Pallavi Subhash
-
అది మా కుటుంబంలోనే లేదు!
‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ చిత్రం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సుమంత్ ‘నరుడా.. డోనరుడా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. హిందీ ‘విక్కీ డోనర్’కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని మల్లిక్‌రామ్ దర్శకత్వంలో వై.సుప్రియ, సుధీర్ పూదోట నిర్మించారు. పల్లవీ సుభాష్ కథానాయిక. ఈ శుక్రవారం విడుదల కానున్న ‘నరుడా.. డోనరుడా’ గురించి సుమంత్ మాట్లాడుతూ- ‘‘ ‘గోల్కొండ హైస్కూల్’ తర్వాత నా మూడు సినిమాలు సరిగ్గా ఆడలేదు. దాంతో కెరీర్జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలనుకున్నా. ఓ రోజు టీవీలో ‘విక్కీ డోనర్’ చూసిన తాతయ్య (ఏయన్నార్) చాలా బాగుందన్నారు. అటువంటి వైవిధ్యమైన కథలు రాయమని రచయితలకు చెప్పేవాణ్ణి. నిర్మాత రామ్మోహన్‌గారు దర్శకుడు మల్లిక్‌ను పరిచయం చేశారు. మల్లిక్ విజన్ ఉన్న డెరైక్టర్. వీర్యదానం నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదంతో పాటు సందేశం ఉంటుంది. సినిమాలో ఎక్కడా అసభ్యత ఉండదు. రెగ్యులర్ చిత్రాలు చేయడం మా కుటుంబంలోనే లేదు. ఎప్పుడూ కొత్తవి ట్రై చేస్తుంటాం. రావణాసురుడు, దుర్యోధనుడి తరహా విలన్ పాత్రలు చేయాలనుంది. ఎన్టీఆర్, చిరంజీవి, మోహన్బాబుగార్లు తొలుత విలన్‌గా నటించి, సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. ఈ చిత్రం విడుదల తర్వాత పూర్తి వివరాలు చెబుతా’’ అన్నారు. -
ఒక వీర్యదాత కథ
‘గోల్కొండ హైస్కూల్’, ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రాలకు అసోసియేట్ దర్శకునిగా పనిచేసిన మల్లిక్ రామ్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘నరుడా.. డోనరుడా’. హిందీ హిట్ ‘విక్కీ డోనార్’కు రీమేకైన ఈ చిత్రంలో సుమంత్ హీరో కాగా హిందీ సీరియల్స్ ఫేమ్ పల్లవీ సుభాష్‌ను తెలుగులో హీరోయిన్గా పరిచయం చేస్తున్నారు. రమా రీల్స్, ఎస్ఎస్ క్రియేషన్స్ పతాకాలపై వై.సుప్రియ, సుధీర్ పూదోట నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు విడుదల చేసి, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘వీర్యదానం అనే వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇలాంటి కథ ఎంచుకున్నందుకు సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతున్నారు. వీర్యదాతగా సుమంత్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్టు డాక్టర్ పాత్రలో తనికెళ్ల భరణి కనిపిస్తారు. ఇటీవల హీరో నాగార్జున విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. మా చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది’’ అని పేర్కొన్నారు. శ్రీలక్ష్మి, సుమన్ శెట్టి, ‘జబర్దస్త్’ శేషు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: షానియల్ డియో, సంగీతం: శ్రీచరణ్ పాకాల, లైన్ ప్రొడ్యూసర్: డా.అనిల్ విశ్వనాథ్, సమర్పణ: అన్నపూర్ణా స్టూడియోస్. -
సుమంత్ సినిమాకు వెరైటీ టైటిల్
అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, స్టార్ ఇమేజ్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నటుడు సుమంత్. వరుస ఫ్లాప్‌లతో కొంత కాలంగా వెండితెరకు దూరమైన సుమంత్, ఇప్పుడో వెరైటీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. హిందీలో మంచి సక్సెస్ సాధించిన విక్కీడోనర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఒరిజినల్ వర్షన్‌పై ఉన్న నమ్మకంతో ఈ సినిమా తనకు తెలుగులో బ్రేక్ ఇస్తుందన్న ఆశతో ఉన్నాడు సుమంత్. కొత్త దర్శకుడు మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పల్లవి సుభాష్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాకు 'నరుడా డోనరుడా' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. త్వరలోనే అఫీషియల్‌గా టైటిల్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ఎనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. -
గౌతమ్ మీనన్‌కు అయితే ఓకే
టాలీవుడ్లో విజయాలను రాబట్టుకుని కోలీవుడ్‌లో యమస్ట్రాంగ్గా నిలదొక్కుకున్న నటి సమంత. ఇప్పుడు విజయ్, అజిత్, సూర్య, విక్రమ్, ధనుష్ అంటూ ప్రముఖ హీరోలందరితోనూ నటిస్తున్న నటి సమంత. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. క్షణం తీరిక లేకుండా నటించేస్తున్న ఈ చెన్నై చిన్నదానికి వద్దంటే అవకాశాలు వచ్చిపడుతున్నాయి. నటుడు శివకార్తికేయన్ సొంతంగా నిర్మిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్గా సమంతను ఎంపిక చేయాలనుకున్నారు. అయితే ఆమె సారీ కాల్షీట్స్ లేవంటూ ఖరాఖండిగా చెప్పేశారని కోలీవుడ్ టాక్. ఇలాంటి పరిస్థితిలో ఈ చెన్నై చిన్నది గురువుగా చెప్పుకునే గౌతమ్‌మీనన్‌కు అర్జెంట్‌గా ఒక హీరోయిన్ అవసరం అయ్యారు. వివరంగా చెప్పాలంటే ఎన్నై అరిందాల్ చిత్రానికి ముందే శింబు హీరోగా గౌతమ్‌మీనన్ చిత్రం ప్రారంభించారు. అప్పుడు ఆ చిత్రంలో పల్లవి సుభాష్‌ను హీరోయిన్గా ఎంపిక చేశారు. అయితే అజిత్ హీరోగా ఎన్నై అరిందాల్ చిత్రం చేసే అవకాశం రావడంతో గౌతమ్‌మీనన్ శింబు చిత్రాన్ని పక్కన పెట్టేశారు. ఎన్నై అరిందాల్ చిత్రం విజయం సాధించడంతో ఇప్పుడు శింబు చి త్రాన్ని బూజుదులిపి బయటకు తీస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కొన్ని రోజులు నటించిన నటి పల్లవి సుభాష్ ప్రస్తుతం ఇతర చిత్రాలతో బిజీగా ఉండడంతో శింబు చిత్రం నుంచి వైదొగలిగారు. ఇప్పుడు గౌతమ్‌మీనన్‌కు హీరోయిన్ అవసరం వచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఆయనకు నటి సమంత గుర్తు కొచ్చారు. ఆమె ఇంతకుముందు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో తెలుగులో ఏ మాయ చేశావే, తమిళంలో నీ దానే ఎన్ పొన్ వసంతం, నడునిశి నాయిగళ్ చిత్రాలలో నటించారు. తెలుగు చిత్రం ఏ మాయ చేశావే సమంతకు లైఫ్ ఇచ్చిన చిత్రం. దీంతో గురువు గౌతమ్‌మీనన్ కోసం తన కాల్షీట్స్ను సర్దుబాటు చేసి ఇవ్వడానికి సిద్ధం అయినట్లు కోలీవుడ్ సమాచారం.