Producer Naga Vamsi Reacts On Rumours About Anupama And Siddhu Clash, Deets Inside - Sakshi
Sakshi News home page

DJ TILLU2 : సిద్దూకు హెడ్‌ వెయిట్‌ పెరిగిందా? అందుకే హీరోయిన్స్‌ తప్పుకుంటున్నారా?

Published Thu, Dec 1 2022 12:13 PM | Last Updated on Thu, Dec 1 2022 1:47 PM

Producer Naga Vamsi Respond Rumours About Anupama And Siddhu Clash - Sakshi

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌ రాబోతుంది. అయితే ఈ సినిమా అనౌన్స్‌ చేసినప్పటి నుంచి వరుస వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ముందుగా ఈ సీక్వెల్ నుంచి డైరెక్టర్‌ విమల్ కృష్ణ తప్పుకున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ల విషయంలో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ముందుగా పెళ్లిసందD బ్యూటీ శ్రీలలను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత ఏమైందో కానీ ఆమె ప్లేస్‌లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుందంటూ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. తాజాగా ఆమె కూడా ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఆమె తప్పుకుందంటూ ఫిల్మ్‌నగర్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. సెట్‌లో సిద్దూతో అనుపమకు గొడవ అయ్యిందని, అందుకే  ఈ సినిమా నుంచి తప్పుకుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సిద్దు యూటిట్యూడ్‌పై రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. 

“DJ టిల్లు హిట్ అవ్వడంతో సిద్ధు జొన్నలగడ్డకి హెడ్ వెయిట్ ఎక్కువ అయ్యింది. అందుకే ఈ సీక్వెల్ నుంచి దర్శకుడు విమల్ కృష్ణ తప్పుకున్నాడు, హీరోయిన్‌ శ్రీలల తప్పుకుంది. ఇప్పుడు అనుపమ కూడా వెళ్లిపోయింది అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ప్రొడ్యూసర్‌ నాగవంశీ స్పందించాడు. డీజే టిల్లు-2కి సంబంధించిన ఓ వెబ్‌సైట్‌లో వచ్చిన వార్తలపై ఆయన ట్వీట్‌ చేస్తూ.. మీలో మంచి రైటర్‌ ఉన్నాడు. సినిమాల్లో ట్రై చేయండి అంటూ కౌంటర్‌ ఇచ్చాడు. కానీ హీరోయిన్ల మార్పుపై మాత్రం ప్రకటన చేయలేదు. దీంతో నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజముందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement