- జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం
- వెల్గటూర్‌లో 6.8 సెంటీమీటర్లు నమోదు
పంటకు జీవం.. రైతుల హర్షం
Published Mon, Aug 29 2016 11:24 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
ముకరంపుర : ఇరవై రోజుల అనంతరం రైతుల మోముల్లో ఆనందం కనిపించింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఎండిపోయే దశలో ఉన్న పంటలకు ఈ వర్షాలు జీవం పోశాయి. ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటలకు వర్షం అనుకూలించింది. వాన కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రైతులు కాస్తా ఊరటచెందారు. సగటున 1.3 సెంటీమీటర్ల వర్షపాతంగా నమోదైంది. అత్యధికంగా వెల్గటూర్ మండలంలో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలపల్లిలో 5.6, సిరిసిల్లలో 5, చందుర్తిలో 4.1, కరీంనగర్‌లో 4.2, భీమదేవరపల్లిలో 1.1, గంగాధరలో 2.4, చొప్పదండిలో 1.8, మానకొండూర్‌లో 1, రామడుగులో 1.8, జగిత్యాలలో 3.8, మల్యాలలో 1.9, గొల్లపల్లిలో 1.6, కొడిమ్యాలలో 1, ముస్తాబాద్‌లో 2.4, వేములవాడలో 3.4, బోయినిపల్లిలో 3.8, కోనరావుపేటలో 3.2, ధర్మారంలో 2.1, రామగుండంలో 1.4, ఎలిగేడులో 1.9, మంథనిలో 2.2, కాటారంలో 1.5, మల్హర్‌రావులో 2.7, మహదేవపూర్, మహాముత్తారంలలో 1.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జూన్ నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 654.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 589.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
Advertisement