న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల కంపెనీ హ్యాపీ ఫోర్జింగ్స్ ఈ నెల 19న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 21న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 71.6 లక్షల షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 808– 850 ధరల శ్రేణిలో చేపట్టనున్న ఇష్యూ ద్వారా దాదాపు రూ. 1,009 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది.
ఈక్విటీ జారీ నిధులను ఎక్విప్‌మెంట్, ప్లాంట్లు, మెషీనరీ కొనుగోలుతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 17 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. లూధియానా కంపెనీ ఆటో విడిభాగాలు, వ్యవసాయ పరికరాలు, ఇండస్ట్రియల్ మెషీనరీ విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. కస్టమర్లలో అశోక్ లేలాండ్, జేసీబీ ఇండియా, ఎంఅండ్‌ఎం, ఎస్‌ఎంఎల్ ఇసుజు, టాటా కమిన్స్ తదితరాలున్నాయి. గతేడాది(2022–23) ఆదాయం 39 శాతం ఎగసి రూ. 1,197 కోట్లకు చేరగా.. నికర లాభం 47 శాతం జంప్‌చేసి రూ. 209 కోట్లను తాకింది.
Comments
Please login to add a commentAdd a comment