experience
-
జననేతతో మీ అనుభవం..
నాయకుడంటే.. అధికారం కోసం పాకులాడే వాడు కాదు. అధికారం పేరిట పెత్తనం చెలాయించడమూ కాదు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ గొప్పలు చెప్పుకోవడం అంతకంటే కాదు.. జనాల కోసం.. జనం నుంచి పుట్టేవాడు.. వారి బాగోగులను సొంతింటి మనిషిగా చూసుకునే వాడు. జనం గర్వంగా మనవాడని చెప్పుకోగలిగిన వాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఐదేళ్ల పాలనతో అందరి మనసులను చూరగొన్న ‘జగనన్న’! ఏపీ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం జగనన్న పాలన. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాలన్నీ కొత్త పుంతలు తొక్కిన కాలమిది. రాష్ట్ర అభివృద్ధి.. ప్రజా సంక్షేమం విషయంలో ముందు చూపు ఉన్న నేత. అలాంటి నేతతో మీకూ అనుబంధం ఉందా?. 👉ఎప్పుడైనా జగన్‌తో కలిసి ఫొటోగానీ.. సెల్ఫీగానీ దిగారా? 👉ఆయన గురించి మీ అభిప్రాయం ఏమిటి? మాతో పంచుకోండి..మీరు చేయాల్సిందిల్లా... మీ వివరాలతో 9182729310 నెంబర్‌కు వాట్సాప్ చేయడమే. జగనన్న పుట్టినరోజు (డిసెంబర్ 21న) సందర్భంలో మీ ఫొటోలను, ఆ అనుభవాన్ని మేం ప్రచురిస్తాం.నోట్: సెల్ఫీ వీడియో నిమిషం వీడియో ఉండాలి. -
మలి సంధ్యా... మరో వసంతమే!
‘‘పండుటాకులము మిగిలితిమి.. ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి’’ అని భర్త పదవీ విరమణ రోజు భార్య పాడుతున్నట్లుగా ఓ సినీ గీతిక సాగుతుంది. పాటలోని భావమూ మనకు భారంగా అనిపిస్తుంది, కానీ ప్రస్తుత ప్రపంచ ధోరణికి ఆ వాక్యాలు సరిపోవని అనిపిస్తుంది. వృద్ధులు పండుటాకులు కాదు. అనుభవంతో మన ముందు నిలిచే నిండైన అమృత భాండాలు.ప్రతి మనిషి జీవిత దశని రెండు ప్రధాన అంగాలుగా విభజించుకోవచ్చు. మొదటిది ఉద్యోగబాధ్యతలు నిర్వర్తిస్తూ భార్యాబిడ్డలతో కాలాన్ని గడపడం. రెండోది.. బాధ్యతలను పూర్తిచేసి, ఉద్యోగవిరమణ తర్వాత లేదా ఆరు పదులు నిండాక గడిపే కాలం. వీటిలో మొదటి దశకే ప్రాధాన్యం ఉందని, రెండో దశ పనికిరానిదని భావించడం ఏమాత్రం సమంజసం కాదు.ప్రతి జీవన దశలోనూ మనిషికి ప్రత్యేకమైన విషయాలపై శ్రద్ధ కనబరచవలసి ఉంటుంది. అదే విధంగా వృద్ధాప్యంలోనూ కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే, మలిసంజెలో వెల్లివిరిసే కాంతులు వారికి మనోహరంగానే అగుపిస్తాయి.యవ్వనంలో పటుత్వం, బిగువు జీవులకు సహజ గుణం. వయసు పెరుగుతున్న కొద్దీ బిగువు సడలుతూ ఉంటుంది. అది శరీరానికుండే సహజ లక్షణం. గడచిపోయిన కాలం ఒక అనుభవాల సుమహారంలా పరిమళిస్తూ ఉంటుంది. ఎంతో విలువైన అనుభవాలు, అవి నేర్పిన పాఠాలను యువతరానికి నేర్పడాన్ని మించిన ఆనందం ఏముంటుంది? ప్రతి అనుభవం ఎంతో విలువైనది. ఎన్నో కష్టాలను, దుఃఖాలను దాటుకుని తెచ్చుకున్న విజయాలను పంచుకుని భావితరాలను తీర్చిదిద్దగలిగింది విశ్రాంత జీవనం గడిపి మలి సంజలో కాలం గడిపే అనుభవ సంపన్నులే. వారి అనుభవాల చేవను ఏ వ్యక్తిత్వ వికాస గ్రంథాలూ అందించలేవు. అనుభవైక వేద్యమైన వారి జీవనగమనాన్ని కొడుకులతో, మనవళ్ళతో పంచుకుంటూ గడపడం ఆహ్లాదకరమైన విషయం.దేశంలోని, ప్రపంచంలోని రకరకాల ప్రదేశాలు చూసే అవకాశం కేవలం విశ్రాంత జీవనంలోనే ఎవరికైనా సాధ్యమవుతుంది. ఉద్యోగంలో లేదా వేరే వ్యాపకంలో ఉండే పని ఒత్తిడివల్ల కొత్త ప్రదేశాలు చూసే సౌలభ్యం తక్కువగానే ఉంటుంది. ఆ విధంగా కొత్త కొత్తవిహారాల్లో సందర్శించే ప్రదేశాలు, అక్కడి వారి ఆహారపు అలవాట్లు, ప్రత్యేకమైన అభిరుచులు తిలకించి ఆనందం పొందడం ద్వారా వృద్ధుల మనసు మరింతగా ఉత్తేజితమవుతుంది. మరింతగా వాళ్ళను చిన్నవాళ్ళను చేసి ఆనంద సంభరితుల్ని చేస్తుందనడం అతిశయోక్తి కాదు.వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే. మదిలో మెదిలే భావాలకు అనుగుణంగా మన జీవన నావ సాగుతూ ఉంటుంది. నేను ఎన్నటికీ నవ యువకుడినే అన్న భావం మదిలో నింపుకుంటే ఆనందం సముద్ర తరంగాల్లా ఉరకలు వేస్తూనే ఉంటుంది. మనం సాధించిన విజయాలూ మన జ్ఞాపకాల పందిరిలోంచి పరిమళించే మల్లికల్లా తొంగి చూస్తూ ఉత్సాహానికి ఊపిరులూదుతూనే ఉంటాయి.వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటివృద్ధాప్యం శాపం కాదు... ఆస్వాదిస్తే అణువణువూ ఆనందమే! ప్రతి జీవీ తమ జీవితంలో వృద్ధాప్యాన్ని ఎదుర్కొనక తప్పదు. అయితే ఈ వృద్ధాప్యాన్ని శాపంగా కాకుండా వరంగా భావించి ఆస్వాదిస్తే వృద్ధాప్యంలో కూడా హాయిగా సమయాన్ని అనుభవించవచ్చు. వృద్ధాప్యాన్ని బాధామయమని భావించకుండా, మన కోసం మనం జీవించే అద్భుత అవకాశంగా భావించిన నాడు వృద్ధాప్యం ఏమాత్రం బాధించదు. పెద్దవయసులో గుర్తుపెట్టుకోవలసింది మన వయసును కాదు.. గడిపే ప్రతి క్షణం తీసుకువచ్చే ఆనందాన్ని మాత్రమే..!! యవ్వనం కొంగ్రొత్త భోగాల సారం.. వృద్ధాప్యం అనుభవాల మణిహారం..!! -
సంపదలు సత్కార్యాలకు ద్వారాలు
సాధారణంగా సంపద అంటే డబ్బులు అనుకుంటారు. కాని, సనాతన ధర్మం ఎప్పుడు కాగితం ముక్కల్ని కాని, లోహపు బిళ్ళలని కాని ధనంగా పరిగణించినట్టు కనపడదు. అష్టలక్ష్ములు అని చేప్పే సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ధనంగా చెప్పటం జరిగింది. సత్కార్యాలు చేయటానికి చేతి నిండుగా డబ్బు లేదే అని బాధ పడ నవసరం లేదు. మనకి ఎన్నో రకాలైన సంపదలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేయవచ్చు.సంపదలు ఉంటే ఎన్నో సత్కార్యాలు చేయవచ్చు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. సంపదలు అనుభవించటానికి మాత్రమే అని లోకంలో ఉన్న అభిప్రాయం. కానీ, అవి ఎన్ని పనులు చేయటానికో సాధనాలు. దురదష్టవంతులు, దుర్మార్గులు అయినవారికి పతనానికి హేతువులుఅవుతాయి. సంపద అంటే ఇతరులకి ఎంత ఇచ్చినా తరగనంత ఉన్నది. తాను అనుభవించటానికి లేదే అని కొద్దిగా కూడా బాధ పడవలసిన అవసరం లేనంత ఉండటం. ఎవరికైనా ఇవ్వాలంటే ముందు తన దగ్గర ఉండాలి కదా! ఇవ్వాలని ఉద్దేశం ఉంది కాని, తన దగ్గర తగినంత లేక పోతే ఏమి చేయగలరు ఎవరైనా? అందువల్ల ఎవరికైనా సహాయం చేయాలంటే తగినంత సమకూర్చుకోవలసి ఉంటుంది. అన్నిటిని మించి ఆరోగ్యవంతమైన శరీరం ఉంది. దానితో శారీరకంగా బలహీనంగా ఉన్న వారికి సహాయం చేయ వచ్చు. బలహీనుడు మరొకరికి చేయూత నివ్వలేడు కదా! కనీసం ఈ సంపదని పెంపొందించు కోవచ్చు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం కోసమైనా ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. అదీ కాక పోయినా, తాను ఇతరుల పైన ఆధార పడి ఉండకుండా ఉంటే అదే పెద్ద సహాయం. (నట్టింటి నుంచి.. నెట్టింటికి..)మరొక ప్రధాన మైన సంపద జ్ఞానసంపద. ఇతరులకి జ్ఞానాన్ని పంచాలి అంటే తన దగ్గర ఉండాలి. ఎంత చదువుకుంటే ఏం లాభం? అంటూ ఉంటారు చాలా మంది. నిజమే! దానిని ఎవరికి పంచక, తన జీవితంలో ఉపయోగపరచక పోతే వ్యర్థమే. సార్థకం చేసుకోవాలంటే తనకున్న జ్ఞానాన్ని వీలైనంత మందికి పంచుతూ పోవాలి. ఈ మాట అనగానే నాకు పెద్ద పెద్ద డిగ్రీలు లేవు నేనేం చేయ గలను? అంటారు. జ్ఞానం అంటే కళాశాలలలోనో, విశ్వవిద్యాలయాలలోనో చదివితే వచ్చేది కాదు. ఆ చదువు సహజంగా ఉన్న దానికి సహకరించ వచ్చు. అనుభవంతో, లోకాన్ని పరిశీలించటంతో వచ్చేది ఎక్కువ. ఆ జ్ఞానాన్ని తన వద్దనే ఉంచుకోకుండా పదిమందికి పంచితే నశించకుండా తరువాతి తరాలకి అందుతుంది. అందుకే ధర్మశాస్త్రాలు కూడా ఏదైనా విషయంలో కలిగిన సందేహానికి పరిష్కారం గ్రంథాలలో లభించక పోతే ఆ కుటుంబంలో వృద్ధురాలైన మహిళని అడగమని చెప్పాయి. అనుభవ జ్ఞానం అంత గొప్పది. అన్నిటినీ మించినది ప్రేమ. దీనితోఎన్నిటినో సాధించవచ్చు. ఈ సంపద పంచిన కొద్ది పెరుగుతూ ఉంటుంది. మనం ఇచ్చినదే మన సంపద. దాచుకున్నది ఏమవుతుందో తెలియదు. మనం అన్ని విధాలా సంపన్నులం అయే మార్గం తెలిసింది కదా! శారీరికంగా ఏమీ చేయలేనప్పుడు ఏ మాత్రం కష్టపడకుండా చేయగలిగిన సహాయం కూడా ఉంది. అది మాట సాయం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న వారికి మాట సహాయం చేయవచ్చు. తాను చేయ లేక పోయినా, చేసే వారిని చూపించ వచ్చు. అది కూడా తనకి అందుబాటులో లేక పోతే కష్టంలో ఉన్నప్పుడు ఓదార్పుగా ఒక్క మాట చెపితే ఎంతో ధైర్యం కలుగుతుంది. మాట్లాడితే నోటి ముత్యాలు రాలిపోవుగా! ఇదీ చేయటం రాక పోతే ఊరకున్నంత ఉత్తమం లేదు. పిచ్చి మాటలు మాట్లాడి చెడగొట్టకుండా ఉండటం కూడా గొప్ప సహాయమే అంటారు తెలిసిన పెద్దలు. నేర్పుగా మాట్లాడిన ఒక్క మాటతో సమస్యల పరిష్కారం, బాధల నుండి ఓదార్పు దొరకటం చూస్తూనే ఉంటాం. – డా. ఎన్. అనంతలక్ష్మి -
జాబ్ అంటే చావేనా? ఊపిరి తీస్తున్న ఉద్యోగాలు!
కార్పొరేట్ రంగంలో పని సంస్కృతి రానురాను విషపూరితంగా మారుతోంది. తీవ్రమైన పని ఒత్తిడితో ఉద్యోగులు సతమతవుతున్నారు. రోజూ నిద్రాహారాలు లేకుండా 15 గంటలకు పైగా సుదీర్ఘంగా పని చేయాల్సి ఉండటంతో శారీరక, మానసిక అనారోగ్యాలకు గురవుతున్నారు. ఒత్తిడి తాళలేక కొంత మంది తనువులు చాలిస్తున్నారు."పని ఒత్తిడి" కారణంగా ఎర్నెస్ట్ & యంగ్ (EY) కన్సల్టెంట్ 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డెలాయిట్ మాజీ ఉద్యోగి దేశంలోని కార్పొరేట్ రంగంలో విషపూరితమైన పని సంస్కృతికి సంబంధించిన తన సొంత అనుభవాన్ని పంచుకోవడానికి ముందుకు వచ్చారు. ఇండోర్‌కు చెందిన జయేష్ జైన్ తన స్వానుభవాన్ని ‘ఎక్స్’(ట్విటర్)లో వివరించారు."అన్నా ఎంత ఒత్తిడి అనుభవించిందో పూర్తిగా అర్థం చేసుకోగలను" అంటూ తాను డెలాయిట్‌లో అనుభవించిన తీవ్రమైన ఒత్తిడిని వివరించారు. వేకువజామున 5 గంటల సమయంలో వర్క్ గురించి, తద్వారా తలెత్తిన ఆరోగ్య సమస్యల గురించి సహచరులతో చర్చించిన చాట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు.రోజులో దాదాపు 20 గంటలు పని చేసేవాళ్లమని, అయితే అన్నేసి గంటలు పనిచేసినా కూడా 15 గంటలకు మించి పని చేసినట్టుగా లాగిన్‌లో చూపేందుకు వీలుండేది కాదని రాసుకొచ్చారు. "ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు వారికి (కంపెనీలకు) ఒక ఉద్యోగి మాత్రమే. కానీ మీ కుటుంబానికి మీరే సర్వస్వం" అంటూ ఒత్తిడి గురయ్యే ఉద్యోగులను ఉద్దేశించి హితవు పలికారు. "కార్పొరేట్ జీవితమంటేనే కఠినం. తొందరగానే అక్కడి నుండి బయటపడగలిగినందుకు సంతోషిస్తున్నాను" పోస్ట్‌ను ముగించారు.With EY case getting some lights. I would like to share my personal experience at Deloitte. Attaching some screenshots of chats with my team mate - friend where we were discussing the work and our health at 5AM in the morning. We use to work for around 20 hours and they won’t… pic.twitter.com/EjtqWjhwSm— Jayesh Jain (@arey_jainsaab) September 18, 2024 -
ఆ మాత్రం ఆలోచన ఎందుకు రాదు : గుత్తా జ్వాల ఫైర్, ఫోటో వైరల్
ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పొల్గొనే భారతీయ క్రీడాకారుల యూనిఫాం డిజైన్‌పై అసంతృప్తి చెలరేగింది. ముఖ్యంగా తరుణ్ తహిలియానిపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ముఖ్యంగా మహిళల దుస్తులపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి రియో ఒలింపిక్స్నాటి ఫొటోతో.. దుస్తులను, తమకెదురైన అసౌకర్యం గురించి తన అనుభవాన్ని షేర్ చేశారు. ఫోటోలను కూడా ట్వీట్ చేశారు. After not much of thinking..The garments which was made for the Indian contingent participating in Olympics this time has been a huge disappointment!! (Especially when the designer was announced I had huge expectations)First not all girls know how to wear a saree…why didn’t… pic.twitter.com/b5UjzpvUJQ— Gutta Jwala 💙 (@Guttajwala) July 28, 2024‘‘ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందం కోసం తయారు చేసిన వస్త్రాలు నిరాశ పరుస్తూనే వస్తున్నాయి. టీమిండియా దుస్తులు డిజైనర్‌ను ప్రకటించాక నేనైతే భారీ అంచనాలే పెట్టుకున్నా. కానీ దాదాపు అమ్మాయిలందరికీ చీర కట్టుకోవడం రాదు. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా రెడీ టూ వేర్ చీరను డిజైన్ చేయాలన్ని కనీస ఆలోచన ఎందుకు చేయలేక పోయారో అర్థం కాలేదు. ఆ పిచ్చి బ్లౌజ్‌లు, బాడీకి ఫిట్ కాక చాలా ఇబ్బందులు పడ్డాం. అస్సలు సౌకర్యంగా లేవు. పైగానాసికరంగా, చూడటానికి దారుణంగా ఉన్నాయి. భారత సంప్రదాయాలను ప్రతిబింబించేలా చీరలపై ఎంబ్రాయిడరీ లేదా హ్యాండ్ పెయింట్ ద్వారా మన కళలను ప్రదర్శించేందుకు డిజైనర్లకు అవకాశం ఉన్నాఎందుకు ఉపయోగించుకోలేదు. ఇప్పటికైనా మైదానం లోపల, బైట క్రీడాకారులకు ఇచ్చే దుస్తుల నాణ్యతపై క్రీడాకుటుంబం రాజీ లేని ధోరణి అవలంబిస్తారని ఆశిస్తున్నాను’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.దీంతో చాలామంది నెటిజన్లు కూడా గుత్తాజ్వాలకు మద్దతు పలికారు. ఇంట్రెస్టింగ్ షేడ్ అండ్ డిజైన్ ఉంటే బాగుండేది. అలాగే చుడీదార్ కుర్తా లేదా రెడీమేడ్ చీర అయితే బావుండేది. తరుణ్ తహిలియానీ భారతదేశ సంస్కృతిని ప్రదర్శించే మంచి అవకాశాన్ని కోల్పోయారని ఒకరు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి : పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం.. నెట్టింట చర్చ కాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో క్రీడాకారిణి మను భాకర్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతోంది. మూడో ఒలింపిక్ మెడల్ సాధించే క్రమంలో ఆదివారం జరిగిన గ్రూప్–ఎమ్ తొలి మ్యాచ్‌లో సింధు 21–9, 21–6తో ఫాతిమా అబ్దుల్ రజాక్ (మాల్దీవ్స్)పై విజయం సాధించి శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగే రెండో మ్యాచ్‌లో సింధు.. క్రిస్టినా కుబా (ఈస్టోనియా)తో తలపడుతుంది. -
ఫ్రెషర్లకు పిడుగులాంటి వార్త!.. కొత్త ఉద్యోగాల్లో..
2024-25లో రిక్రూట్మెంట్ కార్యకలాపాలలో కొత్త పొజిషన్లను దాఖలు చేయడంపై దృష్టి పెట్టాలని సర్వేలు చెబుతున్నాయి. కొత్త ఉగ్యగాల భర్తీ కోసం అనుభవం, ప్రతిభ ఉన్న వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని స్టాఫింగ్ సొల్యూషన్స్ అండ్ హెచ్ఆర్ సర్వీసెస్ ప్రొవైడర్ జీనియస్ కన్సల్టెంట్స్ హైరింగ్, కాంపెన్సేషన్ & అట్రిషన్ మేనేజ్మెంట్ రిపోర్ట్ వెల్లడించింది.పరిశ్రమల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త పాత్రలను సృష్టించడం ద్వారా వృద్ధి, ఆవిష్కరణలను అభివృద్ధి చేయడం ప్రాథమిక లక్ష్యం.. అని జీనియస్ కన్సల్టెంట్స్ సీఎండీ ఆర్పీ యాదవ్ పేర్కొన్నారు. నియామకాలలో 4 నుంచి 8 సంవత్సరాలు అనుభవం ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 32 శాతం అనుభవం ఉన్నవారికే కొత్త ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయి.1 నుంచి 4 సంవత్సరాలు అనుభవం ఉన్న వారిని 26 శాతం, ఫ్రెషర్లను కేవలం 15 శాతం మాత్రమే రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని సమాచారం. తాత్కాలిక నియమాలు 27 శాతం, 25 శాతంతో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు నియామకం, 24 శాతం గిగ్ స్టాఫ్ నియామకాలు ఉంటాయని తెలుస్తోంది. -
ఎదురయ్యే అనుభవాన్ని ఏవిధంగా తీసుకుంటావనే దానిపైనే..
చదువు వేరు జీవితం వేరు. చాలామంది అంత చదువుకున్నాడు అలా ఎలా నిర్ణయం తీసుకున్నాడు. పెద్ద పెద్ద చదువులు చదివి కూడా ఇలా ఎలా ఆలోచిస్తున్నాడు. వంటి మాటలు తరుచు వింటుంటాం. నిజానికి చదువుకి చాలా తేడా ఉంది. చదువులో రాజీ పడకుండా చదివితేనే గెలుపుని అందుకోగలం. అదే జీవితంలో బంధాలు నిలవాలన్న, కాపాడుకోవాలన్న రాజీపడాలి. అంటే ఇక్కడ ప్రతిసారి గమ్మని కూర్చొమని కాదు. తగ్గాల్సిన చోట తగ్గాలి పెదవి విప్పి గట్టిగా చెప్పాల్సినప్పుడూ చెప్పాలి. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఏది మాట్లాడితే సమస్య రాదో ఎవ్వరికి గాయం కాకుండా సూటిగా విషయం అవగతమయ్యేలా చెప్పే నేర్పు, ఓర్పు కావాలి లేదంటే జీవితాలు తలకిందులవ్వుతాయి. ముందుకు అసలు జీవితంలో జరిగే ప్రతికూలతల విషయాలను ఎలా స్వీకరించాలో చూద్దాం!. జీవితంలో ఏం కావాలను కుంటారో అది చాలామందికి దక్కదు. దక్కకపోవడం సహజంగా బాధను కలిగిస్తుంది. దక్కినదాంట్లోనే ఆనందం వెతుక్కునేవారు మరోరకం. తృప్తి, అసంతృప్తి అనేవి మనుషుల ఆలోచనా విధానంలో ఉంటాయి. కొందరు నిరంతరం కావాల్సిన దానికోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటారు. ఏ పద్ధతిలో అన్నది ముఖ్యం. అన్నీ కలిసివస్తే అదృష్టవంతుడిగా చలామణీ అయ్యే మనిషి గెలుపును కేవలం తన ప్రతిభగా ప్రకటించుకోవడం ఎంతవరకు సమంజసం? కోరిక ఉండాలి. దాన్ని నెరవేర్చుకునేందుకు కృషి జరగాలి. ఫలితం ఎలా ఉన్నా ప్రయత్నంలో మాత్రం ఆనందం పొందాలి. లక్ష్యసాధనలో రాజీ పడకూడదు. జీవితం ఎలా రూపుదిద్దుకుంటుందో, ఎక్కడెక్కడ మలుపులు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మనం చేసే మంచి పనులే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయని భావించేవారు కొందరైతే, మనం గతంలో చేసుకున్నదాన్ని బట్టే ఈ స్థితి అని విశ్వసించేవారు మరికొందరు. ఎదురయ్యే అనుభవాన్ని ఏ విధంగా తీసుకుంటామన్నదే ముఖ్యం. అదే జీవితసత్యం. (చదవండి: ఆ పార్కులో మాటల్లేవ్! కేవలం నిశబ్దమే..మనుషులంతా విగ్రహాలే!) -
ఎక్స్పీరియన్స్ ఉందా? ...ఆ గృహిణిగా బోలెడంత!
ఒక ఉద్యోగంలో ఎవరైనా ఎన్ని గంటలు పని చేస్తారు? 8 గంటలు. మరి గృహిణి? 24 గంటలు. ఆ అనుభవం ఎక్కువా? ఈ అనుభవం ఎక్కువా? సీట్లో కూచుని చేసే ఉద్యోగం అనుకోండి... గృహిణికి ఇల్లే కదా సీటు. ఆ సీటు వదులుతుందా ఆమె. అందులోనే కూచుని అన్ని పనులూ చక్కబెడుతుంది. పిల్లలూ, వంట, బట్టలుతకడం, అత్తామామలను చూసుకోవడం, బంధువులొస్తే చేసి పెట్టడం.... సరే. బయట తిరిగి చేయాల్సిన ఉద్యోగం అనుకోండి. గృహిణి ఏమన్నా ఇంట్లో కూచుంటుందా ఏం? బయటే కదా తిరగాలి. పిల్లల్ని స్కూల్లో వదలడానికి, కూరగాయలు తేవడానికి, కరెంటు బిల్లు కట్టడానికి, సరుకుల కోసం, ఇంట్లో ఉండే పెద్దవాళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి, మందులకూ మాకులకూ... తిరగాల్సిందే కదా. ఉద్యోగంలో నీకు అనుభవం ఉందా అనంటే ఆఫీసులో చేసిన ఉద్యోగానిది మాత్రమే అనుభవమా... గృహిణిగా ఉండి చేసింది అనుభవం కాదా? ఈ ప్రశ్నే వేసింది ఒక గృహిణి. అసలేం జరిగింది సాధారణంగా కొత్త జాబ్ వెతుక్కోవాలంటే సి.వి (రెజ్యూమె)ని పక్కాగా రెడీ చేసుకోవాలి. విద్యార్హతలు, నైపుణ్యాలతోపాటు అనుభవం తప్పనిసరిగా చెప్పాలి. ఉద్యోగం మానేసి మధ్యలో గ్యాప్ ఉంటే ఆ సమయంలో ఏం చేశామో కూడా సదరు కంపెనీకి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం చాలామంది రకరకాల కారణాలను చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటోన్న ఓ మహిళ మాత్రం గతంలో ఉద్యోగం చేసి మానేసి తిరిగి ఉద్యోగానికి అప్లయి చేస్తూ గ్యాప్‌లో 13 ఏళ్లపాటు గృహిణిగా పని చేసానని రెజ్యూమెను అప్లోడ్ చేసింది. గ్రౌతిక్ అనే కంటెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు యుగన్ష్ చోక్రా ఆమె సి.వి.ని చూసి మురిసిపోయాడు. ఈమె ఎంతో నిజాయితీగా గృహిణిగా పని చేశానని చెబుతోంది అని ప్రశంసిస్తూ సి.వి.ని లింక్డ్ఇన్లో పోస్టు చేశారు. ఈ పోస్టుప్రకారం... ఓ మహిళ గతంలో ఉద్యోగం చేసి 2009లో ఇంటి అవసరాల నిమిత్తం మానేసింది. ఇప్పుడు కాస్త వెసులుబాటు దొరకడంలో మళ్లీ చేసేందుకు రెడీ అయ్యింది. తన రెజ్యూమెని తయారు చేసింది. అందులో గ్యాప్‌లో ఏం చేశావ్? అనే ప్రశ్నకు పదమూడేళ్లపాటు గృహిణిగా చేశానని చెప్పింది. ‘గృహిణి అంటే ఫుల్‌టైమ్ జాబ్. సి.వి.లో దానిని ప్రత్యేకంగా చెప్పడం చాలా మంచి విషయం. ఎంతో మంది గ్యాప్‌లో ఏం చేశారంటే అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేశామని ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లు పెడుతుంటారు. కానీ ఈమె చాలా నిజాయితీగా చెప్పి తన వ్యక్తిత్వమేమిటో చెప్పకనే చెప్పింది’ అని చోక్రా ప్రశంసించారు. ఈ పోస్టును చూసిన నెటిజన్లు ఆమెను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. ఇదో మేలుకొలుపు ఈ పోస్టు ఎంతో మంది మహిళలకు, కంపెనీలకు మేలుకొలుపులాంటిది. నిజానికి గృహిణిగా ఉండటానికి ఏ ఉద్యోగి అయినా గ్యాప్ తీసుకుంటే ఆమెకు అదొక ప్రత్యేక అర్హతగా భావించి ప్రత్యేక రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగం ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలిస్తే తప్పు లేదు. కారణం? గృహిణిగా స్త్రీ ఇంటì ని, తద్వారా సమాజాన్ని నిలబెడుతుంది. పిల్లలను ఆరోగ్యకరంగా పెంచి మంచి పౌరులుగా సమాజానికి ఇస్తుంది. భర్త ఇంటి టెన్షన్లలో మునగకుండా పని మీద శ్రద్ధ పెట్టి మంచిగా పని చేసి వ్యవస్థ ముందుకెళ్లడంలో సాయపడుతుంది. ఇన్ని చేసిన స్త్రీ– తనకు వెసులుబాటు దొరికి ఉద్యోగం చేస్తానంటే పిలిచి ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీలకు ఉంటుంది. అలాంటి స్త్రీలను ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజానికుంటుంది. హోం మేకర్‌గా ఇక జీవితం అయిపోయింది అనుకోకుండా అదే ఒక అర్హతగా ఉద్యోగం వెతుక్కోవచ్చని ఈ పోస్టు భరోసా ఇస్తోంది. ఇంకెందుకు ఆలస్యం... గృహిణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా ధైర్యంగా ఉద్యోగాలు వెతుక్కోండి మహిళలూ. -
ఇంటి గేటు దగ్గర ఎర్రని గుర్తులు.. నెటిజన్ల వివరణలకు మహిళ హడల్!
ప్రపంచంలో నేరాలు చేసేందుకు నేరస్తులు వివిధ మార్గాలను ఎన్నుకుంటుంటారు. కొందరు నేరస్తులు ఫోనులో బెదిరిస్తే, మరికొందరు నేరం చేసేముందు ఏదో ఒక సూచన చేస్తారు. అయితే ఇటీవల ఒక మహిళకు ఎదురైన అనుభవం ఆమెకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఆస్ట్రేలియాలోని విక్టోరియాకు చెందిన ఈ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్బుక్ మాధ్యమంలో అందరికీ తెలియజేసింది. ఆ మహిళ తన అనుభవాన్ని ఎఫ్బీలో తెలియజేస్తూ..‘కొద్దిరోజుల క్రితం మా ఇంటి లెటర్ బాక్స్‌పై ఎరుపు రంగు గుర్తులు కనిపించాయి. మరోమారు కూడా ఇంటి సైడ్ గేట్ దగ్గర మళ్లీ ఇటువంటి గుర్తులే కనిపించాయి. రెండు రోజుల క్రితం రాత్రి వేళ ఇంటి రెండవ గేటు తెరచివుంది. ఇలా ఎందుకు జరుగుతున్నదో నాకు అర్థం కాలేదు. దీనిపై నాలో ఆందోళన మొదలయ్యింది. ఆ గేటు కొంచెం కష్టంమీద తెరవాల్సి ఉంటుంది. అయినప్పటికీ గాలి కారణంగానే ఆ గేటు తెరుచుకుని ఉంటుందని భావిస్తున్నాను. ఎవరి ఇంటి దగ్గరైనా ఇటువంటి చిహ్నాలు కనిపించాయా? ఎవరికైనా ఇటువంటి అనుభవం ఎదురయ్యిందా?’ అని ఆమె నెటిజన్లను ప్రశ్నించింది. సదరు మహిళ ఈ పోస్టు విషయంలో ఎంతో సస్పెన్స్ మెయింటైన్ చేసింది. దీనిని స్పందించిన ఒక యూజర్ ‘మీ ఇంటిలోని కుక్కలను తీసుకుపోయేందుకు ఎవరో దొంగ ఈ చిహ్నాలు వేశాడని’ రాశారు. ఇటువంటి గుర్తులను కుక్కలను ఎత్తుకుపోయేవారు వేస్తుంటారని విన్నానని, మీ కుక్కలను జాగ్రత్తగా కోవాలంటూ ఆయన సలహా ఇచ్చారు. కొంతమంది యూజర్లు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి, సీసీటీవీ కెమెరాలు అమర్చుకోవాలని, గేటుకు తాళం వేయాలని సలహా ఇచ్చారు. కాగా ఆ మహిళ తన ఇంటి బయట ఉన్న గుర్తులకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఒక ఫొటోపై నాలుగు ఎర్రని సమాంతర రేఖలు ఉండగా, మరో ఫొటోపై ఎన్టీ ఆని రాసివుంది. మరో ఫొటోపై ఎస్ అని రాసి వుంది. దీనికి స్పందించిన ఒక యూజర్ ఎన్టీ అంటే ‘నో థ్రెట్’ ఎస్ అంటే సెక్యూరిటీ ఉందని పేర్కొన్నారు. చివరకు ఆ మహిళ పోలీసులకు ఈ సమాచారాన్ని తెలియజేసింది. పోలీసులు తదుపరి చర్యలు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: కొడుకు బర్త్‌డేకి తల్లి సర్ప్రైజ్.. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోందంటూ.. -
‘ఈ ‘డర్టీ పాస్‌పోర్ట్’ పాస్ చేయాలంటే రూ. 82 వేలు కట్టాల్సిందే’.. యువతికి వేధింపులు!
ఎవరైనా సరే తమకు సంబంధించిన ముఖ్యమైన ధృవీకరణ పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోకపోతే సమస్యల్లో పడతారు. ఇటువంటి నేపధ్యంలోనే అస్ట్రేలియాకు చెందిన ఒక మహిళ చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఎయిర్‌పోర్టు కౌంటర్లో.. బాలీ విమానాశ్రయం అధికారులు ఒక ఆస్ట్రేలియా యువతి దగ్గరున్నది ‘డర్టీ పాస్‌పోర్ట్’ అని ఆరోపిస్తూ, రూ. 1000 డాలర్లు వసూలు చేశారు. అధికారులు ఆమె దగ్గరున్న ‘డర్టీ పాస్ట్‌పోర్ట్’ను స్వీకరించలేమని పేర్కొన్నారు. న్యూయార్క్ పోస్ట్ రిపోర్టును అనుసరించి 28 ఏళ్ల యువతి తన తల్లితోపాటు సెలవుల్లో ఎంజాయ్ చేసేందుకు ఇండోనేషియా వెళుతోంది. బాటిక్ ఎయిర్‌పోర్టు కౌంటర్లో ఆమెకు చేదు అనుభవం ఎదురయ్యింది. ఆమె దగ్గరున్న పాస్‌పోర్ట్ పాతబడిపోవడంతో ఆమె కొత్తగా ఒక ఫారం నింపాల్సి వచ్చింది. 7 సంవత్సరాల క్రితంనాటిది కావడంతో.. ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆమెచేత ఒక ప్రత్యేకమైన నీలిరంగు ఫారం మీద సంతకం చేయించారు. దానిని తనతో ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ పత్రానికి సంబంధించిన ప్రక్రియతోపాటు ఇమిగ్రేషన్ పూర్తయిన తరువాత వారికి విమానం ఎక్కేందుకు అనుమతి లభించింది. ఆ యువతి తెలిపిన వివరాల ప్రకారం ఆ పాస్‌పోర్ట్ 7 సంవత్సరాల క్రితంనాటిది. దీంతో అది కాస్త మురికిగా తయారయ్యింది. ‘నన్ను ఎగతాళి చేశారు’ ఆమె తన అనుభవాన్ని వివరిస్తూ ‘మాకు నిజమైన ఇబ్బంది బాలీ ఎయిర్‌పోర్టులో ఎదురయ్యింది. బాలీ ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్‌కు ముందు అధికారులు నన్ను గంటపాటు ప్రశ్నించారు. వారు నన్ను చూసి నవ్వారు. చట్టాన్ని అతిక్రమించానని ఆరోపించారు. నా పాస్‌పోర్ట్ డ్యామేజ్ అయ్యిందంటూ ఎగతాళి చేశారు. 1000 డాలర్లు కడితే నా సమస్య పరిష్కారం అవుతుందని, లేనిపక్షంలో పాస్‌పోర్ట్ తిరగి ఇవ్వబోమని తెలిపారు. పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వబోమంటూ.. ఇటీవలే నేను ఉద్యోగాన్ని కోల్పోవడం వలన అంత మెత్తం చెల్లించలేనన్నాను. వెంటనే అధికారులు మా అమ్మతో మాట్లాడి, తన డర్టీ పాస్‌పోర్ట్ చెల్లుబాటుకు అనుమతినివ్వాలంటే 1000 డాలర్లు చెల్లించాలని మరోమారు తెలిపారు. అయితే ఆమె కూడా ఇందుకు సమ్మతించలేదు. దీంతో అధికారులు తన పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వబోమని హెచ్చరించారు. మరోమార్గం లేక అధికారులకు వారు అడిగినంత మొత్తం చెల్లించామని, అప్పుడు తమ ప్రయాణానికి ఏర్పడిన ఆటంకం తొలగిపోయిందని’ ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్! -
‘ ఒక పెద్ద కుదుపు.. అంతా అయిపోయింది’
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన భయానక రైలు ప్రమాదం అందరిలోనూ దడ పుట్టించింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకూ 275 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మృత్యుముఖాన్ని చూసి, ప్రాణాలతో బతికి బట్టకట్టారు. అలాగే ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారు కూడా చాలామంది ఉన్నారు. వీరు ఈ ఘటనను మరువలేకపోతున్నామని చెబుతున్నారు. బాలేశ్వర్‌కు చెందిన జితేంద్ర నాయక్ ఈ ఘటనను ప్రత్యక్షంగా చూశారు. ఆయన ఈ దుర్ఘటన సంభవించిన సమయంలో తనకు ఎదురైన అనుభూతిని మీడియాకు తెలిపారు. జితేంద్ర నాయక్ మీడియాతో మాట్లాడుతూ ‘ నేను ఆ సమయంలో కోరమాండల్‌లోని జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నాను. ఆ బోగీలో 100 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. దీంతో బోగీ రద్దీగా మారింది. బోగీలో నేను కింద కూర్చున్నాను. రైలు ముందుకు కదిలిన కొద్దసేపటికే రైలులో వైబ్రేషన్ మొదలయ్యింది. ట్రైన్ అటుఇటు కదులుతున్నట్లు అనిపించింది. కొన్ని నిముషాల తరువాత హఠాత్తుగా పెద్ద కుదుపు వచ్చింది. దాని తరువాత ఏమయ్యిందో తెలియలేదు. చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’ రైలు అంతా పొగమయంగా మారిపోయింది. కళ్లు నులుముకుని చూసే సరికి, కొందరు చేతులు తెగి పడినవారు, కాళ్లను కోల్పోయినవారు, ముఖం, శరీరంపై తీవ్ర గాయాలయినవారు కనిపించారు. నేను రైలులో నుంచి ఎలాగోలా బయటకు వచ్చాను . అప్పుడు నాకు కొత్త జీవితం దొరికినట్లు అనిపించింది. ఆ సమయంలో నన్ను ఎవరూ కాపాడలేదు. నేనే అతి కష్టం మీద శిధిలాల నుంచి బయటపడ్డాను. ఆ సమయంలో చాలామంది క్షతగాత్రులు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. నేను ప్రయాణించిన జనరల్ బోగీలోని ప్రయాణికులెవరూ బతికివుండే అవకాశం లేదు. భగవంతుడు నాకు నూతన జీవితాన్ని ప్రసాదించాడు. అందుకు నేను భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు. -
అంతరిక్షంలో అరుదైన దృశ్యం, సూర్య మామతో చంద్రుడి ఆటలు
-
లేస్ గౌర్మెట్ చిప్స్: పెప్సికో ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ శైలజా జోషి ఏమన్నారంటే!
పెప్సికో 2022లో లేస్ గౌర్మెట్‌తో ప్రీమియం పొటాటో చిప్స్లోకి ప్రవేశించింది.ఈ కేటగిరీలో వినియోగదారులు మరిన్ని ప్రీమియం అనుభవాల కోసం చూస్తున్నారంటున్నారు పెప్సి కో ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ శైలజా జోషి. కేటగిరీ ప్రీమియమైజేషన్ గురించి, రూ.20 రేంజ్లో అందించే కొత్త ప్లాన్..తదితర వివరాలు ఆమె మాటల్లోనే.. ఆగస్టు 2022లో లే గౌర్మెట్ను ప్రారంభించాం. వీటికి మంచి స్పందన వచ్చింది. వినియోగదారుల గురించి, అవుట్లెట్ల గురించి తెలుసుకున్నాము. స్పందన బాగుంది. జీవితంలో మంచి విషయాలను ఆస్వాదించేవారు గౌర్మెట్ను ఆనందిస్తారు. ఈ స్నాక్ అందించే అనుభూతులు మరింత ఆనందంగా ఉంటాయి. ప్రతీ ఒక్కరు చక్కటి స్నాక్స్‌తో ట్రీట్ చేసుకోవాలనుకుంటుంటారు. లేస్ గౌర్మెట్‌కు వచ్చిన విశేష ఆదరణ దృష్ట్యా దానిని మరింత విస్తరించాలని భావిస్తున్నాం. అందువల్ల, మరింత మందికి లేస్‌ను చేరువచేసే లక్క్ష్యంతో రూ.20 ప్యాకెట్లను విడుదల చేస్తున్నాము. రిటైల్, వినియోగదారుల దృక్కోణం నుండి ఈ ధర అంశం చాలా ముఖ్యమైనది. రూ.20 ప్యాక్‌లు త్వరలో మార్కెట్లో లభింస్తాయి. మరింత విస్తృతంగా పంపిణీ చేయనున్నాం. లేస్ కన్సూమర్తో పోలిస్తే గౌర్మెట్ కొనేవాళ్లు భిన్నమని మీరు భావిస్తున్నారా? ఈ తేడాను జనాభా పరంగా చూడలేం, అప్పటికప్పుడు పుట్టుకొచ్చే అవసరం లేదా సందర్భం కావొచ్చు. ఒక వినియోగదారు ఒక సారి లేస్‌ను తినాలనుకోవచ్చు, ఎందుకంటే అతను/ఆమె స్నేహితులతో సరదాగా గడపాలని కోరుకుంటారు, ఇదొక సంబరం, ఇలాంటి నోరూరించే చిరుతిళ్లతో స్నేహితుల భేటీ సరదాగా ఉంటుంది. వేరే మూడ్‌లో లేదా వేరే సందర్భంలో ఉన్న ఒకే రకమైన వినియోగదారులు లేస్ గౌర్మెట్‌కు కూడా వినియోగదారుగా ఉండవచ్చు. అలాగే, కోవిడ్ తర్వాత, ప్రజలు మరింత కొత్త రుచుల కోసం ఎలా వెతుకుతున్నారో కూడా మేము గమనించాము. లే యొక్క గౌర్మెట్‌తో, చాలా మంది వినియోగదారులు స్నాకింగ్లోకి రావడాన్ని మేము ఖచ్చితంగా చూస్తాము, ఎందుకంటే వారు స్నాకింగ్‌లో చక్కని అనుభవాన్ని కోరుకుంటారు. Q. Not just cooked, crafted. ఈ లైన్ వినగానే సైఫ్ అలీ ఖాన్, ఆయన రాజవంశం గుర్తుకొస్తుంది. అప్పుడు లేస్ ప్రోడక్ట్ ప్రమోషన్లో ఈ వ్యాక్యం వాడారు. ఇప్పుడదే వ్యాక్యాన్ని అలాగే సైఫ్‌ను మళ్లీ ఇప్పుడు ఎంపిక చేసుకున్నారు. ఎలా చూడవచ్చు? సైఫ్ అలీ ఖాన్‌తో మా అనుబంధం చాలా గొప్పది. ఆయనతో చేసిన ప్రయాణం అద్భుతం అందుకే లేస్ గౌర్మెట్ కోసం సైఫ్‌నే మళ్లీ ఎంచుకున్నాం. లేస్ గౌర్మెట్ చిప్స్ బ్రాండ్‌కు అతడే సరైన ఎంపిక. మంచి రుచి, క్రమబద్ధత కలిగిన ఉత్పత్తులకు ప్రాతినిధ్యం వహించారు కాబట్టి సైఫ్‌ను ఎంపిక చేసుకున్నాం. బ్రాండ్ అంబాసిడర్ అవసరం ఎందుకు వచ్చింది? పెప్సీకో కింద ఎన్నో బ్రాండ్లు, ప్రోడక్టులున్నాయి. సైఫ్ అంశాన్ని బ్రాండ్ అంబాసిడర్ అవసరంగా చూడకూడదు. మా బ్రాండ్ ఇమేజ్‌కు మరింత ప్రయోజనం లభిస్తుందని భావించినప్పుడు మేము బ్రాండ్ అంబాసిడర్లతో కలిసి పని చేస్తాము. అలాగే బ్రాండ్ , అంబాసిడర్ రెండూ పరస్పర సంబంధం కలిగి ఉండాలి, రెండూ కలిసి వెళ్లాలి. మా బ్రాండ్‌కు ఉన్న గుర్తింపు, చక్కటి రుచి గురించి ఆలోచిస్తున్నప్పుడు, సైఫ్ అలీ ఖాన్ చాలా విలువను జోడించగలడని మా నమ్మకం. గౌర్మెట్‌తో కలిసి సైఫ్ నడవడం వల్ల ఆ ప్రయాణం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. బ్రాండ్ ఇమేజ్ మరింత ఉన్నతమవుతుంది. అసలు సైఫ్‌ను తీసుకురావడం వెనక మా ఆలోచన ఇదే. చాలా ప్రీమియం బ్రాండ్ల ధరలు రూ.100 వరకు ఉన్నాయి. వాటితో పోలిస్తే గౌర్మెట్ ధర చాలా తక్కువగా ఉంది. ఇది గౌర్మెట్‌కు ఎలా సహాయపడుతుంది? రూ.30, రూ.50ల ఉత్పత్తుల విభాగంలో మీ వాటా వాటా ఎంత? ప్రపంచవ్యాప్తంగా పొటాటో చిప్స్ విభాగంలో అగ్రగామిగా ఉన్నాము. ఒక ఉత్పత్తిని తీసుకొస్తున్నప్పుడు మా నైపుణ్యాన్ని, మా అభ్యాసాలను కేవలం భారతీయ మార్కెట్‌కు పరిమితం చేయాలనుకోవడం లేదు. మార్కెట్‌పై మాకు ఉన్న అవగాహన మాకు గౌర్మెట్ సెగ్మెంట్ ధరల గురించి స్పష్టమైన ఆలోచనన ఇచ్చింది. చాన్నాళ్లుగా మేము మార్కెట్లో ఉన్నాం.ఇది కూడా సత్పలితాలను ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక మార్కెట్లో ఉన్న రూ.30 ప్యాక్ ఉత్పత్తులు ఎక్కువగా సాంప్రదాయ వినియోగదారులు కొంటున్నారు. మా వాటా కూడా దీంట్లోనే ఎక్కువ. అలాగే రూ.50 ప్యాక్ ఉత్పత్తులకు ఇ-కామర్స్‌లో డిమాండ్ ఎక్కువ. లేస్ గౌర్మెట్ చిప్స్ మూడు ఫ్లేవర్లలో ఉన్నాయి. లైమ్ అండ్ క్రాక్డ్ పెప్పర్, థాయ్ స్వీట్ చిల్లీ మరియు వింటేజ్ చీజ్ & పెప్రికా. వీటిలో ఎక్కువ అమ్ముడవుతున్న ఫ్లేవర్ ఏది? మరిన్ని ఫ్లేవర్లు తెచ్చే ఆలోచన ఉందా? థాయ్ స్వీట్ చిల్లీకి మంచి స్పందన వచ్చింది. ఎక్కువ మంది ఏది ఇష్టపడితే అదే ఫ్లేవర్ అవుతుంది. నిజానికి మూడు ఫ్లేవర్ల అమ్మకాల మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. మేము కూడా ఎక్కువ ఉత్పత్తులను ప్రయత్నించే దశలో ఉన్నాము. వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికైతే ఎక్కువ మందికి ఈ రుచులు చేరాలని, వినియోగదారుల సంఖ్య పెరగాలని భావిస్తున్నాం. మా దగ్గర మరిన్ని ఆలోచనలున్నాయి. మార్కెట్ అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు వాటిని అభివృద్ధి చేస్తాం. ప్రస్తుతానికయితే ఈ మూడు ఫ్లేవర్లతో మా వ్యాపారాన్ని పెంచుతాం. -
న్యూగ్రాండ్ విటారా ఎక్స్పీరియన్స్ డ్రైవ్: థ్రిల్ అయిన కస్టమర్లు
హైదరాబాద్: దేశీయ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన ఎస్యూవీ ఆల్ న్యూ గ్రాండ్ విటారాతో ‘‘ఎక్స్పీరియన్స్ డ్రైవ్’’ను నిర్వహించింది. సుమారు 300 మందికి పైగా కస్టమర్లు ర్యాలీలో పాల్గొని ఆల్ న్యూ గ్రాండ్ విటారా సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ డ్రైవ్‌లో వినియోగదారులు గ్రాండ్ విటారా అద్భుతమైన అనుభవం, సామర్థ్యాలతో పులకించి పోయారనీ, ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నెక్సా డీలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. సుజుకీ పేటెంట్ కలిగి ఆల్‌గ్రిప్ సెలెక్ట్ ట్రిమ్ ధర రూ.16.89 లక్షలు ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ డ్రైవ్ ద్వారా గ్రాండ్ విటారాకు సుమారు 100 బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ వెల్లడించింది. ఈ వేరియంట్ లీటరుకు 19.38 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. -
ఉబెర్ కొత్త డిజైన్: రైడర్లకు కొత్త ఫీచర్లు...ఇకపై ఈజీగా!
ముంబై: రైడ్ షేరింగ్ కంపెనీ ఉబర్ మరింత మెరుగ్గా యాప్‌ను తీర్చిదిద్దింది. రైడ్ సమయంలో యాప్‌ను ప్రతీసారి తెరవకుండానే లాక్ స్క్రీన్‌పైనే లైవ్ యాక్టివిటీతో రైడ్, వాహన వివరాలు, ట్రిప్ స్టేటస్‌ను చూడవచ్చు. తన హోమ్స్క్రీన్, కొత్త ఫీచర్ల రీడిజైన్ చేసింది. కస్టమర్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తొలిసారి ఇలాంటి మార్పులు ప్రకటించింది. యాప్‌ను మునుపెన్నడూ లేనంత సులభంగా, స్పష్టంగా , పర్సనలైజ్డ్గా తీసుకొస్తున్నామని ఉడెర్ హెడ్ జెన్ యు అన్నారు. తద్వారా క్యాబ్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ రైడ్ ట్రాకింగ్ ఈజీగా ఉండేలా ఇంటర్ఫేస్ని రూపొందించింది. సో నెక్ట్స్ రైడ్ లేదా ఆర్డర్ ఫుడ్ బుక్ చేస్తే, యాప్ కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఐవోఎస్ ఉపకరణాలకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ డివైసెస్‌కు విస్తరించనున్నట్టు కంపెన ప్రకటించింది. సర్వీసెస్ ట్యాబ్ సైతం పొందు పరిచింది. శరవేగంగా లైఫ్ గడిచిపోతున్న ప్రస్తుత తరుణంలో కొన్ని, సెకన్లలో యాప్ ద్వారా నావిగేట్ చేయగలిగే అవసరాన్ని అర్థం చేసుకున్నామని ఉబర్ ఇండియా దక్షిణాసియా సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నితీష్ భూషణ్ అన్నారు. తక్కువ ట్యాప్‌లతో ప్రయాణాలను మరింత సులభంగా బుక్ చేసుకునేందుకు రైడర్లకు సహాయ పడేందుకు హోమ్‌స్క్రీన్‌ను అనుభవాన్ని కూడా మెరుగ్గా అందించనుంది. ఇందుకోసం 'సర్వీసెస్' ట్యాబ్‌ను జోడించింది. దీని ద్వారా కొత్త యాప్‌లో సమీపంలోని మోటో నుండి ఆటో, ఇంటర్సిటీ, అద్దెలు, ఇతర వాటితో పాటు నగరంలోని రైడర్లకు అందుబాటులో ఉన్న అన్ని ఉత్పత్తులను కనుగొనడానికి ఒక-స్టాప్ షాప్‌గా కూడా ఉపయోగపడనుంది. అలాగే కొత్తగా యాడ్ చేసిన 'యాక్టివిటీ హబ్' గత రాబోయే రైడ్లను ఒకే చోట ట్రాక్ చేయడంలో సహాయపడుతుందని ఉబెర్ తెలిపింది. -
డిజిటల్ లెండింగ్ హవా
ముంబై: ఈ దశాబ్దంలో డిజిటల్ లెండింగ్ దూసుకుపోతుందని, ఫిన్‌టెక్ సంస్థలు ఈ సేవలను మరింతగా వినియోగదారుల చెంతకు తీసుకెళతాయని క్రెడిట్ సమాచార సంస్థ ఎక్స్పీరియన్స్ తెలిపింది. 2030 నాటికి అన్సెక్యూర్డ్ రుణాల్లో సంప్రదాయ రుణవితరణతో పోలిస్తే డిజిటల్ రుణాలదే పైచేయి అవుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. అన్సెక్యూర్డ్ చిన్న సైజు రుణాలతోపాటు, సెక్యూర్డ్ అధిక సైజు రుణాల్లో డిజిటల్ లెండింగ్ మరింత విస్తరిస్తుందని పేర్కొంది. ‘‘సంప్రదాయ రుణదాతలు సాధారణంగా ఆస్తుల తనఖాపై రుణాల్లో (సెక్యూర్డ్) అధిక వాటా కలిగి ఉంటారు. డిజిటైజేషన్ పెరుగుతున్న కొద్దీ ఈ విభాగంలోకి సైతం ఫిన్‌టెక్ సంస్థలు చొచ్చుకుపోతాయి. దీంతో అవి చెప్పుకోతగ్గ మార్కెట్ వాటాను సొంతం చేసుకోగలవు’’అని ఎక్స్పీరియన్స్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఇండియా ఎండీ సాయికృష్ణన్ శ్రీనివాసన్ తెలిపారు. డిజిటల్‌గా సౌకర్యవంతమైన అనుభవాన్ని కస్టమర్లకు అందిస్తున్నప్పటికీ డిజిటల్ లెండింగ్ సంస్థలకు తదుపరి దశ వృద్ధి అన్నది సవాలుగా ఈ నివేదిక పేర్కొంది. డిజిటల్ లెండింగ్ విభాగంలో బడా టెక్నాలజీ సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేసింది. రికవరీ ఏజెంట్లపై ముందే చెప్పాలి: ఆర్బీఐ డిజిటల్ లెండింగ్ సంస్థలు (డిజిటల్ వేదికల రూపంలో రుణాలిచ్చేవి) కస్టమర్లకు రికవరీ ఏజెంట్ల వివరాలను ముందే వెల్లడించాలని ఆర్బీఐ ఆదేశించింది. ‘‘ఏదైనా రుణం చెల్లింపుల్లేకుండా ఆగిపోతే, ఆ రుణం వసూలుకు ఏజెంట్‌ను నియమించినట్టయితే.. సంబంధిత ఏజెంట్ పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలను కస్టమర్‌కు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ రూపంలో తెలియజేయాలి’’అని తాజా ఆదేశాల్లో ఆర్బీఐ పేర్కొంది. డిజిటల్ లెండింగ్, రుణాల రికవరీకి సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ గతేడాది చివర్లో కఠినతరం చేయడం తెలిసిందే. -
ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్
Vaani Kapoor Reveals Her Horse Riding Experience: బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బ్యూటిఫుల్ హీరోయిన్ వాణీ కపూర్. నాని నటించిన 'ఆహా కల్యాణం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు కమర్షియల్ మూవీస్తోపాటు మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న రోల్స్‌లో నటిస్తూ మెప్పించే ప్రయత్నం చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె నటించిన చిత్రం 'షంషేరా'. రణ్‌బీర్ కపూర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో సోనా అనే పాత్రలో అలరించనుంది వాణీ కపూర్. అయితే ఈ పాత్ర కోసం వాణీ కపూర్ స్పెషల్‌గా గుర్రపు స్వారీ నేర్చుకున్నట్లు తెలిపింది. గుర్రపు స్వారీ నేర్చుకున్న అనుభవాలను 'షంషేరా' మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'ఇది నాకెంతో ఛాలేంజింగ్ పాత్ర. దీనికోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీ నేర్చుకున్నా. నా దృష్టిలో గుర్రాలు అత్యంత అందమైన జంతువులు. వాటికి ప్రేమ భాష మాత్రమే తెలుసు. స్వారీ నేర్చుకోవడానికి ముందు వాటితో సన్నిహితంగా ఉండటం, స్నేహం చేయడం, ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకోవడం అవసరం. లేకపోతే అవి మనల్ని విసిరేస్తాయి. అందుకే శిక్షణ సమయంలో నేను వాటికోసం ఆహారం తీసుకొచ్చేదాన్ని. అలా వాటిని మచ్చిక చేసుకుని స్వారీ నేర్చుకున్నా.' అని తెలిపింది వాణీ కపూర్. కాగా కరణ్ మల్హోత్రా తెరకెక్కించిన 'షంషేరా' చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాను హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో జులై 22న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. Meet Sona ✨ Watch how Sona's character came to life.. pic.twitter.com/loe1mbEgUR Shamshera releasing in Hindi, Tamil & Telugu. Celebrate #Shamshera with #YRF50 only at a theatre near you on 22nd July. #RanbirKapoor @duttsanjay @RonitBoseRoy @saurabhshukla_s @karanmalhotra21 @yrf — Vaani Kapoor (@Vaaniofficial) July 9, 2022 -
హీరోయిన్‌కు వింత అనుభవం.. అతన్ని ఫాలో అవ్వమని కోరాడట
Shraddha Srinath Different Experience With Cab Driver And Airport Security: నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది శ్రద్ధా శ్రీనాథ్. తర్వాత సిద్ధు జొన్నల గడ్డ కృష్ణ 'అండ్ హిజ్ లీల', 'మార' సినిమాలతో మరింత పాపులారిటీ దక్కించికుంది. దక్షిణాది భాషలన్నింటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది శ్రద్ధా. అయితే తాజాగా ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే క్రమంలో ఆమెకు జరిగిన వింత అనుభవాల గురించి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. సినిమా షూటింగ్ తర్వాత ఎయిర్పోర్ట్ వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్‌లో ప్రయాణించేప్పడు డ్రైవర్ ఏసీ ఆన్ చేయలేదు. ఏసీ గురించి అడిగితే అందుకు డ్రైవర్ నిరాకరించాడు. 'పెట్రోల్ ధరలు పెరగడం వల్ల క్యాబ్ డ్రైవర్ ఏసీ ఆన్ చేసేందుకు నిరాకరించాడు. ఎంతోకొంత డబ్బు పొదుపు చేసేందుకు అలా చేశాడని నాకు అర్థమైంది. అందుకే నేను కూడా ఏం అనలేదు. కానీ ఓలా క్యాబ్ సంస్థ వాళ్ల సంపాదనను దోచుకుంటోంది.' అని ఇన్‌స్టాలో తెలిపింది. అలాగే తనకు ఎయిర్‌పోర్టులో జరిగిన మరో అనుభవాన్ని శ్రద్ధా వెల్లడించింది. 'ఎయిర్పోర్ట్ ఎంట్రాన్స్ వద్ద సెక్యూరిటీ ఒకతను నన్ను గుర్తుపట్టి, నా దగ్గరికి వచ్చి నా ఇన్‌స్టా గ్రామ్‌లో తన అకౌంట్ వెతికి అతన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరాడు. నేను సానుకూలంగా తిరస్కరించాను. దానికి అతను ఏ సమస్య లేదు. నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. మీకు సపోర్ట్ చేస్తాను.' అని చెప్పాడని శ్రద్ధా పేర్కొంది. -
రాజ్యసభలో 72మంది సభ్యుల పదవీకాలం పూర్తి
-
అనుభవాన్ని అందరికీ పంచండి!
న్యూఢిల్లీ: త్వరలో రాజ్యసభ నుంచి రిటైరవుతున్న సభ్యులు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా, యువతలో ఆసక్తి రేపేలా తమ అనుభవసారాన్ని అన్నిదిశలకు వ్యాపింపజేయాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. జ్ఞానం కన్నా అనుభవం గొప్పదని, సభ్యులంతా తమ అనుభవాన్ని దేశ సేవకు వినియోగించాలని కోరారు. రాజ్యసభలో రిటైరవుతున్న 72 మంది సభ్యులకు గురువారం వీడ్కోలు పలికారు. ఈ ఏడాది మార్చి– జూలై సమయంలో వీరంతా పదవీ విరమణ చేయనున్నారు. చట్టసభల సభ్యులు సమర్థవంతమైన పనితీరు చూపాలని, చట్టసభల విధులకు అంతరాయం కలిగించకుండా పనిచేయాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. -
డాక్యుమెంటరీ కోసం ఉక్రెయిన్ వెళ్లిన హాలీవుడ్ దర్శకుడు.. మెళ్లకు మైళ్లు నడిచి..
కీవ్: బాంబుల మోత మోగు తూ ఉంటే, క్షిపణులు వచ్చి మీద పడు తూ ఉంటే రాజు పేద తేడా లేనే లేదు. ఉండేదల్లా ప్రాణభయమే. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటే ఎన్నో కష్టనష్టాలను పంటి బిగువున భరించాల్సి ఉంటుంది. యుద్ధంపై డాక్యుమెంటరీ తీయడానికి ఉక్రెయిన్ వెళ్లి ఇరుక్కుపోయిన హాలీవుడ్ నట దర్శకుడు, ఆస్కార్ గ్రహీత సీన్ పెన్కు అలాంటి భయంకరమైన అనుభవాలే ఎదురయ్యాయి. గత ఏడాది నవంబర్ నుంచి ఉక్రెయిన్‌లో ఉంటూ ఉద్రిక్తతల్ని కెమెరాలో బంధిస్తున్న ఆయన చివరికి తన ప్రాణాలే ప్రమాదంలో పడడంతో కాళ్లకి పని చెప్పాల్సి వచ్చింది. 61 ఏళ్ల వయసులో మైళ్లకి మైళ్లు నడిచి పోలండ్ సరిహద్దులకి చేరుకున్నారు. రష్యా దాడిని తీవ్రతరం చేయడంతో ప్రాణ రక్షణ కోసం లక్షలాది మంది ఉక్రెయిన్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం మొదలు పెట్టారు. అన్ని సరిహద్దుల్లోనూ మైళ్ల కొద్దీ కార్లు వరస కట్టాయి. సీన్ పెన్, ఆయన బృందం కారులో వెళ్లడానికి సమయం సరిపోదని భావించి దానిని వదిలేసి నడుచుకుంటూ పోలాండ్ సరిహద్దులకు చేరుకున్నారు. ‘‘నేను, నా కొలీగ్స్ ఇద్దరూ కారుని రోడ్డు పక్కనే వదిలేసి మైళ్ల కొద్దీ నడుచుకుంటూ వచ్చాం. దారి పొడవునా నిలిచిపోయిన అన్ని కార్లలోనూ మహిళలు, పిల్లలే ఉన్నారు. వాళ్లెవరూ తమ వెంట లగేజీ తీసుకు రాలేదు. ఎంత మంది పడితే అంత మంది కార్లలోకి ఎక్కేసి సరిహద్దుల వైపు బయల్దేరారు’’ అని ట్విటర్ వేదికగా పెన్ వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘పుతిన్ చాలా క్రూరమైన తప్పు చేస్తున్నారు. ఎందరో జీవితాల్ని బలి తీసుకుంటున్నారు. ఆయనలో పశ్చాత్తాపం రాకపోతే మానవాళికే తీరని ద్రోహం చేసిన వారవుతారు’’ అని దుయ్యబట్టారు. ‘‘ఉక్రెయిన్ ప్రజలు ధైర్యానికి, నిబద్ధతకి చారిత్రక సంకేతాలుగా మిగిలిపోతారు’’ అని కొనియాడారు. పెన్ ఉక్రెయిన్‌లో ఉండగా అధ్యక్షుడు జెలెన్స్కీని కలుసుకున్నారు. రష్యా దాడి మొదలు పెట్టడానికి ముందు ప్రభుత్వం నిర్వహించిన ప్రెస్ మీట్లోనూ పాల్గొన్నారు. (చదవండి: ‘జెలెన్స్కీ’ బిజినెస్ బ్రాండ్) -
హైదరాబాద్‌లో ఓరియంట్బెల్ స్టోర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెరామిక్ టైల్స్ తయారీలో ఉన్న ఓరియంట్బెల్ తాజాగా హైదరాబాద్‌లో ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ను తెరిచింది. సికింద్రాబాద్‌లో 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మహాలక్ష్మి ఎంటర్ప్రైసెస్ దీనిని ఏర్పాటు చేసింది. 2020లో దేశవ్యాప్తంగా 69 ఎక్స్‌పీరియెన్స్ సెంటర్స్‌ను ప్రారంభించామని ఓరియంట్బెల్ టైల్స్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ పినాకి నంది తెలిపారు. 1977లో కంపెనీని స్థాపించారు. -
జియోసావన్ లో మరో సరికొత్త ఫీచర్
దక్షిణ ఆసియాలో అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన సంగీత ప్రియులకు ఇష్టమైన జియోసావన్ మరో కొత్త ముందుకు వచ్చింది. జియోసావన్ టీవీ పేరుతో విదేయో కంటెంట్ అందించనుంది. ఇప్పటివరకు రేడియో, పాడ్ క్యాస్ట్ సేవలను అందించిన జియోసావ్న్ ఇప్పడు వీడియో సేవలను అందించనుంది. ప్రత్యేకమైన ఈ వీడియో ఫీచర్ వల్ల మరింత మందికి అద్భుతమైన కంటెంట్ అందించనున్నట్లు పేర్కొంది. జియోసావన్ ప్లాట్‌ఫాం విస్తృతంగా ప్రాచుర్యం పొందిన ఆడియో సేవలతో పాటు సంగీతం కోసం కొత్తగా టెలివిజన్ అనుభవాన్ని సృష్టిస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు అత్యధిక నాణ్యత గల వీడియో స్ట్రీమింగ్ అందిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు హోమ్‌పేజీలోని క్రొత్త ట్యాబ్‌లో మ్యూజిక్ టీవీ ఛానెల్‌లను, మ్యూజిక్ వీడియో ప్లేజాబితాలను యాక్సెస్ చేయవచ్చు. దీనివల్ల చూడాలనుకుంటున్న వీడియోను వెంటనే చూడటానికి వీలు కలుగుతుంది. కొత్త ఫీచర్ వల్ల ఎందరో ప్రసిద్ద కళాకారులు చెందిన వీడియోలను సులభంగా చూడవచ్చు. చదవండి: చిన్న ఎస్ఎంఎస్తో ఆధార్ డేటాను రక్షించుకోండి -
ఈ బ్యాంకులో ఖాతా ఉందా? రేణూ దేశాయ్ షాకింగ్ పోస్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటి రేణూ దేశాయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ, ఇటీవల కరోనా బాధితులకు అండగా నిలుస్తున్న రేణూ బ్యాంకింగ్ వ్యవహారాలపై ఒక షాకింగ్ విషయాన్ని ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా పోస్ట్ చేశారు. దీంతో సదరు బ్యాంకు ఖాతాదారులతో ఇతరులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది చాలా తీవ్రమైన తప్పు. మన ఖాతాలో వేరొకరు లాగిన్ అయ్యి నగదు బదిలీ చేసే అవకాశా లున్నాయంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వక్తం చేశారు. రేణూ దేశాయ్ పంచుకున్న విషయాల ప్రకారం... ఆమె ఇండస్ఇండ్ బ్యాంకు మొబైల్ యాప్‌లోకి లాగిన్ అయినప్పుడు, అది వేరొకరి ఖాతాలోకి లాగిన్ అయింది. అంతేకాదు సదరు ఖాతాలోని పూర్తి వివరాలను కూడా చూడగలిగారు. దీంతో తాను షాక్ అయ్యాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రేణూ వివరాలను షేర్ చేశారు. హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసినా వారు సీరియస్‌గా తీసుకోలేదంటూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకున్న వెంటనే ఈ ఖాతా నుండి లాగ్ అవుట్ అయ్యానంటూ వివరించారు. కస్టమర్లకు ఆ బ్యాంకు ఇస్తున్న భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె తన అకౌంట్‌ను సోమవారం క్లోజ్ చేయబోతున్నట్టు కూడా వెల్లడించారు. బ్యాంకింగ్ లావాదేవీలు, భద్రతాలోపాలపై విమర్శలు గుప్పిస్తూ కొంతమంది నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొంతమంది ‘డిజిటల్ ఇండియా’ అంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. మరి ఈ మొత్తం వ్యవహారంపై ఇండస్ ఇండ్ బ్యాంకు ఎలా స్పందిస్తుందో చూడాలి. చదవండి: Digital Rules: ట్విటర్‌కు ఫైనల్ వార్నింగ్ View this post on Instagram A post shared by renu (@renuudesai) -
ఆన్లైన్లో టీనేజర్స్ : మంచీ మర్యాద!
సాక్షి, హైదరాబాద్: భారతీయులు ఆన్లైన్ ప్రపంచంలో కొంత మర్యాద నేర్చుకున్నారని మైక్రోసాఫ్ట్ సంస్థ చెబుతోంది. ‘సివిలిటీ, సేఫ్టీ అండ్ ఇంటరాక్షన్స్ ఆన్లైన్’పేరుతో ఈ ఐటీ దిగ్గజం ఇటీవల ఓ వార్షిక నివేదిక విడుదల చేసింది. ఆన్లైన్ వినియోగదారుల మర్యాద విషయంలో డిజిటల్ సివిలిటీ ఇండెక్స్ (డీసీఐ)2020లో భారత్ 2019లో ఉన్న 71వ స్థానం నుంచి 68వ స్థానానికి పెరిగింది. అంటే ఆన్లైన్లో కొంచెం తక్కువ మంది దురుసు ప్రవర్తన ఎదుర్కొంటున్నారని అర్థం. అయితే ఆసియా పసిఫిక్ దేశాల్లో మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే భారత్ స్థానం దిగువనే ఉండటం గమనార్హం. అంతేకాదు.. 2016తో పోలిస్తే విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం రెట్టింపు అయ్యిందని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, స్కామ్‌లు, మోసాలు 5 శాతం వరకు పెరిగి ప్రస్తుతం 22 శాతంగా నమోదైంది. వివక్ష అంశంలోనూ భారతీయుల ఆన్లైన్ ప్రవర్తన సరిగా లేదు. 2016లో ఇది 10 శాతంగా ఉంటే 2020 నాటికి 6 శాతం పెరిగింది. సానుకూల సంభాషణలతో మంచి సంబంధాలు.. డీసీఐ తాజా సర్వే కోసం మైక్రోసాఫ్ట్ ఆస్ట్రేలియా, ఇండియా, ఇండొనేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం వంటి దేశాల్లోని మొత్తం 32 ప్రాంతాల్లో 16 వేల మందిని ప్రశ్నించారు. ఆన్లైన్లో సంభాషణలు, ప్రమాదాలు వంటి అంశాలపై అడిగిన సర్వేలో పెద్దవారితో పాటు యువత కూడా పాల్గొంది. ఆన్లైన్ సంభాషణలు సానుకూలంగా ఉండేలా ప్రోత్సహించేందుకు మైక్రోసాఫ్ట్ ఈ సర్వే నిర్వహిస్తోందని, డిజిటల్ టెక్నాలజీల వినియోగం అంతకంతకూ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఆన్లైన్ అనుభవం బాగా ఉంటేనే సమాజ సామరస్యం సాధ్యమవుతుందని మైక్రోసాఫ్ట్ ఉన్నతాధికారి కేశవ్ ధక్కడ్ తెలిపారు. మార్పులో యువతదే ప్రధాన పాత్ర ఆన్లైన్ ప్రవర్తనలో కొంత మార్పులు వచ్చిన విషయంలో యువతది (13–16 మధ్య వయస్కులు) ప్రధానపాత్ర అని డీసీఐ 2020 సర్వే తెలిపింది. ఆన్లైన్లో మర్యాద పాటించే వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన సూచీలో పెద్దలు 69 స్కోరు సాధించగా, యువత 67 స్కోరు సాధించారు. భారత్‌లో సర్వేకు స్పందించిన వారిలో 38 శాతం మంది కరోనా సమయంలో ఆన్లైన్ మర్యాద మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించగా, చాలామంది ఇతరులకు సాయపడాలన్న దృక్పథాన్ని కనబరిచారని ఈ సర్వే తెలిపింది. ఇదే సమయంలో 22 శాతం మంది కరోనా సమయంలో ఆన్లైన్లో మర్యాదపూర్వక ధోరణి తగ్గిందని, తప్పుడు సమాచారం ఎక్కువగా ప్రసారమైందని, వ్యక్తిగత దూషణలు, నెగెటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయని అభిప్రాయపడ్డారు.