సాక్షి, హైదరాబాద్: కష్టాల్లో ఉన్నప్పుడే మనిషి విలువ తెలుస్తుందంటారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ లక్షలాది మందికి కష్టాలు తెచ్చిపెట్టింది. లాక్‌డౌన్ వలన ఎన్నో జీవితాలు అతలాకుతులమయ్యాయి. రెక్కాడితే కాని డొక్కాడని కూలీలకు చేయడానికి పని లేకుండా పోయింది. ఆకలి కష్టాల్లో ఉన్న కూలీలకు, భవన కార్మికులకు, వలస కూలీల బాధలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కు చెందిన అనురాగ్ సంస్థ తనవంతు సాయంగా కాప్రాలో మార్చి 16 నుంచి 20 వరకూ కరోనాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. అంతేగాక ఆ ప్రాంతంలో నివాసించే కూలీలకు, భవన కార్మికుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం శైలజ, సీఐ చంద్రశేఖర్‌ల ఆధ్వర్యంలో అన్నం పొట్లాలు, కురగాయలను పంపిణీ చేసింది. (భారత్ నుంచి 1300 మంది వెనక్కి: అమెరికా)
ఈ క్రమంలో కరోనా వల్ల ఎదుర్కొంటున్న కష్టాలను అధిగమించడానికి వ్యక్తిగత శుభ్రత గురించి వివరించి మాస్క్‌లు, శానిటైజర్లు పంచి పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్ పిలుపు మేరకు దేశంలో అమలవుతున్న లాక్‌డౌన్ ద్వారా కరోనా మహమ్మారిని తరిమే ఉద్దేశంతో ‘బయటకు రావోద్దు- ఇల్లే ముద్దు’ అనే నినాదంతో ఈ సంస్థ ముందుకు వెళ్లింది. అంతేగాక కాప్రా పరిసర ప్రాంత భవన కార్మికుల ఇంటి ఇంటికీ వెళ్లి కురగాయలు, కిరణా సామగ్రిని అందించింది. ఈ పంపిణీ కార్యక్రమంలో డా. రామ్ సతిమణి బిందు, రాజు, రమ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు. (దేశంలో 117కి చేరిన కరోనా మరణాలు)
Comments
Please login to add a commentAdd a comment