చదువు వేరు జీవితం వేరు. చాలామంది అంత చదువుకున్నాడు అలా ఎలా నిర్ణయం తీసుకున్నాడు. పెద్ద పెద్ద చదువులు చదివి కూడా ఇలా ఎలా ఆలోచిస్తున్నాడు. వంటి మాటలు తరుచు వింటుంటాం. నిజానికి చదువుకి చాలా తేడా ఉంది. చదువులో రాజీ పడకుండా చదివితేనే గెలుపుని అందుకోగలం. అదే జీవితంలో బంధాలు నిలవాలన్న, కాపాడుకోవాలన్న రాజీపడాలి. అంటే ఇక్కడ ప్రతిసారి గమ్మని కూర్చొమని కాదు. తగ్గాల్సిన చోట తగ్గాలి పెదవి విప్పి గట్టిగా చెప్పాల్సినప్పుడూ చెప్పాలి. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఏది మాట్లాడితే సమస్య రాదో ఎవ్వరికి గాయం కాకుండా సూటిగా విషయం అవగతమయ్యేలా చెప్పే నేర్పు, ఓర్పు కావాలి లేదంటే జీవితాలు తలకిందులవ్వుతాయి. ముందుకు అసలు జీవితంలో జరిగే ప్రతికూలతల విషయాలను ఎలా స్వీకరించాలో చూద్దాం!.
- జీవితంలో ఏం కావాలను కుంటారో అది చాలామందికి దక్కదు. దక్కకపోవడం సహజంగా బాధను కలిగిస్తుంది. దక్కినదాంట్లోనే ఆనందం వెతుక్కునేవారు మరోరకం.
- తృప్తి, అసంతృప్తి అనేవి మనుషుల ఆలోచనా విధానంలో ఉంటాయి. కొందరు నిరంతరం కావాల్సిన దానికోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటారు. ఏ పద్ధతిలో అన్నది ముఖ్యం.
- అన్నీ కలిసివస్తే అదృష్టవంతుడిగా చలామణీ అయ్యే మనిషి గెలుపును కేవలం తన ప్రతిభగా ప్రకటించుకోవడం ఎంతవరకు సమంజసం?
- కోరిక ఉండాలి. దాన్ని నెరవేర్చుకునేందుకు కృషి జరగాలి. ఫలితం ఎలా ఉన్నా ప్రయత్నంలో మాత్రం ఆనందం పొందాలి. లక్ష్యసాధనలో రాజీ పడకూడదు.
- జీవితం ఎలా రూపుదిద్దుకుంటుందో, ఎక్కడెక్కడ మలుపులు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మనం చేసే మంచి పనులే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయని భావించేవారు కొందరైతే, మనం గతంలో చేసుకున్నదాన్ని బట్టే ఈ స్థితి అని విశ్వసించేవారు మరికొందరు. ఎదురయ్యే అనుభవాన్ని ఏ విధంగా తీసుకుంటామన్నదే ముఖ్యం. అదే జీవితసత్యం.
(చదవండి: ఆ పార్కులో మాటల్లేవ్! కేవలం నిశబ్దమే..మనుషులంతా విగ్రహాలే!)
Comments
Please login to add a commentAdd a comment