గౌతమ్ మీనన్‌కు అయితే ఓకే | Pallavi Subhash reveals truth on Gautham Menon film | Sakshi
Sakshi News home page

గౌతమ్ మీనన్‌కు అయితే ఓకే

Published Sun, May 10 2015 3:01 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 AM

గౌతమ్ మీనన్‌కు అయితే ఓకే

గౌతమ్ మీనన్‌కు అయితే ఓకే

 టాలీవుడ్‌లో విజయాలను రాబట్టుకుని కోలీవుడ్‌లో యమస్ట్రాంగ్‌గా నిలదొక్కుకున్న నటి సమంత. ఇప్పుడు విజయ్, అజిత్, సూర్య, విక్రమ్, ధనుష్ అంటూ ప్రముఖ హీరోలందరితోనూ నటిస్తున్న నటి సమంత. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. క్షణం తీరిక లేకుండా నటించేస్తున్న ఈ చెన్నై చిన్నదానికి వద్దంటే అవకాశాలు వచ్చిపడుతున్నాయి. నటుడు శివకార్తికేయన్ సొంతంగా నిర్మిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేయాలనుకున్నారు. అయితే ఆమె సారీ కాల్‌షీట్స్ లేవంటూ ఖరాఖండిగా చెప్పేశారని కోలీవుడ్ టాక్.
 
 ఇలాంటి పరిస్థితిలో ఈ చెన్నై చిన్నది గురువుగా చెప్పుకునే గౌతమ్‌మీనన్‌కు అర్జెంట్‌గా ఒక హీరోయిన్ అవసరం అయ్యారు. వివరంగా చెప్పాలంటే ఎన్నై అరిందాల్ చిత్రానికి ముందే శింబు హీరోగా గౌతమ్‌మీనన్ చిత్రం ప్రారంభించారు. అప్పుడు ఆ చిత్రంలో పల్లవి సుభాష్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే అజిత్ హీరోగా ఎన్నై అరిందాల్ చిత్రం చేసే అవకాశం రావడంతో గౌతమ్‌మీనన్ శింబు చిత్రాన్ని పక్కన పెట్టేశారు. ఎన్నై అరిందాల్ చిత్రం విజయం సాధించడంతో ఇప్పుడు శింబు చి త్రాన్ని బూజుదులిపి బయటకు తీస్తున్నారు.
 
 అయితే ఈ చిత్రంలో కొన్ని రోజులు నటించిన నటి పల్లవి సుభాష్ ప్రస్తుతం ఇతర చిత్రాలతో బిజీగా ఉండడంతో శింబు చిత్రం నుంచి వైదొగలిగారు. ఇప్పుడు గౌతమ్‌మీనన్‌కు హీరోయిన్ అవసరం వచ్చింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఆయనకు నటి సమంత గుర్తు కొచ్చారు. ఆమె ఇంతకుముందు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో తెలుగులో ఏ మాయ చేశావే, తమిళంలో నీ దానే ఎన్ పొన్ వసంతం, నడునిశి నాయిగళ్ చిత్రాలలో నటించారు. తెలుగు చిత్రం ఏ మాయ చేశావే సమంతకు లైఫ్ ఇచ్చిన చిత్రం. దీంతో గురువు గౌతమ్‌మీనన్ కోసం తన కాల్‌షీట్స్‌ను సర్దుబాటు చేసి ఇవ్వడానికి సిద్ధం అయినట్లు కోలీవుడ్ సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement