mallik ram
-
అందుకే అనుపమని బోల్డ్‌గా చూపించాం: 'టిల్లు స్క్వేర్' డైరెక్టర్
'టిల్లు స్క్వేర్'లో లిల్లీ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.ఆమెది ఛాలెంజింగ్ రోల్. ఆ పాత్ర కోసం ఎందరో పేర్లను పరిశీలించాం. కానీ అనుపమనే పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది. ఆమెను బోల్డ్‌గా చూపించాలనే ఉద్దేశంతో లిల్లీ పాత్రను రాసుకోలేదు. లిల్లీ పాత్ర తీరే అలా ఉంటుంది. ఆ పాత్రకి అనుపమ న్యాయం చేయగలదని నమ్మాం. ఆమె ఆ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేసింది’ అన్నారు దర్శకుడు మల్లిక్ రామ్. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘టిల్లు స్కేవర్’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ మల్లిక్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► సిద్ధుతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. దాదాపు ఇద్దరం ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టాం. నేను దర్శకత్వం వహించిన అద్భుతం మూవీ, డీజే టిల్లు ఇంచుమించు ఒకే సమయంలో వచ్చాయి. ఆ తర్వాత నేను, సిద్ధు కలిసి ఒక సినిమా చేయాలి అనుకున్నాం. అదే సమయంలో నాగవంశీ గారు 'టిల్లు స్క్వేర్' చేస్తే బాగుంటుందని చెప్పడం, డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ ఇతర కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటంతో నేను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. మొదట కాస్త సంకోచించాను కానీ కథ బాగా వచ్చేసరికి ఇక వెనకడుగు వేయలేదు. ► సినిమాలో సిద్దు ప్రమేయం ఉటుందని..ప్రతి సీన్లోనూ తలదూర్చుతాడని బయట ఏవో కొన్ని వార్తలు వస్తుంటాయి కానీ వాటిలో వాస్తవం లేదు. సిద్ధు ఒక రచయితగా, నటుడిగా ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో.. అంతవరకే ఇన్వాల్వ్ అవుతాడు. దర్శకుడికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను దర్శకుడికి ఇస్తాడు. ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇద్దరం చర్చించుకొని చేశాం. కథా చర్చల సమయంలో ఒక రచయితగా వ్యవహరిస్తాడు. చిత్రీకరణ సమయంలో ఒక నటుడిగా ఏం చేయాలో అది చేస్తాడు. ► డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ కి వ్యత్యాసం ఉంటుంది. డీజే టిల్లు డెడ్ బాడీ నేపథ్యంలో సాగే బ్లాక్ కామెడీ. కానీ టిల్లు స్క్వేర్ అలా ఉండదు. ఒక కమర్షియల్ సినిమాలా ఉంటుంది. టిల్లు పాత్ర తీరు అలాగే ఉంటుంది. రాధిక పాత్ర ప్రస్తావన ఉంటుంది. మొదటి భాగాన్ని ముడిపెడుతూ కొన్ని సన్నివేశాలు ఉంటాయి. డీజే టిల్లుని గుర్తు చేస్తూనే టిల్లు స్క్వేర్ మీకొక కొత్త అనుభూతిని ఇస్తుంది. ► ఇంటర్వెల్ తర్వాత ద్వితీయార్థం ప్రారంభ సన్నివేశాలు చాలా సినిమాల్లో తేలిపోతుంటాయి. ఫస్టాఫ్ బాగుంటుంది, క్లైమాక్ బాగుంటుంది. కానీ ఆ 15-20 నిమిషాలు ఆశించిన స్థాయిలో ఉండదు. టిల్లు స్క్వేర్ విషయంలో అలా జరగకూడదన్న ఉద్దేశంతో.. ఆ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా రాసుకొని రీ షూట్ చేయడం జరిగింది. ► ముందు ఈ సినిమాకు పాటలు రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల, నేపథ్య సంగీతం తమన్ అనుకున్నాం. రామ్ మిరియాల రెండు పాటలు ఇచ్చారు. శ్రీచరణ్ పాకాల ఒక పాట ఇచ్చారు. ఆ పాట బాగా వచ్చింది. కానీ అక్కడ సిట్యుయేషన్ మారడంతో మరో సంగీత దర్శకుడు అచ్చుత్తో పాట చేయించడం జరిగింది. తమన్ గారు ఇతర సినిమాలతో బిజీగా ఉండి అందుబాటులో లేకపోవడంతో..భీమ్స్ గారిని తీసుకున్నాం. ► ఈ చిత్రంలో ఎలాంటి సందేశం ఉండదు. కొందరి స్వభావం ఎలా ఉంటుందో చూపించాము కానీ ఇలా ఉండకండి మారండి అనే సందేశాలు మాత్రం ఇవ్వలేదు. -
టిల్లు డేట్ ఫిక్స్
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందు తున్న సినిమా ‘టిల్లు స్క్వేర్’. ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘టిల్లు స్క్వేర్’కి సహనిర్మాత: సాయి సౌజన్య. -
టిక్కెట్టే కొనకుండా...
‘డీజే టిల్లు’ సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘టిల్లు స్క్వేర్’లో నటిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘టిక్కెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా...’ అంటూ సాగే తొలి మాస్ సాంగ్‌ను బుధవారం విడుదల చేశారు. రామ్ మిరియాల స్వరపరచి, పాడిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి సంగీతం: రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల. -
నేను ఆ డైరెక్టర్‌తో రిలేషన్ షిప్లో ఉన్నాను : 'డీజే టిల్లు' హీరో
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సిద్దు కెరీర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. దీంతో ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ‘డీజే టిల్లు స్క్వేర్’గా తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక కాంట్రవర్సీ చుట్టుముడుతూనే ఉంది. ముందుగా ఈ సీక్వెల్ నుంచి డైరెక్టర్ విమల్ కృష్ణ తప్పుకున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ల విషయంలో చాలామంది పేర్లు తెరపైకి వచ్చినా ఫైనల్‌గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా ఫైనలైజ్ చేశారు. అయితే కొన్ని రోజుల క్రితం షూటింగ్ సెట్లో సిద్దూకి, అనుపమకి గొడవ జరగడంతో ఆమె వాకౌట్ చేసి వెళ్లిపోయినట్లు పలు రూమర్స్ తెరమీదకి వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై సిద్దూ జొన్నలగడ్డ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ వివాదాలపై క్లారిటీ ఇచ్చారు. 'సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. నిజానికి మేం ఈ సినిమాకు ముందుగా అప్రోచ్ అయ్యింది అనుపమనే. ఇక డైరెక్టర్ విమల్ కృష్ణతో గొడవపై స్పందిస్తూ.. లైవ్‌లోనే అతడికి కాల్ చేసి తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ''ప్రస్తుతం ‘డీజే టిల్లు స్క్వేర్’ డైరెక్ట్ చేస్తున్న మాలిక్ రామ్‌తో నేను రిలేషన్షిప్లో ఉన్నాను. అతడు మా ఇంట్లోనే ఉంటాడు. మా దగ్గరే తింటడు. అతను పడుకుంటే దుప్పటి కూడా నేనే కప్పుతా. అంతలా నేను డైరెక్టర్స్‌తో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తా. కృష్ణ అండ్ హిస్ లీలా( Krishna And His Leela) డైరెక్టర్‌కు అయితే ముద్దు కూడా పెట్టాను'' అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు సిద్దూ. -
ఒక వీర్యదాత కథ
‘గోల్కొండ హైస్కూల్’, ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రాలకు అసోసియేట్ దర్శకునిగా పనిచేసిన మల్లిక్ రామ్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘నరుడా.. డోనరుడా’. హిందీ హిట్ ‘విక్కీ డోనార్’కు రీమేకైన ఈ చిత్రంలో సుమంత్ హీరో కాగా హిందీ సీరియల్స్ ఫేమ్ పల్లవీ సుభాష్‌ను తెలుగులో హీరోయిన్గా పరిచయం చేస్తున్నారు. రమా రీల్స్, ఎస్ఎస్ క్రియేషన్స్ పతాకాలపై వై.సుప్రియ, సుధీర్ పూదోట నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు విడుదల చేసి, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘వీర్యదానం అనే వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇలాంటి కథ ఎంచుకున్నందుకు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. వీర్యదాతగా సుమంత్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్ పాత్రలో తనికెళ్ల భరణి కనిపిస్తారు. ఇటీవల హీరో నాగార్జున విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. మా చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది’’ అని పేర్కొన్నారు. శ్రీలక్ష్మి, సుమన్ శెట్టి, ‘జబర్దస్త్’ శేషు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: షానియల్ డియో, సంగీతం: శ్రీచరణ్ పాకాల, లైన్ ప్రొడ్యూసర్: డా.అనిల్ విశ్వనాథ్, సమర్పణ: అన్నపూర్ణా స్టూడియోస్.