కళాకారుల ఆశాసౌదం యంగ్మ్‌న్స్ హేపీ క్లబ్
కళాకారుల ఆశాసౌదం యంగ్మ్‌న్స్ హేపీ క్లబ్
Published Mon, Dec 19 2016 10:34 PM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM
నేడు క్లబ్ శత వసంతోత్సవ వేడుకలు
కాకినాడ కల్చరల్ : ది యంగ్మెన్స్ హేపీ క్లబ్. చితామణి, భక్తరామదాసు, కృష్ణ లీల, లోబి, డాటర్, నాటకాలు ఆంధ్ర, ఆంధ్రేతర ప్రాంతాలలో ప్రదర్శనలిచ్చి ఎనలేని కీర్తిని పొందింది. ఎస్వీ రంగారావు, రేలంగి వెంకట్రావు, అంజనీదేవి, సూర్యకాంతం వంటి నటులు ది యంగ్మ్‌న్స్ క్లబ్ నుంచి వచ్చినవారే. క్లబ్ వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాకారం కూడా అందజేస్తుంది. రాజమహేంద్రవరం కేంద్రంగా తెలుగు రాష్ట్రమంతటా నాటకోద్యమం జరుగుతున్న తరుణంలో ఆ సంస్కృతికోత్సవంలో భాగంగా కాకినాడ నగరంలో 1913లో పల్లె హనుమంతరావు, యరగల సత్తిరాజు యువజన ఆనంద సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘాన్ని 1916లో యంగ్మ్‌న్స్ హాపీ క్లబ్‌గా దంటూ సూర్యారావు, గండికోట జోగినాధం, మాదిరెడ్డి రామానుజల నాయుడు, ఖాశిం సాహెబ్ మార్పు చేశారు. కళాకారులు, కళాభిమానుల శ్రమదానంతో ది యంగ్మెన్స్ హాపీ క్లబ్ ప్రదర్శనశాల నిర్మాణం జరిగింది. దంటు సూర్యారావు తదనంతరం ఆయన సోదరులు దంటూ భాస్కరావు అధ్యక్ష బాధ్యతలు చేపట్టి క్లబ్‌కు జవసత్వాలు అందించారు. ఔత్సాహిక నటీనటులను రప్పించి, శిక్షణ ఇప్పించి ప్రొత్సాహాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం దంటు సూర్యారావు అధ్యక్షత వహిస్తున్నారు. క్లబ్ శత వసంతోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహిస్తున్నారు. సినీ, టీవీ, ఇంటర్నెట్‌లకు పోటీగా రంగ స్థలానికి సాంకేతిక విజ్ఞానాన్ని జత చేసి అద్భుత ప్రదర్శనలు అందించాలనే సంకల్పంతోనే ఆడిటోరియం నిర్మాణం చేపట్టినట్టు దంటు తెలిపారు.
Advertisement