వర్షం.. వర్షం
-
మైదాన ప్రాంతంలో ఓ మోస్తరు వర్షం
-
జిల్లాలో సగటు వర్షపాతం 1.49 సెం.మీ.
-
అత్యధికంగా వైరాలో 8.02 సెం.మీ వర్షపాతం నమోదు
ఖమ్మం వ్యవసాయం:
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత నాలుగు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా నైరుతి రుతుపవనాలు కూడా బలపడ్డాయి. గురువారం ఉదయం జిల్లా సగటు వర్షపాతం 1.49 సెం.మీ.గా నమోదైంది. అయితే ఏజెన్సీ ప్రాంతం కన్నా మైదాన ప్రాంతంలో అధిక వర్షం కురిసింది. అయితే ఇటీవల ఏజెన్సీ ప్రాంతంలోనే అధికంగా వర్షాలు పడుతున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షం కూడా తొలి రెండు రోజులు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోనే అధికంగా కురిసింది. మైదాన ప్రాంతంలో అక్కడక్కడ నామమాత్రంగా వర్షం పడింది. గురువారం నమోదైన వర్షపాతం మాత్రం మైదాన ప్రాంతంలో అధికంగా నమోదైంది. అత్యధికంగా వైరా మండలంలో 8.02 సెం.మీ వర్షపాతం నమోదైంది. తల్లాడ మండలంలో 6.42 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 3 నుంచి 6 సెం.మీ. మధ్య 7 మండలాల్లో, 1 నుంచి 3 సెం.మీ.ల మధ్య 6 మండలాల్లో, 1 సెం.మీ వరకు 19 మండలాల్లో వర్షపాతం నమోదైంది.
వెంకటాపురం, అశ్వాపురం, దుమ్ముగూడెం, టేకులపల్లి, ఇల్లెందు, సింగరేణి, బయ్యారం మండలాల్లో మాత్రం వర్షం కురవలేదు. అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు మాత్రం ఏజెన్సీ ప్రాంతంలోని పలు ప్రాజెక్టులు, చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ఇప్పటికే చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పెరగటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అశ్వాపురం, మణుగూరు, బూర్గంపాడు మండలాల్లోని చెరువుల్లోకి నీరు చేరింది. అశ్వారావుపేట మండలంలో ఉన్న నీటి ప్రాజెక్టుల్లోకి కూడా నీరు చేరింది. బయ్యారం చెరువు అలుగు పోస్తోంది. వరంగల్ ప్రాంతం నుంచి ఉన్న మున్నేరులో వరద నీరు ప్రవహిస్తుంది. ఈ వర్షాలు భూగర్భ జలాలను పెంచటంతోపాటు ఖరీఫ్‌లో సాగు చేసిన పైర్లకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న వంటి పైర్లకు ఈ వర్షాలు బాగా అనుకూలిస్తున్నాయి. వర్షాలతో జిల్లాలోని నాగార్జున సాగర్ ఆయకట్టులో కూడా ఆరుతడి పంటలు వేసుకునే అవకాశాలున్నాయి.
జిల్లాలో నమోదైన వర్షపాతం(సెం.మీటర్లలో)
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
మండలం వర్షపాతం (సెం.మీ.)
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
6–12 సెం.మీల మధ్య వర్షపాతం
వైరా 8.02
తల్లాడ 6.42
3–6 సెం.మీల మధ్య
బోనకల్లు 5.38
చింతకాని 5.22
నేలకొండపల్లి 4.62
ఖమ్మం రూరల్ 3.58
ఖమ్మం అర్బ¯ŒS 3.06
ముదిగొండ 3.18
సత్తుపల్లి 3.22
1–3 సెం.మీల మధ్య వర్షపాతం
ఎర్రుపాలెం 1.26
మధిర 1.66
కల్లూరు 2.88
పెనుబల్లి 2.06
వేంసూరు 1.44
తిరుమలాయపాలెం 1.96
1 సెం.మీ వరకు వర్షపాతం
వాజేడు 0.32
చర్ల 0.54
పినపాక 0.06
గుండాల 0.42
మణుగూరు 0.34
భద్రాచలం 0.22
బూర్గంపాడు 0.36
పాల్వంచ 0.24
కొత్తగూడెం 0.14
గార్ల 0.32
కామేపల్లి 0.22
జూలూరుపాడు 0.16
చండ్రుగొండ 0.12
ముల్కలపల్లి 0.22
అశ్వారావుపేట 0.82
దమ్మపేట 0.78
ఏన్కూరు 0.12
కొణిజర్ల 0.88
కూసుమంచి 0.98