workouts at gym
-
'ఎల్లప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలంటే'..!: ఇవాంక ట్రంప్ ఫిట్నెస్ మంత్ర..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా, తల్లిగా రెండు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే స్ట్రాంగ్ విమెన్. ముగ్గురు పిల్లల తల్లి అయినా.. ఆమె ఇప్పటకీ అంతే స్లిమ్‌గా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఆమె శరీరాకృతి చూస్తే 16 ఏళ్ల అమ్మాయే అన్నంత అందంగా ఉంటుంది. అంతలా టోన్డ్ ఫిజిక్‌ని మెయింటైన్ చేసేందుకు ఎలాంటి వర్కౌట్లు చేస్తుంటుందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఇవాంక. సాధారణ వ్యాయమాలతో సరిపెట్టెకుండా అలాంటి వర్కౌట్లు కూడా చేస్తే.. ఎప్పటికీ స్ట్రాంగ్‌గా ఉండగలమని అంటోంది. ఇంతకీ ఆమె విల్లులాంటి శరీరాకృతి కోసం ఎలాంటి వ్యాయామాలు చేస్తుందో తెలుసా..!.చాలామంది మహిళల మాదిరిగానే తాను కూడా కార్డియో, యోగా, పైలేట్స్ వంటి వర్కౌట్లపైనే దృష్టిసారిస్తానని ఆ వీడియోలో పేర్కొంది ఇవాంక. అయితే తన కండరాల బలం కోసం ప్రస్తుతం తాను వెయిట్ లిఫ్టింగ్ వర్కౌట్లపై శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఎప్పుడూ సాధారణ వ్యాయామాలే కాకుండా ఎల్లప్పుడు స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఇలాంటి వ్యాయామాలు కూడా చేయాలని చెబుతోంది. మన కండరాలు బలోపేతంగా ఉండేలా స్క్వాట్లు, డెడ్‌లిఫ్ట్‌లు, హింగ్లు, పుష్-పుల్ అప్స్ వంటి వర్కౌట్లు అవసరమని గట్టిగా విశ్వసిస్తానంటోంది ఇవాంక. స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఇలాంటివి ప్రతి మహిళ తప్పనిసరిగా చేయాలని చెబుతోంది. అంతేగాదు వర్కౌట్లలో అత్యంత కీలకమైనవి ఇవేనని పేర్కొంది. వారంలో నాలుగు రోజులు ఇలాంటి వ్యాయామాలకు కేటాయిస్తానని చెప్పారు. జిమ్‌కి వెళ్లడమే గాక ఆరు బయట సర్ఫింగ్ పాడిల్ టెన్నిస్, స్విమ్మింగ్, వేక్ సర్ఫింగ్, బ్రెజిలియన్ జియు-జిట్సు, హైకింగ్, వాకింగ్, గోల్ప్ వంటి వాటిల్లో కూడా పాల్గొంటానని అన్నారు. తాను రొటీన్ వ్యాయామాలతో సరిపెట్టనని గేమ్‌చేంజర్‌లా వివిధ వ్యాయామాలపై దృష్టిపెడతానని చెప్పారు. తాను శరీరాకృతి విల్లులా ఉండేలా.. అత్యంత బలంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెబుతోంది ఇవాంక. అందుకు అంకితభావంతో కూడిన నిబద్ధత అవసరమని చెప్పారు. అలా క్రమతప్పకుండా వర్కౌట్లు చేస్తే మంచి ఫిట్నెస్ లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని అంటోంది. అలాగే వీడియోలో అందర్నీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిట్‌గా ఉండమని కోరింది ఇవాంక. View this post on Instagram A post shared by Ivanka Trump (@ivankatrump) (చదవండి: బెల్ట్‌లు, చెప్పులతో కొట్టేవారు: ఆయుష్మాన్ ఖురాన్! బాల్యం భారంగా మారకూడదంటే..) -
నమ్రతా భారీ వర్కౌట్స్ చూస్తే షాక్, ఫ్యాన్స్ ఫిదా!
టాలీవుడ్లో పరిచయం అవసరంలేని అందమైన జంట ప్రిన్స్ మహేష్ బాబు, నటి నమ్రతా శిరోద్కర్ది. పెళ్లి తరువాత నటనకు గుడ్ బై చెప్పి నమ్రత కుటుంబ బాధ్యతలను చూసుకుంటోంది. వీరి ముద్దుల తనయ సితార నటిగా, మోడల్‌గా ఇప్పటికే తన హవాను చాటుకుంటోంది. అయితే తాజాగా నమ్రత వర్కౌవుట్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో సందడి చేస్తోంది. దీంతో వదినమ్మ ఎందుకింత కసరత్తు చేస్తోందంటూ ఫ్యాన్స్ చేస్తున్న ఊహాగానాలు వైరల్‌గా మారాయి.2004 నుండి పెద్ద స్క్రీన్కు దూరంగా ఉన్నారు నమ్రత. అయితే సోషల్ మీడియా అభిమానులకు అప్డేట్స్ మాత్రం అస్సలు మర్చిపోదు. భర్త , సూపర్ స్టార్ మహేష్ బాబు, పిల్లలు సితార గౌతమ్ గురించి తరచుగా పోస్ట్ చేస్తుంది. తాజాగా మాజీ మిస్ ఇండియా ఇటీవల ఒక రీల్‌ను షేర్ చేసింది. ఆమె భారీ వర్కౌట్ సెషన్ చూసి అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు.ఫిట్నెస్ కోసం ఆమె చేస్తున్న పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ‘‘బలమైన మహిళ!!’’ ‘‘సూపర్ వుమన్’’, , ‘‘వావ్’’, ‘‘బ్యూటిఫుల్’’ , ‘‘సూపర్ మామ్’’ అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) కాగా నమ్రతా గతంలో వివిధ సందర్భాలలో వర్కౌట్ వీడియోలను షేర్ చేసింది. గత ఏడాది మేలో, ట్రైనర్ కుమార్ మన్నవతో కలిసి హార్డ్‌కోర్ వ్యాయామాలు చేస్తున్న వీడియోను పోస్ట్ చేయడంతో ఆమె మళ్ళీ నటించనుందనే ఊహాగానాలకు దారితీసిన సంగతి తెలిసిందే. -
రష్మిక కసరత్తు మామూలుగా లేదుగా...! వీడియో వైరల్
టాలీవుడ్, బాలీవుడ్ అంతటా తన సత్తా చాటుకుంటున్న స్టార్ హీయిన్ రష్మిక మందన్న ఫిట్నెస్ కోసం తెగ కష్టపడుతోంది. మండు వేసవిలో జిమ్‌లో చెమటలు కక్కుతోంది. జిమ్‌లో కసరత్తు చేస్తున్న నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. నేషనల్ క్రష్ వీడియో చేసి ఫ్యాన్స్ అంతా అబ్బురపడుతున్నారు. హీరోయిన్గా నిలదొక్కుకోవాలంటే... ఆ మాత్రం చేయాల్సిందే.. కీప్ గోయింగ్ అంటూ కమెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎపుడూ ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉండే ఈ భామ తాజాగా వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోలనుచాలాపోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన సమంత కూడా ఇలాంటి వీడియోలను గతం చాలా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా గంటల తరబడి జిమ్ చేయడం, కష్టమైన వర్కవుట్స్ చేయడం ఆమెకి బాగా అలవాటు. ఆమె బాడీ చూస్తే ఈ విషయం ఇట్టే అర్థం అవుతుంది. కరియర్ పరంగా చూస్తే సూపర్, డూపర్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంటోంది. ఇటీవల పుష్ప, యానిమల్ లాంటి సినిమాలతో అటు సౌత్, ఇటు నార్త్‌లోనూ బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కాంబోలో పుష్ప2లో మరోసారి తన హవా చాటుకునేందుకు సిద్దమవుతోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
జిమ్‌లో హీరోయిన్ కసరత్తులు.. ఆశ్చర్యపోయిన భర్త !
నటి జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీనియర్ నటి నగ్మా చెల్లెలుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె తెలుగు, తమిళంలో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్గా కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉండగానే తమిళ స్టార్ హీరో సూర్యను ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చిన జ్యోతిక ప్రస్తుతం కుటుంబంతో కలిసి ముంబయిలో ఉంటోంది. (ఇది చదవండి: 'ప్రతి అమ్మాయితో రాఖీ కట్టించుకుంటే పాపం'.. ఆసక్తిగా ట్రైలర్ ) తాజాగా జ్యోతిక జిమ్‌లో చేసిన కసరత్తులను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారామె. ఆ వీడియోలో స్టన్నింగ్ వర్కవుట్స్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఇది చూసిన సూర్య సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మై వండర్ వుమెన్ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో జ్యోతిక జిమ్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం జ్యోతిక జిమ్‌లో కసరత్తులు చేస్తూ చెమడ్చోతున్న వీడియో తెగ వైరలవుతోంది. అంతేకాకుండా ఈ వీడియోకు భాగ్ మిల్కా భాగ్ చిత్రంలోని జిందా పాటను జోడించింది. కాగా.. జ్యోతిక వెంకట్ ప్రభు దర్శకత్వం తెరకెక్కించబోయే దళపతి-68లో విజయ్‌తో కలిసి నటించనున్నట్లు సమాచారం. గతంలో ఈ జంట 'కుషి', 'తిరుమలై' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించారు. మరోవైపు రాజ్‌కుమార్ రావు రాబోయే చిత్రం శ్రీలో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా అజయ్ దేవగన్ నటిస్తోన్న థ్రిల్లర్ మూవీలో కనిపించనుంది.ఈ చిత్రంలో ఆర్ మాధవన్ కీలక పాత్రలో నటించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కంగువ షూటింగ్లో బిజీగా ఉన్నాడు సూర్య. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో దిశా పటాని హీరోయిన్గా నటిస్తోంది. (ఇది చదవండి: విషాదం.. యంగ్ టైగర్ వీరాభిమాని మృతి) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
దేవర మూవీ కోసం ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్...
-
వైరల్ వీడియో : సిక్స్‌ప్యాక్ కోసం జిమ్ లో తెగ కష్టపడుతున్న పిల్లి
-
రిషి సునాక్ ఫిట్నెస్ సీక్రెట్, డైట్ ప్లాన్ ఏంటో తెలుసా?
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ కొద్ది రోజుల క్రితం బాధ్యతలు చేపట్టారు. 42 ఏళ్ల వయసున్న రిషి సునాక్.. 200 ఏళ్ల బ్రిటన్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా నిలిచారు. ఏ వేదికపై చూసినా ఎంతో ఫిట్‌గా, ఉత్సాహంగా కనిపిస్తారు. ఇంతకి ఆయన ఫిట్నెస్ సీక్రెట్, డైట్ ప్లాన్ ఏంటి అనేది చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్న ప్రశ్న. ఆయన దిన చర్య, డైట్ ప్లాన్, ఫిట్నెస్ కోసం ఏం చేస్తారనేది ఆయనే వెల్లడించారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని సాధించేందుకు రిషి సునాక్ దిన చర్య ఎందరికో ఆదర్శవంతంగా ఉంటుంది. గత ఏడాది ‘ద ట్వంటీ మినట్ వీసీ పోడ్కాస్ట్ విత్ హ్యారీ స్టెబ్బింగ్స్’ కార్యక్రమం వేదికగా తన దినచర్య, ఆహార అలవాట్ల వంటి అంశాలను బహిర్గతం చేశారు రిషి సునాక్. తాను ఉదయం 6-7గంటలకు నిద్ర లేస్తానని, అది తాను చేయబోయే జిమ్‌ను బట్టి సమయం ఆధారపడి ఉంటుందని తెలిపారు. ‘శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు ఒక సెషన్ పెలోటన్, ఒక సెషన్ ట్రెడ్మిల్ వర్కౌట్ చేస్తా. అలాగే హెచ్ఐఐటీ క్లాస్ నిర్వహిస్తాను. అమెరికన్ ఫిట్నెస్ ట్రైనర్ కాడీ రగ్స్బైని అనుసరిస్తాను. ఆయనే నాకు చాలా కాలంగా ఫేవరెట్. నేను అడపా దడపా ఉపవాసం చేస్తాను. కొన్ని రోజులు అసలు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే ఉంటాను. ఉపవాసం రోజుల్లో గ్రీకు పెరుగు, బ్లూబెర్రీలను తీసుకుంటాను. ఆపై అల్పాహారంలో బన్, చాక్లెట్ వంటివి తీసుకుంటాను. వారాంతాలు శని, ఆదివారాల్లో ఇంట్లోనే వండిన వాటిని అల్పాహారంగా తీసుకుంటాము. అమెరికన్ స్టైల్లో పాన్‌కేక్స్ తయారు చేస్తాము.’ అని తెలిపారు రిషి సునాక్. ఇదీ చదవండి: రిషి సునాక్ ఆప్యాయ పలకరింపు వీడియో.. ఇంతకీ ఆ ‘విజయ్ మామా’ ఎవరు? -
జిమ్‌లో తెగ కష్టపడుతున్న వరుణ్ తేజ్
Varun Tej Workout Video: హీరోలు ఒక్కో సినిమాకు ఒక్కో స్టైల్ మెయింటెన్ చేస్తుంటారు. యాక్షన్ సినిమాకు ఒక రకంగా, మాస్ సినిమాకు మరో రకంగా, ఫ్యామిలీ డ్రామాకు ఇంకో విధంగా.. ఇలా జానర్‌ను బట్టి, ఎంచుకున్న కథను బట్టి హీరో తన శరీరాకృతిని మార్చుకోక తప్పదు. అందులోనూ క్రీడా నేపథ్యం ఉన్న సినిమా అయితే బాడీని మరింత సానబెట్టాల్సిందే! కొణిదెల వారసుడు వరుణ్ తేజ్ కూడా ఇప్పుడదే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఇతడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'గని' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా! ఇందులో వరుణ్ బాక్సర్‌గా రింగులోకి దిగి ఫైట్ చేయనున్నాడు. ఇందుకుగానూ కండలు పెంచడం కోసం జిమ్‌లో చెమటలు చిందిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'హార్డ్వర్క్కు బ్యాక్ అప్ అంటూ ఉండదు' అని క్యాప్షన్ ఇచ్చిన ఈ వీడియోలో వరుణ్ బాగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయూ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా తమన్నా స్పెషల్ సాంగ్‌లో నర్తించే అవకాశం ఉందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు సమాచారం. No back-ups for hard work!🥊#Ghani#MondayMotivaton pic.twitter.com/XqXLlVXXnJ — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) August 2, 2021 -
‘4 నెలల్లో 26 కిలోల బరువు తగ్గాను’
రోజులో ఓ రెండు గంటల సమయం వ్యాయామానికి కేటాయిస్తే శారీరకంగానూ.. మానసికంగానూ బలంగా ఉండొవచ్చని సూచిస్తున్నారు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. కొత్తగా తల్లైన వారు బరువు పెరగడం సహజమని... అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. ఇజహాన్‌కు జన్మనిచ్చిన రెండున్నర నెలల తర్వాత తాను వర్కౌట్ చేయడం ప్రారంభించానని పేర్కొంటూ.. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 26 కిలోలు తగ్గాను... ‘ప్రసవం తర్వాత ఆరోగ్యంగా.. ఫిట్‌గా ఉండటానికి నేను చేసిన వర్కౌట్ల గురించి చాలా మంది నన్ను అడిగారు. వాళ్ల కోసమే ఈ వీడియోలు పోస్ట్ చేస్తున్నా. గర్భవతిగా ఉన్న సమయంలో దాదాపు 23 కిలోల బరువు పెరిగాను. ప్రసవం తర్వాత బరువు తగ్గేందుకు కఠినంగా శ్రమించాను. అలా 4 నెలల్లో 26 కిలోలు తగ్గాను. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మునుపటి ఆకృతి పొందాలని చాలా మంది భావిస్తారు. ఇది కేవలం అందానికి సంబంధించిన విషయం కాదు. శారరీక, మానసిక ఆరోగ్యానికి సంబంధించినది. డియర్ లేడీస్ మీరు చేయాలని సంకల్పించుకుంటే తప్పక చేస్తారు. నన్ను నమ్మండి.. రోజుకు గంట లేదా 2 గంటల సమయాన్ని వ్యాయామానికి కేటాయించండి. ఇజహాన్ పుట్టిన తర్వాత రెండున్నర నెలలకు నేను కసరత్తులు చేయడం ప్రారంభించాను’ అంటూ సానియా మీర్జా తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోలు షేర్ చేశారు. ఈ క్రమంలో సానియా వీడియోలకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది. సూపర్ సానియా. ఇలాంటి వీడియోలు షేర్ చేసినందుకు థ్యాంక్యూ. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాల్సిన ఆవశ్యకతను బాగా చెప్పారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా గతేడాది అక్టోబరులో క్రీడా దంపతులు సానియా మీర్జా- షోయబ్ మాలిక్ మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram We had documented little ‘tid bits from my post pregnancy journey back to being and feeling healthy and fit again .. I’ve been asked bout my ‘weight loss’ journey sooo many times .. how? When? Which? Where ? So I’ll try to post some of it here everyday or every few days .. I put on 23 kilos when I was pregnant and have managed to lose 26 in span of 4 months or so .. with a lot of hard work ,discipline and dedication .. I read msgs from women allll the time as to how they find it so difficult to come back to ‘normalcy’ after child birth and don’t take care of themselves or don’t find the motivation or inspiration .. Ladies, I just wanna say ... if I can do it then anyone else can too .. believe me that one hour or 2 hours a day to yourself will do wonders to you physically but sooo much mentally as well .. ❤️ remember - #Mummahustles 🙃 Ps- this is me after losing a bit of weight already after Izhaan was born .. roughly 2 and a half half months after I delivered .. A post shared by Sania Mirza (@mirzasaniar) on Sep 24, 2019 at 1:23am PDT -
ఏయ్ చహల్.. ప్రోటీన్ పౌడర్ తీసుకో!
టీమిండియా యువ క్రికెటర్లు సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. వారికి సంబందించిన ప్రతీ అప్డేట్స్ని అభిమానులతో పంచుకుంటారు. సహచర ఆటగాళ్లతో సరదా సన్నివేశాలు, ఫన్నీ వీడియోలు, వర్కౌట్ వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తుంటారు. అయితే తాజాగా టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో తెగ ట్రోల్ అవుతోంది. ఇక వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్ సైతం ‘దేవుడా సహాయం చేయ్’ అంటూ చహల్‌పై సెటైర్ వేశాడు. ఆ వీడియోలో ఏముందంటే.. కీలక ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా సెషన్ల వారిగా ప్రాక్టీస్ చేస్తూ టీమిండియా ఆటగాళ్లు చెమట చిందిస్తున్నారు. దీనిలో భాగంగా చహల్ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ‘బక్కపలచగా ఉండే చహల్ రోజు ప్రోటీన్ పౌడర్ తీసుకో’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సందిస్తున్నారు. ‘నువ్వు ఎంత ట్రై చేసినా గేల్లా బాడీ పెంచలేవు’ అంటూ మరికొందరు ఫన్నీగా స్పందిస్తున్నారు. View this post on Instagram Trying to UP the game down under #stayahead #IndvsAus A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on Nov 20, 2018 at 3:46am PST -
111 ఏళ్ల వయసులో రోజూ వర్కవుట్లు..
కాలిఫోర్నియా : అరవై దాటగానే అంతా అయిపోయిందని నిట్టూర్చే రోజుల్లో 111 ఏళ్ల వయసులోనూ ఈ తాత రోజూ వర్కవుట్లు చేస్తూ యువతకే సవాల్ విసురుతున్నారు. ఈ బైక్‌పై రోజూ 30 నిమిషాలు సవారీ చేసే 111 సంవత్సరాల హెన్రీ సెంగ్ ఇప్పటికీ రోజూ జిమ్‌లో కసరత్తులు చేస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. జపాన్‌లోని యొకొహమాలో జన్మించిన హెన్రీ 1975 నుంచి లాస్ఏంజెల్స్లో స్ధిరపడ్డారు. వ్యాపారవేత్తగా విజయం సాధించిన హెన్రీ రిటైర్మెంట్ జీవితాన్ని ఆస్వాదిస్తూ నిత్యం చురుకుగా ఉండటమే ఆయన ఆరోగ్య రహస్యంగా చెబుతారు. హెన్రీ తన 80 ఏళ్ల వయసులో శీర్షాసనం వేసేవారని, 90 ఏళ్ల వయసులో ఉదయం ఆరున్నర గంటలకే ఏరోబిక్ క్లాస్‌లకు వెళ్లేవారని కుటుంబ సభ్యులు చెప్పారు. హెన్రీ యువకుడిగా ఉన్నప్పుడు స్విమ్మింగ్‌తో పాటు అవుట్డోర్ స్పోర్ట్స్‌ను ఇష్టపడేవారని ఆయన కుమార్తె లిండా అన్నారు. ఇప్పటికీ ఆయన రోజూ 30 నిమిషాల పాటు ఈ బైక్‌పై వ్యాయామం చేస్తారని, వీల్‌ఛైర్‌లోనే యోగ విన్యాసాలతో పాటు ఒత్తిడిని అధిగమించే కసరత్తులు చేస్తారని చెప్పారు. తమ తల్లితండ్రులు ఎన్నడూ మద్యం, పొగతాగడానికి దూరంగా ఉండేవారని, ఆరోగ్యకర జీవితాన్ని ఆస్వాదించారని చెప్పారు. నిత్యం వ్యాయామం చేస్తూ సానుకూల దృక్పథంతో జీవించే వారు విజయం సాధిస్తారని హెన్రీ సెంగ్ చెబుతారు. హెన్రీ ఆహారం ఇదే.. ఉదయాన్నేబ్రేక్ఫాస్ట్లో రెండు బాయిల్డ్ ఎగ్స్, ద్రాక్ష పండ్లు, ఒక అరటిపండు, బ్రెడ్, ఓట్స్, ఆరంజ్ జ్యూస్ తీసుకుంటారు. లంచ్‌కు ఇటాలియన్, చైనీస్, మెక్సికన్ ఫుడ్‌ను ఇష్టపడతారు. స్టార్‌బక్స్‌లో స్నాక్స్ ఆరగిస్తారు. ఇక రాత్రి డిన్నర్లో ఉడకబెట్టిన చికెన్, గ్రౌండ్ బీఫ్, పోర్క్, ఆమ్లెట్లు, సూప్‌ను రొటేషన్ కింద రోజుకో ఐటెమ్‌గా తీసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్‌ను భారీగా, లంచ్‌ను అధికంగా, డిన్నర్‌ను మితంగా ముగించడంతో పాటు నిత్యం సంతోషంగా ఉండటం, సానుకూల దృక్పదంతో ముందుకు సాగుతుండటమే తన ఆరోగ్య రహస్యమని, వీటికి మించి ఎప్పుడూ చెదరని చిరునవ్వే తానింత కాలం ఆరోగ్యంగా బతకడానికి కారణమంటారు హెన్రీ. -
సూపర్ బ్యాలెన్స్
‘వ్యాయామం అంటే శరీరాన్ని బలంగా తయారు చేసుకోవడమే కాదు క్రమశిక్షణను అలవరచుకోవడం’ అని ఓ సందర్భంలో సమంత అన్నారు. అన్నట్లుగానే వర్కౌట్స్ చేయడంలో ఆమె రాజీ పడటంలేదు. ఎంతలా వ్యాయామాలు చేస్తారంటే ఎంత బరువైనా అవలీలగా మోసేంత. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 కేజీల బరువు ఎత్తారు. ఇక్కడున్న ఫొటోలో గమనించవచ్చు. అంత బరువును మోయాలంటే బాడీని ఎంతో బ్యాలెన్స్ చేయాలి, అలాగే చేశారు సమంత. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ఆమె నటించిన ‘రంగస్థలం, మహానటి, అభిమన్యుడు’ చిత్రాలు రిలీజైన సంగతి తెలిసిందే. తమిళ చిత్రాలు ‘సీమరాజా, సూపర్ డీలక్స్’, తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ‘యు టర్న్’ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అలాగే పెళ్లి తర్వాత భర్త నాగచైతన్యతో కలిసి ఆమె నటించబోయే సినిమా ఈ నెల 23న స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి శివనిర్వాణ దర్శకత్వం వహిస్తారు. ఇలా ఓన్లీ వర్కౌట్స్లోనే కాదు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ సమంత సూపర్ బ్యాలెన్స్ చూపిస్తున్నారు. ∙వెయిట్‌లిఫ్టింగ్ చేస్తూ... -
నా అందమంతా కరిగిపోతుందా?
సమంతకు ఈ మధ్య పెద్ద బెంగ పట్టుకుంది. జిమ్‌లో కసరత్తులు చేస్తే తన అందం ఏమైపోతుందోనని ఆమె భయపడుతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో చేసే అవకాశం వచ్చిన సమంతను.. కొన్నాళ్లు రోజు జిమ్‌కు వెళ్లమని చెప్పారట. దాంతో అంతకుముందు ఇలాగే కసరత్తులు చేసి రూపాన్ని పూర్తిగా మార్చేసుకున్న ప్రియాంకా చోప్రా లాంటివాళ్లు ఆమె కళ్లముందు కదలాడారు. తాను కూడా వాళ్లలాగే చేయాల్సి వస్తే తన గతేంటని ఈ అమ్మడు తెగ భయపడిపోతోంది. అందుకే జిమ్‌కు వెళ్లినా కూడా అక్కడ వర్కవుట్లు చేయకుండా.. ఇదుగో ఇలా ఒక మూల కూర్చుండిపోయింది. టీషర్టు, త్రీఫోర్త్ వేసుకుని.. కాళ్లకు స్పోర్ట్స్ షూ తగిలించి, చేతులకు వర్కవుట్ గ్లోవ్స్ కూడా వేసుకున్నా కూడా.. ఏమీ చేయకుండా ఉండిపోయింది. అంతేనా, అలా కూర్చున్న ఫొటోతో ట్వీట్ కూడా పెట్టేసింది. All those pics of stars at the gym with their six packs and chiseled bodies bringing you down. Look MEEEEEE!!! Sniff pic.twitter.com/lASiF1jIgl — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) November 18, 2014