happy
-
Sleep Divorce నయా ట్రెండ్: కలిసి పడుకోవాలా? వద్దా?!
కాలం మారుతోంది, మారుతోన్న కాలంతో పాటు సాంకేతికతా మారుతోంది. అయితే ఇదే తరుణంలో మనుషుల ఆలోచన ధోరణి మరింతగా మారుతోంది. దైనందిన వ్యవహారాలలో చిత్రవిచిత్రమైన పోకడలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఇలాంటివి కూడా ఉంటాయా అనేవిధమైన అలవాట్లు, పద్ధతులు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. అదే స్లీపింగ్ డివోర్స్. విడాకుల గురించి అందరికీ తెలుసు. మరి ఈ నిద్ర విడాకులు ఏంటనేగా సందేహం. అయితే ఈ కథనంలోకి వెళ్లవలసిందే! ప్రస్తుతం సమాజంలో నిద్ర విషయంలో ఒక కొత్త ట్రెండు మొదలైంది. మనుషుల ఆలోచన ధోరణి మారడంతో స్లీపింగ్ డివోర్స్ ఇప్పుడు కుటుంబాలలో ఒక భాగంగా మారింది. అంటే నిద్ర విడాకులు.. అంటే మరేంటో కాదు... రాత్రిపూట నిద్రపోయే సమయంలో భార్యాభర్తలు విడివిడిగా వేరువేరు గదుల్లో పడుకుని ఎవరికి వారు హాయిగా నిద్రపోతారు. తెల్లవారి లేచిన తర్వాత మళ్లీ ఇంట్లో కలిసి ఉంటారు. దీనినే స్లీపింగ్ డివోర్స్ అంటారు.రాత్రి పడుకున్న తర్వాత ఒకరు స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తూ ఉండడం, ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు గట్టిగా హత్తుకుని పడుకోవడం లాంటి సమస్యలకు పరిష్కారంగా చాలా జంటలు స్లీపింగ్ డైవర్స్ విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే ఈ స్లీపింగ్ డివోర్స్‌తో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే.. లాభనష్టాలు రెండూ ఉంటాయి!దంపతుల మధ్య బంధం బలంగా ఉండాలంటే వారు కలిసి పడుకుంటేనే మంచిదని మానసిక వైద్య నిపుణులంటారు. కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే, ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే విడివిడిగా పడుకోవడమే మంచిదని చెబుతున్నారు. వివాహబంధాన్ని కాపాడుకోవడానికే ఈ ట్రెండు ఫాలో అవుతున్నట్టు చెబుతున్నారు. ఎవరి వెర్షన్ వారిదే... నిద్ర అసమానతలతో ఇద్దరు ఒకేచోట పడుకుని రోజూ కీచులాడుకునే కంటే, విడివిడిగా పడుకొని మిగతా సమయాలలో కలిసి ఉండటం ఉత్తమమని కొందరు చెబుతున్నారు. అయితే ఇలా భార్యాభర్తలు విడివిడిగా పడుకోవడం వల్ల వారి మధ్య బంధం బలహీనంగా మారుతుందని, ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం తగ్గుతుందని కొందరు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా స్లీపింగ్ డివోర్స్ విషయంలో ఎవరి వర్షన్ వాళ్ళది.. ఎవరైనా సరే హాయిగా నిద్రపోవడమే ముఖ్యమని చెబుతూ ఉండడం గమనార్హం. పైగా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నట్లు చెబుతుండడం గమనార్హం. ఒకే బెడ్‌పై కలిసి పడుకోవాల్సిన కపుల్స్.. వేరువేరు గదుల్లో పడుకోవడం లేదా, వేరు వేరు మంచాలపై పడుకోవడం వల్ల ఎవరూ నష్టపోయే పని ఏం ఉండదని కొందరి వాదన. కలిసి పడుకునే సమయంలో వచ్చే గురక, దుప్పటిని ఇద్దరు పంచుకోవడం, ఇద్దరిలో ఒకరు స్మార్ట్‌ఫోన్ వాడడం, ఒకరికి ఇష్టం లేకుండా మరొకరు హత్తుకోవడం ఇలా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టేందుకే నిద్ర విడాకులు విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే, ఇలా విడివిడిగా నిద్రించడంతో కంటినిండా నిద్రపట్టి మరుసటి రోజు మరింత యాక్టివ్‌గా టూర్లో పాల్గొన్నట్టు అనేక మంది చెప్పుకొచ్చారు. ఈ స్లీప్ డివోర్స్ కారణంగా లాభనష్టాలు రెండూ ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒకేచోట ఇష్టం లేకుండా కలిసి పడుకోవడం వల్ల బంధాలు బీటలు వారేకంటే విడివిడిగా ఉంటూ సంతోషంగా ఉండడమే బెటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే దీర్ఘకాలంగా జంటలు కలిసి నిద్రించకపోతే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బంధం బలోపేతంగా ఉండాలంటే కచ్చితంగా కపుల్స్ కలిసి పడుకోవాలని సూచిస్తున్నారు. భాగస్వాములు ఇద్దరి నిద్రలో ఉండే అసమానతల కారణంగా ఒకరివల్ల మరొకరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని, ఈ స్లీపింగ్ డైవర్స్ ట్రెండును ఫాలో అవుతున్నారు. ఎవరికి వారు ప్రశాంతంగా సుఖంగా నిద్ర΄ోవడానికి విడివిడి గదులను లేదా విడివిడి పడకలను ఎంచుకుంటున్నారు. అన్నింటికీ మించి భార్యాభర్తల మధ్య గురక సమస్య...భాగస్వాముల నిద్రలో అసమానతలే కారణం. పురుషుల్లో 45 శాతం మంది భాగస్వామికి దూరంగా విడిగా పడుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారట. అయితే, మహిళల్లో మాత్రం కేవలం 25 శాతం మందే ఇందుకు సుముఖంగా ఉన్నట్టు పరిశోధకుల అంచనా. ఇదీ చదవండి: ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!ఇటీవల హిల్టన్ ట్రెండ్స్ పేరిట విడుదలైన ఓ నివేదికలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ నివేదిక ప్రకారం, రోజుల తరబడి టూర్లకు వెళ్లే జంటల్లో ఏకంగా 63 శాతం మంది ఒంటరిగా నిద్రించేందుకే మొగ్గు చూపుతున్నారట. అంతేకాకుండా ఇలా చేస్తే కంటినిండా నిద్ర పట్టిందని, మరుసటి రోజు టూర్‌ను బాగా ఎంజాయ్ చేశామని చెబుతున్నారు. ఇక పిల్లాజల్లాతో వెళ్లేవాళ్లు కూడా తమ బిడ్డల్ని వేరే గదిలో నిద్రపుచ్చేందుకే మొగ్గు చూపుతున్నారట. ఈ ట్రెండ్‌పై అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ కూడా దృష్టి సారించింది. కమ్మటి నిద్రకోసమే తాము విడివిడిగా పడుకున్నట్టు అనేక జంటలు చెప్పారు. -
కొత్త ఏడాదిలో... ఇలా చేద్దాం!
న్యూ ఇయర్‌ను ‘హ్యాపీ’గా మలచుకునే మార్గాలు కాలం ఒక మాయాజాలం. కళ్లముందే కరిగిపోతుంది. ఒడిసిపట్టేందుకు ఎంత ప్రయత్నించినా వేలి సందుల గుండా ఇట్టే జారిపోతుంది. ఆ క్రమంలో మరో ఏడాది చూస్తుండగానే కరిగిపోయింది. తీపి, చేదు అనుభవాలను మిగిల్చి 2024 చరిత్ర పుటల్లోకి జారుకుంది. కొత్త ఆశలను, సరికొత్త ఆకాంక్షలను మోసుకుంటూ 2025 వచ్చేసింది. బద్ధకం వదిలించుకుంటామని, ఇంకోటని, మరోటని... ఇలా న్యూ ఇయర్ అంటేనే ఎన్నో తీర్మానాలు, మనకు మనమే చేసుకునే వాగ్దానాలు. ఇటు చేసే పనిని, అటు ఈదే సంసారాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంటిల్లిపాదితో పాటు మన ఆరోగ్యమూ జాగ్రత్తగా చూసుకోవాలి. పెట్టుకున్న లక్ష్యాలన్నింటినీ సాధించేయాలి. కొత్త అభిరుచులు పెంచుకోవాలి. మొత్తమ్మీద వీలైనన్ని ఆనందమయ క్షణాలను ఒడిసిపట్టుకోవాలి. ఇలాంటివన్నీ ఎవరికైనా ఉండే ఆశలే. ఇవన్నీ తీరి 2025 ఆసాంతం హాయిగా సాగేందుకు ఏమేం చేయాలంటే..!ఆందోళనకు చెక్ ఆధునిక జీవన విధానం పుణ్యమా అని అప్పుడప్పుడు ఒత్తిళ్లు ఎవరికైనా ఉండేవే. కానీ రోజులో చాలాభాగం ఆందోళన మధ్యే గడుస్తోందంటే మాత్రం డేంజరే. కాస్త ఆగి, అర్థం చేసుకునే లోపే పూడ్చుకోలేనంత నష్టం జరిగిపోతుంటుంది. కనుక మనసును కుంగదీసే ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితిని ఎప్పటికప్పుడు నిష్పాక్షికంగా మదింపు చేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం వారానికోసారి కొంత సమయాన్ని ప్రత్యేకించుకోవాలి. ప్రథమ కోపం వంటివేమైనా పెరుగుతున్నాయా అని ఒకటికి రెండుసార్లు పరిశీలించి చూసుకోవాలి. ఆ లక్షణాలు కనిపిస్తే మొదట్లోనేవదిలించుకోవాలి. లేదంటే ఆఫీసులోనూ, ఇంట్లోనూ లేనిపోని సమస్యలు నెత్తిన పడటం ఖాయం. లేదంటే నచ్చనిది, ఊహించనిది జరిగితే వెంటనే అరిచేసి అవతలి వారిని గాయపరచడం లాంటివి పెరిగిపోతాయి. ఇది సంబంధాలను సరిచేయలేనంతగా దెబ్బ తీస్తుందని గుర్తుంచుకోవాలి. అది ఆఫీసైనా కావచ్చు, ఇల్లయినా కావచ్చు. అయితే ఎంత ప్రయత్నించినా మనమూ మనుషులమే గనుక ఎప్పుడైనా నోరు జారవచ్చు. అప్పుడు పరిస్థితిని చక్కదిద్దేందుకు మీరే చొరవ తీసుకోండి. అవసరమైతే అవతలి వారికి సారీ చెప్పినా తప్పు లేదు. అది మీకు నామర్దా అని అస్సలు అనుకోవద్దు. అవతలి వారి దృష్టిలో వ్యక్తిగా మిమ్మల్ని మరో మెట్టు ఎక్కిస్తుందని తెలుసుకోండి. మంచి సావాసం మీకన్నా తెలివైన వారితో, మంచివారితో వీలైనంత ఎక్కువగా గడపండి. తెలివైనవారి సాహచర్యంలో తెలియకుండానే బోలెడు విషయాలు నేర్చుకుంటారు. మంచివారు ఆచరించి చూపే జీవిత విలువలు మనకు దారి చూపే దీపాలవుతాయి. వాటిని ఎంతగా అలవర్చుకుంటే అహంకారం వంటి అవలక్షణాలు అంతగా అణగుతాయి. మానసిక ప్రశాంతతకు, నిజమైన తృప్తికి బాటలు పడతాయి. బద్ధకానికి బై బై బద్ధకాన్ని వదలించుకుందాం. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా దీన్ని న్యూ ఇయర్ తీర్మానాల చిట్టాకు పరిమితం చేయకండి. ఈ క్షణం నుంచే ఆచరణలో పెట్టండి. దీన్నొక్కదాన్ని దూరం చేసుకుంటే చాలా సమస్యలు పరిష్కారమైనట్టేనని గుర్తుంచుకోండి. మెదడును ఖాళీగా ఉంచకపోవడమే ఈ సమస్యకు పరిష్కారం. ఏఐ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోండి. వృత్తి సంబంధ నైపుణ్యాలను మెరుగుపెట్టుకోండి. అది మీ ఆత్మవిశ్వాసాన్నీ అమాంతంగా పెంచేస్తుంది. నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే అటు బద్ధకమూ వదులుతుంది. ఇటు చక్కని ఐడియాలూ పుట్టుకొస్తాయి. రెండిందాలా లాభమే. ఇతరులకు సాయపడదాం ప్రతిఫలం ఆశించకుండా చేసే సాయం వల్ల కలిగే ఆత్మసంతృప్తి అంతా ఇంతా కాదు. అది ఎన్ని వేలు, లక్షలు ఖర్చు చేసినా దొరికేది కాదు. మనకిష్టమైన వారికి సాయపడటం పెద్ద విషయమేమీ కాదు. మీకిష్టం లేని వారికి అవసరాల్లో సాయపడితే మనిíÙగా మరో మెట్టు ఎక్కినట్టే. ఇతరుల్లోని మంచిని గుర్తించడం, అభినందించడం అలవాటుగా మార్చుకుంటే మన సాన్నిధ్యాన్ని అంతా ఇష్టపడతారు. పరిష్కారాలు సూచిద్దాం ఎప్పుడూ సమస్యలను ఎత్తిచూపడం కాదు. అది అందరూ చేసేదే. ఇంతకాలంగా మనమూ చేస్తూ వస్తున్నదే. వాటికి ఆచరణసాధ్యమైన పరిష్కారాలను సూచించే ధోరణి అలవర్చుకుందాం. మొదట్లో కాస్త కష్టమే అనిపించినా మనల్ని అందరికీ అత్యంత ఇషు్టలను చేస్తుందిది. ముఖ్యంగా ఆఫీసుల్లో మేనేజర్ వంటి పొజిషన్లలో ఉంటే ఈ ఒక్క అలవాటుతో సహోద్యోగులందరి మనసూ ఇట్టే గెలుచుకోవచ్చు. వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి వాళ్లకు సలహాలివ్వడమే గాక ఎప్పటికప్పుడు తోడు నిలిస్తే వాళ్లకూ బాగుంటుంది. మనకూ తృప్తిగా ఉంటుంది. సంస్థా లాభపడుతుంది. అలా ఆల్ హ్యాపీసే. చిన్న విజయాలనూ ఆస్వాదిద్దాం విజయం సాపేక్షం. దానికి ఒక్కొక్కరూ ఒక్కో నిర్వచనమిస్తారు. భారీ లక్ష్యాలు సాధించినప్పుడు కలిగే విజయానందం గొప్పదే. కానీ దాని కోసమని ఆనందాన్ని అప్పటిదాకా వాయిదా వేసుకోవడమెందుకు? ఆ లక్ష్యాలను సాధించే క్రమంలో ఎదురయ్యే చిన్న చిన్న సాఫల్యాలను కూడా సెలబ్రేట్ చేసుకోవడాన్ని అలవాటుగా మార్చు కుందాం. అప్పుడిక ప్రతి రోజూ పండుగే. ఆత్మానందమూ ముఖ్యమే వ్యక్తిగత, వృత్తిగత, సాంసారిక సంతృప్తి చా లా ముఖ్యమే. కానీ ఆత్మానందం వీటన్నింటి కంటే విలువైనది. దాన్ని పొందేందుకు కూడా ఇప్పటినుంచే ప్రయత్నం మొ దలు పెడదాం.అంటే ఎకాయెకిన కఠోర ఆధ్యాత్మిక సాధనలు చేసి తీరాలని కాదు. ఏ కవిత్వం, సంగీతం వంటివాటితో లోపలి ప్రయాణాన్ని మెల్లిమెల్లిగా మొదలు పెట్టవచ్చు. నేనెవరిని అనే మూలాలోచన అంటూ ఒకటి మనసులో ఒక పక్కన సాగుతూ ఉంటే చాలు. ఆత్మాన్వేషణకు క్రమంగా బాటలు అవే పడతాయి. చివరగా, వీలైనంతగా నవ్వండి. మానసికంగా అది కలిగించే సానుకూల ప్రభావం అంతా ఇంతా కాదని ఎన్నెన్నో అధ్యయనాలు ముక్త కంఠంతో తేల్చాయి. మొహంపై చిరునవ్వు చెరగని వారికి ప్రతి క్షణమూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తుంది. మరింకెందుకు ఆలస్యం?! ఈ క్షణమే రంగంలోకి దిగుదాం. బద్ధకాన్ని వదిలించుకుందాం. మనల్ని మనం నిత్యం సానబట్టుకుంటూ సాగుదాం. 2025ను మన జీవితంలోకెల్లా అత్యంత ఆనందమయమైన ఏడాదిగా మలచుకుందాం. అవసరాలకే జై కోర్కెలకు, కనీస అవసరాలకు చాలా తేడా ఉంది. ఆశలు అనంతమే గానీ ఆర్జన ఎప్పుడూ పరిమితమే. ఇదొక్కటి గుర్తుంచుకుంటే అవసరాలు, సౌకర్యాలు, ఆడంబరాలకు మధ్య స్పష్టమైన గీత గీయగలం. వేటిని తీర్చుకోవాలో, వేటిని దూరం పెట్టాలో, వేటిని వదిలించుకోవాలో తేల్చుకోవ డం తేలికవుతుంది. చాలా ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. అనుకోని అవసరాల కోసం కొంత మొత్తం కూడా పక్కన పెట్టుకోగలుగుతాం. ఆర్థిక ప్రశాంతత ఎంత బావుంటుందో అనుభవంలోకి వస్తుంది.బంధాలే ముఖ్యం చిన్న పొరపాట్లకు బంధాలు తెంచుకునేదాకా వెళ్లకండి. ఇందుకోసం ప్రత్యేకించి ఏమీ చేయనక్కర్లేదు. అవతలివాళ్లు కూడా మనలాగే మామూలు మనుషులేనని, అప్పుడప్పుడు తప్పులు, పొరపాట్లు చేస్తుంటారని గుర్తుంచుకుంటే చాలు. క్షమించే గుణాన్ని పెంచుకుంటే ప్రపంచమంతా మరింత అందంగా మారుతుంది. ఎప్పుడో జరిగిన అవమానాలను, చేదు సంఘటనలను మనసులో మోయకండి. ఆ భారం నానారకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.సహోద్యోగులు కీలకం తిండీ, నిద్రా తదితరాలకు పోగా మన జీవితంలో మిగిలే నాణ్యమైన సమయంలో అత్యధిక భాగం గడిపేది కలిసి పనిచేసే సహోద్యోగులతోనే. వారితో సత్సంబంధాలు చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. చిన్నాచితకా కారణాలతో సహోద్యోగులతో కీచులాటలకు దిగకండి. అందుకోసం అవసరమైతే మీరే కాస్త తగ్గండి. తప్పేమీ లేదు. చక్కని పని వాతావరణం మన మానసిక, శారీరక ఆరోగ్యాలకు ఎంతో అవసరం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డ్రీమ్ జాబ్స్ అంటే ఇలా ఉంటాయా? వైరల్ వీడియో
నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లేందుకు ఏదో ఒక పని దొరికితే చాలు.. ఇది సగటు మానవుని ఆరాటం. అర్హతకు తగ్గ ఉద్యోగం రావాలి? కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆ తరువాత ఉండటానికి చిన్న ఇల్లు కొనుక్కోవాలి ఇది కొంతమంది ఆశ.పే..ద్ద హోదా ఉన్న ఉద్యోగం కావాలి. నెలకు ఇదెంకల జీతం, బంగ్లా..కారు.. ఎక్స్ట్రా.. ఇది మరికొంతమంది డ్రీమ్ జాబ్. మరి ఇస్త్రీ మడత నలగకుండా, ఒళ్లుఅలవకుండా, చెమట పట్టకుండా ఉండే జాబ్ కావాలి? ఇలా ఆలోచించే జీవులు చాలామందే ఉన్నారు. సరిగ్గా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్రీమ్ జాబ్స్.. అంటూ సీసీటీవీ ఇడియట్స్ అనే ట్విటర్ ఖాతా ఒక ఫన్నీ వీడియోను షేర్ చేసింది. అదేంటో మీరు కూడా చూడండి. అన్నట్టు ఇలాంటి ఉద్యోగాలు నిజంగా డ్రీమ్ జాబ్సేనా? కొన్నాళ్లకు బోర్ కొట్టదూ? ఏమంటారు? Dream jobs! 😂😂 pic.twitter.com/jfsNGwI0H7— CCTV IDIOTS (@cctvidiots) November 11, 2024 -
ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్.. సురక్షితం.. కాలుష్య రహితం
దేశంలో గత కొన్నేళ్లుగా దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంపై పలు ఆంక్షలు విధించారు. బాణసంచా నుండి వెలువడే పొగ ఆరోగ్యానికి హానిచేస్తుంది. అలాగే కాలుష్యాన్ని కూడా వ్యాపింపజేస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే బాణసంచా కొనుగోళ్లు, అమ్మకాలను నిషేధించారు.అయితే దీపావళి వేళ బాణసంచా లేకుండా సరదాగా ఎలా గడపడం? ఇది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పుడు బాణసంచాకు బదులుగా ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి వెలుగు జిలుగులను, ధ్వనిని అందించినప్పటికీ కాలుష్యాన్ని కలుగజేయవు. ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్‌ను కాల్పడం వలన ఎటువంటి హాని జరగదు.ఎలక్ట్రానిక్ టపాసులు నిజమైన టపాసుల మాదిరిగనే కనిపిస్తాయి. వాటిలానే వెలుగులను ఇస్తాయి. అయితే ఇవి రిమోట్‌తో పనిచేస్తాయి. వీటిని వినియోగించినప్పుడు నిజమైన బాణసంచాను కాల్చిన అనుభూతినే పొందవచ్చు. ఎలక్ట్రానిక్ టపాసులు వెలిగించేందుకు ఎటువంటి అగ్గిపెట్టె లేదా నిప్పు అవసరం లేదు. ఇవి ఎంతో సురక్షితమైనవి. కాలుష్యాన్ని కూడా వెదజల్లవు. ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్లో వివిధ రకాల శబ్ధాలు, వెలుగులను చూడవచ్చు.remote control ignition device for crackers दिवाली में पटाखे जलाने के सुरक्षित यंत्र शुभ दिवाली 🪔 pic.twitter.com/VLj2n0tNFV— Er Ranjeet Singh (@ErRanjeetSingh) October 27, 2024 ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్ లోపల వైర్లతో అనుసంధానమైన పలు చిన్న పాడ్లు, ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. వీటిని ఆన్ చేసినప్పుడు పాడ్ల నుంచి స్పార్క్ వస్తుంది. అలాగే బాణసంచా మాదిరి శబ్దం కూడా వస్తుంది. ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్‌ను రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు. ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్‌ను వినియోగించి వినూత్నమైన దీపావళి ఆనందాన్ని పొందవచ్చు.ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్‌ను మార్కెట్లో లేదా ఆన్లైన్లో సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఇవి కొంచెం ఖరీదైనవే అయినప్పటికీ పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు. వీటిని పలుమార్లు ఉపయోగించవచ్చు. వీటిధర రూ.2,500 వరకూ ఉండవచ్చు.ఇది కూడా చదవండి: వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వెలుగులు -
హ్యాపీ ఫోర్జింగ్స్ @ రూ. 808–850
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల కంపెనీ హ్యాపీ ఫోర్జింగ్స్ ఈ నెల 19న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 21న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 71.6 లక్షల షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 808– 850 ధరల శ్రేణిలో చేపట్టనున్న ఇష్యూ ద్వారా దాదాపు రూ. 1,009 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధులను ఎక్విప్మెంట్, ప్లాంట్లు, మెషీనరీ కొనుగోలుతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 17 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. లూధియానా కంపెనీ ఆటో విడిభాగాలు, వ్యవసాయ పరికరాలు, ఇండస్ట్రియల్ మెషీనరీ విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. కస్టమర్లలో అశోక్ లేలాండ్, జేసీబీ ఇండియా, ఎంఅండ్ఎం, ఎస్ఎంఎల్ ఇసుజు, టాటా కమిన్స్ తదితరాలున్నాయి. గతేడాది(2022–23) ఆదాయం 39 శాతం ఎగసి రూ. 1,197 కోట్లకు చేరగా.. నికర లాభం 47 శాతం జంప్‌చేసి రూ. 209 కోట్లను తాకింది. -
రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక
రైల్వే ఉద్యోగులు దీపావళి కానుక అందుకోనున్నారు. ఉద్యోగుల కరువు భత్యాన్ని నాలుగు శాతం పెంచుతున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. దీంతో రైల్వే కార్మికుల డియర్నెస్ అలవెన్స్ బేసిక్ జీతంలో 46 శాతానికి పెరగనుంది. గతంలో ఉద్యోగులు ప్రాథమిక వేతనంలో 42 శాతం డీఏ పొందేవారు. డీఏ పెంపుదల 2023, జూలై ఒకటి నుంచి అమలులోకి రానుంది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను నాలుగు శాతం మేరకు పెంచుతూ కేంద్ర కేబినెట్ ప్రకటించిన ఐదు రోజుల తర్వాత రైల్వే బోర్డు ఈ ప్రకటన చేయడం విశేషం. దీపావళికి ముందు చేసిన ఈ ప్రకటనపై రైల్వే ఉద్యోగుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. డీఏ అనేది ఉద్యోగుల హక్కు అని అఖిల భారత రైల్వేమెన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా అన్నారు. దీపావళికి ముందే ఈ చెల్లింపును ప్రకటించడం ఆనందదాయకమన్నారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ జనరల్ సెక్రటరీ ఎం. రాఘవయ్య మాట్లాడుతూ వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా రైల్వేశాఖ డీఎ చెల్లిస్తుందని, ద్రవ్యోల్బణాన్ని తటస్థీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. కాగా కోవిడ్-19 కారణంగా ప్రభుత్వం జనవరి 2020 నుండి జూన్ 2021 వరకు నిలిపివేసిన డీఎను చెల్లించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌లో రెండు రైళ్లు ఢీ.. 20 మంది మృతి -
జగన్ గారు వరుసగా ఐదేళ్లు వాహన మిత్ర పథకం ద్వారా మా డ్రైవర్లకు అండగా నిలబడ్డారు
-
మీకు తెలుసా! ఆ ఫోబియా వస్తే.. సంతోషంగా ఉండాటానికే భయపడతారట!
ఈ ప్రపంచంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. శాస్త్రవేతలు లేదా మేధావుల కారణంగానో ఆ కొంగొత్త విషయాలు వెలుగులోకి వస్తే ఇలాంటివి కూడా ఉన్నాయా!.. అని నోరెళ్లబెడతాం. అలాంటి కొన్ని ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకుందాం. మంచి ఆసక్తికర విషయాలు.. ఇంతవరకు ఆంగ్లవర్ణమాలలోని అన్ని అక్షరాలు కనిపించే వాక్యం గురించి ఆలోచించారా. అస్సలు అలాంటి వెరైటీ వాక్యం ఒకటి ఉంటుందన్న ఆలోచన వచ్చిందా. తెలుసుకోకపోయిన ఏం ఫర్వాలేదు ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకోండి. ఇంతకీ ఆ వాక్యం ఏంటంటే.. ‘ది క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ వోవర్ ది లేజీ డాగ్’ అనే వాక్యాన్ని గమనిస్తే ఆంగ్ల వర్ణమాలలోని అన్ని అక్షరాలు కనిపిస్తాయట. నిశితంగా గమనిస్తే ఆ విషయం మీకే తెలుస్తుంది. అలానే ఎన్నో రకాల వింత వింత ఫోబియాలు గురించి వినుంటారు. సంతోషం అంటే భయపడే ఫోబియా గురించి విన్నారా. అస్సలు అలాంటిది ఒకటి ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. ఔను మీరు వింటుంది నిజమే! . అలాంటి విచిత్రమైన ఫోబియా ఉందంట..దాన్ని చెరోఫోబియా అని పిలుస్తారట. సంతోషంగా ఉండటం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే కొందరు మాత్రం సంతోషంగా ఉండేందుకు భయపడతారట. దీనికి కారణం సంతోషంగా కనిపిస్తే ఎక్కడ కీడు జరగుతుందోననే మూఢ నమ్మకంతో సంతోషంగా ఉండరట. ఇది రాను రాను సంతోషంగా ఉండాలంటేనే భయపడేంతగా మారుతుందట. అందుకే ఈ లక్షణాన్ని చెరోఫోబియా అంటారు. చాలామంది ఎందువల్ల తెలియదు కొన్ని దురలవాట్లు ఉంటాయి. దూరం చేసుకోవాలనుకున్న ఏదో బలహీనత మళ్లీ ఆ చెడ్డఅలవాటే దగ్గరికి వెళ్లేలా చేస్తుంది. ఈ అలవాట్ల నుంచి ఎలా బయటపడాల్రా బాబు అని తలపట్టుకుంటారు. అలాంటి వాళ్లు నిజంగా మారాలి అని గట్టిగా కోరుకుంటే మాత్రం ముందుగా ఆ దురలవాటు జోలికి వెళ్లకుండా ఓ 21 రోజులు ట్రై చేస్తే చాలట. ఇక వాళ్లకి తెలియకుండానే ఆ అలవాటు నుంచి బయటపడతారట. అధ్యయనంలో తేలిందని నిపుణులు చెబుతున్నారు. ఇక కొన్ని కొత్త పదాలు ఓ పట్టాన అర్థం కావు. ఆంగ్ల పదంలా ఉన్న వేరే భాష మాదిరిగా ఉంటాయి. ఎందకంటే ఆ పదం అర్థం కాక. అట్లాంటి పదమే ‘వోవర్ మారో’. ఐతే దీని అర్థం వింటే ఓస్ ఇంతేనా అనేస్తారు. దీని అర్థం ది డే ఆఫ్టర్ టుమారో అని అర్థమట అంటే ఎల్లుండి అని. (చదవండి: ఏకే ఫ్లవర్ కాదు ఫైర్ బోల్ట్! అతి పెద్ద స్మార్ట్ వాచ్ బ్రాండ్!) -
ఎదురయ్యే అనుభవాన్ని ఏవిధంగా తీసుకుంటావనే దానిపైనే..
చదువు వేరు జీవితం వేరు. చాలామంది అంత చదువుకున్నాడు అలా ఎలా నిర్ణయం తీసుకున్నాడు. పెద్ద పెద్ద చదువులు చదివి కూడా ఇలా ఎలా ఆలోచిస్తున్నాడు. వంటి మాటలు తరుచు వింటుంటాం. నిజానికి చదువుకి చాలా తేడా ఉంది. చదువులో రాజీ పడకుండా చదివితేనే గెలుపుని అందుకోగలం. అదే జీవితంలో బంధాలు నిలవాలన్న, కాపాడుకోవాలన్న రాజీపడాలి. అంటే ఇక్కడ ప్రతిసారి గమ్మని కూర్చొమని కాదు. తగ్గాల్సిన చోట తగ్గాలి పెదవి విప్పి గట్టిగా చెప్పాల్సినప్పుడూ చెప్పాలి. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఏది మాట్లాడితే సమస్య రాదో ఎవ్వరికి గాయం కాకుండా సూటిగా విషయం అవగతమయ్యేలా చెప్పే నేర్పు, ఓర్పు కావాలి లేదంటే జీవితాలు తలకిందులవ్వుతాయి. ముందుకు అసలు జీవితంలో జరిగే ప్రతికూలతల విషయాలను ఎలా స్వీకరించాలో చూద్దాం!. జీవితంలో ఏం కావాలను కుంటారో అది చాలామందికి దక్కదు. దక్కకపోవడం సహజంగా బాధను కలిగిస్తుంది. దక్కినదాంట్లోనే ఆనందం వెతుక్కునేవారు మరోరకం. తృప్తి, అసంతృప్తి అనేవి మనుషుల ఆలోచనా విధానంలో ఉంటాయి. కొందరు నిరంతరం కావాల్సిన దానికోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటారు. ఏ పద్ధతిలో అన్నది ముఖ్యం. అన్నీ కలిసివస్తే అదృష్టవంతుడిగా చలామణీ అయ్యే మనిషి గెలుపును కేవలం తన ప్రతిభగా ప్రకటించుకోవడం ఎంతవరకు సమంజసం? కోరిక ఉండాలి. దాన్ని నెరవేర్చుకునేందుకు కృషి జరగాలి. ఫలితం ఎలా ఉన్నా ప్రయత్నంలో మాత్రం ఆనందం పొందాలి. లక్ష్యసాధనలో రాజీ పడకూడదు. జీవితం ఎలా రూపుదిద్దుకుంటుందో, ఎక్కడెక్కడ మలుపులు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మనం చేసే మంచి పనులే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయని భావించేవారు కొందరైతే, మనం గతంలో చేసుకున్నదాన్ని బట్టే ఈ స్థితి అని విశ్వసించేవారు మరికొందరు. ఎదురయ్యే అనుభవాన్ని ఏ విధంగా తీసుకుంటామన్నదే ముఖ్యం. అదే జీవితసత్యం. (చదవండి: ఆ పార్కులో మాటల్లేవ్! కేవలం నిశబ్దమే..మనుషులంతా విగ్రహాలే!) -
పని చేసేవారు కొందరైతే.. హడావుడి చేసేవారు మరికొందరు!
కంచర్ల యాదగిరిరెడ్డి: ప్రతి ఆఫీసులో రెండు రకాల ఉద్యోగులు ఉంటారు.. పనిలో ఆనందం పొందాలనుకునే వారు కొందరైతే.. పనిచేస్తున్నట్టుగా హడావుడి (షో) చేసేవాళ్లు ఇంకొందరు. ఎవరు ఏమిటన్నది తెలుసుకోవడం కొంచెం కష్టమైన పనే.. కానీ ఐటీ కంపెనీల్లో ఇలాంటి వారిని గుర్తించేందుకు ఈ–కమ్యూనికేషన్ టెక్ కంపెనీ ‘స్లాక్’ ఒక అధ్యయనం చేసింది. ఆశ్చర్యకరమైన ఫలితాలను ప్రకటించింది.మన దేశంలో ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో షో చేసేవాళ్లు 43 శాతందాకా ఉన్నారని వెల్లడైనట్టు తేల్చి చెప్పింది. అంటే ప్రతి వంద మందిలో 57 మంది చక్కగా పనిచేసుకుంటూంటే.. మిగతా వారు చేసేపనికన్నా ఎక్కువగా ‘షో’ చేస్తున్నారని అభిప్రాయపడింది. ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని కంపెనీల్లో ఇలాంటి ఉద్యోగులు గణనీయంగానే ఉన్నారని పేర్కొంది. 18వేల మందిని ప్రశ్నించి.. ఆఫీసుల్లో సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వినియోగించే అప్లికేషన్ ‘స్లాక్’. వాట్సాప్, మెసెంజర్, సిగ్నల్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇది ఆఫీసు బృందాలకు మాత్రమే పరిమితం. అయితే ఉద్యోగుల్లో పనిచేసేవాళ్లు, చేస్తున్నట్టు నటించే/హడావుడి చేసేవారిని గుర్తించేందుకు స్లాక్ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒక అధ్యయనం చేపట్టింది. వివిధ దేశాల్లోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న 18వేల మందిని రకరకాల ప్రశ్నలు వేసి.. వారు ఏ రకానికి చెందినవారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. తాజాగా ఆ అధ్యయనం నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా, జపాన్, సింగపూర్ వంటి ఆసియా దేశాల్లో పనిచేస్తున్న వారిలో ‘షో’ చేసేవారే ఎక్కువని పేర్కొంది.ఇండియాలో 43 శాతం, జపాన్‌లో 37 శాతం, సింగపూర్‌లో 36 శాతం ఇలాంటి ఉద్యోగులు ఉన్నారని తెలిపింది. కానీ ఆసియాలో భాగమే అయినా దక్షిణ కొరియాలో మాత్రం దాదాపు 72 శాతం మంది ఒళ్లు వంచి బుద్ధిగా పనిచేస్తున్నారని పేర్కొంది. యూరప్, అమెరికాలలో హడావుడి చేసే ఉద్యోగులు కొంత తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. ఉద్యోగులు ఏమంటున్నారు? స్లాక్ సర్వే ప్రకారం.. పలువురు ఐటీ ఉద్యోగులు తమ పనితీరును లెక్కగట్టే విధానంలో మార్పులు రావాలని కోరుకుంటున్నారు. కేవలం ఆన్లైన్ స్టేటస్, ఈ–మెయిళ్లకు ఇచ్చిన సమాదానాలు వంటివాటిపై మాత్రమే కాకుండా.. పనికి సంబంధించి మేనేజర్లతో మాట్లాడిన సందర్భాలు, ఏదైనా పని పూర్తి చేసేందుకు పట్టిన గంటలు వంటివాటి ఆధారంగా పనితీరును మదింపు చేయాలని అంటున్నారు. కోవిడ్ సమయంలో మాదిరిగా రిమోట్ వర్కింగ్ లాంటి పద్ధతులే మేలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది పనివేళలు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలని కోరుకుంటే.. ఇష్టమైన చోట పనిచేసే అవకాశం ఉండాలని 36శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆఫీసుల్లో ప్రోత్సాహకాలు భిన్నంగా ఉండాలని, కార్యాలయాల్లో వసతులు పెరగాలని 32శాతం మంది భావిస్తే.. వర్క్ ఫ్రం హోమ్ కాకుండా మళ్లీ ఆఫీసులకు వచ్చి పనిచేయడంపై నిర్ణయం తీసుకోవాలని మరికొందరు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఆఫీసులలో ఒకరిద్దరు కాకుండా బృందాలుగా పనిచేయాలని, బృందంగా మేధోమథనం చేయడం ద్వారా ఉత్పాదకత పెరుగుతుందని పలువురు ఉద్యోగులు పేర్కొన్నారు. సహోద్యోగులతో కలివిడిగా ఉండవచ్చునని, నాలుగు మాటలు మాట్లాడుకోవచ్చని తెలిస్తేనే మళ్లీ ఆఫీసులకు వెళతామని మైక్రోసాఫ్ట్ నిర్వహించిన ఒక అధ్యయనంలో 84శాతం మంది ఉద్యోగులు చెప్పడం గమనార్హం. పని చేయకున్నా ‘ఆన్లైన్’ కొందరు ఉద్యోగులు తాము పెద్దగా పనేమీ చేయకపోయినా యాక్టివ్‌గా ఉన్నామని చూపుకొనేందుకు ప్రయత్నిస్తుంటారని స్లాక్ అధ్యయనం వెల్లడించింది. ఇలాంటి 63 శాతం మంది ఉద్యోగులు యాప్స్‌లో తమ స్టేటస్ ‘ఆన్లైన్’ అని ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తారని పేర్కొంది. మీటింగ్‌లతోనే సరి! తమకు మీటింగ్‌లలో, ఈ–మెయిళ్లకు సమాధానాలు ఇవ్వడంతోనే రోజంతా గడచిపోతోందని.. దీనివల్ల తాము ఉత్పాదకత ఎక్కువగా ఉండే పనులు చేయలేకపోతున్నామని సింగపూర్ ఉద్యోగుల్లో 44 శాతం మంది పేర్కొన్నట్టు స్లాక్ అధ్యయనం వెల్లడించింది. స్లాక్ ఏమంటోంది? ఒక ఐటీ కంపెనీ ఉద్యోగి పనితీరును, ఉత్పాదకతను అంచనా వేసేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్రమాణాలు విజిబిలిటీ, యాక్టివిటీ అని రెండు రకాలు. ఉద్యోగి ఆన్లైన్లో ఎన్ని గంటలు ఉన్నాడు? ఎన్ని ఈ–మెయిళ్లు పంపాడు? వంటి వివరాల ఆధారంగా 27శాతం మేనేజర్లు ఉత్పాదకతను నిర్ణయిస్తుంటారని స్లాక్ సర్వే చెప్తోంది. ఉద్యోగులు అసలు పనిలో ఉత్పాదకత ఎంత పెంచారనేది మేనేజర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్లాక్ టెక్నాలజీ ఎవాంజలిస్ట్ డెరెన్ లానే పేర్కొన్నారు. ఫలితాలను బట్టి కాకుండా, కంటికి కనిపించే అంశాల ఆధారంగా ఉత్పాదకతను నిర్ణయిస్తే.. ఆ కంపెనీ ఉద్యోగులు పనిచేస్తున్నట్టు నటించేందుకే ఇష్టపడతారని చెప్పారు. ఈ తీరువల్ల ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందని.. పనితో సంబంధం లేకుండా ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడపడం, వచ్చిన ఈ–మెయిళ్లకు వెంటనే సమాధానాలు చెప్పడంలో బిజీగా మారిపోతున్నారని, లేదంటే అవసరమున్నా లేకపోయినా అన్ని మీటింగ్‌లకూ హాజరవుతున్నారని స్లాక్ అధ్యయనంలో తేలిందని వివరించారు. -
సముద్రంలో పర్యాటకుల సయ్యాటలు.. సడన్‌గా షార్క్ దూసుకురావడంతో..
అమెరికాలోని ఫ్లోరిడా సముద్రతీరంలో ఆ క్షణంలో భయానక వాతావరణం ఏర్పడింది. సముద్రంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా స్నానం చేస్తున్న వారి మధ్యలోకి ఉన్నట్టుండి ఒక భారీ షార్క్ ప్రత్యక్షమయ్యింది. దీంతో వారంతా నీటిలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ భారీ షార్క్ నీటి మీద తేలియాడుతూ సముద్రంలో సేద తీరుతున్నవారి దిశగా దూసుకువచ్చింది. ఈ షార్క్‌ను బీచ్‌లో నుంచి చూసినవారు సముద్రంలో సయ్యాటలాడుతున్న వారిని హెచ్చరిస్తూ బయటకు వచ్చేయండంటూ గట్టిగా కేకలు పెట్టారు. గతంలో న్యూయార్క్‌లోని ఫైర్ ఐలాండ్‌ను 15 ఏళ్ల కుర్రాడిని షార్క్ చంపేసినప్పటి నుంచి జనాలకు షార్క్‌లంటే విపరీతమైన భయం పట్టుకుంది. తాజాగా ఫ్లోరిడా బీచ్‌లో కనిపించిన షార్క్ భారీ ఆకారంతో ఉండటంతో అక్కడున్న వారంతా భయపడిపోయారు. ఆ క్షణంలో అక్కడ ఆందోళనకర వాతావారణం ఏర్పడింది. గతంలో షార్క్ దాడిలో బాలుడు మృతి చెందడం, దీనికి ముందు షార్క్ దాడిలో కొందరు గాయపడటాన్ని స్థానికులు మరోమారు గుర్తుచేసుకున్నారు. ‘అది ఆకలితో ఉన్నట్టుంది’ ఫ్లోరిడాలో ఆ సమయంలో సముద్రతీరంలో సేదతీరిన క్రిస్టీ కాక్స్ మాట్లాడుతూ తాను ఆ షార్క్‌ను చూసినప్పుడు అది ఆహరపు వేటలో ఉన్నట్లు అనిపించిదన్నారు. అందుకే అది వేగంగా కదులుతూ మనుషులవైపు వచ్చిందన్నారు. దానిని చూడగానే అక్కడున్న వారంతా నిశ్చేష్టులైపోయారన్నారు. ఎలాగోలా అందరూ దారి బారి నుంచి తప్పించుకున్నారన్నారు. కాగా గతంలో పలువురిపై షార్క్ దాడులు జరగగా, వారిలో కొందరు వికలాంగులుగా మారిపోయారు. ఇది కూడా చదవండి: ‘ఇదేం పువ్వు రా బాబూ.. ముక్కు పేలిపోతోంది’ -
పాకిస్తాన్ అభిమానుల సంతోషానికి కారణమైన ఈ అంపైర్ గురించి మీకు తెలుసా
-
ఇటువంటి సాహసం సీఎం వైఎస్ జగన్ మాత్రమే చేయగలరు
-
ఉద్యోగుల పట్ల సీఎం వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు తీసుకున్నారు
-
మన కితకితలు మనకు ఎందుకు నవ్వు తెప్పించవంటే..
కితకితలు.. ఎవరికైనా ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చే ఉంటాయి. ఎవరైనా కితకితలు పెడుతున్నప్పుడు మనకు విచిత్ర అనుభూతి కలిగి, నవ్వు వస్తుంటుంది. ఇటువంటి సందర్భంలో పగలబడి నవ్విన ఉదంతాలు కూడా ఉంటాయి. సాధారణంగా చిన్నపిల్లలకు పెద్దవాళ్లు కితకితలు పెట్టడం చూస్తుంటాం. అటువంటప్పుడు పిల్లలు ఆనందంతో మెలికలు తిరిగిపోతూ నవ్వుతుంటారు. అయితే ఇక్కడున్న ఒక విచిత్ర విషయాన్ని చాలామంది గమనించివుండరు. ఎవరికి వారు కితకితలు పెట్టుకున్నప్పుడు నవ్వు రాదు. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కితకితలు అనుభూతికి రావడంలో మన మెదడులోని రెండు భాగాలు బాధ్యత వహిస్తాయి. వాటిలో మొదటిది కార్టిక్స్.. ఇది శరీరపు స్పర్శను అనుభూతి చెందుతుంది. ఇక రెండవది ఎంటీరియా సింగులెట్ కార్టిక్స్. ఇది ఆనందాన్ని, సెన్సేషన్‌ను అనుభూతి చెందుతుంది. మనకు మనం కితకితలు పెట్టుకున్నప్పుడు మెదడులోని సెరిబెల్మ్ భాగానికి ముందుగానే ఈ విషయం తెలిసిపోతుంది. దీంతో అది కార్టిక్స్‌కు ఆ సమాచారాన్ని అందిస్తుంది. దీంతో కితకితలకు సిద్ధమైన కార్టిక్స్ అంతకుముందే విషయాన్ని గ్రహిస్తుంది. ఫలితంగా మనకు మనం కితకితలు పెట్టుకున్నా నవ్వురాదు. ఎటువంటి అనుభూతి కూడా కలుగదు. కితకితలను అనుభూతి చెందేందుకు సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది తప్పనిసరి. మనకు మనం కితకితలు పెట్టుకున్నప్పుడు మెదడు ముందుగానే శరీరానికి సిగ్నల్ పంపుతుంది. అందుకే మన కితకితలు మన అనుభూతికి అందవు. అయితే మనకు ఎవరైనా కితకితలు పెట్టినప్పుడు మన మెదడు ఆ సిగ్నల్‌ను కార్టిక్స్‌కు పంపలేదు. దీంతో మెదడు కితకితల అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉండదు. ఫలితంగా ఎవరైనా కితకితలు పెడితే వెంటనే ఎడతెగకుండా నవ్వువస్తుంది. అయితే ఇతరులు కితకితలు పెడుతుంటే మనం నవ్వడం కొంతవరకూ మంచిదేనని నిరూపితమయ్యింది. అప్పుడప్పుడు మన శరీరంపై ఏదైనా పురుగు లేదా కీటకం పాకినప్పుడు మనకు శరీరం జలదరిస్తుంది. వెంటనే ఆ పురుగును లేదా కీటకాన్ని తీసి బయట పారేస్తాం. మెదడు ఈ విధంగా కూడా మనకు రక్షణ కల్పిస్తుంది. -
దాస్ కా ధమ్కీ వల్ల మా పేరెంట్స్ ఫుల్ హ్యాపీ
-
సీఎం జగన్ ను చూసేందుకు జనం ఉరుకులు పరుగులు
-
బంగ్లా ఖాళీ చేయడంపై రాహుల్ లేఖలో ఏమన్నారంటే..
రాహుల్ గాంధీకి అనర్హత వేటు పడిన తర్వాత ఆయన నివాసముంటున్న అధికారిక బంగ్లా ఖాళీ చేయాలని సోమవారం లోక్‌సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ భవనం న్యూఢిల్లీలోని తుగ్లక్ లేన్ 12లో ఉంది. రాహుల్ వాస్తవానికి జెడ్ ప్లస్ ప్రొటెక్షన్‌తో 2005 నుంచి అదే బంగ్లాలో ఉంటున్నారు. నోటీసులు అందుకున్న తర్వాత రాహుల్ లోక్‌సభ సెక్రటేరియేట్ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో.. ఆ బంగ్లాతో ముడిపడి ఉన్న కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. గత నాలుగు పర్యాయాలుగా లోక్‌సభకు ఎన్నికైన సభ్యుడిగా ప్రజలిచ్చిన తీర్పుతో ఇక్కడ ఉంటున్న నాకు ఈ భవనంతో చిరస్మరణీయ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. నన్ను ఎన్నుకున్నందుకు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, అలాగే నా హక్కులకు భంగం వాటిల్లకుండా లేఖలో పేర్కొన్న వాటికి కట్టుబడి ఉంటాను అని రాహుల్ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే డిస్ క్వాలిఫై అయ్యాను కాబట్టి, నిబంధనల మేరకు నడుచుకుంటానని, లోక్ సభ సభ్యత్వం ద్వారా సంక్రమించిన బంగాళాను ఖాళీ చేస్తానని తెలిపారు. అయితే బంగళా ఖాళీ చేయాలన్న లోక్ సభ సెక్రటేరియట్ ఆదేశంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. దీనిపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ ను దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని, తుగ్లక్ లేన్ లో ఉన్న బంగ్లా ఖాళీ చేస్తే రాహుల్ తన తల్లితో కలిసి ఉండొచ్చని, లేదా తనకు కేటాయించిన బంగళా అయినా వాడుకోవచ్చని ఖర్గే తెలిపారు. అయినా రాహుల్‌ని భయపెట్టి, బెదిరించడం, అవమానించడం సరికాదని, ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఖర్గే అన్నారు. (చదవండి: ప్రధాని ఇమేజ్‌ని డ్యామేజ్ చేయటం అంత ఈజీ కాదు!: స్మృతి ఇరానీ) -
సంతోష సూచీలో మనమెక్కడ.. మనకంటే మెరుగైన స్థానాల్లో పాక్, శ్రీలంక
ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి : ప్రపంచంలో సంతోషకర దేశాల గురించి తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ దేశాల ఎంపికకు తీసుకుంటున్న ప్రమాణాలపై పలు అభ్యంతరాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ జాబితాపై అంతా ఆసక్తి చూపుతుంటారు. తాజాగా ప్రపంచ సంతోషకర దేశాల (హ్యాపీనెస్ ఇండెక్స్) జాబితాలో భారత్ 126వ స్థానంలో నిలిచింది. ఈ జాబితా కోసం మొత్తం 150 దేశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రపంచంలోనే సంతోషకర దేశాలుగా నార్డిక్ దేశాలుగా పేరున్న ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. చిట్టచివరి స్థానంలో ఆప్ఘనిస్థాన్ నిలిచింది. మొత్తం 10 పాయింట్లకుగాను తొలిస్థానంలో నిలిచిన ఫిన్లాండ్కు 7.8 పాయింట్లు లభించాయి. మన దేశానికి కేవలం 4.6 పాయింట్లు మాత్రమే దక్కాయి. ఇక అట్టడుగున నిలిచిన ఆఫ్ఘనిస్థాన్‌కు 1.9 పాయింట్లు మాత్రమే వచ్చాయి. సంతోషానికి కొలమానం ఏమిటి? ఇది అత్యంత క్లిష్టమైన ప్రశ్న. మనిషి ఎంత సంతోషంగా ఉన్నారని చెప్పడానికి కొలమానం ఏమీ లేదు. సంపదకు, సంతోషానికి ప్రత్యక్ష సంబంధం లేదని సంతోష సూచీ ఫలితాలనుబట్టి చూస్తే అర్థమవుతుంది. సైనిక, ఆర్థిక వ్యవస్థల పరంగా పెద్ద దేశాలైన అమెరికా, చైనా టాప్–10లో లేకపోవడం గమనార్హం. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన దేశం కంటే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్.. సంతోష సూచీలో ముందుండటంగమనార్హం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ.. సంతోష సూచీలో కీలకపాత్ర పోషిస్తున్నాయని నివేదిక రూపకర్తలు అభిప్రాయపడ్డారు. కానీ ప్రజాస్వామ్యం లేని దేశాలు కూడా సంతోష సూచీలో మెరుగైన స్థానాలు సంపాదించడం గమనార్హం. ఈ అంశాల ఆధారంగా నివేదిక ‘యూఎన్ సస్టైన్‌బుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్’.. ఏటా సంతోష సూచీ నివేదిక రూపొందిస్తోంది. మార్చి మూడో వారంలో ఈ నివేదికను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా తాజా నివేదికను ఇటీవల విడుదల చేసింది. జీవితంలో ఎంత సంతృప్తిగా ఉన్నారు? అనే తొలి ప్రశ్నతో మొదలుపెట్టి, ప్రజల సంతృప్తస్థాయి, ఆరోగ్యకర జీవనం, విద్య, వైద్య రంగాల్లో నాణ్యత, భద్రత, తలసరి ఆదాయం, సామాజిక మద్దతు, అతి తక్కువ అవినీతి, సమాజంలో ఔదార్యం.. వంటి ప్రశ్నలకు ప్రజలు ఇచ్చిన జవాబుల ఆధారంగా సూచీని రూపొందించారు. నివేదికపై భిన్నాభిప్రాయాలు భారతీయ సమాజంలో సంక్లిష్టతను పాశ్చాత్య దేశాలు అర్థం చేసుకోలేవని, ఒకే రకమైన కొలమానంతో మన దేశ ప్రజల సంతోషాన్ని కొలవడంలో అర్థం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబంతో కలిసి సంవత్సరానికి ఎన్నిసార్లు భోజనం చేశారు? అనే ప్రశ్న అడిగితే పాశ్చాత్య దేశాలు సంతోష సూచీల్లో వెనుకబడి ఉంటాయని ప్రముఖ సినీ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (ది కాశ్మీర్ ఫైల్స్ ఫేమ్) ప్రశ్నించడం గమనార్హం. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన అభిప్రాయంతో కొందరు ఏకీభవిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. యుద్ధం చేస్తున్నా ఆనందంగానే.. కాగా ఏడాదికిపైగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రంగా దెబ్బతింది. అయినా సరే సంతోష సూచీలో మెరుగైన స్థానంలోనే ఉంది. గతేడాది 98వ స్థానంలో ఉన్న ఉక్రెయిన్ తాజా నివేదికలో 92కు చేరింది. దేశం కోసం స్వచ్ఛంద సేవ చేయడం, వివిధ రూపాల్లో రోజూ కరుణ చూపడం, తోటి ప్రజలకు సహాయం అందించడం, ఉన్నంతలో పొరుగువారికి పంచడం, ఒకరికోసం ఒకరు నిలబడటం, యుద్ధంలో గాయపడిన వారికి సేవలు చేయడం.. ఇవన్నీ ప్రజల్లో సంతృప్తస్థాయిని పెంచాయని సంతోష సూచీ రూపకర్తల్లో ఒకరైన లారా అక్నిన్ నివేదికలో పేర్కొనడం గమనార్హం. గతంతో పోలిస్తే కాస్త మెరుగుపడ్డ భారత్ ర్యాంక్ కాగా గతేడాది నివేదికలో మన దేశానికి 136వ స్థానం దక్కగా ఈ సంవత్సరం కాస్త మెరుగుపడి 126వ స్థానానికి చేరింది. సంతోషకర దేశాల జాబితాలో మన దాయాది పాకిస్తాన్ 108, ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమైన శ్రీలంక 112, బంగ్లాదేశ్ 118 స్థానాల్లో నిలిచాయి. నేపాల్ 78వ స్థానం దక్కించుకుంది. ప్రపంచంలోని అన్ని దేశాలు స్థూల జాతీయ ఉత్పత్తి(జీడీపీ) గణాంకాలను రూపొందిస్తుండగా.. గ్రాస్ నేషనల్ ఇండెక్స్ రూపొందిస్తున్న భూటాన్‌ను ప్రపంచ సంతోష సూచీలో పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. -
గాల్లో తేలినట్టుంది..నెక్ట్స్ ఏంటి? టీసీఎస్ గోపీనాథన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు అనూహ్యంగా గుడ్‌బై చెప్పిన సీఈవో గోపీనాథన్ తన నిష్క్రమణపై కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పుకోవడానికి ఇంతకంటే మంచి సమయం లేదని తాను భావించాననీ, సంతోషంగా, మనసంతా ఎంత తేలిగ్గా ఉందో చెప్పలేను..రీసెటింగ్కి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను అంటూ గోపీనాథన్ వ్యాఖ్యానించారు. పదవీకాలం ఇంకా నాలుగేళ్లు మిగిలి ఉండగానే (ఫిబ్రవరి 21, 2027 వరకు) తన పదవికి రాజీనామా చేయడం టెక్ వర్గాల్లో చర్చకు దారితీసింది. అదీ కంపెనీ చరిత్రలో ఒక సీఈవో సమయానికి ముందే తమ రాజీనామాను చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. టీసీఎస్‌లో 22 ఏళ్ల సుదీర్ఘ కరియర్‌కు గుడ్‌బై చెబుతూ గోపీనాథన్ గురువారం రాజీనామా ప్రకటించారు. సాధారణంగా సిగ్గుపడే గోపీనాథన్ శుక్రవారం ఉదయం మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏక్షణమైతే ఆసక్తిపోతుందో.. ఆక్షణమే తప్పుకోవాలి (జిస్ దిన్ మన్ ఉడ్ జాయే, ఉఎస్ దిన్ నికల్ జానే కా!) గత 48 గంటలుగా చాలా స్వేచ్ఛగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే తన భవిష్యత్తు ప్లాన్ల గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా టీసీఎస్ భవిష్యత్తు గురించి ఆలోచించి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే తన ప్లేస్లోమరొకరు ఉండటం సముచితమని భావించానన్నారు. ఈ సందర్బంగా కృతివాసన్ సామర్థ్యంపై సంతృప్తిం వ్యక్తం చేశారు. అలాగే తన రాజీనామాపై టాటా సన్స్ ఛైర్మన్, టీసీఎస్ మాజీ సీఎండీ చంద్రశేఖరన్‌తో చర్చించి, వారం క్రితమే ఈనిర్ణయం తీసుకున్నట్లు గోపీనాథన్ వివరించారు టీసీఎస్‌లో ప్రతీ నిమిషం ఆస్వాదించానని చెప్పుకొచ్చారు. కానీ కొన్నిసార్లు కీలక మైలురాళ్లను చేరుకున్నప్పుడు, ఆలోచన మొదలవుతుంది. నెక్ట్స్ ఏమిటి? అనేది కచ్చితంగా పెద్ద ట్రిగ్గర్ పాయింటే.. కానీ ప్రస్తుతానికి ఎలాంటి క్లూ లేదు అని చెప్పారు. కాగా గోపీనాథన్ రాజీనామా ఇచ్చినప్పటికీ ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు గోపీనాథన్ టీసీఎస్‌తోనే కొనసాగనున్నారు. అలాగూ కొత్త సీఈవోగా (డిజిగ్నేట్) బీఎఫ్ఎస్ఐ డివిజన్ గ్లోబల్ హెడ్‌గా ఉన్న కే కృతివాసన్‌ను నియమించినట్టు కంపెనీ ప్రకటించింది. 2001లో టాటా ఇండస్ట్రీస్ నుంచి టీసీఎస్‌లో చేరారు గోపీనాథన్ 20013లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా, 2017లో సీఎండీగా ఎంపికయ్యారు. -
పొలిటికల్ కారిడార్ : రాహుల్ గాంధీ యాత్రతో తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్సహం
-
దీపావళి 2021: శానిటైజర్లతో జాగ్రత్త! హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ!!
Safe Diwali Tips In Telugu: దేశవ్యాప్తంగా పిల్లా పాపలతో కలిసి దీపావళి సంబరాన్ని ఉత్సాహంగా జరుపుకునేందుకు సిద్ధమవు తున్నారు. కుల మత ప్రాంత విభేదాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగ దీపావళి. అయితే పలుదేశాల్లో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతున్న తరుణంలో కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముంచు కొస్తున్న కాలుష్య భూతం కోరలకు చిక్కకుండా వీలైనంతవరకు క్రాకర్స్‌కు దూరంగా ఉండాలని కనీసం పర్యావరణ హితమైన గ్రీన్‌క్రాకర్స్ మాత్రమే వినియోగించాలంటున్నారు. దీంతోపాటు చిన్నపిల్లలు వృద్ధులను దృష్టిలో ఉంచుకుని భారీ శబ్దాలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. పెంపుడు జంతువులకు కూడా పెద్ద పెద్ద శబ్దాలు హానికరం. మరీ ముఖ్యంగా టపాసులు అంటే పిల్లలకు చాలా ఇష్టం. ఉత్సాహంగా దూసుకుపోతూ వుంటారు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఆనందంగా దీపావళి జరుపు కోవచ్చు. ప్రమాదాలు లేని దీపావళి కోసం జాగ్రత్తలు పాటిద్దాం.. తద్వారా సర్వత్రా వెలుగు దివ్వెల పండుగ దీపావళి కాంతులు నింపుదాం. శానిటైజర్ల వినియోగంలో అప్రమత్తత దీపావళి పండుగలో కీలకమైన దీపాలు, కొవ్వొత్తులను వెలిగించే ముందు శానిటైజర్ల వాడకాన్ని మానుకోండి. ముఖ్యంగా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లను వాడకండి. ఎందుకంటే శానిటైజర్లు మండించే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇది తీవ్రమైన అగ్ని ప్రమాదాలకు కారణం కావచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా నీరును, పేపర్ సబ్బులు బెటర్. అలాగే దీపాలను వెలిగించే ముందు టపాసులు వెలిగించిన తరువాత చేతులు సరిగ్గా కడుక్కోవాలి. దీపావళికి తగిన దుస్తులు ఉదయం నుంచి ఎథ్నిక్ వేర్, డిజైనర్ వేర్ ఎలాంటి దుస్తులు ధరించినా పరవాలేదు కానీ, టపాసులు కాల్చే సమయంలో షిఫాన్, జార్జెట్, శాటిన్, సిల్క్ ఫ్యాబ్రిక్స్‌కు దూరంగా ఉండాలి. దీనికి బదులుగా, కాటన్ సిల్క్, కాటన్ లేదా జ్యూట్ దుస్తులను ధరించడం మంచిది. ►టపాసులు కాల్చేటప్పుడు కాస్త వదులైన మందపాటి కాటన్ దుస్తులను ధరించడం, తప్పనిసరిగా కాళ్లకు చెప్పులు ధరించడం మంచిది. ►కాకరపువ్వొత్తులు, మతాబులు, పెద్ద పెద్ద బాంబులు వంటివి కాల్చేటప్పుడు చిన్న పిల్లలకు పెద్దలెవరైనా సహాయంగా ఉండటం మంచిది. ►టపాసులు, బాంబులు వంటి పేలుడు పదార్థాలను గృహసముదాయాల వద్ద కాకుండా దూరంగా ఆరుబయట ప్రదేశంలో కాల్చడం మంచిది. ►కొన్ని రకాల టపాసులను కాల్చేసిన తర్వాత ఆవి పూర్తిగా ఆరిపోయాయో లేదు తనిఖీ చేసుకోవాలి. పిల్లలు తొందరపాటుగా వాటి సమీపానికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ►ఇంట్లో ఉన్న అందరూ రాకెట్లు, తారాజువ్వలు వంటివి కాల్చేటప్పుడు అవి ఇతరుల ఇళ్లలోకి చొరబడకుండా దిశ సరిగా ఉండేలా చూసుకోవాలి. ►దీపావళి టపాసులు కాల్చేటపుడు కళ్లకు రక్షణగా కళ్లజోడు ధరించడం కూడా చాలా మంచిది. ఈ జాగ్రత్తల విషయంలో తల్లిదండ్రులు, పెద్దలు బాధ్యతగా వ్యవహరిస్తే.. హ్యాపీ అండ్ సేఫ్ దివాలి సొంతమవుతుంది. కరోనా సమయంలో సంబంధిత మార్గదర్శకాలను పాటిస్తూ సురక్షితంగా దీపావళిని జరుపుకోవాలి. ప్రతీ ఏడాది దీపావళి తరువాత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి పెరగడం మనం చూస్తున్నాం. దీంతో శ్వాసకోశ రుగ్మతలు, సంబంధిత బాధితులు మరింత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందులోనూ ప్రస్తుత కోవిడ్-19 సమయంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, కాలుష్యమైన గాలి చాలా ప్రమాదకరమని పల్మనాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. -
సంతోషంగా ఉండటం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: సంతోషం.. మానవ జీవితంలో ఓ ముఖ్యమైన సానుకూల భావన. సంతోషంగా ఉండే వ్యక్తులు మంచి మానవ సంబంధాలు కలిగి ఉంటారు. ఇతరులతో పోల్చుకుంటే వీరికి ఎక్కువగా సామాజిక మద్దతు లభిస్తుంది. అలాగే ఆనందంగా ఉండేవారు తక్కువ ఒత్తిళ్లకు గురవుతారు. అధిక సృజనాత్మకతను, మరింత ఉదారతను కలిగి ఉంటారు. మంచి ఆరోగ్యంతో ఇతరులతో పోల్చుకుంటే ఎక్కువ కాలం జీవిస్తారని మానసిక నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు సంతోషంగా ఉన్నామనే భావనే జీవితంలో అనేక ప్రయత్నాలను, చొరవల్ని విజయపథం వైపు నడిపిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భయం, ఆందోళన, వైరాగ్యం నుంచి బయటపడి సాధ్యమైనంతగా సంతోషంతో జీవించడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు. మనుషులపై సంతోషం, సంతృప్తి, అసంతృప్తి వంటి అంశాలు చూపే ప్రభావం, వాటితో ముడిపడిన విషయాలపై సైకియాట్రిస్ట్‌లు డాక్టర్ ఎమ్మెస్ రెడ్డి, డాక్టర్ నిషాంత్ వేమన, సీనియర్ సైకాలజిస్ట్ సి.వీరేందర్‌ల వివరణ వారి మాటల్లోనే... ఆరోగ్యం, విద్య అత్యంత కీలకం ఆస్తులున్నా ఆనందంగా ఉండలేరు. అదే సమయంలో ఏమీలేని వారు కూడా ఉన్నదాంట్లోనే సంతోషంగా గడుపుతుంటారు. సంతోషంగా ఉండడానికి ఆరోగ్యం, విద్య అనేవి చాలా ప్రధానమైనవి. నెలకు రూ. కోటి సంపాదించే వారికి, నెలకు రూ.లక్ష సంపాదించే వారికి హ్యాపీనెస్లో పెద్దగా తేడాలుండవు. అత్యంత సంపన్నులుగా ఉన్న వారు సైతం ఆరోగ్యం సరిగా లేకపోతే, సరిగా నడవలేకపోతే, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలుంటే సంతోషంగా ఉండలేరు. అదే సమయంలో కుటుంబంతో, ఒక వర్గంతో, సామాజిక సంస్థలతో మంచి సంబంధాలు కలిగి ఉండేవారు ఆనందంగా ఉంటారు. సంబందిత కార్యకలాపాలు ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ ప్రస్తుతం పూర్తిస్థాయిలో సొసైటీ, ఇతరుల అంచనాలను చేరుకోకపోవడంతో అసంతృప్తి ఏర్పడుతుంది. నేటి యువతరంతో పాటు కాలేజీ విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా గడుపుతూ ఫేస్‌బుక్‌లోనో, ఇన్స్ట్రాగామ్లోనో తాము పెట్టే పోస్టులకు తగిన లైకింగ్లు రాలేదనో, తమకంటే ఇతరులు అందంగా ఉన్నారనో ఇలా అసంతృప్తికి గురవుతున్నారు. మనకు కావాల్సినవన్నీ సమకూరుతున్నా, పెద్దగా సమస్యలు లేకపోయినా ఇంకేదో కావాలని కోరుకుంటూ అది దొరకకపోతే నిరాశ, నిస్పృహలకు గురవుతున్న వారు కూడా ఉన్నారు. – డాక్టర్ నిషాంత్ వేమన, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సన్‌షైన్ ఆసుపత్రి సమాజమూ సంతోషపడేలా చేయాలి జీవితంలో ఏది ముఖ్యమనే ప్రశ్నకు సంతోషంగా ఉండడమేననే సమాధానమే వస్తుంది. ప్రపంచంలో ఎవరు కూడా నాకు ఆనందంగా ఉండడం ఇష్టం లేదని చెప్పే పరిస్థితి లేదు. ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. అయితే ఆనందం కానీ సంతోషం కాని ఎలా వస్తుందనేది ముఖ్యం. అసలు సంతోషమంటే ఏమిటి? మనసులో కలిగే ఓ మధుర భావన, ఒక కదలిక. ప్రత్యేక ఆహార పదార్థాలు, నచ్చిన సువాసనలు, అందమై దృశ్యాలు, వినసొంపైన సంగీతం, తదితరాలు మంచి అనుభూతిని కలిగించడంతో పాటు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే మనం నిర్దేశించుకున్న లక్ష్యాలు, అంచనాలు చేరుకుంటే, ఏదైనా విషయంలో విజయం సాధిస్తే అది సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే ఇవి ఒక్కొక్కరి అలవాట్లు, పద్ధతులు, ఆలోచనా ధోరణులు, పెరిగిన వాతావరణం తదితర ప్రభావాలకు అనుగుణంగా మారిపోతుంటాయి. అయితే వ్యక్తిగత స్థాయి హ్యాపీనెస్ కంటే కూడా సమూహ సమిష్టి ఆనందం ఉన్నత స్థాయిలో నిలుపుతుంది. సంతోషం, సంతృప్తి్త, ఆనందం అనేవి కేవలం మనకు మాత్రమే పరిమితం చేసుకోకుండా విశాల సమాజానికి, వర్గానికి కలిగేలా చేయడం ద్వారా జీవితానికి ఒక సార్థకత, అర్థం ఏర్పడుతుంది. అదే సమయంలో అçపరిమితమైన ఆశలు, ఆశయాలు, నెరవేర్చుకోలేని కోరికలతో సతమతమవుతుండటం కూడా మంచిది కాదు. కోరికలను నియంత్రించుకుంటే అంచనాలు తగ్గి ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. – డాక్టర్ ఎమ్మెస్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, డైరెక్డర్, ఆశా హాస్పిటల్స్ అవసరాలు పూర్తి చేసుకోవడంలోనే ఆనందం ప్రముఖ అమెరికా సైకాలజిస్ట్ అబ్రహాం మాస్లో 1970లలో చేసిన సైద్ధాంతీకరణ ప్రకారం.. మనిషి జీవితం ప్రధానంగా ఐదు ముఖ్యమైన అవసరాలను పూర్తి చేసుకోవడంలోనే ముగుస్తుంది. ఆహారం, నీళ్లు, శృంగారం, నిద్ర వంటి శారీరక అవసరాలు.. శారీరక భద్రత, ఉద్యోగ, కుటుంబం, ఆరోగ్యం, ఆస్తుల భద్రత.. ప్రేమ, తనదనే భావన, లైంగిక పరమైన దగ్గరితనం.. ఆత్మగౌరవం, విశ్వాసం, ఇతరులను గౌరవించడం.. స్వీయ వాస్తవికత (సెల్ఫ్ యాక్చువలైజేషన్), నైతికత..వీటిలోనే సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే అంశాలు ముడివడి ఉన్నట్టుగా మాస్లో సూత్రీకరించాడు. ప్రపంచంలో అత్యధిక శాతం మంది శారీరకంగా ఆకలి, సెక్స్, ఆహారం తదితరాల లభ్యతకు సంబంధించిన అవకాశాలు, సామాజికంగా తెలిసిన వారితో ప్రేమ, స్నేహసంబంధాలు, బంధుత్వాలు ఏర్పాటు చేసుకోవడం వంటి వాటి సాధనతోనే సంతోషపడి సంతృప్తి పడతారు. ఎప్పుడైతే ఈ రెండు తీరతాయో అప్పుడు ఒక వర్గానికో, ఒక గ్రూపుకో నాయకత్వం వహించాలని కోరుకుంటారు. లీడర్‌గా ఒకస్థాయికి చేరుకున్నాక ఇతరులకు మంచిచేయడం, ఇతరుల కోసం కృషి చేయడంలో సంతోషం, ఆనందం పొందడం జరుగుతుంది. ప్రస్తుత సమాజం చాలా వేగంగా మారడం, ఇందులో.. అందంగా కనిపించేందుకు ఎక్కువగా ప్రయత్నం, ఆలోచించగలగడం వంటివి జరుగుతున్నాయి. అందువల్లే తమ ముందుతరంతో పోల్చితే యంగర్ జనరేషన్ తెలివిగా, నూతనంగా ఆలోచిస్తుంటుంది. కొత్త పోకడలతో సృజనాత్మకంగా ఆలోచించే ప్రయత్నం చేస్తుంటుంది. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ చదవండి: Fathers Day: నాన్న ఎవ్రీడే వారియర్.. -
ఆ ఆహారంతో నిత్యం సంతోషం..
న్యూఢిల్లీ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రజలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయితే ఒత్తిడిని ఎదుర్కొవడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. మనం ప్రోబయోటిక్స్ ఆహారం(మంచి బ్యాక్టేరియా) తీసుకుంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉండవచ్చు. ప్రోబయోటిక్స్ ఆహారం కావాలంటే కొద్దిసేపు పులవడానికి అవకాశమున్న ఇడ్లీపిండి, దోసెపిండి, మజ్జిగ వంటి వాటిల్లో మన జీర్ణవ్యవస్థకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియానే మనం ప్రోబయోటిక్స్ అని పిలుస్తాం. హార్వర్డ్ విశ్వవిద్యాలయ నిపుణుల ప్రకారం డయెరియా, మలమద్దకం తదితర సమస్యలను ప్రోబయోటిక్స్‌తో ఎదుర్కోవచ్చని సూచిస్తున్నారు. ప్రోబయోటిక్స్‌తో ఆనందంగా ఎలా ఉండగలం ఆనందంగా ఉండడానికి ప్రోబయోటిక్స్ ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని పోషకాహార నిపుణులు డాక్టర్ అనుజా గౌర్ తెలిపారు. అయితే ఓ చిన్న ఉదాహరణతో ఆమె విశ్లేషించారు. కాగా డిప్రెషన్, మానసిక ఒత్తిడితో బాధపడేవారికి డాక్టర్లు స్వాంతన కలిగించే మందులు సూచిస్తుంటారు. అదేవిధంగా ప్రోబయోటిక్స్‌తో మానసిక సమస్యలకు చెక్ పెట్టవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే ఎక్కువగా పాలు సంబంధించిన పదార్ధాలలో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా లభిస్తుంది. సానుకూల ఆలోచనలు మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదని, అలాకాకుండా ఎదైనా సమస్యుంటే కావాల్సిన శక్తి అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలి. అయితే ప్రోబయోటిక్స్ ఆహారం తీసుకుంటే సానుకూల ఆలోచనలతో పాటు సంతోషంగా ఉండవచ్చు -
యువత అభిరుచులపై సర్వే
న్యూఢిల్లీ: పాశ్చాత్య యువత, దేశీయ యువతకు సంబంధించిన అభిరుచులపై మింట్(మీడియా సంస్థ), సీపీఆర్(సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్) సంయుక్తంగా సర్వే నిర్వహించింది. అమెరికా యువత ఎక్కువ అప్పులు, తక్కువ ఆదాయాలు, తక్కువ ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలిపింది. కాగా భారతీయ యువత మాత్రం తమ తల్లిదండ్రుల కంటే మెరుగైన జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. సర్వేలో పాల్గొన్న పదిలో ఎనిమిది మంది భారతీయులు తమ తల్లిదండ్రుల కంటే మెరుగ్గా ఉన్నామని తెలిపారు. ప్రపంచీకరణ నేపథ్యంలో భారతీయ యువతకు అత్యున్నత ఉద్యోగాలు లభించాయని.. అనుబంధాల విషయంలోను తమ తల్లిదండ్రుల కంటే మెరుగైన స్థితిలో ఉన్నట్లు పేర్కొన్నారు. మింట్-సీపీఆర్ మిలీనియల్ సర్వేను ఆన్లైన్లో 2020, మార్చి12 నుంచి ఏప్రిల్ 2 మధ్య 184 పట్టణాలు, నగరాల్లో నిర్వహించారు. ఈ సర్వేలో 10,005 మంది పాల్గొన్నారు. వీరిలో 4,957 మంది మిలీనియల్స్(22నుంచి 37సంవత్సరాలు), 2,983 మంది పోస్ట్ మిలీనిలయల్స్(1996 సంవత్సరం తరువాత జన్మించిన వారు) 2,065 ప్రీ-మిలీనియల్స్(40సంవత్సరాల వయస్సు పైబడిన వారు) పాల్గొన్నారు. దేశీయ యువత ఎక్కువగా ఇతర నగరాలు, విదేశాలకు వెల్లడానికి మొగ్గు చూపారని సర్వే పేర్కొంది. కాగా, లక్షకుపైగా జీతాన్ని సంపాదిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న మెజారిటీ యువత తెలిపారు. భారతీయ యువత ఎక్కువగా సొంతింటి బదులు అద్ది ఇంటేకే ప్రాధాన్యత ఇస్తున్నారని.. ఆర్థికంగా మెరుగయ్యాకే సొంతింటి కళ గురించి ఆలోచిస్తామని మెజారిటీ యువత పేర్కొన్నారు.(చదవండి: ‘భారత్‌లో మతస్వేచ్ఛ.. ఆందోళనకరం’) -
ఆర్టీసీ విలీనంపై కార్మికుల హర్షం
-
విలీనానందం
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేరబోతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకారం తెలిపారు. ఇకపై ఆర్టీసీ ఉద్యోగులు అంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి అధ్యక్షతన నియమించిన కమిటీ.. తన నివేదికను సీఎం జగన్‌కు అందజేసిం ది. నిపుణుల కమి టీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఆర్టీసీ లో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చాలని నిర్ణయించారు. ముఖ్య మంత్రి జగన్ బుధవారం అధికారికంగా ఆర్టీసీ విలీనాన్ని ప్రకటిస్తుండడంతో కార్మికసంఘాలు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. రాష్ట్ర విభజన సమయంలో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయింది. నష్టాల్లోంచి గట్టెక్కాలంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని నాటి నాటి ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు పద్మాకర్ సూచించారు. నాటి నుంచి ఈ విషయంలో కార్మిక వర్గాలు పోరాడుతూనే ఉన్నాయి. సంకల్ప యాత్రలో భాగంగా ఈ సమస్యను వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాం. సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసి, మూడు నెలల్లోనే విలీనం చేస్తామన్నారు. అనుకున్నట్టే హామీ నిలబెట్టుకుంటున్నారు. ఆయన రుణం ఎప్పటికీ మర్చిపోం. – కేజే శుభాకర్, రాష్ట్ర కార్యదర్శి, ఎంప్లాయిస్ యూనియన్ సీఎం నిర్ణయం అభినందనీయం.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సాహోసపేత నిర్ణయంపై కార్మిక వర్గాల్లో ఆనందం ఉప్పొంగుతోంది. ఆయనకు మేమంతా రుణపడి ఉంటాం. – అల్లు సురేష్‌నాయుడు, రీజనల్ కార్యదర్శి, విశాఖ రీజియన్ సాహసోపేత నిర్ణయం.. ఏపీఎస్ ఆర్టీసీని కార్పొరేషన్ స్థాయి నుంచి ప్రభుత్వంలోనే విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి యావత్ ఆర్టీసీ కార్మిక వర్గం రుణపడి ఉంటుంది. విశాఖ రీజనల్ పరిధిలోనే గాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, రీజనల్ పరిధిల్లో నష్టాలను, ఆస్తులను గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు అధ్యయనం చేసినా ఆచరణలో విఫలమయ్యాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంకాగానే ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు సాహసోపేత నిర్ణయం తీసుకోవడంతో మా చిరకాల కోరిక నెరవేరబోతోంది. విలీనం కోసం ఎన్ఎంయూ చాలా ఏళ్లుగా కృషి చేస్తోంది. జగన్మోహన్రెడ్డి ఉద్యోగుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు అందరిలో హర్షం వ్యక్తమవుతోంది. – ఏకే శివాజి, అర్బన్ డివిజన్ కార్యదర్శి, నేషనల్ మజ్దూర్ యూనియన్ శుభపరిణామం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం శుభపరిణామం. గతంలో ఏ ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకోలేకపోయాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు ఆర్టీసీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. విలీనం కారణంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు పలు ప్రయోజనాలు చేకూరతాయి. – జీపీ రావు, ప్రచార కార్యదర్శి, వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ జగన్‌కు రుణపడి ఉంటాం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ మంగళవారం సాయంత్రం పలు టీవీ చానల్లో వస్తున్న స్క్రోలింగ్ చూసి ఎంతో సంబరపడ్డాను. కేబినెట్ తొలి సమావేశంలోనే ఆర్టీసీపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీ వేయడం. ఆ కమిటీ మూడు నెలల్లోనే నివేదికను ప్రభుత్వానికి అందజేయడం, ఆపై జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవడం ప్రతి కార్మికుడు, ఉద్యోగి సంతోషపడ్డ విషయమే. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులే. ప్రతి కార్మికుడు, ఉద్యోగి జగన్‌కు రుణపడి ఉంటాం. – బి.అరుణ రాజేశ్వరి, ఆర్టీసీ ఉద్యోగి, మధురవాడ మా కల నిజమవుతోంది.. ఎప్పుడూ నష్టాల పేరిట మా శ్రమను దోచుకున్న పరిస్థితి నుంచి ప్రభుత్వ హయాంలో పనిచేయడం వింటుంటే కలా..నిజమా అనిపిస్తోంది. మా కలను ముఖ్యమంత్రి నెరవేర్చారు. కొండంత అప్పుల్లో మునిగి ఉన్న ఆర్టీసీ ఈ రోజు జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ప్రగతిబాటలో నడవడం ఖాయం. మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులమనే ఫీలింగ్ గొప్పగా ఉంది. పాదయాత్రలో జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు. – కేఎస్ఎస్ మూర్తి, సహాయ కార్యదర్శి, విశాఖ రీజియన్ -
ప్రేమలో పడితే...
సాక్షి, హైదరాబాద్: ప్రేమలో పడటం, ప్రేమలో ఉండటం ఓ అందమైన అనుభూతి. ప్రేమను ఇవ్వడంలో, ప్రేమను పొందడంలో ఉండే ఆనందం ప్రేమికులకు మాత్రమే తెలుస్తుంది. అతడు లేదా ఆమె ప్రేమలో పడితే వారి జీవితంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయని తాజాగా చేసిన ఓ సర్వేలో వెల్లడయింది. ఆనందంగా ఉంటారు... కిన్సే ఇన్స్టిట్యూట్ వారు జరిపిన ఓ అధ్యయనం ప్రకారం, ప్రేమలో ఉన్న వారి స్థితి కొకైన్ తీసుకున్నవారిలాగే ఉంటుందని తేలింది. అధిక శాతంలో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ కావడమే దీనికి కారణమని వారు అభిప్రాయపడ్డారు. డోపమైన్ విడుదలతో ప్రేమలో ఉన్నవారు, ప్రేమలో లేని వారికంటే అధిక ఆనందంగా ఉంటారు. పార్టనర్నీ ఆనందంగా ఉంచుతారు... షేరింగ్ ఈజ్ కేరింగ్ అనే సామెతను అనుసరించి తమ పార్ట్నర్ని కూడా ఆనందంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. తాము ఆనందంగా ఉన్నామన్న విషయాన్ని భాగస్వామితో పంచుకోవడానికి ప్రయత్నిస్తారు. వారిని ఆనందంగా ఉంచాలన్న ఆలోచన వల్ల ఎక్కువగా వారి గురించే ఆలోచిస్తూ మరింత సంతోషాన్ని పొందుతారు. ఒత్తిడి తగ్గుతుంది... స్టాన్ఫోర్డ్ మెడికల్ యూనివర్సిటీ వారు చేసిన అధ్యయనం ప్రకారం ప్రేమలో ఉన్నవారు ఎక్కువ నొప్పిని, ఒత్తిడిని భరించగలరు. అంటే ప్రేమలో లేనప్పటికంటే, ప్రేమలో పడ్డాక తమ విషయాలను షేర్ చేసుకునే వారు దొరకడంతో కష్టాలను పంచుకోవడం ద్వారా నొప్పిని తగ్గించుకోగలరు. గుండె వేగం మారుతుంది... కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు చేసిన అధ్యయనం ప్రేమలో పడ్డాక ఇద్దరి గుండె వేగాలు ఒకేలా మారతాయని తెలిపింది. ఇది కేవలం వేగానికే పరిమితం కాకుండా, కొంత కాలం గడిచేసరికి ఇద్దరి అభిరుచులు సైతం ఒకేలా మారతాయి. ప్రయోగాత్మకంగా మారతారు.. ప్రేమలో పడ్డాక తమను తాము మార్చుకోవడానికి ప్రేరణ పొందుతారు. గతంలో లేని అలవాట్లను కొత్తగా ప్రారంభిస్తారు. కొత్త హెయిర్ స్టైల్స్‌ను, కొత్త ఆహార్యాన్ని అలవర్చుకుంటారు. తమ శరీర సౌష్ఠవం మీదా, మెదిలే తీరు మీదా కసరత్తులు చేసి హుందాగా తయారవుతారు. మీరు ప్రేమలో పడ్డారా ? పడ్డాక మీలో ఏమైనా మార్పులు కనిపించాయా ? బాగా పరిశీలించుకోండి మరి. -
ఆహహ్హహారం
బాధ అన్నది ఆకలైతే ఫుడ్ అన్నది ఆనందం ఇస్తుంది. ఆనందం అన్నది దుఃఖం లాగే మన శరీరంలో కలిగే ఒక రసాయనిక చర్య. మనం ఆనందంగా ఉండాలనుకుంటే పాజిటివ్‌గా ఉండాలనుకుంటే సంతోష రసాయనాలు స్రవిస్తాయి. సో... ఆనందం అన్నది మన చేతుల్లోనే ఉంది. ఏదీ... చెయ్యి చాపండి ఒక హ్యాపీ పీస్ అందుకోండి. సంతోషం సగం బలం మాత్రమే కాదు... ఇప్పుడు సంతోషం సంపూర్ణ బలం. ఈ రోజుల్లో రకరకాల ఆర్థిక, సామాజిక కారణాలతో సంతోషం దొరకడం చాలా కష్టమైపోతోంది. పైగా న్యూ ఇయర్ వచ్చి జస్ట్ నాలుగు రోజులే. మిగిలిన 360 రోజులూ... ఆపైన బతికి ఉన్న మిగతా రోజుల్లోనూ కావాల్సింది కూడా సంతోషమే. అప్పుడు బతుకు ఆనందమానందమానందమే అనిపిస్తుంది. మరి అలాంటి ఆనందం పొందేదెలా? చాలా సింపుల్. ఈ కథనం చదివితే చాలు. ఆనందం అనేది మరెక్కడో లేదు. మన మెదడులోనే ఉంటుంది. ఇదేదో వ్యక్తిత్వ వికాస ఉపన్యాసంలోని గంభీరమైన మాటో లేదా ఆధ్యాత్మిక ప్రవచనంలోని బ్రహ్మాండమైన వాక్యమో కాదు. అవును ఆనందం అన్నది అక్షరాలా మన మెదడులోనే ఉంటుంది. అక్కడ కొన్ని స్రావాలు రూపంలో సంతోషం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ స్రావాల ఊరుతూ, పెరుగుతున్నకొద్దీ సంతోషం కట్టలు తెంచుకుంటుంది. సంతోషాన్ని కలిగించే ఆ మెదడు స్రావాల్లో కొన్ని సెరిటోనిన్, ఎండార్ఫిన్, డోపమైన్, ఫినైల్ ఇథిలమైన్ అనే రసాయనాలు. అవి స్రవించడానికి దోహదపడేవి మనం దాదాపుగా రోజూ తీసుకునే ఆహార పదార్థాలు. అవేమిటో తెలుసుకుంటే సంతోషాన్ని హ్యాపీగా కొనుగోలు చేయవచ్చు కదా. అవేమిటో ఎక్కడ దొరుకుతాయో చూద్దాం. ఆనందాన్ని ఇచ్చే ఈ ఆహారాలన్నీ కేవలం సంతోషం కోసం మాత్రమే గాక పక్షవాతం, గుండెపోటు, మతిమరపు (డిమెన్షియా) వచ్చే ముప్పును 30 శాతానికి పైగా తగ్గిస్తాయని అనేక అధ్యయనాల్లో తేలింది. ఎండార్ఫిన్ ప్రధాన సోర్స్ పాయింట్ వ్యాయామం. మనం బాగా వ్యాయమం చేశాక మనలో ఒక సంతోషం నెలకొన్న భావన కలుగుతుంది. సాధారణంగా వ్యాయామం చేసే వాళ్లు, అంతా పూర్తయ్యాక ఒక తృప్తికరమైన, సంతోషకరమైన ఫీలింగ్‌లోనే ఉంటారు. అలా అనుభూతి కలిగించేది ఈ ఎండార్ఫినే! ఈ రకంగా చూస్తే సంతోషానికి మరో సోర్స్ ఎండార్ఫిన్ రూపంలో ప్రధానంగా జిమ్‌లో ఉంటుందన్నమాట. ఒక సంతోష స్రావం సెరిటోనిన్ పొద్దున్నే గిన్నెలో కాచీ కాచగానే... జాయ్ అనేది చాయ్ రూపంలోనో లేదా కాఫీ అనే మారువేషంలోనో మొదట గ్లాసులోకి జర్రున జారుతుంది. తర్వాత చుర్రున కాలుతూ నోట్లోకి చేరుతుంది. అక్కణ్నుంచి మెల్లగా హాయిగా గొంతులోకి దిగుతుంది. దాంతో మెదడులో సంతోషం సర్రున పారుతుంది. అది పాల రూపంలో. దీనికి సోర్స్ పాయింట్ మన పాలపార్లర్లు. ఇక మన కాలనీలోకి వచ్చే తోపుడు బండి మీద కూడా సంతోషం గుట్టలు గుట్టలుగా పేర్చి ఉంటుంది పైనాపిల్ రూపంలో! అరటిపండ్ల రూపంలో గెలలుగా వేలాడుతూనూ ఉంటుంది. ఎలాగంటారా? ఈ అన్నిట్లో సెరిటోనిన్ ఉంటుంది. ఏంటా సెరిటోనిన్... ఏమా కథ: మనకు సంతోష భావనను ఇచ్చే రసాయనాల్లో ముఖ్యమైనది సెరిటోనిన్. అందుకే దీన్ని ‘హ్యాపీనెస్ హార్మోన్’ అని కూడా అంటారు. ఎక్కడెక్కడ దొరుకుతుంది: పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. అది సెరిటోనిన్ స్రావం పెరిగేలా చేస్తుంది. ద్రాక్ష, నారింజల్లోనూ ట్రిప్టోఫాన్ ఎక్కువే. వెన్నలో, విటమిన్ బి6 లభించే పొట్టుతో ఉండే ఆహారధాన్యాలు, బఠాణీలు, కాలీఫ్లవర్, అవకాడోలో, గుమ్మడిగింజల్లో సెరిటోనిన్ పుష్కలంగా ఉంటుంది. ఉచితంగా ప్రతిరోజూ ప్రతి ఒక్కరికీ సెరిటోనిన్ లభించే మార్గం సూర్మరశ్మి. ఎక్కువగా నవ్వేవాళ్లలో సెరిటోనిన్ అధికంగా విడుదలవుతుంది. ఇక కాలేయం, కిడ్నీ, తాజామాంసం, కోడిమాంసంతో పాటు ఇటు క్యాబేజీ, బ్రకోలీ వంటివి కూడా సెరిటోనిన్ స్రవించేందుకు దోహదపడతాయి. ఇక ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే అవకాడో, వాల్‌నట్లూ సెరిటోనిన్కు సోర్స్లే. ఇంకో సంతోష స్రావం డోపమైన్ మీరు చాలాకాలం తర్వాత కలిసిన ఆ ఫ్రెండ్‌ను చూసి ఆనందోద్వేగాలకు లోనవుతున్నారా? దానికి కారణం మన మెదడులో స్రవించే డోపమైన్. ఏమిటా డోపమైన్ : ఇది మన మెదడు చురుగ్గా ఉంచేలా చేసే రసాయనం. ఏదైనా సంతోషం కలిగినప్పుడు దాంతోపాటు మనలోకి ప్రవేశించే ఆ చురుకుదనానికి కారణం డోపమైన్. అలాగే ఏదైనా వేదన లేదా బాధ కలిగించే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోడానికి తగిన చురుకుదనాన్ని ఇచ్చేది కూడా ఇదే. ఎక్కడెక్కడ దొరుకుతుంది: ఇది కూడా అరటిపండ్ల బండి మీదే దొరుకుతుంది! పక్వానికి వచ్చిన అరటిపండులో టైరోసిన్ అనే అమైనో యాసిడ్ పాళ్లు ఎక్కువ. ఈ అమైనోఆసిడ్... డోపమైన్ రసాయనాన్ని స్రవించేలా చేస్తుంది. బీట్రూట్ డోపమైన్‌తో పాటు సెరిటోనిన్నూ స్రవించేలా చేస్తుంది. నువ్వులు, స్ట్రాబెర్రీలలో టైరోసిస్ చాలాఎక్కువ కావడంతో ఇవీ డోపమైన్‌ను విడుదలయ్యేలా చేస్తాయి. తాజా చికెన్ కూడా నార్ఎపీనెఫ్రిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్తో పాటు డోపమైన్ స్రావానికి దోహదపడుతుంది. వెన్నలోని ప్రొటీన్‌లో ఉండే అమైనో ఆసిడ్స్ సైతం డోపమైన్‌ను స్రవించేలా చేస్తాయి. వెజిటేరియన్లను మినహాయిస్తే నాన్–వెజ్ ప్రియులకు ఇది మాంసం దుకాణాల్లోనూ, పెద్ద పెద్ద మాల్స్‌లోని నాన్–వెజ్ ఆహారాలు విక్రయించే కార్నర్లోనూ దొరుకుతుంది. ఎందుకంటే ఇది మాంసాహారం, గుడ్లు, చేపలు, సీఫుడ్స్‌లో ఉంటుంది. మరో ఆనంద స్రావం ఎండార్ఫిన్ సపోజ్... ఏదో సమస్య మీలో బోల్డంత ఒత్తిడి కలుగుతూ మీకు బాధ కలిగిస్తోందనుకుందాం. అకస్మాత్తుగా ఒక పరిష్కారం దొరికి ఆ ఒత్తిడంతా తొలగిపోయినప్పుడు కలిగే సంతోషాన్ని గుర్తుతెచ్చుకోండి. హాౖయెన ఆ భావన కలగజేసే రసాయనమే ఎండార్ఫిన్. మనలో ఒత్తిడి కొండలా పేరుకుపోయిన ఉన్నప్పుడు ఆ గుట్టను పక్కకు తీసిన భావననిస్తూ మనలో యాంగై్జటీని తొలగించే రసాయనం ఇది. దాంతో ఇది స్రవించినప్పుడు మనలో ఒక ‘ఫీల్ గుడ్’ భావన కలుగుతుంది. ఏదైనా నొప్పి కలిగినప్పుడు దాని నుంచి ఉపశమనం కలగడానికి దోహదం చేసేది ఎండార్ఫినే. ఎక్కడెక్కడ దొరుకుతుంది: నిజానికి ఎండార్ఫిన్ ప్రధానంగా లభించేది వ్యాయామంతోనే. అయితే వ్యాయామం తర్వాత ఆహారాల్లో చూస్తే దాని ప్రధాన వనరు చాక్లేట్లు. ఆ తర్వాత విటమిన్–సి ఎక్కువగా ఉండే స్ట్రాబెర్రీస్ ఎండార్ఫిన్ స్రావానికి బాగా ఉపయోగపడతాయి. ఇక తియ్యటి ద్రాక్షలో కూడా ఎండార్ఫిన్స్ స్రవించేలా చేసే సామర్థ్యం ఉంది. విటమిన్–సి ఎక్కువగా ఉండే నారింజ, నిమ్మ జాతి పండ్లు సైతం ఎండార్ఫిన్స్‌ను ఎక్కువగా స్రవించేలా చేయగలవు. ఒక్కమాట గుర్తుంచుకోవాలి. ఎండార్ఫిన్ స్రవించాలంటే విటమిన్–సి కావాలి. కాబట్టి నిమ్మజాతి పండ్లు తింటే ఎండార్ఫిన్‌ను తీసుకున్నట్లే. ఇలా చాక్లెట్ల దుకాణంతో పాటు మళ్లీ పండ్ల బండిపైనే ఎండార్ఫిన్ పుష్కలంగా దొరుకుతుంది. మరో సంతోష రసాయనం ఫినైల్ ఇథిలమైన్ : మీ ఆత్మీయులను చూడగానే మీ ముఖం ఆనందంతో ఎందుకు వికసిస్తుంది? మీలో చాలా ఉల్లాసపూరితమైన సంతోషభావన ఎందుకు కలుగుతుంది? ఇందుకు కారణం ‘ఫినైల్ ఇథిలమైన్’ అనే మరో మెదడు రసాయనం. ఎక్కడెక్కడ దొరుకుతుంది: చాక్లెట్ అనేది ఒక సంతోషసాగరం. చాలా ఆనందాలకు చాక్లెట్ మూలం. అలాగే ఫినైల్ ఇథమైన్కు కూడా ప్రధాన వనరు చాకోలెటే. అందుకేనేమో... కొత్తగా ఫ్రెండ్షిప్ ఏర్పడినప్పుడు చాకోలెట్స్ ఇచ్చిపుచ్చుకుంటారు. చాకోలెట్‌లో ఉండే ఫినైల్ ఎథిలమైన్ మూడ్స్‌ను చక్కదిద్దుతుంది. మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది. అందులోని కెఫిన్ మనసును ఉత్తేజ పరుస్తుంది. అలాగే న్యూరోట్రాన్స్మిటర్ అయిన సెరిటోనిన్ను కూడా చాకోలెట్ స్రవింపజేస్తుంది. డార్క్ చాక్లెట్స్ వల్ల ఈ ప్రయోజనాలు ఒనగూరుతాయి. అలాగే విషాదాహారాలూ ఉన్నాయి. అవి ఇవే... సంతోషాలను ఇచ్చే ఆహారాల్లాగే విషాదాలను కలగజేసే ఆహారాలూ ఉంటాయి. అవి సెరిటోనిన్, డోపమైన్, ఎండార్ఫిన్ స్రావాల్ని తగ్గిస్తాయి. అవేమిటో చూద్దాం. కాఫీ మొదట్లో కాస్తంత ఉత్తేజం కలిగించినా అందులోని మితిమీరిన కెఫిన్ క్లేశాన్ని కలిగిస్తుంది. సిగరెట్‌లోని నికోటిన్. ఆల్కహాల్‌లు కూడా అంటే. నిషేధిత మాదకద్రవ్యాలైతే అకస్మాత్తుగా సెరిటోనిన్, డోపమైన్, ఎండార్ఫిన్ పాళ్లను మొదట ఎక్కువయ్యేలా చేసి, ఆ తర్వాత అవి ఎంత మోతాదులో విడుదల కావాలో అంత మోతాదులో కాకుండా... నియంత్రణ లోపించినట్లుగా విడుదలయ్యేలా చేస్తాయి. దాంతో ఆయా రసాయనాల మధ్య ఉండాల్సిన సమతౌల్యం లోపిస్తుంది. అందుకే ఇవన్నీ తొలుత తాత్కాలికంగా ఆహ్లాదం కలిగించినా... తీవ్రమైన విచారంలో ముంచి, తర్వాత ఆరోగ్యానికీ హాని చేస్తాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లోని మోనోసోడియమ్ గ్లుటామేట్, ఐస్‌క్రీమ్స్, డోనట్స్, ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్, వైట్బ్రెడ్లు విషాదం కలిగించే ఆహారాలే. డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి సీనియర్ న్యూరోఫిజీషియన్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12 బంజారాహిల్స్, హైదరాబాద్ -
హీరోయిన్ చాన్స్ రావటం ఆనందం..!
కొడవలూరు: నెల్లూరులో 2015 లో జరిగిన మిస్ నెల్లూరు పోటీల్లో విజేతగా నిలిచానని.. అదే తనకు సీబీఐ వర్సెస్ లవర్స్ సిని మాలో హీరోయిన్ చాన్స్ దక్కేలా చేసిందని హీరోయిన్ శ్రావణి నిక్కీ తెలిపారు. మొత్తం నెల్లూరుకు చెందిన వారే ‘సీబీఐ వర్సెస్ లవర్స్’ అనే సినిమాను తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నార్తురాజుపాలెంలోని శ్రీవెంకటేశ్వర కళాశాలలో జరుగుతోంది. ఈ సందర్భంగా మంగళవారం ‘సాక్షి’తో ముచ్చటించారు శ్రావణి నిక్కీ. మిస్ నెల్లూరుగా ఎంపికైన సందర్భంలో కళాకారులను ప్రోత్సహించే అమరావతి కృష్ణారెడి సహకారంతో సినిమా హీరోయిన్గా చాన్స్ దక్కిందని చెప్పారు. 2015 లోనే మిస్ ఏపీ పోటీల్లో ఫైనల్స్ వరకు వచ్చినట్లు తెలిపారు. 3 వేల మంది పాల్గొన్న ఆ పోటీల్లో 15 మంది ఫైనల్స్‌కు చేరగా.. అందులో తానూ ఒకరినని పేర్కొన్నారు. నెల్లూరు కృష్ణ చైతన్య కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న తనకు సినిమా రంగంపై ఎంతో ఆసక్తి ఉందన్నారు. అవకాశాలు వస్తే సినిమా రంగంలోనే కొనసాగాలన్నది తన లక్ష్యమని చెప్పారు. నెల్లూరుకు చెందిన తారాగణం, సాంకేతిక బృందంతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ చాన్స్ దక్కడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. మొత్తం చిత్ర బృందం నెల్లూరు వాళ్లే అయ్యి తీస్తున్న ఈ సినిమాకు దర్శకుడు హరిప్రసాద్‌రెడ్డి, హీరో వంశీ తదితరులు నటిస్తున్నారు. -
అలాంటివాళ్లంటే అసహ్యం
పదిహేనేళ్ల కెరీర్.. 34ఏళ్ల వయసు... మామూలుగా అయితే చాలామంది కథానాయికలు ఈపాటికి రిటైర్ అయిపోతారు. కానీ, త్రిషలాంటి తారలు మాత్రం జోరుగా దూసుకెళ్లగలుగుతారు. ప్రస్తుతం ఈ చెన్నై బ్యూటీ చేతిలో అరడజను సినిమాలున్నాయి. హ్యాపీగా ఉండటానికి ఇంతకన్నా ఏం కావాలి? అంటున్నారు త్రిష. ఇంకా బోలెడన్ని విషయాలు చెప్పారు. ► కథానాయికగా మీ ఇన్నేళ్ల సక్సెస్‌కు కారణం? నా అభిమానులు, మంచి స్క్రిప్ట్స్, దర్శకులు నా మీద పెట్టుకున్న నమ్మకం. ► ఇన్నేళ్ల కెరీర్లో ఎదురైన అత్యంత కష్టమైన సంఘటన? వరుసగా 120 రోజులు వర్షంలో షూటింగ్ జరిపాం. అప్పుడు ఇబ్బంది పడ్డాను. ► రెమ్యునరేషన్, స్క్రిప్ట్, హీరో.. సినిమా సైన్ చేయడానికి మీ ప్రాధాన్యం? స్క్రిప్ట్, స్టార్ క్యాస్ట్, రెమ్యునరేషన్... ఇది ఆర్డర్. ► ఫెయిల్యూర్ నుంచి బయటపడటానికి ఏం చేస్తారు? ఆత్మపరిశీలన చేసుకుని మరింత కష్టపడేలా ప్లాన్ చేసుకుంటాను. ► జీవితంలో మీరు గర్వంగా ఫీలైన సందర్భం? నంది, ఎన్డీటీవీ అవార్డ్స్ తీసుకున్నప్పుడు. ► ఎలాంటి వ్యక్తులను ఇష్టపడతారు? హుందాగా ఉండేవాళ్లంటే ఇష్టం. కపటవేషగాళ్లు, అవసరానికి వాడుకుని వదిలేసేవాళ్లంటే పరమ అసహ్యం. ► వన్‌సైడ్ లవ్ గురించి చెబుతారా? వన్ సైడ్ లవ్వా.. దాని గురించి నేను చెప్పలేను. ఎందుకంటే నేనెప్పుడూ వన్ సైడ్ లవ్ చేయలేదు. ► వయసులో పెద్ద అమ్మాయి చిన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవడంపై మీ అభిప్రాయం? వాళ్ల మనస్తత్వాలు కలిసి, అన్నీ పర్ఫెక్ట్గా కుదిరితే ఓకే. బాగానే ఉంటుంది. ► చెన్నైలో మీ ఫేవరెట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్? మై హోమ్ థియేటర్. ► మీ ఫేవరెట్ వర్కవుట్స్? బాక్సింగ్, యోగా. ► సమస్యలను ఎదుర్కోలేనప్పుడు ఏం చేస్తారు? మా అమ్మగారి సహాయం తీసుకుంటా. -
నందమూరు పాత అక్విడెక్ట్ తొలగింపు
తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెం మండలంలోని ఎర్ర కాలువ ముంపు రైతులకు శుభతరుణం మొదలైంది. ఏళ్ల కాలంగా ఈ రైతాంగాన్ని పట్టిపీడిస్తున్న నందమూరు పాత అక్విడెక్ట్ తొలగింపు పనులు గురువారం రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో జగన్నాథపురం, మారంపల్లి, అప్పారావుపేట, మాధవరం, వీరంపాలెం తదితర గ్రామాల్లో 326 హెక్టార్లలోని బాడవా రైతాంగానికి ముంపు సమస్య తీరనున్నది. కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ అధికారులు ఈ పనులు చేపట్టారు. శుక్రవారం కూడా పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఎంతో మంది ప్రజాప్రతినిధులు వచ్చినా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. ఎట్టకేలకు రైతులే రంగంలోకి దిగి ఉద్యమ బాట పట్టడంతో అధికార యంత్రాంగం దిగివచ్చింది. ఫలించిన రైతుల ఆందోళన సార్వాలో కురిసిన వర్షాలకు జగన్నాథపురం, మారంపల్లి, అప్పారావుపేట, మాధవరం వీరంపాలెం గ్రామాల ఆయకట్టులోని పంట భూములు నీటమునిగాయి. దీంతో గత ఏడాది సెప్టెంబరు 23వ తేదీన ఆయకట్టు బాడవ రైతులు నందమూరు అక్విడెక్ట్ వద్ద ఆందోళన చేపట్టారు. అధికార యంత్రాంగం స్పందించకపోతే తామే పాత అక్విడెక్ట్‌ను కూల్చివేస్తామని హెచ్చరించారు. దీంతో పోలీస్ పహారా కూడా ఏర్పాటు చేశారు. ఎట ్టకేలకు దిగివచ్చిన అధికార యంత్రాంగం అప్పట్లో పాత అక్విడెక్ట్ వద్ద గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టారు. ఈ నేపథ్యం లోనే పాత అక్విడెక్ట్‌ను తొలగిస్తామని ఇరిగేషన్ అధికారులు వాగ్దానం చేశారు. పాత అక్విడెక్ట్ పనులను శుక్రవారం చేపట్టారు. దీంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
‘బీసీ’ బిల్లు ప్రవేశపెట్టడంపై సీఎం హర్షం
సాక్షి, హైదరాబాద్: జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించడానికి వీలుగా పార్లమెంటులో బిల్లు (రాజ్యాంగ సవరణ బిల్లు) ప్రవేశపెట్టడంపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించడం ప్రగతిశీల చర్యగా అభివర్ణించిన సీఎం.. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు పలుకు తుందని స్పష్టం చేశారు. బిల్లుకు అనుకూలంగా ఓటేయడంతోపాటు తెలంగాణ తరఫున మద్దతుగా నిలవాలని తమ పార్టీ ఎంపీలను కోరారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాదిరిగానే బీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించడం వల్ల దేశంలోని ఇతర వెనుకబడిన తరగతులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. -
కళాకారుల ఆశాసౌదం యంగ్మ్న్స్ హేపీ క్లబ్
నేడు క్లబ్ శత వసంతోత్సవ వేడుకలు కాకినాడ కల్చరల్ : ది యంగ్మెన్స్ హేపీ క్లబ్. చితామణి, భక్తరామదాసు, కృష్ణ లీల, లోబి, డాటర్, నాటకాలు ఆంధ్ర, ఆంధ్రేతర ప్రాంతాలలో ప్రదర్శనలిచ్చి ఎనలేని కీర్తిని పొందింది. ఎస్వీ రంగారావు, రేలంగి వెంకట్రావు, అంజనీదేవి, సూర్యకాంతం వంటి నటులు ది యంగ్మ్న్స్ క్లబ్ నుంచి వచ్చినవారే. క్లబ్ వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాకారం కూడా అందజేస్తుంది. రాజమహేంద్రవరం కేంద్రంగా తెలుగు రాష్ట్రమంతటా నాటకోద్యమం జరుగుతున్న తరుణంలో ఆ సంస్కృతికోత్సవంలో భాగంగా కాకినాడ నగరంలో 1913లో పల్లె హనుమంతరావు, యరగల సత్తిరాజు యువజన ఆనంద సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘాన్ని 1916లో యంగ్మ్న్స్ హాపీ క్లబ్‌గా దంటూ సూర్యారావు, గండికోట జోగినాధం, మాదిరెడ్డి రామానుజల నాయుడు, ఖాశిం సాహెబ్ మార్పు చేశారు. కళాకారులు, కళాభిమానుల శ్రమదానంతో ది యంగ్మెన్స్ హాపీ క్లబ్ ప్రదర్శనశాల నిర్మాణం జరిగింది. దంటు సూర్యారావు తదనంతరం ఆయన సోదరులు దంటూ భాస్కరావు అధ్యక్ష బాధ్యతలు చేపట్టి క్లబ్‌కు జవసత్వాలు అందించారు. ఔత్సాహిక నటీనటులను రప్పించి, శిక్షణ ఇప్పించి ప్రొత్సాహాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం దంటు సూర్యారావు అధ్యక్షత వహిస్తున్నారు. క్లబ్ శత వసంతోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహిస్తున్నారు. సినీ, టీవీ, ఇంటర్నెట్లకు పోటీగా రంగ స్థలానికి సాంకేతిక విజ్ఞానాన్ని జత చేసి అద్భుత ప్రదర్శనలు అందించాలనే సంకల్పంతోనే ఆడిటోరియం నిర్మాణం చేపట్టినట్టు దంటు తెలిపారు. -
విశాల్ కల ఇప్పుడు నెరవేరబోతోంది!
-
విజయవాడలో ఉత్సాహంగా హ్యాపీ సండే
-
ఊరికి పోదాం..చలో.. చలో...
అసలే దసరా, బతుకమ్మ పండుగలు.. సిటీలో ఏముంది.. మనూరికి పోతే అందరినీ చూడొచ్చు.. చిన్ననాటి మిత్రులు,హితులు, సన్నిహితులు, బంధువులు.. అందరినీ పలకరిస్తే మనసుకెంతో హాయి.. సంవత్సరానికోసారే కదా అందరం కలిసేది.. మళ్లీ ఎప్పుడో.. అందుకే ఊరికి పోయొద్దాం అనుకుంటున్నారు నగరవాసి. ఊళ్లకెళ్లే వారితో నగరంలోని రైల్వేస్టేçÙన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీకి సికింద్రాబాద్రైల్వే స్టేషన్లో ఆదివారం కనిపించిన ఈ దృశ్యాలే ప్రత్యక్ష సాక్షి – ఫొటోలు: ఆడెపు నాగరాజు -
కరువు తీరే.. రైతు మురిసె
ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు హుస్నాబాద్ : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్నాబాద్ ప్రాంతంలోని జలవనరులన్నీ నిండుకుండలయ్యాయి. జిల్లాలో అత్యధిక వర్షపాతం ఇక్కడే నమోదుకావడంతో తాగు, సాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. కాకతీయులు నిర్మించిన హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకు జలకళ సంతరించుకుంది. 1983లో కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్టతెగింది. ఆతర్వాత కరువు కరువు కాటకాలు ఇక్కడి రైతాంగాన్ని కంటతడిపెట్టించాయి. చెరువులో చుక్కనీరు లేక ఎవుసం బీడుపడింది. 2009, 2013లో కురిసిన వర్షాలకు చెరువు మత్తడి పడింది. అప్పుడు కాస్త ఊరట లభించింది. 16 ఫీట్ల నీటినిల్వ సామర్థ్యం ఉన్న ఎల్లమ్మ చెరువు ఇటీవల కురిసిన వర్షాలకు దాదాపు 14 ఫీట్ల మేర నిండింది. ఈ చెరువు ఆయకట్టు సుమారు రెండు వేల ఎరాల వరకు ఉంది. వరుణుడి కరుణతో ఇప్పుడు ఆయకట్టు అంతా సాగయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం చెరువు నిండుకుండలా ఉండడంతో మరో రెండేళ్ల కాలానికి ఢోకాలేదని ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భూగర్భజలాలు పెరిగి తాగునీటి ఇబ్బందులు దూరంకానున్నాయి. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా జిల్లాలో అన్ని చెరువుల్లో పూడిక తీత చేపట్టిన అధికారులు.. ఎల్లమ్మ చెరువులోని పూడిక తీయకపోవడం విశేషం. కాకతీయులు నిర్మించిన ఎల్లమ్మ చెరువును మరింత అభివృద్ది చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ. 6.5 కోట్లు మంజూరు చేసింది. నిధులు వచ్చి ఆరునెలలైనా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. -
అయ్యో వైరా..!
వైరా రెవెన్యూ డివిజన్‌పై అస్పష్టత 50 ఏళ్లుగా నిరుత్సాహం చివరి నిమిషంలో మార్పులు ప్రకటించాల్సిందేనని డిమాండ్ సౌకర్యవంతమంటున్న నేతలు వైరా: వైరా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అనేక ఏళ్లుగా కలగానే మిగులుతోంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా పరిపాలనా సౌలభ్యం కోసం వైరా రెవెన్యూ డివిజన్‌ను ముసాయిదాలో ప్రకటించారు. ఆ వెంటనే మళ్లీ కల్లూరుకు వెళ్తున్నట్లు సమాచారం రావడంతో స్థానికంగా ఆందోళనలు ఊపందుకున్నాయి. పది మండలాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే వైరాను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని నిరసనలు వెల్లువెత్తాయి. - నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో వైరా నియోజకవర్గం ఆవిర్భవించింది. - వైరా రెవెన్యూ డివిజన్‌ను కూడా ఏర్పాటు చేస్తే పది మండలాలకు సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికులంటున్నారు. ఇప్పటికే సబ్ డివిజన్ స్థాయి అధికారుల కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్న దృష్ట్యా రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది. 50 ఏళ్లుగా ఇలాగే.. 1960లో వైరా పంచాయతీ సమితిని ఏర్పాటు చేసి రెండేళ్లు మాత్రమే కొనసాగించారు. తిరిగి 1962లో రద్దు చేసి వైరా సమితిని రెండుగా చీల్చి మధిర, కల్లూరు మండలాల్లో కలిపారు. ఈ ప్రాంతం నుంచే నలుగురు ఎమ్మెల్యేలు మధిర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినప్పటికీ కనీసం మంత్రి వర్గంలో చోటు లభించకపోవడంతో వైరా అభివృద్ధిలో వెనకడుగు వేసింది. - వైరా రిజర్వాయర్ నుంచే సాగు, తాగునీరు కూడా వైరా, తల్లాడ, బోనకల్, మధిర, ఎర్రుపాలెం, కొణిజర్ల మండలాలకు గత 15ఏళ్లుగా సరఫరా అవుతున్నాయి. 30వేల ఎకరాల్లో పంటలు కూడా సాగవుతున్నాయి. - గతంలో వైరాలో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మండలంలోని రెబ్బవరం గ్రామంలో ప్రభుత్వ భూమిని ఖరారు చేసి చివరి నిమిషంలో రాజకీయ ఒత్తిడితో కల్లూరు మండలానికి తరలించారు. - వైరాలో ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేస్తామని ఆనాటి ప్రభుత్వాలు ప్రకటించినా.. చివరి క్షణంలో మధిరకు తరలిపోయింది. - ఎన్నెస్పీ సర్కిల్ కార్యాలయాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేయాల్సి ఉన్నా అది కూడా కల్లూరుకే తరలించారు. ఇలా 50 ఏళ్లుగా వైరాకు ప్రతి విషయంలో నిరుత్సాహం తప్పట్లేదు. - మిషన్ భగీరథతో 11 మండలాలకు తాగునీరు మిషన్ భగీరథ పథకం ద్వారా వైరా రిజర్వాయర్ నుంచి జిల్లాలోని 11 మండలాలకు తాగునీటిని అందించే పనులు కూడా సాగుతున్నాయి. వైరా, కొణిజర్ల, చింతకాని, మధిర, బోనకల్, ఏన్కూరు, జూలూరుపాడు, తల్లాడ, కల్లూరు, వేంసూరు, పెనుబల్లి మండలాలకు ఇక్కడి నుంచే నీరందిస్తున్నారు. - అన్ని కార్యాలయాలు ఇక్కడే .. ప్రస్తుతం వైరాలో పోలీస్‌శాఖ సబ్ డివిజన్ కార్యాలయం, ఆరు మండలాల పరిధిలో మోటారు వాహనాల తనిఖీ అధికారి కార్యాలయం, జిల్లా మొత్తానికి సరఫరా అయ్యే ఐఎంఎల్ మద్యం డిపో, పశుగాణాభివృద్ధి సంస్థ జిల్లా కార్యాలయం, రైతులకు శిక్షణ ఇచ్చేందుకు కృషి విజ్ఞాన కేంద్రం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు ఇటీవల అగ్ని మాపక కేంద్రం కూడా మంజూరైంది. ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే ఉండటం విశేషం. ఇప్పటికే రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి ఆర్డీఓ కార్యాలయం ప్రతిపాదనలను కూడా రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదించడం గమనార్హం. సీఎం నిర్ణయం మేరకే.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకే వైరా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఉంటుంది. రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని మార్చరనే నమ్మకం ఉంది. రాజకీయ ఉద్దేశాలు ఏవీ పనిచేయవు. వైరా రెవెన్యూ డివిజన్ కోసం త్వరలో సీఎంను కలుస్తా. వైరా అన్ని విధాలా సౌలభ్యంగా ఉంటుంది. బాణోత్ మదన్‌లాల్, వైరా ఎమ్మెల్యే - ప్రభుత్వం ఆలోచించాలి వైరా రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసే విషయాన్ని ప్రభుత్వం అలోచించాలి. రాజకీయంగా, సామాజికంగా ఇక్కడి పరిస్థితులు ప్రజలకు సౌకర్యవంతంగా ఉన్నాయి. కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు రాజకీయ దురుద్దేశమే. - లావుడ్య రాములునాయక్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు - ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం వైరా రెవెన్యూ డివిజన్‌ను ప్రకటించటం శుభపరిణామమే.. ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు తిరిగి కల్లూరు రెవెన్యూ డివిజన్‌ను తెరమీదకు తేవడం సరైంది కాదు. నిర్ణయాన్ని మార్చుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. యర్రా బాబు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి - వైరా ఎంతో సౌకర్యవంతం వైరా రెవెన్యూ డివిజన్‌గా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఏన్కూరు, జూలూరుపాడు మండలాల నుంచి ప్రజలు వైరాకు నేరుగా ఆర్టీసీ బస్సులో చేరుకోవచ్చు. అటు ఎర్రుపాలెం, మధిర ప్రజలు కూడా బస్సులో సులభంగా రావచ్చు. మాలోత్ రాందాసునాయక్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి -
వర్షం.. వర్షం
మైదాన ప్రాంతంలో ఓ మోస్తరు వర్షం జిల్లాలో సగటు వర్షపాతం 1.49 సెం.మీ. అత్యధికంగా వైరాలో 8.02 సెం.మీ వర్షపాతం నమోదు ఖమ్మం వ్యవసాయం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత నాలుగు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా నైరుతి రుతుపవనాలు కూడా బలపడ్డాయి. గురువారం ఉదయం జిల్లా సగటు వర్షపాతం 1.49 సెం.మీ.గా నమోదైంది. అయితే ఏజెన్సీ ప్రాంతం కన్నా మైదాన ప్రాంతంలో అధిక వర్షం కురిసింది. అయితే ఇటీవల ఏజెన్సీ ప్రాంతంలోనే అధికంగా వర్షాలు పడుతున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం కూడా తొలి రెండు రోజులు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోనే అధికంగా కురిసింది. మైదాన ప్రాంతంలో అక్కడక్కడ నామమాత్రంగా వర్షం పడింది. గురువారం నమోదైన వర్షపాతం మాత్రం మైదాన ప్రాంతంలో అధికంగా నమోదైంది. అత్యధికంగా వైరా మండలంలో 8.02 సెం.మీ వర్షపాతం నమోదైంది. తల్లాడ మండలంలో 6.42 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 3 నుంచి 6 సెం.మీ. మధ్య 7 మండలాల్లో, 1 నుంచి 3 సెం.మీ.ల మధ్య 6 మండలాల్లో, 1 సెం.మీ వరకు 19 మండలాల్లో వర్షపాతం నమోదైంది. వెంకటాపురం, అశ్వాపురం, దుమ్ముగూడెం, టేకులపల్లి, ఇల్లెందు, సింగరేణి, బయ్యారం మండలాల్లో మాత్రం వర్షం కురవలేదు. అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు మాత్రం ఏజెన్సీ ప్రాంతంలోని పలు ప్రాజెక్టులు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ఇప్పటికే చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పెరగటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అశ్వాపురం, మణుగూరు, బూర్గంపాడు మండలాల్లోని చెరువుల్లోకి నీరు చేరింది. అశ్వారావుపేట మండలంలో ఉన్న నీటి ప్రాజెక్టుల్లోకి కూడా నీరు చేరింది. బయ్యారం చెరువు అలుగు పోస్తోంది. వరంగల్ ప్రాంతం నుంచి ఉన్న మున్నేరులో వరద నీరు ప్రవహిస్తుంది. ఈ వర్షాలు భూగర్భ జలాలను పెంచటంతోపాటు ఖరీఫ్‌లో సాగు చేసిన పైర్లకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న వంటి పైర్లకు ఈ వర్షాలు బాగా అనుకూలిస్తున్నాయి. వర్షాలతో జిల్లాలోని నాగార్జున సాగర్ ఆయకట్టులో కూడా ఆరుతడి పంటలు వేసుకునే అవకాశాలున్నాయి. జిల్లాలో నమోదైన వర్షపాతం(సెం.మీటర్లలో) –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– మండలం వర్షపాతం (సెం.మీ.) ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– 6–12 సెం.మీల మధ్య వర్షపాతం వైరా 8.02 తల్లాడ 6.42 3–6 సెం.మీల మధ్య బోనకల్లు 5.38 చింతకాని 5.22 నేలకొండపల్లి 4.62 ఖమ్మం రూరల్ 3.58 ఖమ్మం అర్బ¯ŒS 3.06 ముదిగొండ 3.18 సత్తుపల్లి 3.22 1–3 సెం.మీల మధ్య వర్షపాతం ఎర్రుపాలెం 1.26 మధిర 1.66 కల్లూరు 2.88 పెనుబల్లి 2.06 వేంసూరు 1.44 తిరుమలాయపాలెం 1.96 1 సెం.మీ వరకు వర్షపాతం వాజేడు 0.32 చర్ల 0.54 పినపాక 0.06 గుండాల 0.42 మణుగూరు 0.34 భద్రాచలం 0.22 బూర్గంపాడు 0.36 పాల్వంచ 0.24 కొత్తగూడెం 0.14 గార్ల 0.32 కామేపల్లి 0.22 జూలూరుపాడు 0.16 చండ్రుగొండ 0.12 ముల్కలపల్లి 0.22 అశ్వారావుపేట 0.82 దమ్మపేట 0.78 ఏన్కూరు 0.12 కొణిజర్ల 0.88 కూసుమంచి 0.98 -
పంటకు జీవం.. రైతుల హర్షం
జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం వెల్గటూర్‌లో 6.8 సెంటీమీటర్లు నమోదు ముకరంపుర : ఇరవై రోజుల అనంతరం రైతుల మోముల్లో ఆనందం కనిపించింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఎండిపోయే దశలో ఉన్న పంటలకు ఈ వర్షాలు జీవం పోశాయి. ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలకు వర్షం అనుకూలించింది. వాన కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రైతులు కాస్తా ఊరటచెందారు. సగటున 1.3 సెంటీమీటర్ల వర్షపాతంగా నమోదైంది. అత్యధికంగా వెల్గటూర్ మండలంలో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలపల్లిలో 5.6, సిరిసిల్లలో 5, చందుర్తిలో 4.1, కరీంనగర్లో 4.2, భీమదేవరపల్లిలో 1.1, గంగాధరలో 2.4, చొప్పదండిలో 1.8, మానకొండూర్‌లో 1, రామడుగులో 1.8, జగిత్యాలలో 3.8, మల్యాలలో 1.9, గొల్లపల్లిలో 1.6, కొడిమ్యాలలో 1, ముస్తాబాద్‌లో 2.4, వేములవాడలో 3.4, బోయినిపల్లిలో 3.8, కోనరావుపేటలో 3.2, ధర్మారంలో 2.1, రామగుండంలో 1.4, ఎలిగేడులో 1.9, మంథనిలో 2.2, కాటారంలో 1.5, మల్హర్రావులో 2.7, మహదేవపూర్, మహాముత్తారంలలో 1.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జూన్ నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 654.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 589.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
సంతోషంగా కృష్ణమ్మ చెంత
-
'సింధు రజతం గెలవడం చాలా ఆనందంగా ఉంది'
-
123 జీఓ రద్దుపై హర్షం
కందుకూరు: ఇటీవల 123 జీఓను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మండల పరిధిలోని ముచ్చర్ల సర్వే నంబర్ 288లోని సర్టిఫికెట్దారులు ఆదివారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్ పేదల భూములను లాక్కొంటూ సరైన పరిహారం ఇవ్వడం లేదని, ఈతీర్పు ప్రభుత్వానికి ఓ చెంప పెట్టులాంటిదన్నారు. గ్రామ పరిధిలోని 221 మంది పేదలకు గతంలో ఎకరం చొప్పున ఇచ్చిన సర్టిఫికెట్లను పట్టించుకోకుండా, కనీస పరిహారం చెల్లించకుండా అన్యాయంగా భూములను గుంజుకున్నారని విమర్శించారు. ఆ భూముల్నే నమ్ముకున్న తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. హైకోర్టు తీర్పును అనుసరించి 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూములను సేకరించాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు వెంకటరమణ, యాదయ్య, లక్ష్మమ్మ, బుగ్గమ్మ తదితరులు పాల్గొన్నారు. -
స్నేహం ఓ సుమం.. ఇగరదులే సుగంధం..
‘చెలిమి..జీవితాన్ని సుసంపన్నం చేసే కలిమి’ అన్నాడో కవి. ‘స్నేహం..రుతువేదైనా వాడని సుమం’ అన్నాడింకో కవి. స్నేహితుల దినోత్సవాన్ని (ఆదివారం) పురస్కరించుకుని స్థానిక నర్సరీ రైతులు ఫ్రెండ్‌షిప్‌డే శుభాకాంక్షలు అందంగా తెలియజేశారు. స్థానిక పల్లవెంకన్న నర్సరీలో మొక్కలు, పువ్వులతో ఏర్పాటు చేసిన కూర్పు ఇది. ప్రతివారూ స్నేహభావంతో మెలగాలని కాంక్షిస్తూ దీన్ని ఏర్పాటు చేసినట్లు నర్సరీ డైరెక్టర్ పల్ల వెంకటేష్, రైతులు సత్తిబాబు, సుబ్రహ్మణ్యం, గణపతి తెలిపారు. – కడియం -
పెన్నా నదిలో ఈతకెళ్లి ముగ్గురు బాలురు దుర్మరణం
సిద్దవటం : వైఎస్సార్ జిల్లా సిద్దవటం మండలం మాచుపల్లె సమీపంలోని పెన్నా నదిలో ఆదివారం ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. కడప నగరం బెల్లంమండి వీధికి చెందిన షేక్ సోహేల్ (11), రామాంజనేయపురం గ్రామంలోని దండోరా కాలనీకి చెందిన రాయపాటి లక్ష్మికాశీ(9), రాయపాటి కిరణ్(10)తో పాటు మరో ముగ్గురు బాలురు వారి పెద్దలతో కలిసి ఆదివారం మాచుపల్లె దర్గా వద్దకు చేరుకుని మధ్యాహ్నం అక్కడే భోజనం చేశారు. అనంతరం సరదాగా ఈత కొట్టేందుకు సమీపంలో ఉన్న పెన్నానది వద్దకు వెళ్లారు. నీటిలోకి దిగి ఈత కొడుతుండగా గతంలో ఇసుక కోసం తీసిన గోతులు ఉన్న విషయం తెలియక ఆ ప్రాంతానికి వెళ్లిన ఆరుగురు బాలురు మునిగిపోయారు. దీన్ని గమనించిన స్థానికులు, కుటుంబీకులు వెంటనే నీళ్లలోకి దిగి ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో ముగ్గురు బాలురను కూడా ఒడ్డుకు తీసుకురాగా వారు అప్పటికే మృతి చెంది ఉన్నారు. వెంటనే మృతదేహాలను కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులను రిమ్స్‌కు పంపి సమాచారం తెలుసుకున్నట్లు ఒంటిమిట్ట సీఐ శ్రీరాములు, సిద్దవటం ఎస్ఐ లింగప్ప తెలిపారు. కళ్లముందు ఆనందంగా కనిపించిన కొద్ది క్షణాల్లోనే విగతజీవులుగా మారడంతో వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
పైర్లకు ఊపిరి!
ఎమ్మిగనూరులో అత్యధికంగా 95.6 మిమీ వర్షం 57శాతం భూముల్లో పంటలు సాగు వారం రోజుల్లోనే లక్షకు పైగా హెక్టార్లలో పంటలు కర్నూలు(అగ్రికల్చర్): జూలై నెలలో వర్షాలు కొంత అలస్యం అయినా ఆశాజనకంగా పడుతుండటంతో రైతులు ఊరట చెందుతున్నారు. మంగళవారం రాత్రి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఎమ్మిగనూరు, దేవనకొండ, గోనెగండ్ల మండలాల్లో భారీ వర్షాలు పడటంతో హంద్రీకి వరద నీరు భారీగా వచ్చింది. అయా మండలాల్లో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కొద్ది రోజులుగా వర్షాలు పడుతుండటంతో ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత వారం నాటికి జిల్లాలో 2.48 లక్షల హెక్టార్లలోనే పంటలు సాగు అయ్యాయి. వర్షాలు పడుతుండటం వల్ల వారం రోజులు వ్యవధిలో లక్ష హెక్టార్లకు పైగా పంటలు సాగు కావడం విశేషం. పత్తి, కంది, వేరుశనగ సాగు గణనీయంగా పెరుగతోంది. మంగళవారం రాత్రి అత్యధికంగా 95.6 మిమీ వర్షపాతం నమోదు అయింది. దేవనకొండలో 87.4, మద్దికెరలో 74.4, గొనెగండ్లలో 72.6, పత్తికొండలో 55.4, నందవరంలో 48.0, తుగ్గలిలో 46.4, మంత్రాలయంలో 41.2, ఆస్పరిలో 40.0, శిరువెళ్లలో 39.6, నంద్యాలలో 38.0, మహనందిలో 34.2, దొర్నిపాడులో 33.0, చిప్పగిరిలో 30.0,బండి ఆత్మకూరులో 28.2 మిమీ ప్రకారం వర్షాలు కురిశాయి. జూలై నెల సాధారణ వర్షపాతం 117.2 మిమీ ఉండగా ఇప్పటి వరకు 90.8 మిమీ వర్షపాతం నమోదు అయింది. పది రోజులు వ్యవధిలోనే 65 మిమీ వర్షపాతం నమోదు కావడం విశేషం. ఈ నెల మొదటి నుంచి వర్షాలు లేకపోవడం వల్ల పంటలు కొంతమేర దెబ్బతిన్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలు పూర్తి స్థాయిలో కోలుకున్నాయి. మరో 10 రోజుల్లో వర్షాధారం కింద పూర్తి స్థాయిలో సాగు అయ్యే అవకాశం ఉంది. పత్తి సాగు భారీగానే.. జిల్లాలో పత్తి భారీగానే సాగు అయింది. ఇప్పటికే 1.10 లక్షల హెక్టార్లలో సాగు కావడం విశేషం. కంది సాగు క్రమంగా పెరుగుతోంది. జిల్లాలో 65,123హెక్టార్లు, వేరుశనగ 84,425, మినుము 10096, మొక్కజొన్న 19095, ఆముదం 13170, మిరప 9085, ఉల్లి 13465 హెక్టార్లలో సాగు చేశారు. సాధారణ సాగు 6.21 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 3.53 లక్షల(57 శాతం) హెక్టార్లలో పంటలు సాగు అయ్యాయి. -
హమ్మయ్య.. వచ్చేశాం
కొయ్యలగూడెం: ఉగ్రవాదుల దాడులు, కాశ్శీర్‌లో కర్ఫ్యూ, అల్లర్ల మధ్య తీవ్ర ఇబ్బందులు పడిన అమర్నాథ్ యాత్రికులు ఒక్కొక్కరుగా జిల్లాకు చేరుకుంటున్నారు. కొయ్యలగూడేనికి చెందిన మండా నాగేశ్వరరావు, అచ్యుతాపురం గ్రామానికి చెందిన తలకొండ సత్యనారాయణ శుక్రవారం వేకువజామున స్వగ్రామాలకు చేరుకున్నారు. వీరు ఈనెల 1న కొయ్యలగూడెం నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లామని, యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో శ్రీనగర్‌లో చిక్కుకునిపోయామని చెప్పారు. 8 నుంచి 11వ తేదీ వరకు అక్కడ బస్టాండ్‌లోనే భద్రతా దళాల మధ్య బిక్కుబిక్కుమంటూ గడిపామని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజుల పాటు ఆహారం లేకపోవడంతో నీరసించిపోయామని చెప్పారు. శాంతిభద్రతలు మెరుగుపడిన తర్వాత భద్రతా దళాలు తమను ఢిల్లీకి చేర్చారన్నారు. అక్కడ ఆంధ్రాభవన్‌లో ఆశ్రయం పొంది కోలుకున్న తర్వాత ఇక్కడకు చేరుకున్నామన్నారు. పరమ శివుని దయతోనే.. పోతవరం (నల్లజర్ల): పరమ శివుని దయ వల్లే తామంతా తిరిగి ఇంటికి చేరుకున్నామని పోతవరానికి చెందిన కందుల రవిశేఖర్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. కాశ్శీర్‌లో అల్లర్ల నేపథ్యంలో మూడు రోజులపాటు శ్రీనగర్ బస్టాండ్‌లోనే భయం, ఆకలితో అసలు స్వస్థలం చేరుతామో లేదో అన్న భయంతో గడిపామన్నారు. మూడు రోజులు శ్రీనగర్‌లో చిక్కుకుపోవడంతో కాంగ్డా, ఛాముండి, నైనాదేవి ఆలయాలను సందర్శించకుండానే వెనుదిరిగామని చెప్పారు. కాశ్మీరుకు ఉత్తర భాగం హిమాలయాల్లో 14 వేల అడుగుల ఎత్తులో యాత్ర అత్యంత క్లిష్టంగా సాగిందని చెప్పారు. తనతో పాటు నల్లజర్ల, ఏలూరు, మక్కినవారిగూడెం తదితర ప్రాంతాల నుంచి 80 మంది బృందంగా వెళ్లామని చెప్పారు. -
ఇలా చేస్తే.. సంతోషం మీవెంటే..
సాక్షి, స్కూల్ ఎడిషన్: సంతోషం, కోపం, బాధ, ఆందోళన వంటి అనేక భావనలు మనలో సహజంగా కలుగుతాయి. వీటన్నింటికీ మన మెదడులోని రసాయనాలే కారణం. ఈ విషయం శాస్త్రీయంగా నిరూపణ అయిన అంశం. మెదడులో విడుదలయ్యే నాడీ రసాయనాల వల్లే సంతోషం కలుగుతుంది కాబట్టి ఈ రసాయనాలను అదుపులో పెట్టుకుంటే ఎక్కువ ఆనందంగా ఉండొచ్చనేది శాస్త్రవేత్తల మాట. మన చుట్టూ ఉండే పరిస్థితులు, జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు వంటివి ఒత్తిడికి గురిచేస్తాయి. ఫలితంగా ఆనందం దూరమవుతుంది. మరి ఇలాంటి సందర్భాల్లో మెదడులో హ్యాప్పీ కెమికల్స్ విడుదలయ్యేలా చూసుకుంటే మళ్లీ సంతోషాన్ని తిరిగి పొందవచ్చు. ఆనందాన్నిచ్చే రసాయనాలు విడుదలయ్యేందుకు ఏం చేయాలో.. దీనివల్ల సంతోషాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం.. చల్లని నీటితో.. ఇది రోజూ క్రమం తప్పకుండా చేసేపనే. చల్లని నీరు తీసుకుని కాస్త ముఖంపై చల్లుకోండి. దీనివల్ల గుండె వేగం తగ్గి, వేగస్ అనే ఓ కీలకమైన నాడీ సంబంధిత నరం ఉత్తేజితమవుతుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది. కండరాలు ఎక్కువగా ఆక్సిజన్‌ను వినియోగించుకుంటాయి. వేగస్ ఉత్తేజితమైతే జీర్ణవ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. మన మూడ్‌ని, ఆలోచనల్ని మార్చేందుకు పరోక్షంగా ఈ ప్రక్రియ తోడ్పడుతుంది. సన్నిహితులతో మమేకం.. మూడ్ బాగోలేనప్పుడు ఒంటరిగా, ఒకే ప్లేస్‌లో ఉండడం మంచిది కాదు. వీలైనంత వరకు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు ప్రయత్నించండి. లేదా ఏదైనా బుక్‌స్టోర్, కాఫీ షాప్, షాపింగ్ కాంప్లెక్స్ వంటి పబ్లిక్ ప్లేసెస్‌కు వెళ్లండి. అక్కడి వారితో సంభాషించండి. ఇలా ఇతరులతో సరదాగా మాట్లాడడం, ఎంజాయ్ చేయడం వల్ల ఆక్సీటోసిన్ విడుదలవుతుంది. దీంతోపాటు సెరటోనిన్ కూడా మెరుగుపడుతుంది. ఈ రెండు రసాయనాలు ఉత్సాహాన్ని కలిగించేవే. అందువల్ల ఇతరులతో సన్నిహితంగా మెదలడం వల్ల మెదడుకు ఈ రసాయనాల వల్ల కొత్త శక్తి లభిస్తుంది. కేవలం తోటివారితో మాట్లాడడం మాత్రమే కాదు. గార్డెనింగ్, డ్రాయింగ్, మ్యూజిక్ వినడం వంటి పనులు కూడా చురుకుదనాన్ని కలిగిస్తాయి. చిరునవ్వు.. సంతోషంగా ఉన్నప్పుడే నవ్వగలుగుతాం అనేది సత్యమే. కానీ నవ్వడం వల్ల కూడా సంతోషం కలుగుతుందనే విషయాన్ని గుర్తించాలి. వీలైనంత వరకు నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించండి. చిరునవ్వు అయినా, బిగ్గరగా నవ్వినా సంతోషం కలుగుతుంది. కృత్రిమంగా నవ్వినా, సహజంగా నవ్వినా మెదడులో కలిగే స్పందనలు దాదాపు ఒకేలా ఉంటాయి. అందువల్ల ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ఆనందాన్ని కోరుకున్నప్పుడు నవ్వడానికి ప్రయత్నించండి. దీనివల్ల మెదడులో సంతోషాన్ని కలిగించే రసాయనాలు విడుదలవుతాయి. దీంతో మీరు ఆనందంగా ఉండగలుగుతారు. సూర్యకాంతితో చురుకుదనం.. వీలున్నంత వరకు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఆరుబయట తిరగండి. లేదా ఆఫీస్ వేళల్లో కాస్త సూర్యకాంతి పడేలా చూసుకోండి. అలాగని ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయట తిరగకూడదు. సూర్యకాంతి మెదడులో సెరటోనిన్ అనే రసాయనం విడుదలయ్యేలా ప్రేరేపిస్తుంది. ఇది మెదడుకు మంచి శక్తినిస్తూ, మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. శరీరంలో మెలటోనిన్ విడుదలయ్యేలా కూడా సూర్యకాంతి తోడ్పడుతుంది. ఇది మంచి నిద్రను అందిస్తుంది. పెంపుడు జంతువులతో కాలక్షేపం.. కుక్క, పిల్లి, కుందేలు, లేదా ఏదైనా పక్షి వంటి పెంపుడు జీవులతో గడపడం వల్ల మొదడుకు కొత్త శక్తి చేకూరి ఆనందం కలుగుతుంది. పెంపుడు జీవులతో కాస్సేపు గడపడం వల్ల మెదడులో ఆక్సిటోసిన్, ఎండోర్ఫిన్స్, డోపమైన్ వంటి హ్యాప్పీ కెమికల్స్ విడుదలవుతాయి. ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నవారిలో డిప్రెషన్ లక్షణాలు తక్కువగా ఉంటాయని, ఆరోగ్యపు అలవాట్లు బాగుంటాయని అనేక పరిశోధనలు రుజువు చేశాయి. ముఖ్యంగా శునకాలతో ఆడుకునే వారిలో ఆక్సిటోసిన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్లు జపాన్ అధ్యయనం వెల్లడించింది. అందుకే ఏదైనా పెంపుడు జంతువుకు ఇంట్లో చోటు కల్పించండి. -
ఒబామాతో స్టెప్పులేసిన 106 ఏళ్ల బామ్మ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులను కలిసిన ఓ 106 ఏళ్ల బామ్మ సంతోషంతో స్టెప్పులేసింది. బామ్మ ఉత్సాహానికి ఆశ్చర్యపోయిన ఒబామా.. మీరు ఈ వయసులో కూడా ఇంత హుషారుగా ఉండటం వెనుక రహస్యం ఏంటీ అని ఆమెను ప్రశ్నించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఒబామా దంపతులంటే ఉన్న అభిమానంతో వారిని కలుసుకోవాలని వర్జీనియా మెక్ లారెన్ అనే మహిళ 2014లో వైట్‌హౌస్‌కు దరఖాస్తు పెట్టుకుంది. మెక్ లారెన్ అభ్యర్థనకు అంగీకరించిన వైట్‌హౌస్ వర్గాలు ఆదివారం ఒబామా దంపతులను కలవడానికి అవకాశం కల్పించారు. దీంతో తనకు ఎంతో ఇష్టమైన వారిని మొదటిసారి కలిసిన సంతోషంలో ఆ బామ్మ ఊతకర్ర సహాయంతోనే ఒబామా, మిచెల్‌లతో కలిసి స్టెప్పులేసింది. అనంతరం మాట్లాడుతూ.. అమెరికా మొట్టమొదటి నల్లజాతి ప్రెసిడెంట్ ఒబామాను, ఆయన సతీమణి మిచెల్‌ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. -
హ్యాపీ బర్త్ డే ఇక అందరిదీ...
ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన పాటల్లో ఒకటైన 'హ్యాపీ బర్త్ డే' పాటకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పుడు అందరూ హాయిగా పాడుకునే అవకాశం ఏర్పడింది. పేటెంట్ హక్కుల బంధనాలు వీడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆమెరికా పబ్లిషర్ 'వార్నర్ ఛాపెల్ మ్యూజిక్' సెటిల్ మెంట్ కు రావడంతో దీర్ఘకాలంపాటు కొనసాగిన చట్టపరమైన వివాదం ముగిసింది. మ్యూజిక్ సంస్థ గతంలో ఈ పాటకు 15 మిలియన్ డాలర్లు చెల్లించి పేటెంట్ హక్కులు పొందింది. హ్యాపీ బర్త్ డే టు యు.. అంటూ పుట్టినరోజు సందర్భాల్లో అందరూ పాడుకునే పాటపై 2013 లో వివాదం మొదలైంది. అమెరికాకు చెందిన వార్నర్ ఛాపెల్ మ్యూజిక్ కంపెనీ ఇప్పటిదాకా ఈ పాటకు రాయల్టీ పొందుతోంది. అయితే ఓ సినీ నిర్మాత ఈ పాటను తన సినిమాలో వాడుకోవడంతో కాపీరైట్ చట్టం కింద తనకు 1,500 డాలర్లు చెల్లించాలంటూ వార్నర్ చాపెల్ డిమాండ్ చేయడంతో వివాదం మొదలైంది. దాదాపు వందేళ్ళ క్రితం నుంచే అమెరికాలో ప్రముఖంగా వినిపించడమే కాక.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ పాడుకుంటున్న ఆ పాటకు రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని సినీ నిర్మాత సహా మరికొందర్ని భాగస్వాములుగా చేర్చి క్లాజ్ యాక్షన్ దావా దాఖలు చేశారు. దీంతో అప్పట్నుంచీ వివాదం కొనసాగుతోంది. అయితే తాజాగా ఆమెరికా లాస్ ఏంజిల్స్ ఫెడరల్ కోర్టు ముందు ఆ వివాదానికి తెరపడింది. పాటకు రాయల్టీగా పబ్లిషింగ్ హౌస్ కు 14 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు, 2030 వరకూ అమల్లో ఉన్న రాయల్టీ చెల్లింపులు ఇక్కడితో ముగించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే చాపెల్ సంస్థకు చెల్లించాల్సిన మొత్తంలో ఫిల్మ్ మేకర్స్, న్యాయవాదులు 4.62 మిలియన్ డాలర్లు... మిగిలిన మొత్తాన్ని ఈ పాట వాడుకున్న వారందరూ కలసి చెల్లించాలని కోర్టు నిర్ణయించింది. ఇలా ఒప్పందం కుదరడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి సమస్య మరోసారి తలెత్తకుండా ఉండాలని ఫిర్యాదుదారులు కోరుకుంటున్నారు. గతంలో ఫిల్మ్ మేకర్స్ వార్నర్ చాపెల్ కు ఎటువంటి రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా సెంట్రల్ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ పాట అందరికీ అందుబాటులోకి రావాలని, పబ్లిక్ డొమైన్ గా మారాలన్న ఉద్దేశ్యంతో తిరిగి కేసును కొసాగించారు. చివరికి తాజా తీర్పుతో వివాదం సర్దుమణిగింది. ఈ హ్యాపీ బర్త్ డే పాట 1893 లో వచ్చిన గుడ్ మార్నింగ్ టు ఆల్ అనే పాటనుంచి వాడకంలోకి వచ్చింది. ఆ పాటను అప్పట్లోనే అమెరికా స్కూళ్ళలో పాడినట్లుగా తెలుస్తోంది. తర్వాత గుడ్ మార్నింగ్ టు ఆల్ నుంచి హ్యాపీ బర్త్ డే గా ఇందులోని పదాలు మారాయి. ఇంగ్లీష్ లో అన్ని పాటలకంటే హ్యాపీ బర్త్ డే సాంగ్ ఎంతో ప్రాచుర్యం పొందినట్లు గిన్నిస్ బుక్ లెక్కలు చెప్తున్నాయి. -
ఆనంద బృందావనం
వాళ్లంతా ఎంతో జీవితాన్ని చూశారు. తమ జీవితంలోని ప్రతి క్షణాన్నీ తమ బిడ్డల కోసమే వెచ్చించారు. పిల్లల జీవితాలను తీర్చిదిద్దడానికి తమ రక్తాన్ని చెమటగా చిందించారు. కానీ వాళ్లు చూసిన ప్రేమలో కాస్త కూడా తిరిగి పిల్లలు వాళ్లపై చూపించలేదు. కనీసం జాలిపడి అయినా ముదిమి వయసులో వారికి అండగా నిలబడలేదు. బిడ్డల ఛీత్కారాలు, చీదరింపులతో ఆవేదనకు లోనై, కాస్త ప్రేమగా పలకరించేవారిని వెతుక్కుంటూ బయలుదేరారు. అప్పుడే వారికి కనిపించింది... ఆనంద నిలయం. మెదక్ జిల్లా కొండపాక మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆశ్రమం... వయసుడిగిన తరుణంలో వాళ్లందరికీ ఓ మంచి అండ, గొప్ప భరోసా! కరీంనగర్ జిల్లా చిగురుమామిడికి చెందిన మోతుబరి రైతు మల్లారెడ్డి. తొంభై ఎకరాలకు పైగా భూమి ఉండేదాయనకు. ఎంతో మంది కూలీలు ఆయన పొలంలో పని చేసేవారు. వాళ్లందరినీ ఎంతో ప్రేమగా చూసేవారు మల్లారెడ్డి. పదిమందికీ తాను మంచి చేస్తే, ఆ దీవెనలన్నీ తన పిల్లలకు వస్తాయని అనుకునేవారాయన. పిల్లలంటే అంత ప్రేమ ఆయనకు. వాళ్లను కళ్లలో పెట్టుకుని పెంచారు. ముఖ్యంగా కొడుకులే తన సర్వస్వం అనుకున్నాడాయన. కానీ ఆ కొడుకులే తన కన్నీటికి కారణమవుతారని ఆయన ఊహించలేదు. పెద్దకుమారుడు ఉపాధ్యాయ వృత్తి చేపట్టాడు. చిన్న కుమారుడు గ్రామంలో కిరాణాషాపు పెట్టుకున్నాడు. వాళ్లిద్దరికీ చెరో 42 ఎకరాల భూమినీ పంచి ఇచ్చారు మల్లారెడ్డి. మిగతా ఆరు ఎకరాలను తనకు, తన భార్య కోసమని ఉంచుకున్నారు. తన రెండు ఇళ్లనూ కూడా కొడుకులకే రాసిచ్చి, ఒక ఇంట్లో ఓ పంచన ఉండేవారు ఆ దంపతులు. పైగా కొడుకుల అవసరాలకు అప్పుడప్పుడూ డబ్బు కూడా సర్దుబాటు చేస్తుండేవారు. ఇంత చేస్తున్నా తల్లిదండులను సక్రమంగా చూసుకోవాలనే ఆలోచన మాత్రం ఆ కొడుకులకు కలగలేదు. వయసు మీద పడి అమ్మానాన్నలు కష్టపడుతుంటే, కనీసం వాళ్లను పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా వాళ్ల దగ్గర ఉన్న ఆరెకరాల భూమి కూడా తమకు ఇవ్వాలని గొడవకు దిగారు. కొడుకుల తీరు నచ్చక మల్లారెడ్డి ఆ భూమిని నాలుగేళ్ల క్రితం కూతురి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. దాంతో ఏకంగా తండ్రిపైనే భూమి కోసం కేసు వేశారు. కొడుకులు చేసిన ఈ పనికి ఆ దంపతులు పాపం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కన్న బిడ్డలే బద్ధ శత్రువుల్లా ప్రవర్తిస్తుంటే ఏం చేయాలో తోచక, కనీసం తమ పొట్ట తాము పోసుకోలేక అవస్థ పడాల్సి వచ్చింది ఆ వృద్ధ దంపతులకు. వీరే కాదు. వీరిలా ఎంతోమంది. అందరికీ ఒకటే కథ. గుండెల్లో పెట్టుకుని పెంచిన పిల్లలు గుండెలపై గుద్ది వెళ్లి పోయిన కథ. కడుపు నిండా ఇంత అన్నం పెట్టి, ప్రేమగా పలకరించేవాళ్లు కూడా లేరే అన్న వ్యథ. వారి కథను మార్చి, వాళ్లందరి వ్యథను తీర్చింది ఓ ఆశ్రమం. అదే ‘ఆనంద నిలయం’. ఒక్కరితో మొదలై... మెదక్ జిల్లాలోని కొండపాక శివారులోని కొమురవెళ్లి కమాన్‌కు కిలోమీటర్ దూరంలో అటవీ ప్రాంతం ఉంది. 2010కి పూర్వం అది కేవలం అడవి. దాన్ని మమతకు నిలయంగా మార్చారు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు పెద్ది వైకుంఠం. పిల్లల నిరాదరణకు గురై తల్లడిల్లే వృద్ధుల కోసం ఏదైనా చేయాలని తలంచారు వైకుంఠం. తన ఆలోచనను మిత్రుడు కోట రాధాకృష్ణశర్మతో పంచుకోగా, ఆయన కూడా ఆ మహాకార్యంలో పాలు పంచుకుంటానన్నారు. మరికొంత మంది కూడా వీరితో కలవడంతో వృద్ధాశ్రమ స్థాపనకు ప్రణాళిక సిద్ధం అయ్యింది. తాము సంపాదించే దాంట్లో కొంత ఆ ఆశ్రమానికి కేటాయించాలనే నిర్ణయానికి వచ్చారంతా. ఈ విషయాన్ని అప్పటి హౌసింగ్ బోర్డు కమిషనర్‌గా పనిచేస్తోన్న సిద్దిపేట వాస్తవ్యులు కేవీ రమణాచారికి తెలిపారు. రమణాచారి పెద్ది వైకుంఠంకు డిగ్రీలో జూనియర్ కావడంతో వారి మధ్య చనువుంది. ఆయన వైకుంఠం ఆలోచనను సమర్థించారు. ఆయన ద్వారా ఎందరో దాతలు విరా ళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. బెంగళూరుకు చెందిన సుధా జనార్దన్ ఆశ్రమానికి తనవంతు సాయంగా రూ. 50లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. దాంతో ఆనంద నిలయ స్థాపనకు మార్గం సుగమ మయ్యింది. కొండపాక శివారులో 93 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఆనంద నిలయాన్ని నిర్మించారు. వైకుంఠం, ఆయన మిత్రులు, రమణాచారి దంప తులు తదితరులు కలిసి ట్రస్టుగా ఏర్ప డ్డారు. రమణాచారి భార్య లత చైర్మన్‌గా వ్యవహరిస్తోన్న ఈ ట్రస్టు ఆశ్రమాన్ని ఎంతో గొప్పగా అభివృద్ధి చేస్తోంది. అమ్మ ఒడి అది... ముదిమి మీద పడిన మనిషి పసి బిడ్డతో సమానం అంటారు. ఆ సమ యంలో వాళ్లకి ప్రేమ కావాలి. ధైర్యం చెప్పే తోడు కావాలి. మంచాన పడితే సేవ చేసే చేయి కావాలి. మొత్తంగా చెప్పాలంటే అమ్మలా సాకాలి. నాన్నలా నడిపించాలి. అవన్నీ చేస్తోంది ఆనంద నిలయం. అందుకే అది ఆశ్రమం కాదు, అమ్మ ఒడి అంటారు అక్కడ ఉంటోన్నవారు. వాళ్ల మాటల్లో నిజముంది. ఎందు కంటే ఆ ఆశ్రమం వాళ్లను నిజంగా అలానే చూస్తోంది. వాళ్లకి ఎటువంటి లోటూ లేదక్కడ. మూడు పూటలా రుచి కరమైన, ఆరోగ్యకరమైన ఆహారం, అన్ని వసతులూ ఉన్న గదులు, కాలక్షేపం కోసం ఆట వస్తువులు, చక్కని గార్డెన్... అన్నీ ఉన్నాయి. చివరి రోజుల్లో ప్రతి ఒక్కరూ దేవుని ధ్యానంలో గడపాలని అను కుంటారు. అందుకే ఆశ్రమంలోనే ఒక కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని కట్టారు. ఆ ఆధ్మాత్మిక పవనాలు వారి మనసులు స్వాంతననిస్తున్నాయి. ప్రతి నెలా జరిగే ఆరోగ్య పరీక్షలు ఆరోగ్యం గురించి కూడా చింత వద్దంటూ భరోసా ఇస్తున్నాయి. ఇన్ని చేస్తున్నందుకే వాళ్లు ఆ ఆశ్రమాన్ని అమ్మ ఒడి అంటున్నారు. అయితే ఆనంద నిలయం సేవ ఇక్క డితో ఆగిపోలేదు. సేంద్రియ పద్ధతుల్లో కూరగాయల్ని పండిస్తోంది. గోశాలను నిర్మించి పశు సంపదనూ పెంచుతోంది. ఓ బనియన్ తయారీ కంపెనీని పెట్టి వారికి చుట్టుపక్కల గ్రామాల ఉపాధిని కల్పిస్తోంది. ఈ సేవల్ని ముందు ముందు మరింత విస్తరించాలని అను కుంటోంది. మంచి పనికి అవరోధం ఏముంటుంది! అవన్నీ చేసే తీరుతుంది. కనిపించే దైవాలు... దైవం ఎక్కడో లేడు. తల్లిదండ్రుల్లోనే ఉన్నాడు. వాళ్లే మనకు కనిపించే దైవాలు. తల్లిదండ్రులను గౌరవించే వారు వికాసం, సంతోషం, సంతప్తి పొందగలుగుతారు. పదిహేనేళ్ల క్రితం నాకు వృద్ధులకు చేయూతగా నిలువాలనే ఆలోచన వచ్చింది. ఆ కలల సాకారమే ఈ ఆశ్రమం. సిద్దిపేటలోని మిత్రులు పెద్ది వైకుంఠం, వెంకటేశం తదితరుల సహకారంతో ఆశ్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నాం. ఈ ఆనంద నిలయం నాకు దేవాలయం. ఈ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులు ఆరోగ్యంగా, సంతప్తికరంగా ఉండాలన్నదే నా తాపత్రయం. - కేవీ రమణాచారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు - వై.సురేందర్, సాక్షి ప్రతినిధి, గజ్వేల్ ఫొటోలు: కనకారెడ్డి -
జూ.ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: 'నాన్నకు ప్రేమతో' భారీ విజయంతో జోష్ మీదున్న జూ. ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. 2009లో తనకు జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసుకొంటూ ఆయన చేసిన కమెంట్స్‌తో అందరూ షాకయ్యారు. తాను చావుకు భయపడే వ్యక్తిని కాదని.. మృత్యువు తనదాకా వస్తే సంతోషంగా వెళ్లిపోతానని వ్యాఖ్యానించాడు. 2009లో మార్చి 26 జరిగిన యాక్సిడెంట్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పాడు. జీవితాన్ని తాను చూసే కోణమే మారిపోయిందని తెలిపాడు. అది తన రెండవ జన్మగా భావిస్తానన్నాడు. అందుకే తన భార్య లక్ష్మీప్రణతి బర్త్ డే కూడా అయిన మార్చి 26 న ఇంట్లో రెండు పుట్టిన రోజులు జరుపుకొంటామని వెల్లడించాడు. 'పుట్టిన ప్రతి మనిషి ఎప్పటికైనా మరణానికి చేరువ కావాల్సిందే. ఆశ అనే చిన్న రేఖపై బతుకుతున్నాం. ఎపుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. నా కోరిక ఒక్కటే చనిపోయే ముందు ఒక్క క్షణం కూడా గిల్టీగా ఫీలవకూడదు' అంటూ తన ఆలోచనలు ఇలానే ఉంటాయంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. సూర్యాపేట సమీపంలో జూనియర్ ఎన్టీయార్ ప్రయాణిస్తున్న కారు బోల్తాపడటంతో ఆయన గాయపడ్డారు. ఆ సమయంలో తనను ఆసుపత్రికి తీసుకెళ్లేటపుడు అమ్మ, అభిమానులు, వస్తువులు, కుక్క సహా అన్నీ గుర్తుకొచ్చాయన్నాడు. చనిపోతాననే భయం లేదు కానీ...సాధించాల్సింది చాలా ఉంది, అప్పుడే వెళ్లిపోతున్నానా అన్న ఫీలింగ్ మాత్రం వెంటాడిందని చెప్పుకొచ్చాడు. కానీ అభిమానులు, పెద్దల ఆశీస్సులు ఉండబట్టే ఇపుడు ఇలా మళ్లీ అందరిముందుకు రాగలిగానన్నాడు. కాగా ఈ మధ్య సరైన హిట్స్ లేక కలవరడుతున్న ఎన్జీఆర్ 'నాన్నకు ప్రేమతో' విజయంతో ఖుషీగా ఉన్నాడు. ఇండియాలో కంటే ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ సాధిస్తూ ఎన్టీయార్ కు అక్కడ తిరుగులేని మార్కెట్ ను క్రియేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. -
ఫేస్ బుక్ వదిలేస్తే కొండంత సంతోషం!
న్యూయార్క్: ఇప్పుడు సంతోషం ఎక్కడుందంటే సామాజిక మాధ్యమాల్లో అని చెప్పుకునే రోజులు వచ్చాయి. ఆటపాట, మాటాముచ్చట అన్నీ మర్చిపోయి అందుబాటులో మొబైల్‌తోనో, ఆఫీస్ లో ఉంటే కంప్యూటర్లతోనే వెంటనే ఫేస్ బుక్, ట్విట్టర్, చాటర్ బాక్సెస్ వంటి ఎన్నో సోషల్ వెబ్ సైట్లలోకి దూరేస్తుంటారు. ఇక ఫేస్ బుక్ మాత్రం దిన చర్యగా మారింది. అయితే, ఎంత దినచర్యగా మారినా అది వ్యసనంగా ఉన్నా, ఒక్కసారి ఫేస్ బుక్ ను వదిలేసి బయటకు వస్తే ఆ వచ్చిన వ్యక్తులు ఎంతో సంతోషంగా ఉంటారని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. కొత్తగా ఫేస్ బుక్ ఉపయోగిస్తున్నవారిని, అప్పటికే ఫేస్ బుక్ వదిలేసిన వారిని ప్రశ్నించగా.. వారి రియాక్షన్ అధ్యయనకారులను ఆశ్చర్యపరిచాయి. డెన్మార్క్ లో చేసిన ఈ అధ్యయనంలో మొత్తం 1095మందిని తీసుకొని రెండు గ్రూపులుగా చేసి వారిని ప్రశ్నించగా 88శాతంమంది తాము ఫేస్ బుక్ వదిసేశాకే సంతోషంగా ఉన్నామని చెప్పారు. 81శాతంమంది మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టమున్నా లేకపోయినా ఫేస్ బుక్‌ను ప్రతి రోజు తనిఖీ చేసుకుంటున్నామని తెలిపారు. మరికొందరు మాత్రం ఫేస్ బుక్‌లో గడపడం చాలా ఆహ్లాదంగా ఉంటుందని, ఒంటరిగా ఉన్నామనే భావన అస్సలు తెలియదని చాలా తక్కువ మాత్రమే బాధపడిన సందర్భాలున్నాయని చెప్పారు. ఎక్కువమంది మాత్రం ఫేస్ బుక్ వదిలేసిన తర్వాతనే కాస్త ఎక్కువ ఆనందంగా ఉన్నామని తెలిపారు. ఈ విషయంలో అధ్యయనకారులు ఫేస్ బుక్ ప్రతినిధులను ప్రశ్నించగా వాస్తవానికి అందులో ఖాతా తెరిచినవారు తమకు ఏం కావాలో అనే విషయంపై స్పష్టత లేకుండానే గడిపి అనవసర ఒత్తిడికి లోనవుతుంటారని, ఇబ్బంది కలిగించేటటువంటి విషయాలేవీ అందులో ఉండవని అన్నారు. -
'ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి'
-
ఆనందంలో మునిగి పోయిన కుటుంబ సభ్యులు
-
తిరుపతిలో వడగళ్ల వాన
తిరుపతి టౌన్: తిరుపతి పట్టణంలో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. వడగళ్లు పెద్ద గోళీల పరిమాణంలో ఉన్నాయి. అక్కడే ఉన్న స్థానికులు వడగళ్ల వాన పడటంతో దగ్గర్లోని షెల్టర్ల వద్దకు పరుగు లంకించుకున్నారు. అనంతరం వడగళ్లను బాటిళ్లలోకి ఏరుకొని సంబరపడిపోయారు. -
అస్సలు భయపడకూడదు!
‘‘ఎప్పుడో శ్వాసించేసిన గతాన్ని పూర్తిగా వదిలేయండి. వర్తమానాన్ని శ్వాసించండి. దాన్నలా నొక్కిపట్టి ఉంచండి. ఎలాంటి అంచనాలు లేకుండా భవిష్యత్తును కూడా శ్వాసించండి... ఈ మాటలు వింటుంటే విచిత్రంగా ఉందా? యోగా చేసేవాళ్లు ‘ప్రాణాయామం’ చేస్తారు. జీవితం గురించి నేను చెప్పిన పై మాటలు కూడా మంచి ప్రాణాయామం లాంటివే. వర్తమాన జీవితం గురించి ఆలోచించి, దాన్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటే, భవిష్యత్తు బాగుంటుంది. అలాగే, గతించిన చేదు జ్ఞాపకాలను మనసులో నుంచి తీసేసి, ఆ స్థానంలో తీపి నింపుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. నాకు పరిశీలనా దృష్టి ఎక్కువ. కొంతమంది ప్రతి చిన్న విషయానికీ అతిగా స్పందిస్తుంటారు. చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేరు. దాంతో పెద్ద పెద్ద కష్టాలు వాళ్లను బాగా కుంగదీసేస్తాయ్. జీవితం కష్ట సుఖాల సమాహారం అనుకుని, రెంటినీ సమానంగా తీసుకుని ముందుకు సాగిపోవాలి. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని భయపడడం మొదలుపెడితే వర్తమానం దుర్భరంగా ఉంటుంది. అందుకే అస్సలు భయపడకూడదు. ‘ఈ క్షణం ఏంటి?’ అని ముందుకు సాగిపోవాలి. వేదాంతం మాట్లాడుతున్నాననుకోవద్దు. ఆచరించి చూడండి.. జీవితం సాఫీగా ఉన్నట్లు మీకే అనిపిస్తుంది.’’ - శ్రీయ -
రాజధాని ప్రాంత గ్రామాల్లో సంబరాలు
-
సంతోషంగా సంక్రాంతి
నెల్లూరు(క్రైమ్) : ప్రజలందరూ సంక్రాంతి పండగను సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్ కోరా రు. పండగ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం తగదని చెప్పారు. మంగళవారం ఆయన తనచాంబర్లో ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా కోడిపందేలు, జూదం పోటీలు జరిగే ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. గతేడాది పండగ సమయాల్లో పందేలు నిర్వహిస్తూ తమ రికార్డులకెక్కిన వ్యక్తుల వివరాలను సేకరించామన్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా సుమారు 150 మందిని బైండోవర్ చేసుకున్నామని పేర్కొన్నారు. రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన దొంగల ముఠాలు జిల్లాలో తిష్టవేశాయన్న సమాచారం ఉందన్నారు. దీంతో గస్తీని ముమ్మరం చేయడంతో పాటూ అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. పండగ వేళల్లో ఊరు విడిచి వెళ్లేవారు ముందుగా సెల్ నంబరు 9494626644కు సమాచారం మేసేజ్ రూపంలో అందిస్తే తమ సిబ్బంది ఆ ఇంటిపై ప్రత్యేక దృష్టిసారిస్తారని వివరించారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో ఇప్పటి వరకు సుమారు 280 కేసులు నమోదు చేశామని చెప్పారు. సుమారు రూ 2.79కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకోవడంతో పాటు 295 మంది నిందితులను అరెస్ట్చేశామని వెల్లడించారు. జిల్లాలో సిమి ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని మీడియాల్లో వచ్చిన కథనాల్లో వాస్తవం లేదన్నారు. సిమి ఉగ్రవాదులు 2013లో మధ్యప్రదేశ్‌లోని ఖాండాన్ జైలు నుంచి తప్పించుకొన్నారన్నారు. వారి కోసం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గాలింపు జరుగుతుందన్నారు. -
కామెడీ హీరోలు..!
పంచామృతం: విదూషకుడు బావిలో పడ్డట్టు.. అనేది నానుడి. తెరపై కమెడియన్లు పడే పాట్లు కూడా నవ్విస్తాయి. అందరినీ ఆనందంలో ముంచెత్తుతాయి. అయితే అలాంటి విదూషకులు నిజజీవితంలో పడే పాట్లు మాత్రం బాధను మిగులుస్తాయి. మనల్ని నవ్వించేది వాళ్లే ఏడిపించేదీ వాళ్లే. ఇటీవలే రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య చాలా మందిని బాధపెట్టింది. రాబిన్ మాత్రమే కాదు.. హాలీవుడ్లో కమెడియన్లుగా పేరు పొందిన అనేక మంది మానసికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. అయితే వాళ్లు ధైర్యంగా నిలబడ్డారు.. హీరోల్లా నిలిచారు! చార్లీ చాప్లిన్ సెలైంట్ ఎరా సినిమా.. మాటల్లేని రోజుల్లో కూడా నవ్వించిందంటే అందుకు చార్లీ చాప్లిన్ హావభావాలే మూలం. బాధాకరంగా గడిచిన బాల్యం, ప్రేమ, వైవాహిక జీవితాల్లో పడ్డ ఇబ్బందులు.. ఇవన్నీ చాప్లిన్‌ను డిప్రెషన్లోకి తీసుకెళ్లాయి. ఆయనను కుంగుబాటు బాధితుడిగా మార్చాయి. అయితే చాప్లిన్ వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు. జిమ్ క్యారీ హాస్యాన్ని అభినయించగల వాళ్లే అసలైన హీరోలు. హాలీవుడ్‌లోనైనా ఇది వర్తిస్తుంది. అందుకు జిమ్ క్యారీనే రుజువు. హాలీవుడ్‌లోని స్టార్లలో ఒకరిగా నిలదొక్కుకొన్న ఈ కెనడియన్ సంతతి వ్యక్తిని గతానుభవాలు ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాయట. ఈయన కూడా డిప్రెషన్ బాధితుడే. సినిమాల్లో నిలదొక్కుకోక ముందు జిమ్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేశాడు. అప్పుడు మొదలైన మానసిక ఒత్తిడి జిమ్‌పై ఇప్పటికీ కొనసాగుతోందని వైద్యులు చెబుతున్నారు. అయితే జిమ్ మాత్రం అలాంటి ఒత్తిడిని తేలికగా తీసుకొని ముందుకు సాగుతున్నాడు. బెన్ స్టిల్లర్ అమెరికా, కెనడాల్లో స్టార్ ఇమేజ్. డబ్బుకు కూడా లోటు లేదు. వారసులు కూడా సినిమా రంగంలోనే స్థిరపడ్డారు. అయితే జన్యుపరంగా, వారసత్వంగా వచ్చిన డిప్రెషన్ మాత్రం ఈ స్టార్ యాక్టర్‌ను ఇబ్బంది పెడుతోంది. సినిమాలతో బిజీ అయిపోవడమే అందుకు విరుగుడుగా భావిస్తున్నాడు ఈ నటుడు. ఒవెన్ విల్సన్ ఎనిమిదేళ్ల కిందటే ఈయన ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే అదృష్టవశాత్తూ బయటపడ్డాడు. ఒవెన్ విల్సన్ తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నాడనీ, ఆ ఒత్తిడే ఆయనను ఆత్మహత్యకు పురిగొల్పిందనీ వైద్యులు పేర్కొన్నారు. తన రచనతో కూడా హాస్యాన్ని పండించిన ఈ విదూషకుడిపై అనేక సంఘటనలు ఒత్తిడి పెంచాయనీ, కుంగుబాటును కలిగించాయనీ తెలుస్తోంది. అయితే ఈయన క్రమంగా స్థిమితపడ్డాడు. ఆత్మహత్యాయత్నపు అనంతర జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో లీడ్ చేస్తున్నాడు. రస్సెల్ బ్రాండ్ బై పోలార్ డిజార్డర్ బాధితుడీయన. దాని ప్రభావంతో చాలా ఇబ్బందులే పడుతున్నాడు. ఒక దశలో డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. సినిమాల్లో కమెడియన్‌గా రాణిస్తున్నప్పుడే అరెస్టయ్యాడు. అయితే తర్వాత పరివర్తన చెందాడు. కానీ ఇప్పటికీ కుంగుబాటు బాధితుడుగానే ఉన్నాడు. అయినా సినిమాల్లో, టీవీల్లో విదూషక పాత్రలో రాణిస్తున్నాడు. -
‘హ్యాపీ’ హైదరాబాద్
హైదరాబాద్ ట్రెడిషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలా చెప్పినా తక్కువే. ఆనాటి చార్మినార్ నుంచి నేటి మెట్రో వరకు అన్నీ భాగ్యనగర సిగలో మెరిసే తారకలే. తాజాగా మన సైబరాబాద్ గొప్పదనం యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. ఆస్కార్‌కు నామినేట్ అయిన పారెల్ విలియమ్స్ ‘హ్యాపీ’ సాంగ్‌లో హైదరాబాద్ ఒదిగిపోయింది. సరదా, సరదా పదాలతో తన నగరాన్ని పొగుడ్తూ పారెల్ విలియమ్స్ పాడిన పాట ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఆ పాట ఎసెన్స్ పట్టిన హైదరాబాదీ కుర్రాళ్లు ఊరికే ఊరుకుంటారా. ఆ ట్యూన్‌కి తగ్గట్టుగా హైదరాబాద్ అందాలను జోడించి షూట్ చేసిన వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘కౌచ్ పొటాటో ప్రొడక్షన్ హౌస్’ తీసిన ఈ వీడియోకు ఇప్పటికే 31,749 వ్యూస్ వచ్చాయి. మెర్విన్ సామ్ డెరైక్ట్ చేసిన ‘హ్యాపీ’ హైదరాబాద్ వీడియోలో 50 మంది యువతీయువకులు స్టెప్పులతో అదరగొట్టారు. డెసిప్లికబుల్ మీ-2 మూవీలో ‘హ్యాపీ’ పాటను చూసి ఇన్స్పైర్ అయిన మెర్విన్.. యూట్యూబ్‌లో చూస్తే మరింత ‘హ్యాపీ’గా ఫీలయ్యాడు. ఇదే పాటకు చెన్నై, బెంగళూర్ సిటీకి సంబంధించిన వీడియోలు చూసి హైదరాబాద్ ‘హ్యాపీ’ సాంగ్ చేయాలని ఫిక్సయ్యాడు. చార్మినార్, ట్యాంక్‌బండ్, హైటెక్స్, నెక్లెస్ రోడ్ ఇలా డిఫరెంట్ లొకేషన్లలో షూటింగ్ ప్లాన్ చేశాడు. రెండు వారాల్లో వీడియో షూట్ ఫినిష్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేశాడు. ఈ పాటలో మెట్రో ైరె లు కార్మికులు కూడా స్టెప్స్ వేయడం మరో విశేషం. షూటింగ్ టైంలో తారసపడిన వీరిని వీడియో కాన్సెప్ట్ చెప్పగానే.. డ్యాన్స్ చేశారని మెర్విన్ సంతోషంగా చెబుతున్నాడు. ఏదైతేనేం.. కౌచ్ పొటాటో ప్రొడక్షన్ హౌస్ తీసిన ‘హ్యాపీ’ హైదరాబాద్ వీడియో ఇప్పుడు యూ ట్యూబ్ ఫేవరేట్ స్నాక్. - జాయ్ -
అడ్వాన్స్....
అదంతే! ‘‘పర్స్ దొరికిన వారికి వెయ్యి రూపాయల బహుమానం ఇస్తానన్నది మీరేనా?’ లక్షాధికారి దగ్గరకు ఓ బిక్షాధికారి వచ్చి అడిగాడు. ‘‘అవును! నీకేమైనా దొరికిందా?’’ ఆనందంగా అడిగాడు లక్షాధికారి. ‘‘ఇంకా లేదు. ఇంకొంచెం టైం పడుతుంది. ఈలోగా ఆ వెయ్యి రూపాయల్లో కొంత అడ్వాన్స్ తీసుకుందామని వచ్చాను’’ చెప్పాడు బిక్షాధికారి. -
వాన కలలో తడిసిపోయారా?!
స్వప్నలిపి వానలో చిక్కుకుపోయినట్లు, బాగా తడిసిపోయినట్లు అప్పుడప్పుడు కల వస్తుంటుంది. కలలో కనిపించే వానకు రెండు భిన్నమైన కోణాలు ఉన్నాయి. ఒకటి సంతోషం. రెండోది విషాదం. సంతోషం: ఊహించని విజయం సాధించినప్పుడు, ఒక మంచి పని చేసి ఇతరుల మెప్పు పొందినప్పుడు, వ్యాపారంలో ఊహించని లాభాలు వచ్చినప్పుడు, పెద్ద వాళ్ల అమూల్యమైన దీవెనలు లభించినప్పుడు, మన పట్ల ఎవరైనా దయగా ప్రవర్తించినప్పుడు...మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఆ ఆహ్లాదమే కలలో వాన! చిన్న చిన్న చినుకులు. వర్షం వచ్చినట్లు కాదు...అలా అని రానట్లు కూడా కాదు. చిన్నటి చినుకులకు చిరుగాలి తోడైన సందర్భాన్ని సంతోషంగా ఆస్వాదిస్తుంటాం. ఇది మన మానసిక ఉల్లాసాన్ని ప్రతిబింబించే దృశ్యం. ఎప్పుడైనా ఎవరికైనా వాగ్దానం చేసి, దాన్ని నెరవేర్చిన శుభసందర్భంలో కూడా కలలో చిరు వర్షం పలకరిస్తుంది. కొన్ని సందర్భాలలో బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా మన ఇంటి మీదే వర్షం కురుస్తుంటుంది. కుటుంబంలోని ఆప్యాయత,అనురాగాలు, సంతోషాలకు ఈ ప్రత్యేక వాన ప్రతీక. విషాదం: ఉన్నట్టుండి పే...ద్ద వానలో చిక్కుకుపోతాం. తల దాచుకోవడానికి ప్రయత్నిస్తాం. అది కుదరక పూర్తిగా తడిసిపోతాం. సమస్యల్లో చిక్కుకుపోయినప్పుడు, వాటికి పరిష్కారం ఒక పట్టాన దొరకనప్పుడు...ఇలాంటి కలలు వస్తుంటాయి. కేవలం... మన ఇంటి మీదే భారీ వర్షం కురిసినట్లు కల వస్తే... ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు అర్థం. కొన్నిసార్లు రాళ్ల వర్షం కురిసినట్లు, రక్తపు వర్షం కురిసినట్లు కూడా కల వస్తుంది. మోసం, వెన్నుపోటుకు గురైన విషాదం మూలంగా వచ్చే కల ఇది. -
తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలి!
‘‘ఈ ప్రపంచంలో ఎవరి స్థానమూ సుస్థిరం కాదు. ఇవాళ ఒకరున్న స్థానంలో రేపు ఇంకొకరు ఉంటారు. అందుకే శాశ్వతం కాని వాటి కోసం ఆరాటపడకూడదు’’ అంటున్నారు ఇలియానా. ప్రభుత్వోద్యోగులకు పదవీ విరమణ ఉంటుంది. కానీ, సినిమా తారలకు వంట్లో ఓపిక, ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్నంత కాలం సినిమాలు చేయొచ్చు. ఒకవేళ క్రేజ్ తగ్గి, బలవంతంగా రిటైర్ కావాల్సి వస్తే మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? అనే ప్రశ్న ‘‘ఈ ప్రపంచంలో ఎవరి స్థానమూ సుస్థిరం కాదు. ఇవాళ ఒకరున్న స్థానంలో రేపు ఇంకొకరు ఉంటారు. అందుకే శాశ్వతం కాని వాటి కోసం ఆరాటపడకూడదు’’ అంటున్నారుముందుంచితే - ‘‘సినిమాల్లోకి వచ్చేటప్పుడు మా అమ్మ ‘వృత్తిపై ఎక్కువగా మమకారం పెంచుకోవద్దు. తామరాకు మీద నీటిబొట్టులా ఉండటం శ్రేయస్కరం’ అని చెప్పింది. ఆ మాటలు బాగా జీర్ణించుకున్నాను. ప్రతి సినిమాని ప్రేమించి చేస్తాను. కానీ, ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీని వదిలేయాల్సి వస్తే, హ్యాపీగా గుడ్‌బై చెప్పేస్తా. ఎందుకంటే, ‘మేం చూడలేకపోతున్నాం బాబూ’ అని ప్రేక్షకులు నెత్తీ నోరూ బాదుకునే లోపే సర్దుకుంటే మంచిది కదా. ఇక్కడ ఇంకో విషయం కూడ చెప్పాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరికీ ఓ టైముంటుంది. ఆ టైమ్‌లో ఎవరు వద్దన్నా, కాదన్నా వెలుగులు విరజిమ్ముతారు. ఆ టైమ్ అయిన తర్వాత ఆ స్థానంలో ఇంకొకరు వస్తారు. ఈ మార్పుని ఆహ్వానించగలిగితే ఆనందంగా ఉండగలుగుతాం’’ అని చెప్పారు. -
ఎవరి స్పేస్ వారికి ఉండాలి
పెళ్లి తర్వాత ఆడపిల్ల జీవితం మారిపోతుందంటారు. అది నిజమే కావచ్చు. కొత్త పరిసరా లు, కొత్తమనుషులు, కొత్త మనస్తత్వాల మధ్య మెలగడం, సర్దుకుపోవడం, అనుబంధాలను అల్లుకుపోవడం అంత సులభం కాదు. అందుకే ఆ మార్పు కాస్త కొత్తగాను, ఇంకాస్త కన్ఫ్యూజింగ్గాను ఉంటుంది. నేను కూడా ఆ మార్పు గురించి ఆలోచించా ను. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా ను. కానీ నా అదృష్టం... అంతా ఎప్పటిలానే ఉంది. చెప్పాలం టే... ఇంకాస్త అందంగా, ఆనందంగా ఉంది. నా భర్త సైఫ్, నేను ఒకలాగే ఆలోచిస్తాం, ఒకేలా నడచుకుంటాం, అందుకే హ్యాపీగా ఉంటాం... లాంటి మాటలు నేను చెప్పను. మా ఇద్దరి వ్యక్తిత్వాలు వేరు. అభిప్రాయాలు కూడా కొన్ని విషయాల్లో వేరు. అయినా హ్యాపీగా ఉన్నామంటే కారణం... అర్థం చేసుకోవడం, అడ్జస్ట్ అయ్యేందుకు ప్రయత్నించడం. నా వరకూ నేను నచ్చనిదాన్ని ముఖం మీద చెప్పేస్తాను. అతడు కోపం తెచ్చుకోడు. ఇంకోసారి అలా చేయకుండా ఉంటానికి ట్రై చేస్తాడు. తను కూడా అన్నీ నాతో షేర్ చేసుకుంటాడు. నేను నా అభిప్రాయాన్ని చెబుతాను. నిర్ణయాన్ని మాత్రం తనకే వదిలేస్తారు. అంతకుమించి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించను. ఎవరి స్పేస్ వారికి ఇస్తే... అపార్థాలకు తావుండదు. ఎప్పుడైతే అవతలివాళ్లు మన కోసం పూర్తిగా మారిపోవాలని, మనకు నచ్చినట్టు మాత్రమే ఉండాలని కోరుకుంటామో... అప్పుడే అభిప్రాయభేదాలు, అలకలు, అనవసరమైన గొడవలు మొదలవుతాయి. ఫలితం... ఇద్దరి మధ్య దూరం. ఆ గ్యాప్ రాకూడదంటే స్పేస్ ఇచ్చుకోవాలి. మా ప్రేమబంధం పదిలంగా ఉండేందుకు నేను ఎంచుకున్న మార్గం... నా భర్త కోరుకునే స్పేస్ తనకి ఇవ్వడం. అందరూ అలాగే ఉండాలి, నాలాగే చేయాలి అని చెప్పను కానీ... అలా చేయడం వల్ల మంచి జరుగుతుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను! -
భాషణం: లాగి బిగించుకోవాల్సిందే!
రోజులెప్పుడూ ఒకలా ఉండవు. ఏమీ లేని వాళ్లకు ఏదైనా కలిసి వస్తే సంతోషమే కానీ, బాగా బతికినవాళ్లు ఊహించని విధంగా చితికిపోవడమన్నది చాలా బాధాకరమైన పరిణామం. అయితే ఉన్ననాడు ఎలా ఉన్నా, లేనినాడు మాత్రం సర్దుకుపోవాల్సిందే. ఇలా సర్దుకుపోవడాన్నే tightening the belt అంటారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, రెండో ప్రపంచ యుద్ధానికి ముందు 1930-40 మధ్య కాలంలో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేసింది. ఎందరో సంపన్నులు, సామాన్యులు తినడానికి తిండే లేని దుర్భరమైన స్థితికి చేరుకున్నారు. ఆ సమయంలో పుట్టిందే tighten your belt అనే పదబంధం. ఆ ‘గ్రేట్ డిప్రెషన్’ పీరియడ్‌లో చేతిలో డబ్బులు లేక, తినడానికి తిండి లేక, బరువు తగ్గి, బక్కచిక్కిపోయినవారు తమ ప్యాంట్లు కిందికి జారకుండా నడుముకు ఉండే బెల్టును మరింత గట్టిగా (ఇంకో రంథ్రం లోపలికి) బిగించుకునేవారట. అలా ఈ మాట వాడుకలోకి వచ్చిందంటారు. మారిన ఆర్థిక పరిస్థితిని బట్టి అవసరాలను కుదించుకోవడమన్నది అంతరార్థం. సడెన్‌గా జీతం రావడం లేటవుతుంది, లేదా అనుకోని అత్యవసరానికి పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు అయివుంటుంది. అలాంటి సందర్భంలో మిగతా అవసరాలను తగ్గించుకోవలసి వస్తుంది. రెండు పాల ప్యాకెట్లు తీసుకునేవాళ్లు ఒకటితో సరిపెట్టుకుంటారు. వారానికి రెండుసార్లకు బదులు ఒకసారే చికెన్ తింటారు. పండగ వస్తున్నా సరే, ఉన్నబట్టలతోనే సర్దుకుంటారు కానీ, కొత్తవి కొనరు. ఇదంతా కూడా బెల్ట్‌ని టైట్ చేసుకోవడమే. ఈ వాక్యం చూడండి. I have had to tighten my belt since I stopped working full-time. ఫుల్ టైమ్ వర్క్ చేయడం లేదు కాబట్టి ఖర్చులు తగ్గించుకున్నానని చెప్పడం. ఇక be in a tight corner అంటే కష్టాల్లో ఉండడం. Keep a tight rein on అంటే అదుపులో ఉంచుకోవడం. ఇక్కడ ట్ఛజీ అంటే కళ్లెం వేసే తోలు బెల్టు లాంటిది. rein ని ‘రెయిన్’అని పలకాలి. (ఉదా: My father always kept us on a tight rein). Sit tight అంటే కదలకుండా, ఓపిగ్గా, సుదీర్ఘంగా కూర్చోవడం. Tight lipped అంటే పెదవి విప్పకపోవడం, కోపాన్ని అణుచుకోవడం. Sleep tight అంటే హాయిగా నిద్రపోవడం. గుడ్ నైట్ చెప్పడానికి బదులుగా కొంతమంది sleep tight అని అంటారు. Tight fisted అంటే డబ్బు ఖర్చుపెట్టడానికి వెనకాడడం. (వాడుక భాషలో పిసినారి). Belt tight చేసుకున్న అనుభవం ఉన్నవారు tight fisted గా ఉండడం సహజమే. In a tight spot అంటే క్లిష్ట పరిస్థితి, సంక్షోభం. (If there is shortage of fuel, everyone who drives to work will be in a tight spot.) Tight-arse అని ఇంకో మాట ఉంది. దాని అర్థం కూడా tight fisted అనే. కాకపోతే అక్కడ fist, ఇక్కడ arse. దీన్ని ‘ఆస్’ అని పలకాలి. arse అంటే ఏ అవయవ భాగంతో అయితే మనిషి కూర్చుంటాడో ఆ భాగం. (You won't get a drink out of him, he is a real tight arse). అలాగే Close chewer and a tight spitter అనే మాట కూడా. అంటే అస్సలు డబ్బు ఖర్చుపెట్టని వ్యక్తి. పిల్లికి భిక్షం వేయడంటారే... అలా! ఇలాంటివారు ‘మీ ఇంటికొస్తే ఏమిస్తావ్? మా ఇంటికొస్తూ ఏం తెస్తావ్?’ అన్నట్లుంటారు. Run a tight ship అంటే సంస్థని క్రమశిక్షణగా, ఒక పద్ధతి ప్రకారం నడపడం. (The new office manager really runs a tight ship). On a tight leash అంటే ఆధీనంలో ఉంచుకోవడం. Leash అంటే.. కుక్కను కట్టే తోలు పటకా. ఈ వాక్యాలు చూడండి. 1. I keep my dog a tight leash so it won't bother people. 2. My father keeps my brother on a tight leash. 3. The boss has us all on a tight leash. I have had to tighten my belt since I stopped working full-time. -
అన్నా చెల్లెళ్ల అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీక