అతనితో ఏడేళ్ల స్నేహం: సమంత | samantha about nagachaitanya | Sakshi

అతనితో ఏడేళ్ల స్నేహం: సమంత

Dec 11 2015 11:09 AM | Updated on Sep 3 2017 1:50 PM

అతనితో ఏడేళ్ల స్నేహం: సమంత

అతనితో ఏడేళ్ల స్నేహం: సమంత

అక్కినేని నటవారసుడు నాగచైతన్యకు తొలి సక్సెస్ ఇవ్వంటంతో పాటు సమంత లాంటి సక్సెస్ ఫుల్ హీరోయిన్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన సూపర్ హిట్ సినిమా ఏం మాయ చేసావే.. యూత్...

అక్కినేని నటవారసుడు నాగచైతన్యకు తొలి సక్సెస్ ఇవ్వటంతో పాటు సమంత లాంటి సక్సెస్ ఫుల్ హీరోయిన్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన సూపర్ హిట్ సినిమా 'ఏం మాయ చేసావే..'. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా సంచలన విజయం నమోదు చేసిన ఈ సినిమాలొ నాగచైతన్య సమంతలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా షూటింగ్ కోసం చైతు, సమంతలు కలుసుకొని ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

' నాగ చైతన్య తో కలిసి ఎదిగిన ఫీలింగ్ కలుగుతోంది. ఏడేళ్లుగా మంచి మిత్రులుగా ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది' అంటూ సమంత ట్విట్టర్ పేజ్ పై పోస్ట్ చేసింది. ఈ కామెంట్ పై స్పందించిన చైతన్య ' కాలం మారినా కొన్ని విషయాలు మాత్రం మారవు సమంత' అంటూ ట్వీట్ చేశాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయ చేసావే ఫిబ్రవరి 26, 2010లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement