PepsiCo
-
రూ.9,000 కోట్ల నిధుల సమీకరణ
పానీయాల తయారీ కంపెనీ పెప్సీకోకు బాటిళ్లు సమకూర్చడంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్న వరుణ్ బెవరేజెస్, ఫోర్టీస్ హెల్త్‌కేర్ తాజాగా నిధుల సమీకరణ బాట పట్టాయి. వ్యాపార వృద్ధి, కొత్త ప్రొడక్టులు, కొత్త ప్రాంతాలకు విస్తరణ, ఇతర సంస్థల కొనుగోళ్లు, రుణాల చెల్లింపునకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడుతాయని సంస్థలు తెలిపాయి.వరుణ్ బెవరేజెస్ రూ.7,500 కోట్లుఅర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా నిధులు సమీకరించే ప్రతిపాదనకు వరుణ్ బెవరేజెస్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వృద్ధి ప్రణాళికల అమలుకు వీలుగా క్విప్ ద్వారా రూ.7,500 కోట్లు మించకుండా సమకూర్చుకునేందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ఒకేసారి లేదా దశలవారీగా నిధులు సమీకరించే అవకాశం ఉందని తెలియజేసింది. అయితే ఇందుకు పోస్టల్ బ్యాలట్ ద్వారా వాటాదారుల అనుమతులు సైతం కోరనున్నట్లు పేర్కొంది. క్విప్‌లో కనీసం 10 శాతాన్ని మ్యూచువల్ ఫండ్స్‌కు కేటాయించనుంది. నిధులను అనుబంధ, భాగస్వామ్య లేదా సహచర సంస్థలలో పెట్టుబడులకు వెచ్చించనున్నట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: ‘స్మార్ట్’ ఉన్నా ఫీచర్ ఫోన్లను ఎందుకు కొంటున్నారు?ఫోర్టిస్ హెల్త్‌కేర్ రూ.1,500 కోట్లుఎన్సీడీలు(నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్-కంపెనీ అప్పు చెల్లించడంలో డిఫాల్ట్ అయితే దాని ఆస్తులు అమ్ముకోవచ్చు) జారీ ద్వారా నిధులు సమీకరించే ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఫోర్టిస్ హెల్త్‌కేర్ వెల్లడించింది. ప్రయివేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో అర్హతగల ఇన్వెస్టర్లకు ఎన్సీడీల జారీ ద్వారా రూ.1,500 కోట్లవరకూ సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. ఇన్వెస్టర్ల జాబితాలో డీబీఎస్ బ్యాంక్(డీబీఎస్), హెచ్ఎస్బీసీ, సిటీకార్ప్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్(సింగపూర్), మిజుహో బ్యాంక్ సింగపూర్సహా ఇతర విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లున్నట్లు వివరించింది. ఐదేళ్ల కాలపరిమితితో ఎన్సీడీలను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. -
స్లయిస్ బ్రాండ్ అంబాసిడర్‌గా నయనతార
న్యూఢిల్లీ: శీతల పానీయ బ్రాండ్ స్లయిస్కి ప్రచారకర్తగా సినీ నటి నయనతార నియమితులయ్యారు. లేడీ సూపర్‌స్టార్‌గా పేరొందిన నయనతార చేరిక అనేది స్లయిస్ బ్రాండ్ మరింత మందికి చేరువయ్యేందుకు తోడ్పడగలదని పెప్సీకో ఇండియా అసోసియేట్ డైరెక్టర్ అనుజ్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. వేసవి సీజన్ సందర్భంగా కొత్త ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించనున్నట్లు వివరించారు. స్లయిస్ కుటుంబంలో భాగమవడంపై నయనతార సంతోషం వ్యక్తం చేశారు. -
లేస్ గౌర్మెట్ చిప్స్: పెప్సికో ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ శైలజా జోషి ఏమన్నారంటే!
పెప్సికో 2022లో లేస్ గౌర్మెట్‌తో ప్రీమియం పొటాటో చిప్స్లోకి ప్రవేశించింది.ఈ కేటగిరీలో వినియోగదారులు మరిన్ని ప్రీమియం అనుభవాల కోసం చూస్తున్నారంటున్నారు పెప్సి కో ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ శైలజా జోషి. కేటగిరీ ప్రీమియమైజేషన్ గురించి, రూ.20 రేంజ్లో అందించే కొత్త ప్లాన్..తదితర వివరాలు ఆమె మాటల్లోనే.. ఆగస్టు 2022లో లే గౌర్మెట్ను ప్రారంభించాం. వీటికి మంచి స్పందన వచ్చింది. వినియోగదారుల గురించి, అవుట్లెట్ల గురించి తెలుసుకున్నాము. స్పందన బాగుంది. జీవితంలో మంచి విషయాలను ఆస్వాదించేవారు గౌర్మెట్ను ఆనందిస్తారు. ఈ స్నాక్ అందించే అనుభూతులు మరింత ఆనందంగా ఉంటాయి. ప్రతీ ఒక్కరు చక్కటి స్నాక్స్‌తో ట్రీట్ చేసుకోవాలనుకుంటుంటారు. లేస్ గౌర్మెట్‌కు వచ్చిన విశేష ఆదరణ దృష్ట్యా దానిని మరింత విస్తరించాలని భావిస్తున్నాం. అందువల్ల, మరింత మందికి లేస్‌ను చేరువచేసే లక్క్ష్యంతో రూ.20 ప్యాకెట్లను విడుదల చేస్తున్నాము. రిటైల్, వినియోగదారుల దృక్కోణం నుండి ఈ ధర అంశం చాలా ముఖ్యమైనది. రూ.20 ప్యాక్‌లు త్వరలో మార్కెట్లో లభింస్తాయి. మరింత విస్తృతంగా పంపిణీ చేయనున్నాం. లేస్ కన్సూమర్తో పోలిస్తే గౌర్మెట్ కొనేవాళ్లు భిన్నమని మీరు భావిస్తున్నారా? ఈ తేడాను జనాభా పరంగా చూడలేం, అప్పటికప్పుడు పుట్టుకొచ్చే అవసరం లేదా సందర్భం కావొచ్చు. ఒక వినియోగదారు ఒక సారి లేస్‌ను తినాలనుకోవచ్చు, ఎందుకంటే అతను/ఆమె స్నేహితులతో సరదాగా గడపాలని కోరుకుంటారు, ఇదొక సంబరం, ఇలాంటి నోరూరించే చిరుతిళ్లతో స్నేహితుల భేటీ సరదాగా ఉంటుంది. వేరే మూడ్‌లో లేదా వేరే సందర్భంలో ఉన్న ఒకే రకమైన వినియోగదారులు లేస్ గౌర్మెట్‌కు కూడా వినియోగదారుగా ఉండవచ్చు. అలాగే, కోవిడ్ తర్వాత, ప్రజలు మరింత కొత్త రుచుల కోసం ఎలా వెతుకుతున్నారో కూడా మేము గమనించాము. లే యొక్క గౌర్మెట్‌తో, చాలా మంది వినియోగదారులు స్నాకింగ్లోకి రావడాన్ని మేము ఖచ్చితంగా చూస్తాము, ఎందుకంటే వారు స్నాకింగ్‌లో చక్కని అనుభవాన్ని కోరుకుంటారు. Q. Not just cooked, crafted. ఈ లైన్ వినగానే సైఫ్ అలీ ఖాన్, ఆయన రాజవంశం గుర్తుకొస్తుంది. అప్పుడు లేస్ ప్రోడక్ట్ ప్రమోషన్లో ఈ వ్యాక్యం వాడారు. ఇప్పుడదే వ్యాక్యాన్ని అలాగే సైఫ్‌ను మళ్లీ ఇప్పుడు ఎంపిక చేసుకున్నారు. ఎలా చూడవచ్చు? సైఫ్ అలీ ఖాన్‌తో మా అనుబంధం చాలా గొప్పది. ఆయనతో చేసిన ప్రయాణం అద్భుతం అందుకే లేస్ గౌర్మెట్ కోసం సైఫ్‌నే మళ్లీ ఎంచుకున్నాం. లేస్ గౌర్మెట్ చిప్స్ బ్రాండ్‌కు అతడే సరైన ఎంపిక. మంచి రుచి, క్రమబద్ధత కలిగిన ఉత్పత్తులకు ప్రాతినిధ్యం వహించారు కాబట్టి సైఫ్‌ను ఎంపిక చేసుకున్నాం. బ్రాండ్ అంబాసిడర్ అవసరం ఎందుకు వచ్చింది? పెప్సీకో కింద ఎన్నో బ్రాండ్లు, ప్రోడక్టులున్నాయి. సైఫ్ అంశాన్ని బ్రాండ్ అంబాసిడర్ అవసరంగా చూడకూడదు. మా బ్రాండ్ ఇమేజ్‌కు మరింత ప్రయోజనం లభిస్తుందని భావించినప్పుడు మేము బ్రాండ్ అంబాసిడర్లతో కలిసి పని చేస్తాము. అలాగే బ్రాండ్ , అంబాసిడర్ రెండూ పరస్పర సంబంధం కలిగి ఉండాలి, రెండూ కలిసి వెళ్లాలి. మా బ్రాండ్‌కు ఉన్న గుర్తింపు, చక్కటి రుచి గురించి ఆలోచిస్తున్నప్పుడు, సైఫ్ అలీ ఖాన్ చాలా విలువను జోడించగలడని మా నమ్మకం. గౌర్మెట్‌తో కలిసి సైఫ్ నడవడం వల్ల ఆ ప్రయాణం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. బ్రాండ్ ఇమేజ్ మరింత ఉన్నతమవుతుంది. అసలు సైఫ్‌ను తీసుకురావడం వెనక మా ఆలోచన ఇదే. చాలా ప్రీమియం బ్రాండ్ల ధరలు రూ.100 వరకు ఉన్నాయి. వాటితో పోలిస్తే గౌర్మెట్ ధర చాలా తక్కువగా ఉంది. ఇది గౌర్మెట్‌కు ఎలా సహాయపడుతుంది? రూ.30, రూ.50ల ఉత్పత్తుల విభాగంలో మీ వాటా వాటా ఎంత? ప్రపంచవ్యాప్తంగా పొటాటో చిప్స్ విభాగంలో అగ్రగామిగా ఉన్నాము. ఒక ఉత్పత్తిని తీసుకొస్తున్నప్పుడు మా నైపుణ్యాన్ని, మా అభ్యాసాలను కేవలం భారతీయ మార్కెట్‌కు పరిమితం చేయాలనుకోవడం లేదు. మార్కెట్‌పై మాకు ఉన్న అవగాహన మాకు గౌర్మెట్ సెగ్మెంట్ ధరల గురించి స్పష్టమైన ఆలోచనన ఇచ్చింది. చాన్నాళ్లుగా మేము మార్కెట్లో ఉన్నాం.ఇది కూడా సత్పలితాలను ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక మార్కెట్లో ఉన్న రూ.30 ప్యాక్ ఉత్పత్తులు ఎక్కువగా సాంప్రదాయ వినియోగదారులు కొంటున్నారు. మా వాటా కూడా దీంట్లోనే ఎక్కువ. అలాగే రూ.50 ప్యాక్ ఉత్పత్తులకు ఇ-కామర్స్‌లో డిమాండ్ ఎక్కువ. లేస్ గౌర్మెట్ చిప్స్ మూడు ఫ్లేవర్లలో ఉన్నాయి. లైమ్ అండ్ క్రాక్డ్ పెప్పర్, థాయ్ స్వీట్ చిల్లీ మరియు వింటేజ్ చీజ్ & పెప్రికా. వీటిలో ఎక్కువ అమ్ముడవుతున్న ఫ్లేవర్ ఏది? మరిన్ని ఫ్లేవర్లు తెచ్చే ఆలోచన ఉందా? థాయ్ స్వీట్ చిల్లీకి మంచి స్పందన వచ్చింది. ఎక్కువ మంది ఏది ఇష్టపడితే అదే ఫ్లేవర్ అవుతుంది. నిజానికి మూడు ఫ్లేవర్ల అమ్మకాల మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. మేము కూడా ఎక్కువ ఉత్పత్తులను ప్రయత్నించే దశలో ఉన్నాము. వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికైతే ఎక్కువ మందికి ఈ రుచులు చేరాలని, వినియోగదారుల సంఖ్య పెరగాలని భావిస్తున్నాం. మా దగ్గర మరిన్ని ఆలోచనలున్నాయి. మార్కెట్ అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు వాటిని అభివృద్ధి చేస్తాం. ప్రస్తుతానికయితే ఈ మూడు ఫ్లేవర్లతో మా వ్యాపారాన్ని పెంచుతాం. -
పెప్సీ కొత్త లోగో అదుర్స్! 15 ఏళ్ల తర్వాత...
పెప్సీ.. పరిచయం అక్కరలేని కూల్‌డ్రింక్ బ్రాండ్. త్వరలో 125వ వార్షికోత్సవం జరుపుకోబోతోంది. ఈ సందర్భంగా కొత్త లోగోను కంపెనీల ఆవిష్కరించింది. దీంతో దాదాపు 15 ఏళ్ల తర్వాత పెప్సీ లోగో మారబోతోంది. ఇదీ చదవండి: Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా? మొదట ఉత్తర అమెరికాలో, ఆ తర్వాత 2024 నాటికల్లా ప్రపంచమంతటా ఈ లోగో అమల్లోకి వస్తుంది. కాగా ప్రస్తుతం ఉన్న పెప్సీ లోగోను 2008లో రూపొందించారు. మళ్లీ ఇన్నేళ్లకు కంపెనీ 125వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త లోగోను తీసుకొస్తోంది పెప్సీ. పెప్సీ కొత్త లోగోను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. నల్లటి వృత్తం మధ్యలో పెద్దగా ‘PEPSI’ అనే అక్షరాలు, దాని చుట్టూ ఎరుపు, తెలుపు, నీలం చారలతో రూపొందించారు. కంపెనీ లోగోకు గొప్ప శక్తి, విశ్వాసం, ధైర్యాన్ని అందించడానికి రీడిజైన్ చేసినట్లు పెప్సికో చీఫ్ డిజైన్ ఆఫీసర్ మౌరో పోర్సిని తెలిపారు. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్‌కైనా చెల్లింపులు పెప్సికో విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్, కెనడాలలో మొదటగా ఎలక్ట్రిక్ బ్లూ, బ్లాక్ క్యాన్లపై పెప్సీ కొత్తలోగోను వినియోగిస్తారు. దీంతోనే అక్కడ మార్కెటింగ్ కూడా చేస్తారు. తర్వాత 2024లో ప్రపంచమంతటా కొత్త లోగోను పరిచయం చేస్తారు. ఇదీ చదవండి: అడక్కుండానే రూ. 8,800 కోట్లు.. ఎస్బీఐపై కాగ్ రిపోర్ట్ -
దేశీ మార్కెట్‌పై గ్లోబల్ దిగ్గజాల కన్ను
ముంబై: కన్జూమర్ ప్రొడక్టుల గ్లోబల్ దిగ్గజాలు దేశీ వినియోగ మార్కెట్‌పై సానుకూలంగా స్పందిస్తున్నాయి. ప్రధానంగా పెప్సీకో, కోకకోలా, మాండెలెజ్ యూనిలీవర్, లారియల్ దేశీయంగా పటిష్ట అమ్మకాలు సాధించాలని ప్రణాళికలు వేస్తున్నాయి. ఇందుకు దేశీ ఆర్థిక వృద్ధి పరిస్థితులు సహకరించనున్నట్లు పేర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ పరిస్థితులకుతోడు, స్థూల ఆర్థిక వాతావరణం అనిశ్చింతగా ఉన్నప్పటికీ ఇండియా గ్రోత్ స్టోరీ పలు అవకాశాలను కల్పించనున్నట్లు అంచనా వేస్తున్నాయి. గత కేలండర్ ఏడాది(2022)లో పటిష్ట అమ్మకాలు సాధించడంతో ఈ ఏడాది(2023)లోనూ మరింత మెరుగైన పనితీరును సాధించాలని ఆశిస్తున్నాయి. 2022 ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తూ కన్జూమర్ ప్రొడక్ట్ దిగ్గజాలు పలు అంచనాలను ప్రకటించాయి. మార్కెట్‌ను మించుతూ సౌందర్య కేంద్రంగా ఆవిర్భవించే బాటలో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నట్లు కాస్మెటిక్ ప్రొడక్టుల దిగ్గజం లారియల్ పేర్కొంది. గతేడాది పటిష్ట అమ్మకాలు సాధించామని, మార్కెట్‌ను మించి రెండు రెట్లు వృద్ధిని అందుకున్నట్లు తెలియజేసింది. ఇండియా తమకు అత్యంత ప్రాధాన్యతగల మార్కెట్ అని పేర్కొంటూ భారీ లక్ష్యాలతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించింది. గణాంకాల ప్రకారం చూస్తే 2030కల్లా ఇండియా ప్రపంచ జనాభాలో 20 శాతం వాటా, నైపుణ్యంగల సిబ్బందిలో 30 శాతం వాటాను ఆక్రమించుకోనున్నట్లు అభిప్రాయపడింది. వెరసి కంపెనీ వృద్ధికి దేశీ మార్కెట్ కీలకంగా నిలవనున్నట్లు తెలియజేసింది. పానీయాలకు భళా 2022కు పానీయాల అమ్మకాల్లో ఇండియా మార్కెట్ అత్యుత్తమంగా నిలిచినట్లు కోకకోలా చైర్మన్, సీఈవో జేమ్స్ క్విన్సీ పేర్కొన్నారు. పానీయాల విభాగంలో ఇండియా మార్కెట్ అత్యంత భారీగా విస్తరించే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో పలు అవకాశాలకు తెరలేవనున్నట్లు తెలియజేశారు. బెవరేజెస్ వినియోగంలో దీర్ఘకాలిక మార్కెట్‌గా నిలవనున్నదని, ఇకపై మరింత వృద్ధికి వీలున్నదని అంచనా వేశారు. వినియోగ రంగంలో 2022లో దేశీయంగా విస్తారమైన వృద్ధి నమోదైనట్లు యూనిలీవర్ పేర్కొంది. పోటీతత్వం, విభిన్న బ్రాండ్లు, ధరల పోర్ట్‌ఫోలియో ద్వారా వినియోగదారులను ఆకట్టుకున్నట్లు వివరించింది. గ్రామీణ ప్రాంతాలకుమించి పట్టణాలలో విక్రయాలు ఊపందుకున్నట్లు కంపెనీ సీఈవో అలెన్ జోప్ వెల్లడించారు. ఇకపైన సైతం మార్కెట్‌ను మించిన వృద్ధిని అందుకోగలమని భావిస్తున్నట్లు తెలియజేశారు. రెండంకెల వృద్ధి 2022లో దేశీయంగా రెండంకెల వృద్ధిని అందుకున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం మాండెలెజ్ తెలియజేసింది. ప్రధానంగా చాకొలెట్లు, బిస్కట్లతోకూడిన పోర్ట్‌ఫోలియో జోరు చూపినట్లు పేర్కొంది. గతేడాది ఇండియా, బ్రెజిల్ మార్కెట్లలో అత్యధిక స్థాయిలో అమ్మకాలు సాధించినట్లు వెల్లడించింది. ఇక బెవరేజెస్ దిగ్గజం పెప్సీకో సైతం దేశీయ మార్కెట్లో గతేడాది అత్యంత పటిష్ట వృద్ధిని సాధించినట్లు తెలియజేసింది. పానీయాలతోపాటు.. స్నాక్స్ అమ్మకాల ద్వారా మార్కెట్ వాటాను పెంచుకున్నట్లు వెల్లడించింది. -
చావు కబురు చల్లగా అన్నట్టు: కార్పొరేట్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్!
న్యూఢిల్లీ: ఆర్థికమాంద్యం కారణంగా పలు కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ పలు దిగ్గజ సంస్థల్లో కొనసాగుతోంది. తాజాగా ఈ బాటలో మరో గ్లోబల్‌సంస్థ పెప్సీకో నిలిచింది. స్నాక్స్ అండ్ శీతల పానీయల కంపెనీ వందలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పెప్సీకో అంతర్గత మెమో జారీ చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.ఉత్తర అమెరికాలో వందలాది కార్పొరేట్ ఉద్యోగాలను తొలగిస్తోందని తెలిపింది. ఈ వార్తలతో అంతర్జాతీయ దిగ్గజసంస్థ పెప్సీకో తన కంపెనీ ఉద్యోగుల్లు గుండెల్లో బాంబు పేలింది. పెప్సికో పెప్సి కోలా డ్రింక్‌తో పాటు డోరిటోస్, లేస్ చిప్స్ , క్వేకర్ ఓట్స్‌ని తయారు చేస్తుంది. పెప్సీకోలో ప్రపంచవ్యాప్తంగా 309,000 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 40శాతానికి మంచి అమెరికాలోనే ఉన్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమం ద్వారా ఇప్పటికే స్నాక్స్ యూనిట్లో ఉద్యోగాల కోత నేపథ్యంలో ఇక పానీయాల వ్యాపారంలో కోతలు భారీగా ఉంటాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది. అయితే ఈ వార్తలపై పెప్సీకో కంపెనీ అధికారికంగా ఇంకా స్పందించలేదు. (లేఆఫ్స్ బాంబు: టాప్ మేనేజర్స్‌తో సహా 20 వేల మందిపై వేటు!) కాగా ప్రపంచం ఆర్థికమాంద్యం ముప్పు భయాలతో పలు దిగ్గజ కంపెనీలు ముందస్తు చర్యలకు దిగుతున్నాయి. దీనికి తోడు ఆదాయాలు పడిపోతూ ఉండటంతో నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఇప్పటికే పలు టెక్, మీడియా కంపెనీల్లో లక్షల మంది ఉద్యోగులపై వేటు వేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెజాన్, ఆపిల్, మెటా, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఇంక్, సీఎన్ఎన్, కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయి. (రెండేళ్లలో 10వేల సినిమా హాళ్లు..సినిమా చూపిస్త మామా!) -
టెస్లా ఎలక్ట్రిక్ ట్రక్ వచ్చేసింది..సింగిల్ ఛార్జ్‌తో 800 కిలోమీటర్ల ప్రయాణం
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ 2017 నవంబర్‌లో టెస్లా సెమీ ట్రక్‌ను ఆవిష్కరించారు. ఆ కార్యక్రమంలో 2019 లో ట్రక్ల తయారీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తాజాగా ఆ సంస్థ తయారు చేసిన ట్రక్‌ను విడుదల చేశారు. తొలి ఈవీ ట్రక్‌ను ప్రముఖ ఫుడ్ బేవరేజెస్ కంపెనీ పెప్సికోకి అందించారు. మస్క్ సెమీ ఎలక్ట్రిక్ ట్రక్ల తయారీ ప్రకటనతో పెప్సికో 100 ట్రక్లు కొనుగోలు చేసేలా టెస్లాతో సంప్రదింపులు జరిపింది. వాస్తవానికి ఈ వెహికల్స్‌ను పెప్సికోకు 2021లోనే అందించాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా తయారీ, విడుదల సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆ ఈవీ ట్రక్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ సందర్భంగా వీటిలోని ఓకదాన్ని మస్క్ స్వయంగా నడిపారు. ఈ సెమీ ట్రక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 37,000 కిలోల బరువుతో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని మస్క్ తెలిపారు. ఫీచర్లు, ధర 37,000 కిలోలు బరువున్న ఈ ట్రక్ 20 సెకన్లలో 0-60mph వేగాన్ని అందుకుంటుంది. సింగిల్ ఛార్జ్‌తో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించ వచ్చు. ఇక ఈ వెహికల్ ధర 1,50,000 డాలర్లు ఖరీదు చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా,ఉత్తర అమెరికాలో 2024లో 50వేల ట్రక్కులను తయారు చేసే లక్ష్యంతో ప్రొడ క్షన్‌ను పెంచాలని కంపెనీ యోచిస్తోంది. -
‘మౌంటెన్ డ్యూ’పై హక్కులు పెప్సీకోవే..
సాక్షి, హైదరాబాద్: ‘మౌంటెన్ డ్యూ’ట్రేడ్‌మార్క్‌పై పెప్సికోకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది. మాగ్ఫాస్ట్ పానీయాల కంపెనీ మౌంటైన్ డ్యూ లేబుల్‌పై వాటర్ బాటిల్ విక్రయించడాన్ని సవాల్ చేస్తూ పెప్సీకో తొలుత ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. సదరు లేబుల్‌పై ఇరు కంపెనీలకు హక్కులున్నాయని ట్రయల్‌కోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే కూల్‌డ్రింక్‌కు సంబంధించి పెప్సికోకు, వాటర్ బాటిల్‌కు సంబంధించి మాగ్ఫాస్ట్కు హక్కులున్నాయంది. దీన్ని పెప్సీకో హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ పి. నవీన్‌రావు, జస్టిస్ జి.రాధారాణి ధర్మాసనం విచారణ చేపట్టింది. పెప్సీకో తరఫున సీనియర్ న్యాయవాది కె.వివేక్‌రెడ్డి వాదనలు వినిపించారు. 1985లోనే పెప్పీకో మౌంటైన్ డ్యూ పేరిట ట్రేడ్‌మార్క్ పొందిందన్నారు. మాగ్ఫాస్ట్ ఆ లేబుల్‌ను వినియోగించడం చట్టవిరుద్ధమన్నారు. మాగ్ఫాస్ట్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పెప్సీకో ట్రేడ్‌మార్క్ పొందడంపై తమకు తెలియదని, 2000 సంవత్సరం నుంచి తాము మౌంటెన్ డ్యూ పేరిట వాటర్ బాటిళ్లు విక్రయిస్తున్నట్లు చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. మౌంటెన్ డ్యూపై పెప్సీకో కంపెనీకే హక్కులున్నాయని చెప్పింది. కూల్‌డ్రింక్, వాటర్ బాటిల్ ఒకే పేరుపై ఉంటే వినియోగదారులు తికమకపడటంతో పాటు రెండూ పెప్సీకోవే అనుకునే అవకాశం ఉందని అభిప్రాయపడింది. -
విత్తన హక్కులలో... రైతు విజయం
ప్రపంచం మొత్తంలో ఒక్క మన దేశ రైతులకు మాత్రమే విత్తనాలకు సంబంధించి విశిష్ట హక్కులు ఉన్నాయి. రైతులకు మేధోసంపత్తి హక్కు కల్పించడం కోసం మన పార్లమెంటు ప్రత్యేక చట్టం చేసి 20 ఏళ్లయ్యింది. విత్తనాలను ఇచ్చి పుచ్చుకోవడానికి సంబంధించి భారతీయ రైతులకున్న విశిష్ట హక్కుల చరిత్రలో మైలురాయి వంటి ఓ తీర్పు ఇటీవల వెలు వడింది. ఓ బహుళ జాతి కంపెనీకి చెంప పెట్టులాంటి తీర్పు ఇది. వేప, పసుపు, బాస్మతి బియ్యంపై అనాదిగా మన దేశానికి ఉన్న మేధో సంపత్తి హక్కుల తస్కరణకు గతంలో వివిధ కంపెనీల ఆధ్వ ర్యంలో ప్రయత్నాలు జరిగాయి. వాటిని ప్రపంచ మేధో సంపత్తి హక్కుల సంస్థలో డా. వందనా శివ వంటి ఉద్యమకారిణులు సమర్థ వంతంగా తిప్పికొట్టిన ఘన చరిత్ర మనకుంది. ఈ నేపథ్యంలో చట్టబద్ధ రైతాంగ విత్తన హక్కుల పరిరక్షణ కృషిలో తాజా తీర్పు గుజరాత్ రైతులకు సంబంధించిందే కానీ.. దేశంలో రైతులందరికీ గొప్ప విజయం అనటంలో సందేహం లేదు. గుజరాత్ రైతులపై పెప్సీ కేసులు గుజరాత్ బంగాళదుంప రైతులకు వ్యతిరేకంగా మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన కేసులు పెట్టిన బహుళ జాతి కంపెనీ పెప్సికో ఇండియా హోల్డింగ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బంగాళదుంప వంగడంపై పెప్సికో కంపెనీకి గతంలో ఇచ్చిన మేధో సంపత్తి హక్కులను కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న ‘పంట వంగడాల పరిరక్షణ మరియు రైతుల హక్కుల ప్రాధికార సంస్థ (పి.పి.వి. అండ్ ఎఫ్.ఆర్.ఎ.)’ ఇటీవల రద్దు చేయటంతో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇరవయ్యేళ్ల క్రితం పంట వంగడాల పరిరక్షణ మరియు రైతుల హక్కుల చట్టం–2001 ప్రకారం పి.పి.వి. అండ్ ఎఫ్.ఆర్.ఎ. ఏర్పాటైంది. (చదవండి: రైతాంగ సమస్యలే రాజకీయ ఎజెండా) విత్తన శాస్త్రవేత్తలు/ కంపెనీలు రూపొందించే కొత్త వంగడాలతో పాటు.. రైతులు సంప్రదాయ విజ్ఞానంతో రూపొందించే కొత్త వంగడాలకు కూడా ఈ చట్టం మేధో సంపత్తి హక్కులను కల్పిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుంది. ఇలా ధ్రువీకరణ పొందిన కంపెనీల వంగడాలను సాగు చేసే రైతులు తమ పంట దిగుబడులను విత్తనాల కోసం వాడుకోవటంతోపాటు.. ఇతరులకు విక్రయించుకోవ టానికి కూడా ఈ చట్టం రైతులకు విశిష్ట హక్కును కల్పిస్తోంది. ప్రత్యే కంగా బ్రాండ్ పేరు ముద్రించిన సంచుల్లో పోసి విక్రయించకూడదు. అయితే, భారతీయ రైతులకున్న ఈ విశిష్ట హక్కును కాలరాసిన పెప్సికో కంపెనీకి చెంపపెట్టు లాంటి తీర్పును పి.పి.వి. అండ్ ఎఫ్.ఆర్.ఎ. వెలు వరించింది. లేస్ చిప్స్ తయారీకి వాడే ప్రత్యేక బంగాళదుంప వంగ డానికి గతంలో ఈ కంపెనీకి ఇచ్చిన మేధాహక్కుల ధ్రువీకరణను రద్దు చేస్తూ ఈ తీర్పు వెలువడింది. పి.పి.వి. అండ్ ఎఫ్.ఆర్.ఎ. ఏర్పాటైన తర్వాత ఇలా ఒక వంగడంపై ధ్రువీకరణను రద్దు చేయటం ఇదే మొదటి సారి కావటంతో జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ, వాణిజ్య వర్గాల్లో తీవ్ర సంచలనం రేగింది. (చదవండి: అన్నదాత హక్కు గెలిచినట్లే...!) అసలేం జరిగిందంటే.. లేస్ చిప్స్ తయారీ కోసం ఉపయోగించేందుకు ఉద్దేశించిన ఎఫ్.ఎల్. 2027 అనే రకం బంగాళదుంప వంగడంపై పెప్సికో ఇండియా హోల్డింగ్ కంపెనీ ‘పంట వంగడాల పరిరక్షణ, రైతుల హక్కుల ప్రాధికార సంస్థ’లో 2016లో రిజిస్ట్రేషన్ చేయించి మేధో సంపత్తి హక్కులను పొందింది. గుజరాత్లో 12,000 మంది రైతులతో కొనుగోలు ఒప్పందం చేసుకొని ఎఫ్.ఎల్.2027 రకం బంగాళదుంపలను పెప్సికో కంపెనీ సాగు చేయించింది. అయితే, ఈ రైతుల వద్ద నుంచి ఈ రకం బంగాళదుంప విత్తనాలు పొంది అక్రమంగా సాగు చేయడం ద్వారా 9 మంది గుజరాత్ రైతులు మేధో సంపత్తి ఉల్లంఘనకు పాల్పడ్డారని పేర్కొంటూ 9 మంది గుజరాత్ రైతులపై కేసులు పెట్టింది. ఒక్కో రైతు నుంచి తమకు రూ. కోటి పరిహారం ఇప్పించాల్సిందిగా కూడా పెప్సికో కంపెనీ వ్యాజ్యంలో కోరింది. రైతులపై కేసులను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనోద్యమం పెల్లుబకటంతో కంపెనీ వెనక్కి తగ్గి, కేసులు ఉపసంహరించుకుంది. (చదవండి: ఈ సాగు చట్టాలు నిజంగానే మేలు చేయవా?) కవిత దరఖాస్తు ‘పంట వంగడాల పరిరక్షణ, రైతుల హక్కుల చట్టం–2001’ మన దేశంలో రైతులకు రిజిస్టరైన విత్తనాలను విత్తుకోవటం, దాచుకోవటం, ఇతరులతో పంచుకోవటం, బ్రాండ్ ముద్ర వేయకుండా ఇతరులకు విక్రయించుకునే హక్కులను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆ వంగ డంపై పెప్సికో కంపెనీకి మేధో సంపత్తి హక్కుల ధ్రువీకరణ ఇవ్వటం సమంజసం కాదని, ఆ ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రముఖ రైతు హక్కుల ఉద్యమకారిణి, కురుగంటి కవిత 2019 జూన్ 11న పి.పి.వి–ఎఫ్.ఆర్.ఎ.కు దరఖాస్తు చేశారు. 30 నెలల సుదీర్ఘ విచా రణ తర్వాత పెప్సికో కంపెనీకి ఎఫ్.ఎల్. 2027 బంగాళదుంప వంగ డంపై ఇచ్చిన మేధాహక్కుల ధ్రువీకరణను రద్దు చేస్తూ డిసెంబర్ 3న పి.పి.వి–ఎఫ్.ఆర్.ఎ. చైర్పర్సన్ కె.వి. ప్రభు తీర్పు ఇచ్చారు. ప్రజాప్రయోజనాలకు విఘాతం ధ్రువీకరణ కోసం కంపెనీ తప్పుడు సమాచారం ఇచ్చినందున, రిజి స్ట్రార్‌కు తగిన సమాచారాన్ని, పత్రాలను అందించనందున, పంట వంగ డాల పరిరక్షణ, రైతుల హక్కుల చట్టం –2001 (సెక్షన్ 34 హెచ్) ప్రకారం ‘ప్రజాప్రయోజనాల’కు విఘాతం కలుగుతున్నందున, ధ్రువీ కరణ పొందిన వ్యక్తికి తగిన యోగ్యత లేనందున మేధాహక్కుల ధ్రువీ కరణ పత్రాన్ని రద్దు చేస్తున్నట్లు పి.పి.వి–ఎఫ్.ఆర్.ఎ. చైర్పర్సన్ కె.వి. ప్రభు ప్రకటించారు. రద్దు కాకుండా ఉంటే 2031 జనవరి 31 వరకు పెప్సికోకు మే«ధా సంపత్తి హక్కులు కొనసాగేవి. రైతుల చట్టబద్ధమైన విత్తన హక్కులను, స్వేచ్ఛను తుంగలో తొక్కాలని ప్రయత్నించే విత్తన, ఆహార, పానీయాల వాణిజ్య సంస్థల ఆటలు సాగవని చెప్పడానికి ఈ తీర్పు ఒక హెచ్చరికగా నిలుస్తుంది. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు -
Lays Chips: పెప్సీకో కంపెనీకి భారత్‌లో ఎదురుదెబ్బ
Pepsico Lays Chips Potato Patent Rights Revoked In India: ప్రముఖ ఫుడ్ అండ్ స్నాక్ కంపెనీ ‘పెప్సీకో’కి భారత్‌లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చిప్స్ తయారీ కోసం ఉపయోగించే ప్రత్యేకమైన ఆలు వంగడంపై హక్కులు పూర్తిగా పెప్సీకో సొంతం మాత్రమే కాదనే తీర్పు వెలువడింది. ఈ మేరకు పెప్సీకో పేరిట ఉన్న రిజిస్ట్రేషన్ హక్కుల్ని రద్దు చేస్తూ.. మొక్కల రకాల పరిరక్షణ & రైతు హక్కుల అధికార సంఘం Protection of Plant Varieties and Farmers' Rights (PPVFR) Authority శుక్రవారం తీర్పు వెలువరించింది. లేస్ చిప్స్ తయారీకి ఉపయోగించే బంగాళదుంప వంగడంపై రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తమపేరిట ఉన్నందున పూర్తి హక్కులు తమవేనని, ఇతర రైతులెవరూ(ఒప్పంద పరిధిలో ఉన్నవాళ్లని మినహాయించి) వాటిని పండించడానికి వీల్లేదంటూ న్యూయార్క్‌కు చెందిన ఈ మల్టీనేషనల్ ఫుడ్ కంపెనీ మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. అయితే కేవలం పరిమితులు ఉంటాయే తప్ప.. పూర్తిగా రైతుల్ని నిలువరించడం కుదరని, అందుకు చట్టం సైతం అంగీకరించదంటూ PPVFR తీర్పు వెలువరించింది. ఈ మేరకు పెప్సీకో కంపెనీకి గతంలో జారీ అయిన పేటెంట్ హక్కుల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రైతులు సంబురాలు చేసుకున్నారు. ‘రైతుల విత్తన స్వేచ్ఛ’ను ఉల్లంఘించకుండా ఇతర విత్తన, ఆహార సంస్థలను కూడా నిలువరించాలని ఈ సందర్భంగా PPVFRను రైతుల తరపున పిటిషన్ దాఖలు చేసిన కవిత కురుగంటి కోరుతున్నారు. ఇక ఈ వ్యతిరేక పరిణామంపై స్పందించేందుకు పెప్సీకో కంపెనీ నిరాకరించింది. ఏంటీ వంగడం.. ఎఫ్ఎల్-2027 (FC5) వెరైటీ పొటాటోలు. వీటిని లేస్ పొటాటో చిప్స్‌గా పేర్కొంటారు. చిప్స్ తయారీలో ఉపయోగించే ఈ వంగడాల్ని 2009లో భారత్‌లోకి తీసుకొచ్చింది పెప్సీకో కంపెనీ. సుమారు 12 వేల మంది రైతులకు వీటి విత్తనాల్ని అందించి.. తిరిగి దుంపల్ని చేజిక్కిచ్చుకునేలా ఒప్పందం ఆ సమయంలో కుదుర్చుకుంది. అంతేకాదు 2016లో ఈ వెరైటీ వంగడం మీద.. ‘పీపీవీ అండ్ ఎఫ్ఆర్ చట్టం 2001’ ప్రకారం అధికారికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 2019లో తమ హక్కులకు భంగం కలిగిందంటూ పెప్సీకో కంపెనీ దావా వేయడం ద్వారా ఈ వంగడం గురించి బయటి ప్రపంచానికి బాగా తెలిసింది. తమ ఒప్పందం పరిధిలోని లేని తొమ్మిది మంది గుజరాత్ రైతులు ఈ వంగడం పండిస్తుండడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అందులో నలుగురు చిన్న రైతులపై 4.2 కోట్ల రూ.కు దావా వేసింది పెప్సీకో కంపెనీ. అయితే సార్వత్రిక ఎన్నికల సమయం కావడంతో ప్రభుత్వం ఈ వ్యవహారంలో కలగజేసుకుంది. దీంతో అదే ఏడాది మే నెలలో పెప్సీకో కంపెనీ కేసులు మొత్తం వెనక్కి తీసుకుంది. ఆ వెంటనే రైతు ఉద్యమకారిణి కవితా కురుగంటి.. పెప్సీకో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ PPVFR ముందు ఒక అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న పీపీవీఎఫ్‌ఆర్.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పెప్సీకో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను రద్దు చేసింది. ‘‘అనేక మంది రైతులు కష్టాల్లో కూరుకుపోయారు, వారు చేస్తున్న ఉద్దేశ్య ఉల్లంఘనపై భారీ జరిమానా చెల్లించే అవకాశం ఉంది! ఇది కచ్చితంగా ప్రజా ప్రయోజనాలను ఉల్లంఘించడమే అవుతుంది’’ అన్న కవిత వాదనలతో పీపీవీఎఫ్‌ఆర్ ఏకీభవించింది. ‘రిజిస్ట్రేటర్లు తమ హక్కులు తెలుసుకోవాలి అలాగే రైతులనూ ఇబ్బంది పెట్టకూడదు. ఇలాంటి వ్యవహారాల్లో హక్కులపై పరిమితులు ఉంటాయే తప్ప.. పూర్తి హక్కులుండవని చట్టంలో ఉంది. సీడ్ వెరైటీల మీద పేటెంట్లను చట్టం ఈ స్థాయిలో అనుమతించబోద’న్న విషయాన్ని గుర్తు చేశారు పీపీవీఎఫ్‌ఆర్ చైర్పర్సన్ కేవీ ప్రభు. చదవండి: బతుకు రోడ్డు పాలు.. జేబులో చిల్లిగవ్వ లేకున్నా కోటీశ్వరుడయ్యాడు -
ఎలన్ మస్క్ చాపకింద నీరులా.. రోడ్లపై రయ్ రయ్ మంటూ ఎలక్ట్రిక్ ట్రక్లు
టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ గురించి, ఆయన ప్రతిభాపాటవాలు' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ వైపు అంతరిక్షంపై మానవుని మనగడ కోసం ప్రయత్నాలు చేస్తూనే మరో వైపు ఎలక్ట్రిక్ రంగంలో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు చాపకింద నీరులా సెమీ ఎలక్ట్రిక్ ట్రక్‌లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఉద్గారాలను తగ్గించేందుకే మనం ఇప్పటి వరకు రోడ్లపై తిరిగే ఎలక్ట్రిక్ బైక్స్, కార్లను, బస్సులను మాత్రమే చూసుంటాం. కానీ ఇకపై ఎలక్ట్రిక్ సెమీ ట్రక్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ సందడి చేయనున్నాయి. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ప్రముఖ బెవరేజెస్ కంపెనీ పెప్సికో'కి తొలిసారి టెస్లా సెమీ ట్రక్‌లను తయారు చేశారు. త్వరలోనే సెమీ ట్రక్‌లను ఈవీ మార్కెట్‌కు పరిచయం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పెప్సికో సీఈఓ రామన్ లగుర్టా సీఎన్బీసీతో మాట్లాడుతూ..పెప్సికో సంస్థ కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయత్నాల్లో భాగంగా ఎలక్ట్రిక్ 2017లోనే సెమీ ట్రక్‌లను తయారు చేసే ప్రాజెక్ట్‌ను టెస్లాకు అప్పగించినట్లు వెల్లడించారు. 2017లోనే 100 సెమీ ట్రక్‌లకు ఆర్డర్ ఎలన్ మస్క్ సంబంధించి బయటి ప్రపంచానికి కేవలం ఎలక్ట్రిక్ కార్ల గురించి మాత్రమే తెలుసు. కానీ తొలిసారి సెమీ ఎలక్ట్రిక్ ట్రక్‌లను తయారు చేయడంలో 2017నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. 2017లోనే పెప్సికో కంపెనీ ఎలన్ మస్క్‌కు 100 సెమీ ఎలక్ట్రిక్ ట్రక్‌లను తయారు చేసే బాధ్యత అప్పగించినట్లు రామన్ సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు టెస్లా సెమీ ఎలక్ట్రిక్ ట్రక్‌లను తయారు చేసిందని, వాటిని ఈ ఏడాది డిసెంబర్ నాటికి తమకి అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఎలన్ మాట తప్పాడు ఎలన్ మస్క్ ఈ సెమీ ఎలక్ట్రిక్ ట్రక్‌లను 2020 నాటికే పెప్సికోకి అందిస్తామని మాటిచ్చారు. కానీ బ్యాటరీతో పాటు, సప్లయి చైన్ సంబంధిత రంగాల్లో మార్కెట్ డిమాండ్ కారణంగా సెమీ ట్రక్‌లను అందించే విషయంలో ఎలన్ మాట తప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ట్రక్‌లను విడుదల తేదీలను వాయిదా వేసిన మస్క్ ఈ ఏడాది జులైలో మరోసారి ప్రకటించారు. 2022 సెమీ ట్రక్‌లను లాంఛ్ చేస్తామని ప్రకటించారు. పెప్సీకో మాత్రం ఈ ఏడాది చివరి నాటికి కనీసం 15 ఎలక్ట్రిక్ ట్రక్‌లను టెస్లా నుంచి దిగుమతి చేసుకోవాలని భావిస్తుండగా.. టెస్లా ట్రక్ల కొనుగోలు కోసం మరికొన్ని దిగ్గజ కంపెనీలు క్యూకడుతున్నాయి. క్యూ కడుతున్న కంపెనీలు ఎలన్ మస్క్ తయారు చేస్తున్న సెమీ ఎలక్ట్రిక్ 150,000 డాలర్ల నుంచి 180,000 మధ్యలో ఉంది. అయితే వీటిని కొనుగోలు కోసం వాల్‌మార్ట్, ఫెడ్ఎక్స్, అన్హ్యూసర్ బుష్ దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. చదవండి: భూమ్మీద కాదు, అంతరిక్షంపై ఆదిపత్యం కోసం పోటా పోటీ పడుతున్నారు -
లారస్ లేబ్స్- టాటా కన్జూమర్ ఖుషీ
ప్రపంచ మార్కెట్ల ప్రోద్బలంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా హెల్త్‌కేర్ రంగ కంపెనీ లారస్ లేబ్స్, ఎఫ్ఎంసీజీ రంగ కంపెనీ టాటా కన్జూమర్ స్టాక్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం... లారస్ లేబ్స్ యూఎస్ఎఫ్డీఏ నుంచి రెండు ఏఎన్‌డీఏలకు అనుమతి లభించినట్లు వెల్లడించడంతో హెల్త్‌కేర్ రంగ కంపెనీ లారస్ లేబ్స్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 3.5 శాతం పెరిగి రూ. 441 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 457ను అధిగమించింది. హెచ్ఐవీ చికిత్సకు వినియోగించే టీఎల్ఈ-400, టీఎల్ఈ-600 ఔషధ విక్రయాలకు యూఎస్ఎఫ్డీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు లారస్ లేబ్స్ తెలియజేసింది. అధ్యక్ష అత్యవసర పథకం(పెఫార్)లో భాగంగా వీటిని తక్కువ, మధ్యాదాయ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు పేర్కొంది. ఈ ట్యాబ్లెట్లను 300-400-600 ఎంజీ డోసేజీలలో రూపొందించనున్నట్లు వెల్లడించింది.కంపెనీలో ప్రమోటర్లకు 32.04% వాటా ఉంది. టాటా కన్జూమర్ భాగస్వామ్య సంస్థ నౌరిష్కో బెవరేజెస్‌లో విదేశీ దిగ్గజం పెప్సీకోకు గల వాటాను కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడికావడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీ టాటా కన్జూమర్ కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 3.5 శాతం పుంజుకుని రూ. 360 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 363కు ఎగసింది. హిమాలయన్ మినరల్ వాటర్, టాటా గ్లూకో ప్లస్ తదితర బ్రాండ్ల నౌరిష్ కంపెనీలో పెప్సీకో, టాటా కన్జూమర్‌కు 50:50 వాటా ఉంది. ఈ వాటా కొనుగోలు ద్వారా పానీయాల విభాగంలో టాటా కన్జూమర్ మరింత పట్టుసాధించే వీలుంటుందని నిపుణులు పేర్కొన్నారు. -
షఫాలీ వర్మ అరుదైన ఘనత
న్యూఢిల్లీ : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన యువ సంచలనం, డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ అరుదైన ఛాన్స్ కొట్టేసింది. అనతి కాలంలోనే అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న షఫాలీ వర్మను ప్రముఖ శీతల పానీయాల సంస్థ 'పెప్సీ' తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. టీ 20 ప్రపంచకప్ ప్రదర్శనతో షఫాలీ వర్మ పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోవడంతో పలు కంపెనీలు ఆమెకు కోట్లు కుమ్మరించడానికి సిద్ధమయ్యాయి. (ఆసీస్ పేసర్‌కు షఫాలీ భయం!) ఈ నేపథ్యంలోనే షఫాలీ వర్మతో పెప్సీ ఒక సంవత్సరం పాటు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రముఖ బ్రాండ్‌తో షఫాలీ కి ఇదే తొలి ఒప్పందం.ఒక ఐకానిక్ బ్రాండ్ పెప్సీతో ఒప్పందం చేసుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. మంచి పేరున్న బ్రాండ్ 'పెప్సీ'తో అనుబంధం పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో అర్ధం కావట్లేదు. మహిళలు తమ జీవితానికి సంబంధించి అన్ని విభాగాల్లోనూ దూసుకుపోతున్నారు. ఇది మా కాళ్లపై మేం నిలబడాల్సిన తరుణం' అని షఫాలీ వర్మ అరుదైన ఘనతవర్మ పేర్కొంది. ప్రపంచకప్ ఫైనల్లోనూ షఫాలీ తన ఫామ్‌ను కొనసాగిస్తూ భారత్‌ను విశ్వవిజేతగా నిలపాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మార్చి 8(ఆదివారం) జరిగే పైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాతో తుది పోరుకు సిద్ధమైంది. గతేడాది సెప్టెంబర్ నెలలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 16 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం షఫాలీ వర్మ ఆరు నెలల కాలంలోనే ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచకప్‌లో మూడు మ్యాచుల్లో 11 బౌండరీలు, 8 సిక్స్‌లతో మొత్తంగా 114 పరుగులు చేసి 172.7 స్టైక్‌రేట్‌ను నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక టీ20 మ్యాచ్‌లలో 146.96 స్ట్రైక్ రేట్‌తో 485 పరుగులు చేసింది. (నంబర్ 1 బ్యాటర్‌గా షఫాలీ.. ఐసీసీ స్పెషల్ ట్వీట్!) -
రైతులపై కేసులు ‘సాంకేతిక ఉగ్రవాదమే’
జీవవైవిధ్యంతోనే మనకు ఆహార భద్రత. మంచి ఆహారం, జీవ వైవిధ్యం తోనే సాధ్యం. జీవ వైవిధ్యం కొనసాగడానికి, స్వచ్ఛంగా ఉండడానికి, ప్రాకృతిక సేవలు అందించటంలో విత్తనాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రకృతి వనరుల వ్యాపారీకరణ పట్ల ఆందోళన చెందుతున్న వారు, ఇటీవల విత్తనాలు, జన్యుసంపదను అందరికీ అందుబాటులో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాని బహుళ జాతి కంపెనీలు అభివృద్ధి చెందిన దేశాలలో మేధోహక్కుల పేరిట కొన్ని రకాల విత్తనాల మీద కూడా తమ వ్యాపార హక్కులను విస్తృతపరుచుకుని, తమ మార్కెట్ గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. భారతదేశం విత్తన హక్కులను కంపెనీలకు ధారాదత్తం ఎప్పుడూ చెయ్యలేదు. ఇక్కడి స్వచ్ఛంద సంస్థలు, రైతు సంఘాలు, రైతులు, సాధారణ పౌరులు అప్రమత్తంగా ఉండి ఆ పరిస్థితి రాకుండా అనేక సమయాలలో అడ్డుకున్నారు. అయినా, అనేక రకాలుగా విత్తన కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించు కుంటున్నాయి. బీటీ ప్రత్తి జన్యుమార్పిడి విత్తనంతో ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. మోన్ శాంటో కంపెనీ రైతులు వ్యతిరేకిస్తున్నా కూడా, స్థానిక విత్తన సంస్థల నిరసనల మధ్య, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మాయపరిచి బీటీ ప్రత్తి విత్తన వ్యాపారాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తోంది. ఈ లాభార్జనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రైతు సంఘాలు కొంత అడ్డుకట్ట వేసినా, బీటీ ప్రత్తి విత్తనం వ్యాప్తిని అడ్డుకోవడంలో భారత ప్రభుత్వం విఫలమైంది. తాజాగా, గుజరాత్లో తమ కంపెనికి చెందిన ఆలుగడ్డ విత్తనం దొంగిలించి పంట వేసుకుంటున్నారని, నలుగురు చిన్న రైతుల మీద పెప్సీకో కేసు పెట్టింది. దానికి ప్రతిగా ఒక్కొక్కరు రూ. కోటి నష్ట పరిహారం కట్టాలని కోర్టు ద్వారా డిమాండ్ పెట్టింది. వాళ్ళు ఎంత పండించినా కోట్ల విలువ చేసే ఆస్కారమే లేదు. కానీ, కోట్ల రూపాయల నష్ట పరిహారం కట్టాలని ఒక బహుళదేశ సంస్థ అయిన పెప్సీ కంపెనీ అడిగిందంటే, రైతులను భయబ్రాంతులను చేయడానికే. పెప్సీ కంపెనీ వాడిన చట్టం పేరు ‘మొక్కల రకాల సంరక్షణ మరియు రైతుల హక్కులు 2001’. కాగా, అదే చట్టంలో స్పష్టంగా ఉంది–రైతులు ఏ విత్తనమైనా తమ ఇష్టానుసారంగా విత్తవచ్చు, మళ్ళీ విత్తవచ్చు, ఇతర రైతులతో పంచుకోవచ్చు, దాచుకోవచ్చు, విత్తన పంటగా కూడా వేయవచ్చు. రైతులకు ఇచ్చిన ఈ హక్కుని కాలరాస్తూ, అదే చట్టం క్రింద తన హక్కులకు భంగం కలిగించారని కేసు పెట్టింది. కంపెనీ సరే, ప్రాథమిక వాదనలు విన్న కోర్టుకు ఈ హక్కు గురించి ఎందుకు తెలియలేదో స్పష్టత లేదు. గుజరాత్ ప్రభుత్వం కూడా రైతుల పక్షాన నిలిచే ప్రయత్నం మొదట చేయలేదు. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనను మేము మొదలు పెట్టగా, గుజరాత్ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. పెప్సీ కంపెనీతో చర్చలు జరిపింది. చివరకు, పెప్సీ కంపెనీ ఈ కేసులను ఉపసంహరించుకుంది. ఆ నలుగురితో పాటు ఇదివరకు వేసిన ఇంకొక ఐదుగురి పైన కూడా వేసిన కేసులు ఎత్తివేశారు. ఈ ఉదంతం అనేక ప్రశ్నలకు ఆస్కారం ఇచ్చింది. పెప్సీ కంపెనీ కేసు పెట్టటానికి గుజరాత్ రాష్ట్రాన్ని మాత్రమే ఎందుకు ఎంచుకుంది? అందునా, వ్యవసాయం గురించి అవగాహన లేని ఒక ‘వాణిజ్య కోర్టులో’ కేసు దాఖలు చేసింది. అత్యధికంగా ఆలుగడ్డ వ్యవసాయం చేసే 10 రాష్ట్రాలలో గుజరాత్ నాలుగో స్థానంలో ఉంది. మరి, ఇతర రాష్ట్రాలలో ఈ రకం రైతులు వాడడం లేదా? అసలు రైతులకు విత్తన రకాల మధ్య వ్యత్యాసం సాధారణంగా తెలుస్తుందా? కేవలం, ల్యాబ్ పరీక్షల ద్వారానే తెలిసే పరిస్థితిలో భారత రైతుల మీద ఇట్లాంటి కేసులు ‘సాంకేతిక ఉగ్రవాదం’ అనిపించుకుంటుంది. ఆహార శుద్ధి పరిశ్రమలను విపరీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న నేపధ్యంలో ఆయా ఆహార శుద్ధి పరిశ్రమలు తమకు అవసరమైన వ్యవసాయ పంటలు, విత్తనాల మీద మేథోహక్కులు పొంది, రైతుల మీద ఈ తరహ ‘దాడి’ చేస్తే, అసలే సంక్షోభంలో ఉన్న రైతు, వ్యవసాయం మీద పడే దుష్ప్రభావం మన ఆహార వ్యవస్థ మీద పడదా? ఆహార పంటలు వేస్తే గిట్టుబాటు ధర రావడం లేదని, కోతులు ఇంకా ఇతర అనేక ‘జంతువులూ, పురుగుల’ నుంచి కాపాడుకోలేక, రైతు వాణిజ్య పంటల వైపు పోతుంటే, పెప్సీ లాంటి కంపెనీలు లాభాల మదంతో రైతుల మీద కేసులు వేస్తే, ఆహార ఉత్పత్తి కుంటుపడి, దిగుమతుల మీద ఆధారపడే దుస్థితి తప్పదు. అందుకే, పెప్సీ కంపెనీ మీద దేశీయ ఆహార ఉత్పత్తికి విఘాతం కలిగించే చర్యలు చేపట్టినందుకు ఆర్థిక ఆంక్షలు విధించాలి. ఇంకొక కంపెనీ ఇట్లాంటి దుశ్చర్య చేపట్టకుండా తీవ్ర చర్యలు చేపట్టాలి. తక్షణమే, జాతీయ విత్తనం చట్టం తీసుకు రావాలి. దీనితో రైతుల ప్రయోజనాలు కాపాడుతూ, పర్యావరణ సంరక్షణకు, జన్యుసంపద పరిరక్షణకు, దేశీయ విత్తనాల ఉపయోగానికి మార్పులు తీసుకురావాలి. (నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం) డా.డి. నరసింహరెడ్డి వ్యాసకర్త పర్యావరణ విధాన విశ్లేషకులు nreddy.donthi16@gmail.com -
‘పెప్సీ’ని వదిలే ప్రసక్తే లేదు
సాక్షి, అమరావతి: రైతుల్ని వేధించినందుకు పెప్సీ కంపెనీ నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. గుజరాత్ రైతులపై కేసులు ఉపసంహరించుకుంటే సరిపోదని, మరెక్కడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని తీర్మానించాయి. ఈ వ్యవహారమై విజయవాడలో త్వరలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి రైతుల్ని చైతన్య పరచాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇదిలా ఉంటే పెప్సీ కంపెనీ నుంచి తమకు పరిహారం ఇప్పించాలంటూ బంగాళదుంప రైతులు కేసు వేయడంతో ఈ వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. చదవండి: (కేసులు పెడతావా.. పరిహారం చెల్లించు) గుజరాత్లో ఎఫ్‌సీ–5 రకం బంగాళదుంపను సాగు చేసినందుకు గత రెండేళ్లలో 9 మంది రైతులపై పెప్సీ కంపెనీ ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఒక్కో రైతు నుంచి ఒక కోటీ రెండు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ వ్యాజ్యాన్ని వేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో వెనక్కు తగ్గిన పెప్సీ కంపెనీ రైతులపై పెట్టిన కేసుల్ని వెనక్కు తీసుకుంటామంటూ కొన్ని ఆంక్షలు విధించింది. అయితే బాధిత రైతులకు మద్దతు తెలుపుతున్న రైతు సంఘాల ఐక్య వేదిక పలు రాష్ట్రాల్లో అవగాహన సదస్సులు, సభలు నిర్వహించతలపెట్టింది. దీనికి అనుగుణంగా త్వరలో ఏపీలోని పలు ప్రాంతాలలో సదస్సులు జరుగనున్నాయి. -
కేసులు పెడతావా.. పరిహారం చెల్లించు
అహ్మదాబాద్: గుజరాత్లో బంగాళదుంపలు పండించిన రైతులపై పెట్టిన కేసులను పెప్సీకో బేషరతుగా ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. కేసుల పేరుతో అన్నదాతలను వేధించినందుకు తగిన పరిహారం చెల్లించాలని అన్నాయి. పెప్సికో కేసు నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు గుజరాత్‌లోని 25 రైతు సంఘాలతో పాటు భారతీయ కిసాన్ సంఘ్(బీఎస్కే), హక్కుల కార్యకర్తలు, ఎన్జీవోలు కలిసి ‘విత్తన సార్వభౌమాధికార జాతీయ ఫోరం’గా ఏర్పడ్డాయి. కార్యాచరణ ఖరారు చేసేందుకు శుక్రవారం అహ్మదాబాద్‌లోని గుజరాత్ విద్యాపీఠ్‌లో జాతీయ ఫోరం ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు హక్కుల నేత కపిల్ షా విలేకరులతో మాట్లాడుతూ.. రైతులపై కేసులు ఉపసంహరించుకుంటామని పెప్సికో చేసిన ప్రకటనలో కొత్త విషయాలు లేవన్నారు. రెండు షరతుల మీద రైతులపై కేసులు వెనక్కు తీసుకుంటామని గతంలో కోర్టుకు పెప్సికో తెలిపిందన్నారు. తమ కంపెనీ కాంట్రాక్టు ఫార్మింగ్‌లో భాగస్వాములు కావడం లేదా తమ విత్తనాలు వాడటం మానేస్తేనే కేసులు ఉపసంహరించుకుంటామని కోర్టుకు పెప్సికో చెప్పిందన్నారు. బేషరతుగా కేసులు ఉపసంహరించి, రైతులకు పరిహారం చెల్లించాలని కపిల్ షా డిమాండ్ చేశారు. విత్తన వ్యాపారుల కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని చట్టాలు చెబుతున్నాయని, ఈ విషయంలో ఎటువంటి సంప్రదింపులకు తావులేదన్నారు. గుజరాత్‌లోని కొంతమంది రైతులు ఎఫ్‌సీ–5 రకం బంగాళదుంపలను పండించగా, ఆ రకం బంగాళదుంపలపై తమకు పంటరకం రక్షణ హక్కులు ఉన్నాయనీ, తమ అనుమతి లేకుండా వీటిని ఎవరూ పండించకూడదంటూ పెప్సీకో మొత్తం 11 మంది రైతులపై కేసు వేయడం తెలిసిందే. ఈ రకం బంగాళదుంపలను పెప్సీలో తమ లేస్ చిప్స్ తయారీకి వినియోగిస్తోంది. పెప్సీకో కేసు వేయడంతో మన దేశంలో రైతులు ఏం పండించాలో ఒక విదేశీ సంస్థ శాసించడం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తడంతో పెప్సీకో వెనక్కి తగ్గింది. -
‘అమెజాన్’లోకి ఇంద్రా నూయి!
వాషింగ్టన్ : పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఆమె అమెజాన్ ఆడిట్ కమిటీలో తన సేవలు అందించనున్నారు.ఈ మేరకు అమెజాన్ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంద్రా నూయి చేరికతో అమెజాన్ బోర్డు సభ్యుల్లో మహిళల సంఖ్య ఐదుకు చేరింది. కంపెనీ కొత్త పాలసీ ప్రకారం వివిధ కంపెనీల్లో ఉత్తమ సేవలు అందించిన, అందిస్తున్న కార్పోరేట్ దిగ్గజాలను బోర్డు డైరెక్టర్లుగా నియమిస్తూ వస్తోంది. అదే విధంగా మహిళా ప్రాధాన్యం పెంచే క్రమంలో గతేడాది స్టార్‌బక్స్ కార్పోరేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రోసాలిండ్ బ్రూవర్‌ను బోర్డు డైరెక్టర్‌గా నియమించిన అమెజాన్... జామీ గోరెలిక్, జూడిత్ మెగ్రాత్, పాట్రిసియా స్టోన్సిఫర్లకు అవకాశం కల్పించింది. తాజాగా ఇంద్రా నూయి నియామకంతో 11 మంది సభ్యులతో కూడిన బోర్డులో మహిళల సంఖ్య ఐదుకు చేరింది. కాగా శీతల పానీయాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తయారీలో ప్రపంచ రెండో అగ్రగామి సంస్థ, అమెరికాకు చెందిన ‘పెప్సీకో’ సీఈవోగా పనిచేసిన ఇండో-అమెరికన్ ఇంద్రా నూయి తన పదవి నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.12 ఏళ్ల పాటు కంపెనీకి సారథ్యం వహించిన ఆమె గతేడాది అక్టోబర్ 3న తన బాధ్యతల నుంచి వైదొలగారు. ఆమె స్థానంలో కంపెనీ ప్రెసిడెంట్ రామన్ లగుర్తా నూతన సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. అమెజాన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు వీరే.. జెఫ్ బెజోస్ (అమెజాన్ సీఈఓ, చైర్మన్) టామ్ అల్బర్గ్ (మద్రోనా వెంచర్ గ్రూపు స్థాపకులు) *రోసాలిండ్ బ్రూవర్(స్టార్‌బక్స్ సీఓఓ) *జామీ గోరెలిక్(యూఎస్ మాజీ డిప్యూటీ అటార్నీ జనరల్) డానియల్ హట్టెన్లోచర్(డీన్ ఆఫ్ కార్నెల్ టెక్) *జూడిత్ మెగ్రాత్(ఎంటీవీ నెట్వర్క్ మాజీ సీఈఓ) జొనాథన్ రూబీన్స్టీన్(పాల్ సీఈఓ, ఆపిల్ మాజీ ఎగ్జిక్యూటిక్) థామస్ రైడర్(ది రీడర్స్ డైజెస్ట్ అసోసియేషన్ మాజీ సీఈఓ) *పెట్రిసియా స్టోన్సిఫర్(మార్తా టేబుల్ సీఈఓ) వెండల్ వీక్స్(కార్నింగ్ సీఈఓ) *ఇంద్రా నూయి(పెప్సీకో మాజీ సీఈఓ) -
ట్రంప్‌కు లేఖ : దిగ్గజాలు కలవరపాటు
వాషింగ్టన్ : ఆపిల్, జేపీ మోర్గాన్, పెప్సీ వంటి దిగ్గజ కంపెనీలు సైతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధాటికి తట్టుకోలేకపోతున్నాయి. ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకునే హెచ్-1బీ వీసా పాలసీలో ట్రంప్ తీసుకొస్తున్న మార్పులు, దిగ్గజాలను తీవ్రంగా కలవరపెడుతోంది. ఇప్పటికే పలుమార్లు ట్రంప్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. ఆయన నా దారి రహదారి అన్నట్టు ప్రయాణిస్తున్నారు. హెచ్-1బీ వీసా విధానంలో మార్పులపై తాజాగా మరోసారి దిగ్గజ కంపెనీలు ట్రంప్ కార్యాలయానికి తమ గోడును వెల్లబుచ్చుకున్నాయి. ఇమ్మిగ్రేషన్ పాలసీలో ట్రంప్ కార్యాలయం తీసుకుంటున్న మార్పులు.. చాలా ఆందోళకరంగా ఉన్నాయంటూ టాప్ యూఎస్ బిజినెస్ లీడర్లు రాసిన లేఖలో పేర్కొన్నారు. వీరిలో ఆపిల్ ఇంక్ సీఈవో టిమ్ కుక్, జేపీ మోర్గాన్ ఛేజ్ అండ్ కంపెనీ జమీ డిమోన్, పెప్సికో ఇంక్ ఇంద్రా నూయీ ఉన్నారు. ఈ లేఖలో అత్యంత ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకునే ఇమ్మిగ్రేషన్ విధానం, ట్రంప్ ప్రభుత్వం చేపడుతున్న మార్పులను వీరు ఎక్కువగా ఫోకస్ చేశారు. అస్థిరమైన వలస విధాన నిర్ణయాలు, ఇమ్మిగ్రెంట్ల జీవిత భాగస్వాముల వర్క్ పర్మిట్లను తగ్గించడం వంటి వాటిపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మార్పులతో అనవసరమైన ఖర్చులు, ఇబ్బందులు పెరుగుతాయే తప్ప, పెద్దగా ప్రయోజనాలేమీ ఉండవని సీఈవోలు చెప్పారు. చట్టాన్ని గౌరవించే వేలమంది జీవితాలను అతలాకుతలం చేయొద్దని వేడుకున్నారు. అమెరికాలో పోటీతత్వానికి ఇది గండికొడుతుందని ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొన్నారు. అమెరికా టాప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లందరూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, ఈ లేఖను రూపొందించారని ఫార్చ్యూన్ రిపోర్టు చేసింది. కాగ, హెచ్-1బీ వీసాలపై పరిమితులు తీసుకొస్తున్న ట్రంప్ కార్యాలయం, అత్యంత ప్రతిభావంతులైన విదేశీయులను నియమించుకోవడం తగ్గించేసింది. అయితే విదేశీ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు వల్ల అమెరికా బాగా ప్రయోజనం పొందుతుందని, ఇప్పుడు వారిపై ఆంక్షలు విధిస్తే అమెరికాలోఆర్థిక వ్యవస్థకే దెబ్బ అని ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నారు. -
అమ్మ ప్రోత్సాహంతోనే నేడు ఇంద్రా నూయి....
సాక్షి, న్యూఢిల్లీ : ‘విదేశానికి వెళ్లేందుకు నాకు ఉపకార వేతనం రాదని నా తల్లిదండ్రులు అప్పట్లో గట్టి విశ్వాసంతో ఉన్నారు. అందుకే నిన్ను మేమెందుకు ఆపుతాం! అంటూ నన్ను అనునయిస్తూ వచ్చారు. తీరా ఉపకార వేతనం మంజూరవడంతో వారు ఊగిసలాటలో పడ్డారు. పెళ్లికాని అమ్మాయిని విదేశానికి ఎలా పంపించాలి? పంపిస్తే ఒంటరిగా విదేశానికి వెళ్లిందన్న కారణంగా జీవితంలో పెళ్లి కాదుగదా! అన్నది వారి సంశయం. కుటుంబ సభ్యులందరిని పిలిచి పెద్ద మీటింగ్ పెట్టారు. పంపించాలా, వద్దా ! అంటూ చాలాసేపు తర్జనభర్జన పడ్డారు. నేను మాత్రం ఏది ఏమైనా వెళతానని శపథం చేశాను. చివరకు పెళ్లి చేసి పంపించాలనుకున్నారు. అది అంత త్వరగా సాధ్యం కాదని గ్రహించారు. చివరకు పంపించేందుకు అయిష్టంగానే అంగీకరించారు. అలా నేను 1978లో ఐదు వందల డాలర్లను జేబులో పెట్టుకొని అమెరికా బయల్దేరాను’ అని అమెరికాలోని ప్రముఖ బహూళార్థక కంపెనీ ‘పెప్సికో’ కంపెనీకి 2006 నుంచి సీఈవోగా పనిచేస్తున్న ఇంద్రానూయి ఈ ఏడాది జరిగిన ‘ఫోర్బ్స్ మహిళల సమ్మేళనం’లో తన గురించి చెప్పుకొచ్చారు. అమెరికా దిగ్గజ కంపెనీకి పనిచేస్తున్న తొలి విదేశీ సంతతి వ్యక్తిగా, కంపెనీ తొలి మహిళా సీఈవోగా చరిత్ర సృష్టించిన ఇంద్రా నూయి, అక్టోబర్ 3వ తేదీ నాడు కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. ఎన్నో కంపెనీల్లో పనిచేసి అంచెలంచెలుగా అందరికి అందని ఎత్తుకు ఎదిగిన ఇంద్రా నూయి పెళ్లికి ముందు పేరు ఇంద్రా కృష్ణమూర్తి. తమిళ సంప్రదాయక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె చైన్నైలో అక్టోబర్ 28, 1955లో జన్నించారు. ‘మా అక్కయ్య చంద్రికైనా, నేనయినా జీవితంలో రాణించడానికి కారణం మా అమ్మ. రోజు భోజనాల దగ్గర మా ఇద్దరికి ఓ పోటీ పెట్టేది. ప్రధాన మంత్రి అయితే ఎలా మాట్లాడతావు ? ముఖ్యమంత్రయితే ఎలా మాట్లాడతావు ? ఒక్క భారత దేశానికే పరిమితం కాకుండా బ్రిటీష్ ప్రధాని అయితే ఎలా, అమెరికా అధ్యక్షులయితే ఎలా? అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి అయితే ఎలా, కశ్మీర్ ముఖ్యమంత్రి అయితే ఎలా? అని ప్రశ్నించేది. తింటున్నంత సేపు ఎలా మాట్లాడాలో ఆలోచించుకుంటూ ఉండేవాళ్లం. భోజనం ముగిశాక పరకాయ ప్రవేశంలా వివిధ దేశాలు, వివిధ రాష్ట్రాల నాయకుల్లా చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చేసే వాళ్లం. వాటిని శ్రద్ధగా ఆలకించే మా అమ్మ వాటికి మార్కులను కూడా కేటాయించేది’ అని ఓ సందర్భంలో పదేళ్ల క్రితం తన గురించి ఇంద్రా చెప్పుకున్నారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదివిన ఇంద్రా కృష్ణమూర్తి ఓ బ్యాండ్ తరఫున గిటార్ వాయించే వారు. క్రికెట్లో కూడా మంచి ప్రావీణ్యం చూపించారు. అయినా చదువును నిర్లక్ష్యం చేయకుండా 1974లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. కలకత్తాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో పట్టా పుచ్చుకోవాలనుకున్నారు. అప్పట్లో మహిళలు బిజినెస్ చదువుల పట్ల అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. ‘ఐఐఎంకు అప్పట్లో కూడా కొన్ని వేల మంది పరీక్ష రాశారు. వారిలో కొందరికే అడ్మిషన్లు లభించాయి. 150 మంది అహ్మదాబాద్ బ్రాంచ్‌కు వెళ్లారు. మరో వంద మంది కలకత్తాకు వెళ్లారు. వారిలో అతి తక్కువ మంది మహిళలు. వారిలో నేను ఒకరిని. అడ్డుగోడను బద్దలు కొట్టాలన్న తపన కారణంగానే నాడు బిజినెస్ చదవ గలిగాను’ అని గతేడాది ‘పోయెట్స్ అండ్ క్వాంట్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంద్రా చెప్పుకున్నారు. బిజినెస్‌లో పట్టా పుచ్చుకున్నాక ఇంద్రా మెట్టూర్ బియర్డ్సెల్లో, ఆ తర్వాత ముంబైలోని జాన్సన్ అండ్ జాన్సన్లో పనిచేశారు. జాన్సన్ అండ్ జాన్సన్ తరఫున ‘స్టే ఫ్రీ’ శానిటరీ నాప్కిన్స్ను తీసుకరావడంలో ఆమె ప్రధాన పాత్ర నిర్వహించారు. ఆ తర్వాత ఇంకా ఉన్నత చదువులు చదవాలనుకున్నారు. అమెరికాలోని పలు యూనివర్శిటీలకు దరఖాస్తు చేసుకున్నారు. స్కాలర్షిప్ కూడా డిమాండ్ చేశారు. స్కాలర్షిప్ ఇచ్చి చేర్చుకోవడానికి యేల్ యూనివర్శిటీ ముందుకు వచ్చింది. అలా అమె 1980లో ‘యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్’ నుంచి పబ్లిక్, ప్రైవేట్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీని అందుకున్నారు. ఆమె ఆ తర్వాత కొద్ది రోజులకే రాజ్ నూయిని పెళ్లి చేసుకొని ఇంద్రా నూయిగా మారిపోయారు. రాజ్ నూయి ప్రస్తుతం ‘ఏఎం సాఫ్ట్ సిస్టమ్స్’కు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తర్వాత నూయి ‘బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్’లో చేరి ఆరేళ్లు పనిచేశారు. 1986లో ‘మోటరోలా’ కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. అక్కడి నుంచి 1990లో స్విస్ పారిశ్రామిక ఉత్పత్తుల కంపెనీ ‘ఆసియా బ్రౌన్ బోవరి’లో యాజమాన్య బృందంలో ఒకరిగా చేరారు. 1994లో పెప్సికో కంపెనీ వైస్‌ప్రెసిడెంట్‌గా చేరారు. ఆ తర్వాత ఆమె చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌గా మారి కంపెనీ తరఫున చర్చలు జరిపి పలు కంపెనీలను కొనుగోలు చేయించారు. అలా ఎదుగుతూ వచ్చి 2006లో సీఈవో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఈ కంపెనీకి కూడా గుడ్‌బై చెప్పాక ఆమె ఎక్కడికెళతారో, ఏ బాధ్యతలు స్వీకరిస్తారో ఇంకా వెల్లడించలేదు. -
పెప్సికో కుర్కురే దెబ్బకు వందల పోస్టులు డిలీట్
న్యూఢిల్లీ : కుర్కురే అంటే ఎవరికి ఇష్టముండదో చెప్పండి.. భారతీయులకు కుర్కురే ఎంతో ఇష్టమైన బ్రాండ్. ఖాళీగా ఉన్నప్పుడు, ఆకలి వేసినప్పుడు, టైమ్ పాస్‌కు చాలా మంది కుర్కురే తింటూ ఉంటారు. కానీ గత కొంత కాలంగా కుర్కురేలో ప్లాస్టిక్ ఉందంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అయితే ఈ చర్చ విజృంభించింది. వీడియోల మీద వీడియోలు, పోస్టుల మీద పోస్టులు సర్క్యూలేట్ అయ్యాయి. దీంతో తమ బ్రాండ్ కుర్కురేను దెబ్బతీస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై, ఆ బ్రాండ్ కంపెనీ పెప్సికో న్యాయపోరాటానికి దిగింది. బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీసేలా.. నకిలీ, పరువు నష్టం కంటెంట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు సర్క్యూలేట్ చేస్తున్నాయని పెప్సికో, ఢిల్లీ హైకోర్టులో దావా దాఖలు చేసింది. దీంతో కుర్కురేకు వ్యతిరేకంగా ఉన్న వెబ్సైట్ లింక్‌లను, పోస్టులను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు సోషల్ మీడియాలను ఆదేశించింది. కుర్కురేకు వ్యతిరేకంగా పోస్టు అయిన వందల కొద్దీ పోస్టులను ఈ కంపెనీలు తొలగించాయి. యూట్యూబ్ కూడా ఇలాంటి వందల కొద్దీ వీడియోలకు స్వస్తి పలికింది. ఈ ఏడాది ప్రారంభంలో పెప్సికో ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీలపై సివిల్ దావా ఫైల్ చేసింది. 2018 జూన్ 1న సోషల్ మీడియా కంపెనీలకు కోర్టు ఈ ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. ‘కుర్కురేలో ప్లాస్టిక్ ఉందంటూ వచ్చిన నకిలీ వార్తలతో, తమ బ్రాండ్ ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం చూపింది. సోషల్ మీడియాలో సర్య్యూలేట్ అయిన పరువు నష్టం కంటెంట్, నకిలీ వార్తల వల్లే, ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాం’ అని పెప్సికో అధికార ప్రతినిధి చెప్పారు. ఈ విషయాన్ని తాము చాలా సీరియస్‌గా తీసుకున్నామని తెలిపారు. అన్ని ప్లాట్‌ఫామ్‌లతో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని, నకిలీ, పరువు నష్టం కలిగించే అంశాలపై తాము కౌంటర్ దాఖలు చేస్తున్నామని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. కుర్కురేకు ఎవరూ వ్యతిరేకంగా కామెడీ, విమర్శనాత్మక పోస్టులు పెట్టినా.. వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా పెప్సికో రంగం సిద్ధం చేసింది. అయితే ఇలాంటి విషయాలపై న్యాయ అథారిటీలు జోక్యం చేసుకోవాలని పెప్సికో కోరడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పెప్సికో ‘లేస్ చిప్స్’ కు వ్యతికేంగా వచ్చిన ఫేస్బుక్, యూట్యూబ్‌లలో వీడియోలు, వెబ్‌లింక్‌లను బ్లాక్ చేయాలని కూడా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. లేచిప్స్ తినడం వల్ల ఓ వ్యక్తి మరణించినట్టు గత ఫిబ్రవరి 26న మింట్ రిపోర్టు చేసింది. -
ఐసీసీ డైరెక్టర్‌గా ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రానూయి
-
‘గ్యాటోరెడ్’ అంబాసిడర్‌గా సింధు
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రఖ్యాత స్పోర్ట్స్ డ్రింక్ ‘గ్యాటోరెడ్’కు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రచారకర్తగా వ్యవహరించనుంది. దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేయనున్న తొలి భారత క్రీడాకారిణి సింధునే కావడం విశేషం. పెప్సికో సంస్థ ఈ పానీయాన్ని ఉత్పత్తి చేస్తుంది. గతంలో స్టార్ ప్లేయర్స్ ఉసేన్ బోల్ట్ (అథ్లెటిక్స్), సెరెనా విలియమ్స్ (టెన్నిస్), మెస్సీ (ఫుట్‌బాల్) తదితరులు గ్యాటోరెడ్‌కు ప్రచారకర్తలుగా వ్యవహరించారు. -
కూల్‌డ్రింక్ పెట్ బాటిల్స్‌లో విషపదార్థాలు?
బహుళ జాతి కంపెనీలు పెప్సీకో, కోకా-కోలా తయారుచేస్తున్న పలు సాఫ్ట్డ్రింకులలో ఐదు రకాల విష పదార్థాలు ఉన్నట్లు భారత ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పరిశీలనలో తేలింది. అయితే తమ పెట్‌బాటిల్స్‌లో అలాంటివి ఏమీ లేవని రెండు కంపెనీలు ఖండించాయి. తమకు ప్రభుత్వం నుంచి అలాంటి నివేదిక ఏదీ రాలేదంటున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు చెందిన డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (డీటీఏబీ) నిర్వహించిన పరీక్షలలో.. పెప్సీ, కోకా కోలా, మౌంటెన్ డ్యూ, స్ప్రైట్, 7అప్ లాంటి కూల్ డ్రింకుల బాటిల్స్‌లో యాంటిమోనీ, సీసీ, క్రోమియం, కాడ్మియంతో పాటు.. డీఈహెచ్‌పీ లేదా డైఫ్తాలేట్ కూడా ఉన్నాయని తేలింది. వీటిలో పెప్సీ, మౌంటెన్ డ్యూ, 7 అప్ బ్రాండ్లు పెప్సీకోవి కాగా, స్ప్రైట్ మాత్రం కోకా కోలా కంపెనీది. ఈ రెండు కంపెనీలు ఈ ఆరోపణలను ఖండించాయి. తమకు ఈ పరీక్షల నివేదికలకు సంబంధించిన సమాచారం ఏమీ ఇంతవరకు రాలేదని పెప్సికో ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. తకు ప్రభుత్వ శాఖల నుంచి నోటీసులు గానీ, సమాచారం గానీ కూడా ఏమీ లేదని కోకాకోలా ప్రతినిధి అన్నారు. భారతదేశంలోని ఆహార భద్రతా ప్రమాణాలు అనుమతించిన స్థాయిలో మాత్రమే తమ కూల్‌డ్రింకులలో భారలోహాలు ఉంటాయని పెప్సికో తెలిపింది. కానీ డీటీఏబీ వెబ్సైట్లో పేర్కొన్న వివరాలు చూస్తుంటే.. అసలు కూల్‌డ్రింకులలో భారలోహాలకు అనుమతించిన పరిమితి అంటూ ఏమీ లేదు. కాడ్మియం అనేది ప్రజారోగ్యానికి చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. -
ఇంద్రజాలం
లైఫ్ ఈజ్ ఫన్.. బెటర్.. అండ్ గుడ్! ఇదీ ఇంద్రానూయి ఫిలాసఫీ ఫర్ పెిప్సీకో. ఎంత పెద్ద ఆలోచన అయినా... ఎంత పెద్ద బ్రాండ్ అయినా ఎంత పెద్ద మార్కెట్ వ్యూహం అయినా పెప్సీకో చేరాల్సింది... నాలుకకే! ఫిలాసఫీ రుచించింది. నూయికి సక్సెస్ దక్కింది. షి ఈజ్ ఎ మెజీషియన్. ఆహారపానీయాల ఆహార్యాన్ని మార్చిన వ్యూహకర్త. ఆమె ఇంద్రజాలానికి అందరూ ముగ్ధులే. టేస్ట్ ది సక్సెస్! ఫోర్బ్స్‌నీ, పెప్సీనీ, ఫార్చూన్నీ, టైమ్‌నీ.. కాసేపు పక్కన పెట్టేయండి. ఇంద్రా నూయిని ఈ దిగ్గజాలన్నీ ‘ఆహా.. ఓహో..’ అనడం ఎన్నాళ్ల నుంచో వింటున్నాం! ఆమె జీతం కూడా బాగా పాతబడిపోయిన పే స్లిప్. ఎలాగూ కోట్లలో ఉంటుంది. కొత్తగా క్లాప్స్ కొట్టేందుకేమీ లేదు. ఇక ‘ఫారిన్ కంపెనీని నడుపుతున్న శారీ అమ్మాయ్’ అనే మాట కాస్త బెటర్. ఎన్నాళ్లకైనా వినసొంపుగానే ఉంటుంది. మరి ఏం మిగిలి ఉంది.. కొత్తగా ఇవాళ ఆమె బయోగ్రఫీలోకి వెళ్లేందుకు? ఉంది. ఆమెకంటూ ఒక ‘వ్యూ’ ఉంది. అది.. ఈ ప్రపంచానికి మహిళాశక్తిని సాక్షాత్కరింపజేసిన చూపు. ఒక సాధారణ మహిళకు ఇంద్రా నూయి ఇచ్చే స్ఫూర్తి.. ఆమె సాధించిన ‘మోస్ట్ పవర్ఫుల్’, ‘మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్’ లిస్టుల నుంచి వచ్చింది కాదు. ఆమెకై ఆమెలో ఓ పవర్ ఉంది. ఉమన్ పవర్! సో స్వీట్ కదా! ఇదిగో... వర్క్‌ప్లేస్‌లో ఆడవాళ్లను ఇలాంటి మాటలంటేనే.. విసుగ్గా చూస్తారు నూయీ. ‘స్వీటీ’, ‘హనీ’.. అనే మాటలు నూయికి వికారం తెప్పిస్తాయి. ఎగ్జిక్యూటివ్‌ని ఎగ్జిక్యూటివ్‌గా చూడకుండా ‘క్యూటీ’గా చూడడం నూయికి నచ్చదు. కానీ.. ఆమె తన కెరీర్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటికీ ఈ ముద్దు మురిపాలను ఎక్కడో ఒక చోట వింటూనే ఉన్నారు. సమాన వేతనం మాత్రమే కాదు. సమానమనే భావన కూడా ఉండాలన్నది నూయీ ‘పాయింట్ ఆఫ్ వ్యూ’. సహాయం.. సమానత్వం పనికి వెళ్లి వచ్చే మగవాళ్లకు, ఆడవాళ్లకు తేడా ఉంటుంది. మగవాళ్లు వాళ్లెంత చిన్న పొజిషన్లో ఉన్నా.. ఇంటికి వెళ్లాక రిలాక్స్ అవడానికి ఉంటుంది. ఆడవాళ్లు వాళ్లెంత పెద్ద పొజిషన్లో ఉన్నా.. ఇంటికి వెళ్లాక అక్కడ మళ్లీ ‘ఫ్రెష్’గా పని ఎదురు చూస్తుంటుంది. నూయీనే చూడండి. ఈ పెప్సీ కంపెనీ సి.ఇ.వో. ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి వెళ్లగానే తల్లిగా, భార్యగా, కోడలిగా, ఇంకా అప్పటికప్పుడు ఊహించని కొన్ని అతిథి పాత్రలను పోషించవలసి వస్తుంది. ఇంతకీ నూయి అనడం ఏమంటే... ఇంటినీ, ఆఫీస్‌ను చక్కబెట్టుకోడానికి అనువైన సదుపాయాలతో పాటు మహిళా ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం అందేవిధంగా ప్రతి కంపెనీ కొన్ని నియమాలు ఏర్పరచాలని. అంతే తప్ప, ఏవో కొన్ని సౌకర్యాలు కల్పించి, సంబోధనలతో గారాం చేస్తూ, జెండర్ ఈక్వాలిటీ తెచ్చేశామోచ్ అంటే నూయీ ఊరుకోరు. తన విజయం వెనుక తనే! పురుషుడి ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. రైట్. స్త్రీ ప్రతి విజయం వెనుక? ఆమె స్వయం కృషి ఉంటుంది. లేదంటే ఆమె తల్లి పడ్డ కష్టం ఉంటుంది. చిన్నప్పుడు నూయీ వాళ్ల అమ్మగారు పిల్లలు ముగ్గుర్నీ కూర్చోబెట్టుకుని వాళ్లకొక పరీక్ష పెడుతుండేవారు. ఒక్కొక్కరు లేచి నిలబడి ఏదైనా విషయం మీద మాట్లాడాలి. చక్కగా, అర్థవంతంగా మాట్లాడిన వాళ్లు విజేత. వాళ్లకొక చాక్లెట్. ఆ అనుభవం, ఆ వాక్పటిమ, ఆ క్లారిటీ జీవితంలోని ప్రతి దశలోనూ ఆమెకు ఉపయోగపడింది. ఏ రోజు ఎక్కడ ఉన్నా ఇప్పటికీ నూయి రోజుకు రెండు మూడుసార్లైనా తన తల్లికి ఫోన్‌చేసి మాట్లాడుతుంటారు. గత ఏడాది కోల్‌కతా ఐ.ఐ.ఎం.లో చదువు పూర్తిచేసుకుని బయటి ప్రపంచంలోకి వెళుతున్న విద్యార్థులకు ఇచ్చిన ప్రసంగంలో నూయీ ఈ మాటే చెప్పారు. మీరెంత పెద్ద స్థాయిలో ఉండనివ్వండి. మీరెంత బిజీగా ఉండనివ్వండి. ‘అమ్మా నేను బిజీగా ఉన్నాను’ అని మాత్రం అనకండి అని చెప్పారు నూయి. అమ్మానాన్నలకు ధన్యవాదాలు పెద్ద పెద్ద కంపెనీల సిఇవోలు పదవిని చేపట్టినప్పుడో, పదవీ విరమణ పొందుతున్నప్పుడో ఉద్యోగులందర్నీ ఉద్దేశించి ఒక లేఖ రాస్తుంటారు. ఇంద్రా నూయి కూడా రాశారు. కానీ ఉద్యోగులకు కాదు. వారి తల్లిదండ్రులకు. ‘మీ అబ్బాయిని / అమ్మాయిని మా పెప్సీ కంపెనీకి కానుకగా ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అంకితభావంతో కూడిన వారి అత్యద్భుతమైన పనితీరుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను’ అని ప్రతి ఎంప్లాయీ తల్లిదండ్రులకు తన సంతకం ఉన్న లెటర్ పంపించారు నూయి! గుడ్... బెటర్... ఫన్ ఇండియాలో నూయీ తొలి ఉద్యోగం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో ప్రాడక్ట్ మేనేజర్‌గా. తర్వాత మెట్టూర్ బియర్డ్‌సెల్ అనే వస్త్ర పరిశ్రమ సంస్థలో. తర్వాత యు.ఎస్. వెళ్లాక అక్కడి బూజ్ అలెన్ హామిల్టన్ అనే మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థలో సమ్మర్ ఇంటెర్న్షిప్. ఆ తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు, మోటరోలా, ఏషియా బ్రౌన్ బొవెరీ. 1994లో నూయీ పెప్సీకోలో చేరేనాటికి ఆమె వయసు 39 సం. 118 ఏళ్ల చరిత్రగల అమెరికన్ కంపెనీ పెప్సీకో చైర్పర్సన్, సి.ఇ.ఒ అయ్యే నాటికి 51 సం. ఆ పన్నెండేళ్ల వ్యవధిలో నూయీ తన ‘స్ట్రాటెజిక్ రీడెరైక్షన్’ విధానాలతో పెప్సీనీ పవర్‌ఫుల్‌గా పునర్నిర్మించారు. ఫన్ ఫర్ యు (పొటాటో చిప్స్, రెగ్యులర్ సోడా), బెటర్ ఫర్ యు (డైట్ లేదా లోఫ్యాట్ స్నాక్స్, సోడాలు), గుడ్ ఫర్ యు (ఓట్ మీల్ పదార్థాలు).. ఇదీ నూయీ స్ట్రాటెజిక్ రీడెరైక్షన్. హిట్ అయింది. షేక్ చేసి మూత తీసిన బాటిల్లా పెప్సీకో లాభాలు పొంగిపొర్లాయి. కిరీటం ఇంట్లోకి రాకూడదు! పెప్సీ సి.ఇ.ఒ. గా నూయికి ఇది పదో ఏడాది. ఈ పదేళ్లలో అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలు ఆమెను అనేకసార్లు ‘మోస్ట్ పవర్ఫుల్ ఉమన్’గా కీర్తించాయి. సి.ఇ.ఒ. అయిన తొలినాళ్లలో ఓ రోజు.. నూయి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 10 అయింది. ‘అమ్మా.. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి’ అన్నారు నూయి. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతులైన మహిళల్లో నూయి కూడా ఒకరు అని అంతకుముందే ఫార్చూన్ పత్రిక ప్రకటించింది. ఆ విషయాన్నే ఆమె తన తల్లికి చెప్పదలచుకున్నారు. ‘ఆ ముఖ్యమైన విషయమేదో తర్వాత చూద్దాం. ముందు వెళ్లి పాల ప్యాకెట్ తీసుకురా’ అన్నారు శాంత(మ్మ). నూయి ఆశ్చర్యపోయారు. ‘రాజ్ ఇంట్లోనే ఉన్నాడు కదా. తనని తెమ్మనాల్సింది’ అన్నారు. ‘అబ్బాయి అలసిపోయాడు’- శాంతమ్మ సమాధానం. అల్లుడి అలసట ఆమెకు కనిపించింది కానీ, అలసిపోయి ఇంటికొచ్చిన కూతురు కనిపించలేదు. నూయి కోపంగా బయటికి కెళ్లి పాల ప్యాకెట్‌తో తిరిగొచ్చారు. ప్యాకెట్‌ని కిచెన్ టేబుల్ మీద పడేసి తల్లి వైపు తిరిగారు. ‘ఇప్పుడు చెప్పు. పాలు నేనే వెళ్లి ఎందుకు తేవాలి? మిగతావాళ్లు ఎందుకు తేకూడదు?’ అన్నారు. శాంతమ్మ మాట్లాడలేదు. ఒక చూపు మాత్రం చూశారు. తర్వాత మెల్ల్లిగా మొదలు పెట్టారు. ‘‘చూడు.. నీ కిరీటాన్ని గ్యారేజీలోనే వదిలేయ్. నీతోపాటు దాన్ని ఇంట్లోకి తీసుకురాకు. నువ్వు మొదట భార్యవి. తర్వాత తల్లివి. ఆ తర్వాతే మిగతావన్ని. నీ కుటుంబానికి పాలు అవసరం అయినప్పుడు నీకున్న ముఖ్యమైన పని పాలు తెచ్చు కోవడం ఒక్కటే’’ అన్నారు శాంతమ్మ ఏకబిగిన! ఈ ఏడాది ఫోర్బ్స్ లిస్ట్‌లో పేరొచ్చిన ప్పుడు కూడా మొదట ఆమెకు తన తల్లి మాటలే గుర్తుకొచ్చి ఉంటాయి. ‘పవర్ఫుల్ ఉమన్’ అని ఎవరు ఎన్ని టైటిల్స్ ఇచ్చినా, ‘పవర్’ అంటే ఇంద్రానూయి దృష్టిలో ఒకటే. స్త్రీపురుష సమభావనకు, సమభాగస్యామ్యానికి కృషి చేయగల సామర్థ్యం ఉండడం. ఆమెలో ఆ సామర్థ్యం ఉంది. అందుకే ఆమె పవర్ఫుల్ ఉమన్. ఆఫీసులలో మహిళలు ఒకరికొకరు సహాయం చేసుకుంటే.. ఉమన్ టు ఉమన్.. ఆ పవర్ ప్రవహించడం పెద్ద కష్టమేం కాదని కూడా నూయి అంటుంటారు. ఇంద్రా నూయి (60), వ్యాపార నిర్వాహక దిగ్గజం పూర్తి పేరు : ఇంద్ర కృష్ణమూర్తి జన్మస్థలం : చెన్నై జన్మదినం : 28 అక్టోబర్ 1955 చదువు : పి.జి.డిప్లమా ఇన్ మేనేజ్మెంట్ (ఐ.ఐ.ఎం. కోల్‌కతా) మాస్టర్స్ డిగ్రీ - పబ్లిక్ అండ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ (యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, యు.ఎస్.) తల్లితండ్రులు : కృష్ణమూర్తి, శాంత తోబుట్టువులు : చంద్రిక, నారాయణ్ భర్త : రాజ్.కె.నూయి (యామ్సాఫ్ట్ ప్రెసి.) పిల్లలు : {పీతా నూయి, తారా నూయి ప్రస్తుత నివాసం : {Xన్విచ్, కనెక్టికట్ (యు.ఎస్.) మరికొన్ని విశేషాలు ఇంద్రా నూయి తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి. తల్లి గృహిణి. యేల్ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు నూయీ తన రోజువారీ ఖర్చుల కోసం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఉండే షిఫ్టులో రిసెప్షనిస్టుగా పని చేశారు.యు.ఎస్.లో తొలి ఉద్యోగానికి నూయి చీర కట్టుకుని ఇంటర్వ్యూకు వెళ్లారు. చెన్నైలో ఉన్నప్పుడు అక్కడి ఆల్ ఉమెన్ రాక్ బ్యాండులో నూయీ ప్రధాన గిటారిస్టు. కాలేజ్‌లో నూయీ క్రికెట్ ప్లేయర్.కార్పోరేట్ సంస్థల వేడుకల్లో సంగీత నేపథ్యంతో (కరావొకె) పాటలు పాడడం నూయీ హాబీ. ఇప్పటికీ పాడుతుంటారు. పెప్సీకో లో ఏ సమావేశానికైనా నూయీ చీర కట్టుతోనే హాజరవుతారు. -
ఆరోగ్య సంబంధిత పానీయాలపై దృష్టి: పెప్సికో
న్యూఢిల్లీ: శీతల పానీయాల ప్రముఖ తయారీ సంస్థ పెప్సికో ఆరోగ్య పరమైన డ్రింక్స్ తయారీపై ప్రధానంగా దృష్టి పెట్టింది. రోజు రోజుకి వినియోగదారుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త డ్రింక్స్, తినుబంఢారాలను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో హైడ్రేషన్, ఫంక్షనల్ డ్రింక్స్‌కు మార్కెట్ అవకాశాలున్నాయని పెప్సికో బెవరేజ్ క్యాటగిరి ఇండియా వైస్ ప్రెసిడెంట్ విపుల్ ప్రకాశ్ పేర్కొన్నారు. ఫంక్షనల్ డ్రింక్స్‌లో విటమిన్లు, మినరల్స్ ఉంటాయని తెలిపారు. క్రీడాకారులు లక్ష్యంగా మౌంటెన్ డ్యూ బ్రాండ్‌లో గేమ్ ఫ్యూయల్ డ్రింక్‌ను గురువారం విడుదల చేసింది. ‘గేమ్ ఫ్యూయల్‌ను అమెరికా తర్వాత భారత్‌లోనే విడుదల చేసాం. ఈ ఏడాది చివరికల్లా మరో 2 కొత్త ఉత్పత్తులను వినియోగదారుల ముందుకు తీసుకువస్తాం’ అని విపుల్ ప్రకాశ్ చెప్పారు.