మహేష్ చేతుల మీదుగా నరుడా..డోనరుడా ట్రైలర్
మహేష్ చేతుల మీదుగా నరుడా..డోనరుడా ట్రైలర్
Published Mon, Sep 26 2016 12:49 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
చెన్నై: బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ విక్కీ డోనర్ రీమేక్ గా సుమంత్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం నరుడా.. డోనరుడా. ఈ సినిమా ఫుల్ లెన్త్ ట్రైలర్ ను టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు రిలీజ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని సుమంత్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ' నా ఫ్రెండ్ మహేష్ బాబు చేతుల మీదుగా నరుడా.. డోనరుడా ఎక్స్క్లూజివ్ ఫుల్ లెన్త్ ట్రైలర్ మంగళవారం రిలీజ్ కాబోతోంది..' అంటూ సుమంత్ సోమవారం ట్వీట్ చేశాడు.
ఇంతకముందే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ఈ పోస్టర్స్ సూపర్ ఫన్నీగా కనిపిస్తుండటంతో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇందులో సుమంత్ స్పెర్మ్ డోనర్ పాత్రలో నటించనున్నాడు. రేపు విడుదల కాబోయే కొత్త ట్రైలర్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది.
కాగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రీమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ పతాకాలపై వై. సుప్రియ, జాన్ సుధీర్ పూదోట నిర్మించారు. హీరోయిన్‌గా పల్లవి సుభాశ్, కీలక పాత్రలో తనికెళ్ల భరణి నటించారు.
Advertisement
Advertisement