లండన్: బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ కొద్ది రోజుల క్రితం బాధ్యతలు చేపట్టారు. 42 ఏళ్ల వయసున్న రిషి సునాక్.. 200 ఏళ్ల బ్రిటన్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా నిలిచారు. ఏ వేదికపై చూసినా ఎంతో ఫిట్‌గా, ఉత్సాహంగా కనిపిస్తారు. ఇంతకి ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్, డైట్ ప్లాన్ ఏంటి అనేది చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్న. ఆయన దిన చర్య, డైట్ ప్లాన్, ఫిట్‌నెస్ కోసం ఏం చేస్తారనేది ఆయనే వెల్లడించారు.
ఆరోగ్యకరమైన జీవితాన్ని సాధించేందుకు రిషి సునాక్ దిన చర్య ఎందరికో ఆదర్శవంతంగా ఉంటుంది. గత ఏడాది ‘ద ట్వంటీ మినట్ వీసీ పోడ్‌కాస్ట్ విత్ హ్యారీ స్టెబ్బింగ్స్’ కార్యక్రమం వేదికగా తన దినచర్య, ఆహార అలవాట్ల వంటి అంశాలను బహిర‍్గతం చేశారు రిషి సునాక్. తాను ఉదయం 6-7గంటలకు నిద్ర లేస్తానని, అది తాను చేయబోయే జిమ్‌ను బట్టి సమయం ఆధారపడి ఉంటుందని తెలిపారు.
‘శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు ఒక సెషన్ పెలోటన్, ఒక సెషన్ ట్రెడ్‌మిల్ వర్కౌట్ చేస్తా. అలాగే హెచ్‌ఐఐటీ క్లాస్ నిర్వహిస్తాను. అమెరికన్ ఫిట్‌నెస్ ట్రైనర్ కాడీ రగ్స్‌బైని అనుసరిస్తాను. ఆయనే నాకు చాలా కాలంగా ఫేవరెట్. నేను అడపా దడపా ఉపవాసం చేస్తాను. కొన్ని రోజులు అసలు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే ఉంటాను. ఉపవాసం రోజుల్లో గ‍్రీకు పెరుగు, బ్లూబెర్రీలను తీసుకుంటాను. ఆపై అల్పాహారంలో బన్, చాక్లెట్ వంటివి తీసుకుంటాను. వారాంతాలు శని, ఆదివారాల్లో ఇంట్లోనే వండిన వాటిని అల్పాహారంగా తీసుకుంటాము. అమెరికన్ స్టైల్‌లో పాన్‌కేక్స్ తయారు చేస్తాము.’ అని తెలిపారు రిషి సునాక్.
ఇదీ చదవండి: రిషి సునాక్ ఆప్యాయ పలకరింపు వీడియో.. ఇంతకీ ఆ ‘విజయ్ మామా’ ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment