పెప్సీ.. పరిచయం అక్కరలేని కూల్‌డ్రింక్ బ్రాండ్. త్వరలో 125వ వార్షికోత్సవం జరుపుకోబోతోంది. ఈ సందర్భంగా కొత్త లోగోను కంపెనీల ఆవిష్కరించింది. దీంతో దాదాపు 15 ఏళ్ల తర్వాత పెప్సీ లోగో మారబోతోంది.
ఇదీ చదవండి: Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా?
మొదట ఉత్తర అమెరికాలో, ఆ తర్వాత 2024 నాటికల్లా ప్రపంచమంతటా ఈ లోగో అమల్లోకి వస్తుంది. కాగా ప్రస్తుతం ఉన్న పెప్సీ లోగోను 2008లో రూపొందించారు. మళ్లీ ఇన్నేళ్లకు కంపెనీ 125వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త లోగోను తీసుకొస్తోంది పెప్సీ.
పెప్సీ కొత్త లోగోను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. నల్లటి వృత్తం మధ్యలో పెద్దగా ‘PEPSI’ అనే అక్షరాలు, దాని చుట్టూ ఎరుపు, తెలుపు, నీలం చారలతో రూపొందించారు. కంపెనీ లోగోకు గొప్ప శక్తి, విశ్వాసం, ధైర్యాన్ని అందించడానికి రీడిజైన్ చేసినట్లు పెప్సికో చీఫ్ డిజైన్ ఆఫీసర్ మౌరో పోర్సిని తెలిపారు.
ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు
పెప్సికో విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్, కెనడాలలో మొదటగా ఎలక్ట్రిక్ బ్లూ, బ్లాక్ క్యాన్‌లపై పెప్సీ కొత్తలోగోను వినియోగిస్తారు. దీంతోనే అక్కడ మార్కెటింగ్ కూడా చేస్తారు. తర్వాత 2024లో ప్రపంచమంతటా కొత్త లోగోను పరిచయం చేస్తారు.
ఇదీ చదవండి: అడక్కుండానే రూ. 8,800 కోట్లు.. ఎస్‌బీఐపై కాగ్ రిపోర్ట్
Comments
Please login to add a commentAdd a comment