heroiens
-
42 ఏళ్ల వయసులో తల్లైన హీరోయిన్
సాక్షి, చెన్నై : ఎంత పేరు, ప్రఖ్యాతి సంపాదించినా, మాతృత్వంతో కలిగే ఆనందమే వేరు. అలాంటి కమ్మనైన అమ్మతనాన్ని నటి సంఘవి 42 ఏళ్ల వయసులో అనుభవిస్తోంది. 1990 ప్రాంతంలో కథానాయికగా వెలిగిన నటి సంఘవి. 1993లో అమరావతి చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు కథానాయకిగా పరిచయం అయిన నటి సంఘవి. ఆ తరువాత తమిళం, తెలుగు, కన్నడ అంటూ దక్షిణాది లో పలు చిత్రాల్లో నటించింది. కాగా ఈమె 2016లో వెంకటేశ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంది. (నటుడికి షాకిచ్చిన భార్య.. లీగల్ నోటీసులు) ఆ తరువాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న సంఘవి ఇటీవల కాలంలో నటిగా రీఎంట్రీ అయింది. కాగా 42 ఏళ్ల వయస్సులో నటి సంఘవి అమ్మ అయింది. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డతో మాతృత్వ ఆనందాన్ని పొందుతున్న దృశ్యాన్ని వీడియోలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. (కరోనాకు హైదరాబాద్ మెడిసిన్! ) -
హీరోయిన్ చాన్స్ రావటం ఆనందం..!
కొడవలూరు: నెల్లూరులో 2015 లో జరిగిన మిస్ నెల్లూరు పోటీల్లో విజేతగా నిలిచానని.. అదే తనకు సీబీఐ వర్సెస్ లవర్స్ సిని మాలో హీరోయిన్ చాన్స్ దక్కేలా చేసిందని హీరోయిన్ శ్రావణి నిక్కీ తెలిపారు. మొత్తం నెల్లూరుకు చెందిన వారే ‘సీబీఐ వర్సెస్ లవర్స్’ అనే సినిమాను తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నార్తురాజుపాలెంలోని శ్రీవెంకటేశ్వర కళాశాలలో జరుగుతోంది. ఈ సందర్భంగా మంగళవారం ‘సాక్షి’తో ముచ్చటించారు శ్రావణి నిక్కీ. మిస్ నెల్లూరుగా ఎంపికైన సందర్భంలో కళాకారులను ప్రోత్సహించే అమరావతి కృష్ణారెడి సహకారంతో సినిమా హీరోయిన్గా చాన్స్ దక్కిందని చెప్పారు. 2015 లోనే మిస్ ఏపీ పోటీల్లో ఫైనల్స్ వరకు వచ్చినట్లు తెలిపారు. 3 వేల మంది పాల్గొన్న ఆ పోటీల్లో 15 మంది ఫైనల్స్‌కు చేరగా.. అందులో తానూ ఒకరినని పేర్కొన్నారు. నెల్లూరు కృష్ణ చైతన్య కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న తనకు సినిమా రంగంపై ఎంతో ఆసక్తి ఉందన్నారు. అవకాశాలు వస్తే సినిమా రంగంలోనే కొనసాగాలన్నది తన లక్ష్యమని చెప్పారు. నెల్లూరుకు చెందిన తారాగణం, సాంకేతిక బృందంతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ చాన్స్ దక్కడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. మొత్తం చిత్ర బృందం నెల్లూరు వాళ్లే అయ్యి తీస్తున్న ఈ సినిమాకు దర్శకుడు హరిప్రసాద్‌రెడ్డి, హీరో వంశీ తదితరులు నటిస్తున్నారు. -
ఐటం సాంగ్స్ కు సిద్ధమవుతున్న మరో హీరోయిన్!
ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకట్టుకోవటానికి సినిమాల్లో ఐటం సాంగ్స్ తో ప్రయోగాలు చేస్తుంటారు. సినిమాల్లో ఐటం సాంగ్ కు ఉన్న ప్రత్యేకతను విడమరిచి చెప్పక్కర్లేకపోయినా.. దానికున్న క్రేజ్ మాత్రం తక్కువేం కాదు. సినిమాలు హిట్-ప్లాప్ లతో సంబంధం లేకుండా ఐటం సాంగ్స్ అత్యధికంగా జనాల నోటిలో నానుతూనే ఉండటం మనం తరుచు చూస్తూ ఉంటాం. ఆ పాటల గత చరిత్రను చూస్తే అందుకోసం ప్రత్యేకంగా కొంతమంది మాత్రమే అందుబాటులో ఉండేవారు. గతాన్ని వదిలి వర్తమానానికి వస్తే ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. సినీ రంగంలో టాప్ హీరోయిన్స్ గా పేరు అందుకున్న వారు కూడా అదే బాటను అనుసరిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఆ బాటలో పయనించగా.. మరో ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఆ మార్గాన్నే అన్వేషించుకునే పనిలో పడ్డారు. ఎప్పుడో 2004 లో క్యూ హో గయానా చిత్రంలో హీరోయిన్ కు స్నేహితురాలి పాత్రతో వెండి తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ..2007 లో విడుదలైన లక్ష్మీ కళ్యాణం చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది. అనంతరం ఆమె ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. అదే సంవత్సరం కృష్ణ వంశీ తెరకెక్కించిన 'చందమామ' చిత్రంలో మహాలక్ష్మి పాత్రలో చక్కగా ఇమిడిపోయి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్ కు తిరుగులేకుండా పోయింది.అలా ఏడు సంవత్సరాల పాటు టాలీవుడ్ లో హీరోయిన్ గా అలరించిన కాజల్ కు ఈ మధ్య పెద్దగా అవకాశం రావడం లేదు. దీంతో ఆమె సరికొత్త అన్వేషణలో పడింది. ఐటం సాంగ్స్ చేయడానికి సిద్ధమవుతోంది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అంజలి హీరోయిన్ గా తెరకెక్కుతున్న గీతాంజలి చిత్రంలో ఐటం సాంగ్ చేయడానికి ఒక ఆఫర్ కూడా వచ్చిందట. అందులో భాగంగా కలిసిన చిత్ర నిర్మాతలకు కాజల్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ పాటకు భారీ పారితోషకాన్ని కాజల్ ఆఫర్ చేయడంతో వారు వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది. గతంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్లు ఇదే మార్గంలో పయనించి ఆకట్టుకునే యత్నం చేశారు. ఇప్పటికే ఐటం సాంగ్స్ చేసిన హీరోయిన్లలో ఛార్మి, ప్రియమణిలో ముందు వరుసలోఉన్నారు. తాజాగా శృతిహాసన్ కూడా 'ఆగడు' చిత్రంలో ఐటం సాంగ్ ను చేయడానికి సిద్ధమైంది. ఇక తాను ఏమీ తక్కువ తినలేదకున్న కాజల్.. ఆ తరహా సాంగ్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని యత్నాలు చేస్తోందని సినీ వర్గాల సమాచారం.