టాలీవుడ్, బాలీవుడ్ అంతటా తన సత్తా చాటుకుంటున్న స్టార్ హీయిన్ రష్మిక మందన్న ఫిట్‌నెస్ కోసం తెగ కష్టపడుతోంది. మండు వేసవిలో జిమ్‌లో చెమటలు కక్కుతోంది. జిమ్‌లో కసరత్తు చేస్తున్న నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. నేషనల్ క్రష్ వీడియో చేసి ఫ్యాన్స్ అంతా అబ్బురపడుతున్నారు. హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలంటే... ఆ మాత్రం చేయాల్సిందే.. కీప్ గోయింగ్ అంటూ కమెంట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎపుడూ ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉండే ఈ భామ తాజాగా వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గతంలో జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోలనుచాలాపోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన సమంత కూడా ఇలాంటి వీడియోలను గతం చాలా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా గంటల తరబడి జిమ్ చేయడం, కష్టమైన వర్కవుట్స్ చేయడం ఆమెకి బాగా అలవాటు. ఆమె బాడీ చూస్తే ఈ విషయం ఇట్టే అర్థం అవుతుంది.
కరియర్ పరంగా చూస్తే సూపర్, డూపర్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటోంది. ఇటీవల పుష్ప, యానిమల్ లాంటి సినిమాలతో అటు సౌత్, ఇటు నార్త్‌లోనూ బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కాంబోలో పుష్ప2లో మరోసారి తన హవా చాటుకునేందుకు సిద్దమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment