అమెరికా విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ కంపెనీ కార్ల దిగుమతిపై సుంకం రాయితీలు, స్థానిక విలువ జోడింపు మినహాయింపుల ప్రతిపాదనలేవీ పరిగణగించడం లేదని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం నుంచి టెస్లా పలు రాయితీలు, మినహాయింపులు ఆశిస్తున్న విషయం తెలిసిందే.
భారీ బ్యాటరీలు, సెమీకండక్టర్లు, అయస్కాంత భాగాలపై స్థానిక విలువ జోడింపు నుంచి టెస్లా, ఇతర బహుళజాతి కార్ కంపెనీలను మినహాయించే ప్రతిపాదన ఏదైనా ఉందా అంటూ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతిపై విధించే సుంకంపై రాయితీ కూడా ఏమీ ఉండదని తెలిపారు..
ఇది కూడా చదవండి: AI warning: బ్యాంకులకూ ముప్పు తప్పదా? హెచ్చరిస్తున్న జెరోధా సీఈవో నితిన్ కామత్
భారత ప్రభుత్వం రూ.25,938 కోట్ల బడ్జెట్ వ్యయంతో ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్ పరిశ్రమలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించిందని పేర్కొన్న ఆయన ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి విడి భాగాలతో సహా రేపటితరం ఆటోమోటివ్ టెక్నాలజీస్ ఉత్పత్తుల్లో దేశీయ తయారీని పెంచడమే లక్ష్యంగా ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment