సుమంత్ ఆడియో రిలీజ్కు అక్కినేని బ్రదర్స్ | Naga Chaitanya Akhil to launch naruda donaruda audio | Sakshi
Sakshi News home page

సుమంత్ ఆడియో రిలీజ్కు అక్కినేని బ్రదర్స్

Published Thu, Oct 27 2016 1:48 PM | Last Updated on Wed, Aug 29 2018 5:43 PM

సుమంత్ ఆడియో రిలీజ్కు అక్కినేని బ్రదర్స్ - Sakshi

సుమంత్ ఆడియో రిలీజ్కు అక్కినేని బ్రదర్స్

అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన హీరో సుమంత్. సత్యం, గౌరీ లాంటి హిట్ సినిమాలు చేసినా.. స్టార్ ఇమేజ్ సాధించే స్థాయి భారీ సక్సెస్లు సాధించటంలో మాత్రం వెనకపడ్డాడు. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న సుమంత్ తాజాగా ఓ బాలీవుడ్ సినిమా రీమేక్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.

హిందీలో మంచి సక్సెస్ సాధించిన విక్కీ డోనర్ సినిమాను నరుడా డోనరుడా పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు సుమంత్. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. దాదాపుగా సుమంత్కు రీఎంట్రీ లాంటి సినిమా కావటంతో అక్కినేని కుటుంబం భారీ హైప్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే నవంబర్ 4న ఏర్పాటు చేసిన ఆడియో రిలీజ్ వేడుకకు అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్లు హాజరవుతున్నారు. ఈ సపోర్ట్ సుమంత్ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement