చౌక దిగుమతులపై దర్యాప్తు ఆరంభం
న్యూఢిల్లీ: కొన్ని రకాల స్టీల్ ఉత్పత్తులు చౌకగా దిగుమతి అవుతున్నాయన్న దేశీ స్టీల్ పరిశ్రమ ఫిర్యాదుపై డైరెక్టరేజ్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ (డీజీటీఆర్) అధికారిక దర్యాప్తు మొదలు పెట్టింది. ఫ్యాబ్రికేషన్, పైపుల తయారీ, నిర్మాణ రంగం, క్యాపిటల్ గూడ్స్, ఆటో, ట్రాక్టర్లు, సైకిళ్లు, ఎలక్ట్రికల్ ప్యానెళ్ల కోసం వినియోగించే నాన్ అలాయ్, అలాయ్ స్టీల్ ఫ్లాట్ ఉత్పత్తులపై దర్యాప్తు మొదలు పెట్టినట్టు డీజీటీఆర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉత్పత్తులపై 25 శాతం రక్షిత సుంకం విధించాలని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
ఇటీవల ఉన్నట్టుండి, పెద్ద ఎత్తున పెరిగిన ఈ దిగుమతులతో దేశీ పరిశ్రమకు శారాఘాతంగా మారినట్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశీ పరిశ్రమకు తీవ్ర హానికరంగా పేర్కొంది. దరఖాస్తుదారు (స్టీల్ పరిశ్రమ) సమర్పించిన వివరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించేందుకు కావాల్సిన ప్రాథమిక సాక్ష్యాధారాలుట్టు భావిస్తున్నామని డీజీటీఆర్ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. హాట్ రోల్డ్ (హెచ్‌ఆర్) కాయిల్స్, షీట్స్ అండ్ ప్లేట్స్, హెచ్‌ఆర్ ప్లేట్ మిల్ ప్లేట్స్, కోల్డ్‌రోల్డ్ (సీఆర్) కాయిల్స్ అండ్ షీట్స్, మెటాలిక్ కోటెడ్ స్టీల్ కాయిల్స్ అండ్ షీట్స్, కలర్ కోటెడ్ కాయిల్స్ అండ్ షీట్స్ ఉత్పత్తులు డీజీటీఆర్ దర్యాప్తు పరిధిలోకి రానున్నాయి.
విచారణ అనంతరం తన సిఫారసులను కేంద్ర ఆరి్థక శాఖకు డీజీటీఆర్ సమరి్పస్తుంది. ఈ సిఫారసుల ఆధారంగా దిగుమతులపై ప్రత్యేక సుంకాలు విధించే అవశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా చైనా నుంచి ఈ దిగుమతులు గణనీయంగా పెరిగినట్టు ప్రస్తుత ఆరి్థక సంవత్సరం తొలి ఎనిమిది నెలల గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment