Krish
-
హృతిక్ రోషన్ క్రిష్-4.. బిగ్ షాకిచ్చిన నిర్మాత!
హృతిక్ రోషన్, ప్రీతి జింటా నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కోయి మిల్ గయా'. ఈ మూవీకి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఈ మూవీ సీక్వెల్‌గా వచ్చిన చిత్రం క్రిష్. ఈ మూవీలో హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా జంటగా నటించారు. ఆ తర్వాత వచ్చిన క్రిష్ -3లో హృతిక్, ప్రియాంక, వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్ కీలక పాత్రల్లో నటించారు. అలా ఈ సిరీస్‌లో వచ్చిన మూడు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.అయితే ఈ సిరీస్‌లో క్రిష్-4 రానుందని చాలాకాలంగా బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను సిద్ధార్థ్ ఆనంద్ నిర్మించనున్నట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఈ మూవీకి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించారని టాక్ వినిపించింది. ఈ మూవీకి తాను డైరెక్షన్ చేయడం లేదని హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.అయితే తాజాగా ఈ నిర్మాణ బాధ్యతల నుంచి సిద్ధార్థ్ ఆనంద్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే రూ.700 కోట్ల భారీ బడ్జెట్ కావడంతోనే సిద్ధార్థ్ ఆనంద్ ఆలోచనలో పడ్డారని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అందుకే నిర్మాణ బాధ్యతల నుంచి వైదొలగారని సమాచారం. తాజా పరిణామాలు చూస్తే అతనితో పాటు కరణ్ మల్హోత్రా ఈ ప్రాజెక్ట్ తప్పుకున్నట్లు అర్థమవుతోంది. దీంతో అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రిష్-4 ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.సిద్ధార్థ్ ఆనంద్‌తో పాటు కరణ్ తప్పుకోవడంతో ఈ మూవీకి కొత్త దర్శకత్వంలో తెరకెక్కించే ఛాన్స్ ఉంది. కొత్త టీమ్‌తో మళ్లీ బడ్జెట్‌ను అంచనా లు తయారు చేయాల్సి ఉంది. ఇప్పటికే రాకేష్ రోషన్ కూడా తాను దర్శకుడిగా చేయడం లేదని చెప్పడంతో మరో డైరెక్టర్ ఎవరనే దానిపై క్లారిటీ రాలేదు. కాగా.. క్రిష్, క్రిష్ -3 చిత్రాలకు రాకేశ్ రోషన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే క్రిష్-4 కూడా ఆయనే డైరెక్ట్ చేస్తాడని అభిమానులంతా భావించారు. కానీ తాజా ఇంటర్వ్యూలో తాను దర్శకత్వం చేయడం లేదని చెప్పేశారు. ఈ బాధ్యతలు వేరే దర్శకుడికి అప్పగించనున్నట్లు వెల్లడించారుయ. అయితే ఇప్పుడు తాను డైరెక్ట్ చేసినా బ్లాక్ బస్టర్ అవుతుందన్న గ్యారెంటీ లేదని అన్నారు. అందుకే దర్శకత్వం మార్పు అవసరమని స్పష్టం చేశారు. -
Krish Jagarlamudi : మళ్లీ పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్!
-
డైరెక్టర్ క్రిష్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా?
ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం.. ఇలాంటి మాటలు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. త్వరలో నాగచైతన్య కూడా ఇలానే మళ్లీ పెళ్లిచేసుకోబోతున్నాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. ఇదలా ఉంచితే తెలుగు దర్శకుడు క్రిష్ కూడా మరోసారి వివాహం చేసుకోబోతున్నాడనే రూమర్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయాయి.(ఇదీ చదవండి: మొదటి భర్త గురించి అమలాపాల్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్)'గమ్యం', 'వేదం' తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న క్రిష్.. 2016లో రమ్య అనే డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నారు కానీ మనస్పర్థలు వచ్చి 2021లో విడిపోయారు. అప్పటినుంచే సింగిల్‌గానే ఉంటున్న క్రిష్.. ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడట. ఓ లేడీ డాక్టర్‌తో త్వరలో పెళ్లి జరగనుందని తెలుస్తోంది. వచ్చే వారం ఈ మేరకు నిశ్చితార్థం జరుపుకోనున్నారనే టాక్ వినిపిస్తుంది.క్రిష్ పెళ్లి చేసుకోబోయే మహిళకు ఇదివరకే పెళ్లయి విడాకులు తీసుకుందని, 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని అంటున్నారు. మరి ఈ రూమర్స్ నిజమేనా అనేది తెలియాల్సి ఉంది. చివరగా 'కొండపొలం' మూవీతో పలకరించిన క్రిష్.. పవన్ 'హరిహర వీరమల్లు' సినిమా మొదలుపెట్టాడు. ఇది జరిగి ఏళ్లు గడిచిపోయింది. పవన్ ఎంతకీ ఈ మూవీ గురించి పట్టించుకోకపోవడంతో దర్శకుడిగా ఇతడు పక్కకు తప్పుకొన్నాడు. ప్రస్తుతం అనుష్కతో 'ఘాటీ' మూవీ చేస్తున్నాడు. ఇంతలోనే ఇలా క్రిష్ పెళ్లి రూమర్స్ రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: డబ్బు లాక్కొని హీరోయిన్ని భయపెట్టిన బిచ్చగాడు) -
క్రిష వర్మ పసిడి పంచ్
న్యూఢిల్లీ: అండర్–19 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ క్రిష వర్మ పసిడి పతకంతో సత్తా చాటింది. ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య ఆధ్వర్యంలో కొలరాడో వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్‌కు ఒక స్వర్ణంతో పాటు ఐదు రజత పతకాలు దక్కాయి. తొలి సారి నిర్వహించిన ఈ చాంపియన్‌షిప్ మహిళల 75 కేజీల విభాగంలో క్రిష వర్మ విజేతగా నిలిచింది. తుది పోరులో క్రిష 5–0 పాయింట్ల తేడాతో సిమోన్ లెరికా (జర్మనీ)పై గెలుపొందింది. మహిళల విభాగంలో చంచల్ చౌదరీ (48 కేజీలు), అంజలీ కుమారి సింగ్ (57 కేజీలు), విని (60 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) ఫైనల్స్‌లో ఓడి రజత పతకాలు దక్కించుకోగా... పురుషుల విభాగంలో రాహుల్ కుందు (75 కేజీలు) తుదిపోరులో తడబడి రజతానికి పరిమితమయ్యాడు. మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో చంచల్ చౌధరీ 0–5తో మియా టియా ఆటోన్ (ఇంగ్లండ్) చేతిలో... 70 కేజీల ఈవెంట్లో ఆకాంక్ష 1–4తో లిలల్లీ డెకాన్ (ఇంగ్లండ్) చేతిలో ఓడగా... 60 కేజీల విభాగంలో విని 2–3తో ఎల్లా లాన్స్‌డలె (ఇంగ్లండ్) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల 75 కేజీల విభాగంలో రాహుల్ కుందు 1–4తో అవినోంగ్య జోసెఫ్ (అమెరికా) చేతిలో ఓడాడు.శనివారం పోటీల్లో మొత్తం ఆరుగురు భారత బాక్సర్లు పాల్గొనగా అందులో ఒకరు గెలిచి ఐదుగురు ఓటమి పాలయ్యారు. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఐబీఏ) స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్న వరల్డ్ బాక్సింగ్ ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరుగుతోంది. -
పవన్ 'హరిహర వీరమల్లు'.. మరో వికెట్ డౌన్?
'హరిహర వీరమల్లు' సినిమా నుంచి మరో వికెట్ డౌన్? అవును మీరు సరిగానే విన్నారు. ఏమైందో ఏమో గానీ ఈ మూవీకి అస్సలు కలిసి రావట్లేదు. ఎందుకంటే ఏళ్లకు ఏళ్లు సెట్స్‌పైనే ఉంది. నిర్మాతలు ఈ ఏడాది వచ్చేస్తుందని అంటున్నారు. కానీ సగటు ప్రేక్షకుడికి మాత్రం డౌట్. ఎందుకంటే అక్కడ ఉన్నది పవన్ కాబట్టి. దీనికి తోడు మూవీ టీమ్ నుంచి ఒక్కొక్కరుగా తప్పుకోవడం చూస్తుంటే సినిమాపై లేని పోని సందేహాలు రావడం గ్యారంటీ.అప్పుడెప్పుడో లాక్డౌన్ కంటే ముందు 'హరిహర వీరమల్లు' సినిమా పవన్ ఒప్పుకొన్నాడు. కానీ దీని తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 'భీమ్లా నాయక్', 'బ్రో' రిలీజ్ అయిపోయి ఏళ్లు గడిచిపోయాయి. ఇది పాన్ ఇండియా అని అంటారేమో. చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి గానీ ఎలాంటి మూవీనైనా నెలల్లో కంప్లీట్ చేసేయొచ్చు. కానీ పవన్‌కి ఎందుకో 'వీరమల్లు'పై ఆసక్తి లేనట్లు ఉంది. అందుకే ఇలా జప్యం చేస్తూ వస్తున్నారు.(ఇదీ చదవండి: విడాకుల బాటలో మరో టాలీవుడ్ హీరోయిన్.. ఏమైందంటే?)ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ని తీసుకున్నారు. కానీ అతడు తప్పుకోవడంతో బాబీ డియోల్‌ని తీసుకొచ్చారు. ఇక రీసెంట్గా దర్శకుడిగా క్రిష్ తప్పుకోవడంతో నిర్మాత రత్నం పెద్ద కొడుకు జ్యోతికృష్ణ మిగిలిన పని పూర్తి చేయనున్నారు. తాజాగా కొత్త షెడ్యూల్ గురించి డిస్కషన్ అని చెప్పి మూవీ టీమ్ ఓ ఫొటో రిలీజ్ చేసింది. ఇందులో సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ బదులు మరో సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస కనిపించారు.దీంతో పవన్ సినిమా నుంచి మూడో వికెట్ డౌన్ అయిందని మాట్లాడుకుంటున్నారు. ఇలా నిర్మాణంలో ఉన్నప్పుటే మార్పులు ఎక్కువైతే అది ఫైనల్ ఔట్పుట్ మీద పడే అవకాశాలు ఎక్కువ. మరి 'హరిహర వీరమల్లు' సినిమాని ఏం చేస్తారో? ఎప్పుడు థియేటర్లలోకి తీసుకొస్తారో ఆ పెరుమాళ్లకే ఎరుక!(ఇదీ చదవండి: తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్.. ధర ఎంతంటే?) -
పవన్ కల్యాణ్‌కి షాక్.. సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ తప్పుకొన్నాడా?
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నాడు. గెలుస్తాడో లేదో పక్కనబెడితే ఇతడిని నమ్ముకున్న దర్శక నిర్మాతలు మాత్రం మెంటలెక్కిపోతున్నారు. అలాంటిది సడన్‌గా 'హరిహర వీరమల్లు' టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు వరస అప్డేట్స్ ఇస్తున్నారు. దీనిపై ఫ్యాన్స్ నుంచి ఏమంత పాజిటివ్ రెస్పాన్స్ లేదు. ఎందుకంటే ఈ సినిమా ఒకటి ఉందనే చాలామంది మర్చిపోయారు. ఇవన్నీ కాదన్నట్లు డైరెక్టర్ విషయంలో సరికొత్త రూమర్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే)2019 ఎన్నికల టైంలో పూర్తిగా సినిమాలే చేయనని చెప్పిన పవన్.. భీమవరం, గాజువాకలో పోటీ చేసిన చిత్తుగా ఓడిపోయాడు. దీంతో మాట మార్చేసి మళ్లీ మూవీస్ చేశాడు. అలా ఒప్పుకొన్న వాటిలో 'హరిహర వీరమల్లు' ఒకటి. మూడు నాలుగేళ్ల క్రితం సెట్స్‌పైకి వెళ్లిన ఈ పాన్ ఇండియా చిత్రానికి క్రిష్ దర్శకుడు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. అయితే దీని తర్వాత ఒప్పుకొన్న వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలు రిలీజై పోయాయి గానీ 'హరిహర' మాత్రం మూలకి పడిపోయింది.దీంతో అభిమానులతో సహా ప్రేక్షకులు 'హరిహర..' సినిమా ఉందనే విషయమే మర్చిపోయారు. ఇప్పుడు ఉన్నఫలంగా టీజర్ అని చెప్పి నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే ఇందులో నిర్మాత, నిర్మాణ సంస్థ పేర్లు మాత్రమే ఉన్నాయి. డైరెక్టర్ క్రిష్ పేరు ఎక్కడా లేదు. తాజాగా రిలీజ్ చేసిన మరో పోస్టర్లోనూ లేకపోవడం షాకిచ్చింది. అయితే ఆలస్యం అవుతుండటం వల్ల క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాడని, అతడి బదులు నిర్మాత కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వం చేస్తారని అంటున్నారు. అయితే క్రిష్ కావాలనే తప్పుకొన్నాడా? లేదంటే తప్పించారా? అనే టాక్ నెటిజన్ల మధ్య నడుస్తోంది. మరి కారణం ఏమై ఉంటుందంటారు?(ఇదీ చదవండి: పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన నటి) -
డ్రగ్స్ కేసు.. హైకోర్టులో పిటిషన్ విత్‌డ్రా చేసుకున్న క్రిష్
రీసెంట్గా టాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకలం రేపింది. మిగతా వాళ్ల సంగతి పక్కనబెడితే పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తున్న డైరెక్టర్ క్రిష్ పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ కేసులో క్రిష్ పేరు బయటకు రాగానే విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. తొలుత సరేనని ఒప్పుకొన్న క్రిష్.. ముంబయిలో ఉన్నానని రెండు రోజులు టైమ్ కావాలని కోరాడు. (ఇదీ చదవండి: 'అజ్ఞాతవాసి' పవన్ కల్యాణ్ పొలిటికల్ సినిమా) కానీ అంతలోనే తనన పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డైరెక్టర్ క్రిష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అది అలా ఉండగానే తాజాగా డ్రగ్స్ కేసులో పోలీసుల ముందు క్రిష్ విచారణకు హాజరయ్యాడు. టెస్టుల్లో నెగిటివ్ అని తేలింది. దీంతో క్రిష్.. తన పిటిషన్‌ని విత్ డ్రా చేసుకుంటున్నట్లు అతడి తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్.. కీలక వ్యాఖ్యలు చేసిన మాదాపుర్ డీసీపీ) -
డ్రగ్స్ టెస్ట్ కోసం క్రిష్ వద్ద శాంపిల్స్ సేకరించిన పోలీసులు
-
డ్రగ్స్ కేసులో అనూహ్య మలుపు.. విచారణకు వచ్చిన క్రిష్
డ్రగ్స్ కేసులో అనుమానితుడిగా ఉన్న సినీ డైరెక్టర్ క్రిష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పై హైకోర్టులో విచారణ జరగ్గా.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. దీంతో అనూహ్యంగా క్రిష్ శుక్రవారం సైబరాబాద్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి విచారణకు వస్తానని చెప్పి ఆయన ముందస్తు బెయిల్‌కు వెళ్లడంతో ఆయనపై అనుమానాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో బెయిల్ పిటిషన్ వాయిదా పడటం.. ఆయన విచారణకు రావడం వంటి పరిణామాలు జరిగాయి. అత్యంత గోప్యంగా పోలీసుల ముందుకొచ్చిన క్రిష్‌ను పోలీసులు కొద్దిసేపు విచారించిన అనంతరం రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. డ్రగ్స్ అంశాలపై క్రిష్ రియాక్ట్ అయ్యారు.. తాను ముంబయిలో ఉన్నానని, పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని తెలిపారు. ప్రధాన నిందితుడిగా ఉన్న గజ్జల వివేకానంద్, నిర్భయ్, కేదార్నాథ్ రక్త నమూనాలు పాజిటివ్‌గా రావడంతో ఈ కేసు కీలక పరిణామంగా మారింది. హోటల్‌పై పోలీసులు దాడి చేసిన సమయంలో డ్రగ్స్ దొరక్కపోవడంతో ప్రధాన నిందితుడి జ్యుడిషియల్ రిమాండుకు అనుమతి లభించలేదు. మరోవైపు ఈ కేసులో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న లిషి, సందీప్, శ్వేత, నీల్ ఇప్పటి వరకు పోలీసుల విచారణకు రాలేదు. వారు డ్రగ్స్ తీసుకోకుంటే భయం ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆలస్యం చేసేకొద్దీ మూత్ర విశ్లేషణలో డ్రగ్స్ ఆనవాళ్లు తొలగిపోతాయనే కారణంతోనే వారు కాలయాపన చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో వారిని వీలైనంత త్వరగా గుర్తించాలని పోలీసులు భావిస్తున్నారు. నీల్ విదేశాలకు వెళ్లినట్లుగా అనుమానిస్తుండటంతో అతడిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విచారణకు రాని వారందరీ ఇళ్లకు 160 సీఆర్పీసీ నోటీసులు అంటించారు. -
కావాలనే నన్ను ఇరికించారు: డైరెక్టర్ క్రిష్
రాడిసన్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మిగతా వాళ్ల సంగతి పక్కనబెడితే ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. క్రిష్‌ని కూడా నిందితుడిగా చేర్చారు. విచారణకు హాజరు కావాలని కోరారు. దీనికి తొలుత ఒప్పుకొన్నాడు. కానీ ఆ తర్వాత రెండు రోజులు గడువు కావాలని శుక్రవారం వస్తానని పోలీసులతో చెప్పాడు. ఇప్పుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించాడు. తాజాగా ఈ బెయిల్ పై హైకోర్టులో విచారణ జరగ్గా.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ షోకి వెళ్లొచ్చాక నన్ను బ్యాన్ చేశారు: అలీ రెజా) ఈ క్రమంలోనే క్రిష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వివేకానంద్ ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల నన్ను నిందితుడిగా చేర్చారు. నేను డ్రగ్స్ తీసుకున్నాను అనడానికి ఆధారాలు లేవు. నన్ను కావాలనే ఈ కేసులో ఇరికించారు' అని క్రిష్ చెప్పుకొచ్చారు. అయితే రాడిసన్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు అయిన వివేకానంద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే క్రిష్ పేరుని పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఇతడికి, క్రిష్‌కి మధ్య ఏ స్థాయిలో సంబంధాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలనుకుంటున్నారు. పనిలో పనిగా క్రిష్ నుంచి శాంపిల్స్ తీసుకొని పరీక్షలకు పంపించాలనేది పోలీసుల ప్లాన్. కానీ క్రిష్ మాత్రం తనకు సమయం కావాలని చెబుతూ, కోర్టులో బెయిల్ కోసం అప్లై చేశాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
పరారీలో దర్శకుడు క్రిష్
-
రోజుకో మలుపు..భారీ ట్విస్ట్
-
దర్శకులు క్రిష్ వీరమల్లును పూర్తిగా వదిలేసాడా..?
-
స్నేహానికి హద్దు లేదురా
ఆశిష్ గాంధీ, అశోక్, వర్ష, హ్రితిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హద్దు లేదురా..’. రాజశేఖర్ రావి దర్శకత్వంలో వీరేష్ గాజుల బళ్లారి నిర్మించారు. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ని దర్శకుడు క్రిష్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘హద్దు లేదురా..’ టైటిల్ బాగుంది. ఫస్ట్ లుక్, సినిమా థీమ్ వైవిధ్యంగా ఉన్నాయి. సినిమా హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘అలనాటి కృష్ణార్జునులు స్నేహితులు అయితే ఎలా ఉంటారో తెలిపే కథ, కథనంతో ‘హద్దు లేదురా..’ రూ΄పొందింది. ఫైట్స్, పాటలు, సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు రాజశేఖర్ రావి. ‘‘జనవరిలో మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు గాజుల వీరేశ్. ‘‘స్నేహం నేపథ్యంలో రూ΄పొందిన ‘హద్దు లేదురా..’ మా యూనిట్‌కి మంచి పేరు తీసుకొస్తుంది’’ అన్నారు ఆశిష్ గాంధీ. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: రావి మోహన్ రావు. -
సుమంత్ హీరోగా వస్తోన్న కొత్త మూవీ.. గ్లింప్స్ అదుర్స్!
సుమంత్ , మీనాక్షి గోసామి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ చిత్రానికి జాగర్లపూడి సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కాలిపు మధు, ఎం.సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. క్రిష్ మాట్లాడుతూ...'మహేంద్రగిరి వారాహి టైటిల్ బాగుంది. అందరికి కనెక్ట్ అయ్యే కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గ్లింప్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని ఆశిస్తున్నా. చిత్ర యూనిట్ సభ్యులందరికి అభినందనలు తెలుపుతున్నా' అని అన్నారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర దర్శకులు జాగర్లపూడి సంతోష్ తెలిపారు. త్వరలో చిత్ర నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, సత్యసాయి శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. -
నవ్వుల జాతర
క్రిష్ సిద్ధిపల్లి, కష్వీ జంటగా ‘జంధ్యాలగారి జాతర 2.0’ సినిమా షురూ అయింది. వాల్మీకి దర్శకత్వంలో శ్రీ నిధి క్రియేషన్స్ సమర్పణలో సన్ స్టూడియో బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వాల్మీకి మాట్లాడుతూ– ‘‘పూర్తి హాస్యభరిత చిత్రంగా ‘జంధ్యాలగారి జాతర 2.0’ ఉంటుంది. ఈ సినిమాకు జంధ్యాలగారి పేరు పెట్టడంతో మంచి అంచనాలుంటాయి. ఆ అంచనాలను అందుకునేలా మా చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘విందు భోజనం లాంటి చిత్రమిది’’ అన్నారు క్రిష్ సిద్ధిపల్లి. నటులు రఘుబాబు, పృథ్వీ, యాని మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వంశీ కృష్ణ, కెమెరా: విజయ్ ఠాగూర్. -
ద్రోహి వస్తున్నాడు
సందీప్ కుమార్ బొడ్డ పాటి, దీప్తి వర్మ జంటగా విజయ్ పెందుర్తి దర్శకత్వంలో రూపొందిన ఫిల్మ్ ‘ద్రోహి’. ‘ది క్రిమినల్’ అనేది ఉపశీర్షిక. శ్రీకాంత్ రెడ్డి, విజయ్ పెందుర్తి, ఆర్. రాజశేఖర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా లుక్, గ్లింప్స్ ప్రామిసింగ్‌గా ఉన్నాయి. ఈ సినిమాకు పని చేసిన అందరికీ ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ప్రేక్షకులు మెచ్చే అన్ని థ్రిల్లర్ అంశాలున్న చిత్రం ఇది. ఈ నెలలోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. డెబి, ‘షకలక’ శంకర్, నిరోజ్, శివ, మహేశ్ విట్టా కీలక పాత్రలు పొషించిన ఈ చిత్రానికి సంగీతం: అనంత్ నారాయణ. -
పెళ్లి జీవితంపై సంగీత కామెంట్స్.. అప్పట్లో చాలా దారుణంగా!
నటి సంగీత గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పేదేం లేదు. అప్పుడెప్పుడో 'ఖడ్గం' నుంచి స్టిల్ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంది. పెళ్లాం ఊరెళితే, ఆయుధం, ఖుషీఖుషీగా, సంక్రాంతి తదితర చిత్రాలు ఈమెకు బోలెడంత ఫేమ్ తెచ్చిపెట్టాయి. 2010 తర్వాత దాదాపు పదేళ్లపాటు టాలీవుడ్‌కు దూరమైన సంగీత.. 'సరిలేరు నీకెవ్వరు'తో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు-తమిళంలో సినిమాలు చేస్తున్న ఈమె.. తన పెళ్లి జీవితంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 19 మూవీస్) తొందరపడ్డామా అనిపించింది 'పెళ్లి చేసుకున్న తర్వాత మొదట్లో ఈ లైఫ్ అంటేనే చిరాకేసింది. దీని నుంచి బయటపడాలని ప్రయత్నించాను. త్వరగా ఈ మ్యారేజ్ లైఫ్‌ని వదిలేయాలనుకున్నాను. ఎందుకంటే మొదట్లో పరిస్థితులు అంత దారుణంగా ఉండేవి. మేం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా ఆయన ఫ్యామిలీ నుంచి ఒత్తిడి, మా ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో వాళ్లకు దూరమైపోయాం. తొందరపడి పెళ్లి చేసుకున్నామా అనే డౌట్ వచ్చింది' అర్థం చేసుకున్నాం 'తెలిసో తెలియకో ఓ నిర్ణయం తీసుకున్నాను. అది తప్పా ఒప్పా అనేది నాకు తెలియదు. కానీ కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మాత్రం నాపైనే ఉంది. దీన్ని పరిష్కరించాలా? దీని నుంచి బయటకొచ్చేయాలా? నా ముందు రెండే ఆప్షన్స్ కనిపించాయి. అప్పట్లో మా ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి పెద్దగా తెలియదు. ముందు దానిపై వర్క్ చేశాం. ఒకరినొకరు అర్థం చేసుకుని, బాగా నమ్మకం ఏర్పరుచుకున్నాం' (ఇదీ చదవండి: పెళ్లిపై విజయ్ దేవరకొండ కామెంట్స్.. తను కూడా!) వదిలేద్దామనుకున్నా 'ఇద్దరం ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఆలోచనలు, మనస్తత్వాలు, చేసే పనులు అన్నీ మా విషయంలో డిఫరెంట్. దీనిపై వర్క్ చేసి అర్థం చేసుకున్నాం. క్రిష్(సంగీత భర్త) అమేజింగ్ పర్సన్. నన్ను వదులుకోవడం తనకు అస్సలు ఇష్టం లేదు. నేను చాలాసార్లు ఆయన్ని వదిలేద్దామనుకున్నాను. కానీ.. 'అలా చేయొద్దు. జీవితం చాలా చిన్నది. ఇష్టమైన వాళ్లు కొందరే ఉంటారు. వారిని అస్సలు వదులుకోవద్దు' అని నన్ను మోటివేట్ చేశాడు' నాపై చాలా ప్రేమ 'క్రిష్ తో పోలిస్తే నేను ఓ రకమైన రాక్షసిని. నేను ఏది అనుకుంటే అది జరగాలని ఫిక్సవుతాను. తను మాత్రం నాకోసం ఏదైనా చేస్తాడు. అందుకే పెళ్లి జీవితాన్ని కంటిన్యూ చేస్తున్నాను. తను నన్ను చాలా ప్రేమిస్తాడు. చాలా కమాండ్ ఉన్న వ్యక్తి కూడా' అని సంగీత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి తన పెళ్లి జీవితంపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌కి పవన్ కాస్ట్ లీ గిఫ్ట్.. దాంతో పాటు!) -
అలాంటి వారికి సమాధానమే టక్కర్
‘‘మీరెప్పుడూ లవర్ బోయ్ పాత్రలు చేస్తుంటారు. కంప్లీట్ కమర్షియల్ సినిమా చేయొచ్చు కదా?’ అని చాలామంది నన్ను ప్రశ్నిస్తుంటారు.. వారికి సమాధానమే ‘టక్కర్’. ఫుల్ యాక్షన్ అండ్ రొమాంటిక్ టచ్‌తో ఈ ప్రేమకథ నడుస్తుంది’’ అన్నారు సిద్ధార్థ్. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్ జంటగా నటించిన చిత్రం ‘టక్కర్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘బాయ్స్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చా. ఈ ఆగస్టుకి హీరోగా 20 ఏళ్ల కెరీర్ పూర్తవుతుంది. ఇప్పటికీ నా చేతిలో అరడజను సినిమాలు ఉండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘టక్కర్’ న్యూ జనరేషన్ సినిమా. ఇందులో సిద్ధార్థ్‌ని రగ్డ్ లవర్ బోయ్‌గా చూస్తారు ’’ అన్నారు కార్తీక్ జి. క్రిష్. ‘‘ఈ సినిమాతో మళ్లీ పాత సిద్ధార్థ్‌ని చూస్తాం’’ అన్నారు చిత్ర సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. -
స్మార్ట్ సేద్యం: వ్యవసాయ సాధనాల కోసం స్మార్ట్ కిట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రైస్ ట్రాన్స్ప్లాంటర్లు వంటి వ్యవసాయ సాధనాల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఉపయోగపడేలా ఎంఅండ్ఎం గ్రూప్‌లో భాగమైన కృష్–ఈ సంస్థ స్మార్ట్ కిట్ (కేఎస్కే)ని తెలంగాణ మార్కెట్లో ఆవిష్కరించింది. దీనితో రైతులు తమ ట్రాక్టర్లు, వ్యవసాయ సాధనాల వినియోగం వివరాలను స్మార్ట్ ఫోన్ ద్వారా ట్రాక్ చేయొచ్చని ఎంఅండ్ఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రామచంద్రన్ తెలిపారు. ఇదీ చదవండి: iPhone 14 Offers: ఐఫోన్14పై ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు మరో సంస్థలోనూ భారీ డిస్కౌంట్లు! తద్వారా నిర్వహణ వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని, ఆదాయాన్ని మెరుగుపర్చుకోవచ్చని ఆయన వివరించారు. ప్రారంభ ఆఫర్ కింద దీన్ని రూ. 4,995కి (పన్నులు, ఆరు నెలల సబ్స్క్రిప్షన్ ప్యాకేజీ కూడా కలిపి) అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 25,000 పైచిలుకు కిట్స్ వినియోగంలో ఉన్నట్లు కేఎస్‌కేని రూపొందించిన కార్నట్ టెక్నాలజీస్ సీటీవో పుష్కర్ లిమాయే తెలిపారు. కార్నాట్‌లో ఎంఅండ్ఎంకు గణనీయంగా వాటాలు ఉన్నాయి. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు -
కృష్ణవంశీ, క్రిష్, విక్రమ్ కె. కుమార్, హను రాఘవపూడి వెబ్ సిరీస్‌లివే!
ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అంటే గతంలో థియేటరే.. కానీ, ప్రస్తుతం బుల్లితెర కూడా ఇంటిల్లిపాదికీ వినోదం పంచుతోంది. పైగా కరోనా లాక్డౌన్లో ప్రేక్షకులకు ఓటీటీలు మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యాయి. ఇంట్లో కూర్చునే అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్‌లు, షోలు చూస్తున్నారు. వెబ్ సిరీస్‌లకు ఆదరణ బాగా ఉండటంతో సినిమా దర్శకులు సైతం ‘ఓటీటీకి సై’ అంటూ డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే పలువురు దర్శకులు ఓటీటీలోకి ఎంటర్ కాగా తాజాగా ఈ జాబితాలోకి కృష్ణవంశీ, క్రిష్, విక్రమ్ కె. కుమార్, హను రాఘవపూడి వంటి దర్శకులు చేరారు. ఈ దర్శకుల ఓటీటీ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్షన్, యాక్షన్, లవ్, ఫ్యామిలీ.. ఇలా ఏ జోనర్ సినిమా అయినా తన మార్క్ చూపించారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. ఆయన దర్శకత్వం వహించిన ‘రంగ మార్తాండ’ చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. తదుపరి ప్రాజెక్ట్‌గా దాదాపు రూ. 300 కోట్లతో ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లు ఈ మధ్యనే ప్రకటించారు కృష్టవంశీ. తెలంగాణ సాయుధ పోరాటాన్ని వెబ్ సిరీస్‌గా మలచనున్నట్లు తెలిపారాయన. ఒక్కో సీజన్‌కు 10 ఎపిసోడ్స్ చొప్పున 5 సీజన్స్‌గా ఈ సిరీస్‌ని రూపొందించనున్నారట. ఇక సమాజంలోని వాస్తవ అంశాలను, నవలలను, చారిత్రక అంశాలను కథలుగా మలిచి వెండితెరపైకి తీసుకురావడంలో క్రిష్ జాగర్లమూడిది ప్రత్యేక శైలి. ఇప్పటికే ‘మస్తీస్, 9 అవర్స్’ వంటి వెబ్ సిరీస్‌లకు షో రన్నర్‌గా వ్యవహరించిన ఆయన తొలిసారి ఓ వెబ్ సిరీస్‌ని డైరెక్ట్ చేయనున్నారని టాక్. ఒక వేశ్య జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుందట. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హీరోగా ‘హరి హర వీర మల్లు’ షూటింగ్లో బిజీగా ఉన్న క్రిష్ ఆ తర్వాత ఈ వెబ్ సిరీస్‌ను పట్టాలెక్కిస్తారని భోగట్టా. కాగా ‘కన్యాశుల్కం’ నవలను కూడా వెబ్ సిరీస్‌గా తీయాలనుకుంటున్నార ట క్రిష్. మరో దర్శకుడు విక్రమ్ కె. కుమార్ వినూత్న కథాంశాలతో ‘24’, ‘మనం’ వంటి సినిమాలు తెరకెక్కించారు. ప్రేమ కథలతో యువతని, కుటుంబ కథలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేసిన విక్రమ్ కె. కుమార్ బుల్లితెర ప్రేక్షకులను భయపెట్టనున్నారు. తొలిసారి ఆయన ‘దూత’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ ద్వారా హీరో నాగచైతన్య ఫస్ట్ టైమ్ డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ‘మనం, థ్యాంక్యూ’ చిత్రాల తర్వాత చైతన్య–విక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘దూత’ హారర్, థ్రిల్లర్ జానర్లో ఉంటుందని సమాచారం. నాగచైతన్య పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ఇందులో హీరోయిన్లు పార్వతి, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఓ ప్రముఖ ఓటీటీలో ‘దూత’ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ‘అందాల రాక్షసి’ వంటి ప్రేమకథా చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, గత శుక్రవారం విడుదలైన ‘సీతారామం’ వరకూ ప్రేమకథా చిత్రాలను తెరకెక్కిస్తూ లవ్‌స్టోరీస్ స్పెషలిస్టు అనిపించు కున్నారు హను రాఘవపూడి. ప్రేమకథలకు సెంటిమెంట్, భావోద్వేగాలను జత చేసే ఆయన తొలిసారి ఓ వెబ్ సిరీస్‌కి పచ్చజెండా ఊపారు. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ సిరీస్‌లోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివ రాలు అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఓటీటీ ప్రాజెక్ట్స్ ప్రకటించినవారిలో దర్శకుడు తేజ ఉన్నారు. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేయనున్నట్లు ఆ మధ్య ప్రకటించారాయన. అయితే ఈ ప్రాజెక్ట్ వివరాలు తెలియాల్సి ఉంది. కొందరు యువదర్శకులు కూడా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ ‘పిట్ట కథలు’లో ఓ ఎపిసోడ్‌కి దర్శకత్వం వహించారు. తాజాగా సోనీ లివ్ కోసం ఓ వెబ్ సిరీస్ కమిట్ అయ్యారు. అలాగే ‘బెస్ట్ యాక్టర్స్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, వజ్ర కవచధర గోవింద’ వంటి సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు అరుణ్ పవార్ ‘బిగ్ బాస్’ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘అసుర’ మూవీ డైరెక్టర్ కృష్ణ విజయ్ కూడా ‘పరంపర’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. గోపీచంద్ హీరోగా ‘పంతం’ సినిమాని తెరకెక్కించిన కె. చక్రవర్తి రెడ్డి ‘పులి–మేక’ అనే ఓ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ఆది సాయికుమార్, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ సిరీస్ షూటింగ్ జరుపుకుంటోంది. వీరితో పాటు మరికొందరు దర్శకులు వెబ్ సిరీస్‌ల కోసం కథలు సిద్ధం చేసుకుంటున్నారు. -
కిరణ్ అబ్బవరం కొత్త సినిమా షురూ..
Kiran Abbavaram Rules Ranjan Movie Launched: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల 'సెబాస్టియన్ పీసీ 524'తో ఆకట్టుకున్న కిరణ్ అంతకుముందు 'ఎస్ఆర్ కల్యాణమండపం' సినిమాతో హిట్ కొట్టాడు. తాజాగా 'సమ్మతమే' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా రత్నం కృష్ణ దర్శకత్వంలో 'రూల్స్ రంజన్' అనే కొత్త సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో సినీ అతిరథుల సమక్షంలో వైభవంగా జరిగాయి. హీరో కిరణ్ అబ్బవరంపై చిత్రీకరించిన తొలి ముహుర్తపు సన్నివేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు క్రిష్ క్లాప్ కొట్టారు. దర్శక నిర్మాత ఏఎం రత్నం స్క్రిప్ట్ అందించి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. శుక్రవారం (మే 27) నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఏఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆశిష్ విద్యార్థి, అజయ్, వెన్నెల కిశోర్, వైశాలి, హిమాని, జయవాణి, ముంతాజ్, సత్య బాలీవుడ్ నటీనటులు అన్ను కపూర్, సిద్ధార్థ సేన్, అతుల్ పర్చులే అలరించనున్నారు. చదవండి: 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ -
మహేశ్.. ప్రభాస్‌లా నాకూ చేయాలని ఉంది: వైష్ణవ్ తేజ్
‘‘మా మామయ్యలు (చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్), అన్నయ్య (సాయితేజ్)కు ప్రేక్షకుల్లో ఇమేజ్ రావడం చూశాను. కానీ నాకో ఇమేజ్ వస్తే ఎలా రియాక్ట్ రావాలో ఆలోచించలేదు. ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు అందరూ నన్ను చూస్తుంటే బిడియంగా ఉంటుంది’’ అన్నారు హీరో వైష్ణవ్ తేజ్. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. ‘బిబో’ శ్రీనివాస్ సమర్పణలో జె. సాయిబాబు, వై. రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ చెప్పిన విశేషాలు. ► క్రిష్‌గారి సినిమాలన్నా, మేకింగ్ అన్నా నాకు చాలా ఇష్టం. ‘వేదం, గమ్యం’ సినిమాలు బాగా నచ్చాయి. క్రిష్‌గారు ఫోన్ చేసినప్పుడు సినిమా కోసమని అనుకోలేదు. పైగా అప్పటికి నా ‘ఉప్పెన’ విడుదల కాలేదు. నేను ఆయన ఇంటికి వెళ్లాక ‘కొండపొలం’ కథ చెప్పారు. నా రెండో సినిమాకే క్రిష్ వంటి సీనియర్‌తో పని చేసే అవకాశం రావడం సంతోషంగా అనిపించింది. ► ‘కొండపొలం’ అనే అంశమే కొత్తది. నేనెప్పుడూ వినలేదు. క్రిష్‌గారు కొత్త కథ చెప్పాలనుకున్నారు.. పైగా నాకూ కథ కొత్తగా అనిపించడంతో ఒప్పుకున్నాను. ఈ సినిమా కోసం కొండలు ఎక్కేవాళ్లం, రెండు మూడు కిలోమీటర్లు నడిచేవాళ్లం. అదేం పెద్ద కష్టంగా అనిపించలేదు. అయితే ఎండలో రోజంతా మాస్కులు పెట్టుకుని చేయడం కష్టంగా అనిపించింది. ఏమీ లేని స్థాయి నుంచి ఎన్నో కష్టాలను దాటుకుని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ స్థాయికి ఎదగడమే ‘కొండపొలం’ కథ. అడవితో, అక్కడ ఉన్న ఓబులమ్మతో ప్రేమలో పడతాడు. ఈ కథ, పాత్రలు చాలా కొత్తగా అనిపిస్తాయి. పెద్ద హీరోల సినిమాలు చూసినప్పుడు నాకూ అలాంటి కమర్షియల్ కథలు చేయాలనిపిస్తుంది. ప్రభాస్, మహేశ్‌బాబు అన్నల్లా నాక్కూడా కొట్టాలనిపిస్తుంది (సినిమాలో విలన్లను). మా ఫ్యామిలీకి కూడా నన్ను అలా చూడటం ఇష్టం. అదే సమయంలో కొత్త పాత్రలు చేయాలనిపిస్తుంది. ► ‘కొండపొలం’ కోసం ప్రత్యేకంగా వర్క్ షాప్స్ చేయలేదు. కొన్ని పదాలు మాత్రం యాసలోనే మాట్లాడాలని క్రిష్‌గారు చెప్పారు.. అలానే చేశాను. నా రెండో సినిమాకే కీరవాణిగారితో పని చేయడం నా అదృష్టం. ► కథకు తగ్గట్టు సినిమా తీశారా? లేదా? అని ఇప్పుడే చెప్పేంత అనుభవం నాకు లేదు. నా నటన గురించి నేను జడ్జ్ చేసుకోవడం కంటే దర్శకుడు, ప్రేక్షకులు చెబితేనే బాగుంటుంది. కొన్నిసార్లు బాగా చేశామని మనసు చెబుతుంది.. అలాంటప్పుడు మానిటర్ చూస్తాను. ఓటీటీ ఆఫర్లు వస్తే నటిస్తాను. ప్రస్తుతానికి గిరి సాయితో (తమిళ ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు) ఓ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రం తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ సినిమా ఉంటుంది. ‘రిపబ్లిక్’ చిత్రంలో అన్నయ్య ఐఏఎస్‌గా చేశారు. ‘కొండపొలం’ మూవీలో నేను ఐఎఫ్ఎస్. ‘రిపబ్లిక్, కొండపొలం’ సినిమాకు సంబంధం ఉండదు. అన్నయ్య బాగున్నారు.. భయపడాల్సిన పనిలేదు. ఫిజియోథెరపీ జరుగుతోంది.. త్వరలోనే ఆస్పత్రి నుంచి బయ టకు వస్తారు. అడవిలో ఎక్కువ రోజులు షూటింగ్ చేయడంతో చాలా విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా మనకు అడవి ఎంతో ఆక్సిజన్‌ను ఇస్తుంది. అలాంటి అడవుల్లో ఎక్కువగా చెత్త వేయకూడదనిపించింది. ‘కొండపొలం’ షూటింగ్లో మొదట్లో గొర్రెల భాషను అర్థం చేసుకోలేకపోయాను. తల పొట్టేలు నడిచినట్టుగానే మిగతా గొర్రెలు కూడా నడుస్తాయి. వాటికి ఇష్టమైన పచ్చళ్లతో వాటిని కంట్రోల్ చేశాం. -
ఛాలెంజింగ్ పాత్రలు ఇష్టం
‘‘కొన్ని సన్నివేశాలకో, పాటలకే పరిమితం అయ్యే పాత్రలు చేయాలనుకోవడం లేదు. ఛాలెంజింగ్ పాత్రలు చేయాలనుకుంటున్నాను.. అందుకే సెలెక్టివ్‌గా ఉంటున్నాను. ఓబులమ్మ పాత్ర నన్ను ఎగై్జట్ చేయడంతో ‘కొండపొలం’ సినిమా చేశాను’’ అని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. బిబో శ్రీనివాస్ సమర్పణలో వై.రాజీవ్‌రెడ్డి, జె.సాయిబాబు నిర్మించిన ఈ సినిమా రేపు(8న) విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రకుల్ ప్రీత్‌సింగ్ పంచుకున్న విశేషాలు... ► ‘కొండపొలం’ కథ చెప్పేందుకు క్రిష్‌గారు ఇంటికి వచ్చినప్పుడు నేను షార్ట్, టీషర్ట్‌లో ఉన్నాను. ‘చాలా యంగ్‌గా ఉన్నావ్.. వైష్ణవ్ తేజ్ పక్కన యంగ్ గర్ల్ కావాలనుకున్నా.. అలాగే ఉన్నావ్’ అంటూ క్రిష్‌గారు ఎగై్జట్ అయ్యారు. ఆయన కథ చెబుతున్నప్పుడే వెంటనే ఓకే చెప్పేశాను. గొర్రెల కాపర్ల గురించి ‘కొండపొలం’ లాంటి చిత్రం ఇంత వరకూ ఇండియాలో రాలేదు. ► ‘కొండపొలం’ లో పూర్తిస్థాయిలో గొర్రెలు కాసే పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను. అడవిలో గొర్రెలను కంట్రోల్ చేయడానికి నేను, వైష్ణవ్ మొదట్లో చాలా కష్టపడ్డాం. అయితే షూటింగ్ స్టార్ట్ చేసిన నాలుగైదు రోజుల్లోనే ఎలా కంట్రోల్ చేయాలో తెలిసింది. ► ‘కొండపొలం’ చూడటానికి ఈజీగా ఉంటుంది. కానీ, షూట్ చేయడం చాలా కష్టమైంది. కీరవాణిగారి సంగీతం అద్భుతంగా ఉంది. ► ఈ నెల 10న నా పుట్టినరోజు. అయితే ఆ రోజు ఎటువంటి సెలబ్రేషన్స్ చేసుకోవడం లేదు. షూటింగ్లో ఉంటాను. ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఏదీ అంగీకరించలేదు. ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలు కూడా చేయాలని ఉంది. కరణం మల్లీశ్వరీ బయోపిక్ చేస్తున్నాననే వార్తల్లో వాస్తవం లేదు. ► నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదు. కానీ మనం ఒక్క సినిమా చేస్తే అది జీవితాంతం ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవాలి. ఒక డీడీఎల్జే (దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే), ఒక ‘బాహుబలి’ లాంటి సినిమాలు చేస్తే చాలనిపిస్తోంది. అలాంటి కేటగిరిల్లో ‘కొండపొలం’ కూడా ఉంటుందని నమ్ముతున్నాను. సాయి తేజ్‌తో నేరుగా మాట్లాడలేదు. వైష్ణవ్ తేజ్ నుంచి తేజు ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాను. -
ఫిల్మ్ మేకింగ్‌లో నాకు నచ్చింది అదే!
‘‘దర్శకులంతా కలిసినప్పుడు పుస్తకాల గురించి చర్చించుకుంటాం. అలా కరోనా సమయంలో ఓసారి డైరెక్టర్స్ అందరం కలిసినప్పుడు ‘కొండపొలం’ నవల గురించి ఇంద్రగంటి మోహనకృష్ణ, సుకుమార్ గార్లు చెప్పడంతో చదివాను.. బాగా నచ్చడంతో సినిమాగా తీశా’’ అని దర్శకుడు క్రిష్ అన్నారు. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. బిబో శ్రీనివాస్ సమర్పణలో వై. రాజీవ్‌రెడ్డి, జె. సాయిబాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా క్రిష్ చెప్పిన విశేషాలు. ►సాహసం నేపథ్యంలో ఓ కథ చెప్పాలనుకున్నాను. ఆ సమయంలో ‘సప్తభూమి, కొండపొలం’ పుస్తకాలు చదివా. ‘కొండపొలం’ బాగా నచ్చడంతో ఆ నవలా రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిని కలిసి హక్కులు తీసుకున్నాం. ‘కొండపొలం’ హక్కులు కొన్నావా? అని సుకుమార్ అడిగారు. నేను తీసుకున్నానని చెప్పడంతో వదిలేశారు. లేకుంటే ఆయన తీసుకోవాలనుకున్నారు. ‘సప్తభూమి’ నవల హక్కులు కొనేందుకు ట్రై చేశాం.. కానీ కుదరలేదు. ►రచయితకు విపరీతమైన పరిధి ఉంటుంది. పుస్తకం రాయడం వేరు.. సినిమాగా తీయడం వేరు. సన్నపురెడ్డి ‘కొండపొలం’ అద్భుతమైన కథ.. స్క్రీన్‌ప్లే చక్కగా ఉంటుంది. ఆ కథలో ఓబులమ్మ పాత్ర ఉండదు. కానీ దానికి అందమైన ప్రేమకథను జోడిస్తే బాగుంటుందని ఓబులమ్మ పాత్రను క్రియేట్ చేశాం. దాన్ని సన్నపురెడ్డికి చెప్పాను.. ఆయనే ఈ సినిమాకు కథనం రాయడం వల్ల నాకు సులభం అయ్యింది. ►వైష్ణవ్‌ను తన పదో తరగతి అప్పుడో ఇంటర్లోనో చూశాను. ‘కొండపొలం’ అనుకున్నప్పుడు తనను ఓ పార్టీలో చూశా. అప్పటికింకా తన ‘ఉప్పెన’ చిత్రంలోని ‘నీ కళ్లు నీలి సముద్రం..’ పాట రాలేదనుకుంటాను. ఆ పాట చూడమన్నాడు.. చూడగానే వైష్ణవ్ తేజ్ కళ్లు బాగా అట్రాక్ట్ చేశాయి. కొండపొలం’లో రవీంద్ర పాత్రకు వైష్ణవ్ తేజ్ సరిపోతాడనిపించింది. వైష్ణవ్‌ని ఇంటికి పిలిపించి సినిమా గురించి చెప్పాను. వైష్ణవ్‌కి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాననే యాటిట్యూడ్ ఉండదు. నేర్చుకోవాలనే తపన ఎంతో ఉంది.. అందుకే ‘ఉప్పెన’, ‘కొండపొలం’ లాంటి కథలు ఎంచుకున్నాడు. ►ఓబులమ్మ పాత్రకు రకుల్ ప్రీత్ సరిపోతారని కెమెరామేన్ జ్ఞానశేఖర్ చెప్పారు. ఈ కథను రకుల్‌కు చెబుతున్నప్పుడే ఆమె హావాభావాలు చూసి ఈ పాత్రకు సరిపోతుందనుకున్నాను. తనకూ కథ నచ్చడంతో పాత్ర కోసం మరింత సన్నబడింది. ►గొర్రెలను అడవులకు తీసుకెళ్తే పులులు వస్తాయని గోవాలో షూటింగ్‌కి పర్మిషన్ ఇవ్వలేదు. నల్లమలలో తీద్దామనుకుంటే కోవిడ్ వల్ల కుదరలేదు. అందుకే వికారాబాద్ అడవుల్లో చేశాం. కొండపై దాదాపు 1000 గొర్రెలతో షూటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఉదయం 6:30 గంటలకే అందరం సెట్స్‌లో ఉండేవాళ్లం. ఈ సినిమా చూస్తుంటే మనం కూడా గొర్రెల కాపరిలా భావిస్తాం.. అంతలా కథలో లీనమవుతాం. ►‘కొండపొలం’ కోసం సంగీత దర్శకునిగా ముందుగా కీరవాణిగారి తనయుడు కాలభైరవకి ఫోన్ చేశాను. ‘కొండపొలం’ చదివి కీరవాణిగారు ఎగై్జట్ అయ్యారు. మీ కంటే ముందు ఓ మ్యూజిక్ డైరెక్టర్‌కు ఫోన్ చేశానని కీరవాణిగారికి చెప్పడంతో ఎవరు? అన్నారు. కాలభైరవ అంటే నవ్వారు. ‘ఎవరు కావాలో నువ్వే తేల్చుకో?’ అనడంతో ‘మీరే కావాలి’ అన్నాను. ∙ఫిల్మ్ మేకింగ్‌లో నాకు నచ్చింది రచనే. ఇప్పుడు నేను హాట్ స్టార్‌కు ఓ కథ రాస్తున్నాను. నేను చేసే ప్రతి సినిమా ఓ కొత్త అధ్యాయంలా ఉంటే ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ‘అతడు అడవిని జయించాడు’ స్ఫూర్తితో వెంకటేశ్‌గారితో అడవి నేపథ్యంలో సినిమా చేయాల్సింది... కానీ కుదర్లేదు. -
అమ్మతో ఉన్న ఫొటో షేర్ చేసిన హృతిక్... తడి గోడను పట్టేసిన నెటిజన్
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ పేరు తెలియని భారతీయ సినీప్రియులు లేరనే చెప్పాలి. ఆయన్ను బాలీవుడ్లో గ్రీకువీరుడు అని పిలుస్తుంటారు. క్రిష్ సిరీస్‌లో నటించి దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించాడు. అప్పటి వరకూ బాలీవుడ్ మాత్రమే ఎక్కువ తెలిసిన ఈ కండల వీరుడు సూపర్ హీరో సినిమాలతో ఇండియా మొత్తం అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ఆయన ఇంట్లో తడి గోడ హాట్ టాపిక్‌గా మారింది. ఆయన వివరణ ఇవ్వడంతో అది వైరల్‌గా అయ్యింది. హృతిక్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో తెలిసిందే. అయితే ఆయన బుధవారం తన తల్లి పింకీ రోషన్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. ఆ సమయంలో ఆమె బాల్కనీలో నుంచి బయటకు చూస్తోంది. ఈ ఫోటో వైరల్‌గా మారింది. అయితే ఓ అభిమాని మాత్రం గోడ తడిగా ఉన్న విషయం గుర్తించి కామెంట్ పెట్టాడు. దీనిపై స్పందించిన హీరో తాను అద్దె ఇంట్లో ఉంటున్నట్లు, త్వరలో సొంత ఇంటికి మారబోతున్నట్లు వెల్లడించాడు. అంతేకాకుండా తడి ఉంటే కదా దాన్ని రిపేర్ చేసే విధానాన్ని ఎంజాయ్ చేయెచ్చని అన్నాడు. అయితే గతంలో జుహులోని ఓ అపార్ట్మెంట్లో అద్దె ఉంటున్న ఈ అందగాడు దానికి రూ.8.25 లక్షల అద్దె చెల్లిస్తున్నట్లు ముంబైలోని ఓ మీడియా తెలిపింది. అనంతరం ఆయన మొత్తం 97.5 కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్స్ కొన్నట్లు అదే మీడియా రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
గురు వెన్నెల
-
వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమా: రిలీజ్ డేట్ ఫిక్స్.. టైటిల్ అదేనా!
తొలి సినిమా ‘ఉప్పెన’తోనే బాక్సాఫీస్ బద్దలు కొట్టిన హీరో వైష్ణవ్‌తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యంగ్ హీరో.. తనదైన నటనతో ఒక్క సినిమాతోనే లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు.ఉప్పెన’సినిమా చూసిన వాళ్లంతా వైష్ణవ్‌కు ఇది తొలి సినిమా అంటే నమ్మలేరు. అంతలా నటించాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఇక తన రెండో సినిమాకి ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించాడు. అడవి నేపథ్యంలో సాగే ఈ మూవీని ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. (చదవండి: అధ్యక్ష భవనంలో తాలిబన్ల జల్సాలు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్) తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించింది చిత్ర బృందం. అక్టోబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మవీ.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్ని జరుపుకుంటుంది. ఈ మూవీ టైటిల్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘కొండపొలం’అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న కారణంగా అదే పేరుని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. (చదవండి: క్యూట్‌గా నవ్వులు చిందిస్తున్న ఈ కవలలు ఎవరో తెలుసా?) -
నిధి అగర్వాల్‌కు ‘హరి హర వీరమల్లు' సర్ప్రైజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. నిధి అగర్వాల్ పవన్ సరసన హీరోయిన్గా నటిస్తుంది. మంగళవారం (ఆగస్టు17)న నిధి అగర్వాల్ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమాకు సంబంధించి ఆమె ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. పంచమి అనే పాత్రలో ఈ ఇస్మార్ట్ బ్యూటీ కనిపించనుంది. నిండైన చీరకట్టు, నాట్యం చేస్తున్నట్లున్న నిధి లుక్ ఆకట్టుకుంటుంది. 15వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యపు కాలం నాటి పరిస్థితుల ఆధారంగా సినిమా నేపథ్యం ఉండనుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన వన్ కళ్యాణ్ ఫస్ట్ గ్లిమ్స్‌కి భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ బందిపోటు దారుడిగా నటించనున్నట్లు తెలుస్తుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అగ్ర నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో ఈ చిత్రం రూపొందుతుంది. నిధి అగర్వాల్‌తో పాటు జాక్వలైన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్గా నటించనుంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. చదవండి :షూటింగ్ చేస్తుండగా చంపేస్తామని బెదిరించారు: సత్యదేవ్ (Bheemla Nayak: కేక పెట్టిస్తున్న ఫస్ట్ గ్లింప్స్, పవన్ ఎంట్రీ అదుర్స్) Beauty as ELEGANT & RADIANT as the Moon… We wish our gorgeous #PANCHAMI @AgerwalNidhhi a very Happy Birthday! ❤️ - Team #HariHaraVeeraMallu @PawanKalyan @AMRatnamOfI @ADayakarRao2 @mmkeeravaani @gnanashekarvs @saimadhav_burra @benlock @aishureddy82 @HHVMFilm pic.twitter.com/U4PL2aIqKI — Krish Jagarlamudi (@DirKrish) August 17, 2021 -
Peanut Diamond: ట్రైలర్‌పై క్రిష్ ప్రశంసలు
అభినవ్ సర్దార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్ రాసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం "పీనట్ డైమండ్". ఇటీవల రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుందన్నాడు. దర్శకుడు ఎంత శ్రద్ధ పెట్టి సినిమా చేశారో అర్థం అవుతుందని, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని తెలిపాడు. ఈ సినిమా హిట్ అయ్యి దర్శకనిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నాడు. ట్రైలర్ చూస్తుంటే నర్సిపట్నంలో దొరికే వజ్రాల వేట చుట్టూ కథ కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఎఎస్పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ నిర్మిస్తున్నారు. వెంకటేష్ త్రిపర్ణ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్ లతో మంచి క్రేజ్ ను దక్కించుకున్న ఈ సినిమ కి `బెంగాల్ టైగర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. హీరో సుధీర్ బాబు రిలీజ్ చేసిన సినిమా పాటకు విశేష స్పందన లభించింది. చదవండి: 30 ఇయర్స్ అంటోన్న బాలాదిత్య -
పాన్ ఇండియా ప్రాజెక్టు : సోనూసూద్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..
సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా కాలంలో రియల్ హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆపదలో ఉన్న వారిని దేవుడిలా ఆదుకుంటూ, ఏ కష్టం వచ్చిన కాదనకుండా సాయం చేస్తూ ఆపద్భాందవుడిలా మారాడు. గతేడాది లాక్డౌన్లో ఎంతోమంది వలస కార్మికులను తమ సొంతూళ్లకు చేర్చడంతో ప్రారంభమవ్వగా.. ఇప్పటికీ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ తన సేవలను కొనసాగిస్తున్నాడు. తన పనులతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆదుకోవాలని అడిగిన వారందరికి నేనున్నానంటూ అండగా నిలుస్తూ దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకున్నాడు. అయితే రియల్ లైఫ్‌తో పాటు రీల్ లైఫ్‌లోనూ సోనూసూద్‌ని హీరోగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఆయన సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించారు. అయితే ఇకపై హీరోలా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ పాన్ఇండియా సినిమాలో సోనూసూద్ హీరో పాత్ర పోషించనున్నారట. ఇందకోసం ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ ఓ మంచి కథను సిద్ధం చేశారని, సోనూసూద్‌కి కూడా కథ నచ్చడంతో వెంటనే ఓకే చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం క్రిష్ పవన్ కల్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పూర్తవగానే సోనూసూద్ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్తారట. ఇదే నిజమైతే త్వరలోనే వెండితెరపై కూడా సోనూను హీరోగా చూడాలన్న చాలా మంది కల నెరవేరినట్లే. చదవండి : భవిష్యత్తు ప్రధాని సోనూసూద్.. స్పందించిన నటుడు Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఆర్ఆర్ఆర్’ సర్ప్రైజ్ వచ్చేసింది -
వారిద్దరూ జంటగా '101 జిల్లాల అందగాడు'
అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ జంటగా తెరకెక్కిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ఈ సినిమాతో రాచకొండ విద్యాసాగర్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. నిర్మాత ‘దిల్’ రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్‌పై శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ సినిమాను మే 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా మంచి ఎంటర్టైనింగ్ కథను అందించారు అవసరాల శ్రీనివాస్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రామ్, సంగీతం: శక్తికాంత్ కార్తీక్. -
పవన్ రెండో హీరోయిన్ ఫిక్స్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ను హీరోయిన్గా తీసుకున్నారు. ఈ చిత్రంలో ఆమె యువరాణి పాత్రలో కనిపించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ వజ్రాల దొంగగా కనిపిస్తారట. తాజాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు సమాచారం. దీంతో పవన్‌తో జోడీ కట్టే భామ ఎవరా? అని ఆయన అభిమానులు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో రెండో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆమె పాత్ర వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇక ఈ శ్రీలంక భామ గతంలో జూనియర్ ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో చిందులేసింది. కానీ ఈసారి పూర్తి స్థాయిలో ఆడిపాడి అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఏయం రత్నం నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. (చదవండి: పవన్ కల్యాణ్ న్యూ లుక్ ఫోటోలు వైరల్) మరోవైపు పవన్ కల్యాణ్ తాజాగా నటించిన వకీల్ సాబ్ ఉగాది కానుకగా ఏప్రిల్ 9న థియేటర్లలో సందడి చేయనుంది. ఇక పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం'కు ఇది రీమేక్. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 25న ఆరంభమైంది. సాగర్ కె.చంద్ర దర్శకుడు. ప్రముఖ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే– సంభాషణలు అందిస్తున్నాడు. సముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. (చదవండి: వకీల్ సాబ్ వచ్చేస్తున్నాడు.. ఆ రోజే రిలీజ్) -
పల్లెటూరి అమ్మాయి
క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కుతోంది. అడవి నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇటీవలే షూటింగ్ ప్రారంభించారు. వికారాబాద్ అడవుల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సినిమాలో రకుల్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తున్నారని ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని స్టిల్స్ చెబుతున్నాయి. ఆ మధ్య రకుల్ షూటింగ్లో పాల్గొన్నప్పటి ఫొటోలు ఇవి. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి.. డ్రగ్స్ తీసుకుంటున్న వారి పేర్లలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా చెప్పారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
శ్రియ గమనం
శ్రియ కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘గమనం’. శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. పోస్టర్లో మధ్యతరగతి యువతిలా కనిపిస్తున్నారు శ్రియ. ఓ రియల్ లైఫ్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు సృజనరావు తెరకెక్కించారు. కెమెరామేన్ జ్ఞానశేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తూనే రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపులతో కలిసి నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందించారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాశారు. -
నాన్‌స్టాప్ నలభైరోజులు
వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. వికారాబాద్ అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు. నలభైరోజులు నాన్‌స్టాప్‌గా జరిగే ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. మంగళవారం ఈ సెట్లో అడుగుపెట్టారు రకుల్. ప్రస్తుతం వైష్ణవ్, రకుల్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు. -
సువర్ణా.. ఇన్నావా
క్రిష్ హీరోగా, అశ్విత, త్రిష హీరోయిన్లుగా బి.ఎన్.ఎస్ రాజు దర్శకత్వంలో తెరక్కిన చిత్రం ‘రావణలంక’. కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్‌పై క్రిష్ బండిపల్లి నిర్మించారు. ఈ చిత్రంలోని మొదటి పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా బి.ఎన్.ఎస్ రాజు మాట్లాడుతూ –‘‘యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. యాక్షన్ థ్రిల్లర్‌ని ఎంజాయ్ చేసే ఆడియ¯Œ ్సతో పాటు ఫ్యామిలీ ఆడియ¯Œ ్స కూడా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. మా సినిమా ఆడియో హక్కుల్ని ఆదిత్య మ్యూజిక్ వారు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తాజాగా విడుదల చేసిన ‘సువర్ణా ఇన్నావా...’ పాట యూత్‌ని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ పాటను ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ పాడారు’’ అన్నారు. -
అడవిలో కథ
‘ఉప్పెన’ ద్వారా హీరోగా పరిచయం కాబోతున్న చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ రెండో సినిమా అంగీకరించారు. క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై జాగర్లమూడి సాయిబాబు, వై. రాజీవ్‌రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నిర్మాణ సంస్థ కార్యాలయంలో జరిగాయి. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక. ‘‘అడవి నేపథ్యంలో జరిగే కథ ఇది. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాం. సింగిల్ షెడ్యూల్లో సినిమాని పూర్తి చేయడానికి క్రిష్ సన్నాహాలు చేస్తున్నారు’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్ వి.ఎస్. -
బాలీవుడ్ యువ కాస్టింగ్ డైరెక్టర్ మృతి
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వెనువెంటనే పెను విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖుల వరుస మరణాలు బీటౌన్ ఇండస్టీని ఆందోళనకు గురి చేస్తోంది. బుధవారం పాటల రచయిత అన్వర్ సాగర్ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ యువ కాస్టింగ్ డైరెక్టర్ క్రిష్ కపూర్ మృతి చెందారు. మెదడులో రక్తస్రావం జరిగి మే 31న ముంబైలో తుదిశ్వాస విడిచారు. క్రిష్ కపూర్ మరణాన్ని అతని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అతి చిన్న వయస్సులోని క్రిష్ కపూర్ మృతి చెందడం బాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 28 ఏళ్ల వయసున్న కపూర్‌కు భార్య, ఏడేళ్ల పాప ఉన్నారు. (పాటల రచయిత అన్వర్ ఇక లేరు) మహేష్ భట్ నిర్మాతగా వ్యవహరించిన ‘జలేబీ’, కృతి ఖర్బందా నటించిన ‘వీరే కి వెడ్డింగ్’ వంటి సినిమాలకు క్రిష్ కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అయితే కపూర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడని పలు వార్తలు వినిపించగా.. అతని మామయ్య సునీల్ భళ్లా ఈ వార్తలను ఖండించారు. సబర్బన్ మీరా రోడ్డులో ఉన్న తన ఇంట్లో క్రిష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని వెంటనే ఆసుపత్రిలో చేర్చగా మెదడులో రక్తస్రావం ఏర్పడి మరణించాడని వెల్లడించారు. తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, పూర్తిగా ఆరోగ్యంగా ఉండేవాడని ఆయన పేర్కొన్నారు. క్రిష్ మరణం తమ కుటుంబాన్ని షాక్‌కు గురిచేసిందని సునీల్ భళ్లా వాపోయారు. (చిరంజీవి ఇచ్చిన సరుకులే ఆసరా..) -
పవర్ స్టార్ సరసన అనుష్క?
చిన్న గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ జోరు పెంచారు. వేణు శ్రీరామ్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్’ విడుదలకు సిద్దంగా ఉంది. అయితే కరోనా లాక్‌డౌన్‌తో థియేటర్లకు తాళం పడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వకీల్ సాబ్ విడుదలవడంతో పాటు క్రిష్ సినిమా పట్టాలెక్కేది. కానీ కరోనాతో అన్నీ తలకిందులయ్యాయి. అయితే ఈ లాక్డౌన్ సమయాన్ని ప్రీ ప్రొడక్షన్ పనులకోసం సద్వినియోగం చేసుకుంటున్నారు దర్శకులు. ఈ క్రమంలో పవన్-క్రిష్ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాబిన్ హుడ్ కాన్సెప్ట్‌తో హిస్టారికల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ బందిపోటు పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్ ‘విరూపాక్ష’గా ఫిక్సయిందని టాలీవుడ్ టాక్. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ల విషయంలో స్పష్టతరావడం లేదు. తొలుత ఈ చిత్రంలో జాక్వలిన్ ఫెర్నాండెజ్ అని అనుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్రంలో స్వీటీ అనుష్క పవన్ సరసన నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరి హీరోయిన్లకు అవకాశం ఉండటంతో జాక్వలిన్, అనుష్కల వైపు క్రిష్ మొగ్గు చూపుతున్నట్లు ఫిలింనగర్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు. దీంతో ఈ సినిమా అప్డేట్ కోసం పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చదవండి: ‘విజయ్ ఆగ్రహం.. మద్దతిచ్చిన టాలీవుడ్’ ‘డియర్ విజయ్.. నేనర్థం చేసుకోగలను’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_191237004.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పవన్ సినిమా.. నన్నెవరూ కలవలేదు
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్దంగా ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా మే15న విడుదలై క్రిష్ పీరియాడికల్ చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. దీంతో ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోయాయి. అయితే ఈ అనూహ్యంగా దొరికిన ఖాళీ సమయాన్ని ప్రీ ప్రొడక్షన్ పనులకోసం వినియోగించుకుంటున్నారు. పవన్-క్రిష్ కాంబినేషన్లో రాబోతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీలో ఓ పవర్ఫుల్ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ శివకార్తీకేయన్‌ను చిత్రబృందం సంప్రదించినట్లు అనేక వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఈ కోలీవుడ్ హీరో సన్నిహితులు స్పందించారు. పవన్ సినిమా గురించి శివకార్తీకేయన్‌ను ఎవరు స్పందించలేదని, ప్రస్తుతం వరుస తమిళ సినిమాలతో అతడు బిజీగా ఉన్నారని చెబుతున్నారు. అయితే ఈ విషయంపై స్పష్టతరావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ చిత్రంలో బందిపోటుగా పవన్ కనిపించనున్నారని లీకువీరులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో పవన్ పాత్ర పేరు వీరు అని అందుకే ‘విరూపాక్ష’ అనే సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేయాలని క్రిష్ భావిస్తున్నారని మరో వార్త వినిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఇద్దరి హీరోయిన్లు నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కీరవాణి సంగీతమందిస్తున్నట్లు సమాచారం. చదవండి: రాజమౌళికి రిక్వెస్ట్.. ఏం చేస్తారో చూడాలి భన్సాలీ చిత్రం.. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అప్పుడు మంచి సినిమా బతుకుతుంది
‘‘మూడు నెలల క్రితం ‘ప్రెజర్ కుక్కర్’ చూసి, నచ్చింది కానీ చిన్న కరెక్షన్స్ చేయాలని చెప్పాను. 3 వారాల క్రితం మళ్లీ చూశాను. సుజోయ్, సుశీల్ మంచి సినిమా తీశారనిపించింది. 12 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోని చాలామంది హెల్ప్ చేయడం వల్ల నేనిప్పుడీ స్థాయిలో ఉన్నాను. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించి ఈ డైరెక్టర్లు ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు క్రిష్. సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా సుజోయ్, సుశీల్ దర్శకత్వంలో సుశీల్ సుభాష్, అప్పిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్లో దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ– ‘‘బాగున్న సినిమాను చూసినవారు మరో పదిమందికి చూడమని చెబితే మంచి సినిమా బతుకుతుంది. ఈ టీజర్ చూసినప్పుడు నా ప్రెజర్ కుక్కర్ జర్నీ గుర్తుకు వచ్చింది’’ అన్నారు. ‘‘డైరెక్టర్ క్రిష్ మాకు ఎంతో సహాయం చేశారు. భవిష్యత్‌లో కొత్తవారికి మేం కూడా ఇలానే చేయాలని చెప్పారు. ఆ మాట గుర్తుపెట్టుకుంటాం. తరుణ్ భాస్కర్, ‘మధుర’ శ్రీధర్‌కు థ్యాంక్స్’’ అన్నారు దర్శకులు. ‘‘అమెరికా వెళ్లిన చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు. నువ్వు అమెరికాకు వెళ్లకపోతే ఎందుకూ పనికిరావని తోమేస్తున్న తల్లిదండ్రులకు ఈ సినిమా ఓ కనువిప్పు’’ అన్నారు నటుడు తనికెళ్ల భరణి. నటి సంగీత, హీరోలు సాయి రోనక్, విశ్వక్ సేన్, నిర్మాతలు రాజ్ కుందుకూరి, దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ తదితరులు మాట్లాడారు. -
రావణలంక
మురళీ శర్మ, దేవ్ గిల్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రానికి ‘రావణ లంక’ అనే టైటిల్ ఖరారు చేశారు. బీఎన్ఎస్ రాజు దర్శకత్వంలో క్రిష్ సమర్పణలో కె. సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బేనర్లో రూపొందుతున్న ఈ చిత్రంలో క్రిష్, అస్మిత, త్రిష ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఆదివారం చిత్రం మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బీఎన్ఎస్ రాజు మాట్లాడుతూ – ‘‘ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిస్తున్నాం. ఉజ్జల్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాటలు హైలైట్. త్వరలో పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. -
పవన్ కల్యాణ్ హీరోయిన్ ఫిక్స్!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వేగం పెంచాడు. రాజకీయాలతో బిజీగా మారడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన పవన్.. తాజాగా వరుస సినిమాలతో దూకుడు పెంచాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘పింక్’రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తమిళంలో కూడా హిట్ సాధించిన పింక్ రిమేక్‌ను పవన్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంజలి, నివేదా థామస్, అనన్య పాండేలు నటిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నారట. కాగా, ఈ చిత్రం నిర్మాణ దశలో ఉండగానే మరో చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లె పనిలో పవన్ ఉన్నట్లు సమాచారం. ఎప్పటినుంచో ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో పవన్ సరసన ‘కంచె’ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్‌ను ఎంపిక చేసినట్లు అనధికారిక సమాచారం. చారిత్రక నేపథ్యంతో పాటు ఓ ఎమోషనల్ విప్లవాత్మకమైన పాయింట్‌ను కూడా టచ్ చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్. అంతేకాకుండా ఈ చిత్రంలో మంచి కోసం పరితపించే ఓ దొంగ పాత్రలో పవన్ నటించనున్నట్లు సమాచారం. ఇక ఈ రెండు చిత్రాలతో పాటు పూరి జగన్నాథ్ చిత్రం కూడా లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాల్లోకి పవన్ రీఎంట్రీతో అయన అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
సంగీత ఈజ్ బ్యాక్
సినిమా: నటి సంగీత గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదనుకుంటా. బహుభాషా నటి. కథానాయకిగానే కాకుండా ప్రతినాయకి ఛాయలున్న పాత్రలనైనా సమర్థవంతంగా పోషించి మెప్పించగల సత్తా ఉన్న నటి. అలాంటి నటి గాయకుడు క్రిష్‌ను ప్రేమ వివాహం చేసుకున్న తరువాత నటనను తగ్గించుకుంది. ఆ మధ్య అడపాదడపా నటించినా రెండేళ్ల నుంచి పూర్తిగా సినిమాలకు దూరమైంది. అయితే బుల్లితెర కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతలా పాల్గొంటూ ఆ వర్గ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. తాజాగా మళ్లీ సంగీత బ్యాక్ అంటూ ఒక బ్యాంగ్ పాత్రలో వెండితెరపై కనిపించబోతోంది. అవును నటుడు విజయ్‌ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న తిమిళరసన్ చిత్రంలో సంగీత ప్రధాన పాత్రల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ఎన్ఎస్.మూవీస్ పతాకంపై కౌసల్యరాణి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో విజయ్‌ఆంటోని సరసన నటి రమ్యానంబీశన్ నటిస్తోంది. ఇతర ముఖ్య పాత్రల్లో సురేశ్‌గోపి, రాధారవి, సోనూసూద్, యోగిబాబు, రోబోశంకర్, కస్తూరి, చాయాసింగ్, మధుమిత, వైజీ.మహేంద్రన్, కదిర్, శ్రీలేఖ, శ్రీజా, కేఆర్.సెల్వరాజ్, సెండ్రాయన్, కుంకీ అశ్విన్, మేజర్ గౌతమ్, స్వామినాథన్, మునీశ్కాంత్, రాజ్‌కృష్ణ, రాజేంద్రన్ నటిస్తున్నారు. వీరితో పాటు దర్శకుడు మోహన్‌రాజా కొడుకు మాస్టర్ ప్రణవ్ కీలక పాత్రలో పరిచయం అవుతున్నాడు. ఇందులో ఒక ప్రధాన పాత్రలో నటి సంగీత నటిస్తోంది. రెండేళ్ల క్రితం నెరుప్పుడా చిత్రంలో ప్రతినాయకిగా నటించిన సంగీత ఆ తరువాత ఏ చిత్రంలోనూ నటించలేదు. ఇదే విషయాన్ని ఈ అమ్మడిని అడగ్గా తనకు తగ్గ పాత్రలు అనిపించకపోవడంతో వచ్చిన చాలా అవకా>శాలను తిరస్కరించినట్లు తెలిపింది. ఇప్పుడు నటించడానికి కారణం తమిళరసన్ చిత్రంలో తన పాత్ర చర్చనీయాంశంగా ఉంటుందని చెప్పింది. అందుకే ఆ పాత్ర చేయడానికి అంగీకరించినట్లు తెలిపింది. ఈ చిత్రంలో తాను ఒక పెద్ద ఆస్పత్రిని నిర్వహించే డాక్టర్‌గా నటిస్తున్నానని చెప్పింది. ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని నటి సంగీత పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతజ్ఞాని ఇళయరాజా బాణీలు కట్టడం మరో విశేషం. ఆర్డీ.రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. తమిళరసన్ చిత్ర షూటింగ్ చెన్నైలో చిత్రీకరణను జరుపుకుంటోంది. -
ఎన్టీఆర్ బయోపిక్‌పై కంగన షాకింగ్ కామెంట్స్
మణికర్ణిక సినిమా విషయంలో కంగన, క్రిష్‌ల మధ్య తలెత్తిన వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవల క్రిష్ దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాలు(కథానాయకుడు, మహానాయకుడు) బాక్సాఫీస్ వద్ద నిరాశను మిగిల్చిన సంగతి తెలిసిందే. మణికర్ణిక చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలోనే క్రిష్, ఎన్టీఆర్ బయోపిక్కు దర్శకత్వం వహించడానికి అంగీకరించారు. తాజాగా క్రిష్ గురించి ఓ మీడియా సంస్థతో మాట్లాడిన కంగన, క్రిష్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఎన్టీఆర్ బయోపిక్ కలెక్షన్ల గురించి విన్నాను. ఇవి జీరో రికవరీగా నిలిచాయి. ఆ నటుడి జీవితంలో ఈ చిత్రం మచ్చగా మిగులుతుంది. క్రిష్‌ను నమ్మినందుకు బాలకృష్ణను చూస్తుంటే నాకు బాధగా ఉంది. నేను క్రిష్‌ను ద్రోహం చేశానని చాలా మంది విమర్శలు చేశారు. నా వ్యక్తిత్వంపై దాడి చేయడమే కాకుండా.. నిందలు వేస్తూ రాబందుల్లా పీక్కు తిన్నారు. నాపై అనాలోచితంగా విమర్శలు చేసినవారు ఇప్పుడేమంటారు?. కమర్షియల్‌గా మణికర్ణిక చిత్రం విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. అటువంటి చిత్రంపై విమర్శలు చేస్తారా?. క్రిష్‌తో కొన్ని పెయిడ్ మీడియా సంస్థలు కూడా నాపై బురదజల్లడం సిగ్గుచేటు. స్వాతంత్ర సమరమోధులు.. ఇటువంటి వారి కోసం రక్తం ధారపోసినందుకు నిజంగా బాధగా ఉంద’ని కంగన తెలిపారు. -
‘క్రిష్ చేయని పనికి క్రెడిట్ అడుగుతున్నారు’
మణికర్ణిక సినిమా వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదిక క్రిష్, చిత్ర యూనిట్‌పై ముఖ్యంగా కంగనా రనౌత్‌పై ఆరోపణలు గుప్పిస్తుంటే, కంగనా కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తోంది. పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ వివాదంపై స్పందిస్తున్నారు. కొందరు కంగనాను తప్పు పడుతుండగా, మరికొందరు క్రిష్ తీరును విమర్శిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై స్పందించిన చిత్ర నిర్మాత కమల్ జైన్.. క్రిష్ వాదనను తప్పు పట్టారు. దర్శకురాలిగా కంగనా పేరు ముందు వేయటం అనేది నిర్మాణ సంస్థ నిర్ణయం అన్నారు. అంతేకాదు.. క్రిష్, తన వాదన సరైనదే అని భావిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చిన తెలిపారు. ఆయన, తను చేయని పనికి క్రెడిట్ కావాలని కోరటం సరైన పద్దతి కాదన్నారు. సినిమా సక్సెస్ సాధించిన తరువాత క్రిష్ తనకు క్రెడిట్ కావాలని వాదిస్తున్నారని విమర్శించారు. -
‘మణికర్ణిక’ వివాదంపై తమన్నా.!
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలను కుదిపేస్తున్న వివాదం మణికర్ణిక. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమాకు తరువాత కంగనా దర్శకత్వ బాధ్యతలు తీసుకోవటంతో వివాదం మొదలైంది. కంగనా తన పాత్రను ఎలివేట్ చేసుకునేందుకు ఇతర పాత్రలను తగ్గించిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వివాదంలో కొంతమంది క్రిష్‌కు మద్దతు తెలుపుతుండగా మరికొందరు కంగనానే కరెక్ట్ అంటున్నారు. తాజాగా ఈ వివాదంపై మిల్కీబ్యూటీ తమన్నా స్పదించారు. ‘నటనపరంగా కంగనాకు వంక పెట్టడానికి లేదు. ఆమె ఎంత గొప్ప నటో అందరికీ తెలిసి విషయమే. క్రియేటివ్ పీపుల్ ఆలోచనలు వేరుగా ఉంటాయి. అయితే ఎవరి ఆలోచన ఎలా ఉన్నా ఫైనల్‌గా అవి సినిమాకు మంచి చేసేవిగా ఉండాలి. ప్రతీ ఒక్కరు సినిమా సక్సెస్ కోసమే పనిచేయా’లన్నారు. అయితే ఈ వివాదంలో ఎవరిది తప్పన్న విషయాన్ని సూటిగా చెప్పేందుకు తమన్నా ఇష్టపడలేదు. -
నా పాత్రను తగ్గించేశారు
‘మణికర్ణిక’ చిత్రం మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో కంగనా రనౌత్ నటనను ప్రేక్షకులు అభినందిస్తున్నా, ఆమె ప్రవర్తనను మాత్రం తోటి టెక్నీషియన్స్ విమర్శిస్తున్నారు. దర్శకత్వం విషయంలో క్రిష్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘నా పాత్రను నిర్దాక్షిణ్యంగా తగ్గించేశారని అందులో నటించిన హీరోయిన్ మిస్తీ చక్రవర్తి ఆరోపించారు. ‘‘మణికర్ణిక’ సినిమాలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని, మంచి సన్నివేశాలున్నాయని క్రిష్‌గారు నాతో చెప్పారు. అలానే అద్భుతమైన సన్నివేశాలు చిత్రీకరించారు కూడా. కానీ, అవన్నీ సినిమాలో కనిపించలేదు. సినిమా పూర్తయ్యాక మళ్లీ కొన్ని సన్నివేశాలు షూట్ చేయడానికి కంగనా నన్ను డేట్స్ అడిగారు. అప్పుడు తీసిన సన్నివేశాలను మొదట షూట్ చేసినవాటి స్థానంలో చేర్చారు. ఒకవేళ కంగనానే దర్శకురాలని ముందే తెలిసుంటే ఈ సినిమా చేసుండేదాన్ని కాదు’’ అని పేర్కొన్నారు మిస్తీ. -
‘యన్.టి.ఆర్’పై తేజ ఏమన్నాడంటే..!
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ యన్.టి.ఆర్ కథానాయకుడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ముందుగా తేజను దర్శకుడిగా తీసుకున్నారు. ముహూర్తం షాట్ చిత్రీకరణ కూడా జరిగిన తరువాత తేజ తప్పుకోవటంతో ప్రాజెక్ట్ క్రిష్ చేతిలోకి వెళ్లింది. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడిన తేజకు యన్.టి.ఆర్ కథానాయకుడికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. అయితే ఈ విషయంపై స్పందించిన తేజ.. తాను ‘సీత’ సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో ఇంకా ఆ సినిమా చూడలేదని చూసిన తరువాత స్పందిస్తానంటూ సమాధానమిచ్చారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. -
సిమ్రాన్‌కి జరిగిందే మణికర్ణికకూ జరిగింది
‘‘దర్శకుడు క్రిష్ ‘మణికర్ణిక’ను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడంతో దర్శకత్వ బాధ్యతలను చేపట్టాల్సి వచ్చింది’’ అని ఆ చిత్రం రిలీజ్ ముందు కంగనా రనౌత్ పేర్కొన్నారు. అయితే ఇటీవల బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మణికర్ణిక’ సినిమాకు సంబంధించిన పలు విషయాలు పేర్కొన్నారు క్రిష్. ‘‘మణికర్ణిక’ సినిమాను జూన్‌లోనే పూర్తి చేశాను. అన్ని పాత్రలు డబ్బింగ్ కూడా చెప్పేసుకున్నారు. అప్పుడు ‘మెంటల్ హై క్యా’ షూటింగ్ నిమిత్తం లండన్‌లో ఉన్నారు కంగనా. ఇండియా వచ్చిన తర్వాత నేను చిత్రీకరించిన విధానం నచ్చలేదని నిర్మాణ సంస్థను నమ్మించారు. భోజ్‌పూరి సినిమాలా ఉందని వాళ్లతో పేర్కొన్నారు. సినిమా మొత్తం తన చుట్టూనే తిరగాలన్నట్టు కంగనా ప్రవర్తన ఉండేది. సోనూసూద్ పాత్ర సుమారు 100 నిమిషాలు ఉండేది. దాన్ని 60 నిమిషాలకు కుదించేయడంతో ఆయన తప్పుకున్నారు తప్పితే లేడీ డైరెక్టర్‌తో యాక్ట్ చేయను అనే కారణం కాదు. ఫస్ట్ హాఫ్‌లో ఓ 25 శాతం సెకండ్ హాఫ్‌లో 15 శాతం మాత్రమే కంగనా రనౌత్ డైరెక్ట్ చేశారు’’ అంటూ తెర వెనుక జరిగిన అసలు విషయాన్ని పంచుకున్నారు. క్రిష్ పేర్కొన్న విషయాలకు బాలీవుడ్ దర్శకుడు, స్క్రీన్ రైటర్ అపూర్వ అశ్రాని మద్దతు తెలిపారు. ‘‘నేను ‘సిమ్రాన్’ అనే సినిమాను ఎంతో ప్రేమతో రాశాను. అయితే కంగనా రనౌత్ మాత్రం మిగతా పాత్రల డైలాగ్స్, సీన్స్‌ను తగ్గించేశారు. ‘మణికర్ణిక’కు ఏం జరిగిందని క్రిష్ చెబుతున్నారో ‘సిమ్రాన్’ విషయంలోనూ అలానే జరిగింది. స్క్రిప్ట్ చాలా బావుందని చెప్పి, తర్వాత తన ఇష్టమొచ్చినట్టు మార్చేసిందామె. క్రిష్ ధైర్యానికి, నిజాయితీకి సెల్యూట్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు అపూర్వ. కంగనా రనౌత్ పై క్రిష్ చేస్తున్న ఆరోపణలకు కంగనా చెల్లెలు రంగోలి స్పందించారు. ‘‘క్రిష్‌గారు.. సినిమా మొత్తం మీరే డైరెక్ట్ చేశారు. కొంచెం కామ్‌గా ఉండండి. సినిమాకు హీరోయిన్ కంగనే కదా. ప్రస్తుతం తన సక్సెస్‌ను ఎంజాయ్ చేయనివ్వండి’’ అని పేర్కొన్నారు. ఈ కామెంట్స్ గురించి కంగనా ఎలా స్పందిస్తారో చూడాలి -
‘మణికర్ణిక’ మూవీ రివ్యూ
టైటిల్ : మణికర్ణిక జానర్ : హిస్టారికల్ మూవీ తారాగణం : కంగానా రనౌత్, అతుల్ కులకర్ణి, డానీ డెంజొప్ప, జిషు సేన్‌గుప్తా, రిచర్డ్ కీప్ సంగీతం : శంకర్ ఇషాన్ లాయ్ దర్శకత్వం : క్రిష్, కంగనా రనౌత్ నిర్మాత : కమల్ జైన్, నిశాంత్ పిట్టి, జీ స్టూడియోస్ ప్రస్తుతం అన్ని భాషల్లో బయోగ్రాఫికల్ సినిమాల సీజన్ నడుస్తోంది. కొందరు సినీ నటులు, రాజకీయ నాయకులు, క్రీడా కారుల జీవితాలను తెరకెక్కిస్తుంటే మరికొందరు దర్శక నిర్మాతలు చారిత్రక పాత్రలను తెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అదే బాటలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ హిస్టారికల్ మూవీ మణికర్ణిక. ఎన్నో వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ సినిమాకు చాలా భాగం క్రిష్ దర్శకత్వం వహించటం, తరువాత దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న కంగనా రనౌత్ కథా కథనాలతో పాటు నటీనటులను కూడా మార్చటం వివాదాస్పదంగా మారింది. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించిటంతో టాలీవుడ్‌లోనూ మణికర్ణికపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. మరి ఆ అంచనాలు మణికర్ణిక అందుకుందా..? చారిత్రక పాత్రలో కంగనా ఏ మేరకు మెప్పించింది..? దర్శకురాలిగానూ కంగనా విజయం సాధించిందా..? కథ : భారతీయులకు చాలా బాగా తెలిసిన కథే ఝాన్సీ లక్ష్మీబాయి. అదే కథను సినిమాటిక్ ఫార్మాట్లో చెప్పే ప్రయత్నం చేశారు మణికర్ణిక యూనిట్. బితూర్‌లో పుట్టిన మణికర్ణిక (కంగనా రనౌత్) ఝాన్సీ రాజు గంగాధర్ రావు(జిషు సేన్‌గుప్తా) ను వివాహం చేసుకుంటుంది. పెళ్లి తరువాత మణికర్ణిక పేరును లక్ష్మీబాయిగా మారుస్తారు. లక్ష్మీ బాయి మహారాణిగా మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలో ఈస్ట్ఇండియా కంపెనీ తన పరిధిని విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అదే సమయంలో లక్ష్మీబాయి జీవితంలోనూ కల్లోలం మొదలువుతుంది. భర్త మరణించటంతో కొంతమంది నమ్మకస్తుల సాయంతో రాజ్యాధికారాన్ని లక్ష్మీబాయి తీసుకుంటుంది. ఝాన్సీ రాణిగా మారిన లక్ష్మీబాయి ఆంగ్లేయులను ఎలా ఎదిరించింది..? ఎలాంటి ధైర్య సాహసాలను ప్రదర్శించింది..? చివరకు ఏమయ్యింది..? అన్నదే మిగత కథ. నటీనటులు : సినిమా అంతా లక్ష్మీబాయి చుట్టూనే తిరిగటంతో ఇతర పాత్రలకు పెద్దగా గుర్తింపు వచ్చే అవకాశమే లేదు. కంగనా కూడా అద్భుతమైన నటనతో ప్రేక్షకుడిని చూపు తిప్పుకోకుండా చేసిందనటంలో ఎలాంటి సందేహం లేదు. మణికర్ణికగా ఆనందంగా కాలం గడిపే అమ్మాయి నుంచి రాజ్య భారం మోసే రాణిగా హుందాగా కనిపించే వరకు ఎన్నో కోణాలను తెర మీద ఆవిష్కరించింది. రణరంగంలో వీరనారిగా కత్తి దూసే సన్నివేశాల్లో కంగనా నటవిశ్వరూపం చూపించింది. కీలక పాత్రల్లో నటించిన అతుల్ కులకర్ణి, జిషు సేన్‌గుప్తా, డానీ డెంజొప్ప, అంకితా లోఖండే బ్రిటీష్ పాలకుడిగా రిచర్డ్ కీప్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ : సినిమాను ఆసక్తికరంగా ప్రారంభించిన దర్శకుడు అసలు కథను మొదలు పెట్టడానికి మాత్రం చాలా సమయం తీసుకున్నాడు. దాదాపు ఫస్ట్ అంతా మణికర్ణిక పాత్రను ఎలివేట్ చేసేందుకు, ఆమెను స్వతంత్రభావాలు ఉన్న.. భయం లేని మహిళగా చూపించేందుకు కేటాయించారు. లక్ష్మీ బాయి ఝాన్సీ బాధ్యతలు తీసుకున్న తరువాత కథనం కాస్త స్పీడందుకున్న భావన కలిగినా.. భారీ డైలాగులు, పాటలు కథనానికి అడ్డుపడుతుంటాయి. గ్రాఫిక్స్ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా లేవు. కొన్ని సీన్స్ రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. పోరాట సన్నివేశాలు సహజంగా ఉన్నాయి. క్లైమాక్స్ సూపర్బ్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి సినిమాకు ప్రధాన బలం. అప్పటి పరిస్థితులను వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు. సంగీత త్రయం శంకర్ ఇసాన్ లాయ్‌లు నిరాశపరిచారనే చెప్పాలి. పాటలతో పాటు నేపథ్యం సంగీతంతో కూడా మెప్పించలేకపోయారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కంగనా రనౌత్ పోరాట సన్నివేశాలు మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ సంగీతం -
‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ మరోసారి వాయిదా!
నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బయోపిక్ మూవీ యన్.టి.ఆర్. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం యన్.టి.ఆర్ కథానాయకుడు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై డివైడ్ టాక్ రావటంతో రెండో భాగం రిలీజ్ విషయంలో చిత్రయూనిట్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ముందుగా రెండో భాగం యన్.టి.ఆర్ మహానాయకుడు సినిమాని జనవరి 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాదన్న ఉద్దేశంతో రిలీజ్ డేట్‌ను ఫిబ్రవరికి మార్చారు. ఫిబ్రవరి 7న యన్.టి.ఆర్ మహానాయకుడు రిలీజ్ అవుతుందని ప్రకటిస్తూ రిలీజ్ డేట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాదన్న ఉద్దేశంతో రిలీజ్ డేట్‌ను మరోసారి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. యన్.టి.ఆర్ మహానాయకుడు సినిమాను వారం ఆలస్యంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. -
రాష్ట్రపతి కోసం ‘మణికర్ణిక’ స్పెషల్ షో
వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం మణికర్ణిక. టాలీవుడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాకు కొంత భాగం కంగనా కూడా దర్శకత్వం వహించారు. అనేక వివాదాలు, మరెన్నో వాయిదాల తరువాత షూటింగ్ పూర్తి చేసుకున్న మణికర్ణిక ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్‌తోపాటు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి కథగా తెరకెక్కుతున్న ఈసినిమాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీక్షించనున్నారు. ఆయన కోసం ఈ నెల 18న సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తోంది చిత్రయూనిట్. ఈ ప్రదర్శనకు కంగనాతో పాటు చిత్రయూనిట్ అంతా హాజరు కానుంది. అయితే టీంతో పాటు దర్శకుడు క్రిష్ హాజరవుతారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. మణికర్ణిక సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. Shri Ram Nath Kovind, President of India, will watch a special screening of #Manikarnika: The Queen Of Jhansi in New Delhi tomorrow [18 Jan]... Kangana Ranaut and the team will be present... Screening organised by Zee Entertainment... #Manikarnika releases on 25 Jan 2019. pic.twitter.com/axuA0waqhb — taran adarsh (@taran_adarsh) 17 January 2019 -
భారీ డిజాస్టర్ దిశగా ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయోపిక్ మూవీ యన్.టి.ఆర్ కథానాయకుడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటంతో అదే స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఎన్టీఆర్ సినిమాను దాదాపు రూ. 70 కోట్లకు అమ్మినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు తొలి రోజు నుంచి డివైడ్ టాక్ రావటంతో కలెక్షన్ల ఆశించిన స్థాయిలో రాలేదు. సంక్రాంతి సెలవులను కూడా యన్.టి.ఆర్ క్యాష్ చేసుకోలేకపోయింది. గత బుధవారం రిలీజ్ అయిన ఈ సినిమా తొలి వారాంతానికి ఇంకా రూ. 20 కోట్ల మార్క్ షేర్ కూడా సాధించలేదని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో యన్.టి.ఆర్ కథానాయకుడు బ్రేక్ ఈవెన్ సాధించటం సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పండుగ సెలవులు కూడా అయిపోవటంతో కలక్షన్లపై మరింత డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యన్.టి.ఆర్ కథానాయకుడు భారీ డిజాస్టర్‌గా మిగిలే అవకాశలే ఎక్కువగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. -
కథే కథకుడిని ఎన్నుకుంటుంది
యన్టీ రామారావు జీవితం ఆధారంగా క్రిష్ తెరకెక్కించిన చిత్రం ‘యన్టీఆర్ : కథానాయకుడు’. యన్టీఆర్ తనయుడు బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించి, నిర్మించారు. ఈ చిత్రం 9న రిలీజైంది. ఈ సందర్భంగా పలు విశేషాలను పంచుకున్నారు క్రిష్. ► ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చేస్తున్న సమయంలోనే విబ్రీ మీడియా విష్ణుగారు రామారావుగారి మీద సినిమా చేస్తారా? అని అడిగారు. అప్పుడే ఓ బయోపిక్ తీస్తున్నాం మళ్లీ కుదురుతుందో లేదో అనుకున్నాం. కథ తన కథకుడిని వెతుక్కుంటుంది అన్నట్టు ‘యన్టీఆర్’గారి కథ నన్ను ఎంచుకుంది. ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు. తిప్పి చదివితే రామ తారకం. వీళ్లిద్దరి కథ చెబుదాం అని అనిపించింది. ఆ దారం పట్టుకుని వెళ్లిపోయాను. ► ఈ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ నా పదో సినిమా అవుతుంది. చాలా సినిమాలకు సేమ్ టీమ్‌తో వర్క్ చేశాను. రెండు భాగాలు కలిపి ఎనభై రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ‘ఏ పనికైనా పట్టుదల, ప్రణాళిక ముఖ్యం’. ఇదివరకు సినిమాలు ఇలానే తీసేవారు. నా బలం నా టీమే. ► రెస్పాన్స్ చాలా బావుంది. ఎవరు మాట్లాడినా సరే కళ్లలో తడితోనో లేదా గుండెల్లో చెమ్మతోనే మాట్లాడుతున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ని అని ఫిక్స్ అయ్యాక అప్పటి వరకూ రెడీ అయిన కథ రఫ్‌గా విన్నాను. కానీ వాళ్లు చేసిన వెర్షన్ చూడలేదు. మొత్తం నా సొంత స్క్రీన్‌ప్లే రాసుకున్నాను. కథ ఆలోచించడం కష్టం. స్క్రీన్ ప్లే రాయడం అంత కాదేమో. రామారావుగారి గురించి చాలా ఆర్టికల్స్ చదివాను, బయోగ్రఫీలు చదివాను. కేవలం ఈ సినిమా కోసమనే కాదు. సాధారణంగా చరిత్రంటేనే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆ పరిశోధన ఇప్పుడు ఉపయోగపడింది. సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేయకపోయినా ఇదే స్పీడ్‌తో సినిమా పూర్తి చేసేవాణ్ని. ► నేను రచయితను. బుర్రా సాయిమాధవ్‌గారు గొప్ప రచయిత. గొప్ప రచయిత ఉన్నప్పుడు వాళ్లు చెప్పిందే ఫైనల్ అవుతుంది. ఆయన డైలాగ్స్ గొప్పతనమేంటంటే అవి కథను ముందుకు నడిపిస్తుంటాయి. మ్యూజిక్ విషయానికి వస్తే ‘మంచి సినిమా తీశావు. దాన్ని గొప్ప సినిమా చేస్తాను’ అన్నారు కీరవాణిగారు. అలానే చేశారు. కెమెరామేన్ జ్ఙానశేఖర్వి, నావి వేరు వేరు కళ్లయినా ఇద్దరం ఒకటే చూస్తాం. ఆయనో గొప్ప పెయింటర్. మాకిది ఎనిమిదో సినిమా. ► ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్‌లో రామారావుగారికి, బాలకృష్ణగారికి మధ్య నేను గమనించిన లక్షణాలు క్రమశిక్షణ, వృతి పట్ల అంకిత భావం. తెగువ. మంచి సినిమా చేయడానికి వెనుకాడరు. బాలకృష్ణగారి ఆహార్యం చక్కగా కుదిరింది. విద్యా బాలన్ లేకుంటే తారకమ్మగారి పాత్రే లేదు. తారకమ్మగారి గురించి చదవడానికి మెటీరియల్ లేదు. కుటుంబ సభ్యుల ద్వారా విని బాగా పాత్రను పోషించారు. ఎల్వీ ప్రసాద్ పాత్రను బెంగాళీ నటుడు జిష్షుసేన్ గుప్తా చేశారు. మణికర్ణికలో కంగనా భర్తగా నటించారు. బెంగాలీలో ఆయనో సూపర్‌స్టార్. ఎల్వీ ప్రసాద్ బాడీ లాంగ్వేజ్‌ను ఆయన అన్వయించుకున్న తీరు బావుంది. 2,3 నెలలు బ్రేక్ తీసుకోవాలి. లాస్ట్ 215 రోజులు పని చేస్తూనే ఉన్నాను. ► వరుసగా చారిత్రాత్మక నేపథ్యమున్న సినిమాలు చేయడం అనుకోకుండా జరిగింది. ‘శాతకర్ణి’ కథ చెప్పాలని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చేశాను. ‘మణికర్ణిక, యన్టీఆర్’ సినిమాలు అనుకోకుండా వరించిన అదృష్టాలు. ఏదైనా సినిమా చేయాలనుకున్నప్పుడు మూడు విషయాలు ముఖ్యంగా పాటిస్తాను. ఆ కథ వినూత్నంగా, అర్థవంతంగా, వినోదాత్మకంగా ఉందా? మామూలు కథలు చెప్పుకెళ్లడం నాకు నచ్చదు. మహా అయితే 30–40 సినిమాలు చేస్తాం. అందులో అర్థం లేని సినిమాలు ఉండటం నాకిష్టంలేదు. ► ‘మణికర్ణిక’ నుంచి సోనూ సూద్ తప్పుకోవడం వల్ల మళ్లీ షూటింగ్ ఏర్పడింది. నా పాత్ర వరకూ నేను సరిగ్గానే నిర్వహించాను. 10 సినిమాల వయసొచ్చింది. ఇంకా డైరెక్షన్ క్రెడిట్ కంగనాకి వెళుతుందా? నాకా? అని ఆలోచించను. -
సినిమా కాదు.. ఒక లైఫ్ చూసినట్టు అనిపించింది: కృష్ణ
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన బయోపిక్ మూవీ ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి మంచి స్పందనే వస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ దంపతులు ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. ‘నందమూరి బాలకృష్ణ రూపొందించిన యన్.టి.ఆర్ బయోపిక్ చూశాను. చాలా బావుంది. సినిమా చూసినట్లు కాకుండా ఒక లైఫ్ చూసినట్టు అనిపించింది. బాలకృష్ణ.. ఎన్టీఆర్‌లా వందశాతం కనిపించారు. ఆయన వేసిన అన్నీ గెటప్స్‌లోనూ బావున్నారు. కచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు. విజయ నిర్మల మాట్లాడుతూ - ` ఈ బయోపిక్‌లో బాలకృష్ణను చూస్తుంటే ఎన్టీఆర్‌ను చూసినట్టే అనిపించింది. సినిమా చాలా బావుంది. చాలా సంతోషం`` అన్నారు. నరేష్ విజయకృష్ణ మాట్లాడుతూ - ``యన్.టి.ఆర్` బయోపిక్ అనౌన్స్ అయినప్పుడు ఇందులో ఓ అవకాశం వస్తుందా! అని ఆసక్తిగా ఎదురుచూశాను. ఈ బయోపిక్‌లో వేషం వేయాలని నన్ను అడిగినప్పుడు చాలా సంతోషం వేసింది. అది కూడా బి.ఎ.సుబ్బారావు వేషం. ఆ సన్నివేశాలను నేను చేస్తున్నప్పుడు థ్రిల్ ఫీలయ్యాను. మా అమ్మ తొలి సినిమా ఆయనతోనే నటించారు. అలాగే నేను ప్రేమ సంకెళ్లు సినిమా సమయంలో ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను. దర్శకుడు క్రిష్ ఈ సినిమాతో గ్రేట్ డైరెక్టర్ నుండి లెజెండ్రీ డైరెక్టర్ అయ్యారు’ అన్నారు. -
‘యన్.టి.ఆర్’లో ఏదో వెలితి..!
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన బయోపిక్ మూవీ ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’. సినిమా ప్రకటించిన దగ్గర నుంచి ఎన్నో చర్చలకు దారితీసిన యన్‌టిఆర్, బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నా.. సాధారణ ప్రేక్షకులు మాత్రం ఏదో వెలితి ఉందన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సినిమాలో నందమూరి తారక రామారావు బాల్యానికి సంబంధించిన సన్నివేశాలు లేకపోవటం.. తొలిసారి ఎన్టీఆర్, ఎల్వీ ప్రసాద్‌లు ఎక్కడ కలిసారు.. ఎల్వీ ప్రసాద్ ఎందుకు ఎన్టీఆర్‌కు సినిమా అవకాశం ఇస్తా అన్నారు.. అన్న విషయాలు చూపించకపోవటం లాంటివి కథ అసంపూర్తిగా విన్న భావన కలిగిస్తాయి. ఎన్టీఆర్ యువకుడిగా కనిపించే సీన్స్‌లో బాలయ్య లుక్‌పై అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. సెకండ్ హాఫ్లోనూ అలాంటి సన్నివేశాలు చాలా కనిపిస్తాయి. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుల పరిచయం, ఎన్టీఆర్ తన కుమార్తెను చంద్రబాబు నాయుడికి ఇచ్చి వివాహం చేయటం లాంటి కీలకమైన సంఘటనలకు కూడా సినిమాలో చోటివ్వలేదు. ఎక్కువగా బాలకృష్ణను వివిధ గెటప్‌లలో చూపించేందుకే సమయం కేటాయించారు. సీతా రామ కళ్యాణం సినిమాలో రావణాసురుడిని దశకంఠుడిగా చూపించేందుకు ఏకంగా 20 గంటల పాటు రెప్ప కూడా వేయకుండా ఎన్టీఆర్ ఒకే స్టిల్‌లో నిలబడ్డట్టుగా చూపించటం అంత నమ్మశక్యంగా అనిపించదు. ఎన్టీఆర్ కెరీర్లో ఘనవిజయం సాధించిన చిత్రాలను మాత్రమే ప్రస్తావిస్తూ ఫెయిల్యూర్స్‌ను పక్కన పెట్టేయటంతో డ్రామా మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక దాన వీర శూర కర్ణ సినిమాలో ఎన్టీఆర్ అనర్గళంగా చెప్పిన ‘ఏమంటివి ఏమంటివి’ డైలాగ్‌ను బాలయ్య చెప్పకుండా కేవలం ఎన్టీఆర్ వాయిస్‌కు యాక్ట్ చేయటం కూడా అభిమానులను నిరాశపరిచే అంశమే. -
వాళ్లు కర్త.. కర్మ.. నేను క్రియ
యన్టీఆర్ జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించి, నిర్మించిన చిత్రం ‘యన్.టి.ఆర్’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ‘యన్.టి.ఆర్ : కథానాయకుడు’ ఈ నెల 9న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ పంచుకున్న విశేషాలు. ► ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమా ఒక ఎత్తు అనుకుంటారా? చాలెంజ్ అనుకోలేదు. గొప్ప అవకాశం అనుకున్నాను. విధి మనకు ఎలాంటి చాలెంజ్‌లు ఇచ్చినా వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలని భావిస్తాను. ఏ సినిమా వచ్చినా అది ఎందుకు నాదాకా వచ్చిందో నాకు నేనే ఆలోచించుకుంటా. ఎక్కువ మందితో చర్చలు ఉండవు. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రాత్ (ఎక్కువ మంది వంటగాళ్లు కూర చెడగొట్టినట్టు) అంటారు కదా అలాగ. అనిపించింది చేసుకుంటూ వెళ్లడమే. ప్రాచీన ఆంధ్ర చరిత్ర సృష్టికర్త గౌతమీపుత్ర శాతకర్ణి, నవీన తెలుగు జాతి సృష్టికర్త ఎన్టీఆర్‌ల కథలను ఒకే దర్శకుడు క్రిష్‌తో చేయడం విశేషం. ► మీ నాన్నగారిలా చేయడం కష్టం అనిపించిందా? కష్టమేం అనిపించలేదు. ఆయన కేవలం నా తండ్రి మాత్రమే కాదు. దైవం, గురువు, మెంటర్ అన్నీ. ఆయన చేసిన పాత్రలన్నీ చేయగలగడం ఈ సినిమాతో కుదిరింది. కర్త, కర్మ అన్నీ అమ్మానాన్నే. నేను కేవలం క్రియ మాత్రమే. ► ఆర్టిస్టుల ఎంపిక ఎలా జరిగింది? బయోపిక్ ఫీల్ రావాలంటే తెలిసిన ముఖాలు ఎక్కువ కనిపించకూడదు. ఎందుకంటే కథ నుంచి డైవర్ట్ అయిపోతారు. కేవలం సినిమా యాక్టర్ అయినప్పటి పోర్షన్లో మాత్రమే యాక్టర్స్ కనిపిస్తారు. మిగతా సీన్స్ కోసం సురభి నాటక కళాకారులను తీసుకున్నాం. యాక్టర్స్ కనిపిస్తే కమర్షియల్ అయిపోతుంది. ఈ సినిమాను అలా చేయదలుచుకోలేదు. ► రెండు భాగాల కథ ఎలా ఉంటుంది? ఫస్ట్ పార్ట్ సినిమాలు, పార్టీని అనౌన్స్ చేయడం. రెండో భాగం పార్టీ స్థాపించడం, పార్టీ క్రైసిస్, అమ్మగారు శివైక్యం అవ్వడం ఉంటాయి. ఇది అమ్మానాన్నల కథ. కేవలం వాళ్లమీదే ఈ సినిమా ఉంటుంది. ► ఈ జర్నీ ఎమోషనల్‌గా సాగిందనుకోవచ్చా? అవును. చాలా వరకు. నాన్నగారి వైఖరి నాకు తెలుసు, అమ్మగారి సెంటిమెంట్సూ నాకు తెలుసు. అమ్మ మాటకు నాన్నగారు ఎంత విలువ ఇచ్చేవారో చెప్పాం. హరి (హరికృష్ణ) అన్నయ్యతో, నాతో మా మేనమామ ‘రామ్ రహీమ్’ పిక్చర్ తీద్దాం అనుకున్నారు. ముందు చదువు పూర్తి కావాలని నాన్నగారు అనేవారు. నాన్నగారిని అమ్మగారు అడిగిన వెంటనే ‘సరే చేసుకోమనండి’ అన్నారు. ఇలాంటి బోలెడన్ని విషయాలు ఉంటాయి సినిమాలో. ► మీ క్యారెక్టర్ (బాలకృష్ణ) ఉంటుందా? నాకో ఐడెంటిఫికేషన్ ఉంది. దాంతో కథ నుంచి డైవర్ట్ అయిపోతారు. అలా అవ్వకూడదు. అయితే నా పాత్ర ఒక్క సీన్లో కనిపిస్తుంది. ► అంటే.. ఏ వయసు పాత్రలో కనిపిస్తారు? లేదు. లేదు. చంటి బిడ్డగా ఉన్నప్పుడు. ఆ పాత్రను నా మనవడు దేవాన్ష్ చేశాడు. బాగా చేశాడు. నాకు నామకరణం చేసే సన్నివేశంలో కనిపిస్తాడు. షూటింగ్ టైమ్‌లో ఏడుస్తాడేమో అని చాలా ఏర్పాటు చేసుకున్నాడు క్రిష్. బొమ్మలు అవీ ఇవీ తెప్పించాడు. కానీ సీన్లో ఎవరు డైలాగ్ చెప్పినా వాళ్లను చూసేవాడు. క్లోజప్ షాట్ కావాలంటే నవ్వాడు. నటన మా బ్లడ్లోఉంది కదా (నవ్వుతూ). ► చిన్న ఎన్టీఆర్, మీ అబ్బాయి మోక్షజ్ఞ పాత్రలు కూడా లేవు కదా? లెంగ్త్ కుదర్లేదు. అంత సమయాభావాన్ని సరిపెట్టలేకపోయాం. నా పాత్రే లేనప్పుడు వాళ్ల పాత్రలు పెట్టించడం కుదరదు కదా. ► క్రిష్ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారు? విద్యాబాలన్గారితో మాట్లాడటానికి ముంబై వెళ్లా. అక్కడ ‘మణికర్ణిక’ షూటింగ్ జరుగుతోంది. క్రిష్‌ని కలిశాను. నేను డైరెక్షన్ చేసేయనా? అన్నారు. ‘యస్.. యు ఆర్ మై డైరెక్టర్’ అన్నాను. ► డైలాగ్స్ గురించి? ఏమంటివి ఏమంటివి, ‘బొబ్బిలి పులి’లో డైలాగ్స్ ఉంటాయి. ఊరికే నేను చెప్పగలుగుతాను అని పెట్టినవి కాదు. ప్రతి సీన్‌కు ఓ రీజన్ ఉంది. నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధం కూడా చూపిస్తాం. మా నాన్నగారికి నేనిచ్చే ఘనమైన నివాళి ఈ సినిమా. ► పొలిటికల్ కాంట్రవర్సీలు ఉంటాయా? అవేం ఉండవు. 1983 ఆగస్ట్‌లో పాలిటిక్స్ క్రైసిస్, ఆ తర్వాత అమ్మగారు శివైక్యం అవ్వడంతో సినిమా ముగుస్తుంది. ఇది కేవలం మా అమ్మానాన్నల కథ. ► ఈ సినిమా తర్వాత బోయపాటితో మూవీ అనౌన్స్ చేశారు. రెస్ట్ ఎప్పుడు తీసుకుంటారు? రెస్ట్ ఎందుకు? ప్రతి రోజూ నాన్నగారి సినిమాలో ఏదో సీన్ చూసి పడుకుంటా. పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అభిమానులు మా నుంచి సినిమాలు కోరుకుంటారు. ఆర్టిస్ట్ నిత్యావసర వస్తువు. వాళ్లకు కావాల్సింది అందిస్తుండాలి. ఇచ్చే ధైర్యం మనకుండాలి. -
నిజం చూపిస్తారా? అబద్ధం చూపిస్తారా?
-
క్రిష్ చెడ్డవాళ్లను ఎలా చూపించాడో : మోహన్ బాబు
-
క్రిష్ చెడ్డవాళ్లను ఎలా చూపించాడో : మోహన్ బాబు
నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ సినిమా ఆడియో వేడుక నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ సన్నిహితులు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నటుడు మోహన్ బాబు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వేడుకలో ప్రసంగించిన మోహన్ బాబు చివర్లో ‘క్రిష్.. యు డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్.. మా అన్నయే కనిపిస్తున్నాడు. ఎక్కడ సినిమాను ప్రారంభించావో.. ఎక్కడ ఫినిష్ చేశావో తెలియదు. దాన్లో చెడ్డవాళ్లను కూడా మంచి క్యారెక్టర్స్ చేశావో. ఎవరెవరిని ఎలా చేశావో నాకు తెలియదు’ అంటూ ముగించారు. బాలకృష్ణ స్వయంగా తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణిగా కనిపించనున్నారు. టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, ప్రణీత, శాలినీ పాండే, శ్రియ, పాయల్ రాజ్‌పుత్ అలనాటి అందాల భామలుగా కనిపించనున్నారు. కల్యాణ్ రామ్, సుమంత్, కైకాల సత్యనారాయణ, ప్రకాష్ కోవెలమూడి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
‘యన్.టీ.ఆర్’ సినిమా ఆడియో వేడుక
-
‘అంతరిక్షం’ మూవీ రివ్యూ
టైటిల్ : అంతరిక్షం జానర్ : సైన్స్‌ఫిక్షన్ స్పేస్ థ్రిల్లర్ తారాగణం : వరుణ్ తేజ్, అదితిరావ్ హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, రాజా, రెహమాన్, శ్రీనివాస్ అవసరాల సంగీతం : ప్రశాంత్ విహారి దర్శకత్వం : సంకల్ప్ రెడ్డి నిర్మాత : క్రిష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి, మురళి ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి రెండో ప్రయత్నంగా తొలి తెలుగు స్పేస్ మూవీ అంతరిక్షంను తెరకెక్కించాడు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ విజువల్ వండర్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. టీజర్, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండటంతో సంకల్ప్ మరోసారి మ్యాజిక్ చేస్తాడన్న నమ్మకం కలిగింది. మరి ఆ నమ్మకాన్ని సంకల్ప్ రెడ్డి నిలబెట్టుకున్నాడా..? వరుసగా రెండు సూపర్ హిట్లు అందుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్నాడా..? కథ : దేవ్ (వరుణ్ తేజ్) ఓ స్పేస్ సైంటిస్ట్. రష్యాలో ట్రైన్ అయిన వ్యోమగామి. ఎన్నో ఆశలతో చంద్రుడి మీద నీటి జాడలు తెలుసుకునేందుకు విప్రయాన్ అనే శాటిలైట్‌ను ప్రయోగిస్తాడు. కానీ ఆ మిషన్ ఫెయిల్ అవుతుంది. అదే సమయంలో తను ప్రేమించిన పారు (లావణ్య త్రిపాఠి) కూడా ప్రమాదంలో చనిపోతుంది. దీంతో దేవ్ స్పేస్ రిసెర్చ్‌కు దూరమవుతాడు. కానీ ఐదేళ్ల తరువాత రిసెర్చ్ సెంటర్‌కు దేవ్ అవసరం పడుతుంది. మిహిరా శాటిలైట్ కక్షనుంచి పక్కకు తప్పుకొని మరో శాటిలైట్‌ను డికొట్టబోతుందని తెలుస్తోంది. మిహిరాను దేవ్ మాత్రమే కరెక్ట్ చేయగలడని అతన్ని పిలిపిస్తారు. రియా(అదితిరావ్ హైదరి), కరణ్ (సత్యదేవ్), సంజయ్ (రాజా)లతో కలిసి స్పేస్‌లోకి వెళ్లిన దేవ్. మిహిరాను ఎలా సరిచేశాడు.? స్పేస్‌లో దేవ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమేంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రయోగాలు చేస్తూ వస్తున్న వరుణ్ తేజ్ ప్రతీ సినిమాతో నటుడిగాను ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్నాడు. ఈ సినిమాలో టెంపర్ కంట్రోల్ లేని సైంటిస్ట్‌గా, ప్రేమికుడిగా, స్పేస్‌లో సాహసాలు చేసే వ్యోమగామిగా అద్భుతంగా నటించాడు. దేవ్ పాత్రకు ప్రాణం పోశాడు. రియా పాత్రలో అదితిరావ్ హైదరి సూపర్బ్ అనిపించింది. లుక్స్ తో పాటు నటన పరంగానూ మంచి మార్కులు సాధించింది. లావణ్య త్రిపాఠిది దాదాపు అతిథి పాత్రే. ఉన్నంతలో అందంతో అభినయంతో ఆకట్టుకుంది. ఇతర పాత్రల్లో సత్యదేవ్, రాజా, రెహమాన్, అవసరాల శ్రీనివాస్ తమ పాత్రల పరిదిమేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : ఘాజీ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంకల్ప్ మరోసారి అదే తరహా ప్రయోగం చేశాడు. అంతరిక్షం కోసం సంకల్ప్ తయారు చేసుకున్న కథనం దాదాపు ఘాజీలాగే సాగుతుంది. సినిమా ప్రారంభంలోనే మిహిరాకు సంబంధించిన డిటెయిల్స్ తో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన దర్శకుడు తొలి భాగాన్ని చాలా నెమ్మదిగా నడిపించాడు. ఎక్కువ భాగం పాత్రల పరిచయంతో పాటు స్పేస్ మిషన్ అవసరం ఏంటి అన్న విషయాలను వివరించేందుకు కేటాయించాడు. ఫస్ట్ హాఫ్‌లో లవ్ స్టోరి కూడా అంత ఆసక్తికరంగా అనిపించదు. సెకండ్ హాఫ్ అంతా అంతరిక్షంలోనే నడుస్తూ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది. రాకెట్ ప్రయోగం ఎలా జరుగుతుంది. వ్యోమగామలు ఎలాంటి కోడ్స్ వాడతారు. ఎలా కమ్యూనికేట్ చేస్తారు లాంటి అంశాల్లో సంకల్ప్ చేసిన రిసెర్చ్ తెర మీద కనిపిస్తుంది. ద్వితియార్థంలో పెద్దగా కథ లేకపోయినా.. తన కథనంతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు దర్శకుడు. సినిమాకు మరో మేజర్ ప్లస్‌పాయింట్ సినిమాటోగ్రఫి. స్పేస్‌లో ఉండే పరిస్థితులను తెర మీద కళ్లకు కట్టినట్టుగా చూపించాడు సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్. గ్రాఫిక్స్ అద్భుతమనే స్థాయిలో లేకపోయినా తమకున్న బడ్జెట్ పరిధిలో మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. ప్రశాంత్ విహారి సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచింది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : లీడ్ యాక్టర్స్ నటన మ్యూజిక్ సినిమాటోగ్రఫి సెకండ్ హాఫ్ మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్‌లో కొన్ని బోరింగ్ సీన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
యన్.టి.ఆర్ : విద్యాబాలన్ లుక్
నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న బయోపిక్ యన్.టి.ఆర్. బాలయ్య టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా తొలి భాగం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. తాజాగా ఎన్టీఆర్ సతీమణి బసవతారం పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటి విద్యా బాలన్ లుక్‌ను రివీల్ చేశారు. హర్మోనియం వాయిస్తున్న విద్యాలుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో ఎన్టీఆర్ పోషించిన రావణాసురుడి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. డిసెంబర్ 21న అభిమానుల సమక్షంలో ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు. -
‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ వాయిదా..!
నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న బయోపిక్ మూవీ యన్.టి.ఆర్. క్రిష్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. తొలి భాగం కథానాయకుడులో ఎన్టీఆర్ సినీ జీవిత విశేషాలు. రెండో భాగం మహానాయకుడులో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం చూపించనున్నారు. ముందు ఈ రెండు భాగాలను రెండు వారాల గ్యాప్‌తో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. తొలి భాగం యన్.టి.ఆర్ కథానాయకుడు జనవరి 9న, యన్.టి.ఆర్ మహానాయకుడు జనవరి 24న రిలీజ్ చేస్తున్నట్టుగా పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. తాజాగా యన్.టి.ఆర్ మహానాయకుడు రిలీజ్‌ను వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. ముందుగా ప్రకటించినట్టుగా జనవరి 24న కాకుండా మరో రెండు వారాలు ఆలస్యంగా ఫిబ్రవరి 7న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. -
క్రిష్ పేరు కూడా ఎత్తలేదు..!
బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం మణికర్ణిక. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విశేషాల కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో వినిపించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కూడా చర్చకు దారితీసింది. మణికర్ణిక మేజర్ పార్ట్‌కు క్రిష్ దర్శకత్వం వహించారు. అనివార్య కారణాల వల్ల క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో కంగనా స్వయంగా దర్శకత్వ బాధ్యతలను స్వీకరించారు. అయితే టీజర్ రిలీజ్ సమయంలో దర్శకుడిగా క్రెడిట్ అంతా క్రిష్‌కే ఇచ్చిన కంగనా తాజాగా ట్రైలర్ లాంచ్‌లో మాత్రం తానే అంతా చేసినట్టుగా మాట్లాడటం చర్చకు దారితీసింది. కనీసం ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో క్రిష్ పేరు కూడా ప్రస్తావించని ఈ బ్యూటీ, దర్శకుడు అర్థాంతరంగా సినిమా వదిలేయంటంతో తానే మేజర్పార్ట్ను డైరెక్ట్ చేసినట్టుగా మాట్లాడి అందరికి షాక్ ఇచ్చారు. టీజర్లో దర్శకుడిగా క్రిష్ పేరు మాత్రమే వేసిన చిత్రయూనిట్, ట్రైలర్లో మాత్రం క్రిష్‌తో పాటు కంగనా పేరును కూడా వేశారు. ఇంత వరకు క్రిష్‌తో కంగనాకు వివాదాలు ఉన్నట్టుగా ఎలాంటి వార్తలు రాకపోయినా తాజాగా ట్రైలర్ లాంచ్‌తో వివాదం కారణంగా క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారన్న విషయంపై క్లారిటీ వచ్చినట్టైంది. -
ఆకట్టుకుంటున్న ‘మణికర్ణిక’ ట్రైలర్
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం ‘మణికర్ణిక’. బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాహుబలి సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాకు కొంత భాగం కంగనా కూడా దర్శకత్వం వహించడం విశేషం. కాగా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మణికర్ణిక ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేసింది చిత్రబృందం. లక్ష్మీబాయి జీవితంలోని అన్ని ముఖ్య ఘట్టాలకు సంబంధించిన సన్నివేశాలతో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యుద్ధరంగంలో శత్రువులను చీల్చి చెండాడే యోధురాలిగా కంగన తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమాను జనవరి 25న రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. -
యన్.టి.ఆర్ : ఒకటా..? రెండా..?
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న బయోపిక్ యన్.టి.ఆర్. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు యన్.టి.ఆర్ కథానాయకుడు, యన్.టి.ఆర్ మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తొలి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితం, రెండో భాగంలో ఎన్టీఆర్ రాజకీయ జీవితాలను చూపిస్తారన్న ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగా రెండు టైటిల్ లోగోలతో పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు. కానీ తాజాగా యన్.టి.ఆర్ ఒక్క సినిమా గానే రిలీజ్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగా తాజాగా చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పాట, పోస్టర్స్ సినిమా ఒక భాగమా రెండు భాగాలా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి. ఇటీవల రిలీజ్చేసిన ఎన్టీఆర్ సెకండ్ సింగిల్ పూర్తి రాజకీయ నేపథ్యంలోనే చూపించారు. తాజాగా ట్రైలర్ ఆడియో, రిలీజ్ డేట్లను ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లోనూ ఎన్టీఆర్ రాజకీయ నాయకుడిగా ఉన్న గెటప్‌నే చూపించారు. అంతేకాదు టైటిల్ కింద కథానాయకడు ట్యాగ్ లేకపోవటం కూడా అనుమానాలకు కారణమైంది. దీంతో యన్.టి.ఆర్ ఒక సినిమాగా వస్తుందా..? లేక రెండు సినిమాలుగానా అన్న చర్చ జరుగుతోంది. ఈ విషయం పై కార్లిటీ రావాలంటే చిత్రయూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
యన్.టి.ఆర్ : 16న ట్రైలర్.. 21న ఆడియో
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ యన్‌టిఆర్ బయోపిక్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ స్టిల్స్‌తో పాటు రెండు పాటలను కూడా విడుదల చేశారు. తాజాగా చిత్ర టైలర్, ఆడియో రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. యన్.టి.ఆర్ ట్రైలర్ లాంచ్ డిసెంబర్ 16న హైదరాబాద్‌లో, ఆడియో రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 21న నందమూరి తారకరామారావు పుట్టిన ఊరు నిమ్మకూరులో జరగనున్నాయి.ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి ఈ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా యన్.టి.ఆర్ కథానాయకుడు, యన్.టి.ఆర్ మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా వస్తుంది. విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, లెజెండరీ కైకాల సత్యనారాయణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
మూడు భాషల్లో ‘మణికర్ణిక’
వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం మణికర్ణిక. టాలీవుడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాకు కొంత భాగం కంగనా కూడా దర్శకత్వం వహించారు. అనేక వివాదాలు, మరెన్నో వాయిదాల తరువాత షూటింగ్ పూర్తి చేసుకున్న మణికర్ణిక ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 18న ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. దర్శకుడు తెలుగు వాడు కావటంతో పాటు చారిత్రక కథ కావటంతో ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. హిందీ పాటు ఇతర భాషల్లోనూ జనవరి 25నే మణికర్ణికను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే జనవరి 24న క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న యన్.టి.ఆర్ మహానాయకుడు రిలీజ్ కానుంది. మరి ఒకే దర్శకుడు తెరకెక్కించిన రెండు సినిమాలు ఒక్క రోజు రిలీజ్ చేసే సాహసం చేస్తారో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
‘యన్.టి.ఆర్’ నుంచి మరోపాట
నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా యన్.టి.ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ సినీ ప్రయాణానికి సంబంధించిన పాటను రిలీజ్ చేయగా తాజాగా ఎన్టీఆర్ రాజకీయా జీవితానికి సంబంధించిన మరో పాటను విడుదల చేశారు. ఎక్కువగా సంస్కృత పదాలతో గంభీరంగా ఉన్న ఈ పాటకు శివ దత్త, రామకృష్ణ, కీరవాణిలు సాహిత్యంమందించగా శరత్ సంతోష్, మోహన భోగరాజు, కీరవాణి, కాల భైరవ, శ్రీనిధి తిరుమలలు ఆలపించారు. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి విద్యాబాలన్‌తో పాటు ఎంతో మంది టాలీవుడ్ నటీమణులు సందడి చేయనున్నారు. బాలకృష్ణ వారాహి చలనచిత్రం, విబ్రీ మీడియా బ్యానర్లతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
‘యన్.టి.ఆర్’ తొలి పాట..!
బాలకృష్ణ హీరోగా నందమూరి తారకరామరావు జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈసినిమా తొలిభాగం యన్.టి.ఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఆదివారం తొలి పాటను రిలీజ్ చేశారు. రచయితలు శివ శక్తిదత్తా, కే రామకృష్ణలు పూర్తి సంస్కృత పదాలతో గంభీరమైన పాటను రచించారు. కీరవాణి సంగీత సారధ్యంలో బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్ ఈ గీతాన్ని ఆలపించారు. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రానా, సుమంత్, సత్యనారాయణలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
బాలయ్య యాక్షన్.. ఎన్టీఆర్ వాయిస్..!
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా యన్.టి.ఆర్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్కు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా రెండు భాగాలుగా జనవరిలో రిలీజ్ కానుంది. తొలి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితం, రెండో భాగంలో ఆయన రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ ప్రసంగాలను ప్రత్యేకంగా చూపించనున్నారట. ఎంతో ఆవేశంగా సాగే ఎన్టీఆర్ ప్రసంగాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అందుకే సినిమాలో ఆ సన్నివేశాలకు మరింత స్కోప్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఆ సన్నివేశాల్లో బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో కనిపించినా.. డబ్బింగ్ మాత్రం చెప్పటం లేదట. అప్పట్లో ఎన్టీఆర్ చేసిన ప్రసంగాల వాయిస్కే బాలయ్య యాక్ట్ చేస్తారట. అంటే బాలయ్య తెర మీద కనిపించినా గొంతు మాత్రం సీనియర్ ఎన్టీఆర్‌దే వినిపిస్తుందనమాట. ప్రస్తుతం ఈ ప్రచారం టాలీవుడ్ లో గట్టిగానే జరుగుతోంది. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ వాయిదా పడనుందా..?
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా యన్.టి.ఆర్. నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా తొలి భాగం యన్.టి.ఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రెండవ భాగం యన్.టి.ఆర్ మహానాయకుడు జనవరి 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే రెండు సినిమా మధ్య గ్యాప్ తక్కువగా ఉండే కలెక్షన్ల పై ప్రభావం పడుతుందని భావిస్తున్నారట నందమూరి ఫ్యాన్స్. అందుకే రెండవ భాగాన్ని పోస్ట్‌పోన్ చేయాల్సిందిగా చిత్రయూనిట్‌పై ఒత్తిడి తెస్తున్నారట. మరి అభిమానుల కోరిక మేరకు యన్.టి.ఆర్ టీం సినిమాను వాయిదా వేస్తుందేమో చూడాలి. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తుండగా అక్కినేని పాత్రలో సుమంత్, ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణగా కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతమందిస్తున్నారు. -
ఒక్క సినిమాకు 14 కోట్ల పారితోషికం
సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో ఉండే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం బ్యూటీ చారిత్రక కథతో తెరకెక్కుతున్న మణికర్ణిక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత కథగా రూపొందుతున్న ఈ సినిమాకు క్రిష్ డైరెక్షన్ చేయగా చివరి షెడ్యూల్‌కు కంగనా స్వయంగా దర్శకత్వం వహించారు. బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ తో క్రిష్ బిజీగా కావటంతో మణికర్ణిక దర్శకత్వ బాధ్యతలు కంగన తీసుకున్నారు. ఒకే సినిమాలో నటిగా, దర్శకురాలిగా పనిచేస్తుండటంతో రెమ్యూరేషన్ కూడా అదే స్థాయిలో తీసుకుంటున్నారట కంగనా. గతంలో ఒక్కో సినిమా 5 నుంచి 6 కోట్ల పారితోషికం తీసుకున్న ఈ భామ ఈ సినిమాకు డబుల్ కన్నా ఎక్కువగా తీసుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈసినిమాకు ఈ బ్యూటీ ఏకంగా 14 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టుగా బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ మొత్తం పద్మావత్‌కు దీపిక తీసుకున్న రెమ్యూనరేషన్ కన్నా ఎక్కువ కావటంతో బాలీవుడ్ ప్రముఖులు షాక్ అవుతున్నారు. అంతేకాదు ఈ సినిమాతో బాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకున్ననటిగా రికార్డ్ సృష్టించనుంది కంగనా. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న మణికర్ణిక జనవరి 25న రిలీజ్ కానుంది. -
ఆ అర్హత విశాల్‌కి ఉంది
‘‘గొప్ప స్నేహితుడికి అర్థం విశాల్. తనకు నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. పొల్లాచ్చిలో ‘కృష్ణం వందే జగద్గురుమ్’ రెక్కీకి వెళ్లినప్పుడు నాకు రూమ్ లేకపోవడంతో విశాల్ తన రూమ్‌కి తీసుకెళ్లి, బెడ్ నాకు ఇచ్చి, నేలపై పడుకోవడానికి రెడీ అయ్యాడు. పురట్చి దళపతి (విప్లవ సేన నాయకుడు) అని విశాల్‌ను తమిళ ప్రేక్షకులు, అభిమానులు పిలుచుకుంటారు. ఆ పేరు పెట్టుకోవడానికి తనకు అర్హత ఉంది’’ అని డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ అన్నారు. విశాల్ హీరోగా, కీర్తీ సురేశ్, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్లుగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పందెంకోడి 2’. ‘ఠాగూర్’ మధు సమర్పణలో విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతి లాల్ గడా నిర్మించిన ఈ సినిమా ఈనెల 18న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నటి లక్ష్మీప్రసన్న, ఆడియో సీడీలను క్రిష్ విడుదల చేశారు. ఈ వేడుకలో కొంత మంది రైతులకు విశాల్ ఆర్థిక సాయం చేశారు. విశాల్ మాట్లాడుతూ– ‘‘నాన్న జి.కె.రెడ్డిగారు, అన్నయ్య విక్రమ్ కృష్ణగారి వల్లే ఓ నటుడిగా మీ ముందు గర్వంగా నిలబడి ఉన్నా. ‘పందెంకోడి’ ప్రారంభించే ముందు నేను 25 సినిమాలు చేస్తానని అనుకోలేదు. నేను మరో 25 సినిమాలు చేసేలా నా 25వ సినిమా ‘పందెంకోడి 2’ ఉంటుంది. ‘పందెంకోడి 3’ చేయడానికి మళ్లీ 13 ఏళ్లు కాకుండా పదమూడు నెలల్లో ప్రారంభం అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా సమర్పకులు ‘ఠాగూర్’ మధుగారు నా తర్వాతి సినిమా నిర్మాత. నా ప్రతి సినిమాకు టికెట్‌పై ఓ రూపాయి రైతులకే ఇచ్చేస్తాను. ఇప్పుడు ప్రతి ఏడాది వంద సినిమాలకు పైగానే రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకుడు కొనే టికెట్లో ఒక రూపాయిని ప్రభుత్వమే తీసుకుని రైతులకు ఖర్చుపెడితే బావుంటుంది. రైతులు, నిర్మాతలు ఒకటే. నాకు థియేటర్ గుడి.. ప్రేక్షకులే దేవుళ్లు’’ అన్నారు. ‘‘విశాల్, నా కాంబినేషన్లో ‘పందెంకోడి 3’ కూడా చేయాలనుకుంటున్నాం’’ అన్నారు లింగుస్వామి. నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, ‘లగడపాటి’ శ్రీధర్, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, రచయిత ఆకుల శివ, కథానాయికలు కీర్తీ సురేశ్, వరలక్ష్మి శరత్‌కుమార్ పాల్గొన్నారు. చిత్ర సమర్పకులు ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ– ‘‘పందెం కోడి’ చిత్రానికి ఇది పర్ఫెక్ట్ సీక్వెల్. ఎత్తుకు పై ఎత్తు వేసి విలన్స్‌ని హీరో ఎలా ఢీ కొన్నాడు అన్నదే కథ. జయాపజయాల నుంచి నేర్చుకోకపోతే ఇండస్ట్రీలో ఉండలేం. డిజిటల్ కంటెంట్‌తో థియేట్రికల్ రెవెన్యూ తగ్గినా డిజిటల్ మార్కెట్లో వచ్చే రెవెన్యూ దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. విశాల్‌తో తమిళంలో ‘టెంపర్’ రీమేక్ చేస్తున్నా. నిఖిల్‌తో చేస్తోన్న ‘ముద్ర’ షూటింగ్ పూర్తి కాబోతోంది’’ అన్నారు. -
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మణికర్ణిక’
ఆంగ్లేయులను ఎదిరించి పోరాడిన వీర వనిత ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మణికర్ణిక. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించారు. అయితే క్రిష్.. యన్.టి.ఆర్ షూటింగ్లో బిజీ కావటంతో మణికర్ణిక చిత్రానికి కంగనా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆఖరి పాట చిత్రీకరణ మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ నర్మద ఘాట్‌లో జరుగుతోంది. ఈ దీంతో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టే. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
అఫీషియల్.. రెండు భాగాలు ‘యన్.టి.ఆర్’
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా యన్.టి.ఆర్. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇన్నాళ్లు ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. ఈ రోజు రిలీజ్ చేసిన రెండు పోస్టర్లతో యన్.టి.ఆర్‌పై క్లారిటీ ఇచ్చారు. ఉదయం ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ అంటూ ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించిన తొలిభాగం పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సాయంత్రం ‘యన్.టి.ఆర్ మహానాయకుడు’ పేరుతో ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి సంబంధించిన రెండో భాగం పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తొలి భాగం జనవరి 9న, రెండో భాగాన్ని జనవరి 24న రిలీజ్ చేయనున్నారు. -
‘యన్.టి.ఆర్’ కథానాయకుడు
బాలకృష్ణ హీరోగా నందమూరి తారకరామరావు జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రానా, సుమంత్, సత్యనారాయణలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింట్ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్‌ను బాలయ్య రెండు భాగాలుగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తొలి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితం రెండో భాగంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలను తెరకెక్కించనున్నారు. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ చూస్తే ఈ వార్తలు నిజమే అన్న భావన కలుగుతోంది. ఈ పోస్టర్ యన్.టి.ఆర్ టైటిల్‌తో పాటు కథానాయకుడు అనే ట్యాగ్‌ను జత చేశారు. దీంతో యన్.టి.ఆర్ తొలి భాగం కథానాయకుడు గా రిలీజ్ కాబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ భాగాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. రెండో వారాల గ్యాప్‌లోనే రెండో భాగం కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే యన్.టి.ఆర్ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టుగా చిత్రయూనిట్ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. -
కంగనా విశ్వరూపం ‘మణికర్ణిక’
టాలీవుడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా మణికర్ణిక. ఇప్పటికే పలు వివాదాలతో వార్తల్లో ఉంటున్న ఈ సినిమా ఫైనల్‌గా రిలీజ్‌కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేశారు. బిగ్ బి అమితాబ్ వాయిస్ ఓవర్‌తో రూపొందించిన టీజర్ ఆసక్తికరంగా ఉంది. ఝాన్సీ లక్ష్మీ బాయ్ రాజనీతి, ధైర్య సాహసాలు ప్రతిబింభించేలా మణికర్ణిక సినిమాను రూపొందిస్తున్నారు. కంగనా రనౌత్ ఝాన్సీ లక్ష్మీ బాయ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. మేజర్ పార్ట్‌కు క్రిష్ దర్శకత్వం వహించగా చివర్లో కొన్ని సన్నివేశాలతో పాటు ప్యాచ్ వర్క్‌కు కంగనా దర్శకత్వం వహించారు. ఆ సమయంలో కంగన వ్యవహార శైలిపై ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు దర్శకురాలిగా కంగనా పేరునే టైటిల్స్‌లో వేస్తారన్న ప్రచారం జరిగిన టీజర్లో దర్శకుడిగా క్రిష్ పేరే కనిపించింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను 2019 జనవరి 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. &rel=0 -
‘మణికర్ణిక’ టీజర్ రెడీ..!
టాలీవుడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా మణికర్ణిక. ఇప్పటికే పలు వివాదాలతో వార్తల్లో ఉంటున్న ఈ సినిమా ఫైనల్‌గా రిలీజ్‌కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. కంగనా రనౌత్ ఝాన్సీ లక్ష్మీ బాయ్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. మేజర్ పార్ట్‌కు క్రిష్ దర్శకత్వం వహించగా చివర్లో కొన్ని సన్నివేశాలతో పాటు ప్యాచ్ వర్క్‌కు కంగనా దర్శకత్వం వహించారు. ఆ సమయంలో కంగన వ్యవహార శైలిపై ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు దర్శకురాలిగా కంగనా పేరునే టైటిల్స్ లో వేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ అనుమానాలన్నింటికి టీజర్‌తో సమాధానమివ్వనున్నారు చిత్రయూనిట్. -
‘యన్.టి.ఆర్’లో ఏఎన్నార్
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా టాలీవుడ్ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. సినీ ప్రముఖులు సోషల్ ఈ మీడియా ద్వారా ఏఎన్నార్‌ను స్మరించుకుంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రయూనిట్ ఏఎన్నార్‌కు నివాళులర్పిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ బయోపిక్‌లో ఏఎన్నార్ పాత్రలో నటిస్తున్న ఆయన మనవడు సుమంత్ లుక్‌ను రివీల్ చేశారు చిత్రయూనిట్. నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. సాయి కొర్రపాటి, విష్ణువర్దన్ ఇందూరి నిర్మాణంలో తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఎన్టీఆర్ సినీ రాజకీయ ప్రస్థానాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో యంగ్ హీరో రానా నటిస్తుండగా ఎన్టీఆర్ సతీమణి బసవతారకంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించనున్నారు. -
‘యన్.టి.ఆర్’కి బిగ్ టార్గెట్
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా యన్.టి.ఆర్(బయోపిక్). ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా స్టార్ట్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు సినీ రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ బయోపిక్ కావటంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఓవర్సీస్లో ఈ సినిమా దాదాపు 20 కోట్లు పలికినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంత ఎమౌంట్‌ను యన్.టి.ఆర్ తిరిగి వసూళు చేయగలదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమాలేవి ఓవర్సీస్లో ఈ స్థాయిలో వసూళ్లు సాధించలేదు. మరి యన్.టి.ఆర్తో బాలయ్య సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తాడేమో చూడాలి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించేశారు. ఒక్కో పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్, చంద్రబాబులకు సంబంధించిన స్టిల్‌ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్‌గా బాలయ్య, చంద్రబాబు పాత్రలో రానా కనిపిస్తుండగా ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు. -
ఇలాంటి సినిమా తీయాలనిపించింది
‘‘మను, కేరాఫ్ కంచరపాలెం’ సినిమాలు ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి. ‘మను’ ట్రైలర్ చూసిన తర్వాత ప్రివ్యూ వేస్తే నాకు చూపిస్తారా? అని సుజన్‌ని అడిగా. అంతేకాదు.. ఇలాంటి సినిమా నేను కూడా ఒకటి తీయాలనిపించింది’’ అని డైరెక్టర్ క్రిష్ అన్నారు. రాజా గౌతమ్, చాందినీ చౌదరి జంటగా ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను’. నిర్వాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్ ఫండ్‌తో నిర్మించి ఈ సినిమా ఈనెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘నేను, గౌతమ్అన్న ఒకే కాలనీలో పెరిగాం. ఆయన హీరో కావడానికి చాలా కష్టపడ్డాడు. తెలుగులో నాలుగు ఫైట్స్, సాంగ్స్‌తో సినిమాలు వస్తుంటాయి. కానీ, ఇలాంటి సినిమాలు తక్కువగా వస్తుంటాయి.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ‘‘క్రౌడ్ ఫండింగ్ అనేది డిగ్నిఫైడ్ అప్రోచ్ అని మా సినిమాతో నిరూపించాలనుకుంటున్నాం. సరైన సినిమా తీస్తే క్రౌడ్ ఫండింగ్ అనే ఓ ఫ్లాట్‌ఫాం ఉందని చెప్పే ప్రయత్నమిది’’ అన్నారు ఫణీంద్ర నర్సెట్టి. ‘‘ఈ మూడేళ్ల జర్నీని నా లైఫ్‌లో మరచిపోలేను. ఇది నా బెస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్. కొత్త కాన్సెప్ట్‌లకు నిర్మాతలెవరూ ముందుకు రాకపోతే.. క్రౌడ్ ఉందనే ధైర్యం మా సినిమా చూస్తే కలుగుతుంది’’ అన్నారు రాజా గౌతమ్. చాందినీ చౌదరి, సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ శివ్ కుమార్ పాల్గొన్నారు. -
ఫస్ట్‌లుక్ : అచ్చం ఎన్టీఆర్లాగే
క్రిష్ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. టైటిల్ రోల్ పోషిస్తూ, బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదల చేసిన బాలయ్య ఫస్ట్‌లుక్ అంచనాలను మరింతగా పెంచేసింది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ అభిమాలను ఆకట్టుకుంటోంది. కాషాయ వస్త్రాల్లో మైక్ ముందు నిలబడి.. ఎన్టీఆర్ సిగ్నేచర్ మార్కుతో ఉన్న బాలయ్యను చూస్తే అచ్చం ఎన్టీఆర్‌ను చూసినట్టే ఉందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో ఆయన భార్యగా విద్యాబాలన్ నటిస్తున్నారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, యువ నటులు రానా, సుమంత్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా తొలి షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. Natasimha Nandamuri Bala Krishna in and as the Legendary #NTR #NTRBiopic #HappyIndependenceDay @NBKFilms_ @DirKrish @vishinduri pic.twitter.com/yZLknkmuZl — BARaju (@baraju_SuperHit) August 14, 2018 -
హైదరాబాద్‌కి వస్తే పుట్టింటికి వచ్చినట్లు ఉంటుంది
ప్రభుదేవా, ఐశ్వర్యా రాజేశ్, బేబి దిత్య ముఖ్య తారలుగా నటించిన డ్యాన్స్ బేస్డ్ మూవీ ‘లక్ష్మి’. ఎ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిర్మాత సి.కల్యాణ్ ఈ నెల 24న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సీఎస్ శ్యామ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఆడియోను దర్శకుడు వీవీ వినాయక్, ట్రైలర్‌ను దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. అనంతరం వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘ప్రభు మాస్టర్ అంటే మా అందరికీ చాలా గౌరవం. అన్ని భాషల్లో కీర్తి సంపాదించిన ఆయన ఇప్పటికీ లైమ్‌లైట్‌లో ఉన్నారంటే చాలా గొప్ప విషయం. విజయ్ అర్థవంతమైన సినిమాలు తీస్తాడు. నా సినిమా టైటిల్‌ను వాడుకోవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘గొప్ప ప్రొడ్యూసర్ కల్యాణ్‌గారు రిలీజ్ చేస్తున్న ఈ సినిమా హిట్ సాధించాలి. ఎ.ఎల్. విజయ్, నేను ఇద్దరం ఒకేసారి కెరీర్‌ను స్టార్ట్ చేశాం’’ అన్నారు క్రిష్. ‘‘చాలా ఇష్టపడి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. ఇందుకు కారణం ప్రభుదేవాగారే. మంచి ఫీల్‌తో సాగే చిత్రమిది’’ అన్నారు సి.కల్యాణ్. ‘‘ఈ ఆడియో వేడుకను ఇంత బాగా సెలబ్రేట్ చేసిన కల్యాణ్‌గారికి థ్యాంక్స్. హైదరాబాద్‌కి వస్తే నాకు పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. విజయ్‌గారికి ఇది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇది డ్యాన్స్ సినిమా అనే కంటే ఎమోషనల్ మూవీ అని చెప్పవచ్చు. దిత్య సూపర్ డ్యాన్సర్’’ అన్నారు ప్రభుదేవా. ‘‘ప్రభుదేవా ఈ సినిమాకు ఒక యాక్టర్లా కాకుండా గాడ్‌ఫాదర్‌లా పనిచేశారు. చిన్నారి దిత్య బాగా కష్టపడింది’’ అన్నారు చిత్రదర్శకుడు విజయ్. ‘‘నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రభుదేవాగారి ‘ప్రేమికుడు’ సినిమా చూశా. ఇప్పుడు ఆయన పక్కన కూర్చునే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది’’ అన్నారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. చిన్న పిల్లల ప్రతిభను బయటకు చూపించే ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది’’ అన్నారు రాజ్ కందుకూరి. బేబి దిత్య, ఐశ్వర్యా రాజేశ్, సత్యం రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ సినిమాకు బాబు డైరెక్షన్!
వింతల్లోకెల్లా వింత. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, పదవీచ్యుతుడిని చేసి, ఆయన మానసిక క్షోభకు, మరణానికి కారకుడైన వ్యక్తే.. ఎన్టీఆర్ సినిమా ఎలా తీయాలో, ఆ సినిమాలో ఏం చెప్పాలో నిర్దేశిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాత, దర్శకులు బాలకృష్ణ, క్రిష్‌లను చంద్రబాబు శుక్రవారం తన దగ్గరకు పిలిపించుకొని మూడు గంటలపాటు ఆ సినిమాపై కర్తవ్య ప్రబోధం చేయడం తెలుగు ప్రజలను షాక్‌కు గురిచేసింది. సాక్షి, అమరావతి: ప్రముఖ నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమా సీఎం చంద్రబాబు సూచనల ప్రకారం తెరకెక్కుతోందనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆ సినిమాపై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండగా చిత్ర ముఖ్యులు చంద్రబాబుతో సుదీర్ఘంగా సమావేశం కావడం వాటికి బలాన్ని చేకూరుస్తోంది.ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న దగ్గుబాటి రాణాలు శుక్రవారం మూడు గంటలపాటు చంద్రబాబుతో ఈ సినిమా గురించి చర్చించారు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ అనగానే ఆయన జీవితంలో అత్యంత విషాదకర పరిణామాలేవీ ఉండవని, అన్ని ఘటనలను చంద్రబాబు రాజకీయాలకు అనుగుణంగా చిత్రీకరిస్తారని అటు సినిమా, ఇటు రాజకీయ వర్గాలో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలపై ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఇప్పటికే దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ మానసిక క్షోభ సినిమాలో లేనట్లే.. తెలుగు సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగొంది, ఆ తర్వాత రాజకీయాల్లోకొచ్చి సంచలనాలు సృష్టించిన ఎన్టీఆర్ చివరి దశ అత్యంత దారుణంగా ముగిసింది. ఒక పథకం ప్రకారం ఎన్టీఆర్ అల్లుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపి దాన్ని ఆక్రమించారనే విషయం జగమెరిగిన సత్యం. పిల్లనిచ్చిన పాపానికి తనను మోసం చేశాడని, చంద్రబాబు మరో ఔరంగజేబని బ్రతికున్న రోజుల్లో ఎన్టీఆర్ వాపోయారు. ముఖ్యమంత్రి పదవిని లాక్కోవడమేగాక, చంద్రబాబు ఆయనపై చెప్పులు వేయించి, దుర్భాషలాడించి తీవ్ర అవమానాల పాలు చేశారు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని కబ్జా చేయడమేగాక ఒక వ్యూహం ప్రకారం ఎన్టీఆర్ కుటుంబాన్ని ఆయనకు దూరం చేసి ఒంటరి చేశారు. ఈ మానసిక వ్యధతోనే ఆయన 1996 జనవరి 18న మృతి చెందారు. బ్రతికున్నంత కాలం అన్నివిధాలుగా అవమానించి వేధించిన చంద్రబాబు మృతి చెందిన తర్వాత ఆయన కీర్తిని కూడా కబ్జా చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ను పొగుడుతున్నా ఆయన మరణానికి చంద్రబాబే కారణమని ఆరోపణలు తరచుగా అభిమానుల నుంచి వింటూనే ఉంటాం. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తుండడం, ఆయన పాత్రను చంద్రబాబుకు పూర్తి అనుకూలంగా ఉండే ఆయన కుమారుడు బాలకృష్ణ నిర్మిస్తూ, స్వయంగా తండ్రి పాత్ర వేస్తుండడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు సూచనలు, సలహాల ప్రకారం పూర్తిగా ఆయనే అనుకూలంగా ఉండేలా సినిమా తీయనున్నారని ఎన్టీఆర్ అభిమానులు పేర్కొంటున్నారు. ఎన్టీఆర్ చివరి దశలో చంద్రబాబు వల్ల జరిగిన విషాద ఘటనలేవీ ఈ సినిమాలో ఉండవని వారు స్పష్టం చేస్తున్నారు. గాంధీ సినిమాకు గాడ్సే సూచనలా? మొదట ఈ సినిమాను తేజ దర్శకత్వంలో నిర్మించాలనుకున్నారు. కొంత పని కూడా జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. బాలకృష్ణ చెప్పిన ప్రకారం సినిమాను తీసేందుకు తేజ ఒప్పుకోలేదని సమాచారం. తనతో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తీసిన క్రిష్ అయితే తాము చెప్పినట్లు సినిమా తీస్తారని, ఇబ్బంది ఉండదని బాలకృష్ణ భావించడంతోనే దర్శకుడి మార్పు జరిగిందనే వాదన ఉంది. ఈ మార్పు జరిగినప్పుడే ఎన్టీఆర్ సినిమా వాస్తవానికి దగ్గరగా ఉండే అవకాశం లేదనే విశ్లేషణలు వచ్చాయి. తాజాగా చంద్రబాబు వద్దకే నేరుగా చిత్ర దర్శకుడు వచ్చి కొన్ని గంటలపాటు సూచనలు తీసుకోవడంతో ఎన్టీఆర్ జీవితంలోని విషాద పరిణామాలను వక్రీకరించడం ఖాయమని స్పష్టమవుతోంది. ఈ చర్చలపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గాంధీ సినిమాకు ఆయన్ను చంపిన గాడ్సే సూచనలు తీసుకున్నట్లు ఎన్టీఆర్ సినిమాకు ఆయనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు సలహాలు తీసుకుంటున్నారనే సెటైర్లు హల్చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ అంతిమ దశలో చోటుచేసుకున్న దుర్భర పరిణామాలను చంద్రబాబుకు అనుకూలంగా, రాజకీయంగా ఆయనకు ఉపయోగపడేలా చిత్రీకరిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా చంద్రబాబు కోణంలోనే ఉంటుందని, బ్రతికుండగా ఆయన్ను అన్నింటికీ దూరం చేసి చివరికి ఆయన జీవిత చరిత్రను కూడా చంద్రబాబు వక్రీకరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
కన్ఫమ్ : ఏఎన్నార్‌గా సుమంత్
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా ఇద్దరు యువ కథా నాయకులు ఎన్టీఆర్‌లో భాగమవుతున్నట్టుగా ప్రకటంచారు. ఇప్పటికే రానా.. ఎన్టీఆర్ కోసం పనిచేస్తున్నట్టుగా ప్రకటించగా తాజా సుమంత్ కూడా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నట్టుగా కన్ఫమ్ చేశాడు. రానా ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ తాను కూడా ఎన్టీఆర్‌లో నటిస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే తాత ఏఎన్నార్ పాత్రలో నటించేందుకు ఓకె చెప్పాడు సుమంత్. గతంలో ఈ పాత్రను నాగచైతన్య పోషిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే రూమర్స్ కు చెక్ పెడుతూ ఎన్టీఆర్ లో ఏఎన్నార్‌గా కనిపించబోయేది తానే అంటూ క్లారిటీ ఇచ్చేశాడు సుమంత్. Excited and honored to be joining this team, portraying my grandfather #ANR in this prestigious venture🙏🏼 #NTR https://t.co/6T09vrnCHB — Sumanth (@iSumanth) 4 August 2018 -
నిమ్మకూరులో ‘ఎన్టీఆర్’ టీం
నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం లొకేషన్స్‌ను వెతికే పనిలో పడ్డారు చిత్రయూనిట్. ఎన్టీఆర్ బాల్యనికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించాల్సిన లొకేషన్స్ పరిశీలించేందుకు ఆయన స్వగ్రామం నిమ్మకూరుకు వచ్చింది ఎన్టీఆర్ టీం. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన నందమూరి బాలకృష్ణ మరియు డైరెక్టర్ క్రిష్ అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌లు నిమ్మకూరు, కొమరవోలులో పర్యటించారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలను అభిమానులకు తెలియజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘సినిమాలో నాన్నగారు, అమ్మ పుట్టిన ఊర్లను యాదాతధంగా చూపించాలని అనుకుంటున్నాం. ఈ గ్రామాలతో మాకు ఎంతో అనుబంధం ఉంది. ఎన్టీఆర్ కథను వెండితెర మీద చూసేందుకు అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. జనవరి నాటికి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. -
ఎన్టీఆర్ బయోపిక్: ‘టైగర్’ పాత్రలో కైకాల
విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ఎన్టీఆర్. టాప్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు రివీల్ చేస్తూ చిత్రబృందం సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కీలక పాత్రలకు పలువురిని ఫైనల్ చేసిన చిత్ర బృందం.. తాజాగా మరో కీలక పాత్రకు సంబంధించిన విషయాన్ని వెల్లడించింది. ఈ చిత్రంలో దర్శకుడు హెచ్ఎమ్ రెడ్డి పాత్రలో కైకాల సత్యనారాయణ నటించినట్లు దర్శకుడు క్రిష్ స్వయంగా ట్విటర్లో పేర్కొన్నాడు. నేడు(జులై25) కైకాల సత్యనారాయణ జన్మదిన సందర్బంగా క్రిష్ శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్ నెటిజన్లను తెగ ఆకట్టుకోంటోంది. ‘కాళిదాస, భక్త ప్రహ్లాద చిత్రాలతో దక్షిణ భారతీయ సినిమాకు పునాది వేసిన పితామహుడు టైగర్ హెచ్ ఎమ్ రెడ్డి పాత్రలో నటించిన నవరస నట సార్వభౌమ శ్రీ కైకాల సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ క్రిష్ ట్వీట్ చేశాడు. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఈసినిమాలో ఆయన భార్యగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్‌లు కనిపించనున్నారు. టైగర్ H.M Reddy గారి పాత్రలో నటించిన నవరస నట సార్వభౌమ శ్రీ కైకాల సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు #NTR pic.twitter.com/5aiK0gcKla — Krish Jagarlamudi (@DirKrish) July 25, 2018 -
ఎన్టీఆర్ : తొలి షెడ్యూల్ పూర్తయ్యింది
నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ఎన్టీఆర్. చాలా రోజుల క్రితం ప్రారంభమైన ఈ సినిమా తేజ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవటంతో వాయిదా పడింది. తరువాత బాలయ్య హీరోగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను తెరకెక్కించిన క్రిష్ సారధ్యంలో ఎన్టీఆర్ సినిమాను ప్రారంభించారు. క్రిష్ స్టైల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తొలి ఫెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. షూటింగ్సెట్లో తీసిన ఓ ఫోటోను ట్విటర్ పేజ్‌లో పోస్ట్ చేసిన క్రిష్ తొలి షెడ్యూల్ పూర్తయ్యిందంటూ కామెంట్ చేశారు. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఈసినిమాలో ఆయన భార్యగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్‌లు కనిపించనున్నారు. -
‘మణికర్ణిక’ ఆగమనం అప్పుడే..!
టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం ‘మణికర్ణిక- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితకథ ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పలు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మణికర్ణిక మూవీకి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ సమకూర్చారు. మార్చిలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా 2019 జనవరి 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొన్ని సన్నివేశాలు రీషూట్ చేయాల్సి రావటం, గ్రాఫిక్స్ వర్క్కూడా భారీగా ఉండటంతో నిర్మాణాంతర కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయట. అందుకే సినిమా రిలీజ్ ఆలస్యమవుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సంబంధిత కథనాలు.. రీ-షూట్ కోసం ఐదు కోట్ల ఖర్చు...! గుమ్మడికాయ కొట్టేశారు మణికర్ణికలో కంగనా లుక్.. -
మోక్షజ్ఞ తెరంగేట్రం ఆ సినిమాతోనే..!
నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణిలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారని భావించారు. అయితే బాలయ్య మాత్రం వారసుడ్ని పరిచయం చేసేందుకు మరింత సమయం తీసుకున్నారు. త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు. అయితే తాజాగా టాలీవుడ్ లో మోక్షజ్ఞ అరంగేట్రానికి సంబంధించిన వార్త హల్చల్ చేస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా సమయంలో నందమూరి వారసుడ్ని పరిచయం చేసే అవకాశాన్ని మిస్ అయిన దర్శకుడు క్రిష్, ఎన్టీఆర్ బయోపిక్‌తో మోక్షజ్ఞను పరిచయం చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నతనానికి సంబంధించిన సన్నివేశాల్లో మోక్షజ్ఞ, ఎన్టీఆర్‌గా కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. -
‘ఎన్టీఆర్’లో బెంగాలీ నటుడు
నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ, ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా ఈ సినిమా కోసం ఓ బెంగాలీ నటుడ్ని తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మణికర్ణిక సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయ్ భర్తగా నటిస్తున్న జిష్షు సేన్‌గుప్తాను ఎన్టీఆర్‌లో కీలకపాత్రలకు ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ నటుడిగా ఎదుగుతున్న రోజుల్లో ప్రొత్సహించిన ఎల్వీ ప్రసాద్ పాత్రలో జిష్షు కనిపించనున్నారు. త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనున్న ఈ బాలీవుడ్ నటి విద్యాబాలన్, రానా దగ్గుబాటి, సచిన్ కేడ్కర్‌లు కీలక పాత్రలో నటించనున్నారు. -
ఎన్టీఆర్ బయోపిక్.. కొత్త ట్విస్ట్!
నందమూరి బాలకృష్ణ ఏ ముహూర్తాని ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్రకటించారో గాని.. సినిమా ఎనౌన్స్ చేసిన దగ్గరనుంచి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. దర్శకత్వ బాధ్యతల నుంచి తేజ తప్పుకోవటం, ఆ స్థానంలో క్రిష్ వచ్చి చేరటంతో సినిమా పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం కథను ఫైనల్ చేసే పనిలో ఉన్న క్రిష్ నటీనటుల ఎంపిక మీద కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ సమకాలీన నటుల పాత్రల్లో ఈ జనరేషన్ స్టార్ హీరోలను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కృష్ణ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏఎన్నార్‌గా నాగచైతన్య కనిపిస్తారన్న టాక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఏఎన్నార్ పాత్రలో చైతూకు బదులుగా మరో అక్కినేని ఫ్యామిలీ హీరోను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇటీవల మళ్ళీరావా సక్సెస్‌తో ఫాంలోకి వచ్చిన సుమంత్‌ను ‘ఎన్టీఆర్’లో ఏఎన్నార్ పాత్రకు తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఎన్టీఆర్ బయోపిక్ : నాదెండ్ల కుటుంబం నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘యన్.టి.ఆర్’. చిత్రంపై నాదెండ్ల కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సినిమా దర్శకుడు క్రిష్, నటుడు బాలకృష్ణకు నోటీసులు పంపింది. ఎమ్మెల్యే హోదాను ఉద్దేశించ ఒకటి, నటుడిగా మరొక నోటీసును బాలకృష్ణకు నాదెండ్ల భాస్కరరావు పెద్ద కుమారుడు పంపారు. సినిమాలో తమ పాత్రల గురించి ఎలాంటి అనుమతి తీసుకోలేదని వెల్లడించారు. నెగటివ్ షేడ్‌లో భాస్కరరావును చూపించే ప్రయత్నం చేస్తునట్టు తమకు సమాచారం ఉందని ఆయన చెప్పారు. కాగా, క్రిష్ దర్శకత్వంలో ఎన్బీకే ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇటీవలే గ్రాండ్‌గా ఈ సినిమాను స్టార్ట్ చేసిన బాలకృష్ణ, సినిమా రిలీజ్‌కు కూడా స్పెషల్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9నే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావాల్సివుంది. -
‘ఎన్టీఆర్’ రిలీజ్.. అదే రోజు ఎందుకంటే..!
నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్న చివరి నిమిషంలో దర్శకుడు తేజ తప్పుకోవటంతో వాయిదా పడింది. త్వరలో క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్రారంభించనున్నట్టుగా బాలకృష్ణ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్‌ను జనవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే జనవరి 9నే రిలీజ్ డేట్‌గా ప్రకటించటం వెనుక ప్రత్యేకమైన కారణం ఉన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం చేపట్టిన ఎన్టీఆర్ తొలిసారిగా జనవరి 9నే ప్రమాణ స్వీకారం చేశారు. ఎంతో చారిత్రక ప్రాదాన్యం ఉన్న అదే రోజు సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే విషయంపై చిత్రయూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. -
పెళ్లి తర్వాత ఫస్ట్ సినిమా
‘కంచె, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి విజయవంతమైన చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేశారు జ్ఞానశేఖర్. మొదటిసారి ఆయన నిర్మాతగా మారారు. శ్రియ శరణ్ , నీహారిక కొణిదెల ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సుజనా దర్శకత్వం వహిస్తున్నారు. క్రియా ఫిలిం కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్లో రమేష్ కరుతూరితో కలిసి జ్ఞానశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి హీరో వరుణ్ తేజ్ క్లాప్ ఇవ్వగా, డైరెక్టర్ క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. కమర్షియల్ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుందని పేర్కొన్నారు చిత్రబృందం. పెళ్లి తర్వాత శ్రియ నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు. ప్రారంభోత్సవంలో నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్. -
స్పెషల్ డేట్!
దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. ఈ చిత్రాన్ని ఆయన కుమారుడు బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తూ, నిర్మించనున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో ఎన్బీకే ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇటీవలే గ్రాండ్‌గా ఈ సినిమాను స్టార్ట్ చేసిన బాలకృష్ణ, సినిమా రిలీజ్‌కు కూడా స్పెషల్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9నే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాకు సంగీతం: కీరవాణి. -
విడాకులు తీసుకోనున్న డైరెక్టర్ క్రిష్..!
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు క్రిష్ అలియాస్ జాగర్లముడి రాధాకృష్ణ తన వివాహ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న క్రిష్ కొద్ది కాలంలోనే విడాకులు తీసుకోవడానికి సిద్దమయ్యారని తెలుస్తోంది. 2016 ఆగస్టులో వెలగ రమ్య అనే వైద్యురాలిని ఆయన వివాహం చేసుకున్నారు. అయితే క్రిష్, రమ్యలు పరస్పర అంగీకారంతోనే విడాకులకు దరఖాస్తు చేసినట్టు సమాచారం. క్రిష్ దంపతులు విడాకులకు దరఖాస్తు చేయడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. క్రిష్ నిర్ణయంపై పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం క్రిష్ మణికర్ణిక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్‌ను కూడా క్రిష్ తెరకెక్కించనున్నారు. -
మెగా హీరోతో మరోసారి..!
‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొన్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ‘ఫిదా, తొలిప్రేమ’ చిత్రాలతో ఘన విజయాలు సొంతం చేసుకొని ఫుల్ ఫామ్ లో ఉన్న వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. బిబో శ్రీనివాస్ సమర్పణలో జాగర్లమూడి సాయిబాబా, రాజీవ్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రానికి ‘ఘాజీ’ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకుడు. స్పేస్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో వరుణ్ సరసన కథానాయికగా ఇప్పటికే అదితిరావు హైదరీని ఎంపిక చేయగా.. ఇప్పుడు మరో కథానాయికగా లావణ్య త్రిపాఠిని ఫైనల్ చేసారు. మిస్టర్ సినిమాలో కలిసి నటించిన ఈ జోడి ఇప్పుడు మరో సారి తెరమీద సందడి చేసేందుకు రెడీ అవుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ స్పేస్ డ్రామా కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరుకు మొదలవ్వనుంది. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
బన్నీ కొత్త సినిమా ఓకే చేశాడా..?
డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా మే 4న రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తరువాత బన్నీ చేయబోయే సినిమాపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా కోలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. కమర్షియల్ విజయాలు లేకపోయినా.. అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ దర్శకత్వంలో బన్నీ తన నెక్ట్స్ సినిమాను చేయబోతున్నాడట. గతంలో క్రిష్ దర్శకత్వంలో వేదం సినిమాలో నటించిన బన్నీకి నటుడిగా మంచి పేరు వచ్చింది. తాజాగా మరోసారి అదే డైరెక్టర్‌తో వర్క్ చేసేందుకు బన్నీ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఈ సినిమాకు అహం బ్రహ్మాస్మి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. -
అహం బ్రహ్మస్మి
... అంటే నేనే బ్రహ్మ అని అర్థం. క్రిష్ ఇలానే అంటున్నారు. ‘అహం బ్రహ్మసి’ టైటిల్‌తో ఓ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరనారి రాణీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా ఆయన ‘మణికర్ణిక’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో లక్ష్మీభాయ్గా కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఈ హిస్టారికల్ మూవీని తెరకెక్కి స్తూనే తన నెక్ట్స్ సినిమా ‘అహం బ్రహ్మస్మి’కు సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారు క్రిష్. ఇదొక హై బడ్జెట్ కమర్షియల్ మూవీ అని సమాచారం. ఒక్క ‘వేదం’ మినహా క్రిష్ తెరకెక్కించిన ఫస్ట్ మూవీ ‘గమ్యం’ నుంచి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వరకు అన్ని సినిమాలనూ నిర్మించిన సాయిబాబు జాగర్లముడి, రాజీవ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో ఒక టాప్ హీరోను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు క్రిష్. ‘‘ఫుల్ టెక్నికల్ వేల్యూస్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నాం. హీరో ఫైనలైజ్ అయిన తర్వాత మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తాం. ఆగస్టులో ఈ సినిమాను ప్రారంభించబోతున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. -
వివాదంలో మరో చారిత్రక చిత్రం
బాలీవుడ్లో సంచలనం సృష్టించిన పద్మావత్ వివాదం మరువక ముందే మరో చారిత్రక చిత్రం వివాదంలో ఇరుక్కుంది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో ఉండే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ లీడ్ రోల్లో టాలీవుడ్ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమా మణికర్ణిక. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితకథ ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఈ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ చరిత్రను వక్రీకరించారంటూ సర్వ బ్రాహ్మణ మహాసభ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సర్వ బ్రాహ్మణ మహా సభ అధ్యక్షుడు సురేష్ మిశ్రా రాజస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కథా కథనాలు అందిస్తున్న ఈ సినిమాలో ఝాన్సీ రాణికి, ఓ బ్రిటీష్ వ్యక్తికి మధ్య ప్రేమ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు సర్వ బ్రాహ్మణ మహాసభ సభ్యులు. జై శ్రీ మిశ్రా రాసిన వివాదాస్పద పుస్తకం ‘రాణీ’ ఆధారంగా మణికర్ణిక సినిమానుతెరకెక్కిస్తున్నారన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఝాన్సీ చరిత్రకు మచ్చ తెచ్చే విధంగా సినిమాను రూపొందిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ వివాదంపై మణికర్ణిక టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
మరోసారి గాయపడిన స్టార్ హీరోయిన్
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ మరోసారి షూటింగ్ లో గాయపడ్డారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'మణికర్ణిక-ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ' షూటింగ్ సందర్భంగా ఆమె కాలికి గాయమైంది. వెంటనే స్పందించిన చిత్రయూనిట్ ఆమెను దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రమాదమేమి లేకపోయినా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించటంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన కంగనా ముంబై వెళ్లిపోయారు. గతంలోనూ ఓ పోరాట సన్నివేశం షూటింగ్ లో గాయపడిన కంగనా కొద్ది రోజులు పాటు షూటింగ్ కు దూరమయ్యారు. టాలీవుడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. -
దిగ్దర్శకులుగా క్రిష్, తరుణ్
అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాల్లో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో కనిపించనుంది. అంతేకాదు దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితులైన మహానటుల పాత్రల్లో ఈ తరం నటీనటులు దర్శనమివ్వనున్నారు. జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా కాస్టింగ్ కు సంబంధించి ఆసక్తికరమైన అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. తెలుగు సినిమా ఖ్యాతీని పెంచిన దిగ్గజ దర్శకులు కెవీ రెడ్డి పాత్రలో ఈ తరం దర్శకుడు క్రిష్, మాయాబజార్ సినిమాకు అసిస్టెంట్ గా పనిచేసిన సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ పాత్రలో పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ కనిపించనున్నారు. వీరితో ఇతర కీలక పాత్రల్లో సమంత, రాజేంద్ర ప్రసాద్, షాలినీ పాండే లు నటిస్తున్నారు. -
హాలీవుడ్ టీమ్ 30... లోకల్ ఫైటర్స్ 300!
‘మణికర్ణిక’... ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితకథతో దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న చిత్రమిది. లక్ష్మీభాయ్ అంటేనే యుద్ధాలు, గుర్రపు స్వారీలు గట్రా కంపల్సరీ కదా! ఆ యుద్ధాలు తెరకెక్కించ డం కోసం నిక్ పావెల్ అనే హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌ను రప్పించారు క్రిష్. ‘గ్లాడియేటర్’ వంటి హాలీవుడ్ హిట్ సిన్మాలకు నిక్ వర్క్ చేశారు. ఆయన చేత స్వోర్డ్ ఫైటింగ్, హార్స్ రైడింగ్ తదితర అంశాల్లో కంగనాకు శిక్షణ ఇప్పించారనే సంగతి తెలిసిందే. ఇంకో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే... కంగనాకే కాదు, హైదరాబాద్ లోకల్ ఫైటర్స్కూ నిక్ పావెల్ టీమ్ చేత ట్రైనింగ్ ఇప్పించారట. అందుకోసం, హాలీవుడ్ నుంచి 30 మంది స్పెషల్ టీమ్ వచ్చారట! ఎందుకంటే... వార్ సీక్వెన్సులను వీలైనంత లైవ్‌లో షూట్ చేయాలనుకుంటారు క్రిష్. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగును అలానే చేశారు. ఇప్పుడీ సిన్మాకు సేమ్ థియరీ ఫాలో అవు తున్నారట! మొన్నామధ్య ఓ 30 రోజులు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ‘మణికర్ణిక’ కోసం యుద్ధ సన్నివేశాలు తీశారు. అప్పుడు 300 మంది లోకల్ ఫైటర్స్, మరికొందరు జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈ వార్ సీక్వెన్స్ కోసమే లోకల్ ఫైటర్స్ కు ట్రైనింగ్ ఇప్పించారు. కంగనా నటించిన హిందీ సినిమా ‘సిమ్రన్’ శుక్రవారం రిలీజవుతోంది. ఆ హడావుడి ముగిశాక ‘మణికర్ణిక’ షూట్ మళ్లీ ఇక్కడే మొదలవుతుందట! -
రాంగ్ టైమింగ్..!
కదనరంగంలో శత్రువును జయించాలనే తపనే కాదు, ఆత్మరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలక్ష్యంగా ఆదమరచామా అదును చూసుకుని క్షణాల్లో పదునైన వేటు వేస్తారు ప్రత్యర్థులు. అందుకే రణరంగంలో కత్తితో పోరాటం చేసే వ్యక్తి కాలి కదలికలతోపాటు, టైమింగ్ కూడా కీలకం అంటారు యుద్ధనిపుణులు. అయితే ఈ విషయంలో కంగనా రనౌత్ కాస్త తొందరపడ్డారు. ఫలితంగా ఆమె లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్న ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’లో ఆమె గాయపడ్డారు. కంగనాకు 15 కుట్లు పడ్డట్లు సమాచారం. ఈ విషయం గురించి నిర్మాత కమల్‌జైన్ మాట్లాడుతూ–‘‘ కంగనా, నిహార్ పాండ్యా సెట్లో కత్తి సీన్లో యాక్ట్ చేస్తున్నారు. నిహార్ కంగానాను ఎటాక్ చేసినప్పుడు కంగనా తల కిందకి వంచింది. అయితే అది రాంగ్ టైమింగ్‌లో జరిగింది. దీంతో కంగనా నుదుటి దగ్గర నిహార్ కత్తి తగలడం వల్ల గాయమైంది. ఆ టైమ్‌లో కంగనా ఎంతో ధైర్యంగా ఉండటం నన్ను ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటన పట్ల నిహార్ వినయ పూర్వకమైన క్షమాపణలను కంగనా ఫీలవ్వడంతో సెట్లో అంతా బాగానే ఉంది’’ అని పేర్కొన్నారు. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వంలో కంగనా లీడ్ రోల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. జీ స్టూడియో సమర్పణలో కైరోస్ కంటెంట్ ప్రొడక్షన్స్‌పై కమల్‌జైన్ నిర్మిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథ సిద్ధం చేసిన ఈ సినిమాకు శంకర్ ఇషాన్ లాయ్ త్రయం సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. -
తమిళంలో గౌతమీపుత్ర శాతకర్ణి
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి ఘనవిజయం సాధించి చారిత్రక చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తెలుగు నాట రికార్డ్ వసూళ్లను సాధించింది. ఇప్పుడు తమిళ నాట డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా క్రిష్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఇంత వరకూ ఎవరూ టచ్ చేయని గొప్ప చారిత్రాత్మక కథను దర్శకుడు క్రిష్ వెండితెరపై అద్భుతంగా మలిచిన తీరుకు తమిళ ప్రజలు కూడా కాసులు వర్షం కురిపిస్తారని భావిస్తున్నారు. బాలకృష్ణ సరసన శ్రియ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని బాలకృష్ణకు తల్లిగా కీలక పాత్రను పోషించడం విశేషం. చారిత్రక కథా చిత్రాలు అరుదైపోతున్న ఈ రోజుల్లో చరిత్రను తవ్వి,తానికి కల్పిత హంగులు అద్ది గొప్ప కళాఖండంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఆర్ఎన్సీ.సినిమా పతాకంపై నిర్మాత నరేంద్ర గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం చెన్నై, సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ప్రముఖ నటీమణులు వెన్నెరాడై నిర్మల,లత,దర్శకుడు కేఎస్.రవికుమార్, జాగ్వర్‌తంగం తదితరులు అతిధులుగా పాల్గొని ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ తనకు చెన్నైతో మంచి అనుబంధం ఉందన్నారు. తన చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తమిళనాడులో విడుదల కానండటం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని బాలకృష్ణ కథానాయకుడిగా చేయడమే మంచి అనుభూతిగా పేర్కొన్నారు.ప్రస్తుతం తాను హిందిలో ఝాన్సీరాణి కథతో మణికర్ణిక అనే చారిత్రక చిత్రాన్ని చేస్తున్నట్లు తెలిపారు. -
కష్టాల్లో క్రిష్ 'మణికర్ణిక'..!
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఆకట్టుకున్న టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ తన నెక్ట్స్ సినిమాగా మరో భారీ చారిత్రక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా మణికర్ణిక పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇటీవల కాశీలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కంగనా రనౌత్ టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాపై అప్పుడే వివాదాలు మొదలయ్యాయి. తను రాసుకున్న కథను దొంగిలించి కంగనా వేరే దర్శకుడితో మణికర్ణిక సినిమా చేస్తుందంటూ కేతన్ మెహతా కోర్టును ఆశ్రయించాడు. తాజాగా క్రిష్ మణికర్ణికకు మరో సమస్య ఏర్పడింది. మణికర్ణికకు ముందే నిర్మాత స్వాతి భిసే, ఝాన్సీ రాణి కథతో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఝాన్సీకి రాణి పేరుతో తన కూతురు దేవికా భిసే ప్రధాన పాత్రలో ఈ సినిమా నిర్మాణం ప్రారంభించింది. హాలీవుడ్లో 'ది మ్యాన్ హు న్యూ ఇన్ఫినిటీ' సినిమాకు అసోసియేట్ ప్రొడ్యూసర్ అయిన స్వాతి, ఆ పరిచయాలతో ఝాన్సీకి రాణీ చిత్రాన్ని హాలీవుడ్లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మణికర్ణిక ఎనౌన్స్మెంట్ తరువాత స్పీడు పెంచిన ఝాన్సీకి రాణీ టీం.. ఈ ఏడాది చివరల్లో తమ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే మణికర్ణిక మీద ఎఫెక్ట్ గట్టిగానే పడుతుందని భావిస్తున్నారు. -
మెగాఫోన్ పడుతున్న హీరోయిన్!
రెండు సార్లు జాతీయ అవార్డులు.. కెరీర్లో లెక్కలేనన్ని హిట్లు.. వాటితో పాటు అగ్రహీరోతో రచ్చకెక్కిన విభేదాలు.. ఇవన్నీ కలబోస్తే కంగనా రనౌత్ అవుతుంది. గ్యాంగ్‌స్టర్, క్వీన్, తను వెడ్స్ మను లాంటి సినిమాలతో తానేంటో నిరూపించుకున్న కంగనా.. ఇప్పుడు మెగాఫోన్ పట్టుకుని యాక్షన్... కట్ అని చెబుతానంటోంది. క్రిష్ దర్శకత్వంలో తాను చేస్తున్న 'మణికర్ణిక: ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ' సినిమా తర్వాత ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తానని, అది కామెడీ అవుతుందని కంగనా ఖరారు చేసింది. మణికర్ణిక పోస్టర్ విడుదల అనంతరం ఆమె వారణాసిలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పింది. రాణీ లక్ష్మీబాయి పాత్రలో కూడా నటించే అవకాశం వచ్చిన తర్వాత.. తన జీవితం పరిపూర్ణం అయినట్లు అనిపిస్తోందని, అందుకే ఇప్పుడు తనకు ఎంతో ప్యాషన్ అయిన దర్శకత్వం వైపు వెళ్తున్నానని 30 ఏళ్ల కంగన తెలిపింది. తాను 15 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి వచ్చేశానని, ఏదైనా సాధించినట్లు ఎప్పటికి ఫీలవుతానో అప్పటికి ఏమీ తెలియదని, ఇన్నాళ్లకు తన జీవితం పరిపూర్ణం అయినట్లు అనిపిస్తోందని చెప్పింది. విజయాలు, పరాజయాలు అన్నీ చూసి తాను అన్నీ సాధించేశానని అనుకోడానికి ముందే దర్శకత్వం వైపు కూడా వెళ్తున్నట్లు వివరించింది. ఇక నటనతో సమయం ఎక్కువగా వేస్ట్ చేసుకోనని, అయితే దర్శకత్వం వహిస్తూనే తన సినిమాల్లో కూడా నటిస్తానని చెప్పింది. అందుకే క్రిష్‌తో 'నా చిట్టచివరి డైరెక్టర్ మీరే' అని చెప్పేశానంది. తనకు నటిగా కంటే దర్శకురాలిగా పేరు తెచ్చుకోవడమే ఇష్టమంది. -
కాశీలో క్రిష్ కొత్త సినిమా ఎనౌన్స్మెంట్
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఘనవిజయం సాధించిన క్రిష్ తన నెక్ట్స్ సినిమాకు కూడా చారిత్రక కథాంశాన్నే ఎంచుకున్నాడు. బాహుబలి సినిమాతో భారతీయ చలన చిత్ర రికార్డులను తిరగరాసిన కథా రచయిత విజయేంద్ర ప్రసాధ్ అందించిన రాణీ ఝాన్సీ లక్ష్మీభాయ్ గాథను మణికర్ణిక పేరుతో సినిమాగా తెరకెక్కించనున్నాడు. బాలీవుడ్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో నటిస్తోంది. చాలా రోజులుగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ రోజు (గురువారం) కాశీలో ఎనౌన్స్ చేయనున్నారు. ఇప్పటికే యూనిట్ సభ్యులతో పాటు హీరోయిన్ కంగన కూడా కాశీ చేరుకుంది. సాయంత్రం దశాశ్వమేథ్ ఘాట్ లో జరగనున్న గంగ హారతిలో యూనిట్ సభ్యులు పాల్గొననున్నారు. తరువాత ప్రెస్ మీట్ లో సినిమా ఎనౌన్స్మెంట్ తో పాటు లక్ష్మీభాయ్ లుక్ లో కంగనా 20 అడుగుల పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. బాలీవుడ్ నిర్మాత కమల్ జైన్ భారీ బడ్జెట్ తో ఈ సినమాను నిర్మిస్తుండగా.. సక్సెస్ఫుల్ సంగీత త్రయం శంకర్ ఇషాన్ లాయ్ ను సంగీతం అందిస్తున్నారు. ప్రసూన్ జోషి మాటలు పాటలు రాస్తున్నారు. మరాఠ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాణీ లక్ష్మీభాయ్ 1828లో కాశీలోనే జన్మించింది. అందుకే సినిమా ఎనౌన్స్మెంట్ అక్కడే ప్లాన్ చేశారు చిత్రయూనిట్. -
లక్ష్మీభాయ్గా కంగనా.. ఫస్ట్ లుక్ సూపర్బ్
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ సాధించిన యంగ్ డైరెక్టర్ క్రిష్, తన నెక్ట్స్ సినిమాను కూడా మరో చారిత్రక గాథ నేపథ్యంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సారి జాతీయ స్థాయిలో బాలీవుడ్లో సినిమాచేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఝాన్సీ రాని లక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా మణికర్ణిక అనే సినిమాను తెరకెక్కించనున్నాడు క్రిష్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్లో నటిస్తున్న మణికర్ణిక సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పెన్సిల్ స్కెచ్‌లా ఉన్న ఈ పోస్టర్ లో కంగనా లక్ష్మీభాయ్ లుక్‌లో ఆకట్టుకుంటోంది. అయితే క్రిష్, ఈ లుక్ పై అఫీషియల్‌గా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
క్రిష్, కంగనాల 'మణికర్ణిక'.?
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్.. మరో దృష్యాకావ్యానికి తెరరూపం ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. క్రిష్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై బాలీవుడ్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గౌతమిపుత్ర శాతకర్ణితో తెలుగు చక్రవర్తి కథకు రూపం ఇచ్చిన క్రిష్, మరోసారి ఓ భారీ చారిత్రక చిత్రం రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో... భారత చరిత్రలో ధీరవనితగా గుర్తింపు తెచ్చుకున్న రాణీ లక్ష్మీబాయ్ జీవితాన్ని సినిమాగా రూపొందించనున్నాడు. బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కంగనా రనౌత్ ఈ సినిమాలో లక్ష్మీబాయ్‌గా నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు లక్ష్మీబాయి పుట్టినప్పటి పేరు 'మణికర్ణిక'ను టైటిల్‌గా ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్‌లోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్లో 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సినిమాతో సక్సెస్ సాధించిన క్రిష్, మణికర్ణికతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. -
కళ్యాణ్ రామ్‌తో క్రిష్..?
నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. స్టార్ ఇమేజ్ కోసం ఇప్పటికీ పోరాడుతున్న యంగ్ హీరో కళ్యాణ్ రామ్. ఇటీవల పటాస్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన కళ్యాణ్ రామ్, తరువాత షేర్, ఇజం సినిమాలతో మరోసారి నిరాశపరిచాడు. ప్రస్తుతం నిర్మాతగా ఎన్టీఆర్, బాబీల కాంబినేషన్లో సినిమా రూపొందిస్తున్న ఈ యంగ్ హీరో, తాను హీరోగా చేయబోయే సినిమా కోసం మంచి టీం సెట్ చేసే పనిలో ఉన్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు క్రిష్, ఈ మధ్య కళ్యాణ్ రామ్‌కు ఓ కథ చెప్పాడన్న ప్రచారం జరుగుతోంది. బాబాయ్‌తో భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు తనతో సినిమాకు రెడీ అయ్యే సరికి కళ్యాణ్ రామ్ తెగ సంబరపడిపోతున్నాడు. కానీ క్రిష్ చెప్పిన కథ తనే స్యయంగా డైరెక్ట్ చేస్తాడా..? లేక తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వారెవరైనా డైరెక్ట్ చేస్తారా అన్న విషయంలో క్లారిటీలేదు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
క్రిష్‌ను ప్రశంసిస్తూ సింగీతం లేఖ
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిన దర్శకుడు క్రిష్ కు ఇప్పటికీ ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి. ఓ భారీ చిత్రాన్ని అతి తక్కువ రోజుల్లో తెరకెక్కించి సూపర్ హిట్ చేసిన క్రిష్, ప్రతిష్టాత్మక కేవీ రెడ్డి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ ఆయనకు స్వహస్తాలతో లేఖరాసి పంపారు. ఈ సందర్భంగా సింగీతం క్రిష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. 'యువ కళావాహిని వారు ఈ సంవత్సరపు కేవీ రెడ్డి అవార్డును నా అభిమాన దర్శకుడు క్రిష్ కు ఇస్తున్నారని తెలిసి, ఒకప్పుడు నాకు ఇదే అవార్డు వచ్చినప్పటి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంతోషిస్తున్నాను. నా గురువుగారు కేవీ రెడ్డి గారి ప్రతిభను ప్రతిభింభించే మూడు ముఖ్య గుణాలు - స్పష్టత, బాధ్యత, పవిత్రత. ఈ మూడు గుణాలు క్రిష్ లో పుష్కలంగా ఉన్నాయి. ఇది అతని మొదటి సినిమా గమ్యంలోనే చూసాను. అప్పుడు అతనెవరో నాకు తెలీదు. అతన్ని వెతికి, ఫోన్ నంబర్ పట్టి, మాట్లాడి అభినందించాను. నేనూహించినట్లుగానే క్రిష్ గమ్యం మొదలు గౌతమిపుత్ర శాతకర్ణి వరకు ప్రతి చిత్రాన్నీ ఒక కళాఖండంగా తీర్చిదిద్దుతూ అదే సమయంలో వ్యాపారాత్మక అవసరాలను విస్మరించకుండా తనదైన శైలిలో ముందుకు సాగిపోతున్నాడు. క్రిష్ మున్ముందు ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీసి, అతి త్వరలోనే అంతర్జాతీయ ఖ్యాతి పొందుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అతనికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, స్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. క్రిష్ కు నా హృదయ పూర్వక ఆశీస్సులు.' అంటూ ఈ నెల 22న లేఖ రాశారు. ఈ లేఖ పై స్పందించిన క్రిష్, సీనియర్ దర్శకులు సింగీతం గారు రాసిన ఈ లేఖను జీవితాంతం గుర్తుంచుకుంటాను అంటూ ట్వీట్ చేశారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కంచె సినిమాలో సింగీతం శ్రీనివాస్ ఓ కీలక పాత్రలో నటించారు. -
క్రిష్, వెంకీల సినిమా లేనట్టేనా..?
గౌతమిపుత్ర శాతకర్ణితో అందరి దృష్టిని ఆకర్షించిన క్రిష్, తన తదుపరి చిత్రాన్ని కూడా సీనియర్ హీరోతోనే చేసేందుకు ప్లాన్ చేశాడు. గురు సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న వెంకటేష్ హీరోగా ఓ సక్సెస్ ఫుల్ నవల ఆధారంగా సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేశాడు. డాక్టర్ కేశవ రెడ్డి రాసిన 'అతడు అడవిని జయించాడు' నవల ఆధారంగా 'వీరయ్య' పేరుతో సినిమాను తెరకెక్కించాలని భావించాడు. ఈ సినిమా వెంకటేష్ 75వ సినిమా కూడా కావటంతో మరో ట్యాండ్ మార్క్ సినిమా చేసిన క్రెడిట్ తన ఖాతాలో పడుతుందని ఈ ప్రాజెక్ట్ అంగీకరించాడు. అయితే ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఈ సినిమా ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. సరైన కారణాలు వెల్లడించకపోయినా.. 'అతడు అడవిని జయించాడు' నవల విషయంలో కాపీ రైట్స్ ఇష్యూ కారణంగా ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేసిన క్రిష్, మరో స్టార్ హీరోతో చర్చలు జరుపుతున్నాడట. అదే సమయంలో 'అతడు అడవిని జయించాడు' నవల కాపీరైట్స్ ఇష్యూను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. త్వరలోనే క్రిష్ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
క్రిష్ డైరెక్షన్లో మరో రెండు చారిత్రక కథలు..?
గౌతమిపుత్ర శాతకర్ణితో ఘనవిజయం సాధించిన క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ మరో రెండు చారిత్రక చిత్రాలకు దృశ్యరూపం ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో అఖండ భారతాన్ని పరిపాలించిన తెలుగు చక్రవర్తి కథను గుర్తుచేశాడు. ఈ సినిమా విజయానందంలో ఉన్న క్రిష్ తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాడు. గౌతమబుద్ధుడు, శ్రీకృష్ణదేవరాయల జీవిత కథలను సినిమాగా తెరకెక్కించే ఆలోచన ఉన్నట్టుగా వెల్లడించాడు క్రిష్. వీటిలో గౌతమబుద్ధుడు సినిమాను రెండు మూడు సన్నివేశాల ఆధారంగా ఆఫ్ బీట్ సినిమాగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇక శ్రీకృష్ణదేవరాయలు సినిమాను మాత్రం పూర్తి కమర్షియల్ హంగులతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ఇప్పటికే ఆదిత్య 369 లాంటి చిత్రాల్లో శ్రీకృష్ణ దేవరాయలు గెటప్ లో కనిపించిన బాలయ్యతోనే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తాడేమో చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను రూపొందించే ప్లాన్‌లో ఉన్నాడు క్రిష్. -
ఎన్టీఆర్‌కి దాన వీర శూర కర్ణ బాలకృష్ణకి శాతకర్ణి...
–టీఎస్సార్ ‘‘తెలుగు సినిమా చరిత్రలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఓ మైలురాయి. తెలుగు వారికి తెలియని ఓ తెలుగు వీరుణ్ణి క్రిష్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఎన్టీఆర్‌గారిని ‘దాన వీర శూర కర్ణ’గా ప్రేక్షకులు గుర్తించుకున్నట్లు.. బాలకృష్ణను ‘గౌతమిపుత్ర శాతకర్ణి’గా గుర్తు పెట్టుకుంటారు. ఈ సినిమా తర్వాతి తరాలకు ఒక పాఠ్యాంశంలా నిలుస్తుంది’’ అని ‘కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. బాలకృష్ణ, శ్రియ జంటగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విజయం సాధించిన సందర్భంగా ఆ చిత్ర యూనిట్‌ను టీఎస్సార్ సన్మానించారు. బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నటించడం నా పూర్వజన్మ సుకృతం. నాన్నగారు ‘శాతకర్ణుడి’ చరిత్రతో సినిమా చేద్దామనుకున్నారు. ఆ అవకాశం నాకు వచ్చిందంటే ఆయన ఆశీస్సులే. కళలను ప్రోత్సహిస్తున్న సుబ్బరామి రెడ్డిగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘తెలుగు సినిమా చరిత్రపై బాలకృష్ణ గారి వేలిముద్ర ‘గౌతమిపుత్ర శాతకర్ణి’’ అని క్రిష్ అన్నారు. బాలకృష్ణ, క్రిష్, నిర్మాతలు జాగర్లమూడి సాయిబాబు, బిబో శ్రీనివాస్, రచయిత బుర్రా సాయిమాధవ్, సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్, సంగీత దర్శకులు చిరంతన్ భట్ తదితరులను టీఎస్సార్ సన్మానించారు. దర్శకులు కె.రాఘవేంద్ర రావు, కోదండరామిరెడ్డి, ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాతలు శివలెంక కృష్ణప్రసాద్, పీవీపీ, సాయి కొర్రపాటి, హీరోలు వెంకటేష్, మంచు విష్ణు, మనోజ్, నటి జయసుధ, హీరోయిన్ తమన్నా పాల్గొన్నారు. -
శాతవాహనుల కథతో క్రిష్ మరో సినిమా
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు క్రిష్ మరో భారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు. తెలుగు వారి ఘనకీర్తిని కేవలం 79 రోజుల్లో తెరకెక్కించిన క్రిష్, ఇప్పుడు అదే కథకు కొనసాగింపుగా మరో సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. అయితే తొలి భాగంలో పూర్తిగా యుద్ధం, సామ్రాజ్య స్థాపననే చూపించిన క్రిష్.. రెండో భాగాన్ని ప్రేమకథగా రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ప్రముఖ తెలుగు రచయిత డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ రాసిన శ్రావణి అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి తనయుడు వాశిష్టిపుత్ర పులోమావి, శ్రావణి ప్రేమకథే శ్రావణి నవల. ఇప్పుడు అదే కథను క్రిష్ భారీగా వెండితెర మీద ఆవిష్కరించనున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ క్లాసిక్ మొగల్ ఈ అజం తరహాలో చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో రూపొందించాలని భావిస్తున్నారు. -
'సాహో రాజమౌళి... సాహో'
సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాపై ఇప్పటికీ ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ముఖ్యంగా అతి తక్కువ సమయంలో ఇంతటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ ప్రతిభకు దిగ్దర్శకులు కూడా సాహో అంటున్నారు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ఎన్నో రెట్లు పెంచిన దర్శకుడు రాజమౌళి, గౌతమిపుత్ర శాతకర్ణి యూనిట్‌ను, ప్రత్యేకంగా దర్శకుడు క్రిష్‌ను అభినందించారు. రాజమౌళి లాంటి గ్రేట్ డైరెక్టర్ స్వయంగా అభినందించటంతో దర్శకుడు క్రిష్ పొంగిపోతున్నాడు. అందుకే రాజమౌళికి కృతజ్ఞతలు తనదైన స్టైల్లో తెలిపాడు. ' ప్రియమైన రాజమౌళి గారూ.. నాకు ఆదర్శంగా నిలిచిన దర్శకుల్లో మీరు ఒకరు.. అందరూ విజయం కోసం ఎదురుచూస్తుంటారు, కానీ విజయం మీ కోసం ఎదురుచూస్తుంటుంది.. అలాంటి మీరు విజయం వరించింది క్రిష్ అంటే నాకెలా ఉంటుంది? ఎన్ని ధన్యవాదాలు చెపితే సరిపోతుంది? దర్శకత్వంలోనే కాదు, వ్యక్తిత్వంలో కూడా నాకు ఆదర్శంగా నిలిచారు.. మీ అబినందన వింటుంటే, ఆదర్శం ఆశీర్వదిస్తున్నట్టుంది.. భుజం తడుతున్న మీ చేతిని ఎన్నిసార్లు నా నుదురు తాకినా తక్కువే.. త్రికరణ శుద్ధిగా చెపుతున్నాను.. సాహో రాజమౌళి.. సాహో.. ప్రేమతో, క్రిష్'. అంటూ ఉద్వేగంగా తన కృతజ్ఞతలు తెలియజేశాడు క్రిష్. సాహో రాజమౌళి.. సాహో!! pic.twitter.com/m3X9DitqVN — AnjanaPutra KRISH (@DirKrish) 22 January 2017 -
బాండ్ క్యారెక్టర్లో రామ్ చరణ్..?
హీరోగానే కాక నిర్మాతగానూ సక్సెస్ సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నెక్ట్స్ సినిమాల విషయంలో కూడా సెలెక్టివ్‌గా ఉంటున్నాడు. గతంలో మూస మాస్ సినిమాలతో బోర్ కొట్టించిన చెర్రీ, ధృవ సినిమాతో ప్రయోగాల బాట పట్టాడు. ఇమేజ్ను పక్కన పెట్టి కొత్త తరహా కథలకు సై అంటున్నాడు. ధృవ, ఖైదీ నంబర్ 150 సినిమాల పనులు ముగియటంతో ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా మీద దృష్టిపెట్టాడు చరణ్, ఈ నెల 30న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కనున్న ఈ సినిమాలో చరణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. సుకుమార్ సినిమా తరువాత మరో ఇంట్రస్టింగ్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు చరణ్. ఇటీవల గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఘనవిజయం సాధించిన క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట. అది కూడా జేమ్స్ బాండ్ తరహా స్పై థ్రిల్లర్ అన్న టాక్ వినిపిస్తోంది. గతంలో క్రిష్, వరుణ్ హీరోగా 'రాయభారి' అనే సినిమాను చేస్తున్నాడన్న టాక్ వినిపించింది. ఇప్పుడు అదే కథకు మార్పులు చేసి చరణ్ హీరోగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది. సూపర్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తరువాత తెలుగులో బాండ్ క్యారెక్టర్లలో నటించిన నటులు లేరు. ఇన్నేళ్ల తరువాత చరణ్ బాండ్ పాత్రలో కనిపిస్తాడన్న వార్తతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. -
రెండోవారం దూసుకుపోతున్న శాతకర్ణి
‘సమయం లేదు మిత్రమా.. శరణమా? రణమా?’ అంటూ వచ్చిన నందమూరి బాలకృష్ణ వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'.. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా అమెరికాలో భారీ వసూళ్లతో దూసుకుపోతున్నది. అమెరికాలో రెండోవారంలోనూ ఈ సినిమా గొప్ప వసూళ్లు రాబడుతున్నది. అగ్రరాజ్యంలో ఈ సినిమా వసూళ్ల జోరు కొనసాగుతున్నదని, సోమవారం 93,419 డాలర్లను, మంగళవారం 68,205 డాలర్లను ‘శాతకర్ణి’ రాబట్టిందని ప్రముఖ బాలీవుడ్ ట్రెడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. ఇప్పటివరకు అమెరికాలో ఈ సినిమా రూ. 9.87 కోట్లను రాబట్టినట్టు సమాచారం. మొత్తంగా చూసుకుంటే రూ. 50 కోట్ల మార్క్‌ను ఈ సినిమా దాటినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తొలిరోజు రూ. 18 కోట్లు వసూలు చేసిన ‘శాతకర్ణి’ ఇటు బాలకృష్ణ కెరీర్లోనూ, అటు దర్శకుడు క్రిష్ కెరీర్లోనూ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా రికార్డు సాధించింది. ఫెస్టివల్ సీజన్లో వచ్చిన ఈ సినిమా తొలి వీకెండ్ భారీ వసూళ్లు సాధించింది. తొలి మూడు రోజుల్లో రూ. 48 కోట్ల వరకు వసూలు చేసినట్టు సమాచారం. ప్రస్తుతానికి బాక్సాఫీస్ వద్ద ‘శాతకర్ణి’ నిలకడగా వసూళ్లు రాబడుతున్నట్టు సినీ పండితులు చెప్తున్నారు. 'శాతకర్ణి' సినిమా 'ఏ' సెంటర్లలో బాగా ఆడుతున్నప్పటికీ, బీ, సీ సెంటర్లలో అంతగా ప్రభావం చూపలేకపోతున్నదని అంటున్నారు. తెలుగు చక్రవర్తి శాతకర్ణి చారిత్రక కథతో సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. Telugu film #GautamiPutraSatakarni continues its GLORIOUS RUN in USA... Mon $ 93,419, Tue $ 68,205. Total: $ 1,449,617 [₹ 9.87 cr]. @Rentrak — taran adarsh (@taran_adarsh) January 18, 2017 -
కొంత చరిత్రశోధన... కొంత కల్పితం!
‘‘కొన్ని కథలకు కొంతమంది మాత్రమే నప్పుతారు. శాతకర్ణి కథకు బాలకృష్ణగారు మాత్రమే కరెక్ట్. ఆయన కోసమే పుట్టిన కథ ఇది. శాతకర్ణి పాత్రను బాలయ్య తప్ప ఎవరూ చేయలేరని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. నన్ను నమ్మి వందో చిత్రానికి అవకాశం ఇచ్చారాయన. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు ఆనందంగా ఉంది’’ అని క్రిష్ అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన బాలకృష్ణ నూరో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. ‘‘ఈ చిత్రాన్ని ఆదరించడం ద్వారా కథాబలం ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు అంగీకరిస్తారనే విషయం మరోసారి నిరూపితమైంది’’ అని పాత్రికేయులతో క్రిష్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘శాతవాహనుల గురించి కొన్ని పుస్తకాల ద్వారా తెలుసుకున్నాను. కొంత చరిత్ర పరిశోధన చేసి, దానికి కొంత కల్పిత కథతో ఈ సినిమా తీశా. అసలు శాతవాహనులు తెలుగువాళ్లే కాదని కొందరు అంటున్నారు. ఆ విషయం గురించి నేను వాదించదల్చుకోలేదు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘ఆంధ్రప్రశస్తి’లో శాతవాహనుల గురించి చెప్పారు. ఆయన కన్నా ఎక్కువ తెలుసా?’’ అని అన్నారు. ‘‘తెరపై కనిపించిన బాలకృష్ణ, శ్రియ తదితర నటీనటులు, తెర వెనక పని చేసిన సాయిమాధవ్ బుర్రా, చిరంతన్ భట్, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి.. ఇలా ఈ చిత్ర విజయానికి టీమ్ మొత్తం కారణం’’ అని క్రిష్ అన్నారు. వెంకటేశ్ 75వ చిత్రానికి తానే దర్శకుణ్ణి అనీ, అశ్వనీదత్ నిర్మించే ఓ చిత్రానికి దర్శక త్వం వహించనున్నాననీ ఆయన తెలిపారు. -
క్రిష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటంటే..?
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన క్రిష్ తరువాత చేయబోయే సినిమా ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. తన కెరీర్లో ఇప్పటి వరకు తీసిన జానర్లో మరో సినిమా చేకుండా వస్తున్న క్రిష్, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో చారిత్రక కథాంశాన్ని కూడా అద్భుతంగా డీల్ చేశాడు. ఈ నేపథ్యంలో క్రిష్ నెక్ట్స్ సినిమాకు ఏ జానర్ ఎంచుకుంటాడని ఇండస్ట్రీ జనాలు ఆసక్తిగా గమనిస్తున్నారు. క్రిష్ చేయబోయే నెక్ట్స్ సినిమా ఓ థ్రిల్లర్ అన్న టాక్ వినిపిస్తోంది. బాలయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన క్రిష్ తన నెక్ట్స్ సినిమాను కూడా సీనియర్ హీరోతోనే చేయాలని భావిస్తున్నాడట. అందుకే విక్టరీ వెంకటేష్ హీరోగా ఓ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నాడు. ఈ సినిమాను భారీ గ్రాఫిక్స్‌తో రూపొందించాలని భావిస్తున్నాడు. ప్రస్తుతానికి క్రిష్ నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా.. దాదాపు ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టే అన్న ప్రచారం జరుగుతోంది. -
బాలకృష్ణ 'శాతకర్ణి'కి కలెక్షన్ల బొనంజా!
నందమూరి బాలకృష్ణ వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ ల్యాండ్ మార్క్ సినిమా సంక్రాంతి బరిలో కలెక్షన్లతో దూసుకుపోతున్నది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నది. ఇప్పటికే తొలిరోజు రూ. 18 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇటు బాలకృష్ణ కెరీర్లోనూ, అటు దర్శకుడు క్రిష్ కెరీర్లోనూ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా రికార్డు సాధించింది. ఫెస్టివల్ సీజన్లో వచ్చిన ఈ సినిమా తొలి వీకెండ్ భారీ వసూళ్లు సాధించింది. తొలి మూడు రోజుల్లో రూ. 48 కోట్ల వరకు వసూలు చేసినట్టు సమాచారం. తొలిరోజు దేశీయంగా రూ. 18 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్లో రూ. 8 కోట్లు, రెండోరోజు దేశీయంగా రూ. 20 కోట్లు, ఓవర్సీస్ రూ. 5 కోట్లు, మూడు రోజు దేశీయంగా రూ. 10 కోట్ల వరకు వసూలు చేసినట్టు ట్రెడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతానికి బాక్సాఫీస్ వద్ద సినిమా నిలకడగా వసూళ్లు రాబడుతున్నట్టు సినీ పండితులు చెప్తున్నారు. 'శాతకర్ణి' సినిమా 'ఏ' సెంటర్లలో బాగా ఆడుతున్నప్పటికీ, బీ, సీ సెంటర్లలో అంతగా ప్రభావం చూపలేకపోతున్నదని అంటున్నారు. అయితే, తెలుగు చక్రవర్తి శాతకర్ణి చారిత్రక కథతో సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా అటు బాలకృష్ణకు, ఇటు దర్శకుడు క్రిష్‌కు గర్వించే సినిమా అని వారు అభిప్రాయపడుతున్నారు. -
బాలయ్య సినిమాపై వర్మ రోరింగ్ కామెంట్!
నందమూరి బాలకృష్ణ వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి పాజిటివ్ టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందించారు. 'హే క్రిష్.. నా జడ్జిమెంట్ సరైనదేనని వినపడుతుండటం ఎంతో థ్రిల్లింగ్ కు గురిచేస్తోంది. 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి రోరింగ్ టాక్ వస్తున్నందుకు నీకు అభినందనలు. నీకు, బాలయ్యకు హండ్రెడ్ ఛీర్స్' అంటూ వర్మ ట్వీట్ చేశారు. 'శాతకర్ణి' విజయం నేపథ్యంలో ముంబైలోని నాలుగు కంపెనీలు దర్శకుడు క్రిష్ తో ఒప్పందాలు చేసుకున్నాయని, దీంతో తాను చాలా ఈర్ష్య పడుతున్నానని వర్మ అన్నారు. ఈ నాలుగు ఒప్పందాలలో ఒకటి ఏకే (ఆమిర్ ఖాన్?) నుంచి కాగా, మరొకటి ఎస్ కే (షారుఖ్ ఖాన్?) నుంచి కూడా ఉందని తెలుస్తోందని, క్రిష్ దీనిని కన్ఫర్మ్ చేస్తావా? అని వర్మ అడిగారు. Salute to @DirKrish n Balayya for pushing telugu cinema pride to skies with original content instead of bringing down with borrowed content — Ram Gopal Varma (@RGVzoomin) 12 January 2017 అరువు తెచ్చుకున్న కంటెంట్ తో తెలుగు సినిమా పరువును దెబ్బతీయడానికి బదులు... ఒరిజినల్ కంటెంట్ తో తెలుగు సినిమా ప్రతిష్టను ఆకాశమంత ఎత్తు చేర్చినందుకు క్రిష్ కు, బాలయ్యకు సెల్యూట్ చేస్తున్నానని వర్మ కొనియాడారు. గొప్ప సినిమాల విషయంలో బాలయ్య వందో సినిమా 150సార్లు మెగా అడ్వాన్స్ డ్ గా ఉందంటూ పేర్కొన్నారు. Balayya in his 100th film only seems to have become 150 times more Mega advanced in terms of great cinema #GPSK — Ram Gopal Varma (@RGVzoomin) 12 January 2017 'ఖైదీ నంబర్ 150' సినిమా వేడుకలో నాగాబాబు తనపై విమర్శలు చేయడంతో వర్మ అంతే ఘాటుగా మెగా బ్రదర్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్యను ప్రశంసిస్తూనే.. అరువు తెచ్చుకున్న కథతో తెలుగు సినిమా పరువు తీయడానికి బదులు అంటూ పరోక్షంగా తమిళ 'కత్తి' సినిమా రీమేక్ అయిన 'ఖైదీ నంబర్ 150' సినిమాపై వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాహుబలితో మొదలైన తెలుగు సినిమా ఖ్యాతిని శాతకర్ణి మరింత ముందుకు తీసుకెళ్లిందని, దీంతో మెగా వ్యక్తులు తాము మినీగా మారిపోయామని గుర్తించి ఉండరని ఎద్దేవా చేశారు. What Bahubali started GPSK is taking telugu cinema way more forward and even now if Mega people don't realise they might become Mini — Ram Gopal Varma (@RGVzoomin) 12 January 2017 -
ఇది నా పూర్వజన్మ సుకృతం : బాలయ్య
ఈ రోజు(గురువారం) విడుదలైన గౌతమిపుత్రశాతకర్ణి సినిమాను బాలకృష్ణ అభిమానులతో కలిసి చూశారు. రాత్రి భ్రమరాంబ థియేటర్లో ఏర్సాటు చేసిన బెనిఫిట్ షోకు హాజరైన బాలయ్య ఉదయాన్నే ప్రసాద్ ఐమాక్స్ లో సందడి చేశాడు. దర్శకుడు క్రిష్, హీరోయిన్ శ్రియలతో ఐమాక్స్ కు వచ్చిన బాలకృష్ణ ఘనవిజయాన్ని అంధించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాలో మాట్లాడిన బాలకృష్ణ.. ఈ విజయం తెలుగుజాతి విజయంగా భావిస్తున్నానని తెలిపారు. నాన్నగారు చేయాలనుకున్న సినిమాలో తాను నటించటం తన పూర్వజన్మ సుకృతం అన్న బాలయ్య, ఈ విజయం తనకు మరింత బాధ్యతను పెంచిందని.. ఇక పై కూడా అభిమానులను అలరించే సినిమాలను అందిస్తానని తెలిపాడు. -
ఇది నా పూర్వజన్మ సుకృతం
-
బాలయ్య సినిమాపై మెగా హీరో ట్వీట్
నందమూరి బాలకృష్ణ వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి పాజిటివ్ టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చాలా బాగుందని నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ నేపథ్యంలో మెగా హీరో సాయి ధరం తేజ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' గురించి గొప్ప రిపోర్టులు అందుతున్నాయని, ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు, దర్శకుడు క్రిష్ కు శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ గారు తమలో చాలామందికి స్ఫూర్తిగా నిలిచారని ఆయన ఫొటో పెట్టి మరీ హర్షం వ్యక్తం చేశారు. Hearing great reports about #GPSK congratulations to the whole team and @DirKrish, #NBK garu you are an inspiration to many of us 😊 pic.twitter.com/ps4f1H1EE6 — Sai Dharam Tej (@IamSaiDharamTej) 12 January 2017 'గౌతమీపుత్ర శాతకర్ణి' విడుదలవుతున్న సందర్భంగా బాబాయ్ బాలయ్యకు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. బాబాయ్ కి, దర్శకుడు క్రిష్ కి, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర యూనిట్ కి ట్విట్టర్ లో ఆల్ ద బెస్ట్ చెప్పారు. నందమూరి కల్యాణ్ రాం కూడా ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. లెజండ్ నుంచి వస్తున్న ల్యాండ్ మార్క్ సినిమా ఇదని, బాలకృష్ణ వందో సినిమా తమకు గర్వకారణంగా నిలుస్తుందని అన్నారు. అలాగే యువ హీరో మంచు మనోజ్ కూడా బాలయ్యకు, శాతకర్ణి చిత్రబృందానికి ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. Wishing Babai and the whole team of #GPSK and @DirKrish all the best.#NBK100 — tarakaram n (@tarak9999) 11 January 2017 A landmark film for the Legend. Wishing Balayya Babai and the whole team of #GPSK the very best. #NBK100 will make us proud — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) 11 January 2017 -
థియేటర్ లో బాలకృష్ణ హల్ చల్
హైదరాబాద్: తన వందో సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' విడుదల సందర్భంగా నందమూరి బాలకృష్ణ థియేటర్ లో సందడి చేశారు. కూకట్ పల్లిలోని 'భ్రమరాంబ' థియేటర్ లో ఆయన అభిమానులతో కలిసి సినిమా చూశారు. బాలయ్య రాకతో అభిమానులు కెరింతలు కొట్టారు. చిత్ర దర్శకుడు క్రిష్ తోపాటు ప్రముఖ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తదితరులతో కలిసి ఆయన సినిమా చూశారు. బెనిఫిట్ షో చూసిన అభిమానులు సినిమా అద్భుతంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక గురువారం ఉదయం ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ లో చిత్ర దర్శకుడు క్రిష్, కథానాయిక శ్రియా సినిమాను ప్రేక్షకులతో కలిసి చూశారు. గొప్ప తెలుగుయోధుడిని జీవితచరిత్రను సినిమాగా మలిచామని, ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటం థ్రిల్లింగ్ గా ఉందని క్రిష్ అన్నారు. -
థియేటర్ లో బాలకృష్ణ హల్ చల్
-
గౌతమీపుత్ర శాతకర్ణి ఎర్లీ రివ్యూ!
ట్విట్టర్ లో పాజిటివ్ టాక్ ఎన్నో అంచనాలు, మరెన్నో ప్రత్యేకతలతో సంక్రాంతి బరిలోకి దిగిన నందమూరి బాలకృష్ణ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'. ఒకే రాజ్యం.. ఒకే యుద్ధం.. అఖండ భరత జాతి అంటూ కలలుగన్న శాతవాహన చక్రవర్తి శాతకర్ణి జీవిత కథ ఆధారంగా చారిత్రక నేపథ్యంతో దర్శకుడు క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించారు. చిరంజీవి 150వ సినిమాతో పోటాపోటీగా సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Interval - Mesmerising, Magnificent. Stunned by this epic. Balakrishna's career best Till now #GautamiPutraSatakarni #GPSK!! — Deepak (@deepuzoomout) January 12, 2017 సామాజిక సందేశాలతో కూడిన వినూత్న సినిమాలు అందించే దర్శకుడిగా పేరొందిన క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించడంతో 'శాతకర్ణి'పై మొదటినుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు సినిమా ట్రైలర్ కూడా బాగుండటంతో ఈసారి సంక్రాంతి బరిలో బాలయ్యకు సూపర్ హిట్ ఖాయమన్న అంచనాకు వచ్చారు. అందుకు తగ్గట్టుగానే 'శాతకర్ణి' చాలా బాగుందని మార్నింగ్ షోలు చూసినవారు సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. తెలుగు వీరుడి గొప్పతనాన్ని చాటి చెప్పే చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ అద్భుతంగా నటించారని అంటున్నారు. ప్రధానంగా యుద్ధ ఘట్టాల నేపథ్యంలోనే నడిచే ఈ కథలో బలమైన భావోద్వేగాలు ఉన్నాయని, బాలకృష్ణ, శ్రియ, హేమమాలిని నటన, సాయిమాధవ్ డైలాగులు, క్రిష్ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రాన్ని గొప్ప సినిమాగా నిలబెట్టాయని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. సినిమా సూపర్బ్ గా ఉందనే రిపోర్టులు వస్తున్నాయని మహేష్ ఎస్ కోనేరు ట్వీట్ చేశారు. సినిమా చాలా బాగుందంటూ మార్నింగ్ షో చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ వస్తుండటం చిత్రయూనిట్ సంతోషంలో మునిగిపోయింది. Hearing awesome things about #GautamiPutraSatakarni . Getting to the cinemas as fast as I can!! @DirKrish the profile name in your honour!! — LakshmiPutra Rana (@RanaDaggubati) January 12, 2017 -
సాహో.. బాలకృష్ణ.. శాతకర్ణి!
నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' బుధవారం విడుదల అవుతున్న సందర్భంగా ట్విట్టర్ లో బాలయ్యకు అభినందనలు వెల్లువెత్తాయి. సినిమా ఘనవిజయం సాధించాలంటూ తెలుగు సినీ ప్రముఖులంతా సోషల్ మీడియాలో ఆకాంక్షించారు. 'స్వాహో బసవతారకమ్మ పుత్ర బాలకృష్ణ. నందమూరి తారక రామారావుగారి గర్వపడేరీతిలో శాతకర్ణిగా నటించిన (బాలకృష్ణ) సార్ కు సెల్యూట్ చేస్తున్నా. పైనుంచి ఎన్టీఆర్ ఆశీస్సులు మీకు ఉంటాయి' అని ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. ' అజంనాపుత్ర క్రిష్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12కోట్లమంది తెలుగువారి ఆశీస్సులు నీకు ఉన్నాయి. 79 రోజుల్లో ఈ ఎపిక్ సినిమాను మీరు ఎలా తీశారు? నమ్మశక్యం లేదు. మీ నుంచి నేను చాలాచాలా మార్చుకోవాలి. సాయిమాధవ్ గారు మీ పెన్నే శాతకర్ణి కత్తి. అద్భుతమైన కెమెరా వర్క్, అసాధారణ నిర్మాణ విలువలు గర్వించే తెలుగు సినిమాగా శాతకర్ణిని చాలారోజులు గుర్తుండిపోయేలా చేస్తాయి' అని రాజమౌళి పేర్కొన్నారు. Saaho Basavatarakarama puthra BALAKRISHNA!!! I salute you sir for your potrayal of Satakarni that will make nandamuri tarakaramarao garu — rajamouli ss (@ssrajamouli) 12 January 2017 proud. He will shower his blessings from above. Anjanaputhra Krish the blessings of 12 crore telugus across the globe will be with you. — rajamouli ss (@ssrajamouli) 12 January 2017 ప్రముఖ హీరోలు నాగార్జున, మోహన్ బాబులు కూడా బాలయ్య, దర్శకుడు క్రిష్ కు ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. చారిత్రక సినిమాలు చూడటం తనకు ఇష్టమని, ఈ సినిమా చరిత్ర సృష్టించాలని నాగార్జున ఆకాంక్షించారు. సంగీత దర్శకుడు థమన్, యాంకర్ అనసూయ కూడా ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో తనకు చిన్నపాత్రను ఇచ్చినందుకు అనసూయ దర్శకుడు క్రిష్ కి కృతజ్ఞతలు తెలిపింది. Wishing #Balayya,@DirKrish &team all the best for #GautamiPutraSatakarni/I love watching historicals. Let this one create history!! — Nagarjuna Akkineni (@iamnagarjuna) 11 January 2017 Also thank you @DirKrish for giving #AnuradhaPutrikaAnasuya an oppurtunity to be a teeny-weeny part of the epic #GautamiPutraSatakarni !!❤ -
బాలయ్య, క్రిష్‌లతో స్పెషల్ ఇంటర్వ్యూ
-
నేడు విశాఖలో శాతకర్ణి పతాక ఉత్సవం
-
సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తి!
బాలకృష్ణ నటిస్తున్న వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొంది. క్రిష్ తెరకెక్కించిన ఈ హిస్టారికల్ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బిబో శ్రీనివాస్ సమర్పణలో వై.రాజీవ్ రెడ్డి- జాగర్లమూడి సాయిబాబు నిర్మించారు. బాలకృష్ణ సరసన శ్రేయ హీరోయిన్గా నటించగా, వీరమాత గౌతమిగా ప్రత్యేక పాత్రలో బాలీవుడ్ నటి హేమమాలిని నటించారు. ఈ సినిమాలకు సెన్సార్ సభ్యులు ఒక్క కట్ కూడా లేకుండా యు/ఎ సెర్టిఫికెట్ ఇచ్చారు. శాలివాహన శకం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్రిష్ ఓ దృశ్యకావ్యంలా తెరకెక్కించారని సెన్సార్ సభ్యులు క్రిష్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ.. "మా శాతకర్ణి సెన్సార్ పూర్తయ్యింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు అభినందనలు తెలపడంతోపాటు.. బాలకృష్ణ నటవిశ్వరూపం, భారీ వ్యయంతో తెరకెక్కించిన యుద్ధ సన్నివేశాలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న గౌతమిపుత్ర శాతకర్ణి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నందమూరి అభిమానులనే కాక యావత్ తెలుగు సినిమా అభిమానులను విశేషంగా అలరించడం ఖాయం" అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ణానశేఖర్, సంగీతం: చిరంతన్ భట్, కళ: భూపేష్ భూపతి, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంభాషణలు: సాయిమాధవ్ బుర్ర, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, సహనిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వర్రావు, సమర్పణ: బిబో శ్రీనివాస్, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి-జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్. -
జనవరి 8న శాతకర్ణి పతాక ఉత్సవం
నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ స్యయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చారిత్రక చిత్రంలో బాలీవుడ్ నటి హేమామాలినీ, శ్రియలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్, ఆడియో రిలీజ్ కార్యక్రమాలను భారీగా నిర్వహించిన యూనిట్ సభ్యులు త్వరలో మరో ఉత్సవాన్ని ప్లాన్ చేశారు. శాతకర్ణి పతాక ఉత్సవం పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లోని వందో థియేటర్లలో నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. తెలుగు చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలకు చిహ్నంగా శాలివాహన రాజ్య చిహ్నం ఉన్న జెండాలను వంద థియేటర్లలో ఎగురవేసేలా ప్లాన్ చేస్తారు. జనవరి 8న ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్నారు. హీరో నందమూరి బాలకృష్ణ స్వయంగా విశాఖలోని జ్యోతి థియేటర్లో జెండా ఎగురవేసి ఈ పతాక ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ఇతర ప్రాంతాల్లో నందమూరి అభిమాన సంఘం నాయకులు ఇతర ప్రముఖులు జెండాలు ఎగురవేసేలా ప్లాన్ చేస్తున్నారు. -
ఇద్దరినీ స్వాగతిద్దాం..!
చాలా కాలం తరువాత టాలీవుడ్ వెండితెర మీద ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమయ్యింది. ఇద్దరు సీనియర్ హీరోలు సంక్రాంతి పండుగకు ముఖాముఖి తలపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇస్తుండగా, నందమూరి బాలకృష్ణ తన వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణితో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌తో జనవరి 11, 12 తేదిల్లో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు భారీ చిత్రాలు ఒకేసమయంలో రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. అలా రిలీజ్ అయితే థియేటర్ల సమస్యతో పాటు కలెక్షన్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా ఆ రిస్క్ చేయడానికే రెడీ అవుతున్నారు ఈ సీనియర్ స్టార్స్. ఇద్దరికీ ప్రతిష్టాత్మక చిత్రాలు కావటంతో ప్రచారం, రిలీజ్ విషయంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేసారి రెండు భారీ చిత్రాలు రిలీజ్ అవ్వటం పై ఇరు చిత్రాల నిర్మాతలు స్పందించారు. ఇలా భారీ చిత్రాలు ఒకేసారి రిలీజ్ అవ్వటం గతంలో కూడా జరిగిందంటూ రామ్‌చరణ్ వివరించగా... గౌతమీపుత్ర శాతకర్ణి దర్శక నిర్మాత క్రిష్. ఇద్దరినీ స్వాగతించాలంటూ కోరాడు. 'ఈ సంక్రాంతికి ఇద్దరు లెజెండ్స్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రతిష్టాత్మక చిత్రాలతో వస్తున్నారు. #jan11khaidi, #jan12GPSK హ్యాష్ ట్యాగ్‌లను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ వారిని స్వాగతిద్దాం'. అంటూ ట్వీట్ చేశాడు. This #Sankranthi two legends r coming to entertain us with their landmark films. Let us all welcome both by trending #Jan11Khaidi #Jan12GPSK — Krish Jagarlamudi (@DirKrish) 3 January 2017 -
వైభవంగా గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో
తిరుపతి: క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా ఆడియో కార్యక్రమం తిరుపతిలో వైభవంగా జరిగింది. నగరంలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ ఆడియో వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, సిరివెన్నెల సీతారామశాస్త్రి సహా పలువురు సినీరంగ ప్రముఖలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చారిత్రాత్మక చిత్రంతో పాటు బాలయ్య వందో చిత్రం కూడా కావటంతో కళ్లుచెదిరే సెట్టింగ్‌లతో ఆడియో వేడుకను భారీగా నిర్వహించారు. సంక్రాంతి కానుకగా గౌతమీపుత్ర శాతకర్ణి ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. బాలయ్య సరసన శ్రియా హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలినీ బాలకృష్ణ తల్లి పాత్రలో కనిపించనున్నారు. కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ శాతకర్ణి కొడుకు పాత్రలో నటించారు. -
శాతకర్ణి విజువల్స్ కాపీనా..?
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అతి తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసుకుంది. చారిత్రక కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. భారీ యుద్ధ సన్నివేశాలతో కలిపి మొత్తం షూటింగ్‌ను నాలుగు నెలల లోపే పూర్తి చేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో.. ఇంత తక్కువ సమయంలో ఇంత గ్రాండ్ విజువల్స్ ఎలా సాధ్యమయ్యాయన్న అనుమానం వ్యక్తమవుతోంది. అంతేకాదు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కోసం బాజీరావ్ మస్తానీ సినిమాలోని విజువల్స్‌ను, గ్రాఫిక్స్‌ను వాడుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. బాజీరావ్ మస్తానీ సినిమాలోని విజువల్స్ వాడుకునేందుకు ఆ సినిమా దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ నుంచి క్రిష్ ముందుగానే పర్మిషన్ కూడా తీసుకున్నాడట. గతంలో సంజయ్ నిర్మాతగా తెరకెక్కించిన గబ్బర్ ఈజ్ బ్యాక్ సినిమాతో క్రిష్ బాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ అనుబంధం తోనే గ్రాఫిక్స్ విషయంలో సంజయ్ సాయం చేశాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి యూనిట్ కొట్టి పారేస్తోంది. ట్రైలర్లో కనిపించిన విజువల్స్ అన్ని ఈ సినిమా కోసం స్పెషల్‌గా క్రియేట్ చేసినవే గాని.., కాపీ చేసినవి కాదని తేల్చి చెపుతోంది. బాలయ్య సరసన శ్రియ హీరోయిన్గా నటిస్తున్న., ఈ సినిమాలో బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని కీలక పాత్రలో నటిస్తోంది. -
బాబాయ్ తరువాత అబ్బాయితో..!
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం, గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్, తన తరువాతి ప్రాజెక్ట్ ప్లాన్స్ కూడా మొదలెట్టేశాడు. ఇప్పటికే నెక్ట్స్ సినిమా కోసం ఓ లైన్ కూడా రెడీ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు తన నెక్ట్స్ సినిమాను ఓ స్టార్ ఇమేజ్ ఉన్న యంగ్ హీరోతో చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు క్రిష్. ఇటీవల జనతా గ్యారేజ్ సినిమాతో తన కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అందుకున్న ఎన్టీఆర్‌తో తన నెక్ట్స్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ ఇమేజ్, బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ లైన్ ను సిద్ధం చేసిన క్రిష్, గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ తరువాత ఎన్టీఆర్‌కు కథ వినిపించాలని భావిస్తున్నాడట. అయితే ఇప్పటికే బాబీ సినిమా పనులు మొదలు పెట్టిన జూనియర్, ఆ తరువాత త్రివిక్రమ్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత 2018లో క్రిష్ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కే చాన్స్ ఉంది. -
గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ రిలీజ్
-
శాతకర్ణి సంచలనం
నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రం అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. శాతకర్ణి జన్మస్థలం అయిన కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అఖండ భారతాన్ని పరిపాలించిన శాతకర్ణి కథతో భారీ యుద్ధ సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. శుక్రవారం సాయంత్రం విడుదలైన శాతకర్ణి ట్రైలర్ కేవలం నాలుగున్నర గంటల సమయంలో పదిలక్షల వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. బాలయ్య సరసన శ్రియా హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలినీ బాలకృష్ణ తల్లి పాత్రలో కనిపించనున్నారు. కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, శాతకర్ణి కొడుకు పాత్రలో నటిస్తున్నాడు. ఈ నెల 26న గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో వేడుకను తిరుపతిలో నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
దుమ్మురేపుతున్న శాతకర్ణి ట్రైలర్
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని కరీంనగర్‌లోని తిరుమల థియేటర్లో వినూత్నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలయ్య అభిమానులు భారీగా పాల్గొన్నారు. 'మా జైత్రయాత్రను గౌరవించి, మా ఏలుబడిని అంగీకరించి, మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి, మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయము లేదు మిత్రమా శరణమా.. రణమా' అంటూ బాలకృష్ణ తనదైన శైలి డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చారిత్రాత్మక చిత్రాన్ని అదే స్థాయితో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
శాతకర్ణి జన్మస్థలంలో ట్రైలర్ లాంచ్
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చారిత్రాత్మక చిత్రాన్ని అదే స్థాయితో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని కూడా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా బాలయ్య వందో చిత్రం కావటంతో వంద థియేటర్లలో ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు చక్రవర్తి శాతకర్ణి జీవితకథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆయన జన్మస్థలమైన కోటిలింగాలలో నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల శాతకర్ణి తల్లి గౌతమీ ఊరు. ఆయన జన్మస్థలం కూడా అదే. అందుకే ఈ నెల 16న గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్‌ను నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా కోటిలింగాలలో విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను కూడా ఘనంగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. -
మరో సీనియర్ హీరోతో క్రిష్
గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె లాంటి సినిమాలతో విభిన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ క్రిష్. ఇప్పటికే వరకు ఎక్కువగా యువ కథానాయకులతోనే సినిమాలు తెరకెక్కించిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం సీనియర్ స్టార్ బాలకృష్ణ హీరోగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత మరో సీనియర్ హీరోతో కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నాడు క్రిష్. ప్రస్తుతం గురు సినిమాతో పాటు, నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలు చేస్తున్న విక్టరీ వెంకటేష్, క్రిష్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు అంగకీరించాడు. గతంలో రానా, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన వెంకటేష్, త్వరలో క్రిష్ దర్శకత్వంలో సినిమాకు ఓకె చెప్పాడు. ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా పూర్తయిన తరువాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ గా తెరకెక్కనుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న వెంకటేష్ గురు రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ అవుతోంది. -
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి డైరెక్టర్ ఫిక్స్..?
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి చాలా రోజులుగా రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా ఎప్పుడు.. ఎవరి దర్శకత్వంలో సెట్స్ మీదకు వెళ్లనుందన్న విషయంలో మాత్రం ఇంత వరకు క్లారిటీ రాలేదు. బాలయ్య వందో సినిమాలో మోక్షజ్ఞ అతిథి పాత్రలో కనిపించనున్నాడన్న ప్రచారం జరిగినా.. ఆ విషయంపై కూడా నందమూరి కుటుంబ సభ్యులు, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీకి బాలకృష్ణ డైరెక్టర్‌ను ఫిక్స్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ సమయంలో క్రిష్ పనితీరు నచ్చిన బాలయ్య, అతని దర్శకత్వంలోనే మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాను 2017 చివర్లోగాని 2018 మొదట్లో గాని ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాను అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సాయి కొర్రపాటి, వారాహి చలనచిత్ర బ్యానర్‌పై రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
చారిత్రక కథనూ షార్ట్‌గా చెప్తున్నాడు
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో చారిత్రక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. బాలకృష్ణ సినిమాలతో పోలిస్తే గౌతమీపుత్ర శాతకర్ణి ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా దూసుకుపోతోంది. తన ప్రతీ సినిమాను సందేశాత్మకంగా మానవీయ కోణంలో తెరకెక్కించే క్రిష్ ఆ సినిమాలన్నింటినీ తక్కువ నిడివితోనే రూపొందిస్తుంటాడు. అయితే గౌతమీపుత్ర శాతకర్ణి చారిత్రక కథ కావటంతో షార్ట్ రన్ టైంలో పూర్తిచేయటం కష్టామని భావించారు. కానీ క్రిష్ మరోసారి షాక్ ఇచ్చాడు. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా కేవలం 2 గంటల 12 నిమిషాల్లోనే ముగించేశాడట. క్రిష్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. డిసెంబర్ 16న భారీ ఎత్తున ఆడియో రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు నుంచే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు.