
నందమూరి బాలకృష్ణ ఏ ముహూర్తాని ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్రకటించారో గాని.. సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. దర్శకత్వ బాధ్యతల నుంచి తేజ తప్పుకోవటం, ఆ స్థానంలో క్రిష్ వచ్చి చేరటంతో సినిమా పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కథను ఫైనల్ చేసే పనిలో ఉన్న క్రిష్ నటీనటుల ఎంపిక మీద కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ సమకాలీన నటుల పాత్రల్లో ఈ జనరేషన్ స్టార్ హీరోలను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కృష్ణ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏఎన్నార్‌గా నాగచైతన్య కనిపిస్తారన్న టాక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఏఎన్నార్ పాత్రలో చైతూకు బదులుగా మరో అక్కినేని ఫ్యామిలీ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇటీవల మళ్ళీరావా సక్సెస్‌తో ఫాంలోకి వచ్చిన సుమంత్‌ను ‘ఎన్టీఆర్’లో ఏఎన్నార్ పాత్రకు తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.