తప్పుకున్నాడు. ప్రధానిగా థెరిసా మేను తప్పిస్తారనే వార్తల నేపథ్యంలో... తాను ఆమెకు మద్దతు ఇస్తున్నట్లు జాన్సన్ ట్వీట్ చేశారు. ఫిల్ హమండ్ కన్జర్వేటివ్ పార్టీలో బలమైన నాయకుడు. ఆర్థికమంత్రిగా ఉన్న ఈయన ఎన్నికల్లో ఎదురుదెబ్బ తర్వాత మేకు వ్యతిరేకంగా గళమెత్తారు. డిప్యూటీ ప్రధానమంత్రిని నియమించాలని, థెరిసాకు సన్నిహితులైన ఇద్దరు మంత్రులను తప్పించాలని డిమాండ్ చేశారు. ఆ ఇద్దరు శనివారం రాజీనామా చేయడం పార్టీలో పెరుగుతున్న హమండ్ పలుకుబడికి నిదర్శనంగా భావిస్తున్నారు. బ్రెగ్జిట్‌ను పూర్తిచేసేందుకు కావాల్సిన అనుభవం ఈయనకు ఉందని నిపుణుల అభిప్రాయం. అయితే థెరిసా మేను ఎన్నికలకు వెళ్లమని ప్రోత్సహించిన వారిలో ఈయన ముఖ్యుడు. అంబర్ రూడ్ హోంశాఖను చూస్తున్న 53 ఏళ్ల అంబర్ రూడ్‌కు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశీలకుల అంచనా. ఇటీవలి కాలంలో బ్రిటన్‌లో జరిగిన ఉగ్రదాడుల సందర్భంగా ఈమె తన పనితీరుతో ప్రశంసలు అందుకున్నారు. కామెరూన్ రాజీనామా చేశాక ప్రధాని రేసులో థెరిసా మే పేరు పెద్దగా వినపడలేదు. కానీ నాటకీయ పరిణామాల మధ్య ఆమె ప్రధాని పదవి చేపట్టారు. నాడు థెరిసా మే ఉన్న స్థానంలో ఇప్పుడు అంబర్ రూడ్ ఉన్నారనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అయితే గురువారం నాటి ఎన్నికల్లో ఆమె అతితక్కువ మెజారిటీ (346 ఓట్లు)తో బయటపడ్డారు. ఇది ఆమెకు ప్రతికూలంగా కావొచ్చు. అలాగే ప్రధాని పదవిని చేపట్టడానికి కావాల్సిన అనుభవం, అర్హత ఆమెకు లేవని కన్జర్వేటివ్ పార్టీలోని ఓ వర్గం వాదన. డేవిడ్ డేవిస్ 2005లో ప్రధాని పదవికి ఫేవరెట్‌గా బరిలోకి దిగి అనూహ్యంగా కామెరూన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు బ్రెగ్జిట్ మంత్రిత్వశాఖను చూస్తున్నారు. ప్రధాని పదవికి రేసులో ఉంటానని మద్దతుదారుల ద్వారా ఎంపీలకు సంకేతాలు పంపుతూ లాబీయింగ్ చేస్తున్నారు.