
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డకు ఈ ఏడాది బ్రేక్ ఇచ్చిన సినిమా డీజే టిల్లు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది ఈ చిత్రం. సిద్దూ నటన, డైలాగ్ డెలివరీ యూత్‌ను ఫిదా చేసింది. ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో సిద్దూ జొన్నలగడ్డకు జోడీగా నేహా శెట్టికి బదులుగా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్ నటించనున్నట్లు తెలుస్తుంది. రౌడీ బాయ్స్ చిత్రంతో రొమాన్స్ డోస్ పెంచిన అనుపమ ఈ చిత్రానికి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తతం అనుపమ టాలీవుడ్ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఇప్పటికే ఆమె నిఖిల్‌తో ’18పేజీస్’, ‘బటర్‌ఫ్లై’ అనే చిత్రల్లో నటిస్తుంది.
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment