టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ 2017 నవంబర్‌లో టెస్లా సెమీ ట్రక్‌ను ఆవిష్కరించారు. ఆ కార్యక్రమంలో 2019 లో ట్రక్‌ల తయారీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తాజాగా ఆ సంస్థ తయారు చేసిన ట్రక్‌ను విడుదల చేశారు. తొలి ఈవీ ట్రక్‌ను ప్రముఖ ఫుడ్ బేవరేజెస్ కంపెనీ పెప్సికోకి అందించారు.
మస్క్ సెమీ ఎలక్ట్రిక్ ట్రక్‌ల తయారీ ప్రకటనతో పెప్సికో 100 ట్రక్‌లు కొనుగోలు చేసేలా టెస్లాతో సంప్రదింపులు జరిపింది. వాస్తవానికి ఈ వెహికల్స్‌ను పెప్సికోకు 2021లోనే అందించాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా తయారీ, విడుదల సాధ్యం కాలేదు.
ఇప్పుడు ఆ ఈవీ ట్రక్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ సందర్భంగా వీటిలోని ఓకదాన్ని మస్క్ స్వయంగా నడిపారు. ఈ సెమీ ట్రక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 37,000 కిలోల బరువుతో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని మస్క్ తెలిపారు.
ఫీచర్లు, ధర
37,000 కిలోలు బరువున్న ఈ ట్రక్ 20 సెకన్లలో 0-60mph వేగాన్ని అందుకుంటుంది. సింగిల్ ఛార్జ్‌తో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించ వచ్చు. ఇక ఈ వెహికల్ ధర 1,50,000 డాలర్లు ఖరీదు చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కాగా,ఉత్తర అమెరికాలో 2024లో 50వేల ట్రక్కులను తయారు చేసే లక్ష్యంతో ప్రొడ క్షన్‌ను పెంచాలని కంపెనీ యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment