
సుమంత్ సినిమాకు వెరైటీ టైటిల్
అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి, స్టార్ ఇమేజ్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నటుడు సుమంత్. వరుస ఫ్లాప్లతో కొంత కాలంగా వెండితెరకు దూరమైన సుమంత్, ఇప్పుడో వెరైటీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. హిందీలో మంచి సక్సెస్ సాధించిన విక్కీడోనర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఒరిజినల్ వర్షన్పై ఉన్న నమ్మకంతో ఈ సినిమా తనకు తెలుగులో బ్రేక్ ఇస్తుందన్న ఆశతో ఉన్నాడు సుమంత్.
కొత్త దర్శకుడు మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పల్లవి సుభాష్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాకు 'నరుడా డోనరుడా' అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. త్వరలోనే అఫీషియల్గా టైటిల్తో పాటు సినిమా రిలీజ్ డేట్ను కూడా ఎనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్.