అమెరికాలోని ఫ్లోరిడా సముద్రతీరంలో ఆ క్షణంలో భయానక వాతావరణం ఏర్పడింది. సముద్రంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా స్నానం చేస్తున్న వారి మధ్యలోకి ఉన్నట్టుండి ఒక భారీ షార్క్ ప్రత్యక్షమయ్యింది. దీంతో వారంతా నీటిలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ భారీ షార్క్ నీటి మీద తేలియాడుతూ సముద్రంలో సేద తీరుతున్నవారి దిశగా దూసుకువచ్చింది.
ఈ షార్క్‌ను బీచ్‌లో నుంచి చూసినవారు సముద్రంలో సయ్యాటలాడుతున్న వారిని హెచ్చరిస్తూ బయటకు వచ్చేయండంటూ గట్టిగా కేకలు పెట్టారు. గతంలో న్యూయార్క్‌లోని ఫైర్ ఐలాండ్‌ను 15 ఏళ్ల కుర్రాడిని షార్క్ చంపేసినప్పటి నుంచి జనాలకు షార్క్‌లంటే విపరీతమైన భయం పట్టుకుంది.
తాజాగా ఫ్లోరిడా బీచ్‌లో కనిపించిన షార్క్ భారీ ఆకారంతో ఉండటంతో అక్కడున్న వారంతా భయపడిపోయారు. ఆ క్షణంలో అక్కడ ఆందోళనకర వాతావారణం ఏర్పడింది. గతంలో షార్క్ దాడిలో బాలుడు మృతి చెందడం, దీనికి ముందు షార్క్ దాడిలో కొందరు గాయపడటాన్ని స్థానికులు మరోమారు గుర్తుచేసుకున్నారు.
‘అది ఆకలితో ఉన్నట్టుంది’
ఫ్లోరిడాలో ఆ సమయంలో సముద్రతీరంలో సేదతీరిన క్రిస్టీ కాక్స్ మాట్లాడుతూ తాను ఆ షార్క్‌ను చూసినప్పుడు అది ఆహరపు వేటలో ఉన్నట్లు అనిపించిదన్నారు. అందుకే అది వేగంగా కదులుతూ మనుషులవైపు వచ్చిందన్నారు. దానిని చూడగానే అక్కడున్న వారంతా నిశ్చేష్టులైపోయారన్నారు. ఎలాగోలా అందరూ దారి బారి నుంచి తప్పించుకున్నారన్నారు. కాగా గతంలో పలువురిపై షార్క్ దాడులు జరగగా, వారిలో కొందరు వికలాంగులుగా మారిపోయారు.
ఇది కూడా చదవండి: ‘ఇదేం పువ్వు రా బాబూ.. ముక్కు పేలిపోతోంది’
Comments
Please login to add a commentAdd a comment