కూల్‌డ్రింక్ పెట్ బాటిల్స్‌లో విషపదార్థాలు? | toxins found in cool drink pet bottles, companies refute charges | Sakshi
Sakshi News home page

కూల్‌డ్రింక్ పెట్ బాటిల్స్‌లో విషపదార్థాలు?

Published Fri, Oct 7 2016 10:40 AM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM

కూల్‌డ్రింక్ పెట్ బాటిల్స్‌లో విషపదార్థాలు?

కూల్‌డ్రింక్ పెట్ బాటిల్స్‌లో విషపదార్థాలు?

బహుళ జాతి కంపెనీలు పెప్సీకో, కోకా-కోలా తయారుచేస్తున్న పలు సాఫ్ట్‌డ్రింకులలో ఐదు రకాల విష పదార్థాలు ఉన్నట్లు భారత ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పరిశీలనలో తేలింది. అయితే తమ పెట్‌బాటిల్స్‌లో అలాంటివి ఏమీ లేవని రెండు కంపెనీలు ఖండించాయి. తమకు ప్రభుత్వం నుంచి అలాంటి నివేదిక ఏదీ రాలేదంటున్నాయి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (డీటీఏబీ) నిర్వహించిన పరీక్షలలో.. పెప్సీ, కోకా కోలా, మౌంటెన్ డ్యూ, స్ప్రైట్, 7అప్ లాంటి కూల్ డ్రింకుల బాటిల్స్‌లో యాంటిమోనీ, సీసీ, క్రోమియం, కాడ్మియంతో పాటు.. డీఈహెచ్‌పీ లేదా డైఫ్తాలేట్ కూడా ఉన్నాయని తేలింది. వీటిలో పెప్సీ, మౌంటెన్ డ్యూ, 7 అప్ బ్రాండ్లు పెప్సీకోవి కాగా, స్ప్రైట్ మాత్రం కోకా కోలా కంపెనీది.

ఈ రెండు కంపెనీలు ఈ ఆరోపణలను ఖండించాయి. తమకు ఈ పరీక్షల నివేదికలకు సంబంధించిన సమాచారం ఏమీ ఇంతవరకు రాలేదని పెప్సికో ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. తకు ప్రభుత్వ శాఖల నుంచి నోటీసులు గానీ, సమాచారం గానీ కూడా ఏమీ లేదని కోకాకోలా ప్రతినిధి అన్నారు. భారతదేశంలోని ఆహార భద్రతా ప్రమాణాలు అనుమతించిన స్థాయిలో మాత్రమే తమ కూల్‌డ్రింకులలో భారలోహాలు ఉంటాయని పెప్సికో తెలిపింది. కానీ డీటీఏబీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాలు చూస్తుంటే.. అసలు కూల్‌డ్రింకులలో భారలోహాలకు అనుమతించిన పరిమితి అంటూ ఏమీ లేదు. కాడ్మియం అనేది ప్రజారోగ్యానికి చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement