కరీంనగర్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేదవారు, దినసరి కార్మికులకు పనులు లేక ఇళ్లకే పరిమితమయ్యారు. రెక్కాడితేగాని డొక్కాడని వారి పరిస్తితి దయనీయంగా మారింది. ఈ క్రమంలో వారిని అదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. అయితే ఏ ఒక్క పేదవాడు ఉపవాసంతో ఉండకూడదని ఇప్పటికే పలువురు ప్రముఖులు, స్వచ్చంద సంస్థలు తమకు తోచిన సహాయసహకారాలు అందిస్తున్నాయి.
ఈ సందర్భంగా స్థానిక ‘లైఫ్ లైన్ హాస్పిటల్’ యాజమాన్యం తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. లాక్‌డౌన్ ప్రకటించినప్పట్నుంచి నిత్యం వందలాది మందికి భోజనాన్ని అందిస్తూ వారి కడుపు నింపుతున్నారు. నగరంలోని వేలాది మంది పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలను అందిస్తూ వారి ముఖాలపై చిరునవ్వును తీసుకొస్తున్నారు. అంతేకాకుండా నగరంలోని పేద ప్రజానీకం ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని వసతులను సమకూరుస్తున్నారు. మామూలు ప్రజానికానీకే కాకుండా కరోనా నియంత్రలో అలుపెరగకుండా పోరాడుతున్న పోలీసు సిబ్బందికి అవసరమైన సానిటైజర్లు, మాస్కులు, ఇతర సామాగ్రిని అందిస్తున్నారు.
స్థానిక నాయకుల ప్రశంసలు..
కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవలందిస్తున్న లైఫ్‌లైన్ ఆస్పత్రి డాక్టర్ ప్రదీప్ కుమార్, నిర్వాహకులు చిట్టుమల్ల ప్రశాంత్‌కుమార్, కొండయ్యలపై స్థానిక నాయకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. స్థానిక మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ సునీల్ రావు తదితర నాయకులు ‘లైఫ్ లైన్’ ఏర్పాటు చేస్తున్న అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని మానవథా దృక్పథంతో వారు చేస్తున్న సేవలను కొనియాడుతున్నారు. ‘లైఫ్ లైన్’ ఆస్పత్రి యాజమాన్యం ఎంతోమందికి స్పూర్థిగా నిలుస్తున్నారని ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment