మూడు ముళ్లూ పడగానే శోభిత ఎమోషనల్‌, నాగ్‌ భావోద్వేగ సందేశం | Sobhita Dhulipala Wipes Tears As Naga Chaitanya Makes Her Wear A Mangalsutra During Wedding | Sakshi
Sakshi News home page

మూడు ముళ్లూ పడగానే శోభిత ఎమోషనల్‌, నాగ్‌ భావోద్వేగ సందేశం

Published Thu, Dec 5 2024 12:50 PM | Last Updated on Thu, Dec 5 2024 3:13 PM

Sobhita Dhulipala Wipes Tears As Naga Chaitanya Makes Her Wear A Mangalsutra During Wedding

వివాహం అనేది ప్రతీఅమ్మాయికి ఒక అందమైన అనుభూతి. బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రో ఛ్చారణల మధ్య మెడలో పవిత్రమైన మూడు ముళ్లూ పడే సందర్భంకోసం  వేయి కళ్లతో ఎదురు చూస్తారు. ఈ క్షణాల్లో భావోద్వేగాన్ని అదుపుచేసుకోవడం చాలా కష్టం. అక్కినేని వారి ఇంట పెళ్లి సందడిలో ఇలాంటి దృశ్యాలు నెట్టింట హాట్‌ టాపిక్‌గా నిలిచాయి.

సోషల్‌ మీడియాలో  శోభిత ధూళిపాళ, నాగచైతన్య  మూడుముళ్ల వేడుకకు సంబంధించిన ఫోటోలు తెగ సందడి చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో (డిసెంబర్ 4, 2024న) అంగరంగ వైభవంగా ముగిసాయి. ఈ సందర్భంగా నాగ చైతన్య , తన మెడలో మంగళసూత్రాన్ని కడుతున్న సందర్భంలో  శోభిత ఎమోషనల్‌ అయింది. మంగళసూత్రాలను  తనివితీరా చూసుకుంటూ ఆనందంతో కళ్లనీళ్లు పెట్టుకుంది. ఈ  దృశ్యాలు అభిమానులను హత్తుకున్నాయి. <

మంగళ సూత్ర ధారణ సందర్భంగా ముత్తయిదువలు  ఈలలు వేస్తూ, తెగ అల్లరి చేశారు.  ఇది చూస్తూ అలాగే నాగ చైతన్య తండ్రి, నాగార్జున  మురిపెంగా నవ్వుకున్నారు. . నాగార్జునతో పాటు వెంకటేష్ దగ్గుబాటి, దగ్గుబాటి సురేష్ బాబుతోపాటు ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న చైతన్య సోదరుడు అఖిల్ అక్కినేని కూడా ఈలలతో తెగ ఎంజాయ్‌ చేసిన దృశ్యాలు ఆకట్టు కుంటున్నాయి.  

అలాగే చే శోభిత పెళ్లిపై ఒక ప్రకటన చేశారు నాగార్జున.  ట్విటర్‌లో ఒక  భావోద్వేగ సందేశాన్ని కూడా పోస్ట్‌ చేశారు. "ఈ రోజు మాపై కురిపించిన అమితమైనఆశీర్వాదాలకు, ప్రేమకు కృతజ్ఞతలు. శోభిత-చే కలిసి ఈ అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం ఒక ప్రత్యేకమైన , భావోద్వేగ క్షణం. నా ప్రియమైన చేకి అభినందనలు,  డియర్‌  శోభిత-  మా కుటుంబంలోకి స్వాగతం. నువ్వు ఇప్పటికే  మా జీవితాల్లో  ఎనలేని సంతోషాన్ని నింపావు" అంటూ ట్వీట్‌ చేయడం విశేషం. పసుపు బట్టల్లో , శోభిత , చే పెళ్లి కళ్ల ఉట్టిపడేలా  కనిపిస్తున్న ఫోటోలు  వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో  తెగవైరల్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement