![Dj Tillu Sequel Anupama Parameswaran Out Madonna Finalised - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/29/DJ.jpg.webp?itok=fGK01fTK)
సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సిద్దు కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది.
ఇప్పుడు హీరోయిన్‌ను మార్చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. డీజే టిల్లులో నటించిన నేహాశెట్టిని మొదట్లోనే సైడ్ చేశారు. ఆ తర్వాత శ్రీలలను తీసుకున్నట్లు వార్తలు వచ్చినా ఆమె ప్లేస్‌లో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ను ఫైనలైజ్ చేశారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది, ఇద్దరూ కలిసి షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు.
అయితే మళ్లీ ఏమైందో ఏమో తెలియదు కానీ అనుపమ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఈసారి అనుపమ ప్లేస్‌లో ప్రేమమ్ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ నటిస్తుందని ఫిల్మ్‌నగర్ టాక్. మరి ఈ హీరోయిన్ అయినా మొత్తం సినిమా అయ్యే వరకు ఉంటుందా? లేక మధ్యలోనా తప్పిస్తారా అన్నది చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment