ప్రపంచవ్యాప్తంగా కోకాకోలా పానియాలకు ఉన్న ప్రసిద్ధి గురించి తెలిసిందే. తమ ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్య రహస్యాలను అత్యంత పకడ్బందీగా ఉంచుతుంది కోకాకోలా. అయితే ఈ సీక్రెట్స్‌ను అమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంది ఓ ఉద్యోగి. కానీ పెప్సీ కంపెనీ ఇచ్చిన షాక్‌తో కటకటాలపాలైంది.
కోకా-కోలా గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌లో సెక్రటరీగా పనిచేస్తున్న జోయా విలియమ్స్ కొత్త ఉత్పత్తికి సంబంధించిన వ్యాపార రహస్యాలను పెప్సీకి విక్రయించడానికి ప్రయత్నించి అరెస్టు అయింది. జోయా విలియమ్స్, ఆమె సహచరులు ఇబ్రహీం డిమ్సన్, ఎడ్మండ్ డుహానీతో కలిసి దొంగిలించిన కోకాకోలా సమాచారాన్ని 1.5 మిలియన్ డాలర్ల (రూ. 12.6 కోట్లు) భారీ ధరకు విక్రయించడానికి కుట్ర పన్నారు. అయితే పెప్సీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా కోకాకోలాకు, ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేసింది.
ఇదీ చదవండి: కంపెనీ డేటా లీక్.. రూ.57 లక్షలు డిమాండ్
కోకా-కోలా గ్లోబల్ బ్రాండ్ డైరెక్టర్‌కి అసిస్టెంట్‌గా పనిచేసిన విలియమ్స్, ఒక రహస్య కొత్త ఉత్పత్తిని కలిగి ఉన్న ఫియల్‌ను దొంగిలించి విక్రయించడానికి ప్రయత్నించి పట్టుబడింది. ఎఫ్‌బీఐ ఒక రహస్య ఆపరేషన్‌లో పెప్సీ ఎగ్జిక్యూటివ్‌లుగా నటించి నిందితులను పట్టుకుంది. వీరి మధ్య పలు దఫాలుగా లావాదేవీలు జరిగాయి. ఈ క్రమంలో డిమ్సన్ ఒక కుకీ బాక్స్‌లో దాచిన 30,000 డాలర్లు తీసుకుని కోకాకోలా సీక్రెట్ పత్రాలు, ఫియల్‌ను అందజేసారు. విలియమ్స్, ఆమె సహచరులను వారి అక్రమ ఒప్పందం పూర్తయ్యేలోపు అరెస్టు చేయడంతో ఈ అండర్‌కవర్ ఆపరేషన్ ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment