Helping Hands
-
వైద్యురాలి ఊపిరితిత్తుల మార్పిడికి సీఎం జగన్ చేయూత
సాక్షి, అమలాపురం: అనారోగ్యంతో బాధపడుతున్న వైద్యాధికారి పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఔదార్యం చూపింది. దెబ్బతిన్న ఊపిరితిత్తులు, అవయవ మార్పిడి కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.30 లక్షలు మంజూరు చేసింది. ఈ విషయాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం విలేకరులకు తెలిపారు. వివరాల ప్రకారం.. జిల్లాలోని కె.గంగవరం మండలం పేకేరు పీహెచ్సీ వైద్యాధికారిగా కాలే యేసు దేవీకుమారి పదేళ్లుగా పని చేస్తున్నారు. ఆమె రెండో దశలో కోవిడ్ బారినపడి కోలుకున్న తర్వాత అరుదైనవ్యాధి సోకడంతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. దీనికి కొంతకాలం నుంచి ఆమె చికిత్స పొందుతున్నారు. కానీ ఊపిరితిత్తులు 85శాతం దెబ్బతినడంతో నెల రోజుల క్రితం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్సలు చేసినా ఫలితం లేకపోవడంతో ఊపిరి తిత్తులు మార్పిడి చేయాలని వైద్యులు చెప్పారు. అదే సమయంలో సీఎం వైఎస్ జగన్ ఈ నెల 7వ తేదీన జిల్లాలోని రాజోలు నియోజకవర్గ పర్యటనకు వచ్చారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా చొరవతో డాక్టర్ యేసు దేవీకుమారి భర్త, కొత్తపేట మండలం అవిడి పీహెచ్సీ వైద్యాధికారి పి.రవికుమార్... సీఎం జగన్‌ను కలిసి తన భార్యకు వైద్యం కోసం సహాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు లెటర్ ఆఫ్ క్రెడిట్ ప్రాతిపదికన అవయవ మార్పిడి జరిగిన తర్వాత నేరుగా యశోద ఆస్పత్రికి చెల్లించే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.30 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సీఎం సాయం మరువలేం చాలా సంతోషంగా ఉంది. నా భార్య ప్రాణాలు నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సాయం మరువలేం. నా భార్య అనారోగ్య సమస్యను కలెక్టర్ హిమాన్షు శుక్లా దృష్టికి తీసుకువెళ్లాను. డీఎంహెచ్‌వో ద్వారా కలెక్టర్ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సీఎం జగన్ వద్దకు కలెక్టర్ తీసుకువెళ్లి నాతోపాటు ఆయన కూడా సమస్యను వివరించారు. తర్వా త మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ స్వయంగా సీఎం వద్దకు ఫైల్ తీసుకువెళ్లారు. వీరందరి కృషితో నా భార్య ఊపిరితిత్తుల మార్పిడికి ఈ సాయం అందింది. – డాక్టర్ రవికుమార్, వైద్యాధికారి, అవిడి పీహెచ్సీ, కొత్తపేట మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇది కూడా చదవండి: Andhra Pradesh:భూ చిక్కుముడులకు చెక్ -
CM Jagan: సాయం కోరితే.. సత్వర స్పందన
సాక్షి, ప్రకాశం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి గొప్ప మనస్సు చాటుకున్నారు. ఆపదలో సాయం అడిగిన వారికి నేనున్నానంటూ ఆపన్న హస్తం అందించారు. సీఎం జగన్ బుధవారం మార్కాపురంలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమం అనంతరం, తమకు సాయం అందించాలని కొందరు బాధితులు సీఎం జగన్‌ను కలిశారు. దీంతో, గొప్ప మనస్సుతో వారికి సాయం అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అధైర్యపడవద్దు.. అండగా ఉంటా.. తూర్పుగోదావరి జిల్లా మిరియంపల్లి శ్రీనివాసులు(49) వెలగపూడి రామకృష్ణ డిగ్రీ కాలేజీలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ఇద్దరు బిడ్డలు. కుమార్తె చంద్రగౌరి(24) అంగవైక్యలంతో జన్మించింది. చిన్నప్పటి నుంచి మాటలు కూడా రావు. కుమారుడు కూడా అంగవైకల్యంతో జన్మించాడు. తన కుటుంబ పరిస్థితి దృష్టిలో ఉంచుకుని తన బిడ్డలకు తగిన వైద్య సాయం అందించాలని సీఎం జగన్‌ను కోరారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఇప్పించమని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తగు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్.. కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రభుత్వం సహకారం అందిస్తామని సీఎం హమీ ఇచ్చారు. ఆపరేషన్ చేపిస్తా.. ఉద్యోగం ఇప్పిస్తా.. నాగిరెడ్డిపల్లికి చెందిన వి. మార్తమ్మకు ఇద్దరు కుమారులు. భర్త చనిపోయాడు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. పెద్ద కుమారుడు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఒక కిడ్నీ పాడైపోయింది. ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లడంతో ముఖ్యమంత్రి.. బాధితులకు భరోసా ఇచ్చారు. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు సీఎం జగన్. ప్రభుత్వం తరఫున పూర్తి వైద్య సాయం అందిస్తామని, అర్హతను బట్టి ఉద్యోగం కూడా ఇప్పిస్తామని సీఎం జగన్ తెలిపారు. తక్షణమే లక్ష రూపాయల ఆర్థిక అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. న్యాయం చేస్తాం సాంకేతిక సమస్యల వల్ల తనకు వస్తున్న సంక్షేమ పథకాలు, పెన్షన్ నిలిచిపోయాయని ఓ వృద్ధుడు ఇచ్చిన అర్జీపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించి.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. బొప్పరాజు నరసయ్య(60) అనే వ్యక్తి ప్రత్యేక అర్జీకి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. తర్లుపాడు మండలం గోరుగుంతలపాడు గ్రామానికి చెందిన తనకు వికలాంగుల పెన్షన్ వస్తున్నట్లు చెప్పాడు. అయితే.. కిందటి ఏడాది ఆగష్టు నుంచి పెన్షన్‌తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవీ అందడం లేదని మార్కాపురం పర్యటన ముగించుకుని వెళ్తున్న సీఎం జగన్ దృష్టికి తన సమస్యను తీసుకెళ్లారు. సచివాలయానికి వెళ్లి అధికారులను అడిగితే.. హౌజ్హోల్డింగ్ మ్యాపింగ్‌లో తన కోడలు సచివాలయ ఉద్యోగిగా పని చేస్తోందని, రూ.12 వేల కన్నా ఎక్కువ వేతనం ఆమెకు వస్తుండడమే అందుకు కారణమని అధికారులు చెప్పారని సీఎం జగన్‌కు నరసయ్య వివరించాడు. గతంలో తాను, తన భార్య, కొడుకు-కోడలు ఒకే మ్యాపింగ్‌లో ఉన్నప్పటికీ.. రెండు నెలల కిందటి నుంచి రెండు కుటుంబాలుగా ఏపీ సేవా పోర్టల్‌లో స్ప్లిట్ చేయించుకున్నామని, సచివాలయంలో ఇందుకు సంబంధించి సర్టిఫికెట్ తీసుకున్నామని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారాయన. కానీ, పైస్థాయి నుంచి అనుమతి రానందున.. ఆన్లైన్లో డేటా మార్చడం కుదరదని సిబ్బంది చెప్పినట్లు సీఎం జగన్‌కు వివరించారు. తమకు సహాయం చేయాలని నరసయ్య కోరగా.. న్యాయం చేస్తామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. బిడ్డను కోల్పోయా.. సహాయం చేయండి కుటుంబానికి అండగా ఉంటున్న కుమారుడిని కోల్పోయిన తమకు ప్రభుత్వం అండగా ఉండి.. ఆర్థిక సహాయం చేయాలని అర్థవీడు మండలం యాచవరం గ్రామానికి చెందిన బి.సాల్మన్, సీఎం జగన్‌ను కోరారు. ఈ మేరకు ప్రత్యేక వినతిపత్రం ఇచ్చారు. చేతికి ఎదిగి వచ్చిన కొడుకు రమేష్(24) ప్రమాదంలో చనిపోవడంతో తన కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. సీఎంఆర్ఎఫ్ నుంచి సహాయం అందించాలని సాల్మన్, సీఎం జగన్‌ను కోరగా.. సంబంధిత వివరాలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. -
AP: శరవేగంగా సాయం.. 99 మండలాల్లో భారీ వర్షాల ప్రభావం..
సాక్షి, అమరావతి, నెట్వర్క్: మాండూస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లోని 99 మండలాల్లో 416 గ్రామాలు వర్షాల ప్రభావానికి గురయ్యాయి. నెల్లూరు జిల్లాలోని పునరావాస కేంద్రాల్లో 208 మంది, చిత్తూరు జిల్లాలో 416 మంది, తిరుపతి జిల్లాలోని కేంద్రాల్లో 571 మంది మొత్తం 1,195 మందికి ఆశ్రయమిచ్చి భోజన సదుపాయాలు కల్పించారు. ఇళ్లకు తిరిగి వెళుతున్న బాధితులకు రూ.2 వేల చొప్పున సాయాన్ని అందిస్తున్నారు. పారిశుధ్య చర్యలు చేపట్టి అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పంట, ఆస్తి నష్టాలను ఆయా శాఖలు అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యాయి. వదలని వర్షాలు.. తుపాన్ ప్రభావిత జిల్లాల్లో వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. ఆదివారం ఉదయం 8.30 నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు నెల్లూరు జిల్లా ఉలవపాడులో అత్యధికంగా 12.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విశాఖ జిల్లా భీమునిపట్నంలో 10.2 సెంటీమీటర్లు, నెల్లూరు జిల్లా కందుకూరులో 9.8, విశాఖ జిల్లా భీమిలిలో 9.4, ప్రకాశం జిల్లా జరుగుమిల్లిలో 8.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అన్నమయ్య జిల్లా కురబలకోటలో 7 సెంటీమీటర్ల వర్షం పడింది. 1,267 బృందాలు తుపాన్ ప్రభావిత గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణతో పాటు రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ 1,267 బృందాలను సిద్ధం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సోమవారం శాఖ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. మురుగు కాల్వలలో పూడిక తొలగింపు పనులను వెంటనే చేపట్టాలని సూచించారు. 21 కల్లా నష్టం లెక్కలు మాండూస్ తుపాన్ వల్ల జరిగిన పంట నష్టం లెక్కింపు ప్రక్రియను ఈ నెల 21వ తేదీకల్లా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ అధికారులకు సూచించారు. పంట నష్టం జాబితాలను సామాజిక తనిఖీల కోసం 26 కల్లా పూర్తి చేసి డిసెంబర్ 27న ఈ – క్రాప్ ప్రాతిపదికన తుది జాబితాలను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. తుపాన్ వల్ల రబీ సీజన్లో దెబ్బ తిన్న పంటల స్థానంలో రెండోసారి విత్తుకునేందుకు వీలుగా ప్రతిపాదనలను రెండు రోజుల్లో పంపాలని అధికారులకు సూచించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మల్లిమడుగు, కాళంగి, అరిణియార్, ఎన్టీఆర్ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండిపోవటంతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. అత్యధికంగా సోమల మండలంలో 37.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 2,650 చెరువులు ఉండగా 90 శాతం పూర్తిగా నిండిపోయాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద చెరువైన తొండమనాడు చెరువు కలుజు పారుతోంది. 10,500 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. చిల్లకూరు మండలం పాలెం గ్రామానికి చెందిన కిడ్నీ బాధితుడు వ్యాధిగ్రస్తుడు ప్రదీప్ నాయుడు ఆక్వా గుంత వద్ద చిక్కుకోవడంతో రెస్క్యూటీం పడవ ద్వారా చేరుకుని రక్షించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయానికి సోమవారం సాయంత్రానికి 26 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. -
శ్రీకాకుళం: గొప్ప మనసు చాటుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి, శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి సాయం అందించి మంత్రి సీదిరి అప్పలరాజు గొప్ప మనసు చాటుకున్నారు. క్షతగాత్రులకు తన ప్రోటోకాల్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నుంచి తన స్వగ్రామానికి మంత్రి సీదిరి అప్పలరాజు కాన్వాయ్‌లో వెళ్తున్నారు. ఈ క్రమంలో పూండి గ్రామ సమీపంలో బైక్‌పై వెళ్తూ ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఆ సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి సీదిరి.. క్షతగాత్రులను చూశారు. అనంతరం, వెంటనే రోడ్డు ప్రక్కనే కాన్వాయ్‌ని నిలిపివేసి వారికి ప్రథమ చికిత్స అందించి మానవత్వం చాటుకున్నారు. వారు తీవ్రంగా గాయపడటంతో తన కాన్వాయ్‌లోని ఓ వాహనంలో వారిని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని గుర్తించిన మంత్రి సీదిరి.. హై స్పీడ్‌తో వెళ్లవద్దని సూచించారు. అతి వేగమే ప్రమాదాలకు కారణమవుతుందని హితవు పలికారు. -
మానవత్వం చాటుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు
-
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్.. చిన్నారి వైద్యసాయంపై హామీ
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. నరసన్నపేట పర్యటనలో భాగంగా కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో కాన్వాయ్ నుంచి బాధితులను గమనించిన సీఎం వైఎస్ జగన్ వాహనం నిలిపివేసి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా చిన్న శిర్లాం గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి తమ కుమార్తె ఇంద్రజకు(7) అవసరమైన వైద్య సాయం అందించాలని సీఎం వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇంద్రజ అనారోగ్య సమస్యను సీఎం జగన్‌కు వారు వివరించారు. దీంతో, తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి జగన్.. ఇంద్రజకు అవసరమైన పూర్తి వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం, చిన్నారి పేరెంట్స్ జగనన్నకు ధన్యవాదాలు తెలిపారు. ఇక సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో చిన్నారి ఇంద్రజ తల్లిదండ్రులు మీసాల కృష్ణవేణి, మీసాల అప్పలనాయుడుని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లఠ్కర్ పిలిపించుకుని మాట్లాడారు. అంతేకాదు.. చిన్నారి ఇంద్రజ ప్రస్తుత ఆరోగ్య పరిస్ధితిని పరిశీలించేందుకు డీఎంహెచ్‌వో పర్యవేక్షణలో శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు ఇంద్రజకు అవసరమైన శస్త్రచికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించనుంది. -
గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్.. హనీ వైద్యం కోసం రూ.కోటి మంజూరు
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): ఓ చిన్నారి ప్రాణాలకు సీఎం వైఎస్ జగన్ శ్రీరామరక్షలా నిలిచారు. ఆమెకు సోకిన అరుదైన వ్యాధి వైద్యానికి లక్షలాది రూపాయల ఖర్చును జీవితాంతం భరిస్తానని భరోసా ఇచ్చారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తమ పాలిట దైవంలా వచ్చి తమ బిడ్డకు ప్రాణం పోశారంటూ ఆ నిరుపేద తల్లిదండ్రులు సీఎం జగన్‌కు చేతులెత్తి దండం పెడుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేశ్వరానికి చెందిన మూడేళ్ల కొప్పాడి హనీ.. కాలేయానికి సంబంధించిన అరుదైన వ్యాధి ‘గాకర్స్’ బారిన పడింది. తల్లిదండ్రులు రాంబాబు, నాగలక్ష్మి నిరు పేదలు. తండ్రి ఇంటింటా ప్రభుత్వ రేషన్ వాహనాన్ని నడుపుకుంటూ, తల్లి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు, కుమార్తె హనీ ఉన్నారు. హనీకి 15 రోజులకోసారి రూ.1.25 లక్షల విలువైన సెరిజైమ్ అనే ఇంజెక్షన్ చేయాల్సి ఉంది. అమెరికాలోని ఈ ఇంజెక్షన్ తయారీ సంస్థ డిస్కౌంట్ పోను రూ.74 వేలకు దీనిని అందిస్తోంది. ఇంత ఖర్చు చేయడం ఆ కుటుంబం వల్ల కావడం లేదు. ప్లకార్డు చూసి.. స్పందించిన సీఎం జగన్ కుమార్తెను ఎలా దక్కించుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపద్బాంధవుడిలా కనిపించారు. గత జూలై 26న సీఎం జగన్ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు వచ్చారు. లంకల్లో వరద పరిస్థితులను పరిశీలించాక పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు కాన్వాయ్‌తో వెళుతున్నారు. ‘సీఎం గారూ.. మా పాపకు వైద్యం అందించండి’ అనే అభ్యర్థనతో ప్లకార్డు పట్టుకుని.. హెలిప్యాడ్ సమీపాన కుమార్తెతో కలిసి తల్లిదండ్రులు నిలుచున్నారు. ఆ ప్లకార్డు చూసి ఆగిన సీఎం జగన్.. ఆ చిన్నారి వ్యాధి గురించి విని చలించిపోయారు. పాప ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చయినా జీవితాంతం వైద్యం చేయిస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఆదేశించారు. తొలి విడతగా రూ.10 లక్షలతో 13 ఇంజెక్షన్లు సీఎం ఆదేశాల మేరకు చిన్నారి వైద్యానికి తొలి విడతగా రూ.10 లక్షల విలువైన 13 ఇంజెక్షన్లను అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక ముందు కూడా దాదాపు రూ.40 లక్షలతో మరో 52 ఇంజెక్షన్లు తెప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రిలో కలెక్టర్ సమక్షంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ పద్మశ్రీరాణి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి భరతలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకరరావులు.. హనీకి ఆదివారం ఉదయం తొలి ఇంజెక్షన్ చేశారు. బాలిక తల్లిదండ్రులకు కలెక్టర్ శుక్లా ధైర్యం చెప్పారు. చిన్నారి వైద్యానికి సీఎం జగన్ రూ.కోటి కేటాయించారని తెలిపారు. చదువుతో పాటు పౌష్టికాహారం, పెన్షన్‌ను కూడా ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. చిన్నారికి ప్రభుత్వం సరఫరా చేసిన మందుల కిట్‌ను వారికి అందించారు. దేశంలో మొత్తం 14 మంది.. రాష్ట్రంలో తొలి బాధితురాలు హనీకి వచ్చిన కాలేయ సంబంధిత గ్రాకర్ వ్యాధి అత్యంత అరుదైనది. దేశంలో ఈ తరహా బాధితులు 14 మందే ఉండగా.. రాష్ట్రంలో హనీ తొలి బాధితురాలు. కాలేయ పనితీరులో జరిగే ప్రతికూల పరిస్థితులు, జన్యుపరమైన లోపాల వల్ల ఈ అరుదైన వ్యాధి సోకుతుంది. లివర్ హార్మోన్ల రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా చిన్నారికి వైద్యం అందిస్తున్నారు. లివర్‌లో ఉండే ఎంజైమ్ బీటా గ్లూకోసైడేజ్ లోపించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. వీరికి జీవితాంతం వైద్యం అవసరం. అయితే హనీ చిన్న వయస్సులో ఉన్నందున పదేళ్ల పాటు ప్రతి నెలా రెండు ఇంజెక్షన్ల చొప్పున ఇస్తే.. ఆరోగ్యం కుదుట పడే అవకాశముందని వైద్యులు భావిస్తున్నారు. పేదోడి కోసం ఓ ముఖ్యమంత్రి ఇంతలా పరితపిస్తారా.. ఈ రోజే తొలి ఇంజెక్షన్ ఇచ్చారు. మా పాపకు ప్రాణం దానం చేసిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఆ రోజు కాన్వాయ్‌లో సీఎం జగనన్న మమ్మల్ని చూసి ఆగడం.. మా పాప అనారోగ్యం గురించి తక్షణమే స్పందించి కలెక్టర్‌కు చెప్పడం, ఇప్పుడు రూ.లక్షల విలువైన వైద్యం అందించడం చూస్తుంటే.. ఓ సీఎం ఇంతలా ఓ పేదవాడి కోసం తపిస్తారా.. అని ఆశ్చర్యమేస్తోంది. మా బిడ్డను ఆదుకుని మాపాలిట దైవంలా నిలిచిన జగనన్నకు చేతులెత్తి దండాలు పెడుతున్నాం. – తల్లిదండ్రులు రాంబాబు, నాగలక్ష్మి -
ఆహారం మిగిలిందా... మాకివ్వండి
సాక్షి,మదనపల్లె సిటీ: శుభ కార్యాల్లో ఆహారం మిగిలిపోయిందా? హోటళ్లలో భోజనం, అల్పహారం ఉండిపోయిందా.. అయితే ఆ ఆహారాన్ని మాకందించండి.. మీ తరపున పేదలకు అందిస్తాం అంటున్నారు మదనపల్లెకు చెందిన హెల్పింగ్ మైండ్స్ సభ్యులు. పేదల ఆకలిని తీర్చేందుకు స్థానిక ఆర్టీసీ బస్టాండులో ఫుడ్ బ్యాంకు కేంద్రం ఏర్పాటు చేశారు. ’ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే.. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఫుడ్ బ్యాంకు కేంద్రం ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన ఆహారాన్ని భద్రపరిచే ఆలోచనతో ఏర్పాటు చేసిన కేంద్రం ఇప్పుడు అన్నపూర్ణగా మారింది. ఈ కేంద్రాన్ని గత ఏడాది ఫిబ్రవరి 14న పుల్వాలో అమరులైన జవానుల జ్ఞాపకార్థం హెల్పింగ్‌మైండ్స్ సంస్థ ఏర్పాటు చేసింది. ఆకలి బాధను దిగమింగుకుంటూ అడుగులు వేస్తున్న పేద అవ్వాతాతలు, దివ్యాంగులు, అనాథల కడుపులు నింపుతున్నాయి. సంస్థ సభ్యులు ప్రతి రోజు ఇందులో ఆహారాన్ని నిల్వ చేస్తారు. ప్రధానంగా ఎవరైనా పుట్టిన రోజు వేడుకలు, వర్ధంతి కార్యక్రమాలకు దాతలు ముందుకు వచ్చి ఇందులో ఆహారపొట్లాలను పెడుతున్నారు. కేంద్రానికి వచ్చే ఆహార పదార్థాల్ని ఫ్రిజ్‌ల్లో భద్రపరచడం, పేదలకు అందించడం సిబ్బంది కర్తవ్యం. ఈ కేంద్రం ఏర్పాటుపై ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరూ సహకారం అందిస్తున్నారు పేదలకు గుప్పెడు అన్నం అందించాలనే లక్ష్యంతో ఫుడ్ బ్యాంకు ఏర్పాటు చేశాం. అందరూ సహకరిస్తున్నారు.మానవత్వం, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ ఆహారాన్ని వృథాగా పారవేయకుండా ఈ కేంద్రానికి అందజేయాలి. –అబూబకర్‌సిద్దిక్, హెల్పింగ్‌మైండ్స్ వ్యవస్థాపకులు, మదనపల్లె -
అయ్యో.. చిన్నారికి ఎంత కష్టం..
సాక్షి, తిరుమలాయపాలెం(ఖమ్మం): అమ్మ పొత్తిళ్లలో హాయిగా ఉండాల్సిన ఈ పిల్లాడు ఆస్పత్రి బెడ్డుపై బిక్కుబిక్కుమంటున్నాడు. గుండెకు రంధ్రం పడి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న బిడ్డడిని చూస్తూ పేద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మేడిదపల్లి గ్రామానికి చెందిన బందారపు లింగేశ్వర్, శైలజ దంపతుల ఎనిమిది నెలల బాబు మోక్షిత్ గుండె సమస్యతో బాధపడుతున్నాడు. నాలుగు నెలల కిందట శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించారు. పుట్టుకతోనే హృదయానికి రంధ్రం ఉందని అక్కడి వైద్యులు గుర్తించారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్ హాస్పిటల్‌కు సిఫారసు చేయగా..పరీక్షించిన పెద్ద డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, రూ.12 లక్షలు ఖర్చవుతాయని తెలిపారు. ఉన్నత చదువు చదివినా ఉద్యోగం రాకపోవడంతో పెయింటింగ్ వర్కర్‌గా పనిచేస్తూ జీవిస్తున్న లింగేశ్వర్.. ఇప్పటి దాకా రూ.3 లక్షలు అప్పుచేసి వైద్యం చేయించాడు. ఆరోగ్యం క్షీణిస్తున్న బిడ్డడిని చూస్తూ.. చేతిలో డబ్బులు లేక కుమిలిపోతున్న ఆ అమ్మానాన్నల హృదయ వేదన అంతాఇంతా కాదు. దాతలు సాయం చేయాలి.. వైద్య సౌకర్యం ఉన్న ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ పరిధిలో లేకపోవడంతో మొత్తం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చిన్నారి తల్లిదండ్రులు అంటున్నారు. పనిచేస్తేనే ఇల్లు గడుస్తుందని, తమ బిడ్డ మోక్షిత్ ఆపరేషన్‌కు దాతలు సాయం చేయాలని లింగేశ్వర్, శైలజ కోరుతున్నారు. దయార్థ్ర హృదయులు స్పందించాలని వేడుకుంటున్నారు. సెల్ నంబర్ 8179913499కు కాల్ చేసి కానీ, ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా కానీ..ఆర్థిక సాయం చేసి, ఆపరేషన్‌కు చేయూతనివ్వాలని వేడుకుంటున్నారు. -
చేతులెత్తి నమస్కరించిన న్యాయమూర్తి
ఖమ్మం క్రైం: మానవత్వం ఎల్లలు దాటింది.. గ్రామం, మండలం, జిల్లా దాటి పక్క రాష్ట్రాలకు చేరిన సేవా తత్పరుడికి అక్కడి ప్రజలు పాదపూజ చేశారు. ఏకంగా జిల్లా జడ్జి చేతులెత్తి నమస్కరించి.. సేవలను అభినందించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ‘అన్నం’ ఫౌండేషన్ కొనసాగుతోంది. దిక్కులేని వారినేగాక మతిస్థిమితం లేనివారికి ఆశ్రయం కల్పించి బాగు చేసే వరకు బాధ్యత తీసుకుంటారు. అస్సాంలోని గోలాఘాట్ జిల్లా బోటియాపూరికి చెందిన చునీల్ గొగొయ్ నాలుగేళ్ల క్రితం, జార్ఖండ్ లోని ఖుర్దేగ్ జిల్లాకు చెందిన మర్కస్ ఖుజూర్ రెండేళ్ల క్రితం మతిస్థిమితం తప్పడంతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఖమ్మం చేరారు. శ్రీనివాసరావుకు అస్సాంవాసుల పాదపూజ వారిని అన్నం ఫౌండేషన్ చేరదీసింది. ఇటీవల వారి ఆరోగ్యం కుదుటపడింది. చునీల్ గొగొయ్ ఆశ్రమంలో వంటలు చేస్తూ ఉంటున్నాడు. అతను చెప్పిన వివరాల ఆధారంగా కొత్తగూడెం జిల్లా ఇల్లెందువాసి అయిన గుహవాటి ఐఐటీ ప్రొఫెసర్ నందకిషోర్ సహకారంతో కుటుంబీకుల సమాచారం తెలుసుకున్నారు. అలాగే ఖజూర్ వివరాలు కూడా తెలిశాయి. దీంతో ఈ నెల 3న శ్రీనివాసరావు, ఆశ్రమం బాధ్యులు వారిని తీసుకుని ఆ రాష్ట్రాలకు బయలుదేరారు. జార్ఖండ్ వెళ్లి అక్కడ ఖుజూర్‌ను జిల్లా జడ్జి సమక్షంలో ఆయన కుటుంబానికి అప్పగించారు. ఖుజూర్‌కు రూ.25 వేల నగదు అందించారు. ఫౌండేషన్ సేవలను తెలుసుకున్న జడ్జి శ్రీనివాస్‌రావుకు నమస్కరించారు. ఆపై గోలాగాట్ జిల్లా కేంద్రానికి 7న చేరుకుని జిల్లా జడ్జి ఎదుట చునీల్ గొగొయ్‌ను కుటుంబానికి అప్పగించారు. ఆయనకు కూడా రూ.50 వేల నగదు అందించారు. ఈ సందర్భంగా చునీల్ కుటుంబం శ్రీనివాసరావుకు పాదపూజ చేసింది. -
కోవిడ్ వేళ.. అండగా ఆమె
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న వేళ... బాధితులకు మీరు అండగా ఉంటున్నారా? ఉచితంగా..ఉదారంగా సేవలందిస్తున్నారా? ఐసోలేషన్ పేషెంట్లకు ఆహారం, నిత్యావసరాలు అందిస్తున్నారా? ఆక్సిజన్ అవసరమైన వారికి సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు అందించారా? అవసరమైన రోగులకు అంబులెన్స్ వసతి కల్పించారా? మీ సేవలు ఏ రూపంలో ఉంటున్నాయి..మాతో పంచుకోండి. మీకు తెలిసిన వాళ్లు కానీ..మీకు సాయం చేసిన వాళ్లు కానీ ఉంటే స్పందించండి ఆ మనసున్న మారాజుల వివరాలు మాకు ఫొటోలతో సహా పంపించండి ‘సాక్షి’లో ప్రచురిస్తాం. దిగువ తెలిపిన నంబర్లకు వాట్సాప్/మెయిల్ చేయండి. Satyasakshi@gmail.com ( ph.no.. 9912199485 ), Hanumadris@gmail.com ( ph.no ..9160666866 ) నగరానికి చెందిన 7 రేస్ ఫౌండేషన్ సామాన్యులకు ఆసరాగా నిలుస్తోంది. కరోనా సోకిన పేదవారికి ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నట్లు సంస్థ ఫౌండర్ శారద పేర్కొన్నారు. ఈసీఐఎల్, ఏఎస్‌రావునగర్, సైనిక్‌పురి, యాప్రాల్, నేరేడ్మెట్, ఆర్కేపురం తదితర ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. 7రేస్‌ని సంప్రదించిన బాధితుల ఇంటి వద్దకే ఆహారం అందిస్తున్నారు. బస్తీల్లో రైస్ కిట్ అందజేస్తున్నారు. ఇందులో పప్పు దిçనుసులు, వంట నూనెతో పాటు నిత్యావసర సరుకులు ఉంటున్నాయి. 99080 88258ను సంప్రదిస్తే ఆదుకుంటామని శారద సూచించారు. నేనున్నాననీ.. స్వచ్ఛంద సంస్థలతో పాటు కొంతమంది వ్యక్తిగతంగానూ ముందుకొచ్చి ఔదార్యం కనబరుస్తున్నారు. వీరిలో నగరానికి చెందిన నవత ఒకరు. కరోనా బాధితులకు నేనున్నాననే భరోసానిస్తున్నారు. 63042 19659ను సంప్రదించిన వారికి నెగెటివ్ వచ్చేంత వరకు మూడు పూటలా ఆహారం అందిస్తున్నారు. నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నారు. నిమ్స్, గాంధీ, టిమ్స్ తదితర ప్రాంతాల్లో 3500 ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేశామని నవత తెలిపారు. తనకున్న పరిచయాలతో రక్తదానం కూడా చేయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. రోనా బాధితులు, పోస్ట్ కోవిడ్ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఉచితంగా సేవలను అందిస్తోంది హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్. ఈ ఐసోలేషన్ సెంటర్లను 80 బెడ్ల సామర్థ్యంతో మూసాపేట్, అల్వాల్‌లో ప్రారంభించినట్లు సంస్థ ఫౌండర్ హిమజ తెలిపారు. నగరవాసులు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి. రోగులకు అవసరమైన చికిత్స అందించడానికి డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉన్నారు. బాధితులకు అవసరమైన మందులు, ఆహారం అందిస్తారు. దిశా ఫౌండేషన్, అభయం ఫౌండేషన్లు సహకారం అందిస్తున్నాయి. అనాథాశ్రమాలకూ అండగా.. నగరంలోని అనాథ, వృద్ధాశ్రమాలకు హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడిసిన్ మాస్క్‌లు, న్యాప్కిన్లు, శానిటైజర్లను అందిస్తున్నారు. ఉపాధి కోల్పోయిన పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. సేవలను పొందాలనుకునే వారు 91827 35664ను సంప్రదించవచ్చు. చదవండి: కరోనాతో అనాథలైన చిన్నారులకు చేయూత -
TTD: ఆపత్కాలంలో టీటీడీ ఔదార్యం
తిరుమల: కోవిడ్ బాధితులకు టీటీడీ అండగా నిలుస్తోంది. ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా అడుగులు వస్తోంది. కరోనా కోరల్లో చిక్కి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్నా, ఆదాయ మార్గాలు సన్నగిల్లుతున్నా ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనిస్తూ.. కరోనా బాధితుల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా రూ.3.52 కోట్లతో 22 ప్రాంతాల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేసింది. వీటి ఏర్పాటుతో అదనంగా మరో వెయ్యి ఆక్సిజన్ బెడ్లు బాధితులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. బాధితుల కోసం క్వారన్టైన్ సెంటర్లు కరోనా ప్రారంభం నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు టీటీడీ ఏర్పాటు చేసిన కోవిడ్ కేంద్రాల్లో వైద్యం పొందారు. చిత్తూరు జిల్లా వాసులే కాకుండా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లా నుంచి కోవిడ్ భాధితులు తిరుపతిలో చికిత్స పొందారు. ఈ ఏడాది కూడా స్విమ్స్‌తో పాటు పద్మావతి నిలయం, విష్ణు నివాసం, శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాలు కోవిడ్ బాధితుల కోసం కేటాయించారు. ఆయుర్వేద వైద్యశాలలో ప్రత్యేకంగా ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశారు. టీటీడీ ఉద్యోగుల కోసం ఆగమేఘాలమీద బర్డ్ హాస్పిటల్‌ను కోవిడ్ హస్పిటల్స్ మార్పు చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. కరోనా బాధితులకు టీటీడీ ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్డు ఆపన్నులకు అభయ హస్తం అంతర్రాష్ట్ర సరహద్దు ప్రాంతం కావడం, శ్రీవారి దర్శనానికి నిత్యం ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో జిల్లాలో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితులకు చికిత్స అందించేందుకు జిల్లా యంత్రాంగం టీటీడీపైనే ఆధారపడింది. ఆర్థికపరమైన సహాయంతో పాటు హాస్పిటళ్లు, క్వారంటైన్ సెంటర్లు టీటీడీ సమకూర్చింది. గతేడాది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అప్పటికప్పుడు లాక్డౌన్ ప్రకటించడంతో తిరుపతి పరిసర ప్రాంతాల్లో నిత్యం 1.2 లక్షల మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేసింది.ఎమ్మెల్యేలు కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి సహకారంతో ఆపన్నుల ఆకలి తీర్చింది. ఆపత్కాలంలో ఆర్థిక భరోసా కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు టీటీడీ గత ఏడాది రూ.19 కోట్లు కేటాయించింది. రాయలసీమ వాసులకు ఇదే ప్రాణధారగా మారింది. ప్రస్తుతం రూ.3.52 కోట్లు కేటాయించింది. ఆయా నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేసింది. సాధారణంగా టీటీడీ హుండీ ఆదాయం రోజుకు రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు వస్తుంది. నెలకు రూ.90 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు వచ్చేది. కరోనా కారణంగా గత ఏడాది నుంచి భక్తుల సంఖ్య తగ్గుతోంది. ఫలితంగా ఆదాయం గణనీయంగా పడిపోతోంది. ప్రస్తుతం రోజుకు రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలు, ఒక్కో రోజు రూ.70 లక్షల వరకు వస్తోంది. ఆదాయం తగ్గుతున్నా ప్రజల సేవకు మాత్రం వెనుకడుగు వేయడంలేదు. కరోనా కాలంలో ఆధ్యాత్మిక క్షేత్రం ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు అండగా నిలుస్తోంది. బాధితుల కోసం జర్మన్ షెడ్లు బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో స్విమ్స్‌లో బెడ్లు కొరత ఏర్పడింది. బాధితులు ఆరుబయటే ఉంటూ ఆక్సిజన్ పొందాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో టీటీడీ జర్మన్ షెడ్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చొరవతో 30 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది. ఇందుకోసం టీటీడీ రూ.3.52 కోట్లను శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయోనిధి నుంచి మంజూరు చేసింది. విశాఖపట్నం జిల్లాలో 4, ప్రకాశంలో 2, అనంతపురంలో 3, కర్నూల్లో 2, గుంటూరులో 3, కాకినాడలో 3 జర్మన్ షెడ్లతోపాటు ఇతర ప్రాంతాల్లో మరో రెండు షెడ్లు ఏర్పాటు చేయనుంది. ఒక్కో షెడ్డులో 30 నుంచి 50 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరో వెయ్యి ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. కోవిడ్ బాధితులకు మెరుగైన సేవలు ఆపత్కాలంలో టీటీడీ ప్రజలకు అండగా నిలుస్తోంది. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు సంకల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రాంతాల్లో రూ.3.52 కోట్లతో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేసింది. ప్రతి చోటా 50 వరకు ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి తెచ్చింది. – వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ చైర్మన్ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ప్రజాసేవకు టీటీడీ కూడా భాగస్వామ్యమవుతోంది. గతేడాది పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేశాం. ఇప్పటికే టీటీడీ వసతి గృహాలు కోవిడ్ బాధితులకు అందుబాటులోకి తీసుకొచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశాం. – ఏవీ ధర్మారెడ్డి, అడిషనల్ ఈఓ ఉద్యోగులకు అత్యాధునిక వైద్యం దేశంలోనే ఎక్కడా లేని విధంగా టీటీడీ ఉద్యోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. 7 వేల రెగ్యులర్ ఉద్యోగులు, 15వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండగా ఇప్పటికే 40% మందికి మొదటి దశ వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. మరో 20% మందికి సెకండ్ డోస్ కూడా పూర్తి చేసింది. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం మాధవం, ఆయుర్వేద, బర్డ్ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలందిస్తోంది. రూ.5 లక్షల మెడికల్ రీయింబర్స్మెంట్ నుంచి టీటీడీ ఉద్యోగులకు కేటాయించింది. – కీర్ల కిరణ్, టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ -
కరోనా కష్ట కాలంలో ఆదుకుంటున్న ఆపన్న హస్తాలు
కష్టం వచ్చినప్పుడే ధైర్యం కావాలి.. ధైర్యమే ఆలోచనను రేకెత్తిస్తుంది.. ఆలోచన పరిష్కార మార్గాలను చూపిస్తుంది.. సహాయమార్జించడం.. సహాయం అందించడం ఈ రెండూ ఆ మార్గాల్లోనివే!! పెద్ద విపత్తే వచ్చి పడింది.. ఆ రెండు అవసరాలకూ పరీక్ష పెడుతోంది.. కిందటి సారి ఇంచుమించు ఇదే సమయం, సందర్భంలో.. సొంతూళ్లకు కదిలివెళ్లిన పాదచారులకు అన్నం పెట్టి, సద్ది మూట ఇచ్చి, జేబుల్లో, కొంగు మూడిలో కొంత పైకం సర్ది, పిల్లలకు జోళ్లు, బట్టల జతలు పెట్టి, చేతిలో పళ్లు ఉంచి... దారెంట జాగ్రత్తలు చెప్పి సాగనంపిన మనసులు... బస్సులు మాట్లాడీ బాటసారులను బయలెల్లదీసిన మనుషులు.. ఇప్పుడూ కనిపిస్తున్నారు. కరోనాతో గడపదాటలేని కుటుంబాలు.. వీధి బహిష్కరణతో తలుపులు చాటేసుకున్న ఇళ్లు.. ఆక్సిజన్ అందక ఆగమాగం అవుతున్న జీవితాలు, వెంటిలెటర్ కోసం వెయిటింగ్ లిస్ట్‌లో ఆగిన బతుకులు.. బెడ్స్ దొరక్క బెంబేలెత్తుతున్న బంధువులు.. దొరికినా లక్షల్లో డబ్బు కట్టలేక.. మందుల్లేక.. ఉన్నా కొనే ఆర్థికపరిస్థితి సహకరించక.. మందులు, ఆసుపత్రి ఆగత్యంలేని.. బలవర్ధకమైన ఆహారం తినాల్సిన బాధితులు.. అన్నీ ఉన్నా వండుకునే శక్తిలేని పీడితులకు ఆపన్న హస్తం అందించే మనుషులు ఇప్పుడూ కనిపిస్తున్నారు. రియల్ హీరో రియల్ హీరో.. అనగానే సోనూ సూదే గుర్తొస్తాడు. కిందటేడు లాక్డౌన్ మొదలు ఇప్పటిదాకా అలుపు లేకుండా సేవలను అందిస్తున్నాడు. రియల్ హీరోగా కనిపిస్తున్నాడు. సామాన్యుడి నుంచి సెలబ్రటీస్ దాకా ఎవరికి కష్టం వచ్చినా సోనూ సూద్‌నే తలుచుకుంటున్నారు. ఇందుకు నిన్నమొన్నటి ఉదాహరణ.. 2021 ఐపీఎల్ రద్దు. ఇండియాలో చిక్కుకున్న విదేశీ ఆటగాళ్లను ఇంటికి చేర్చాలని ట్విట్టర్ వేదికగా సురేష్ రైనా సోనూసూద్‌ను కోరిన వెంటనే ‘ప్యాక్ యువర్ బాగ్స్’ అంటూ సంద్పించాడు సోనూ. ఇలా కరోనా కష్టకాలంలో సోనూ చేసిన సేవలు ఎన్నో! చిన్న పిల్లల చదువుకోసం స్మార్ట్ఫోనులు, నిరాశ్రయులకు ఆహారం, నిత్యావసర సరుకులు, బట్టలు.. ఎన్నని చెప్తాం స్వచ్ఛందంగా అతను చేస్తున్న పనులను! సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్ సిలిండర్స్‌ను విదేశాల నుంచి కొనుగోలు చేసి అవసరమైన వారికి పంపిస్తున్నాడు. ఇందుకు ఆయన తన ఆస్తులన్నింటిని అమ్ముకోగా, మరో పదికోట్ల ఆస్తులను తాకట్టు పెట్టాడు. ‘అర్థరాత్రి అపరాత్రి కాల్స్ వస్తూనే ఉన్నాయి. వీళ్లలో కనీసం కొంతమందికైనా ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ అందించి వాళ్ల ప్రాణాలను కాపాడగలిగితే వంద కోట్ల సినిమా చేయడం కన్నా కొన్ని లక్షల రెట్లు ఎక్కువ సంతృప్తి మిగులుతుంది’ అంటాడు సోనూ సూద్. అన్నదాత.. నిహారిక రెడ్డి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. ప్రస్తుతం ఆమె ఇల్లు ఓ మెస్‌ను తలపిస్తోంది. కరోనా బారినపడి హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వారి కోసం ఆ ఇంటి వంటిగది విరామెరుగక వండుతూనే ఉంది. హైదరాబాద్‌లోని శ్రీనగర్, బంజారా హిల్స్, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌కు చెందిన సుమారు మూడు వందల పైగా మందికి ప్రతిరోజూ పౌష్టికాహారం అందించడానికి తానే స్వయంగా వండి వడ్డిస్తోంది నిహారిక. ఈ బాధ్యతలో ఆమె కుటుంబమంతా పాలుపంచుకుంటోంది. ఆమె పిల్లలు కూడా ఆటలు, పాటలు అన్నీ మానేసి వంటపనిలో నిమగ్నమయ్యారు. కూరలు తరగడం, వండిన వంటను ప్యాక్ చేయడంలో తల్లికి తోడ్పడుతున్నారు. ఇలా తయారైన వంటను నిహారిక సోదరుడు, డ్రైవర్ కలసి హోమ్ ఐసోలేషన్‌లో ఉంటోన్న వారికి అందిస్తున్నారు. ప్రొటీన్లు, ఇతర పోషక పదార్థాలు కలిగిన కూరలతోపాటు వెజిటేబుల్ సలాడ్, డ్రై ఫూట్స్ లడ్డూ కూడా ఉంటాయి మెనులో. హామ్ఐసోలేషన్లో ఉన్నవారు కరోనా పాజీటీవ్ రిపోర్ట్, ఇంటి చిరునామాను ఈ హెల్ప్‌లైన్ నెం. 9701821089కు పంపి, ఫోన్ చేస్తే .. ఆ చిరునామా వీళ్లు అందించగల దూరంలో ఉంటే ఆ తర్వాత రోజు నుంచే ఆ ఇంటికి వండిన ఆహారాన్ని పంపిస్తారు. కరోనాలో చదువు కోసం .. ఆటపాటలతో ఆనందంగా గడపాల్సిన బాల్యం ఆన్లైన్ క్లాసులకే అంకితమై పోయింది. ఈ ఆన్లైన్ క్లాసుల కోసం పిల్లలకు స్మార్ట్ ఫోన్లు తప్పనిసరయ్యాయి. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు, ఉన్నా ఆర్థికంగా వెనకబడిన పిల్లల కోసం ఉచితంగా స్మార్ట్ఫోన్లు అందిస్తూ, అనాథశ్రయాల్లో గ్రూప్ ఆన్లైన్ కోర్సులను నిర్వహిస్తోంది ‘ప్యూర్ ఆర్ఫన్ అండ్ రూరల్ ఎడ్యూకేషన్’ అనే స్వస్థంచ సంస్థ. 2016లో గిరిజన ప్రాంత పిల్లల చదువు కోసం ప్రారంభమైన ఈ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మధ్యాహ్నభోజనం కోసమే బడికి వెళ్లే పిల్లలు కూడా ఉన్నారని తెలిసి.. పేద విద్యార్థులు, నిరాశ్రయులతోపాటు హోమ్ఐసోలేషన్లో ఉంటున్న కరోనా రోగులకూ ఉచితంగా ఆహారాన్ని అందిస్తోందీ సంస్థ. కరోనా వల్ల ఇబ్బంది పడిన వలస కూలీల కోసం ఈ సంస్థ బస్సులను ఏర్పాటు చేసి, సుమారు మూడు వేలమందికి పైగా కూలీలను వారి ఇళ్లకు చేర్చింది. వీరిలో నిండు గర్భీణీలూ ఉండటం గమనించి వారిని ఆసుపత్రిలో చేర్పించింది. ఈ కరోనా సమయంలో ఏదైనా సహాయం కావాలనుకునేవారు తమ హెల్ప్‌లైన్ నంబర్లు 7386120040, 7675940040 లకు ఫోన్ చేస్తే చాలు సహాయం అందించడానికి సిద్ధం అంటున్నారు ఈ సంస్థ సభ్యులు. నిరాశ్రయులకు ఆసరా.. నిత్యావసరాల సరఫరా అనాథల కోసం దశాబ్దం కిందట మొదలైన ‘దిశా ఫౌండేషన్’ ప్రస్తుతం తన సేవలను కరోనా బాధితుల కోసమూ విస్తరించింది. ప్రతి రోజూ వందల సంఖ్యలో మందులు, మాస్కులతో పాటు అవసరమైన వారికి నిత్యావసర సరుకులు, నిరాశ్రయులకు అహారం అందిస్తున్నారు. త్వరలోనే ఎల్బీ నగర్లో ఓ ఐసోలేషన్ సెంటర్‌నూ ఏర్పాటు చేయనుంది. వీటితోపాటు గుంటూరులోని క్యాన్సర్ ఆసుపత్రి దగ్గర నిత్యాన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. అందరూ ఒక్కటై ఇలాంటి సమయంలో నేను, నాది.. నా అనే ఆలోచనలు పోయి, మనం అనే భావన రావాలి. పది మందికి సాయం చేయలేకపోయనా కనీసం ఒక్కరికైనా సాయం చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అందరూ ఒక్కటై సహాయ కార్యక్రమాలు చేపట్టాలి. కరోనా నుంచి కాపాడుకునే చర్యలు తీసుకోవాలి. – సుస్మిత జగ్గి రెడ్డి దిశా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ష్యాషన్ డిజైనర్. వృద్ధుల కోసం... కరోనా దాటికి రాలిపోతున్న వృద్ధులను చూసి చలించిపోయింది హిమజ. అందుకే వారి కోసం ఉచితంగా మందులు, ఆహారం పంపిణీ చే స్తోంది. అలా ఇప్పటి వరకు సుమారు పదిహేను వందల మందికిపైగా సహాయం అందించింది ఆమె. సేవా కార్యక్రమాలు ఆమెకు కొత్త కాదు. గత ఆరేళ్లుగా ఆనాథ పిల్లల కోసం కృషి చేస్తోంది. క్యాన్సర్ రోగులకు వైద్యసహాయంతో పాటు వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు విగ్గులను అందిస్తోంది. కరోనా కష్టకాలంలో సేవలందిస్తోన్న మరికొన్ని హెల్ప్‌లైన్ నెంబర్లు.. ఎమ్మెల్సీ కవిత కార్యాలయం: 898569993 ఎల్హెచ్ఓ ర్యాపిడ్ రెస్పాన్స్ టీం: 8374303020, 8688919729 చదవండి: గాల్లోకి లేచిన కారు.. సీసీ కెమెరాలో దృశ్యాలు -
‘కిలిమంజారో’ చాన్స్.. సాయం చేయండి ప్లీజ్
మరిపెడ రూరల్: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యాతండాకు చెందిన బాలుడు ఎంపికయ్యాడు. భూక్యా రాంమూర్తి, జ్యోతి దంపతుల కుమారుడు భూక్యా జశ్వంత్ హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని గిరిజన సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఫస్టియర్ చదువుతున్నాడు. జశ్వంత్‌కు చిన్నప్పటి నుంచి పర్వతారోహణ అంటే ఎంతో ఇష్టం. ఈ ఏడాది ఫిబ్రవరిలో యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రాక్‌ౖక్లైంబింగ్ పోటీల్లో మొత్తం 40 మంది పాల్గొనగా జశ్వంత్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే రాష్ట్రం నుంచి కిలిమంజారో పర్వ తం అధిరోహణకు జశ్వంత్ ఎంపికయ్యాడు. జూలై 22న అతను బయలుదేరాల్సి ఉంది. ఇందుకు ప్రయాణ ఖర్చుల కింద రూ.3 లక్షలు అవసరం. దాతలు సహకారం అందిస్తే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి వస్తానని, భవిష్యత్‌తో మరిన్ని విజయాలు సాధించి దేశానికి మంచి పేరు తెస్తానని జశ్వంత్ ఈ సందర్భంగా తెలిపాడు. సాయం చేయదలచిన వారు 70750 13778 నంబర్ ద్వారా గూగుల్, ఫోన్ పే చేయాలని కోరాడు. -
సేవా ‘మార్గం’.. ‘డాక్టర్స్’ ఔదార్యం
కరోనా మానవ సంబంధాలను దూరం చేస్తోంది. అయిన వారిని సైతం కాకుండా చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్ బాధితులకు మేమున్నామంటూ పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. వారికి అవసరమైన మందులు, ఆహారాన్ని ఉచితంగా అందించడమే కాకుండా.. నేరుగా వారి ఇంటికే వెళ్లి వారిలోని ఆందోళనను తొలగించేలా మనో స్థైర్యాన్ని నింపుతున్నాయి. విజయవాడలోని మార్గం ఫౌండేషన్ కూడా ఇదే విధంగా హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న రోగులకు రోజూ రెండు వందల మందికి భోజనాన్ని పంపిణీ చేస్తోంది. ఆహారం ప్యాకెట్లను సిద్ధం చేస్తున్న ‘మార్గం’ సభ్యులను చిత్రంలో చూడొచ్చు. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ ‘డాక్టర్స్ ఫర్ యూ’ ఔదార్యం విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రికి డాక్టర్స్ ఫర్ యూ ఆర్గనేషన్ సంస్థ 8 లక్షల రూపాయల విలువచేసే మూడు జంబో ఆక్సిజన్ సిలెండర్లను వితరణ చేసింది. వీటిని కొత్త ప్రభుత్వాసుపత్రి ఆవరణలోడాక్టర్స్ ఫర్ యూ ఆర్గనేషన్ సంస్థ ప్రతినిధులు బుధవారం కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్‌కు అందజేశారు. క్రయోజనిక్ లిక్విడ్ ఆక్సిజన్ జంబో సిలెండర్ల ద్వారా ఎక్కువ మందికి ప్రాణవాయువు సరఫరా చేసే వీలు కలుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. డాక్టర్స్ ఫర్ యూ ఆర్గనేషన్ సంస్థ ప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. గతంలోనూ ఈ సంస్థ బెడ్లు, మాస్క్‌లు, కిట్స్ అందించిన విషయాన్ని గుర్తు చేశారు. పెద్దయ్యాక సీఎం అవుతా.. ఓ చిన్నారి ఆకాంక్ష -
Hyderabad: ఆపదలో.. సంప్రదించండి
సాక్షి, హైదరాబాద్: విపత్కర పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ నిస్వార్థ సేవ చేయడంలో ఎన్జీవోలది ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లోనూ మేమున్నామంటూ అనేక విధాలుగా ఆపన్న హస్తాన్ని అందిస్తున్నాయి. ఇందులో కొందరు సంస్థలుగా, ఇంకొందరు వ్యక్తిగతంగా, మరికొందరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆపదలో అండగా నిలుస్తున్నారు. ఇలా అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించే కొన్ని సంస్థల, వ్యక్తుల వివరాలను తెలంగాణ రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. 1. ఆక్సిజన్ సిలిండర్స్, అంబులెన్స్ సేవలు సకిన ఫౌండేషన్... 8008008012 ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్స్ అందిస్తున్నాయి సహారా అంబులెన్స్ సేవలు... 7569600800 కొన్ని ఎన్జీవోల కలయికతో అంబులెన్స్‌లను అందిస్తున్నాయి, రోగులను ఇతర ప్రాంతాలకు చేరవేయడానికి వాహనాలను కూడా సమకూర్చుతున్నాయి. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్.. 8790679505 ఆక్సిజన్ సిలిండర్స్, మరికొన్ని కోవిడ్ సేవలు సఫా బైతుల్ మాల్ అండ్ యాక్సెస్ ఫౌండేషన్... 7306600600 ూ మెడిసిన్స్, కోవిడ్ కిట్స్, ఆక్సిజన్. ఫీడ్ ది నీడి... 7995404040 అంత్యక్రియలు.. (ఉ.8 గం నుంచి సా.6 గం వరకు) జైన్ రిలీఫ్ ఫౌండేషన్... 9849159292 కోవిడ్ రోగులకోసం హోటల్స్‌లో ప్రత్యేకంగా ఆక్సిజన్, వెంటిలేటర్లు తదితర వైద్య సేవలతో ఐసోలేషన్ సెంటర్ల ఏర్పాటు. (ఒక రోజుకి కనీస చార్జీ రూ.3 వేల నుంచి) 2. ప్లాస్మా సేవలు https://donateplasma.scsc.in/ సైబరాబాద్ పోలీస్ శాఖ, ఎస్సీఎస్సీ సంయుక్తంగా స్వచ్ కర్మ ఫౌండేషన్.. 7407112233 కోవిడ్ యోధుల నుంచి ప్లాస్మా డొనేషన్ ఎన్టీఆర్ ఛారిటబుల్ సర్వీసెస్... 8555036885, 9000166005 ఉచిత ఆన్లైన్ కన్సల్టేషన్. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ గ్రూప్... bit.ly/covid-hyd ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్స్, ఫుడ్, ప్లాస్మా డోనర్స్ హైదరాబాద్ కోవిడ్ హెల్ప్... @hyderabadcovid కోవిడ్ సేవలు covidastra.com కోవిడ్ సేవల సమాచారం 3. ఫుడ్ డెలివరీ, ఇతర సేవలు... సేవ ఆహార్... 7799616163 లంచ్ (ఉ.7 గంటలలోపే ఆర్డర్ పెట్టాలి) తెలుగు ఇంటి భోజనం... 9100854558 కరోనా పేషెంట్‌కి ఫుడ్ డెలివరీ సేవలు (కేపీహెచ్‌బీ, మియాపూర్, చందానగర్, మదీనాగూడ, బాచుపల్లి, కొండాపూర్) నిహారికా రెడ్డి 9701821089 కోవిడ్ బాధితులకు ఆహార పంపిణీ సేవలు (యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్) 7 క్లౌడ్ కిచెన్..8978619766 కరోనా పేషెంట్‌కి ఫుడ్ డెలివరీ సేవలు జాహ్నవి ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్... 6300975328 కోవిడ్ బాధితులకు ఆహార సరఫరా సేవలు (బోయిన్పల్లి, మారేడ్‌పల్లి, బేగంపేట్, పంజాగుట్ట, సైనిక్‌పురి, తిరుమలగిరి) 4.పెంపుడు జంతువుల సంరక్షణ సేవలు పీపుల్ ఫర్ ఎనిమల్స్... 7337350643 బ్లూ క్రాస్ హైదరాబాద్... 040–23545523 5.తెలంగాణ కోవిడ్ కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్... 9490617440 చైల్డ్ కేర్... 080–45811215 ఫ్రీ కోవిడ్ టెలీ మెడిసిన్ 080–45811138 అత్యవసర వైద్య సేవలు 9490617431 ప్లాస్మా దాతలు, స్వీకరణ 9490617440 అంత్యక్రియల సేవలు... 7995404040 జీహెచ్ఎంసీ కోవిడ్ హెల్ప్‌లైన్.. 040–21111111 List of #NGOs & good samaritans & their are of work & contact # Slide 1 & 2 - dealing with Covid patients / home service Slide 3- supplying food at home etc Slide 4 - pet care & @GHMCOnline emergency contact # Will keep adding ..@KTRTRS pic.twitter.com/Ol7g5rm8HV — Arvind Kumar (@arvindkumar_ias) May 11, 2021 -
చేయి చేయి కలిపారు సేవకు సై అన్నారు...
ప్రపంచం ఎట్లా పోతేనేం? మాకెందుకు లెండి...అంటూ సెల్ఫోన్లో ముఖం దాచుకోవడం లేదు యువత. దుఃఖప్రపంచంలోకి తొంగిచూడడమే కాదు... ట్విట్టర్, గూగుల్ డ్రైవ్, వాట్సాప్, టెలిగ్రామ్... సాంకేతిక జ్ఞానాన్ని సమాజసేవకు ఉపయోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.... వినయ్ శ్రీవాస్తవ (65) ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో సీనియర్ జర్నలిస్ట్. కోవిడ్ బారిన పడి చనిపోయారు శ్రీవాస్తవ. చనిపోయే ముందు వైద్యసహాయాన్ని అర్థిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సరిౖయెన టైమ్‌లో, సరిౖయెన వైద్యసౌకర్యం అందితే ఆయన బతికే ఉండేవారు. శ్రీవాస్తవ ట్విట్ ముంబైలోని నైరిత్ గలన్ను కుదిపేసింది. 20 సంవత్సరాల గలన్ ఆ రోజంతా ఆ పోస్ట్ గురించే ఆలోచించాడు. కోవిడ్–19 సెకండ్ వేవ్ ధాటికి మన వైద్యవ్యవస్థ మోయలేనంత భారంతో ఉన్న నేపథ్యానికి శ్రీవాస్తవ మరణం ఒక ఉదాహరణ మాత్రమే. హాస్పిటల్ బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్స్, ప్లాస్మా... ఇలా రకరకాల సహాయాలను అర్థిస్తున్న ఎన్నో పోస్ట్‌లను మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో చూసి ఉన్నాడు గలన్. ఇండోర్‌లో అనుష్క జైన్ (20) పరిస్థితి కూడా అంతే. వైద్యసహాయాన్ని అర్థిస్తూ సామాజిక మాధ్యమాల్లో కనిపించే విన్నపాలు ఆమెను బాగా కదిలించాయి. ముంబైలో ఉండే నైరిత్‌కు, ఇండోర్‌లో ఉండే అనుష్క జైన్‌కు ట్విట్టర్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఒకరి భావాలను ఒకరు పంచుకున్నారు. ఇద్దరుగా మొదలైన ఈ ప్రయాణంలో సమభావాలు ఉన్న యువతీయువకులు తోడయ్యారు. మొత్తం 60 మంది ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసు వారు ఇందులో ఉన్నారు. వీరిలో ఒకరితో ఒకరికి ఇంతకుముందు పరిచయమేదీ లేదు. ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించాలనే భావన వారిని దగ్గర చేసింది. దేశవ్యాప్తంగా కోవిడ్ బాధితులకు సేవలు అందించడానికి ఈ 60 మంది రెండు బృందాలుగా ఏర్పడ్డారు. ఒక బృందం... సహాయం కోసం ఆశించే వారి వివరాలు సేకరిస్తుంది. మరో బృందం... ఆ సహాయం అందించడానికి కావలసిన వనరుల ఏర్పాటు చేస్తుంది. హాస్పిటల్ బెడ్స్, అంబులెన్స్ సర్వీస్, ఆక్సిజన్, ప్లాస్మా... మొదలైన వాటికి సంబంధించి సాధికారికమైన సమాచారంతో గూగుల్ డ్రైవ్‌లో డేటాబేస్ ఏర్పాటు చేశారు. ‘బాట్ ఆన్ ట్విట్టర్’ను కూడా ఉపయోగించుకున్నారు. డేటాబేస్ లింక్‌తో ఈ బాట్ ఆటోమేటిక్‌గా రీట్విట్ చేయడం, రిక్వెస్ట్‌లకు రిప్లే ఇవ్వడం చేస్తుంది. 14 గంటల్లో 1,500 రిక్వెస్ట్‌లు వచ్చాయి! ట్విట్టర్ మాత్రమే కాకుండా వాట్సాప్, టెలిగ్రామ్‌లను కూడా ఉపయోగిస్తున్నారు. ఇవేమీ ఉపయోగించని వారికోసం ప్రత్యేకంగా వెబ్సైట్ డిజైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని స్వచ్ఛందసంస్థలతో అవగాహన కుదుర్చుకొని ప్లాస్మా డొనేషన్ డ్రైవ్‌లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ 60 మందిలో కొందరు అనారోగ్యం బారిన పడినా, కోలుకున్నారో లేదో వెంటనే పనిలోకి దిగేవారు. ‘ఎప్పడైనా బద్దకంగానో, దిగులుగానో అనిపిస్తే శ్రీవాస్తవ ట్విట్స్ స్క్రీన్ షాట్స్ చూస్తాను. అవి కర్తవ్యబోధ చేసినట్లు అనిపిస్తాయి. మరింత శక్తి పుంజుకొని పనిలోకి దిగుతాను’ అంటున్నాడు గలన్. పాలో కోయిలో ప్రసిద్ధ పుస్తకం ‘ఆల్కెమిస్ట్’లో ఒక మంచి వాక్యం ఉంది.... ‘మీరు ఏదైనా కావాలనుకున్నప్పుడు దాన్ని సాధించడంలో మీకు సహాయపడడానికి ఈ విశ్వమంతా కుట్ర చేస్తుంది’ ఎంత నిజం! -
వందమందికి సాయం
కరోనా కారణంగా దాదాపు ఐదు నెలలుగా అన్ని పరిశ్రమల లాగానే చిత్రపరిశ్రమలో పలువురు చిన్న స్థాయి కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు. తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు నిత్యావసరాలు అమ్మే దుకాణం ఆరంభించారు. ఒకరిద్దరు రోడ్లపై పండ్లు అమ్ముకుంటున్నారు. అయితే స్టార్స్ తమకు తోచిన విధంగా సహాయం అందిస్తూనే ఉన్నారు. తాజాగా కథానాయిక కత్రినా కైఫ్ తన వంతు సాయంగా 100మంది డ్యాన్సర్స్కి ఆర్థిక సాయాన్ని అందించారు. కూరగాయల షాపులను, టిఫిన్ బండ్లు పెట్టుకునేందుకు వాళ్లకు కత్రినా సాయమందించారు. కొన్నినెలల క్రితం హృతిక్ రోషన్ కూడా వంద మంది డ్యాన్సర్స్‌కు సాయం అందించారు. ఇప్పుడు కత్రినా ముందుకొచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అండగా నిలిచినందుకు కత్రినాకి డ్యాన్సర్స్ కృతజ్ఞతలు తెలియచేశారు. -
వింత వ్యాధితో గిరిజన విద్యార్థిని..
సీతంపేట: ఎచ్చెర్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న అమీల అనే గిరిజన విద్యార్థిని కొద్ది నెలలుగా తీవ్ర అనారోగ్యానికి గురైంది. సీతంపేట మండలంలోని ఎతైన కొండలపై ఉన్న గడికారెం గ్రామానికి చెందిన ఈ విద్యార్థిని వింత వ్యాధితో బాధపడుతోంది. ఒల్లంతా కురుపులతో నరకయాతన అనుభవిస్తోంది. ఇప్పటికే ఈమె వైద్యానికి రూ.2 లక్షల వరకు ఖర్చు అయింది. అయినా ఎటువంటి ప్రయోజనం కలగలేదు. తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో అప్పులు చేసి ఈమెకు వైద్యం చేయించారు. ఇంకా నయం కావడానికి మరో రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆ కుటుంబం ఆందోళన చెందుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని తమ కుటుంబానికి వింత వ్యాధి దాపురించిందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. -
సినీ కార్మికులకు చేయూత
నటుడు కాదంబరి కిరణ్ సారథ్యంలోని ‘మనం సైతం’ ఆధ్వర్యంలో కరోనా కాలంలో ఇప్పటికే వేలాదిమందికి వంట సరుకులు ఉచితంగా అందించిన సంగతి తెలిసిందే. తాజాగా 230 మంది సినీ కార్మికులు, నిరుపేదలకు మంతెన వెంకట రామరాజువారి ‘వసుధ ఫౌండేషన్’ ద్వారా ఆర్థికసాయం అందించారు. దర్శకులు వీవీ వినాయక్, హీరోయిన్ పూనమ్ కౌర్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. కాదంబరి కిరణ్ చేస్తున్న నిస్వార్థ సేవకు తమ వంతుగా మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశ్యంతో ‘మనం సైతం’ కు ‘వసుధ ఫౌండేషన్’ చేయూత అందిస్తోందని మంతెన వెంకట రామరాజు అన్నారు. అనంతరం పూనమ్ కౌర్ చేతుల మీదుగా ‘మనం సైతం’ కార్యాలయం వద్ద మొక్క నాటించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, బీబీజీ రాజు, ‘మనం సైతం’ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
బిడ్డ కోసం ఓ తండ్రి ఆరాటం!
తిరువనంతపురం(కేరళ): మనం గెలిస్తే పది మందికి చెప్పుకొని మనం ఓడిపోయి ఒంటరిగా మిగిలితే మన భుజం తట్టి ప్రోత్సహించేవాడు నాన్న. మన భాద్యతను తను బతికున్నంత కాలం తీసుకునేవాడు నాన్న. ఫాదర్స్ డే సందర్భంగా తన కూతురి కోసం ఎంతో పోరాటం చేసి గెలిచిన ఓ నాన్న కథను తెలుసుకుందాం. అతని పేరు ఎస్ బైజు. తిరువనంతపురానికి చెందిన బైజుది రెక్కాడితే కానీ డొక్కాడని జీవితం. అతని 8 సంవత్సరాల కూతురు అబిన బైజు ఆరోగ్యం పాడై అసుపత్రిలోచేరింది. (ఫాదర్స్ డే ఎలా వచ్చిందో తెలుసా!) అసలే లాక్డౌన్ కారణంగా మూడునెలల నుంచి పనిదొరక్క అల్లాడిపోతున్న అతడిపై పిడుగుపడినట్లు తన కూతురి కాలేయం పాడైందని, ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించాలని డాక్టర్లు చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియని ఆ తండ్రి ఎక్కని మెట్టులేదు, తొక్కని గడపలేదు. కానీ ఏ ఒక్కరూ అతని బాధను పంచుకోవడానికి ముందుకు రాలేదు. తన కూతురుకు సరిపోయే లివర్ దొరికిందని వెంటనే మారిస్తే పాప బతుకుందని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యులు చెప్పారు. కానీ చేతిలో పైసా లేని ఆ తండ్రి ఏం చేయాలో తెలియక కన్నీరు మున్నీరుగా విలపించాడు. అప్పుడు అక్కడే ఉన్న ఒక నర్సు క్రౌండ్ ఫండింగ్ సంస్థ గురించి తెలిపింది. దీంతో మిలాప్ క్రౌండ్ ఫండింగ్ సంస్థను అతడు కలిశాడు. (రేపొక్క రోజే ఏడు రోజులు) పాప ఆపరేషన్‌కు రూ. 20 లక్షలు అవసరం కాగా మిలాప్ సంస్థ రూ. 11,81,325 అందించింది. కొంత మంది దాతలు మరికొంత సాయం చేశారు. మిగిలిన డబ్బును పాపను చేర్పించిన కొచ్చి అస్టర్ మెడిసిటీ ఆసుపత్రి యాజమాన్యం ఇవ్వడానికి అంగీకరించింది. పాపను 21రోజుల పాటు ఐసీయూలో ఉంచారు. పాపకు మే మొదటివారంలో ఆపరేషన్ చేయగా మూడు వారాల పాటు ఐసీయూలో ఉంచారు. మరో మూడు నెలలు పాప ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. తన బిడ్డను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి బైజు ధన్యవాదాలు తెలిపాడు. -
కరోనా పోరాటంలో ప్రభుత్వానికి అండగా....
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌పై చేస్తున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అండగా నిలవడానికి సామాన్యుల నుంచి పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు, స్వచ్ఛంధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. సీఎం సహాయ నిధికి తమ వంతుగా సాయాన్ని అందిస్తున్నాయి. అందులో భాగంగానే కేసీపీ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ఇచ్చింది. దీనికి సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేసీపీ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జి.వెంకటేశ్వరరావు, వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఎ.బాలసుబ్రమణ్యం, ఫార్మర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జే.మోహన్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే పార్ధసారధి పాల్గొన్నారు. (ఇక ‘ఆరోగ్య సేతు’ బాధ్యత వారిదే..) మరోవైపు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం వ్యాపారవేత్తలు, స్వచ్ఛందసంస్ధలు,వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు తరపున కరోనా వైరస్‌పై పోరాడటానికి సీఎం సహాయ నిధికి 64 లక్షల 50వేల రూపాయలు విరాళంగా అందించారు. ఈ చెక్కులను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్‌కు అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యానారాయణ రెడ్డి, ఎస్.కృష్ణారెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి మురళీకృష్ణారెడ్డి అందజేశారు. (బట్టతల వారికి కరోనా వచ్చే అవకాశం ఎక్కువ, ఎందుకంటే) -
చేయూతనివ్వండి..
చిల్పూరు : జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన తాళ్లపల్లి రమేష్‌గౌడ్ –రమాదేవిలకు ఇద్దరు ఆడపిల్లలు. రమేష్ కులవృత్తితో పాటు సెంట్రింగ్ కూలీ పనిచేస్తుండగా.. భార్య రమాదేవి కూడా కూలీ పనులు చేస్తూ భర్తకు సాయంగా ఉండేంది. ఇద్దరు కుమార్తెల వివాహం జరిపించారు. ఈక్రమంలో 6 ఏళ్ల క్రితం ఇంటిఆవరణలో ఉన్న చింతచెట్టు పై కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో వెన్ను పూస ఎముక విరిగింది. దీంతో రెండు కాళ్లు చచ్చుబడి పోయాయి. సరిగా నిలబడలేని భార్యకు రమేష్ సపర్యలు చేస్తూ వచ్చాడు. ఈక్రమంలో 3 నెలల క్రితం రమేష్‌కు గొంతులో నొప్పిగా ఉండడంతో ఆస్పత్రిలో చూపించగా గొంతు కేన్సర్ అని వైద్యులు తేల్చారు. దీంతో ఆహారం నోటినుంచి తీనే పరిస్థితి లేకపోవడంతో పొట్టభాగంలో పైపు వేసి అందులో నుంచి కేవలం పండ్ల రసాలను అందించే ఏర్పాటు చేశారు. గొంతు ఆపరేషన్‌కు రెండు నెలల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో స్వగ్రామానికి వచ్చేశారు. అనంతరం హన్మకొండలోని ఫాతిమా కేన్సర్ ఆస్పత్రికి వెళ్లగా ఆరోగ్య శ్రీ కార్డుపై తాము ఆపరేషన్ చేస్తామని అక్కడి వైద్యులు చెప్పినట్లు బాధితులు తెలిపారు. దీంతో దంపతులు ఇద్దరూ ఇలా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఇబ్బంది ఎదుర్కొంటుండడంతో స్థానిక యువకులు వాట్సప్ గ్రూప్‌లో వీరి సమస్యలను వివరిస్తూ సాయం కోరారు. అడ్మిన్లు తాళ్లపల్లి ప్రవీన్, క్రాంతి, మహేందర్, కొత్తపల్లి యాకరాజులు దాతల సాయం కోరుతూ పోస్టు పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, తన గొంతు ఆపరేషన్‌కు ఆరోగ్య శ్రీ కార్డును త్వరగా కిమ్స్‌నుంచి ఫాతిమాకు బదిలీ చేయించాలని ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. దాతలు 83418 11560, 99851 81981 ద్వారా సహకారం అందిచాలని వేడుకుంటున్నారు. -
టామాటో ఛాలెంజ్: రైతులకు అండగా ఎన్ఆర్ఐలు
సాక్షి, ప్రకాశం: అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు ‘టామాటో ఛాలేంజ్’ పేరుతో జిల్లాలోని రైతులకు భరోసానిస్తున్నారు. అంతేగాక లాక్డౌన్లో తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్న పేదవారికి అండగా నిలబడ్డారు. ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజవర్గం, బురుజుపల్లె, ముండ్ల పాడు, వేంకటాపురంలోని 1000 కుటుంబాలకు శుక్రవారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇందుకోసం సాయం చేసిన ఇక్కడి తెలుగువారికి వారు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే చిక్కికుపోవడంతో పండించిన పంటను మార్కెట్‌కు తరలించలేక రైతులు సతమతమవుతున్నారు. ఇటీవల ఓ రైతు చేతికొచ్చిన తన టమోటా పంటను అమ్మడానికి వీలులేక తన ఆవేదనను ఓ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ వీడియో చూసిన తెలుగు ఎన్ఆర్ఐ సోదరులు డా. వాసుదేవ రెడ్డి నలిపిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి కల్లూరి, సుబ్బారెడ్డి చింతగుంట, పుల్లారెడ్డి యెదురు, డా. ప్రభాకర్ రెడ్డిలు ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది రైతులను ఈ కష్టకాలంలో ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ‘టామాటో చాలేంజ్’ పేరుతో జిల్లా రైతులకు భరోసా ఇవ్వడమే కాకుండా పేదవారిని కూడా నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేసి ఈ కష్టకాలంలో వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఇందుకోసం టామాట పంటను నేరుగా రైతుల వద్దే కొనుగోలు చేసి వాటిని పేద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తు ఎన్ఆర్ఐలు తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు. -
వలసకార్మికులకు అండగా ‘లియోన్ హ్యూమన్ ఫౌండేషన్’
సాక్షి, అనంతపురం: కరోనా మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. అయితే ఈ లాక్డౌన్ కారణంగా ఎక్కడికక్కడ అన్ని కార్యకలాపాలు, రవాణా వ్యవస్థలు స్థంభించిపోయాయి. దీంతో వలసకార్మికులు, దినసరి కూలీల పరిస్థితి దుర్భరంగా మారింది. అయితే వారికి చేయూతనందించడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంధ సంస్థలతో పాటు సామాన్యులు సైతం ముందుకు వచ్చి ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. (టెంపాబే లో నాట్స్ సాయం) లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అనంతపురంలో ‘ లియోన్ హ్యూమన్ ఫౌండేషన్’ ఆస్టిన్, టెక్సాస్, యూఎస్ఏ వారిచే రూ. 20, 000 విలువ గల మెడికల్ కిట్లను అనంతపురం జిల్లా యూనియన్ ట్రేడ్ ఫెడరేషన్ అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ‘లియోన్ హ్యూమన్ ఫౌండేషన్’ డైరెక్టర్స్ పుల్లారెడ్డి యెదురు, నంగి పరమేశ్వర రెడ్డి, పులిమి రవి కుమార్ రెడ్డి తదితరులకు క్యాంపు నిర్వాహకులు ధన్యవాదములు తెలిపారు. (మానవత్వమే మన మతం) -
మనసున్న మా రాజులు
కరోనా కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పొయి ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటివారి ఆకలి తీర్చేందుకు చాలా మంది ముందుకు వచ్చి ఆపన్నహస్తాలు అందిస్తున్నారు. వారికి అన్నం పెడుతూ, నిత్యవసరాలు అందిస్తూ సాయం చేస్తున్నారు. (టాప్10 లో టాస్క్ ఫుడ్ డ్రైవ్) ప్రజా సర్వీస్ పౌండేషన్ చైర్మన్ దూపాటి సుధాకర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు, నెల్లూరు, బాపట్ల ప్రాంతాలలో వందల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కూరగాయల పంపిణీ చేశారు. దీంతో పాటు ఆ ప్రాంతాల్లో కరోనా వైరస్ గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు, అది రాకుండా చేపట్టవలసిన చర్యలు, ఆచరించాల్సిన పద్దతుల గురించి అక్కడ ఉన్న వారికి వివరించారు. హైదరాబాద్ బేగంపేటఉంటున్న బీవీ ప్రసాద్ రెడ్డి కరోనా కారణంగా అన్నం దొరక్క ఇబ్బందులు పడుతున్న వారిని చూపి చలించిపోయి వారికి అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నారు. వారి కుటుంబ సభ్యుల సహకారంతో తమ ఇంటి చుట్టు పక్కల ఉంటూ ఆకలితో ఉంటున్న వారికి ఆహారాన్ని అందించి ఆదుకున్నారు. కరోనా లాక్ డౌన్ వాళ్ళ వివిధ రాష్ట్రాలలో చిక్కు పోయి ఇప్పుడు తమ తమ రాష్ట్రాలకు నడక ద్వారా, సైకిల్స్ మీద, బస్సులు, లారీల ద్వారా ప్రయాణం చేస్తున్న వలస కార్మికులకు ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి సభ్యులు ఫలహారం, బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్, అరటి పళ్ళు, పప్పు ఉండలు, గ్లూకోస్ ప్యాకెట్స్ నేషనల్ హైవే మీద ప్రేమతో అందజేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలు ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ జి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగాయి. ఆర్ఏ నాయుడు, శ్యామ్ సబ్బవరం జాతీయ రహదారి వద్ద వస్తువులను పంపిణీ చేశారు. వారితో పాటు అసకపల్లి భజన మండలి కన్వీనర్ బంగారు నాయుడు, సాయి సేవాదళ్ & యువత ఈ సేవా కార్యక్రమాలలో సహాయపడ్డారు. మీరు కూడా చేస్తున్న ఇలాంటి సేవా కార్యక్రమాలు మాకు కూడా తెలపాలనుకుంటే webeditor@sakshi.com కి వివరాలు పంపిచండి. (సీఎం సహాయనిధికి లలితా జ్యువెలర్స్ కోటి విరాళం) -
టాప్10 లో టాస్క్ ఫుడ్ డ్రైవ్
కాలిఫోర్నియా: అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది. ఆకలిగా ఉన్నవారికి రెండు ముద్దలు అన్నం పెడితే చాలు వారి కళ్లలో కనిపించే ఆనందం కోట్లు పెట్టి కొన్నా దొరకదు. అలాంటి బృహత్కార్యాన్నే తెలుగు అసోసియేషన్ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా(టాస్క్) చేపట్టింది. కరోనాలాంటి ఈ విపత్కర పరిస్థితుల్లో ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్న వారికి అండగా నిలిచేందుకు టాస్క్ వర్చువల్ ఫుడ్ పేరిట ఒక డ్రైవ్ చేపట్టింది. దాతలు, టాస్క్ కార్యకర్తలు కొండంత నిండు మనసుతో ఇచ్చిన 5001.95 డాలర్లతో 18,007పౌండ్ల ఆహారాన్ని సేకరించి 15,005 ఆహార పాకెట్లను తయారుచేసి అన్నార్తులకి అందించారు. తాము అనుకున్న దాని కంటే 200 శాతం ఎక్కువగా విరాళాలు సేకరించగలిగామని టాస్క్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని టాస్క్ ప్రెసిడెంట్ శీలం రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ విరాళం మొత్తాన్ని నిరంతరం అన్నదానం చేసే స్వచ్చంధ సంస్థ సెకండ్ హార్వెస్ట్ ఫుడ్ బ్యాంక్ ఆరెంజ్ కంట్రీకి టాస్క్ సభ్యులు రామకృష్ణ రెడ్డి, కేతిరెడ్డి అమరేందర్‌రెడ్డి, కిశోర్ తంగిరాల వీరితో పాటు టాస్క్ సభ్యులు అందజేశారు. టాస్క్ 2020 ఫుడ్ డ్రైవ్ కాలిఫోర్నియాలో నిర్వహించిన ఫుడ్డ్రైవ్లో టాప్ 10లో నిలవడం ఎంతో గర్వకారణం. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి టాస్క్ అధ్యక్షులు శీలం రామకృష్ణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
సామాన్యుల సాయం
కరోనా విజృంభించడంతో దాని వ్యాప్తిని కట్టడిచేయడానికి లాక్‌డౌన్‌ను విధించారు. దీంతో ఎంతో మంది వలస కార్మికులు, నిరుపేదలు, రోజువారి కూలీలు ఉపాధి కోల్పొయారు. ఉన్నచోట తిండి లేక, ఉపాధి కరువై భార్య పిల్లలతో నడిరోడ్డుపై పడ్డారు. ఒక్కపూట భోజనం దొరకక, సొంతగూటికి చేరే మార్గం లేక నలిగిపోతున్నారు. ఏం చేయాలో దిక్కు తోచక ఎవరైనా పట్టెడన్నం పెడతారేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అటువంటి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంధ సంస్థలు, సామాన్యులు సైతం ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాం పురం సౌత్ గ్రామ పంచాయతీకి చెందిన సుమారు 55-60 పేదకుటుంబాలకు, పేరు పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న యేలూరి శ్యామ్ బాబు, ఎల్బీ చర్ల గురుకుల పాఠశాల లో పీజీటీ గా పని చేస్తోన్న నల్లి సాయి బాబు కలిసి నిత్యావసర వస్తువులైన వంట నూనె, పంచదార, వివిధ రకాల కూరగాయలు పంపిణీ చేశారు. ఈ లాక్డౌన్ సమయంలో చాలా మంది రోజు వారీ కూలీలు,పనులు లేక ఇబ్బందులు పడుతున్న వేళ వీటిని పంచిపెట్టడంఎంతో సంతోషంగా వుందని వారు చెప్పారు. విశాఖపట్నంలో పేదలకు సాయం అందించాలనే ఉద్దేశంతో కొంత మంది స్నేహితులు ఒక వాట్సాప్ గ్రూప్ వ్యాల్యుబుల్ హార్ట్స్ని క్రియేట్ చేసి కొంత మొత్తం సేకరించి ప్రతి వారం కొంత మందికి సాయం చేస్తోన్నారు. తమకి తోచినంతలో పేదవారికి సాయం చేయడంలో ఎంతో తృప్తి ఉందని వారు తెలిపారు. చిన్నవారైనా పెద్దమనసుతో పేదలను ఆదుకుంటూ వారు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మీరు కూడా లాక్డౌన్ సమయంలో చేస్తోన్న సేవకార్యాక్రమాను సాక్షి.కామ్ ద్వారా నలుగురికి తెలియజేసి వారిలో స్ఫూర్తి నింపాలి అనుకుంటే మీ వివరాలను webeditor@sakshi.com పంపించండి. -
ఆపరేషన్‌కు ఆర్థిక చేయూత అందించండి
సాక్షి, సిటీబ్యూరో: ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిన తన భర్త ఆపరేషన్‌కు ఆర్థిక చేయూత అందించి ఆదుకోవాలని భార్య స్వరూపరాణి, కుమారుడు వికాస్ దాతలను వేడుకుంటున్నారు. నాగర్‌కర్నూల్‌కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన జూలూరు శ్రీనివాస్‌కు యాక్సిడెంట్లో తలకు బలమైన గాయమై మెదడుపై ప్రభావం చూపింది. నిరుపేద కుటుంబం అప్పు చేయడంతోపాటు కొందరు దాతలు సాయం చేయడంతో సుమారు రూ.25 లక్షలు ఖర్చు చేసి హైదరాబాద్‌లో ఆపరేషన్ చేయించారు. మరో ఆపరేషన్ అవసరమని వైద్యులు పేర్కొంటున్నారు. దీనికి సుమారు రూ.3 లక్షలకు పైగా ఖర్చవుతుంది. దాతలు ఆదుకోవాలని బాధితుడి భార్య, కుమారుడు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫోన్: 96034 19501 గూగుల్ పే ద్వారా తోచిన సాయం చేయాలని కోరుతున్నారు. -
కష్టాల బాటలో తోడుగా
కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి లాక్డౌన్ విధించడంతో చాలా మంది దినసరి కూలీలు, వలస కూలీలు, నిరుపేదలు, నిరాశ్రయులు ఉపాధి కోల్పొయి ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తోన్నారు. అటువంటివారిని ఆదుకోవడానికి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. కానీ అవి కొంత మందికి చేరుతున్నాయి. అయితే లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవడానికి స్వచ్ఛంధ సంస్థలతో పాటు, సామాన్యులు సైతం ముందుకు వస్తున్నారు. (‘మాతృభూమి’ కోసం చేతనైన సాయం) సత్తుపల్లి నియోజకవర్గ వైఎస్సార్, జగన్మోహన్ర్డెడి అభిమానుల ఆధ్వర్యంలో.. ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం ,మండాలపాడు గ్రామ శివారులో ఛతీజ్ఘడ్ నుండి వలస వచ్చి నివాసముంటున్న 40 కుటుంబాలకు మాస్కులు, నిత్యవసర వస్తువులు, కూరగాయలు,గుడ్లు ,బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ వైఎస్సార్, జగన్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అరవపల్లి సందీప్ గౌడ్,కిషోర్ పోతురాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.కార్యక్రమంలో జొన్నలగడ్డ వంశీకృష్ణ జక్కంపూడి మరేశ్. ఎం.దయాకర్ రెడ్డి , బల్లి. శ్యామ్ ప్రసాద్, పాణెం.పుల్లారావు ,పాణెం.ఆనంద్, వేణు, కిశోర్, రారాజు, మహేశ్, రాజు, రామారావ్, జొన్నలగడ్డ రాజు బంక వెంకీ సాగర్ గౌతమ్ సాయి తదిరులు పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా అన్నం పెట్టే వారు లేక రోడ్డు పక్కన ఆకలితో అలమటిస్తున్న వారికి విజయవాడలో ఉంటున్న పసుపులేటి రామ్‌ప్రసాద్ అండగా నిలిచారు. వారికి అన్నదానం చేసి వారి ఆకలిని తీర్చి కరోనా కష్టకాలంలో వారికి సాయం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. (లాక్డౌన్లో వినూత్న కార్యక్రమం) విదేశాలలో ఉంటున్న తన గ్రామాన్ని మర్చిపోకుండా తాను పుట్టిన ఊరిలో లాక్డౌన్ కారణంగా తిండిలేక అనేకమంది కష్టపడటం చూడలేక అమెరికా నుంచి తన మొత్తం జీతాన్ని పేదవారికి కడుపు నింపడానికి ఉపయోగిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కుంజర్ గ్రామానికి చెందిన ఆదీష్ అనే యువకుడు తన తండ్రి స్ఫూర్తితో పేదలకుసాయం చేస్తూ ఆదుకుంటున్నాడు. కరోనాను ఎదుర్కోవాలంటే మాస్క్‌లు పెట్టుకోవడం, శానిటైజర్లు ఉపయోగించడం ఎంతో అవసరం. అయితే మాస్క్‌ల కొరత వెంటాడుతోంది. ఈ నేపథ్యంలోనే చార్టెడ్ అకౌంటెంట్ మోహాన్ కడింపల్లి లక్షా ముప్పై వేల రూపాయల విలువైన 200 పీపీఈ కిట్లను కేడీఎఫ్ చెన్నై నుంచి తెప్పించి కర్నూల్ మున్సిపల్ కమిషనర్ బాలాజీకి అందజేశారు. వార్డు వాలంటీర్లతో సహా కర్నూల్ మున్సిపాలిటీ ఫ్రంట్‌లైన్ కార్మికుల కోసం పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు. మీరు కూడా లాక్డౌన్ సమయంలో చేస్తోన్న సేవాకార్యక్రమాలు నలుగురికి తెలిపి వారిలో స్ఫూర్తి నింపాలనుకుంటే webeditor@sakshi.comకి మెయిల్ చేయండి. -
సీఎం సహాయనిధికి లలితా జ్యువెలర్స్ కోటి విరాళం
సాక్షి, అమరావతి: కరోనా (కోవిడ్-19) వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సంఘీభావంగా పలువురు ప్రముఖులు, సంస్థలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 1 కోటి విరాళం ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లలిత జ్యువెలర్ సీఎండీ కిరణ్‌కుమార్ బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో విరాళం చెక్కును అందచేశారు. ►అలాగే ముఖ్యమంత్రి సహాయనిధికి అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు డాక్టర్ జీ. శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ లలిత, రమణా రెడ్డి, మనోహరి రూ. 50,00,000 విరాళం ఇచ్చారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి సమక్షంలో డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులు గుద్దేటి నరసింహారెడ్డి (గుండ్లకుంట), డాక్టర్ ఎంఎల్ నారాయణరెడ్డి (జమ్ములమడుగు) విరాళం చెక్కును సీఎం జగన్‌కు అందచేశారు. ►కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఇండియన్ బ్యాంక్ రూ. 30,00,000 విరాళం అందించింది. విరాళానికి సంబంధించిన డీడీని సీఎం జగన్‌కు ఇండియన్ బ్యాంక్ డీజీఎం ప్రసాద్ అందించారు. ►అలాగే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ రూ. 17,00,000 విరాళం ప్రకటించింది. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆర్ఎం రామకృష్ణ విరాళానికి సంబంధించిన డీడీని ముఖ్యమంత్రి అందచేశారు. ►మరోవైపు ముఖ్యమంత్రి సహాయనిధికి అసోసియేషన్ ఆఫ్ ఫార్మర్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టు (ఏపీ, తెలంగాణ) రూ. 6,15,000 విరాళం ఇచ్చింది. -
వెల్లివిరుస్తోన్న మానవత్వం
కరోనా మహమ్మారిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా అనేక దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తోన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కరోనాని అదుపు చేయడానికి మార్చి 21న లాక్‌డౌన్‌ను ప్రకటించింది. లాక్‌డౌన్‌ను ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటి వరకు మూడు సార్లు పొడిగించారు. అది మే 17 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఉపాధి కోల్పొయారు. చాలా మంది వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు వెళ్లే పరిస్థితులు కూడా లేక ఎక్కడి వారు అక్కడే చిక్కుకు పోయారు. చాలా మంది నిరాశ్రయులు, నిరుపేదలు, వలసకూలీలు ఆకలితో అలమటిస్తోన్నారు. మే 1 నుంచి వారిని ఊళ్లకు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోన్న ఇంకా చాలా మంది ఊర్లకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అలాంటి వారికి ప్రభుత్వాలతో పాటు చాలా స్వచ్ఛంధ సంస్థలు, సామాన్యుల సైత్యం సాయం చేస్తోన్నారు. కడపజిల్లా మైదుకూరులో నివాసం ఉంటున్న సాయి తేజ రెడ్డి కూన్ కా రిస్తా, గాడెస్ పూర్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ద్వారా తమ చుట్టు పక్కల ఉండే వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. పనిరుపేదల కుటుంబాలు ఒక్కొక్కరికి 1.5 కేజీల బియ్యం, 0.5 కేజీల పప్పు, అర కేజీ పంచదార, కేజీ గోధుమ పిండి, ఒక లీటర్ ఆయిల్ ప్యాకెట్ ఇంకా ఇతర నిత్యవసర సరుకులతో కూడిన కిట్లను అందజేశారు. దాదాపు 300 కుటుంబాలకు వీటిని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ కారణంగా అనంతపురం జిల్లాలో ఇబ్బంది పడుతున్న వారికి యస్యస్వై సంస్థ తరుపున ఎన్. సదా శివరెడ్డి గురూజీ ఆధ్వర్యంలో అన్నదానం, నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్నారు. అనంతపురం గవర్నమెంట్ ఆసుపత్రిలోని కరోనా బాధితులతో పాటు, పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉపాధి కోల్పొయి ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఆహౠరాన్ని అందిస్తూ ఎంతో మంది ఆకలి తీరుస్తున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో జిల్లా మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ షేక్ సుభాని, శ్రీశంకర్ గ్రాఫిక్స్ శ్రీనివాస్ లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందజేసి అండగా నిలిచారు. హైదరాబాద్ సనత్ నగర్ లోని హనుమాన్ గోశాల దగ్గర సేవా కార్యక్రమాలు నిర్వహించే దేవేందర్ కొన్నే తన సహచరులతో కలిసి లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడే పేదల కోసం రోజు ఆహారాన్ని అందిస్తున్నారు. తన సహచరులందరూ కలిసి కూడగట్టిన డబ్బులతో ఇప్పటి వరకు 14,000 మందికి ఆహారపదార్థాలు అందించారు. ఈ కార్యక్రమంలో దేవందర్ కొన్నేతోపాటు తులసి కుమార్, సూర్య ప్రకాష్, ఆనంద్, బాల మురళి కృష్ణ, శివ ప్రసాద్, రవి, గడ్డం రవి, వేణు, భజరంగ్, సునీత, హనుమాన్, లక్ష్మీ, కొన్నే అఖిల, శ్రీకాంత్, పూజ, పాల్గొన్నారు మీరు కూడా లాక్డౌన్ సమయంలో చేస్తోన్న సేవ కార్యక్రమ వివరాలు నలుగురికి తెలిపి చాలా మందిలో స్ఫూర్తి నింపాలి అనుకుంటే webeditor@sakshi.com కి మీ వివరాలు పంపించండి. -
సేవా రత్నాలు
కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో అనేక మంది చేసేందుకు పనులు లేక తినేందుకు తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. రోజుకు ఒక్కపూట కూడా తిండి దొరకక అనేక మంది కుటుంబంతో కలిసి పస్తులుంటున్నారు. లాక్‌డౌన్‌ను ఇప్పటికే మూడు సార్లు పొడిగిచడంతో రోజు కూలీ చేసుకొని బతికే బడుగు బలహీన వర్గాల వారు ఆకలితో అలమటిస్తున్నారు. సాయం అందించే వారికి కోసం ఆశగా ఎదరుచూస్తున్నారు. అటువంటి వారికి అండగా నిలవడం కోసం చాలా మంది ముందుకు వస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న డాక్టర్లు, ఎఎన్ఎమ్లను గాదెరాజు బాలకృష్ణ ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.రెడ్ జోన్‌గా ప్రకటించినప్పటి నుంచి 20 రోజులుగా కంటైన్మెంట్ జోన్లో టింటికి సర్వే చేస్తున్న ఆశావర్కర్లను, ఎఎన్ఎమ్లు, మున్సిపల్‌సిబ్బంది పై పూల వర్షం కురిపించారు. వారందరికి 15 రోజులకు సరిపడా నిత్యావసరాలను కూడా అందించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పల్లవి, కంటైన్మెంట్ ఇంచార్జ్ ప్రకాశ్‌లు పాల్గొన్నారు. (అన్నార్తులకు అమీనామ్మ ) అమెరికాలో ఉంటున్న కడపజిల్లా గాలివీడు మండలానికి చెందిన వేణుగోపాల్ రెడ్డి కరోనా లాక్డౌన్ కాలంలో పేదలకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో ఒక చారిటీ సంస్థను స్థాపించారు. దాని ద్వారా రూ. 1,50,000 లతో వికలాంగులకు, వలస కార్మికులకు సాయాన్ని అందించారు. తాను చేసిన ఈ కార్యక్రమంలో సహకరించిన సేవా భావం సంస్థకు, స్నేహితులకు వేణుగోపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. (మానవత్వమే మన మతం) లాక్డౌన్ నేపథ్యంలో ప్రకాశం జిల్లా మార్టూరు మండలం వలపర్ల గ్రామంలో సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేస్తూ అమెరికాలో నివాసం ఉంటున్న కార్యంపూడి శ్రీనివాస వరప్రసాద్ ఆర్థిక సహాయముతో , మాస్టర్ వీవర్ కార్యంపూడి కోటీనాగులు ఆధ్వర్యంలో పద్మశాలీ చేనేత కార్మికులకు భోజనం పంపిణీ చేస్తున్నారు. రోజు మధ్యాహ్నం అన్నం, పప్పు లేదా కర్రీ వండి పెరుగుతో పాటు ఆహార పొట్లాలు తయారు చేసి, వీటిని పద్మశాలీ యూత్ సహకారంతో రోజు మధ్యాహ్నం సుమారు 150 మంది చేనేత కార్మికులు, పేదలకు అందజేస్తున్నారు. కరోనా కట్టడికి పోరాడుతున్న వారిలో వైద్యులు, పోలీసు వారు ముందు వరుసలో ఉంటారు. అటువంటి పోలీసులకు వోల్టాస్ మాజీ ఉద్యోగులు "ఎకో ఫ్రెండ్లీ హెర్బల్ పాకెట్ శానిటైజర్స్ " తయారు చేసి 500 బాటిల్స్ అందజేశారు. వోల్టాస్ మాజీ ఉద్యోగుల ప్రతినిధి శ్రీ కృష్ణా రెడ్డి, జీరో బడ్జెట్ పాలిటిక్స్ ప్రతినిధి శ్రీ మాధవ రెడ్డి సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ చేతుల మీదుగా పోలీస్‌లకు అందజేశారు. మీరు కూడా లాక్డౌన్ కాలంలో చేస్తున్న సేవ కార్యక్రమాలను నలుగురికి తెలిపి వారిలో స్పూర్తి నింపాలంటే webeditor@sakshi.com కి ఆ వివరాలు తెలియజేయండి. -
కోవిడ్ నియంత్రణ కోసం ఎస్ఎఫ్సీ విరాళం
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా ఇంతవరకు ఎప్పుడు ఎదుర్కొని సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటోంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్డౌన్ విధించడంతో ఆయా ప్రభుత్వాలు అనేక సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా అనేక సంస్థలు, సామాన్యులు కూడా అండగా నిలుస్తున్నారు. మహమ్మారిపై పోరాటంలో భాగంగా తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఈ క్రమంలో చాలా కంపెనీలు, సంస్థలు పీఎం కేర్‌కి, సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళాలు అందిస్తున్నాయి. (సీఎంఆర్ఎఫ్కు భారీగా విరాళాలు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ - తెలంగాణ విభాగం) తమ వంతు బాధ్యతగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 20 లక్షల రూపాయలను అందజేసింది. కోవిడ్-19 నియంత్రణలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు మద్దతుగా కార్పొరేషన్ తరఫున ఈ విరాళం అందజేసినట్లు కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వేముల శ్రీనివాసులు తెలిపారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును శ్రీనివాసులతో పాటు కార్పొరేషన్ ఎగ్జికూటివ్ డైరెక్టర్ దేవానంద్ శనివారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. అదేవిధంగా, ఎస్ఎఫ్సీ ఉద్యోగులు, సిబ్బంది సైతం ముందుకొచ్చి తమ ఒకరోజు వేతనం 3.8 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్‌ను అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. (కస్టమ్స్ అండ్ సెంట్రల్ జీఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ రూ.70 లక్షల విరాళం) -
అనాథకు అన్నీ తామై..
జగిత్యాలజోన్: అనాథకు అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించారు హెల్పింగ్‌హ్యాండ్ సభ్యులు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని రెండోవార్డుకు చెందిన అనాథ మహిళ లక్ష్మి శుక్రవారం గుండెపోటుతో మరణించింది. ఆ వార్డు కౌన్సిలర్ డిష్ జగన్ స్పందించి హెల్పింగ్‌హ్యాండ్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. లక్ష్మి మృతదేహాన్ని హెల్పింగ్‌హ్యాండ్ సభ్యులు నల్ల సురేష్, మందాడి సురేష్, సింగం భూమేష్, సాయిచరణ్ శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్పింగ్‌హ్యాండ్ సభ్యులను సంస్థ వ్యవస్థాపకులు డెక్క శ్రావణ్, కౌన్సిలర్ డిష్ జగన్ అభినందించారు. -
అన్నార్తులకు అమీనామ్మ
పొరుగు రాష్ట్రాలకు కాలినడకన వెళుతున్న వారి ఆకలి తీర్చుతున్న మానవతామూర్తి అమీనా బేగం. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన అమీనా బేగం వృత్తిరీత్యా అంగన్వాడీ టీచర్. తన రెండు నెలల వేతనంతో పాటు టైలరింగ్ చేసే కూతురు హీనా, చికెన్ సెంటర్ నడిపే పెద్ద కొడుకు అజార్, బి.టెక్ చదువుతున్న చిన్న కొడుకు మజార్ సహకారంతో బాటసారులకు రోజూ అన్నం పెడుతున్నారు. లాక్డౌన్ అమలైనప్పటి నుంచి జాతీయ రహదారి 44 వెంట మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లకు వెళుతున్న వలసకార్మికులకు అమీనా కుటుంబం అపన్నహస్తం అందిస్తోంది. చలించిన మనసు ఓ రోజు అమీనా బంధువు సూచన మేరకు వలస కార్మికుల కుటుంబాలకు బిస్కట్లు, పండ్లు అందించారు. తాము రెండు రోజుల నుంచి ఏమీ తినలేదని వలస కార్మికులు వివరించడంతో ఆకలి బాధ తెలిసిన అమీనా తమకోసం వండిన ఆహారాన్ని వారికి అందించారు. తమకు అన్నం పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపిన వలస కార్మికులు తమలాంటి మరెందరో కాలిబాటన వస్తున్నారని వివరించారు. దీంతో చలించిన అమీనా నిత్యాన్నదానానికి పూనుకున్నారు. నిత్యాన్నదానం వలసకార్మికుల్లో ఎవరైనా అన్నం వద్దు అంటే వారికి పండ్లు అందిస్తున్నారు. స్వచ్ఛందంగా బాటసారుల ఆకలి తీరుస్తున్న అమీనా సేవలను గుర్తించిన సిక్కిం గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వయంగా ఫోన్ చేసి అమీనాను అభినందించారు. అమీనా సేవలను గుర్తించిన కొందరు స్థానికులు వంట సామాగ్రి వితరణ చేశారు. ఒకపూట అదనంగా ఒకరికి భోజనం పెట్టాలంటేనే ఆలోచించే ఈ రోజుల్లో అమీనా రోజుల తరబడి రోజూ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు నిత్యాన్నదానం చేయడం పట్ల స్థానికులు అభినందిస్తున్నారు. ఆకలితో ఉన్నవారి కడుపు నింపడం తన అదృష్టం అని అమీనా చెబుతున్నారు. – ఎన్.చంద్రశేఖర్, నిజామాబాద్ జిల్లా -
కరోనా: సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
సాక్షి, తాడేపల్లి: కరోనా మమ్మారిపై చేస్తోన్న యుద్దంలో చాలా మంది ప్రభుత్వాలకు అండగా నిలబడుతున్నారు. తాము చేయగలిగినంత సాయం చేస్తూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే కోవిడ్-19 నివారణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీస్ మేనేజిమెంట్ అసోసియేషన్ బుధవారం రూ. 2,56,00,000 విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్ మేనేజిమెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ప్రతినిధులు ఆలూరు సాంబశివారెడ్డి, ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, మిట్టపల్లి కోటేశ్వరరావు, దాడి రత్నాకర్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు అందించారు. (కరోనా : సీఎం సహాయనిధికి విరాళాలు) దీనికి తోడు నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు, నియోజకవర్గ నాయకులు, అభిమానులు కోటి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ( రూ. 1,00,29,000) విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన చెక్కును,డీడీని ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందించారు. సివీఎస్ కృష్ణమూర్తి చారిటీస్ ఇరవై ఐదు లక్షలు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించింది. వీరితో పాటు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, నియోజకవర్గ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డాక్టర్లు, నాయకులు రూ. 89,86,222 విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్‌కు అందజేశారు. (సీఎం సహాయ నిధికి వాణిజ్య సంఘాల విరాళాలు) -
టెంపాబే లో నాట్స్ సాయం
మెక్సికో: అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) టెంపాబేలో తెలుగువారికి నిత్యావసరాలు పంపిణీ చేసింది. కరోనా నియంత్రణ కోసం లాక్డౌన్ విధించడంతో ఇబ్బందులు పడుతున్న భారతీయుల కోసం నాట్స్ టెంపాబే విభాగం స్పందించి నిత్యావసరాల సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను దాదాపు 300 మందికిపైగా అందించింది. స్థానికంగా ఉండే బటర్ ప్లై ఫార్మసీ కూడా దీనికి తన వంతు సహకారం అందించింది. అవసరమైన వారికి మాస్కులు, గ్లౌజులు కూడా నాట్స్ పంపిణీ చేసింది. (చిన్నారుల ఆశ్రమానికి నాట్స్ చేయూత) ప్లోరిడా హౌస్ ప్రతినిధి మిస్ డయాన్ ఈ పంపిణీ కార్యక్రమానికి హాజరై నాట్స్ నాయకులను అభినందించారు. ఈ కష్టకాలంలో నాట్స్ ముందుకు వచ్చి సాయం చేయడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. స్థానిక పోలీసులు కూడా డ్రైవ్ త్రూ లైన్ లలో ట్రాఫిక్‌ను మళ్లించి ఈ పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేలా చేశారు. దీనికి నాట్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ టెంపా బే కోర్ టీం సభ్యులు శ్రీనివాస్ గుత్తికొండ, ప్రశాంత్ పిన్నమనేని,రాజేశ్ కాండ్రు, శ్రీనివాస్ మల్లాది, ప్రసాద్ ఆరికట్ల, సుధీర్ మిక్కిలినేని తదితరులు ఈ నిత్యావసరసరుకుల ఉచిత పంపిణీ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. బటర్ ఫ్లై ఫార్మసీ నుంచి జన్ను కుటుంబం, టోని, టుటూ తో పాటు ఫార్మసీ కార్యాలయం సిబ్బంది కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసరుకులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, సెక్రటరీ విష్ణు వీరపనేని, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మురళీ మేడిచర్లకు నాట్స్ టెంపాబే టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. టెంపాబే స్ఫూర్తితో మరిన్ని ఛాప్టర్లలో నాట్స్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టనుంది.(శాన్ఎన్టానియోలో నాట్స్ ఉదారత) -
మానవత్వమే మన మతం
కరోనా కష్టకాలంలో పేదలు చాలా మంది జీవనోపాధి కోల్పొయి ఆకలితో అలమటిస్తున్నారు. ఒక్కపూట ఆహారం కూడా దొరకక కుటుంబంతో కలసి పస్తులు ఉంటున్నారు. రోజు పనికి వెళితే కానీ పూట గడవని బడుగు జీవులు బాధతో వస్తున్న కన్నీటిని దిగమింగుతూ భోజనం పెట్టి ఆదుకునే వారి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వారిని ఆదుకునేందుకు అనేక స్వచ్ఛంధ సంస్థలతో పాటు సామాన్యులు సైతం చేతనైనంత సాయం అందిస్తున్నారు. (వాళ్లు కూడా మనవాళ్లే) కృష్ణాజిల్లా ఉయ్యూరులో ఆర్ఎంపీగా పనిచేస్తున్న నగిపోగు కోటేశ్వర రావు కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ఉపాధి కోల్పొయిన వారికి ఆహారాన్ని అందిస్తూ ఆకలి తీరుస్తున్నారు. నిరుపేదలు, నిరాశ్రయులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన లారీ డ్రైవర్లకు కూడా భోజనాన్ని అందిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో ఆర్ఆర్ హెచ్ఈ డీఎస్ సంస్థ ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు, దివ్యాంగులకు, నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి వారిని ఆదుకుంటున్నారు. ఇప్పటి వరకు అనేక మందికి సాయాన్ని అందించిన ఈ సంస్థ మానవత్వాన్ని చాటుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా తొందంగికి చెందిన క్రిష్టియన్ వర్షిప్ సెంటర్ చర్ఛ్ లాక్డౌన్ కారణంగా రోడ్డుపై ఉంటూ ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్న భిక్షగాళ్లకు, అనాధలకు ఆహారాన్ని అందించారు. దాదాపు 200 మందికి పైగా భోజనాన్ని పంపిణీ చేశారు. (కరోనాపై పోరాటంలో మీరు చేయి కలపండి) మేడ్చల్ గ్రంధాలయ డైరెక్టర్ అనిత శ్రీపద రావు కుకట్ పల్లి కరోనా కారణంగా ఉపాధి కోల్పొయి బాధపడుతున్న నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందించారు. గత 15 సంవత్సరాలుగా ఎంతో మంది పేదలను ఆదుకుంటూ అండగా నిలుస్తున్న అనిత కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆమె సాయాన్ని మరింత విస్తరించి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మీరు కూడా లాక్డౌన్ కాలంలో చేస్తున్న సేవ కార్యక్రమలను webeditor@sakshi.com ద్వారా తెలియజేస్తూ మరికొంత మందిలోసాయం చేయాలన్న స్ఫూర్తిని నింపండి. -
తల్లి చర్మంతో చిన్నారికి చికిత్స
శ్రీకాకుళం,ఆమదాలవలస: ఒళ్లంతా గాయాలైన చిన్నారిని చూసి ఆ తల్లి తల్లిడిల్లింది. తనకు ఏమైనా పర్వాలేదు నవ మాసాలు మోసిన బిడ్డ బాగుండాలని తన చర్మంతో వైద్యం చేయించాలని కోరింది. వైద్యమైతే చేయించాలని ఆశపడింది కానీ ఆర్థిక సాయం అందక నిలువునా కుమిలిపోతోంది. దాతలు ఎవరైనా దయతలిస్తే తన కంటి పాపను బతికించుకోవాలని ఆశపడుతోంది. మున్సిపాలిటీలోని రెండోవార్డు కృష్ణాపురం గ్రామానికి చెందిన మెట్ట శ్రీనివాసరావు, పార్వతి దంపతులు విశాఖపట్నం సుజాతానగర్‌లో నివాసముంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు లలిని, ప్రశీలా ఉన్నారు. అయితే మూడు నెలల క్రితం విశాఖపట్నంలో వారి ఇంటివద్ద తల్లి పార్వతి దీపం వెలిగించేటప్పుడు ప్రశీల అగ్ని ప్రమాదానికి గురయ్యింది. తులసి కోటవద్ద తల్లి పెట్టిన దీపం దుస్తులకు అంటుకోవడంతో 60 శాతం గాయపడింది. వెంటనే విమ్స్‌కి తెసుకెళ్లగా ఎవరి చర్మానైనా ఉపయోగించి శస్త్రచికిత్స చేయవచ్చునని తెలియజేశారు. దీంతో బాలిక తల్లి చర్మం ఇచ్చేందుకు సిద్ధం కావడంతో చికిత్స చేశారు. అయితే వైద్యం కోసం ఇప్పటివరకు రూ.3 లక్షలు ఖర్చు అయ్యిందని, మరో మూడు రూ.లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారని బాలిక తండ్రి తెలియజేశారు. వైద్య ఖర్చులకు ప్రస్తుతం డబ్బులు లేవని దాతలు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. వీరికి కర్లకో ట గ్రామానికి చెందిన యువ కిరణాలు సేవా సమి తి సభ్యులు రూ.10 వేల ఆర్థిక సాయం సోమవా రం అందజేశారు. ఆర్థిక సాయం అందించాలనుకునేవారు మెట్ట శ్రీనివాసరావు, అకౌంట్ నంబర్ 123810100055034, ఆంధ్రా బ్యాంకు,మధురవాడ బ్రాంచ్, విశాఖపట్టణం, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఏఎన్‌డీబీ 0001238, గోగుల్ పే, ఫోన్ పేకు 7995880331 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. -
చేదోడు వాదోడుగా...
కరోనాని కట్టడి చేయడం కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఎక్కడివారు అక్కడ ఉండిపోయారు. ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. దీంతో ఎంతో మంది రోజువారీ కార్మికులు, వలస కూలీలు, నిరుపేదలు పనులు దొరకక పస్తులుంటున్నారు. ఒక్కపూట కూడా తిండి దొరకక ఆకలితో అలమటిస్తోన్నారు. అటువంటి వారిని ఆదుకోవడానికి చాలా మంది సామాన్యులు సైతం వారికి చేతనైనంత సాయం చేస్తున్నారు. (కష్టంలో తోడుగా కామన్‌మ్యాన్) వెంగన్నగూడెం గ్రామ పంచాయితీ పరిధిలో ఆముదాల ఫ్యాక్టరీ వద్ద నివాసం ఉంటున్న వలస కార్మికులకు మన్నెం రంజిత్ యాదవ్ గారి సహాయ సహకారాలతో నిడమనూర్ ఏఎస్ఐ సీహెచ్ రమేష్ గారు కూరగాయలు, బియ్యం పంపిణి చేశారు. దాదాపు 50 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి మాజీ ఎమ్పీటీసీ మన్నెం వెంకన్న యాదవ్, వెంగన్నగూడెం ఎమ్పీటీసీ చెలుముల సంతోష్, మండల ఎస్పీసెల్ ప్రధాన కార్యదర్శి లకుమాల మధుబాబు, కోటి, ఆవుల కృష్ణ, మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు. (సేవ సైనికులు) నెల్లూరు జిల్లా బ్రహ్మణ క్రాక పంచాయితీలో నిరుపేదలకు, రోజువారీ కూలీ దొరకక లాక్డౌన్ కాలంలో ఆకలితో అలమటిస్తున్న వారికి మంజుల నిత్యవసర సరుకులు అందించి అండగా నిలిచారు. కదిరికి చెందిన నాగేంద్ర ప్రసాద్ కరోనా కష్ట కాలంలో పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో తమ ప్రాంతానికి చెందిన మున్సిపల్ కార్మికులకు, పేద ప్రజలకు తన కుటుంబసభ్యులతో కలిసి వంట సామాగ్రి అందించారు. జయశంకర్ భూపాలపల్లి మోరంచపల్లి గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ గ్రామంలోని పేద ప్రజలకి, నిరాశ్రయులకి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే వారికి కరోనా రాకుండా చేతులు కడుక్కోవాలని, మాస్క్ ధరించాలని జాగ్రత్తలు చెప్పి వారిలో చైతన్యం నింపారు. మీరు కూడా సేవ కార్యక్రమాలు చేస్తూ ఉండి ఉంటే అవి ఎందరిలోనో స్ఫూర్తిని నింపవచ్చు. వాటిని మాకు webeditor@sakshi.com ద్వారా పంపించండి. -
కష్టంలో తోడుగా...
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు భారతప్రభుత్వం మార్చి25 నుంచి లాక్‌డౌన్‌ని ప్రకటించింది. అయితే మొదట ఏప్రిల్ 14తో ముగుస్తుంది అనుకున్న లాక్‌డౌన్‌ను రెండు సార్లు పొడిగించారు. దీంతో మరోసారి లాక్డౌన్ పొడిగించకపోతే మే17 వరకు కొనసాగనుంది. లాక్డౌన్ కారణంగా చాలా మంది ఉపాధి కోల్పొయి ఆకలితో పస్తులు ఉంటున్నారు. పూట కూడా గడవక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారిని స్వచ్ఛంధ సంస్థలతో పాటు సామాన్యులు సైతం చేతనైనంతా సాయం చేస్తూ ఆదుకుంటున్నారు. (కష్టంలో తోడుగా కామన్‌మ్యాన్) టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హైకోర్ట్ న్యాయవాది మన్నెం రంజిత్ యాదవ్ ఆర్థిక సహాయంతో నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో,పోలీస్ సిబ్బందికి,ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, గ్రామపంచాయతీ సిబ్బందికి,జంగాల కాలనీకి చెందిన 250 కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో త్రిపురారం S. I రామ్మూర్తి, గ్రామ సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్వి మండల అధ్యక్షుడు షేక్ ఆలిమ్ చేతుల మీదుగా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి మాజీ యంపీటీసీ, మన్నెం వెంకన్న ,హాలియా ఏయమ్సీ డైరెక్టర్ కొట్టే రమేష్ యాదవ్, టీఆర్ఎస్వినియోజకవర్గ కార్యదర్శి కుంటిగొర్ల రాజశేఖర్,ఇరిగి ప్రభాకర్, కోటి,శివ,నవీన్,ఉపేందర్,మహేష్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా గుంటిపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిడ్మనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ, ఎంపీపీ సలహాదారు బొల్లం రవి, ఎర్రబెల్లి మాజీ సర్పంచ్ తాటి సత్యపాల్, తదితరులు పాల్గొన్నారు. నాం ఉల్ హుస్సేన్ ఆధ్వర్యంలో కర్నూలు రోజా వీధి లోని 70 పేద ముస్లిం కుటుంబాలకి రేషన్ సామాన్లు అందించారు. కర్నూలులో పూర్తి రెడ్ జోన్ గా ఉన్న రోజా వీధిలో లాక్ డౌన్ వల్ల, రెడ్ జోన్ వల్ల రోజు వారి పనులు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి వచ్చినట్టు, అందుకు సహాయం చేయాలనీ నిర్ణయించినట్టు సౌదీ అరేబియా లో ఉండే ఇనాముల్ హుస్సేన్ తెలిపారు. తన కుటుంబ సభ్యులు పెద్ద మొత్తంలో సహకారం అందించడంతో సరుకులను కొనుగోలు చేసి కిట్స్ గా మార్చి , క్యూపన్స్ ద్వారా వస్తువులను అవసరమైన వారికి అందిస్తున్నట్టు తెలిపారు. కందిపప్పు, గోధుమ పిండి, చక్కర, కరం, అల్లం పేస్ట్, నూనె, ఉప్పు తదితర నిత్యావసర సరుకులు ఒక్కొకటి రూ.1000 విలువ గల కిటను హుస్సేన్ సౌదీ నుంచి అందించారు. (కరోనాపై పోరాటంలో మీరు చేయి కలపండి) కరోనా విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులకు ఎస్ఎఫ్ఐ కృష్ణాజిల్లా కమిటీ వారు సాయం అందించారు. వీరు ప్రతి రోజు కృష్ణాజిల్లాలో 265 మందికి భోజనాలు, మాస్కులు సరఫరా చేస్తున్నారు. జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ , నూజివీడు , చందర్లపాడు ,మచిలీపట్నాలలో శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. మీరు చేస్తున్న సేవ కార్యక్రమాలు కూడా అందరికి తెలియజేసి వారిలో స్ఫూర్తి నింపాలంటే మీరు చేస్తున్న సేవ కార్యక్రమాల వివరాలు webeditor@sakshi.comకి పంపించండి. -
మానవతామూర్తులు
కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో దేశ వ్యాప్తంగా అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. రోజు పనిచేస్తే కాని పూటగడవని ఎంతో మంది రోజులు తరబడి పస్తులు ఉండే పరిస్థితి దాపురించింది. ఇలాంటి సమయంలో వారిని ఆదుకొని అన్నం పెట్టే ఆపన్న హస్తాల కోసం ఎందరో ఆశగా ఎదురు చూస్తున్నారు. నిరుపేదలను, నిరాశ్రయులను, ఉపాధి కోల్పొయి ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి అండగా నిలవడానికి అనేక స్వచ్ఛంధ సంస్థలతో పాటు సామాన్యులు సైతం ముందుకొస్తున్నారు. (కష్టంలో తోడుగా కామన్‌మ్యాన్) జగిత్యాలలో తల్లిదండ్రులను కోల్పొయిన ఇద్దరి పిల్లల్ని అంగన్వాడీ టీచర్ అక్కున చేర్చుకుంది.ఈ విషయం పేపర్ ద్వారా తెలుసుకున్న ఫ్రెండ్స్ బీయింగ్ ఎ హెల్పింగ్ హ్యాడ్స్ అనే ఎన్జీఓ సంస్థ వారిక బియ్యం, నిత్యవసర సరుకులు అందించారు. ఎన్జీఓ ప్రతినిధి మోర భాను ప్రభా దగ్గరుండి సాయం చేశారు. లాక్డౌన్ అనంతరం వారికి చదువు చెప్పిస్తామని ఎన్జీఓ ఫౌండర్, సీఈఓ వికిల్ ప్రభ చెప్పారు ప్రకాశం జిల్లా జల్లెపాలెం గ్రామంలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పొయి ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు కూరగాయలు, నిత్యవసర సరుకులు అందించి అనపు రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. 400 బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు బియ్యాన్ని ఉచితంగా అందించారు. కర్మాన్ఘూట్లో ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్న విజేందర్, తన స్నేహితులతో కలిసి గ్రీన్ పార్క్ కాలనీలో ఆకలితో బాధపడుతున్న వారికి 100 కిలోల బియ్యం, పప్పుదినుసులు, కూరగాయలు, ఆయిల్ అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. (సేవ సైనికులు) మీరు కూడా ఈ లాక్డౌన్ కాలంలో మీరు చేస్తున్న సాయాన్ని నలుగురికి తెలియజేసి వారిలో స్ఫూర్తి నింపాలంటే webeditor@sakshi.comకి మీ వివరాలు పంపించండి. -
సరైన సమయంలో ఆదుకోవడం ముఖ్యం
తిరిగి ఏం ఆశించకుండా, సరైన సమయంలో అవసరం ఉన్న వారికి చేసే సాయం దైవత్వంతో సమానం. ప్రస్తుతం ఉన్న కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వారికి చేతనైనంత సాయం అందించాల్సిన సమయం ఇది. ఎంతో మంది నిరుపేదలు, రోజు పనిచేస్తే కానీ పూట గడవని ఎంతో మంది దినసరి కూలీలు కరోనా మహమ్మారి కారణంగా పూట గడవక ఇబ్బందులు పడుతురన్నారు. అయితే అటువంటి వారి ఆకలి తీర్చడానికి చాలా స్వచ్ఛంధ సంస్థలతో పాటు సామాన్యలు సైతం ముందుకు వస్తున్నారు. (సాయం అందిస్తున్న హెల్పింగ్ హాండ్స్) నారీ గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు దువ్వూరి చాందినీ ఈ విపత్కర పరిస్థితుల్లో ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో పేదలకు సాయాన్ని అందిస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒక హాస్పిటల్ని దత్తత తీసుకొని అందులో ఎందరికో ఉచితంగా కనుపులు, అత్యవసర ఆపరేషన్లు ఫ్రీగా చేయించడంతో పాటు రోగులకు, వారికి సాయంగా వచ్చిన వారికి కూడా ఆహారాన్ని అందిస్తున్నారు. మెడికల్ సిబ్బందికి పీపీఈ కిట్లను అందిస్తున్నారు. ప్రతి రోజు మెడికల్ సిబ్బందితో పాటు 700 మందికి భోజనాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పొయిన 4000ల మంది వలస కూలీలకు తమ సంస్థ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు. (వాళ్లు కూడా మనవాళ్లే) దీంతో పాటు రూ.1500 విలువ గల నిత్యవసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 2000 మందికి పైగా ఈ కిట్లను అందజేశారు. చేనేత కార్మికలను ఆదుకునేందుకు తెలంగాణ సర్కారుతో కలిసి కొయ్యగూడెం, బోగారం, సిరిపురం, కరీంనగర్, జోగిపేట, చిన్నూరు తదితర ప్రాంతాల్లో ఉన్న చేనేత కార్మికుల కుటుంబాలకు రూ. 1000 చొప్పున సాయం అందించారు. అందరూ సాయం చేస్తే ఇంకా ఎన్నో కుటుంబాలకు, ఆసుపత్రుల్లో ఉంటున్నవారికి సేవ చేయడానికి అవకాశం ఉంటుందని చాందిని తెలిపారు. -
పేదలకు అండగా నిలుస్తున్న కరుణమయులు
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచలోని అనేక దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. అదే బాటలో భారతప్రభుత్వం కూడా మార్చి 24 తేదీ నుంచి మొదట మూడు వారాల పాటు లాక్‌డౌన్‌ను విధించారు. అయినప్పటికీ కరోనా కేసుల సంఖ్యలో దేశంలో విపరీతంగా పెరిగిపోవడంతో లాక్‌డౌన్‌ను మే3 వరకు పొడిగిస్తున్నట్లు మోదీ మరోసారి ప్రకటించారు. దీంతో రోజువారి కూలీ చేస్తే గాని పూట గడవని బడుగు వర్గాల వారి బతుకులు భారంగా మారాయి. నిత్యవసర సరుకుల ధరలు పెరగడం, కొనడానికి డబ్బులు లేకపోవడంతో సహా పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. అయితే వారిని ఆదుకునేందుకు, వారి ఆకలి తీర్చేందుకు ప్రభుత్వాలు అనేక విధాలుగా కృషి చేస్తున్న అవి కొంత మంది వరకు మాత్రమే చేరుతున్నాయి. ఇంకా చాలా మంది ఖాళీ కడుపులతో ఆహారం ఎవరు పెడతారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అటువంటి వారిని ఆదుకునేందుకు చాలా స్వచ్ఛంధ సంస్థలతో పాటు అనేక మంది సామాన్యులు సైతం ముందుకు వచ్చి చేయూతనందిస్తున్నారు. (వాళ్లు కూడా మనవాళ్లే) చిత్తూరు జిల్లా బాధలవాళ్ళం గ్రామానికి చెందిన రమణ తమ గ్రామంలో నిరుపేదలకు, రోజు వారీ కూలీ చేసుకునే వారికి, వలస కూలీలకు కూరగాయలు, నిత్యవసర సరుకులు అందించి మానవత్వాన్ని చాటుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. లాక్‌డౌన్‌ను కేంద్రం మే 3 వరకు ప్రకటిస్తే తెలంగాణ సర్కార్ మాత్రం మే7 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిలో డాక్టర్లు, పోలీసులు ముందు వరుసలో ఉంటారు. ఈ నేపథ్యంలోనే అనురాగ సంస్థ ప్రతినిధి రామ్ రాచకొండ డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీసు రక్షిత మూర్తికి 100 శానిటైజర్ బాటిళ్లు, 250 మాస్క్‌లను అందించారు. వీటితో పాటు అనురాగ్ సంస్థ కాప్రా, రాచకొండ ప్రాంతాల్లోని పేదలకు నిత్యవసర సరుకులు, అహారాన్ని అందిస్తోన్నారు. (సాయం అందిస్తున్న హెల్పింగ్ హాండ్స్) బెంగుళూరు వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ టీం వారు కడప జిల్లా రైల్వే కోడూర్ నియోజక వర్గంలో లాక్డౌన్ కారణంగా పూట గడవక ఇబ్బంది పడుతున్న దాదాపు 3000 కుటుంబాలకి నిత్యవసర సరుకులు,పప్పులు,కూరగాయలు సాయం చేసి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్‌రెడ్డి, చంద్ర పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కొవ్వూరులో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు శ్రీహరి సాయాన్ని అందించారు. 250 మంది పేదలకు ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చారు. విజ్ఞేశ్వర పురంలోని ఎస్సీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మీరు కూడా లాక్డౌన్ కాలంలో పనులు లేక పూటగడవక ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేస్తుంటే ఆ వివరాలు మాకు తెలియజేయండి. మీరు చేసే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో మందిలో స్ఫూర్తి నింపవచ్చు. webeditor@sakshi.com కి మీ వివరాలు పంపించండి. -
వాళ్లు కూడా మనవాళ్లే
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం... వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఎందరినో ఎంతో కాలంగా తన అక్కున చేర్చుకొని ఆశ్రయాన్ని, ఉపాధిని ఇస్తోంది. దేశ విదేశాల నుంచి ఎందరో ఇక్కడికి పొట్టకూటి కోసం వస్తూనే ఉంటారు. బీహార్, ఉత్తరప్రదేశ్, బెంగాల్ నుంచి వచ్చిన ఎందరో వస్త్ర కళాకారులకు హైదరాబాద్ దశాబ్ధాలుగా ఆశ్రయాన్ని ఇస్తోంది. హైదరాబాద్ వస్త్ర పరిశ్రమ దాదాపు వీరి మీదే ఎక్కువ శాతం ఆధారపడి ఉంది. అందమైన డిజైన్లతో బట్టలు తయారు చేసి భాగ్యనగరంలో ప్రజలకు ఎప్పటికప్పుడు కొత్త మెరుగులు అందిస్తూ ఉంటారు. అయితే లాక్డౌన్ కారణంగా ఇప్పుడు పనిలేక వారి పరిస్థితి దయనీయంగా మారింది. పూట గడవక రోజుకు ఒక్కపూట కూడ తిండి దొరకక విలవిలలాడుతున్నారు. అండగా నిలిచే ఆపన్న హస్తాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. (కష్టంలో తోడుగా కామన్‌మ్యాన్) వారికి చేయూతనందించేందుకు ముగ్గురు స్నేహితులు ముందుకొచ్చారు. వారికి నిత్యవసర సరుకులు, ఆహారాన్ని అందిస్తు వారి ఆకలి తీరుస్తున్నారు. ప్రతి రోజు 1500ల మందికి పైగా కార్మికులకు, రోజువారీ కూలీలకు అన్నదానం చేస్తున్నారు. వారికి సేవకు కుటుంబ సభ్యలు, స్నేహితులు అండగా నిలవడంతో లాక్డౌన్ విధించిన నాటి నుంచి వారికి నిత్యం ఆహారాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్ సంస్కృతిలో భాగంగా మారిపోయిన వివిధ రాష్ట్రాల వారిని కూడా సోదర భావంతో దగ్గరకు తీసుకొని కష్టంలో తోడుగా నిలుస్తున్న వారికి మీరు కూడా సాయాన్ని అందించాలంటే ఈ నెంబర్‌కి 9963009009 (సింధూరిక) జీపే/పేటీఎమ్ కానీ చేయండి. మనం అందంగా కనిపించడానికి వాళ్లు చాలా కష్టపడి బట్టలు తయారు చేస్తారు. మరి వాళ్లు బతకడానికి మనం సాయం చేయాల్సిన సమయం ఇది. మనకి తోచినంత సాయాన్ని చేసి మనం వాళ్లని ఆకలి నుంచి కాపాడగలం కదా. వెంటనే మీకు తోచిన సాయం చేసి వారికి అండగా నిలవండి. మానవత్వాన్ని చాటుకోవల్సిన సమయం ఇది. తోటి వారికి తోడుగా నిలవాల్సిన గడ్డుకాలం ఇది. ఆలోచించండి. సాయం చేయండి. (కరోనాపై పోరాటంలో మీరు చేయి కలపండి) -
ఆపన్న హస్తాలు
కరోనా విజృంభించడంతో భారతప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించింది. మొదట ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించినప్పటికి తరువాత దానిని మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానిమోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అనేక మంది నిరుపేదలు, రోజువారీ కూలీలు, దినసరి కూలీలు ఉపాధి కోల్పొయారు. రోజుకు ఒక్కపూట కూడా ఆహారం దొరకక అలమటిస్తోన్నారు. సాయం అందించే వారి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి ప్రభుత్వాలు సాయం చేస్తున్నా అది కొందరికే సరిపోతుంది. అందుకే అటువంటి వారిని ఆదుకొని ఆహారాన్ని అందించడానికి చాలా స్వచ్ఛంధ సంస్ధలతో పాటు సామాన్యులు సైతం ముందుకు వస్తున్నారు. (కష్టంలో తోడుగా కామన్‌మ్యాన్) నల్గొండజిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామంలో పేదలకు కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ ప్రారంభించగా , తాటి సత్యపాల్, మాజీ సర్ఫంచ్ రాము అంజయ్య యాదవ్. సలీం పాషా, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు గండికోట యాదగిరి, బొల్లం రవి పాల్గొన్నారు. దీంతో పాటు నిడమనూరు మండలం ముప్పారం గ్రామంలో కూడా బొల్లం రవి నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేసి పెద్ద మనసు చాటుకున్నారు. (సాయం అందిస్తున్న హెల్పింగ్ హాండ్స్) రమణీయ ఎన్ క్లేవ్ ఫ్లాట్ ఓనర్స్ అసిసియేషన్ అధ్యక్షులు సునీల్ మిశ్రా,ఉపాధ్యక్షులు రామచంద్రారెడ్డి, సభ్యుల ఆధ్వర్యంలో 600 మందికి పైగా వెజ్ బిర్యానీ, బటర్ మిల్క్, మంచినీళ్ళ ప్యాకెట్లు తయారుచేసి ఇస్నాపూర్. ముత్తంగి జాతీయ రహదారిపై నిరుపేదలకు పంపిణీ చేశారు. ముత్తంగి చర్చి, ఇస్నాపూర్ చౌరస్తాలో పేదల గుడిసెల వద్దకు వెళ్లి అసోసియేషన్ సభ్యులు ఆహార ప్యాకెట్లు అందజేశారు.. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు రాచప్ప, మోహనలాల్, శివారెడ్డి, నరేందర్, వీరభద్రాచారి, నర్సింహాచారి, జోసెఫ్, పాల్, సంజీవ, అభిజిత్, రవికిరణ్. సత్యనారాయణరాజు, కాలనీ యూత్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టనర్స్ ఇన్ ప్రస్పరిటి ఎన్జీవో సంస్థ చింతల్ పల్లిలో 500 నిత్యవసర సరుకుల కిట్లను పంపిణీ చేసి ఔదార్యాన్ని చాటుకుంది. కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలవడానికి ఒక్కొక్క కిట్‌లో 5 కేజీల బియ్యం, ఒక కేజీ పప్పు, అర లీటరు ఆయిల్, ఐదు రకాల కూరగాయలను అందించారు. కాఫీ రైతులకు, రోజు వారి కూలీలకు సాయాన్ని అందించి చేయూతనందించారు. మీరు కూడా మీరు చేస్తున్న సేవ కార్యక్రమాలను సాక్షి.కామ్ ద్వారా నలుగురికి తెలియజేసి వారిలో స్ఫూర్తి నింపాలనుకుంటే webeditor@sakshi.com కి వివరాలు పంపించండి. -
సీఎం సహాయనిధికి శివానీ, శివాత్మికా విరాళం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ (కోవిడ్ –19) నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం టాలీవుడ్ ప్రముఖులు తమవంతు సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హీరో రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రెండు లక్షలు విరాళంగా ఇచ్చారు. 'దొరసాని' సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైన శివాత్మిక పుట్టినరోజు (ఏప్రిల్ 22) సందర్భంగా ఇవాళ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి ...విరాళం చెక్‌ను అందించారు. (అన్నయ్యా.. వదినకు చాన్స్ ఇస్తున్నవా? ) అనంతరం శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చక్కటి చర్యలు తీసుకుంటున్నాయి. మా వంతుగా వీలైనంత సహాయం చేయాలని ముందుకొచ్చాం. ప్రజలందరూ తమ తమ ఇళ్లకు పరిమితమై, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాము. స్టే హోమ్. స్టే సేఫ్’ అని అన్నారు. ఆ సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఉన్నారు. (సీఎం సహాయ నిధికి రూ.4.70 కోట్ల విరాళం) -
భారీ విరాళం ప్రకటించిన భారత్ యూనివర్శిటీ
చెన్నై: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్ని కలవరపెడుతోంది. ఈ మహమ్మారి కారణంగా ఇంతక ముందు ఎన్నడు ఎదుర్కోని సంక్షోభాన్ని అన్నిదేశాలు ఎదుర్కొంటున్నాయి. కరోనా భారత్‌లోకి కూడా ప్రవేశించడంతో దానిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. తొలుత ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ అని ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ ఆ తరువాత దానిని మే3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దినసరి కూలీలు, వలస కూలీలు, నిరాశ్రయుల ఆర్థిక పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో వారిని ఆదుకునేందుకు కొన్ని వాణిజ్య సంస్థలు, సామాన్య ప్రజలు సైతం ముందుకు వస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటించి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. (కరోనా : సీఎం సహాయనిధికి విరాళాలు) ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెన్నైలోని భారత్ యూనివర్సిటీ రూ. 10 లక్షల విరాళం ప్రకటించింది. కరోనా కష్టకాలంలో భారత్ యూనివర్సిటీ డీన్, అడ్మిషన్ మార్కెటింగ్ డైరెక్టర్ యం. రాజశేఖర్ రెడ్డి అండ్ టీమ్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షల విరాళాన్ని అందచేయనున్నామని ప్రకటించారు. రూ. 5 లక్షలు తెలంగాణకు, రూ. 5లక్షలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్నామని వారు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు సేఫ్‌గా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క యూనివర్సిటిలో చాలామంది తెలుగు విద్యార్ధులు చదువుతున్నారని, ఆ యూనివర్శిటిలు, కాలేజీలు కూడా తెలుగు విద్యార్థుల కోసం తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తమకు తోచిన విధంగా ఎంతో కొంత సాయం చేయాలని ఆయా కాలేజీల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు లాక్‌డౌన్‌ను పాటిస్తూ కరోనా కాలంలో ఎంతో కొంత సహాయం అందించాలని ఆయన రాజశేఖర్ రెడ్డి సూచించారు. (కరోనా : విరాళాలు ప్రకటించిన కంపెనీలు) -
కష్టంలో తోడుగా కామన్‌మ్యాన్
కరోనా కోరల్లో చిక్కుకొని ప్రతి ఒక్కరు విలవిలలాడుతున్నారు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితం కావడంతో పనులు లేక రోజువారీ కూలీలు, పేదల పరిస్థితి దుర్భరంగా మారింది. రోజూ కూలీ చేస్తే కానీ పూటగడవని వారి జీవితాలు లాక్డౌన్ కారణంగా చిన్నభిన్నమవుతున్నాయి. ఇక వలస కార్మికుల పరిస్థితి ఇంకా దయనీయంగా మారింది. సొంత ఊరికి వెళ్లలేక ఉన్నచోట ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. చేయూతనందిచే వారి కోసం వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. దీంతో చాలా మంది సామాన్యులు సైతం తమకి తోచినంత సాయం చేస్తూ వారికి అండగా నిలబడుతున్నారు. (వలస కార్మికులకు వీహెచ్‌పీ చేయూత) కృష్ణా జిల్లా చాట్రాయి మండలం నరసింహారావు పాలెంలో హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న హరగోవింద్ ఖొరానా రెడ్డి 1100 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రతి కుటుంబానికి 10 కేజీల బియ్యం, రెండు కేజీల కూరగాయలు, ఆయిల్ ప్యాకెట్, పండ్లు అందజేశారు. అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే డా సిద్ధారెడ్డి గారి పిలుపు మేరకు రాచవారిపల్లి తాండాలో పేద ప్రజలకు గ్రామ ఎంప్లాయీస్, పట్నం యమ్‌పీటీసీ అభ్యర్థి బి.ఆనంద్ నాయక్ ఆధ్వర్యంలో 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం చేశారు. (సేవ సైనికులు) కరోనా కారణగా ఇంటికే పరిమితమయ్యి పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదకుటుంబాలకు బెల్లంపల్లిలో ఆర్ శ్రీనివాస్ తన బృందంతో కలిసి నిత్యవసర సరుకులు అందించి అండగా నిలిచారు. అలహాబాద్ బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ వారు వరంగల్ కరీమాబాద్‌లో ఉంటున్న పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కాశీ విశ్వనాధ్, రమాదేవి, దామోదర్, శ్రీనివాస్, శివ, ప్రసన్నకుమార్ పాల్లొన్నారు. ప్రతి కుటుంబానికి రెండు కేజీల బియ్యం, అరకిలో నూనె, ఒక కిలో పప్పు అందించారు. మీరు కూడా ఇలా మీరు చేస్తున్న సాయాన్ని పదిమందికి తెలిపి వారిలో స్ఫూర్తి నింపాలి అనుకుంటే Webeditor@sakshi.comకి మీరు చేస్తున్న సేవ కార్యక్రమాల వివరాలు పంపండి. -
మేము సైతం
సాక్షి, హైదరాబాద్: కరోనా... ప్రస్తుతం ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న పేరు ఇది. కేవలం చిన్న దేశాలే కాదు అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని గజగజ వణికిపోతుంది. కంటికి కనిపించని ఈ వైరస్ దాటికి ఏ యుద్దంలోనూ చనిపోనంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అణువంత కూడా లేని ఈ కరోనా అణుబాంబు కంటే ఎక్కువ భయాన్ని కలిగిస్తోంది. ఈ మహమ్మారి విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలు దాదాపు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే అధిక జనాభా కలిగిన మనదేశంలో ఈ మహమ్మారి ఒక్కసారి విజృంభిస్తే పరిస్థితులు చేజారిపోయే అవకాశాలు ఉన్నాయని భావించిన భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో ఎక్కడి వారు అక్కడే ఇళ్లకు పరిమితమయ్యారు. చాలా మంది ఉపాధి కోల్పొయి దిక్కులేక ఒక్కపూట కూడా గడవక ఇబ్బంది పడుతున్నారు. ఇక దినసరి కూలీలు, వలస కూలీల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారింది. పనికి వెళితే కాని పూట గడవని వీరు కుటుంబంతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి దాపురించింది. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు కొన్ని పథకాలు అమలు చేస్తున్నా అవి కొంతవరకు మాత్రమే సరిపోతున్నాయి. అయితే ఇటువంటి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు అనేక స్వచ్ఛంధసంస్థలు, సామాన్యలు సైతం ముందుకు వచ్చి వారికి తోచిన సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. (సేవ సైనికులు) హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ చైతన్యపురి, సాయిబాబా కాలనీ కి చెందిన శ్రీ భవాని ఫ్రెండ్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పొయిన వారికి కరోనా కష్టకాలంలో అండగా నిలుస్తోంది. అసోసియేషన్ సభ్యులైన అల్లపి ఆనంద్ రావు, అంబటి లోహిత్ భార్గవ్, నీలా మణిదీప్, పల్స దినేశ్, మాసిపెద్ది వంశీ క్రిష్న, శ్రీకర్ విశ్వనాధుల, గోకుల్ కృష్ణ మూర్తి తదితరులు వారి కుటుంబ సభ్యులు, సాయిబాబా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహకారంతో రోజు వారి కూలీ చేసుకునే కుటుంబాలకు సాయం అందిస్తున్నారు. ఒక్కొ కుటుంబానికి గత మూడు వారాలుగా నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా డ్యూటీలో ఉన్న పోలీసు వారికి, పురపాలక కార్మికులకు వాటర్ బాటిల్స్, మజ్జిగ, టిఫిన్, బ్రెడ్, బిస్కెట్లు పంచుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అంతే కాకుండా దిల్సుఖ్నగర్ పరిధిలోని వలస కార్మికులకు ప్రతి రోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఉపాధి కోల్పొయిన కొన్ని కుటుంబాలకు నెలకు సరిపడ కిరాణ సామాగ్రి, బియ్యం బ్యాగులు అందించి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. శ్రీ భవాని ఫ్రెండ్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ 2016 నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమందికి తోడుగా నిలుస్తోంది. -
సీఎం సహాయ నిధికి వాణిజ్య సంఘాల విరాళాలు
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నందున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో దినసరి కూలీలు, వలస కూలీలు, నిరాశ్రయుల ఆర్థిక పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో వారిని ఆదుకునేందుకు కొన్ని వాణిజ్య సంస్థలు, సామాన్య ప్రజలు సైతం ముందుకు వస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటించి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తరపున సోమవారం సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ చెక్కును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఎమ్మెల్యే వెంకటేష్ గౌడల ఆధ్వర్యంలో.. డీసీసీబీ ఛైర్ పర్సన్ మొగసాల రెడ్డమ్మ, మొగసాల కృష్ణమూర్తిలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి క్యాంపు కార్యాలయంలో ఆందజేశారు. (నెగిటివ్ అని తేలిన కరోనా మళ్లీ ఎందుకు వస్తుందంటే...) అంతేగాక శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వర్తక వాణిజ్య సంఘాల, ప్రజల తరపున రూ. 53, 3,343 రూపాలయలను పలాస ఎమ్మెల్యే సీదిరిర అప్పలరాజు ఆధ్వర్యంలో బడగల బాలచంద్రుడు, టి. సురేంద్ర, కృష్ణారెడ్డిలు సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌కు చెక్కును అందించారు. ఇక గుంటూరు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంఘం వారు రూ. 25 లక్షలను సీఎం సహానిధికి కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా విరాళం ప్రకటింది. దీనికి సంబంధించిన చెక్కును డిప్యూటీ స్పికర్ కోనా రఘుపతి అధ్వర్యంలో అసోషీయేషన్ అధ్యక్షుడు వి. భాస్కరరావు సెక్రటరీ వి.వి రత్న గుప్త సీఎం జగన్‌కు క్యాంపు కార్యాలయంలో అందజేశారు. (కష్టాల్లో ఉన్నా.. పథకాల్లో ముందుకే : వైఎస్ జగన్) -
మేడిపల్లి వినయ్ రెడ్డి దాతృత్వం
-
సేవ సైనికులు
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు కరోనా. కరోనా కారణంగా కేవలం ఏ ఒక్క దేశమో, రెండు దేశాలో మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొవడంలేదు. ప్రతి మనిషి కష్టాలను ఎదుర్కొంటున్నారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విభృంజించడంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించింది. దీంతో చాలా మంది రోజువారి కార్మికులు, దినసరి కూలీలు, నిరాశ్రయులు, నిరుపేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో వారిని ఆదుకునేందుకు స్వచ్చంధ సంస్థలతో పాటు సామాన్యలు సైతం తమ వంతుగా సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాము అందించే చిన్న సాయం కొందరి బతుకుల్లో అయిన వెలుగునింపితే చాలని అన్నార్థులకు అండగా నిలుస్తున్నారు. (వెల్లివిరుస్తున్న మానవత్వం) ముస్లిం మైనారిటీ ట్రస్ట్ ఆధ్వర్యం లో పదమూడు రోజుల నుంచి రామగుండం నియోజకవర్గ పేద ప్రజలకు,వలసకార్మికులకు నిత్య అన్నదానం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని షేక్ నసీరుద్దీన్, షేక్ ఖలీద్ పాషా, మహ్మాద్ ముస్తఫా దగ్గరుండి నిర్వహిస్తున్నారు. ఈ కష్ట కాలంలో ఎందరో ఆకలి తీరుస్తున్నారు. (లాక్డౌన్ : నలుగురికి స్పూర్తిగా) హైదరాబాద్ అనురాగ్ సంస్ధ ఆధ్వర్యంలో వికలాంగుల కోసం సేకరిస్తున్న విరాళాల కార్యక్రమానకి రామాంజనేయులు, ఆయన కుటుంబం తమకు తోచిన సాయం అందించి సేవ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. విశాఖపట్నానికి చెందిన యారబాటి శ్రీనువాసురావు, (బ్యాంక్ శ్రీను) అల్లిపురం 34 వ వార్డ్‌లో పూట గడవక ఇబ్బంది పడుతున్న పేదలక నిత్యవసర సరుకులు ఉచితంగా అందించి పెద్ద మనసు చాటుకున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన మెరుపుల అవతారం కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు తన సొంత డబ్బులు 70 వేలు వెచ్చించి 900 కుటుంబాలకు ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున వివిధ రకాల కూరగాయలను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. -
సాయం అందిస్తున్న హెల్పింగ్ హాండ్స్
సాక్షి, విజయవాడ: కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో ఎక్కడి కార్యకలాపాలు అక్కడ నిలిచిపోయాయి. దీంతో చాలా మంది నిరాశ్రయులకు,పేదలకు పూట గడవక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు కూడా దాతలు లేక దీనంగా సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. లాక్డౌన్ సమయంలో అనాధ బాలలు, వృద్ధుల పరిస్థితి మరింత దిగజారింది. సాయం చేసే వారు లేక ఆహారం దొరకక విలవిలలాడుతున్నారు. అలాంటి వారికి అండగా పలు స్వచ్ఛంధ సంస్థలు, చారిటబుల్ ట్రస్ట్‌లు, సామాన్యలు సైతం తమకు తోచినంత సాయం చేస్తూ ఆదుకుంటున్నాయి. గత 9 సంవత్సరాలుగా అనేక మంది సాయాన్ని అందిస్తున్న ఇండియన్ హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ లాక్డౌన్ కాలంలో వృద్ధులకు తమ సహాయ సహకారాలను అందిస్తోంది. చిన్నారులకు ఆహారం, విద్య అందిస్తోంది. ఎంతో మంది వృద్ధులను అక్కున చేర్చుకొని ఆదరిస్తోంది. 2011 నుంచి సేవలు అందిస్తున్న ఈ ట్రస్ట్ లాక్డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అన్ని విధాల అండగా నిలబడుతుంది. వృద్ధులకు మూడు నెలలకు సరిపడా ఆహారధాన్యాలను, నిత్యవసర సరుకులను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. -
భారత కార్మికులకు సాయంగా ఐఎస్సీ సంఘం
అబుదాబి: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు పలు దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. యూఏఈలో కూడా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో జీవనోపాధి కోసం వెళ్లిన భారతీయుల ఆర్థిక పరిస్థితి అస్థవ్యస్థమంగా మారింది. వారు పని చేసే చోట యాజమాన్యం వేతనాలు చెల్లించకపోవడంతో వారి బతుకుతెరువు ప్రశ్నార్థకంగా మారింది. ఇక అక్కడి మన భారత వలస కూలీలను ఆదుకునేందుకు తాము ఉన్నామంటూ అబుదాబిలోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ (ఐఎస్సీ) వారు ముందుకు వచ్చారు. (నిరుపేదలకు చేయూతగా నిలిచిన జీవీఎంసీ) ఈ సంస్థ గత 52 సంవత్సరాలుగా యూఏఈలోని మన తెలుగువారికి ఎన్నో విధాలుగా సేవలందిస్తోంది. ఇక కోవిడ్-19 నేపథ్యంలో అక్కడి తెలుగు వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కొక్కరికి 3 వారాలకు సరిపడే విధంగా వంట సామగ్రిని అందించింది. పరిస్థితులు మెరుగయ్యే వరకు కార్మికులను ఆదుకుంటామని ఈ కార్యక్రమానికి ముఖ్యదాతగా వ్యవహరిస్తున్న లూలూ గ్రూప్ అధినేత అజిత్ జాన్సన్ తెలియజేశారు. ఈ విపత్కర పరిస్థితుల నుండి బయటపడే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఐఎస్సీ సంస్థ అధ్యక్షుడు యోగేష్ చెప్పారు. ఇవే కాకుండా అన్ని కార్మిక గృహాలలో ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లతో పాటు చేతి గ్లౌజులను కూడా అందజేస్తున్నామని సంఘం సంక్షేమ కార్యదర్శి రాజా శ్రీనివాస రావు పేర్కొన్నారు. యూఏఈలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత అధికంగా ఉండటంతో ఇక్కడి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా తమ సంఘం తరపున ఐసోలేషన్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేశామని సంఘ కోశాధికారి షజీల్, కార్యదర్శి జయప్రదీప్ చెప్పారు. -
నిరుపేదలకు చేయూతగా నిలిచిన జీవీఎంసీ
సాక్షి, వైజాగ్: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలన్నింటిని గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా కోరల్లో చిక్కుకొని విలవిలాడిపోతుంది. ఈ మహమ్మారి కట్టడికి చాలా దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. భారత్‌లో కూడా మొదట ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్డౌన్ విధించగా దానిని మే 3 వరకు పొడిగించారు. దీంతో మన తోటి మనుషులు ఎంతో మంది రోజుకు ఒక్క పూట కూడా ఆహారం దొరకక పస్తులు ఉంటున్నారు. లాక్‌డౌన్‌కి ముందు కష్టం చేసుకొని స్వశక్తితో బతికిన ఎంతో మంది వలసకూలీలు, దినసరి కూలీలు, నిరుపేదలు ఆకలితో నీళ్లు తాగి పడుకునే దుస్థితి దాపురించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను, వలస కూలీలను ఆదుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. దీనికి తోడు అనేక స్వచ్ఛంధ సంస్థలు, సామాన్యులు సైతం ఈ సమయంలో ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. పేదలకు నిత్యవసర సరుకులు, ఆహారాన్ని అందిస్తున్నారు. అలా సాయం చేస్తున్న వారు సాక్షి.కామ్ ద్వారా వాళ్ల సేవ కార్యక్రమాన్ని తెలిపి మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. (విజయవాడలో పేదలకు అండగా రేడియో గ్రూప్) విశాఖపట్నానికి చెందిన జీవీఎంసీ స్వచ్చంధ సంస్థ నగరంలో, పరిసర ప్రాంతాల్లో ఉంటున్న పేదలకు, నిరాశ్రయులకు పండ్లు, నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తూ వారికి అండగా నిలుస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో అభాగ్యులకు బాసటగా నిలిచి మానవత్వాన్ని నిరూపించుకుంటున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. మీరు కూడా మీ సేవ కార్యక్రమాలు సాక్షి.కామ్ ద్వారా తెలియజేయాలి అనుకుంటే webeditor@sakshi.com కి మీ వివరాలు పంపించండి. (వలస కార్మికులకు వీహెచ్‌పీ చేయూత) ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 22,40,191 మంది కరోనా బారిన పడగా 1,53,822 మంది మరణించారు. ఇక భారతదేశం విషయానికి వస్తే 13,835 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,767 మంది రికవరీ అయ్యారు, 452 మంది మరణించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 766కుపైగా కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 534 కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి (కరోనాపై పోరాటంలో మీరు చేయి కలపండి) -
విజయవాడలో పేదలకు అండగా రేడియో గ్రూప్
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్‌ని కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ను విధించడంతో చాలా మంది ఆహారం అందక పూట గడవక ఇబ్బంది పడుతున్నారు. అది వరకు పనులు చేసుకొని స్వశక్తితో బతికిన వారు ఇప్పుడు సాయం అందించే వారికి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రోజులో కనీసం ఒకపూట కూడా తిండిలేక కన్నీళ్లతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు దేశంలో కరోనా మహమ్మారి మరింత విజృంభించడంతో భారత ప్రభుత్వం లాక్డౌన్ మే3 వరకు పొడిగించింది. దీంతో నిరుపేదలు, వలసకూలీలు, నిరాశ్రయుల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. అలాంటి నిర్భాగ్యులను ఆదుకోవడానికి చాలా స్వచ్ఛంధ సంస్థలు ముందుకొచ్చి అండగా నిలబడుతున్నాయి. (మానవ సేవే మాధవ సేవమానవ సేవే మాధవ సేవ) విజయవాడకు చెందిన అమెచ్యూర్ రేడియో-హామ్ రేడియో గ్రూప్ సభ్యులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటూ ఉపాధి కోల్పోయి పస్తులు ఉంటున్న వలసకార్మికులకు, పేదలకు, అనాధలకు, అదేవిధంగా శానిటరీ వర్కర్స్‌కి నిత్యవసర సరుకులు, భోజనం ప్యాకెట్లను పంపిణి చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. మీరు కూడా ఇలాంటి సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాటిని సాక్షి.కామ్‌తో పంచుకోవడం ద్వారా మరికొందరిలో స్ఫూర్తి నింపండి. మీరు వివరాలు పంపించాల్సిన మెయిల్ ఐడీ webeditor@sakshi.com. (వెల్లివిరుస్తున్న మానవత్వం) ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 22,40,191 మంది కరోనా బారిన పడగా 1,53,822 మంది మరణించారు. ఇక భారతదేశం విషయానికి వస్తే 13,835 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 1,767 మంది రికవరీ అయ్యారు, 452 మంది మరణించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 766కుపైగా కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 534 కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆపన్నహస్తం అందిస్తున్న అభయం పౌండేషన్ -
వలస కార్మికులకు వీహెచ్‌పీ చేయూత
సాక్షి, హైదరాబాద్: కరోనాను కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. దీంతో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. రోజువారి జరిగే కార్యకలాపాలు అన్ని ఆగిపోయాయి. దీంతో పేదలు, నిరాశ్రయులు, వలస కూలీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేసే వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. లాక్డౌన్ విధించడంతో బస్సులు, రైళ్లు లేక సొంత ఊర్లకు వెళ్లలేక ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. వారందరూ పనిలేక, డబ్బులు లేక, ఆశ్రయం లేక ప్రతి రోజు పస్తులు ఉంటున్నారు. వారిని ఆదుకునేందుకు చాలా స్వచ్ఛంధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. (లాక్డౌన్లో వినూత్న కార్యక్రమం) హైదరాబాద్ మసీదుబండలో నిర్మిస్తున్న మై హోమ్ కన్స్ట్రక్షన్స్ దగ్గర పని చేస్తున్న బెంగాల్, అస్సాం వలస కార్మికులకు విశ్వహిందూ పరిషత్ ఆహారాన్ని, నిత్యవసర సరుకులను అందించింది. దాదాపు 2000 మంది కార్మికుల వరకు ఇక్కడ చిక్కుకుపోయామంటూ విశ్వహిందూ పరిషత్‌కు కొంతమంది ఫోన్ చేశారు. దీనిపై స్పందించిన ఢిల్లీ విశ్వహిందూ పరిషత్ హైదరాబాద్‌లోని తమ సభ్యులను వెంటనే అక్కడికి వెళ్లి వారికి సాయాన్ని అందించాలని ఆదేశించింది. వారు వెంటనే కార్మికులు ఉంటున్న ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని చూసి వారికి ఆహారపు పొట్లాలను, నిత్యవసర సరుకులను అందించారు. లాక్డౌన్ ఎత్తివేసే వరకు తాము సాయం అందిస్తామని, లాక్డౌన్ కారణంగా ఏ ఒక్కరు పస్తులు ఉండటానికి వీల్లేదని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి శ్రీ రాఘవులు అన్నారు. దినసరి కూలీలు, పేదలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ లో పని చేసుకునే వలస కూలీలు ఎవరికి ఏ ఆపద వచ్చినా అన్నం పెట్టేందుకు విశ్వహిందూ పరిషత్ ఎల్లవేళలా ముందు ఉంటుందని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేస్తే ఎప్పుడైనా తాము సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. లాక్డౌన్ కొనసాగుతుందని ప్రధాని మోదీ ప్రకటించడంతో రెండో విడతలో మొదటిరోజైన ఏప్రిల్ 15న విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం నుంచి 11 క్వింటాళ్ల బియ్యం, రెండు క్వింటాళ్ల పప్పు పంపిణీ చేశారు. రెండో విడతలో మొదటిరోజు కోటి, బషీర్ బాగ్, ఫిల్మ్ నగర్, ఎల్బీనగర్ ప్రాంతాలలో సరుకులు అందజేశారు. (కరోనాపై పోరాటంలో మీరు చేయి కలపండి) విశ్వహిందూ పరిషత్ హెల్ప్‌లైన్ నంబర్‌కు వస్తున్న కాల్స్ ఆధారంగా సరుకులు అందజేస్తున్నామని రాఘవులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ జాతీయ కార్యదర్శి సత్యం, రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి , కార్యదర్శి బండారి రమేష్, క్షేత్ర సామాజిక సమరసతా ప్రముఖ్ భాస్కర్ , రాష్ట్ర సహ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి , ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కోకన్వీనర్ శివ రాములు పాల్గొన్నారు. (మానవత్వం చాటుతున్న వన్ వే మిషన్) -
మానవత్వం చాటుతున్న వన్ వే మిషన్
సాక్షి, విజయవాడ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తూ దేశాలన్నింటిని వణికిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని విలవిలలాడిపోతుంది. కరోనా వైరస్ ఇండియాకు కూడా రావడంతో దాని వ్యాప్తిని అరికట్టడానికి మొదట్లోనే భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో ఎక్కడి కార్యకలాపాలు అక్కడ నిలిచిపోయాయి. ఉద్యోగులందరూ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. అయితే రోజు కూలీ చేసుకొని బతికే వారి పరిస్థితే దయనీయంగా మారింది. పూట గడవక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబం మొత్తం పస్తులు ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే వీరిని ఆదుకునేందుకు చాలా స్వచ్ఛంధ సంస్థలు ముందుకు వచ్చి వాటికి తోచిన సహాయం చేస్తున్నాయి. (లాక్డౌన్ : నలుగురికి స్పూర్తిగా) లాక్డౌన్ మొదలైన రోజు నుంచి స్వచ్ఛంద సంస్థలైన బేతేలు మినిస్ట్రీస్ (విజయవాడ), ఉంగుటూరు మండలం పొట్టిపడు గ్రామానికి చెందిన వన్ వే మిషన్ సంయుక్తంగా విజయవాడ నగరంలో, ఉంగుటూరు మండలంలోని గ్రామల్లో అనేకమంది వలస కూలీలకు, పేదలకు భోజనాన్ని అందిస్తున్నారు. కృష్ణ జిల్లా ఉంగుటూరు మండలంలోని 17 గ్రామాలలో సుమారు 400 మంది వలస కూలీలకు రెండుపూటలా భోజనం అందిస్తున్నారు. సుమారు 1000 భోజన పాక్కెట్లు పంచడం జరుగుతోందని సంస్థ డైరెక్టర్లు శ్రీ కొడాలి జోయెల్, కోడాలి ప్రేమ్ తెలియచేశారు. ఇవే కాక గ్రామాలలో ఇంతవరకు 1200 కుటుంబాలకు కూరగాయలు, 100 మంది వృద్దులకు విటమిన్ మాత్రలు పంపిణీ చేయడం జరిగింది. బేతేలు, వన్ వే సంస్థలలో చదువుకున్న సుమారు 20 మంది విద్యార్థులు వాలంటీర్లగా ఎంతో శ్రమపడి భోజనం తయారు చేస్తున్నారని, రోజు 17 గ్రామాలు తిరిగి భోజనం సరఫరా చేస్తునందకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. (ఆదుకునేందుకు ఏకమయ్యారు!) చదవండి: ‘మాతృభూమి’ కోసం చేతనైన సాయం -
కరోనా : సంకల్పం ముందు ఏదైనా దిగదిడుపే
-
కరోనా : సంకల్పం ముందు ఏదైనా దిగదిడుపే
లండన్ : కరోనాతో ప్రపంచం గడగడలాడిపోతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ఆయా దేశాల్లోని సెలబ్రిటీలు, ప్రజలు తమ వంతుగా విరాళాలు అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బ్రిటన్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్‌లో నివాసముంటున్న 99 ఏండ్ల రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ టామ్ మూర్ (99) కరోనా బాధితులకు వైద్యం కోసం ఏదైనా సహాయం చేయాలని భావించారు. అయితే మూర్కు రెండేండ్ల క్రితమే తుంటి ఎముక విరిగిపోవటంతో వికలాంగులు వాడే ఊతకర్ర సాయంతో మాత్రమే నడువగలరు. అది కూడా పది పదిహేను అగుడు దూరం మాత్రమే. కానీ ఆయన సంకల్పం ముందు అతనికున్న వైకల్యం కూడా చిన్నబోయింది. తన నివాసం చుట్టూ 25 మీటర్ల దూరం ఏర్పరచుకున్న గార్డెన్లో 100 సార్లు నడవాలని నిశ్చయించుకున్నారు. అలా నడవమే గాక తన మిత్రులు, సన్నిహితులకు జాతీయ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) కోసం తోచినంత విరాళం చేయాలని కోరాడు. ఏప్రిల్ నెలలోనే ఆయన తన 100వ జన్మదినం జరుపుకోనున్న టామ్ మూర్ పుట్టిన రోజు నాటికి 100 రౌండ్లు తిరుగుతానని చాలెంజ్ చేశారు.(కరోనా; త్వరలోనే సాధారణ స్థితికి) తన గార్డెన్ ఏరియాలో రోజు నడుస్తూనే.. దాంతో వచ్చే విరాళాలను ఎన్హెచ్ఎస్కు అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆయన చేస్తున్న పని అక్కడి స్థానిక మీడియా దృష్టిలో పడటంతో పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. ప్రస్తుతం మూర్ పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. అంతేకాదు మూర్ చేస్తున్న పనిని మెచ్చి లక్షల మంది ఆయన ప్రారంభించిన నిధుల సేకరణకు విరాళాలు అందజేశారు. ఇప్పటివరకు మూర్కు 12 మిలియన్ పౌండ్లు( దాదాపు రూ. వంద కోట్లకు పైగా) విరాళాలు సమకూరాయి. మూర్కు ప్రమాదం జరిగినప్పుడు ఎన్హెచ్ఎస్ ఆయనకు ఎంతో సేవ చేసింది. ఆ సంస్థ చేసిన సేవలకు కృతజ్ఞతగా ఎన్హెచ్ఎస్కు ఏదో విధంగా సహాయపడాలనుకున్నారని మూర్ అల్లుడు కొలిన్ ఇన్‌గ్రామ్ తెలిపారు. ఇప్పుడు మూర్ 100వ జన్మదినం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుండడం విశేషం. (గూగుల్ ట్రెండింగ్స్‌లో మద్యం తయారీ) -
కరోనాపై పోరాటంలో మీరు చేయి కలపండి
కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో ఎంతో మంది వలసకూలీలు, రోజువారి కూలీలు, అనాధాశ్రమాల్లో ఉంటున్న చిన్నారులు, వికలాంగులు, వృద్దాశ్రమల్లో ఉంటున్న వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారింది. తినేందుకు తిండి దొరకక ఆకలితో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే వీరిని ఆదుకునేందుకు కేంద్రం పీఎం కేర్‌ను ఏర్పాటుచేయగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సీఎం కేర్‌ను ఏర్పాటు చేశాయి. వీటితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, సామాన్యులు సైతం ముందుకు వస్తున్నారు. మీరు కూడా సాయం అందించి ఈ సేవ కార్యక్రమాల్లో భాగం పంచుకోవాలంటే ఈ కింది తెలిపిన వివరాలు ఒకసారి పరిశీలించండి. పీఎం కేర్: దీని ద్వారా సేకరించిన విరాళాలను కేంద్రప్రభుత్వం కోవిడ్-19 పై పోరాటానికి ఉపయోగిస్తుందిం. https://www.pmindia.gov.in/en/about-pm-cares-fund/ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళాలు ఇవ్వాలనుకునే వారు ఈ లింక్ క్లిక్ చేయండి. https://apcmrf.ap.gov.in/ తెలంగాణ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం చేయాలనుకునే వారు ఈ కింది లింక్ ద్వారా మీ విరాళాలు అందజేయవచ్చు. https://telangana.gov.in/cm-relief-fund చిత్రిక: ఈ సంస్ధ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఉన్న రైతులకు, నేతన్నలకు, తెగల వారికి సాయాన్ని అందిస్తుంది. https://www.ketto.org/fundraiser/ChitrikaforCorona?payment=form కోవా నెట్వర్క్: హైదరాబాద్‌లో ఉన్న 10,000 పైగా వలస కార్మికులకు సహాయాన్ని అందిస్తుంది. http://www.covanetwork.org/collaborate/donate/ రాపిడ్ రెస్పాన్స్ : ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో ఉంటున్న రోజువారి కూలీలకు, గ్రామాల్లో ఉంటున్న వారికి అండగానిలిచి అందుకుంటుంది. వారికి ఆహారాన్ని అందిస్తుంది. https://www.rapidresponse.org.in/coronavirusrelief.html Account Name: Rapid Response Account Number: 50200002115108 IFSC Code: HDFC0001038 Account Type: Current Bank: HDFC Bank, Branch: Avadi యాక్షన్ ఎయిడ్: ఇండియాలో లక్షమందికి నిత్యసరుకులు, లేక ఆహారాన్ని అందిస్తుంది. భారతదేశంలో మొత్తం 18 స్టేట్స్, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో తన సేవలను అందిస్తూ ఎంతో మందిని ఆదుకుంటుంది. https://www.actionaidindia.org/SupportCOVID-hitFamilies/ ఉమెన్, ట్రాన్స్‌జెండర్ ఆర్గనైజేషన్ జాయింట్ యాక్షన్ కమిటి: హైదరాబాద్‌కు చెందిన ఈ కమిటి 200 పైగా ట్రాన్స్‌జెండర్ కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొకుండా లాక్డౌన్లో వారికి కొంత డబ్బులు ఇచ్చి సాయ పడుతుంది. https://www.ketto.org/fundraiser/help-the-hyderabad-transgender-community-during-covid-19-crisis?payment=form -
లాక్డౌన్ : నలుగురికి స్పూర్తిగా
‘చిన్నచేతులు’ పెద్దసాయం చేస్తున్నాయి మందులు ఇంటికే తెచ్చి ఇస్తున్న వైఏసీ మానవతా వజ్రాలు కురగాయలు, కిరణా సామాగ్రి పంపిణీ చేసిన అనురాగ్ సంస్థ వారందరికి భోజనాలు పంపిణి చేసిన రెడ్‌క్రాస్ పారిశద్ధ్య కార్మికులకు అండగా ‘ప్రగతి భారత్ ఫౌండేషన్’ మానవత్వాన్ని చాటుకుంటున్న ‘మాతృభూమి’ సవరం ట్రస్ట్ వారి సాయం మీ సేవకు మా సలాం -
ఆదుకునేందుకు ఏకమయ్యారు!
మునుగోడు: లాక్డౌన్ కారణంగా ఉపాధి దొరకక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని కుటుంబాలకైనా సాయం చేయాలనుకున్నారు మునుగోడు తహసీల్దార్ జి.దేశ్యా. తాను ఒక్కడినైతే కొద్దిమందికే చేయగలుగుతాను.. మరికొంతమంది తోడైతే చాలామందిని ఆదుకోవచ్చన్న ఆలోచనను స్థానిక ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులతో చర్చించారు. అందుకనుగుణంగా రెండు రోజులక్రితం ‘హెల్పింగ్ హ్యాండ్స్’ పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసి అందులో వారిని చేర్చారు. తన ఆలోచనను చెప్పి విరాళాలు ఆహ్వానించారు. 8 గంటలలోపే రూ.5 లక్షలకుపైగా పోగు తహసీల్దార్ ఏర్పాటుచేసిన ఈ వాట్సాప్ గ్రూపులో చేరిన సామాన్య ప్రజలు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు తమవంతు సహాయంగా రూ. 500 నుంచి రూ.లక్ష వరకు అందించారు. 8 గంటల వ్యవధిలోనే 112మంది రూ.5లక్షలకు పైగా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. మంగళవారం వరకు 152మంది విరాళాలు అందించగా రూ.6.50లక్షలు పోగయ్యాయి. ఆ నగదుతో మండలవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లోని 800 మంది అత్యంత పేద కుటుంబాలకు 15 రకాల నిత్యావసర వస్తువులను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పక్షపాతం చూపకుండా రెవెన్యూ అధికారులే చేస్తున్నారు. నిత్యావసరాలను బుధ లేదా గురువారం అందిస్తామని చెప్పారు. విషయం తెలిసిన చుట్టుపక్కల మండలాల ప్రజలు, అధికారులు తాము కూడా ఇదే పద్ధతిలో విరాళాలు అందజేసి పేదలకు అండగా ఉంటామని చెబుతున్నారు. పేదలకు చేతనైన సాయం చేయాలి లాక్‌డౌన్‌తో ఉపాధి లేక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారికి నా వంతు సహాయం అందించాలని నిర్ణయించుకున్నా. అందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు తోడై మద్దతు తెలిపారు. మొత్తం విరాళాలు సేకరించారు. వాటితో రెండు రోజుల్లో ప్రతి కుటుంబానికి రూ.వెయ్యి విలువగల నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేస్తాం. – జి.దేశ్యా, తహసీల్దార్, మునుగోడు -
మరువలేని సేవ చేస్తున్న ‘శ్రీసేవా’
సాక్షి, కరీంనగర్: కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో చాలా మంది నిరుపేదలు, వలస కార్మికలు, దినసరి కూలీలు, నిరాశ్రయులు అష్టకష్టాలు పడుతున్నారు. అయితే ఈ కష్టకాలంలో అనేక స్వచ్ఛందసంస్థలు, సామాన్యలు వారికి తోడుగా నిలబడుతున్నారు. వారి ఆకలిదప్పులు తీరుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో దినసరి కూలీలకు, నిరుపేదలకు శ్రీసేవా మార్గం స్వచ్చంద సేవా సంస్థ వారు ప్రతిరోజు ఏదో ఒక రకంగా సాయం చేస్తున్నారు. (‘మాతృభూమి’ కోసం చేతనైన సాయం’) శ్రీసేవా మార్గం వ్యవస్థాపకురాలు మునిపల్లి పణిత ఒక రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టగా, మరో రోజు పండ్లు పంచిపెట్టారు. ఇంకొరోజు రాగి జావాని చెట్లకింద ఉంటున్న నిరుపేదల వద్దకే వెళ్లి స్వయంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. ఇలా రోజుకు ఒక కార్యక్రమంతో ప్రజలకు అండగా నిలుస్తున్న పణిత ఒకరోజు మాస్క్‌లు, గ్లౌజ్‌లు కూడా పంచిపెట్టారు. అదేవిధంగా కరోనా కట్టడిలో ఎండలో పనిచేస్తున్న వారికి 400 మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. ఇదేవిధంగా లాక్డౌన్ ముగిసేవరకు ఏదోఒక సేవా కార్యక్రమంతో నిరుపేదలకు సాయం అందిస్తానని పణిత తెలిపారు. .ఈ కార్యక్రమంలో శ్రీ సేవ మార్గం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, వీరితో పాటు పోలీసు సిబ్బంది కూడా పాల్గొన్నారు. చదవండి: మందులు ఇంటికే తెచ్చి ఇస్తున్న వైఏసీ -
ఆపదలో ఆదుకుంటున్న ‘ఆరాధన’
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో ప్రార్థన మందిరాలన్ని( గుడి, చర్చి, మసీద్) మూసివేశారు. అందుకే ప్రతి ఒక్కరు తమ తోటి వారిలోనే భగవంతుడిని చూసుకుంటూ మానవసేవే మాధవ సేవ అంటూ తమ తోచిన సాయాన్ని చేస్తూ పక్కవారికి చేయూతనిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రన్ ఫర్ జీసస్ అవుట్ రీచ్ సందర్భంగా ఆరాధన టెలివిజన్ సౌజన్యంతో హైదరాబాద్ అన్నోజిగూడ , పెరాజీము క్రిస్టియన్ ప్రేయర్ హాల్ ఆధ్వర్యములో నిరుపేద కుటుంబాలకు ఆహారం పాకెట్లు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోచారం మునిసిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, కౌన్సిలర్స్ సాయిరెడ్డి, మెట్టు బాలిరెడ్డి, హేమ ఐలయ్య, సంఘపెద్దలు బి .ఆర్.డేవిడ్ సన్, జి.విక్టర్ ఇమ్మానుయేల్, ఇవాంజలిస్ట్ యం.జీవరాజు స్థానిక పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రొగ్రాం లో రాజీవ్ గృహకల్ప, వికలాంగుల కాలని, యామ్నాంపేట, అన్నోజిగూడ తదితర ప్రాంతాల్లోని దాదాపు వెయ్యి మంది పేదకుటుంబాలు, వలస కూలీలు, పోలీస్ సిబ్బంది, పారిశుద్య కార్మికులకు వెజిటబుల్ బిర్యాణి పోట్లాలు, అరటిపళ్లు అందజేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరు సామాజిక దూరం పాటించి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిర్వహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
సేవ మూర్తులు
కరోనా మహమ్మారికి ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా బలయ్యారు. అదేవిధంగా భారత్‌లో కూడా అనేక మంది మరణించారు. కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో దానిని కట్టడి చేయడానికి భారత ప్రధాని నరేంద్రమోదీ మొదట మూడువారాల పాటు లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 14 వరకు విధించారు. అయితే కరోనా కేసులు దేశంలో నానాటికి పెరిగిపోతుండటంతో అన్ని రాషష్టట్రాల విజ్ఞప్తి మేరకు కేంద్రం మే3 వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగించాలని నిర్ణయించినట్లు మోదీ ప్రకటించారు. అయితే లాక్డౌన్ కారణంగా చాలా మంది పేదవారు ఉపాధిని కోల్పొయారు. ఒక్కపూట భోజనం కూడా దొరకక ఇబ్బంది పడుతున్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నా... ఆ ఫలాలు కొందరికే అందుతున్నాయి. ప్రభుత్వాలతో పాటు సామాన్యులు కూడా తమకు చేతనైనంత సాయం చేస్తూ పేదవారి కడుపునింపుతున్నారు. కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలుస్తున్న కొంత మంది వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విజయవాడ కానూరు మదీనాలో ఉంటున్న అబ్దుల్ రహమాన్ కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తనకు తోచిన సాయాన్ని అందిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తన ఇంట్లో అద్దెకు ఉండేవారికి రెండు నెలల అద్దె మినహాయించారు. దాంతో పాటు తమ ఇంటికి చుట్టు పక్కల ఉండే పేదలకు కుటుంబ సభ్యులతో కలిసి నిత్యవసర సరుకులు పంచి పెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు. హనీ వెల్ టెక్నాలజీ సొల్యూషన్‌లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు చందనా నగర్లో ఉన్న అనాధాశ్రమానికి నిత్యవసర సరుకులు, బియ్యం అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఒంగోలు జిల్లా నల్లగండ్లకు చెందిన వెంకట రామకృష్ణ రెడ్డి తమ చుట్టు పక్కల ఉండే ప్రతి పేద కుటుంబానికి 25 కేజీల బియ్యం, ఒక కేజీ వంట నూనె, ఒక కిలో పప్పును అందించారు. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పొయి ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి అండగా నిలిచారు. గుంటూరు జిల్లా చల్లగుండ్ల అడ్డరోడ్డులో ఉంటున్న నాగార్జున తన ఇంటి చుట్టుపక్కల ఉండే పేదవారికి, నిరాశ్రయులకు, రోజు వారి కూలీలకు కూరగాయలు పంపిణీ చేసి వారికి తన వంతు సాయాన్ని అందించి దయ గుణాన్ని చాటుకున్నారు. -
పేదలకు అండగా సవరం ట్రస్ట్
కరోనా వైరస్‌ని కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ను విధించడంతో చాలా మంది ఆహారం అందక పూట గడవక ఇబ్బంది పడుతున్నారు. అది వరకు పనులు చేసుకొని స్వశక్తితో బతికిన వారు ఇప్పుడు సాయం అందించే వారికి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రోజులో కనీసం ఒకపూట కూడా తిండిలేక కన్నీళ్లతో కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి నిర్భాగ్యులను ఆదుకోవడానికి చాలా స్వచ్ఛంధ సంస్థలు ముందుకొచ్చి అండగా నిలబడుతున్నాయి. చదవండి: సామాన్యుల సాయం ఇందులో భాగంగానే కిషోర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సవరం చారిట్రబుల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్న వారికి అన్నదానం చేస్తున్నారు. దీంతోపాటు నిత్యవసర సరుకులు, కూరగాయాలు కూడా పంపిణీ చేస్తున్నారు. కొన్ని చోట్ల రోగనిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడేందుకు నారింజ, అరటి పండ్లను కూడా పంపిణీ చేస్తూ తమ ఉదారభావాన్ని చాటుకుంటూ కరోనా కష్టకాలంలో ఎందరికో అండగా నిలుస్తున్నారు. (కష్టంలో ఆదుకుంటున్న కామన్‌మ్యాన్) -
‘మాతృభూమి’ కోసం చేతనైన సాయం
సాక్షి, మహబూబ్‌నగర్: కరోనా వైరస్‌ని కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ను విధించడంతో చాలా మంది ఆహారం అందక పూట గడవక ఇబ్బంది పడుతున్నారు. అది వరకు పనులు చేసుకొని స్వశక్తితో బతికిన వారు ఇప్పుడు సాయం అందించే వారికి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. రోజులో కనీసం ఒకపూట కూడా తిండిలేక కన్నీళ్లతో కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి నిర్భాగ్యులను ఆదుకోవడానికి చాలా స్వచ్ఛంధ సంస్థలు ముందుకొచ్చి అండగా నిలబడుతున్నాయి. (ఆపన్నహస్తం అందిస్తున్న అభయం పౌండేషన్) నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో మాతృభూమి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కరోనా నివారణ కోసం ప్రజలకు , నిస్వార్థంగా సేవ చేస్తున్న పోలీసులు, వైద్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులకు ఉచితంగా మాస్కులు ఇచ్చేందుకు తయారుచేస్తున్నారు. మాతృభూమి ఫౌండర్ మంజుల, అధ్యక్షుడు రమాకాంత్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు లు సాయి శ్రీ , వివేకవర్ధన్, అంబికా, సంధ్యారాణి సహకారంతో ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 500 పైగా మాస్కులు ఉచితంగా పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో అధిక సంఖ్యలో మాస్కులు తయారుచేసి కరోనా నివారణకు తమ వంతు సహాయం చేస్తామని రమాకాంత్ తెలిపారు. -
అండగా నిలుస్తున్న సామాన్యులు
కరోనా మహమ్మారి కట్టడికి భారత ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. భారతదేశంలో కూడా కరోనా మహమ్మారి విజృంభించడంతో 3వారాల పాటు లాక్డౌన్ విధించారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కరోనా అంతకంతకు పెరుగుతుండటంతో ఆర్ధికపరమైన విషయాల కంటే ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని కోరాయి. పంజాబ్, ఒడిషా, తెలంగాణ , మహారాష్ట లాంటి ప్రభుత్వాలు ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దినసరి కూలీలు, వలస కూలీలు, నిరుపేదలు జీవన భృతి కోల్పొయి అష్టకష్టాలు పడుతున్నారు. అయితే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలతో పాటు సామాన్యులు కూడా ముందుకు వచ్చి వారికి తోచిని సాయం చేస్తున్నారు. అలా సాయం చేస్తూ మానవత్వాన్ని కొంత మంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. (మానవ సేవే మాధవ సేవ) మూసపేటలో ఉంటున్న కె. అజయ్‌సాయి కరోనా కాలంలో పేదలకు అండగా నిలవడం కోసం తన చుట్టు పక్కన ఉండే నిజమైన పేదవారిని గుర్తించి వారి తన సొంత ఖర్చులతో నిత్యవసర సరుకులు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. లాక్డౌన్ కారణంగా తమ తమ ప్రాంతాలకు వెళ్లలేక వలస కూలీలు పరిస్థితి దుర్భరంగా మారింది వారిని ఆదుకునేందురకు మోహన్‌కుమార్ ముందుకొచ్చారు. కర్నూలు జిల్లా ఒబులపురంలో ఉంటున్న వలసకూలీలకు నిత్యవసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో మోహన్ కుమార్ కడింపల్లి, చార్టెడ్ అకౌంటెంట్, రాష్ట్ర కమిటీ సభ్యులు - రైతు స్వరాజ్య వేదిక, శేఖర్ పోతుల , చంద్ర శేఖర్ రాజు చార్టెడ్ అకౌంటెంట్ , జుబేదా తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా కారణంగా మనుషులతో పాటు నోరు లేని మూగజీవులు కూడా తిండి దొరకక అష్టకష్టాలు పడుతున్నాయి. దీంతో పాటు వేసవికాలం కూడా కావడంతో నీరు కూడా దొరకని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు బ్రాడీపేటలో ఉంటున్న రాధాకృష్ణ మూగజీవాలకు ఆహారాన్ని అందించి సహృదయాన్ని చాటుకున్నారు. మీరు అందిస్తున్న సాయం ఎంతో మందిలో స్ఫూర్తి నింపవచ్చు. మీరు చేస్తున్న సాయాన్ని తెలియజేయాలనుకుంటే వివరాలను webeditor@sakshi.com కి పంపించండి. -
నా జీవితంలో ఇంతకన్నా ఆనందం ఏముంది?
ఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ప్రం హోం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ నిత్యం ఉరుకుల పరగుల జీవితంలో ఉండే ఉద్యోగులకు వర్క్ ఫ్రం వెసులుబాటు కల్పించడంతో ఇంట్లోనే ఉంటూ తమ పని చేయడమే గాక సురక్షితంగా ఉండొచ్చు అని భావిస్తారు. అయితే ఢిల్లీకి చెందిన రవి చంద్రన్ మాత్రం ఉద్యోగం కంటే సమాజసేవ చేయడమే ముఖ్యమని పేర్కొంటున్నాడు. రవి చంద్రన్.. ఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డ్‌లో అసిస్టెంట్ స్క్రుటిని ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రోజు తన ఇంటి నుంచి నార్త్ డిల్లీలోని విధాన సభకు పక్కనే ఉన్న బిల్డింగ్‌లో విధులు నిర్వహించేవాడు. రోజు 8గంటల పాటు పనిచేసి మెళ్లిగా ఇంటికి చేరుకునేవాడు. ఇది అతని జీవితంలో రెగ్యులర్‌గా జరిగే పని. అయితే ఇప్పుడు కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ప్రసుతం అతను పని చేస్తున్న ఆఫీస్‌కు కొన్ని రోజులు సెలవులు ఇవ్వడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే తనకు మాత్రం ఉద్యోగం లేకపోతే సమాజసేవ చేయడమే చాలా ఇష్టమంటున్న రవి చంద్రన్‌ను చూడాలంటే మాత్రం ఉత్తర ఢిల్లీలోని ఘాజీపూర్‌లోని గవర్నమెంట్ సీనియర్ సెకండరీ స్కూల్లో కనిపిస్తాడు. ఇటువంటి ఆపత్కాల సమయంలో రోజుకు 14గంటల పాటు విధుల నిర్వహిస్తూ అందరిచేత శెభాశ్ అనిపించుకుంటున్నాడు. మార్చి 25 నుంచి లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ఈ స్కూల్‌ను ఇప్పుడు వలసదారుల సహాయ శిబిర కేంద్రంగా మార్చారు. దీనికి ఇప్పుడు రవి చంద్రన్ వార్డెనర్గా వ్యవహరిస్తున్నాడు. ఒక చిన్న షెడ్ వేసుకొని అందులోనే ఒక టేబుల్, కుర్చీ ఏర్పాటు చేసుకున్నాడు. దాదాపు 400 మందికి పైగా ఉంటున్న ఈ శిబిరంలో వారికి అందవలసిన సామాగ్రితో పాటు , తినే ఆహారం నుంచి వారంతా సామాజికి దూరం పాటించే వరకు ప్రతీ విషయాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇదే విషయమై రవి చంద్రన్‌ను అడిగితే.. 'ఇటువంటి పరిస్థితి నా జీవితంలో ఊహ తెలిసినప్పటి నుంచి చూడలేదు. ఇలాంటి విపత్కర సమయంలో నేను ఖాళీగా ఉండలేను. నాకు తోచినంత సహాయం చేయడానికి ఎప్పుడు మందుంటాను. నేను ఎంత గొప్ప పని చేసినా ఇంకా సాధించాల్సింది ఏదో ఉంది అని ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుంది. నేను ఇప్పుడు వార్డెనర్గా విధులు నిర్వహిస్తున్న దగ్గర చాలామందికి డబ్బులు లేవు. ఇప్పుడు ఉన్నపళంగా వారిని అక్కడినుంచి పంపిచేస్తే వారంతా దిక్కులేని వారవుతారు. అందుకే మార్చిలో వచ్చిన జీతం నుంచి కొంచెం పక్కకు తీసి వారికి చేతనైనంత సహాయం చేస్తున్నాను. ఇప్పుడు కూడా నా మిత్రులు, తెలిసినవారి దగ్గరికి వెళ్లి కొంత డబ్బు అడుగుతున్నాను. ఇప్పుడు సహాయ కేంద్రాలలో ఉంటున్నవారు లాక్డౌన్ ముగిశాక తమ ఇళ్లకు వెళ్లే ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి 500 నుంచి వెయ్యి రూపాయలు అందిస్తాను. ఈ మధ్యనే నాకు తెలిసిన కొంతమంది డబ్బులు పోగేసుకొని దాదాపు 450 మాస్కులు అందజేశారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చేసే పని కంటే 14 గంటల పాటు సమాజసేవ చేస్తున్నందుకు నా భార్య ఎంతో సంతోషిస్తుంది. కష్టకాలంలో ఇంతమందికి సహాయపడడం కంటే నా జీవితంలో ఆనందం ఏముంటుందంటూ' రవి చంద్రన్ చెప్పుకొచ్చాడు. -
లాక్డౌన్లో వినూత్న కార్యక్రమం
కరోనా వైరస్ అరికట్టేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోను లాక్ డౌన్ విధించారు. తెలంగాణలోని ప్రజలను ప్రాణాలను కాపాడేందుకు పటిష్టమైన లాక్ డౌన్ కొనసాగుతోంది. సాధారణ ప్రజలే బయటికి వచ్చే సందర్భాలు లేవు. అలాంటి సమయంలో వారాల వారీగా, నెలల వారీగా, ప్రతిరోజు మందులు వాడే వృద్దులు, వికలాంగులు, పిల్లల పరిస్థతి ఆగమ్యగోచరంగా మారిపోయింది. ప్రజల రక్షణ, ఆరోగ్యం కాపాడడం కోసం ప్రభుత్వాలు అడుగడుగునా తనిఖీలు చేపట్టాయి. వృద్దులు, వికలాంగులు బయటకు వెళ్లలేని పరిస్థితి. మందులు ఐపోయి సమయానికి వాడకుండా ఇబ్బందులు పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారికి మీకు మేమున్నామంటూ, వారికి సహయం చేసేందుకు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ముందడుగు వేసింది. గత పది సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అవినీతి నిర్మూలన కోసం శాంతియుతంగా పనిచేస్తున్న వైఏసి సంస్థలో యాభై వేలకు మందికి పైగా సభ్యులు, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ సంధర్బంగా వినూత్న కార్యక్రమం చేయాలని హైదరాబాద్ నగరంలోని సంస్థ సభ్యులు, వంద మంది యువకులు ప్రతిరోజు టూ వీలర్ వాహనాల ద్వారా మందులు అవసరం ఉన్న వారికి ఉచితంగా డోర్ డెలివరీ చేస్తున్నారు. వారికి కావలసిన మందులను తెచ్చి ఇస్తూ మందులకు అయిన బిల్లులను మాత్రమే తీసుకుంటున్నారు. ఫోన్ లేదా వాట్సప్ ద్వారా సమాచారం అందిస్తే ఇంటికే వెళ్లి మందులు ఇస్తున్నారు. ఈ సమయంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ చేస్తున్న సేవలను పలువురు అభినందిస్తున్నారు. బయటికి వెళ్లలేని, ఓపికలేని వృద్దులు, వికలాంగులను ఈ సమయంలో మెడిసిన్ అందిస్తూ అదుకోవాలనే ఆలోచన రావడం చాలా గొప్పపరిణామమని కొనియాడుతున్నారు. వృద్దులకు, వికలాంగులకు, చిన్న పిల్లలకు మందులతో పాటు ఇతర వస్తువులకు అందించేందుకు కూడా తాము సిద్దంగా ఉన్నామని, కొంతమంది వృద్దులకు ఆహారాన్ని కూడా అందిస్తున్నామన్నని వైఏసి ఫౌండర్ పల్నాటి రాజేంద్ర తెలిపారు. హైదరాబాద్ నగరంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ కాల్ చేసిన స్పందిస్తూ సాధ్యమైనంత వరకు మెడిసిన్ ఇస్తూ సేవలందించనున్నామని చెప్పారు. ప్రభుత్వాలు లాక్ డౌన్ ఎత్తివేసే వరకు సేవలు కొనసాగుతాయన్నారు. అవసరమున్న వారు సంప్రదించాల్సిన నంబర్లు 9491114616, 8143304148, 9000042143, 9182339595, 8897736324, 7799553385 -
మానవ సేవే మాధవ సేవ
కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో మన తోటి మనుషులు ఎంతో మంది రోజుకు ఒక్క పూట కూడా ఆహారం దొరకక పస్తులు ఉంటున్నారు. లాక్‌డౌన్‌కి ముందు కష్టం చేసుకొని స్వశక్తితో బతికిన ఎంతో మంది వలసకూలీలు, దినసరి కూలీలు, నిరుపేదలు ఆకలితో నీళ్లు తాగి పడుకునే దుస్థితి దాపురించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను, వలస కూలీలను ఆదుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. దీనికి తోడు సామాన్యులు సైతం ఈ సమయంలో ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. పేదలకు నిత్యవసర సరుకులు, ఆహారాన్ని అందిస్తున్నారు. అలా సాయం చేస్తున్న సామాన్యులు కొంతమంది సాక్షి.కామ్ ద్వారా వాళ్ల సేవ కార్యక్రమాన్ని తెలిపి మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అనుశ్రీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి అధ్వర్యంలో కరోనా కారణంగా ఉపాధి కోల్పొయిన వలస కూలీలకు, పేదలకు, దినసరి కూలీలకు గత మూడు రోజులుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోజుకు 500 మందికి అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సహాయం అందించిన వారికి అసోసియేషన్ అధ్యక్షలు అంబటి నాగరాజు, ఉపాధ్యక్షులు రమేష్‌గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. మనమంతా గ్రూప్ వారు లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 4 ఆశ్రమాలకు కు కిరాణా సరుకులు, అద్దె ఖర్చులు అందించి సాయం చేశారు. సుధీర్ ఫౌండేషన్, హయత్ నగర్, మాతృ అభయ ఫౌండేషన్ , మేడిపల్లి, సాయి సురక్షిత వృద్ధ ఆశ్రమం, ఆలేటి ఆటం వరల్డ్ ఆశ్రమాలకు సాయం చేశారు. ఈ కార్యక్రమంలో మనమంతా గ్రూపు ఫౌండర్ రవి, జగదీష్ కుమార్ జల్లు, శేఖర్ ఉదయగిరి గారు, సుజాత గారు, రామాంజనేయులు, సునీత గారు, సుధాకర్ రెడ్డి, ఉష గారు సహాయ సహకారాలు అందించారు. ఇవే కాకుండా మానసిక వికలాంగురాలి కోసం టీవీ, నెలకు సరిపడా ఆర్గానిక్ ఫుడ్స్ అందించారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పొయిన పేదలకు, నిరాశ్రయులకు కృష్ణజిల్లా గూడూరులో యతిరాజం గిడియోన్ తన వంతు సహాయాన్ని అందించారు. ప్రజలకు నిత్యావసర సరుకులు బియ్యం, కంది పప్పు, వంట నూనె అందించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ, ట్రైనీ డీఎస్పీ శ్రావణి , బండారు తాలూకా సీఐ, గూడూరు ఎస్సై ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, సోలమన్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ కారణంగా పూణేలో ఇరుక్కపోయిన యల్‌టీఐలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న కాయల రామకృష్ణుడు తన సొంత గ్రామమైన కడపజిల్లా గంగాయపల్లిలో పేదలకు కూరగాయలు, గుడ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో తనకు సహాయం చేస్తున్న గ్రామ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఖతర్‌లో ఉంటున్న కొణిజేటి శ్రీనివాసరావు తన స్వగ్రామమైన ఒంగోలులో ఉంటున్న వైద్యసిబ్భందికి 3560 మాస్క్‌లు అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. బోడుప్పల్కి చెందిన శ్రీనివాసరావు వారి స్వచ్ఛంద సంస్థ జెరూషా ఫౌండేషన్ ద్వారా హైవేల పక్కన ఉంటున్న నిరాశ్రయులకు, లాక్డౌన్ కారణగా జీహెచ్‌యమ్‌సీ వారు ఏర్పాటు చేసిన షల్టర్స్‌లో ఉంటున్న వారికి పులిహోర, గుడ్లు పంపిణీ చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని లాక్డౌన్ చివరి వరకు కొనసాగిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. చంద్రన్న పాలానికి చెందిన గెత్సమన్ ప్రార్థన సమూహము వారు కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకి ఆహారాన్ని అందించారు. మణికొండలో లాక్డౌన్ కారణంగా ఆహారం అందక ఇబ్బంది పడుతున్న రోజువారీ కూలీలకు, పేదలు 100 మందికి నీలేష్ దుబే అన్నదానం చేశారు. నెల్లూరు జిల్లా పియ్యలపాలేం గ్రామంలో అరబిందో ఫార్మా లిమిటెడ్ రిప్రజెంటేటివ్ పీనక గోపినాథ రెడ్డి 315 కుటుంబాలకు కూరగాయలు అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ పీనక శ్రీనివాసులు రెడ్డి, రమణయ్య, సురేంద్ర రెడ్డి, సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. -
మానవతా వజ్రాలు
సాక్షి కడప : కరోనా లాక్డౌన్ సమయంలో ఆకలితో అ లమటిస్తున్న పేదలకు కడపకు చెందిన ట్రాన్స్‌జెండర్స్(హిజ్రాలు) అండగా నిలుస్తున్నారు. పెద్ద మనసు చాటుకుంటున్నారు. రాయలసీమ ట్రాన్స్‌జెండర్స్ అ సోసియేషన్ అధ్యక్షురాలు హాసిని ఆధ్వర్యంలో వీరంతా రోజూ ఆహార వితరణ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. కడపతోపాటు కమలాపురం, ఇతర ప్రాంతాల్లో యాచకులు, నిరుపేదలకు ట్రాన్స్‌జెండర్స్‌కు వీరు ఆహార పదార్థాలను అందజేస్తున్నారు. ఒక రోజు బిర్యానీ ప్యాకెట్లు, మరొకరోజు ఎగ్ రైస్, ఇంకో రోజు వెజిటబుల్ రైస్, ఉడకబెట్టిన గుడ్లతో కూడిన పౌ ష్ఠికాహారాన్ని అందిస్తున్నారు. కడపలోని అల్లూరి సీతా రామరాజునగర్‌లో సుమారు 30 మంది ట్రాన్స్‌జెండ ర్స్ స్వయంగా వండుతున్నారు. రెండు ఆటోల ద్వారా మరియాపురం, ఐటీఐ, ఆరోగ్యమాత చర్చి, ఎర్రముక్కపల్లె, ఆర్టీసీ బస్టాండు, కోటిరెడ్డిసర్కిల్, పాతబస్టాండు, పాత కలెక్టరేట్, పాత రిమ్స్, వినాయకనగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న పేదలు, యాచకులు, అనాథలకు అందజేస్తూ వస్తున్నారు. ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం రెండు రోజులకు ఒకసారి 250 నుంచి 300 ప్యాకెట్లు తయారు చేసి అందిస్తూ వస్తున్నారు. ఆకలి బాధ తెలుసు ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలుసు. అందుకే కష్టసమయమైనా ముందుకు వచ్చాం. మావంతు సహాయంగా ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరికీ అందిస్తూ ఆకలిని తీరుస్తున్నాం. – హాసిని, రాయలసీమ ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, కడప అన్నదానం గొప్పది అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అంటారు. అందుకే మా వద్ద దాచుకున్న సొమ్మును పేదల కోసం వినియోగిస్తున్నాం. విపత్కర పరిస్థితుల్లో వారిందరి ఆకలి తీర్చడమే మా బాధ్యత. అందుకోసం మరింత కష్టపడుతాం. – అన్యన్య, కడప హాసిని అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు, కడప -
సాయం చేస్తున్న ఖాకీలు!
సాక్షి, హైదరాబాద్: కరోనా కోరల్లో చిక్కుకొని ప్రతి ఒక్కరూ అల్లడిపోతున్నారు. రాణి, రాజు, దేశ ప్రధానుల నుంచి సామాన్యలు వరకు కరోనా బారిన పడి విలవిలలాడిపోతున్నారు. ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఈ మహమ్మారిని కట్టడిచేయడానికి భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించింది. దీంతో ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. దీని వల్ల వలస కూలీలు సొంత గ్రామాలకు వెళ్లలేక ఉన్నచోట పనిలేక తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. వీరితో పాటు వలస కూలీలు, నిరుపేదల పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో వారిని ఆదుకునేందుకు సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే 24 గంటలు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రజలు భద్రత కోసం పనిచేస్తోన్న పోలీసువారు కూడా తమ డ్యూటీతో పాటు పేదలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీసులు రూ. 700 విలువగల నిత్యవసర సరుకుల కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్క కుటుంబంలో నలుగురి వ్యక్తులకు సరిపడా సరుకులను కిట్ల ద్వారా అందిస్తున్నారు. ప్రతి కిట్‌లో 5 కేజీల బియ్యం, కేజీ పప్పు, 100 గ్రాముల చింతపండు, ఒక కేజీ ఉప్పు, ఒక కేజీ చక్కెర, చిన్న కారం ప్యాకెట్, ఒక లీటరు ఆయిల్ ప్యాకెట్, 70 గ్రామల టీ పౌండర్ ఉంటాయి . ఈ కార్యక్రమంలో పోలీసులతో కలిసి సామన్యులు సైతం పాలుపంచుకుంటున్నారు. వారికి తోచిన సాయం పోలీసుల ద్వారా చేస్తున్నారు. సామాన్యల సాయంతో వచ్చిన డబ్బుతో మియాపూర్ పోలీసులు వలసకూలీలకు, దినసరి కూలీలకు, నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందించి వారిని ఆదుకుంటున్నారు. -
వెల్లివిరుస్తున్న మానవత్వం
కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని ప్రపంచం విలవిలలాడుతున్న నేపథ్యంలో వైరస్ విస్తరణను అరికట్టేందుకు భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో చాలా మంది పేదవారు ఆహారం దొరకక అవస్థులు పడుతున్నారు. అయితే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు చాలా పథకాలు అమలు చేస్తూ అండగా నిలుస్తున్నాయి. వీటికి తోడు మేము సైతం అంటూ సామాన్యులు కూడా వారిని ఆదుకునేందుకు కదం తొక్కుతున్నారు. వారికి చేతనైనంత సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అలా సాయం చేస్తున్న కొందరు సామాన్యలు ఎందరికి స్ఫూర్తిగా నిలవడం కోసం వారు చేస్తున్న సేవకార్యక్రమాలను సాక్షి.కామ్‌తో పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం... తూర్పుగోదావరి జిల్లా మలికిపురానికి చెందిన చెల్లుబోయిన మనోజ్ వలస కూలీలకు, దినసరి కూలీలకు,నిరుపేదలకు కూరగాయలు, నిత్యవసర సరుకులు అందించి అండగా నిలిచారు. తను చేసే సాయంతో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. లాక్ డౌన్ తో రోడ్లపై తిరిగే మూగజీవాలకూ ఆహారం కరువైంది.సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద వుండే ఆవులకు నిత్యం గుడికి వచ్చే భక్తులు అరటి పళ్ళు,కూరగాయలను ఆహారంగా పెట్టే వారు అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఆలయానికి భక్తులు రాకపోడంతో వాటికి ఆహారం పెట్టే నాధుడు లేక రోడ్లపై కి వచ్చేస్తున్నాయి. చుట్టూ గడ్డి వున్నా వాటికి గడ్డి అలవాటు లేకపోవడంతో ఆహారం లేక అలమటిస్తున్నాయి.దీన్ని గమనించిన సఖినేటిపల్లి ఎస్సై సురేష్ ఆ ఆవులకు అరటిపండ్లు, ఆకుకూరలు తీసుకొచ్చి వాటికి ఆహారం అందించి తన మానవత్వాన్ని చాటుకుని నలుగురికి ఆదర్శం అయ్యారు.ఒక ప్రక్క ఇరవై నాలుగు గంటలు పోలీసు విధులు నిర్వహిస్తూనే ఈ మూగజీవాల పట్ల తనకున్న ప్రేమను చూపిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో అనేక మంది ఇబ్బంది పడటం చూస్తున్న చాలా మంది వారికి చేతనైనంత సాయం చేస్తున్నారు. పుట్టిన రోజులాంటి వేడుకల్లో పేదలకు సాయం చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ విధంగానే తాళ్లపూడి శ్రీ విజేత హై స్కూల్ కరస్పాండెంట్ మోపిదేవి విజయ లక్ష్మి బుధవారం తన పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చెయ్యడం,విందు ఇవ్వడం వంటివి రద్దు చేసుకొని వాటి స్థానంలో శాని టైజేషన్ బాటిల్స్ ,లస్సీ పేకెట్స్ పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందికి ,పాత్రి కేయులకు వీటిని పంపిణీ చేసి తన ఆదర్శాన్ని చాటుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ విధించడంతో పనులు లేక ఇబ్బందిపడుతున్న 150 కుటుంబాలకు అన్న దేవరపేట గ్రామానికి చెందిన కొత్త చందు కూరగాయలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా కొడమంచిలి జానుబాబు, బొచ్చు కుమార్, విజయ్, మన్యం ప్రసాద్, రసూల్, కొడమంచిలి విజయ రత్నం, బంగారు బాబు, మంచెల్లి సోమరాజు, బొచ్చు శ్రీను, కొల్లూరు సురేష్, దొండపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌లో సుందర్ ఊట తన స్నేహితులతో కలసి సొంత ఖర్చులతో తమ ఊరిలో 800 డెట్టాల్ సోప్ లు ఇచ్చి హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తూ ఎవ్వరు బయట తిరగొద్దు అని కొన్ని జాగ్రత్తలు చెబుతూ తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. విజయవాడ మొగల్రాజపురం లో నివాసం ఉంటున్న దోమకొండ శ్యామ్ కుమార్ తల్లి దోమకొండ మేరీ, స్నేహితులతో కలిసి ఆకలితో బాధపడుతున్న వారికి అన్నపానీయాలు అందించి పెద్ద మనసు చాటుకున్నారు. విస్సన్నపేటకు చెందిన తేజ ఇంటర్నెట్ నిర్వహకులు, పాత్రికేయులు ఎల్. బాబ్జీ వారి తండ్రి సుబ్బారావు జ్ఞాపకార్థం మదర్‌దెరిస్సా అనాధాశ్రమ నిర్వాహకులకు 25 కేజీల బియ్యాన్ని అందించారు. -
మానవత్వాన్ని చాటుకుంటున్న సామాన్యులు
సాక్షి, కృష్ణా: కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో సామాన్యలు ఎదుర్కొంటున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇక వలసకూలీలు, దినసరి కూలీలు, నిరుపేదల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉండటంతోఎన్నో నిరుపేద కుటుంబాలు నీళ్లు తాగి బతుకుతున్నాయి . అయితే వీరిని ఆదుకోవడానికి ఎందరో వారి ఆపన్న హస్తాలను అందిస్తున్నారు. తమ దాతృత్వాన్ని చాలుకుంటున్నారు. పది మంది కలిస్తే చేతనైనంత సాయం చేయవచ్చనే ఆలోచనని ఆచరణలో పెడుతున్నారు. కొంత మంది వ్యక్తిగతంగా ఒక్కరై సాయం అందిస్తుంటే ఇంకొందరు బృందాలుగా సాయం అందిస్తున్నారు. (ఎందరో మహానుభావులు!) ఇందులో భాగంగానే హాసిని కంప్యూటర్స్ మిత్ర బృందం కొండపల్లి గ్రామంలో 150 పేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసి తమ మానత్వాన్ని చాటుకున్నారు. పారిశ్రామిక వాడలో పని చేస్తూ లాక్డౌన్ కారణంగా స్వస్థలాలకు వెళ్లలేని కుటుంబాల్ని గుర్తించి వాళ్ళకి కూరగాయలు పంపిణీ చేశారు. వీరితో పాటు వృద్ధులు, ఎలాంటి ఆదరవూ లేని వికలాంగులని గుర్తించి వారికి కూడా కూరగాయలు అందించారు. ఈ కార్యక్రమంలో చుట్టుకుదురు వాసు, భయ్య రాము,కొత్తపల్లి ప్రకాష్, గుంటుపల్లి గోపి, ఎలక్ట్రికల్ శివ, కూచిపూడి రమేష్, అనిల్ డ్యాని, వంశీ, బండి వేణు, హాసిని కంప్యూటర్స్ భద్ర పాల్గొన్నారు. వీరి సాయం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. మీరు కూడా మీరు చేస్తున్న సాయాన్ని తెలియజేయాలంటే వివరాలు పంపించాల్సిన మెయిల్ ఐడీ: webeditor@sakshi.com -
దాచుకున్న డబ్బులు దానం
బంజారాహిల్స్: మానవతా హృదయాలు స్పందిస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, చిన్నారులు మొదలుకొని అన్ని వర్గాలవారూ మేమున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తున్నాయి. కరోనా కట్టడికి తాము సైతం చేయూతనిస్తామని భరోసానిస్తున్నాయి. ప్రభుత్వానికి తమవంతు సహాయం అందిస్తున్నాయి. ఈ జాబితాలో ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థిని చేరారు. తాను కొన్నాళ్లుగా సేవింగ్ చేసిన రూ.లక్షను విరాళంగా అందజేశారు. బుధవారం బంజారాహిల్స్ రోడ్‌నంబర్- 14 నందినగర్‌కు చెందిన డేంజర్ రాజు కూతురు మోనెకా సాగర్ రూ.లక్ష చెక్కును మంత్రి కేటీఆర్‌ను కలిసి అందజేశారు. జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ లక్ష్మీనర్సింగరావు ఆధ్వర్యంలో ఆమె కేటీఆర్‌ను కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆమెను మంత్రి అభినందించారు. మంచి మనసుతో ఇచ్చే విరాళాలు ప్రభుత్వానికి మరింత భరోసానిస్తాయని కొనియాడారు. (భారత్ సహకారం మరువలేనిది : ట్రంప్) -
పెద్దాయన ఔదార్యం.. 100 మందికి భోజనం
మహమ్మారి కరోనా సృష్టిస్తున్న కల్లోలం కారణంగా ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. లాక్డౌన్ అమలవుతున్న తరుణంలో అనాథలు, పేదలే కాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది కొంతమంది భోజన వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న విశ్రాంత ఉద్యోగి మేకల బాలయ్య పెద్ద మనసు చాటుకున్నారు. మియాపూర్‌లోని అల్విన్ కాలనీకి చెందిన ఆయన తన పెన్షన్ డబ్బుతో దాదాపు 100 మందికి భోజన సదుపాయం కల్పించారు. ఈ క్రమంలో లేబర్ ఆఫీసర్‌గా పనిచేసిన ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 70 ఏళ్ల వయస్సులోనూ చురుగ్గా ఉంటూ సమాజ సేవ చేస్తున్న బాలయ్యను ఆదర్శంగా తీసుకోవాలంటూ పలువురు సూచిస్తున్నారు. -
కరోనా : సీఎం సహాయనిధికి విరాళాలు
సాక్షి,అమరావతి : కరోనా నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీ మూడు కోట్ల రూపాయల విరాళాన్ని అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ ఎండీ, సీఈవో ఎం.గౌతమ్ రెడ్డి, ఆళ్ల శరణ్ సీఎం జగన్‌ను కలిసి చెక్కును అందజేశారు. దీంతో పాటు రెండు కోట్ల విలువైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కూడా అందించనున్నట్టు ప్రకటించారు. అలాగే ముఖ్యమంత్రి సహాయనిధికి మిడ్వెస్ట్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్ కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను బుధవారం మిడ్వెస్ట్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ రామచంద్ర కొల్లారెడ్డి, కె రాఘవరెడ్డి కలిసి విరాళానికి సంబంధించిన చెక్‌ను అందచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ టెక్ట్స్‌టైల్ మిల్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని అందించారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో ఛైర్మన్ లంకా రఘురామిరెడ్డి, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, అసోసియేషన్ సభ్యులు వసంతకృష్ణప్రసాద్, మద్దాల గిరి ఉన్నారు. సాగర్ సిమెంట్స్ కోటి విరాళం ముఖ్యమంత్రి నివాసంలో నిన్న (మంగళవారం) సీఎం వైఎస్ జగన్‌కు సాగర్ సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఆనంద్‌రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.శ్రీకాంత్ రెడ్డి విరాళం చెక్‌ను అందచేశారు. -
కోదాడలో పేదలకు చేయూత
సాక్షి,నల్గొండ: కరోనా మహమ్మారి చిన్న వారి నుంచి పెద్దవారి వరకు కష్టాన్ని కలిగిస్తోంది. ఈ వైరస్ విజృంభించడంతో కేంద్రప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కదీంతో రోజు వారీ కూలీలు, వలస కూలీలు, పేదలకు ఆహారం లభించక, నిత్యవసరాలు అందుబాటులో లేక పూటగడవని పరిస్థితి ఏర్పడింది. అయితే వారికి సాయంగా అనేక మంది వారిని ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు వారికి తోచిన సాయం అందిస్తున్నారు. (జగనన్న సైనికులు పేరిట ఐటీ ఉద్యోగులు సేవ) ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం తొగర్రాయి గ్రామంలో అత్యంత నిరుపేద, రోజువారి వ్యవసాయ కూలీ, వృద్ధులు, దివ్యాoగులలో 200 కుటుంబాలను ఎంపిక చేసి వారికి నెలకు సరిపోను సుమారు రూ.500ల విలువగల లక్ష రూపాయల నిత్యవసర వస్తువులు డొనేట్ కార్ట్ పౌండేషన్ వారి సహకారంతో తొగర్రాయి శ్రీ వివేకానంద యువజన సంఘం సభ్యులు వారి ఇంటికే వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు నందుల లక్ష్మీనరసింహశాస్త్రి, ప్రస్తుత అధ్యక్షుడు సంతోష్, డోనేట్ కార్ట్ సీఈఓ సందీప్ శ్రీవాత్సవ్, యూత్ సభ్యులతో పాటు గ్రామ సర్పంచ్ దొంగల లక్ష్మీనారాయణ ఇతర గ్రామ పెద్దలు పాల్గొన్నారు. చదవండి: (ఆపన్నహస్తం అందిస్తున్న అభయం పౌండేషన్) -
ఆపన్నహస్తం అందిస్తున్న అభయం పౌండేషన్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో దాని కట్టడి కోసం భారత ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ను విధించింది. దీంతో రోజు వారీ కూలీలు, వలస కూలీలు, పేదలకు ఆహారం లభించక, నిత్యవసరాలు అందుబాటులో లేక పూటగడవని పరిస్థితి ఏర్పడింది. అయితే వారికి సాయంగా అనేక మంది వారి ఆపన్న హస్తాలను అందిస్తున్నారు. అనేక స్వచ్ఛంధ సంస్థలు, ట్రస్టులు అన్నదానం, నిత్యవసరసరుకులు అందిస్తూ సాయాన్ని చేస్తున్నాయి. ఈ సేవ కార్యక్రమంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతున్న 30 వృధాశ్రమాలు మరియు అనాదాశ్రమాల్లో 21 రోజులు సరిపడా నిత్యావసరాలు పంపిణీని 'లిటిల్ హ్యాండ్స్ ట్రస్ట్', 'అభయం ఫౌండేషన్' సభ్యులు అందించారు. అదేవిధంగా ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న పోలీసులుకు, ప్రభుత్వ అధికారులుకు, సానిటరీ కార్మికులకు, నిత్యవసర సామాగ్రి అందించే వ్యాపారులకు, కూరగాయల వ్యాపారులకు మాస్క్‌లు అందించారు. దాదాపు 5500 మాస్క్‌లను పశ్చిమగోదావరి, కృష్ణా, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లో అందించారు. వీటితో పాటు హైదరాబాద్ లో 150 రోజు కూలి కుటుంబాలకు 10 రోజులకు సరిపడా నిత్యావసరాలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. అభయం పౌండేషన్ ద్వారా మీరు కూడా సాయం అందించాలనుకుంటే 6303251670 నంబర్‌కి కాల్ చేయండి https://www.facebook.com/groups/Abhayam.Group/?ref=bookmarks https://m.facebook.com/story.php?story_fbid=1279274842278130&id=411726419032981 -
జగనన్న సైనికులు పేరిట ఐటీ ఉద్యోగులు సేవ
సాక్షి, బెంగళూరు: కరోనా... ఇప్పుడు ఈ పేరు ప్రపంచాన్ని వణికిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాతో సహా అన్ని దేశాలు కరోనా కోరల్లో చిక్కుకొని విలవిలాడిపోతున్నాయి. రోజు వేల మంది దీనికి బలవుతున్నారు. ఎప్పుడు చూడని సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటుంది. కరోనాని కట్టడి చేయడానికి ఉత్తమ మార్గాలు సామాజిక దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం. మన దేశంలో కూడా కరోనా మహమ్మారి విజృంభించడంతో 21 రోజుల పాటు ఎవరు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా లాక్‌డౌన్‌ను విధించారు. దీంతో చాలా మంది పేదలకు, రోజువారీ కూలీలు ఉపాధి కోల్పొయి పూట గడవక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది వారికి అండగా నిలుస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వారికి తోచినంతలో ఇతరులకు సహాయపడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఎంత సంపాదించిన మనతో రాదు కష్టాల్లో ఉన్న వారికి కడుపునింపడమే నిజమైన పరమార్థం అని తోటివారికి అండగా నిలుస్తున్నారు. కొందరు వారికి తోచినంత డబ్బును సాయం చేస్తుంటే ఇంకొందరు స్వయంగా వారే బృందాలుగా ఏర్పడి అన్నదానం లాంటివి చేస్తూ కరోనా కష్టకాలంలో అన్నం దొరకనివారికి, వలస కూలీలకు, పేదలకు ఆహారాన్ని అందిస్తున్నారు. బెంగుళూరుకు చెందిన ఐటీ ఉద్యోగులు కొందరు జగనన్న సైనికులు పేరుతో 2000నుంచి 3000 తెలుగు కుటుంబాలకు అన్నదానం చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి చేస్తున్న ఈ కార్యక్రమం ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. వీరు కొన్ని ప్రాంతాలకు మొబైల్ వాహానాల ద్వారా కూడా ఆహారాన్ని అందిస్తున్నారు. వీరు చేస్తున్న ఈ సేవ కార్యక్రమాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని శ్యాం కలకడ, భాస్కర్‌రెడ్డి అంభవరం నిర్వహిస్తున్నారు. బెంగుళూరులో ఉన్న తెలుగువారికి ఎవరికైనా ఆహారానికి సంబంధించి ఇబ్బందులు ఉంటే కింది నంబర్లకు ఫోన్ చేస్తే ఆహారాన్ని అందిస్తామని వారు తెలిపారు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 9900301234, 8123829473 -
కరోనా: వలస కూలీలకు చేయూత..
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఆర్ఎంపీ, పీఎంపీ రాష్ట్ర అధ్యక్షులు డా. వెంకట్‌రెడ్డి అండగా నిలిచారు. వలస వచ్చిన కూలీలకు శేరిలింగంపల్లి నల్లగండ్ల దగ్గర పులిహోర, పండ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్డౌన్ సందర్భంగా ఆకలి బాధలు పడుతున్న పేదవారికి తమ ముకేశ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తోటి వైద్య మిత్రులను కలుపుకొని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు డాక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. (ఏపీలో మరో 15 కరోనా కేసులు ) కరోనా: భారత్‌లో 5351కి చేరిన కేసులు 14 లక్షలు దాటిన కరోనా కేసులు -
రియల్ 'హీరో'ల్
బంజారాహిల్స్: ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కరోనా వైరస్‌ను తరిమికొట్టాలంటూ ప్రముఖ సినీ హీరో విజయ్‌దేవరకొండ తాను మాస్క్ ధరించిన ఫొటోలు విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఈ మేరకు విజయ్ చేస్తున్న ప్రచారానికి ఆయన అభిమానులతో పాటు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదలు నివసించే బస్తీల్లో వెయ్యి మందికి హీరో గోపీచంద్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇక హీరో నిఖిల్ శానిటైజర్లు సిద్ధం చేసి అంతటా పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసులకు వీటిని అందజేశారు. పోలీసులకు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్న ఉత్తేజ్ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వంటల్లో తన భార్యకు సహాయం చేస్తున్న ఫొటోలను షేర్ చేశారు. సినీ తారలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తూ కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ఇంట్లోనే ఉందామంటూ ప్రచారం చేస్తున్నారు. ఒక వైపు సీఎం సహాయ నిధికి విరాళాలు అందిస్తూనే ఇంకో వైపు తమవంతుగా ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనే ఉందామంటూ టీవీల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ తేజ్ తదితరులు స్టే హోం–స్టే సేఫ్ అంటూ పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. ఇక నటుడు ఉత్తేజ్ ప్రతిరోజూ మధ్యాహ్నం పోలీసులకు అన్నం పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీసులే దేవుళ్లంటూ తారలంతా వివిధ రూపాల్లో సాయం అందిస్తున్నారు. -
మాస్కులు కుడుతున్న ‘బ్రిటిష్ ఇల్లాలు’
బంజారాహిల్స్: కరోనా వైరస్ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాల్సి ఉండగా కొంతమంది పేదలు వీటికి దూరమవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బంజారాహిల్స్ రోడ్ నంబర్–3లో నివసించే బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ హైదరాబాద్ విభాగం అధికారి ఆండ్రుఫ్లెమింగ్ భార్య వ్యాన్ఫ్లెమింగ్ గత 3 రోజుల నుంచి మాస్క్‌లు ఉచితంగా అందిస్తున్నారు. నైజీరియన్ క్లాత్‌తో ఆమె ఈ మాస్క్‌లు కుడుతూ తన చుట్టుపక్కల నివసించే పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఆమె చేస్తున్న ఈ సేవకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే ఆమె 300కుపైగా మాస్క్‌లను సొంతంగా కుట్టి పంపిణీ చేశారు. -
కూలీలకు సహాయంగా అనురాగ్ సంస్థ
సాక్షి, హైదరాబాద్: కష్టాల్లో ఉన్నప్పుడే మనిషి విలువ తెలుస్తుందంటారు. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ లక్షలాది మందికి కష్టాలు తెచ్చిపెట్టింది. లాక్డౌన్ వలన ఎన్నో జీవితాలు అతలాకుతులమయ్యాయి. రెక్కాడితే కాని డొక్కాడని కూలీలకు చేయడానికి పని లేకుండా పోయింది. ఆకలి కష్టాల్లో ఉన్న కూలీలకు, భవన కార్మికులకు, వలస కూలీల బాధలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కు చెందిన అనురాగ్ సంస్థ తనవంతు సాయంగా కాప్రాలో మార్చి 16 నుంచి 20 వరకూ కరోనాపై అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. అంతేగాక ఆ ప్రాంతంలో నివాసించే కూలీలకు, భవన కార్మికుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం శైలజ, సీఐ చంద్రశేఖర్‌ల ఆధ్వర్యంలో అన్నం పొట్లాలు, కురగాయలను పంపిణీ చేసింది. (భారత్ నుంచి 1300 మంది వెనక్కి: అమెరికా) ఈ క్రమంలో కరోనా వల్ల ఎదుర్కొంటున్న కష్టాలను అధిగమించడానికి వ్యక్తిగత శుభ్రత గురించి వివరించి మాస్క్‌లు, శానిటైజర్లు పంచి పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ పిలుపు మేరకు దేశంలో అమలవుతున్న లాక్డౌన్ ద్వారా కరోనా మహమ్మారిని తరిమే ఉద్దేశంతో ‘బయటకు రావోద్దు- ఇల్లే ముద్దు’ అనే నినాదంతో ఈ సంస్థ ముందుకు వెళ్లింది. అంతేగాక కాప్రా పరిసర ప్రాంత భవన కార్మికుల ఇంటి ఇంటికీ వెళ్లి కురగాయలు, కిరణా సామగ్రిని అందించింది. ఈ పంపిణీ కార్యక్రమంలో డా. రామ్ సతిమణి బిందు, రాజు, రమ, నీలమ్మ తదితరులు పాల్గొన్నారు. (దేశంలో 117కి చేరిన కరోనా మరణాలు) -
లాక్డౌన్: పోలీసులకు మజ్జిగ అందించిన ఐటీ ఉద్యోగి
సాక్షి, ఖమ్మం: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు లాక్‌డౌన్‌కు అందరూ సహకరించేలా పగలు రాత్రి తేడా లేకుండా పోలీసులు సేవలు అందిస్తున్నారు. ఈ మహమ్మారి బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు పోలీసులు ఎవరూ రోడ్లపైకి రాకుండా సామాజిక దూరం పాటించేలా సేవలందిస్తున్నారు. క్రమంలో వారు ఎండను సైతం లెక్క చేయడం లేదు. ఇలా కరోనాతో యుద్ధంలో సైనికుల పాత్ర పోషిస్తున్న రక్షక భటులకు మద్దతునిచ్చేందుకు ఖమ్మంకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముందుకు వచ్చారు. రక్షక భటులకు చల్లని మజ్జిగ పానియం పంపిణీ చేసి వారి దాహన్ని తిరుస్తున్నాడు. ఇక లాక్డౌన్ కారణంగా దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎదుటివారికి సాయం చేయడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఇందుకోసం ఎవరికి తోచిన విధంగా వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు, అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ భరోసా అందిస్తున్నారు. (కరోనా ఎఫెక్ట్ : రూ. 5 లక్షల కోట్లకు) -
లాక్డౌన్ : అన్నం, వాటర్ ప్యాకెట్లు పంపిణీ
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్డౌన్ అమలవుతోన్న సంగతి తెలిసిందే. దీంతో రోజువారి కూలీలు, వలస జీవులు, బడుగులు, సంచాలకులు తిండి దొరకని దీన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ గడ్డుకాలంలో వారిని ఆదుకోవడానికి అనేక మంది ముందుకొచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు డబ్బులు పంచుతుంటే, మరికొందరు అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌కు చెందిన ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి స్వచ్చందం ముందుకు వచ్చారు. ఈ గడ్డు కాలంతో తిండి దొరక్క అలమటిస్తున్న సికింద్రాబాద్ ప్రాంతంలో నిరాశ్రయులకు, సంచాలకులకు పులిహోర, వాటర్ ప్యాకెట్లు పంపిణి చేసి మనవతను చాటుకున్నారు. (నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన బిట్స్ పిలానీ) -
మార్కెట్లో మాస్క్‌ల పంపిణీ : కడప విద్యార్థుల సహాయం
సాక్షి, వైఎస్సార్ కడప: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు కోరలు చాస్తుంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశమంతా 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని వ్యాపార రంగాలు మూతపడటంతో దినసరి కూలీలు, వలస కూలీల, పేదల ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో వారి ఆదుకునేందుకు వ్యక్తులు, ఆయా స్వచ్చంధ సంస్థలు నడుం బిగించారు. వివిధ ఫౌండేషన్ల ద్వారా విరాళాలు ప్రకటిస్తున్నారు. (ఏప్రిల్ 15 నుంచి లాక్డౌన్ పాక్షిక ఎత్తివేత!) విద్యార్థి సంఘాలు, పార్టీ కార్యకర్తలు ముందుకొచ్చి తమ వంతుగా సహాయంగా డబ్బులు పంచడం, అన్నదాన కార్యక్రమాలు, మాస్క్‌లు, శానిటైజర్లు పంచుతూ మేము సైతం అంటూ భాగస్వాములవుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంత పూర్వ విద్యార్థులు శనివారం స్థానిక మార్కెట్ వెండర్స్‌కు మాస్క్‌లు, శానిటైజర్లను పంపిణీ చేశారు. మార్కెట్లో కూరగాయలు అమ్మె రైతులు, కొనడానికి వచ్చిన ప్రజలు, మార్కెట్ వెండర్స్, సిబ్బంది కరోనా బారిన పడకుండా ఉండేందుకు స్థానిక ఎస్సై ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. -
ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా, చేపడుతున్న చర్యలకు ఉపయోగపడేలా పలువురు ప్రముఖులు, సంస్థలు సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. ► తెలంగాణ ఐకేపీ వీఓఏలు 1,72,61,000 రూపాయలను విరాళంగా అందించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఐకేపీ వీఓఏల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎల్.రూప్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు మంచికట్ల కోటేశ్వర్, ప్రధాన కార్యదర్శి మారిపెల్లి మాధవి, కోశాధికారి తిరుపతిలు ఈ విరాళాన్ని సీఎం కేసీఆర్‌కు అందించారు. ► రాష్ట్ర మహిళా సమాఖ్యలకు చెందిన స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ తరుఫున స్త్రీనిధి అధ్యక్షురాలు ఎస్.అనిత కోటి రూపాయల చెక్కును సీఎం కేసీఆర్‌కు అందించారు. ► తెలంగాణ పౌల్ట్రీ అసోసియేషన్ కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ అధ్యక్షుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి సీఎంకు అందించారు. ► తెలంగాణ బ్రీడర్స్ అసోసియేషన్ కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ జి.రంజిత్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. ► యూనిక్ ట్రీస్ రూ.25 లక్షల విరాళం అందించింది. యూనిక్ ట్రీస్ అధ్యక్షుడు రామ్ దేవ్ చెక్కును సీఎంకు అందించారు ► తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకు (టెస్కాబ్) కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవిందర్ రావు, వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. ఈ కోటి రూపాయల్లో 88 లక్షల రూపాయలు బ్యాంకు విరాళం కాగా, 8.5 లక్షలు బ్యాంకు ఉద్యోగులు, 3.5 లక్షల రూపాయలు రవిందర్ రావు అందించారు. ► డీసీసీబీలు, సింగిల్ విండోలు కలిపి 76 లక్షల రూపాయలు అందించాయి. డీసీసీబీ చైర్మన్లు ఒక్కొక్కరు రూ. లక్ష చొప్పున, సింగిల్ విండో చైర్మన్లు 5వేల రూపాయల చొప్పున, ఉద్యోగులు ఒక రోజు వేతనం చొప్పున అందించారు. ► రెడ్డీస్ ల్యాబ్స్ 5 కోట్ల రూపాయల విలువైన మందులు, ఎన్ 95 మాస్కులు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ ను రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ సతీశ్, ఎండీ జీవీ ప్రసాద్ ముఖ్యమంత్రికి అందించారు. ► ఎమ్ఎస్ఎన్ ల్యాబ్స్ 5 కోట్ల రూపాయల మందులు, ఇతర మెడికల్ సామగ్రి అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్‌ను ల్యాబ్స్ చైర్మన్ ఎమ్.సత్యనారాయణ రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. ► ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని దాతలు ‘గుడ్ సమరిటాన్స్ ఆఫ్ ఖమ్మం’పేరిటి ఏర్పడి రూ. రెండు కోట్ల విరాళాలు సేకరించారు. ఇందులో రూ. కోటి 75 లక్షలు విరాళాలు రాగా, రూ. 25 లక్షలను మమత వైద్య విద్యా సంస్థలు అందించారు. రెండు కోట్ల రూపాయల చెక్కును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎంకు అందించారు. ► అనూష ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ఎ.జలంధర్ రెడ్డి రూ.50 లక్షలు, డీఈసీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఎండీ అనిరుధ్ గుప్తా 50 లక్షల రూపాయల చెక్కును సీఎంకు అందించారు ► కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ కె.అనిల్ కుమార్ 50 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. ► ఎస్‌ఎల్‌ఎంఐ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండీ బి.వెంకటరెడ్డి రూ.25 లక్షల విరాళాన్ని ముఖ్యమంత్రికి అందించారు. ► శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్ ఎండీ ఎం.రవీందర్ రెడ్డి రూ.25 లక్షల చెక్కును సీఎం కేసీఆర్‌కు అందించారు. ► సీల్ వెల్ కార్పొరేషన్ ఎండీ బంగారు సుబ్బారావు రూ. 25 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు. ► జీవీకే బయో తరపున కంపెనీ వైస్ చైర్మన్ సంజయ్‌రెడ్డి రూ.5 కోట్లు, సాగర్ సిమెంట్స్, వెల్జన్ డెనిజన్స్, రహేజా కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్ కోటి రూపాయల చొప్పున చెక్కులను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ► శ్రీ ఆదిత్య హోమ్స్, తెలంగాణ స్టేట్ ఆయిల్ ఫెడరేషన్ లిమిటెడ్, హైదరాబాద్ అర్చ్ డైకోసిస్ ఎడ్యుకేషన్ సొసైటీ, కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, తెలంగాణ స్పిన్నింగ్ అండ్ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ రూ.50 లక్షల చొప్పున విరాళాన్ని మంత్రి కేటీఆర్‌కు అందజేశాయి. ► పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, యూనిక్ ఇన్‌ప్లేటబుల్స్ లిమిటెడ్, జీఎస్జీ బిల్డర్స్, కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, సప్తగిరి కాంఫర్ ప్రైవేట్ లిమిటెడ్, సరళ ప్రాజెక్ట్ వర్క్స్ లిమిటెడ్, వెలిజన్ హైడ్రాయిర్ లిమిటెడ్, దివ్య శక్తి పేపర్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రెండ్ సెట్ బిల్డర్స్, ఎలగన్స్ డెవలపర్స్ రూ.25 లక్షల చొప్పున విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంత్రి కేటీఆర్‌కు అందజేశాయి. ► ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.31 లక్షలు సీఎంఆర్ఎఫ్కు ప్రకటించగా, గ్రీన్ సిటీ ఎస్టేట్, సూర్య శంకర రెడ్డి గుండేటి, నిజాం క్లబ్ రూ.15 లక్షల చొప్పున విరాళాన్ని కేటీఆర్‌కు అందజేశారు. ► సాకేత్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేష్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్, ధనలక్ష్మీ ఐరన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హారిక, హాసిని క్రియేషన్స్, ఏ.శ్రీనివాస్, జై రాజ్ ఇస్పాత్ లిమిటెడ్, దేవ శ్రీ ఇస్పాత్ లిమిటెడ్, హైదరాబాద్ జింఖానా క్లబ్, నవ తేజ్ ఇన్ ఫ్రా లిమిటెడ్, ఆర్ బీవీ ఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ, వీరమణి బిస్కెట్ ప్రైవేట్ లిమిటెడ్, డాల్ఫిన్ ఫుడ్స్, సంజీవని చారిటబుల్ ట్రస్ట్ రూ.10 లక్షల చొప్పున విరాళాలకు సంబంధించిన చెక్కులను మంత్రి కేటీఆర్ కి అందించారు. -
కరోనా : విరాళాలు ప్రకటించిన కంపెనీలు
సాక్షి, అమరావతి : కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించింది. క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సోమవారం కిమ్స్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.భాస్కర్‌రావు చెక్కును అందజేశారు. అలాగే కరోనా నివారణ చర్యల కోసం తమ వంతు సాయంగా కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు శ్రీ చైతన్య యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీధర్ సీఎం జగన్‌ను కలిసి చెక్కును అందజేశారు. నాట్కో ఫార్మా లిమిటెడ్ కంపెనీ రూ.2.5 కోట్లు విరాళాన్ని అందజేసింది. ఆర్టీజీఎస్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి నాట్కో ఫార్మా లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ నన్నపనేని విరాళాన్ని అందజేశారు. దీంతో పాటు రూ.1.5 కోట్లు విలువ చేసే మందులు, పర్సన్ ప్రొటక్షన్ ఎక్విప్మెంట్ను కూడా అందించారు. ఇక కరోనా నివారణ చర్యల్లో భాగంగా కల్లాం గ్రూపు ఆఫ్ కంపెనీస్ 25 లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. -
నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన బిట్స్ పిలానీ
సాక్షి, హైదరాబాద్: భారత ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాపించకుండా లాక్‌డౌన్‌ను విధించడంతో అనేక మంది దినసరి కూలీలు, అనాధలు, బిక్షాటన చేసుకునే వారు పూట గడవక ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రభుత్వాలు వీరి ఆకలిని తీర్చడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వంతో పాటు కొన్ని స్వచ్ఛంధ సంస్థలు, దాతలు వచ్చి ఆహారం దొరకని వారికి అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే బిట్స్‌పిలానీ హైదరాబాద్ క్యాంపస్ వారు క్యాంపస్‌కు సమీపంలో ఉన్న వారికి ఆదివారం నిత్యవసర సరుకులు అందించారు. దాదాపు 450 కుటుంబాలకు సాయాన్ని అందించారు. ఈ విషయం పట్ల మండల ఎంఆర్వో శ్రీగోవర్ధన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిట్స్‌పిలానీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి. సుందర్, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ ఎం. శ్రీనివాసరెడ్డి, రజిని వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. రానున్న రెండురోజుల్లో అంతైపల్లి, ఫరాహ్‌నగర్ ప్రాంతాల్లో ఇలాంటి డ్రైవ్ నిర్వహిస్తామని వారు తెలిపారు. చదవండి: వారందరికి భోజనాలు పంపిణి చేసిన రెడ్‌క్రాస్ -
మహారాష్ట్రకు మేఘా రూ.2 కోట్ల విరాళం
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిపై పోరుకు తనవంతు బాధ్యతగా ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మేఘ ఇంజనీరింగ్ ముందుకు వచ్చి సహాయం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి 5 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 5 కోట్లు, కర్ణాటకకు 2 కోట్లు ఆర్ధిక సహాయం అందించిన మేఘ అధినేత పీవీ కృష్ణారెడ్డి తాజాగా ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వానికి 2 కోట్ల రూపాయల విరాళం అందచేసారు. ఈ మేరకు 2 కోట్లు బ్యాంకు ద్వారా పంపించిన మేఘ యాజమాన్యం మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ కూడా రాసింది. లాక్డౌన్ మూలంగా పేదలు, కూలీలు, ఆకలితో అలమటిస్తున్న వారికి ప్రభుత్వాలు అందిస్తున్న సాయానికి తమ వంతుగా మరిన్ని ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు చేయూతను అందిస్తామని మేఘా ప్రకటించింది. (ఏపీ: ‘మేఘా’ విరాళం) -
రెడ్‌క్రాస్ భోజన పంపిణి కార్యక్రమం
సాక్షి, పశ్చిమ గోదావరి: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ శ్రీ మామిళ్ళపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఆదివారం భోజన పంపిణి కార్యక్రమం నిర్వహించారు. జనతా కర్ఫ్యూ లోనూ విధులు నిర్వహిస్తున్న పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి, కలెక్టరేట్ సిబ్బందికి, ఆశ వర్కర్స్‌కి సిబ్బందికి అలాగే రోడ్డు ప్రక్కల నిరాశ్రయులకు, బిక్షాటన చేసుకునేవారికి భోజనాన్ని అందించారు. దాదాపు 1000 మందికి ఈ కార్యక్రమం ద్వారా ఆహారాన్ని అందించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ జయప్రకాష్ మాట్లాడుతూ దాతలు శ్రీనివాస్ 600 మందికి, కన్యకా పరమేశ్వరి సత్రం వారు 400 మందికి భోజనాన్ని అందించారని తెలిపారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దిరిశాల వరప్రసాద్, రెడ్ క్రాస్ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. -
పారిశద్ధ్య కార్మికులకు అండగా ‘ప్రగతి భారత్ ఫౌండేషన్’
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో 7500 పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.15 వేల మంది వాలంటీర్లకు శానిటైజర్లు,మాస్క్‌లను తమ ట్రస్ట్ తరపున పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో విశాఖలోని పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించిన ‘ప్రగతి భారత్ ఫౌండేషన్’ వారికి వెయ్యి రుపాయల విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో ప్రగతి భారత్ ఫౌండేషన్‌కు గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు సరుకులను పంపిణీ చేశారు. (రజినీ రియాలిటీ షోకు అత్యధిక రేటింగ్) ఈ సందర్బంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పారిశుద్య కార్మికులకు కూడా ఉచితంగా నిత్యావసర సరుకులు అందివ్వబోతున్నట్లు వెల్లడించారు. పోలీసులకు, హోంగార్డులకు, జర్నలిస్టులకు సైతం ప్రగతి భారత్ ఫౌండేషన్ తరపున నిత్యావసర సరుకులు అందించనున్నామన్నారు. విశాఖలో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల వారికి ట్రస్ట్ తరపున భోజన సదుపాయం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తక్కువ ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్డ్రంలోని నిరుపేద కుటుంబాలని ఆదుకుంటున్నారని ప్రశంసించారు. (పీఎం కేర్స్‌కు యువీ విరాళం ) భౌతిక దూరంతో కరోనాను నియంత్రించగలం లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం పేదలకు అండగా నిలిచిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎం పిలుపుకి స్వచ్చంద సేవా సంస్థలు స్పందించి.. పేదలని ఆదుకోవడానికి ముందుకు రావటం అభినందనీయమన్నారు. బౌతిక దురాన్ని పాటించడం ద్వారా కరోనా నియంత్రించగలమన్నారు. విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలబడం హర్షనీయమన్నారు. లాక్డౌన్ కాలంలో వీరికి నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రగతి భారత్ ఫౌండేషన్‌ను అభినందించారు. ప్రభుత్వం తరపున కూడా అండగా ఉండాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది అని ప్రశంసించారు. (కరోనా షాక్ : జూలోని పులికి పాజిటివ్) -
సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
► ఏయూ టీచింగ్, నాన్ టీచింగ్‌తో పాటు కాంట్రాక్ట్, అడ్హాక్ ఉద్యోగులు ఒక రోజు జీతం రూ.91.48 లక్షలు. ► ఏపీ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రూ. 2.72 లక్షలు ► గుంటూరులోని సింగెంటా సంస్థ ప్రతినిధులు రూ.25 లక్షలు, నరసరావుపేటలోని న్యూ మధు లైటింగ్ సంస్థల ప్రతినిధులు రూ.2 లక్షలు ► శ్రీ లక్ష్మీ గాయత్రి నగర్ రూ.లక్ష , విక్టరీ డిగ్రీ కళాశాల ప్రతినిధులు రూ.లక్ష, కొత్తూరు గోపి రూ.లక్ష, వాసవీ డిగ్రీ కళాశాల ప్రతినిధులు రూ.లక్ష, వైఎస్సార్సీపీ సీనియర్ నేత షేక్ ఖాజావలి రూ.లక్ష, ఉప్పలపాడు వాసి శనివారపు శివారెడ్డి రూ.లక్ష, వి.సాంబశివరావు రూ.లక్ష, బీరం భాస్కరరెడ్డి రూ.50 వేలు, మద్ది రామబ్రహ్మానందరావు రూ.50 వేలు, రెడ్‌క్రాస్ సంస్థ ప్రతినిధి బత్తుల మురళీ రూ.21,216, డాక్టర్ నరసింహారెడ్డి, కాసింరెడ్డి, రామారావు కలిపి రూ.2 లక్షలు. ► నరసరావుపేటకి చెందిన సాయి సూర్య డెవలపర్స్ మేనేజింగ్ పార్టనర్ రూ.2 లక్షలు, వాగ్దేవి విద్యాసంస్థల డైరెక్టర్లు రూ.లక్ష, కృష్ణవేణి విద్యాసంస్థలు, ఎంఏఎం విద్యాసంస్థలు సంయుక్తంగా రూ.4 లక్షలు, వ్యవసాయ శాఖ విశ్రాంత ఉద్యోగి కొల్లి సాంబిరెడ్డి రూ.లక్ష , కాలిఫోర్నియాలో ఉంటున్న ఆయన కుమారుడు మధుబాబు రూ.లక్ష , వ్యవసాయ శాఖ మాజీ ఉద్యోగి అవుతు ప్రకాష్‌రెడ్డి రూ.40 వేలు, బాపట్ల కు చెందిన వ్యాపారి ప్రవీణ్‌కుమార్ రూ.లక్ష , వరుణ్ హేచరీస్ రూ.లక్ష, ఆక్వా కల్చర్ రూ.లక్ష , సీబీజెడ్ చర్చి రూ.లక్ష. ► మొవ్వ వ్యవసాయ కమిటీ పూర్వపు చైర్మన్ చీకటిమర్ల శివరామప్రసాద్ రూ.లక్ష ► విజయవాడ వాకర్స్ అసోసియేషన్ రూ.లక్ష ► హైకోర్టులో ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయవాదులుగా వ్యవహరిస్తున్న స్టాండింగ్ కౌన్సిళ్లు రూ.7.80 లక్షలు, హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులందరూ రూ.5.80 లక్షలు. -
సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
► కరోనా నివారణలో భాగంగా సీఎం సహాయనిధికి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌కు చెందిన ఆర్జే రత్నాకర్ రాజు రూ.5 కోట్లు, గ్రీన్కో ఎండీ చలమలశెట్టి అనిల్ రూ.5 కోట్లు. ► పెన్నా సిమెంట్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ పెన్నా ప్రతాప్‌రెడ్డి రూ.2 కోట్లు. ► ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్లు తమ రెండు రోజుల వేతనమైన రూ.1.15 కోట్లు. ► ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ బి.సాంబశివారెడ్డి, రాష్ట్ర మౌలిక, వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డిలు ఏపీ మెడికల్ కౌన్సిల్ తరఫున రూ.కోటి. ► ఆంధ్రా ఆర్గానిక్స్ ఎండీ ఎం నారాయణరెడ్డి రూ. కోటి విరాళం. ► కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరులోని దీపక్ నెక్స్‌జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.35 లక్షలు. ► చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేతలు రూ.15 లక్షలు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంపీ.విజయానందరెడ్డి, ఎస్ఆర్పురం మండల నాయకుడు గురవారెడ్డిలు కలిసి రూ.15 లక్షలు, సత్యవేడు మండలంలోని సెవెన్‌హిల్స్ ఎంటర్‌ప్రైజస్ క్వారీ సిబ్బంది రూ.2 లక్షలు, లలిత్ రియల్టర్స్ సిబ్బంది రూ.లక్ష , వెంకట పద్మావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాల యాజమాన్యం రూ.1.2 లక్షలు, కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ (రెస్కో) రూ.20 లక్షలు, శ్రీవాణి విద్యా సంస్థల నిర్వాహకులు, రాష్ట్ర జూనియర్ కళాశాలల సంఘం ఉపాధ్యక్షులు క్రిష్ణమూర్తి రెడ్డి రూ.లక్ష. ► ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)కు చెందిన గుంటూరు జిల్లా నరసరావుపేట వైద్యులు రూ.10.12 లక్షలు. ► గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థల తరపున రూ.8 లక్షలు ► మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి తనకు వచ్చే ఏడాది పెన్షన్ రూ.3.5 లక్షలను సీఎంఆర్ఎఫ్, ప్రధానమంత్రి సహాయనిధికి, సత్యాగ్రూపు విద్యాసంస్థల తరఫున సీఎంఆర్ఎఫ్కు రూ.లక్ష , ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.లక్ష , బొత్స గురునాయుడు స్మారక విద్యాసంస్థల తరఫున కలెక్టర్ సహాయ నిధికి రూ.లక్ష. ► కృష్ణా జిల్లా ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ సభ్యులు ఎస్.వీరభద్రరావు, బి.నారాయణరావులు రూ.3 లక్షలు. ► ఏపీ టెక్స్టైల్స్ ప్రెసిడెంట్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, ఆయన సోదరుడు వెంకటరెడ్డి కలిసి రూ.2 లక్షలు. ► గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన పాండురంగ మెడికల్ గ్రూప్ రూ.2 లక్షలు. ► ప్రకాశం జిల్లా వేముల గ్రామానికి చెందిన బైలడుగు కృష్ణ పీఎం సహాయ నిధికి రూ.2 లక్షలు, సీఎం సహాయ నిధికి రూ.లక్ష, పుల్లలచెరువు మండలం ప్రభుత్వ ఉద్యోగుల తరఫున ఎంపీడీవో శ్రీనివాసులు రూ.లక్ష, ఎరువుల వ్యాపారి గజ్వల్లి భాస్కర్‌రావు రూ.50 వేలు, మార్కాపురం మండలం నికరంపల్లి గ్రామానికి చెందిన ఏర్వ శ్రీనివాసరెడ్డి రూ.50 వేలు. -
సీఎం సహాయ నిధికి గీతం రూ. 25 లక్షల విరాళం
పటాన్చెరు: కరోనా బాధితులకు చేయూతనిచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయనిధికి, గీతం యూనివర్సిటీ (గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్) రూ.25 లక్షల విరాళాన్ని ఇచ్చింది. గీతం విద్యాసంస్థల అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ శనివారం ఈ చెక్కును మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌కు అందించారు. ఈ మేరకు రుద్రారంలోని హైదరాబాద్ గీతం యూనివర్సిటీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కేటీఆర్‌ను కలసిన వారిలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, గీతం హైదరాబాద్ అడిషనల్ వీసీ ప్రొ.ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ఉన్నారు. గీతం విద్యాసంస్థల వితరణను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా అభినందించారు. -
అన్నార్తులకు ఆపన్న హస్తం
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా అమలవుతోన్న లాక్డౌన్ తో రాష్ట్రంలోని పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు తాళం పడింది. చేసేందుకు చేతినిండా పనీ..తినేందుకు జేబునిండా డబ్బులేకపోవటంతో కాయకష్టం చేసుకుని పొట్ట నింపుకునే కూలీలకు ముద్ద కరువైంది. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం..దేశంలో ఎక్కడా లేనివిధంగా వలసజీవులు, యాచకులకు పట్టెడన్నం పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇల్లు లేకుండా వీధుల్లోనే జీవనం సాగిస్తున్న వలస కూలీలకు రెండు పూటలా నాణ్యమైన, రుచికరమైన భోజనం వడ్డిస్తోంది. రాష్ట్రంలోని 11 నగరపాలక సంస్థల పరిధిలో ప్రతిరోజూ 26,526 మందికి లంచ్, రాత్రి డిన్నర్‌ను (కరీంనగర్, వరంగల్ మినహా)ఉచితంగా పంపిణీ చేస్తుంది.హైదరాబాద్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లు మినహా మిగతా వాటిలో వండి వారుస్తోంది. రామగుండంలో వలస జీవుల సంఖ్య తక్కువగా ఉంది. ఇక జంటనగరాల్లో అన్నపూర్ణ కేంద్రాల్లో రూ.5లకే ఇచ్చే భోజనాన్ని ఉచితంగా అందించడంతోపాటుగా వలస కూలీల ఆకలిని ప్రభుత్వం తీరుస్తోంది. వలస జీవులు, యాచకులు ఇతర నిరాశ్రయులకు భోజనవసతి కల్పించేందుకు ముందుకొచ్చేవారి సహకారం తీసుకుంటోంది. -
రైల్వే పోర్టర్లకు ఆపన్నహస్తం
సాక్షి, హైదరాబాద్: రైళ్లు నిలిచిపోవటంతో పనుల్లేక ఇబ్బంది పడుతున్న రైల్వే కూలీలకు ఆ శాఖ సిబ్బంది ఆపన్నహస్తం అందించారు. లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రైళ్లు నిలిచిపోయాయి. దీంతో పనుల్లేక రైల్వే పోర్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికులు ఇచ్చే డబ్బులు తప్ప వీరికి ప్రత్యేకంగా జీతం అంటూ ఉండదు. దీంతో వీరికి ఆదాయం లేక వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. దీన్ని గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే కమర్షియల్ విభాగం సిబ్బంది డబ్బులు పోగు చేసి నిత్యావసర వస్తువులు కొని వారికి అందించారు. కొంత నగదు కూడా అందజేశారు. హైదరాబాద్ డివిజన్లో 101 మందికి బియ్యం, పప్పు, నూనె ప్యాకెట్లు, గోధుమ పిండి, ఉప్పు, సబ్బులు, శానిటరీ కిట్లతో పాటు మరికొన్ని వస్తువులను ప్యాకెట్లుగా చేసి వారికి అందజేశారు. వీటితోపాటు ఒక్కొక్కరికి రూ. 2,600 చొప్పున నగదు కూడా అందజేశారు. గుంతకల్లు డివిజన్లో 40 మందికి సరుకులతోపాటు రూ.500 నగదు, గుంటూరు డివిజన్ పరిధిలో 33 మందికి సరుకులతోపాటు రూ. 1,500 నగదు, నాందేడ్ డివిజన్ పరిధిలో 33 మందికి సరుకులు అందజేశారు. కమర్షియల్ విభాగం సిబ్బంది వితరణను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అభినందించారు. -
సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయనిధికి శుక్రవారం పలువురు విరాళాలు అందజేశారు. పలు సంస్థలు, పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు విరాళాలకు సంబంధించిన చెక్కులను ప్రగతిభవన్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు అందజేశారు. సీఎం సహాయనిధికి విరాళాలు అందజేసిన వారికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పరిశ్రమల సమాఖ్య తరఫున అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి రూ. 1.22 కోట్లు, సాయి లైఫ్ సైన్సెస్, హువావే ఇండియా లిమిటెడ్, వీఎస్టీ ఇండస్ట్రీస్, జీఎస్జీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఆవ్రా ల్యాబొరేటరీ కోటి రూపాయల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందజేశారు. బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ తరఫున రూ. 50 లక్షల రూపాయల చెక్కును సినీనటుడు, ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అందజేశారు. టీఎస్టీసీ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, సహృదయ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, వెన్సా ఫౌండేషన్, రవి ఫుడ్స్, గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ రూ.25 లక్షల చొప్పున చెక్కులను విరాళంగా అందజేశారు. వేసెళ్ళ మీడోస్, సికింద్రాబాద్ క్లబ్ రూ.20 లక్షల చొప్పున, జలవిహార్ ఎంటర్టైన్మెంట్, ఎన్‌వీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ రూ.15 లక్షల చొప్పున చెక్కులను కేటీఆర్‌కు అందించారు. సామ్రాట్ ఐరన్స్, పుష్పభూమి ఎస్టేట్ డెవలపర్స్, మహేశ్వరి భవన్ ట్రస్ట్, గ్రీన్‌రిచ్ ఎస్టేట్స్, ఫెయిర్ మౌంట్ బిల్డర్స్ 11 లక్షలు అందజేశాయి. అభిరుచి స్వగృహ ఫుడ్స్, వంశీరామ్ హోమ్స్, త్రివేణి ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎన్.సాయిబాబా అండ్ కంపెనీ, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్, జెమ్ అవెన్యూస్, పట్నం మహేందర్‌రెడ్డి హాస్పిటల్, టీఎస్ఐసీ ఎంప్లాయీస్, కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.10 లక్షల చొప్పున విరాళాలకు సంబంధించిన చెక్కులను అందించాయి. -
సీఎంఆర్ఎఫ్కు భారీగా విరాళాలు
కరోనా వైరస్ నియంత్రణ కోసం తమ వంతు సాయంగా పలువురు సీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు. గంగవరం పోర్టు తరఫున చైర్మన్ డీవీఎస్ రాజు, పోర్టు సీఈవో, మాజీ డీజీపీ ఎన్.సాంబశివరావు రూ.3 కోట్ల విరాళం అందజేశారు. అలాగే డీవీఎస్ రాజు గంగవరం పోర్టులో షేర్ హోల్డర్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.16.25 కోట్ల ఇంటర్మ్ డివిడెండ్ చెక్‌ను కూడా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి అందజేశారు. ఇతర విరాళాల వివరాలు.. ► దివీస్ లాబొరేటరీస్ రూ.5 కోట్లు. ► మిత్రా ఎనర్జీ ఎండీ విక్రమ్ కైలాష్ రూ.2 కోట్లు. ► హువెయ్ కంపెనీ వారు ఛారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ ద్వారా రూ.1 కోటి ► చీమకుర్తి రాసన్ గ్రానైట్స్ అధినేత కె.రవీంద్రారెడ్డి రూ.10 లక్షలు. ► కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని సిజిటిన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కోటేశ్వరరావు రూ.5 లక్షలు ► చిత్తూరు జిల్లా ఐరాల మండలం పలువురు వైఎస్సార్సీపీ నాయకులు సీఎం సహాయనిధికి రూ.3.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. ► చిత్తూరు జిల్లా కుప్పంలోని బీసీఎన్ విద్యా సంస్థల చైర్మన్ బీసీ నాగరాజ్ రూ.2 లక్షలు ► తిరుపతికి చెందిన సీన్ హైటెక్ మోటర్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, సిబ్బంది తరఫున రూ.2 లక్షలు ► రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య తన వంతుగా రూ.1.54 లక్షలు ► కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కార్డియాలజిస్ట్ రాసంశెట్టి చంద్రశేఖర్ రూ.లక్ష, పిల్లల వైద్య నిపుణులు చీకటి ఉదయభాస్కరరావు రూ.లక్ష. ► విజయవాడలోని గరిమెళ్ళ లక్ష్మీ సమీర ఈస్ట్ లయన్స్ కంటి ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ బి.హనుమయ్య రూ.లక్ష. ► కృష్ణా జిల్లా కైకలూరు మండలం భుజ బలపట్నం గ్రామానికి చెందిన ఆక్వా రైతు ముదునూరి సీతారామరాజు రూ.లక్ష. ► కరోనా నివారణ చర్యల కోసం ఏపీ సీఎం సహాయ నిధికి హువెయ్ కంపెనీ వారు ఛారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ ద్వారా రూ. కోటి విరాళం ప్రకటించారు. అందుకు సంబంధిన లేఖ శుక్రవారం సీఎం సహాయ నిధి విభాగానికి పంపారు. -
రూ.1,000 సాయం నేడే
సాక్షి, అమరావతి: ఒకవైపు కరోనా వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే లాక్డౌన్ వల్ల పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకెళుతోంది. పేదలకు చేయూత అందించాలనే ఉద్దేశంతో వారికి ఉచితంగా బియ్యం, కందిపప్పుతోపాటు ఒక్కో కుటుంబానికి ఏప్రిల్ 4న రూ.1,000 చొప్పున నగదు ఇస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొదటి విడతగా గత నెల 29 నుంచి పేదలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ చేస్తున్నారు. నేడు (శనివారం) బియ్యం కార్డులున్న 1.30 కోట్ల కుటుంబాలకు ఇంటి వద్దే వలంటీర్ల ద్వారా రూ.వెయ్యి చొప్పున నగదు సాయం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలందరికీ ఈ ప్రత్యేక సాయం అందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యం. ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే అర్హత పరిశీలించి వెయ్యి రూపాయల సాయం అందిస్తారు. ► ఈ మేరకు బియ్యం కార్డులున్న కుటుంబాల జాబితాను సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) అధికారులకు అందించినట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ► రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1,300 కోట్లను సెర్ప్‌కు విడుదల చేసింది. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా నగదు పంపిణీపై అన్ని జిల్లాలకు సెర్ప్ మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ► ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఈ నిధులను డ్రా చేసి గ్రామ సచివాలయ కార్యదర్శి... గ్రామ వార్డు కార్యదర్శులకు అందజేస్తారు. వీరు శుక్రవారం సాయంత్రానికి బియ్యం కార్డుల ఆధారంగా వలంటీర్లకు నగదు పంపిణీ చేశారు. ► గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితోపాటు వలంటీర్లు కూడా నేడు (శనివారం) కచ్చితంగా వి«ధుల్లో ఉండాలని ఆదేశించారు. ► వలంటీర్లు శుక్రవారం సాయంత్రమే బియ్యం కార్డుదారుల ఇళ్లకు వెళ్లి నగదు సాయంపై సమాచారం ఇచ్చారు. ► వలంటీర్ల మొబైల్ అప్లికేషన్లో బియ్యం కార్డు లబ్ధిదారుల వివరాల ఆధారంగా రూ.వెయ్యి చొప్పున నగదు అందజేయాలని పేర్కొన్నారు. ► వలంటీర్లు భౌతిక దూరం పాటిస్తూ శనివారం ఉదయం 7 గంటల నుంచి ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయాలి. పంపిణీ అనంతరం నగదు మిగిలితే రాత్రి 8.30 గంటలకు గ్రామ, వార్డు కార్యదర్శులకు అందజేయాలి. -
సీఎం సహాయ నిధికి కియా భారీ విరాళం
సాక్షి, తాడేపల్లి : కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సాయం అందించేందకు పలువురు ప్రముఖులు, పలు సంస్థలు ముందుకొస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కియా మోటార్స్ రూ. 2 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు కియా మోటార్స్ ఇండియా ఎండీ కుక్ హయాన్ షిమ్ గురువారం సీఎం వైఎస్ జగన్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళాలకు సంబంధించిన వివరాలను అందజేశారు. (భారతి సిమెంట్స్ రూ.5 కోట్ల విరాళం) రూ. 2 కోట్లు విరాళం ప్రకటించిన శ్రీ సీటీ చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ సంస్థ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన శ్రీ సిటీ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సన్నారెడ్డి రవీంద్ర.. విరాళానికి సంబంధించిన చెక్‌ను అందజేశారు. మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన ఏపీ ఐఏఎస్‌లు.. కరోనా నియంత్రణ చర్యల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్.. వారి మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరబ్ కుమార్ ప్రసాద్, విజయకుమార్, ప్రద్యుమ్న, ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్ విరాళాలకు సంబంధించిన వివరాలు అందించారు. రూ. 25 లక్షల విరాళం ప్రకటించిన జీఎల్ మంధానీ గ్రూప్ కరోనా నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఎంబీజీ కమొడిటీస్ తరఫున జీఎల్ మంధానీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని జీఎల్ మంధానీ గ్రూప్ ట్రస్టీ బిజయ్ మంధానీ ఆన్లైన్ ద్వారా సీఎం సహాయ నిధికి బదిలీ చేశారు. -
ఏపీ సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు
సాక్షి, తాడేపల్లి : కరోనా నేపథ్యంలో సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కట్టడికి గ్రామ సచివాలయాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయన్నారు. గ్రామాల్లో పారిశుద్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఇక నుంచి కూడా సీఎం సహాయ నిధికి పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వాలని పెద్దిరెడ్డి కోరారు. సీఎం సహాయనిధికి అందిన విరాళాలు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖల విరాళం : రూ. 200.11 కోట్లు ఏపీఎండీసీ విరాళం : రూ. 10.62 కోట్లు మైన్స్ అండ్ జియాలజీ శాఖ విరాళం : రూ. 56 లక్షలు ఉపాధి హామీ, వాటర్‌షెడ్ శాఖ విరాళం : రూ. 1.50 కోట్లు సెర్ఫ్‌ఉద్యోగుల విరాళం : రూ. 50 లక్షలు -
సీఎంఆర్ఎఫ్కు విరాళాల వెల్లువ
► కరోనా విపత్తును ఎదుర్కొనేందుకుగాను సీఎం సహాయనిధికి రామోజీ ఫౌండేషన్ రూ.10 కోట్లు విరాళం ఇచ్చింది. ► ఏపీ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు రూ.7.87 కోట్లు, ట్రాన్స్‌కో, జెన్కో, తూర్పు, దక్షిణ, కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థల ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందజేశారు. ► దివీస్ ల్యాబ్ లిమిటెడ్ రూ.5 కోట్లు, ఎన్సీపీ లిమిటెడ్ రూ.కోటి అందజేశాయి. ► ఏపీలోని పౌల్ట్రీ అసోసియేషన్లు, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్ఈసీసీ) సభ్యులు కలిపి రూ.60 లక్షలు, గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని రాజధాని గ్రామమైన పెనుమాక నివాసి, రైతు కళ్లం నరేంద్రరెడ్డి రూ.1,00,116 విరాళం. సీఎంఆర్ఎఫ్కుగానూ సీఎస్‌కు రూ.5 కోట్ల చెక్‌ను ఇస్తున్న దివీస్ ల్యాబ్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ దివి, రూ.కోటి చెక్‌ను అందిస్తున్న ఎన్సీపీ లిమిటెడ్ సంస్థ సంచాలకులు ఎఆర్కే సూర్య ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రూ.44 లక్షల 52 వేలు. ► గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో పనిచేసే ఎల్1, ఎల్2 కేటగిరి ఉద్యోగులతో పాటు మండల స్థాయి సమాఖ్యలో పనిచేసే సిబ్బంది మొత్తం తమ ఒక్క రోజు వేతనమైన రూ.33 లక్షలు విరాళమిచ్చారు. ► గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు రూ.25 లక్షలు. ► కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లోని కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్లు రూ.17 లక్షలు. ► పాపులర్ షూమార్ట్ మేనేజింగ్ పార్ట్నర్లు చుక్కపల్లి అరుణ్‌కుమార్, విజయ్‌కుమార్ రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మొత్తంలో సీఎం సహాయనిధికి రూ.5 లక్షలు, ప్రధానమంత్రి నిధికి రూ.5 లక్షలు అందజేశారు. ► అనంతపురం జిల్లాలోని సప్తగిరి క్యాంపర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.5 లక్షలు. ► శ్రీకాకుళం జిల్లాకి చెందిన యడ్ల గోపాలరావు రూ.2 లక్షలు, బగ్గు సరోజినీదేవి ఆసుపత్రి అధినేత డా.బగ్గు శ్రీనివాసరావు రూ.లక్ష, రాజాంకు చెందిన కల్కి జ్యుయెలరీ షాపు యజమాని కె.మధుసూదనరావు రూ.లక్ష విరాళమిచ్చారు. -
కష్టకాలంలో పెద్ద మనసు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఉపయోగపడేందుకు వీలుగా పలు సంస్థలు సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందించాయి. దీనికి సంబంధించిన చెక్కులను ఆయా సంస్థల ప్రతినిధులు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు అందించారు. ► హెటెరో డ్రగ్స్ రూ.5 కోట్ల విరాళం అందించింది. దీంతోపాటు రూ.5 కోట్ల విలువైన మందులను (హైడ్రాక్సి క్లోనోక్విన్, రిటోనవిర్, లోపినవిర్, ఒసెల్టమివిర్) కూడా ప్రభుత్వానికి అందించారు. చెక్కును ముఖ్యమంత్రికి, మందులను వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు హెటెరో చైర్మన్ పార్థసారథి రెడ్డి, డైరెక్టర్ రత్నాకర్ రెడ్డి అందించారు. ► తెలంగాణ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ అసోసియేషన్ రూ.1.5 కోట్ల విరాళం అందిం చారు. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్ అధ్య క్షుడు కె.పాపారావు తదితరులు సీఎం కేసీఆర్‌కు అందించారు. ► సువెన్ ఫార్మా రూ.కోటి విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సువెన్ ఫార్మా చైర్మన్ వెంకట్ జాస్తి ముఖ్యమంత్రికి అందించారు. ► రాష్ట్ర విద్యుత్ సంస్థల ఉద్యోగులు ఒక రోజు వేతనం సుమారు రూ.12 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేశారు. ఉద్యోగుల తరఫున తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సోమవారం విద్యుత్ సౌధలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావును కలిసి ఈ మేరకు లేఖను అందజేశారు. ► ఎన్సీసీ లిమిటెడ్ రూ.కోటి విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండీ ఎ.రంగరాజు ముఖ్యమంత్రికి అందించారు. ► శ్రీ చైతన్య విద్యాసంస్థలు రూ.కోటి విరాళం అందించాయి. దీనికి సంబంధించిన చెక్కును ఆ సంస్థ డైరెక్టర్ వై.శ్రీధర్ ముఖ్యమంత్రికి అందించారు. ► తెలంగాణ రైస్ మిల్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్ నాయకులు నాగేందర్, మోహన్ రెడ్డి తదితరులు సీఎంకు అందించారు. ► జేఎన్టీయూ బోధన, బోధనేతర, కాంట్రాక్టు సిబ్బంది, పెన్షనర్లు ఒకరోజు మూల వేతనం సుమారు రూ.12 లక్షలు సీఎంఆర్ఎఫ్కు విరాళంగా అందజేయనున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ తెలిపారు. మంత్రి కేటీఆర్‌కు పలువురు అందజేసిన విరాళాల వివరాలివీ ► వాల్యూ ల్యాబ్స్ సంస్థ రూ.5.25 కోట్లు ► జీవీపీఆర్ ఇంజనీర్స్ సంస్థ రూ.కోటి ► అమర్‌రాజా బ్యాటరీస్ రూ.కోటి ► ఐసీఎఫ్ఏఐ సొసైటీ రూ.కోటి ► వంశీ రామ్ బిల్డర్స్ రూ.కోటి ► సిగ్నిటి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.50లక్షలు ► యునైటెడ్ స్టేట్స్ ఫార్మా కోపియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.50 లక్షలు ► భాష్యం ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.25 లక్షలు ► విమల ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.25 లక్షలు ► ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రూ.25 లక్షలు ► స్వస్తిక్ మిర్చ్ స్టోర్ రూ.21 లక్షలు ► గురునానక్ ఎడ్యుకేషన్ సొసైటీ రూ.11 లక్షలు ► బీహెచ్ఆర్ డెవలపర్స్ రూ.10 లక్షలు ► సీఎస్కే రియల్టర్స్ లిమిటెడ్ రూ.10 లక్షలు ► సాయిసూర్య డెవలపర్స్ రూ.10 లక్షలు ► నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్(నాటా) రూ.10 లక్షలు ► సీ5 ఇన్ఫ్రా లిమిటెడ్ రూ.10 లక్షలు ► జగత్ స్వల్ప రియల్టర్స్ రూ.10 లక్షలు ► శ్రీసాయి రూరల్ ఫ్లోర్ మిల్ రూ.10 లక్షలు ► చల్లా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రూ.10 లక్షలు ► హైదరాబాద్ బోట్స్ క్లబ్ తరఫున రూ.10 లక్షలను సంస్థ అధ్యక్షుడు చెన్నాడి సుధాకర్ రావు అందించారు ► తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం రూ.10 లక్షలు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రూ.10 లక్షలు ఇచ్చారు. ► సీఎస్కే రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్, జాన్సన్ గ్రామర్ స్కూల్ స్కూల్ చెరో రూ.5 లక్షలు ► జాన్సన్ గ్రామర్ స్కూల్(సీబీఎస్ఈ) చైర్మన్ సురేశ్ కుమార్ రూ.5 లక్షలు -
సింగరేణి ఉద్యోగుల భారీ విరాళం
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకారంగా సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఉద్యోగులు, అధికారులు తమ ఒక్కరోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయాలని నిర్ణయించారు. తమ వేతనం నుంచి ఒక్కరోజు మూలవేతనం, కరువు భత్యంను సీఎం సహాయనిధికి చెల్లించాలని సంస్థ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. 2,400 మంది సింగరేణి అధికారుల ఒక రోజు మూలవేతనం, కరువు భత్యం కలిపి రూ.కోటి, ఇక 47 వేల మంది కార్మికుల ఒకరోజు మూలవేతనం, కరువు భత్యం కలిపి రూ.7 కోట్ల 50 లక్షలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. అధికారులు, కార్మికుల వితరణ కలిపి మొత్తం రూ.8.50 కోట్ల చెక్కును త్వరలో సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సమయాలలో సింగరేణి ఉద్యోగులు, అధికారులు ఇదే తరహాలో వితరణను చాటుకున్నారు. క్లిష్ట సమయంలో కార్మికులు, అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించడం పట్ల సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో దక్షిణ భారత విద్యుత్ అవసరాలకు బొగ్గు అందిస్తున్న సింగరేణి సంస్థను అత్యవసర సేవల సంస్థగా గుర్తించారని..కనుక సింగరేణి ఉద్యోగులు, అధికారులు 3 షిఫ్టుల్లో పని చేస్తూ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఎటువంటి బొగ్గు కొరత లేకుండా సింగరేణి ఉద్యోగులు నిత్యం పాటుపడుతున్నారని వివరించారు. ప్రతి గనిలో, కార్మిక కాలనీల్లో, ఆస్పత్రుల్లో, కరోనా వ్యాప్తి నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నామన్నారు.