import
-
‘ఆదాయ పన్ను రద్దు చేస్తాం’
అమెరికా పన్నుల వ్యవస్థను పునర్నిర్మించే సాహసోపేత చర్యలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక విధానాలు అనుసరించాలని చెప్పారు. అమెరికన్ పౌరులకు ఆదాయపు పన్నును రద్దు(abolishing income tax) చేయాలని ప్రతిపాదించారు. దాని స్థానంలో పౌరుల డిస్పోజబుల్ ఆదాయాన్ని(కనీస అవసరాలు, ఈఎంఐలు.. వంటి వాటికి ఖర్చు చేశాక మిగిలే మొత్తం) పెంచే లక్ష్యంతో దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను ప్రవేశపెట్టాలని ట్రంప్ సూచించారు. హౌస్ రిపబ్లికన్ మెంబర్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.1870-1913 మధ్య కాలంలో అమెరికా ప్రత్యేక టారిఫ్(tariff)లను ప్రవేశపెట్టి వాటివల్ల వచ్చే ఆదాయంపై ఆధారపడిందని ట్రంప్ తెలిపారు. తర్వాత ఆ ప్రత్యేక టారిఫ్‌లను క్రమంగా తొలగించారని గుర్తు చేశారు. ఈ వ్యూహం అమెరికా ఆర్థిక వ్యవస్థకు మరోసారి ఊతమిస్తుందని ట్రంప్ అన్నారు. మునుపెన్నడూ లేనంతగా అమెరికన్లను ధనవంతులుగా, మరింత శక్తిమంతులుగా మార్చే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఆదాయపన్ను రద్దు చేసి, దిగుమతి వస్తువులపై సుంకాలు పెంచాలనే విధానాలు ప్రవేశపెట్టాలని ట్రంప్ చెబుతుండడం చర్చకు దారి తీసింది.భారత్, చైనాలపై టారిఫ్లుఈ విధానాన్ని పర్యవేక్షించడానికి, టారిఫ్‌లు, సంబంధిత ఆదాయాల నిర్వహణకు బాధ్యత వహించే ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే జనవరి 20న ట్రంప్ తన ప్రారంభ ఉపన్యాసంలో మాట్లాడుతూ..‘అమెరికా పౌరులను సంపన్నులుగా చేయడానికి విదేశాలపై సుంకాలు విధిస్తాం. మన ఖజానాకు విదేశీ వనరుల నుంచి భారీగా డబ్బు వచ్చి చేరుతుంది’ అన్నారు. ట్రంప్ చైనా, భారత్ వంటి దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని చెప్పారు.ఇదీ చదవండి: హైదరాబాద్ అమెజాన్‌లో రూ.102 కోట్ల మోసంఈ ఆదాయ పన్ను రద్దు పథకంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరిలో ఇది ఉత్సాహాన్ని రేకెత్తించినప్పటికీ, మరికొందరిలో విమర్శలకు దారితీస్తుంది. పెరిగిన దిగుమతి వ్యయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. పన్ను పునర్వ్యవస్థీకరణను అమలు చేయడంలో లోపాలు ఎదురవుతాయని అమెరికన్ కాంగ్రెస్‌లో కొంతమంది చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అమెరికన్ కార్మికులు, వారి కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి నిబద్ధతతో ఉన్నట్లు ట్రంప్ చెప్పారు. ‘అమెరికా ప్రయోజనాలను పరిరక్షించడానికి మేము వెంటనే వాణిజ్య వ్యవస్థను సమూలంగా మార్చాలని నిర్ణయించుకున్నాం’ అన్నారు. -
భారంగా మారనున్న స్టీల్ దిగుమతులు!?
న్యూఢిల్లీ: కొన్ని రకాల స్టీల్ ఉత్పత్తులు చౌకగా దిగుమతి అవుతున్నాయన్న దేశీ స్టీల్ పరిశ్రమ ఫిర్యాదుపై డైరెక్టరేజ్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ (డీజీటీఆర్) అధికారిక దర్యాప్తు మొదలు పెట్టింది. ఫ్యాబ్రికేషన్, పైపుల తయారీ, నిర్మాణ రంగం, క్యాపిటల్ గూడ్స్, ఆటో, ట్రాక్టర్లు, సైకిళ్లు, ఎలక్ట్రికల్ ప్యానెళ్ల కోసం వినియోగించే నాన్ అలాయ్, అలాయ్ స్టీల్ ఫ్లాట్ ఉత్పత్తులపై దర్యాప్తు మొదలు పెట్టినట్టు డీజీటీఆర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉత్పత్తులపై 25 శాతం రక్షిత సుంకం విధించాలని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.ఇటీవల ఉన్నట్టుండి, పెద్ద ఎత్తున పెరిగిన ఈ దిగుమతులతో దేశీ పరిశ్రమకు శారాఘాతంగా మారినట్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశీ పరిశ్రమకు తీవ్ర హానికరంగా పేర్కొంది. దరఖాస్తుదారు (స్టీల్ పరిశ్రమ) సమర్పించిన వివరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించేందుకు కావాల్సిన ప్రాథమిక సాక్ష్యాధారాలుట్టు భావిస్తున్నామని డీజీటీఆర్ తన నోటిఫికేషన్లో పేర్కొంది. హాట్ రోల్డ్ (హెచ్ఆర్) కాయిల్స్, షీట్స్ అండ్ ప్లేట్స్, హెచ్ఆర్ ప్లేట్ మిల్ ప్లేట్స్, కోల్డ్‌రోల్డ్ (సీఆర్) కాయిల్స్ అండ్ షీట్స్, మెటాలిక్ కోటెడ్ స్టీల్ కాయిల్స్ అండ్ షీట్స్, కలర్ కోటెడ్ కాయిల్స్ అండ్ షీట్స్ ఉత్పత్తులు డీజీటీఆర్ దర్యాప్తు పరిధిలోకి రానున్నాయి.విచారణ అనంతరం తన సిఫారసులను కేంద్ర ఆరి్థక శాఖకు డీజీటీఆర్ సమరి్పస్తుంది. ఈ సిఫారసుల ఆధారంగా దిగుమతులపై ప్రత్యేక సుంకాలు విధించే అవశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా చైనా నుంచి ఈ దిగుమతులు గణనీయంగా పెరిగినట్టు ప్రస్తుత ఆరి్థక సంవత్సరం తొలి ఎనిమిది నెలల గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. -
జోరుగా వంట నూనెల దిగుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంట నూనెల దిగుమతులు భారత్‌లో 2024 నవంబర్‌లో 15.9 లక్షల టన్నులు నమోదైంది. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఇది 38.5 శాతం అధికం. ముఖ్యంగా విదేశాల నుంచి ముడి పొద్దుతిరుగుడు నూనె, ముడి సోయాబీన్ నూనెలు భారత్‌కు వెల్లువెత్తడం ఇందుకు కారణం.సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ప్రకారం.. 2024–25 నవంబర్–అక్టోబర్ ఆయిల్ మార్కెటింగ్ సంవత్సరం మొదటి నెలలో వివిధ దేశాల నుంచి భారత్‌కు వెజిటబుల్ ఆయిల్స్ సరఫరా 40 శాతం అధికమై 16,27,642 టన్నులకు చేరుకుంది. ఇది ఏడాది క్రితం 11,60,590 టన్నులుగా ఉంది. 2023 నవంబర్‌లో నమోదైన 12,498 టన్నులతో పోలిస్తే నాన్ ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతి గత నెలలో 37,341 టన్నులకు పెరిగింది. ఆర్బీడీ పామోలిన్ 1,71,069 టన్నుల నుంచి 2,84,537 టన్నులకు ఎగసింది. ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ 1,28,707 టన్నుల నుంచి 3,40,660 టన్నులకు చేరింది. పెరిగిన సాఫ్ట్ ఆయిల్స్.. గత నెలలో భారత్‌కు ముడి సోయాబీన్ ఆయిల్ రాక 1,49,894 టన్నుల నుంచి 4,07,648 ట న్నులకు దూసుకెళ్లింది. విదేశాల నుంచి భారత్‌కు ముడి పామాయిల్ సరఫరా 6,92,423 టన్నుల నుంచి గత నెలలో 5,47,309 టన్నులకు పడిపోయింది. గత నెలలో ముడి, శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతి 8,69,491 టన్నుల నుండి 8,41,993 టన్నులకు వచ్చి చేరింది. విదేశాల నుంచి భారత్‌కు సాఫ్ట్ ఆయిల్ సరఫరా 2023 నవంబర్‌తో పోలిస్తే 2024 నవంబర్‌లో 2,78,601 టన్నుల నుంచి ఏకంగా 7,48,308 టన్నులకు దూసుకెళ్లింది.పామాయిల్ వాటా 76% నుంచి 53 శాతానికి పడిపోయింది. సాఫ్ట్ ఆయిల్స్ 24 నుంచి 47 శాతానికి పెరిగాయి. ఇండోనేషియా, మలేషియా నుంచి ఆర్బీడీ పామోలిన్, ముడి పామాయిల్ ప్రధానంగా సరఫరా అవు తోంది. సోయాబీన్ నూనె ప్రధానంగా అర్జెంటీ నా, బ్రెజిల్, రష్యా నుండి, సన్‌ఫ్లవర్ ఆయిల్ ర ష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా నుండి భారత్‌కు వస్తోంది. -
30 లక్షల యూనిట్లు ఎగుమతి!
వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మొత్తంగా ఇప్పటి వరకు 30 లక్షల యూనిట్ల కార్లను వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. తాజాగా గుజరాత్‌లోని పిపావావ్ పోర్ట్ నుంచి సెలెరియో, ఫ్రాంక్స్, జిమ్నీ, బలేనో, సియాజ్, డిజైర్, ఎస్–ప్రెస్సో వంటి మోడళ్లతో కూడిన 1,053 యూనిట్ల రవాణాతో కంపెనీ కొత్త మైలురాయిని సాధించింది. 2030–31 నాటికి విదేశాలకు ఏటా 7.5 లక్షల యూనిట్లను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకున్నట్టు సంస్థ తెలిపింది. భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా చొరవతో మరింత స్థానికీకరణ, ఎగుమతులను రెట్టింపు చేయడం కోసం కట్టుబడి ఉన్నామని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈవో హిసాటీ టాకేయూచీ ఒక ప్రకటనలో తెలిపారు. నాలుగేళ్లలో మూడు రెట్లు..భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం ప్రయాణికుల వాహనాల్లో 40 శాతం వాటా తమ సంస్థ కైవసం చేసుకుందని టాకేయూచీ చెప్పారు. దేశం నుంచి కంపెనీ ఎగుమతులు నాలుగేళ్లలో మూడు రెట్లు పెరిగాయని వెల్లడించారు. ఈ గ్లోబల్ డిమాండ్ ద్వారా ప్రేరణ పొంది 2030–31 నాటికి వాహన ఎగుమతులను 7.5 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలు, కొన్ని మార్కెట్లతో వాణిజ్య ఒప్పందాలు కంపెనీ ఎగుమతుల వృద్ధిని పెంచుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలంలో మారుతీ సుజుకీ ఇండియా 1,81,444 యూనిట్లను ఎగుమతి చేసింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 17 శాతం వృద్ధిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 2.83 లక్షల యూనిట్లను వివిధ దేశాలకు సరఫరా చేసింది.ఇదీ చదవండి: ఐపీవోకు తొలి ఎస్ఎం రీట్అత్యంత వేగంగా 10 లక్షల యూనిట్లు ఎగుమతిప్రస్తుతం కంపెనీ లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్యంలోని దాదాపు 100 దేశాల్లో 17 మోడళ్లను విక్రయిస్తోంది. ఫ్రాంక్స్, జిమ్నీ, బలేనో, డిజైర్, ఎస్–ప్రెస్సో అధికంగా ఎగుమతి అవుతున్న టాప్ మోడళ్లుగా నిలిచాయి. 1986 నుంచి మారుతీ సుజుకీ భారత్‌లో తయారైన కార్లను విదేశాలకు సరఫరాను ప్రారంభించింది. కంపెనీ వాహన ఎగుమతుల్లో తొలి 10 లక్షల యూనిట్ల మార్కును 2012–13లో సాధించింది. తొమ్మిదేళ్లలోనే 20 లక్షల యూనిట్ల మైలురాయిని 2020–21లో అందుకుంది. 30 లక్షల యూనిట్ల స్థాయికి మూడు సంవత్సరాల తొమ్మిది నెలల్లోనే సంస్థ సాధించింది. ఇది కంపెనీకి అత్యంత వేగవంతమైన మిలియన్గా నిలవడం విశేషం. -
ఇప్పటికీ పాకిస్తాన్ నుంచే రాక్ సాల్ట్ దిగుమతి.. ఎందుకో తెలుసా?
మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఒక్క రోజు ముందు పాకిస్తాన్ ఏర్పడింది. అప్పటి వరకు ఇండియాలో భాగమైన పాకిస్తాన్.. ఆ తరువాత భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న అనేక ఉగ్రవాద సంస్థలకు మద్దతు పలికింది. అనేక యుద్దాలు తరువాత కూడా రెండు దేశాల మధ్య వాణిజ్యం కొనసాగింది. 2019లో ఈ దిగుమతులు గణనీయంగా తగ్గినప్పటికీ.. రాక్ సాల్ట్ కోసం భారత్ పాకిస్తాన్ మీదనే ఆధారపడాల్సి వస్తోంది.భారతదేశంలో హిందూ మతపరమైన వేడుకలకు కావలసిన రాతి ఉప్పును పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ రాతి ఉప్పునే.. రాక్ సాల్ట్, సంధవ్ సాల్ట్, లాహోరీ సాల్ట్, పింక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్ అని వివిధ పేర్లతో పిలుస్తారు. సముద్రపు లేదా సరస్సులలోని ఉప్పునీరు ఆవిరై సోడియం క్లోరైడ్‌గా మారినప్పుడు రాక్ సాల్ట్ ఏర్పడింది. పాకిస్తాన్లో ఇది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఖేవ్రా ఉప్పు గని.. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉప్పు గనిగా పేరుగాంచింది. ఇక్కడ ప్రతి ఏటా సుమారు 4,50,000 టన్నుల రాక్ సాల్ట్ ఉత్పత్తి అవుతుందని సమాచారం. ప్రస్తుతం భారత్ 99.7 శాతం రాక్ సాల్ట్‌ను పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. మిగిలిన 0.3 శాతం ఇరాన్, మలేషియా, జర్మనీ, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.ఇదీ చదవండి: తండ్రి నుంచి అప్పు తీసుకుని మరీ!! మకుటం లేని మహరాజుగా ఎదిగి..రాక్ సాల్ట్ ధర పాకిస్తాన్లో రూ. 2 నుంచి రూ. 3 మాత్రమే. కానీ భారతదేశంలో దీని ధర రూ. 50 నుంచి రూ. 60 మధ్యలో ఉంది. ఇక్కడ చాలామంది ఈ ఉప్పును వాడుతున్నారు. ఈ కారణంగానే దీని ధర సాధారణ సాల్ట్ కంటే కొంత ఎక్కువగా ఉంటుంది.రాక్ సాల్ట్ వల్ల ప్రయోజనాలురాక్ సాల్ట్ పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, ఎలక్ట్రోలైట్స్ వంటివి ఉండటం వల్ల బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఉపవాసం సమయాన్ని బీపీని కంట్రోల్ చేయడంలో, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా రాక్ సాల్ట్ ఉపయోగపడుతుంది. ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా అందం కోసం కూడా ఈ ఉప్పును ఉపయోగిస్తారు. -
భారీగా పెరిగిన ల్యాప్‌టాప్‌ల దిగుమతి
న్యూఢిల్లీ: దిగుమతి నిర్వహణ వ్యవస్థను అనుసరించి అనుమతి పొందిన కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 4 బిలియన్ డాలర్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, ఇతర ఐటీ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. 2023–24లో ఈ దిగుమతుల విలువ 8.4 బిలియన్ డాలర్లు. వీటిలో అత్యధికం చైనా నుంచి భారత్‌కు వస్తున్నాయని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.2023 అక్టోబర్‌లో ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల దిగుమతుల కోసం ప్రభుత్వం దిగుమతి నిర్వహణ/అధికారీకరణను రూపొందించింది. మార్కెట్ సరఫరా దెబ్బతినకుండా దేశంలోకి ఈ వస్తువుల రాకను పర్యవేక్షించడం ఈ వ్యవస్థ లక్ష్యం. దీని ప్రకారం దరఖాస్తు చేసుకుని పొందిన అనుమతులు 2024 సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతాయి.10 బిలియన్ డాలర్లకుపైగా.. నూతన వ్యవస్థ అమలులోకి వచ్చిన తొలిరోజు 2023 నవంబర్ 1న 100కుపైగా దరఖాస్తులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో యాపిల్, డెల్, లెనోవో వంటి సంస్థలు ఉన్నాయి. 10 బిలియన్ డాలర్లకుపైగా విలువైన ఉత్పత్తుల కోసం ఇవి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.ఈ ఏడాది సెప్టెంబర్ 30 తర్వాత తదుపరి ఉత్తర్వుల కోసం వాణిజ్య మంత్రిత్వ శాఖ పూర్తిగా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూచనలను పాటిస్తుందని అధికారి తెలిపారు. 2022–23లో భారత్‌కు 5.33 బిలియన్ డాలర్ల విలువైన పర్సనల్ కంప్యూటర్లు దిగుమతి అయ్యాయి. ఇందులో చైనా వాటా ఏకంగా 5.11 బిలియన్ డాలర్లు ఉంది. సింగపూర్, హాంగ్‌కాంగ్, యూఎస్, మలేషియా, తైవాన్, నెదర్లాండ్స్, వియత్నాం సైతం ఐటీ ఉత్పత్తులను భారత్‌కు సరఫరా చేస్తున్నాయి. -
అలాంటివేం లేవు.. టెస్లాకు షాకిచ్చిన భారత ప్రభుత్వం
అమెరికా విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ కంపెనీ కార్ల దిగుమతిపై సుంకం రాయితీలు, స్థానిక విలువ జోడింపు మినహాయింపుల ప్రతిపాదనలేవీ పరిగణగించడం లేదని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం నుంచి టెస్లా పలు రాయితీలు, మినహాయింపులు ఆశిస్తున్న విషయం తెలిసిందే. భారీ బ్యాటరీలు, సెమీకండక్టర్లు, అయస్కాంత భాగాలపై స్థానిక విలువ జోడింపు నుంచి టెస్లా, ఇతర బహుళజాతి కార్ కంపెనీలను మినహాయించే ప్రతిపాదన ఏదైనా ఉందా అంటూ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతిపై విధించే సుంకంపై రాయితీ కూడా ఏమీ ఉండదని తెలిపారు.. ఇది కూడా చదవండి: AI warning: బ్యాంకులకూ ముప్పు తప్పదా? హెచ్చరిస్తున్న జెరోధా సీఈవో నితిన్ కామత్ భారత ప్రభుత్వం రూ.25,938 కోట్ల బడ్జెట్ వ్యయంతో ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్ పరిశ్రమలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించిందని పేర్కొన్న ఆయన ఎలక్ట్రిక్ వాహనాలు, వాటి విడి భాగాలతో సహా రేపటితరం ఆటోమోటివ్ టెక్నాలజీస్ ఉత్పత్తుల్లో దేశీయ తయారీని పెంచడమే లక్ష్యంగా ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు వివరించారు. -
టాప్‌గేర్‌లో టెస్లా దిగుమతులు..!
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. భారత్ నుంచి ఆటో విడిభాగాల దిగుమతిని రెట్టింపు చేసుకునే యోచనలో ఉంది. నాలుగు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్ (కాలిఫోరి్నయా)లోని కంపెనీ ప్లాంటును సందర్శించిన సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ విషయం తెలిపారు. అనారోగ్య కారణాల రీత్యా గోయల్‌ను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కలవలేకపోయారు. ‘టెస్లా అధునాతన ప్లాంటును సందర్శించాను. మొబిలిటీ ముఖచిత్రాన్ని మారుస్తున్న టెస్లా వృద్ధి ప్రస్థానంలో పలువురు భారతీయ ఇంజ నీర్లు, ఫైనాన్స్ నిపుణులు సీనియర్ల స్థాయిలో పాలుపంచుకుంటూ ఉండటం సంతోషం కలిగించింది. అలాగే టెస్లా సరఫరా వ్యవస్థలో భారతీయ ఆటో విడిభాగాల సరఫరా సంస్థలకు ప్రాధాన్యం పెరుగుతుండటం గర్వకారణం. భారత్ నుంచి టెస్లా దిగుమతులను రెట్టింపు చేసుకునే దిశగా ముందుకెడుతోంది. మస్క్ వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నాను‘ అని సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఎక్స్‌లో గోయల్ ట్వీట్ చేశారు. ‘మీరు టెస్లా ప్లాంటును సందర్శించడం సంతోషం కలిగించింది. కాలిఫోరి్నయాకు రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. భవిష్యత్తులో మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను‘ అని దానికి ప్రతిస్పందనగా మస్క్ ట్వీట్ చేశారు. టెస్లా 2022లో భారత్ నుంచి 1 బిలియన్ డాలర్ల విలువ చేసే విడిభాగాలను దిగుమతి చేసుకోగా, ఈసారి 1.9 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు గోయల్ ఇటీవలే తెలిపారు. పరిశీలనలో మినహాయింపులు.. టెస్లా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా దిగుమతులతో ప్రారంభించి ఇక్కడ డిమాండ్‌ను బట్టి ప్లాంటును నెలకొల్పే యోచనలో ఉన్నట్లు రెండేళ్ల క్రితం మస్క్ చెప్పారు. అయితే, భారీ స్థాయి దిగుమతి సుంకాల విషయంలో భారత్ తమకు కొంత మినహాయింపు కల్పించాలని కోరారు. కానీ, టెస్లా కూడా ఇతర సంస్థల బాటలోనే రావాల్సి ఉంటుందని కేంద్రం అప్పట్లో స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్‌లో అమెరికాలో ప్రధాని మోదీతో మస్క్ సమావేశం అనంతరం.. దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలను ఆకర్షించేందుకు తగిన విధానాన్ని రూపొందిస్తామంటూ కేంద్రం వెల్లడించడం గమనార్హం. దీనితో టెస్లా ఎంట్రీకి మార్గం సుగమం చేసేలా కంపెనీకి వెసులుబాట్లునిచ్చే అవకాశాలు ఉన్నాయంటూ అంచనాలు నెలకొన్నాయి. -
Africa : పాత దుస్తులే వాళ్లకి ఫ్యాషన్!
సాక్షి, అమరావతి: అమెరికా, చైనా వంటి అగ్ర దేశాల్లో వాడేసి వదిలేసిన పాత దుస్తులే ఆఫ్రికా ప్రజలకు కొత్త ఫ్యాషన్. దీంతో ఆఫ్రికా ఖండాన్ని సెకండ్ హ్యాండ్ వ్రస్తాలు ముంచెత్తుతున్నాయి. అక్కడి వ్యాపారస్తులు విదేశాల నుంచి టన్నుల కొద్దీ పాత దుస్తుల్ని దిగుమతి చేసుకుని పెద్దఎత్తున వ్యాపారం చేస్తున్నారు. ఇలా వచ్చిన వాటిలో 50 శాతం పైగా వాడుకోవడానికి వీలుగా లేక పోవడంతో చెత్తకుప్పలుగా మిగిలిపోతున్నాయి. ఆ దుస్తులు ఆఫ్రికాలోని పర్యావరణానికి సవాలు విసురుతున్నాయి. వాస్తవానికి ప్రపంచంలో అత్యంత నాణ్యమైన పత్తిని ఆఫ్రికా దేశాల్లోనే పండిస్తున్నా.. పేదరికం కారణంగా అక్కడి ప్రజలు మాత్రం దిగుమతి చేసుకున్న సెకెండ్ హ్యాండ్ దుస్తులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను మెరుగు పరిచేందుకు ఇటీవల ‘ఆఫ్రికన్ కాంటినెంటల్ ఫ్రీ ట్రేడ్ ఏరియా’ ద్వారా ఖండం అంతటా సెకండ్ హ్యాండ్ దుస్తుల వ్యాపారాన్ని నిషేధించాలని నిర్ణయించినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. లక్షల టన్నుల్లో దిగుమతి ఆఫ్రికా ఖండంలో మాగ్రెబ్ (అరబ్ సంస్కృతి గల దేశాలు), సబ్ సహారా దేశాలు ఉన్నాయి. 2021లో మాగ్రెబ్ దేశాల్లో సెకండ్ హ్యాండ్ దుస్తుల మొత్తం దిగుమతులు సుమారు 107 మిలియన్ డాలర్లు కాగా, సబ్ సహారాలో 1,734 మిలియన్ డాలర్లుకు పైగా ఉంది. ‘గ్రీన్‌పీస్ ఆఫ్రికా’ సంస్థ సర్వే ప్రకారం మడగాస్కర్ ఏటా లక్ష టన్నుల సెకండ్ హ్యాండ్ దుస్తులను దిగుమతి చేసుకుంటే, కెన్యా 900 మిలియన్ల దుస్తులు, ఘనా 720 మిలియన్ల పాత దుస్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. పాత వ్రస్తాల దిగుమతిపై సరైన చట్టాలు లేకపోవడం, చెత్తగా మిగిలిన వాటిని ప్రాసెస్ చేయడంపై సరైన పరిజ్ఞానం లేకపోవడంతో ఈ దేశాలు సెకండ్ హ్యాండ్ దుస్తుల చెత్త కుప్పలుగా మారుతున్నాయి. దిగుమతైన దుస్తుల్లో 60% పైగా ప్లాస్టిక్ కలిసిన వ్రస్తాలే ఉండడంతో వాటిని తగులబెట్టినా.. భూమిలో పాతిపెట్టినా పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ట్రాషన్: ది స్టెల్త్ ఎక్స్పోర్ట్ ఆఫ్ వేస్ట్ ప్లాస్టిక్ క్లాత్స్ టు కెన్యా’ నివేదిక ఆఫ్రికాకు సెకండ్ హ్యాండ్ దుస్తుల దిగుమతులు డిమాండ్‌ను మించిపోయాయని, అవి ఇక్కడి పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తున్నట్టు ప్రకటించింది. ఈ వ్యర్థాల వల్ల నదులు, సముద్రాలు, పట్టణాలు, అడవులు, ప్రజల ఆరోగ్యం కలుíÙతమవుతున్నట్టు నివేదించింది. ఈ దేశాల్లో 2029 నాటికి సెకెండ్ హ్యాండ్ దుస్తుల వార్షిక విలువ 27.5 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ఇది ఆఫ్రికా మొత్తం ఆదాయంలో 12.4 శాతం. ఆఫ్రికాలో రెండో అతిపెద్ద ఉపాధి రంగం పేదరికం తాండవించే ఆఫ్రికా దేశాల్లో చవకైన దుస్తులకు డిమాండ్ ఉంది. అక్కడ వ్యవసాయం తర్వాత సెకండ్ హ్యాండ్ వస్త్రాల మార్కెట్టే అతిపెద్ద ఉపాధి రంగం. ఈ తరహా దుస్తులకు అతిపెద్ద ఎగుమతిదారు బ్రిటన్. ఆ దేశం నుంచి 14 మిలియన్ టన్నులు, అమెరికా నుంచి 7 లక్షల టన్నులు వాడేసిన దుస్తులను ఏటా ఆఫ్రికాకు ఎగుమతి చేస్తుండగా, యూరోపియన్ యూనియన్, చైనా తర్వాతి స్థానంలో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ నుంచి కూడా ఆఫ్రికాకు ఈ వ్రస్తాలు ఎగుమతి అవుతున్నాయి. ఒక్క ఘనా దేశానికే ప్రతివారం యూరప్, యూఎస్, ఆ్రస్టేలియా నుంచి 15 మిలియన్ల సెకండ్ హ్యాండ్ వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. సెకెండ్‌హ్యాండ్ దుస్తులను ఎక్కువగా దిగుమతి చేసుకునే కెన్యాలో ప్రతిరోజూ 4 వేల టన్నుల వస్త్ర వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కెన్యా ప్రభుత్వానికి సెకండ్ హ్యాండ్ వ్రస్తాల దిగుమతి, ఇతర దేశాలు విరాళంగా ఇచ్చిన వాటిపై విధించే పన్ను ముఖ్య ఆదాయ వనరు. ఈ దేశంలో 91.5 శాతం కుటుంబాలు సెకండ్ హ్యాండ్ దుస్తులను కొనుగోలు చేస్తున్నాయని అంచనా. పత్తి ప్రధాన ఉత్పత్తిదారైన జింబాబ్వే పెట్టుబడుల కొరత కారణంగా 85 శాతం పత్తిని ఎగుమతి చేస్తూ, 95 శాతం వ్రస్తాలు దిగుమతి చేసుకుంటోంది. గ్రీన్‌పీస్ ఆఫ్రికా 2022లో ఇచ్చిన నివేదిక ప్రకారం ఆఫ్రికా దేశాలకు విరాళంగా ఇచ్చే సెకెండ్ హ్యాండ్ దుస్తుల్లో 40 శాతం పైగా ధరించేందుకు పనికిరానివే. వాటిని బహిరంగ ప్రదేశాల్లో వదిలేయడమో, నదుల్లో పారవేయడమో చేస్తున్నారు. -
దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకే కంప్యూటర్ల దిగుమతిపై ఆంక్షలు
న్యూఢిల్లీ: పర్సనల్ కంప్యూటర్లు (పీసీ), ల్యాప్‌టాప్‌ల దిగుమతి లైసెన్సు కోసం కంపెనీలు/ట్రేడర్లు దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ప్రత్యేక పోర్టల్ రూపొందించింది. వివరాలన్నీ సక్రమంగా ఉంటే దరఖాస్తు చేసుకున్న 3–4 రోజుల్లోనే లైసెన్సును జారీ చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రవాణాలో ఉన్న కన్సైమెంట్స్ను లైసెన్సు లేకుండా అనుమతిస్తారని వివరించాయి. పీసీలు, ల్యాప్‌టాప్‌ల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దేశీయంగా ఐటీ హార్డ్‌వేర్ డివైజ్‌లను తయారు చేసుకునేందుకు భారత్‌కు తగినంత సామర్ధ్యం ఉండటం వల్ల నియంత్రణల విధింపుతో కంప్యూటర్ల లభ్యతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భద్రత కోసమే నియంత్రణలు.. దిగుమతైన కంప్యూటర్లలోని హార్డ్‌వేర్‌లో ఏవైనా లొసుగులు ఉంటే, వాటి నుంచి కీలకమైన వ్యక్తిగత, సంస్థాగత డేటాకు ముప్పు కలగకుండా భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఇంటర్నెట్ విస్తృతి పెరుగుతుండటంతో ప్రజలు ఆన్లైన్ మోసాల బారిన పడే అవకాశాలూ మరింతగా పెరిగాయని చెప్పాయి. ఈ నేపథ్యంలోనే దేశం, దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతోనే ప్రభుత్వం తాజా నియంత్రణలు విధించిందని అధికారులు తెలిపారు. అలాగే, చైనాతో వాణిజ్య సమతౌల్యం సాధించేందుకు కూడా ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. టారిఫ్యేతర నియంత్రణలనేవి దిగుమతులపై నిషేధం కిందికి రావని, లైసెన్సు తీసుకున్న వారు దిగుమతి చేసుకోవచ్చని వివరించారు. అటు, హార్డ్‌వేర్.. సిస్టమ్స్ విశ్వసనీయమైనవిగా ఉండేలా చూసేందుకు, దిగుమతులను తగ్గించుకునేందుకు, దేశీయంగా ఉత్పత్తిని పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. 2022–23లో ల్యాప్‌టాప్‌లు, పీసీల దిగుమతులు 5.33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య వ్యవధిలో పీసీలు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లతో పాటు ఎల్రక్టానిక్స్ దిగుమతుల విలువ 19.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి -
ల్యాప్‌టాప్ దిగుమతి నిబంధనలకు సమయం ఉంది - ఇదిగో క్లారిటీ!
Laptop Import Norms: ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా స్మాల్ కంప్యూటర్ల దిగుమతిపై విధించిన ఆంక్షలు వెంటనే అమలులోకి రావని, వీటిని అమలు చేయడానికి ఇంకా కొంత సమయం పడుతుందని కేంద్రం స్పష్టం చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్.. తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం, రవాణాలో ఉన్న లేదా ఇప్పటికే ఆర్డర్ చేసిన షిప్మెంట్లను దృష్టిలో ఉంచుకుని, ఈ పరివర్తన వ్యవధి ఎంత వరకు ఉంటుందనేది ఖచ్చితంగా త్వరలోనే వెల్లడవుతుంది కేంద్ర మంత్రి 'రాజీవ్ చంద్రశేఖర్' ఒక ట్వీట్లో తెలిపారు. ఐటి హార్డ్‌వేర్ కోసం ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ) స్కీమ్ కింద దేశీయ తయారీని ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భాగంగానే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతికి ప్రభుత్వం గురువారం లైసెన్సింగ్ అవసరమని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: 2030 నాటికి 10 కోట్ల ఉద్యోగాలు.. వీరికి తిరుగులేదండోయ్! Q: Why has the @GoI_MeitY finalized new norms for import of IT hardware like Laptops, Servers etc? Ans: There will be a transition period for this to be put into effect which will be notified soon. Pls read 👇 https://t.co/u5436EA0IG — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) August 4, 2023 చైనా, కొరియా నుంచి ఈ వస్తువుల దిగుమతులను తగ్గించడానికి కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని చాలా మంది భావిస్తున్నారు. అయితే మన దేశంలో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను అమ్మకానికి తీసుకురావాలని యోచిస్తున్న కంపెనీలు తమ ఇన్‌బౌండ్ షిప్మెంట్ల కోసం ప్రభుత్వం నుంచి అనుమతి పొందటం తప్పనిసరి. ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా ఫస్ట్ ఆఫీస్ అక్కడే? అద్దె ఎంతో తెలిస్తే అవాక్కవుతారు! డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నోటిఫికేషన్ ప్రకారం, ఏడు రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై HSN కోడ్ 8471 కింద పరిమితులు విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆంక్షలు విధించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని, ప్రాథమికంగా మన పౌరుల భద్రత పూర్తిగా రక్షించబడటానికని ఒక అధికారి వెల్లడించారు. -
భారత్ లో టెస్లా కార్ల తయారీ కేంద్రం....
-
పోటెత్తిన మామిడి
సాక్షి, హైదరాబాద్: బాటసింగారం పండ్ల మార్కెట్‌కు మామిడి పోటెత్తింది. ఈ సంవత్సరం పూత నెల రోజులు ఆలస్యంగా రావడంతో మామిడి పండ్లు మార్కెట్‌కు ఆలస్యంగా వస్తున్నాయి. గత నాలుగు రోజులుగా మార్కెట్‌కు మామిడి పండ్ల దిగుమతి ఒకేసారి పెరిగింది. సోమవారం ఈ సీజన్లోనే అత్యధికంగా 1800 నుంచి 2 వేల టన్నుల వరకు మామిడి దిగుమతి అయినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. దిగుమతులు పెరగడంతో పండ్ల ధరలు కూడా తగ్గాయి. మొదటి రకం పండ్ల టన్ను ధర రూ. 60 వేలు ఉండగా సాధారణ రకం టన్ను రూ.30 నుంచి రూ.40 వేల మధ్యలో ధర పలుకుతోంది. దీంతో రిటైల్ మార్కెట్లోనూ పండ్ల ధరలు భారీగా తగ్గాయి. గత వారం కిలో రూ. 90 నుంచి 80 ఉన్న మామిడి ధరలు సోమవారం రిటైల్ మార్కెట్లో రూ. 60 లోపే ఉన్నాయి. పెరగనున్న దిగుమతులు ఈ ఏడాది మామిడి సీజన్ కాస్తా ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ త్వరలో దిగుమతులు పెరుగుతాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మామిడి సీజన్ జూన్ చివరి వరకు కొనసాగుతుందని మార్కెట్ వర్గాల అంచనా. రోజు 2 వేల టన్నుల కంటే ఎక్కువగా మామిడి దిగుమతి కావచ్చని తెలిపారు. ఈ ఏడాది తెలంగాణ జిల్లాలనుంచే కాకుండా ఏపీ నుంచి కూడా మామిడి దిగుమతి ఎక్కువ దిగుమతి ఎక్కువగానే ఉంటుందన్నారు. దిగుమతులకు తగినట్లుగా ఏర్పాట్లు ఈ ఏడాది సీజన్ ఆలస్యంగా ప్రారంభమైనా దిగుమతులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. మార్కెట్‌కు వివిధ జిల్లాల నుంచి వచ్చే లారీలు మార్కెట్ నుంచి కాస్తా ఆలస్యంగా వెళ్లినా ట్రాఫిక్ సమస్యలు లేకుండా తగిన ఏర్పాట్లు చేశాం.. మార్కెట్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడానికి చర్యలు తీసుకున్నాం. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా మార్కెట్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. – చిలుకా నర్సింహా రెడ్డి, గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి (ఎఫ్ఏసీ). (చదవండి: రైతన్న ఆశలు ఆవిరి) -
యూఎస్‌కు భారతీయ బొమ్మలు
ప్యారిస్: భారత్‌లో తయారైన బొమ్మలను దిగుమతి చేసుకునేందుకు యూఎస్, యూరప్‌కు చెందిన దిగ్గజ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ సంస్థలు పెద్ద ఎత్తున బొమ్మలను కొనుగోలు చేసి ఆయా దేశాల్లో విక్రయించాలని భావిస్తున్నాయని ప్రభుత్వ అధికారుల సమాచారం. అంతేకాదు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తయారీ చేపట్టేందుకు వీలుగా ఇక్కడి కంపెనీలకు సాయం అందించేందుకూ ముందుకు రానున్నాయి. దేశీయంగా బొమ్మల తయారీని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్న డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ).. ఎగుమతులను పెంచడానికి విదేశీ కంపెనీలతో భాగస్వామ్యానికి కూడా సహాయం చేస్తోంది. డీపీఐఐటీ తోడ్పాటు.. బొమ్మల కొనుగోలుకై ఇటీవలే యూఎస్‌కు చెందిన ప్రముఖ రిటైల్ కంపెనీ ఒకటి ఇక్కడి పరిశ్రమను సంప్రదించిందని ప్లేగ్రో టాయ్స్ ప్రమోటర్, టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మను గుప్తా తెలిపారు. రూ.3,280 కోట్ల విలువైన రైడ్ ఆన్, ఔట్‌డోర్, మెకానికల్, ఎలక్ట్రికల్ టాయ్స్‌ను దిగుమతి చేసుకునేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. అలాగే ఇటలీ కంపెనీ సైతం ఆసక్తి చూపుతోందని వెల్లడించారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలతో భాగస్వామ్యానికి, ఆర్డర్లు పొందేందుకు ఇక్కడి కంపెనీలకు డీపీఐఐటీ తోడ్పాటు అందిస్తోందని వివరించారు. భారత కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు నైపుణ్యం మెరుగుపరిచేందుకు విదేశీ కంపెనీలు చేయి అందించనున్నాయని తెలిపారు. విదేశీ సంస్థలతో చేతులు కలిపేందుకు 82 భారతీయ కంపెనీలు అడుగు ముందుకు వేశాయన్నారు. ఎగుమతులు ఇలా.. భారత్ నుంచి 2022–23 ఏప్రిల్–డిసెంబర్ కాలంలో రూ.1,017 కోట్ల విలువైన ఆట వస్తువులు ఎగుమతి అయ్యాయి. 2021–22లో వీటి విలువ రూ.2,601 కోట్లు. 2013–14 ఏప్రిల్–డిసెంబర్లో ఇక్కడి నుంచి విదేశాలకు చేరిన బొమ్మల విలువ కేవలం రూ.167 కోట్లు మాత్రమే. విదేశాల నుంచి భారత్‌కు దిగుమతైన బొమ్మల విలువ 70 శాతం క్షీణించి 2021–22లో రూ.870 కోట్లుగా ఉంది. 20 శాతంగా ఉన్న దిగుమతి సుంకం 2020 ఫిబ్రవరిలో 60 శాతానికి చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దిగుమతి సుంకం 70 శాతం ఉంది. దిగుమతులను నిరుత్సాహపర్చడం, దేశీయంగా తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని బొమ్మల తయారీకి వర్తింపజేయాలని కేంద్రం భావిస్తోంది. -
కేంద్ర మంత్రి జైశంకర్ దౌత్యం.. చమురు దిగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డులు!
గత డిసెంబర్ నెలలో రష్యా నుంచి భారత్ చమరు దిగుమతులు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. అంతేకాదు వరుసగా భారత్‌కు చమురు దిగుమతి చేస్తున్న ప్రధాన తొలి దేశంగా రష్యా నిలిచింది. దేశాల మధ్య జరిగే ఎగుమతులు- దిగుమతుల్ని ట్రాక్ చేసే సంస్థ వోర్టెక్సా ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. తొలిసారి గతేడాది డిసెంబర్ నెలలో రోజుకు 1 మిలియన్ బ్యారెల్స్ రష్యా భారత్‌కు సరఫరా చేయగా.. ఆ మొత్తం 1.19 మిలియన్ బీపీడీ (బ్యారెల్స్ పర్ డే)కి చేరినట్లు తెలుస్తోంది. పెరిగిపోతున్న దిగుమతి రష్యా నుంచి భారత్‌కు క్రూడాయిల్ దిగుమతులు నెలనెలా పెరిగిపోతున్నట్లు వోర్టెక్సా హైలెట్ చేసింది. అక్టోబర్ నెల మొత్తంలో మాస్కో (రష్యా రాజధాని) నుంచి 935,556 క్రూడాయిల్ బ్యారెల్స్ దిగుమతి చేయగా..నవంబర్ నెలలో 909,403 క్రూడాయిల్ బ్యారెల్స్ ఉన్నాయి. కాగా, గతంలో భారత్‌కు రష్యా 2022 జూన్ నెలలో అత్యధికంగా 942,694 బీపీడీలు దిగుమతి చేసింది. టాప్‌లో రష్యా ఇతర దేశాల నుంచి భారత్ సముద్ర మార్గానా ఆయిల్ బ్యారెల్స్‌ను దిగుమతి చేసుకుంటుంది. అయితే రవాణాపై ఈయూ, అమెరికా దేశాలు పరిమితులు విధించాయి. దీంతో భారత్ రష్యా నుంచి భారీ ఎత్తున ఆయిల్ బ్యారెల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆయిల్ దిగుమతుల్లో మూడో స్థానం పెట్రోల్, డీజిల్ వినియోగంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. అవసరాల దృష్ట్యా భారత్ 85 శాతం ఇతర దేశాల నుంచి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. ఆ క్రూడాయిల్‌ను శుద్ది చేసి పెట్రోల్, డీజిల్‌గా మార్చి అమ్మకాలు జరుపుతుంది. ఇతర దేశాల నుంచి బ్యారెల్స్ దిగుమతులు ఇక రష్యాతో పాటు ఇతర దేశాల నుంచి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నట్లు వోర్టెక్సా పేర్కొంది. గత డిసెంబర్ నెలలో ఇరాక్ నుంచి 803,228 బ్యారెల్స్, సౌదీ అరేబియా నుంచి 718,357 బ్యారెల్స్‌ను దిగుమతి చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (uae) అమెరికాను అధిగమించి భారత్‌కు క్రూడాయిల్‌ను సరఫరా చేసే నాల్గవ అతిపెద్ద దేశంగా అవతరించింది. డిసెంబర్లో 323,811 బ్యారెల్ చమురును భారత్‌కు విక్రయించింది. కానీ యూఎస్ నుంచి భారత్‌కు సరఫరా అయ్యే క్రూడాయిల్ తగ్గుతుంది. నవంబర్‌లో 405,525 బ్యారెల్స్ ఉండగా డిసెంబర్లో 322,015 బ్యారెల్స్‌కు చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ఉక్రెయిన్‌పై రష్యా దాడిని పశ్చిమ దేశాలు వ్యతిరేకించాయి. మాస్కోతో వ్యాపార వ్యవహారాలకు దూరంగా ఉన్నాయి. భారత్ మాత్రం రష్యాతో సన్నిహితంగా ఉంటూ.. క్రూడాయిల్ దిగుమతుల్లో రికార్డులు నమోదు చేస్తోంది. ఉక్రెయిన్ దాడికి ముందు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు భారత్ మిడిల్ ఈస్ట్రన్ కంట్రీస్ నుంచి 60శాతం కంటే ఎక్కువగా క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోవగా, ఉత్తర అమెరికా నుంచి 14శాతం, పశ్చిమ ఆఫ్రికా నుంచి 12శాతం, లాటిన్ అమెరికా నుంచి 5శాతం, రష్యా నుంచి కేవలం 2శాతం మాత్రమే దిగుమతి చేసుకుంది.ఇప్పుడు రష్యా నుంచి దిగుమతులు చేసుకునే క్రూడాయిల్ బ్యారెళ్ల సంఖ్య రికార్డులు దాటుతున్నాయి. 60 డాలర్లు మాత్రమే జలమార్గాన సరఫరా అవుతున్న రష్యా చమురు ధరపై ఐరోపా సమాఖ్య పరిమితి విధించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కో బ్యారెల్ ధర ఇప్పుడు భారత్‌కు 60 డాలర్ల కంటే తక్కువకే దొరుకుతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి భారత్ దిగుమతుల్ని మరింత పెంచిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. జైశంకర్ దౌత్యం రష్యాకు భారత్ మద్దతు ఇచ్చే విషయంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ దౌత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఆ దేశంతో వ్యాపారం చేసేందుకు ఇతర దేశాలు వ్యతిరేకిస్తుంటే.. భారత్ మాత్రం గట్టిగా సమర్ధిస్తోంది. చమురు ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో అక్కడ నుంచి సరఫరా చేసుకోవాలని నిర్ణయించుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతుల వస్తున్న విమర్శల్ని జై శంకర్ తిప్పికొట్టారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. ‘దయచేసి అర్థం చేసుకోండి. ఇది మనం ఒక దేశం నుండి చమురును కొనుగోలు చేయడం మాత్రమే కాదు. ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తాం. కానీ భారతీయ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మనకు అనువైన దేశాలతో ఒప్పందం చేసుకోవడం సరైన విధానం. ఇప్పుడు మనం అదే చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. -
వంట నూనెల దిగుమతులు పెరిగాయ్
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతుల విలువ అక్టోబర్‌తో ముగిసిన సంవత్సరంలో రూ.1.57 లక్షల కోట్లకు చేరుకుంది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 34.18 శాతం అధికం కావడం గమనార్హం. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ప్రకారం.. విదేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయిన∙వంట నూనెల పరిమాణం 6.85 శాతం అధికమై 140.3 లక్షల టన్నులుగా ఉంది. 2020–21 నవంబర్–అక్టోబర్‌లో 131.3 లక్షల టన్నుల నూనెలు భారత్‌కు వచ్చి చేరాయి. వీటి విలువ రూ.1.17 లక్షల కోట్లు. 2021–22 నవంబర్–అక్టోబర్ కాలానికి పామ్ ఆయిల్ దిగుమతులు 4 లక్షల టన్నులు తగ్గి 79 లక్షల టన్నులుగా ఉంది. ధరల అధిక అస్థిరత ఈ తగ్గుదలకు కారణం. ఆర్బీడీ పామోలిన్ దాదాపు మూడింతలై 18.4 లక్షల టన్నులకు చేరింది. ముడి పామాయిల్ 20 శాతం క్షీణించి 59.94 లక్షల టన్నులు నమోదైంది. సాఫ్ట్ ఆయిల్స్ 48.12 లక్షల టన్నుల నుంచి 61.15 లక్షల టన్నులకు ఎగసింది. సాఫ్ట్ ఆయిల్స్‌లో సోయాబీన్ 28.66 లక్షల టన్నుల నుంచి 41.71 లక్షల టన్నులు, సన్‌ఫ్లవర్ స్వల్పంగా అధికమై 19.44 లక్షల టన్నులకు చేరింది. నవంబర్ 1 నాటికి దేశంలో 24.55 లక్షల టన్నుల వంట నూనెల నిల్వలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నెలకు 19 లక్షల టన్నుల నూనె వినియోగం అవుతోంది. ముడి పామాయిల్, ఆర్బీడీ పామోలిన్ అధికంగా ఇండోనేషియా, మలేషియా నుంచి సరఫరా అవుతోంది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
ఇక నెలకు ఒకసారే వాణిజ్య గణాంకాలు
న్యూఢిల్లీ: నెలవారీ ఎగుమతులు-దిగుమతుల గణాంకాలను నెలకు ఒకసారి మాత్రమే విడుదల చేసే విధానాన్ని తిరిగి ప్రారంభించాలని వాణిజ్యమంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు ఒక అధికారి తెలిపారు. దేశ వాణిజ్యం గురించి స్పష్టమైన చిత్రాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారి తెలిపారు. అక్టోబర్ 2020 నుంచి నెలకు రెండుసార్లు వాణిజ్య డేటా విడుదలవుతోంది. తొలి గణాంకాలు నెల మొదట్లో వెలువడితే, తుది గణాంకాలు నెల మధ్యన వెలువడుతున్నాయి. రెండు గణాంకాల భారీ వ్యత్యాసాలూ నమోదవుతున్నాయి. గడచిన మూడు నెలల్లో తొలుత క్షీణత నమోదుకావడం, తుది గణాంకాల్లో వృద్ధి ధోరణికి మారడం సంభవిస్తోంది. ఆయా అంశాల నేపథ్యంలో అస్పష్టత నివారణ, ఒకేసారి స్పష్టమైన తుది గణాంకాల విడుదల లక్ష్యంగా మంత్రిత్వశాఖ తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిప్రకారం రానున్న అక్టోబర్ గణాంకాలు నవంబర్ నెల మధ్యలో విడుదలవుతాయి. గడచిన మూడు నెలలూ ఇలా... తుది, తొలి గణాంకాల్లో భారత్ వస్తు వాణిజ్య లెక్కలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న పరిస్థితి కనబడుతోంది. వరుసగా మూడు నెలల్లో తొలి నిరాశాకరమైన గణాంకాలు తుది గణాంకాల్లో సానుకూలంగా మారాయి. గడచిన మూడు నెలలుగా పరిస్థితి చూస్తే, తాజా సమీక్షా నెల సెప్టెంబర్‌లో భారత్ ఎగుమతులు 4.82 శాతం పెరిగి 35.45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ నెల మొదటి వారంలో వెలువడిన తొలి గణాంకాల ప్రకారం భారత్ ఎగుమతులు సెప్టెంబర్‌లో 3.52 శాతం క్షీణించి 32.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జూలై, ఆగస్టు నెలల్లో ఎగుమతుల తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత వాటిని వృద్ధిబాటలోకి రావడం జరిగింది. -
రూ.1,476 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నారింజ పండ్ల ముసుగులో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు శనివారం ముంబైలో స్వాధీనం చేసుకున్నారు. 198 కిలోల స్పటిక మెథాంఫెటామైన్, 9 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఈ డ్రగ్స్ విలువ రూ.1,476 కోట్లు ఉంటుందని తెలిపారు. ముంబైలోని వసీ ప్రాంతంలో అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో నారింజ పండ్ల బాక్సుల్లో భద్రపర్చిన మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయని ప్రకటించారు. అక్రమార్కులు దక్షిణాఫ్రికా నుంచి నారింజ పండ్లను దిగుమతి చేసుకున్నట్లు కస్టమ్స్ అనుమతులు పొందారని అధికారులు గుర్తించారు. డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే దానిపై డీఆర్ఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. -
అమెరికా చెప్పినా వినలేదు.. అందుకే రూ.35వేల కోట్లు లాభం వచ్చింది!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ రష్యా వివాదం భారత్‌కు బాగానే కలిసొచ్చింది. యుద్ధ పరిణామాల కారణంగా రష్యా డిస్కౌంట్లతో కూడిన చమురును సరఫరా చేయడంతో భారత్ ఖజానాకు రూ.35వేల కోట్లు లాభం వచ్చింది. దేశీయ క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ విధించడంతో పాటు తగ్గింపుతో ముడి చమురు దిగుమతి చేసుకోవడం వల్ల ఈ మొత్తం సమకూరింది. ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ వివాదం తర్వాత ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం విండ్‌ఫాల్ పన్నును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఎవరు చెప్పినా వినలే.. అందుకే లాభం వచ్చింది! ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా పై అగ్రరాజ్యంతో పాటు యూరోప్ దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ సమస్యకు పరిష్యారంగా రష్యా భారత్‌తో తనకున్న సత్సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ముడి చమురుని భారీ డిస్కౌంట్లతో సరఫరా చేసింది. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా రష్యా నుంచి భారత అధికంగా ముడి చమురు దిగుమతి చేసుకుంది. మరో వైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయద్దని అగ్రరాజ్యంతో పాటు పలు అభివృద్ధి చెందిన దేశాల నుంచి భారత్‌కు విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా ముడి చమురును దిగుమతి చేసుకుంది. తద్వారా భారత్‌కు రూ.35వేల కోట్లు లాభాం చేకూరింది. యుద్ధానికి ముందుగా మన దేశ ఆయిల్ వాటాలో రష్యా వాటా 1 శాతం ఉండగా, ఇప్పుడది 12 శాతానికి చేరడం విశేషం. చదవండి: లక్కీ బాయ్.. 5 నిమిషాల వీడియో పంపి, రూ.38 లక్షల రివార్డ్ అందుకున్నాడు! -
డీజిల్ ఎగుమతిదారులకు కేంద్రం భారీ షాక్!
న్యూఢిల్లీ: డీజిల్ ఎగుమతిపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను ప్రభుత్వం గురువారం లీటరుకు రూ.5 నుంచి రూ. 7కు పెంచింది. అలాగే జెట్ ఇంధన (ఏటీఎఫ్) ఎగుమతులపై లీటరుకు రూ.2 పన్నును తిరిగి ప్రవేశపెట్టింది. కాగా, దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై పన్నును టన్నుకు రూ.17,750 నుంచి రూ.13,000కు తగ్గించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల ప్రారంభంలో ఏటీఎఫ్‌పై విడ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. మార్జిన్లు పెరిగిన నేపథ్యంలో ఎగుమతులపై ప్రభుత్వం పన్ను పెంచింది. అయితే అంతర్జాతీయ చమురు ధరలు ఆరు నెలల కనిష్టానికి పడిపోయినందున దేశీయంగా ఉత్పత్తయిన చమురుపై పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకుంది. -
.. కింద మేడిన్ చైనా అని వుంది..!
.. కింద మేడిన్ చైనా అని వుంది..! -
ప్లీజ్.. ఛాయ్ తాగడం తగ్గించండి: పాక్ మంత్రి
Pak import tea on loan: పాకిస్తాన్‌లోని ఆర్థిక వ్యవస్థ సంక్షోభం దిశగా వెళ్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలతో సతమతమవుతున్న పౌరులకు...పాక్ స్థానిక మంత్రి ఒకరు తాజాగా ఒక సలహ ఇచ్చారు. టీ వినియోగాన్ని తగ్గించాలని పాక్ మంత్రి ప్రజలను కోరారు. టీని కూడా అప్పుగా దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన ప్రజలను టీ తాగడం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. పాక్‌లో విదేశీ మారక నిల్వలు తగ్గడంతో.. దిగుమతుల బిల్లును తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నగదు కొరతతో సతమతమవుతున్న టీ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలను కోరాడు ఆయన. అదీగాక 2021-22 ఆర్థిక సంవత్సరంలో పాక్ సుమారు రూ.2 వేల కోట్ల టీని వినియోగించిందని తేలడంతో పాక్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ఈ విధంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో టీని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన పాక్ టీని దిగుమతి చేసుకోవడానికి కూడా అప్పులు చేయాల్సి వస్తుందని చెప్పారు. గతేడాది కంటే రూ. 4 వందల కోట్ల టీని పాక్ అధికంగా దిగుమతి చేసుకుందని తెలిపారు. ఐతే పాక్ మంత్రి చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ...నెటిజన్లు పాక్ ప్రభుత్వ తీరుని, ఆయన్ను విమర్శిస్తూ తమదైన శైలిలో చురకలు అట్టించారు. అంతేకాదు ఆయన గతంలో ఇంధనాన్ని ఆదా చేసేందుకు రాత్రి 8.30 గంటలకు మార్కెట్లను మూసివేయాలని వ్యాపారులను కోరినట్లు ప్రణాళిక మంత్రి తెలిపారు. పైగా ఇది పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి బిల్లును తగ్గించడానికి సహాయపడుతుందని ఇక్బాల్ అన్నారు. ఇటీవలే ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ కూడా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ శ్రీలంక ఆర్థిక వ్యవస్థలా మారిపోతుందంటూ హెచ్చరించారు. (చదవండి: వీడియో: దిగజారిపోతున్న పుతిన్ ఆరోగ్యం? వణికిపోతూ.. నిలబడలేక!) -
విదేశీ మారకద్రవ్యం పెంచేలా పరిశోధనలు
సాక్షి, అమరావతి: విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తుల సాగులో మరింత స్వయం సమృద్ధి సాధించాల్సిన ఆవశ్యకత ఉందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ (ఐఐపీఎం) డైరెక్టర్ రాకేష్ మోహన్‌జోషి అన్నారు. దిగుమతులను తగ్గించి, విదేశీ మారక ద్రవ్యం పెంచేందుకు ఎగుమతులను ప్రోత్సహించేలా పరిశోధనలు సాగాలన్నారు. గుంటూరు లాంలోని ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. మన దేశంలో నూటికి 60 శాతం మంది వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని, అదే అమెరికాలో 3–4 శాతం మంది, న్యూజిలాండ్‌లో 3–5 శాతం మంది మాత్రమే ఈ రంగంపై ఆధారపడ్డారని చెప్పారు. మన దేశ మార్కెట్లోకి వచ్చే ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల్లో మెజార్టీ వాటా అమెరికాదేనన్నారు. ఆర్బీకేల సేవలు అమోఘం ఏపీలో రైతు భరోసా కేంద్రాలు సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు అందించడంతో పాటు పరిశోధనా ఫలితాలు క్షేత్ర స్థాయిలో రైతులకు చేరవేసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని జోషి కొనియాడారు. ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీ ఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ పరిశోధనాలయాలు రైతుల పాలిట దేవాలయాలని పేర్కొన్నారు. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ టి. జానకిరామ్ తదితరులు మాట్లాడారు. -
దేశంలో విద్యుత్ సంక్షోభం..కోల్ ఇండియాకు కేంద్రం కీలక ఆదేశాలు!
న్యూఢిల్లీ: రానున్న కాలంలో విద్యుత్ రంగ యుటిలిటీలకు అవసరమయ్యే బొగ్గును దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉండవలసిందిగా ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రానున్న 13 నెలల్లో 12 మిలియన్ టన్నుల(ఎంటీ) కోకింగ్ కోల్‌ను దిగుమతి చేసుకోవలసి ఉంటుందంటూ సూచించింది. ఎంతమొత్తం బొగ్గు కాలవసిందీ వెల్లడించేందుకు రాష్ట్ర జెన్కోలు, స్వతంత్ర విద్యుదుత్పత్తి సంస్థలు శనివారం మధ్యాహ్నంవరకూ గడువును కోరినట్లు తెలుస్తోంది.తద్వారా కోల్ ఇండియా దిగుమతులకు ఆర్డర్లను పెట్టే వీలుంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి 2015 తదుపరి మహారత్న కంపెనీ కోల్ ఇండియా తిరిగి బొగ్గును దిగుమతి చేసుకోనుంది. కాగా..ఈ జులై నుంచి 2023 జులై మధ్య కాలంలో 12 ఎంటీ బొగ్గు దిగుమతులకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. బొగ్గు కొరత కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో విద్యుత్ కోతలకు తెరలేచిన విషయం విదితమే. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టే బాటలో ప్రభుత్వం బొగ్గు నిల్వలు సిద్ధం చేసేందుకు తగిన సన్నాహాలు చేపట్టినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. -
రూ.1.41 లక్షల కోట్ల ఎగుమతులు
న్యూఢిల్లీ: ఎగుమతులు మంచి వృద్ధిని చూస్తునాయి. ఏప్రిల్ మొదటి రెండు వారాల్లోనే 1 నుంచి 14వ తేదీ వరకు 18.79 బిలియన్ డాలర్ల విలువ మేర (సుమారు రూ.1.41 లక్షల కోట్లు) ఎగుమతులు జరిగాయి. పెట్రోలియం, ఆభరణాలు, రత్నాలు ఎగుమతుల వృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. గతేడాది ఏప్రిల్ 1–14 మధ్య ఎగుమతులు 13.72 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనించాలి. ఇక ఈ నెల 1–14 మధ్యకాలంలో దిగుమతులు 12 శాతం పెరిగి 25.84 బిలియన్ డాలర్లుగా (రూ.1.94 లక్షల కోట్లు) నమోదైనట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యాలయం విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2021–22లో మొత్తం ఎగుమతులు రికార్డు స్థాయిలో 420 బిలియన్ డాలర్లు. దిగుమతులు 612 బిలియన్ డాలర్లు. -
అమ్మో..బంగారం దిగుమతులు ఇన్ని లక్షల కోట్లా!
న్యూఢిల్లీ: దేశ బంగారం దిగుమతులు 2021–22 సంవత్సరంలో 33 శాతం పెరిగాయి. మొత్తం 46.14 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.45 లక్షల కోట్లు) విలువైన బంగారం (842 టన్నులు) దిగుమతి అయినట్టు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2020–21లో బంగారం దిగుమతుల విలువ 34.62 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం బంగారం దిగుమతులు పెరిగిపోవడంతో వాణిజ్యలోటు 192 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవ త్సరంలో 103 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. బంగారం వినియోగంలో చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా భారత్ ఉంది. రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 2021–22లో 50 శాతం పెరిగి 39 బిలియన్ డాలర్లకు చేరాయి. కరెంటు ఖాతా లోటు గత ఆర్థిక సంవత్సరానికి 23 బిలియన్ డాలర్లకు విస్తరించింది. ఇది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం జీడీపీలో 2.7 శాతానికి సమానం. -
అదానీ పోర్టు సరికొత్త రికార్డులు..ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ పోర్టుగా
దొండపర్తి (విశాఖ దక్షిణ): అదానీ పోర్టు సరికొత్త రికార్డును నమోదు చేసింది. కార్గో రవాణాలో 300 మిలియన్ మెట్రిక్ టన్నుల మైలురాయిని అధిగమించింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(ఏపీసెజ్)గా దేశ నౌకాశ్రయాల్లో రెండు దశాబ్దాల క్రితం కార్యకలాపాలను ప్రారంభించిన నాటి నుంచి గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తూ మార్కెట్ వాటాను పెంచుకుంటోంది. నిర్దిష్టమైన వ్యూహాలు, ప్రణాళికలతో కార్గో రవాణాలో వృద్ధిని నమోదు చేస్తుండడం అదానీ పోర్ట్స్ సామర్థ్యానికి నిదర్శనమని ఏపీసెజ్ సీఈఓ అండ్ హోల్‌టైమ్ డైరెక్టర్ కరణ్ అదానీ పేర్కొన్నారు. ఏటా 100 మిలియన్ మెట్రిక్ టన్నులు(పోర్ట్‌ఫోలియోలో 5 పోర్టులతో) సరకు రవాణా సాధించడానికి 14 ఏళ్లు పట్టిందని వెల్లడించారు. ఏపీసెజ్ తరువాత ఐదేళ్లలో దానిని రెట్టింపు చేసి ఏటా 200 మిలియన్ మెట్రిక్ టన్నులు (పోర్ట్‌ఫోలియోలో 9 పోర్టులతో) కార్గోను రవాణా చేసినట్లు తెలిపారు. ఇపుడు ఏపీసెజ్ పోర్ట్‌ఫోలియోలో 12 పోర్టులతో మూడేళ్లలోనే ఏటా 300 మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని అధిగమించిందని వివరించారు. కరోనా సమయంలోను, ప్రపంచ ఆర్థిక రంగం మందగమనంలో ఉన్నప్పటికీ ఈ ఘనతను సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. భారత తీరప్రాంతంలోని పోర్టుల నెట్‌వర్క్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ సామర్థ్యాల పెంపుతో పాటు సాంకేతికతతో కూడిన డిజిటలైజ్డ్ కార్యకలాపాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. 2025 నాటికి 500 మిలియన్ మెట్రిక్ టన్నుల లక్ష్యానికి చేరుకుంటామన్నారు. అలాగే 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ పోర్టు కంపెనీగా ఎదుగుతుందని చెప్పారు. అదానీ పవర్ పునర్వ్యవస్థీకరణ న్యూఢిల్లీ: పూర్తి అనుబంధ సంస్థలు ఆరింటిని విలీనం చేసుకునే పథకానికి బోర్డు ఆమోదముద్ర వేసినట్లు అదానీ పవర్ తాజాగా వెల్లడించింది. కంపెనీకి చెందిన విభిన్నతరహా సొంత అనుబంధ సంస్థలను విలీనం చేసుకోనున్నట్లు తెలియజేసింది. విలీనం చేసుకోనున్న సంస్థల జాబితాలో అదానీ పవర్ మహారాష్ట్ర, అదానీ పవర్ రాజస్తాన్, అదానీ పవర్ ముంద్రా, ఉడు పి పవర్ కార్పొరేషన్, రాయ్‌పూర్ ఎనర్జెన్, రాయ్‌గఢ్ ఎనర్జీ జనరేషన్ ఉన్నట్లు పేర్కొంది. ఈ పథకం అమలుకు 2021 అక్టోబర్ 1ను ఖరారు చేయగా.. ఆరు సంస్థల ఆస్తులు, అప్పులు అదానీ పవర్‌కు బదిలీకానున్నట్లు వివరించింది. -
మంత్రాలమర్రి చెప్పిన బియ్యం కథ!
పూర్వకాలంలో సేవాతత్పరత కలిగిన ఒక సంపన్నుడు ఉండేవాడట. ఆయన గుణగణాలు నచ్చిన ప్రజలు తమ అధినేతగా ఎంపిక చేసుకున్నారట. అదే సమయంలో అదే రాజ్యంలో ఒక పేద యువకుడు తీవ్రమైన ధనాశ, అధికార వ్యామోహంతో రగిలిపోతూ ఉండేవాడు. రాచబాటలో పయనిస్తే వాటిని సంపాదించడం అసాధ్యమని గట్టి నిర్ణయానికి వచ్చాడు. అడ్డదారులు తొక్కనారంభించాడు. తాంత్రిక విద్యల్ని, కనికట్టు శాస్త్రాన్ని నిష్ఠగా అభ్యసించాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసే నైపుణ్యం అలవడింది. తన ఇంద్రజాల ప్రదర్శనలతో అధినేత దృష్టిలో పడ్డాడు. కుతాంత్రిక విద్యా రహస్యం తెలియని సదరు అధినేత ఇంద్రజాలికుణ్ణి మెచ్చి తన కుమార్తెల్లో ఒకరినిచ్చి పెళ్ళి జరిపించాడు. ఆశబోతు యువకుడు ఇక ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. తంత్రాంగం మొదలుపెట్టాడు. ఒక మంత్రించిన మర్రి మొక్కను నాటించాడు. ఈ మర్రి చెట్టుకు భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పగలిగే దివ్యదృష్టి ఉందని చాటింపు వేయించాడు. ప్రజలకు ఏదైనా సందేశాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు మంత్రాల మర్రి ఒక ఆకును రాలుస్తుందనీ, ఆకు మీద ఉండే సందేశాన్ని అక్షరాలా పాటిస్తే ప్రజలకు పుణ్యం ప్రాప్తిస్తుందనీ, వచ్చే జన్మలో సుఖ సంతోషాలతో బతుకుతారనీ ప్రచారం చేయించాడు. ప్రజలు నెమ్మదిగా ఆకు కథల్ని నమ్మడం మొదలుపెట్టారు. జనం తన దారిలో పడ్డారన్న గురి కుదరగానే ఒక సంచలన హెచ్చరికతో కూడిన ఆకు రాలింది. అధినేతను తక్షణం గద్దె దింపి ఖైదు చేయాలనీ, లేకపోతే దేశానికి అరిష్టం దాపురిస్తుందనీ రాలిపడ్డ ఆకులో రాసి ఉంది. ఇంద్రజాలం తెలిసిన ఆయన అల్లుడిని గద్దెనెక్కిస్తే ప్రజలు భోగభాగ్యాలతో తులతూగుతారని కూడా సదరు మర్రి ఆకు జోస్యం చెప్పింది. జనం కొంత కలవరపడ్డారు. వెర్రి వెంగళప్ప లయిన అధినేత సంతానం మాత్రం బావగారి వశీకరణ మంత్రానికి దాసోహమన్నారు. వారే ముందుండి తండ్రిని ఖైదు చేయించి, బావను కుర్చీలో కూర్చోబెట్టారు. మంత్రాల మర్రి ఆకు రాతల సాయంతో చాలాకాలంపాటు ఇంద్రజాలికుడు పెత్తనం చలాయించాడు. కొన్నాళ్లకు బండారం బయటపడి జనం బడితె పూజ చేసి దేశ బహిష్కారం చేశారట! వాస్తవాలను పోలిన కథలున్నట్టే కథల్ని పోలిన వాస్తవాలు కూడా ఉంటాయి. వర్తమాన ఆంధ్ర రాజకీయాలకు ఈ కథకు చాలా దగ్గరి పోలికలుంటాయి. మంత్రాల మర్రి కాన్సెప్టుకు అచ్చు గుద్దినట్టు సరిపోయే మీడియా మాత్రం పలు చానెళ్లు, పత్రికలు, సోషల్ విభాగాలతో ఊడలు దిగి విస్తరించి ఉంది. గిట్టనివాళ్లు దీన్ని ‘ఎల్లో మీడియా’ అని విమర్శిస్తుంటారు. కథలోని ఇంద్రజాలికుడి అభీష్టం మేరకు మంత్రాల మర్రి ఆకులు రాల్చినట్టే చంద్రబాబు ప్రయోజనాల కోసం ఈ మంత్రాల మర్రి మీడియా కూడా పనిచేస్తున్నది. మిగిలిన విషయాల్లో పోలికలు ఉన్నాయో లేదో తెలియదు గానీ, ఆ మంత్రాల మర్రి – ఈ మీడియా మంత్రాల మర్రి మధ్య, వాటి స్వామిభక్తి పరాయణతల మధ్య మాత్రం స్పష్టమైన పోలికలున్నాయి. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడు మరో కోణంలో ఆకు కథల్ని రాల్చడం ఈ మంత్రాల మర్రి ప్రత్యేకత. దీంతోపాటు చంద్రబాబుకు మరికొన్ని అదనపు సౌలభ్యా లున్నాయి. తన సొంత పార్టీ కాకుండా ఇతర పార్టీల్లో కూడా ఆయనకు కొందరు అద్దె ‘మైకు టైసన్’లున్నారు. బాబు క్యాంపు నుంచి సిగ్నల్ అందిన వెంటనే బాబు ప్రత్యర్థి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్‌గా వ్రాయించి ఇచ్చిన పంచ్ డైలాగ్‌లను చదివేస్తారు. స్వయంగా చంద్రబాబు లేదా ఆయన పార్టీవారు రోజుకు రెండో మూడో పంచ్‌లు విసురుతారు. ఆ పంచ్‌లు పాచిపోయే దాకా మీడియా మంత్రాల మర్రి వాటిని ప్రతిధ్వనింపజేస్తుంది. స్వయంగా మంత్రాలమర్రి ఊడ్చు కొచ్చిన స్వీయరచనలు ఈ పంచ్‌లకు అదనం. ముప్పేట దాడి వ్యూహంతో ఎల్లో మీడియా రాల్చుతున్న ఆకు కథనాలు వారానికి డజన్ దాటుతున్నాయి. ఆకు కథల్లో ఏముంది? దాని అసలు సంగతేమిటి? అని శోధించి చూసి నప్పుడు దిగ్భ్రాంతికి లోనవుతాము. సమాచార విప్లవ విస్ఫోటనం తర్వాత కూడా ఈ మంత్రాల మర్రి కథలు ఎలా రాజ్యం చేయగలుగుతున్నాయని కలవరం కలుగుతుంది. తాంత్రిక సేద్యంతో పెరిగి పెద్దదైన ఈ వృక్షం సమాజంలోకి తంత్రాంగాన్నే ప్రాణవాయువుగా విడుదల చేస్తూ, నాగరిక జీవనంలో కాలుష్యానికి కారణమవుతున్నది. ఈ వారం రోజుల్లోనే ఒక డజన్‌కు పైగా కాలుష్యకారక కథనాలను మంత్రాలమర్రి మీడియా విడుదల చేసింది. అందులో మచ్చుకు ఒక ఆకు కథనాన్ని, దాని అసలు విషయాన్ని పోల్చి చూద్దాం. మతులు పోగొట్టే ఒక మాయా ప్రపంచపు గుట్టుమట్లు కొద్ది కొద్దిగానైనా అర్థమవుతాయి. ఒక ఆకు కథ: కాకినాడ బియ్యం కాకినాడ రేవు నుంచి 2020–21 సంవత్సరంలో 30 లక్షల టన్నుల (గ్రాండ్‌గా ఉండేందుకు 3 కోట్ల క్వింటాళ్లని రాశారు) బియ్యాన్ని ఎగుమతి చేశారు. రాష్ట్రంలో బియ్యం ధర కేజీ 40 రూపాయలు వుంటే 25 రూపాయల చొప్పునే ఎగుమతి చేశారు. స్థానిక వినియోగదారులను మోసగిస్తూ తక్కువ ధరకే ఎగుమతి చేయడం ఎలా సాధ్యమైంది! కేవలం రెండే రెండు కారణాల వల్ల ఇది సాధ్యమవుతుంది. ఒకటి: పేదల సబ్సిడీ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి దారి మళ్లించే స్కామ్ ద్వారా ఎగుమతి చేసి ఉండాలి. రెండు: రైతులకు మద్దతు ధర ఎగవేసి ఉండాలి. ఎందుకంటే 1,900 రూపాయల చొప్పున మద్దతు ధర చెల్లిస్తే 25 రూపాయలకు కిలో వర్కవుట్ కాదు. ఆ ధరకు ఎగుమతి చేయాలంటే రైతులకు ధాన్యం ధర మద్దతు కంటే తక్కువగా రూ.1,400 మాత్రమే చెల్లించి ఉండాలి. ఈ రకంగా పండించిన రైతుకూ, వినియోగదారునికీ, సబ్సిడీ బియ్యం అందవలసిన పేదవారికీ అన్యాయం జరిగింది. చదివితే స్క్రీన్‌ప్లే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కాని మూలకథకూ, స్క్రీన్‌ప్లేకూ ఎటు వంటి సంబంధం లేకపోవడమే ఇక్కడ విశేషం. అసలు కథ: ఇక్కడ స్క్రీన్‌ప్లే రచయిత నిర్ధారణ చేసుకోవలసిన కొన్ని ప్రాథమిక విషయాలను గాలికొదిలేశారు. 1. కాకినాడ నుంచి ఎగుమతి అయ్యే బియ్యం మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే సేకరించారా? 2. ఎన్ని రాష్ట్రాల నుంచి ఎగుమతి బియ్యం కాకినాడ రేవుకు వస్తుంది? 3. మొత్తం ఎగుమతిలో ఏపీ బియ్యం వాటా ఎంత శాతం? 4. ఇందులో ఏపీ ఎగుమతి దారులు స్వరాష్ట్రం నుంచి సేకరించినదెంత – ఇతర రాష్ట్రాల నుంచి సేకరించినదెంత? 5. ఏరకమైన లేదా ఎన్నిరకాల బియ్యాన్ని కాకినాడ రేవు ఎగుమతి చేస్తున్నది. 6. అందులో మన రాష్ట్ర ప్రజలు వినియోగించే రకాలు ఉన్నాయా? 7. ఆ సంవత్సరంలో ప్రభుత్వం మద్దతు ధరకు సేకరించిన బియ్యం పరిమాణమెంత? 8. మద్దతు ధర కంటే ఎక్కువకు రైస్ మిల్లర్లు సేకరించినదెంత? 9. రైతులే నేరుగా అధిక ధరకు ఇతర రాష్ట్రా లకు పంపించింది ఎంత? కాకినాడ పోర్టులో గానీ, బియ్యం ఎగుమతిదారుల సంఘం దగ్గర గానీ, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ దగ్గర గానీ ఈ వివరాలన్నీ దొరుకుతాయి. కానీ, ఆ వివరాల సేకరణ కోసం స్క్రీన్‌ప్లే రచయిత ప్రయత్నించలేదని ఈ కథనం చూసిన తర్వాత భావించవలసి వస్తున్నది. కాకినాడ నుంచి 2020–21 సంవత్సరం 30 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసిన మాట వాస్తవం. ఇందులో ఉప్పుడు బియ్యం, నూక బియ్యం కలిపి 80 శాతం వాటా. మార్కెట్లో 40 రూపాయలకు దొరికే బియ్యాన్ని 25 రూపాయలకే ఎలా ఎగుమతి చేసేవారన్న ప్రశ్నకు జవాబు ఇక్కడ దొరుకుతుంది. ఉప్పుడు బియ్యాన్ని, నూక బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ వినియోగ దారులు ఉపయోగించరు. ఇంతకంటే తక్కువ ధరకే బయట రాష్ట్రాల్లో సేకరించి ఎగుమతి చేస్తున్నారు. నూక బియ్యం, ఉప్పుడు బియ్యం పోను కాకినాడ నుంచి ఎగుమతి అయ్యే పచ్చిబియ్యం మొత్తం కూడా పొడుగు బియ్యమే. పొడుగు బియ్యాన్ని ఆంధ్ర రైతులు పండించరు. కనుక ఎగుమతి చేసిన ఉప్పుడు బియ్యం, నూక బియ్యం, పొడుగు రకం పచ్చి బియ్యాల్లో ఏ రకం కూడా ఆంధ్రప్రదేశ్‌లో సేకరించినవి కావు. కాకినాడ నుంచి ఎగుమతి చేసే బియ్యం 80 శాతాన్ని ఇతర రాష్ట్రాల ఎగుమతిదారులే చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఎగుమతిదారులు సేకరించే మిగిలిన 20 శాతం బియ్యంలో తొంభై శాతాన్ని బెంగాల్, ఒడిషా, బిహార్ రాష్ట్రాల నుంచి సేకరిస్తున్నారు. ఈ లెక్క ప్రకారం 2020–21లో కాకినాడ పోర్టు ఎగుమతి చేసిన 30 లక్షల టన్నుల బియ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎగుమతి దారులు సేకరించింది (20 శాతం) 6 లక్షల టన్నులు. ఇందులో ఇతర రాష్ట్రాల్లో సేకరించింది (90 శాతం) 5 లక్షల 40 వేల టన్నులు. ఇక మిగిలింది 60 వేల టన్నులు. అంటే మొత్తం ఎగుమతిలో రెండు శాతం! హతవిధీ! ఈ రెండు శాతం ఎంత పని చేసింది? మంత్రాల మర్రి కథనం ప్రకారం రైతుల గిట్టుబాటు ధరలో క్వింటాల్ 500 రూపాయలను కొల్లగొట్టింది ఈ రెండు శాతమే. వినియోగదారులకు మార్కెట్లో 25 రూపాయలకు కిలో బియ్యం దొరక్కుండా చేసింది ఈ రెండు శాతమే. సబ్సిడీ బియ్యాన్ని అందుకునే నిరు పేదల కడుపు కొట్టింది కూడా ఈ రెండు శాతమేనని ఈ కథనం సారాంశం. ఈ లెక్కలన్నీ బియ్యం ఎగుమతిదారుల సంఘం వారు విడుదల చేసినవే. ఆంధ్రప్రదేశ్ రైతులు 2020–21లో 1 కోటి 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని సాధించారు. ఇందులో 82 లక్షల 68 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు సేకరించింది. మేలురకం ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లర్లే మద్దతు ధరకంటే ఎక్కువకు రైతుల నుంచి కొనుగోలు చేశారు. మిగిలిన ధాన్యాన్ని రైతులు కుటుంబ అవసరాల కోసం తమవద్దే ఉంచుకున్నారు. ఇదీ లెక్క. మరి మంత్రాల మర్రిచెట్టు చెప్పిన 30 లక్షల టన్నుల బియ్యం లెక్క ఎక్కడిదో విజ్ఞులు ఆలోచించాలి. ఈ వారం రోజుల్లో మంత్రాల మర్రి రాల్చిన ఆకు కథలన్నీ ఇటువంటి మాయ కథలే. సినిమారంగ సమస్యలపై చర్చించ డానికి కొందరు హీరోలు, దర్శకులు ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంపై కూడా చంద్రబాబు అసంగతమైన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి సినీ ప్రముఖులను అవమా నించారని ఈయన ఆవేశం వెళ్లగక్కారు. ఆయన ఆవేశానికి మంత్రాల మర్రి సుడిగాలినిచ్చి ఎగదోసింది. ముఖ్యమంత్రిని గురించి ఆయనను కలిసిన తర్వాత ఆ సినీప్రముఖులు ఏమని చెప్పారనే ఇంగితాన్ని వదిలేశారు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వం మీద చినజీయర్ స్వామి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఈ తరహా ప్రచారానికి చెంపపెట్టు లాంటివి. ప్రత్యేక హోదా ఎపిసోడ్ నిజానికి చంద్రబాబు కూటమి సిగ్గుతో తలదించుకోవలసిన విషయం. సాంకేతికంగా రెండు రాష్ట్రాల మధ్య జరిగే చర్చల ఎజెండా నుంచి రాష్ట్రానికే ప్రత్యేకమైన అంశాలను తొలగించి ఉండవచ్చు. కానీ, చంద్రబాబు స్వహస్తాలతో ఖననం చేసిన అంశానికి వైఎస్ జగన్ తిరిగి ప్రాణం పోసి నిలబెట్టారని ఈ ఎపిసోడ్ నిరూపించింది. కానీ మన మంత్రాల మర్రి దీన్ని జగన్ ప్రభుత్వ వైఫల్యంగా ప్రచారం చేయడానికి నానాపాట్లు పడింది. గౌతమ్ సవాంగ్ వ్యవహారం ఇలాంటిదే. చంద్రబాబు హయాంలో ఒక డీజీపీ సగటున 15 నెలలు పనిచేశారు. 30 నెలల తర్వాత సవాంగ్‌ను మార్చడం మంత్రాల మర్రికి విడ్డూరంగా తోచింది. ఉద్యోగుల సంఘ నాయకుడిగా ఉన్న అశోక్‌బాబు తన సర్వీస్ రిజిస్టర్‌ను ట్యాంపర్ చేసి లేని విద్యార్హతలను చేర్చుకున్నారు. నేరం బయటపడడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. దొంగతనం చేస్తే మాత్రం అరెస్టు చేస్తారా? ఇది వేధింపు కాదా అని ప్రతిపక్షం ఎదురుదాడికి దిగింది. నిజంగానే జగన్ ప్రభుత్వం తన వ్యతిరేకులను వేధిస్తున్నదని మంత్రాల మర్రి చర్చాగోష్ఠులు నడిపింది. ఒక్క వారంలో ఇన్ని వక్రీకరణలకు పాల్పడిన మంత్రాల మర్రి కథల పట్ల జనం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కీలక చట్టంపై బైడెన్ సంతకం.. చైనాకు చుక్కలే!
Joe Biden Signed Uyghurs Rights Protection Bill To Check China Atrocities: కీలకంగా భావించిన ఉయిగర్ చట్టంపై ఎట్టకేలకు అగ్రరాజ్యం అధినేత రాజముద్ర పడింది. చైనాను ఇరకాటంలో పడేసే ‘ఉయిగుర్ ఫోర్స్డ్ లేబర్ ప్రివెన్షన్ యాక్ట్’(బలవంతపు కార్మిక నిరోధక చట్టం) మీద గురువారం అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. అనంతరం ఆయన ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ద్వైపాక్షిక ఒప్పందం మీద సంతకం చేశా. కేవలం షిన్జియాంగ్ మాత్రమే కాదు.. చైనాలోని మిగతా ప్రాంతాలకు కూడా ఇది వర్తిస్తుంది. చైనా ప్రతీ మూల నుంచి వచ్చేవి బలవంతపు చాకిరీ ఉత్పత్తులు కావని నిర్ధారించుకునేందుకు మా వద్ద (అమెరికా ప్రభుత్వం) ఉన్న ప్రతీ సాధనాన్ని ఉపయోగించుకుంటాం’’ అంటూ ఉయిగర్ల చట్టాన్ని బలంగా అమలు చేసే ఉద్దేశాన్ని అధ్యక్షుడు జో బైడెన్ ట్విటర్ వేదికగా వినిపించారు. Today, I signed the bipartisan Uyghur Forced Labor Prevention Act. The United States will continue to use every tool at our disposal to ensure supply chains are free from the use of forced labor — including from Xinjiang and other parts of China. pic.twitter.com/kd4fk2CvmJ — President Biden (@POTUS) December 23, 2021 ఇదిలా ఉంటే చైనా పశ్చిమ ప్రాంతంలో పదిలక్షల మైనార్టీ వర్గపు జనాభాపై మానవ హక్కుల ఉల్లంఘన జరగుతోందని, వెట్టిచాకిరీ చేయించుకుంటోందని చైనా మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అయితే ఈ వ్యవహారంలో చైనా మీద మొదటి నుంచే కొరడా ఝళిపిస్తోంది. ఈ క్రమంలో షిన్జియాంగ్ నుంచి తమ దేశానికి అన్ని దిగుమతులను నిషేధిస్తూ ఓ బిల్లు తీసుకొచ్చింది. బిల్లుకు సెనేట్ గత గురువారమే ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేయగా.. చివరి పేరాలో అభ్యంతరాల మేరకు మరో వారం ఆమోద ముద్ర వాయిదాపడింది. దీంతో ఆ అభ్యంతరాలపై క్లియరెన్స్ అనంతరం.. గురువారం (డిసెంబర్ 23న) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేయడంతో చట్టం అమలులోకి వచ్చింది. Uyghur Forced Labor Prevention Act ప్రకారం.. బలవంతపు చాకిరీ లేకుండానే తయారుచేశామని నిరూపించగలిగిన ఉత్పత్తులను మాత్రమే ఇకపై అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇది నిరూపించుకోవాలంటే షిన్జియాంగ్ ప్రావిన్స్‌లోకి అమెరికా ప్రతినిధుల్ని, అంతర్జాతీయ జర్నలిస్టులు తప్పనిసరిగా అనుమతించాల్సి ఉంటుంది. అదే జరిగితే అక్కడ జరిగే అకృత్యాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇలా వర్తకవాణిజ్యాన్ని ముడిపెట్టి.. చైనా బండారం బయటపెట్టాలన్నదే బైడెన్ ప్రభుత్వం వేసిన స్కెచ్. ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. కేవలం షిన్జియాంగ్ను మాత్రమే తొలుత చట్టంలో చేర్చిన అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్).. ఆపై మిగతా ప్రావిన్స్‌లకు సైతం ఈ చట్టాన్ని అన్వయింపజేయడం. ఇదిలా ఉంటే వర్తకవాణిజ్యాల పరంగా అమెరికాకు వచ్చే వీలైనన్నీ దారులను చైనాకు మూసేస్తోంది బైడెన్ ప్రభుత్వం. బొమ్మలపై విషపు రసాయనాల పూత ఉంటోందని ఆరోపిస్తూ.. మేడ్ ఇన్ చైనా బొమ్మలను అమెరికాలో అడుగు పెట్టనివ్వట్లేదు. ఇక ఉయిగర్లపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ.. ఆ దేశ బయోటెక్, నిఘా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు.. ఇలా ఒక్కోదానిపై ఆంక్షలు విధిస్తూ పోతోంది. ఇక అమెరికా వైపు నుంచి కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందకుండా.. చైనాకు ఎలాంటి ఉత్పత్తులను విక్రయించడానికి వీల్లేదని ఆదేశాలు అమలు చేస్తోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా.. అమెరికాతో వర్తకం ద్వారా భారీ ఆదాయం వెనకేసుకుంటోంది. అయితే కరోనా పరిణామాల అనంతరం ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం బెడిసికొడుతోంది. ఈ క్రమంలో చైనాను దూరం పెడుతూ.. క్రమంగా భారత్ సహా ఇతర ఆసియా దేశాలకు దగ్గర అవుతోంది అమెరికా. సంబంధిత వార్త: డ్రాగన్‌కు దెబ్బలు.. షిన్జియాంగ్ మీదే ఫోకస్ -
భారత్ కొంప ముంచేలా చైనా నిర్ణయం!
ఇండియన్ ఈవీ ఆటోమేకర్స్ ఆశలపై నీళ్లు జల్లేలా చైనా ప్రవర్తిస్తోంది. కరోనా వల్ల చిప్ ఫ్యాక్టరీలు మూతపడి.. క్రానిక్ చిప్ షార్టేజ్ ఏర్పడి 2021లో ఫ్యూయల్ బేస్డ్ కార్ల ఉత్పత్తి తగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఉత్పత్తికీ విఘాతం కలిగించే చేష్టలకు పాల్పడుతోంది డ్రాగన్ కంట్రీ. లిథియం-ఇయాన్ బ్యాటరీల సరఫరాను భారత్‌కు గణనీయంగా తగ్గించేయడంతో ఈవీ మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. సౌత్ కొరియా, తైవాన్లతో పాటుగా చైనా లిథియమ్-ఇయాన్ సెల్స్‌ను భారత్‌కు సప్లై చేస్తోంది. ఈ మూడు దేశాల్లో చైనా వాటానే అధికంగా(60 శాతంపైనే?!) ఉంది. కానీ, చైనా ఇప్పుడు భారత్ మార్కెట్ కంటే యూరప్, అమెరికాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో మనకు సప్లై తగ్గిపోయి.. అటువైపు సప్లై పెరిగింది. అక్కడి మార్కెట్లలో లిథియమ్-ఇయాన్ బ్యాటరీలకు భారీ డిమాండ్ ఉండడం, భారత్‌తో పోలిస్తే అధిక చెల్లింపులు చేస్తుండడమే అందుకు కారణం. ఈ ప్రభావం భారత్ ఈవీ మార్కెట్‌పై పడనుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలకు తోడు అప్డేషన్లో భాగంగా ఈవీ వెహికిల్స్‌కు భారత్‌లో డిమాండ్ ఊపందుకుంది. దీంతో ఈవీ మేకింగ్ రంగంలోకి అడుగుపెడుతున్నాయి చాలా కంపెనీలు. ఇక ఇప్పటికే కొన్ని కంపెనీలు ఉత్పత్తిని సైతం ప్రారంభించగా, మరికొన్ని ప్రయత్నాల్ని ముమ్మరం చేశాయి. ఈ తరుణంలో భారత్‌కు కాకుండా చైనా యూఎస్, యూరప్ బేస్డ్ దేశాలకు బ్యాటరీలను తరలించడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు కొందరు ఈవీ మేకర్స్ వెనకడుగు వేసే ఆలోచన చేస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. భారత్ పూర్తిగా లిథియమ్-ఇయాన్ బ్యాటరీల కోసం దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. 2021 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 9 వేల కోట్ల విలువ చేసే లిథియం-ఇయాన్ సెల్స్ దిగుమతులను తెప్పించుకుంది. ఈ సెల్స్‌ను చేర్చి.. బ్యాటరీ ప్యాక్స్‌గా మార్చేసి ఈవీలలో ఉపయోగిస్తారు. కానీ, బ్యాటరీ గ్రేడ్ లిథియం కార్బొనేట్ ధర రెండువారాల్లోనే 27 శాతం పెరిగి.. గరిష్ట ధరకు చేరుకుంది. మెటీరియల్ ధరలు పెరగడం, మరోవైపు సేకరణ.. నిల్వ.. రవాణాల ఖర్చు కారణంగా సెల్స్ ధరల్ని పెంచుతున్నాయి ఉత్పత్తి కంపెనీలు. ఈ తరుణంలో ఫుల్‌డిమాండ్ ఉన్న యూరప్, యూఎస్లకే సప్లైకి మొగ్గు చూపిస్తోంది చైనా. ఇంకోవైపు షిప్పింగ్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కిందటి ఏడాదితో పోలిస్తే.. నాలుగు రెట్లు పెంచేసింది చైనా. ఈ పరిస్థితుల్లో గత్యంతరం లేక గగనతలం నుంచి తెప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నష్టాన్ని ఓర్చుకుని అయినా సరే బ్యాటరీలను తెప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్ని భారత కంపెనీలు. అయినప్పటికీ షిప్మెంట్ మాత్రం 10-15రోజుల ఆలస్యంగా చేరుతున్నాయట. ఇందుకు కారణం.. మెజార్టీ షిప్‌లు యూఎస్, యూరప్‌లకు తరలిపోతుండడమే. ఇక ఆ జాప్యం ప్రభావం ఉత్పత్తిపైనా పడుతోంది. ఈవీ మేకర్స్‌కు ఇదంతా అదనపు భారం కానుంది. దీంతో బ్యాటరీ ధరల్ని పెంచాల్సిన పరిస్థితి ఎదురవుతుండగా.. వినియోగదారులపైనా భారం పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బ్యాటరీ ధరల్ని ఐదు శాతం పెంచే నిర్ణయం తీసుకుంది ట్రోంటెక్ ఎలక్ట్రానిక్స్. సెప్టెంబర్‌లో తమ కంపెనీ ఉత్పత్తి 50 శాతం తగ్గిండమే అందుకు కారణమని చెప్తున్నారు ట్రోంటెక్ ఎలక్ట్రానిక్స్ సీఈవో సమరథ్ కొచ్చర్. ఇక ఫోన్ చేసిన ప్రతీసారి చైనా కంపెనీలు ధరలు పెంచేస్తున్నాయని వాపోతున్నారు వన్ ఎలక్ట్రిక్ సీఈవో గౌరవ్ ఉప్పల్. అమెరికా, యూరప్ మార్కెట్‌కు తరలిపోకుండా.. కన్సార్టియం(గుత్తగంప ఆర్డర్లు) ద్వారానే మన మార్కెట్ మీద చైనాకు ఆసక్తి సృష్టించవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గౌరవ్. ఇదికాకుండా చైనా మనకు సృష్టిస్తున్న కొరత తీరాలంటే.. ఇతర దేశాల నుంచి బ్యాటరీలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ, చైనా బాటలోనే అవి కూడా యూరప్, అమెరికా మార్కెట్ మీదే దృష్టి పెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అదనపు సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యం పెరిగితేగానీ ఈ లోటు తీరే పరిస్థితి కనిపించడం లేదు. అందుకు 15 నుంచి 24 నెలలు పట్టే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోనీ భారీ ఖర్చుతో స్థానిక ఉత్పత్తి మొదలుపెట్టినా.. పూర్తిస్థాయి లోటు తీరడానికి ఐదేళ్లు పట్టొచ్చనేది ఓ అంచనా. లిథియమ్-ఇయాన్ దిగుమతి విషయంలో పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన ప్రకటన.. రాబోయే కాలంలో ఈవీ మార్కెట్ ఎదుర్కొనే గడ్డు పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. చదవండి: చైనా బొమ్మల్లో ‘విషం’.. అమెరికా అలర్ట్! -
గుడ్‌న్యూస్: కేంద్రం నిర్ణయంతో.. తగ్గిన వంట నూనెల ధరలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరలు పెరిగినప్పటికీ భారత్‌లో మాత్రం తగ్గముఖం పట్టడం విశేషం. దిగుమతి పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. అంతర్జాతీయంగా ధరలు 1.95 శాతం నుంచి 7.17 శాతం దాకా ఎగబాకాయి. మనదేశంలో ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించాక ధరలు 3.26 శాతం నుంచి 8.58 శాతం వరకూ పడిపోయాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించింది. అంతర్జాతీయ మార్కెట్లో గత నెల రోజుల్లో సోయాబీన్ నూనె, పొద్దుతిరుగుడు నూనె, ముడి పామాయిల్, ఆర్బీడీ పామోలీన్ ధరలు వరుసగా 1.85 శాతం, 3.15, 8.44, 10.92 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయా నూనెల ధరలు భారత్‌లో సెప్టెంబర్ 11 నుంచి ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడంతో భారీగా తగ్గాయి. పెరిగిన పప్పుల ధరలు భారత్‌లో గత ఏడాది కాలంగా గోధుమల ధరలు సైతం నేల చూపులు చూస్తున్నాయి. హోల్‌సేల్, రిటైల్ ధరలు వరుసగా 5.39 శాతం, 3.56 శాతం తగ్గాయి. గత నెల రోజుల్లో బియ్యం ధరలు హోల్‌సేల్ మార్కెట్లో 0.07 శాతం తగ్గగా రిటైల్ మార్కెట్లో మాత్రం 1.26 శాతం పెరగడం గమనార్హం. ధాన్యం, గోధుమలకు కనీస మద్దతు ధరలను(ఎంఎస్పీ) కేంద్ర ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. ధాన్యం ధర క్వింటాల్‌కు రూ.1,940, గోధుమల ధర క్వింటాల్‌కు రూ.1,975గా నిర్ధారించింది. అయినప్పటికీ దేశీయంగా బియ్యం, గోధుమల ధరలు తగ్గడం వినియోగదారులకు ఊరట కలిగించే పరిణామమే. అదే సమయంలో కొన్ని పప్పు ధాన్యాల ధరలు పెరిగాయి. బంగాళాదుంపల ధర గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా సగటున 44.77 శాతం తగ్గింది. ఉల్లిపాయలు, టమోటా ధరలు సైతం తగ్గాయి. ఉల్లిపాయల ధర సగటున 17.09 శాతం, టమోటాల ధర సగటున 22.83 శాతం తగ్గినట్లు తేటతెల్లమవుతోంది. -
గంగవరం పోర్టు రికార్డ్!
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరుకు రావాణాలో ఆంధ్రప్రదేశ్‌లోని గంగవరం పోర్ట్ కొత్త రికార్డులను నమోదు చేసింది. మొబైల్ హార్బర్ క్రేన్స్‌ను ఉపయోగించి 24 గంటల వ్యవధిలో ఏకంగా 26,885 మెట్రిక్ టన్నుల ఎరువులను పోర్ట్ స్వీకరించింది. గతంలో ఈ రికార్డు కింద 16,690 టన్నులు మాత్రమే నమోదైంది. 64,575 మెట్రిక్ టన్నుల యూరియాను అందుకుంది. 24 గంటల్లో 23,500 మెట్రిక్ టన్నుల దుక్క ఇనుము, 46,700 మెట్రిక్ టన్నుల ఇనుము ధాతువు గుళికలు పోర్ట్ నుంచి సరఫరా అయింది. ఆగస్ట్ నెలలో కన్వేయర్స్ ద్వారా వైజాగ్ స్టీల్‌కు 6,08,706 మెట్రిక్ టన్నుల బొగ్గు రవాణా చేశారు. నౌకాశ్రయం అత్యున్నత మౌలిక సదుపాయాలు, కార్యాచరణ సామర్థ్యానికి ఇది నిదర్శనమని గంగవరం పోర్ట్ ఈడీ జి.జె.రావు తెలిపారు. చదవండి : HUL Price Hike: ఇక ఇప్పుడు సబ్బులు, డిటర్జెంట్ల వంతు -
Afghanistan Crisis: భారీగా పెరిగిన డ్రైఫ్రూట్స్ ధరలు
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. చాలామంది పౌష్టికాహారంగా డ్రైఫ్రూట్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వీటికి గిరాకీ పెరిగింది. డ్రైఫ్రూట్స్‌లో బాదం, అంజీర, మనక్క, పిస్తా, ఆలూబుకార, ఖుర్బానీ..వంటివి అఫ్గానిస్తాన్ దేశం నుంచే మనకు దిగుమతి అవుతాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. అక్కడ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా వీటి రవాణా నిలిచిందని తద్వారా ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. రూ.50 నుంచి రూ.200 వరకు... అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల రాకతో అక్కడి వారి మాటేమో గానీ, అక్కడి నుంచి మన దేశానికి దిగుమతి అయ్యే డ్రైఫ్రూట్స్ ధరలపై మాత్రం ప్రభావం పడిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మనకు పెద్దమొత్తంలో డ్రైఫ్రూట్స్ అక్కడి నుంచే దిగుమతి అవుతాయి. ముందుగా ఢిల్లీ, ముంబయి, తదితర ప్రాంతాలకు వస్తాయి. అక్కడి నుంచి హైదరాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్‌కు దిగుమతి అవుతుంటాయి. అక్కడి నుంచి జిల్లాకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకువస్తుంటారు. అఫ్గాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా రవాణా నిలిచిపోయింది. ఫలితంగా ఇక్కడ ధరలపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం డ్రై ఫ్రూట్స్ ధరలు పక్షం రోజుల క్రితంతో పోల్చితే కిలోకు రూ.50 నుంచి రూ.200 వరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: చక్కెర ఎగుమతులపై తాలిబన్ ఎఫెక్ట్ ? -
పామాయిల్ రైతులపై దిగుమతి సుంకం దెబ్బ
సాక్షి, హైదరాబాద్: పామాయిల్ మొలక విత్తనాలపై కేంద్రం భారీగా పెంచిన దిగుమతి సుంకం రైతులను ఆర్థికంగా దెబ్బతీయనుంది. ఐదు శాతం నుంచి ఏకంగా 30 శాతానికి పెంచడంతో రైతులపై కోట్ల రూపాయల భారం పడనుంది. ఒకవైపు ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు సుంకం పెంచడంపై ఆయిల్‌ఫెడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగును 20 లక్షల ఎకరాలకు విస్తరింపజేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి దిగుమతి సుంకం పెంపు తీవ్రమైన విఘాతం కలిగిస్తుందని అంటున్నారు. ఇప్పటికే 30% చొప్పున చెల్లింపులు గతంలో లక్ష విత్తనాలకు దిగుమతి సుంకం రూ.3.25 లక్షలు పడితే, ఇప్పుడది రూ.19.50 లక్షలకు పెరగనుంది. 2022– 23 సంవత్సరానికి గాను దాదాపు 55 వేల ఎకరాల సాగుకు అవసరమైన 40 లక్షల విత్తనాలు థాయ్‌లాండ్, మలేసియా, కోస్టారికా దేశాల నుంచి కొనుగోలు చేయాలని ఆయిల్ ఫెడ్ నిర్ణయించింది. ఒక్కో మొలక విత్తనపు గింజ ధర ఆయా దేశాల్లో సగటున రూ.65 ఉంటుంది. గతంలో ఉన్న 5 శాతం కస్టమ్స్ డ్యూటీ ప్రకారం రూ. 3.25 సుంకం, రవాణా ఖర్చులు కలిపితే ఒక్కో విత్తనం రూ.75 వరకు అయ్యేది. ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ 30 శాతానికి పెరగటంతో సుంకం రూ.19.50కి పెరిగింది. రవాణా ఖర్చులు కలిపితే ఒక్కో విత్తనపు గింజ రూ.95 అవుతుండగా.. లక్ష విత్తనాలకు రూ.19.50 లక్షల సుంకం చెల్లించాల్సి వస్తోంది. దిగుమతి, రవాణా ఖర్చులు కలిపి 40 లక్షల పామాయిల్ విత్తనాలకు గాను ఆయిల్ ఫెడ్‌కు రూ. 38 కోట్లు ఖర్చవుతోంది. పాత విధానం ప్రకారమైతే రూ. 30 కోట్లే అయ్యేది. అంటే కొత్తగా రూ.8 కోట్ల భారం పడుతోందన్నమాట. పెరిగిన దిగుమతి సుంకం రైతులే భరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దాదాపు 9 లక్షల మొలక విత్తనాలను కొనుగోలు చేసిన ఆయిల్ ఫెడ్ 30 శాతం చొప్పున దిగుమతి సుంకం చెల్లించింది. కొత్తగా 8.24 లక్షల ఎకరాలు గుర్తింపు రాష్ట్రంలో ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోనే ఆయిల్‌పామ్ సాగవుతోంది. కొత్తగా 25 జిల్లాల్లో 8.24 లక్షల ఎకరాలు దీనికి అనుకూలమైన భూమిగా గుర్తించారు. ఆయిల్‌పా మ్ నుంచి క్రూడ్ ఆయిల్ తీసేందుకు ఫ్యాక్టరీలు అవసరం కాగా, ప్రస్తుతం అశ్వారావుపేట, అప్పారావుపేటలో ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. కొత్తగా నోటిఫై చేసిన 8 లక్షలకు పైగా ఎకరాలకు గాను కొత్తగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో గుర్తించిన భూములకు సంబంధించిన రైతుల నుంచి ఆయిల్‌పామ్‌ను ఆయా ఫ్యాక్టరీలే కొనుగోలు చేయాలి. వారికి అవసరమైన మొక్కలు అందజేయాలి. మార్కెట్లో ఉన్న ధర రైతుకు ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లో కేంద్రం నోటిఫై చేసిన దానికంటే మరింత ఎక్కువగా సాగును ప్రోత్సహించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వానికి దిగుమతి సుంకం పెంపు శరాఘాతంలా మారింది. రైతులపై భారం వేస్తే వారు సాగుకు దూరం అవుతారు. కొత్త రైతులు ముందు కు వచ్చే అవకాశం ఉండదని అంటున్నారు. పెంచిన సుంకాన్ని రైతులే భరించాల్సి వస్తుంది దిగుమతి సుంకాన్ని తగ్గించాలని, పాత పద్ధతిలోనే 5 శాతం వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్‌కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాం. 30 శాతం దిగుమతి సుంకం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇప్పటివరకు ఐదు శాతం సుంకాన్ని ఆయిల్‌ఫెడ్ భరించేది. కానీ పెంచిన దిగుమతి సుంకాన్ని రైతులే భరించాల్సి వస్తుంది. – కంచర్ల రామకృష్ణారెడ్డి, చైర్మన్, ఆయిల్‌ఫెడ్ -
పన్ను ఎగవేసి విదేశాల నుంచి లగ్జరీ కార్ల దిగుమతి
సాక్షి, హైదరాబాద్: దౌత్యవేత్తలకు లభించే మినహాయింపులను వినియోగించుకొని లగ్జరీ కార్లను దిగుమతి చేసుకుంటూ పన్నులు ఎగవేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ లగ్జరీ కార్ల దిగుమతి వ్యవహారమంతా ఓ ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొదట రాయబారుల పేరుతో కార్లు దిగుమతిని ముంబై మాఫియా చేస్తోంది. అనంతరం దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లకు మణిపూర్ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. అన్ని తతంగాలు పూర్తయ్యాక ఈ లగ్జరీ కార్లను ముంబై మాఫియా నుంచి కొందరు బడాబాబులు కొంటున్నారు. ప్రస్తుతం విదేశీ కార్లు కొనుగోలు చేసిన వారి వివరాలను డీఆర్ఐ సేకరిస్తోంది. పన్ను ఎగవేత కార్లు వాడుతున్న వారిలో రాజకీయ, సినీ ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. -
రెమిడెసివిర్ కొరత: కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ, కరోనా చికిత్సలో ప్రధానమైన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడెసివిర్‌కు ఏర్పడిన తీవ్ర కొరత నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల నుండి రెమిడెసివిర్‌ను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలో 4,50,000 మోతాదులను దిగుమతి చేసుకోనుంది. మొదటి విడతగా 75 వేల రెమిడెసివిర్ వయల్స్‌ను శుక్రవారం రిసీవ్ చేసుకోనుంది. దేశంలో భారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసులతో రెమిడెసివర్ దిగుమతులపై దృష్టిపెట్టడంతో పాటు ఇప్పటికే దేశీయంగా ఈ ఔషధం ఎగుమతిని కేంద్రం నిషేధించింది భారత ప్రభుత్వ యాజమాన్యంలోని హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్, అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్, యు ఈజిప్టు ఫార్మా మేజర్ ఇవా ఫార్మా సంస్థలనుంచి వీటిని కొనుగోలు చేయనుంది. రాబోయే ఒకటి రెండు రోజుల్లో గిలియడ్ సైన్సెస్ నుంచి భారత్‌కు 75వేల నుంచి లక్ష వయల్స్ వస్తాయని, మే 15లోగా లక్ష వయల్స్ చేరుతాయని కేంద్ర కెమికల్స్, ఫర్టిలైజర్స్ శాఖ తాజాగా ప్రకటించింది. వెల్లడించింది. అలాగే ఎవా ఫార్మా తొలుత పది వేల వయల్స్ దేశానికి అందించనుంది. జూలై వరకు ప్రతీ15 రోజులకొకసారి 50వేల వయల్స్‌ను వరకు మనదేశానికి పంపిస్తుందని కేంద్రం తెలిపింది. దీంతోపాటు ప్రస్తుత కొరత నేపథ్యంలో ఈ ఔషద్ ఉత్పత్తులను పెంచడానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా దేశంలోని 7 దేశీయ కంపెనీలు తమ ఉత్పత్తిని నెలకు 38 లక్షల వయల్స్ నుంచి 1.03 కోట్ల వయల్స్‌కు పెంచాయి. కాగా గత ఏడు రోజులలో (21-28 ఏప్రిల్) దేశవ్యాప్తంగా మొత్తం 13.73 లక్షల వయిల్స్ సరఫరా చేయగా, రోజువారీ రెమిడెసివర్ సరఫరా ఏప్రిల్ 11 న 67,900 డి ఏప్రిల్ 28 న 2.09 లక్షలకు పెరిగిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా శుక్రవారం ప్రకటించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో 3,86,452 కొత్త కోవిడ్-19 కేసులు, 3,498 మరణాలు సంభవించాయి. 2,97,540 రోగులు డిశ్చార్జ్ అయ్యారు. -
ఆహార దిగుమతి.. చైనా గుణపాఠాలు
దేశంలోని 95 శాతం ప్రజల ఆహార అవసరాన్ని దేశీయ ఉత్పత్తిద్వారానే నెరవేర్చాలని చైనా 1996లో లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 2011 నాటికి చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా మారిపోయింది. మన దేశంలోనూ ప్రధాన స్రవంతి ఆర్థిక వేత్తలు వ్యవసాయ సంస్కరణల పేరిట ఉన్న సౌకర్యాలను కూడా తొలగించే పద్ధతులను ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ నియంత్రణ నుంచి మార్కెట్ ఆధారిత వ్యవసాయం వైపు పరివర్తన అనేది.. చైనాను నిర్వహించలేని ఆహార సంక్షోభంలోకి ఎలా నెట్టివేసిందనే అంశంపై చైనా మనకు పెద్ద గుణపాఠం నేర్పుతోంది. అదే బాటలో మనమూ నడిస్తే భారత్‌కు ఎవరు తిండి పెడతారు అనే ప్రశ్న మన భవిష్యత్ తరాలను కూడా వెంటాడుతుంది. సరిగ్గా 150 ఏళ్ల క్రితం గ్రేట్ ఐరిష్ కరువు బారిన పడి 10 లక్షలమంది చనిపోయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఐర్లండ్‌లోని యూనివర్సిటీ కాలేజి కోర్క్‌లో 1998లో నిర్వహించిన ఒక అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ సభికులు నన్ను ప్రశ్నించారు. భారత్‌కు తిండి పెట్టేది ఎవరు? ప్రపంచ ప్రఖ్యాత పర్యావరణ పరిశోధకుడు, చింతనాపరుడు లెస్టర్ బ్రౌన్ ప్రతిపాదించిన ఒక పరికల్పనను ప్రపంచం చర్చిస్తున్న సందర్భంగా ఆ ప్రశ్న వెలువడింది. అమెరికా కేంద్రంగా పనిచేసే పర్యావరణ మేధోమధన సంస్థ వరల్డ్ వాచ్ ఇనిస్టిట్యూట్ సంస్థాపకుడు, తర్వాత ఎర్త్ పాలసీ ఇనిస్టిట్యూట్ అధ్యక్షుడు లెస్టర్ బ్రౌన్ చైనాకు ఎవరు తిండి పెడతారు (హూ విల్ ఫీడ్ చైనా) అనే పుస్తకంలో తన విశ్లేషణను తీసుకొచ్చారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక సెమినార్లు, సదస్సులలో తీవ్ర వాదోపవాదాలకు తావిచ్చింది. అగణిత మేధోపండితులు కూడా లెస్టర్ బ్రౌన్ పరికల్పనను బలపర్చారు. కాగా కొంతమంది నిపుణులు ఆయన వాదనను బహిరంగంగానే సవాలు చేశారు. కానైతే.. సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా ఆవిర్భవించింది. ఆహార సంక్షోభ తీవ్రతను పైకి తోసిపుచ్చుతున్నప్పటికీ, గత ఏడాది ఆగస్టులో ఒక్క మెతుకు ఆహారాన్ని కూడా వృథా చేయవద్దని చైనా ప్రజలను కోరుతూ సాక్షాత్తూ చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ఆపరేషన్ క్లీన్ ప్లేట్ (ఆహార వృధాను అరికట్టే చర్య) పథకాన్ని ప్రారంభించడంతో చైనా పరిస్థితిపై ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనాలో ఒక సంవత్సరంలో 6 శాతం ఆహారం మాత్రమే వృథా అవుతుందని అంచనా వేసినా, అది 20 కోట్లమంది ప్రజలకు సరిపోయే ఆహారాన్ని అందిస్తుంది. చివరకు కస్టమర్లు కోరినంత తిండి పెట్టవద్దని చైనాలో రెస్టారెంట్లపై ఆంక్షలు విధించారు. ఉదాహరణకు విని యోగదారులు అయిదు మీల్స్ ఆర్డర్ చేస్తే నలుగురికి సరిపోయే తిండి మాత్రమే పెట్టాలని రెస్టారెంట్లను ప్రభుత్వం ఆదేశించింది. ఆహార వృథాపై చైనా ప్రభుత్వ ఆంక్షలు.. ప్రతి సోమవారం నిరాహార దీక్ష పూనాలంటూ నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 1965లో భారతీయులను కోరిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. నిజానికి 1965లో అంటే దేశంలో హరిత విప్లవం ప్రారంభానికి సంవత్సరం ముందు ఏర్పడిన తీవ్రమైన ఆహార కొరతను అధిగమించడానికి భారతదేశం కోటి టన్నుల ఆహారధాన్యాలను దిగుమతి చేసుకుంది. హరిత విప్లవం మొదలైన తర్వాత భారత్ ఆహార పదార్థాల విషయంలో స్వావలంబనను సాధించింది కానీ ఆహారం సులభంగా అందుబాటులోకి వస్తుండటంతో నిర్లక్ష్యం దేశాన్ని అలుముకుంది. చైనా కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో చాలా పెద్ద ముందంజ వేసింది. 1996లో చైనా ఒక విధానంపై దృష్టి పెడుతూ దేశంలోని 95 శాతం ప్రజల ఆహార అవసరాన్ని దేశీయ ఉత్పత్తిద్వారానే నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 2011 నాటికి ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకటన మేరకు, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా మారిపోయింది. ఆదాయాలు పెరగడంతో మధ్యతరగతి ప్రజల ఆహార ప్రాధాన్యతల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. చైనా వాడుకగా పండించే ఆహార ఉత్పత్తులనుంచి చైనా మధ్యతరగతి మాంసం, పాలతో సహా ఇతర పోషకాహార ఉత్పత్తులను డిమాండ్ చేయడం మొదలెట్టింది. ప్రజల ఆహార అలవాట్లలో మార్పులు చోటుచేసుకోవడంతో ఆహార స్వావలంబన విధానం నుంచి చైనా ప్రభుత్వం గమనం మార్చుకుని తగుమాత్రం ఆహార దిగుమతులను అనుమతించింది. అదేసమయంలో భారీ ఎత్తున ప్రజలు నగరాల బాట పట్టడం, వ్యవసాయరంగం నుంచి రైతాంగం భారీ స్థాయిలో పారిశ్రామిక కార్మికవర్గంలోకి పరివర్తన చెందడం అనేది ఆహార ఉత్పత్తిలో అంతరాన్ని సృష్టించింది. పైగా, రసాయన ఎరువులు అధికంగా వాడే సాంద్ర వ్యవసాయ పద్ధతులతో సాగుభూములు కలుషితమయ్యాయి. భూగర్భ జలాలు క్షీణించి పోవడంతో కాలుష్యం కూడా పెరిగిపోయింది. ఈ పర్యావరణపరమైన క్షీణత సాగు భూముల విస్తీర్ణాన్ని తగ్గించివేసింది. దీంతో తన ఆహార భద్రత కోసం 12 కోట్ల హెక్టార్ల సాగు భూమిని కాపాడుకోక తప్పదంటూ చైనా ప్రకటించింది. చైనాలో సగటు వ్యవసాయ భూమి విస్తీర్ణం ఇప్పుడు 1.6 ఎకరాలకు పడిపోయింది. నైట్రోజన్తోపాటు రసాయనిక ఎరువుల వాడకం తీవ్రమవడం, రైతులకు ప్రత్యక్ష నగదు మద్దతును అందించడం కారణంగా 2017లో 60 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు అదనంగా ఉత్పత్తయ్యాయి. కానీ, బీఫ్‌తో సహా ఇతర పోషకాహార పదార్థాల కోసం చైనాలో డిమాండ్ పెరిగిపోయింది. ఉదాహరణకు చైనాలో బీఫ్ ఉత్పత్తులకు డిమాండ్ 19,000 శాతానికి అమాంతంగా పెరిగిపోయింది. దీంతో భారత్, పాక్‌తో సహా ప్రపంచమంతటినుంచి చైనా ఆహార పదార్థాల కోసం అర్రులు చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిచ్ రేటింగుల ప్రకారం 2020 సంవత్సరంలో మొక్కజొన్న, గోధుమ, జొన్న, బార్లీ పంటల దిగుమతులు చైనాలో వరుసగా 136, 140, 437, 36.3 శాతం వరకు పెరిగాయి. ప్రపంచంలోనే అత్యధికంగా సోయాబీన్స్‌ను ఉత్పత్తి చేస్తున్న బ్రెజిల్నుంచి ఇప్పటికే గరి ష్టంగా సోయాబీన్ దిగుమతులు మొదలెట్టిన చైనా, ఇప్పుడు వాటికోసం అమెరికావైపు చూపు సారిస్తోంది. ప్రపంచంలోనే గోధుమలను అత్యధికంగా పండిస్తున్న రెండో దేశంగా గుర్తింపు పొందిన చైనా ప్రపంచవ్యాప్తంగా పండే మొత్తం గోధుమ నిల్వల్లో సగం మేరకు సొంతం చేసుకుంది. ప్రపంచంలోని మొక్కజొన్న నిల్వల్లో 65 శాతాన్ని చైనా ఇప్పటికే సొంతం చేసుకుంది. దేశీయంగా ఆహార అవసరాలను తీర్చలేకపోతున్న చైనా, ఇప్పుడు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోని వ్యవసాయ క్షేత్రాలను కొనివేయడంలో దూకుడు ప్రదర్శిస్తోంది. అమెరికా, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా దేశాల్లోని వ్యవసాయ క్షేత్రాల కొనుగోలుపైనా చైనా చూపు సారిస్తోంది. 2010 నుంచి చైనా విదేశాల్లో 94 బిలియన్ డాలర్లు పెట్టి 32 లక్షల హెక్టార్ల భూమిని కొనుగోలు చేసిందని జ్చటఝl్చnఛీజట్చb.ఛిౌఝ వెబ్సైట్ అంచనా వేసింది. చైనా అనుభవాల నుంచి భారత్ ముఖ్యమైన గుణపాఠాలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ నియంత్రణ నుంచి మార్కెట్ ఆధారిత వ్యవసాయం వైపు చైనా పరివర్తన అనేది ఆ దేశాన్ని ఇక నిర్వహించలేని ఆహార సంక్షోభంలోకి ఎలా పడవేసిందనే అంశంపై చైనా మనకు పెద్ద గుణపాఠం నేర్పుతోంది. ప్రపంచ వస్తూత్పత్తి కేంద్రంగా చైనాను మార్చివేసిన ప్రయోగం ఇప్పుడు అవసవ్య దిశలో పయనించబోతోంది. ఎందుకంటే కారుచౌకతో దొరికే శ్రామికలను అందించడంలో ఆఫ్రికా చైనాతో పోటీపడుతోంది. దీంతో చైనాలో మళ్లీ వ్యవసాయ క్షేత్రాలను పునరుద్ధరించడం అనేది అతి పెద్ద సవాలు కానుంది. చైనా ప్రతి ఏడాది 206 బిలియన్ డాలర్ల మేరకు వ్యవసాయ సబ్సిడీలను అందిస్తోంది. దీనికి ప్రతి ఏటా ఆహార ధాన్యాల దిగుమతిపై ఖర్చుపెడుతున్న వందల కోట్ల డాలర్లను కూడా కలుపుకోవాలి. చైనాలోని చిన్న కమతాల వ్యవసాయ క్షేత్రాలను ఆర్థిక శక్తి కేంద్రాలుగా మార్చడానికి ఇంతే మొత్తం ఖర్చు పెట్టినట్లయితే, అతిపెద్ద ఆహార ధాన్యాల ఉత్పత్తిదారు అయిన చైనా ప్రపంచ అతిపెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా మారే ప్రమాదాన్ని అరికట్టవచ్చు. ఇది ఒకరకంగా ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గం. సాగుభూములపై అధికంగా వ్యయం చేయడం వల్ల దీర్ఘకాలంలో స్వావలంబన సాధ్యపడుతుంది. కానీ చైనా ఇక్కడే విఫలమైంది. భారత్ కూడా ఆ దారిలో పయనిస్తే తట్టుకోలేదు. మరోమాటలో చెప్పాలంటే భారత్‌కు ఎవరు తిండి పెడతారు అనే ప్రశ్న మన భవిష్యత్ తరాలను కూడా వెంటాడుతుంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ-మెయిల్ : : hunger55@gmail.com -
భారత్‌పై ఆక్రోశం? చక్కెర, పత్తికి పాకిస్తాన్లో తిప్పలు
ఇస్లామాబాద్: పక్కనున్న దేశంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అవసరమైన వస్తువుల దిగుమతిపై నిషేధం విధించగా తాజాగా మళ్లీ ఎత్తి వేసే ప్రయత్నాలు జరిగాయి. దీనిపై నిన్న మంత్రిమండలి కూడా నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి పత్తి, చక్కెర దిగుమతి చేసుకోవాలని తీర్మానించారు. అయితే ఒకరోజు తిరిగే లోపే ఆ నిర్ణయానికి బ్రేక్ పడింది. దీంతో ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు చుక్కెదురైంది. భారత్ నుంచి వస్తువుల దిగుమతికి ఆ దేశంలోని జాతీయ సంస్థ నిరాకరించింది. 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌పై తీసుకున్న చర్యలతో పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటి నుంచి భారత్ నుంచి దిగుమతి చేసుకునే పత్తి, చక్కెర తదితర వస్తువులపై నిషేధం విధించింది. పాకిస్తాన్ మంత్రిమండలి ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అధ్యక్షతన బుధవారం సమావేశమై భారత్ నుంచి దిగుమతులు పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు పత్తి, చక్కెర దిగుమతులకు తిరిగి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే తెల్లారే గురువారం పాకిస్తాన్లో ఆర్థిక సహకార కమిటీ (ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ-ఈసీసీ) ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. భారత్ నుంచి దిగుమతులు అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే మంత్రిమండలి తీసుకున్న నిర్ణయమే ఫైనలా? లేదా ఆర్థిక కమిటీ నిర్ణయం ఫైనలా అనేది తేలాల్సి ఉంది. భారత్‌ను దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో పాక్ వైఖరి ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్లో ఆహార కొరత తీవ్రంగా ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే చక్కెర, పత్తి కొరత తీవ్రంగా ఉంది. అందుకే వాటిని తిరిగి దిగుమతి చేసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తుండగా ఆ నిర్ణయానికి ఆర్థిక కమిటీ నిరాకరించింది. మరి ఇమ్రాన్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. -
బంగారం స్మగ్లింగ్‌కు ఇలా చెక్ పెట్టొచ్చు!
ముంబై: బడ్జెట్లో పసిడిపై కస్టమ్స్ డ్యూటీని 7.5 శాతానికి పరిమితం చేయడంతో అనధికార దిగుమతులు(గ్రే మార్కెట్) తగ్గే వీలున్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. కస్టమ్స్ తగ్గింపునకు తోడు డిమాండ్ బలపడుతుండటంతో స్మగ్లింగ్‌కు కొంతమేర చెక్ పడవచ్చని అభిప్రాయపడింది. 2021–22 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పసిడిపై కస్టమ్స్ డ్యూటీని నికరంగా 2.2 శాతం స్థాయిలో తగ్గించిన విషయం విదితమే. బడ్జెట్లో చేసిన తాజా ప్రతిపాదనల ప్రకారం గోల్డ్ బార్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీతోపాటు, వ్యవసాయ, ఇన్ఫ్రా సెస్, సామాజిక సంక్షేమ సర్‌చార్జీ కలగలిసి 10.75 శాతానికి చేరాయి. ఇవి బడ్జెట్‌కు ముందు 12.87 శాతంగా అమలయ్యేవి. వీటికి 3 శాతం జీఎస్టీ జత కలవనుంది. దీంతో 14.07 శాతానికి చేరే వీలుంది. అంతక్రితం 16.26 శాతంగా అమలయ్యేది. దేశీ గోల్డ్ మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం పేరుతో డబ్ల్యూజీసీ ప్రకటించిన నివేదిక ఇంకా ఇలా పేర్కొంది.. 80 శాతం డౌన్ 2020లో పసిడి అనధికార దిగుమతులు 80 శాతం పడిపోయి 20–25 టన్నులకు పరిమితమయ్యాయి. ఇందుకు కోవిడ్–19 కారణంగా లాజిస్టిక్స్ తదితర అవాంతరాలు ఎదురుకావడం ప్రభావం చూపింది. ఈ ఏడాది(2021)లోనూ విమానయానంపై ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలు, కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు దీనికి జత కలవనున్నాయి. వెరసి పసిడిలో అధికారిక దిగుమతులు పుంజుకునే వీలుంది. కాగా.. పసిడిపై దిగుమతి సుంకాలను క్రమబద్ధీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో చర్యలు తీసుకున్నట్లు డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చదవండి: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు కొత్తగా ముస్తాబైన మారుతి స్విఫ్ట్: ధర ఎంతంటే.. -
30 ఏళ్ల తర్వాత చైనాకు మన బియ్యం..
న్యూఢిల్లీ: దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత చైనాకు మన బియ్యం ఎగుమతి కాబోతున్నాయి. గతంలో సరఫరాను కఠినతరం చేయడంతో భారత్ నుంచి బియ్యం దిగుమతి చేసుకోవడం చైనాకు సాధ్యపడలేదు. అయితే ప్రస్తుతం భారత్ భారీ డిస్కౌంట్ రేట్లు ఆఫర్ చేయడంతో బియ్యం దిగుమతి చేసుకునేందుకు చైనా ముందుకు వచ్చింది. ఇక ప్రపంచంలో బియ్యం ఎగుమతిలో భారత్ ప్రథమ స్థానంలో ఉండగా... దిగుమతిలో చైనా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. డ్రాగన్ ప్రతి ఏడాది వేర్వేరు దేశాల నుంచి 4 మిలియన్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకుంటుంది. కానీ వీటిలో ఇండియా లేదు. మన బియ్యం నాణ్యత సరిగా ఉండదనే కారణంతో భారత్ బియ్యం పట్ల చైనా ఆసక్తి చూపేది కాదు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికి.. ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. (చదవండి: డ్రాగన్ శకం ముగిసింది!) ఈ సందర్భంగా బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బీవీ క్రిష్ణా రావు మాట్లాడుతూ.. ‘చాలా కాలం తర్వాత మొదటి సారి చైనా మన బియ్యం దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తోంది. నాణ్యత చూశాక వచ్చే ఏడాది నుంచి ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకుంటుందని భావిస్తున్నాం’ అన్నారు. ఇక డిసెంబరు-ఫిబ్రవరి మధ్యలో భారతీయ వ్యాపారులు టన్నుకు 300(మన కరెన్సీలో 22వేల రూపాయలు) అమెరికన్ డాలర్ల చొప్పున లక్ష టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు చైనా థాయిలాండ్, వియత్నాం, మయాన్మార్, పాకిస్తాన్ల నుంచి బియ్యం కొనుగోలు చేస్తూ వస్తోంది. -
దిగుమతులు తగ్గించాలనుకోవడం సరికాదు : రాజన్
సాక్షి, ముంబై: ఆత్మ నిర్భర్ భారత్ (స్వావలంబన భారత్) చొరవల్లో భాగంగా ‘టారిఫ్‌లు పెంపుతో’ దేశం దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని, దేశీయ ఉత్పత్తులను పెంచడం ద్వారా స్వయం సంమృద్ధిని సాధించాలనీ భావించడం సరికాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. గతంలో అనుసరించిన ఈ తరహా విధానాలు తగిన ఫలితాలను ఇవ్వలేదని కూడా ఆయన ఈ సందర్భంగా అన్నారు. సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ స్టడీస్ నిర్వహించిన ఒక వెబ్‌నార్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఒక దేశం చౌకగా వస్తున్న ముడి పదార్థాలను దిగుమతి చేసుకుని, వాటి ఆధారిత ఉత్పత్తులను ‘అంతర్జాతీయ మార్కెట్లో పోటీకి తగినట్లు’ తగిన ధర వద్ద ఎగుమతి చేయాలి. తద్వారా దేశం తగిన ప్రయోజనం పొందాలి. చైనా అనుసరించిన విధానం ఇదే. ఆ దేశం ఈ దిశలో మంచి ఫలితాలను సాధించింది. ఈ తరహా ఉత్పత్తి వాతావరణం దేశంలో నెలకొనడానికి తగిన కృషి జరగాలి’’ అని వెబ్‌నార్‌లో రాజన్ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... లక్ష్యాన్ని ఉద్దేశించి కేంద్రం చేసే ప్రతిపైనా దీర్ఘకాలంలో ప్రతిఫలం అందిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో విచక్షణారహిత వ్యయ విధానాలు అనుసరించరాదు. కరోనా సవాళ్లకు ముందే దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిందన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇందుకు కారణాలను, పర్యవసానాలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలని సూచించారు. భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థ ఇప్పటికీ బలహీనంగా ఉందని పేర్కొన్న ఆయన, సవాళ్ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి అవసరమని అన్నారు. తద్వారానే సామాన్యుని కష్టాలను తీర్చగలమని పేర్కొన్నారు. సమీప కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సరళతర ద్రవ్య పరపతి విధానాన్నే అవలంభిస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. అలా భావించడం తగదు..: సన్యాల్ స్వావలంబన భారత్ ఉద్దేశం ‘దిగుమతులు తగ్గించడమో... లేక లైసెన్స్ రాజ్‌ను తిరిగి ప్రవేశపెట్టడమో లేదా సమర్థవంతంగా వ్యాపారం చేయని సంస్థలను రక్షించడమో కాదు’ అని సీఐఐ గురువారం నిర్వహించిన ఫైనాన్షియల్ మార్కెట్ 2020– వెర్చువల్ సదస్సులో కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్ ప్రకటన నేపథ్యంలో సన్యాల్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అత్యంత పటిష్టమైన, సామర్థ్యంతో కూడిన సంస్థలు సవాళ్లను ఎదుర్కొని నిలబడేట్లు చేయడమే ఆత్మ నిర్భర్ భారత్ ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే సర్కార్ నిర్భర్ భారత్‌గా భావించరాదని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో ఎంతో సామర్థ్యంతో పనిచేస్తున్న ఫార్మా రంగం ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, అలాంటి పరిశ్రమలకు ప్రభుత్వ పరంగా తగిన సహాయ సహకారాలు అందాల్సి ఉంటుందని అన్నారు. కోవిడ్-19తో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలో తిరిగి డిమాండ్ నెలకొనడానికి తక్షణం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సన్యాల్ పేర్కొన్నారు. ఆతిథ్యం వంటి ఎన్నో రంగాల్లో డిమాండ్ మెరుగుపడాల్సి ఉందని అన్నారు. -
మొక్కజొన్న దిగుమతి చేసుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 2014లో తీసుకున్న విధానపరమైన నిర్ణయం మేరకు విదేశాల నుంచి మొక్కజొన్నను దిగుమతి తీసుకోవచ్చని విదేశీ వాణిజ్య విభాగం అదనపు డీజీ బాలసుబ్రమణ్యం హైకోర్టుకు నివేదించారు. మొక్కజొన్న దిగుమతితో స్థానిక రైతులు, వ్యాపారులు నష్టపోతున్నారంటూ పలువురు రైతులు, వ్యాపారులు దాఖలు చేసిన పలు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. సొంత అవసరాల కోసం వాడుకునే వారు మాత్రమే దిగుమతి చేసుకోవాలని, దిగుమతి చేసుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్, కారం, ఉప్పు వేసి తిరిగి ప్యాక్ చేసి అమ్మడానికి వీల్లేదని రైతుల తరఫున న్యాయవాది డొమినిక్ ఫెర్నాండెజ్ వాదనలు వినిపించారు. 2014లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం విదేశాల నుంచి మొక్కజొన్నను దిగుమతి చేసుకోవచ్చని, గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తొలగించాలని దిగుమతిదారుల తరఫు న్యాయవాది నివేదించారు. సొంత అవసరాలకు మాత్రమే దిగుమతి చేసుకోవాలన్న నిబంధనేమీ లేదని, గతంలో హైకోర్టు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఆ ఆదేశాలను అమలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది నివేదించారు. మన దేశం నుంచే పెద్ద మొత్తంలో మొక్కజొన్నను ఎగుమతి చేస్తారని, ఒక శాతం మాత్రమే దిగుమతి చేసుంటారని, సొంత అవసరాలకు మాత్రమే అన్న నిబంధన అంతర్జాతీయ వాణిజ్యం ఒప్పందాలకు విరుద్ధమని, ఇటువంటి నిబంధనలు పెడితే మనదేశ రైతులకే నష్టమని పేర్కొన్నారు. అయితే విధానపరమైన నిర్ణయాల్లో హైకోర్టు ఆదేశాలు ఇచ్చినంత మాత్రాన ఎలా కొనసాగిస్తారని, మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. మొక్కజొన్న దిగుమతికి సంబంధించి స్పష్టమైన విధానం ఉండాలని, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది. -
కలర్ టీవీల దిగుమతులపై కేంద్రం నియంత్రణ
న్యూఢిల్లీ: కలర్ టీవీల ధరలకు రెక్కలు రానున్నాయి! ఎందుకంటే కలర్ టీవీల దిగుమతులపై నియంత్రణలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా దేశీయ తయారీని ప్రోత్సహించడంతోపాటు.. చైనా నుంచి వచ్చి పడుతున్న నిత్యావసరం కాని వస్తువులకు కళ్లెం వేయడమే కేంద్రం నిర్ణయం వెనుక ఉద్దేశ్యంగా ఉంది. ఇప్పటి వరకు కలర్ టెలివిజన్లను స్వేచ్ఛగా దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉండగా, ఇకపై నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) విభాగం ప్రకటన జారీ చేసింది. 32 సెంటీమీటర్ల నుంచి 105 సెంటీమీటర్ల పరిమాణంలోని తెరలు కలిగిన టీవీలు, 63 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలోని ఎల్సీడీ టీవీలు నియంత్రణ పరిధిలోకి వస్తాయి. నియంత్రణతో ఇకపై వీటిని దిగుమతి చేసుకోవాలంటే తప్పకుండా కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డీజీఎఫ్టీ నుంచి లైసెన్స్ పొదాల్సిందే. -
ఫార్మా.. లోకల్ రూట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీయంగా ఫార్మా దిగుమతుల్లో యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్, ఇంటర్మీడియేట్స్ వాటా 63 శాతముంది. ఇందులో 70 శాతం చైనా నుంచి దిగుమతి అవుతున్నవే. ఔషధాల తయారీకి అవసరమైన ముడిపదార్థాలే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్, ఇంటర్మీడియేట్స్. ఏ ముడి పదార్థం తీసుకున్నా దీని కోసం ఖచ్చితంగా చైనాపై భారత్ ఆధారపడి ఉంది. ఈ స్థాయిలో ఒక దేశంపై ఆధారపడడం శ్రేయస్కరం కాదని భారత ఔషధ పరిశ్రమ ఎన్నాళ్లనుంచో చెబుతూ వస్తోంది. దేశీయంగా ముడి పదార్థాల తయారీకి దీర్ఘకాలిక వ్యూహం అమలు చేయాలని విన్నవిస్తోంది. ఇదే జరిగితే నాలుగైదేళ్లలో స్వయం సమృద్ధి సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇతర దేశాల నుంచి ముడి పదార్థాల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. నాలుగైదేళ్లలో సాధించవచ్చు.. ఫార్మా ముడి పదార్థాల విషయంలో భారత్ స్వావలంబన సాధ్యమేనని పరిశ్రమ చెబుతోంది. ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు వస్తే నాలుగైదేళ్లలో స్వయం సమృద్ధి సాధిస్తామని బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ) ఈడీ ఈశ్వర్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘ఉన్నఫలంగా చైనా నుంచి ముడిపదార్థాల దిగుమతులను ఆపేయలేము. క్రమంగా దేశీయంగా వీటి తయారీని పెంచుకుంటూ పోవాలి. ఇక ఏపీఐ, ఇంటర్మీడియేట్స్ తయారీ ప్రక్రియలో ఉప పదార్థాలు వస్తాయి. ఇవి సద్వినియోగం అయితేనే తయారీదారుకు ప్రయోజనం. ఇందుకోసం మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. భారత్‌లో ఉత్పత్తి వ్యయం చైనాతో పోలిస్తే 20–25 శాతం అధికంగా ఉంటుంది. ఆ మేరకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలి. టెక్నికల్ ఇన్నోవేషన్ పెద్ద ఎత్తున జరగాలి’ అని వెల్లడించారు. కాగా, రూ.3,000 కోట్లతో మూడు బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశీయంగా ముడి పదార్థాల తయారీకి ఊతం ఇచ్చేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద రూ.6,940 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. కొత్త మార్కెట్ల నుంచి... చైనాపై ఆధారపడడం తగ్గించేందుకు కొన్ని రకాల యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్, ఇంటర్మీడియేట్స్ను యూఎస్, ఇటలీ, సింగపూర్, హాంగ్‌కాంగ్ నుంచి దిగుమతి చేసుకునే విషయమై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. చైనాతో తలెత్తిన వివాదం నేపథ్యమూ ఇతర దేశాలవైపు దృష్టిసారించేందుకు మరో కారణమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. అన్ని దేశాలు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ వెల్లడించారు. ఏ దేశాల నుంచి ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవచ్చో అన్న అంశంపై ఐపీఏ ఇప్పటికే ఓ అధ్యయనం చేపట్టిందని ఆయన చెప్పారు. కొత్త దేశాల నుంచి దిగుమతులు వెంటనే చేపట్టి, మధ్య, దీర్ఘకాలంలో దేశీయంగా సామర్థ్యం పెంచుకోవాలన్న సరైన విధానం భారత్ ఎంచుకుందని అన్నారు. సరైన విధానాలు, ప్రోత్సాహకాలతో దేశీయంగా ఉన్న 1,500–1,600 ఏపీఐ యూనిట్లు బలోపేతం అవుతాయని ఇండియన్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఈడీ అశోక్ మదన్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
దిగుబడులు కిందకు.. ధరలు పైపైకి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వినియోగదారులకు కూరగాయలు పూర్తిగా అందుబాటులోకి వచ్చినా వాటి ధరలు మాత్రం క్రమంగా పెరుగుతున్నాయి. లాక్డౌన్ సడలింపులతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు పెరగడం, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకోవడం..ఇదే సమయంలో డిమాండ్‌కు తగ్గట్లు దిగుమతి లేకపోవడంతో ధరలు అనూహ్యంగా పెరుగుతున్నా యి. వారం పదిరోజుల కిందటి ధరలతో పోల్చినా ఏకంగా రూ.20 నుంచి రూ.30వరకు పెరుగుదల కనిపిస్తోంది. అనూహ్యంగా పెరుగుదల... టమాటా ధరల్లో అనూహ్య పెరుగుదల కనిపిస్తోంది. పది రోజుల కిందటి వరకు సైతం బహిరంగ మార్కెట్లో కిలో టమాటా ధర రూ.10 పలుకగా, ప్రస్తుతం రూ.30కి చేరింది. రాష్ట్రంలో అధికంగా సాగు చేసే మెదక్, సిద్దిపేట రంగారెడ్డి జిల్లాల నుంచి హైదరాబాద్ మార్కెట్‌కు టమాటా రాక తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. వేసవిలో బోర్ల కింద వేసిన సాగు పూర్తవ్వడం, ఇప్పుడు కొత్తగా సాగు జరుగుతున్న నేపథ్యంలో డి మాండ్ మేరకు పంట రావడం లేదని అంటున్నారు. ఇక రాష్ట్రానికి అధికంగా ఏపీలోని మదనపల్లి, కర్ణాటకలోని చిక్మగళూర్ నుంచి రోజుకు 2వేల నుంచి 3వేల క్వింటా ళ్లు దిగుమతి అవుతుండగా ..ఇప్పుడది 1,500 క్వింటాళ్లకు తగ్గింది. దీనికి తోడు ప్రస్తుతం మదనపల్లి మార్కెట్లోనే కిలో టమాటా రూ.20 వరకు పలుకుతోంది. రవాణా ఖర్చులు కలుపుకొని అమ్మే సరికి దాని ధర రూ.30–35కి చేరుతోంది. గడిచిన 4 రోజులుగా బోయిన్పల్లి మార్కెట్‌కు వచ్చిన పంటను గమనిస్తే దిగుమతుల తగ్గుదల తెలుస్తోంది. ఈ నెల 15న మార్కెట్‌కు 3,074 క్వింటాళ్లు రాగా, 16న 2,870, 17న 251 క్వింటాళ్లు రాగా 18న గురువారం కేవలం 1,313 క్వింటాళ్లు›మాత్రమే వచ్చింది. దీంతో హోల్‌సేల్ మా ర్కెట్లోనూ కిలో టమాటా 4 రోజుల కిందట రూ.15 ఉండగా, ఆ ధర ప్రస్తుతం రూ.24కు చేరింది.అది రైతుబజార్లలో రూ.25–28 పలుకుతుండగా, బహిరంగ మార్కెట్‌కు వచ్చేసరికి దాని ధర రూ.30–35కి చేరింది. ఇతర కూరగాయల ధరలు పైపైకి.. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్, బోయిన్పల్లి, ఎల్బీనగర్ మార్కెట్లకు లాక్డౌన్ సమయంలో రోజుకు 30–35 వేల క్వింటాళ్ల మేర అన్ని రకాల కూరగాయలు వచ్చేవి. బోయిన్పల్లి మార్కెట్‌కే 20 వేల క్వింటాళ్లకు పైగా వచ్చిన రోజులున్నాయి. ఈ నెల 15న బోయిన్పల్లి మార్కెట్‌కు అన్ని రకాల కూరగాయలు కలిపి 18,468 క్వింటాళ్ల మేర రాగా, 16న 16,471 క్వింటా ళ్లు, 17న 15,741 క్వింటాళ్లు రాగా, 18న గురువారం 10,937 క్వింటాళ్లే వచ్చింది. పది రోజుల కిందటి ధరలతో పోలిస్తే ప్రతీదానిపై రూ.20–30 వరకు పెరిగాయి. కాకర కిలో రూ.35, వంకాయ రూ.35, క్యాప్సికం రూ.70, బీన్స్ రూ.50, క్యారెట్ (బెంగళూరు) రూ.50, దొండ రూ.32–35, పచ్చిమిర్చి రూ.45, బెండ రూ.30 వరకు ఉండగా, బీరకాయ రూ.60 పలుకుతోంది. ఆలు ధర వారం కింద రూ.20 ఉండగా, ప్రస్తుతం రూ.40కి చేరింది. ఉల్లి ధరలు మాత్రం వినియోగదారులకు అందుబాటు లో ఉన్నాయి. రూ.100కు 6 నుంచి 7 కిలోల వంతున విక్రయిస్తున్నారు. పంటలసాగు మొదలవడంతో మరో 3 నెలల పా టు ధరల్లో పెరుగుదల ఉంటుందని మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. -
ఈజిప్టు నుంచి 6వేల టన్నుల ఉల్లి
న్యూఢిల్లీ: దేశీయంగా ఉన్న కొరత, పెరుగుతున్న ధరను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈజిప్టు నుంచి 6వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోనుంది. దీనిని కిలో రూ.52–60 స్థాయిలో రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. సుమారు 1.2 లక్షల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకోవాలని గత వారం కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ‘ఈజిప్టు నుంచి మొదటి విడతగా 6,090 టన్నుల ఉల్లి కొనుగోలు చేయాలని నిర్ణయించాం. కావాలనుకున్న రాష్ట్రాలు డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ స్టాకును తీసుకెళ్లవచ్చునన్నారు. -
ఉల్లి ధరలపై ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఆకాశన్నంటిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్ర మరిన్ని చర్యల్ని చేపట్టింది. రిటైల్ మార్కెట్లో కిలోకుసుమారు రూ.100 వరకు పెరిగిన నేపథ్యంలో ఒక లక్ష టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్నికేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ట్వీటర్ ద్వారా శనివారం పేర్కొన్నారు. ధరలను నియంత్రించడానికి లక్ష టన్నుల ఉల్లిపాయను దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నవంబర్ 15, డిసెంబర్ 15 మధ్య కాలంలో ఉల్లిపాయలను దిగుమతి చేసుకుని దేశీయ మార్కెట్లో పంపిణీ చేయడానికి ఎంఎంటీసీని కోరినట్లు ఆయన తెలిపారు. దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను దేశవ్యాప్తంగా సరఫరా చేయాలని నాఫెడ్‌ను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలోని వాణిజ్య సంస్థ ఎంఎంటిసి ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటుందనీ, దేశీయ మార్కెట్లో కీలకమైన నాఫెడ్ వీటిని సరఫరా చేస్తుందని ఆయన తెలిపారు. శనివారం జరిగిన కార్యదర్శుల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. सरकार ने प्याज की कीमतों को नियंत्रित करने के लिए 1 लाख टन प्याज के आयात का फैसला लिया है। MMTC 15 नवंबर से 15 दिसंबर के बीच आयातित प्याज देश में वितरण के लिए उपलब्ध कराएगा और NAFED को देश के हर हिस्से में प्याज का वितरण करने की जिम्मेदारी सौंपी गई है। #Onion @PMOIndia pic.twitter.com/O8KuaaO2la — Ram Vilas Paswan (@irvpaswan) November 9, 2019 -
విధిలేని పరిస్థితుల్లో దిగొచ్చిన పాక్ !
ఇస్లామాబాద్ : జమ్ము కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌తో ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను అన్నిస్థాయిల్లో నిలిపివేసిన సంగతి తెలిసిందే. తన దేశంలో వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహానికనుగుణంగా ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యాధికారిని కూడా బహిష్కరించింది. బాలీవుడ్ సినిమాలను, సీరియళ్లను నిలిపివేసింది. అంతేకాక, భారత్‌లో తయారైన వస్తువులను కొనుగోలు చేయరాదంటూ ఆ దేశ సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆవేశంతో భారత్‌తో సంబంధాలు నిలిపివేసిన దాయాది దేశానికి ఇప్పుడు మెల్లిగా కష్టాలు తెలిసొస్తున్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను చూస్తే పాక్ నుంచి భారత్‌కు వచ్చే దిగుమతుల కన్నా భారత్ నుంచి పాక్‌కు అయ్యే దిగుమతులే ఎక్కువ. ఇప్పుడు పాకిస్తాన్‌కు ప్రాణాంతక వ్యాధుల (ఉదా: రేబిస్, పాముకాటు)కు తగిన మందులు అవసరమయ్యాయి. ఈ మందులను ఇంతకు ముందు భారత్ నుంచి దిగుమతి చేసుకునేది. వాణిజ్యంపై నిషేధం దరిమిలా ఇన్ని రోజులుగా ఆ దేశంలో నిల్వ ఉన్న మందులు అయిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మందులు అందకపోతే చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశముంది. ఈ ప్రమాదాన్ని గ్రహించిన పాకిస్తాన్ వాణిజ్య శాఖ భారత్ నుంచి ఔషధాలను దిగుమతి చేసుకోవడానికి చట్టబద్ధంగా అనుమతినిచ్చిందని అక్కడి జియో న్యూస్ తెలిపింది. పిటిఐ నివేదిక ప్రకారం 2019 జులై వరకు పాకిస్తాన్ నుంచి భారత్‌కు 136 కోట్ల రూపాయల ఫార్మా ఆర్డర్ ఉంది. కశ్మీర్ విభజన నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్యం రద్దు కావడంతో ఇవి ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడు పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లిన ఇటువంటి పరిస్థితిలో పాక్‌కు భారత్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితులు అనివార్యమయ్యాయి. మరి ఈ విషయంపై మోదీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో.. వేచి చూడాలి. -
భారత్ నుంచి పాక్‌కు భారీగా దిగుమతి
ఇస్లామాబాద్: దాయాది దేశమైన పాకిస్తాన్, భారత్ నుంచి భారీ స్థాయిలో టీకాలను దిగుమతి చేసుకుంది. గత 16 నెలల్లో రూ. 250 కోట్ల విలువ చేసే యాంటీ–రేబిస్, యాంటీ–వీనమ్ వ్యాక్సీన్లను కొనుగోలు చేసినట్లు ది నేషన్ వార్తాపత్రిక గురువారం కథనాన్ని ప్రచురించింది. భారత్ నుంచి కొనుగోలు చేస్తున్న టీకాల వివరాలు, స్వదేశంలో తయారు చేస్తున్న టీకాల వివరాలను తెలపాల్సిందిగా, పాక్ సెనెటర్ రెహ్మాన్ మాలిక్ ఆ దేశ జాతీయ ఆరోగ్య సేవలు విభాగాన్ని కోరారు. దీనికి సమాధానంగా ఎన్హెచ్ఎస్ ఓ నివేదికను ఆయనకు అందించింది. తయారీకి తగిన వనరులు లేనందునే వ్యాక్సీన్లను భారత్ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. భారత్–పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సమస్యలు ఉన్నప్పటికీ వీటి దిగుమతి మాత్రం కొనసాగుతోంది. 50 శాతం కుటుంబాలకు ఆకలికేకలే! కరాచీ: పాకిస్తాన్ పోషకాహార లోపంతో కొట్టుమిట్టాడుతోంది. దేశంలో కనీసం రెండు పూటలా పోషకాహారం తీసుకోలేని కుటుంబాలు 50 శాతానికి పైగా ఉన్నాయని శుక్రవారం ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ఓ కథనం ప్రచురించింది. పేదరికం వల్ల పిల్లలు పోషకాహార లేమికి గురయ్యారని జాతీయ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘జాతీయ పోషకాహార సర్వే 2018’ తెలిపినట్లు ఆ కథనం వెల్లడించింది. పిల్లల ఆరోగ్య స్థితిని అధికారులకు తెలియజేయడమే లక్ష్యంగా 4 ప్రావిన్సుల్లో ఈ సర్వే జరిగింది. -
గోల్డ్ మాఫియా!
సాక్షి, హైదరాబాద్: ‘శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయలంటారు పెద్దలు’.. సరిగ్గా ఇలాగే బంగారం పన్ను ఎగవేతకు ఇక్కడి వ్యాపారులు అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని వాడేసుకుంటున్నారు. దీనికోసం ఏకంగా పరిశ్రమలే ఏర్పాటు చేయడం లేదా అలాంటి పరిశ్రమలతో ములాఖత్ అవ్వడం చేస్తున్నారు. హైదరాబాద్ బంగారం మార్కెట్లో ఇలాంటి గోల్మాల్ వ్యాపారాలు తరచుగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా భారీ స్కామ్‌లు ఒక్కొక్కటిగా బయటికి రావడం డెరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులనే విస్మయానికి గురిచేస్తోంది. ఈ కుంభకోణం కారణంగా కొందరు వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొట్టి.. స్థానిక మార్కెట్లో తక్కువ ధరలకు విక్రయిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. దీనికి ఇటీవల వెలుగుచూసిన ‘జెమ్స్ అండ్ జువెల్లరీ ఎస్ఈజెడ్’ఉదంతమే నిదర్శనం. బంగారు ఆభరణాల తయారీకి అనుమతి పొందిన ఈ పరిశ్రమ రాచబాటలో బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుని, పక్కదారి పట్టిస్తోంది. ఫలితంగా కోట్ల రూపాయల పన్నులు మిగుల్చుకుని జేబులో వేసుకుంటోంది. అసలేం జరిగింది?... రావిర్యాలలోని జెమ్స్ అండ్ జువెల్లరీ ఎస్ఈజెడ్ పరిశ్రమ విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకుంటారు. ఈ బంగారాన్ని స్థానిక మార్కెట్‌కు బదిలీ చేయకూడదనే నిబంధన కూడా ఉంది. ఇలా దిగుమతి చేసుకున్న బంగారానికి పన్నులు ఉండవు. ఇదే గోల్‌మాల్‌కు కారణమైంది. దిగుమతి చేసుకున్న బంగారంతో ఆభరణాలు తయారు చేసి తిరిగి విదేశాలకు ఎగుమతి చేయాలి. కానీ, వీరు అలా పంపకుండా.. చాలా స్వల్ప శాతం బంగారంతో ఆభరణాలు తయారు చేస్తున్నారు. వీటిలో అధిక శాతం రంగురాళ్లు నింపి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనిపై అధికారులకు పక్కా సమాచారం అందడంతో ఈ నెల 3, 4, 5 తేదీల్లో సదరు సంస్థపై దాడులు చేశారు. స్వా«ధీనం చేసుకున్న ఆభరణాలను, రికార్డులను చూసిన అ«ధికారులు విస్తుపోయారు. ఓ లావాదేవీలో 19 కిలోగ్రాముల బంగారం, 2 కిలోగ్రాముల రాళ్లు ఉండాలి. కానీ, 20.85 కిలోగ్రాముల రాళ్లు, కేవలం 565 గ్రాముల బంగారమే ఉండటంతో గుట్టు బయటపడింది. చాలాకాలం నుంచి ఇలాంటి పనులు చేస్తున్నారని, నగరంలో పేరున్న ఓ బడా జువెల్లరీ సంస్థకు వీటిని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకూ 1,100 కిలోల బంగారాన్ని ఇలా పక్కదారి పట్టించి భారీగా ఆర్జించారని, ప్రభుత్వానికి రూ. వేల కోట్ల పన్ను ఎగ్గొట్టినట్లుగా గుర్తించారు. రాకెట్ విదేశాల్లోనే ఉందా? వాస్తవానికి 20 కిలోల బంగారం చొప్పున విదేశాల నుంచి ఆర్డర్ వస్తే.. తిరిగి అదే బరువుకు సమానమైన ఆభరణాలు చేసి పంపాలి. కానీ, అలాకాకుండా గ్రాముల్లో బంగారం పూతపూసి, కిలోగ్రాముల్లో రంగురాళ్లు నింపి పంపుతుంటే విదేశాల నుంచి అధికారులకు ఎందుకు ఫిర్యాదు రాలేదన్నది అధికారులు పరిశీలిస్తున్నారు. విదేశాల్లోనే వీరికి సహకరించేవారు ఉన్నారని డీఆర్ఐ అధికారులు అనుమానిస్తున్నారు. బంగారం పరిమాణంలో ఇంతటి భారీ వ్యత్యాసం ఉంటున్నా.. అవతలి వాళ్లు నోరు మెదపకుండా ఎలా ఉన్నారన్న దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా, త్వరలో మరిన్ని అరెస్టులు జరగవచ్చని సమాచారం. నోట్ల రద్దు సమయంలో నగరానికే చెందిన మసద్దీలాల్ జెమ్స్ అండ్ జువెల్లరీస్ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు తప్పుడు బిల్లులు సృష్టించి ఏకంగా రూ.110 కోట్ల మేరకు గోల్మాల్ చేసినట్లు ఈడీ గుర్తించిన విషయం తెలిసిందే. రూ.82 కోట్లు విలువైన 145 కిలోల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. -
పాత ఇనుమే బంగారమాయెగా..
పార్వతీపుం: ‘‘పాత ఇనప సామాన్లు కొంటాం, పాత ప్లాస్టిక్ డబ్బాలు కొంటాం, మీకు పనికిరాని ఏ వస్తువునైనా కొంటాం’’ అంటూ వీధుల్లోకి వచ్చే వ్యాపారులను తరచూ చూస్తుంటాం. అలాంటివారిని చూసినప్పుడు మన ఇంటిలో ఉండే పాత వస్తువులు వారికి ఇచ్చి వారిచ్చే శనగలో, కొబ్బరి మిఠాయో లేక ఉల్లిపాయలో తీసుకుంటాం. వీడికి ఈ పాత సామాన్ల వల్ల ఏమొస్తుందా అనుకుంటాం కాని దీని వెనక జరుగుతున్న కథ వేరే ఉంది. పగటి పూట వీధుల్లో తిరుగే వ్యాపారులు ప్రతి వీధినీ, ప్రతి ఇంటినీ క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఆ తరువాత వారు ఇంటికి వెళ్లాక ఎక్కడ, ఏ ప్రాంతంలో ఏ వస్తువు చూశారో వారి అనుచరులకు చెబుతారు. వారు రాత్రి సమయంలో ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ వస్తువులను దొంగిలిస్తుంటారు. ఇలా దొంగిలించిన వస్తువులను పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేసే వ్యక్తికి విక్రయిస్తుంటారు. పాత ఇసుప సామానులు కొనుగోలు చేసే వ్యాపారులు దొంగిలించి తెచ్చిన వస్తువులు కాబట్టి సగానికి సగం రేటు తగ్గించి మరీ ఇస్తాడు. దీంతో ఇచ్చింది తీసుకుని వెళ్లిపోవడం దొంగల వంతౌతుంది. ఇది పాత ఇనుపసామానుల వ్యాపారం వెనుక జరుగుతున్న తంతు. ప్రభుత్వ వాహనాలు, పరిశ్రమల పరికరాలు కొనుగోలు.. పాత సామానుల వ్యాపారులు ప్రభుత్వ కార్యాలయాల్లో పాతబడి మూలకు చేరిన వాహనాలను ఆయా శాఖల్లో పనిచేసే అధికారులతో కుమ్మక్కై కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఏదైనా ప్రభుత్వ శాఖలో మూలకు చేరిన వాహనాన్ని విక్రయించాలంటే సంబంధిత శాఖ ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని ముందుగా వేలం ప్రకటన ప్రకటించాల్సి ఉంటుంది. వేలంలో ఎవరు ఎవరు ఎక్కువ ధర ఇస్తామని పాట పాడితే వారికి ఆ వాహనాన్ని అప్పగించాలి. కాని పాత ఇనుప సామానుల వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై పాత వాహనాలను టెండర్ పిలవకుండా టోకున కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో వాణిజ్య పన్నుల శాఖలో పాతబడి మూలకు చేరిన జీపును పట్టణంలోని ఓ పాత ఇనుప సామానులు కొనుగోలు చేసే వ్యాపారి కొనుగోలు చేసిన సంఘటన ఉంది. ఇలా ప్రభుత్వ వాహనాలు, విద్యుత్‌శాఖకు సంబంధించిన ఇనుప విద్యుత్ స్తంభాలను కొనుగోలు చేసిన సందర్భంలో వ్యాపారులపై కేసులు నమోదు చేసిన సంఘటనలు ఉన్నాయి. దొంగ వస్తువులు కొనుగోలు.. వివిధ ప్రాంతాల్లో దొంగంలించిన వస్తువులను వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు.గ్రామాల్లో దొంగిలించిన సైకిళ్లు, పొలాల్లో రాత్రి వేళల్లో దొంగిలించిన విద్యుత్ మోటార్లు, ఐరన్ గేట్లు, ద్విచక్ర వాహనాలను వ్యాపారులు కొనుగోలు చేసి వెనువెంటనే వాటిని నుజ్జునుజ్జు చేస్తారు. ద్విచక్ర వాహనాల విడిభాగాలను విప్పేసి విక్రయిస్తుంటారు. ఇనుప రేకులు, ప్లాస్టిక్కుర్చీలు, విద్యుత్ తీగలు, పొల్లాల్లో ఉండే మోటార్లు ఇలా అనేక రాకాల ఇనుప వస్తువులను, దొంగ సరుకును కొనుగోలు చేసి లక్షలాది రూపాయలు అర్జిస్తున్నారు. చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో ... జీఎస్టీ అమలు జరిగిన తరువాత ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఎత్తివేశారు. ఈ చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో పాత ఇనుప సామాన్లు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. గతంలో ఒడిశా నుంచి లారీల్లో ఇనుప వస్తువులు దొంగతనంగా తెస్తే ఆంధ్రా ఒడిశా చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో దొరికిపోయేవారు. మరికొందరు చెక్‌పోస్టు అధికారులతో చేయి కలిపి దొంగతనంగా రవాణా చేసేవారు. ప్రస్తుతం చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో నేరుగా వ్యాపారుల చెంతకు దొంగ సరుకు చేరుతోంది. ఒడిశాలోని అనేక పరిశ్రమల నుంచి దొంగ ఇనుప సామాన్లు ఎప్పటికప్పుడు వ్యాపారుల అక్రమంగా వాహనాల్లో పార్వతీపురం తీసుకు వస్తుంటారు. కొరవడిన తనిఖీలు పార్వతీపురం పట్టణంలో పాత ఇనుప సామాన్లు వ్యాపారం చేసేవారు పది మంది వరకు ఉంటారు. ఇందులో చిన్నా చితకా వ్యాపారులు ఆరుగురు వరకు ఉండగా ప్రతి నెలా లక్షల్లో వ్యాపారం చేసేవారు నలుగురు ఉన్నారు. వారానికి రెండు లారీల్లో ఒక్కో వ్యాపారి పాత ఇనుప సామన్లును విజయవాడకు తరలిస్తున్నారంటే పాత ఇనుప సామన్లు ఎక్కడినుంచి పుట్టికొస్తున్నాయో అర్థమౌతోంది. వీరి వద్ద పెద్ద పరిశ్రమలకు సంబంధించిన మోటర్లు, యంత్రాలు, మెషిన్లు, పెద్దపెద్ద ఇనుప కమ్మెలు, సిలెండర్లు ఉన్నా అవి ఏవిధంగా వస్తున్నాయి.ఎలా కొనుగోలు చేస్తున్నారో పోలీసులు ప్రశ్నించిన సందర్భాలు లేవు. -
పసిడిపై సుంకం 4%కి తగ్గించాలి
ముంబై: నోట్ల రద్దు, జీఎస్టీ తాలూకూ ప్రభావాలను ఇంకా ఎదుర్కొంటున్నామని, ఈ నేపథ్యంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని రత్నాభరణాల పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కట్, పాలిష్డ్ వజ్రాలు, కట్, పాలిష్డ్ రత్నాలపై పన్నును ప్రస్తుతమున్న 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాలని, వీటికి అదనంగా రుణ నిబంధనలను సరళతరం చేయాలని ఈ పరిశ్రమ కేంద్ర ఆర్థిక శాఖకు రాసిన లేఖలో పేర్కొంది. వచ్చే శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి పార్లమెంట్‌కు బడ్జెట్ సమర్పించనున్న నేపథ్యంలో తమ డిమాండ్లను అఖిల భారత జెమ్స్, జ్యుయలరీ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ లేఖ రూపంలో తెలియజేశారు. ‘‘కరెంటు ఖాతా లోటు అధికంగా ఉన్నప్పుడు దానికి కళ్లెం వేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకాన్ని 10 శాతానికి పెంచింది. నాటి నుంచి వాణిజ్య లోటు తగ్గడంతో కరెంటు ఖాతా లోటు నియంత్రణలోకి వచ్చింది. అయితే, బంగారంపై అధిక దిగుమతి సుంకాలతో ఈ లోహం దొంగ రవాణా పెరిగేందుకు దారితీస్తుంది. దీంతో సంబంధిత లక్ష్యాలు నెరవేరవు’’ అని పద్మనాభన్ పేర్కొన్నారు. బడ్జెట్లో పరిశ్రమ ఆశిస్తున్నవి ఇవే... బంగారు ఆభరణాల కొనుగోళ్ల సమయంలో విలువ రూ.2 లక్షలు, అంతకుమించి ఉంటే పాన్ నంబర్ సమర్పించాలన్న నిబంధనను సడలించాలి. రూ.5 లక్షలకు పెంచాలి. దేశంలో 50 శాతం మందికి పాన్ లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల వారికి ఇబ్బంది అవుతోంది. ప్రత్యేకంగా గుర్తించిన జోన్ల ద్వారా ముడి వజ్రాలను విదేశీ మైనింగ్ కంపెనీలు విక్రయించేందుకు ఆదాయపన్ను నిబంధనల్లో మార్పులు చేయాలి.ఇన్పుట్ సేవలపై 0.25 జీఎస్టీ ఉండాలి. మూలధన అవసరాల కోసం రుణాలను సులభంగా పొందేందుకు నిబంధనలు సడలించాలి.రత్నాభరణాల ఎగుమతులకు సంబంధించి తీసుకునే రుణాలపై 5 శాతం వడ్డీ రాయితీని తిరిగి ప్రవేశపెట్టాలి.కమోడిటీ ట్రేడింగ్ ట్యాక్స్ ఎత్తివేయాలి. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ డిమాండ్లు.. దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై సుంకాలు పెంచడంతోపాటు, వీటికి సంబంధించిన విడిభాగాల దిగుమతులపై మాత్రం సుంకాలు తగ్గించాలని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీ దారుల సంఘం (సీఈఏఎంఏ) కోరింది. ∙టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు వంటి పూర్తి స్థాయి ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు పెంచాలి. వాస్తవానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల వీటి దిగుమతులపై సుంకాలు విడిభాగాల కంటే తక్కుగా ఉంటున్నాయి. ∙కంప్రెషర్లు, ఓపెన్ సెల్, డిస్ప్లే ప్యానెళ్లపై ప్రస్తుతమున్న 10 శాతం సుంకాన్ని 5 శాతానికి తగ్గించాలి. దీనివల్ల దేశీయ తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. ధరల పరంగా స్థానిక కంపెనీలు పోటీ పడగలుగుతాయి. ఓపెన్ సెల్స్, డిస్ప్లే ప్యా నెళ్లు, కంప్రెషర్లను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం వల్ల, అధిక సుంకాల కారణంగా దేశీయ పరిశ్రమలో రెండేళ్లుగా వృద్ధి ఉండటం లేదు. ∙దేశీయంగా తయారయ్యే విడిభాగాలు, ఉత్పత్తులకు సబ్సిడీలు ఇవ్వడం వల్ల స్థానిక తయారీ పెరుగుతుంది. ∙భారీగా దిగుమతి అవుతున్న సెక్యూరిటీ, నిఘా కెమెరాల విషయమై దృష్టి సారించాలి. వీటిపై దిగుమతి సుంకాన్ని 15% నుంచి 20 శాతానికి పెంచాలి. దిగుమతులను నిరుత్సాహపరిచి, స్థాని క తయారీని ప్రోత్సహించేందుకు ఇది అవసరం. ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం ఎగుమతిదారుల సమాఖ్య ‘ఎఫ్ఐఈవో’ న్యూఢిల్లీ: నత్తనడకన ఉన్న దేశీయ ఎగుమతుల వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వపరంగా బడ్జెట్లో ప్రోత్సాహం అవసరమని భారతీయ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) పేర్కొంది. గడిచిన 2–3 నెలల్లో ఎగుమతుల వృద్ధి నామమాత్రంగానే ఉందని, ఇది ఆందోళనకరమని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ గణేశ్ కుమార్ అన్నారు. ‘‘రానున్నది మధ్యంతర బడ్జెటే అయినా కొన్ని ప్రోత్సాహకాలు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగానికి, పరిశోధన, అభివృద్ధికి ఇవ్వాల్సి ఉంది. ఇది ఎగుమతులను పెంచడంతోపాటు తయారీ, ఉద్యోగాల కల్పనకు ఊతమిస్తుంది’’ అని కుమార్ పేర్కొన్నారు. 2018 నవంబర్‌లో ఎగుమతుల వృద్ధి 0.8 శాతం, డిసెంబర్లో 0.34 శాతంగా ఉంటే, గడచిన ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 10.18 శాతం పెరుగుదలతో 245 బిలియన్ డాలర్ల మేర ఉండటం గమనార్హం. పెట్రోలియం, విద్యుత్‌పై పన్నుతోపాటు రాష్ట్రాల పన్నులను తిరిగి ఇచ్చేయాలని కోరారు. ఉద్యోగాలను కల్పించే యూనిట్లకు పన్ను రాయితీలు ఇవ్వాలని. ఎగుమతి ప్రోత్సాహక నిధి ఏర్పాటుకు సైతం డిమాండ్ చేశారు. -
విదేశీ దిగుమతుల తగ్గింపే లక్ష్యం
సాక్షి, రాజమహేంద్రవరం: కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు విదేశాల నుంచి ఆయిల్ దిగుమతిని 10 శాతం తగ్గించటమే లక్ష్యంగా ఓఎన్జీసీ పని చేస్తోందని దాని అనుబంధ విభాగం ఓఎన్జీసీ విదేశ్ డైరెక్టర్ పి.కె.రావు చెప్పారు. విదేశాల్లో సంస్థ కార్యకలాపాలు విజయవంతంగా సాగిస్తున్నట్లు చెప్పారాయన. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం అసెట్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘2002 నుంచి ఓఎన్జీసీ వివిధ దేశాల కంపెనీలతో కలసి సంయుక్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రస్తుతం 20 దేశాల్లో 41 ప్రాజెక్టులు చేపట్టాం. రష్యాలోని వెల్‌లో మైనస్ 38 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆపరేషన్స్ చేపడుతున్నాం. కొలంబియాలో 3200 బ్యారల్స్ ఉత్పిత్తి చేయగల బావిని సొంతంగా తవ్వాం’’ అని వివరించారు. ప్రస్తుతం తమ చమురు ఉత్పత్తి సామర్థ్యం 14.1 మిలియన్ మెట్రిక్ టన్నులుందని, దీన్ని 2030 నాటికి 60 ఎంఎంటీకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారాయన. సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ప్రాజెక్టుల నుంచి మన వాటాగా 26 శాతం వస్తోందని చెప్పారు. సమావేశంలో ఓఎన్జీసీ రాజమహేంద్రవరం అసెట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీఎంఆర్ శేఖర్, గ్రూప్ జనరల్ మేనేజర్ పి.కె.పాండే, కార్పొరేట్ కమ్యూనికేషన్ అధికారి ఎం.డి.జమీల్ తదితరులు పాల్నొన్నారు. -
మొబైల్స్‌కు రూపాయి సెగ..!
దేశీయ కరెన్సీ రూపాయి విలువ పతనం, దిగుమతులపై ఆధారపడిన వస్తు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్నే చూపిస్తోంది. ఒక డాలర్ కొనాలంటే తాజాగా రూ.73.34 చెల్లించాలి. కానీ, ఈ ఏడాది జనవరి 1న డాలర్‌తో రూపాయి మారకం విలువ 63.88. 2018లో ఇంతవరకు 14% నష్టపోయింది. దీంతో దిగుమతి ఆధారిత పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఇప్పటికే కాక పుట్టిస్తుండగా, మరోవైపు బంగారం ధర కూడా రేజింగ్‌లో ఉంది. ఇక ఎక్కువ మంది భారతీయులు వినియోగించే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పైనా రూపాయి ప్రభావం తీవ్రంగానే ఉంది. దేశీయ కరెన్సీ వరుసగా క్షీణిస్తూ రావడంతో చైనా కాంపోనెంట్స్‌పై ఆధారపడిన హ్యాండ్సెట్ తయారీదారులను అయోమయంలోకి నెట్టేసింది. స్మార్ట్ఫోన్లలో వాడే విడిభాగాల్లో 90% దిగుమతి చేసుకునేవే కావడం గమనార్హం. దీంతో ఇంటెక్స్ కంపెనీ తప్పనిసరి పరిస్థితుల్లో తన ప్రస్తుత మోడళ్లను ఉపసంహరించుకుని, వాటి స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఇక చైనాకు చెందిన ప్రీమియం బ్రాండ్ వన్‌ప్లస్ సహా పలు కంపెనీలు తమ స్మార్ట్ఫోన్ల ధరలను రానున్న రోజుల్లో పెంచాలన్న ఆలోచనతో ఉన్నాయి. వచ్చే మూడు నెలల్లో తమ హ్యాండ్సెట్ల ధరలను పెంచనున్నట్టు వన్‌ప్లస్ స్పష్టం చేసింది. రూపాయి క్షీణత ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికి ధరలను సమీక్షించక తప్పదని షావోమీ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. కొత్త ఎత్తుగడ... ఈ ఏడాది జూన్ నుంచి స్మార్ట్ ఫోన్ల తయారీ వ్యయం పెరిగిపోయింది. మే నెలలో రూపాయి 68కి పడిపోవడంతో మొబైల్స్ తయారీ సంస్థలకు కరెన్సీ తాలూకూ నొప్పి తెలియడం మొదలైంది. దీంతో అవి లాభసాటి కావనుకున్న కొన్ని మొబైల్స్‌ను ఉపసంహరించుకునే కార్యక్రమాన్ని మొదలు పెట్టాయి. అదే సమయంలో కొత్త మోడళ్లను, తమకు లాభసాటి అయిన ధరలతో మార్కెట్లోకి విడుదల చేసే పనిని చేపట్టాయి. ఫలితమే జూన్ నుంచి 250 స్మార్ట్‌ఫోన్ మోడళ్లు విడుదల కావడం. గతేడాది ఇదే కాలంలో విడుదలైన మోడళ్ల సంఖ్య 200 వరకే ఉంది. ‘‘ఇతర సంవత్సరాల మాదిరిగా కాకుండా జూన్ నుంచి మొబైల్స్ విడుదల ఊపందుకుంది. వ్యయాలు పెరిగిపోవడంతో కంపెనీలు కొత్త మోడళ్లతో, కొత్త ధరలతో ముందుకు వచ్చాయి’’ అని ఐడీసీ ఇండియా అనలిస్ట్ జైపాల్ సింగ్ తెలిపారు. ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ నిధి మార్కండేయ కంపెనీ చర్యను సమర్థించుకున్నారు. పాత మోడళ్ల స్థానంలో కొత్తవి ప్రవేశపెట్డడం కంపెనీ ప్రణాళికలో భాగమన్నారు. ‘‘పెరిగిన ధరల భారం మాపై ఉంది. కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా అదనపు వ్యయాన్ని కొంత వరకు సర్దుబాటు చేసుకున్నాం. పోటీలో నిలిచేందుకు మొత్తం భారాన్ని కస్టమర్‌కు బదిలీ చేయడం లేదు’’ అని చైనాకు చెందిన హ్యాండ్సెట్ సంస్థ ట్రాన్సియన్ హోల్డింగ్ సీఈవో అరీజిత్ తల్పాత్ర తెలిపారు. అయితే, వన్‌ప్లస్ వంటి ఫ్లాగ్షిప్ మోడళ్లకే పరిమితమయ్యే కంపెనీలకు ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రముఖ కంపెనీలు సైతం... కరెన్సీ పతనం కారణంగా పెరిగిన వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు షావోమీ, వివో, ఒప్పో, శామ్సంగ్ వంటి ప్రధాన కంపెనీలు కూడా నూతన మోడళ్లను ప్రవేశపెట్టడంపై దృష్టి సారించాయి. రూపాయి క్షీణత తమ అన్ని బ్రాండ్లపై భారాన్ని మోపినట్టు షావోమీ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. షావోమీ ఇటీవలే ఆరు మోడళ్లను విడుదల చేసింది. కొరియాకు చెందిన శా>మ్‌సంగ్ అయితే 12 మోడళ్లను విడుదల చేయగా, ఒప్పో, వివో కంపెనీలు అర డజను వరకు మోడళ్లను విడుదల చేశాయి. అయితే, స్మార్ట్ఫోన్ల విక్రయాలు దసరా–దీపావళి పండగల సీజన్లో ఎక్కువగా జరుగుతాయి. ఏడాదిలో మొత్తం విక్రయాల్లో 30 శాతం, ఫోన్ల విడుదలలో 60 శాతం ఈ సీజన్లోనే జరుగుతాయి. కానీ, ఇదే సమయంలో రూపాయి క్షీణిస్తుండడం మార్కెట్ వర్గాలను అసంతృప్తికి గురి చేస్తోంది. చైనా నుంచి విడిభాగాల దిగుమతి కోసం బల్క్ ఆర్డర్లను ఇస్తుంటే, అక్కడి కంపెనీలు తీసుకునే పరిస్థితి లేదంటున్నాయి. రూపాయి రానున్న రోజుల్లో మరింత క్షీణిస్తుందన్న అంచనాలే అక్కడి కంపెనీలు ఆర్డర్లు స్వీకరించకపోవడానికి కారణం. -
కందుల దిగుమతి నిలిపివేయాలి
సాక్షి, హైదరాబాద్ : కందుల దిగుమతి నిలిపివేయా లని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అధికారులతో వివిధ అంశాలపై సమీక్షిం చారు. కందులను కేంద్రం ఇతర దేశాలనుంచి దిగు మతి చేసుకుంటుందన్నారు. రాష్ట్రంలో కొన్న కందు లను మార్కెట్లోకి పూర్తిగా విడుదల చేశాకే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలన్నారు. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని ఆయన ఆదేశించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి, మొక్క జొన్న, జొన్న వంటి పంటల మద్దతు ధరలను ప్రభుత్వం వెంటనే చెల్లిస్తోందన్నారు. రైతుల నుంచి రూ. 5,618 కోట్ల విలువైన వడ్లను కొనుగోలు చేసి పూర్తిగా చెల్లింపులు చేసినట్లు మంత్రి చెప్పారు. కందులను రూ.1,427 కోట్లతోకొని, రూ.1,420 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. మిగిలిన రూ.7.33 కోట్లు రెండు రోజుల్లో చెల్లించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి శనగలు రూ.294 కోట్లతో కొనుగోలు చేస్తే రూ.265 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. మిగిలిన మొత్తాన్ని రెండు రోజుల్లో రైతులకు చెల్లించాలని నాఫెడ్, మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. మొక్కజొన్న రూ.629 కోట్లతో రైతుల నుంచి కొనుగోలు చేసి, రూ.611 కోట్లు చెల్లింపులు చేశామని తెలిపారు. మిగిలిన రూ.18 కోట్లు రెండు మూడు రోజుల్లో చెల్లించాలన్నారు. జూలై రెండో వారానికి పూర్తిచేయాలి ఎస్సారెస్పీ స్టేజ్–1 పనులను జూలై రెండో వారానికి పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సచివాలయంలో ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2 పనులు, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తొలి ఫలితం అందుకునేది ఎస్సారెస్పీ ప్రాజెక్టేనని మంత్రి చెప్పా రు. సీఎం ఆదేశాల మేరకు రాత్రింబవళ్ళు కష్టపడి పనులు పూర్తి చేయాలన్నారు. పూర్తి ఆయకట్టుకు, ఆయకట్టులోని చివరి పొలాలకు నీరు అందించాలని, ఆ దిశగా ఇంజనీర్లు పని చేయాలన్నారు. ఎస్సారెస్పీ కింద రబీలో ఏప్రిల్, మే నెలలోనూ నీరు ఇవ్వడం వల్ల పనిలో కొంత జాప్యం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి క్రిటికల్ వర్క్, స్ట్రక్చర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. కాకతీయ కాలువ పనులు నాణ్యతతో చేయాలన్నారు. షట్టర్స్ పనులు, నాణ్యతను ఈఈలు ఎప్పటికప్పుడు పరిశీలించాల న్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఈఎన్సీలు మురళీధర్, అనిల్ కుమార్lతదితరులు పాల్గొన్నారు. -
మనపై ప్రభావం తక్కువే!!
న్యూఢిల్లీ: ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై భారీ సుంకాలు విధించాలన్న అమెరికా ప్రతిపాదన... భారత్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని దేశీ ఉక్కు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా మొత్తం ఉక్కు దిగుమతుల్లో భారత్ వాటా కేవలం రెండు శాతమేనని ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్ రూర్కెలా ప్లాంటు మాజీ ఎండీ సనక్ మిశ్రా తెలిపారు. అమెరికాకు ఎగుమతి చేసే పరిమాణం తక్కువగా ఉండటం, దేశీయంగా డిమాండ్ పెరుగుతుండటం తదితర అంశాల వల్ల సుంకాల పెంపు ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండబోదని ఆయన చెప్పారు. ‘అమెరికా మొత్తం ఉక్కు దిగుమతుల్లో భారత వాటా రెండు శాతమే ఉంటుంది. దేశీయంగా ఉక్కు మార్కెట్, వినియోగం భారీగా పెరుగుతోంది‘ అని మిశ్రా తెలిపారు. మరోవైపు, ఉక్కు ఉత్పత్తులపై సుంకాలు పెంచాలన్న అమెరికా ప్రతిపాదన.. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలకు విరుద్ధమని ఎస్సార్ స్టీల్ డైరెక్టర్ (కమర్షియల్) హెచ్.శివరామ కృష్ణన్ వ్యాఖ్యానించారు. ఒకవేళ దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించిన పక్షంలో... అంతర్జాతీయంగా ఉక్కు వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. అయితే, భారత్‌పై పరోక్షంగా కొంత ప్రభావం పడొచ్చన్నారు. ‘అమెరికాకు యూరోపియన్ దేశాల నుంచి జరిగే ఎగుమతులపై ప్రధానంగా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా యూరప్‌తో పాటు ఇతర ప్రాంతాలకు భారత్ చేసే ఎగుమతులపైనా ఇది ప్రభావం చూపుతుంది’’ అని ఆయన చెప్పారు. అమెరికాకు భారత్ ఉక్కు ఎగుమతులపై స్వల్ప ప్రభావమే ఉంటుందని సెయిల్ మాజీ చైర్మన్ సుశీల్ కుమార్ రుంగ్టా చెప్పారు. అయితే అమెరికా నిర్ణయంతో మిగతా దేశాలు కూడా ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం ఉందని.. ఇది అంతర్జాతీయంగా ఉక్కు వ్యాపారంలో పెను మార్పులు తీసుకురావచ్చని.. లేదా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్కు దిగుమతులపై 25%, అల్యూమినియంపై 10% సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించడం తెలిసిందే. దీనికి అధికారిక ముద్ర వేస్తూ.. వచ్చేవారం ఈ ప్రతిపాదనపై ఆయన సంతకాలు చేసే అవకాశముంది. ఇతర దేశాలపైనే ఎక్కువ ప్రభావం: కొటక్ సుంకాల పెంపు అమలైతే... ఇతర దేశాల నుంచి అమెరికాకు ఉక్కు ఎగుమతులు సుమారు 9–14 మిలియన్ టన్నుల మేర తగ్గొచ్చని కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ఒక నివేదికలో పేర్కొంది. ‘దిగుమతి సుంకాలను పెంచడంతో పాటు దేశీయంగా ఉక్కు మిల్లుల సామర్థ్యాలను ప్రస్తుతమున్న 72 శాతం స్థాయి నుంచి 80– 85 శాతం స్థాయికి పెంచాలన్న అమెరికా నిర్ణయాలతో ఆ దేశానికి ఇతర దేశాల నుంచి ఉక్కు ఎగుమతులు 9– 14 మిలియన్ టన్నుల మేర తగ్గొచ్చు’’ అని అంచనా వేసింది. 2017లో అమెరికా 82 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయగా 36 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంది. ఒకవేళ ప్లాంట్ల సామర్థ్యం మెరుగుపడి ఉక్కు ఉత్పత్తి 91–96 మిలియన్ టన్నులకు పెరిగిన పక్షంలో దిగుమతులు 22– 25 ఎంటీకి తగ్గిపోవచ్చని అంచనా. అమెరికాకు ఉక్కు ఎగుమతుల్లో కెనడా, బ్రెజిల్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా దేశాల వాటా దాదాపు 60 శాతం. గతేడాది భారత్ 0.9 ఎంటీ ఉక్కు మాత్రమే ఎగుమతి చేసింది. అయితే అమెరికా తీసుకునే రక్షణాత్మక చర్యల ప్రభావం ప్రపంచ ఉక్కు మార్కెట్లపై ప్రత్యక్షంగా మాత్రం తక్కువ స్థాయిలోనే ఉండవచ్చని ఈ నివేదిక అభిప్రాయపడింది. మరోవైపు, సుంకాల పెంపు ప్రపంచ వాణిజ్యంతో పాటు అమెరికా ఎకానమీపైనా, అక్కడి తయారీ.. నిర్మాణ రంగాలపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రతినిధి గెర్రీ రైస్ పేర్కొన్నారు. ఇంకా మినహాయింపులెందుకు?: విల్బర్ రాస్ ఉక్కు, అల్యూమినియంపై దిగుమతుల సుంకాల పెంపు ప్రతిపాదనను అమెరికా సమర్థించుకుంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక దశాబ్దాలుగా చైనా, జర్మనీ వంటి దేశాలకు అన్ని రకాల మినహాయింపులిస్తూ వస్తున్న తప్పుడు విధానాలను సరిదిద్దేందుకు ఇది ఉపయోగపడుతుందని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రాస్ వ్యాఖ్యానించారు. ప్రతీకార చర్యగా యూరోపియన్ దేశాలు కూడా అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు పెంచవచ్చన్న ఆందోళనలు అర్ధరహితమని ఆయన కొట్టిపారేశారు. ‘రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఆ ప్రభావాల నుంచి యూరప్, ఆసియా దేశాలకు తోడ్పాటునివ్వాలన్న సదుద్దేశంతో అప్పట్లో అన్ని రకాల మినహాయింపులు ఇచ్చేశాం. కానీ ఆయా దేశాలు ప్రస్తుతం పటిష్టంగా ఎదిగాక కూడా వాటిని కొనసాగించడం అర్ధరహితం. గతంలో చేసిన అనేక తప్పిదాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది’ అని రాస్ పేర్కొన్నారు. అటు యూరోపియన్ యూనియన్ కొంత ప్రతీకార చర్యలకూ దిగే అవకాశమూ ఉందన్నారు. అయితే, ఇది కేవలం 3 బిలియన్ డాలర్ల మేర అమెరికన్ ఉత్పత్తులకే పరిమితం కాగలదని రాస్ వ్యాఖ్యానించారు. ‘నాఫ్టా’ని సరిచేస్తే పునరాలోచిస్తా: ట్రంప్ సుంకాల విధింపు అంశం అంతర్జాతీయంగా ఉక్కు పరిశ్రమలో ప్రకంపలను సృష్టిస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా మరో ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో (నాఫ్టా) లోపాలను సరిదిద్ది ‘సముచితమైన, కొత్త’ ఒప్పందం రూపొందిన పక్షంలో ఉక్కు, అల్యూమినియంపై ప్రతిపాదిత సుంకాల విధింపు అంశాన్ని పక్కన పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని తాజాగా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఆయన పేర్కొన్నారు. ‘కెనడా, మెక్సికోతో అమెరికాకు భారీ వాణిజ్య లోటు ఉంది. ప్రస్తుతం పునఃసమీక్ష జరుగుతున్నప్పటికీ.. నాఫ్తా ఒప్పందం అమెరికాకు కంపెనీలు, ఉద్యోగాలపరంగా ప్రతికూలంగానే ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో సముచితమైన రీతిలో కొత్తగా నాఫ్తా ఒప్పందం కుదిరిన పక్షంలో మాత్రమే సుంకాల అంశం పక్కన పెట్టే అవకాశం ఉంది‘ అని వివరించారు. -
ఏనుగు దంతాల దిగుమతిపై అమెరికా నిషేధం
వాషింగ్టన్: వన్యప్రాణుల సంరక్షణ కోసం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి తమ దేశంలోకి ఏనుగు దంతాల దిగుమతిపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశాధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఏనుగుల వేటను ‘హారర్ షో’గా అభివర్ణించారు. ఆఫ్రికా దేశాలైన జాంబియా, జింబాబ్వేల నుంచి దిగుమతి అయ్యే ఏనుగు దంతాలపై నిషేధాన్ని విధిస్తున్నట్లు స్పష్టంచేశారు. అమెరికా మత్స్య, వన్యప్రాణి సేవా విభాగం ఏనుగు దంతాల దిగుమతిపై నిషేధాన్ని విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేశారు. వారంరోజుల తర్వాత దీనిపై నిర్ణయాన్ని ప్రకటిస్తామన్న ట్రంప్.. అంతలోనే నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏనుగుల వేట తనను చాలా కదిలించిందని, దంతాల కోసం వాటిని హతమార్చడం హారర్ షో లాంటిదని ట్రంప్ పేర్కొన్నారు. తాము తీసుకున్న నిర్ణయం ఏనుగుల ప్రాణాలను కాపాడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఒబామా హయాంలోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. అప్పటి ప్రభుత్వ నిర్ణయాలను ఒక్కొక్కటిగా సమీక్షిస్తున్న ట్రంప్ సర్కార్.. దాదాపుగా అన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగానే కొత్త చట్టాలను అమలు చేస్తూ వచ్చింది. అయితే ఏనుగుల దంతాల దిగుమతి విషయంలో మాత్రం ఒబామా సర్కార్ తీసుకున్న నిర్ణయానికే ట్రంప్ మద్దతు పలికారు. ఇప్పటికైనా కఠిన నిర్ణయం తీసుకోకపోతే మరో రెండుమూడేళ్లలో ఏనుగులు అంతరించిపోతాయన్న వన్యప్రాణి సంరక్షణ సంస్థల హెచ్చరికల నేపథ్యంలోనే ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని చెబుతున్నారు. -
దేవతా విగ్రహాలు కూడా అక్కడి నుంచే..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతీయుల్లో జాతీయ భావం పెరిగింది. ఫలితంగా దేశంలో ఉన్న 82 శాతం హిందూ మత విశ్వాసకుల్లో దైవ చింతన కూడా పెరిగి దేవతా విగ్రహాల కొనుగోళ్లు కూడా పెరిగిందట. ఏ పట్టణంలో, ఏ బజారుకెళ్లిన మనకు నచ్చే దేవతా విగ్రహాలు ఇట్టే దొరుకుతున్నాయి. అవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయో మనకు తెలియదు. దుకాణదారుడికి కూడా తెలియకపోవచ్చు, తెలిసినా చెప్పడు. ఎందుకంటే అవన్ని కూడా చైనా నుంచే దిగుమతి అవుతున్నాయట. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కొన్ని కోట్ల విగ్రహాలను చైనా మార్కెట్ భారత్‌లో విక్రయించినట్లు ఓ అధ్యయనంలో తేలింది. 2014లో అధికారంలోకి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, వచ్చీరాగానే ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని తీసుకొచ్చారు. దానికి విస్తత ప్రచారాన్ని కల్పించారు. అయినప్పటికీ పరిస్థితుల్లో పెద్దగా మార్పులేదు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా చైనా వస్తువులను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో విస్తతంగా ప్రచారం జరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే చైనా వస్తువులు దేశీయంకన్నా చౌకవడమే. డబ్బుల దగ్గరకి వచ్చేసరకల్లా భారతీయులు జాతీయ భావాన్ని పక్కన పడేస్తున్నారు. ఒక్క 2016 సంవత్సరంలోనే భారత్ నుంచి చైనాకు 26,400 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరగ్గా, చైనా నుంచి భారత్‌కు 2,09,800 కోట్ల రూపాయల దిగుమతులు జరిగాయి. భారత్, చైనా మధ్య కుదుర్చుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కూడా చైనాకే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. చైనా, భారత్‌ల మధ్య ఎగుమతి, దిగుమతుల నిష్పత్తి రేషియో 6–1గా ఉంది. చైనా వస్తువులు చౌకవడానికి చాలా కారణాలున్నాయి. కారణాలు..... 1. ఏ వస్తువులనైనా చైనా భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తోంది. ఓ భారతీయ ఉత్పత్తిదారుడి వద్ద మూడు ప్లాస్టిక్ ఇంజెక్షన్ మౌల్డింగ్ యంత్రాలుంటే చైనా ప్రత్యర్థి వద్ద 70 ఉంటాయి. ఎక్కువ యూనిట్లు ఉండి, ఎక్కువ ఉత్పత్తి చేస్తే ధర తగ్గుతుందని తెల్సిందే. 2. మ్యాక్ కిన్సే రిపోర్టు ప్రకారం భారతీయ కార్మికులతో పోలిస్తే చైనా కార్మికుల ఉత్పాదన రేటు నాలుగు నుంచి ఐదింతలు ఎక్కువ. భారత కార్మికులకన్నా జీతాలు ఎక్కువ తీసుకున్నప్పటికీ చైనా కార్మికులు జీతంతో పోల్చినా భారతీయులకన్నా ఎక్కువ పనిచేస్తారు. భారతీయ కంపెనీల్లో అత్యాధునిక యంత్రాలు లేకపోవడం, నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడం, సప్లై చైన్‌ను సరిగ్గా లేకపోవడం తదితర కారణాలే కాకుండా 99 మంది కార్మికుల సంఖ్యను మించకుండా ఉండేందుకు ప్యాక్టరీ సామర్థ్యాన్ని పరిమితం చేయడం. వందా, ఆపైనా కార్మికులన్న కంపెనీకి 1947 నాటి పారిశ్రామిక వివాదాల చట్టం వర్తించడమే అందుకు కారణం. ఈ చట్టం పరిధిలోకి వచ్చే కంపెనీలు నష్టాలు వచ్చినా ప్రభుత్వం అనుమతి లేకుండా కంపెనీని మూయరాదు, ఓ ఉద్యోగిని తీసేయరాదు. ఇలాంటి ఇబ్బందులు చైనా కంపెనీలకు లేవు. 3. అవినీతి ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన 176 దేశాల జాబితాలో భారత్–చైనా దేశాలు రెండూ కూడా 79వ స్థానాన్ని ఆక్రమించాయి. చైనాలో ఉన్నత స్థాయిలో అప్పుడప్పుడు మాత్రమే అవినీతి జరుగుతుండగా, భారత్‌లో కిందిస్థాయిలో తరచూ జరుగుతుందీ. ఫలింగా ఉత్పత్తిపై చైనా అవినీతి ప్రభావం పెద్దగా ఉండడం లేదు. భారత్‌లో ఎక్కువగా ఉంటోంది. 4. కార్మికుల సమ్మెలు కూడా కారణమే భారత దేశంలో దాదాపు 16 వేల బలమైన కార్మిక సంఘాలు ఉన్నాయి. ఇవి దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నాయి. కనుక సమ్మెలు, ఆందోళనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ సమ్మెలను నియంత్రించేందుకు కార్మిక చట్టాల్లో సవరణలు తీసుకొస్తానని నరేంద్ర మోదీ ప్రకటించారు. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దేశంలో సమ్మెల వల్ల ఏటా 2.30 కోట్ల మంది పని దినాల నష్టం జరుగుతోంది. చైనాలో అఖిల చైనా కార్మిక సంఘాల సమాఖ్య అనే ఏకైక కార్మిక సంఘం ఉంది. అది కూడా ప్రభుత్వం నియంత్రణలోనే ఉంటుంది. 5. విద్యుత్ అంతరాయం భారత్‌లో విద్యుత్ చార్జీలు ఎక్కువవడమే కాకుండా సరఫరాలో కూడా అంతరాయం ఎక్కువగా ఉంటుంది. పరిశ్రమలకు సరఫరాలో కోత కూడా విధిస్తారు. ఈ పరిస్థితి చైనాలో లేదు. పైగా భారత్‌తో పోలిస్తే చైనాలో రవాణా చార్జీలు కూడా చవకా. 6. స్థలం దొరకడం చాలా కష్టం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు స్థలం దొరకడం భారత్‌లో చాలా కష్టం. ఇరుదేశాల జనాభా దాదాపు ఒకే స్థాయిలో ఉన్న భారత భూభాగం చైనా భూభాగంలో మూడోవంతు ఉంది. కొత్త పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడంలో కూడా భారత్‌లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. బ్యూరోక్రసి ఎక్కువ. 7. ఎగుమతులకు ప్రోత్సాహం చైనా ప్రభుత్వం తమ దేశం నుంచి ఎగుమతులను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. అందుకు కారణం 45 శాతం ఉత్పత్తులు ప్రభుత్వరంగానివే కావడం. భారత్‌లో దేశీయ సరకులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, వాటి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు విధిస్తోంది. -
బంగారం దిగుమతులు రెండింతలు
న్యూఢిల్లీ: దేశంలో బంగారానికి డిమాండ్ తగ్గలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలం (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు)లో దిగుమతులు రెట్టింపయ్యాయి. 16.95 బిలియన్ డాలర్ల (రూ.1,0,500 కోట్లు) విలువైన పసిడి దేశంలోకి దిగుమతి అయింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో దిగుమతులు 6.88 బిలియన్ డాలర్లు (రూ.44,000 కోట్లు)గానే ఉన్నాయి. సెప్టెంబర్‌లో మాత్రం దిగుమతులు 5 శాతం తగ్గి 1.71 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. బంగారం దిగుమతులు దేశ కరెంటు ఖాతా లోటు(సీఏడీ), వాణిజ్య లోటును పెంచుతాయన్న విషయం తెలిసిందే. అయితే, సెప్టెంబర్‌లో కొంత మేర దిగుమతులు తగ్గడంతో వాణిజ్య లోటు (ఎగుమతుల కంటే దిగుమతుల విలువ ఎక్కువవడం) ఏడు నెలల కనిష్ట స్థాయి 8.98 బిలియన్ డాలర్ల (రూ.57,500 కోట్లు) దగ్గరే ఆగింది. అయితే, పండుగలు ఉండటంతో ఈ నెలలో దిగుమతులు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో చైనా తర్వాత మన దేశమే బంగారానికి అతిపెద్ద వినియోగ కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్‌ను అందుకునేందుకు వర్తకులు దిగుమతులపై ఆధారపడుతున్నారు. దక్షిణ కొరియాతో మన దేశానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉండటంతో ఆ దేశం నుంచి దిగుమతులు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. -
ఆంధ్రా బియ్యానికి రాయపూర్ దెబ్బ
ఎగుమతులు లేక వ్యాపారులు విలవిల మన కంటే తక్కువ ధరకు చత్తీస్ఘడ్ సరుకు కాకినాడ పోర్టు నుంచి అవే విదేశాలకు రైతుల వద్ద ధాన్యం నిల్వలు తాడేపల్లిగూడెం: ఆంధ్రా బియ్యానికి రాయపూర్ దెబ్బ తగిలింది. ఈ దెబ్బ ప్రభావం నేరుగా ఎగుమతులపై పడింది. ’’జీఎస్టీ వస్తుంది బియ్యం ధరలు తగ్గుతాయని’’ భారీగా ప్రచారం చేసిన మిల్లర్లు, వ్యాపారులు రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని అయిన కాడికి కొనేందుకు చూస్తున్నారు. ఇదే సమయంలో బియ్యం ఎగుమతులకు రాయ్‌పూర్ దెబ్బ తగిలింది. ఇటు బియ్యం ఎగుమతులు, అటు ధాన్యం కొనుగోళ్లు అరువు ప్రాతిపదికన మాత్రమే నడిచే పరిస్థితి వచ్చింది. రెండు నెలల క్రితం వరకు రైతు దగ్గర ధాన్యం ఉంటే చాలు వ్యాపారులు కొంటారులే అనే ధీమా ఉండేది. జీఎస్టీ పుణ్యాన సీన్ కాస్తా రివర్స్ అయ్యింది. 75 కిలోల ధాన్యం బస్తా ధర జీఎస్టీ రాక ముందు 1400 రూపాయల వరకు ఎగబాకింది. ఎప్పుడైతే జీఎస్టీ అమల్లోకి వచ్చిందో బియ్యం ధరలు పడిపోతాయని వ్యాపారులు, మిల్లర్లు పెద్దెత్తున ప్రచారం చేశారు. దాంతో «ధాన్యం ధరలు తగ్గిపోయాయి. జిల్లాలో ఎక్కువగా పండించే 1010 రకం« ధాన్యాన్ని ఇక్కడ ఎవ్వరూ తినే పరిస్థితి లేదు. సోనా అనో... పాలిష్ రైస్ అనో .. బ్రాండెడ్ సన్న బియ్యం అనో.. అవే తినే అలవాటులో పడిపోవడంతో మన దగ్గర పండిన ధాన్యం మనమే తినే అలవాటు లేకుండా పోయింది. ముతక రకం బియ్యంగా పిలుచుకొనే ఈ రకాలను కొండ ప్రాంతాల ప్రజలు బాగా ఇష్టపడతారు. దీంతో ఆయా దేశాలకు ఇక్కడి నుంచి కాకినాడ పోర్టు ద్వారా బియ్యం సరఫరా చేసేవారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎగుమతి కంపెనీదారుల ప్రతినిధుల నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ తీసుకొని ఇక్కడి మిల్లర్లు , వ్యాపారులు బియ్యాన్ని నేరుగా కాకినాడకు పంపి ఎగుమతి చేసేవారు. క్రమేణా మన బియ్యానికి ఇతర రాష్ట్రాల వ్యాపారులు పోటీకి దిగారు. ఎఫ్‌సీఐ లెవీగా బియ్యాన్ని మిల్లర్ల నుంచి తీసుకున్న సందర్భాలలో కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ (కనీస మద్దతు ధర)ని కచ్చితంగా అమలు చేసేవారు. ఇతర రాష్ట్రాలలో చూస్తే అండర్ సేల్ మద్దతు ధర కంటే తక్కువగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం ఎగుమతుల విషయంలో పోటీ ఏర్పడింది. ముఖ్యంగా చత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్ వంటి ప్రాంతం నుంచి బియ్యం కాకినాడకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతోంది. ఆ రాష్ట్ర వ్యాపారులు ఇచ్చినంత తక్కువ ధరకు ఏపీ వ్యాపారులు, మిల్లర్లు బియ్యం ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఇక్కడి ఎగుమతులపై నీలినీడలు అలముకున్నాయి. ప్రస్తుతం ఎగుమతి రకం బియ్యం ధర క్వింటాలుకు రూ. 2200 నుంచి రూ. 2300 వరకు వస్తుంది. ఈ ధరకు ఇక్కడి వ్యాపారులు బియ్యం ఎగుమతి చేసే అవకాశాలు లేకుండా పోయాయి. ధాన్యానికి జీఎస్టీ దెబ్బ జీఎస్టీ వస్తే బ్రాండెడ్ బియ్యంపై ఐదు శాతం పన్ను ఉంటుందని ప్రచారం సాగింది. బ్రాండ్ల పేరిట కాకుండా విక్రయించే బియ్యం ధరలు భారీగా తగ్గుతాయని ప్రచారం చేశారు. దీంతో ధాన్యాలను మార్కెట్లో వ్యాపారులు కొనడం మానేశారు. నెలాపదిహేను రోజులుగా జీఎస్టీ ప్రభావం ధాన్యం ఖరీదులపై పడింది. జీఎస్టీకి ముందు తర్వాత అన్నట్టుగా ధాన్యం కొనుగోళ్లు మారాయి. 75 కిలోల బస్తా 1010 రకం ధాన్యం గతంలో 1450 రూపాయలకు వెళితే.. ప్రస్తుతం ఆ ధర 1300 లకు ఆగిపోయింది. పైగా నెల రోజుల పాటు అరువు. ప్రస్తుతం ఈ రకం బస్తా ధర 1450 రూపాయల వద్దే ఆగిపోయింది. 1121, 1156 రకం ధాన్యం బస్తా 1225 రూపాయల వద్ద ఉంది. పీఎల్ రకం 1450 రూపాయల దగ్గర ఆగిపోయింది. ధాన్యం సుమారుగా రైతుల వద్ద జిల్లాలో లక్ష క్వింటాళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ« ధాన్యం అమ్ముకోవాలన్నా అరువు ప్రాతిపదికన విక్రయించు కోవాల్సిందే. ధాన్యం ఉపఉత్పత్తులైన తవుడు ,నూకల ధరలపై కూడా ఈ ప్రభావాలు పడ్డాయి. తవుడు క్వింటాలు 1600, నూకలు 1750 రూపాయల వద్ద ఉండిపోయాయి. -
ఇప్కా లాబ్స్‌కు యూఎస్ఎఫ్డీఏ షాక్
ముంబై: దేశీయ ఫార్మా సంస్థ ఇప్కా లేబ్స్ తయరు చేసిన మందును అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ షాక్ తగిలింది. రత్లాం, సిల్వస్సా, పీతంబూర్ మూడు యూనిట్లలో తయారయ్యే అన్ని రకాల ఔషధాల దిగుమతులపై యూఎస్ఎఫ్డీఏ బ్యాన్ విధించడంతో ఇప్కా లేబ్స్ షేర్ భారీ పతనాన్ని నమోదు చేసింది. బీఎస్ఈలో ఈ షేరు 15 శాతం కుప్పకూలింది. మధ్యప్రదేశ్‌లోని పీతంపూర్, రత్లాం, సిల్వస్సా (దాద్రా నగర్ హవేలి) లో తయరుచేసిన అన్ని ఔషధాలపై నిషేధం కొనసాగుతుందని ఇప్కా లాబొరేటరీస్ ఒక ప్రకటనలో తెలిపింది . ఈ తయారీ కేంద్రాల నుండి తయారైన ఔషధ ఉత్పత్తులు , అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన మందులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని ప్రకటించేదాకా బ్యాన్ కొనసాగుతుందని పేర్కొంది. కాగా రత్లాం యూనిట్లో క్లోరోక్విన్ ఏపీఐ తయారీకి మాత్రం యూఎస్ఎఫ్డీఏ వెసులుబాటు కల్పించినట్లు కంపెనీ పేర్కొంది. అమెరికా మార్కెట్లో ఈ ఏపీఐకు కరవు ఏర్పడినా లేదా అవసరం ఏర్పడినా వీటి విక్రయాలను అనుమతించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దేశీయ మార్కెట్లో పార్మా బలహీనత కొనసాగుతోంది. దీంతో ఫార్మాసెక్టార్కు దూరంగా ఉండాలని కూడా ఎనలిస్టులు సూచిస్తున్నారు. -
ఇండియాలోకి అమెరికా చికెన్ లెగ్స్ దిగుమతి ?
-
ఇండో-పాక్ పై మోదీకి స్వామి లేఖ
న్యూఢిల్లీ: ఇండో-పాక్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలపై బీజీపీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. దేశీయ పరిశ్రమలు, జాతీయ భద్రత రీత్యా పాకిస్తాన్ నుంచి సిమెంట్ దిగుమతిని నిషేధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, దేశీయ సిమెంట్ పరిశ్రమ ఉనికిని కాపాడుకోవడం, జాతీయ భద్రతా కారణాలరీత్యా మాత్రమే దేశంలోకి సిమెంట్ దిగుమతి నిషేధించాలని అభ్యర్థిస్తున్నానని స్వామి మోదీకి రాసిన ఒక లేఖలో విజ్క్షప్తి చేశారు. పాకిస్తాన్ నుంచి సిమెంట్ దిగుమతులను అనుమతించడమంటే నిషిద్ధ వస్తువులు, హానికరమైన ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి అక్రమ రవాణాకు ఆస్కారం అందించినట్టేనని ఆయన వాదించారు. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ నుంచి సిమెంట్ దిగుమతికి మన దేశం ఒక డంపింగ్ గ్రౌండ్ గా మారిందన్నారు. పాకిస్తాన్ నుంచి పన్నులు లేని సిమెంట్ దిగుమతులకు అనుమతి ఇవ్వడం ద్వారా దేశీయ సిమెంట్ పరిశ్రలను పణంగా పెట్టారని విమర్శించారు. సిమెంట్ పై కాకుండా సిమెంట్ తయారీకి అవసరమైన పదార్థాలపై పన్నులు విధించడం ద్వారా దిగుమతి సుంకాన్ని ఆకర్షించవచ్చని స్వామి సూచించారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్ ఇండియా కాన్సెప్ట్ కు ఇది వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. -
మనం తినేవన్నీ అవా..!
మనం మార్కెట్లో కొనుక్కుని తెచ్చునే తాజా పండ్లు, కూరగాయల్లో 35 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవని చెబుతున్నారు 177 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్(ఐసీటీఏ) నిర్వహించిన ఓ సర్వేలో ఈ నిజం వెలుగులోకి వచ్చింది. నిత్యవసరాలకు ఉపయోగించే బంగాళదుంప, ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చి మిర్చిలను భారత్ ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోందని వీరు చెబుతున్నారు. భారత్ లో లభ్యమయ్యే కూరగాయలు, పండ్లు, దినుసులు, నూనెలు, పంచదారల్లో మూడో వంతు దిగుమతి చేసుకున్నవేనని అంటున్నారు. ఉల్లిపాయలు, గోధుమలను పశ్చిమ ఆసియా నుంచి, బంగాళదుంప, టమాటోలను దక్షిణ అమెరికా నుంచి, దినుసులను మధ్యదరా సముద్రం చుట్టుపక్కల దేశాలనుంచి, అల్లం, ఆపిల్ లను మధ్య ఆసియా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వివరించారు. -
చక్కని పండు.. రుచిలో మెండు
ఔషధ గుణాల ఖర్జూరాలు.. ఉపవాస దీక్ష విరమణలో ప్రధమ స్థానం రంజాన్ మాసంలో విరివిగా అమ్మకాలు నగరానికి 65కి పైగా రకాల దిగుమతి నిగనిగలాడే రంగు.. చూడచక్కని రూపం దూరం నుంచే నోరూరించే నైజం.. నోట్లో వేసుకుంటే కరిగిపోయి.. తక్షణం శక్తినిచ్చే లక్షణం ఖర్జూర పండు సొంతం. అంతేనా.. ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయండోయ్. అందుకే రంజాన్ మాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం పాటించి దీక్షను విరమించేటప్పుడు తొలుత ఈ పండునే నోట్లో వేసుకుంటారు. దీన్ని తీసుకోవడంవల్లశరీరానికి తక్షణ శక్తితో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. రంజాన్ మాసంలో ముస్లింలు ప్రశాంతతను నింపే నమాజ్‌లు, నిబద్ధతతో కూడిన ఉపవాసం చేస్తుంటారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్న పానీయాలను త్యజించి రోజాను పాటిస్తారు. వీరికి ఇఫ్తార్ సమయానికి తప్పక గుర్తుకొచ్చేది ఖజూర్ (కర్జూరం). ఉపవాస దీక్షను ఖజూర్తోనే విరమించడం ‘సున్నత్’గా పేర్కొంటారు. - సాక్షి, సిటీబ్యూరో వారెవ్వా.. అజ్వా..! ఖజూర్ రకాలన్నింటిలోకీ చాలా ఖరీదైన రకం అజ్వా. సౌదీ అరేబియాలో పండే ఈ రకం ఖజూర్ ప్రపంచంలోకెల్లా అత్యంత తియ్యనైన పండుగా గుర్తింపు పొందింది. నల్లటి రంగులో ఉండే అజ్వా ఖజూర్లోని గింజలను తొలగించి, వీటిలో పూర్తిగా బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌ను స్టఫ్ చేసి వాటిని తేనెలో వాటిపై కుంకుమపువ్వును వేసుకుని నోట్లో వేసుకుంటే.. ఆ రుచి ఇక మరిచిపోలేం. అందుకూ ఈ పండు ధర కూడా అధికమే. ఇఫ్తార్‌కు ఈ పండు తప్పనిసరి ఉపవాస దీక్ష ముగిసి ఇఫ్తార్ సమయంలో ఖర్జూరం పండ్లనే అధిక శాతం తీసుకుంటారు. ప్రస్తుతం నగరంలో వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. భారత్‌లో పండే ఖర్జూరాలతో పాటు సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, జోర్డాన్ వంటి దేశాలకు చెందిన దాదాపు 65 రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కల్మీ, సుక్రీ, క్లాస్, సుగాఈ-వార్డ్, అజ్వా, మెడ్‌జాల్ కింగ్, మరియమ్, జఫ్రాన్ రకాలు ముఖ్యమైనవి. రకాన్ని బట్టి కిలో రూ.80 నుంచి రూ. 4000 ధర పలుకుతున్నాయి. నోరూరించే ‘సగాయి’.. అజ్వా తరువాత తియ్యదనంలో మేటిగా చెప్పబడే రకం సగాయి. దుబాయ్‌లో ఈ సగాయి రకం ఖర్జూరం అధికంగా పండుతుంది. ప్రపంచ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న ఖజూర్ ఇది. ఇవి కూడా కేవలం ఖజూర్గానే కాక వీటిలో డ్రై ఫ్రూట్స్ స్టఫ్ చేసి వాటికి వైట్ హనీని జతచేసి కుంకుమ పువ్వుతో కలిపి అమ్ముతారు. త్రిగల్ బందీ.. శిల్పారామం ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా మారింది. వారాంతపు వేడులో భాగంగా కందుల కూచిపూడి నాట్యాలయం ఆధ్వర్యంలో మోహినీ అట్టం, ఒడిస్సీ, కూచిపూడి మిళితంగా ‘త్రిగల్ బందీ’ ప్రదర్శించి అలరించారు. స్వర్ణదీప మోహినీ ఆట్టంతోను, దేబాశీష్ పట్నాయక్ ఒడిస్సీతోను, రవి కూచిపూడి నాట్యాన్ని కలిపి ప్రేక్షకులను సమ్మోహనపరిచారు. కార్యక్రమంలో ప్రముఖ కూచిపూడి కళాకారిణి డాక్టర్ యశోద ఠాకుర్, హేమ పటేల్, డాక్టర్ క్రిష్ణ, డాక్టర్ కన్నయ్య పాల్గొని కళాకారులను సత్కరించారు.- మాదాపూర్ చిలుకూరు కిటకిట చిలుకూరు బాలాజీ దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవుల చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. పర్యావరణ పరిరక్షణకోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలనే సంకల్పంతో సాయంత్రం ‘వృక్షారోపనం’ కార్యక్రమం చేపట్టారు. మెదక్ జిల్లాకు చెందిన ఓ భక్తుడు అందజేసిన 500 మొక్కలకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు పంపిణీ చేశారు. - మొయినాబాద్ కొనేటప్పుడు జాగ్రత్తసుమా..! మార్కెట్లో చాలా రకాల ఖర్జూరాలు దొరుకుతున్నాయి. అయితే, కొందరు వ్యాపారులు అవకాశాన్నిబట్టి నాసిరకం కూడా అమ్మేస్తుంటారు. అందుకే మనం చెల్లించే డబ్బుకు తగినట్టుగా నాణ్యమైన ఖర్జూరాలను తీసుకునేందుకు చిన్నపాటి జాగ్రత్తలు పాటించాలి. ఖర్జూరాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు ఎలాంటి జిగురు అంటకూడదు. అలా ఉంటే నిగనిగలాడేందుకు ఎలాంటి రసాయనాలు వాడలేదని అర్థం. ఖర్జూరాల పైపొర పల్చగా ఉండి, గుజ్జు తాజాగా ఉండాలి. నాణ్యమైన ఖర్జూరాలు ఆరు నెలల వరకు నిల్వ ఉంటాయి. ఎంత నిర్లక్ష్యం..! నగరంలో వాహన రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పెద్దవారే ఈ రద్దీలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. ఇక చిన్నారుల సంగతి అత్యంత దారుణంగా ఉంటుంది. విద్యార్థులు బడికి వెళ్లి రావడానికి.. వారు చదివే స్కూళ్లు ఉన్న వీధుల్లో ‘ఇక్కడ స్కూలు ఉంది’ అని సూచిస్తూ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన సైన్ బోర్డులు ఇప్పుడు విరిగిపోయి ఫుట్‌పాత్‌పై పడిపోయాయి. మరికొన్ని చోట్ల ఆ బోర్డులు కనిపించకుండా చిరువ్యాపారులు ఆక్రమించేశారు. సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనైనా ఈ బోర్డులను సరి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇవి విద్యార్థులు పట్ల అధికారులకు గల బాధ్యతకు అద్దం పడుతున్నాయి. -
పప్పుల ధరలు పైపైకి
* గ్రేడ్-1 కంది కిలో ధర రూ.145 నుంచి రూ.150, గ్రేడ్-2 రూ.125 నుంచి రూ.130 * గత ఏడాదితో పోలిస్తే రూ.50 నుంచి రూ.60 మేర ఎక్కువ * తగ్గిన పప్పుధాన్యాల దిగుబడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి భగభగల మాదిరే.. పప్పుల ధరలు దడ పుట్టిస్తున్నాయి. పప్పుధాన్యాల దిగుబడి, పప్పుల దిగుమతి పడిపోయింది. వినియోగదారుల దిగులు పెరిగిపోయింది. దీంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధరలు మండిపోతున్నాయి. గడిచిన నెల రోజుల్లోనే కందిపప్పు ధర రూ.10 మేర పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు అదనంగా రూ.50 నుంచి రూ.60 వరకు పెరిగాయి. గత ఏడాది ఖరీఫ్‌లో మొత్తంగా 4.67 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగు కావాల్సి ఉండగా కేవలం 3.17 లక్షల హెక్టార్లలోనే రైతులు సాగు చేశారు. పెసర 48 శాతం, మినుములు 45 శాతం, కందులు 78 శాతం మేర సాగు అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీంతో పప్పుధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. కంది మొత్తం ఉత్పత్తి లక్ష్యం 1.67 లక్షల మెట్రిక్ టన్నులుండగా అది 1.05 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. మహారాష్ట్రలో కంది సాగు తగ్గిపోవడంతో అక్కడి నుంచి దిగుమతులు పూర్తిగా క్షీణించాయి. దీనికి తోడు రబీలోనూ కంది సాగు తగ్గడం ధరల పెరుగుదలకు కారణమవుతోంది. గత ఏడాది ఇదే సమయానికి కిలో కంది గ్రేడ్-1 రకం రూ.90 ఉండగా అది ఈ ఏడాది ఏకంగా రూ.145 నుంచి రూ.148 మధ్య ఉంది. ఇక గ్రేడ్-2 కంది ధర గత ఏడాది రూ.82 నుంచి రూ.85 మధ్య ఉండగా, ప్రస్తుతం రూ.125 నుంచి రూ.128 వరకు ఉంది. ఈ ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశముంది. రంగంలోకి కేంద్రం రాష్ట్రంలో మున్ముందు పప్పుల ధరలు మరింత పెరిగే అవకాశముంది. డిమాండ్‌ను ఆసరాగా తీసుకొని వ్యాపారులు నిల్వలను దాచేసి కృత్రిమ కొరత సృష్టించే అవకాశాలున్న దృష్ట్యా ప్రభుత్వం రంగంలోకి దిగింది. పప్పుల నిల్వలపై పరిమితిని నిర్దేశిస్తూ గత ఏడాది సెప్టెంబర్‌లో ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్రాలకు రెండు రోజుల కిందట ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటే భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) కేంద్ర ఆదేశాల అనుగుణంగా ఇప్పటికే 25 వేల మెట్రిక్ టన్నుల కందిపప్పును సేకరించి అదనపు నిల్వలు(బఫర్ స్టాక్) సిద్ధం చేసి పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలు ఏ మేరకు ఉంటాయో అంచనా ఇవ్వాలని, డిమాండ్‌కు అనుగుణంగా తన బఫర్ స్టాక్ నుంచి పప్పుల విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ అవసరాలు తీరాక మిగులు ఉంటే, రాష్ట్ర సమ్మతి మేరకు ఇతర రాష్ట్రాల అవసరాలకు మార్కెట్లోకి ఇదే బఫర్ స్టాక్‌ను విడుదల చేస్తామని తెలిపింది. -
డాక్టర్ రెడ్డీస్‌కు ఇంపోర్ట్ అలర్ట్?
ఎగుమతులకు ఇబ్బంది తప్పదంటున్న విశ్లేషకులు యూనిట్లన్నీ థర్డ్‌పార్టీతో తనిఖీ చేయించాలన్న యూఎస్ఎఫ్డీఏ మరింత ఆలస్యం కానున్న కొత్త ఔషధాల అనుమతులు అమెరికా వ్యాపారం 20% దెబ్బతినే అవకాశం షేరు మరో 4% డౌన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు యూఎస్ ఎఫ్‌డీఏ రూపంలో వచ్చిన కష్టాలు ఇప్పట్లో తీరేట్లు కనిపించడం లేదు. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని వార్నింగ్ ఇచ్చిన మూడు యూనిట్లతో పాటు... కంపెనీకి చెందిన అన్ని యూనిట్లను థర్డ్‌పార్టీతో మరోసారి తనిఖీ చేయించమని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్‌డీఏ) తాజాగా ఆదేశించినట్లు తెలిసింది. ఈ మూడు యూనిట్లకు ఇంపోర్ట్ అలర్ట్ తప్పేట్లు లేదని, ఇదే జరిగితే ఈ యూనిట్ల నుంచి అమెరికాకు ఎగుమతులు ఆగిపోవడమే కాకుండా కొత్త ఔషధాలకు యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతులు రావడం మరింత ఆలస్యం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత వారం యూఎస్ఎఫ్డీఏ నుంచి శ్రీకాకుళం, మిర్యాలగూడలోని ఏపీఏ యూనిట్లకు, విశాఖ సమీపంలోని దువ్వాడలోని క్యాన్సర్ డ్రగ్ ఫార్ములేషన్ యూనిట్‌కు వార్నింగ్ లెటర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ యూనిట్లలో డేటా సెక్యూరిటీ, ల్యాబ్‌లో పరిశోధించిన ఫలితాలను భద్రపర్చడం, ఏదైనా ఒక సమస్య ఉత్పన్నమైతే వాటిని పరిశోధించడానికి సరైన ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ లేకపోవడం వంటివి 483 అబ్జర్వేషన్స్ కింద ఎఫ్‌డీఏ లేవనెత్తిందని తెలిసింది. ఇదే విషయమై సోమవారంనాడు పలువురు సంస్థాగత ఇన్వెస్టర్లతో కంపెనీ సీఈఓ జి.వి.ప్రసాద్ టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వార్నింగ్ లెటర్ వచ్చిన మూడు యూనిట్లలో తయారయ్యే ఉత్పత్తులను వేరే యూనిట్లకు తరలిస్తామని, ఎఫ్‌డీఏ ఎత్తి చూపిన అంశాలపై తగు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఈ వార్నింగ్ లెటర్ వల్ల కొత్త ఔషధాల అనుమతులు మరింత జాప్యం జరగొచ్చని చెప్పారు. దీంతో ఈ ఏడాది అమెరికా వ్యాపారంలో 20 శాతం నష్టపోవాల్సి ఉంటుందని కంపెనీ ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. గతేడాది అమెరికా నుంచి సుమారు రూ. 6,500 కోట్ల ఆదాయాన్ని కంపెనీ ఆర్జించింది. దీని ప్రకారం ఈ ఏడాది అమెరికా ఆదాయం రూ.1,300 కోట్లు నష్టపోవచ్చని అంచనా. ఈ హెచ్చరిక లేఖలు వచ్చిన యూనిట్లను థర్డ్‌పార్టీతో మరోసారి తనిఖీలు నిర్వహించమని ఎఫ్‌డీఏ చెప్పినట్లు ప్రసాద్ తెలియజేశారు. దీంతో ఈ యూనిట్లలో తయారు చేసే ఔషధాలను వేరే యూనిట్లకు తరలించనున్నారు. కానీ ఇది కూడా అంత సులువైన విషయం కాదని, దీనికి కనీసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని, అంతవరకు వ్యాపారాన్ని కోల్పోవాల్సి ఉంటుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ ఆందోళనల నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ షేరు సోమవారం కూడా సుమారు 4% క్షీణించి రూ. 3,505 వద్ద ముగిసింది. -
దిగుమతి దేశాల గ్యాస్ రేట్లే పరిగణించాలి
భారత్‌లో గ్యాస్ ధర నిర్ణయంపై ఎస్అండ్పీ సూచన న్యూఢిల్లీ: గ్యాస్ రేటును నిర్ణయించ డంలో పుష్కలంగా నిల్వలున్న దేశాలను కాకుండా, తక్కువ నిల్వలుండి దిగుమతి చేసుకునే దేశాలనే ప్రాతిపదికగా తీసుకోవాలని భారత్‌కు రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) సూచించింది. లేకపోతే ధర గిట్టుబాటు కాక... ఇంధన అన్వేషణ కార్యకలాపాల కంపెనీలు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం కష్టమని తెలియజేసింది. గ్యాస్ నిల్వలున్న దేశాల్లో రేట్ల ఆధారంగా ఇటీవలే భారత్ సహజ వాయువు రేటును యూనిట్‌కు 18 శాతం మేర కోత పెట్టి 4.24 డాలర్లకు తగ్గించిన నేపథ్యంలో ఎస్అండ్పీ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ఎగుమతి దేశాల సగటు ప్రకారం.. ప్రస్తుతం మిగులు సహజ వాయువు, మెరుగైన గ్యాస్ రవాణా మౌలిక సదుపాయాలు ఉన్న అమెరికా, కెనడా తదితర దేశాల్లో ధరల ఆధారంగా దేశీయంగా రేట్లను నిర్ణయిస్తున్నారు. అయితే, ఆయా దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పత్తి చాలా తక్కువ కాగా, రవాణా మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేవని... ఇలాంటి పరిస్థితుల్లో సదరు దేశాలను ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదని ఎస్ అండ్ పీ అభిప్రాయపడింది. ఇప్పటికే ప్రాంతీయంగా ఇతర దేశాలతో పోల్చి చూసినా భారత్‌లో గ్యాస్ రేట్లు తక్కువగానే ఉన్నాయని, థాయ్‌ల్యాండ్, ఇండొనేషియాలో యూనిట్ ధర సగటున 8-10 డాలర్ల మేర ఉందని ఎస్అండ్పీ పేర్కొంది. అటు రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే చమురు, గ్యాస్ బ్లాకుల వేలానికి కూడా పెద్దగా స్పందన లభించకపోవచ్చని కూడా తెలియజేసింది. మరోవైపు, గ్యాస్ ధరలు తక్కువ స్థాయిలో ఉండటం వల్ల ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ ఆదాయం రూ. 1,080-1,150 కోట్లు, ఆయిల్ ఇండియాకు రూ. 120-130 కోట్ల మేర తగ్గవచ్చని మరో రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. -
ఉల్లి..లొల్లి
కర్నూలు నుంచి దిగుమతులు రాని వైనం 10 రెతు బజార్లలో స్టాక్ నిల్ దిగిరాని ఉల్లి ధరలు విజయవాడ : ఉల్లిపాయల కొరత మరింత తీవ్రమైంది. మహారాష్ట్ర నుంచి సరుకు రాకపోవడంతో ప్రత్యామ్నాయంగా కర్నూల్ జిల్లా నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి కూడా రెండు రోజు లుగా దిగుమతులు స్తంభించాయి. కర్నూలు నుంచి సరుకు దిగుమతి తగ్గడంతో రైతు బజార్లలో సబ్సిడీ ధరకు ఇస్తున్న ఉల్లిపాయల స్టాల్స్‌లో కూడా నిండుకున్నాయి. జిల్లాలో 17 రైతు బజార్లలో ఏడింటిలో సోమవారం వరకు మాత్రమే ఉల్లిపాయల స్టాక్ ఉంది. రెండు రోజులుగా నగరంలోని సింగ్‌నగర్, పటమట, భవానీపురంతో పాటు జిల్లాలో జగ్గయ్యపేట, నూజివీడు తదితర 10 రైతు బజార్లకు ఉల్లిపాయల స్టాక్ వె ళ్లలేదు. ఆయా రైతు బజార్లలో ఉల్లి సబ్సిడీ అమ్మకాలు నిలిచిపోయాయి. కొసరికొసరి సరఫరా శుక్రవారం నుంచి కర్నూల్ జిల్లా నుంచి దిగుమతి అయ్యే లారీల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెపుతున్నారు. పైనుంచి స్టాక్ రాకపోవడంతో రైతు బజార్లలో ఉల్లిపాయల కౌంటర్లలో కొసరికొసరి సరఫరా చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి కర్నూల్ జిల్లా నుంచి సరుకు వస్తుందని మార్కెటింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక వేళ ఉల్లిపాయలు దిగుమతి కాకపోతే సోమవారం సాయంత్రం నుంచి జిల్లాలోని అన్ని రైతు బజార్లలో స్టాక్ ఉండే పరిస్థితి కనపడడం లేదు. ప్రత్నామ్నాయంగా దిగుమతి చేసుకునేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి. ప్రస్తుతం కొన్ని రైతు బజార్లలో అరకొరగా కేజి రూ. 20కి కర్నూల్ ఉల్లి సరఫరా చేస్తున్నారు. లోకల్ సరుకు నిల్ నూతన రాజధాని ప్రాంతంలోని పెనుమాక, ఉండవల్లి, వెంకటపాలెం నుంచి ప్రతి ఏటా ఈ సీజన్లో ఉల్లిపాయలు దిగుమతి అయ్యేవి. అయితే నేటి వరకు గుంటూరు జిల్లా నుంచి లోకల్‌గా సరుకు రాకపోవడంతో కృష్ణాజిల్లాలో ఉల్లిపాయల కొరత ఇతర జిల్లాల కంటే జటిలంగా మారిందని వ్యాపారులు, అధికారులు చెపుతున్నారు. బయటి మార్కెట్లో కేజీ రూ. 50పైనే ప్రస్తుతం బయట మార్కెట్లో కేజి రూ. 50పైనే ఉంది. బహిరంగ మార్కెట్లో వ్యాపారులు రెండు రకాలుగా విక్రయిస్తున్నారు. కర్నూల్ ఉల్లిని కేజీ రూ. 35కు, మహారాష్ట్ర ఉల్లిని రూ. 50కి పైనే విక్రయిస్తున్నారు. రానున్న కొన్ని రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెపుతున్నారు. ప్రతీ ఏటా ఈ సీజన్లో మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతులు నిలిచిపోగానే కర్నూల్ నుంచి వచ్చేవి. -
కీలకమైన ప్రశ్న
సందేహం రాకుండా పోవాలిగానీ వచ్చిందంటే చాలా యాతనే. అది తీరే దాకా సమస్యే. మూడేళ్లక్రితం ఉత్తరప్రదేశ్‌లోని లక్నో బాలిక ఐశ్వర్య మహాత్మ గాంధీకి ‘జాతిపిత’ పురస్కారాన్ని ఎవరిచ్చారని సందేహం వ్యక్తంచేసింది. అది ఎవరూ ఇచ్చిందికాదని... వ్యవహారికంలో ఎప్పుడు చేరిందో ఎవరికీ తెలియదని ‘అధికారికం’గా వెల్లడైంది. అప్పటికామెకు పదేళ్ల వయసు. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని ఎలా చూడాలన్న సందేహం చర్చలోకి వచ్చింది. ఆయనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పరిగణించాలా లేక భారత ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించవచ్చునా అనేది ఆ సందేహం సారాంశం. జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ ఈ సందేహాన్ని వ్యక్తంచేశారు. చూడటానికి రెండింటిమధ్యా పెద్ద తేడా ఏముందని పిస్తుంది. కానీ ఇది సాధారణమైన సమస్య కాదని తరచి చూస్తే అర్థమవుతుంది. మన రాజ్యాంగంలోని 124వ అధికరణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ‘భారత ప్రధాన న్యాయమూర్తి’గా పేర్కొంటున్నది. వివిధ పదవులకు ప్రమాణ స్వీకారం చేసే విధానాన్ని నిర్దేశించిన రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్ మాత్రం ఆ పదవిని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తావించింది. న్యాయమూర్తి ప్రస్తావించేవరకూ ఈ వ్యత్యాసం సంగతే ఎవరి దృష్టికీ రాలేదని విచారణ సందర్భంగా జరిగిన సంభాషణను గమనిస్తే తెలుస్తుంది. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అయినా, సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్. నారిమన్ అయినా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు జవాబివ్వలేకపోయారు. ఈ సమస్యగురించి ఆలోచించవలసి ఉన్నదని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవుల్లో నియమితులయ్యే వారు ఎలాంటి పదవీ స్వీకార ప్రమాణం చేయాలో విడిగా ఉన్నాయి. 60వ అధికరణ రాష్ట్రపతి ప్రమాణస్వీకారంపైనా, 69వ అధికరణ ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారంపైనా సవివరంగా తెలిపాయి. 124వ అధికరణ భారత ప్రధాన న్యాయమూర్తి గురించి ప్రస్తావించినా ప్రమాణస్వీకారం దగ్గరకొచ్చేసరికి మాత్రం ఇతరుల గురించి కూడా ప్రస్తావించే మూడో షెడ్యూల్లో చేర్చారు. రాజ్యాంగం అమల్లోకొచ్చిన ఇన్ని దశాబ్దాల్లో న్యాయవ్యవస్థలో ఎందరో పనిచేశారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన న్యాయకోవిదులున్నారు. అయినా ఇలాంటి సందేహం ఎవరికీ ఇన్నేళ్లుగా కలగలేదంటే ఆశ్చర్యమనిసిస్తుంది. మన రాజ్యాంగ పరిషత్‌లోని సభ్యులు అనేక అంశాలపై కూలంకషంగా చర్చించారు. వివిధ పదవులకు సంబంధించిన హోదాలు, అధికారాలు... ఆ పదవుల్లో ఉండేవారి పరిధులు వగైరాలన్నీ నిర్దిష్టంగా ఉన్నాయి. ఆ పదవుల ప్రమాణస్వీకారానికి సంబంధించిన నియమనిబంధనలను జాగ్రత్తగా పొందుపరిచారు. అయితే, ఎంత చేసినా ఏవో లోటుపాట్లు ఉండకతప్పదు. ఆచరణలో ఎదురయ్యే ఇబ్బందులు కావొచ్చు...తలెత్తే కొత్త సమస్యలు కావొచ్చు... ఉన్న సమస్యలే కొత్త పరిష్కారాలను కోరడంవల్ల కావొచ్చు-అలాంటివాటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగాన్ని అనేకసార్లు సవరించారు. ఇప్పుడు జస్టిస్ జోసెఫ్ లేవనెత్తిన సమస్యపై కూడా విస్తృత చర్చ జరిగి, అవసరమైతే రాజ్యాంగంలో ఆ మేరకు మార్పులు చేయక తప్పదు. అయితే, న్యాయమూర్తి వ్యక్తం చేసిన సందేహం ఆసక్తికరమైనదే తప్ప అంత అవసరమైనది కాకపోవచ్చునని సాధారణ పౌరులకు అనిపిస్తుంది. ఆ పదవి గురించిన ప్రస్తావనలో ఉన్న తేడావల్ల ఆచరణలో తలెత్తే ఇబ్బంది ఏముంటుందని పిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సందేహం కీలకమైనది. న్యాయమూర్తుల ఎంపిక కోసం ఇన్నాళ్లూ అనుసరిస్తూ వస్తున్న కొలీజియం స్థానంలో ఇప్పుడు కొత్తగా ఎన్‌జేఏసీ ఏర్పడిన నేపథ్యంలో ఇది ముఖ్యమైనది. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలన్న నిబంధన ఉంది. రాజ్యాంగంలోని 217వ అధికరణ ఆ సంగతిని సవివరంగా ప్రస్తావించింది. అయితే, న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాజ్యాంగ స్ఫూర్తిని సరిగా అమలు చేయడంలేదని, సుప్రీంకోర్టు పాత్ర అందులో ఉండటం లేదని భావించిన జస్టిస్ జేఎస్ వర్మ 1993లో ప్రధాన న్యాయమూర్తి, మరో ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుండే కొలీజియం వ్యవస్థ ఏర్పాటుకు అంకురార్పణ చేశారు. 1998లో మరో తీర్పు ద్వారా ఇది అయిదుగురు సభ్యుల కొలీజియంగా మారింది. ఈ విధానం లోపభూయిష్టంగా ఉన్నదని, న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకునే విధానంగా మారిందని అంటూ ఎన్డీయే సర్కారు ఎన్‌జేఏసీ చట్టం తీసుకొచ్చింది. ఎన్‌జేఏసీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టుకు చెందిన సీనియర్ న్యాయమూర్తులిద్దరూ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి, మరో ఇద్దరు ప్రముఖులు సభ్యులుగా ఉంటారని చట్టం చెబుతున్నది. రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్ రీత్యా చూస్తే ఎన్‌జేఏసీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మిగిలిన సభ్యులతో సమానమవుతారు. 124వ అధికరణ అయినా, 217వ అధికరణ అయినా రాజ్యాంగపరంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని న్యాయవ్యవస్థ పెద్దగా, ప్రతినిధిగా చూస్తున్నది. కానీ, ఎన్‌జేఏసీ ఆ పాత్రను కుదిస్తున్నది. రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాలను పరిమితం చేస్తున్నది. కనుక రెండింటిమధ్యా ఉన్న వ్యత్యాసాన్ని, అందువల్ల ఏర్పడిన అయోమయాన్ని పోగొట్టాలన్నది జస్టిస్ జోసెఫ్ సంధించిన ప్రశ్నలోని అంతరార్ధం కావొచ్చు. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ అయినా పారదర్శకంగా పనిచేసినప్పుడే అర్ధవంతంగా ఉంటుంది. న్యాయమూర్తుల నియామకాల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని అందరూ కోరుకునేది అందుకే. అది జరగడానికి ముందు రాజ్యాంగ పరంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రాముఖ్యత, పాత్ర ఏమిటన్నది కూడా తేలడం కూడా అవసరమే. -
పసిడి పెట్టుబడికి... పంచ సూత్రాలు
- రాబడి ప్రకారం చూస్తే ఈ-గోల్డ్ ఉత్తమం - అందుబాటులో గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఫండ్లు - పథకాలతో ఆకట్టుకుంటున్న జ్యుయలరీ సంస్థలు ప్రపంచంలో ఉత్పత్తయ్యే మొత్తం బంగారంలో దాదాపు 27 శాతాన్ని మనదేశం దిగుమతి చేసుకుంటోందంటేనే... ఇక్కడ బంగారానికున్న డిమాండు అర్థమవుతుంది. భారతీయులకు ముఖ్యంగా మహిళలకు బంగారంపై మక్కువ ఎక్కువ. అయితే ఇన్వెస్ట్మెంట్ సాధనంగా కూడా బంగారానిది రికార్డే. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాలతో పోలిస్తే బంగారం మంచి రాబడినే ఇచ్చింది. అందుకే ప్రతి ఇన్వెస్టరు పోర్ట్‌ఫోలియోలో బంగారం కచ్చితంగా ఉంటుంది. ఉండాలి కూడా. బంగారంలో భౌతికంగా నాణేలు, కడ్డీలు, ఆభరణాల రూపంలోనూ, గోల్డ్ ఈటీఎఫ్ వంటి ఎలక్ట్రానిక్ రూపంలోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం... గోల్డ్ సేవింగ్ పథకాలు పలు జ్యుయలరీ సంస్థలు రెండు రకాల గోల్డ్ సేవింగ్ పథకాలను అందిస్తున్నాయి. తొలి రకం పథకంలో ప్రతి నెలా నిర్ణీత మొత్తం, నిర్ణీత కాలం వరకు చెల్లించాలి. జ్యుయలరీ సంస్థలు పథకం కాల పరిమితి ముగిసిన తర్వాత ఒక నెల మొత్తాన్ని బోనస్‌గా ఇస్తాయి. వాయిదాలు సక్రమంగా చెల్లించినవారికే కొన్ని సంస్థలు ఈ బోనస్‌ను ఇస్తున్నాయి. ఉదాహరణకు ఒక సంస్థ 11 నెలల కాలపరిమితితో ఈ పథకాన్ని అందిస్తోందని అనుకుంటే... మీరు చెల్లించే వాయిదా రూ.2,000 అయితే మీరు మీ పథకం కాలపరిమితిలోపు సంస్థకు రూ.22,000 చెల్లిస్తారు. దీనికి సదరు సంస్థ మరో రూ.2,000 అదనంగా అందిస్తుంది. అప్పుడు మొత్తం రూ.24,000 విలువైన ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు. రెండవ రకం పథకం లోనూ నిర్ణీత మొత్తం, నిర్ణీత కాలం వరకు ప్రతినెలా వాయిదా పద్ధతిలో చెల్లించాలి. ఇక్కడ మనం చెల్లించే నెలవారి మొత్తంతో ఆ నెల్లోనే బంగారాన్ని కొని మన ఖాతాలో జమచేస్తారు. పథకం కాలపరిమితి ముగిశాక మన ఖాతాలో ఎంత బంగారం ఉంటుందో దానిని మనకిస్తారు. ఈ విధానంలో బోనస్ అంటూ ఏమీ ఉండదు. కస్టమర్లు ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే ఈ జ్యుయలరీ సంస్థలపై బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్ తదితర వాటిపై ఉన్నట్లుగా ప్రభుత్వ సంస్థల అజమాయిషీ ఉండదు. వారు బోర్డు తిప్పేస్తే ఎవరు ఏమీ చేయలేరు. 2003లో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. గతేడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం జ్యుయలరీ సంస్థలు వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లోను 12 శాతానికి మించి రాబడినివ్వకూడదు. గోల్డ్ ఈటీఎఫ్... గోల్డ్ ఈటీఎఫ్ మార్గంలో కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. గోల్డ్ సేవింగ్ పథకాలతో పోలిస్తే గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్మెంట్ మంచిది. ఎందుకంటే మనం ఇన్వెస్ట్‌చేసే డబ్బుకు రాబడి, రక్షణ రెండూ ఉంటాయి. గోల్డ్ సేవింగ్ పథకాల మాదిరే దీన్లోనూ రాబడి ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ గోల్డ్ ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్లలో లిస్టవుతాయి కూడా. మనం మన షేర్లను ఏ విధంగా విక్రయిస్తామో... అలాగే వీటిని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించవచ్చు. అంటే లిక్విడిటీ ఉంటుందన్న మాట. సాధారణంగా ఒక యూనిట్ గోల్డ్ ఈటీఎఫ్ ఒక గ్రాము బంగారానికి సమానం. కొన్ని సంస్థలు అరగ్రామును కూడా యూనిట్‌గా పరిగణిస్తున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు దీర్ఘకాలంలో సగటున 13 శాతం వరకు రాబడినిస్తున్నాయి. బంగారాన్ని భౌతిక రూపంలో కొంటే తయారీ చార్జీలుంటాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లలో అయితే అవేవీ ఉండవు. బంగారం ధర ప్రాంతాన్ని బట్టి మారుతుంది కానీ... ఈటీఎఫ్‌లలో దేశవ్యాప్తంగా ఒకే ధర ఉంటుంది. బంగారాన్ని విక్రయించేటప్పుడు తరుగుదల తీసేస్తారు. గోల్డ్ ఈటీఎఫ్‌లలో అయితే ఇలాంటివి ఉండవు. అలాగే గోల్డ్ ఈటీఎఫ్‌లపై వ్యాట్, సంపద పన్ను, ఎస్టీటీ వంటి పన్నులుండవు. బ్రోకరేజ్ చార్జీలు మాత్రం ఉంటాయి. - గోల్డ్ ఈటీఎఫ్ పథకాలనందిస్తున్న సంస్థలు - ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్ - యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్ - రిలయన్స్ గోల్డ్ ఈటీఎఫ్ - కొటక్ గోల్డ్ ఈటీఎఫ్ - హెచ్డీఎఫ్సీ గోల్డ్ ఈటీ ఎఫ్ - యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్ - ఐడీబీఐ గోల్డ్ ఎక్స్చేంజ్ - జీఎస్ గోల్డ్ పథకం - బిర్లా సన్‌లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్ - రెలిగేర్ గోల్డ్ ఈటీఎఫ్ ఈ-గోల్డ్ ఈ-గోల్డ్ పథకాన్ని నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఈటీ) అందిస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్‌లతో పోలిస్తే ఈ-గోల్డ్ రాబడి ఇంకాస్త ఎక్కువ. 2012లో గోల్డ్ ఈటీఎఫ్‌లు సగటున 11 శాతం రాబడినిస్తే.. ఈ-గోల్డ్ 16 శాతం రాబడిని అందించింది. గోల్డ్ ఈటీఎఫ్‌లతో పోలిస్తే ఈ-గోల్డ్‌లో బ్రోకరేజ్ చార్జీలు తక్కువ. సంపద పన్ను వర్తిస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఏడాది కాలాన్ని దీర్ఘకాలంగా పరిగణిస్తే.. ఈ-గోల్డ్‌లో మూడేళ్లను దీర్ఘకాలంగా పరిగణి స్తారు. అంటే మూడేళ్లు సేవింగ్ చేస్తేనే పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. గోల్డ్ ఫండ్స్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్‌లానే వివిధ ఫండ్ హౌస్‌లు గోల్డ్ ఫండ్స్‌నూ వినియోగదారులకు ఆఫర్ చేస్తున్నాయి. గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి డీమ్యాట్ ఖాతా తప్పనిసరి కాదు. ఈ-గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్ లావాదేవీలు మాత్రం డిమ్యాట్ ఖాతా ద్వారానే జరుగుతాయి. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. గోల్డ్ బాండ్లు కేంద్రం గోల్డ్ బాండ్లను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇంకా దీని విధివిధానాలు ఖరారు కాలేదు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ బాండ్లను... 2,5 నుంచి 10 గ్రాము ల వరకూ వివిధ పరిమాణాల్లో కేంద్రం జారీ చేస్తుంది. వీటి కాలపరిమితి 5-7 సంవత్సరాల దాకా ఉంటుంది. 50 టన్నుల పసిడికి సమానమైన గోల్డ్ బాండ్లను జారీచేసి రూ.13,500 కోట్లను సమీకరించాలని కేంద్రం భావిస్తోంది. -
పక్కోళ్లకే పెద్దపీట !
మన రైతులకు మొండిచేయి ఏనుమాముల మార్కెట్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా పత్తి దిగుమతి ఏజెంట్ల సహకారంతో గరిష్ట ధరతో కొనుగోళ్లు అడ్డగోలు కొర్రీలతో స్థానిక రైతులకు ఇబ్బందులు పోచమ్మమైదాన్ : ఆసియూలోనే అతిపెద్దదైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈ ఏడాదీ పత్తి జీరో దందాకు అడ్డులేకుండా పోయింది. దళారుల మాయాజాలంలో పడి సీసీఐ చోద్యం చూస్తోంది. తేమ శాతం, దూది పింజ పొడవు పేర మద్దతు ధర తెగ్గోస్తే, తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పత్తిని కొంటూ... స్థానికులు తెచ్చే తెల్లబంగారానికి రంగు, నాణ్యత తగ్గిందంటూ కొర్రీలు పెడ్తూ... దోపిడీ చేస్తున్నారు. స్థానిక రైతుల పేరిట దొంగ పట్టా పాసు పుస్తకాలు సృష్టించి... అధికారుల సహకారంతో ఇక్కడి రైతులను మోసగిస్తున్నారు. 60 శాతానికి పైగా ఏపీ పత్తి రాక ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ వాహనాల్లో పత్తి జిల్లా మార్కెట్‌ను ముంచెత్తుతోంది. ఇక్కడికి వస్తున్న పత్తిలో దాదాపు 60 శాతం పత్తి దళారుల నుంచే వస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి వస్తున్న పత్తికి సంబంధించి దళారులు మలుగు, పరకాల, తొర్రూరు మండలాల రైతుల పేర్లు నమోదు చేసి విక్రయిస్తున్నారు. వరంగల్‌లో ఏజెంట్లు మన పక్క రాష్ట్రంలో సైతం సీసీఐ కోనుగోలు కేంద్రాలు ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి భారీ వాహనాల్లో పత్తిని ఇక్కడకు తీసుక వస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో ఏజెంటలను నియమించుకున్నారు. అక్కడి నుంచి దిగుమతి అవుతున్న పత్తి సరియైన నాణ్యత లేకున్నా... ఏజెంట్ల సహకారంతో సీసీఐ అధికారులు నంబర్ వన్ ధర పెట్టడంపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఏపీ నుంచి వచ్చిన పత్తికి అధిక ధర పెట్టి కొనుగోలు చేస్తుండడం.. స్థానిక రైతులకు తేమ శాతం.... దూది పింజ శాతం... నాణ్యత (మైక్ వ్యాల్యూ) అంటూ కొర్రీలు పెడుతూ ధరలో కోత పెట్టడం వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఏపీ నుంచి 24,000 బస్తాల రాక వరంగల్ మార్కెట్‌కు శుక్రవారం మొత్తం సుమారు 40,000 బస్తాలు వచ్చారుు. ఇందులో దాదాపు 24,000 బస్తాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చినవేనని తెలుస్తోంది. ఆ రాష్ట్రానికి సంబంధించిన ఏజెంట్లు చక్రం తిప్పి త్వరత్వరగా కొనుగోళ్లు జరిగేలా చూడడమే కాకుండా... దాదాపు అన్నింటికి నం బర్ వన్ ధర క్వింటాల్‌కు రూ.4050 పెట్టినట్లు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. అదే జిల్లా రైతులకు రూ. 3,969, రూ.3,888 మాత్రమే పెట్టా రు. కాగా, కొనుగోళ్లకు సం బంధించి సీసీఐ ప్రతినిధిని శర్మను సంప్రదిం చగా, ‘ఎక్కడి నుంచి పత్తి వస్తుం దనే విషయం మార్కెట్ వారు చూసుకోవాలి. ‘ఇతర ప్రాంతాల నుంచి పత్తి వస్తున్న మాట నిజమే. కానీ, పట్టా పాస్ పుస్తకాలు ఇక్కడివే తీసుకువస్తున్నారు. వారిని గుర్తించలేకపోతున్నా’మని మార్కెట్ కమిటీ చెర్మైన్ వినోద్ కుమార్ అనడం గమనార్హం. -
భారత మామిడిపై నిషేధం ఎత్తివేసిన యూరప్
న్యూఢిల్లీ: మామిడి రైతులకు శుభవార్త. భారత మామిడి పండ్ల దిగుమతిపై ఉన్న నిషేధాన్ని యూరప్ సమాఖ్య ఎత్తివేసింది. దీంతో భారత్ నుంచి మామిడి పండ్లను పెద్ద ఎత్తున యూరప్ దేశాలకు ఎగుమతి చేసే అవకాశముంది. తద్వారా మామిడి పండ్లకు ధరలు పెరిగి రైతులు భారీ లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. -
కష్టాల్లో దేశీయా ఫార్మారంగం...
-
ఇక ‘జీరో’యే!
దిగుమతులపై వాణిజ్య పన్నుల శాఖ ఆరా పన్నులు చెల్లించని వారిపై కొరడా తనిఖీలకు అధికారులు సిద్ధం సిటీబ్యూరో: ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ... గ్రేటర్ హైదరాబాద్‌లో అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న ‘జీరో’ వ్యాపారంపై వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న వస్తువులకు పన్ను చెల్లించకుండా... గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ గ్రేటర్ పరిధిలోని సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలోని మొత్తం 12 డివిజన్లకు గాను ఏడు గ్రేటర్‌లోనే విస్తరించి ఉండటంతో అత్యధిక రాబడి సాధించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి పన్నులు చెల్లించకుండా దిగుమతి అవుతున్న వస్తువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఎలక్ట్రానిక్, స్టీల్, ప్లాస్టిక్ ముడిసరుకులతో పాటు ఫుడ్ గ్రెయిన్స్ తదితర వస్తువులు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ నుంచి జీరో టాక్స్‌తో అక్రమంగా దిగుమతి అవుతున్నట్లు గుర్తించారు. రాష్ర ్టసరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్స్, రైళ్లు, విమానాల ద్వారా వచ్చే వస్తువులను అడ్డుకునే ప్రత్యేక విభాగాన్ని పటిష్టం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆన్లైన్ వ్యాపారంతోనూ వాణిజ్య పన్నుల శాఖకు ఆదాయం తగ్గుతోందని భావిస్తున్నారు. ఇటీవల దిగుమతి అవుతున్న వస్తువుల మొత్తం విలువలో ఒక శాతం, 5 శాతం వ్యాట్ ఉన్న వాటికి ఇతర రాష్ట్రాల్లో వేస్తున్న పన్నుల వివరాలు సేకరించి, అవసరమైతే కొన్నిటిని 14.5 శాతం పన్ను పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని వాణిజ్య పన్నుల శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీలకు సిద్ధం గ్రేటర్ హైదరాబాద్‌లో వాణిజ్య శాఖ ఆదాయం తగ్గుముఖం పట్టింది. జీరో దందాతో వ్యాపార, వాణిజ్య రంగాల టర్నోవర్ క్షీణించింది. ఫలితంగా సర్కార్‌కు అత్యధిక ఆదాయం సమకూర్చే వాణిజ్య పన్నుల శాఖ రాబడి మందగిస్తునట్లయింది. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖకు వచ్చే మొత్తం రాబడిలో 74 శాతం నగరం నుంచే జమవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. కొత్త లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో అత్యధిక ఆదాయం సమకూరే గ్రేటర్లో జీరో దందాకు అడ్డుకట్ట వేసేందుకు, ఇందులో భాగంగా ముమ్మర తనిఖీలకు సంబంధిత అధికారులు సిద్ధమవుతున్నారు. -
కలప తరలుతోంది
వయా గోదావరి - ఛత్తీస్‌గఢ్.. మహారాష్ట్రల నుంచి దిగుమతి - మంథని కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు తరలింపు - తనిఖీలు అంతంతే.. మంథని : ‘తూర్పు’ కేంద్రంగా కలప స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది. అధికారుల అండదండలతో ఈ దందా మూడు చెట్లు.. ఆరు దుంగలుగా నడుస్తోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి రోజూ లక్షలాది రూపాయల విలువ చేసే టేకు కలప మంథని డివిజన్ కేంద్రంగా ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు రవాణా అవుతోంది. అరుునా అటవీ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మంథని ప్రాంతం నుంచి గోదావరిఖని వైపు రూ. 5 లక్షల విలువచేసే కలపలోడుతో వెళ్తున్న లారీ బుధవారం జీడీకే-11గని చెక్‌పోస్టు వద్ద పట్టుబడింది. మంథని మండలం పోతారం గ్రామంలో రూ. 22 వేలు విలువచేసే టేకు కలప అటవీశాఖ అధికారులు, పోలీసులు నిర్వహించిన సోదాలో దొరికింది. గోదావరినది దాటి తూర్పు డివిజన్‌కు దిగుమతి అవుతున్న కలప మహదేవ్పూర్, మహముత్తారం, మంథని మండలాలకు ఎడ్లబండ్ల ద్వారా రవాణా చేస్తున్నారు. అక్కడి నుంచి సైజులు, ఫర్నిచర్ రూపంలో నిత్యం లారీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు పెద్ద ఎత్తున్న తరలుతోంది. పట్టని అధికారులు... తూర్పు డివిజన్లోని అటవీ గ్రామాల్లో పెద్ద ఎత్తున టేకు కలప నిల్వలున్నాయనే ఆరోపణలున్నారుు. అరుునా అధికారులు దాడులు నిర్వహించిన సందర్భాలు మచ్చుకు కానరావడంలేదు. ఎక్కడైనా కలప పట్టుబడితే ఫిర్యాదులు వస్తే తప్ప అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. గతంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రాష్ట్రం) రాష్ట్రాల అటవీశాఖ ఉన్నతాధికారులు సమావేశమై సరిహద్దుల్లో నిఘా పెట్టినా కలప అక్రమ రవాణాను అదుపు చేయలేకపోయూరు. స్మగ్లర్ల నుంచి ప్రతి నెలా ముడుపులు పుచ్చుకుంటున్న అధికారులు కలప రవాణాపై దృష్టిపెట్టడం లేదనే విమర్శలు వ స్తున్నారుు. తుపాకులేవీ? కలప అక్రమ రవాణా నియంత్రణ కోసం అటవీశాఖ అధికారులకు తుపాకులు కేటాయించాలన్న ప్రతిపాదన ఆచరణకు నోచుకోవడంలేదు. ఆయుధాలు లేవనే సాకు చూపుతున్న అధికారులు అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని పలువురు అంటున్నారు. -
పసిడిపై ఆంక్షలు సడలిస్తేనే మంచిది
న్యూఢిల్లీ: అక్రమ రవాణాకు దారితీస్తున్న పసిడి దిగుమతులపై ఆంక్షలను సడలిస్తేనే మంచిదన్న అభిప్రాయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం వ్యక్తం చేశారు. బంగారంపై 10 శాతం ఉన్న దిగుమతుల సుంకం దేశీయ రత్నాలు, ఆభరణాల పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆందోళనల నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘వాణిజ్య మంత్రిగా బంగారంపై ఆంక్షలు తొలగాలనే నేను కోరుకుంటాను. రత్నాలు, ఆభరణాల పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు పడుతుండడమే దీనికి కారణం’ అని ఒక వార్తా సంస్థతో వ్యాఖ్యానించారు. దేశం మొత్తం ఎగుమతుల్లో రత్నాలు, ఆభరణాల వాటా దాదాపు 15 శాతం ఉన్న విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశం మొత్తం ఎగుమతుల విలువ ఆ యేడాది 312 బిలియన్లుకాగా, ఇందులో రత్నాలు, ఆభరణాల రంగం వాటా 39.5 బిలియన్ డాలర్లని అన్నారు. పరిశ్రమకే కాకుండా, అక్రమ రవాణా పెరగడానికి సైతం ఆంక్షలు దారితీస్తున్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు. ఈ అంశాలన్నింటినీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పరిశీలనకు తీసుకువెళుతున్నట్లు వెల్లడించారు. ఆంక్షల వల్ల కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడి లక్ష్యం నెరవేరుతున్నప్పటికీ, ఈ మెటల్ అక్రమ రవాణా పెరిగి ఆందోళనకరమైన పాతరోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. -
అవశేషాలు.. అవమానాలు..
నిషేధాలు ఈయూకే పరిమితం కావడం లేదు. సమీప భవిష్యత్తులోనే రష్యా నుంచి కూడా ఇలాంటి పరిస్థితి తప్పకపోవచ్చు. భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆలుగడ్డలు నాణ్యతా ప్రమాణాలకు దీటుగా లేవనీ, వీటిని నిషేధించక తప్పని పరిస్థితులు ఉన్నాయనీ ఆ దేశ అధికారులు చెబుతున్నారు. బియ్యం, గోధుమ, పప్పులు, పళ్ళు కూరగాయల ఉత్పత్తిలో మన దేశానిది ప్రపంచంలోనే రెండవ స్థానం. పాలు, పంచదార, జీడిమామిడి, మసాలా దినుసులు వంటి వ్యవసాయోత్పత్తులలో మనది మొదటి స్థానం కూడా. అయినా ప్రపంచ ఎగుమతులలో మన వాటా 5 శాతానికి చేరలేక దిగాలు పడుతున్నది. ఇదంతా అవగాహనా రాహిత్యంతో తలెత్తిన పరిస్థితి కావచ్చు. కానీ ప్రపంచ దేశాలలో ఈ పరిస్థితి వల్ల భారత్ ఎగుమతులు అవమానకరమైన వాతావరణాన్ని ఎదుర్కొనవలసి వస్తున్నది. నాణ్యతా ప్రమాణాల నియంత్రణ గురించి దేశంలో కనిపిస్తున్న అవగాహనా రాహిత్యం తీవ్రమైనది. ఆహారం ద్వారా ప్రబలే వ్యాధు లకు కారణమయ్యే సూక్ష్మక్రిములు, పారిశ్రామిక రంగాలలో భద్రతా లోపాలు మన ఎగుమతులకు శాపంగా మారుతున్నాయి. వ్యవసా యోత్పత్తులను ఎగుమతి చేసే దేశాలు పాటించవలసిన పరిశుభ్రత, మాలిన్యాల నిరోధానికి సంబంధించి 2006లో ఒక చట్టాన్ని రూపొం దించారు. కానీ భారతదేశంలో చాలా చట్టాల మాదిరిగానే ఈ కీలక చట్టానికి కూడా చెదలు పట్టించారు. దీని ఫలితంగానే అంతర్జాతీయ ఎగుమతుల రంగంలో భారత్ ప్రతిష్ట మసకబారిపోతోంది. ఇటీవలి చేదు అనుభవాలు భారత్ నుంచి అత్యధికంగా తాజా కూరగాయలను దిగుమతి చేసుకునే దేశాలలో సౌదీ అరేబియా ఐదో స్థానంలో ఉంది. కానీ మన పచ్చి మిర్చి ఉత్పత్తులను మే నెల 30 నుంచి ఆ దేశం నిషేధించింది. క్రిమి సంహారక అవశేషాలు కనిపించడం వల్ల ఈ నిషేధం విధిస్తున్నట్టు భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల సాధికార సంస్థ (అపిడా)కు సౌదీ అరేబియా వివరించింది. ఇకపై ఉత్పత్తులలో క్రిమి సంహారక అవశేషాల జాడ లేకుండా చేస్తామని, నిషేధం ఎత్తివేయవలసిందని భారత్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఆ దేశం ఇంకా జవాబు ఇవ్వలేదు. ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే అల్ఫాన్సా జాతి మామిడి, కొన్ని రకాల కూరగాయల మీద ఈ మే మాసంలోనే యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిషేధం విధించింది. ఆ ఎగుమతులలో ఫ్రూట్‌ఫ్లైస్ అనే కీటకాల జాడను కనిపెట్టి ఈయూ ఈ నిర్ణయం తీసుకుంది. అల్ఫాన్సాతో పాటు చామ దుంపలు, కాకర, పొట్ల, వంకాయ కూడా మొదటిసారి ఈయూ నిషేధానికి గురైనాయి. గుడ్డిలో మెల్ల మేలు అన్నట్టు తమ నిషేధం ఐదు శాతం తాజా పళ్లు, కూరగాయలకే వర్తిస్తుందనీ, మిగిలిన ఎగుమతులలో ప్రమాణాలు సక్రమంగానే ఉన్నాయని యూనియన్ వివరణ ఇచ్చింది. అలాంటి క్రిములు ఆ దేశాలలో కనిపించవు. కాబట్టే వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 2013 సంవత్సరంలో ఎగుమతైన 207 రకాల వ్యవసాయోత్పత్తులలోనూ ఇలాంటి క్రిములను గుర్తించిన సంగతిని ఈయూ గుర్తు చేసింది. అల్ఫాన్సా మామిడి మీద నిషేధం అంటే దేశం అపారమైన నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది. ఈ మామిడి రకంతో పాటు, మన తమలపాకులనూ నిషేధించే యోచనలో ఈయూ ఉన్నది. ఇక్కడి నుంచి ఎగుమతి అవుతున్న తమలపాకులలో సాల్మొనెల్లా అనే బాక్టీరియాను వారు కనుగొన్నారు. నిజానికి ఈ బాక్టీరియాను ఈయూ 2011 నుంచి గమనిస్తున్నది. ఈ కారణంగానే బంగ్లాదేశ్ నుంచి ఎగుమతయ్యే తమలపాకుల మీద ఈయూ ఇప్పటికే నిషేధాన్ని అమలు చేస్తున్నది. ఆ బాక్టీరియా ఉన్న ఉత్పత్తులను వినియోగిస్తే మనుషులు వాంతులూ విరేచనాల బారిన పడతారు. ఇవన్నీ గమనించే కాబోలు గత సంవత్సరం ఆహార కాలుష్యానికి సంబంధించి ఈయూ 111 హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో 12 కరివేప, మిరప ఉత్పత్తులకు సంబంధించినవి. 84 హెచ్చరికలు బెండ ఉత్పత్తులకు సంబంధించినవి. వీటితో ఈయూ ఇప్పటివరకు భారత్‌కు చేసిన హెచ్చరికల సంఖ్య 257కు చేరుతుంది. అయితే 433 హెచ్చరికలను అందుకుని చైనా మొదటి స్థానంలో ఉంది. 2007లో కూడా మనం ఎగుమతి చేసిన గోరు చిక్కుడు, గోవర్గమ్లలో పెంటాక్లోరోఫినాల్ అనే క్రిమి సంహారకం అవశేషాలను ఈయూ కనుగొన్నది. నిషేధాలు ఇప్పటివి కావు 2003లో యూరప్ దేశాలలో తయారుచేసే వోస్టర్ సాస్‌లో సూడాన్-1డై అనే మలిన కారకాన్ని కనుగొన్నారు. ఇది పెద్ద దుమారం లేపింది. ఈ మలిన కార కం భారత్ నుంచి ఎగుమతి అయిన ఎండుకారం నుంచి వచ్చిందని వెల్లడైంది. భారత్ నుంచి చేసుకునే దిగుమతుల విషయంలో జాగరూకత పాటించాలని ఆ సందర్భంలోనే సభ్య దేశాలకు ఈయూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిణా మం దేశానికి అవమానకరమైనది. మన అంతర్జాతీయ ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం చూపగలిగినది కూడా. ఈ ఉదంతం తరువాత మహారాష్ట్ర ప్రభుత్వం బ్రాండింగ్ లేని ఆహారోత్పత్తులను నిషేధించింది. భారత ప్రభుత్వం కూడా సుగంధ ద్రవ్యాల బోర్డుకు ఎగుమతుల నమూనాలను సమర్పించడాన్ని అనివా ర్యం చేసింది. 2003లో డచ్ అధికారులు మన దేశం నుంచి దిగుమతి చేసుకున్న ద్రాక్షలో మిథోమిల్, ఎసిఫేట్ అనే క్రిమిసంహారక అవశేషాలను కనుగొన్న తరువాత జరిపిన రభస చిన్నదేమీ కాదు. మసాలా దినుసుల ఎగుమతిలో, వినియోగంలో మనదే ప్రపంచంలో అగ్రస్థానం. కానీ అప్లటాక్సిన్ వంటి విష పదార్థం ఉనికి, నిషేధించిన రంగులను ఆహార పదార్థాల తయారీలో వినియో గించడం వంటి కారణాలతో చాలా దేశాలు మన ఎగుమతులను నిలిపివేశాయి. జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఇంగ్లండ్ వంటి దేశాలు 1998, 2000 సంవత్సరాలలో మన ఎండు మిర్చి మీద నిషేధం విధించడానికి కారణం అప్లటాక్సిన్ అనే పదార్థమే. చేపల ఎగుమతిలో కూడా ఇలాంటి ఇబ్బందులే ఉన్నాయి. అన్ని రకాల చేపల ఎగుమతులలోను సాల్మొనెల్లా బాక్టీరియా ఉంటుందన్న ఆరోపణ లు ఉన్నాయి. ఈ ఉత్పత్తుల విషయంలో ప్రమాణాలను పాటించని అవిధేయ దేశంగా భారత్‌కు 1997లోనే యూరోపియన్ కమిషన్ ముద్ర వేసింది. పొంచి ఉన్న నిషేధాలు నిషేధాలు ఈయూకే పరిమితం కావడం లేదు. సమీప భవిష్యత్తులోనే రష్యా నుంచి కూడా ఇలాంటి పరిస్థితి తప్పకపోవచ్చు. భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆలుగడ్డలు నాణ్యతా ప్రమాణాలకు దీటుగా లేవనీ, వీటిని నిషేధించక తప్పని పరిస్థితులు ఉన్నాయనీ ఆ దేశ అధికారులు చెబుతున్నారు. కానీ, ఇకపై తమ దేశానికి ఎగుమతులు జరగాలంటే అపిడా ధ్రవీకరణ పత్రం తప్పనిసరి అని రష్యా చెబుతోంది. మనం ఎగుమతి చేస్తున్న బ్రెడ్, ఒలిచిన రొయ్యలు, బాసుమతి బియ్యం, నువ్వులు, మిరియాలు, ధనియాలు, కారం వంటి వస్తువులు అన్నింటికీ క్రిమి సంహారక మందుల అవశేషాల బెడద పుష్కలంగా ఉంది. అరటి చిప్స్‌లో కలుపుతున్న ఎఫ్డీ అండ్ సీ పసుపు రంగు, క్రీమ్ బిస్కెట్లలో సురక్షితం కాని రంగుల వాడకం వల్ల కూడా మన ఎగుమతుల మీద వేటు పడే అవకాశాలు ఉన్నాయి. వీటికి తోడు భార లోహాల ఉనికి కొత్త బెడదగా మారనున్నది. పరిష్కారాలు మన దగ్గరే ఉన్నాయి వ్యవసాయ, ఆహారోత్పత్తులలో క్రిమి సంహారకాల ఉనికి కేవలం ఎగుమతులకు సంబంధించినదే కాదు. మన ఆరోగ్యానికి సంబంధించినదిగా కూడా పరిగణించాలి. సురక్షిత ఆహారం అనే అంశం మీద ఎలాంటి అవగాహన లేని చిన్న చిన్న వ్యాపారులతో చాలా చిక్కులు వస్తున్నాయి. మన నుంచి దిగుమతులను ఆహ్వాని స్తున్న దేశాలలో ఉన్న భద్రత, ఆరోగ్య ప్రమాణాలను మనం గౌరవించాలి. ఎగుమతుల కోసమే కాకుండా, మన ప్రజల ఆరోగ్యం కోసం కూడా ఇందుకు సంబంధించి పటిష్టమైన చట్టాలు చేయాలి. వ్యవసాయోత్పత్తులను ఎంత వృద్ధి చేశామన్నది కాదు, ఎన్ని నాణ్యతా ప్రమాణాలతో, ఆరోగ్య సూత్రాలతో ఆ వృద్ధి జరిగిందన్నదే నేటి ప్రపంచం గమనిస్తున్న అంశం. ఏ దేశమైనా దిగుమతులను ఆహ్వానించగలదు. వాటితో వచ్చే అనారోగ్యాన్ని మాత్రం కాదు. (వ్యాసకర్త వ్యవసాయ రంగ విశ్లేషకులు) బలిజేపల్లి శరత్‌బాబు -
బంగారం దిగుమతులపై మరిన్ని ఆంక్షలు
-
పాక్ నుంచి ఉల్లి దిగుమతులు కోరుతున్నాం: వ్యాపారులు
చండీగఢ్: దేశంలో ఉల్లిపాయల కొరత తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకునే దిశగా చర్యలు చేపట్టినట్టు అమృత్‌సర్‌కు చెందిన వ్యాపారులు తెలిపారు. దీనిలో భాగంగా పాకిస్థాన్ వ్యాపారులు భారత్‌కు ఉల్లిపాయలను ఎగుమతి చేసుకునేందుకు గాను అక్కడి ప్రభుత్వాన్ని అనుమతి కోరాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. అట్టారీ-వాఘా రహదారి మార్గం ద్వారా భారత్‌కు ఉల్లిపాయలను ఎగుమతి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పాక్ వ్యాపారులను కోరినట్టు రాజ్‌దీప్ ఉప్పల్ అనే వ్యాపారి తెలిపారు. సాధారణంగా ఈ మార్గంలో ఉల్లిపాయల ఎగుమతికి పాక్ అనుమతించదని, అయితే, ఈ దారిగుండా ఉల్లిపాయలు భారత్‌కు చేరుకునేందుకు తక్కువ ఖర్చవుతుందని, ఈ విషయాన్ని త్వరగా పరిశీలించి అమల్లోకి వచ్చేలా చూడాలని లాహోర్ ఉల్లి వ్యాపారులను అడిగామని రాజ్‌దీప్ వివరించారు. ప్రస్తుతం భారత్‌లో కిలో ఉల్లి రూ. 70 నుంచి 80 మధ్య పలుకుతోందని పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటే దీని ధర రూ.40కి పడిపోతుందని ఆయన చెప్పారు.