Pepsi
-
కోకాకోలా సీక్రెట్స్ అమ్మబోయిన ఉద్యోగి.. పెప్సీ ఏం చేసిందంటే..
ప్రపంచవ్యాప్తంగా కోకాకోలా పానియాలకు ఉన్న ప్రసిద్ధి గురించి తెలిసిందే. తమ ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్య రహస్యాలను అత్యంత పకడ్బందీగా ఉంచుతుంది కోకాకోలా. అయితే ఈ సీక్రెట్స్‌ను అమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంది ఓ ఉద్యోగి. కానీ పెప్సీ కంపెనీ ఇచ్చిన షాక్‌తో కటకటాలపాలైంది.కోకా-కోలా గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌లో సెక్రటరీగా పనిచేస్తున్న జోయా విలియమ్స్ కొత్త ఉత్పత్తికి సంబంధించిన వ్యాపార రహస్యాలను పెప్సీకి విక్రయించడానికి ప్రయత్నించి అరెస్టు అయింది. జోయా విలియమ్స్, ఆమె సహచరులు ఇబ్రహీం డిమ్సన్, ఎడ్మండ్ డుహానీతో కలిసి దొంగిలించిన కోకాకోలా సమాచారాన్ని 1.5 మిలియన్ డాలర్ల (రూ. 12.6 కోట్లు) భారీ ధరకు విక్రయించడానికి కుట్ర పన్నారు. అయితే పెప్సీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా కోకాకోలాకు, ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేసింది.ఇదీ చదవండి: కంపెనీ డేటా లీక్.. రూ.57 లక్షలు డిమాండ్కోకా-కోలా గ్లోబల్ బ్రాండ్ డైరెక్టర్‌కి అసిస్టెంట్‌గా పనిచేసిన విలియమ్స్, ఒక రహస్య కొత్త ఉత్పత్తిని కలిగి ఉన్న ఫియల్‌ను దొంగిలించి విక్రయించడానికి ప్రయత్నించి పట్టుబడింది. ఎఫ్‌బీఐ ఒక రహస్య ఆపరేషన్‌లో పెప్సీ ఎగ్జిక్యూటివ్‌లుగా నటించి నిందితులను పట్టుకుంది. వీరి మధ్య పలు దఫాలుగా లావాదేవీలు జరిగాయి. ఈ క్రమంలో డిమ్సన్ ఒక కుకీ బాక్స్‌లో దాచిన 30,000 డాలర్లు తీసుకుని కోకాకోలా సీక్రెట్ పత్రాలు, ఫియల్‌ను అందజేసారు. విలియమ్స్, ఆమె సహచరులను వారి అక్రమ ఒప్పందం పూర్తయ్యేలోపు అరెస్టు చేయడంతో ఈ అండర్‌కవర్ ఆపరేషన్ ముగిసింది. -
అతనికి ఆహారం తినడమే వికారం..17 ఏళ్లుగా పెప్సీ ఒక్కటే..
ఇంతవరకు ఎందరో వింత వ్యక్తులను వారి ఆహారపు అవాట్లను చూశాం. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇతను వాటన్నింటికీ విభిన్నంగా ఉన్నాడు ఇరాన్‌కు చెందని ఓ వ్యక్తి. అతనికి 'ఆకలి' అనేదే తెలియదట. జూన్ 2006 నుంచి తినడమే మానేశాడు. ఐతే అతను ఎలా బతుకుతున్నాడు అనే సందేహం అందరి మదిలోనూ మెదిలే ప్రశ్న.. కానీ అతను ఇప్పటికీ నిక్షేపంగా ఉన్నాడు. ఎలాంటి అనారోగ్య సమస్య లేదు. అసలేం జరిగిందంటే..ఇరాన్‌కి చెందిన ఘోలమ్రేజా అర్దేషిరి జూన్ 2006 నుంచి ఆహారం తినడం మానేశాడు. అలా అని అతనికి ఏదైన ప్రమాదం లేదా ఏదైనా జరగకూడని సంఘటన వల్లో అతను ఇలా చేయడం లేదు. ఎలాంటి కారణం లేకుండానే అకస్మాత్తుగా తినడం మానేశాడు. తనకొక వింత అనుభూతి కలిగిందని. అలా అనిపించినప్పుడల్లా పిచ్చెక్కిపోతుందని, ఏం చేయాలో తెలియనంత బాధగా ఉంటుందని చెబుతున్నాడు అర్దేషిరి. తన నోటిలో ఏదో వెంట్రకలాంటి వస్తువు ఉన్న ఫీలింగ్ వస్తుందట. దాని తల భాగం తన గొంతులోనూ మిగతా భాగం పొట్టలో ఉండి అడ్డుపడి, ఊపిరాడనట్లు అనిపిస్తుందట. ఆ బాధ మాటల్లో చెప్పలేనంటున్నాడు. ఈ విషయమై అనేక మంది వైద్యులను సంప్రదించాడు కానీ ఎవ్వరూ తన సమస్యను నిర్ధారించ లేకపోయారని చెబుతున్నాడు అర్దేషిరి. ఐతే తాను బాగా అలసిపోయినప్పుడూ పెప్సీ వంటి శీతల పానీయాన్ని తాగుతుంటాడు. రోజుకి మూడు లీటర్లు పెప్సీ డ్రిండ్ తీసుకుంటాడు. ఒక్కొసారి రాత్రిళ్లు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతానని చెబుతున్నాడు. అయితే తనకు ఇదేమి షాకింగ్ లేదని ఇప్పటికీ ఈ వింత అనుభూతి గల కారణం మాత్రం ఎవ్వరికీ తెలియలేదని చెబతున్నాడు. అంతేకాదండోయో ఆర్దేషిరి 17 ఏళ్లుగా పెప్సీ ఒక్కటే తాగుతున్నాడు, ఇంకేమి తీసుకోడు. అతని జీవనోపాధి ఫైబర్ గ్లాస్లు రిపేర్ చేయడం. ఐతే అతని ముందేవరు కుటుంబసభ్యులు భోజనం చేయరట. ఎందుకంటే ఎవ్వరైనా తన ముందు భోజనం చేస్తుంటే వికారంగా ఉంటుందట అందుకని ఎవ్వరూ అర్దేషిరి ఎదుట భోజనం చేయరు. విచిత్రమేమిటంటే ఆ వింత అనుభూతి తప్ప ఏ అనారోగ్య సమస్య లేకపోవడం కొసమెరుపు. (చదవండి: మరోసారి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు యత్నం) -
ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో?
హాట్‌గా ఉన్న సమ్మర్లో ఏదైనా తాగాలి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పెప్సీ, కోకో కోలా లాంటి సాఫ్ట్ డింక్సే. ఇప్పుడు ఈ శీతల పానియాల్ని తయారు చేస్తున్న కంపెనీలను ప్రపంచంలోని అతి పేద దేశాల్లో ఒకటైన సూడాన్ అంతర్యుద్ధం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం పెప్సీ, కోకోకోలా, ఫీజీ కూల్ డ్రింక్స్‌తో పాటు క్యాండీ (స్వీట్స్)లలో ఉపయోగించే ఓ పదార్ధం సుడాన్లో మాత్రమే లభ్యమవుతుంది. ఇప్పుడు ఆ పదార్ధం కొరత తయారీ కంపెనీలను తీవ్రంగా వేధిస్తోంది. సూడాన్‌లో కొనసాగుతున్న ఆధిపత్య పోరు ప్రపంచ దేశాలే కాదు.. అంతర్జాతీయ కంపెనీలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రొడక్ట్‌ల తయారీకి అంతరాయం కలగకుండా ఉండేలా సుడాన్లో దొరికే పదార్ధాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. పెప్సీ, కోకో కోలాలో ఉపయోగించే పదార్ధం పెప్సీ, కోకో కోలాలో సాధారణంగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థం 'గమ్ అరబిక్'. పెప్సీ, కోకో కోలా కంపెనీలు తయారు చేసే సాఫ్ట్ డ్రింక్స్‌లో ఈ గమ్ అరబిక్‌ను కలుపుతారు. దీన్ని కలపడం వల్ల కూల్ డ్రింక్‌ను తయారీ కోసం వినియోగించే ఇంగ్రీడియంట్స్ విడిపోకుండా ఉంటాయి. లేదంటే ఇంగ్రీడియంట్స్ విడిపోయి రుచి, పచి ఉండవు. కాబట్టే తయారీ సంస్థలు ఈ గమ్ అరబిక్‌ను ఉపయోగిస్తాయి. ఇక ఆ పదార్ధం సుడాన్‌లోని అకాసియా చెట్టు నుంచి పూసే జిగురు తరహాలో ఉంటుంది. ఈ జిగురు ప్రపంచ దేశాలకు సూడాన్ నుండే రవాణా అవుతుంది. ప్రపంచంలో 70 శాతం గమ్ అరబిక్ సరఫరా ఆఫ్రికాలోని సూడాన్ గుండా ప్రవహించే సాహెల్ ప్రాంతం నుండి ఎగుమతి అవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వచ్చే 5-6 నెలల్లో గమ్ అరబిక్‌తో తయారు చేసిన ఉత్పత్తులు అయిపోవచ్చని ప్రధాన ఆహార, పానీయాల కంపెనీలకు గమ్ అరబిక్ సరఫరా చేసే కెర్రీ గ్రూప్ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ రిచర్డ్ ఫిన్నెగన్ను ఉటంకిస్తూ రాయిటర్స్‌లోని ఓ నివేదిక పేర్కొంది. డచ్ సప్లయర్ ఫోగా గమ్ భాగస్వామి మార్టిజెన్ బెర్గ్కాంప్ ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 బ్యాంక్ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. వారానికి 5 రోజులే పని దినాలు! 'గమ్ అరబిక్' ఉత్పత్తి ఏటా ప్రపంచవ్యాప్తంగా 120.000 బిలియన్ డాలర్ల విలువైన 1,1,500 టన్నుల గమ్ అరబిక్ ఉత్పత్తి అవుతుందని కెర్రీ గ్రూప్ అంచనా వేసింది. తూర్పు నుండి పశ్చిమ ఆఫ్రికా వరకు 500 మైళ్ళలో విస్తరించి ఉన్న ప్రాంతం నుండి ఈ గమ్‌ను సేకరిస్తారు. గమ్ అరబిక్ లేకపోతే పెప్సీ, కోకాకోలా వంటి దిగ్గజాలు తమ ఉత్పత్తులలో గమ్ అరబిక్ లేకుండా తమ ఉనికిని కాపాడుకోవడం సాధ్యం కాదని అగ్రిగమ్ మార్కెటింగ్ డైరెక్టర్ డాని హద్దాద్ చెప్పారు. ఫిజీ డ్రింక్స్ వంటి ఉత్పత్తుల్లో గమ్ అరబిక్కు ప్రత్యామ్నాయం లేదని నిపుణులు చెబుతుండగా.. సూడాన్ అంతర్యుర్ధం ముగింపుపై ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు సైతం ఐక్యారాజ్య సమితి వేదికగా తమ గొంతుకను వినిపిస్తున్నాయి. 500 మందికి పైగా మృతి సాయుధ బలగాల నడుమ జరుగుతున్న ఆ ఆధిపత్య పోరులో నార్త్ ఆఫ్రీకా దేశమైన సూడాన్ అతలాకుతలమవుతోంది. పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్స్‌ను ఆర్మీలో విలీనం చేయాలనే ప్రతిపాదన.. ఈ రెండు వర్గాల నడుమ ఘర్షణలకు దారి తీసింది. సూడాన్ రాజధాని ఖార్తోమ్తో పాటు దేశంలో పలు చోట్ల ఈ ఘర్షణలు కొనసాగుతుండగా.. సాధారణ పౌరులు ఇబ్బంది పడుతున్నారు. ఘర్షణలు మొదలైన ఏప్రిల్ 15 నుంచి ఇప్పటివరకు (మే1) లక్ష మందికిపైగా పౌరులు సూడాన్‌ను వీడినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. మరో 3.30 లక్షల మంది నిరాశ్రయులయ్యారని తెలిపింది. మరోవైపు, ఈ హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటివరకు 500 మందికిపైగా మృతిచెందగా.. నాలుగు వేల మందికి పైగా గాయపడ్డారు. చదవండి👉 ‘ఆఫీస్‌కి వస్తారా.. లేదంటే!’, వర్క్ ప్రమ్ హోం ఉద్యోగులకు దిగ్గజ టెక్ కంపెనీల వార్నింగ్ -
పెప్సీ కొత్త లోగో అదుర్స్! 15 ఏళ్ల తర్వాత...
పెప్సీ.. పరిచయం అక్కరలేని కూల్‌డ్రింక్ బ్రాండ్. త్వరలో 125వ వార్షికోత్సవం జరుపుకోబోతోంది. ఈ సందర్భంగా కొత్త లోగోను కంపెనీల ఆవిష్కరించింది. దీంతో దాదాపు 15 ఏళ్ల తర్వాత పెప్సీ లోగో మారబోతోంది. ఇదీ చదవండి: Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా? మొదట ఉత్తర అమెరికాలో, ఆ తర్వాత 2024 నాటికల్లా ప్రపంచమంతటా ఈ లోగో అమల్లోకి వస్తుంది. కాగా ప్రస్తుతం ఉన్న పెప్సీ లోగోను 2008లో రూపొందించారు. మళ్లీ ఇన్నేళ్లకు కంపెనీ 125వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త లోగోను తీసుకొస్తోంది పెప్సీ. పెప్సీ కొత్త లోగోను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. నల్లటి వృత్తం మధ్యలో పెద్దగా ‘PEPSI’ అనే అక్షరాలు, దాని చుట్టూ ఎరుపు, తెలుపు, నీలం చారలతో రూపొందించారు. కంపెనీ లోగోకు గొప్ప శక్తి, విశ్వాసం, ధైర్యాన్ని అందించడానికి రీడిజైన్ చేసినట్లు పెప్సికో చీఫ్ డిజైన్ ఆఫీసర్ మౌరో పోర్సిని తెలిపారు. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు పెప్సికో విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్, కెనడాలలో మొదటగా ఎలక్ట్రిక్ బ్లూ, బ్లాక్ క్యాన్లపై పెప్సీ కొత్తలోగోను వినియోగిస్తారు. దీంతోనే అక్కడ మార్కెటింగ్ కూడా చేస్తారు. తర్వాత 2024లో ప్రపంచమంతటా కొత్త లోగోను పరిచయం చేస్తారు. ఇదీ చదవండి: అడక్కుండానే రూ. 8,800 కోట్లు.. ఎస్బీఐపై కాగ్ రిపోర్ట్ -
పెప్సీ కొంటే.. కస్టమర్లకు ఎయిర్టెల్ పండుగ ఆఫర్
సాక్షి,ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ కస్టమర్లకు పండుగ ఆఫర్‌నుప్రకటించింది. రీఛార్జ్ కూపన్స్ అందించేలా పెప్సీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పెప్సీ కంపెనీ డ్రింక్స్ కొనుగోలు చేసిన వినియోగ దారులకు రీచార్జ్ కూపన్లను అందిస్తోంది. ఎయిర్టెల్ ఇలాంటి భాగస్వామ్యాన్ని ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. పండుగ సీజన్‌కు ముందుప్రీపెయిడ్ వినియోగదారులకు రీఛార్జ్ కూపన్లను అందించడానికి ఎయిర్టెల్ పెప్సీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పెప్సీ, మౌంటైన్ డ్యూ, మిరిండా, 7UP, స్లైస్, ట్రోపికానా పెట్ బాటిళ్లతో సహా పెప్సీ ఇతర పానీయాలను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 10 నుండి రూ. 20 విలువైన ఎయిర్టెల్ రీఛార్జ్ కూపన్లు లభిస్తాయి. పెప్సీ ప్రత్యేక ఎడిషన్ బాటిళ్లలో లేబుల్ వెనుక వైపు ఎయిర్టెల్ థాంక్స్ యాప్ డిస్కౌంట్ కోడ్ ఉంటుంది. 12 అంకెల కోడ్ కూపన్‌ను ద్వారా రీచార్జ్ కూపర్లను రిడీమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో కనీసం రూ. 99 రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ప్రతీ మొబైల్ నంబర్‌కు, డిస్కౌంట్ కోడ్లు రెండుసార్లు మాత్రమే పని చేస్తాయి. ఎయిర్టెల్ పెప్సికో ఆఫర్ ఫిబ్రవరి 2023 వరకు వినియోగ దారులకు అందుబాటులో ఉంటుందని ఎయిర్టెల్ మార్కెటింగ్ , కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శాశ్వత్ శర్మ తెలిపారు. -
కోలా, పెప్సీలకు క్యాంపాకోలా పోటీ!
న్యూఢిల్లీ: దేశీ శీతల పానీయాల మార్కెట్లో స్థానిక బ్రాండ్ క్యాంపాకోలా దిగ్గజాలకు దీటుగా విస్తరించే ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ప్యూర్ డ్రింక్స్ గ్రూపు 1970ల్లో క్యాంపాకోలా బ్రాండ్‌ను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. మన దేశంలో 1949లో కోకకోలాను పరిచయం చేసింది ఇదే గ్రూప్ కావడం గమనార్హం. 1970ల వరకు కోకకోలాకు తయారీ, డిస్ట్రిబ్యూటర్‌గా పీర్స్గ్రూపు పనిచేయగా, కోకకోలా భారత మార్కెట్ నుంచి వెళ్లిపోయిన తర్వాత తన బ్రాండ్లతో దేశీయంగా చొచ్చుకుపోయింది. విదేశీ కంపెనీల పోటీ లేని దశలో మార్కెట్‌ను శాసించే స్థాయికి చేరింది. ‘ద గ్రేట్ ఇండియన్ టేస్ట్’ నినాదంతో క్యాంపాకోలా స్థానిక రుచులతో కూడిన డ్రింక్స్‌ను పరిచయం చేసింది. అయితే, ఆ తర్వాత కోకకోలా తిరిగి భారత్‌లోకి రావడం, పెప్సీకో కూడా ప్రవేశంతో క్యాంపాకోలా వెనుకబడిపోవడం గమనార్హం. ఇప్పుడు పీర్స్ గ్రూపు వ్యవస్థాపకులైన సర్దార్ మోహన్‌సింగ్ కుటుంబంలో నాలుగో తరానికి చెందిన జయవంత్‌జిత్ సింగ్ దేశీ బ్రాండ్‌కు ఆదరణ తీసుకురావడంతోపాటు దేశవ్యాప్త విస్తరణపై దృష్టి పెట్టారు. త్వరలో చెన్నైకు... పీర్స్ గ్రూపు కార్యకలాపాలను ప్రస్తుతం జయవంత్‌జిత్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ కశ్మీర్, యూపీ, హరియాణా, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలు, రాజస్తాన్, ఢిల్లీ, ఉత్తరాంచల్, హిమాచల్‌ప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో క్యాంపాకోలా బ్రాండ్లు స్థానికులకు పరిచయమే. ప్రధానంగా, ఉత్తరాది, ఈశాన్య మార్కెట్లలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు చేరువయ్యేందుకు గాను తమకు ఫ్రాంచైజీ ప్లాంట్లు ఉన్నాయని జయవంత్‌జిత్ సింగ్ తెలిపారు. సిల్వాస్సాలో నిమిషానికి 600 బాటిళ్ల సామర్థ్యంతో యూనిట్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నేపాల్లోనూ తమ కార్యకలాపాలు ఉన్నాయని తెలిపారు. చెన్నై వంటి దక్షిణాది మార్కెట్లలోకి విస్తరించాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. రోజూ 4 మిలియన్ల కేసులను ప్రస్తుతం తయారు చేస్తున్నట్టు చెప్పారు. కోకకోలా భారత్ నుంచి తప్పుకున్న తర్వాత 1970ల చివర్లో, 1980ల్లో పార్లే గ్రూపు సైతం దేశీయ మార్కెట్లో హవా చలాయించింది. థమ్స్అప్, గోల్డ్‌స్పాట్, లిమ్కా బ్రాండ్లు పార్లేవే. కాకపోతే ఆ తర్వాత వీటిని మళ్లీ 1993లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన కోకకోలాకు విక్రయించడం జరిగింది. పెప్సీకో కూడా ప్రవేశించడంతో స్థానిక బ్రాండ్లు చిన్నబోయాయి. దీంతో దేశీయ శీతల పానీయాల మార్కెట్‌ను రెండు విదేశీ సంస్థలే ప్రస్తుతం శాసిస్తున్నాయి. నెగ్గుకొస్తుందా...? శామ్సికా మార్కెటింగ్ కన్సల్టెంట్స్ సీఎండీ జగ్దీప్కపూర్ మాట్లాడుతూ... ‘‘ఉత్తరాదిన క్యాంపాకోలాకు బలమైన బ్రాండ్ ఈక్విటీ ఉంది. అయితే, బ్రాండ్ స్థాయి అతిపెద్ద సవాలు కాగలదు’’ అని పేర్కొన్నారు. థమ్స్అప్, కోకకోలా, పెప్సీ మార్కెట్లో పెద్ద ఎత్తున వాటా ఉన్న బ్రాండ్లు. మరి క్యాంపాకోలా కూడా ఈ స్థాయికి ఎదగాలంటే అంతే దీటుగా బ్రాండ్ కూడా ఉండాలంటున్నారు మార్కెట్ నిపుణులు. పాతతరంతోపాటు, కొత్త తరానికీ మధ్య సమతూకం అవసరమన్నారు కపూర్. ఉత్తరాదిన రిలయన్స్ ఫ్రెష్, డీమార్ట్ తదితర స్టోర్లలోనూ క్యాంపాకోలా అడుగుపెట్టింది. ఆరెంజ్, లెమన్, లైమ్ అండ్ లెమన్, జీరసోడా, ఫిజ్జి యాపిల్ తదితర రుచులతో కూడిన డ్రింక్స్‌ను ప్రస్తుతం క్యాంపాకోలా మార్కెట్ చేస్తోంది. -
‘పెప్సీ’ని వదిలే ప్రసక్తే లేదు
సాక్షి, అమరావతి: రైతుల్ని వేధించినందుకు పెప్సీ కంపెనీ నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. గుజరాత్ రైతులపై కేసులు ఉపసంహరించుకుంటే సరిపోదని, మరెక్కడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని తీర్మానించాయి. ఈ వ్యవహారమై విజయవాడలో త్వరలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి రైతుల్ని చైతన్య పరచాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇదిలా ఉంటే పెప్సీ కంపెనీ నుంచి తమకు పరిహారం ఇప్పించాలంటూ బంగాళదుంప రైతులు కేసు వేయడంతో ఈ వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. చదవండి: (కేసులు పెడతావా.. పరిహారం చెల్లించు) గుజరాత్లో ఎఫ్‌సీ–5 రకం బంగాళదుంపను సాగు చేసినందుకు గత రెండేళ్లలో 9 మంది రైతులపై పెప్సీ కంపెనీ ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఒక్కో రైతు నుంచి ఒక కోటీ రెండు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ వ్యాజ్యాన్ని వేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో వెనక్కు తగ్గిన పెప్సీ కంపెనీ రైతులపై పెట్టిన కేసుల్ని వెనక్కు తీసుకుంటామంటూ కొన్ని ఆంక్షలు విధించింది. అయితే బాధిత రైతులకు మద్దతు తెలుపుతున్న రైతు సంఘాల ఐక్య వేదిక పలు రాష్ట్రాల్లో అవగాహన సదస్సులు, సభలు నిర్వహించతలపెట్టింది. దీనికి అనుగుణంగా త్వరలో ఏపీలోని పలు ప్రాంతాలలో సదస్సులు జరుగనున్నాయి. -
పెప్సీపై సమరశంఖం
సాక్షి, అమరావతి: బహుళ జాతి కంపెనీ పెప్సీ ఉత్పత్తుల బహిష్కరణకు రాష్ట్ర రైతు సంఘాలు పిలుపిచ్చాయి. రైతుల ప్రయోజనాన్ని కాంక్షించే వారందరూ ఈ కంపెనీ లేస్ పేరిట తయారు చేస్తున్న బంగాళాదుంపల చిప్స్‌ను, పెప్సీ శీతల పానీయాన్ని దూరం పెట్టాలని విజ్ఞప్తి చేశాయి. దేశీయ రైతాంగంపై పెప్సీ కంపెనీ పెత్తనమేమిటంటూ ధ్వజమెత్తాయి. ఈ కంపెనీ తీరును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు, కౌలు రైతుల సంఘం, సీఐటీయూ కార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, పెప్సీ ఉత్పత్తుల దహనం వంటి ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. గుజరాత్ రాష్ట్రంలో బంగాళదుంపలు పండించే రైతులపై పెప్సీ కంపెనీ పెట్టిన కేసుల్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి. అంతర్జాతీయ ఒప్పందాల మాటున రైతులు సొంతంగా విత్తనాలు ఉత్పత్తి చేసుకునే వెసులుబాటును కంపెనీలు కాలరాస్తున్నాయని మండిపడ్డాయి. నాటి ఈస్టిండియా కంపెనీ దోపిడీకి ప్రస్తుత పెప్సీ కంపెనీ దోపిడీకి తేడా లేదని దుమ్మెత్తిపోశాయి. దేశంలోని రైతులు, పంటలు, ఆదాయాలు, ఆహార భద్రత, వ్యవసాయ స్వాతంత్య్రం, దేశ సార్వభౌమాధికారంపై పెప్సీ కేసు ప్రభావం చూపుతుందని విజయవాడలో ధర్నా చేసిన రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెప్సీ కంపెనీ తప్పుడు సంప్రదాయానికి శ్రీకారం చుడుతోందని, ఈ తీరును మొగ్గలోనే తుంచేయకపోతే మున్ముందు రైతులు విత్తనాన్ని తయారుచేసుకునే స్వాతంత్య్రాన్నే కోల్పోతారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. పెప్సీ కంపెనీ వైఖరిని గర్హిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఆందోళనలు సాగినట్టు రైతు సంఘాల నేతలు పి.పెద్దిరెడ్డి, పి.జమలయ్య, కేవీవీ ప్రసాద్ తదితరులు ప్రకటించారు. విత్తన స్వేచ్ఛను హరించే పీపీవీఎఫ్‌ఆర్ చట్టం (వంగడాల రకాలు, రైతుల హక్కుల చట్టం–2001)లోని సెక్షన్ల తొలగింపునకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారమై త్వరలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఇదీ వివాదం..! లేస్ బ్రాండ్ పేరిట చిప్స్ తయారీకి బహుళజాతి పెప్సీ కంపెనీ ఎఫ్‌సీ–5 రకం బంగాళదుంపపై గుత్తాధిపత్యాన్ని సంపాదించింది. ఆ రకం దుంపను తాము గుర్తించిన రైతులు మాత్రమే సాగు చేసేలా గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది తెలియని నలుగురు గుజరాత్ రైతులు ఆ రకం దుంపను సాగు చేశారు. దీన్ని ఆక్షేపిస్తూ ఆ నలుగురి రైతులపై అహ్మదాబాద్ సిటీ కోర్టులో పెప్సీ కంపెనీ వ్యాజ్యం వేసింది. ఒక్కో రైతు నుంచి ఒక కోటీ ఐదు లక్షల రూపాయలను నష్ట పరిహారంగా ఇప్పించాలని కోరింది. కోర్టు తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆ రకం దుంపను సాగు చేయవద్దని ఆదేశించింది. ఈ సమయంలోనే పెప్సీ కంపెనీ.. కోర్టు బయట కేసును పరిష్కరించుకుంటామని కోరింది. అయితే తమ కంపెనీకి కేటాయించిన ఎఫ్‌సీ–5 రకం విత్తనాలను తమ నుంచే కొనుగోలు చేయాలని, పండించిన ఆ దుంపను తమ కంపెనీకే అమ్మాలని ఆంక్షలు పెట్టింది. భవిష్యత్‌లో ఈ విత్తనాలను సాగు చేయకుండా రైతులు తమతో ఒప్పందానికి రావాలని కూడా డిమాండ్ చేసింది. ఇది రైతులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. పెప్సీ ఆంక్షలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, తమపై పెప్సీ పెత్తనమేమిటని ఎఫ్‌సీ–5 రకం దుంపను సాగు చేసిన నలుగురు రైతుల్లో ఒకరైన వినోద్ కుమార్ తేల్చి చెప్పారు. పెప్సీ కంపెనీ ప్రతిపాదనను అంగీకరించినట్టయితే తాము తప్పు చేసినట్టవుతుందని వాదించారు. ఈ కేసు తదుపరి విచారణ జరిగే జూన్ 12 నాటికి తాము రైతులు, రైతు సంఘాలతో చర్చించి ఒక నిర్ణయం చెబుతామని కోర్టుకు నివేదించారు. దేశవ్యాప్తంగా రైతు సంఘాల పోరుబాట పెప్సీ కంపెనీ తీరును తప్పుబడుతూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు పోరు బాట పట్టాయి. దీనికి నానాటికీ మద్దతు పెరుగుతోంది. దేశంలోని 190కి పైగా రైతు సంఘాలు, శాస్త్రవేత్తలు, కార్మిక సంఘాల నేతలు దేశ ప్రజలకు విజ్ఞాపన చేస్తూ పెప్సీ కంపెనీ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపిచ్చారు. ఆ నలుగురు రైతుల తరఫున కేసును వాదిస్తున్న ఆనంద్ యాజ్ఞిక్ పెప్సీ ఒప్పందాన్ని అసంబద్ధమైందిగా అభివర్ణించారు. అధిక ధరకు రైతులు విత్తనాలు కొని, పంటను పండించిన తర్వాత తక్కువ ధరకు అమ్ముకోవాలని పెప్సీ కంపెనీ చెబుతోందని, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. మొత్తం మీద ఇప్పుడు పెప్సీ కంపెనీ వ్యవహారం చినికి చినికి గాలివానలా తయారైంది. -
పెప్సీకి కోహ్లి గుడ్‌బై!
తాను తాగకపోవడమే కారణం న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి మారిపోయాడు... ప్రస్తుతం 18 ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న అతను, ఇకపై తాను వాడే, తనకు నచ్చిన వాటికే అంబాసిడర్‌గా ఉంటా నన్నాడు. అందులో భాగంగా పెప్సీతో ఒప్పందాన్ని పునరుద్ధరించుకోరాదని నిర్ణయించుకున్నాడు. గత ఆరేళ్లుగా పెప్సీ కూల్ డ్రింక్‌తో కోహ్లికి అనుబంధం ఉంది. నేరుగా పెప్సీ అని పేరు చెప్పకపోయినా, ఈ సంస్థతో కాంట్రాక్ట్ పొడిగించుకోవద్దని తీసుకున్న నిర్ణయం అతని ఆలోచనలను చూపించింది. ‘కొన్నాళ్లుగా నా ఫిట్‌నెస్‌పై బాగా దృష్టి పెట్టాను. దానికి ఇబ్బంది కలిగించే వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. పేర్లు చెప్పను కానీ కొన్ని ఉత్పత్తులను నేను వాడటం లేదు. కేవలం డబ్బులు తీసుకుంటున్నాను కాబట్టి అలాంటి వాటిని ప్రమోట్ చేస్తూ వాడమని అభిమానులకు చెప్పలేను’ అని ఇటీవల కోహ్లి వ్యాఖ్యానించాడు. అయితే కూల్ డ్రింక్ కాకుండా పెప్సికో కంపెనీకి సంబంధించిన హెల్త్ బ్రాండ్ కోసం కోహ్లితో చర్చలు జరుపుతున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మరోవైపు లండన్‌లో సోమవారం జరిగిన కోహ్లి చారిటీ డిన్నర్ కార్యక్రమానికి భారత ఆటగాళ్లు హాజరయ్యారు. -
కోకాకోలా, పెప్సీలకు కోర్టులో ఊరట
శీతల పానీయాల కంపెనీలు కోకా కోలా, పెప్సీలను బహిష్కరించాలని అక్కడి వర్తకులు నిర్ణయించుకున్న మర్నాడే.. ఆ కంపెనీలకు మద్రాసు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కంపెనీలు తమిరపరని నది నుంచి నీళ్లను తీసుకుని వాడుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. స్థానికుల నిరసన కారణంగా గత నాలుగు నెలలుగా ఈ కంపెనీలు ఆ నది నీళ్లను వాడుకోలేకపోతున్న విషయం తెలిసిందే. నది నీళ్లను రసాయన అవసరాల కోసం ఈ కంపెనీలు వాడుకోవడం వల్ల వేలాది మంది రైతులు నష్టపోతున్నారని పిటిషనర్ వాదించారు. అయితే తాము కేవలం మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నట్లు కంపెనీలు తెలిపాయి. కూల్డ్రింకు కంపెనీలు నది నీళ్లను వాడుకోవడాన్ని నిరసిస్తూ 2015లో జరిగిన ఘర్షణలలో పలువురు గాయపడ్డారు. అయితే తాము ప్రభుత్వ పారిశ్రామిక ఎస్టేటులోనే ప్లాంట్లు పెట్టుకున్నామని, అనవసరంగా తమను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని కంపెనీలు వాదించాయి. ప్రతిరోజూ ఈ కంపెనీలు 9 లక్షల లీటర్ల నీళ్లను తీసుకోడానికి అనుమతి ఉన్నా, ఆ తర్వాత రెట్టింపు తీసుకుంటున్నాయని, వాటికి ప్రతి వెయ్యి లీటర్లకు రూ. 37.50 మాత్రమే తీసుకుంటున్నారని పిటిషనర్ డీఏ ప్రభాకర్ ఆరోపించారు. ఇప్పుడు కోర్టు నుంచి ఆ కంపెనీలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే.. ఈ మధ్యలోనే వాటిని బహిష్కరించాలని తమిళనాడు వ్యాప్తంగా ఉన్న వర్తక సంఘాలు నిర్ణయించాయి. పెప్సీ, కోకోకోలా పానీయాలు బాయ్‌కాట్! -
పెప్సీ, కోకోకోలా పానీయాలు బాయ్‌కాట్!
చెన్నై: బహుళజాతి సంస్థలు తయారు చేసిన శీతల పానీయాలపై తమిళనాడులో బహిష్కరణ వేటు పడింది. రాష్ట్రవ్యాప్తంగా పెప్సీ, కోకోకోలా శీతల పానీయాల అమ్మకాలు బుధవారం ఉదయం నుంచి నిలిచిపోయాయి. స్థానిక శీతల పానీయాలనే ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ రెండు కూల్ డ్రింక్స్‌ను బహిష్కరిస్తూ తమిళనాడు వనిగర్ సంఘం ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా ఈ నిర్ణయానికి సానుకూల స్పందన వస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు ఏఎం విక్రమరాజా తెలిపారు. పానీయాల ప్రభావం గురించి వ్యాపారులకు, వినియోగదారులకు అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. పెప్సీ, కోక్ పానీయాలు ఆరోగ్యానికి హానికరమని, వాటిలో క్రిమిసంహారకాలు ఉన్నాయన్నారు. అందువల్లే దేశీయం ఉత్పత్తి చేసే పానీయాలను ప్రోత్సహించేలా చర్యలు చేపడతామని విక్రమరాజా పేర్కొన్నారు. కాలీ మార్క్, బొవాంటో, టోనిరో వంటి స్థానిక పానీయాలు అమ్మకాలు పెంచేలా చర్యలు చేపడతామన్నారు. దీంతో కోక్.. పెప్సీ అమ్మకాలపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో రూ.1,400 కోట్లు నష్టం వాటిల్లినుంది. కాగా జల్లికట్టు విషయంలో తమ సంప్రదాయాల్ని.. సంస్కృతిని దెబ్బ తీసేలా వ్యవహరించిన పెటాకు ఆర్థిక సాయం అందించే పెప్సీ.. కోకోకోలా ఉత్పత్తుల్ని సినిమా థియేటర్లలో అమ్మకూడదని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
పెప్సీ, కోకోకోలా పానీయాలు బాయ్‌కాట్!
-
తమిళ యూత్ తర్వాతి టార్గెట్ ఫిక్స్!
చెన్నై: జల్లికట్టును కాపాడుకునేందుకు ఉద్యమిస్తున్న తమిళ యువత తర్వాత అన్నదాతల కోసం పోరాడనుంది. కర్షకులను కష్టల్లోకి నెడుతున్న బహుళజాతి సంస్థలకు వ్యతిరేకంగా పోరుబాట పట్టాలని యువకులు భావిస్తున్నారు. శీతల పానీయాలు తయారు చేస్తున్న మల్టీనేషనల్ కంపెనీలపై ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. రైతుల సంక్షేమం తమ తర్వాతి ఎజెండా అని జల్లికట్టు ఆందోళనలో పాల్గొన్న ఉద్యమకారులు వెల్లడించారు. అన్నదాతలకు నీళ్లు దక్కకుండా దోచుకుంటున్న కోకాకోల, పెప్సీలను నిషేధించాలన్న డిమాండ్ తో ఆందోళనలు చేపట్టనున్నట్టు తెలిపారు. బహుళజాతి కంపెనీలు తమ వ్యాపార అవకాశాల కోసం నీటిని వాడుకుంటూ పంటలకు అందకుండా చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఎంఎన్సీలకు వ్యతిరేకంగా కోయంబత్తూరులో యువత కూల్ డ్రింక్స్ బ్యాటిల్ ను విసిరేసి నిరసన తెలిపింది. వీరికి పలు హోటళ్లు, ఆహార విక్రయ కేంద్రాలు మద్దతు ప్రకటించాయి. కోక్, పెప్సి సర్వ్ చేయబోమని పలు హోటళ్లు బోర్డులు పెట్టాయి. ‘మా సంస్థకు అన్ని బ్రాంచుల్లో పెప్సి, కోక్ ఉత్పత్తులు సర్వ్ చేయడం నిలిపివేశామ’ని ఆర్ హెచ్ ఆర్ హోటల్ మెయిన్ కౌంటర్ వద్ద బోర్డు పెట్టింది. బహుళజాతి సంస్థలు తయారు చేస్తున్న శీతలపానీయాలు ఆరోగ్యానికి హానికరమని కొంతమంది ఆందోళనకారులు పేర్కొంటున్నారు. వీటిపై నిషేధం విధించలేకపోయినా కనీసం అమ్మకాలను నియత్రించాలని వారు కోరుతున్నారు. -
ఐపీఎల్‌కు కొత్త స్పాన్సర్
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి పెప్సీ తప్పుకుంది. పెప్సీ స్థానంలో చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ 'వివో' ముందుకొచ్చింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా పెప్సీ 2013లో ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 396 కోట్ల భారీ మొత్తానికి కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం 5 సంవత్సరాలు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించాల్సి ఉంది. కానీ ఇటీవల ఐపీఎల్లో వెలుగుచూసిన స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంతో పెప్సీ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. పెప్సీ కన్నా ముందుగా ఐపీఎల్‌కు డీఎల్ఎఫ్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. 200 కోట్లకు కుదిరిన డీఎల్ఎఫ్ ఒప్పందం 2008 నుంచి 2012 వరకు కొనసాగింది. ఈ విషయంపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. పెప్పీ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకోవడం చాలా చిన్న విషయం అన్నారు. ఈ ఘటన ఐపీఎల్ పై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. పెప్సీతో తమ అనుబంధం చక్కగా కొనసాగిందని, సామరస్య పూర్వకమైన చర్చలతో ఈ వ్యవహారం ముగుస్తుందని ప్రకటించారు. రెండు సంవత్సరాలకు టైటిల్ స్పాన్సర్‌గా ఇప్పటికే చైనా కంపెనీ వివోతో ఐపీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. పెప్సీ ఒప్పందానికి వర్తించిన నియమనిబంధనలే ఈ డీల్ కు కూడా వర్తిస్తాయని ప్రకటించింది. 2013లో వెలుగుచూసిన అంకిత్ చవాన్, శ్రీశాంత్, చండీలాల స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంతో ఐపీఎల్ ప్రతిష్ఠ మసకబారింది. తాజాగా స్పాట్ ఫిక్సింగ్పై జస్టిస్ లోథా కమిటి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్లు నిషేధం విధించడంతో పెప్సీ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ఐపీఎల్‌కు పెప్సీ రాం రాం!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో మూడేళ్లుగా కొనసాగుతున్న తమ అనుబంధాన్ని తెగదెంపులు చేసుకోవాలని పెప్సీకో కంపెనీ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ నుంచి వైదొలుగుతున్నట్టు బీసీసీఐకి తెలిపింది. దీంతో వచ్చే ఏడాది సీజన్‌కు కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2012లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐపీఎల్‌తో పెప్సీ 2017 వరకు కొనసాగాల్సి ఉంది. దీనికోసం బోర్డుతో రూ.396 కోట్ల భారీ మొత్తంతో డీల్ కుదుర్చుకుంది. అయితే స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం వెలుగు చూడడంతో ఐపీఎల్ ప్రతిష్టకు అపఖ్యాతి ఏర్పడిందన్న కారణంతో ఈ కూల్‌డ్రింక్ కంపెనీ తన మనసు మార్చుకుంది. వాస్తవానికి గతేడాదే ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలని అనుకున్నా బోర్డు ఒత్తిడితో కొనసాగింది. ప్రస్తుతం ఈ విషయంపై బీసీసీఐతో కంపెనీ చర్చలు జరుపుతోంది. మరోవైపు పెప్సీకో తప్పుకోవడం పెద్ద విషయం కాదని, తమకు ఇతర ఆలోచనలు ఉన్నాయని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఏం జరిగినా సామరస్యంగా జరుగుతుందని అన్నారు. మరోవైపు ఆసక్తి ఉన్న కంపెనీలతో చర్చించి పెప్సీ నుంచి హక్కులను వారికి బదలాయించే ఆలోచనలో బోర్డు ఉంది. 18న వర్కింగ్ కమిటీ సమావేశం ముంబై: బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం ఈనెల 18న ముంబైలో జరుగనుంది. చాలా విషయాలు చర్చించే అవకాశాలు ఉండడంతో ఈ మీటింగ్ కీలకం కానుంది. కొత్త అధ్యక్షుడిగా నియమితులైన శశాంక్ మనోహర్ ఈ సందర్భంగా సభ్యులకు తన ప్రణాళికలను వెల్లడించనున్నారు. -
ఆలోచనే ఆరంభం
ఫ్యాప్సీ (ఫెడరేషన్ ఆఫ్ ఏపి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) మహిళా విభాగం ‘ఫ్యాప్సీ ఉమెన్ ఇన్ బిజినెస్’(ఎఫ్‌డబ్ల్యూబి) తొలి అధ్యక్షురాలిగా ఇటీవల ఎన్నికయ్యారు వినీత సురానా. ‘వ్యాపార రంగంలో మహిళల భాగస్వామ్యం కోసం మరింత ప్రయత్నిస్తాను’ అంటున్న వినీత అంతరంగం... సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (హైదరాబాద్) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు ‘‘నేను బాస్‌ను... అనే ఆలోచన నుంచి బయటికి వచ్చి నిన్ను నువ్వు మామూలు ఉద్యోగిగా భావించుకో’’ అని అనడమే కాదు ‘‘నువ్వు మమ్మల్ని ఏ సలహా అడగవద్దు. బాగా కష్టపడు. అలా కష్టపడే క్రమంలోనే నువ్వు అడగకపోయినా ఎన్నో విలువైన సలహాలు నీకు దొరుకుతాయి’’ అన్నారు నాన్న. నిజమే అనిపించింది. నేను ఒక కొత్త ప్రాజెక్ట్ చేపడితే, నామ్‌కే వాస్తేగా కాకుండా ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి అన్ని కోణాలలో అధ్యయనం చేసేదానిని. దీనివల్ల పని సులువయ్యేది. అమెరికా, దుబాయ్... ఇలా దాదాపు యాభై దేశాల్లో కంపెనీ తరపున స్టాల్స్, ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం, మార్కెటింగ్ వ్యవహారాలు చూసుకోవడం వల్ల ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వచ్చింది. నా శైలి ఇది... ప్రతి తరానికి తనదైన ముద్ర ఉంటుంది. అలా నేను కూడా వ్యాపారంలో నాదైన శైలిని చూపాను. ఎప్పుడు చూసినా వ్యాపార జపం చేయడం కాకుండా... ఉద్యోగుల సంతోషం, సంక్షేమం గురించి ఆలోచించేదాన్ని. ఒకప్పుడు ‘వినియోగదారులకు మాత్రమే ప్రాధాన్యత’ అనేట్లుగా ఉండేది. ఈ తరహా ఆలోచన విధానాన్ని నేను మార్చాను. ‘యజమానులు - ఉద్యోగులు’ అనే దాన్ని పక్కన పెట్టి ‘మనమంతా ఒక కుటుంబం’ అనే భావనను తీసుకొచ్చాను. ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాను. ఉద్యోగుల నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తే ఆలస్యం చేయకుండా వాటిని పరిష్కరించడం జరిగింది. అలాగే మా కంపెనీలో ‘ఉమెన్ ఫోరమ్’ను ఏర్పాటు చేసి మహిళా ఉద్యోగులకు అన్ని రకాలుగా అండగా నిలిచాం. ‘ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి’ అనే నా ఆలోచన వృథా పోలేదు. పనిలో నాణ్యత పెరిగింది. లాభాలు ఇరవై శాతం పెరిగాయి! సక్సెస్ మంత్ర సక్సెస్ అనేది అదృష్టంలో ఉండదు. కష్టించడంలో ఉంటుంది అనేమాట వింటాం. అయితే ‘కష్టం’ మాత్రమే సరిపోదు. కాలంతో పాటు మారడం కూడా అత్యవసరం. కాలంతో పాటు వస్తువులు మాత్రమే కాదు... వ్యాపార వ్యూహాల్లో కూడా మార్పులు వస్తుంటాయి. వాటిని అవగాహన చేసుకోకపోతే పోటీలో వెనకబడిపోతాం. వ్యాపారరంగంలో సురాన కంపెనీ నాలుగు దశాబ్దాలుగా నిలుదొక్కు కుందంటే కాలంతో పాటు వచ్చే మార్పును ఆహ్వానించడమే కారణం. ఆలోచన వస్తేనే ఆరంభం... ‘ఫ్యాఫ్సి ఉమెన్ ఇన్ బిజినెస్ (ఎఫ్‌డబ్ల్యూబి)తొలి అధ్యక్షురాలిగా ఎన్నికకావడం అనేది నాకు లభించిన విలువైన అవకాశంగా భావిస్తున్నాను. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మాకు తగిన సహకారం అందించడానికి హామీ ఇచ్చాయి. వారి మద్దతు మా ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. వ్యాపారరంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి... ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వానికి మధ్య ‘ఎఫ్‌డబ్ల్యూబి’ వారధిగా నిలుస్తుంది. వారికి ఎలాంటి సమస్య వచ్చిన ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. మా కార్యక్షేత్రం కేవలం పట్టణాలు మాత్రమే కాదు. గ్రామీణప్రాంతాలకు వెళ్లి మహిళల కోసం వర్క్‌షాప్‌లను నిర్వహించడానికి తగిన ప్రణాళికలను రూపొందిస్తున్నాము. ‘ఆలోచన’ వచ్చినప్పుడే ‘ఆరంభం’ మొదలవుతుంది. దురదృష్టవశాత్తు చాలామంది గ్రామీణ మహిళల్లో ‘వ్యాపారంలోకి ప్రవేశించాలి’ అనే ఆలోచన రావడం లేదు. ఇంటి పనికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ధోరణిలో మార్పు తీసుకురావడానికి వర్క్‌షాప్‌లు కచ్చితంగా ఉపయోగపడతాయి. కుట్టుపని కావచ్చు, ఆర్ట్ కావచ్చు... ఏదైనా సరే, ఏ రంగం అయినా సరే గ్రామీణ మహిళలకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తాం. వర్క్‌షాప్‌లలో ‘మీకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. ఇలా చేయండి’ ‘వ్యాపారరుణం ఇలా తీసుకోవచ్చు’ ‘ఇలా మార్కెటింగ్ చేస్తే మంచిది’ ఇలా ఎన్నో రకాల సలహాలు ఇవ్వడం, వారికేమైనా సందేహాలు ఉంటే తీర్చడం జరుగుతుంది. లండన్‌లోని ‘మాంచెస్టర్ బిజినెస్ స్కూల్’లో చదువుకున్న పాఠాలు, ‘మోటివేషన్ స్పీకర్’గా నాకు ఉన్న అనుభవాన్ని కూడా వ్యాపారరంగం వైపు గ్రామీణ మహిళలు ఆసక్తి చూపించడానికి ఉపయోగిస్తాను. ‘స్వీయ అభివృద్ధి’ ‘సామాజిక అభివృద్ధి’కి ఫ్యాప్సీ ప్రాధాన్యత ఇస్తుంది. స్వీయ అభివృద్ధి ద్వారా సామాజిక అభివృద్ధి జరుగుతుందనేది మా నమ్మకం. ఆ దిశగా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాము. నచ్చిన పుస్తకం దేవదత్ పట్నాయక్ రాసిన ‘బిజినెస్ సూత్ర’ పుస్తకం అంటే ఇష్టం. వ్యాపారసూత్రాలను మన పురాణాల ఆధారంగా ఆసక్తికరంగా చెబుతుందీ పుస్తకం. మన పురాణాల్లోని కథలు, ప్రతీకలు, ఆచారసంబంధమైన వ్యవహారాలను తీసుకొని టీకొట్టు నడిపే వ్యక్తి నుంచి పెద్ద వ్యాపారి వరకు ఉపయోగపడేలా పట్నాయక్ ఈ పుస్తకం రాశారు. గొప్ప గొప్ప వ్యాపార సూత్రాలు పాశ్చాత్యపుస్తకాల్లో మాత్రమే లేవని, మన పురాణాల్లో కూడా ఉన్నాయని స్పష్టంగా చెప్పిన పుస్తకం ఇది. ఆమె అంటే ఇష్టం... నేను అభిమానించే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ కిరణ్ మజుందార్ షా. ‘బయోకాన్ ఇండియా’ మొదలుపెట్టినప్పుడు విశ్వసనీ యత మొదలు జెండర్ వరకు రకరకాల సమస్యలు ఎదుర్కొన్నారు. వీటితోపాటు సాంకేతిక సమస్యలు సరేసరి. అయితే ఆమె ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. సమస్యలకు భయపడకుండా వాటిని అధిగమించిన తీరు ఆదర్శనీయం. ఒకదాని కోసం మరొక దాన్ని నష్టపోనక్కర్లేదు. కుటుంబజీవితాన్ని, వ్యాపారజీవితాన్ని సమన్వయపరు చుకోవడంలో కూడా కిరణ్ ఆదర్శంగా నిలిచారు. అందుకే ఆమె అంటే ఇష్టం. -
సృజన... సంచలనం!
పెప్సీ అన్న పేరు వినగానే అలవోకగా అందరి పెదాలపై పలికే మాట... ‘యే దిల్ మాంగే మోర్’! చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దవాళ్ల వరకూ అందరినీ అంతగా ఆకట్టుకుంది ఆ క్యాప్షన్. ఇంతకీ దాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరో తెలుసా... అనుజా చౌహాన్. అడ్వర్టయిజింగ్ రంగంలో రెయిజింగ్ స్టార్ అంటూ తొంభైల్లో అందరితో అనిపించుకున్న వ్యక్తి ఆమె. అతి చిన్న వయసులోనే పెద్ద విజయాలు సాధించిన అనుజ... నేటి మహిళలెందరికో స్ఫూర్తిప్రదాత! ‘నీ మనసు చెప్పింది విను, అపజయాలకు భయపడకు’... అనుజా చౌహాన్ అందరితోనూ చెప్పే మాట ఇది. అది చెప్పేటప్పుడు ఆమె చూపులు సూటిగా ఉంటాయి. ముఖంలో ఆత్మవిశ్వాసం తెచ్చిన హుందాతనం కనిపిస్తుంది. ఎందుకంటే... అవి ఏవో చెప్పాలని చెప్పిన మాటలు కాదు. ఆమె సాధించిన విజయాలకు పునాదిరాళ్లు! క్రియేటివ్ క్వీన్... మీరట్‌లోని రాజ్‌పుత్ కుటుంబంలో పుట్టారు అనుజ. తండ్రి ఆర్మీ అధికారి కావడంతో ఆమె చిన్నతనమంతా ఉత్తర భారతదేశంలోని కంటోన్మెంట్లలో గడిచింది. ఆయన రిటైరయిన తర్వాత వారి కుటుంబం ఆస్ట్రేలియాకు తరలి వెళ్లింది. అక్కడి రాయల్ మెల్బోర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్ కమ్యునికేషన్స్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు అనుజ. ఆ తర్వాత భారతదేశానికి తిరిగొచ్చి, 1993లో ఢిల్లీలోని ‘జె.వాల్టర్ థామ్సన్’ కంపెనీలో ట్రెయినీగా చేరారు. నాటి నుంచీ సృజనాత్మక రంగంలో ఆమె ప్రయాణం అత్యంత వేగంగా సాగింది. త్వరగా గ్రహించే తత్వం, వేగంగా ఆలోచించే లక్ష్యం, సృజనాత్మకత, నిబద్ధత, క్రమశిక్షణ... ఇలా చాలా విషయాలు అనుజను ఉన్నత స్థాయికి చేర్చాయి. జేడబ్ల్యూటీ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ క్రియేటివ్ డెరైక్టర్ని చేశాయి. అది కూడా ముప్ఫై మూడేళ్లకే. ఆ కంపెనీకి ఉపాధ్యక్షులైనవారిలో అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు అనుజ. అది అంత తేలికగా ఏమీ సాధ్యపడలేదు. పదిహేడేళ్ల పాటు తన తెలివితేటల్ని, క్రియేటివిటీని ఆ కంపెనీకి ధారపోశారు అనుజ. పెప్సీ యాడ్ కోసం... యే దిల్ మాంగే మోర్, మేరా నంబర్ కబ్ ఆయేగా, నథింగ్ ఆఫీషియల్ అబౌట్ ఇట్, ఓయ్ బబ్లీ అంటూ ఆమె సృష్టించిన క్యాప్షన్లు కాసులు కురిపించాయి. అలాగే... డర్‌కే ఆగే జీత్ హై (మౌంటెన్ డ్యూ), తేడా హై పర్ మేరా హై (కుర్కురే), బీ ఎ లిటిల్ దిల్లాజికల్ (లేస్ చిప్స్), బ్రేక్ తో బన్తా హై (కిట్‌క్యాట్)... ఇలా ఆమె రాసిన క్యాప్షన్లు ఆయా ఉత్పత్తులకు మార్కెట్లో తిరుగు లేకుండా చేశాయి. అందుకే క్రియేటివ్ క్వీన్ అంటూ ఆ కంపెనీ ఆమెకు పట్టం కట్టింది. అత్యున్నత పదవిని అప్పజెప్పింది. ఊహించని అడుగు... ఉన్నత స్థాయికి చేరడమనేది అదృష్టం. ఆ అదృష్టాన్ని ఎవరైనా వదులుకుంటారా? వదులుకుంటే వారిని అందరూ పిచ్చివాళ్లలా చూస్తారు. అనుజని కొందరు అలానే చూశారు... జేడబ్ల్యూటీ వైస్ ప్రెసిడెంట్ పదవిని వదులుకున్నప్పుడు! అడ్వర్టయిజింగ్ రంగంలో ఆమె సృష్టించిన సంచలనాలు వ్యాపార ప్రపంచంలో ఆమెను ఓ పెద్ద సెలెబ్రిటీని చేశాయి. ఎకనమిక్ టైమ్స్‌లో తరచుగా ఆమె శీర్షికలు కనిపించేవి. మన దేశంలోని పదిమంది హాట్ క్రియేటివ్ డెరైక్టర్స్‌లో ఒకరు అంటూ పత్రికలు ప్రశంసలు కురిపించాయి. 2010 సంవత్సరపు క్రియేటివ్ ర్యాంకింగ్స్‌లో 26వ ర్యాంకును ఆమెకు కట్టబెట్టాయి. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ప్రకటనా రంగం నుంచి తప్పుకుంది. అలా ఎందుకు చేశారు అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం... ‘నా మనసు చెప్పింది విన్నాను’ అని! ఇంతకీ ఆమె మనసు ఏం చెప్పిందో తెలుసా... రచయిత్రి అవ్వమని! అవును. అనుజకి మొదట్నుంచీ రచయిత్రి కావాలని కోరిక. ఆ కోరికను తీర్చుకోవడానికే అంతవరకూ ఉన్న ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టారు. అందులోనూ విజయం సాధించారు. ఆమె రాసిన ‘ద జోయా ఫ్యాక్టర్’ అనే పుస్తకం బోలెడు అవార్డులు గెలుచుకుంది. ఆ తర్వాత రాసిన ‘బ్యాటిల్ ఫర్ బిటోరా’, ‘దోజ్ ప్రైసీ ఠాకూర్ గాళ్స్’ కూడా ఆమెకు రచయిత్రిగా పేరు తెచ్చిపెట్టాయి. ఇక్కడ కూడా మీ ముద్ర చూపించారుగా అని ఎవరైనా అంటే... ‘‘నాకు తెలుసు నేను సక్సెస్ అవుతానని, ఆ నమ్మకం లేకపోతే నేను అడుగే వేయను’’ అంటారు అనుజ. ఆ మాట ఎంత నిజమో... ఆమె కెరీరే చెబుతోంది కదా! ఓ పక్క తన ప్రతిభకి, మరోపక్క తన అందానికి సమానంగా ప్రశంసలు పొందిన వ్యక్తి అనుజ. 2011లో ఫెమినా పత్రిక ఎంపిక చేసిన యాభైమంది భారతీయ సుందరీమణుల్లో అనుజ ఒకరు. అలాగే భారతదేశంలోని యాభైమంది శక్తిమంతమైన మహిళల జాబితాలో కూడా ఆమె స్థానం సంపాదించారు. 1994లో... ఇండియన్ ఐడల్, పర్ఫెక్ట్ బ్రైడ్ లాంటి ప్రతిష్టాత్మ టెలివిజన్ షోలను నిర్మించిన నిరేత్ అల్వాని పెళ్లాడారు అనుజ. వారికి ఇద్దరు కూతుళ్లు (నీహారిక మార్గరెట్, నయనతార వయొలెట్)... ఒక కుమారుడు (దైవిక్ జాన్). -
శక్తికి మించిన బరువు
రెండు కిరీటాలు ఇంద్రా నూయి! పెప్సీ కంపెనీ సీఈవో. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతురాలైన మహిళల్లో ఒకరిగా ఆమె పేరు పదే పదే వినిపిస్తుంటుంది. ఇక మన భారతీయులకైతే నూయీ ఏకంగా స్త్రీ శక్తికి ప్రతిరూపం. స్ట్రాంగ్ ఉమన్. అయితే ‘‘ఆఫీసు బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ, అదే సమయంలో ఇంటినీ చక్కబెట్టుకునే విషయంలో స్త్రీ ఏమంత శక్తిమంతురాలు కాదు’’ అని ఇటీవలి ఒక సమావేశంలో నూయీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయింది. అమె చెప్పింది కరెక్టే అని పెద్ద పెద్ద కంపెనీలలో ఉన్నత హోదాలో ఉన్న కొందరు మహిళలు ఏకీభవిస్తే, సాధారణ ఉద్యోగినులలో చాలామంది ఆమె అలా అనడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక ఆదర్శ మహిళ ఇలా మాట్లాడ్డం ఏమిటన్న ఆశ్చర్యం కావచ్చది. ఏమైనా 58 ఏళ్ల నూయీ వ్యాఖ్యలు తేలిగ్గా తీసుకోదగినవి కాదు. ‘‘ఇంటినీ, ఆఫీసును ఏక కాలంలో సర్దుబాటు చేసుకోగల శక్తి స్త్రీకి ఉందని నేను అనుకోను’’ అంటూ ఇటీవల కొలరెడోలో జరిగిన ‘ఆస్పెన్ ఐడియాస్ ఫెస్టివల్’లో నూయీ తను అనుభవాలు కొన్నింటిని వెల్లడించారు. ‘‘కొన్నిసార్లు అపరాధభావం నన్ను కుదిపేస్తుంటుంది. నా ఇద్దరు కూతుళ్లకు వారి టీనేజ్‌లో తగిన సమయాన్ని కేటాయించగలిగానా అని ఆలోచనలో పడతాను. నేను మంచి తల్లిని కాదేమోనని అనుకుంటూ ఉంటాను. ముప్పై నాలుగేళ్ల జీవిత సహచర్యంలో నా భర్త కూడా చాలాసార్లు నా పని ఒత్తిళ్లను అర్థం చేసుకునే ప్రయత్నంలో విఫలమై అసంతృప్తికి లోనైన సందర్భాలు కూడా ఉన్నాయి. కుటుంబం అన్నాక ఇలాంటివి తప్పవు. అలాగని ఆఫీసులో అత్యున్నతస్థాయిలో మన వల్ల జరగవలసిన పనులను కుటుంబం కోసం వాయిదా వెయ్యలేం కదా. మరోవైపు ఇంట్లోని పెద్దవాళ్ల బాగోగులనూ చూసుకుంటుండాలి. అందుకే అంటాను, స్త్రీ శక్తి పరిమితమైనదని! బాధ్యతలు ఆమె కన్నా శక్తిమంతమైనవని!’’ అన్నారు ఇంద్రా నూయి. పద్నాలుగేళ్ల క్రితం ఓరోజు ఇంట్లో జరిగిన సంఘటనను ఈ సందర్భంగా నూయీ గుర్తుచేసుకున్నారు. తనను పెప్సీ కంపెనీ ప్రెసిడెంట్‌ను చేయబోతున్నారని, డెరైక్టర్ల బోర్డులో తన పేరు కూడా ఉండబోతున్నదని తెలిసిన వెంటనే ఆమె ఎంతో సంతోషంగా ఇంటికి రాగానే ఆ శుభవార్తను మొదట తల్లి చెవిన వేశారు. అయితే తల్లి అందుకు ఏమన్నారంటే... ‘‘ఒక విషయం చెప్తాను గుర్తుంచుకో. నువ్వు పెప్సీ కంపెనీకి ప్రెసిడెంటు అయితే కావచ్చు. డెరైక్టర్ల బోర్డులో నువ్వు కూడా ఉంటే ఉండొచ్చు కానీ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక నువ్వొక భార్యవి, నువ్వొక కూతురువి, నువ్వొక తల్లివి, నువ్వొక కోడలివి. ఆఫీసులో నీ పనిని మరెవరైనా చేయడానికి వీలుంటుంది. ఇంట్లో మాత్రం ఈ పాత్రలన్నీ నువ్వే పోషించాలి’’ అన్నారట! ‘‘ఇంటినీ, ఆఫీసునీ ఏకకాలంలో చక్కబెట్టేకునే శక్తి స్త్రీకి లేదు’’ అని ఇంద్రా నూయీ అనడం వెనుక ఇలాంటి అనుభవాలు బోలెడన్ని ఉన్నాయి. అలాగని స్త్రీ శక్తిని ఆమె తగ్గించి మాట్లాడారని భావించనవసరం లేదు. స్త్రీ ఇంటా బయటా రాణించాలంటే ఇంట్లో వాళ్ల సహాయ సహకారాలు ఎంతో ముఖ్యమని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా భర్త తోడ్పాటు ఎక్కువగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు స్త్రీ ఏ రంగంలోనైనా రాణిస్తుంది అని చెప్పడం ఇంద్రా నూయి ఉద్దేశమని అనుకోవాలి. -
పెప్సికో ఉచిత టాక్‌టైమ్ ఆఫర్
న్యూఢిల్లీ: పెప్సికో కంపెనీ 20-20 క్రికెట్ సీజన్ సందర్భంగా ఉచిత టాక్‌టైమ్ ఆఫర్‌ను అంది స్తోంది. తమ ఆహార పానీయాలు, ఆహారోత్పత్తుల కొనుగోళ్లపై ఈ ఉచిత టాక్‌టైమ్ ఆఫర్‌ను పొందవచ్చని పెప్సికో ఇండియా వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్) దీపికా వారియర్ తెలిపారు. పెప్సీ, సెవెనప్, మిరిండా ఆరెంజ్, మౌంటెన్ డ్యూ, స్లైస్‌లపై; కుర్కురే(రూ. 30 ప్యాక్), లేస్(రూ.35 ప్యాక్)లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు. వీటి లేబుల్ వెనక గానీ, ప్యాక్ లోపల గానీ ఒక కోడ్ ఉంటుందని, ఆ కోడ్‌ను 9818181234కు ఎస్ఎంఎస్ చేస్తే రూ.10 టాక్‌టైమ్ పొందవచ్చన్నారు. లేదా పేటైమ్డాట్కామ్లో కోడ్‌ను ఎంటర్ చేస్తే రూ.15 టాక్‌టైమ్ లభిస్తుందని తెలిపారు. ఆఫర్ ప్రి పెయిడ్(ఎస్ఎంఎస్ లేదా ఆన్లైన్ రీచార్జ్), పోస్ట్ పెయిడ్(ఆన్లైన్ రీచార్జ్ మాత్రమే) కనెక్షన్లకు వర్తిస్తుందని పేర్కొన్నారు. -
పప్సీకో ఇంద్రా నూయికి రూ. 113 కోట్ల వేతనం
న్యూయార్క్: సాఫ్ట్‌డ్రింక్స్ దిగ్గజం పెప్సీకో సీఈవో ఇంద్రా నూయి గతేడాది సుమారు రూ. 113 కోట్ల (18.6 మిలియన్ డాల ర్లు) వేతనం అందుకున్నారు. ఇది అంతక్రితం ఏడాదితో పోలిస్తే 7 శాతం అధికం. 2006 నుంచి భారతీయ సంతతికి చెందిన ఆమె పెప్సీకో సీఈవోగా ఉన్నారు. -
పవర్ పోయేలోగా పనికానిచేద్దాం
-
పవర్ పోయేలోగా పనికానిచేద్దాం
అనర్హత కంపెనీలకు అడ్డగోలు రాయితీలు పెట్టుబడులకు మించి రాయితీ కల్పిస్తున్న రాష్ట్ర సర్కారు పెప్సీ, మహీంద్రా కంపెనీలపై అలవిమాలిన ప్రేమ నిబంధనలను తుంగలోకి తొక్కుతున్న వైనం ‘మ్యాంగో జ్యూస్’ సాకుతో పెప్సీకి లబ్ధి చేకూర్చేందుకు రెడీ మహీంద్రా కంపెనీ పొరుగు రాష్ట్రంలో చెల్లించే వ్యాట్‌ను భరించేందుకు సంసిద్ధత ఎస్ఐపీబీ ద్వారా లేదంటే నేరుగా ఎంవోయూ ద్వారా రాయితీల ప్రకటనకు రంగం సిద్ధం అనుకూలంగా ప్రతిపాదనలు పంపాలంటూ అధికారులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు సాక్షి, హైదరాబాద్: ఒకవైపు రాష్ట్ర విభజన సెగలు... మరోవైపు పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి! ఈ పరిస్థితుల్లో అన్ని పనులూ కానిచ్చేద్దామని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నట్టుంది. ఒక చేత్తో అనర్హత జాబితాలోని కంపెనీకి రాయితీలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్న ప్రభుత్వం... మరో చేత్తో ఇతర రాష్ట్రాల్లో విక్రయించే ట్రాక్టర్లకు కూడా వ్యాట్ రాయితీని ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు ఎన్ని అడ్డదారులనైనా తొక్కేందుకు వెనుకాడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేతృత్వంలోని రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ)తో సంబంధం లేకుండా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) రూపంలోనో.. సీఎం నేతృత్వంలోని రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) ద్వారానో పని కానిచ్చేందుకు పథక రచన కొనసాగుతోంది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలంటూ పరిశ్రమల శాఖ అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిళ్లు తెస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా కోట్లాది రూపాయల ఈ రాయితీ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెప్సీకి ‘రెడ్’ కార్పెట్.. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌లో రూ.400 కోట్లతో ఏర్పాటు చేయనున్న యూనిట్‌కు అర్హత లేకున్నా రాయితీలు ఇచ్చేందుకు వేగంగా ప్రతిపాదనలు నడుస్తున్నాయి. వాస్తవానికి కూల్ డ్రింక్స్ తయారీ యూనిట్... పారిశ్రామిక విధానం ప్రకారం అనర్హత జాబితాలో ఉంది. అయితే మ్యాంగో జ్యూస్ కూడా ఇక్కడ తయారు చేయనున్నారనే సాకుతో అర్హత లేకున్నా రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధపడుతున్నారు. రెండు రకాల ఉత్పత్తులను ఒకే ప్లాంటులో సంస్థ ఉత్పత్తి చేస్తుంటే.. రాయితీకి అర్హత కలిగిన ఉత్పత్తి... మొత్తం ఉత్పత్తిలో 89 శాతం ఉండాలి. అనర్హత కలిగిన ఉత్పత్తి మొత్తం ఉత్పత్తిలో 11 శాతానికి మించకూడదు. అయితే ఈ పెప్సీ కంపెనీ ఉత్పత్తుల్లో అర్హత కలిగిన వస్తువు ఉత్పత్తి (ఫ్రూట్ జ్యూస్) కేవలం 11 శాతం ఉండగా... అనర్హత కలిగిన వస్తువు (కూల్ డ్రింక్స్) ఉత్పత్తి ఏకంగా 89 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక విధానం 2010-15 మార్గదర్శకాల ప్రకారం పెప్సీకి రాయితీలు ఇచ్చే అవకాశమే లేదు. అందుకే నేరుగా ఎస్ఐపీబీ ద్వారా లేదంటే ఎంవోయూ రూపంలో పని కానిచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నారు. ఇందుకు అనుగుణంగా పరిశ్రమల శాఖ అధికారులపై ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి యూనిట్‌కు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) అనుమతి ఇవ్వడంలోనే తతంగం నడిచిందని సమాచారం. శ్రీసిటీ సెజ్‌లో గ్రీన్ కేటగిరీ పరిశ్రమలకే అనుమతి ఇవ్వాల్సి ఉంది. కానీ పెప్సీ యూనిట్ రెడ్ కేటగిరీ (కాలుష్యకారక పరిశ్రమ) కిందకు వస్తుంది. అందుకే మొదట్లో యూనిట్ ఏర్పాటుకు పీసీబీ అనుమతి ఇవ్వలేదని సమాచారం. అయితే ప్రభుత్వ పెద్దల జోక్యంతో అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. మహీంద్రా కంపెనీకి జీ హుజూర్.. మెదక్ జిల్లాలోని జహీరాబాద్ వద్ద రూ.350 కోట్ల పెట్టుబడితో మహీంద్రా కంపెనీ ఏర్పాటు చేస్తున్న ట్రాక్టర్ల తయారీ యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అదనపు రాయితీలు మంజూరు చేసింది. 100 శాతం వ్యాట్ ఇచ్చేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. పారిశ్రామిక విధానం 2010-15 ప్రకారం కేవలం 50 శాతం వ్యాట్ రాయితీ మాత్రమే ఇవ్వాల్సి ఉంది. అదనంగా 50 శాతం వ్యాట్ రాయితీ ఇచ్చినా సంతృప్తి చెందని ఆ కంపెనీ.. ఇప్పుడు ఇన్పుట్ వ్యాట్ రాయితీ ఇవ్వాలని కోరుతోంది. పారిశ్రామిక విధానం ప్రకారం రాష్ట్రంలో కేవలం ఔట్పుట్ ట్యాక్స్ రాయితీ విధానం మాత్రమే అమల్లో ఉండగా.. ప్రభుత్వం మాత్రం ఇన్పుట్ ట్యాక్స్ (విడిభాగాలపై వసూలు చేసే వ్యాట్)ను 14.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. ఈ 5 శాతం ట్యాక్స్‌ను కూడా తిరిగి రాయితీ రూపంలో వెనక్కి ఇవ్వాలని ఆ కంపెనీ అంటోంది. ఈ యూనిట్లో తయారైన ట్రాక్టర్లను పక్క రాష్ట్రాల్లోనే ఎక్కువగా విక్రయించనున్నట్టు తెలిసింది. ఈ లెక్కన ఆ కంపెనీ వ్యాట్‌ను మనకు కాకుండా పక్క రాష్ట్రాల్లో చెల్లిస్తుంది. ఆ కంపెనీ కోరుతున్న ప్రతిపాదనకు ఒప్పుకుంటే ఇలా ఇతర రాష్ట్రాల్లో చెల్లించే వ్యాట్‌ను కూడా మన రాష్ట్ర ఖజానా నుంచే చెల్లించాల్సి వస్తుంది. ఇది రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టమని ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు స్పష్టం చేశారు. అయినా ససేమిరా అంటూ ఇన్పుట్ వ్యాట్ ఇచ్చేందుకు ప్రతిపాదనలు పంపాలంటూ అధికారులపై ప్రభుత్వ ముఖ్య నేత ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్గదర్శకాలను తుంగలో తొక్కుతూ.. ఏదైనా పరిశ్రమకు రాయితీ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేతృత్వంలోని రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ) ముందు పరిశ్రమల శాఖ ప్రతిపాదనను ఉంచుతుంది. ఈ కమిటీలో ఆర్థికశాఖతోపాటు వాణిజ్య, ఇంధన, రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులు కూడా ఉంటారు. పారిశ్రామిక విధానం మేరకు ఏయే పరిశ్రమలకు ఎంత రాయితీలు ఇవ్వాలనే విషయాన్ని పరిశీలించి అందుకు అనుగుణంగా ఎస్ఐపీసీ నిర్ణయం తీసుకుంటుంది. అనంతరం సీఎం నేతృత్వంలోని రాష్టస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) ముందు ఎస్ఐపీసీ ప్రతిపాదనలు ఉంచుతారు. ఎస్ఐపీబీలో వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులతో పాటు ఆయా శాఖల మంత్రులు కూడా భాగస్వాములు అవుతారు. ఎస్‌ఐపీసీతో పాటు ఎస్ఐపీబీ ఆమోదం లభిస్తేనే ఆ పరిశ్రమకు రాయితీలను మంజూరు చేస్తూ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీచేస్తుంది. అయితే పెప్సీ, మహీంద్రా అండ్ మహీంద్రా విషయాల్లో ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహారం నడుస్తోంది. పెట్టుబడి మించిన రాయితీలా..? పరిశ్రమ నెలకొల్పితే పారిశ్రామిక విధానం ప్రకారం పలు రాయితీలను కల్పిస్తారు. ఇందులో 100 స్టాంపు డ్యూటీ రాయితీతో పాటు యూనిట్ విద్యుత్‌కు రూపాయి చొప్పున రాయితీ, వ్యాట్‌లో రాయితీ, భూమి వినియోగ మార్పిడి పన్నులో 25 శాతం రాయితీ మొదలైనవి ఇస్తారు. పెప్సీ కంపెనీ విషయాన్ని తీసుకుంటే ఏకంగా 100 శాతం వ్యాట్ రాయితీని ఐదేళ్లల్లో ఇచ్చేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే పెప్సీ కంపెనీ ఏర్పాటుకు వెచ్చించిన మొత్తం పెట్టుబడి రూ.400 కోట్లు కేవలం వ్యాట్ రాయితీ రూపంలోనే తిరిగి వస్తుంది. దీనికి మిగతా విద్యుత్, స్టాంపు డ్యూటీ మొదలైన రాయితీలు అదనం. అంటే అర్హత లేని ఓ కంపెనీకి ఏకంగా పెట్టుబడికి మించిన మొత్తాన్ని రాయితీల రూపంలో తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందన్నమాట!!