కొడవలూరు: నెల్లూరులో 2015 లో జరిగిన మిస్ నెల్లూరు పోటీల్లో విజేతగా నిలిచానని.. అదే తనకు సీబీఐ వర్సెస్ లవర్స్ సిని మాలో హీరోయిన్ చాన్స్ దక్కేలా చేసిందని హీరోయిన్ శ్రావణి నిక్కీ తెలిపారు. మొత్తం నెల్లూరుకు చెందిన వారే ‘సీబీఐ వర్సెస్ లవర్స్’ అనే సినిమాను తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నార్తురాజుపాలెంలోని శ్రీవెంకటేశ్వర కళాశాలలో జరుగుతోంది.
ఈ సందర్భంగా మంగళవారం ‘సాక్షి’తో ముచ్చటించారు శ్రావణి నిక్కీ. మిస్ నెల్లూరుగా ఎంపికైన సందర్భంలో కళాకారులను ప్రోత్సహించే అమరావతి కృష్ణారెడి సహకారంతో సినిమా హీరోయిన్‌గా చాన్స్ దక్కిందని చెప్పారు. 2015 లోనే మిస్ ఏపీ పోటీల్లో ఫైనల్స్ వరకు వచ్చినట్లు తెలిపారు. 3 వేల మంది పాల్గొన్న ఆ పోటీల్లో 15 మంది ఫైనల్స్‌కు చేరగా.. అందులో తానూ ఒకరినని పేర్కొన్నారు.
నెల్లూరు కృష్ణ చైతన్య కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న తనకు సినిమా రంగంపై ఎంతో ఆసక్తి ఉందన్నారు. అవకాశాలు వస్తే సినిమా రంగంలోనే కొనసాగాలన్నది తన లక్ష్యమని చెప్పారు. నెల్లూరుకు చెందిన తారాగణం, సాంకేతిక బృందంతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ చాన్స్ దక్కడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. మొత్తం చిత్ర బృందం నెల్లూరు వాళ్లే అయ్యి తీస్తున్న ఈ సినిమాకు దర్శకుడు హరిప్రసాద్‌రెడ్డి, హీరో వంశీ తదితరులు నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment