మనం మార్కెట్లో కొనుక్కుని తెచ్చునే తాజా పండ్లు, కూరగాయల్లో 35 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవని చెబుతున్నారు 177 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్(ఐసీటీఏ) నిర్వహించిన ఓ సర్వేలో ఈ నిజం వెలుగులోకి వచ్చింది.
నిత్యవసరాలకు ఉపయోగించే బంగాళదుంప, ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చి మిర్చిలను భారత్ ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోందని వీరు చెబుతున్నారు. భారత్ లో లభ్యమయ్యే కూరగాయలు, పండ్లు, దినుసులు, నూనెలు, పంచదారల్లో మూడో వంతు దిగుమతి చేసుకున్నవేనని అంటున్నారు. ఉల్లిపాయలు, గోధుమలను పశ్చిమ ఆసియా నుంచి, బంగాళదుంప, టమాటోలను దక్షిణ అమెరికా నుంచి, దినుసులను మధ్యదరా సముద్రం చుట్టుపక్కల దేశాలనుంచి, అల్లం, ఆపిల్ లను మధ్య ఆసియా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వివరించారు.