హైదరాబాద్ : కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లు వాయిదా పడటంతో రోజువారి సినీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. అలాంటి వారికి సాయం చేయడానికి ఇప్పటికే అనేకమంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా విలక్షణ నటుడు జగపతిబాబు ఇబ్బందుల్లో ఉన్న పదివేల మంది పేద సినీ కార్మికులకు నిత్యావసరవస్తువులతో పాటు మాస్క్‌లు, శానిటైజర్లు అందజేశారు. గతంలో కూడా సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించారు. అంతేకాకుండా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు ఎన్-95 మాస్క్‌లు, శానిటైజర్లు అందించిన విషయం తెలిసిందే. (బాలయ్యకు మద్దతు తెలిపిన నిర్మాత)
రాజమౌళికి ధన్యవాదాలు: సైబరాబాద్ పోలీసులు
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు భగభగమండే ఎండలో సైతం తమ విధులను నిర్వర్తిస్తున్న పోలీసులకు దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి ఓ ప్రముఖ కంపెనీకి చెందిన శీతల పానీయాలు అందించిన విషయం తెలిసిందే. గత మూడు వారాలుగా నగరంలో 30,000 బాటిళ్లను పోలీసులకు అందించారు. లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూ రాజమౌళి బృందం ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా రాజమౌళి అండ్ టీంకు సైబరాబాద్ పోలీసులు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. (బుట్టబొమ్మ సారీ చెప్తుందా?)
Thank you @ssrajamouli @Shobu for the expression of support. @cyberabadpolice enjoyed these tasty and nutritious beverages from @GolisodaDrinks. 30000 bottles distributed over 3 weeks time ensuring social distancing and WHO production guidelines. @TelanganaDGP @KTRTRS pic.twitter.com/VmWnRu5ZKc
— Cyberabad Police (@cyberabadpolice) May 30, 2020
Comments
Please login to add a commentAdd a comment