equipment
-
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి
జైపూర్: భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన యుద్ధ విమానం గాల్లో దూసుకెళ్తుండగా అనూహ్యమైన సంఘటన జరిగింది. సాంకేతిక సమస్యతో పలురకాల వైమానిక సామగ్రి జారిపడింది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో బుధవారం ఈ ఘటన జరిగింది. యుద్ధ విమానం అనుకోకుండా నిర్మానుష్య ప్రాంతంలో సామగ్రిని జారవిడిచినట్లు అధికారులు తెలియజేశారు. ప్రాణ, ఆస్తి నష్టమేమీ జరగలేదన్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. జారిపడిన సామగ్రి ఏమిటన్నది బయటపెట్టలేదు. సైనిక భాషలో బాంబు, క్షిపణులు, ఆయుధాలు, చమురు ట్యాంక్‌లను కూడా వైమానిక సామగ్రిగా పిలుస్తుంటారు. -
ఇది కిచెన్‌లో ఉంటే.. టిఫిన్, లంచ్, డిన్నర్‌తో పాటు..
చాలామంది వేడివేడి రుచులను కోరుకుంటారు. కొన్నిసార్లు ఏదో కారణంతో ఆలస్యం అయినప్పుడు వంటకాల వేడి చల్లారిపోయి, తినాలన్న ఆసక్తి కోల్పోతారు. ఆ సమస్యను దూరం చేస్తుంది ఈ ఎలక్ట్రిక్ వార్మింగ్ ట్రే. ఇది కిచెన్ లో ఉంటే టిఫిన్, లంచ్, డిన్నర్‌తో పాటు స్నాక్స్ టైమ్‌లో కూడా వేడివేడి పదార్థాలనే అందుకోవచ్చు. అంతే కాకుండా, టీ, కాఫీ వంటి వేడి పానీయాలను ఫ్లాస్క్‌లో భద్రపరచుకోవాల్సిన పనిలేదు.పార్టీలు, ఫంక్షన్ల సమయంలో కూడా ఈ ట్రే ఉంటే, ఆరగించే రుచులు ఎప్పటికప్పుడు వేడివేడిగా పొగలు కక్కుతూ ఉంటాయి. కేవలం కొన్ని నిమిషాల ముందు ఈ ట్రే మీద వేడి చేయాలనుకున్న వంటకాలను, కాఫీ, టీ వంటి పానీయాలను ఉంచితే సరిపోతుంది. దీనిలో 216 డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి 316 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు త్రీ మోడ్స్ టెంపరేచర్ ఆప్షన్ ఉండటంతో, ఏది ఎంత వేడి కావాలో అంతే పెట్టుకునే వీలుంటుంది. దీనిపైన సిరామిక్ టేబుల్ వేర్, గ్లాస్ వేర్‌తో పాటు క్యాస్రోల్ మెటల్ కలిగిన ఏ పాత్రలోని ఆహార పదార్థాలనైనా, పానీయాలనైనా వేడి చేసుకోవచ్చు.శాండ్విచ్ అండ్ మోర్..ఈ రోజుల్లో ఇలాంటి ఒక మేకర్ ఇంట్లో ఉంటే, నచ్చిన అల్పాహారం, నచ్చిన చిరుతిళ్లను ఇట్టే సిద్ధం చేసుకోవచ్చు. మెల్ట్, టోస్ట్, ఫ్రై వంటి చాలా ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. దీని మీద ఆమ్లెట్, పాన్ కేక్స్, కట్లెట్స్తో పాటు శాండ్విచ్, బర్గర్స్ వంటివీ రెడీ చేసుకోవచ్చు. ఇందులో మొత్తం ఏడు సెట్టింగ్స్ ఉంటాయి.దీన్ని ఓపెన్ చేసుకుని, రెండు వైపులా అధిక మోతాదులో ఆహారాన్ని వండుకోవచ్చు. లేదంటే ఫోల్డ్ చేసుకుని, ఒకేసారి నాలుగు శాండ్విచ్లను రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఫోల్డ్ చేసుకున్నాక లాక్ చేసుకునే వీలు కూడా ఉంటుంది. దాంతో ఇందులోని పదార్థాలు వేగంగా బేక్ అవుతాయి. దీనిలోని నాణ్యమైన నాన్–స్టిక్ ప్లేట్ డివైస్‌కి అటాచ్ అయ్యే ఉంటుంది. దీన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ మేకర్ని ఇతర ప్రదేశాలకు సులభంగా తీసుకెళ్లొచ్చు!టేబుల్‌టాప్ బార్బెక్యూ గ్రిల్..కుటుంబంతో లేదా స్నేహితులతో పిక్నిక్లకు, క్యాంపింగ్‌లకు వెళ్లినప్పుడు.. ఇలాంటి ఓ బార్బెక్యూ గ్రిల్‌ని వెంట తీసుకుని వెళ్తే, వేళకు క్రిస్పీ రుచులను అందుకోవచ్చు. ఇది బొగ్గులతో లేదా చెక్క ముక్కలతో పని చేస్తుంది. దీని అడుగున వాటిని వేసి, నిప్పు రాజేసి పైన గ్రిల్ అమర్చుకోవాలి. వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా దీని మీద చాలా టేస్టీగా గ్రిల్ చేసుకోవచ్చు.పైగా దీనికి అదనంగా ఒక వుడెన్ ట్రే, ఫుడ్ స్టోరేజ్ ట్రే లభిస్తాయి. వుడెన్ ట్రే మీద వంట చేసుకునే ముందు ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇక స్టోరేజ్ ట్రేను వంట పూర్తి అయిన తర్వాత సర్వ్ చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు. దీనికి ముందువైపు కదలకుండా లాక్ చేసుకునే వీలుండటంతో ఈ గ్రిల్‌ని సులభంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్లొచ్చు. దీనికి ఇరువైపులా హ్యాండిల్స్ ఉండటంతో వంట అవుతున్న సమయంలో కూడా ఒకచోట నుంచి మరోచోటికి సులువుగా కదల్చవచ్చు. -
చేనేతకు సంక్షేమ అద్దకం
సాక్షి, అమరావతి: పడుగు–పేకల్లా కష్టాలు అల్లుకున్న చేనేత బతుకులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఆదరణ కోల్పోయిన చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దారు. నేతన్న నేస్తంతోపాటు క్లస్టర్లు, నూలు రాయితీ, రుణాలు, పెన్షన్లు వంటి అనేక రకాల సాయమందించి మగ్గానికి మహర్దశ తెచ్చారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు చేనేత రంగానికి ఇచ్చిన 25 హామీల్లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయకపోగా కమిటీలు, అధ్యయనాలు అంటూ కాలయాపన చేశారు. బాబు ఐదేళ్ల హయాంలో రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.3,706 కోట్లుపైగా ఖర్చు చేసింది, నేతన్న నేస్తం సాయం రూ.969.77 కోట్లు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హామీని తు.చ. తప్పకుండా అమలు చేశారు. సొంత మగ్గం కలిగిన ప్రతి కార్మికునికీ నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున రూ.1.20 లక్షలు అందించారు. దీనికి తోడు కరోనా కష్టకాలంలో 82 వేల చేనేత కుటుంబాలకు రూ.వెయ్యి చొప్పున జమ చేయడంతోపాటు బియ్యం, కందిపప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులు అందించారు.కరోనా రెండేళ్లు సహా ఐదేళ్లుగా కేటాయించిన ఈ మొత్తం అక్షరాలా రూ.969.77 కోట్లు. ఈ నిధులతో డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో తమ మగ్గాలను ఆధునికీకరించుకున్నారు. 2018–19లో నెలవారీ ఆదాయం సగటున రూ.4,680 ఉంటే ఈ పథకం అమలుతో మూడు రెట్లు పెరిగింది. మరోవైపు అర్హులైన 94,224 మంది చేనేత కార్మికులకు నెలకు రూ.3 వేలు చొప్పున పెన్షన్ అందిస్తున్నారు.ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఊతం చేనేత ఉత్పత్తులకు ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. ఆప్కో, రాష్ట్ర చేనేత జౌళి శాఖల ద్వారా ఆర్గానిక్ వ్రస్తాల తయారీ, కొత్త కొత్త డిజైన్ల రూపకల్పన తదితరాల్లో శిక్షణ ఇప్పించింది. 46కి పైగా ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. శిక్షణ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సబ్సిడి అందించి మగ్గాలు, షెడ్డులు, ఇతర సామగ్రిని సమకూర్చింది. అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, లూమ్‌ఫోక్స్, పేటీఎం, గోకూప్ వంటి ఈ– కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం కలి్పంచింది. ఆప్కో షోరూమ్‌లు విస్తరించింది. కేరళ, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోను ఏపీ చేనేత వస్త్రాల విక్రయాలకు చర్యలు చేపట్టింది. జీఎస్టీపై పచ్చ మీడియా గందరగోళం ((బాక్స్)) చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించే జీఎస్టీపై టీడీపీ పచ్చ మీడియా ఇటీవల అర్థంలేని విమర్శలు చేసి గందరగోళం సృష్టిస్తోంది. వాస్తవానికి చేతి వృత్తులు, గ్రామాల్లో కుటీర పరిశ్రమలపై పన్ను వేయకూడదని రాజ్యాంగంలోని ఆరి్టకల్ 43 చెబుతోంది. అయినప్పటికీ నేతకు ఉపయోగించే చిలప నూలుపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం, తయారైన వస్త్రంపై 12 శాతం చొప్పున జీఎస్టీ వసూలు చేస్తోంది. తయారైన వ్రస్తానికి వసూలు చేస్తున్న జీఎస్టీని 18 శాతానికి పెంచాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను చేనేత సహకార సంఘాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో దాన్ని విరమించుకుంది. మొత్తం జీఎస్టీనే ఎత్తివేయాలని చేనేత సహకార సంఘాలు కోరుతున్నాయి. ఉప్పాడకు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు చేనేత రంగానికి ఆరి్థక ఊతంతోపాటు అవార్డులతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది. జమ్దానీ పట్టు నేత కళను కొనసాగిస్తున్న ఉప్పాడ హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ(కాకినాడ)కు వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించడంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఒక జిల్లా–ఒక ఉత్పత్తి(ఓడీఓపీ)లో రాష్ట్రానికి చెందిన చేనేత రంగం హవా కొనసాగింది. దేశంలో మొత్తం మీద 64 ఉత్పత్తులు దరఖాస్తులు చేస్తే.. వాటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి చేసిన 14 ఉత్పత్తుల్లో 8 చేనేతవే కావడం విశేషం. నేతన్న నేస్తం మా జీవితంలో వెలుగులు నింపింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఇప్పటి వరకు రూ.1.20 లక్షల ఆరి్థక సాయం అందింది. ఆ డబ్బుతో చేనేత మగ్గాలను ఆధునికీకరించుకొని రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాం. – శంకర, చేనేత కార్మికుడు, కేశవనగర్, ధర్మవరం జగన్‌కు రుణపడి ఉంటాం.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మా కుటుంబం అంతా రుణపడి ఉంటుంది. ఆరోగ్యశ్రీలో రూ.మూడు లక్షలు సాయం అందించడంతో ఆపరేషన్ చేయించుకున్నాను. ప్రతి నెల పెన్షన్ వస్తోంది. నా భార్యకు చేయూత పథకం కింద రూ.18,750 నాలుగు సార్లు వచ్చాయి. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.15 వేలు చొప్పున మూడుసార్లు వచ్చాయి. –చింతలపూడి రాంబాబు, చేనేత కార్మికుడు, వాకతిప్ప, కాకినాడ జిల్లా మగ్గాన్ని ఆధునికీకరించుకుని ఆదాయం పొందుతున్నా నేతన్న నేస్తంతో రూ.1.20 లక్షలు ఆరి్థక సాయంతో రావడంతో మగ్గాన్ని ఆధునికీకరించుకున్నాను. ముడిసరుకులు కొనుగోలు చేసుకుని అదనపు ఆదాయం పొందుతున్నాను. నేతన్న నేస్తంతోపాటు ఆసరా ద్వారా రూ.84 వేలు, అమ్మ ఒడి రూ.54 వేలు, సున్నా వడ్డీ రూ.7 వేలు ఆరి్థక సాయం అందడంతోపాటు పిల్లల్ని బాగా చదివించుకుని సమాజంలో గౌరవంగా బతుకుతున్నాను. –పిచ్చుక గంగాధరరావు, పెడన, కృష్ణా జిల్లా మగ్గాన్ని విరిచేసింది చంద్రబాబు రాష్ట్రంలో మగ్గాన్ని విరిచేసింది చంద్రబాబు. చేనేత రంగాన్ని ఆదుకుంటానంటూ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఏకంగా 25 హామీలు గుప్పించిన చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా దగా చేశారు. చేనేత రుణాల మాఫీపై అధ్యయనానికి ఒక కమిటీ వేస్తూ జీవో ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఇల్లు, మగ్గానికి రూ.లక్షన్నర చొప్పున సాయమందిస్తానని మోసం చేశారు. చేనేత కార్మికులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, బడ్జెట్లో ప్రతి సంవత్సరం రూ.వెయ్యి కోట్లు కేటాయింపు, ఉచిత విద్యుత్ వంటి హామీలను చంద్రబాబు మరిచారు. – బండారు ఆనందప్రసాద్, అధ్యక్షుడు, ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్. బాబు దగా, జగన్ అండబాబు హయాంలో ► ఆప్కోకు రూ.103 కోట్ల బకాయిలు పెట్టారు. ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు ► సహకార సంఘాల్లో పనిచేసే కార్మికుల కూలీ నుంచి 8 శాతం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 8 శాతం చొప్పున మొత్తం 24 శాతం జమ చేసి ఏడాదికి ఒకసారి అందించే త్రిఫ్ట్ ఫండ్‌ను గత ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నిలిపేశారు. ► 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 25 హామీలు గుప్పించి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు, ► చేనేత రుణాలు మాఫీపై అధ్యయనానికి కమిటీ వేస్తూ చేతులు దులుపుకొన్నారు. జగన్ హయాంలో ► పాత బకాయిలు కలిపి మొత్తం రూ.468.84కోట్లను చెల్లించారు. ► నేతన్న నేస్తం, నేతన్న పెన్షన్ అమలు చేశారు. సంక్షేమానికి మొత్తం రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం ఒక రికార్డు. వీటితో పాటు రుణ పరపతి, ముడి సరుకులకు పెట్టుబడి, నైపుణ్య శిక్షణ, తయారీ–విక్రయాలకు క్లస్టర్ల ఏర్పాటు. మేలైన మార్కెటింగ్‌కు ఈ–కామర్స్ దిగ్గజాలతో ఒప్పందాలు. ► చేనేతకు కీలకమైన నూలు పోగుల కొనుగోలుకు జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌డీసీ) ఏర్పాటు. ► 416 ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు (పీహెచ్డబ్ల్యూసీఎస్) రూ.250.01కోట్ల సాయం. ► వ్యక్తిగతంగాను, స్వయం సహాక సంఘాల్లోని (ఎస్‌హెచ్‌జీ) వారికి నాలుగేళ్లలో రూ.122.50 కోట్ల విలువైన నూలు అందజేత. -
YSR: ఆ కంటైనర్లలో అసలు ఏముందంటే..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కంటైనర్లలో రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని తరలిస్తున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశామని.. వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎం.డి షరీఫ్ హెచ్చరించారు. దేశ రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో పోలీసు, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్కార్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో రూ.వేలకోట్లు నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగదని కడప డీఎస్పీ అన్నారు. దేశ రక్షణకు సంబంధించి సామాగ్రి తరలించే సమయంలో పక్కా ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, సామాగ్రి వెళ్తున్న రూటులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు, రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్మీ అధికారుల ఎస్కార్ట్‌తో పాటు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చామని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, అభూతకల్పనలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అన్నారు. -
హ్యాపీ ఫోర్జింగ్స్ @ రూ. 808–850
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల కంపెనీ హ్యాపీ ఫోర్జింగ్స్ ఈ నెల 19న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 21న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 71.6 లక్షల షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 808– 850 ధరల శ్రేణిలో చేపట్టనున్న ఇష్యూ ద్వారా దాదాపు రూ. 1,009 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధులను ఎక్విప్మెంట్, ప్లాంట్లు, మెషీనరీ కొనుగోలుతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 17 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. లూధియానా కంపెనీ ఆటో విడిభాగాలు, వ్యవసాయ పరికరాలు, ఇండస్ట్రియల్ మెషీనరీ విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. కస్టమర్లలో అశోక్ లేలాండ్, జేసీబీ ఇండియా, ఎంఅండ్ఎం, ఎస్ఎంఎల్ ఇసుజు, టాటా కమిన్స్ తదితరాలున్నాయి. గతేడాది(2022–23) ఆదాయం 39 శాతం ఎగసి రూ. 1,197 కోట్లకు చేరగా.. నికర లాభం 47 శాతం జంప్‌చేసి రూ. 209 కోట్లను తాకింది. -
విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలి
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): ఇస్రో తొలినాళ్లలో ఎడ్లబండి, సైకిల్‌పై శాటిలైట్, రాకెట్ పరికరాలను తీసుకువెళ్లే స్థాయి నుంచి చంద్రుడు, అంగారకుడు గ్రహాల మీద పరిశోధనలు చేసేస్థాయికి చేరడానికి నాడు విక్రమ్ సారాభాయ్ వేసిన పునాదులే కారణమని షార్ శాస్త్రవేత్త ఆర్.ప్రీతా చెప్పారు. విద్యార్థులు పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించుకుని ఇస్రోలో చేరి దేశానికి సేవ చేయాలని సూచించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని భారత అంతరిక్షయానంపై స్థానిక గోకులకృష్ణ కళాశాలలో విద్యార్థులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రీతా మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థను స్థాపించి ప్రపంచస్థాయికి తీసుకువెళ్లడంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పాత్రను చరిత్ర మరువలేనిదని చెప్పారు. నెల రోజుల్లో సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్–1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు తెలిపారు. కళాశాల సెక్రటరీ శ్రీనివాసబాబు, ఇంజినీరింగ్, ఫార్మసీ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
పిల్లలకు పాలు పడుతున్నారా? కనిపించని బ్యాక్టీరియాలు..
సాధారణంగా పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగానే ఉంటాం. అందులోనూ పాలు తాగే పిల్లల విషయంలో ఈ జాగ్రత్త అవసరం. వాళ్ల కోసం వాడే పాలసీసాలు, పాల పీకలు, ఉగ్గు గిన్నెలు, స్పూన్లు వంటివన్నీ శుభ్రంగా ఉంచాలి. అయితే ఎంత శుభ్రంగా కడిగినా కనిపించని క్రిములు, వైరస్లు, బ్యాక్టీరియాలు చాలానే ఉంటాయి. వాటిని పారదోలేందుకు ఉపయోగపడుతుంది ఈ బేబీ బాటిల్ స్టీమ్ స్టెరిలైజర్. ఇందులో సుమారుగా ఆరు చిన్న చిన్న బాటిల్స్‌తో పాటూ నిపుల్స్, ఉగ్గు గిన్నెలు వంటివి క్లీన్ చేసుకోవచ్చు. ఫాస్ట్ – ఎఫెక్టివ్ స్టెరిలైజేషన్ టెక్నాలజీతో ఆటో షట్ ఆఫ్ వంటి ఆప్షన్‌తో రూపొందిన ఈ డిౖవైస్.. 99.9 శాతం సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. క్లీన్ చేసిన తర్వాత సుమారు 24 గంటల పాటు మూత తియ్యకుండా ఉంచితే.. క్రిమిరహితంగా దాచిపెడుతుంది. కేవలం 8 నిమిషాల్లోనే ఈ మెషిన్.. బాటిల్స్‌ని క్లీన్ చేయగలదు. బాగుంది కదూ!. ఈ స్టీమ్ స్టెరిలైజర్ ధర 22 డాలర్లు (రూ.1,810) మాత్రమే. -
ఆకాశం నుంచి పెద్ద శబ్థం.. భయాందోళనలో జనం.. అక్కడ ఏం జరిగింది!
వేలూరు(చెన్నై): జిల్లాలోని గుడియాత్తం సమీపంలో ఆదివారం రాత్రి ఆకాశం నుంచి ఒక వస్తువు పెద్ద శబ్దంతో కింద పడటంతో స్థానికులు భయాందోళన చెందారు. గుడియాత్తం తాలూకా నెల్లూరుపేట పంచాయతీ పరిధిలోని లింగుండ్రం గ్రామంలో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఆకాశం నుంచి ఒక విచిత్రమైన వస్తువు పడింది. గమనించిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి చూశారు. అక్కడ పారాచూట్ లాంటి వస్తువు, సమీపంలో సిగ్నిల్ ఉన్న చిన్న పెట్టెను కనుగొన్నారు. గుడియాత్తం పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. ఆ సమయంలో సిగ్నల్స్ ఉన్న చిన్న పెట్టెలో కేంద్ర ప్రబుత్వ జాతీయ వాతావరణ కేంద్రం, మీనంబాక్కం, చెన్నై అనే చిరునామా, ఫోన్ నంబరు ఉండడంతో చెన్నైలోని వాతావారణ కార్యాలయానికి ఫోన్ చేసి విచారించారు. దీంతో చెన్నై వాతావరణ కేంద్రం నుంచి వివిధ ప్రాంతాల్లో వాతావరణ మార్పులపై అధ్యయనం చేసేందుకు సిగ్నల్స్ ఉన్న పెట్టె సహకారంతో పంపినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు వాటిని సేకరించి పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. చదవండి: ఆరో తరగతిలోనే పెళ్లి.. నేనున్నానని తోడు నిలిచిన భార్య.. డాక్టర్ కొలువుకు ‘నీట్’గా -
స్మార్ట్ సేద్యం: వ్యవసాయ సాధనాల కోసం స్మార్ట్ కిట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, రైస్ ట్రాన్స్ప్లాంటర్లు వంటి వ్యవసాయ సాధనాల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఉపయోగపడేలా ఎంఅండ్ఎం గ్రూప్‌లో భాగమైన కృష్–ఈ సంస్థ స్మార్ట్ కిట్ (కేఎస్కే)ని తెలంగాణ మార్కెట్లో ఆవిష్కరించింది. దీనితో రైతులు తమ ట్రాక్టర్లు, వ్యవసాయ సాధనాల వినియోగం వివరాలను స్మార్ట్ ఫోన్ ద్వారా ట్రాక్ చేయొచ్చని ఎంఅండ్ఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రామచంద్రన్ తెలిపారు. ఇదీ చదవండి: iPhone 14 Offers: ఐఫోన్14పై ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు మరో సంస్థలోనూ భారీ డిస్కౌంట్లు! తద్వారా నిర్వహణ వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని, ఆదాయాన్ని మెరుగుపర్చుకోవచ్చని ఆయన వివరించారు. ప్రారంభ ఆఫర్ కింద దీన్ని రూ. 4,995కి (పన్నులు, ఆరు నెలల సబ్స్క్రిప్షన్ ప్యాకేజీ కూడా కలిపి) అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 25,000 పైచిలుకు కిట్స్ వినియోగంలో ఉన్నట్లు కేఎస్‌కేని రూపొందించిన కార్నట్ టెక్నాలజీస్ సీటీవో పుష్కర్ లిమాయే తెలిపారు. కార్నాట్‌లో ఎంఅండ్ఎంకు గణనీయంగా వాటాలు ఉన్నాయి. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు -
మహీంద్రా చేతికి స్ప్రేయర్ల తయారీ కంపెనీ.. నెక్స్ట్ ప్లాన్ అదేనా?
న్యూఢిల్లీ: స్ప్రేయర్ల తయారీ కంపెనీ మిత్రా ఆగ్రో ఎక్విప్మెంట్స్లో వాటాను 100 శాతానికి పెంచుకున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా సోమవారం ప్రకటించింది. ఇప్పటి వరకు మహీంద్రాకు ఈ కంపెనీలో 47.33 శాతం వాటా ఉంది. ఓమ్నివోర్ పూర్తి వాటాను మహీంద్రా చేజిక్కించుకుంది. తాజా వాటాలను ఎంతకు దక్కించుకున్నదీ కంపెనీ వెల్లడించలేదు. వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల వ్యాపారంలో అయిదేళ్లలో 10 రెట్లు వృద్ధి చెందాలన్నది మహీంద్రా లక్ష్యం. వాటా కొనుగోలు సంస్థ వృద్ధికి దోహదం చేయడంతోపాటు పెరుగుతున్న ఉద్యాన పంటల రంగంలో విస్తరణకు ఆస్కారం ఉందని మహీంద్రా అండ్ మహీంద్రా ఫామ్ ఎక్విప్మెంట్ విభాగం ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా తెలిపారు. (ఇదీ చదవండి: భారత్‌లో 2023 టయోట ఇన్నోవా క్రిస్టా లాంచ్ - ధర ఎంతో తెలుసా?) పండ్ల తోటల్లో వాడే స్ప్రేయర్ల తయారీలో ఉన్న మిత్రా ఆగ్రో 2012లో ప్రారంభమయింది. ఇందులో 200 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2017 - 2018తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ మూడింతల ఆదాయాన్ని ఆర్జించింది. ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. నూతన ఉత్పత్తుల తయారీతోపాటు భారత్ సహా విదేశీ మార్కెట్లలో విస్తరణకు యోచిస్తోంది. -
Nandyal: అత్యాధునికంగా సర్వజనాసుపత్రి
బొమ్మలసత్రం: పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నే రీతిలో ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతోంది. ఈ కోవలోనే నంద్యాల సర్వజన ఆసుపత్రిలో రూ.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక పరికరాలను సమకూర్చడంతో పాటు వివిధ విభాగాలకు ప్రత్యేక గదులను నిర్మించింది. ఆసుపత్రి ఏర్పాటైనప్పటి నుంచి ఈ స్థాయిలో ఆధునీకరించడం ఇదే ప్రప్రథమం కావడం విశేషం. అందుబాటులోకి తీసుకొచ్చిన అధునాతన యంత్రాల ద్వారా ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ విభాగాల్లో దాదాపు 23 రకాల శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయనున్నారు. ఇవే కాకుండా సిబ్బంది కోసం ప్రత్యేకంగా 18 గదులను నిర్మించారు. ఇదే సమయంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది నియామకం కూడా పూర్తి చేశారు. అందుబాటులోకి ఆధునాతన వైద్యం నంద్యాల జిల్లా కేంద్రంలో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల రూపుదిద్దుకుంటోంది. స్థానిక సర్వజన ఆసుపత్రిలో ఇప్పటికే ఓపీ భవనం, జిరియాట్రిక్ భవనం, డీఈఐసీ భవన నిర్మాణాలు పూర్తి చేసి ప్రతి రోజు 1,400 మందికి పైగా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆసుపత్రిలోని పాడుబడిన భవనంలోనే ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆసుపత్రి రూపురేఖలు మార్చేయడంతో ఆపరేషన్ థియేటర్లో మెరుగైన వైద్యం అందుతోంది. ఈ శస్త్ర చికిత్సలన్నీ ఇక్కడే.. ఆర్థో విభాగం: చేతులు, కాళ్లలో విరిగిన ఎముకలకు సర్జరీ, ఎముకలకు రాడ్లు, ప్లేట్లు అమర్చడం చేస్తారు. జనరల్ సర్జరీ విభాగం: హెర్నియా, హైడ్రోసిల్, అపెండిక్స్, పైల్స్, పిస్టులా, కొలొసెక్టమి, పారాటిడ్, పర్ఫరేషన్, లంప్ బ్రిస్ట్, సింపుల్ థైరాయిడ్, లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సలు. ఈఎన్టీ విభాగం: అడినో టోన్సిలెక్టోమీ, టింపోనిప్లాస్టి, మిరిన్గోటోమి, సెప్టోప్లాస్టి, ఫెస్, టర్బినో ప్లాస్టి తదితరాలు. అధునాతన యంత్రాలు.. ఉపయోగాలు ► ఎండోస్కోపి యంత్రం: ఈ యంత్రాన్ని రూ.20 లక్షలతో ఏర్పాటు చేశారు. కడుపు లోపలి భాగంలోని అల్సర్, క్యాన్సర్ గడ్డలను సులభంగా గుర్తిస్తుంది. ► లాప్రోస్కోపి : ఈ యంత్రం దాదాపు కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితం. పేదలకు నాణ్యమైన వైద్యం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.22 లక్షలతో ప్రభుత్వాసుపత్రిలోనే అందుబాటులోకి తీసుకొచ్చింది. కోత లేకుండా శరీరంపై చిన్న రంద్రం చేసి ఆపరేషన్ చేయడం ఈ యంత్రం ప్రత్యేకత. ► సీఏఆర్‌ఎం : ఈ యంత్రం ఖరీదు రూ.12 లక్షలు. ఆపరేషన్ తర్వాత ఎముకలు సరైన క్రమంలో అమర్చినట్లు నిర్ధారించుకుంటారు. ► హారిజాంటల్ ఆటోక్లేవ్: ఈ యంత్రాల ఖర్చు రూ.11 లక్షలు. 120 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆపరేషన్‌కు ఉపయోగించే పరికరాలు, బట్టలపై క్రిములను నశింపజేస్తాయి. ► ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్: ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా ఖాళీ అయినప్పుడు ఈ యంత్రం ద్వారా రోగికి కృత్తిమ ఆక్సిజన్ అందిస్తారు. ఈ యంత్రం ఖరీదు రూ.50వేలు. అవసరానికి తగిన విధంగా ప్రత్యేక గదులు ► సీఎస్ఎస్డీ గది: ఇన్ఫెక్షన్కు సంబంధించిన ప్రీ మెటీరియల్‌ను ఆసుపత్రిలో అవసరమయ్యే గదులకు పంపుతారు. ► సెప్టిక్ ఓపి గది: శరీరంలోని గాయాలకు ఇన్ఫెక్షన్ సోకి సెప్టిక్ అయితే వారికి ఈ గదిలో చికిత్సలు అందిస్తారు. ► స్టాఫ్ నర్సులు, సర్జరీ వైద్యుల కోసం ప్రత్యేకంగా రెండు గదులు ఏర్పాటు. ► ప్రీ అనస్తీషియా గది: అనస్తీషీయా డ్రెస్సింగ్ గదులు నిర్మించారు. ► థియేటర్లో సిలిండర్ స్టోర్, శస్త్రచికిత్సలకు అవసరమయ్యే పరికరాలకు ప్రత్యేక గదులు. ► పీజీ విద్యార్థులకు అవసరమయ్యేలా స్టూడెంట్ డెమో గది. ► అనస్తీషియా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ప్రత్యేక గదులు. ► ఆపరేషన్ తరువాత శుభ్రం చేసిన నీటిని డర్టీకారిడార్ ద్వారా బయటకు పంపేందుకు డిస్పోజల్ జోన్. ► ఆపరేషన్ థియేటర్లో మందులు నిల్వకు డ్రగ్స్ స్టోర్. ఆపరేషన్ థియేటర్‌ను ఆధునీకరించాం నాలుగు నెలలుగా ఆపరేషన్ థియేటర్లో చేపట్టిన పనులన్నీ పూర్తయ్యాయి. రోగులకు శస్త్ర చికిత్సలన్నీ ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చేస్తాం. ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.5 కోట్లు ఖర్చు చేసింది. కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నే రీతిలో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడంతో పేదలకు మెరుగైన వైద్యం మరింత చేరువ కానుంది. – ప్రసాదరావు, సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్, నంద్యాల -
5జీ ప్రొడక్ట్స్ తయారీకి విప్రో, హెచ్ఎఫ్సీఎల్ జోడీ
న్యూఢిల్లీ: ఐటీ సంస్థ విప్రో, టెలికం గేర్ తయారీ కంపెనీ హెచ్ఎఫ్సీఎల్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు కలిసి టెలికం పరిశ్రమకు కావాల్సిన 5జీ ప్రొడక్ట్స్ తయారీ చేపడతాయి. ప్రధానంగా మొబైల్ సైట్లలో వాడే రూటర్స్తోపాటు 5జీ రేడియో యాక్సెస్ నెట్వర్క్, 5జీ ట్రాన్స్పోర్ట్ పరికరాలను ఉత్పత్తి చేస్తాయి. -
వైద్యపరీక్షల్లో జాప్యానికి ‘రిపేర్’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్య పరికరాల మరమ్మతుల్లో జాప్యాన్ని నివారించేందుకు వైద్యారోగ్యశాఖ కొత్త విధానం తీసుకొచ్చింది. పరికరాలన్నింటినీ 4 కేటగిరీ లుగా విభజించి, ప్రత్యేక సాఫ్ట్వేర్ సాయంతో మరమ్మతుల నిర్వహణను పర్యవేక్షించనుంది. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనితో ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాలకు త్వరగా మరమ్మతులు పూర్తయి.. వైద్య పరీక్షలకు ఇబ్బందులు తప్పనున్నాయి. నాలుగు కేటగిరీలుగా చేసి.. కొత్త విధానంలో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న వైద్య పరికరాలను నాలుగు కేటగిరీలుగా విభజించారు. రూ.5 లక్షలకుపైన విలువ ఉండి వ్యారంటీ కలిగి ఉన్నవి, సమగ్ర వార్షి క నిర్వహణ ఒప్పందం ఇంకా ప్రారంభంకాని పరికరాలను ఏ కేటగిరీగా.. రూ.5 లక్షలకుపైగా విలువ ఉండి కంపెనీ మెయింటెనెన్స్ అవసరమున్నవి, వ్యారంటీ పీరియడ్ తర్వాత నిర్వహణ ఒప్పందం చేసుకోవాల్సిన పరికరాలను బీ కేటగిరీగా.. రూ.5 లక్షలకుపైగా విలువ ఉండి ఏడేళ్లు దాటిన పరికరాలు, వ్యారంటీ సహా ఒప్పందం పూర్తయినా ఇంకా పనిచేస్తున్న పరికరాలను సీ కేటగిరీగా.. రూ.5 లక్షల కన్నా తక్కువ విలువైన పరికరాలను డీ కేటగిరీలో చేర్చారు. ఇందులో ఏ, బీ, సీ కేటగిరీ పరికరాల నిర్వహణ బాధ్యతను టీఎస్‌ఎంఎస్‌ఎస్‌ఐడీసీకి అప్పగించారు. డీ కేటగిరీలోని పరికరాల నిర్వహణను ఆయా ఆస్పత్రులు చూసుకుంటాయి. ప్రత్యేక వ్యవస్థ, సాఫ్ట్వేర్ వైద్య పరికరాల నిర్వహణను పర్యవేక్షించేందుకు టీఎస్‌ఎంఎస్‌ఎస్‌ఐడీసీలో ప్రోగ్రామ్ మేనేజెంట్ యూనిట్ (పీఎంయూ) పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. నిర్వహణ కోసం టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ ఆధ్వర్యంలో మెడికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఈఎంఐఎస్) పేరుతో సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. ఆస్పత్రుల సూపరింటెండెంట్లు వైద్య పరికరాలకు అవసరమైన మరమ్మతుల ప్రతిపాదనలను ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో పంపుతారు. వాటిని టీఎస్‌ఎంఎస్‌ఎస్‌ఐడీసీ పరిశీలించి, మరమ్మతులు చేయిస్తుంది. ఇందులో సీ కేటగిరీలోని పరికరాల మరమ్మతుల ధరలను ఖరారు చేసేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు. టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ మెంబర్ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ, డీఎంఈ, టీవీవీపీ కమిషనర్, వైద్యారోగ్యశాఖ సాంకేతిక సలహాదారు సభ్యులుగా ఉంటారు. ఏటా ఒక్కోబెడ్‌కు పీహెచ్‌సీలకు రూ.వెయ్యి, సీహెచ్‌సీలకు రూ.1,500, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రూ.2 వేలు, బోధన, స్పెషాలిటీ ఆస్పత్రులకు రూ.2,500 చొప్పున నిధులు విడుదల చేస్తారు. -
Gandhi Hospital: ఆస్పత్రిలో ‘గుండె’ గోస
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి కార్డియాలజీ విభాగంలోని క్యాత్‌ల్యాబ్ గత పద్దెనిమిది నెలలుగా మూలనపడింది. అత్యంత ప్రాధాన్యం కలిగిన కార్డియాలజీ విభాగం ప్రభుత్వ, వైద్య ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి గురి కావడంతో గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్యసేవలు అందక హృద్రోగులు విలవిల్లాడుతున్నారు. 2010లో ఏర్పాటు.. ► గుండె సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కోట్లాది రూపాయల వ్యయంతో కార్డియాలజీ విభాగంలో 2010లో క్యాత్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. గాంధీ కార్డియాలజీ ఓపీ, ఐపీ విభాగంలో నిత్యం వందలాది మంది రోగులు సేవలు పొందుతుంటారు. ► గుండె సంబంధ వ్యాధులను నిర్ధారించేందుకు నాలుగైదు దశల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈసీజీ, టుడీఎకో, ట్రెడ్ మిల్ టెస్ట్ (టీఎంటీ) తదితర పరీక్షల్లో కొన్నిరకాల రుగ్మతలు, యాంజియోగ్రాం, పెర్యూటేనియస్ ట్రాన్సుమినల్ కొరునరీ యాంజియోఫ్లాస్ట్రీ (పీటీసీఏ), ప్రోటోన్ పంప్ ఇన్‌హేబిటర్ (పీపీఐ), ట్రెపోనిమా పల్లిడం ఇమ్మోబిలైజేషన్ (టీపీఐ) తదితర అత్యంత కీలకమైన వైద్యపరీక్షలు క్యాత్‌ల్యాబ్‌లోనే నిర్ధారణ అవుతాయి. ► క్యాత్‌ల్యాబ్ నివేదిక ప్రకారమే రోగికి స్టంట్ వేయాలా? శస్త్రచికిత్స నిర్వహించాలా? అనేది నిర్ణయిస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వహించక క్యాత్‌ల్యాబ్ మెషీన్ పలుమార్లు మొరాయించింది. కాలపరిమితి ముగిసిన క్యాత్‌ల్యాబ్ మెషీన్ మరమ్మతులకుæ లక్షలాది రూపాయల వ్యయమవుతుందని, కొత్తది సమకూర్చుకోవడం మేలని సంబంధిత నిపుణులు స్పష్టం చేశారు. ► ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య యంత్రాలు, పరికరాల కొనుగోలు, నిర్వహణ బాధ్యతల కేటాయింపులను తెలంగాణ వైద్యవిద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చూస్తోంది. గాంధీ ఆస్పత్రిలో నూతనంగా క్యాత్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించినప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చక పోవడం గమనార్హం. ► వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన హరీష్‌రావు స్పందించి నూతన క్యాత్‌క్యాబ్ ఏర్పాటు చేసి నిరుపేద హృద్రోగుల గుండె చప్పుడు ఆగిపోకుండా చూడాలని పలువురు కోరుకుంటున్నారు. ప్రభుత్వానికి నివేదిక అందించాం గాంధీ ఆస్పత్రిలో క్యాత్‌ల్యాబ్ పని చేయని విషయాన్ని ప్రభుత్వంతో పాటు వైద్య ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా వివరించాం. కాలపరిమితి ముగిసిన గాంధీ క్యాత్‌ల్యాబ్ మరమ్మతులకు రూ. 45 లక్షలు, ఏడాది నిర్వహణకు మరో రూ. 30 లక్షలు అవసరం. రూ.75 లక్షలు వ్యయం చేసే బదులు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులో ఉన్న నూతన క్యాత్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని ఇంజినీరింగ్ నిపుణులు సూచించారు. ఈ విషయాలన్ని నివేదిక రూపంలో అందించగా నూతన క్యాత్‌ల్యాబ్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. త్వరలోనే అందుబాటులోకి తెచ్చి నిరుపేద హృద్రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాం. – రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
Gimbal: వీడియో కంటెంట్ ఇప్పుడు మరింత కొత్తగా
హైదరాబాద్: వీడియో కెమెరాలు, స్మార్ట్ఫోన్లను మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకు వీలుగా చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ జియూన్ సరికొత్త జింబల్లను ఇండియాలో రిలీజ్ చేసింది. జింబల్స్ స్మూత్ క్యూ3, విబిల్ 2ను ఇటీవల ఆవిష్కరించింది. జియూన్ అందిస్తోన్న జింబల్లో త్రీ-యాక్సిస్, రొటేటబుల్ ఫిల్ లైట్, 17 స్మార్ట్ టెంప్లేట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాదు 4300k వార్మ్ టోన్డ్ ఇంటిగ్రేటెడ్ ఫిల్ లైట్, మూడు లెవల్స్‌లో బ్రైట్ అడ్జస్ట్మెంట్, ఫ్రంట్, రియర్ లైటింగ్ కోసం 180° టచ్ బటన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటి సాయంతో తక్కువ వెలుతురులోనూ నాణ్యమైన వీడియోలను మరిన్ని యాంగిల్స్‌లో తీసే వీలు కలుగుతుంది. స్మూత్-క్యూ3 యూజర్లు స్మార్ట్ టెంప్లేట్స్, అడ్వాన్స్డ్ ఎడిటర్ వంటి కొత్త ఫీచర్లతో గతంలో కంటే అధిక విధాలుగా ఇప్పుడు తమ స్టోరీలు క్యాప్చర్ చేయవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. స్మార్ట్ఫోన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్మూత్ క్యూ3 అన్ని ప్రధాన ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లను సపోర్టు చేస్తుంది. కంటెంట్ క్రియేటర్లు, ఇతరులకు మెరుగైన క్వాలిటీ అందిస్తుంది. కొత్త ప్రొడక్టు ఆవిష్కరణ సందర్భంగా జియూన్ ఇండియా ప్రతినిధి మయాంక్ చచ్రా మాట్లాడుతూ... భారతీయ మార్కెట్ నుంచి మాకు మంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రస్తుతం మా బ్రాండ్ నుంచి 11 ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్యను 15 పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. చదవండి : Xiaomi Smart Glasses: మాట్లాడేందుకు కళ్ల జోళ్లొస్తున్నాయ్ -
కిట్ల పేరిట రూ.కోట్లు కొట్టేశారు, రూ.3 వేలకు 16 వేలు
సాక్షి, అమరావతి: అధీకృత డీలర్ వద్ద ఓ ల్యాబ్ కిట్ ధర రూ.3 వేలు. ఆ కిట్ కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించిన ధర రూ.16వేలు. టీడీపీ హయాంలో ఈఎస్ఐ ఆస్పత్రులకు అవసరమైన మందుల కొనుగోళ్లలో యథేచ్ఛగా సాగిన అవినీతి బాగోతం ఎంతటిదో తెలియడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. 2014–19 మధ్య ఈఎస్ఐ ఆస్పత్రులకు మొత్తం రూ.975.79 కోట్ల విలువైన మందులు, పరికరాల కొనుగోళ్ల కుంభకోణంపై ఏసీబీ విచారణలో కొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అప్పటి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించిన టీడీపీ నేత అచ్చెన్నాయుడును గతంలోనే అరెస్ట్ చేసిన ఏసీబీ విచారణ కొనసాగిస్తోంది. ఆయన ప్రస్తుతం బెయిల్‌పై విడుదల అయ్యారు. కాగా ఏసీబీ అధికారులు తాజాగా బుధవారం మరో నలుగుర్ని అరెస్ట్ చేశారు. వారిలో అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్, ప్రస్తుతం విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డా.బాల రవికుమార్ సైతం ఉండగా.. హైదరాబాద్‌లోని ఓమ్ని మెడి, ఓమ్ని ఎంటర్‌ప్రైజస్ యజమాని కంచర్ల శ్రీహరి, ఆయన భార్య, ఓమ్ని హెల్త్‌కేర్ యజమాని కంచర్ల సుజాత, ఓమ్ని మెడి మేనేజర్ బండి వెంకటేశ్వర్లును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. వారిని న్యాయస్థానంలో హాజరుపర్చి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ నలుగురితో పాటు ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు ఇప్పటివరకు 21 మందిని అరెస్ట్ చేశారు. 4 షెల్ కంపెనీలు.. 400 శాతం అధికంగా.. టీడీపీ ప్రభుత్వంలో పెద్దల అండతో ఈఎస్ఐ ఆస్పత్రులకు పరికరాలు, మందుల కొనుగోలులో యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. ఈ కేసులో ఏ–19గా ఉన్న కంచర్ల శ్రీహరిబాబు హైదరాబాద్‌లో ఓమ్ని మెడి పేరుతో ఓ ఫార్మసీ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. అతనే ఓమ్ని ఎంటర్ప్రైజెస్ పేరుతో మరో కంపెనీ, తన భార్య సుజాత పేరుతో ఓమ్ని హెల్త్‌కేర్ అనే ఇంకో కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ మూడు కంపెనీలు హైదరాబాద్‌లో ఒకే అడ్రస్‌తో రిజిస్టర్ అయ్యాయి. శ్రీహరిబాబు తన బినామీ కె.కృపాసాగర్ రెడ్డి పేరున లేజండ్ ఎంటర్ప్రైజెస్ అనే మరో కంపెనీని కూడా సృష్టించారు. ఈ నాలుగు కంపెనీల మధ్య మందులు, వైద్య పరికరాల వ్యాపారం జరిగినట్టుగా రికార్డుల్లో చూపించి వాటి ధరను ఏకంగా 400 శాతం పెంచేశారు. అనంతరం ఆ పెంచిన ధర ప్రకారం ఈఎస్ఐ ఆస్పత్రులకు మందులు, వైద్య పరికరాలు సరఫరా చేశారు. దీనికి అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్, ప్రస్తుతం విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ బి.రవికుమార్ సహకరించారు. ఆ విధంగా కేవలం ఓమ్ని మెడి నుంచి జరిపిన రూ.92 కోట్ల మేర కొనుగోళ్లలో రూ.35 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. టెండర్లు పిలవకుండా.. నోట్ ఫైల్స్ సైతం లేకుండా.. టీడీపీ ప్రభుత్వంలో 2014 జూన్ నుంచి 2019 మార్చి మధ్యలో ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా, టెండర్లు లేకుండా ఈఎస్ఐ ఆస్పత్రుల కోసం ఏకంగా రూ.975.79 కోట్ల మేర మందులు, వైద్య పరికరాలు కొనుగోలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన టెలీ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు అప్పగించాలని టీడీపీ ప్రభుత్వంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సిఫార్సు చేయడంపై దర్యాప్తు ఇప్పటికే కొనసాగుతోంది. మరోవైపు ఇతర సంస్థల నుంచి కూడా టెండర్లు పిలవకుండానే కనీసం నోట్ ఫైళ్లు సైతం లేకుండానే మందులు, వైద్య పరికరాలు, ల్యాబ్ కిట్లు, సర్జికల్ పరికరాలు, ఫర్నిచర్ మొదలైనవి కొన్నారని ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఆర్థిక శాఖ విధి విధానాలు, ఈఎస్ఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా నాన్ రేట్ ఫర్మ్ నుంచి దాదాపు 50 శాతం అధిక ధరలకు కొనుగోలు చేశారు. డైరెక్టర్లు, సెంట్రల్ డ్రగ్ స్టోర్ సిబ్బంది నకిలీ కొటేషన్లు సమర్పించి పోటీ లేకుండా చేశారు. కొందరు తమ బంధువులు, సన్నిహితుల పేరిట సంస్థలను సృష్టించి మరీ వాటి నుంచి కొనుగోలు చేయడం గమనార్హం. ఇక ల్యాబ్ కిట్లు, కన్జూమబుల్స్లను కేవలం మూడు సంస్థల నుంచే కొనుగోలు చేశారు. ఆ మూడు సంస్థలు కూడా అధీకృత డీలర్లు కావు. కనీసం అధీకృత డీలర్లతో ఎంవోయూ కూడా చేసుకోని సంస్థల నుంచి మందులు, వైద్య పరికరాలు కొనుగోలు చేయడం గమనార్హం. -
థర్డ్ వేవ్ కోసం సంసిద్ధం
సాక్షి, ముంబై: కరోనా మూడో వేవ్ ఆగస్టు తరువాత వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలనా విభాగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. మూడో వేవ్‌లోనూ కరోనాను నియంత్రించేందుకు అవసరమైన సామగ్రి, వైద్య సిబ్బందిని సమకూర్చుకుని సిద్ధంగా ఉంచే పనిలో పడింది. ఈ క్రమంలోనే దహిసర్, మలాడ్, నేస్కో, వర్లీలోని ఎన్ఎస్సీఐ–డోమ్, భైకళలోని రిచర్డ్సన్ అండ్ కృడ్డాస్, ములుండ్ తదితర జంబో కోవిడ్ సెంటర్లలో సమారు 20 వేల పడకలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. వీటితోపాటు మహాలక్ష్మిలోని రేస్ కోర్స్, కాంజూర్గ్ మార్గ్, సోమయ్య మైదానంలో కొత్త జంబో కోవిడ్ సెంటర్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నాయర్, కస్తూర్భా, కేం, సైన్, కూపర్ తదితర ప్రధాన ఆస్పత్రులతో పాటు ఉప నగరాల్లో ఉన్న 16 ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లలో కూడా పడకలు సమకూర్చి సిద్ధంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ అదనపు కమిషనర్ సురేశ్ కాకాని తెలిపారు. ఇదిలావుండగా కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు బీఎంసీ ద్వారా చేపడుతున్న చర్యలు, ప్రభుత్వం జారీ చేసిన లాక్డౌన్, కఠిన ఆంక్షల వల్ల ముంబైలో రెండో దఫా కరోనా చాలా శాతం వరకు నియంత్రణలోకి వచ్చింది. దీంతో కరోనా రికవరీ శాతం కూడా 97 శాతం వరకు చేరుకుంది. అయినప్పటికీ మూడో దఫా కరోనా ప్రమాదం ఇంకా పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా బీఎంసీ జంబో కోవిడ్ సెంటర్లు నెలకొల్పడం ప్రారంభించింది. బీఎంసీ, ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లలో కూడా అవసరాన్ని బట్టి పడకలను సమకూర్చి సిద్ధంగా ఉంచనున్నట్లు సురేష్ తెలిపారు. సోమయ్య మైదానంలో 1,200 బెడ్ల సామర్థ్యం గల కోవిడ్ సెంటర్‌ను నిర్మించడం వల్ల చెంబూర్, మాహుల్, ట్రాంబే, దేవ్నార్, గోవండీ, కుర్లా, చునాబట్టి, సైన్ ప్రాంతాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా చిన్న పిల్లల కోసం నిర్మించనున్న 1,500 బెడ్లతో కూడిన సెంటర్లో 70 శాతం ఆక్సిజన్ బెడ్లు, 10–15 శాతం ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉండనున్నాయి. దీంతోపాటు పాత, కొత్త జంబో కోవిడ్ సెంటర్లలో పీడియాట్రిక్ వార్డు కూడా ఉండనుంది. దీంతో కోవిడ్ బారిన పడిన పిల్లలకు వెంటనే వైద్యం అందుతుందని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆశిస్తోంది. -
థర్డ్ వేవ్ ప్రిపరేషన్: కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ఆందోళనల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ను అందుబాటులో ఉంచే విధంగా సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. కరోనా చికిత్సలో కీలకమైన ప్రాణాలను రక్షించే అత్యవసర మందులు, ముఖ్యమైన వైద్య పరికరాలకు సంబంధించి "జాతీయ నిల్వ" ను ఏర్పాటు చేయడానికి కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు ఫార్మా, వైద్య పరికరాల సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఇందుకు గాను ఔషధాల విభాగం కింద, వైద్య పరికరాలను ట్రాక్ చేయడానికి కేంద్రం నేషనల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం కోవిడ్-19 మహమ్మారి థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేలా స్టాక్‌పైల్ నొక దాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది తద్వారా ముఖ్యమైన యాంటీబయాటిక్స్ ఇతర కీలకమైన ఔషధాల, ఆక్సిజనేటర్లు తదితర పరికరాల లభ్యతను సమీక్షించడంతోపాటు కొరత నివారణకు కృషిచేయనుంది. అలాగే వీటి సరఫరా గొలుసు బలోపేతానికి, తయారీ ప్రక్రియలో అవాంతరాల పరిష్కారంలో కూడా సహాయపడుతుంది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై పని చేస్తున్నాయని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ వెల్లడించారు. రానున్న విపత్తుకు తామంతా సంసిద్ధంగా ఉండాల్సి ఉందని పేర్కొన్నారు. అలాగే ఆయా కంపెనీలు కూడా త్వరితగతిన ఉత్పత్తుల సష్టిపై దృష్టిపెడతాయన్నారు. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో క్లిష్టమైన ఔషధాల సరఫరా వేగవంతమవుతుందన్నారు. కరోనా రెండో వేవ్ సృష్టించిన విలయం, ఈ సమయంలో ఆక్సిజన్ కొరత, పల్స్ ఆక్సిమీటర్లు లాంటి వైద్య పరికరాల కొరత, రెమ్‌డెసివర్, బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే టోసిలిజుమాబ్ , అమ్ఫోటెరిసిన్-బి లాంటి ముఖ్యమైన ఔషధాల కోసం బాధితుల కష్టాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ నిల్వను సృష్టించడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి కొరతలను నివారించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కరోనా చికిత్సలో కీలక ఔషధాల లభ్యతపై సమీక్ష , అలాగే బ్లాక్ ఫంగస్ చికిత్సలో కీలకమైన మందుల లభ్యతపైనా వివరాలను సేకరిస్తుంది. దీనికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ కీలక పరికరాలను షార్ట్ లిస్ట్ చేయనుంది. అలాగే రోజువారీ ప్రకారం ఇతర భాగస్వామముల సలహాలను కూడా తీసుకుంటుంది. చదవండి : గుడ్‌న్యూస్: మోడర్నాకు గ్రీన్ సిగ్నల్, 90 శాతం సమర్థత Flipkart Monsoon Sale 2021: ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు -
జిల్లాకో డయాగ్నోస్టిక్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: రోగాన్ని ముందస్తుగా గుర్తిస్తే వేగంగా నయం చేయ వచ్చనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. క్యాన్సర్ లాంటి రోగాన్ని సైతం ప్రాథమిక దశలో గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చామని, వచ్చే నెలాఖరులోగా మరో 19 చోట్ల ఈ సెంటర్లను ప్రారంభించనున్నట్లు వివరించారు. రూ.1.5 కోట్లతో సంబంధిత పరికరాలను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆనంద్ లేవనెత్తిన అంశాలపై మంత్రి ఈటల వివరణ ఇచ్చారు. హైదరాబాద్‌లోని నారాయణగూడలో అత్యాధునిక పరికరాలతో లేబొరేటరీని అందుబాటులోకి తెచ్చామన్నారు. నగరంలో 20 చోట్ల శాంపిల్ కలెక్షన్ సెంటర్లను తెరిచి రోగుల నుంచి శాంపిల్స్ తీసుకుని నారాయణగూడ ల్యాబ్‌కు పంపిస్తున్నామని తెలిపారు. భూపాలపల్లిలో వంద పడకల ఆస్పత్రిని ఉద్యోగుల నియామకం పూర్తిచేసి త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కరోనాపై అసెంబ్లీలో మంత్రి ఆరా రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని ఆరోగ్య శాఖ ఈటల అధికారులను ఆదేశించారు. అధికారుల నుంచి అందే నివేదిక ఆధారంగా భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు ఈటల వద్ద ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అసెంబ్లీలోని తన చాంబర్ నుంచి వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్‌తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసి యేషన్లతో మంత్రి రాజేందర్ ఫోన్లో మాట్లాడారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని, ఆస్పత్రుల్లో చేరుతున్న ఇన్‌పేషంట్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నా, తీవ్రత మాత్రం అంతగా లేదని అధికారులు వివరించారు. కరోనా పరీక్షల సంఖ్య పెంచడంతో పాటు కరోనా బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. -
పది నిమిషాల్లోనే వైరస్ నిర్ధారణ!
లాస్ఏంజెలిస్: కరోనా వైరస్‌ను పది నిమిషాల్లోనే గుర్తించే ఓ వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేయడంలో అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయం సాధించింది. రక్తం లేదా లాలాజలంలోని వైరస్‌ను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు చౌకగా లభించే సెన్సర్లను వినియోగించడం విశేషం. అంతేకాదు... ఈ పరికరాన్ని ఇంట్లో ఎవరికి వారే వాడి వైరస్ ఉనికిని తెలుసుకోవచ్చు. గ్రాఫీన్ పొర సాయంతో గతంలోనే ఈ శాస్త్రవేత్తలు గౌట్ వంటి వ్యాధులను గుర్తించే పద్ధతిని అభివృద్ధి చేశారు. లేజర్ కిరణాల సాయంతో ప్లాస్టిక్ పొరపై అతి సూక్ష్మమైన కంతలను ఏర్పాటు చేయడం.. వీటిల్లో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థ సృష్టించే యాంటీబాడీలను జోడించడం ముఖ్యమైన అంశం. (చదవండి: మరో 10 కోట్ల డోసుల వ్యాక్సిన్స్: సీరమ్) ర్యాపిడ్ ఫ్లెక్స్ అని పిలుస్తున్న ఈ కొత్త పరికరంలో యాంటీబాడీలతోపాటు కొన్ని ప్రొటీన్లు కూడా ఉంటాయి. తద్వారా వైరస్‌ను గుర్తించడంతోపాటు రోగ నిరోధక వ్యవస్థ స్పందనను, వ్యాధి తీవ్రతను సూచించే మార్కర్లను కూడా గుర్తించవచ్చు. ఇలా ఏకకాలంలో కరోనా వైరస్‌కు సంబంధించిన మూడు అంశాలను తెలుసుకోగలగడం.. చికిత్స విషయంలో చాలా కీలకపాత్ర పోషిస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వీ గావ్ తెలిపారు. కోవిడ్ పరీక్షల ఫలితాల కోసం ప్రస్తుతం కొన్ని గంటల సమయం పడుతున్న విషయం తెలిసిందే. సెన్సర్ బాగా పనిచేస్తుందని నమ్మకం కుదిరినప్పటికీ ర్యాపిడ్ ఫ్లెక్స్‌ను ప్రస్తుతానికి తాము పరిశోధనశాలలో మాత్రమే పరీక్షించామని చెప్పారు. (చదవండి: ఏడాది చివరికి కొవాక్జిన్) -
రక్షణ దిగుమతుల నిషేధం : చారిత్రక ప్రకటన ఇదేనా!
సాక్షి, న్యూఢిల్లీ : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం విరుచుకుపడ్డారు. రక్షణ పరికరాల దిగుమతులపై నిషేధం గురించి రాజ్‌నాథ్ ఆడంబర వ్యాఖ్యలు చేసి ఆపై నీరుగార్చే ప్రకటన చేశారని ఎద్దేవా చేశారు. ఆదివారం ఉదయం మెరుపులు ఉంటాయని హామీ ఇచ్చిన రక్షణ మంత్రి ఆపై నిట్టూర్పుతో ముగించారని వరుస ట్వీట్లలో చిదంబరం పేర్కొన్నారు. రక్షణ పరికరాలను కేవలం రక్షణ మంత్రిత్వ శాఖే దిగుమతి చేసుకుంటోందని దిగుమతి ఆంక్షలు ఏమైనా కేవలం ఆ ఒక్క శాఖకే వాటి ప్రభావం పరిమితమని చిదంబరం వ్యాఖ్యానించారు. దిగుమతి ఆంక్షలనేది పెద్ద మాటని అన్నారు. చదవండి : ‘అలా చేస్తే.. చైనా ఆక్రమణలు తొలగిస్తారా? తాము ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న పరికరాలను ఇక్కడే తయారుచేసేందుకు ప్రయత్నించి రెండు నుంచి నాలుగేళ్లలో దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని రక్షణ మంత్రి చెప్పుకొచ్చారని అన్నారు. రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం వెల్లడించిన చారిత్రక ప్రకటనలో పసఏమీ లేదని, ఇది కేవలం మంత్రి తన కార్యదర్శులకు జారీ చేసే శాఖాపరమైన ఉత్తర్వు మాత్రమేనని చిదంబరం ఎద్దేవా చేశారు. కాగా, 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ట్విటర్ ద్వారా తెలిపారు. 'ఆత్మనిర్భర్ భారత్' కార్యక్రమానికి ఊతమిచ్చేందుకే రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఆయుధాలతో పాటు ఇతర రక్షణ వస్తువులు ఇక మీదట దేశీయంగానే తయారవనున్నాయి. ఇది భారత రక్షణశాఖ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుందని రాజనాథ్ తెలిపారు. -
వ్యవసాయ పరికరాలపై 40 శాతం రాయితీ
సాక్షి, అమరావతి: ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 40 శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆప్కాబ్ (ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు) ఆర్ధిక సహకారంతో ఈ సంఘాలు పరికరాలను సమకూర్చుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించనుంది. పరికరం విలువలో 10 శాతం నిధులను సంఘాలు సమకూర్చుకుంటే, బ్యాంకులు 50 శాతం రుణం ఇస్తాయి. మిగిలిన 40 శాతం రాయితీని ప్రభుత్వం అందించనుంది. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయపరికరాల పంపిణీలో జరిగిన అక్రమాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం అనేక మార్పులు, చేర్పులు చేసి కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ఆప్కాబ్ తొలుత పేర్కొన్న సంఘాలకు రాయితీపై పరికరాల పంపిణీకి నిధులు కేటాయించనుంది. ఈ మేరకు శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. ► ఆసక్తికలిగిన రైతులు ఈనెల 15లోగా సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సంఘాలను గ్రామస్ధాయి కమిటీలు గుర్తించాల్సి ఉంటుంది. ► పరికరాల కొనుగోలుకు దరఖాస్తు చేసుకునే సంఘాలు గతంలో ఏ బ్యాంకులోనూ రుణ ఎగవేతదారుగా ఉండకూడదు. ► కనిష్టంగా రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షలు, గరిష్టంగా రూ. 1.20 కోట్ల నుంచి రూ. 1.30 కోట్లను ఆప్కాబ్ రుణంగా మంజూరు చేయనుంది. ► గ్రూపులకు యాంత్రిక పరికరాలను సరఫరా చేసిన తరువాతనే ఉత్పత్తిదారులకు రాయితీ మొత్తాలను ప్రభుత్వం జమ చేయనుంది. ► ఈ ఏడాదికి సంబంధించి ఒక గ్రామంలో ఒక సంఘానికే రాయితీపై రుణం అందించనుంది. ► గ్రూపులు తమకు అవసరమైన యాంత్రిక పరికరాలను ఎంపిక చేసుకునేందుకు ఉత్పత్తిదారులతో మండల, జిల్లాస్ధాయిలో ప్రదర్శనలు ఏర్పాటు కానున్నాయి. వీటిని ఈ నెల నాలుగో వారం నుంచి వచ్చేనెల 2 వారం వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ► యాంత్రిక పరికరాలను రాయితీపై పొందిన గ్రూపులు.. కస్టమ్ హైరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకుని అక్కడి ఇతర రైతులకు ఆ పరికరాలను అద్దెకు ఇచ్చుకోవచ్చు. -
చైనా, పాక్‌కు ‘పవర్’ కట్!
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి భారత్ విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకోబోదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ స్పష్టం చేశారు. అలాగే, చైనా, పాకిస్తాన్ల నుంచి వచ్చే పరికరాల దిగుమతులను కేవలం తనిఖీల ఆధారంగా అనుమతించేది లేదని పేర్కొన్నారు. తనిఖీల తర్వాతైనా అవసరమైతే అనుమతులు రద్దు చేస్తామన్నారు. రాష్ట్రాల విద్యుత్ శాఖల మంత్రులతో శుక్రవారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. ‘మనం ఇక్కడ ప్రతీదీ తయారు చేసుకుంటున్నాం. అయినా కూడా భారత్ రూ. 71,000 కోట్ల విలువ చేసే విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకుంది. ఇందులో రూ.21,000 కోట్ల మేర చైనా నుంచి దిగుమతయ్యాయి. మన దేశంలోకి చొరబడే పొరుగు దేశం నుంచి ఈ స్థాయిలో దిగుమతులను అనుమతించలేం. చైనా, పాకిస్తాన్ల నుంచి ఏదీ కొనుగోలు జరిపే ప్రసక్తే లేదు. ఆయా దేశాల నుంచి దిగుమతులకు అనుమతులివ్వబోము. ఈ దిగుమతి చేసుకున్న వాటిల్లో (చైనా నుంచి) ఏ మాల్వేర్ ఉందో ట్రోజన్ హార్స్ ఉందో (వైరస్లు). వీటి సాయంతో వారు అక్కడెక్కణ్నుంచో మన విద్యుత్ వ్యవస్థలను చిన్నాభిన్నం చేయొచ్చు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. టవర్ ఎలిమెంట్లు, కండక్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు మొదలైనవి భారత్‌లోనే తయారవుతున్నా.. వాటిని దిగుమతి చేసుకోవడం ఆందోళనకరమైన విషయమన్నారు. ‘మీ డిస్కంలు చైనా కంపెనీల నుంచి పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాయి. చైనా కంపెనీల నుంచి కొనుగోళ్లు చేయొద్దని కోరుతున్నాం’ అని రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులకు మంత్రి సూచించారు. స్వయం సమృద్ధి భారత్ నినాదంలో భాగంగా ఇక్కడ లభించే ఏ పరికరాన్నీ చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకోబోదని చెప్పారు. దిగుమతి చేసుకున్న వాటిని కూడా క్షుణ్నంగా తనిఖీ చేస్తుందని, ఆ తర్వాత అవసరమైతే వాటిని రద్దు కూడా చేయొచ్చని కూడా ఆయన తెలిపారు. డిస్కంలకు ఆర్థిక ఊరట... డిస్కంలకు ఆర్థికంగా ఊరటనిచ్చేలా కొత్త పథకాన్ని మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ఉదయ్, డీడీయూజీజేవై, ఐపీడీఎస్ పథకాల స్థానంలో ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. కొత్త స్కీమ్ కింద డిస్కంల నష్టాలను తగ్గించేందుకు రాష్ట్రాలు తగు ప్రణాళికలు సమర్పించాల్సి ఉంటుంది. నష్టాలను తగ్గించుకునే ప్రణాళికల్లో లేని డిస్కంలకు ఈ పథకం కింద రుణాలు గానీ గ్రాంట్లు గానీ ఇవ్వడం జరగదని సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో లాగా ప్రభుత్వ రంగ సంస్థ లేదా ప్రైవేట్ సంస్థల ద్వారానైనా డిస్కంలను లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. డిస్కంలకు రూ. 90,000 కోట్ల మేర నిధులు అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ప్యాకేజీ కింద రాష్ట్రాలు రూ. 93,000 కోట్లు అడిగాయని, ఇప్పటిదాకా రూ. 20,000 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. చైనా దిగుమతులకు ముందస్తు అనుమతులు తప్పనిసరి.. చైనా, పాకిస్తాన్ వంటి దేశాల నుంచి విద్యుత్ పరికరాల దిగుమతులకు ముందస్తుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. భారత్‌తో సరిహద్దులున్న దేశాలు.. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతులను తగ్గించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం విద్యుత్ సరఫరా వ్యవస్థలో వినియోగించేందుకు దిగుమతి చేసుకున్న అన్ని రకాల యంత్రాలు, పరికరాలు, విడిభాగాలతో మాల్వేర్, ట్రోజన్లు, సైబర్ ముప్పులాంటివి పొంచి ఉన్నాయేమో తెలుసుకునేందుకు, భారత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని చూసేందుకు దేశీయంగా పరీక్షించడం జరుగుతుందని కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. విద్యుత్ శాఖ నిర్దేశించిన అధీకృత ల్యాబొరేటరీల్లో టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. టిక్‌టాక్‌కు... 45 వేల కోట్ల నష్టం! చైనా యాప్‌లపై భారత నిషేధం కారణంగా చైనాకు చెందిన బైట్‌డాన్స్ లిమిటెడ్‌కు రూ.45,000 కోట్లు(600 కోట్ల డాలర్లు) నష్టం వస్తుందని అంచనా. సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో టిక్‌టాక్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌లను భారత దేశం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధ యాప్‌ల జాబితాలో బైట్‌డాన్స్‌కు చెందిన యాప్‌లు మూడు(టిక్‌టాక్, విగో వీడియో, హెలో యాప్) ఉన్నాయి. మిగిలిన యాప్‌ల నష్టాలతో పోల్చితే ఈ మూడు యాప్‌ల నష్టాలే అధికమని కైయాక్సిన్గ్లోబల్డాట్కామ్ పేర్కొంది. విదేశాల్లో అత్యధికంగా ప్రాచుర్యం పొందిన చైనా యాప్‌ల్లో టిక్‌టాక్ కూడా ఒకటి. టిక్‌టాక్‌కు చైనా తర్వాత అత్యధిక యూజర్లు ఉన్నది భారత్‌లోనే. ఈ ఏడాది తొలి 3 నెలల కాలంలో 61.1 కోట్ల డౌన్లోడ్స్ జరిగాయి. ఇది ప్రపంచవ్యాప్త టిక్‌టాక్ డౌన్‌లోడ్స్‌లో 30 శాతం. -
‘చైనా బరువు’ మాకొద్దు
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదం కారణంగా చైనా వస్తువులను బహిష్కరించాలంటూ మన దేశంలో అన్ని వైపుల నుంచి పిలుపు వస్తోంది. ఈ నేపథ్యంలో భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) ఒక అడుగు ముందుకు వేసింది. చైనా తయారు చేసిన వెయిట్‌లిఫ్టింగ్ సెట్లను తాము ఇకపై వాడబోమని ప్రకటించింది. బార్బెల్స్, వెయిట్ ప్లేట్స్లతో కూడిన నాలుగు సెట్లను గతంలో ‘జెడ్కేసీ’ అనే చైనా కంపెనీకి ఆర్డర్ ఇచ్చి సమాఖ్య తెప్పించింది. ఇప్పుడు వాటిని పక్కన పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు ఐడబ్ల్యూఎల్ఎఫ్ ప్రధాన కార్యదర్శి సహదేవ్ యాదవ్ లేఖ రాశారు. ‘చైనా ఎక్విప్మెంట్ను మనం నిషేధించాల్సిందే. మున్ముందు కూడా ఆ దేశపు వస్తువులు ఏవీ వాడరాదని సమాఖ్య నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాం. భవిష్యత్తులో భారత కంపెనీలు గానీ లేదా ఇతర దేశాల కంపెనీలు తయారు చేసిన ఎక్విప్మెంట్లు వాడతాం కానీ చైనా వస్తువులు మాత్రం ముట్టం’ అని యాదవ్ స్పష్టం చేశారు. నాసిరకంగా ఉన్నాయి... మరోవైపు నిషేధాన్ని సమర్థిస్తూనే భారత వెయిట్ లిఫ్టింగ్ జాతీయ కోచ్ విజయ్ శర్మ మరో కారణాన్ని కూడా చూపారు. ఎక్విప్మెంట్ నాసిరకంగా ఉండటం వల్లే పక్కన పడేస్తున్నామని ఆయన వెల్లడించారు. టోక్యో ఒలింపిక్స్‌లో చైనా వెయిట్స్‌నే వాడతారు కాబట్టి మరో ప్రత్యామ్నాయం లేక సన్నాహాల కోసం తాము గతంలో వాటికి ఆర్డర్ ఇచ్చామని, ఇప్పుడు ఇతర కంపెనీల ఎక్విప్మెంట్కు అలవాటు పడతామని కోచ్ చెప్పారు. ‘లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత లిఫ్టర్లు వాటిని వాడే ప్రయత్నం చేస్తే అవి ఏమాత్రం బాగా లేవని అర్థమైంది. దాంతో మూలన పడేశాం. మా లిఫ్టర్లంతా కూడా చైనా తయారీ వస్తువులను వాడేందుకు ఇష్టపడటం లేదు. ప్రస్తుతం స్వీడిష్ కంపెనీ ‘ఎలికో’కు చెందిన ఎక్విప్మెంట్తో సాధనకు సిద్ధమయ్యాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ టోర్నీలు ‘ఎలికో’తోనే నిర్వహిస్తారు. భారతీయ తయారీదారులతో సహా ప్రస్తుతం ఎన్నో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటప్పుడు చైనా ఉత్పత్తులు అవసరం ఏముంది’ అని ఆయన ప్రశ్నించారు. -
