డోనరుడి ప్రేమకథ! | Sumanth naruda donaruda movie release in November | Sakshi
Sakshi News home page

డోనరుడి ప్రేమకథ!

Published Tue, Oct 18 2016 11:16 PM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

డోనరుడి ప్రేమకథ!

డోనరుడి ప్రేమకథ!

సుమంత్, పల్లవీ సుభాష్ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వై.సుప్రియ, సుధీర్ పూదోట నిర్మిస్తున్న చిత్రం ‘నరుడా..! డోనరుడా..!’. మల్లిక్‌రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఏ ఉద్యోగం లేని హైదరాబాదీ కుర్రాడు పరిస్థితుల దృష్ట్యా డబ్బు కోసం స్పెర్మ్ డోనర్‌గా మారతాడు.

ఆ తర్వాత ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఏ ఉద్యోగం చేస్తున్నావని అమ్మాయి అడిగితే చెప్పుకోలేడు. ఈ వీర్యదాత ప్రేమకథ ఎటువంటి మలుపులు తీసుకుందనేది ఆసక్తికరం’’ అన్నారు. తనికెళ్ల భరణి, సుమన్ శెట్టి కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి మాటలు: కిట్టూ విస్సాప్రగడ, సాగర్ రాచకొండ, కెమేరా: షానియల్ డియో, సంగీతం: శ్రీచరణ్ పాకాల.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement