ఒక వీర్యదాత కథ
ఒక వీర్యదాత కథ
Published Wed, Sep 28 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
‘గోల్కొండ హైస్కూల్’, ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రాలకు అసోసియేట్ దర్శకునిగా పనిచేసిన మల్లిక్ రామ్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘నరుడా.. డోనరుడా’. హిందీ హిట్ ‘విక్కీ డోనార్’కు రీమేకైన ఈ చిత్రంలో సుమంత్ హీరో కాగా హిందీ సీరియల్స్ ఫేమ్ పల్లవీ సుభాష్‌ను తెలుగులో హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు. రమా రీల్స్, ఎస్‌ఎస్ క్రియేషన్స్ పతాకాలపై వై.సుప్రియ, సుధీర్ పూదోట నిర్మించారు.
ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు విడుదల చేసి, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘వీర్యదానం అనే వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇలాంటి కథ ఎంచుకున్నందుకు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. వీర్యదాతగా సుమంత్, ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్ పాత్రలో తనికెళ్ల భరణి కనిపిస్తారు. ఇటీవల హీరో నాగార్జున విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది.
మా చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది’’ అని పేర్కొన్నారు. శ్రీలక్ష్మి, సుమన్ శెట్టి, ‘జబర్దస్త్’ శేషు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: షానియల్ డియో, సంగీతం: శ్రీచరణ్ పాకాల, లైన్ ప్రొడ్యూసర్: డా.అనిల్ విశ్వనాథ్, సమర్పణ: అన్నపూర్ణా స్టూడియోస్.
Advertisement
Advertisement