ప్రభుత్వాసుపత్రులపై ఏసీబీ మెరుపు దాడులు
సాక్షి, విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మందుల కొనుగోలులో చేతివాటం, పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లు సమాచారం అందడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏసీబీ మెరుపుదాడులు నిర్వహించింది. కగా వారం కిందట ఏపీలోని ఈఎస్ఐలో భారీ కుంభకోణం జరిగినట్లు వెలుగు చూడడంతో ఏసీబీ దాడులు ప్రాధాన్యతను సంతరించకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రులపై దృష్టి సారించిన ఏసీబీ 13 టీమ్‌లుగా ఏర్పడి వంద మంది సిబ్బందితో సోదాలు నిర్వహిస్తున్నారు. -
వరిలో కలుపు తీసే పరికరం
వరి సాగు చేస్తూ కలుపుతీతకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి ఇంటర్ విద్యార్థి సులభంగా కలుపుతీసే పరికరాన్ని అతి తక్కువ ఖర్చుతో రూపొందించి ఇంజనీర్లను సైతం అబ్బురపరుస్తోంది. కోల్‌కతాలోని విజ్ఞానభారతి సహకారంతో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్–2019’లో వ్యవసాయం విభాగంలో ఈ పరికరానికి ప్రధమ బహుమతి లభించింది. ప్రశంసాపత్రం, జ్ఞాపికతోపాటు రూ. 11 వేల నగదు బహుమతిని అందుకున్న అశోక్ రాష్ట్రపతి భవన్లో జరిగే ఆవిష్కరణల ఉత్సవానికి ఎంపికైన నలుగురిలో ఒక్కరుగా నిలవడం విశేషం. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే. తారకరామారావు తదితరుల ప్రశంసలను సైతం అశోక్ అందుకున్నాడు. సృజనాత్మక పరికరం ఆవిష్కరణతో పిన్న వయసులోనే తన ప్రత్యేకతను చాటుకున్న ఆ విద్యార్థి పేరు గొర్రె అశోక్. ఊరు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని అంజలిపురం. మూడెకరాల రైతు గొర్రె నాగరాజు, సావిత్రి దంపతుల కుమారుడైన అశోక్ దేవరకొం డ పట్టణంలో ఒకేషనల్ జూనియర్ కాలేజీలో వ్యవసాయం కోర్సు రెండో సంవత్సరం చదువుతున్నాడు. నాగరాజు తనకున్న మూడెకరాలతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నారు. వరి మాగాణుల్లో కలుపు తీసే వారికి నడుము నొప్పి సమస్యగా మారింది. నడుము వంచాల్సిన పని లేకుండా నిలబడే ముదురు కలుపును సమర్థవంతంగా తీయటం ఎలా? అని అశోక్ ఆలోచించాడు. దీనికి ఏదైనా పరికరం రూపొందించి తమ తల్లిదండ్రులతోపాటు ఇతర రైతులు, వ్యవసాయ కార్మికులు సులువుగా పనులు చేసుకునేందుకు తోడ్పడేలా ఏదైనా పరికరం తయారు చేయాలనుకున్నాడు. ‘నేను తప్ప అందరూ ఇంజినీర్లే’ కోల్‌కతాలో జరిగిన ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్–2019’లో వ్యవసాయం విభాగంలో 120కి పైగా ప్రాజెక్టులను ప్రదర్శించారు. అందులో అశోక్ రూపొందించిన కలుపు తీత పరికరానికి ప్రథమ బహుమతి లభించింది. ‘అక్కడికి వచ్చిన వారందరూ బీటెక్ చదివిన వారే. నేను ఒక్కడినే ఇంటర్ విద్యార్థిని. అయినా నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం, ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రొఫెసర్ ప్రత్యేక ప్రశంసలు తనకు ఎంతో ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగించాయ’ని అన్నాడు అశోక్. తనతోపాటు సైన్స్ ఫెస్టివల్లో పాల్గొనవారు కొందరు సెన్సార్లు అమర్చిన యంత్రాలను తయారు చేశారని, 30–40 వేల రూపాయల ఖరీదైన యంత్ర పరికరాలు తయారు చేశారని అంటూ.. మన దేశంలో 65 శాతం మంది రైతులు చిన్న, సన్నకారు రైతులేనని, అంత ఖరీదైన యంత్ర పరికరాలను మన చిన్న రైతులు ఎలా ఉపయోగించగలరని అశోక్ ప్రశ్నిస్తున్నాడు. ఒంటి చేత్తో కలుపు తీయవచ్చు కూలీలు వరి నాట్లు వేసేటప్పుడు సాళ్లు సాఫీగా రావు, గజిబిజిగా వస్తాయి. అలాంటప్పుడు యంత్రాలతో కలుపు నిర్మూలన సాధ్యం కాదు. తాను తయారు చేసిన పరికరంతో సాళ్లు సరిగ్గా పాటించని వరి పొలంలో కూడా నిలబడి, ఒంటి చేత్తోనే సునాయాసంగా తీసేయవచ్చని, ముఖ్యంగా ముదురు కలుపు మొక్కలను సైతం సులువుగా నిర్మూలించవచ్చని అశోక్ తెలిపాడు. రూ. 250ల తోనే ఈ పరికరాన్ని సుమారు నెల రోజుల క్రితం తయారు చేశానన్నాడు. సైకిల్ బ్రేక్, ఐరన్ రాyŠ (చిన్నపాటి సీకు), ఇనుప కట్టర్లను ఉపయోగించి కలుపు తీత పరికరాన్ని రూపొందించాడు. ఇవన్నీ కూడా స్వల్ప ఖరీదైనవే కాకుండా, పాత ఇనుప సామాన్ల దుకాణాల్లో కూడా దొరుకుతాయన్నాడు. ఒక బ్లేడ్ కిందకు, మరో బ్లేడ్ పైకి ఉండేలా ఏర్పాటు చేయడం వల్ల.. ఈ బ్లేడ్ల మధ్యలో కలుపు మొక్కను ఉంచినప్పుడు కలుపు మొక్క తెగిపోకుండా వేర్లతో సహా పీకడానికి అవకాశం ఉంటుందన్నాడు. సాధారణంగా ముదురు కలుపు మొక్కలను చేతులతో పట్టుకొని పీకినప్పుడు వ్యవసాయ కూలీల చేతులు బొబ్బలు పొక్కుతుంటాయని, తాను రూపొందించిన పరికరంతో ఆ సమస్య ఉండబోదన్నారు. ఇది మూడో ఆవిష్కరణ అశోక్ ఇప్పటికి మూడు ఆవిష్కరణలు వెలువరించాడు. చెవిటి వారికి ఉపయోగపడే అలారాన్ని తయారు చేశాడు. అదేమాదిరిగా, చిన్న రైతులకు నాలుగు రకాలుగా ఉపయోగపడే యంత్ర పరికరాన్ని తయారు చేశాడు. ఇది పత్తి, మిరప పొలాల్లో కలుపు తీయడానికి, విత్తనాలు విత్తుకునే సమయంలో అచ్చు తీయడానికి, ఆరబోసిన ధాన్యాలను కుప్ప చేయడానికి, కళ్లాల్లో గడ్డిని పోగు చేయడానికి ఉపయోగపడుతుంది. దీని ధర రూ. 2 వేలు. అయితే, అప్పట్లో తన ఆవిష్కరణలను ఎవరికి చూపించాలో తెలియలేదన్నాడు. మూడో ఆవిష్కరణను వెలువరించడం, ప్రాచుర్యంలోకి తేవడానికి చాలా మంది తోడ్పడ్డారని అన్నాడు. నల్లగొండ జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి, సికింద్రాబాద్‌లోని స్వచ్ఛంద సంస్థ పల్లెసృజన సహకారంతోనే తన ఆలోచనలను ఆచరణలోకి తెచ్చి, ప్రదర్శనలకు తీసుకువెళ్లగలిగానని అశోక్ కృతజ్ఞతలు తెలిపాడు. వరిలో కలుపు తీసే పరికరం(ధర రూ. 250) కావాలని 16 ఆర్డర్లు వచ్చాయన్నాడు. సెలవు రోజుల్లో వీటిని తయారు చేసి వారికి అందిస్తానని అశోక్ (86885 33637 నంబరులో ఉ. 7–9 గం., సా. 5–9 గంటల మధ్య సంప్రదించవచ్చు) వివరించాడు. – కొలను రాము, సాక్షి, చందంపేట, నల్లగొండ జిల్లా -
పోలీసు బలగాలకు అన్నీ కొరతే
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని పోలీసు బలగాల ఆధునీకరణ కోసం కేంద్రం 2019–2020 వార్షిక బడ్జెట్లో గత ఏడాది కన్నా ఎనిమిది శాతం నిధులను పెంచింది. టెలిఫోన్స్, వైర్లెస్ డివైసెస్, వాహనాలు, ఆధునిక ఆయుధాల కోసం ఈ నిధులను వినియోగించాలని, మ్యాచింగ్ గ్రాంట్లను విడుదల చేసిన వెంటనే గ్రాంటులను విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమని ప్రకటించింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు బలగాల ఆధునీకరణకు ఎలాంటి శ్రద్ధ తీసుకోవడం లేదు. పోలీసు బలగాల ఆధునీకరణ నిధులు ఏడాదికేడాది మురుగి పోతున్నాయి. ‘బ్యూరో ఆఫ్ పోలీస్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్’ ప్రకారం దేశంలోని 267 పోలీసు స్టేషన్లకు టెలిఫోన్ సౌకర్యం లేదు. 129 స్టేషన్లకు వైర్లెస్ కమ్యూనికేషన్ పరికరాలు లేవు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పెట్రోలింగ్ జరపడానికి, ఆపదలో ఉన్నాం, ఆదుకొనమని ఫోన్లు వస్తే స్పందించేందుకు ప్రతి వంద మంది పోలీసులకుగాను ఎనిమిది వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2012 నాటికి దేశంలో వైర్లెస్ కమ్యూనికేషన్ పరికరాలు లేని పోలీసు స్టేషన్లు 39 ఉండగా, 2016 నాటికి వాటి సంఖ్య 129కి చేరుకున్నాయి. 2017 సంవత్సరం నాటికి దేశంలో 273 పోలీసు స్టేషన్లకు ఒక్క వాహనం కూడా లేదు. మణిపూర్‌లో 30, జార్ఖండ్‌లో 22, మేఘాలయ 18 పోలీసు స్టేషన్లకు వైర్లెస్ కమ్యూనికేషన్ డివైస్ ఒక్కటి కూడా లేదు. 2012లో టెలిఫోన్ సదుపాయంలేని పోలీసు స్టేషన్లు 296 ఉండగా, 2017 నాటికి వాటి సంఖ్య 269కి తగ్గాయి. ఉత్తరప్రదేశ్‌లోని 51 పోలీసు స్టేషన్లు, బీహార్‌లోని 41 స్టేషన్లకు, పంజాబ్‌లో 30 పోలీస్ స్టేషన్లకు టెలిఫోన్ సౌకర్యం లేదు. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో క్రైమ్ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు స్టేషన్ల ఆధునీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇక ఆయుధాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆత్యాధునిక ఆయుధాలను పక్కన పెడితే సాధారణ తుపాకుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. పశ్చిమ బెంగాల్‌కు 71 శాతం, కర్ణాటకకు 37 శాతం, పంజాబ్‌కు 36 శాతం ఆయుధాల కొరత ఉంది. పోలీసు బలగాల ఆధునీకరణ కోసం 70 కోట్ల రూపాయల ప్రతిపాదనలు రాగా, అందులో 38.31 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరుకాగా, 32.99 కోట్ల రూపాయలు మాత్రమే ఉపయోగించినట్లు ఐదు రాష్ట్రాల బడ్జెట్‌ను 2014 నుంచి 2018 వరకు సమీక్షించిన కాగ్ వెల్లడించింది. దాదాపు మిగతా రాష్ట్రాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. -
లేనిది ఉన్నట్టు.. అంతా కనికట్టు
జంగారెడ్డిగూడెం : ఒక్కసారిగా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యపరికరాలు వచ్చేశాయి. ఆయా విభాగాల్లో వైద్యపరికరాలు ఏర్పాటు చేసేశారు. ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా కనిపించేలా ముస్తాబు చేశారు. దీంతో ప్రజలు, రోగులు ఆహా ఏరియా ఆసుపత్రికి అన్ని సదుపాయాలు, వైద్యపరికరాలు వచ్చేశాయి అనుకున్నారు. మూడు రోజుల పాటు వైద్యసేవలు కూడా వైద్యులు అలాగే అందించారు. వైద్యులు సిబ్బంది ఠంచన్‌గా విధులకు హాజరయ్యారు. రోగులంతా ఓహో అనుకున్నారు. ఇదంతా నాలుగు రోజుల క్రితం మాట. అయితే శుక్రవారం ఏరియా ఆసుపత్రికి వచ్చిన రోగులకు షాక్ ఎదురైంది. సినిమా సెట్టింగ్‌లు మాదిరిగా ప్యాకప్ చెప్పినట్లు ఏరియా ఆసుపత్రికి వచ్చిన వైద్య పరికరాలు ప్యాక్ చేసి తరలిస్తున్నారు. ఏం జరుగుతుందో రోగులకు అర్థం కాలేదు. ఇంతకీ వైద్యపరికరాలన్నీ ఏలూరు ఆసుపత్రివట. మూడు రోజుల పాటు ఇక్కడ ఉంచి వాటిని శుక్రవారం ప్యాక్ చేసి తిరిగి ఏలూరు ఆసుపత్రికి తరలించేశారు. దీనికి కారణం ఏమిటంటే ఏరియా ఆసుపత్రి పనితీరుపై గ్రేడింగ్ ఇచ్చేందుకు ముగ్గురు వైద్యులతో కూడిన వైద్యబృందం వచ్చింది. మంగళ, బుధ, గురువారాల్లో కేంద్ర బృందంలోని వైద్యులు డాక్టర్ మినీ మోలా, డాక్టర్ బీఎన్ వ్యాస్, డాక్టర్ అర్చన వర్మలు ఇక్కడే మకాం చేసి ఏరియా ఆసుపత్రి ప్రతి అంగుళం పరిశీలించి, వైద్యులు, వైద్యపరికరాలు, రోగులకు అందుతున్న వైద్యసేవలు, సిబ్బంది పనితీరు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ బృందం వస్తున్న సందర్భంగానే ఏరియా ఆసుపత్రిలో లేని వైద్యపరికరాలన్నీ తీసుకువచ్చి హడావుడిగా ఆయా విభాగాల్లో అమర్చారు. హృద్రోగ విభాగం, స్కానింగ్ ఇలా అన్ని విభాగాల్లో అధునాతన పరికరాలు ఏర్పాటు చేసి కేంద్ర బృందానికి ఇక్కడ అన్నీ ఉన్నట్లు సినీమాయ చేశారు. గురువారం సాయంత్రం కేంద్ర బృందం వెళ్లిపోయింది. దీంతో శుక్రవారం ఉదయం ప్యాకప్ చెప్పేశారు. ఏలూరు నుంచి వచ్చిన పరికరాలను ప్యాక్ చేసి లారీలో ఏలూరుకు తరలించేశారు. చివరకు కేంద్ర బృందాన్ని కూడా మన వైద్యాధికారులు, వైద్యులు తమ నైపుణ్యంతో లేనిది ఉన్నట్టుగా చూపి మహా మాయ చేశారు. శుక్రవారం ఆసుపత్రికి వచ్చిన రోగులు ఈ తతంగం చూసి మరో శంకర్‌దాదా సినిమాలో హీరో తన తండ్రి వస్తున్నాడని తెలియగానే ఇంటిని ఆసుపత్రిగా మార్చి చేసిన మాయను, మరోసారి ఇక్కడ చూస్తున్నట్లుగా ఫీలయ్యారు. -
పాఠశాలల సామగ్రి ఏమైంది?
బెజ్జూర్(సిర్పూర్) : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ పాఠశాలకు ఏటా రూ.10 వేల చొప్పున నిధులు విడుదల చేస్తున్నాయి. ఈ నిధులతో పాఠశాలలో రికార్డులు భద్రపర్చేందుకు బీరువా, మూడు కుర్చీలు, చాక్‌పీస్, వాటర్‌ఫిల్టర్, తదితర సామగ్రిని కొనుగొలు చేయాల్సి ఉంటుంది. కాని సామగ్రి కొనకుండా ఈ నిధులను గతేడాది మార్చిలోనే డ్రా చేసినట్లు సమాచారం. పాఠశాలలు ప్రారంభమై 14 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు సామగ్రి లేకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బెజ్జూర్ మండలంలో 49 పాఠశాలకు సంబంధించి రూ.4.90 లక్షలు మంజూరు కాగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, చైర్మన్లు కలిసి నిధులు డ్రా చేసినట్లు తెలుస్తోంది. నిధులు డ్రా అయి దాదాపు మూడు నెలలు గడుస్తున్నా సామగ్రి కొనుగోలు చేయకపోవడంతో అప్పట్లో దీనిపై ‘సాక్షి’ మెయిన్‌లో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన రాష్ట్ర అధికారులు పాఠశాలలను తనిఖీలు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయులు కొంత నాసిరకం సామగ్రి కొనుగోలు చేసి ఎమ్మార్సీ కార్యాలయంలో భద్రపర్చి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. జిల్లా అధికారులను ఎంఈవో రమేశ్ ముందుగానే కలిసి మాట్లాడుకున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. విచారణకు వచ్చిన జిల్లా అధికారులు సైతం నామమాత్రంగా విచారణ చేపట్టారనే ఆరోపణలు వచ్చాయి. 46 పాఠశాలల రికార్డులను తనిఖీ చేయాల్సి ఉండగా కేవలం 22 పాఠశాలల రికార్డులను మాత్రమే తనిఖీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. 50 పాఠశాలలకుగాను కేవలం 12 మంది ఉపాధ్యాయులు ఉండగా, నలుగురు రెగ్యులర్ ప్రధానోపాధ్యాయులు మాత్రమే అన్ని పాఠశాలలకు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. సల్గుపల్లి పాఠశాల హెచ్ఎం తిరుపతికి19 పాఠశాలలకు, బారెగూడ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రవికి 18, పెంచికల్‌పేట ఉర్దూ పాఠశాల హెచ్ఎంకు 12, కొండపల్లి పాఠశాల హెచ్ఎం 7 పాఠశాలలకు ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. వీరు సామగ్రి కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాల అభివృద్ధి నిధులను డ్రా చేసిన ప్రధానోపాధ్యాయులు ఇంతవరకు సామగ్రి కొనుగోలు చేయకపోవడం పలు అనుమానాలు తావిస్తోంది. దీంతో సామగ్రి కొనుగోలు కోసం వచ్చిన నిధులు ఏమాయ్యయని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై సలుగుపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిరుపతిని సంప్రందించగా బెజ్జూర్ ఎంఈవో కార్యాలయంలో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో నిధులు డ్రా చేయాలని మౌఖికంగా ఆదేశించడంతో డ్రా చేసి ఎంఈవోకే ఇచ్చామని తెలిపారు . బెజ్జూర్ ఎంఈవో రమేశ్‌బాబును సంప్రదించగా వారం రోజుల్లో పాఠశాలలకు సామగ్రి సరఫరా చేస్తామని తెలిపారు. సామగ్రి సరఫరా చేయని పక్షంలో నిధులను యాజమాన్య కమిటీ ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. -
మత్స్యమాఫియా
అలంపూర్ రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పారుతున్న తుంగభద్ర, కృష్ణానదుల్లో మత్స్యసంపదను కొల్లగొడుతున్న అలవి వలలు స్థానిక మత్స్యకారుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. మత్స్యసంపదను మధ్య దళారీలు తరలించకుండా మత్స్యశాఖ, పోలీస్ యంత్రాంగం వరుస దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నా పెద్దగా స్పందన కనిపించడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రధానంగా అలంపూర్ గొందిమల్ల, కూడవెల్లి తదితర ప్రాంతాల్లో స్థానికేతరులు ధనార్జనే ధ్యేయంగా వైజాగ్, రాజమండ్రి, తమిళనాడు, ఏపీ వంటి ప్రాంతాల నుంచి అలవి వలలతో చేపలను వేటాడే నైపుణ్యం గల వారికి రోజువారి కూలీలు ఇస్తూ ప్రభుత్వం నిషేధించిన అలవి, పట్టు, నంజు, మ్యాట్ వంటి వలలతో చేపలను వేటాడుతూ మత్స్య సంపదను కొల్లగొడుతూ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో దాదాపు 20 వేల మత్స్యకారుల కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నాయి. లైసెన్స్‌లు.. సొసైటీలు కులవృత్తి అయినంత మాత్రనా లేదా గంగపుత్రులు అయినంత మాత్రాన చేపలు వేటాడే అధికారం లేదు. ఇందుకోసం సంబంధిత మత్స్యశాఖ దగ్గర పేరు నమోదు చేసుకుని లైసెన్సులు పొందాలి. లేదా మత్స్యశాఖ సొసైటీలో కనీసం సభ్యుడై ఉన్నా చేపలను వేటాడవచ్చు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 20 వేల మంది మత్స్యకారులున్నారు. రాజోళి, అలంపూర్, క్యాతూరు ఇలా మిగతా చోట సొసైటీలు కూడా ఉన్నాయి. ఒక్కో సొసైటీలో 400–600 మంది దాకా ఉన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో అయిజ నుంచి అలంపూర్ దాక 13 సొసైటీలు ఉండగా యాక్టివ్ ఉన్న సొసైటీలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. గద్వాల నియోజకవర్గంలో 25 సొసైటీల్లో 38 సంఘాలు, 3,200 మంది లైసెన్స్‌దారులు ఉన్నారు. ఇక వీరి ఆర్థిక పరిస్థితిలు గమనిస్తే చాలా దయనీయంగా ఉన్నాయి. భద్రపరిచే పరికరాలేవీ..? రాష్ట్ర ప్రభుత్వం సహజసిద్ధ ఆర్థిక వనరులు పెంచే ప్రణాళికలో భాగంగా 2016–17 సంవత్సరానికి గాను రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. ఇందులో రూ.900 కోట్లు నాబార్డు నుంచి రాగా కేవలం రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి చేపపిల్లను సరఫరా చేసింది. కానీ వీటిని భద్రపరిచేందుకు గాను టీవీఎస్ ఎక్సెల్ టాంటి మోపైడ్, బోట్లు, వల, ఐస్ బాక్స్ లాంటి పరికరాలు ఏవీ ఇవ్వలేదు. దీంతో పట్టిన చేపలను భద్రపరిచే పరిస్థితి లేకపవడంతో మత్స్యకారులు వాటిని మధ్యదళారీలకే అప్పగిస్తున్నారు. మధ్య దళారికే లాభాలు ఉదయం నుంచి సాయంత్రం దాక కష్టపడిన మత్స్యకారుడికి కడుపు నిండటం గగనంగా మారింది. రోజంతా కష్టపడితే 100 కిలోల చేపలు పడుతాయి. ఇందులో చేప బరువును బట్టి మార్కెట్లో ధర నిర్ణయిస్తారు. అయితే మార్కెట్లో అమ్మకంపై మెళకువలు తెలియని అసలైన మత్స్యకార్మికుడు దళారీకి చేపలు విక్రయిస్తున్నాడు. దీంతో కష్టపడిన మత్స్యకార్మికుడుకి రోజుకు సగటున రూ.150–200 వస్తే గగనం. ఇక అదే చేపలను కొనుగోలు చేసిన మధ్య దళారీ మాత్రం వాటిని హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు ఎగుమతి చేసి పెద్దఎత్తున లాభాలు పొందున్నాడు. లైసెన్సులు పొంది పేరు రిజిష్ట్రేషన్ చేయించుకున్న వారికి మత్స్యశాఖ అధికారులు మార్కెటింగ్‌పై ఎలాంటి శిక్షణ ఇవ్వకపోవడం, వారికి అవగాహన లేకపోవడంతో మధ్య దళారీలే లాభపడుతున్నారు. త్వరలో ఐఎఫ్‌డీఎస్ విధానం.. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఐఎఫ్‌డీఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీం) సమీకృత మత్స్య అభివృద్ధి పథకం అమలు చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ విధానం ద్వారా మత్స్యకారులకు 75 శాతం రుణ సౌకర్యం కల్పిస్తారు. అదేవిధంగా రూ.310 చెల్లించిన లైసెన్స్‌దారులకు కావాల్సిన పరికరాలు 75 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ప్రతిపాదనలు సైతం పంపారు. అమాయకులు బలవుతున్నారు.. అలవి వలల విషయంలో అమాయకులైన స్థానిక మత్స్యకారులే బలవుతున్నారు. వీరి వెనక ఉన్న అసలైన మాఫియా మాత్రం తప్పించుకుంటున్నారు. దీనికంతా కారణం మత్స్యకారులకు మత్స్యశాఖ తగిన రుణ సౌకర్యాలు కానీ మార్కెటింగ్ స్కిల్స్, అవైర్నెస్ ప్రోగ్రాం నిర్వహించకపోవడమే. – అశోక్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి, ముదిరాజ్ మహాసభ కఠిన చర్యలు తప్పవు.. ప్రభుత్వం నిషేధించిన వలల ను ఉపయోగించడం కా కుండా ఎలాంటి అనుమతి, లై సెన్స్లు లేకుండా చేపలను వే టాడుతు మత్స్యసంపదను కొల్లగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. స్థానికంగా కొందరు మా ఫియా దీని వెనక ఉండి నడిపిస్తున్నట్టు సమాచారం. తగిన ఆధారాలతో వారిని కూడా పట్టుకుంటాం. – ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ, అలంపూర్ -
క్షయ పరీక్ష.. సులువు ఇక
ప్రొద్దుటూరు క్రైం : క్షయ వ్యాధి నిర్ధారణ కావాలంటే గతంలో నాలుగైదు రోజులు ఆస్పత్రి చుట్టూ తిరగాల్సి వచ్చేది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఇప్పుడు రెండు గంటల్లోనే టీబీ వ్యాధి నిర్ధారణ జరుగుతోంది. ఇటీవల జిల్లా ఆస్పత్రికి సీబీ నాట్ అనే కొత్త పరికరాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీని వల్ల టీబీ జన్యువును గుర్తిస్తారు. రూ.30 లక్షలు విలువ చేసే ఈ పరికరాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు టీబీ కంట్రోల్ ప్రోగ్రాం కింద అన్ని ప్రముఖ ఆస్పత్రులకు మంజూరు చేశారు. ఒకేసారి నలుగురికి పరీక్షలు గతంలో టిబి వ్యాధి నిర్ధారణ జరగాలంటే ముందుగా జిల్లా ఆస్పత్రిలోని క్షయ వ్యాధి విభాగంలో సంప్రదించాలి. సంబంధిత అధికారి పరిశీలించి క్షయ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే రోగి గల్ల సేకరిస్తారు. మూడు రోజుల తర్వాత దాని రిపోర్టు వస్తుంది. ఒక్కోసారి మరింత ఆలస్యం కావచ్చు. ఇలా రోగులు అనేక మార్లు తిరగాల్సి వచ్చేది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వంచే మంజూరు చేసిన సీబీనాట్ పరికరాన్ని జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు. టీబీకి సంబంధించి రెండు గంటల్లోనే రిపోర్టు వస్తుందని అధికారులు తెలిపారు. ఒక ఎంఎల్ స్పుటంలో 10 వేలకుపైగా కాలనీస్ ఉంటేనే టీబీ ఉందో లేదో తెలిసేది. సీబీ నాట్ మిషన్‌లో ఒక ఎంఎల్ స్పుటంలో కేవలం 130 కాలనీస్ ఉన్నా టీబీ నిర్ధారణ జరుగుతుందని సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్ అన్నారు. ఒకే సారి నలుగురికి పరీక్షలు నిర్వహించవచ్చు. యూపీఎస్ ద్వారా ఆన్లైన్ పరీక్షలు చేస్తారు. శరీరంలో ఏ భాగంలో ఉన్నా గుర్తింపు ఇంత వరకు ఊపిరి తిత్తులకు సంబంధించిన క్షయ వ్యాధిని మాత్రమే గుర్తించి, నివారణకు మందులను ఇచ్చే వారు. ఇది కూడా రోగి నుంచి సేకరించిన గల్ల ద్వారా నిర్ధారణ చేసేవారు. మనిషి శరీరంలోని ఏ భాగానికైనా ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు అంటున్నారు. హెచ్ఐవీ, షుగర్ ఉన్నవారికి, వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వారికి, మురికి వాడల్లో నివసిస్తున్న ప్రజలకు, బీడీ, చేనేతలకు టీబీ సోకే అవకాశాలు ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దగ్గుతో బాధపడుతున్న వీరు వెంటనే వైద్యులను సంప్రదించి సీబీ నాట్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఊపిరితిత్తుల్లో మినహా శరీరంలో ఇతర ఏ భాగాల్లో టీబీ సోకినా అది ఇతరులకు ప్రమాదం కాదన్నారు. ప్రత్యక్ష పర్యవేక్షణ పోగ్రాం ద్వారా మందులు టీబీ సోకిన వారికి కేంద్ర ప్రభుత్వం ఖరీదైన మందులను ఉచితంగా అందిస్తోంది. గ్రామాల్లోని వ్యక్తులకు ప్రొద్దుటూరు టీబీ కేంద్రం నుంచి ఆయా పీహెచ్‌సీలకు మందులను పంపిస్తారు. అంగన్వాడీ సిబ్బంది లేదా ఆశా వర్కర్ల పర్యవేక్షణలో మందులు వాడేలా చూస్తారు. టీబీ ఉన్న వారి టవల్‌ను ఇతరులు వాడకుండా చూడాలి. వయసుతో నిమిత్తం లేకుండా ఈ వ్యాధి వస్తుందని వైద్యులు తెలిపారు. టీబీ రాకుండా ఉండేందుకు పిల్లలు పుట్టగానే బీసీజీ టీకాను వేస్తారన్నారు. టీబీ 100 శాతం నయం అయ్యే వ్యాధి క్షయ వ్యాధి 100 శాతం నయం అవుతుంది. ప్రభుత్వం ఖరీదైన మందులను ఉచితంగా అందచేస్తోంది. క్రమం తప్పకుండా కోర్సు వాడితే వ్యాధి పూర్తిగా నయం అవుతుంది. సీబీ నాట్ పరికరం ద్వారా 2 గంటల్లోనే వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. – లక్ష్మీప్రసాద్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, ప్రొద్దుటూరు. -
రైతు నెత్తిన జీఎస్టీ
