సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సిద్దు కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. దీంతో ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ‘డీజే టిల్లు స్క్వేర్’గా తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక కాంట్రవర్సీ చుట్టుముడుతూనే ఉంది. ముందుగా ఈ సీక్వెల్ నుంచి డైరెక్టర్ విమల్ కృష్ణ తప్పుకున్నాడు.
ఆ తర్వాత హీరోయిన్ల విషయంలో చాలామంది పేర్లు తెరపైకి వచ్చినా ఫైనల్‌గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా ఫైనలైజ్ చేశారు. అయితే కొన్ని రోజుల క్రితం షూటింగ్ సెట్‌లో సిద్దూకి, అనుపమకి గొడవ జరగడంతో ఆమె వాకౌట్ చేసి వెళ్లిపోయినట్లు పలు రూమర్స్ తెరమీదకి వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై సిద్దూ జొన్నలగడ్డ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ వివాదాలపై క్లారిటీ ఇచ్చారు.
'సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. నిజానికి మేం ఈ సినిమాకు ముందుగా అప్రోచ్ అయ్యింది అనుపమనే. ఇక డైరెక్టర్ విమల్ కృష్ణతో గొడవపై స్పందిస్తూ.. లైవ్‌లోనే అతడికి కాల్ చేసి తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చాడు.
''ప్రస్తుతం ‘డీజే టిల్లు స్క్వేర్’ డైరెక్ట్ చేస్తున్న మాలిక్ రామ్‌తో నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. అతడు మా ఇంట్లోనే ఉంటాడు. మా దగ్గరే తింటడు. అతను పడుకుంటే దుప్పటి కూడా నేనే కప్పుతా. అంతలా నేను డైరెక్టర్స్‌తో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తా. కృష్ణ అండ్ హిస్ లీలా( Krishna And His Leela) డైరెక్టర్‌కు అయితే ముద్దు కూడా పెట్టాను'' అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు సిద్దూ.
Comments
Please login to add a commentAdd a comment