Siddu Jonnalagadda : అవమానాలు, అవహేళనలే, వంద కోట్లకు బాటలు వేశాయ్‌! | Tillu Square Hit tollywood hero Siddu Jonnalagadda success story | Sakshi
Sakshi News home page

Siddu Jonnalagadda : అవమానాలు, అవహేళనలే, వంద కోట్లకు బాటలు వేశాయ్‌!

Published Sun, Apr 7 2024 6:30 AM | Last Updated on Mon, Apr 8 2024 10:01 AM

Tillu Square Hit tollywood hero Siddu Jonnalagadda success story - Sakshi

కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ సినిమాలకు అలవాటు  పడిపోయాం.  ఈ  సమయంలో  అతిచిన్న బడ్జెట్‌లో అద్భుతంగా తీసిన తమిళం,మళయాలం, తదితర కొన్ని భాషల సినిమాల మ్యాజిక్‌ను చూసి ఔరా అనుకున్నాం. గుండెలదిరిపోయే బీజీఎంలు, థియేటర్లలో సీటీలు కొట్టించే హీరోల ఎలివేషన్‌లు ఇవేవీ ఉండవు.  విదేశాల్లో షూటింగ్‌లు, ఫైటింగులూ చేజింగ్‌లూ అంతకన్నా ఉండవు. చాలా సింపుల్‌గా సూటిగా ప్రేక్షకుడి మనసులో విషయం దూరిపోతుంది. ఒక్కోసారి మౌనంగా రోదిస్తాం.. మరోసారి సినిమాలోని సీన్లతో రోజంతా అలా ప్రయణిస్తూనే ఉంటాం. ఇదంతా ఎందుకంటే.. తాజాగా ల-బడ్జెట్‌  సినిమా అయినా.. కంటెంట్‌ ఉంటే చాలు నిరూపించాడు  ‘టిల్లూ స్క్వేర్’ మూవీతో డీజే టిల్లు.. సిద్ధూ జొన్నలగడ్డ. 

 కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన  ఒక తెలుగు సినిమా  వంద కోట్ల రూపాయల బాక్సాఫీస్‌ రికార్డు దిశగా దూసుకుపోతోంది.  అదే  ‘టిల్లూ స్క్వేర్’. డీజే టిల్లూ సినిమాతో హిట్‌ కొట్టి ఆ పేరుతోనే పాపులర్‌ అవుతున్న హీరో సిద్ధూ జొన్న‌ల‌గడ్డ.రింగుల జుట్టు, టిపికల్‌ స్టయిల్‌, ఊర మాస్‌ డైలాగులతో జనాలను పొట్ట చేత పట్టుకునేలా (పడీ.. పడీనవ్వలేక) చేస్తున్నాడు. కాస్త గ్యాప్‌ ఇవ్వు బ్రో అని ప్రేక్షకులు అంటున్నారంటేఘీ  స్టార్‌ బోయ్‌.. రేంజ్‌ను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు రింగుల జుట్టు సుందరి,కేరళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్  ఈ సినిమాకు పెద్ద ఎసెట్‌.  మొత్తానికి టిల్లు , లిల్లీ  బాక్సాఫీసును షేక్ చేస్తున్నారు.   

క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి, ఒక్కో మెట్టు ఎక్కుతూ, టాలీవుడ్‌లో హీరోగా ఎదిగిన తానేంటో నిరూపించుకున్న యంగ్‌ హీరో  టాలెంటెడ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ.  స్టైలిష్ లుక్, భాషతో  ‘డీజే టిల్లు’ మూవీతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు.  యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు.  అయితే ఈ స్టార్‌డం అంత ఈజీగా రాలేదు.  ఈ స్థాయికి రావడానికి 12 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. ఎన్నో కష్టాలు...మరెన్నో అవమానాలు. కెరీర్ మొదట్లో చాలా అవమానాలు ఎదుర్కొన్నాననీ, ముఖ్యంగా తన ముఖం మీద ఉన్న మచ్చల గురించి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అన్న మాటలు ఇప్పటికీ తనను బాధిస్తాయని ఒక సందర్భంగా సిద్ధూ గుర్తు చేసుకున్నాడు.

కానీ ఆ మాటలు అతనిలో  కసి పెంచాయి. కంట తడిని ఒత్తుకున్నాడు.. ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు ఫిక్స్‌ అయిపోయాడు. సక్సెస్ కొట్టాడు. సిద్దూ కేవలం నటుడు మాత్రమే..అవసరమైతే రైటర్‌.. డైరెక్టర్‌ ఏ అవతారమైనా ఎత్తేస్తాడు. ఎందుకంటే లో-బడ్జెట్‌ కదా. దటీజ్‌ టిల్లూ..టిల్లు స్క్వేర్‌తో హిట్‌ కొట్టి డీజే డిల్లు మూవీలో అన్నట్టు అట్లుంటది మనతోని అని చెప్పకనే చెప్పాడు. మడత పెట్టేశాడు అన్నట్టు. డీజే టిల్లు 3 గురించి హింట్  ఇచ్చి ఫ్యాన్స్‌కు పూనకాలే తెప్పించాడు. ఇక సినిమా ఏం రేంజ్‌లో ఉంటుందో అని ఫ్యాన్స్‌ ఇప్పటినుంచే తెగ వెయిటింగ్‌.  టిల్లన్నా..  నువ్వు సూపరన్నా..  నీకు సలాం అన్నా.. నీ రింగుల దెబ్బకు .. తానా తందనా ఈ సారి  రామ్‌ మిర్యాలతో పాడిస్తాడేమో చూద్దాం..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement