daily needs
-
ఆ ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీకి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: వరద ప్రభావిత జిల్లాల్లో నిత్యవసరాల పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో వరద బారిన పడిన కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళా దుంపలు పంపిణీ చేయనున్నారు. వీటన్నిటిని కూడా బాధితులకు ఉచితంగా అందించనున్నారు. చదవండి: (మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్) -
జగ్గూ భాయ్ సాయం.. జక్కన్నకు పోలీసుల థ్యాంక్స్
హైదరాబాద్ : కరోనా లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు వాయిదా పడటంతో రోజువారి సినీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. అలాంటి వారికి సాయం చేయడానికి ఇప్పటికే అనేకమంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా విలక్షణ నటుడు జగపతిబాబు ఇబ్బందుల్లో ఉన్న పదివేల మంది పేద సినీ కార్మికులకు నిత్యావసరవస్తువులతో పాటు మాస్క్‌లు, శానిటైజర్లు అందజేశారు. గతంలో కూడా సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించారు. అంతేకాకుండా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు ఎన్-95 మాస్క్‌లు, శానిటైజర్లు అందించిన విషయం తెలిసిందే. (బాలయ్యకు మద్దతు తెలిపిన నిర్మాత) రాజమౌళికి ధన్యవాదాలు: సైబరాబాద్ పోలీసులు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భగభగమండే ఎండలో సైతం తమ విధులను నిర్వర్తిస్తున్న పోలీసులకు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఓ ప్రముఖ కంపెనీకి చెందిన శీతల పానీయాలు అందించిన విషయం తెలిసిందే. గత మూడు వారాలుగా నగరంలో 30,000 బాటిళ్లను పోలీసులకు అందించారు. లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ రాజమౌళి బృందం ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా రాజమౌళి అండ్ టీంకు సైబరాబాద్ పోలీసులు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. (బుట్టబొమ్మ సారీ చెప్తుందా?) Thank you @ssrajamouli @Shobu for the expression of support. @cyberabadpolice enjoyed these tasty and nutritious beverages from @GolisodaDrinks. 30000 bottles distributed over 3 weeks time ensuring social distancing and WHO production guidelines. @TelanganaDGP @KTRTRS pic.twitter.com/VmWnRu5ZKc — Cyberabad Police (@cyberabadpolice) May 30, 2020 -
కరోనా క్రైసిస్: ‘లైఫ్ లైన్’ సాయానికి సలాం
కరీంనగర్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేదవారు, దినసరి కార్మికులకు పనులు లేక ఇళ్లకే పరిమితమయ్యారు. రెక్కాడితేగాని డొక్కాడని వారి పరిస్తితి దయనీయంగా మారింది. ఈ క్రమంలో వారిని అదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. అయితే ఏ ఒక్క పేదవాడు ఉపవాసంతో ఉండకూడదని ఇప్పటికే పలువురు ప్రముఖులు, స్వచ్చంద సంస్థలు తమకు తోచిన సహాయసహకారాలు అందిస్తున్నాయి. ఈ సందర్భంగా స్థానిక ‘లైఫ్ లైన్ హాస్పిటల్’ యాజమాన్యం తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. లాక్డౌన్ ప్రకటించినప్పట్నుంచి నిత్యం వందలాది మందికి భోజనాన్ని అందిస్తూ వారి కడుపు నింపుతున్నారు. నగరంలోని వేలాది మంది పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలను అందిస్తూ వారి ముఖాలపై చిరునవ్వును తీసుకొస్తున్నారు. అంతేకాకుండా నగరంలోని పేద ప్రజానీకం ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని వసతులను సమకూరుస్తున్నారు. మామూలు ప్రజానికానీకే కాకుండా కరోనా నియంత్రలో అలుపెరగకుండా పోరాడుతున్న పోలీసు సిబ్బందికి అవసరమైన సానిటైజర్లు, మాస్కులు, ఇతర సామాగ్రిని అందిస్తున్నారు. స్థానిక నాయకుల ప్రశంసలు.. కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవలందిస్తున్న లైఫ్‌లైన్ ఆస్పత్రి డాక్టర్ ప్రదీప్ కుమార్, నిర్వాహకులు చిట్టుమల్ల ప్రశాంత్‌కుమార్, కొండయ్యలపై స్థానిక నాయకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. స్థానిక మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ సునీల్ రావు తదితర నాయకులు ‘లైఫ్ లైన్’ ఏర్పాటు చేస్తున్న అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని మానవథా దృక్పథంతో వారు చేస్తున్న సేవలను కొనియాడుతున్నారు. ‘లైఫ్ లైన్’ ఆస్పత్రి యాజమాన్యం ఎంతోమందికి స్పూర్థిగా నిలుస్తున్నారని ప్రశంసిస్తున్నారు. -
ధరలు పెంచితే జైలుకు పంపండి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో లాక్డౌన్ కొన సాగుతుండటం, మరిన్ని రోజులు దీన్ని కొనసాగించనున్న నేపథ్యంలో నిత్యావసర వస్తువుల లభ్యత పెంచడం, ధరల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిత్యావసరాల ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వీటిని ఉపేక్షించి అధిక ధరలకు అమ్మే వారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెటింగ్ చేసే వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు, ఏడేళ్ల పాటు జైలుకు పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.ఈ మేరకు కేంద్ర హోం సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా, వినియోగదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి పవన్ అగర్వాల్ రాష్ట్రాలకు లేఖలు రాశారు. పప్పులు, నూనెల ధరల్లో అనూహ్య పెరుగుదల.. దేశవ్యాప్తంగా గత నెల చివరి వారం వరకు ధరలు నియంత్రణలోనే ఉన్నా, ఈ నెల తొలి వారం నుంచి సరుకుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల ధరలు గతానికన్నా తగ్గినా, పప్పులు, నూనెల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. కిందటి నెలలో కందిపప్పు ధర కిలో రూ.75 నుంచి రూ.85 మధ్యలో ఉండేది. ప్రస్తుత డిమాండ్ నేపథ్యంలో మేలురకం కందిపప్పు ధర రూ.120 నుంచి రూ.130కి చేరింది. దేశంలో పప్పుధాన్యాల దిగుబడిలో అధిక వాటా కలిగిన కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి రాష్ట్రానికి సరఫరా తగ్గుతోంది. వాహనాల రాకపోకలకు ఆటంకాలు, సిబ్బంది కొరతతో అక్కడి నుంచి సరఫరా ఆగడంతో ధరలు పెరిగాయి. పెసర, మినపపప్పు ధరలు సైతం ఇంతకింతకీ పెరుగుతున్నాయి.సరఫరాలో తగ్గుదల కారణంగా ప్రస్తుతం ధరల పెరుగుదల 20% నుంచి 25% వరకు ఉంది. పెసర పప్పు ధర వారం కింద రూ.85 వరకు ఉండగా, అది ప్రస్తుతం రూ.130–140కి చేరింది. మినపపప్పు ధర సైతం కిలో రూ. 130–135కిపైనే ఉంది. ఇక వంట నూనెల ధరలు సైతం 15 నుంచి 20% పెరిగాయని వినియోగదారుల మంత్రిత్వశాఖే చెబుతోంది. సప్లై చైన్ వ్యవస్థ దెబ్బతినడంతో ఇష్టారీతిన ధరలు పెంచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది.లీటర్ పామాయిల్ ధర రూ.90 ఉండగా, అది ఇప్పుడు రూ.110–120కి చేరింది. ఈ దృష్ట్యా పప్పులు, నూనెల ధరలను నియంత్రించాలని వినియోగదారుల మంత్రిత్వ శాఖ, కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు ఆదేశించింది. ముఖ్యంగా నిల్వలపై పరిమితులు విధించడం, ధరలు తగ్గించడం, డీలర్ల ఖాతాల తనిఖీలు చేపడుతూనే నిత్యావసర సరుకుల చట్టం కింద బ్లాక్‌మార్కెట్ చేసే వారిపై క్రిమినల్ కేసులు, ఏడేళ్ల జైలు శిక్షలు విధించాలని సూచించింది. దీనికై రాష్ట్ర యంత్రాంగాలు విస్తృత తనిఖీలు చేపట్టి అరెస్ట్‌లు చేయాలని కోరింది. ఇప్పటికే ఆహార ధాన్యాల రవాణాను పెంచే క్రమంలో 109 ప్రత్యేక రైళ్ల ద్వారా రైల్వే శాఖ 21,247 వ్యాగన్ల ద్వారా ఉప్పు, చక్కెర, వంటనూనెలు, కంది, బియ్యం వంటి సరుకుల రవాణా చేసిందని, సరుకుల కొరత రాకుండా అన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తోందని ప్రకటించింది. -
కరోనా క్రైసిస్: పొలిమేర, కేవీఆర్ గ్రూప్ సాయం
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేదవారు, దినసరి కార్మికులకు పనులు లేక ఇళ్లకే పరిమితమయ్యారు. రెక్కాడితేగాని డొక్కాడని వారి పరిస్తితి దయనీయంగా మారింది. ఈ క్రమంలో వారిని అదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. అయితే ఏ ఒక్క పేదవాడు ఉపవాసంతో ఉండకూడదని ఇప్పటికే పలువురు ప్రముఖులు, స్వచ్చంద సంస్థలు తమకు తోచిన సహాయసహకారాలు అందిస్తున్నాయి. తాజాగా లాక్డౌన్ సమయంలో కొంత మంది పేదవారినైనా ఆదుకోవాలని పొలిమేర, కేవీఆర్ గ్రూప్ తమ వంతు సాయాన్ని ప్రకటించాయి. నగరంలోని నిజాంపేట, మియాపూర్, బాచుపల్లి, తదితర పరిసర ప్రాంతాల్లోని దాదాపు 4000 మందికి నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించారు. ఈ సందర్భంగా పొలిమేర, కేవీఆర్ గ్రూప్ నిర్వాహకులు గణేష్ రెడ్డి, కేతు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘ఇలాంటి సంక్షభ సమయంలో ఒకరికొకరు అండగా నిలవడం ఎంతో అవసరం. భౌతిక దూరాన్ని పాటిస్తూ సామాజిక స్పృహతో సహాయం చేయడం మన కర్తవ్యంగా భావించాలి’అని అన్నారు. విపత్కర సమయంలో పొలిమేర, కేవీఆర్ గ్రూప్ గొప్ప మనుసు చాటుకున్నాయిన నెటిజన్లు హర్హం వ్యక్తం చేస్తున్నారు. -
కూలీలకు సహాయంగా అనురాగ్ సంస్థ
సాక్షి, హైదరాబాద్: కష్టాల్లో ఉన్నప్పుడే మనిషి విలువ తెలుస్తుందంటారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ లక్షలాది మందికి కష్టాలు తెచ్చిపెట్టింది. లాక్డౌన్ వలన ఎన్నో జీవితాలు అతలాకుతులమయ్యాయి. రెక్కాడితే కాని డొక్కాడని కూలీలకు చేయడానికి పని లేకుండా పోయింది. ఆకలి కష్టాల్లో ఉన్న కూలీలకు, భవన కార్మికులకు, వలస కూలీల బాధలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కు చెందిన అనురాగ్ సంస్థ తనవంతు సాయంగా కాప్రాలో మార్చి 16 నుంచి 20 వరకూ కరోనాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. అంతేగాక ఆ ప్రాంతంలో నివాసించే కూలీలకు, భవన కార్మికుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం శైలజ, సీఐ చంద్రశేఖర్‌ల ఆధ్వర్యంలో అన్నం పొట్లాలు, కురగాయలను పంపిణీ చేసింది. (భారత్ నుంచి 1300 మంది వెనక్కి: అమెరికా) ఈ క్రమంలో కరోనా వల్ల ఎదుర్కొంటున్న కష్టాలను అధిగమించడానికి వ్యక్తిగత శుభ్రత గురించి వివరించి మాస్క్‌లు, శానిటైజర్లు పంచి పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ పిలుపు మేరకు దేశంలో అమలవుతున్న లాక్డౌన్ ద్వారా కరోనా మహమ్మారిని తరిమే ఉద్దేశంతో ‘బయటకు రావోద్దు- ఇల్లే ముద్దు’ అనే నినాదంతో ఈ సంస్థ ముందుకు వెళ్లింది. అంతేగాక కాప్రా పరిసర ప్రాంత భవన కార్మికుల ఇంటి ఇంటికీ వెళ్లి కురగాయలు, కిరణా సామగ్రిని అందించింది. ఈ పంపిణీ కార్యక్రమంలో డా. రామ్ సతిమణి బిందు, రాజు, రమ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు. (దేశంలో 117కి చేరిన కరోనా మరణాలు) -
కరోనా క్రైసిస్: పోసాని గొప్ప మనుసు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ రచయిత, దర్శకుడు, విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ నేపథ్యంలో పేదవాళ్లు, రోజువారి కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వారిని అదుకోవడానికి టాలీవుడ్ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా నేను సైతం అంటూ పోసాని కృష్ణమురళి కూడా తన వంతు బాధ్యతగా సాయాన్ని ప్రకటించారు. లాక్డౌన్ కారణంగా పనులు లేకుండా పోయిన 50 పేద కుటుంబాలకు ఒక నెలకు సరిపడే విధంగా అన్ని వస్తువులను అందజేశారు. దీంతో ఆ 50 కుటుంబాల్లో చిరునవ్వును నింపారు. పోసాని చేసిన గొప్ప పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా ఆయన బాటలో మరికొంత మంది నడిచి ప్రతీ ఒక్క పేదవాడి కడుపు నింపాలని పలువురు ఆకాంక్షించారు. -
మనం తినేవన్నీ అవా..!
మనం మార్కెట్లో కొనుక్కుని తెచ్చునే తాజా పండ్లు, కూరగాయల్లో 35 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవని చెబుతున్నారు 177 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్(ఐసీటీఏ) నిర్వహించిన ఓ సర్వేలో ఈ నిజం వెలుగులోకి వచ్చింది. నిత్యవసరాలకు ఉపయోగించే బంగాళదుంప, ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చి మిర్చిలను భారత్ ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోందని వీరు చెబుతున్నారు. భారత్ లో లభ్యమయ్యే కూరగాయలు, పండ్లు, దినుసులు, నూనెలు, పంచదారల్లో మూడో వంతు దిగుమతి చేసుకున్నవేనని అంటున్నారు. ఉల్లిపాయలు, గోధుమలను పశ్చిమ ఆసియా నుంచి, బంగాళదుంప, టమాటోలను దక్షిణ అమెరికా నుంచి, దినుసులను మధ్యదరా సముద్రం చుట్టుపక్కల దేశాలనుంచి, అల్లం, ఆపిల్ లను మధ్య ఆసియా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వివరించారు.