సాక్షి, వికారాబాద్: సాగునీటి పొదుపును ప్రోత్సహించాలనే సదాశయంతో ప్రభుత్వం దశాబ్దకాలంగా డ్రిప్, స్ప్రింక్లర్ సేద్యం వైపు రైతులను ప్రోత్సహిస్తోంది. కూరగాయల సాగు కోసం ఉద్యానశాఖ నుంచి చేయూతనిస్తున్నారు. ఇందులో భాగంగా 2016– 17లో జిల్లాలో మంజూరు లక్ష్యం 1,771 హెక్లార్లు ఉండగా 1,072 హెక్టార్లకు గాను 1,008 మంది రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ సెట్లు అందజేశారు. అదే విధంగా 2017– 18లో 2,544 హెక్టార్లలో సాగు లక్ష్యానికి గాను 2,372 మంది రైతులకు మంజూరుచేశారు. సాంక్షన్ అనుమతి ఇచ్చిన తర్వాత సబ్సిడీపోనూ మిగిలిన మొత్తాన్ని రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక రైతుకు గరిష్టంగా 12.5 ఎకరాలకు గాను రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో గత సంవత్సరం జూలై నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి రావడంతో పరికరాలపై 5 శాతం ఉన్న జీఎస్టీ ఏకంగా 18 శాతానికి పెరిగింది. దీంతో తుంపర, బిందు సేద్యానికి అవసరమైన పైపులకు ఆయా కంపెనీలు సైతం వస్తు సేవల పన్ను అమలు చేశారు. ఉదాహరణకు ఒక యూనిట్ కాస్ట్ లక్ష రూపాయలైతే 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. అంటే లక్ష రూపాయల విలువైన వ్యవసాయ పరికరాలు పొందేందుకు జీఎస్టీ కింద రైతులు రూ.18 వేలు చెల్లించాలి. దీంట్లో ప్రభుత్వం తన వాటాగా రూ.5 వేలు మాత్రమే అందిస్తోంది. ఫలితంగా ఒక యూనిట్ మంజూరైన రైతు ప్రస్తుతం రూ.13 వేలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు 5శాతం జీఎస్టీ అమలులో ఉండడంతో ప్రభుత్వ వాటాపోను యూనిట్ కాస్ట్ ఆధారంగా రైతు కేవలం రూ.2 వేల నుంచి రూ.3 వేలు చెల్లిస్తే సరిపోయేది. ప్రస్తుతం ఈ మొత్తం రూ.13 వేలకు చేరి భారంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జీఎస్టీ అమలు కాకముందు ఒక సెట్ (25 పైపులు) స్ప్రింక్లర్లకు గాను సబ్సిడీ పోను రూ.4,500 ధర ఉంటే.. జీఎస్టీ అమలు తర్వాత ఒక్కో సెట్టుకు రూ.6,335 చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. దరఖాస్తు విధానం ఇలా.. తుంపర, బిందు సేద్యం సాగు ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయవచ్చని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. కూరగాయలు, పండ్ల తోటలు, చెరకు, వేరుశనగ తదితర పంటలకు ఉద్యానశాఖ ద్వారా రాయితీ అందజేస్తున్నారు. డ్రిప్, స్ప్రింక్లర్ల సేద్యానికిగాను ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందాలంటే మీసేవ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తుతో పాటుగా 1– బీ, పాస్‌పుస్తకం, గ్రామ రెవెన్యూ ప్లాన్ (నక్షా), ఆధార్‌కార్డు జిరాక్స్, బ్యాంకు ఖాతా జిరాక్స్, ఫీల్డ్ (పొలం) ఫొటో, రైతు పాస్‌పోర్ట్ సైజు ఫొటో జతచేయాలి. నిరంతర ప్రక్రియ ’తుంపర, బిందు సేద్యానికి దరఖాస్తు చేసుకోవడం నిరంతర ప్రక్రియ. గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయగలిగాం. 2017– 18లో సైతం జిల్లాలో 2,544 హెక్టార్ల మంజూరు లక్ష్యానికిగానూ వంద శాతం పూర్తి చేశాం. జిల్లాలో 2,372 మంది రైతులు లబ్ధిపొందారు. బిందు, తుంపర సేద్యంపై ఆసక్తిగల రైతులు ప్రభుత్వ సబ్సిడీకోసం ఆన్లైన్లో మీసేవ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అర్హులైన వారికి మంజూరు ఇస్తాం. జీఎస్టీ అమలు తర్వాత రైతులపై ఆర్థిక భారం పడుతున్న మాట వాస్తవమే. – సంజయ్‌కుమార్, జిల్లా ఉద్యానశాఖ అధికారి -
పీవోఎస్ పరికరాలు మరింత చౌక
ఎక్సైజ్ డ్యూటీ ఎత్తివేసిన కేంద్రం న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం పారుుంట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్) మెషీన్లపై సుంకాలను ఎత్తివేసింది. దీంతో ఇవి మరింత చౌకగా మారనున్నారుు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా పీవోఎస్ పరికరాలకు డిమాండ్ పెరిగిపోరుుంది. వీటి వినియోగాన్ని మరింత పెంచేందుకు గాను... పీవోఎస్ మెషీన్లతోపాటు, వాటి తయారీలో వాడే అన్ని రకాల పరికాలపై 12.5 శాతం ఎక్సైజ్ డ్యూటీ, 4 శాతం ప్రత్యేక అదనపు డ్యూటీల నుంచి మినహారుుస్తున్నట్టు, ఇది వచ్చే మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని అధికార వర్గాలు తెలిపారుు. సుంకాల రద్దు ఫలితంగా పీవోఎస్ మెషీన్లు 16.5 శాతం మేర ధరలు తగ్గనున్నారుు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 90 శాతం పీవోఎస్ మెషీన్లు దిగుమతి అవుతున్నాయని ఆ వర్గాలు తెలిపారుు. -
క్లిక్ దూరంలో రిటైల్ సంస్థలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంటింట్లోని సామగ్రి నుంచి ఒంటి మీద ఫ్యాషన్ వరకూ ప్రతీది ఆన్లైన్లో కొనే రోజులివి. అయితే ఎన్ని ఈ-కామర్స్ సంస్థలొచ్చినా.. నేరుగా షాపుకెళ్లి కొనాలనుకునే వస్తువులను ప్రత్యక్షంగా చూస్తూ.. తాకుతూ కొనేస్తే ఆ అనుభూతే వేరు. నిజమే కానీ మనకు దగ్గర్లో ఏ రిటైల్ షాపులున్నాయి? అందులోని ఆఫర్లు.. ఉత్పత్తులు, సేవల వివరాలెలా తెలుసుకోవాలి?.. ఇదిగో దీనికి పరిష్కారమే వాక్‌టుషాప్.కామ్. మరిన్ని వివరాలు సంస్థ కో-ఫౌండర్ వెంకట్ మాటల్లోనే.. ♦ నాతో పాటూ గోవింద రాజుల పుట్ట, సతీష్, సంజీవ్ నలుగురం కలిసి రూ.2 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా ఈ ఏడాది మార్చిలో వాక్‌టుషాప్ స్టార్టప్‌ను ప్రారంభించాం. వాక్‌టుషాప్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఆఫ్‌లైన్ సంస్థలు, వాటి ఉత్పత్తులు, ఆఫర్ల గురించి ప్రచారం చేయడమే మా ప్రత్యేకత. ♦ మా సేవల విషయానికొస్తే.. మా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న కస్టమర్లకు వారున్న చోటు నుంచి 2 కి.మీ. పరిధిలో ఉన్న రిటైల్ స్టోర్ల జాబితా అంతా సెల్ఫోన్లోకి వచ్చేస్తుంది. అవసరమైతే నేరుగా ఆయా సంస్థలతో చాటింగ్ చేసే వీలూ ఉంటుంది. దీంతో ఎంచక్కా కావాల్సింది నేరుగా కొనేసుకోవచ్చు. ఈ డేటాబేస్ కోసం గూగుల్‌తో ఒప్పందం చేసుకున్నాం. కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను ఎప్పటికప్పుడు రిటైలర్లకు అందిస్తాం. ♦ వ్యాపార విధానం విషయానికొస్తే.. వాక్టుషాప్తో ఒప్పందం చేసుకున్న రిటైల్ సంస్థలకు వారి వారి ఉత్పత్తుల ప్రదర్శన, రాయితీలు, ఆఫర్ల ప్రదర్శన కూడా చేసుకునే వీలుంటుంది. జియో ఫెన్సింగ్ సేవలను కూడా అందిస్తున్నాం. ఇదేంటంటే.. మా వద్ద రిజిస్టరైన కస్టమర్ సంబంధిత స్టోర్‌కు 200 మీటర్ల సమీపంలోకి రాగానే ఆయా స్టోర్ల వివరాలు, ఆఫర్ల వివరాలు నోటిఫికేషన్ రూపంలో సెల్‌ఫోన్‌కు చేరతాయి. బీకాన్ పేరుతో ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ) అనే మరో సేవలందిస్తున్నాం. ఇదేంటంటే.. కస్టమర్ సెల్ఫోన్లో బ్లూ టూత్ ఆన్‌లో ఉంటే చాలు.. ఏదైనా షాపింగ్ మాల్‌కు వెళ్లినప్పుడు మాతో ఒప్పందం చేసుకున్న స్టోర్లకు చేరువకాగానే ఆటోమెటిక్‌గా ఆ స్టోర్ వివరాలు, ఆఫర్ల వివరాలు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ప్రస్తుతం ఈ సేవలను మ్యాక్స్, యూసీబీ సంస్థలు పొందుతున్నాయి. ♦ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లతో పాటూ డెస్క్టాప్ల్లో కూడా సేవలందిస్తున్నాం. ప్రస్తుతం 400 రిటైలర్లు సుమారు 700 స్టోర్లు మా సంస్థలో నమోదయ్యారు. 5 వేల మంది కస్టమర్లు మా యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని సేవలు పొందుతున్నారు. చార్జీల విషయానికొస్తే.. ఆయా సేవలను బట్టి నెలకు రూ.1,500 నుంచి రూ.10 వేల వరకున్నాయి. -
జిమ్‌లో కొన్ని కోట్ల బ్యాక్టీరియా!
లావొక్కింత తగ్గించుకోవాలనే తపనతోనో, జీరో సైజ్ కోసమో, సిక్స్ ప్యాక్ సాధించాలనే పట్టుదలతోనే నేటి యువత జిమ్‌ల వెంట పరుగుతీస్తున్న విషయం తెల్సిందే. అయితే జిమ్ పరికరాలపై మనకు హానికరమైన కొన్ని కోట్ల బ్యాక్టరియా ఉంటుందన్న విషయం ఎంత మందికి తెలుసు? ఇది తెలుసుకోవడం కోసమే ‘ఫిట్ రేటెడ్’ సంస్థ జిమ్‌లోని 27 పరికరాలపై పరిశోధనలు జరిపి కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉందని కనిపెట్టింది. ప్రతి జిమ్ పరికరంపైనా పది లక్షలకు మించి జెర్మ్స్ ఉంటాయని పరిశోధనలో తేలింది. ట్రెడ్మిల్ స్క్రీన్‌ను టచ్ చేసినప్పుడల్లా, ఫ్రీ వెయిట్‌ను పట్టుకున్నప్పుడల్లా బ్యాక్టీరియా జిమ్ యూజర్లపై దాడి చేస్తుంది. దీని వల్ల నిమోనియా లేదా సెప్టిసేమియా, చర్మ వ్యాధులు సంక్రమిస్తాయి. ► ట్రెడ్‌మిల్‌పై పబ్లిక్ టాయ్‌లెట్ కన్నా 74 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. ► ఫ్రీ వెయిట్స్‌పై సరాసరి టాయ్‌లెట్ సీటుకన్నా 362 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. ► ఎక్సర్సైజ్ బైక్‌పై స్కూల్ కేఫ్ ట్రేకన్నా 39 రెట్లు బ్యాక్టీరియా ఉంటుంది. ► అన్ని మూడు రకాల పరికరాలపై గ్రామ్ పాజిటివ్ కొస్సీ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది స్కిన్‌తోపాటు ఇతర ఇన్పెక్షన్లను కలిగిస్తుంది. ఈ రకమైన బ్యాక్టీరియా యాంటీ బయాటిక్స్‌కు కూడా లొంగదు. ►ఫ్రీ వెయిట్స్, ఎక్సర్సైజ్ బైక్‌పైనా బసిల్లస్ బ్యాక్టీరియా కూడా ఉన్నట్టు వెల్లడైంది. దీని వల్ల చెవి, కళ్లు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తాయి. జిమ్ పరికరాలను రోజుకు ఎంతో మంది ఉపయోగిస్తుండడం వల్ల, వారి నుంచి కారే చెమట బిందువులతో కలసి బ్యాక్టీరియా విస్తరిస్తుందని నిపుణులు తెలిపారు. వాటిని వెంటవెంటనే యాంటీ బ్యాక్టీరియా రసాయనాలతో శుభ్రం చేయకపోవడం వల్ల ఈపరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు. బ్యాక్టీరియా భయంతో జిమ్‌ను మానేయాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వారు చెబుతున్నారు. జాగ్రత్తలు జిమ్‌లోకి ప్రవేశించగానే యాంటీ బ్యాక్టీరియా జెల్ లేదా రసాయనంతో చేతులు కడుక్కోవాలి. శుభ్రమైన టవల్‌తో తుడుచుకోవాలి. అదే జెల్‌తో మనం పట్టుకోబోయే ప్రతి జిమ్ పరికరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాతే దాన్ని ఉపయోగించాలి. ప్రతి పరికరం వర్కవుట్ తర్వాత మళ్లీ చేతులు జెల్‌తో కడుక్కోవాలి. ఇంటికి వెళ్లేటప్పుడు కూడా శుభ్రంగా చేతులు కడుక్కొని వెళ్లాలి. వెళ్లాక జిమ్ బట్టలను నీటిలో తడిపి ఉతికేసుకోవాలి. ఇదంతా శ్రమెందుకు అనుకునేవారు ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. -
హైదరాబాద్ లో తోషిబా మరో కొత్త ప్లాంట్
హైదరాబాద్ : జపాన్‌కు చెందిన తోషిబా కార్పోరేషన్ భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్ లోతన నిబద్ధతను, అంతర్జాతీయ మార్కెట్లలో దాని సరఫరా సామర్థ్యాన్ని విస్తరించేందుకు కృషి చేస్తోంది. ఈ నేపధ్యంలో హైదరాబాద్ లో రైల్వేల కోసం ఎలక్ట్రికల్ పరికరాలను తయారు చేసే యొక్క ఒక కొత్త ప్లాంట్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ప్రకటించింది . తమ వ్యాపార విస్తరణలో బాగంగా ఒక కొత్త, ప్రత్యేక రైల్వే వ్యవస్థ డివిజన్ ను తోషిబా ట్రాన్స్మిషన్ & డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ (భారతదేశం) టిటీడీఐ సారధ్యంలో స్థాపిస్తున్నట్టు సంస్థ సీఎండీ కత్సుతోషీ తోడా తెలిపారు. రానున్న సంవత్సరాలలో విద్యుత్తు పంపిణీ విపణిలో 20శాతం వాటాను దక్కించుకోవడమే ధ్వేయంగా విస్తరణ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 2017 లో ఈ ప్లాంట్ లో ఉత్పత్తి ప్రారంభం కానుందని, డిమాండ్ ను బట్టి దీన్ని మరింత విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. 2020 నాటికి 100 మంది ఉద్యోగులను చేర్చకునే అవకాశం ఉందని తోషిబా అంచనా వేసింది. స్థానిక మార్కెట్ అవసరాలనుగుణంగా తమ నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు, పోటీతత్వాన్ని పెంచేందుకు కృషి చేస్తామని తెలిపింది. మధ్య తూర్పు, ఆఫ్రికా మార్కెట్లలో డిమాండ్ అనుగుణంగా ఉత్పాదక కేంద్రంగా రూపుదిద్దుకోనున్నట్టు తెలిపారు. భారతదేశంలో ముఖ్యంగా విద్యుత్తు, రవాణా అవస్థాపనలో బలమైన, దీర్ఘకాలిక పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామన్నారు. ఒక అద్భుతమైన, పెరుగుతున్న మార్కెట్ కు కనుగుణంగా దేశం అంతటా అంకితభావంతో సేవలు అందించనున్నట్టు తోడా తెలిపారు. తద్వారా ఉపాధి కల్పనతో సహా దేశ పారిశ్రామిక అభివృద్ధికి మేక్ ఇన్ ఇండియా లో దోహదం చేస్తున్నామన్నారు. అత్యంత మన్నికైన సాంకేతికతలు, సేవలు అందించడం ద్వారా తమ రైల్వే సిస్టమ్స్ వ్యాపార రంగంలో ప్రపంచ వ్యాప్తవిస్తరణకు కృషి చేయాలనేది తమ లక్ష్యమన్నారు. -
బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచారం
సీతంపేట: బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచా రం నిర్వహిస్తున్న పార్లర్ నిర్వాహకురాలు, వి టుడు, ఆనందపురం మాజీ ఎంపీపీ కోరాడ రా జబాబు పోలీసులకు పట్టుబడ్డారు. ద్వారకా పో లీస్‌స్టేషన్ సీఐ పి.వి.వి.నర సింహారావు తెలిపిన వివరాల ప్రకారం సీతమ్మధార టీపీటీ కాలనీలో ఓ మహిళ ఫ్లోరా పేరుతో బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. వ్యభిచారం జరుగుతోందన్న స్థానికుల సమాచారంతో సీఐ నరసింహారావు, ఎస్ఐ భా స్కర్ సిబ్బందితో కలసి పార్లర్‌పై దాడి చేశారు. పార్లర్ కింద గ్రిల్స్ లాక్ చేసి ఉండటంతో పోలీ సులు గ్రిల్స్ ఎక్కి పార్లర్‌లోకి వెళ్లారు. పోలీసులను చూసి పారిపోతున్న నిర్వాహకురాలు, మరో ముగ్గురు మహిళా సిబ్బంది, విటుడు కోరాడ రాజబాబును అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.2,040ల నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పార్లర్లో మూడు గదులు ఉండగా, కేవలం ఒక్క గదిలో మాత్రమే ఎక్విప్మెంట్ ఉంది. మిగతా రెండు గదుల్లో నేలపై పరుపులు వేసి ఉన్నాయి. పార్లర్ నిర్వహణకు అనుమతులు, పనిచేస్తున్న సిబ్బందికి గుర్తింపు లేదని పోలీసుల విచారణలో బయటపడింది. -
కర్రకు జీవం..
నిర్మల్ అర్బన్ : కొయ్యబొమ్మలు పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది నిర్మల్. ఇక్కడి బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. పునికి కర్రతో తయారు చేసే బొమ్మలు, పరికరాలు, చిత్రకళలు, పెయింటింగ్స్ సహ జసిద్ధంగా ఉంటాయి. చూడగానే ఆకట్టుకుంటాయి. ప్రతీ ఒక్కరి మనస్సు దోచుకుంటాయి. చిత్రకళకు ప్రతీరూపాలైన నిర్మల్ బొమ్మలకు అంతటి ఘనత ఉంది మరీ. 400 ఏళ్ల చరిత్ర.. నిర్మల్ కొయ్యబొమ్మలకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఆనాడు రాజస్థాన్, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కళాకారులు ఇక్కడి కలపను ఉపయోగించి అందమైన బొమ్మలు తయారు చేసేవారు. దీనినే వృత్తిగా మలుచుకుని పలు కుటుంబాలు ఇళ్లలోనే బొమ్మలు తయారు చేసేవని పూర్వీకులు చెబుతారు. చిన్న, చిన్న వస్తువులు, బొమ్మలు తయారు చేసి విక్రయించి జీవనం సాగిస్తుండేవారని ప్రతీతి. దీంతో పాటు రాజులకు అవసరమైన వస్తువులు తయారు చేసేవారు. నిజాం నవాబు కాలంలో సోన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి వచ్చిన రాజు కూర్చునేందుకు ప్రత్యేకంగా కూర్చీని తయారు చేసి ( రాజు కూర్చోగానే బంగారు పూల వర్షం కురిసేలా) బహూకరించడంతో, దానిని చూసి మంత్రముగ్దులైన రాజు తన వంతుగా 16మంది కళాకారులకు పోషణ నిమిత్తం డబ్బులు అందజేశాడని, ఇలా ప్రారంభమైన కొయ్యబొమ్మల తయారీ నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని కళాకారులు చెబుతారు. సంఘంగా ఏర్పాటు మొదట్లో కొయ్యబొమ్మలను ఎవరికి వారే తమ తమ ఇళ్లలో తయారు చేసుకునే వారు. సంతలలో అమ్ముకునేవారు. ఎవరైనా ముందుగానే ఆర్డర్ ఇస్తే వాటిని తయారు చేసి ఇచ్చేవారు. అయితే అది అంత లాభసాటిగా లేకపోవడంతో పాటు మార్కెట్ ఇబ్బందులు రావడంతో తయారీదారులకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడేవి. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ కళపై ఉన్న మక్కువతో సొసైటీ ఏర్పాటు చేయాలని ఇక్కడి కళాకారులకు సలహా ఇచ్చింది. దీంతో జిల్లా పరిశ్రమల కేంద్రం సహాయంతో 1955లో ‘నిర్మల్ కొయ్యబొమ్మల పారిశ్రామిక సహాకార సంఘం’ ఏర్పాటు చేశారు. అప్పుడు కేవలం 16 మందితో ఉన్న సొసైటీలో ప్రస్తుతం దాదాపు 46 మంది సభ్యులు ఉన్నారు. ఉట్టిపడే జీవకళ కళాకారులు చేతిలో కర్రలు జీవాన్ని పొందుతున్నాయి. మెత్తగా, తేలికగా, నాణ్యతగా, పగుళ్లు లేకుండా, రంగులు అద్దేందుకు వీలుగా, చెదలు పట్టకుండా ఎక్కువ కాలం మన్నేలా, అన్నింటికి అనువైనది పునికి కర్ర ఉండటంతో దీనిని బొమ్మల తయారీకి వినియోగిస్తున్నారు. ప్రత్యేక మైన మట్టిని కూడా వీటి తయారీలో వాడుతున్నారు. అలాగే సహజ సిద్ధమైన రంగులు వినియోగిస్తుండటంతో బొమ్మల్లో జీవకళ ఉట్టిపడుతోంది. నిర్మల్ బొమ్మలకు వినియోగించేది కేవలం పునికి కర్ర మాత్రమే కావడంతో దీనికోసం కళాకారులే అడవులకు వెళ్లారు. పునికి చెట్లపై స్థానికులు, అటవీ శాఖాధికారులకు అవగాహన అంతంత మాత్రంగా ఉండటం, చెట్లను గుర్తించేందుకు స్వయంగా వెళ్లాల్సి వస్తుందని కళాకారులు చెబుతున్నారు. పడిపోయిన చెట్లను మాత్రమే అటవీశాఖాధికారుల సహకారంతో టింబర్‌డిపోకు తరలించి, అక్కడ వారి నుంచి కొనుగోలు చేస్తామని, దీంతో ఖర్చు భారంగా మారిందని వాపోతున్నారు. కనీసం కర్రను కూడా ప్రభుత్వం అందించడం లేదు. అడవంతా గాలించడం ఒక ఎత్తయితే దానిని అడవి నుంచి తరలించడం మరో ఎత్తు అవుతోంది. టింబర్ డిపోనుంచి కొనుగోలు చేసిన కలపతో ఒక్కొక్కరు ఒక్కో వస్తువును తయారు చేసేందుకు కార్యదర్శి సూచనలతో తయారీకి సిద్ధమవుతామని చెబుతున్నారు. కుటీర పరిశ్రమగా.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బొమ్మల తయారీ కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. పురుషులతోపాటు మహిళలు కూడా ఇంటి వద్ద కొయ్యబొమ్మలకు రూపాలు ఇస్తున్నారు. సుమారు 30 మంది మహిళలు ఇళ్లలో బొమ్మలు తయారు చేస్తూ ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. వీరు తయారు చేసిన బొమ్మలు సహజ రూపంతో నిలుస్తున్నాయి. సహజత్వానికి మారు పేరు కొయ్యబొమ్మలు సహజత్వానికి మారుపేరుగా నిలుస్తున్నాయి. ఆయా రకాల పండ్లు, ఫలాలు, పక్షులు, జంతువుల వంటి వాటిని కర్ర రూపంలో తయారు చేసి వాటికి జీవం పోస్తున్నారు. అలాగే వీరు వేసే పెయింట్స్‌కు కూడా ప్రత్యేకత ఉంది. డెకో పేయింటింగ్‌తో వేయడంతో ప్రత్యేక ఆకర్షణ వస్తోంది. అలాగే పేయింటింగ్‌లో బ్లాక్ పేయింటింగ్ బ్యాక్‌గ్రౌండ్‌గా రావడమే ప్రత్యేకతగా చెప్పుకుంటారు. డెకో పేయింటింగ్ రాకముందు సహజమైన రూపంలో కళాకారులు రంగులు తయారు చేసుకునేవారు. తెలుపు రంగు కోసం గవ్వలు, పసుపు రంగు కోసం పసుపు, ఎరుపు రంగు కోసం మోదిగ పువ్వు వాడేవారు. ఇక నలుపు రంగు కోసం దీపం పెట్టి దానిపై ఓ పాత్రను ఉంచడంతో దానితో వచ్చే మసిని నలుపు రంగు కోసం వాడేవారు. అయితే ప్రస్తుతం వివిధ రంగులను ఒక్కతాటిపై తీసుకువచ్చి డెకో పేయింటింగ్‌తో చిత్రాలు గీస్తున్నారు. ఈ చిత్రాలు కొన్నేళ్ల పాటు శాశ్వతంగా చెక్కు చెదరకుండా ఉండడమే దీని ప్రత్యేకత. ఇతర రాష్ట్రాల్లోనూ దర్శనం నిర్మల్ కళారూపాలు దేశంలోని పలుచోట్ల దర్శనమిస్తాయి. దేశ రాజధాని అయిన ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ మ్యూజియంలో కామధేను, కోన్గల్లి, రథం, డ్రెస్సింగ్ టేబుల్, తదితర వస్తువులు సుమారు 16 లక్షల విలువైన వాటిని ప్రదర్శనలో ఉంచారు. అలాగే 1948లో మహారాష్ట్రలోని పాలజ్‌కు చెందిన గ్రామస్తులు తమ గ్రామంలో నెలకొల్పేందు కోసం గణేశ్ విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వాలని కోరడంతో అప్పట్లో.. కళాకారుడు గుండాజివర్మ పాలజ్ గణేశ్ విగ్రహాన్ని చెక్కారు. ఆ విగ్రహం ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉంది. కాలానికనుగుణంగా.. నిర్మల్ కొయ్యబొమ్మలకు మరింత శోభ తెచ్చేందుకు, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త రూపాల్లో తయారీకి, మార్కెట్ సదుపాయం కల్పించేందుకు పలు సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. నిఫ్టు ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణతో ఇళ్లల్లో ప్రజలు ఉపయోగించేలా వివిధ వస్తువులు తయారు చేస్తున్నారు. అలాగే సీసీహెచ్ ఆధ్వర్యంలో విజిటేబుల్ కలర్లతో పేయింటింగ్ నేర్పించారు. దీంతో వివిధ ఆకృతులను తీర్చిదిద్దుతున్నారు. అలాగే ప్యాకింగ్‌లోనూ ఇటీవల శిక్షణ ఇచ్చారు. ఎన్నో అవార్డులు, ప్రశంసాపత్రాలు పరిశ్రమలో పనిచేస్తున్న పలువురు కళాకారులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. రాచర్ల లింబయ్య వర్మ ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందారు. ఈయన దేవతామూర్తులను తీర్చిదిద్దడంలో దిట్ట. ఈయన జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. 2006లో అలనాటి రాజుల కాలంలో ఏ విధంగా ఉండేవో అదే రూపంలో కామధేనువు, నాగలక్ష్మీదుర్గాదేవి, కొనుగుల్ల (అవార్డుకు ఇచ్చేవారు), డాల్ల్యాంప్, డ్రెస్సింగ్ టేబుల్, చెస్‌బోర్డు (బరాత్), రథం, మంచం, సోఫాసెట్లు, ప్రముఖుల ఇళ్లలో ఉండే బట్టలు మార్చుకునే పరికరాలను న్యూఢిల్లీలోని మ్యూజియంలో ప్రదర్శించారు. వీటిని తయారు చేయడంలో రాచర్ల లింబయ్యతో పాటు పలువురు ఆయనకు సహాయమందించి జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువచ్చారు. 2006లో అప్పటి ఉపరాష్ట్రపతి బైరాన్‌సింగ్ షేకావత్ చేతుల మీదుగా రాష్ర్టం నుంచి ‘శిల్పగురు’ అవార్డు అందుకున్నారు. ఈయనతో పాటు భూసాని నర్సింగం వర్మ, చిన్న పోశెట్టి వర్మ, నాంపల్లి రాజశేఖర్‌వర్మ తదితరులు అనేక గుర్తింపులు పొందారు. -
తళతళా... మిలమిలా...మీ చేతుల్లోనే...
ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం అంత సులభం కాదు. దాని కోసం సరైన ఉత్పత్తులు, పరికరాలు వాడడం చాలా అవసరం. నిత్యం ఇంటిని శుభ్రపరుచుకోవాలి కాబట్టి, తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్నిచ్చే విధానాన్ని ఎంచుకోవడం అవసరం. అలా కాకుండా మార్కెట్లో దొరికే రకరకాల క్లీనర్లను కొంటే, ఇల్లు కాస్తా హోటల్ లాగానో, హాస్పిటల్ లాగానో అనిపిస్తుంది. ఇంటి గచ్చును శుభ్రం చేసుకోవడానికి వాడే సర్ఫేస్ క్లీనర్‌ను సులభంగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పాత్రలు కడగడానికి వాడే ద్రావణాన్ని రెండు టేబుల్‌స్పూన్లు తీసుకొని, రెండు కప్పుల నీళ్ళు కలిపి, స్ప్రే బాటిల్లో దాచుకుంటే అదే సర్ఫేస్ క్లీనర్. గాజు సామాన్లను క్లీన్ చేసుకొనే ద్రావణాన్ని కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక వంతు వినెగర్‌కు ఒక వంతు నీళ్ళు కలిపి, ఓ స్ప్రే బాటిల్లో ఉంచుకొంటే, అది గాజు సామాన్లను శుభ్రం చేయడానికి పనికొస్తుంది. అలాగే, చేతికి రబ్బరు తొడుగులు, ఇంట్లో దుమ్మూ ధూళి దులపడానికి ఓ చేతి గుడ్డ అవసరం. ఉప్పు, వంట సోడా, వినెగర్, నిమ్మకాయ లాంటివి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి తోడ్పడతాయి. ఉప్పు - కప్పులు, మగ్గులు టీ, కాఫీ మరకలతో ఎబ్బెట్టుగా తయారైతే, వాటిలో కొద్దిగా ఉప్పు చల్లి, అలా కాసేపు ఉంచేయాలి. ఆ తరువాత వాటిని రుద్ది, కడిగితే మరక మాయం. కప్పులు, మగ్గులు తేమగా ఉన్నప్పుడు ఈ పని చేస్తే మరింత సులభంగా పని జరుగుతుంది. కూరలు తరిగే పీట క్రిమిరహితంగా ఉండాలంటే, దాని మీద కొద్దిగా ఉప్పు చల్లి, కొన్ని నిమిషాల తరువాత బాగా రుద్ది, నీటితో కడిగేయాలి. అల్యూమినియమ్ ఫ్రేమ్‌లను శుభ్రం చేయాలంటే, తడి గుడ్డ మీద కొద్దిగా ఉప్పు చల్లి, దానితో ఆ ఫ్రేమ్‌లను తుడవాలి. చీమలు, ఈగల బెడద లేకుండా ఉండాలంటే, నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి, దానితో గచ్చు తుడిస్తే సరి. వంట సోడా - వంటింట్లో గ్యాస్ స్టవ్ మీద పడ్డ మరకలను పోగొట్టాలంటే, సమపాళ్ళలో వంటసోడా, ఉప్పు కలిపి, పేస్ట్‌లా తయారు చేసి, తుడవాలి. ఇంట్లోని చెత్తబుట్టలు, యాష్ట్రేలు వాసన రాకుండా ఉండాలంటే, శుభ్రం చేశాక, కొద్దిగా వంట సోడా వాటిలో చల్లాలి. ఫ్రిజ్ తీయగానే వాసన రాకుండా ఉండాలంటే, మధ్య అరలో ఓ చిన్న గిన్నెలో వంటసోడా పోసి, ఉంచాలి. స్నానాలగదిలోని టైల్స్ శుభ్రంగా ఉండాలంటే, వంటసోడా, నిమ్మరసం, ఉప్పు కలిపి తయారు చేసిన పేస్ట్‌తో రుద్దాలి. పాత టూత్‌బ్రష్‌తో టైల్స్ మీద రుద్దవచ్చు. వినెగర్ - కొన్నిసార్లు తూముల్లో ఏదైనా అడ్డుపడినట్లయి, నీళ్ళు పోకవచ్చు. అలాంటి సందర్భాల్లో ఒక్కో కప్పు ఉప్పు, వినెగర్, వంట సోడాలను తీసుకొని, ఆ మిశ్రమాన్ని తూము దగ్గర వేసి, అలా ఓ రాత్రి అంతా ఉంచేయాలి. తెల్లారాక, ఓ రెండు మగ్గుల వేడి వేడి నీళ్ళు అక్కడ పోస్తే, తూముల్లో అడ్డు తొలగిపోతుంది. అలాగే, కొన్నిసార్లు షవర్‌హెడ్‌లో ఏదో అడ్డుపడినట్లయి, నీళ్ళు సరిగ్గా రావు. దాన్ని ఊడదీసి, రాత్రి తెల్లవార్లూ వినెగర్‌లో ముంచి, ఉండాలి. తెల్లవారాక బలమైన బ్రష్‌తో దాన్ని రుద్దాలి. గాజు సామాన్లను కడిగేటప్పుడు నీటికి, కొద్దిగా వినెగర్ కలిపితే చాలు. సామాన్లు తళతళా మెరిసిపోతాయి. -
తుది పోరు
సాక్షి, కడప : స్థానిక తుది పోరుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం జరిగే పోలింగ్‌కుగాను సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది, పోలీసులు గురువారం సాయంత్రానికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. శాంతిభద్రతల పరంగా ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలింగ్ జరిగే ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఎన్నికలు జరిగే జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు నియోజకవర్గాలు సమస్యాత్మకం, కీలకం కావడంతో పోలీసులు విసృ్తత బందోబస్తును ఏర్పాటు చేశారు. బరిలో ఉన్న అభ్యర్థులు ఎలాగైనా గెలవాలనే కృతనిశ్చయంతో మంచినీళ్లప్రాయంగా డబ్బులను ఖర్చు చేశారు. మద్యంను విచ్చలవిడిగా పంపిణీ చేశారు. కమలాపురం నియోజకవర్గంలోని చిన్నపుత్త, దేవరాజుపల్లె, మాచిరెడ్డిపల్లె, కోగటం వంటి గామాల్లో ఓ పార్టీ దౌర్జన్యం చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేట్ సైన్యాలను మోహరిస్తున్నట్లు సమాచారం. జమ్మలమడుగు ప్రాంతంలోని కొన్ని ఎంపీటీసీ స్థానాల పరిధిలో వైఎస్ఆర్సీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తుండగా, మరికొన్నిచోట్ల ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. పులివెందుల నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్సీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశముంది. ప్రొద్దుటూరు పరిధిలో కొన్ని ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్నాయి. మొత్తం రెండో విడతలో 227 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఇందులో 18 స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 209 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 16 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రలోభాలు గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఎలాగోలా ప్రసన్నం చేసుకునేందుకు బరిలో ఉన్న అభ్యర్థులు తుది ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓటర్లతో బేరసారాలు సాగిస్తున్నారు. తాయిలాలను ఎరగా చూపుతున్నారు. కొన్నిచోట్ల ఓటర్లను గుంపగుత్తగా కొనేస్తున్నారు. దీనికితోడు రకరకాల హామీలు ఇచ్చి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. గురువారం రాత్రి భారీగా డబ్బు, మద్యం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజు కూడా ఓటర్లను ఎలాగోలా మభ్యపెట్టేందుకు తమ ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు.