లేస్‌ గౌర్మెట్‌ చిప్స్: పెప్సికో ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ శైలజా జోషి ఏమన్నారంటే! | Pepsico India Marketing Director Shailja Joshi Says Consumers look for More Premium Experience | Sakshi
Sakshi News home page

లేస్‌ గౌర్మెట్‌ చిప్స్: పెప్సికో ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ శైలజా జోషి ఏమన్నారంటే!

Published Tue, May 9 2023 6:36 PM | Last Updated on Wed, May 10 2023 5:38 PM

Pepsico India Marketing Director Shailja Joshi Says Consumers look for More Premium Experience - Sakshi

పెప్సికో 2022లో లేస్ గౌర్మెట్‌తో ప్రీమియం పొటాటో చిప్స్‌లోకి ప్రవేశించింది.ఈ  కేటగిరీలో వినియోగదారులు మరిన్ని ప్రీమియం అనుభవాల కోసం చూస్తున్నారంటున్నారు పెప్సి కో ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ శైలజా జోషి. కేటగిరీ ప్రీమియమైజేషన్ గురించి, రూ.20 రేంజ్‌లో అందించే కొత్త ప్లాన్‌..తదితర వివరాలు ఆమె మాటల్లోనే..

ఆగస్టు 2022లో లే గౌర్మెట్‌ను ప్రారంభించాం. వీటికి మంచి స్పందన వచ్చింది. వినియోగదారుల గురించి, అవుట్‌లెట్ల గురించి తెలుసుకున్నాము. స్పందన బాగుంది. జీవితంలో మంచి విషయాలను ఆస్వాదించేవారు గౌర్మెట్‌ను ఆనందిస్తారు. ఈ స్నాక్‌ అందించే అనుభూతులు మరింత ఆనందంగా ఉంటాయి.

ప్రతీ ఒక్కరు చక్కటి స్నాక్స్‌తో ట్రీట్ చేసుకోవాలనుకుంటుంటారు. లేస్ గౌర్మెట్‌కు వచ్చిన విశేష ఆదరణ దృష్ట్యా దానిని మరింత విస్తరించాలని భావిస్తున్నాం. అందువల్ల, మరింత మందికి లేస్‌ను చేరువచేసే లక్క్ష్యంతో రూ.20  ప్యాకెట్‌లను విడుదల చేస్తున్నాము. రిటైల్, వినియోగదారుల దృక్కోణం నుండి ఈ ధర అంశం చాలా ముఖ్యమైనది. రూ.20 ప్యాక్‌లు త్వరలో మార్కెట్లో  లభింస్తాయి. మరింత విస్తృతంగా పంపిణీ చేయనున్నాం.

లేస్‌ కన్సూమర్‌తో పోలిస్తే గౌర్మెట్ కొనేవాళ్లు భిన్నమని మీరు భావిస్తున్నారా?
ఈ తేడాను జనాభా పరంగా చూడలేం, అప్పటికప్పుడు పుట్టుకొచ్చే అవసరం లేదా సందర్భం కావొచ్చు. ఒక వినియోగదారు ఒక సారి లేస్‌ను తినాలనుకోవచ్చు, ఎందుకంటే అతను/ఆమె స్నేహితులతో సరదాగా గడపాలని కోరుకుంటారు, ఇదొక సంబరం, ఇలాంటి నోరూరించే చిరుతిళ్లతో స్నేహితుల భేటీ సరదాగా ఉంటుంది. వేరే మూడ్‌లో లేదా వేరే సందర్భంలో ఉన్న ఒకే రకమైన వినియోగదారులు లేస్ గౌర్మెట్‌కు కూడా వినియోగదారుగా ఉండవచ్చు.

అలాగే, కోవిడ్ తర్వాత, ప్రజలు మరింత కొత్త రుచుల కోసం ఎలా వెతుకుతున్నారో కూడా మేము గమనించాము. లే యొక్క గౌర్మెట్‌తో, చాలా మంది వినియోగదారులు స్నాకింగ్‌లోకి రావడాన్ని మేము ఖచ్చితంగా చూస్తాము, ఎందుకంటే వారు స్నాకింగ్‌లో చక్కని అనుభవాన్ని కోరుకుంటారు.

Q. Not just cooked, crafted. ఈ లైన్‌ వినగానే సైఫ్ అలీ ఖాన్‌, ఆయన రాజవంశం గుర్తుకొస్తుంది. అప్పుడు లేస్‌ ప్రోడక్ట్‌ ప్రమోషన్‌లో ఈ వ్యాక్యం వాడారు. ఇప్పుడదే వ్యాక్యాన్ని అలాగే సైఫ్‌ను మళ్లీ ఇప్పుడు ఎంపిక చేసుకున్నారు. ఎలా చూడవచ్చు?

సైఫ్ అలీ ఖాన్‌తో మా అనుబంధం చాలా గొప్పది. ఆయనతో చేసిన ప్రయాణం అద్భుతం అందుకే లేస్ గౌర్మెట్ కోసం సైఫ్‌నే మళ్లీ ఎంచుకున్నాం. లేస్‌ గౌర్మెట్‌ చిప్స్ బ్రాండ్‌కు అతడే సరైన ఎంపిక. మంచి రుచి, క్రమబద్ధత కలిగిన ఉత్పత్తులకు ప్రాతినిధ్యం వహించారు కాబట్టి సైఫ్‌ను ఎంపిక చేసుకున్నాం.

బ్రాండ్ అంబాసిడర్ అవసరం ఎందుకు వచ్చింది?
పెప్సీకో కింద ఎన్నో బ్రాండ్లు, ప్రోడక్టులున్నాయి. సైఫ్‌ అంశాన్ని బ్రాండ్ అంబాసిడర్ అవసరంగా చూడకూడదు. మా బ్రాండ్ ఇమేజ్‌కు మరింత ప్రయోజనం లభిస్తుందని భావించినప్పుడు మేము బ్రాండ్ అంబాసిడర్లతో కలిసి పని చేస్తాము. అలాగే బ్రాండ్ ,  అంబాసిడర్ రెండూ పరస్పర సంబంధం కలిగి ఉండాలి, రెండూ కలిసి వెళ్లాలి. మా బ్రాండ్‌కు ఉన్న గుర్తింపు, చక్కటి రుచి గురించి ఆలోచిస్తున్నప్పుడు, సైఫ్ అలీ ఖాన్ చాలా విలువను జోడించగలడని మా నమ్మకం. గౌర్మెట్‌తో కలిసి సైఫ్‌ నడవడం వల్ల ఆ ప్రయాణం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. బ్రాండ్‌ ఇమేజ్‌ మరింత ఉన్నతమవుతుంది. అసలు సైఫ్‌ను తీసుకురావడం వెనక మా ఆలోచన ఇదే.

చాలా ప్రీమియం బ్రాండ్‌ల ధరలు రూ.100 వరకు ఉన్నాయి. వాటితో పోలిస్తే గౌర్మెట్ ధర చాలా తక్కువగా ఉంది. ఇది గౌర్మెట్‌కు ఎలా సహాయపడుతుంది? రూ.30, రూ.50ల ఉత్పత్తుల విభాగంలో మీ వాటా వాటా ఎంత?

ప్రపంచవ్యాప్తంగా పొటాటో చిప్స్ విభాగంలో అగ్రగామిగా ఉన్నాము. ఒక ఉత్పత్తిని తీసుకొస్తున్నప్పుడు మా నైపుణ్యాన్ని, మా అభ్యాసాలను కేవలం భారతీయ మార్కెట్‌కు పరిమితం చేయాలనుకోవడం లేదు. మార్కెట్‌పై మాకు ఉన్న అవగాహన మాకు గౌర్మెట్ సెగ్మెంట్ ధరల గురించి స్పష్టమైన ఆలోచనన ఇచ్చింది. చాన్నాళ్లుగా మేము మార్కెట్లో ఉన్నాం.ఇది కూడా సత్పలితాలను ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక మార్కెట్‌లో ఉన్న రూ.30 ప్యాక్‌ ఉత్పత్తులు ఎక్కువగా సాంప్రదాయ వినియోగదారులు కొంటున్నారు. మా వాటా కూడా దీంట్లోనే ఎక్కువ. అలాగే రూ.50 ప్యాక్‌ ఉత్పత్తులకు ఇ-కామర్స్‌లో డిమాండ్‌ ఎక్కువ.

లేస్‌ గౌర్మెట్ చిప్స్ మూడు ఫ్లేవర్లలో ఉన్నాయి. లైమ్ అండ్‌ క్రాక్డ్ పెప్పర్, థాయ్ స్వీట్ చిల్లీ మరియు వింటేజ్ చీజ్ & పెప్రికా. వీటిలో ఎక్కువ అమ్ముడవుతున్న ఫ్లేవర్‌ ఏది? మరిన్ని ఫ్లేవర్లు తెచ్చే ఆలోచన ఉందా?

థాయ్ స్వీట్ చిల్లీకి మంచి స్పందన వచ్చింది. ఎక్కువ మంది ఏది ఇష్టపడితే అదే ఫ్లేవర్‌ అవుతుంది. నిజానికి మూడు ఫ్లేవర్ల అమ్మకాల మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. మేము కూడా ఎక్కువ ఉత్పత్తులను ప్రయత్నించే దశలో ఉన్నాము. వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికైతే  ఎక్కువ మందికి ఈ రుచులు చేరాలని,  వినియోగదారుల సంఖ్య పెరగాలని భావిస్తున్నాం. మా దగ్గర మరిన్ని ఆలోచనలున్నాయి. మార్కెట్‌ అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు వాటిని అభివృద్ధి చేస్తాం. ప్రస్తుతానికయితే ఈ మూడు ఫ్లేవర్లతో మా వ్యాపారాన్ని పెంచుతాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్