
సాఫ్ట్‌డ్రింక్స్ మార్కెట్‌లో ప్రముఖ బ్రాండ్‌ల మధ్య పోటీ నెలకొంది. రిలయన్స్ కన్స్యూమర్ ఈ విభాగంలో ఇప్పటికే రూ.10కే కాంపా కోలా డ్రింక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ తరుణంలో రిలయన్స్‌కు పోటీగా వినియోగదారులను నిలుపుకునేందుకు కోకాకోలా, పెప్సికో ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా రూ.10కే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాక్‌ల్లో నో షుగర్ వేరియంట్ డ్రింక్స్‌ను ప్రవేశపెడుతున్నాయి.
కోకాకోలా కోక్ జీరో, స్ప్రైట్ జీరో, థమ్స్ అప్ ఎక్స్ ఫోర్స్ పేరుతో కొత్త వేరియంట్లను మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. పెప్సికో తన పెప్సీ నో-షుగర్ వేరియంట్‌ను ప్రమోట్ చేస్తోంది. ఈ ఉత్పత్తులను రూ.10గా నిర్ణయించడం ద్వారా కోకాకోలా, పెప్సికో తన వినియోగదారులను నిలుపుకోవడంతోపాటు రిలయన్స్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదీ చదవండి: ఏకీకృత పెన్షన్ విధానంలో కొత్త నిబంధనలు
భారత సాఫ్ట్‌డ్రింక్స్ మార్కెట్ విలువ 2023లో 19.7 బిలియన్ డాలర్లు కాగా, 2032 నాటికి 4.8 శాతం సీఏజీఆర్‌తో పెరిగి 30.1 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. కోకాకోలా ఇండియా, పెప్సికో ఇండియా, రిలయన్స్ కన్జూమర్, పార్లే ఆగ్రో, డాబర్ ఇండియా, ఐటీసీ లిమిటెడ్.. వంటి ప్రధాన సంస్థలు విభిన్న ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నాయి. ఇందులో కార్బోనేటేడ్ పానీయాలు (కోలా, సోడాలు వంటివి), కార్బోనేటేడ్ కాని పానీయాలు (పండ్ల రసాలు), స్పోర్ట్స్, ఎనర్జీ డ్రింక్‌లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment