
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రైస్ ట్రాన్స్‌ప్లాంటర్లు వంటి వ్యవసాయ సాధనాల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఉపయోగపడేలా ఎంఅండ్‌ఎం గ్రూప్‌లో భాగమైన కృష్–ఈ సంస్థ స్మార్ట్ కిట్ (కేఎస్‌కే)ని తెలంగాణ మార్కెట్లో ఆవిష్కరించింది. దీనితో రైతులు తమ ట్రాక్టర్లు, వ్యవసాయ సాధనాల వినియోగం వివరాలను స్మార్ట్ ఫోన్ ద్వారా ట్రాక్ చేయొచ్చని ఎంఅండ్‌ఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రామచంద్రన్ తెలిపారు.
ఇదీ చదవండి: iPhone 14 Offers: ఐఫోన్14పై ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు మరో సంస్థలోనూ భారీ డిస్కౌంట్లు!
తద్వారా నిర్వహణ వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని, ఆదాయాన్ని మెరుగుపర్చుకోవచ్చని ఆయన వివరించారు. ప్రారంభ ఆఫర్ కింద దీన్ని రూ. 4,995కి (పన్నులు, ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీ కూడా కలిపి) అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 25,000 పైచిలుకు కిట్స్ వినియోగంలో ఉన్నట్లు కేఎస్‌కేని రూపొందించిన కార్నట్ టెక్నాలజీస్ సీటీవో పుష్కర్ లిమాయే తెలిపారు. కార్నాట్‌లో ఎంఅండ్‌ఎంకు గణనీయంగా వాటాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు